
సాక్షి, విజయవాడ: వల్లభనేని వంశీ కేసులో టీడీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. సత్యవర్థన్‌ను వంశీ బెదిరించి దాడి చేశారంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఓ వీడియో విడుదల చేశారు. సత్యవర్థన్‌ను బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా ఒత్తిడి చేశారని ఆరోపించారు. అయితే, మంత్రి చూపిస్తున్న వీడియో ఫిబ్రవరి 11వ తేదీ సీసీటీవీ ఫుటేజ్‌గా నిర్థారణ అయ్యింది. గన్నవరం కేసులో వల్లభనేని వంశీ ప్రమేయం లేదని.. ఫిబ్రవరి 10వ తేదీనే జడ్జి ముందు సత్యవర్థన్ వాంగ్మూలం ఇచ్చాడు. టీడీపీ కార్యాలయం కేంద్రంగానే కుట్రలు జరిగినట్లు మంత్రి ప్రెస్‌మీట్ తేల్చినట్లయింది. దీంతో వంశీని కుట్రపూరితంగా కేసులో ఇరికించేందుకు ప్రయత్నించి టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు.
కస్టడీ పిటిషన్‌పై విచారణ
కాగా, వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటి(గురువారం)కి వాయిదా వేసింది. దర్యాప్తు కోసం మొబైల్ , బ్లాక్ కలర్ క్రెటా కారును స్వాధీన పరచాలని పోలీసులు కోరారు. విచారణ తర్వాత కస్టడీకి ఇవ్వాలో లేదో న్యాయమూర్తి తీర్పునివ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ కోర్టులో వల్లభనేని వంశీ సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకి సంబంధం లేదని ఆయన సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి మళ్లీ సీన్ రీ కనస్ట్రక్ట్ అవసరం లేదని అఫిడవిట్‌లో వంశీ పేర్కొన్నారు.
వంశీకి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని దాఖలైన పిటిషన్‌ను కూడా ఎస్సీ, ఎస్టీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. సబ్ జైలులో వంశీకి ఏ ఇబ్బందులు ఉన్నాయి. ఏ సదుపాయాలు కావాలో వంశీ నుంచి లెటర్ రూపంలో తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు..
వంశీ కేసులో మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. వంశీని జైలులో హింసాత్మక వాతావరణంలో ఉంచారని పొన్నవోలు తెలిపారు. వంశీ ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నారనేది వంశీ నుంచి లెటర్ రూపంలో తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు.

‘‘సీన్ రీకన స్ట్రక్ట్ కోసం సత్య వర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి వంశీ అవసరం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సెల్ ఫోన్ సీజ్ చేయాల్సిన అవసరం లేదు. అరెస్టు సమయంలో ముద్దాయి దగ్గర మొబైల్ ఉంటే మాత్రమే సీజ్ చేయాలి అనేది నిబంధన. కేసుతో నాకు ఏ సంబంధమూ లేదని వంశీ అఫిడవిట్ దాఖలు చేశారు. కారుకి, నాకు సంబంధం లేదని అఫిడవిట్‌లో వంశీ తెలిపారు. ఈ కేసుకు తనకి సంబంధం లేదని వంశీ చెప్పటంతో థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవకాశం మాత్రమే ఉంది. కేసు వెనక్కి తీసుకుంటూ సత్యవర్ధన్ స్టేట్‌మెంట్ ఇస్తే అతనిపై ఈ నెల 11న కేసు నమోదు చేశారు’’ అని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment