illegal case
-
రషీద్ కుటుంబానికి ప్రభుత్వం వేధింపులు
-
ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు: కూటమి సర్కార్‌పై కాకాణి ఫైర్
సాక్షి, నెల్లూరు: కూటమి సర్కార్ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ క్యాడర్‌పై కూటమి దాడులు చేస్తున్నారని.. పరామర్శకు వెళ్లిన తనపై అక్రమ కేసు పెట్టడం దారుణమన్నారు.అక్రమ కేసులు, అరెస్టులతో మా గొంతును నొక్కలేరు. టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారులపై చర్యలు తప్పవు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తాం. నా పై మరిన్ని కేసులు పెట్టడానికి సీఐడీ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కేసులు, అరెస్ట్‌లతో వైఎస్ జగన్ హార్డ్ కోర్ అభిమానులను ఆపలేరు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేదాకా పోరాడుతా’’ అని కాకాణి చెప్పారు.ఇదీ చదవండి: ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు! -
అక్రమ కేసుల కుప్పం
శాంతిపురం: ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి, శాంతితో వర్ధిల్లడం సహజం. అక్కడి ప్రజలు కూడా ఇదే కోరుకుంటారు. అక్కడి ప్రజలు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను మెరుగ్గా అందుకోవాలని ఏ ముఖ్యమంత్రి అయినా ఆశిస్తారు. కానీ సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. రాజకీయ వేధింపులు, కక్షలు, అక్రమ కేసులతో అట్టుడికిపోతోంది.తప్పుడు కేసులను ఉపేక్షించేది లేదని చంద్రబాబు పైకి చెబుతున్నా, ఆయన సొంత నియోజకవర్గంలోనే అనేక అక్రమ కేసులు పెడుతున్నారు. విపక్ష నేతలు, కార్యకర్తలు, పథకాల గురించి అడిగిన సామాన్యులపై అక్రమ కేసులు, బైండోవర్ కేసులు, ఆంక్షలు, పోలీసుల వేధింపులు, నిర్బంధాలు, పథకాల నిలిపివేత వంటి చర్యలు ఎదుర్కోవాల్సిందే. రాష్ట్రంలో అధికార మార్పు జరిగిన తొలిరోజు నుంచే కుప్పంలో ఆటవిక రాజ్యం సాగుతోంది. పోలీసులను అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు దౌర్జన్యకాండను సాగిస్తున్నారు. అందుకు ఉదాహరణలు కొన్ని.. ఊరి నుంచి తరిమేసి.. రాష్ట్రంలో చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రామకుప్పం మండలం 89 పెద్దూరు పంచాయతీ దళిత మహిళా సర్పంచి మల్లిక రాజీనామా చేయాలంటూ ఆమె ఇంటిపై దాడిచేసి, సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేశారు. ఆమె కుటుంబాన్ని గ్రామం నుంచి వెళ్లగొట్టారు. దీనిపై స్థానిక పోలీసులతో పాటు జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. ప్రాణ భయంతో ఆ కుటుంబం దూరప్రాంతానికి వెళ్లడంతో గ్రామంలో అందుబాటులో లేరని, మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు రాలేదంటూ సర్పంచి చెక్ పవర్‌ను రద్దు చేశారు. పైగా ఇసుక అక్రమ రవాణాపై టీడీపీలోని రెండు వర్గాలు ఘర్షణ పడగా, గాయపడిన వారితో మల్లిక భర్త గోవిందప్పపై తప్పుడు ఫిర్యాదు చేయించి, ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టారు. దీనిపై న్యాయం కోరుతూ బాధితులు మానవ హక్కుల కమిషన్, ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు.పొలానికి మట్టి తోలారనితమిళనాడు సరిహద్దుల్లోని ఓ ఎన్ కొత్తూరుకు చెందిన వైఎస్సార్సీపీ సర్పంచి దేవప్పనాయుడు బంధువులు తమిళనాడు భూభాగంలోని చెరువు నుంచి అదే రాష్ట్రంలోని వారి పొలాలకు మట్టి తోలుకున్నారు. అయితే గుడుపల్లె మండలం తలిఅగ్రహారంలోని ఆంధ్ర భూభాగం గుండా మట్టిని రవాణా చేశారంటూ దేవప్పనాయుడు, ఆయన బంధువులపై తప్పుడు కేసు పెట్టారు. తమిళనాడు అధికారుల నుంచి అన్ని అనుమతులు తీసుకుని, మట్టిని తరలిస్తున్నామని చెప్పినా పట్టించుకోలేదు. దేవప్పనాయుడు, ఆయన తమ్ముడు పొండప్పనాయుడును రోజంతా పోలీసు స్టేషన్లో కూర్చోపెట్టారు.రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఇలాంటి కేసులు, వేధింపులతో కుప్పంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సామాన్యులను అధికార పక్షం నిత్యం వేధిస్తోంది. వైఎస్సార్సీపీ నాయకులు వారి అభిమాన నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను కూడా జరుపుకోనివ్వకుండా పలుచోట్ల పోలీసులను మోహరించారు. తమ పార్టీ వారిపై పదుల సంఖ్యలో అక్రమ కేసులు, బైండోవర్ కేసులు పెట్టారని వైఎస్పార్సీపీ నాయకులు చెబుతున్నారు. అయినా వైఎస్సార్సీపీ నాయకులు భయపడకుండా న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇసుక రవాణా కేసులో ఇరికించి నాయనపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ కృష్ణమూర్తి పైనా తప్పుడు కేసు పెట్టి వేధింపలకు గురిచేస్తున్నారు. ఎప్పుడూ ఇసుక వ్యాపారం చేయని ఆయనపై కర్ణాటకకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ ఓ తప్పుడు కేసు పెట్టారు. సొంతిల్లు కట్టుకొనేందుకు ఆయన బంధువులు చట్టబద్ధంగా పన్నులు చెల్లించి, బైరెడ్డిపల్లి స్టాక్ యార్డు నుంచి తెచ్చుకున్న ఇసుకను చూపి జైలుకు పంపారు. ఉదయం అదుపులోకి తీసుకుని, సాయంత్రం వీఆర్వో నుంచి ఫిర్యాదు రాయించుకుని, నిబంధనలు పాటించకుండా తనను అరెస్టు చేశారని కృష్ణమూర్తి చెప్పారు. పార్టీ మారాలని, లేదంటే ఊరు వదిలి వెళ్లిపోవాలని అధికారులు బెదిరించారని వాపోయారు. పైగా, సీజ్ చేసిన ఇసుకను కూడా అక్రమ మార్గంలో తరలించేశారని కృష్ణమూర్తి బంధువులు చెబుతున్నారు.హామీలపై మాట్లాడితే బైండోవర్ కేసుగుడుపల్లె మండలం బోయనపల్లికి చెందిన రవి కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయడంలేదని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేయడంతో ఓ రోజు ఆయన్ని పోలీసుల ఇంటి నుంచి పట్టుకెళ్లిపోయారు. ఆయనపై బైండోవర్ కేసు పెట్టి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మళ్లీ ఇలా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
న్యాయవాదిపై పోలీసు గూండాగిరి
సాక్షి, అమరావతి : చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసుల గూండాగిరి పెచ్చుమీరిపోతోంది. సీఎం, మంత్రుల మనసెరిగి వైఎస్సార్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు చేయడమే ఏకైక కర్తవ్యంగా పోలీసు అధికారులు చెలరేగిపోతున్నారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలంలో పోలీసులు అధికార పార్టీ గూండాల్లా రెచ్చిపోయారు. లక్కిరెడ్డిపల్లె సీఐ కొండారెడ్డి వైఎస్సార్సీపీ నేత, మాజీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, పెద్ద స్థాయిలో ఉన్న సీనియర్ న్యాయవాది జల్లా సుదర్శన్‌రెడ్డిని కాలర్ పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకెళ్లడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎంపీడీవోపై దాడి చేశారనే అక్రమ కేసు బనాయించింది కాకుండా, పోలీసులు ఈ దాష్టీకానికి తెగబడటం రాజకీయవర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ కేసులో కక్షసాధింపు ధోరణిలో, పక్కా పన్నాగంతో జె. సుదర్శన్‌రెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చారు. సుదర్శన్‌రెడ్డి గాలివీడు మండలం మాజీ ఎంపీపీ. ప్రస్తుతం ఆయన తల్లి ఎంపీపీగా ఉన్నారు. సీనియర్ న్యాయవాది అయిన ఆయన గతంలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌గా గతంలో కీలక పదవిని నిర్వర్తించారు. ఆయన కుటుంబం రాయచోటి నియోజకవర్గంలో రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా పెడుతున్న అక్రమ కేసులకు వ్యతిరేకంగా చేస్తున్న న్యాయ పోరాటంలో సుదర్శన్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై కక్షసాధింపు చర్యలకు తెగబడింది. ఎంపీడీవోపై దాడి చేశారని అక్రమ కేసు బనాయించి పోలీసుల ద్వారా దౌర్జన్యానికి పాల్పడింది. ప్రభుత్వ పక్కా ఆదేశాలతోనే సీఐ కొండారెడ్డి శుక్రవారం గాలివీడు ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న సుదర్శన్‌రెడ్డిని చొక్కా పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఆ సమయంలో అక్కడ భారీ సంఖ్యలో ఉన్న ప్రజలు ఎంతగా అభ్యంతరం పెడుతున్నా, ఏమాత్రం పట్టించుకోకుండా లాక్కెళ్లి పోలీసు వాహనంలో బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఏదైనా కేసులో నిందితులను అరెస్టు చేసేటప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలను సీఐ కొండారెడ్డి నిర్భీతిగా ఉల్లంఘించి మరీ ఈ దాషీ్టకానికి పాల్పడ్డారన్న తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన సుదర్శన్‌రెడ్డిని చొక్కా పట్టుకొని తీసుకెళ్లుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం పోలీసు వ్యవస్థ ఇంతగా దిగజారడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుదర్శన్‌తో పాటు మరో ఇద్దరికి రిమాండ్ రాయచోటి : గాలివీడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జవహర్‌బాబుపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఎంపీడీవో ఫిర్యాదు ఇచ్చారు. గాలివీడు మాజీ మండల పరిషత్ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది జల్లా సుదర్శన్‌రెడ్డితో పాటు మరో 12 మందిపై కేసు నమోదు చేశారు. ఎన్.వెంకటరెడ్డి, ఎం.బయారెడ్డి, జి.చంద్రశేఖర్‌రెడ్డి, జె.ధనుంజయరెడ్డి, ఎన్.రమణారెడ్డి, భానుమూర్తిరెడ్డి, జి.రామాంజులురెడ్డి, ఎన్.రామాంజుల్‌రెడ్డి, యు.ధర్మారెడ్డి, రెడ్డికుమార్, ఎం.ఆంజనేయరెడ్డి, పి.బయారెడ్డిలపై కేసు నమోదు చేశారు. వీరిలో జల్లా సుదర్శన్‌రెడ్డి, ఎన్.వెంకటరెడ్డి, ఎం.బైరెడ్డిలను పోలీసులు శనివారం లక్కిరెడ్డిపల్లె కోర్టులో హాజరుపరిచారు. వీరికి కోర్టు రిమాండ్ విధించింది. న్యాయమూర్తి ఆదేశానుసారం శనివారం సాయంత్రం వీరిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. మిగిలిన నిందితులను కూడా త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని గాలివీడు పోలీసులు తెలిపారు. -
నన్ను చిత్రహింసలు పెట్టి.. తప్పుడు కేసు పెట్టారు
-
అభిప్రాయం చెప్పాడని దండన!
అసభ్యకరంగా దూషించలేదు.. ఎవరినీ కించపరచలేదు.. ఒక్కరినీ పల్లెత్తు మాట అనలేదు. ఎలాంటి చాలెంజ్లూ చేయలేదు.. అయినా కూటమి ప్రభుత్వ పెద్దలకు కోపం వచ్చింది. ఎప్పుడో రెండేళ్ల క్రితం.. ఓ యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘కూటమి పార్టీలు ఇంకా సీఎం క్యాండిడేట్ ఎవరో నిర్ణయించుకోలేదు’ అని అభిప్రాయం చెప్పడమే ఆ విద్యార్థి పాలిట శాపమైపోయింది. అంతర్జాతీయ టెర్రరిస్ట్‌ను పట్టుకోవడానికి వచ్చినట్లు.. క్రైమ్, సస్పెన్స్ సినిమాలను తలదన్నేలా గ్రామంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు.. కోడి కూయక ముందే సీఐడీ పోలీసుల బృందం గ్రామాన్ని చుట్టుముట్టి.. ఆ విద్యార్థిని పట్టి బంధించింది. ఆపై ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా ఇన్నోవాలో ఎక్కించుకుని వెళ్లిపోయింది. ఈ పరిణామాన్ని ఏమనాలి? బహుశా తాలిబన్లు కూడా ఇలా వ్యవహరించి ఉండరు!వీరఘట్టం: పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం దశుమంతపురం గ్రామం బుధవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెల్లవారుజామున సీఐడీ పోలీసులు గ్రామంలోకి వచ్చారు. గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి అలజంగి యఘ్నేష్ ఇంటిని చుట్టుముట్టారు. తీరా చూస్తే ఎప్పుడో రెండేళ్ల కిందట కూటమి పార్టీలపై తన అభిప్రాయం చెప్పాడని, గత ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ‘సీఎం క్యాండిడేట్ ఎవరో నిర్ణయించుకోలేదు’ అన్నందుకు ఇప్పుడు ఈ విద్యార్థిపై అక్రమ కేసు బనాయించినట్టు తెలుసుకుని అవాక్కయ్యారు. అసలు ఎవరు ఫిర్యాదు చేశారు.. ఏమని ఫిర్యాదు చేశారు.. తమ కుమారుడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియక తల్లిదండ్రులు వెంకటనాయుడు, వెంకటరత్నంలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ‘తెల్లవారుజామునే ఇంటి తలుపు తట్టారు. ఎవరని ప్రశ్నిస్తే యఘ్నేష్ స్నేహితులమని చెప్పారు. తలుపు తీసి చూస్తే పోలీసులు. మంచంపై నిద్రపోతున్న మా కుమారుడిని పట్టుకున్నారు. యఘ్నేష్తో చిన్న పని ఉంది.. అరగంటలో మళ్లీ వచ్చేస్తాం అన్నారు. పార్వతీపురంలోని భాస్కర్ డిగ్రీ కాలేజీలో బీకాం సెకండియర్ చదువుతున్నాడు. మంగళవారం నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మరో వారం రోజుల వరకు పరీక్షలు ఉంటాయని చెప్పినా వినిపించుకోలేదు’ అంటూ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. యఘ్నేష్కు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. చదువుకుంటున్న ఓ విద్యార్థిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా పట్టుకుపోవడం తగదని గ్రామస్తులు వాపోతున్నారు. కాగా, యఘ్నేష్ను సీఐడీ పోలీసులు గుంటూరు తీసుకెళ్లారని సమాచారం. -
సెక్షన్లు మార్చి.. చట్టాన్ని ఏమార్చి..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులతో వేధింపుల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును కాలరాస్తూ చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది. ఇందుకోసం సెక్షన్లు మార్చేస్తోంది. చట్టాల్ని ఏమారుస్తోంది. సోషల్ మీడియా పోస్టులపై కేసులు అందుకు ఉద్దేశించిన ఐటీ చట్టం ప్రకారం కాకుండా సంబంధంలేని ఇతర చట్టాల కింద పెడుతుండటం ప్రభుత్వ కక్ష సాధింపునకు నిదర్శనం. చివరకు సుధారాణి అనే సోషల్ మీడియా యాక్టివిస్టుపైనా పోక్సో కేసు పెట్టడం ప్రభుత్వ దుర్నీతికి పరాకాష్ట. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఓ మహిళ మీద పోక్సో కేసు పెట్టడమే అత్యంత దారుణమని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇది రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని, ఇదే కొనసాగితే ఎవరూ మనుగడ సాగించలేని దుస్థితి వస్తుందని చెబుతున్నారు. బాధిత బాలికకు అండగా నిలిచినందుకు వైఎస్సార్సీపీ నేత, మాజీ శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పోక్సో కేసు పెట్టడం ప్రభుత్వ మరో బరితెగింపునకు నిదర్శనం. ఇలా నిత్యం రాష్ట్రంలో అనేక మందిపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతోంది.ఐటీ చట్టం స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ అక్రమ కేసుల పరంపరవ్యక్తిగతంగా లేదా మీడియా ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలు వ్యక్తం చేయడం భావ ప్రకటన హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. సోషల్ మీడియా పోస్టులపై అభ్యంతరం ఉంటే కేంద్ర ఐటీ చట్టం కింద మాత్రమే కేసు నమోదు చేసి 41ఏ నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. కానీ కక్ష సాధింపే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పును నిర్భీతిగా ఉల్లంఘిస్తూ అక్రమ కేసులు నమోదు చేస్తోంది. ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై ఐటీ చట్టం కింద కాకుండా ఇతర చట్టాల కింద కూడా కేసులు పెడుతూ పౌర హక్కులను ఉల్లంఘిస్తోంది. బీఎన్ఎస్ సెక్షన్ 111, పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం.. ఇలా వివిధ చట్టాల కింద కుట్రపూరితంగా కేసులు పెడుతోంది.అందుకు కొన్ని ఉదాహరణలు..» ఇప్పటివరకు 30 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై ఐటీ చట్టంతోపాటు బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద అక్రమ కేసులు నమోదు చేశారు. ఆ సెక్షన్ వ్యవస్థీకృత నేరాల కట్టడికి ఉద్దేశించింది. అంటే ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు, విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసేందుకు ఉద్దేశించినది. కానీ, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టడం తెగింపు ధోరణే.» 9 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై ఐటీ చట్టంతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కూడా అక్రమ కేసులు నమోదు చేశారు. అసలు ప్రభుత్వ వైఫల్యాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించడం ఎస్సీ, ఎస్టీ వేధింపు ఎలా అవుతుందోనని పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. » మరో విడ్డూరం ఏమిటంటే.. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించే వారిపై పోక్సో చట్టం కింద కేసులు పెట్టడం. గుంటూరు జిల్లాకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త, మహిళ సుధారాణిపైనా పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. కొద్దిరోజుల క్రితం సుధారాణి దంపతులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. దీనిపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ ఫుటేజీలను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించడంతో గుంటూరు, ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు షాక్ తగిలింది. దాంతో ఆమెపై ఏకంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, వేధింపులకు గురి చేస్తున్నారు.» చంద్రగిరి నియోజకవర్గంలో ఓ బాలికపై ఇద్దరు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆమె కుటుంబం తల్లడిల్లింది. సమాచారం తెలిసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అదే ఆయన చేసిన నేరమన్నట్టుగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఆయనపై ఏకంగా పోక్సో కేసు పెట్టింది. -
పరామర్శకు వెళితే.. చెవిరెడ్డిపై పోక్సో కేసు
సాక్షి, టాస్క్‌ఫోర్స్, సాక్షి, అమరావతి: ఎక్కడైనా అత్యాచారానికి పాల్పడిన నిందితులపై పోక్సో కేసులు పెడతారు! కానీ పరామర్శించేందుకు వెళ్లి న్యాయం కోసం నిలబడిన వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం దేశ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి!! తిరుపతి జిల్లాలో ఓ బాధిత బాలికకు అండగా నిలిచినందుకు మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై ఏకంగా 11 సెక్షన్ల కింద అక్రమ కేసు నమోదు చేయడం చంద్రబాబు సర్కారు అరాచక పాలన, దుర్మార్గాలకు పరాకాష్టగా నిలుస్తోంది. అధికార దుర్వినియోగం కూడా రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రవచనాలు వల్లించిన సీఎం చంద్రబాబు రెడ్ బుక్ పాలనే లక్ష్యంగా సాగుతున్నట్లు ఈ పరిణామాలు మరోసారి రుజువు చేస్తున్నాయి.బాధిత కుటుంబానికి బాసటగా ఉండడం నేరమా?చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక పాఠశాల నుంచి వస్తుండగా కొద్ది రోజుల క్రితం కొందరు యువకులు దాడి చేసి అపహరించుకుపోయారు. కుమార్తె కోసం గాలిస్తూ వచ్చిన ఆమె తండ్రి ముళ్ల పొదల్లో బాధితురాలిని గుర్తించినట్లు చెప్పారు. ‘బడి నుంచి వస్తున్న నా బిడ్డపై దుర్మార్గులు దాడి చేశారు. ముళ్ల పొదల్లో పడవేశారు. ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు అడ్డగించి కత్తితో దాడిచేశారు. నీళ్లలో మత్తు బిళ్లలు కలిపి తాగించారు. చేతిపై, కడుపుపై కత్తితో కోశారు. గంటవరకు బాలిక సృహలో లేదు.నా పరువు పోయినా పరవాలేదు.. పోలీసులు నిందితులను పట్టుకుని స్టేషన్‌కు తెచ్చి ఉరితీయాలి.. అప్పుడే మాకు న్యాయం జరిగినట్లు..’ అంటూ బాధిత బాలిక తండ్రి విలపించాడు (ఆ వీడియో కూడా ఉంది). ఈ ఘటన గురించి తెలియడంతో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చలించిపోయారు. వెంటనే 80 కిలోమీటర్లు దూరం ప్రయాణించి బాధిత బాలికను, కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ‘అన్న వచ్చాడు.. న్యాయం జరుగుతుంది’ అంటూ అందరి ముందు బాలిక తండ్రి కూడా చెప్పాడు.కానీ ఆ తర్వాత కూటమి ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు రావడం.. పోలీసు అధికారులు రంగంలోకి దిగడంతో బాలిక తండ్రి మాట మార్చారు. ఆయనకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మరికొందరిపై దాదాపు 20 రోజుల తర్వాత పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. తన బిడ్డపై ఎలాంటి అఘాయిత్యం జరగకపోయినా జరిగినట్లు ప్రచారం చేశారని, వైద్యం అందకుండా ఆస్పత్రి వద్ద గందరగోళం సృష్టించారని అందులో పేర్కొన్నాడు. దీనిపై భాస్కర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి మరికొందరిపై పోక్సో, అట్రాసిటీ చట్టాలు, మరికొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.మిగతా మీడియాలోనూ అదే వార్త..మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా అన్ని పత్రికల్లోనూ, ఛానళ్లలోనూ ఈ ఘటన వార్తలు వచ్చాయి. అయితే కూటమి నేతలు బాలిక తండ్రిపై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్సీపీ నాయకులు, సాక్షి, సోషల్ మీడియాపై ఫిర్యాదు చేయించారు. తనకు అండగా నిలిచి సాయం చేసిన వారిపైనే ఫిర్యాదు చేయడం ఇష్టం లేదని, అయినా రోజూ స్టేషన్‌కు పిలిచి వత్తిడి చేస్తుండడంతో తప్పలేదంటూ బాలిక తండ్రి మనోవేదనకు గురవుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.పరామర్శిస్తే ఇన్ని కేసులా..? రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసుల పరంపరకు చెవిరెడ్డిపై మోపిన ఈ కేసును పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ప్రజల అశాంతికి భంగం కలిగించారని.. నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఇలా.. ఏకంగా 11 సెక్షన్ల కింద అక్రమ కేసు నమోదు చేయడం గమనార్హం... బీఎన్ఎస్ సెక్షన్లు 352, 352(1), 196(1), 62(2), 353(1), 72(2) రెడ్ విత్ ఐటీ చట్టం 67ఏ, పోక్సో చట్టం 23(1), ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం 3(1), జెడ్, జెడ్ సీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.రాష్ట్రంలో మహిళలపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నా ప్రేక్షకపాత్రే...రెడ్‌బుక్ పాలనతో ఒకవైపు అక్రమ కేసులు బనాయిస్తున్న కూటమి సర్కారు మరోవైపు మహిళలపై యథేచ్ఛగా జరుగుతున్న లైంగిక దాడులు, హత్యాచారాలపై ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఓ బాలికను అపహరించి హత్యాచారానికి పాల్పడి ఐదు నెలలు దాటినా ఇప్పటివరకు కనీసం మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించలేకపోయింది. పుంగనూరులో ఓ బాలికను అపహరిస్తే నాలుగురోజుల పాటు చేష్టలుడిగి చూస్తుండిపోయింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఓ బాలికపై టీడీపీ నేత లైంగిక దాడికి పాల్పడితే కేసును కప్పిపుచ్చేందుకు యత్నించారు.పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్‌లో అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఘటన వెలుగులోకి వస్తే మూడు రోజుల పాటు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరిగిన 115 అత్యాచారాలు, లైంగిక దాడుల కేసుల్లో ప్రభుత్వం తక్షణం స్పందించలేదు. దీంతో రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అరెస్టుకైనా.. పోరాటానికైనా సిద్ధమే ⇒ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ⇒ దేవుడు, న్యాయం మా వైపే ఉన్నాయి ⇒ పరామర్శిస్తే పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా 11 సెక్షన్లతో కేసులేంటి? ⇒ తన కుమార్తెపై దారుణం జరిగిందని తండ్రి చెబితే వెళ్లి పరామర్శించా ⇒ మెరుగైన వైద్యం అందేలా సహకరించా.. ఆ బిడ్డ గురించి ఎక్కడా మాట్లాడలేదుసాక్షి, అమరావతి : రాష్ట్రంలో అన్యాయానికి గురైన బాధితులకు అండగా నిలిచినందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందని, దాడికి గురైన ఆడబిడ్డను పరామర్శిస్తే తనపై పోక్సో కేసు పెట్టడం ఏమిటని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. తాను దేనికీ భయపడనని, అరెస్టుకు, పోరాటానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. దేవుడు, న్యాయం తమ వైపే ఉన్నాయని చెప్పారు. బాధితులకు అండగా నిలిచిన తన మీద పోక్సో, ఎస్సీ, ఎస్టీతోపాటు 11 సెక్షన్లతో కేసు పెట్టారని, ఇంత దారుణం ఎక్కడా ఉండదని అన్నారు. జగన్ వెంట నడుస్తున్న వారిని భయాందోళనలు గురి చేయాలని కూటమి నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు.చెవిరెడ్డి మంగళవారం రాత్రి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కుమార్తెపై దారుణం జరిగిందని పాప తండ్రి ఫోన్ చేసి చెబితే అక్కడికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పానన్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న తాను బాధ్యతతో ఆ బాధితురాలికి అండగా నిలిచానని చెప్పారు. బాలికపై దాడి చేసిన దుర్మార్గులకు శిక్ష పడాలని తండ్రి డిమాండ్ చేశాడన్నారు. ఒక బిడ్డకు అన్యాయం జరిగిందంటేనే తాను వెళ్లానని తెలిపారు. ఆ బాలికను తిరుపతి తరలించి మెరుగైన వైద్యం అందించేలా సహకరించానన్నారు. 72 కిలోమీటర్లు వెళ్లి బాధితురాలికి అండగా నిలవటం తాను చేసిన తప్పా అని ప్రశ్నించారు. బాధ్యతగా ఉండటాన్ని తప్పుగా సృష్టిస్తారా అని మండిపడ్డారు.ఆ బిడ్డ గురించి తాను ఎక్కడా నోరు తెరిచి మాట్లాడలేదని, అయినా తనపై తీవ్రవాదుల మీద పెట్టినట్టు కేసు పెట్టారని చెప్పారు. భయపెట్టో, కేసులు పెట్టో పాలన చేయాలంటే సాధ్యం అవుతుందా అని నిలదీశారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఎక్కడికీ వెళ్లనని, పారిపోనని, తన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేయనని, ఎప్పుడైనా అందుబాటులో ఉంటానని చెప్పారు. పాప తండ్రిని పోలీసులు రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్లిపోతే తమ పార్టీ నాయకుడు నాగార్జునరెడ్డి ఆయన్ని తిరుపతి తీసుకువెళ్లి కూతురి దగ్గరకు చేర్చాడని తెలిపారు. అతని మీద కూడా ఆ తండ్రితోనే కేసు పెట్టించారన్నారు.తాను ఎలాంటి ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేయనని, అరెస్టు చేసి శిక్షించాలంటే తాను దేనికైనా సిద్ధమని చెప్పారు. తాను ఎక్కడైనా ఆ పాప గురించి మాట్లాడినట్లు ఆధారాలు, రికార్డు ఉంటే చూపించాలని, ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. అన్యాయం జరిగిన ఆడబిడ్డలను ఎవరు పరామర్శించినా పోక్సో కేసు పెడతామని ఈ చర్య ద్వారా బెదిరిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. తన మీద కేసు పెట్టి రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ నాయకులందరినీ భయపెట్టాలని అనుకుంటున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో భాస్కర్‌రెడ్డితోపాటు పార్టీ నాయకుడు నాగార్జునరెడ్డి కూడా ఉన్నారు. -
వైఎస్సార్సీపీ పూనూరు గౌతమ్ రెడ్డిపై అక్రమ కేసు.. తాడిపత్రి చంద్రశేఖర్ సీరియస్ రియాక్షన్
-
అదంతా.. ఐ–టీడీపీ పైశాచికమే
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా కార్యకర్తలపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ అక్రమ అరెస్టులు, థర్డ్ డిగ్రీ చిత్రహింసలతో దమనకాండకు తెగబడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను ఉక్కుపాదంతో అణచివేస్తోంది. వారం రోజుల్లోనే ఏకంగా 147 కేసులు... 49 మంది అరెస్టులు...680 మందికి నోటీసులతో రాష్ట్రంలో అరాచకాలకు తెర తీసింది. తన దమననీతిని సమరి్థంచుకునేందుకు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ప్రభుత్వ పెద్దలు శ్రీరంగ నీతులు చెబుతుండటం పచ్చ కుట్రలకు పరాకాష్ట. కానీ వాస్తవం ఏమిటంటే... ఐ–టీడీపీ.. ఆది గురువు! పైశాచికత్వానికి నాంది పలికింది... విశృంఖలత్వాన్ని పెంచి పోషించింది... మారి్ఫంగ్ ఫొటోలతో మహిళలు, పిల్లలపై జుగుప్సాకర పోస్టులు పెట్టే విష సంస్కృతిని వ్యవస్థీకృతం చేసింది టీడీపీనే అన్నది అక్షర సత్యం. అందుకోసం చంద్రబాబు బృందం వేలాది మందితో తయారు చేసిన సోషల్ మీడియా పిశాచ గణ విభాగమే ‘ఐ–టీడీపీ’. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నెలకొల్పిన ఆ విష వృక్షం దశాబ్దకాలంలో వేళ్లూనుకుని పచ్చ రాక్షస మూకతో విశృంఖలత్వాన్ని సృష్టిస్తూ విరుచుకుపడుతోంది. అసభ్య పదజాలం... పచ్చి బూతులు... జుగుప్సాకర పోస్టులు... మహిళలను కించపరుస్తూ మార్ఫింగ్ ఫొటోలను వైరల్ చేస్తూ ఐ–టీడీపీ వెగటు రాజకీయాలకు బరి తెగిస్తోంది.ఫేక్ ఐడీలతో దేశ, విదేశాల నుంచి సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టుల వరద పారిస్తూ పైశాచికానందాన్ని పొందుతోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల పేర్లతో ఫేక్ ఖాతాలను సృష్టించి ఏకంగా మహానేత వైఎస్సార్ కుటుంబ సభ్యులనే కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం టీడీపీ రాజకీయ కుట్రలకు పరాకాష్ట. ఈ కుట్రలను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పోలీసులు ఛేదించినా సరే... ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో కొందరు ఖాకీలు పచ్చ ముఠా కుట్రకు కొమ్ముకాస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. దశాబ్దకాలంగా సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకర విష సంస్కృతిని పెంచి పోషిస్తున్న ఐ–టీడీపీ తాజాగా కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి మరింతగా పేట్రేగిపోతోంది. సోషల్ మీడియా పిశాచ గణం... టీడీపీ సోషల్ మీడియా విభాగం ‘ఐ–టీడీపీ’ వికృత రాజకీయానికి, జుగుప్సాకర సంస్కృతికి తెరతీసింది. 2014 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీపై దు్రష్పచారం కోసం ఓ వేదికగా టీడీపీ ప్రారంభించిన ఈ ఐ–టీడీపీ పదేళ్లుగా విశృంఖలత్వాన్ని పెంచి పోషించి వ్యవస్థీకృతం చేసింది. హైదరాబాద్‌లోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కేంద్రగా ఈ పిశాచాల ముఠా సోషల్ మీడియా ద్వారాదుష్ప్రచారనికి, వ్యక్తిత్వ హననానికి తెగబడుతోంది. ఫేక్ ఐడీలతో సోషల్ మీడియా ఖాతాలు ఏర్పాటు చేసుకుని పుంఖాను పుంఖాలుగా అసభ్య పదజాలం, బూతులు, దూషణలతో కూడిన పోస్టులను వైరల్ చేయడమే పనిగా పెట్టుకుంది. ప్రధానంగా వైఎస్సార్సీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులనే లక్ష్యంగా చేసుకుని పని చేస్తోంది. 2019 ఎన్నికల తరువాత ఐ–టీడీపీ సోషల్ మీడియా అరాచకాలు మరింత పేట్రేగిపోయాయి. ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేంతగా బరితెగించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళా మంత్రులతోపాటు మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పారీ్టలో క్రియాశీలంగా వ్యవహరించే మహిళలు, వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. నాడు మంత్రులుగా ఉన్న అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని తదితరులను కించపరుస్తూ... వారి కుటుంబ సభ్యులను అవమానిస్తూ పోస్టులు పెట్టారు. ఫొటోలను మారి్ఫంగ్ చేస్తూ యూట్యూబ్ చానళ్లలో వీడియోలు వైరల్ చేశారు. నాడు ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వైఎస్ జగన్ ఫొటోలను మారి్ఫంగ్ చేస్తూ పోస్టులు పెట్టడం పచ్చ పిశాచాల బరి తెగింపునకు నిదర్శనం. ఇక 2024 ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి ఐ–టీడీపీ విశృంఖలత్వం వెర్రి తలలు వేసింది.ఈసారి ఏకంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరుల పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించి సోషల్ మీడియా ఖాతాలు తెరిచింది. ఆ ఐడీల నుంచే జుగుప్సాకరమైన పోస్టులతో బరితెగించింది. దాంతో చూసేవారికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులే ఆ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని నమ్మించడమే లక్ష్యంగా ఈ కుట్రను కొనసాగించింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నేతల ఫొటోలను మారి్ఫంగ్ చేస్తూ... వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ ఐ–టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తోంది. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా పోలీసులు కనీస చర్యలు కూడా చేపట్టకపోవడం గమనార్హం. ఫిర్యాదు చేసిన బాధితుడినే.. తాజాగా నిందితుడిగా చూపిస్తూ..! తాజాగా చంద్రబాబు ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తూ అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడుతోంది. వర్రా రవీంద్రారెడ్డి పేరుతో అసభ్యకర పోస్టులు పెట్టడంపై వైఎస్సార్ కడప జిల్లా పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే అవే పోస్టుల పేరుతో వైఎస్సార్ కడప జిల్లా పోలీసులే ప్రస్తుతం వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయడం విస్మయం కలిగిస్తోంది. మరి అలాంటప్పుడు ఈ ఏడాది ఫిబ్రవరిలో దర్యాప్తు చేసి నిగ్గు తేల్చిన కేసు సంగతి ఏమైనట్లు..? టీడీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని ఈ ఉదంతం ద్వారా మరోసారి రుజువవుతోంది. ఎంపీ అవినాశ్‌రెడ్డిని ఇరికించే కుట్ర...! టీడీపీ పెద్దల ఆదేశాలతో పోలీసులు వర్రా రవీంద్రారెడ్డిని చిత్రహింసలకు గురి చేసి వేధించారు. ఆయన చెప్పని విషయాలను కూడా చెప్పినట్టుగా వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దాదాపు 40 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లు, యూట్యూబ్ చానళ్ల ద్వారా తాము అసభక్యకర పోస్టులను వైరల్ చేసినట్టు వర్రా రవీంద్రారెడ్డి తన దర్యాప్తులో అంగీకరించారని పోలీసులు ఏకపక్షంగా వాంగ్మూలం నమోదు చేయడం గమనార్హం. ఈ అక్రమ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని ఇరికించేందుకు కూడా పోలీసులు పన్నాగం పన్నడం గమనార్హం. ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయన పీఏ రాఘవరెడ్డి రాసిన పోస్టులను తాము సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు వర్రా రవీంద్రారెడ్డి వెల్లడించారని డీఐజీ కోయ ప్రవీణ్ మీడియాతో పేర్కొనడం ప్రభుత్వ కుట్రకు పరాకాష్ట. వైఎస్ భారతి పీఏ కాదు... ఇక వర్రా రవీంద్రారెడ్డి వైఎస్ భారతి పీఏ అంటూ టీడీపీ అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. ఆయన ఏనాడూ ఆమె వద్ద పీఏగా పని చేయలేదు. అయితే టీడీపీ దురుద్దేశపూరితంగానే ఈ అవాస్తవ ప్రచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది. ఎందుకంటే వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఐ–టీడీపీ అప్పటికే ఫేక్ సోషల్ మీడియా ఖాతాను సృష్టించింది. ఆ ఖాతా నుంచి అసభ్యకర పోస్టులను వైరల్ చేస్తోంది. షరి్మల, నర్రెడ్డి సునీతను కూడా కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం టీడీపీ కుట్రకు పరాకాష్ట. దీన్ని వైఎస్సార్ కుటుంబ సభ్యులపైనే నెట్టివేసేందుకే టీడీపీ ఈ అవాస్తవ ప్రచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది. వాస్తవం ఏమిటంటే వర్రా రవీంద్రారెడ్డి ఏనాడూ వైఎస్ భారతి వద్ద పీఏగా పని చేయలేదు. ఆయన కూడా తాను పీఏనని ఏనాడూ చెప్పుకోలేదు కూడా!ఐ–టీడీపీ అరాచక పోస్టుల్లో కొన్ని...⇒ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన కుటుంబ సభ్యులను కించపరుస్తూ వారి ఫొటోలను ఐ–టీడీపీ ముఠాలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆత్మలతో మాట్లాడతారని చంద్రబాబు, లోకేశ్ దారుణంగా దు్రష్పచారం చేయడం... దాన్ని ఐ–టీడీపీ మారి్ఫంగ్ ఫొటోలతో సోషల్ మీడియాలో వైరల్ చేసి కించపరిచింది. ⇒ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ఫొటోలను మారి్ఫంగ్ చేసి అసభ్యకరమైన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా ఆయన కుటుంబ సభ్యులను తీవ్ర ఆవేదనకు గురి చేశారు. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళా మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, విడదల రజని, ఉషాశ్రీ చరణ్, పాముల పుష్పశ్రీవాణితోపాటు పార్టీ మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.⇒ అంబటి రాంబాబు, ఆయన సతీమణి, కుమార్తెలతో ఉన్న ఫొటోను అసభ్యకరమైన పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ⇒ వైఎస్సార్సీపీ హయాంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని, ఆయన కుటుంబ సభ్యులను కించపరుస్తూ మారి్ఫంగ్ ఫొటోలతో వేధించారు. ⇒ హీరో అల్లు అర్జున్, ఆయన సతీమణిని కించపరుస్తూ.. వారి ఫొటోలను మారి్ఫంగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేశారు. ఫేక్ ఐడీలతో వైఎస్సార్ కుటుంబంపై పోస్టులుపోలీస్ విచారణలో ఐ–టీడీపీ దారుణాలు బహిర్గతం ఈ వికృత క్రీడకు టీడీపీ ఎంతగా బరితెగించిందంటే... వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల పేరుతో సృష్టించిన ఫేక్ ఐడీలతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కుట్రలకు దిగజారింది. షర్మిల, సునీత తదితరులను కించపరుస్తూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల వెనుక ఐ–టీడీపీ కుట్ర దాగి ఉందని పోలీసుల దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడి కావడమే దీనికి నిదర్శనం. వైఎస్సార్సీపీ కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఐ–టీడీపీ ఫేక్ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించింది.ఆ ఖాతాల నుంచి వైఎస్సార్ కుటుంబ సభ్యులను, ప్రధానంగా మహిళలను కించపరుస్తూ పోస్టుల వరద పారించింది. దీనిపై అప్పట్లోనే వైఎస్సార్సీపీ తక్షణమే స్పందించి పోలీసులను ఆశ్రయించడం గమనార్హం. తన పేరుతో ఫేక్ ఐడీ సృష్టించి సోషల్ మీడియాలో జుగుప్సాకర పోస్టులు పెడుతున్నారంటూ వర్రా రవీంద్రారెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై పోలీసులు దర్యాప్తు చేయడంతో ఐ–టీడీపీ దారుణాలు బట్టబయలయ్యాయి. ఈక్రమంలో విశాఖపటా్ననికి చెందిన ఐ–టీడీపీ కార్యకర్త ఉదయ్ భూషణ్‌ను అరెస్ట్ చేశారు. వర్రా రవీంద్రరెడ్డి పేరుతో సృష్టించిన ఫేక్ ఐడీ నుంచే షరి్మల, నర్రెడ్డి సునీతలను కించపరుస్తూ అతడు పోస్టులు పెట్టినట్లు ఆధారాలతోసహా వెల్లడైంది. న్యాయమూర్తి దృష్టికి పోలీస్ అరాచకాలు వర్రా రవీంద్రారెడ్డి న్యాయమూర్తి ఎదుట వాస్తవాలను వెల్లడించడంతో పోలీసుల కుట్ర బెడిసికొట్టింది. పోలీసులు తనను తీవ్రంగా హింసించారని... తాము చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలని తీవ్రంగా కొట్టారని... తాను చెప్పని విషయాలను కూడా చెప్పినట్టుగా వాంగ్మూలంగా నమోదు చేశారని వర్రా రవీంద్రారెడ్డి న్యాయమూర్తి వద్ద మొర పెట్టుకోవడంతో పోలీసుల కుట్ర బట్టబయలైంది. -
బాబుకి ఓపెన్ చాలెంజ్ విసిరిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ అక్రమాలు, వైఫల్యాలు, మోసాలపై ప్రశ్నించే స్వరం విన్పించకూడదనే దురాలోచనతో సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ, అక్రమంగా నిర్బంధిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండి పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ రాజకీయంగా ఆయనను వ్యతిరేకించే వారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా ఎవరినీ అరెస్టు చేయడం లేదన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..» దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో 680 మందిపై సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు. 147 మందిపై కేసులు పెట్టి.. 49 మందిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు మోసాలను సోషల్ మీడియా వేదికగా నేను పోస్ట్ చేస్తాను. వైఎస్సార్సీపీ శ్రేణులంతా ఇదే పోస్టు పెట్టాలని పిలుపునిస్తున్నా. ఎంత మందిపై కేసులు పెడతారో చూద్దాం. ఆ కేసులేవో నాతోనే మొదలుపెట్టండి. .@ncbn గారు .. ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు.నీవు చీటర్‌వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా?ఆడబిడ్డ నిధి:18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళలకు రూ.37,313 కోట్లు ఇవ్వాలి. ఎంత…— YS Jagan Mohan Reddy (@ysjagan) November 13, 2024» ఒక వైపు చంద్రబాబు హయాంలో రాష్ట్రం కుదేలైపోయే పరిస్థితి కన్పిస్తోంది. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రతీ వర్గాన్ని మోసం చేస్తున్నారు. మహిళలు, చిన్నారుల పరిస్థితి ఎప్పుడూ చూడని విధంగా ఉంది. ఏకంగా 110 మంది మహిళలు, చిన్నారులపై ఈ ఐదున్నర నెలల్లోనే అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయి. » ఇందులో 11 మంది చనిపోయారు. నిన్న (మంగళవారం) కూడా మూడు ఘటనలు జరిగాయి. రాష్ట్రంలో ఐదున్నర నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 177 హత్యలు.. 500కు పైగా హత్యాయత్నాలు జరిగాయి. మహిళలపై అన్యాయాలు, అత్యాచారాలకు అంతే లేకుండా పోయింది.ఇదీ చదవండి: బూచిగా అప్పుల భూతం.. సూపర్ సిక్స్‌కు ఎగనామం» బడ్జెట్ చూస్తే మోసం.. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం విఫలమైన పరిస్థితి. పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల బకాయిలు రూ.2,300 కోట్లు దాటాయి. వాళ్లు రోడ్డెక్కుతున్నారు. పట్టించుకోవడం లేదు. 108, 104 సిబ్బంది ధర్నా చేస్తున్నారు. అతలాకుతలమైపోయిన పరిస్థితుల్లో సూపర్ సిక్స్, సూపర్ సెవన్ మోసం.. ఇలాంటి పరిస్థితులను నిలదీస్తే.. ప్రశ్నించే గొంతును నొక్కేందుకు అక్రమ కేసులు బనాయిస్తూ అక్రమంగా నిర్బంధిస్తూ ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. -
సర్కారు గూండాగిరీ...కిడ్నాపులు, అక్రమ కేసులు.. దాడులు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారికంగానే గూండాగిరీకి తెగబడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతుకలను అణచివేసే కుట్రతో వేధింపుల పరంపర కొనసాగిస్తోంది. అక్రమ నిర్బంధాలు, కిడ్నాపులు, అక్రమ అరెస్టులు, వేధింపులు, భౌతిక దాడులకు తెగబడుతూ రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తోంది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేవలం మూడు రోజుల్లోనే 101 అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్టగా నిలుస్తోంది. పోలీసులు సివిల్ డ్రెస్‌లో వస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అపహరించుకుపోతున్నారు. ఇలా అక్రమంగా అదుపులోకి తీసుకున్న వారిని ఒక పోలీస్‌స్టేషన్ నుంచి మరో పోలీస్‌స్టేషన్‌కు తిప్పుతూ చిత్రహింసలకు గురిచేయడంతోపాటు భయోత్పాతం సృష్టిస్తున్నారు. అసలు అదుపులోకి తీసుకున్న విషయాన్ని కూడా అధికారికంగా వెల్లడించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం బనాయిస్తున్న ఈ అక్రమ కేసులు, పాల్పడుతున్న వేధింపులకు తాజా ఉదాహరణలు ఇవిగో..నిద్రిస్తుంటే ఎత్తుకుపోయారు..అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం అరవీడుకు చెందిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సభ్యుడు హనుమంతురెడ్డిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. తన ఇంట్లో నిద్రిస్తున్న ఆయన్ని సివిల్ డ్రెస్‌లో వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారు స్థానిక నేతలతో కలిసి గాలివీడు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లినా సరైన సమాచారం ఇవ్వలేదు. తాము అరెస్టుచేయలేదని చెప్పారన్నారు. సాయంత్రం వరకు అనేక పోలీస్స్టేషన్లలో వాకబు చేసినా హనుమంతరెడ్డి ఆచూకీ లభించలేదు. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్‌ను సంప్రదించగా తమకింకా ఎలాంటి సమాచారం లేదన్నారు.కందిపప్పు తూకం తక్కువ ఉందంటే కేసు..వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధి తుమ్మా బాబుల్‌రెడ్డిపై పోలీసులు బుధవారం విచిత్ర కారణంతో కేసు నమోదు చేశారు. ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా సరఫరాచేసే కందిపప్పు ఒక కేజీకి బదులు 780 గ్రాములే ఉండటంపై అక్టోబరు 4న బాబుల్‌రెడ్డి సోషల్ మీడియాలో పోస్టుపెట్టారు. అదేదో తీవ్ర నేరమన్నట్లు పోలీసులు 352 (2) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. బాబుల్‌రెడ్డి ఫోనును పోలీసులు తీసుకున్నారు. రెండు మూడ్రోజుల వరకు తమకు అందుబాటులో ఉండాలంటూ హెచ్చరించారు. విశాఖ వాసిపై ప్రకాశం జిల్లాలో కేసు..విశాఖ మద్దిలపాలేనికి చెందిన బోస రమణారెడ్డిని మంగళవారం అర్థరాత్రి ప్రకాశం జిల్లా పొదిలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని పొదిలి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తున్నట్లు పోలీసులు చెప్పారని రమణారెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ నుంచి రమణారెడ్డిని ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఒకరిపై మూడు జిల్లాల్లో అక్రమ కేసులు..ప్రకాశం జిల్లా కనిగిరి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ మునగాల హరీశ్వర్‌రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో నెల్లూరు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై నెల్లూరు రూరల్, కోవూరు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. హరీశ్వర్‌రెడ్డిని నెల్లూరుకు తరలించారు. విచారణ అనంతరం నోటీసిచ్చి పంపినట్లు సీఐ వేణు చెబుతుండగా, ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం. అలాగే, హరీశ్వర్‌రెడ్డిపై తిరుపతిలో రెండు కేసులు నమోదు చేసిన నేపథ్యంలో అక్కడి పోలీసులు కూడా నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.దంపతులూ అక్రమ అరెస్టు..ఇక పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టుచేశారు. స్టేషన్ బెయిల్ అనంతరం బయటకు రాగానే ప్రకాశం జిల్లా పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకుని ఒంగోలుకు తరలించారు. ఆ క్రమంలో వారిపై టీడీపీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడికి యత్నించారు.మా బిడ్డను చూపించండి..పోలీసులు అదుపులోకి తీసుకున్న మా కొడుకు హనుమంతరెడ్డి (40)ని చూపించాలని తల్లిదండ్రులు మనోహరమ్మ, వెంకటరమణారెడ్డి కోరారు. అన్నమయ్య జిల్లా పోలీసులు బుధవారం తెల్లవారుజామున సివిల్ డ్రెస్‌లో వచ్చిన పోలీసులు ఇంట్లో ఉన్న తమ కుమారుడ్ని బలవంతంగా జీపులో ఎక్కించుకుని వెళ్లారన్నారు. తాము పోలీసులమని, స్టేషన్‌కి తీసుకెళ్తున్నామని చెప్పారని.. కానీ, ఏ స్టేషన్‌కు తీసుకెళ్లింది.. ఎక్కడికి తీసుకెళ్లింది.. తీసుకెళ్లిన పోలీసులు ఎవరన్న విషయం తెలీదని వారు చెప్పారు. జిల్లా ఎస్పీ చొరవ తీసుకుని తమ బిడ్డను విడుదల చేయాలని తల్లిదండ్రులు వేడుకున్నారు.హైదరాబాద్‌లో గుడ్లూరు వాసి అరెస్ట్నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరుకు చెందిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త రామాల మని్వత్ కృష్టారెడ్డిని పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఏ కేసులో అరెస్ట్ చేశారన్న సమాచారం తెలియలేదు. కృష్టారెడ్డి విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఇటీవల హైదరాబాద్ వచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు.87మందిపై కేసు నమోదు వీరిలో రెండేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికీ నోటీసుగుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఓ వాట్సాప్ గ్రూపులో ఉన్న 87 మందిపైనా విజయవాడ పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. వీరందరూ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీచేశారు. వారిలో రెండేళ్ల క్రితం చనిపోయిన తురక శ్రీనివాసరావు కూడా ఉండటం గమనార్హం. మరోవైపు.. గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ మేకా వెంకటరామిరెడ్డిని పోలీసులు అరెస్టుచేశారు. సోషల్ మీడియా పోస్టులతో పేరుతోపాటు ఆయనపై మరిన్ని కేసులు నమోదు చేశారు. వెంకట రామిరెడ్డిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అంతకుముందు వెంకటరామిరెడ్డిని అంబటిరాంబాబు కలిసి ధైర్యం చెప్పారు. కాగా, చంద్రబాబును కించపరుస్తూ 2018లో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన రైతు ఆళ్ల జగదీష్‌రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తెనాలి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 4వ తేదీన కేసు నమోదవగా, తెనాలి రూరల్, కొల్లిపర స్టేషన్లలో మరో రెండు కేసులు నమోదు చేశారు. చివరకు తెనాలి త్రీ టౌన్, రూరల్ పోలీస్స్టేషన్లలో బుధవారం రాత్రి జగదీష్‌రెడ్డిని పోలీసులు విచారించి, కౌన్సెలింగ్ ఇచ్చి, 41 సీఆర్పీసీ నోటీసులిచ్చి పంపారు.విచారణ పేరుతో ‘వర్రా’ కుటుంబంపై వేధింపులు..వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న వేముల మండలం కొండ్రెడ్డి పల్లెకు చెందిన వర్రా రవీంద్రారెడ్డిని మంగళవారం రాత్రి పోలీసులు అతని ఇంటికెళ్లి దౌర్జన్యంగా కడపకు తీసుకొచ్చారు. కడప తాలూకా పోలీసుస్టేషన్లో హాజరుపరిచిన తర్వాత వర్రా రవీంద్రారెడ్డికి 41ఏ నోటీసు ఇచ్చి పంపించారు. అయితే అతను ఎక్కడికి వెళ్లింది తెలియరాలేదు. నిజానికి.. బుధవారం ఉదయాన్నే ఆర్కే వ్యాలీ సీఐ నాగరాజు తమ సిబ్బందితో వెళ్లి రవీంద్రారెడ్డిని వేములకు తీసుకొచ్చారు.రవీంద్రారెడ్డి భార్య కల్యాణి ఇతర కుటుంబ సభ్యులు పోలీసుల వెంట మరో వాహనంలో వచ్చారు. పోలీసుల సూచనలతో అక్కడ నుంచి వేంపల్లెకు.. మళ్లీ కడప వచ్చారు. చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్‌కు 11.30 గంటలకు వచ్చిన వర్రా రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు వేధింపుల పర్వం మొదలైంది. కల్యాణిని, వారి కుటుంబ సభ్యులను పదేపదే రవీంద్రారెడ్డి ఎక్కడికి వెళ్లాడని, సమాచారం చెప్పకపోతే కోటింగ్ ఇస్తామని బెదిరించారు. వీరంతా కూడా పోలీసుల అదుపులో ఉన్నారని మీడియాలో రావడంతో రాత్రి 7 గంటల సమయంలో కుటుంబ సభ్యులకూ 41ఏ నోటీసును పంపించారు. ఇది తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాష, నగర మేయర్ కె.సురేష్‌బాబు, డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి తదితరులు చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్‌కు చేరుకోగా బాధితులు వారికీ, మీడియాకు తమకు ఎదురైన వేధింపులను వివరించారు. 5వ తేదీ అర్థరాత్రి పోలీసులు ఇంటికొచ్చి దౌర్జన్యం చేశారని.. సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని కళ్యాణి చెప్పారు. తనకు ఆరోగ్యం బాగాలేదని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలని కోరినా వినకుండా డ్రామాలు ఆడొద్దని బెదిరించారన్నారు. తన భర్త ఆచూకీ తెలియజేయాలని.. ఆయనకు ఏం జరిగినా హోంమంత్రి, పోలీసులదే బాధ్యతని కళ్యాణి చెప్పారు. అలాగే, ఈ విషయంపై పి.రవీంద్రారెడ్డి, అంజద్ బాషా, సురేష్‌బాబు స్పందిస్తూ.. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు. వర్రా రవీంద్రారెడ్డి రెండేళ్ల కిందట పెట్టిన పోస్టుకు ఇప్పుడు చర్యలు తీసుకోవడం ఏమిటని.. ఇది ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమన్నారు. ప్రజలకు మంచి పాలన అందించకుండా వేధింపులకు గురిచేయడం ఏమిటని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేస్తూ అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. రవీంద్రరెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదని కారణం చూపిస్తూ ఎస్పీని బదిలీ చేయడం దారుణమన్నారు.మా కుటుంబ సభ్యులను కాపాడండి..ఇదిలా ఉంటే.. పోలీసుల అక్రమ నిర్బంధం నుంచి తమ కుటుంబ సభ్యులను విడుదల చేసేలా సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించాలని కోరుతూ వేముల మండలం, కొండ్రెడ్డిపల్లెకు చెందిన వర సూర్యనారాయణరెడ్డి బుధవారం కడప మొదటి అదనపు, మానవ హక్కుల జడ్జికి ఫిర్యాదు చేశారు. తన కోడలు వర కల్యాణితో పాటు కుటుంబ సభ్యులను పోలీసులు హింసిస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. పోలీసుల చర్యలు ప్రాథమిక మానవ హక్కులకు, ప్రాథమిక న్యాయ సూత్రాలకు గండి కొట్టేడమే అవుతుందని పేర్కొన్నారు. -
నందిగం సురేష్ పై మరో అక్రమ కేసు..
-
సాక్షిపై కేసు.. కన్నబాబు రియాక్షన్
-
పత్రికా స్వేచ్ఛపై ‘రెడ్‌బుక్’ పడగ
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన మీడియాపై కూడా చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగంతో వేధింపులకు తెగించింది. పత్రికా స్వేచ్ఛ కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ఎమర్జెన్సీ రోజుల నాటి అరాచకాలకు తెరతీసింది. టీడీపీ కూటమి సర్కారు అసమర్థ, అవినీతి పరిపాలనను సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందుంచుతున్న ‘సాక్షి’ మీడియా గ్రూప్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగింది. రాజ్యాంగ సూత్రాలు, పార్లమెంటు చేసిన చట్టాలకు విరుద్ధంగా విజయవాడ పోలీసులు గురువారం ‘సాక్షి’ ఎడిటర్ వి.మురళి, ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వ దమననీతికి నిదర్శనం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దుర్నీతి, కక్ష సాధింపులు ఇలా ఉన్నాయి...పత్రికా ధర్మం నిర్వర్తిస్తున్నందుకే చంద్రబాబుకు కంటగింపుటీడీపీ కూటమి రెడ్‌బుక్ పేరుతో సాగిస్తున్న అరాచకాలు, దాడులు, వేధింపులను ఎక్కడికక్కడ ఎండగడుతూ ‘సాక్షి’ బాధితులకు అండగా ఉంటోంది. బాధ్యతాయుతమైన మీడియా సంస్థగా పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు పాటుపడుతోంది. ఈ క్రమంలో గత నాలుగు నెలలుగా రాష్ట్రంలో టీడీపీ రౌడీమూకలు బరితెగించి పాల్పడుతున్న హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచుతోంది. మరోవైపు టీడీపీ ప్రభుత్వ అవినీతి, దోపిడీని ప్రజలకు వివరించి చైతన్యపరుస్తూ తన ధర్మాన్ని నిర్వర్తిస్తోంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ‘సాక్షి’ మీడియాపై కక్ష గట్టింది. సాక్షి టీవీ చానల్ ప్రసారాలకు ఆటంకాలు కల్పిస్తోంది. కేబుల్ ఆపరేటర్లను భయపెట్టి సాక్షి టీవీ చానల్ ప్రసారాలను నిలిపివేస్తోంది. మరోవైపు సాక్షి పత్రికపై కూడా కక్ష గట్టింది. సర్కారు అలసత్వంతో ఇటీవల విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదలు వస్తాయని వాతావరణ శాఖ నాలుగు రోజుల ముందే స్పష్టమైన సమాచారం ఇచ్చి హెచ్చరించినా సరే చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర వీడలేదు. దీంతో వరదలు ముంచెత్తి విలయం సృష్టించాయి. 50 మందికిపైగా దుర్మరణం చెందగా ఏకంగా రూ.10 వేల కోట్ల ఆస్తినష్టం సంభవించింది. వరదల సహాయ, పునరావాస చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంతేకాదు వరద బాధితులకు సహాయ, పునరావాస వ్యయం, పరిహారం పంపిణీలో భారీ అవినీతికి పాల్పడింది. భోజనాలు, అగ్గిపెట్టెలు, మంచినీళ్ల సీసాలు తదితర వ్యయాన్ని భారీ ధరలతో అమాంతం పెంచేసింది.దీనిపై పూర్తి సాక్ష్యాధారాలతో ‘ముంపులోనూ మేసేశారు’ అనే శీర్షికతో ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. వామపక్ష పార్టీలు కూడా ఈ విషయంపై పూర్తి ఆధారాలతో ప్రెస్‌మీట్ నిర్వహించి ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘సాక్షి’ కథనంతో తమ అవినీతి బండారం బట్టబయలైందని ఆందోళన చెందిన చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. ఈ క్రమంలో దొంగదారిలో కక్ష సాధింపు చర్యలకు తెర తీసింది.కుట్రపూరితంగా ఎఫ్ఐఆర్ నమోదుపత్రికా స్వేచ్ఛ కోసం రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను చంద్రబాబు ప్రభుత్వం కాలరాసింది. పత్రికల్లో ప్రచురితమైన వార్తలు, కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తగిన చర్యలు తీసుకునేందుకు మన చట్టంలో స్పష్టమైన నిబంధనలున్నాయి. పత్రికలో ప్రచురితమైన కథనంపై అభ్యంతరం తెలుపుతూ ఖండన ఇవ్వవచ్చు. ఇంకా తమ పరువుకు భంగం వాటిల్లిందని భావిస్తే న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేయవచ్చు. దానిపై న్యాయస్థానం విచారించి తగిన తీర్పు వెలువరిస్తుంది. ఇదీ చట్టపరమైన విధానం. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ చట్టపరమైన మార్గాన్ని ఎంచుకోలేదు. ఎందుకంటే న్యాయస్థానంలో కేసు వేస్తే.. సాక్షి పత్రిక పూర్తి ఆధారాలతో తన వాదనను వినిపిస్తుంది. అందుకే దొంగదెబ్బ తీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. విజయవాడకు చెందిన గుడిపాటి లక్ష్మీనారాయణ అనే న్యాయవాదితో ‘సాక్షి’ కథనానికి వ్యతిరేకంగా పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇప్పించారు. నిబంధనల ప్రకారం ఆ ఫిర్యాదును పోలీసులు స్వీకరించకూడదు. ఎందుకంటే ‘సాక్షి’ కథనంతో ఆ న్యాయవాదికి ఎలాంటి సంబంధం లేదు. ఆ న్యాయవాదిని ఉద్దేశించి ఆ కథనం రాయలేదు. ఆయన పరువుకు ఎక్కడా భంగం కలగలేదు. ఆ కథనంలో ప్రభుత్వ అవినీతి గురించే పేర్కొన్నారు. ఆ న్యాయవాది ప్రభుత్వ అధికార వ్యవస్థలో భాగం కూడా కాదు. అయినా సరే నిబంధనలకు విరుద్ధంగా ఆ న్యాయవాదితో ఫిర్యాదు చేయించారు. ఆయన ఫిర్యాదుపై విజయవాడ పోలీసులు ఏకంగా ‘సాక్షి’కి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మరింత విడ్డూరం. కేవలం చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అసమర్థ పరిపాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా.. ‘సాక్షి’ని కట్టడి చేయాలన్న కుట్రతోనే ఈ అక్రమ కేసు బనాయించారన్నది సుస్పష్టం. ఇక తిరుపతిలోనూ ఇదే విధంగా ‘సాక్షి’పై ఫిర్యాదు చేయించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ... రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ‘సాక్షి’ మీడియా గ్రూప్‌పై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగటాన్ని యావత్ పాత్రికేయ రంగంతోపాటు మీడియా నిపుణులు తీవ్ర స్థాయిలో నిరసిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు.సుప్రీం ఆదేశాలు పట్టవా?‘ప్రభుత్వాన్ని విమర్శించే వార్తలు రాశారనే కారణంతో జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు నమోదు చేయవద్దని సుప్రీంకోర్టు ఈ నెల 4వతేదీన ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఏ) కింద జర్నలిస్టులకు ఉన్న భావప్రకటనా స్వేచ్ఛను కాపాడాలని స్పష్టం చేసింది. యూపీ ప్రభుత్వ అధికారుల్లో కుల సమీకరణాలను ఉద్దేశించి జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయ్ ‘యాదవ్ రాజ్ వర్సెస్ ఠాకూర్ రాజ్’ శీర్షికన ఓ కథనం రాశారు. దీనిపై లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 20న ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాల్సిందిగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ హృషికేశ్‌రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘జర్నలిస్టు రాసినవి కేవలం ప్రభుత్వాన్ని విమర్శించేలా ఉన్నాయనే కారణంతో క్రిమినల్ కేసులు పెట్టవద్దు’ అని స్పష్టం చేసింది. జర్నలిస్టులపై దూకుడు చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ.. ఏపీ ప్రభుత్వ పెద్దల ఆదేశంతో ఫిర్యాదు వచ్చిందే తడవుగా విజయవాడ పోలీసులు సాక్షి ఎడిటర్‌పై కేసు నమోదు చేసిన తీరుపై జర్నలిస్టులతో పాటు న్యాయవాదులు విస్తుపోతున్నారు. కుట్రతో కూడిన ఈ కేసుపై సుప్రీం కోర్టు వరకు వెళతామని ప్రకటించారు.చట్ట ప్రకారం కేసులు చెల్లవుఒక కథనం విషయంలో ఎడిటర్‌పై కేసు పెట్టడం అంటే భావ ప్రకటనా సేచ్ఛను ఆటంకం పరిచినట్టే. వాస్తవాలను బయట పెట్టకుండా బెదిరించే ప్రయత్నం ఇది. ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టుకోవచ్చు. పత్రికలు చాలా జవాబుదారీతనంతో నడుస్తాయి. అలాంటి పత్రికా ఎడిటర్‌పై కేసులు పెట్టడం అప్రజాస్వామికం. ఇలాంటి ఘటనల్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉండాల్సింది. రాజకీయ ఒత్తిళ్లతో ఆ పని చేసినట్టు తెలుస్తోంది. ఇలాంటి కేసులు చట్ట ప్రకారం నిలబడవు. – సుప్రీం కోర్టు న్యాయవాదులుఅభ్యంతరాలుంటే ఖండన ఇవ్వాలిరాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టి పత్రికా స్వేచ్ఛను హరించాలనుకోవడం సరికాదు. విపత్తుల సమయంలో ప్రభుత్వ పనితీరును తెలియచేసిన ‘సాక్షి’ ఎడిటర్‌పై పోలీసు స్టేషన్లో కేసు పెట్టడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అకాల వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల కష్టాలను, ప్రభుత్వ చర్యలను రిపోర్టు చేయడం మీడియా బాధ్యత. ఇటీవల విజయవాడ వరదల నేపథ్యంలో బాధితులకు అందిన సహాయంపై ‘సాక్షి’ అదే పని చేసింది. పత్రికలో ప్రచురించిన కథనంపై అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. అందులో అసత్యాలు ఉన్నాయని భావిస్తే మొదట వాస్తవ గణాంకాలను చెబుతూ ఖండన ఇవ్వాలి. సాక్షి ఆ వివరణను ప్రచురించకపోతే న్యాయ స్థానాలను ఆశ్రయించాలి. అంతేగానీ పోలీసు కేసు పెట్టడమంటే భావ ప్రకటన స్వేచ్ఛను దెబ్బతీయడమే. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అసత్య కథనాలపై సంబంధిత శాఖ ఖండనను ప్రచురించకుంటే న్యాయస్థానానికి వెళ్లే వెసులుబాటును అధికార యంత్రాంగానికి కల్పిస్తూ జీవో తీసుకొచ్చారు. అప్పట్లో దీనిపై ప్రతిపక్షాలు నానా హంగామా చేశాయి. ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి పక్షాలు గొడవ చేశాయి. ఆనాడు జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవో సరైందని అంగీకరించాకే ఇప్పుడు ముందుకు వెళ్లాలి. ఎవరైనా తప్పు వార్త రాస్తే ఖండించాలి. ఖండన ప్రచురించకుంటే పరువు నష్టం దావా వేసుకోవచ్చు. అంతేగానీ ఎవరో ఒకరి చేత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించి దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏమాత్రం సరికాదు’ – దేవులపల్లి అమర్, ఇండియన్ జర్నలిస్టు యూనియన్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు, మన తెలంగాణ దినపత్రిక సంపాదకుడు కచ్చితంగా కక్ష సాధింపేమీడియాపై ప్రభుత్వ కక్ష సాధింపులు సరికాదు. సాక్షిపై కేసు పెట్టడం అప్రజాస్వామికం. విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు సాయం అందడం లేదన్న వాస్తవాన్ని రాసినందుకు సాక్షిపై కూటమి ప్రభుత్వం అక్కసు పెంచుకోవడం దారుణం. ప్రజా సమస్యలపై విస్తత కథనాల ద్వారా మీడియా తన బాధ్యతగా ప్రభుత్వం, సమాజం దృష్టికి తెస్తుంది. మీడియా ప్రచురించిన కథనాలపై ఎటువంటి అభ్యంతరం ఉన్నా సంబంధిత బాధ్యులు ఖండన ఇవ్వవచ్చు.అందుకు విరుద్ధంగా కేసులు పెట్టి బెదిరింపులతో మీడియాను కట్టడి చేయాలనే ప్రయత్నం ఏ మాత్రం వాంఛనీయం కాదు. చంద్రబాబు డైరెక్షన్లో ఒక లాయర్‌తో ఫిర్యాదు ఇప్పించి ఆగమేఘాలపై కేసు నమోదు చేయించడం కచ్చితంగా కక్ష సాధింపే. మీడియాపై పోలీసులను పురిగొల్పి బెదిరించే ధోరణిని కూటమి ప్రభుత్వం మార్చుకోవాలి. – మలసాని మనోహర్‌రెడ్డి,వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పత్రికా స్వేచ్ఛపై కత్తి కట్టడమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశారని ‘సాక్షి’పై కేసు నమోదు చేయడం అత్యంత దారుణం. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడే. రోజురోజుకీ గతి తప్పి వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వం ఓ నియంతలా మారుతోంది. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరదల తర్వాత సహాయక పనుల్లో రూ.534 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ వివరాలను అధికారులు స్వయంగా ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించారు. అందులో అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, భోజనాలు, నీళ్ల బాటిల్స్ కోసం ఖర్చు చేసినట్లు చూపిన మొత్తం.. ఆ గణాంకాలు వాస్తవాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. దాన్ని ప్రస్తావిస్తూ, వాస్తవంగా అయ్యే ఖర్చును వివరిస్తూ.. వరద సహాయ పనుల్లో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తూ రాయడం తప్పా? నిజానికి అది మీడియా బాధ్యత. అదే పని ‘సాక్షి’ చేసింది. వరద సహాయక చర్యల్లో చోటు చేసుకున్న అంతులేని అవినీతిని ఎండగట్టింది. అందువల్ల ‘సాక్షి’పై కక్ష కట్టిన కూటమి ప్రభుత్వం మరింత దిగజారి ఏకంగా కేసు నమోదు చేయడం హేయమైన చర్య. ఇప్పటికే కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి, బెదిరించి సాక్షి ఛానల్ ప్రసారాలను అడ్డుకుంది. ఇప్పుడు పత్రికపైనా కత్తి కట్టారు. వెంటనే ‘సాక్షి’పై కేసును ఉపసంహరించుకోవాలి. – కురసాల కన్నబాబు, మాజీ మంత్రిమీడియా స్వేచ్ఛను హరించడమే..వాస్తవాలను బయటపెడితే కూటమి ప్రభుత్వం సహించలేకపోతోంది. విజయవాడ వరదలకు సంబంధించి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి పత్రికలను టార్గెట్ చేస్తోంది. సాక్షి ఎడిటర్‌పై కేసు పెట్టడమంటే పత్రికా స్వేచ్ఛను హరించడమే. నిర్భయంగా, నిష్పాక్షికంగా వార్తలు రాసి వాస్తవాలు బయటపెట్టే విలేకరుల గొంతు నొక్కడమే. ఇది అత్యంత గర్హనీయం. దీనిపై మా అసోసియేషన్ తరఫున ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేస్తాం. ఇలా కేసులు పెట్టేవారిని ఏ ప్రభుత్వం ప్రోత్సహించకూడదు. బేషరతుగా కేసును ఉపసంహరించుకోవాలి. – వీవీఆర్ కృష్ణంరాజు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ -
రఘురామపై మాజీ ఐపీఎస్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన అక్రమ కేసుల వ్యవహారంపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు. డీజీపీ ర్యాంకులో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులపై, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదైందన్న వార్త తనను షాక్‌కు గురిచేసిందని అన్నారాయన. ఈ క్రమంలో రఘురామ వ్యవహారశైలిపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎంపీ, ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజును వేధించారనే ఆరోపణలపై మాజీ సీఎం వైఎస్ జగన్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్నిఆర్ఎస్సీ తన ట్వీట్లో తప్పుబట్టారు. ఈ అంశాన్ని అప్పట్లోనే కోర్టులు విచారించాయని.. అయితే అందులో ఏమీ బయటకు రాలేదని అభిప్రాయపడ్డారు. అధికారం మారడం తప్ప మూడేళ్లలో ఏం మారిందని.. మూడేళ్ల తర్వాత అకస్మాత్తుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. .. దురదృష్టవశాత్తూ నిజాయితీగల పోలీసులు ఈ దేశంలో ప్రతీకార రాజకీయాల్లో బాధితులుగా మారుతున్నారన్న ఆర్ఎస్పీ.. గోద్రా మారణహోమంలో సత్యం, న్యాయానికి అండగా నిలిచినందుకు గుజరాత్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ సంజీవ్ భట్ ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు రఘురామకృష్ణరాజుపైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. అబద్ధాలడడం అలవాటుగా ఉన్న ఇదే రాజకీయ నాయకుడు(రఘురామను ఉద్దేశిస్తూ..).. 2021లో పార్లమెంటులో నాపై నిరాధార ఆరోపణలు చేశారు. పైగా పేదలకు విద్య అందించే విషయంలోనూ ఈ వ్యక్తి ఏనాడూ సానుకూలంగా లేడు. అలాంటిది ఆయన ఎలా మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారనేదీ ఆశ్చర్యంగా ఉంది అని ఆర్ఎస్పీ ట్వీట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర చోట్ల సీనియర్ పోలీస్ అధికారులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను సైతం ట్యాగ్ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.Shocked to hear the news of FIR on senior IPS officers(DGP rank) of AP Cadre Mr PV Sunil Kumar and Mr PSR Anjaneyulu along with former CM of AP, @ysjagan. This matter pertained to the alleged custodial torture of former MP of YSRCP, RaghuRamaKrishnam Raju @ RRR in in AP in 2021.…— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) July 13, 2024 -
కేసీఆర్‌ను ఢీకొట్టలేక కవితను జైలుకు పంపారు
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయంగా మాజీ సీఎం కేసీఆర్ ను ఢీకొట్టలేక ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవితను బీజేపీ జైలుకు పంపిందని బీఆర్ఎస్ నేతలు ఆర్. ఎస్.ప్రవీణ్‌కుమార్, బాల్క సుమన్ ఆరోపించారు. మాట వినని, అడ్డుగా ఉన్న ప్రతిపక్ష నేతలపై ఐటీ, సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తూ అక్రమ కేసు లను బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వా మ్యం ప్రమాదంలో ఉందని, దయచేసి బీజేపీకి ఎవరూ ఓటు వేయొద్దంటూ అభ్యర్థించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితతో తిహార్ జైల్లో ఆర్.ఎస్.ప్రవీణ్, బాల్క సుమన్ అరగంట పాటు ములాఖత్ అయ్యారు.అనంతరం తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. కవిత చాలా ధైర్యంగా ఉన్నారని, నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా అనే నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టి, ఆమె తరపు న్యాయవాదికి నోటీసులివ్వకుండా సీబీఐ అరెస్టు చేసిందంటేనే ఈ కేసు ఎవరి చెప్పుచేతల్లో నడస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆర్థిక నేరాలకు, ఇతర దేశాల నుంచి నగదు లావాదేవీలకు పీఎంఎల్ఏ కేసు నమోదు చేస్తారని, అసలు ఏ ఆధారా లున్నాయని పీఎంఎల్ఏ నమోదు చేశారో చెప్పా లని వారు డిమాండ్ చేశారు. ప్రముఖుల పేర్లు చెప్పాలంటూ కవితపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారనే విషయం కవిత చెప్పినట్లు తెలిపారు.తాము చెప్పినట్లు వింటే బయటకు పంపిస్తాం లేదంటే ఎన్ని రోజులైనా జైల్లోనే ఉంచుతామనే సంకేతాలను బీజేపీ ఇస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అంతా బీజేపీనే అని బాల్క సుమన్ ఆరోపించారు. లిక్కర్ స్కాంలో అరెస్టు అయ్యే వారి పేర్లను 2020లో బీజేపీ నేత మీడియా సమావేశం ద్వారా చెప్పడం.. ఆ తర్వాత నుంచి దేశవ్యాప్తంగా అరెస్టులు జరగడాన్ని మనమంతా చూస్తూనే ఉన్నామన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు, ఇంకా జరగాల్సిన ఎన్నికల్లో బీజేపీకి 220 ఎంపీ సీట్లు కూడా రావని సుమన్ జోస్యం చెప్పారు. -
చిల్లర పనులు మానండి
హుజూరాబాద్: అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించే వారిని అడ్డుకోలేరని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, మల్లన్నకు మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రశ్నించే గొంతును నొక్కివేయడం కేసీఆర్ ప్రభుత్వానికి అలవాటైందన్నారు. ఇలాంటి చిల్లర పనులు మానుకోవడం మంచిదని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. కాగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ లక్ష్యాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాల అమలు తీరుపై క్షేత్రస్థాయిలోని పరిస్థితులను అధ్యయనం చేయడమే లక్ష్యంగా సాగుతున్న బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ విజయవంతం కావాలని ఈటల ఆకాంక్షించారు. -
అన్యాయంగా కేసులు పెట్టారు
సాక్షి, మద్నూర్ (కామారెడ్డి): సోమూర్‌కు చెందిన పలువురిపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని ఆ గ్రామానికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం సోమూర్‌కు చెందిన 30 మంది మహిళలు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌కు వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు రోజుల క్రితం ట్రాన్స్‌కో సిబ్బంది గ్రామానికి వచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. విద్యుత్ మీటర్ల తనిఖీల పేరిట ఇళ్లలోకి విద్యుత్ అధికారులు చొరబడ్డారని ఆరోపించారు. రెండున్నర రోజుల పాటు గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారన్నారు. ట్రాన్స్‌కో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే గ్రామస్తులపైనే కేసులు పెట్టడం ఏమిటని వారు ప్రశ్నించారు. గ్రామానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినా, బుధవారం గ్రామానికి చెందిన పలువురి ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారన్నారు. దురుసుగా ప్రవర్తించారు బుధవారం 50 మంది ట్రాన్స్‌కో అధికారుల బృందం సోమూర్‌కు చేరుకొని ఇండ్లలో ఉన్న విద్యుత్ మీటర్లను ఇంటి బయట బిగిస్తామని దౌర్జన్యం చేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ క్రమంలో తోపులాట జరిగిందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఏఎస్సై వెంకట్రావ్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామాన్ని సందర్శించిన డీఎస్పీ బాన్సువాడ డీఎస్పీ యాదగిరి బుధవారం సోమూర్ గ్రామాన్ని సందర్శించారు. ఐదు రోజుల క్రితం గ్రామంలో ట్రాన్స్‌కో అధికారులపై జరిగిన దాడి ఘటనపై విచారణ జరిపారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
అక్రమ కేసు బనాయించారు... న్యాయం చేయండి
కర్నూలు: ‘చాగలమర్రి మండలం వెలుగు పథకంలో పనిచేస్తున్నాను. వికలాంగురాలిని. మఠం శంకరమ్మ నాపై అసత్యపు దొంగతనం కేసు నమోదు చేయించి నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేసి దుర్భాషలాడుతోంది’ అని చాగలమర్రికి చెందిన నాగమ్మ ఎస్పీ ఆకే రవికృష్ణకు ఫిర్యాదు చేశారు. సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎస్పీ పోలీస్ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 94407 95567కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను నోట్ చేసుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు నేరుగా వచ్చి కలసిన ప్రజల నుంచి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. డయల్ యువర్ ఎస్పీ, పోలీస్ ప్రజాదర్బార్‌కు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఇల్లు తాకట్టు పెట్టి తీసుకున్న డబ్బును చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఇల్లు స్వాధీనం చేయడం లేదని కోవెలకుంట్లకు చెందిన ఓ మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన భర్త ఆరోగ్య సమస్యల కారణంగా ఇంటిని రూ.70 వేలకు తాకట్టు పెట్టామని, ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఇంటిని స్వాధీనం చేసుకున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఇప్పించాలని రామళ్లకోట గ్రామానికి చెందిన రేణుక ఫిర్యాదు చేశారు. సంవత్సరం క్రితం తల్లి చనిపోయిందని, మూడు నెలల తర్వాత ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఇస్తామని ఇంతవరకు ఓర్వకల్లు పోలీసులు ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
మహిళల అక్రమ రవాణ కేసులో పురోగతి
నరసాపురం (పశ్చిమగోదావరి) : వ్యభిచారం చేయించేందుకు విజిట్ వీసాతో ఐదుగురు మహిళలను దుబాయి పంపిన ఏజెంట్లను నరసాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మహిళల అక్రమ రవాణా కేసులో నరసాపురం పోలీసులు శుక్రవారం రాత్రి త్రిమూర్తులు, తిమూతి అనే ఇద్దర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గల్ఫ్ ఏజెంట్లు ఐదుగురు మహిళలను విజిట్ వీసాపై దుబాయి పంపి, వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్న విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ హోం మంత్రి చినరాజప్ప దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేయాలని ఎస్పీకి హో మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బాధిత మహిళలు అమలాపురం,నరసాపురానికి చెందినవారిగా భావిస్తున్నారు. వారిని దుబాయ్ నుంచి ఇక్కడికి రప్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. -
పీఆర్కే రాకతో వెల్లువెత్తిన అభిమానం
మాచర్ల టౌన్ : టీడీపీ నాయకుల ప్రోద్బలంతో నమోదైన అక్రమ కేసుపై హైకోర్టు నుంచి స్టే పొంది నెలరోజుల తరువాత శుక్రవారం రాత్రి మాచర్లలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అడుగడుగునా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలవర్షం కురిపించారు. ఎమ్మెల్యే పీఆర్కే హైదరాబాద్ నుంచి మాచర్లకు వస్తున్నారని తెలుసుకున్న మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, రెంటచింతల మండలాలకు చెందిన వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు సాయంత్రం 4 గంటలకే సాగర్ కొత్త బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. ఆరు గంటలకు విజయపురిసౌత్‌కు చేరుకున్న ఎమ్మెల్యే పీఆర్కే, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు ఘనస్వాగతం పలికారు. సాగర్ నుంచి మాచర్లకు వచ్చేంతవరకు రోడ్డుకిరువైపుల ప్రతి గ్రామంలో అభిమానులు, ప్రజలు వందలాది మంది వేచి వుండి వైఎస్సార్ సీపీ జెండాలను రెపరెపలాడిస్తూ పూలుజల్లుతూ అన్నా.. రామకృష్ణ అన్నా ఎప్పుడూ విజయం మీదేనంటూ అపూర్వస్వాగతం పలికారు. ఏకోనాంపేట, భైరవునిపాడు, తాళ్లపల్లి, కొత్తూరు, పశువేముల గ్రామాలకు చెందిన ప్రధాన రహదారి పైకి చేరుకొన్న ఎమ్మెల్యే పీఆర్కే కాన్వాయ్ పై పూలుజల్లుతూ జై పీఆర్కే అంటూ నినాదాలు చేశారు. ఆయా గ్రామాల్లో ఘనస్వాగతం పలకడంతో 15 కిలోమీటర్ల దూరం రావడానికి రెండు గంటల సమయం పట్టింది. కొత్తపల్లి జంక్షన్ వద్దకు రాగానే పట్టణంలోని నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ పూలజల్లు కురిపించారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి పీఆర్కే, వెంకట్రామిరెడ్డిలకు అభినందనలు తెలిపారు. కొత్తపల్లి జంక్షన్ నుంచి 500 ద్విచక్ర వాహనాలతో వేలాది మంది కార్యకర్తలు అనుసరిస్తూ బస్టాండ్ వరకు భారీ ఊరేగింపు జరిపారు. అక్రమ కేసులు పెట్టి వైఎస్సార్ సీపీని అడ్డుకోలేరని ఎమ్మెల్యే పీఆర్కే పట్ల అభిమానాన్ని ఆపలేరంటూ కేరింతలు కొడుతూ కార్యకర్తలు పీఆర్కేను భుజాలపై ఎక్కించుకొని ప్రదర్శన నిర్వహించారు. తరువాత తన వాహనంపై కూర్చొ ని ప్రజలకు అభివాదంచేస్తూ పీఆర్కే ప్రదర్శనలో పాల్గొన్నా రు. పట్టణంలో బాణసంచా కాలుస్తూ కార్యకర్తలు, పీఆర్కే యూత్ సందడిచేశారు. భారీ ఊరేగింపుతో పట్టణంలో ఎటుచూసినా వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తల నినాదాల తో దద్దరిల్లింది. కార్యక్రమంలో జెడ్పీటీసీ శేరెడ్డి గోపిరెడ్డి, ఎంపీపీ ఓరుగంటి పార్వతమ్మజయపాల్రెడ్డి, వైఎస్సార్ సీపీ పురపాలకసంఘ ఫ్లోర్, డిప్యూటీలీడర్లు బోయ రఘురామిరెడ్డి, షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్లు బత్తుల ఏడుకొండలు, కామనబోయిన కోటయ్యయాదవ్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్లు యరబోతుల శ్రీనివాసరావు, తాడి వెంకటేశ్వరరెడ్డి, పట్టణ, మండల, రెంటచింతల, దుర్గి మండలాల కన్వీనర్లు పోలూరి నరసింహారావు, నోముల కృష్ణ, శొంఠిరెడ్డి నర్శిరెడ్డి, వెలిదండి గోపాల్, నాయకులు ఎం.శ్రీనివాసశర్మ, జూల కంటి వీరారెడ్డి, మేకల కోటిరెడ్డి, నర్రా గురవారెడ్డి, గుత్తికొండ సత్యనారాయణరెడ్డి, చుండూరి రోశయ్య, మాజీ కౌన్సిలర్లు షేక్ కరిముల్లా, మాచర్ల సుందరరావు, షేక్ రషీద్, కౌన్సిలర్లు అనంతరావమ్మ, వింజమూరి రాణిమోషె, బి.నాగలక్ష్మీసుధాకర్రెడ్డి, పోలా భారతిశ్రీను,పోతిరెడ్డి కోటిరెడ్డి, ఓరుగంటి చిన్న, ధర్మవరం శ్రీను, ట్రాక్టరు వెంకటేశ్వర్లు, మెట్టువీరారెడ్డి, ట్రాక్టరు కరిముల్లా, కణితి మస్తాన్‌వలి, రమావత్ నర్శింగ్నాయక్, రవినాయక్, మాజీ సర్పంచ్ కరంటోతు పాండునాయక్, తురకా కిషోర్, బత్తుల రాజా తదితరులు పాల్గొన్నారు. విజయం న్యాయం వైపే.. : పీఆర్కే అధికార టీడీపీ నాయకులు అధికారం శాశ్వతం అనే విధంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు, ఎమ్మెల్యేలను అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని, అక్రమ కేసులకు భయపడేది లేదని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మాచర్లకు వచ్చిన ఆయన ర్యాలీ అనంతరం అంబేద్కర్ సెంటర్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనపై అక్రమకేసులు పెట్టారన్నారు. అక్రమ కేసు బనాయించడానికి కారకులైన టీడీపీ నాయకులందరూ తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎప్పుడూ అధికారం ఒకరివైపే ఉండదనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. కార్యకర్తలు, అభిమానులను తాత్కాలికంగా ఇబ్బందిపెట్టినా విజయం న్యాయం వైపే ఉంటుందన్నారు. కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు ఎప్పుడూ అండదండలు అందిస్తానన్నారు. కార్యకర్తల జోలికివస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేయాలన్నారు. తనపై అభిమానం చూపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, వెల్దుర్తి జెడ్పీటీసీ కళ్లం కృష్ణవేణిరామాంజనేయరెడ్డి, ఎంపీపీ ఓరుగంటి పార్వతమ్మ, జెడ్పీటీసీలు శౌరెడ్డిగోపిరెడ్డి, నవులూరి భాస్కరరెడ్డి, నాయకులు మెట్టు రామ కృష్ణారెడ్డి, మందా శ్యామ్యేలు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులు ఎత్తివేయాలి: రోజా
చిత్తూరు: నాయకులపై కేసులు పెడితే కార్యకర్తలు పారిపోతారని అధికార టీడీపీ నాయకులు భావిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. తమ నేతలపై అక్రమంగా బనాయించిన కేసులు ఎత్తివేయాలని గురువారం ఆమె డిమాండ్ చేశారు. కేసులు ఎత్తివేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు పెడితే సహించేది లేదని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఆయన తెలిపారు. -
నేడు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ధర్నా
యాదమరి : అక్రమ కేసు నమోదును నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం 10 గంట లకు ధర్నా చేయనున్నట్లు పూతలపట్టు శాసనసభ్యుడు డాక్టర్ సునీల్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాదమరి మండలం మోర్థనపల్లె సబ్‌స్టేషన్‌లో కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ అకారణంగా తమను తొలగించారని అక్కడ విధులు నిర్వహిస్తున్న మొగలీష్, సతీష్, భాగ్యరాజ్ తెలియజేశారని తెలిపారు. వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో సోమవారం సబ్‌స్టేషన్ వద్దకు వెళ్లాలని, ఆ సమయంలో అక్కడ షిఫ్ట్ ఆపరేటర్ తప్ప అధికారులెవ్వరూ లేరని తెలి పారు. రికార్డులను పరిశీలిం చి ఎప్పటి నుంచి విధులు నిర్వహిస్తున్నారని అడిగానే తప్ప మరేమీ మాట్లాడలేదన్నారు. దీనిపై అదేరోజు ఆ గ్రామంలో జన్మభూమి కార్యక్రమానికి హాజరైన టీడీపీ నాయకులు రాద్ధాం తం చేశారని, అధికారులపై ఒత్తిడి తెచ్చి అవాస్తవ ఆరోపణలు చేసి కేసు నమోదు చేరుుంచారని ఆరోపించా రు. మాజీ ఎంపీపీ ధనంజయులురెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మనోహరన్ మాట్లాడుతూ ధర్నా కార్య క్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. -
‘సాక్షి’ మీడియా విలేకరిపై అక్రమ కేసు
తుని : రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు చేసే ప్రయత్నానికి రాజకీయ రంగు పులిమారు. నిజాలను నిష్పక్షపాతంగా ప్రజలకు వివరించిన ‘సాక్షి’ మీడియాపై కక్ష సాధింపులు మొదలెట్టారు. రైతుబజార్లో టీడీపీ నాయకుడి దందాపై ‘సాక్షి’ మీడియా విలేకరి చిత్రీకరించిన సంఘటనే ఈ కేసుకు కారణమని, చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు అక్రమ కేసు బనాయించారని పలువురు విమర్శిం చారు. కేసు బనాయింపును ప్రజాసంఘాలు, జర్నలిస్టు సం ఘాలు తీవ్రంగా ఖండించాయి. ‘సాక్షి’ మీడియా విలేకరి కంఠం అప్పారావుపై అక్రమంగా నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసిన విషయాన్ని కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి జిల్లా జర్నలిస్టు సంఘాల నాయకులు తీసుకువెళ్లారు. మీడియా స్వేచ్ఛను హరించేలా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు వ్యహరించడంపై వైఎస్సార్ సీపీ నాయకులు ఖండించారు. ఎస్పీని కలిసిన జర్నలిస్టు నేతలు కాకినాడ క్రైం : తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలు మానుకోవాలని జర్నలిస్టు సంఘ నేతలు పేర్కొన్నారు. తుని సాక్షి టీవీ రిపోర్టర్ అప్పారావుపై మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు, టీడీపీ నేత ఆర్.సూరిబాబు తప్పుడు కేసు బనాయించడాన్ని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం ఏపీడబ్ల్యూజేఎఫ్ నేతలు ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు వినతిపత్రం సమర్పించారు. తుని మార్కెట్ యార్డులోని రైతు బజారులో టీడీపీ నేత సూరిబాబు బాగోతాన్ని చిత్రీకరించేందుకు అక్కడకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత సూరిబాబు అక్కడకు చేరుకుని అప్పారావును బెదిరించాడు. దీంతో అప్పారావు పోలీసులను ఆశ్రయించాడు. కాగా అప్పారావు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని సూరిబాబు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు. పాత్రికేయుడు అప్పారావుపై టీడీపీ నేత సూరిబాబు చేసిన ఫిర్యాదుపై విచారణ జరపాలని జర్నలిస్టు నేతలు ఎస్పీని కోరారు. స్పందించిన ఎస్పీ రవిప్రకాష్ దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా పెద్దాపురం డీఎస్పీ ఓలేటి అరవింద్ బాబును విచారణకు ఆదేశించారు.