పీఆర్కే రాకతో వెల్లువెత్తిన అభిమానం
మాచర్ల టౌన్ : టీడీపీ నాయకుల ప్రోద్బలంతో నమోదైన అక్రమ కేసుపై హైకోర్టు నుంచి స్టే పొంది నెలరోజుల తరువాత శుక్రవారం రాత్రి మాచర్లలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అడుగడుగునా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలవర్షం కురిపించారు. ఎమ్మెల్యే పీఆర్కే హైదరాబాద్ నుంచి మాచర్లకు వస్తున్నారని తెలుసుకున్న మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, రెంటచింతల మండలాలకు చెందిన వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు సాయంత్రం 4 గంటలకే సాగర్ కొత్త బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు.
ఆరు గంటలకు విజయపురిసౌత్‌కు చేరుకున్న ఎమ్మెల్యే పీఆర్కే, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు ఘనస్వాగతం పలికారు. సాగర్ నుంచి మాచర్లకు వచ్చేంతవరకు రోడ్డుకిరువైపుల ప్రతి గ్రామంలో అభిమానులు, ప్రజలు వందలాది మంది వేచి వుండి వైఎస్సార్ సీపీ జెండాలను రెపరెపలాడిస్తూ పూలుజల్లుతూ అన్నా.. రామకృష్ణ అన్నా ఎప్పుడూ విజయం మీదేనంటూ అపూర్వస్వాగతం పలికారు.
ఏకోనాంపేట, భైరవునిపాడు, తాళ్లపల్లి, కొత్తూరు, పశువేముల గ్రామాలకు చెందిన ప్రధాన రహదారి పైకి చేరుకొన్న ఎమ్మెల్యే పీఆర్కే కాన్వాయ్ పై పూలుజల్లుతూ జై పీఆర్కే అంటూ నినాదాలు చేశారు. ఆయా గ్రామాల్లో ఘనస్వాగతం పలకడంతో 15 కిలోమీటర్ల దూరం రావడానికి రెండు గంటల సమయం పట్టింది. కొత్తపల్లి జంక్షన్ వద్దకు రాగానే పట్టణంలోని నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ పూలజల్లు కురిపించారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి పీఆర్కే, వెంకట్రామిరెడ్డిలకు అభినందనలు తెలిపారు.
కొత్తపల్లి జంక్షన్ నుంచి 500 ద్విచక్ర వాహనాలతో వేలాది మంది కార్యకర్తలు అనుసరిస్తూ బస్టాండ్ వరకు భారీ ఊరేగింపు జరిపారు. అక్రమ కేసులు పెట్టి వైఎస్సార్ సీపీని అడ్డుకోలేరని ఎమ్మెల్యే పీఆర్కే పట్ల అభిమానాన్ని ఆపలేరంటూ కేరింతలు కొడుతూ కార్యకర్తలు పీఆర్కేను భుజాలపై ఎక్కించుకొని ప్రదర్శన నిర్వహించారు. తరువాత తన వాహనంపై కూర్చొ ని ప్రజలకు అభివాదంచేస్తూ పీఆర్కే ప్రదర్శనలో పాల్గొన్నా రు. పట్టణంలో బాణసంచా కాలుస్తూ కార్యకర్తలు, పీఆర్కే యూత్ సందడిచేశారు.
భారీ ఊరేగింపుతో పట్టణంలో ఎటుచూసినా వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తల నినాదాల తో దద్దరిల్లింది. కార్యక్రమంలో జెడ్పీటీసీ శేరెడ్డి గోపిరెడ్డి, ఎంపీపీ ఓరుగంటి పార్వతమ్మజయపాల్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ పురపాలకసంఘ ఫ్లోర్, డిప్యూటీలీడర్లు బోయ రఘురామిరెడ్డి, షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్లు బత్తుల ఏడుకొండలు, కామనబోయిన కోటయ్యయాదవ్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్లు యరబోతుల శ్రీనివాసరావు, తాడి వెంకటేశ్వరరెడ్డి, పట్టణ, మండల, రెంటచింతల, దుర్గి మండలాల కన్వీనర్లు పోలూరి నరసింహారావు, నోముల కృష్ణ, శొంఠిరెడ్డి నర్శిరెడ్డి, వెలిదండి గోపాల్, నాయకులు ఎం.శ్రీనివాసశర్మ, జూల కంటి వీరారెడ్డి, మేకల కోటిరెడ్డి, నర్రా గురవారెడ్డి, గుత్తికొండ సత్యనారాయణరెడ్డి, చుండూరి రోశయ్య, మాజీ కౌన్సిలర్లు షేక్ కరిముల్లా, మాచర్ల సుందరరావు, షేక్ రషీద్, కౌన్సిలర్లు అనంతరావమ్మ, వింజమూరి రాణిమోషె, బి.నాగలక్ష్మీసుధాకర్‌రెడ్డి, పోలా భారతిశ్రీను,పోతిరెడ్డి కోటిరెడ్డి, ఓరుగంటి చిన్న, ధర్మవరం శ్రీను, ట్రాక్టరు వెంకటేశ్వర్లు, మెట్టువీరారెడ్డి, ట్రాక్టరు కరిముల్లా, కణితి మస్తాన్‌వలి, రమావత్ నర్శింగ్‌నాయక్, రవినాయక్, మాజీ సర్పంచ్ కరంటోతు పాండునాయక్, తురకా కిషోర్, బత్తుల రాజా తదితరులు పాల్గొన్నారు.
విజయం న్యాయం వైపే.. : పీఆర్కే
అధికార టీడీపీ నాయకులు అధికారం శాశ్వతం అనే విధంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు, ఎమ్మెల్యేలను అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని, అక్రమ కేసులకు భయపడేది లేదని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మాచర్లకు వచ్చిన ఆయన ర్యాలీ అనంతరం అంబేద్కర్ సెంటర్‌లో నాయకులు, కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనపై అక్రమకేసులు పెట్టారన్నారు. అక్రమ కేసు బనాయించడానికి కారకులైన టీడీపీ నాయకులందరూ తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎప్పుడూ అధికారం ఒకరివైపే ఉండదనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. కార్యకర్తలు, అభిమానులను తాత్కాలికంగా ఇబ్బందిపెట్టినా విజయం న్యాయం వైపే ఉంటుందన్నారు.
కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు ఎప్పుడూ అండదండలు అందిస్తానన్నారు. కార్యకర్తల జోలికివస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేయాలన్నారు. తనపై అభిమానం చూపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, వెల్దుర్తి జెడ్పీటీసీ కళ్లం కృష్ణవేణిరామాంజనేయరెడ్డి, ఎంపీపీ ఓరుగంటి పార్వతమ్మ, జెడ్పీటీసీలు శౌరెడ్డిగోపిరెడ్డి, నవులూరి భాస్కరరెడ్డి, నాయకులు మెట్టు రామ కృష్ణారెడ్డి, మందా శ్యామ్యేలు తదితరులు పాల్గొన్నారు.