శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న ప్రవీణ్ కుమార్. చిత్రంలో బాల్క సుమన్
తిహార్ జైల్లో కవితను కలిసిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, బాల్క సుమన్
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయంగా మాజీ సీఎం కేసీఆర్ ను ఢీకొట్టలేక ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవితను బీజేపీ జైలుకు పంపిందని బీఆర్‌ఎస్ నేతలు ఆర్. ఎస్.ప్రవీణ్‌కుమార్, బాల్క సుమన్ ఆరోపించారు. మాట వినని, అడ్డుగా ఉన్న ప్రతిపక్ష నేతలపై ఐటీ, సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తూ అక్రమ కేసు లను బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వా మ్యం ప్రమాదంలో ఉందని, దయచేసి బీజేపీకి ఎవరూ ఓటు వేయొద్దంటూ అభ్యర్థించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితతో తిహార్ జైల్లో ఆర్.ఎస్.ప్రవీణ్, బాల్క సుమన్ అరగంట పాటు ములాఖత్ అయ్యారు.
అనంతరం తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. కవిత చాలా ధైర్యంగా ఉన్నారని, నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా అనే నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టి, ఆమె తరపు న్యాయవాదికి నోటీసులివ్వకుండా సీబీఐ అరెస్టు చేసిందంటేనే ఈ కేసు ఎవరి చెప్పుచేతల్లో నడస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆర్థిక నేరాలకు, ఇతర దేశాల నుంచి నగదు లావాదేవీలకు పీఎంఎల్‌ఏ కేసు నమోదు చేస్తారని, అసలు ఏ ఆధారా లున్నాయని పీఎంఎల్‌ఏ నమోదు చేశారో చెప్పా లని వారు డిమాండ్ చేశారు. ప్రముఖుల పేర్లు చెప్పాలంటూ కవితపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారనే విషయం కవిత చెప్పినట్లు తెలిపారు.
తాము చెప్పినట్లు వింటే బయటకు పంపిస్తాం లేదంటే ఎన్ని రోజులైనా జైల్లోనే ఉంచుతామనే సంకేతాలను బీజేపీ ఇస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అంతా బీజేపీనే అని బాల్క సుమన్ ఆరోపించారు. లిక్కర్ స్కాంలో అరెస్టు అయ్యే వారి పేర్లను 2020లో బీజేపీ నేత మీడియా సమావేశం ద్వారా చెప్పడం.. ఆ తర్వాత నుంచి దేశవ్యాప్తంగా అరెస్టులు జరగడాన్ని మనమంతా చూస్తూనే ఉన్నామన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు, ఇంకా జరగాల్సిన ఎన్నికల్లో బీజేపీకి 220 ఎంపీ సీట్లు కూడా రావని సుమన్ జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment