rs praveen kumar
-
దళిత పోలీసు అధికారులను వేధిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, అమరావతి: దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని నాడు చంద్రబాబు కులదురహంకారంతో మాట్లాడారని, ప్రస్తుతం ఆయన ప్రభుత్వం దళిత పోలీస్ అధికారులను వేధిస్తోందని, దళితులు ఆత్మన్యూనతకు గురి చేయాలనే కుట్రతో వ్యవహరిస్తోందని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఏపీలో దళిత పోలీస్ అధికారులను టీడీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తూ మనోవేదనకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్, మరో రిటైర్డ్ నాన్ క్యాడర్ ఎస్పీ విజయ్ పాల్ పట్ల చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన మంగళవారం విడుదల చేసిన వీడియో సందేశంలో విమర్శించారు. ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు తనను కస్టోడియల్ టార్చర్ చేశారనే అభియోగాలను గతంలో సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని అయినా సరే మూడున్నరేళ్ల తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రఘురామ పాత ఆరోపణలనే చేయడం..టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటనే దళితుల్లో మాల సామాజికవర్గానికి చెందిన పీవీ సునీల్ కుమార్, మాదిగ సామాజికవర్గానికిచెందిన విజయ్‌పాల్‌లపై కేసు నమోదు చేయడం దుర్మార్గమని విమర్శించారు. గుంటూరు జిల్లాలో నమోదు చేసిన ఆ కేసు దర్యాప్తు బాధ్యతను ప్రకాశం జిల్లా ఎస్పీకి అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. పీవీ సునీల్ కుమార్‌కు 9 నెలలుగా పోస్టింగు ఇవ్వకుండా వేధిస్తుండటం..విజయ్‌పాల్‌ను అక్రమంగా అరెస్ట్ చేసి 2 నెలలపాటు జైల్లో ఉంచడం దళిత అధికారుల పట్ల చంద్రబాబు ప్రభుత్వ అమానవీయ వైఖరికి నిదర్శనమన్నారు. -
నా గురించి మాట్లాడే అర్హత మంత్రికి లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొండా సురేఖ వ్యాఖ్యలపై తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు.సభ్యత, సంస్కారం, మానవత్వం అంటే ఎంటో కాంగ్రెస్‌కు తెలియదని ధ్వజమెత్తారు. బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే వారికి తెలుసని మండిపడ్డారు. ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని సురేఖపై విమర్శలు గుప్పించారు. తన గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత మంత్రికి ఏ మాత్రం లేదని హెచ్చరించారు. కేటీఆర్ గురుకుల బాట అనగానే వెన్నులో చలి పుడుతోందా..? రేవంత్ రెడ్డి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. దమ్ముంటే మీరు గురుకులాల మీద బహిరంగ చర్చకు రండి. అంతే కానీ మత్తులో ఉన్న ఈ మతి స్థిమితం లేని మంత్రులను, భజంత్రీలను పంపించి నవ్వులపాలు కాకండి అని సీఎం రేవంత్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ సూచించారు.సభ్యత-సంస్కారం- మానవత్వం అంటే ఎంటో తెలియని మీకు, బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే తెలిసిన మీకు,ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన మీకు,నా గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదు, మంత్రి గారు. రేవంత్… pic.twitter.com/fZd4wh9G5s— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) November 29, 2024 -
‘ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం’
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాల్లో కుట్రల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని ఆరోపించారు మంత్రి కొండా సురేఖ. ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని అన్నారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని, తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని ఆరోపించారు. అన్ని హాస్టల్స్‌లో ప్రవీణ్ కుమార్ అనుచరులు ఉన్నారని, త్వరలోనే అన్ని విషషయాలు బయటకు వస్తాయని చెప్పారు.బాలిక మృతి బాధాకరం..ఈ మేరకు సచివాలయం మీడియా పాయింట్ వద్ద మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. హాస్టళ్లలోని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఒక విద్యార్థిని చనిపోయిందని, అది కూడా బాధకరమని అన్నారు. బాధిత విద్యార్థినికి ప్రత్యేక వైద్య సదుపాయం కల్పించినప్పటికీ దురదృష్టవశాత్తు చనిపోయిందని తెలిపారు. బాలిక మృతి విషయాన్ని బీఆర్ఎస్ తమ రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తోందని.. ఆమె మృతిపై రాజకీయాలు చేయడం తగదని సూచించారు.‘ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని ఒకప్పుడు మాఫియా నడిపారు. సైకో రావు అండ్ బీఆర్ఎస్ గ్రూప్ ప్రభుత్వంపై బట్టకాల్చి వేయాలని చూస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులను సొంత పిల్లల లెక్క ప్రభుత్వం చూడాలి. కానీ గత పదేళ్ళలో ఏనాడు అలా జరగలేదు.అమ్మాయి చనిపోతే బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఆదుకున్నారా? గత ప్రభుత్వం హయంలో కస్తూర్బా ఘటన, గురుకులల్లో ఘటనలు, రెండెకెల సంఖ్యలో ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగితే ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫుడ్ పాయిజన్, మూసీ, లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ ప్రమేయం ఉన్నట్లు అనుమానంగా ఉంది. మల్లన్న సాగర్ ముంపు ప్రజలకు గత ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. బాధితులు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు.అందుకే కేటీఆర్ జైలుకు వెళ్తా అంటున్నారుమహబూబాబాద్లో పసిపిల్లలు ఉన్న వాళ్లను సైతం గత ప్రభుత్వంలో జైల్లో పెట్టారు. పక్కా ప్రణాళికతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలాగ చేస్తున్నారు. ప్రభుత్వం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా నిఘా పెడుతుంది. అన్ని బయటకు వస్తాయి. కేటీఆర్ తప్పులు చేశారు అని ఆయనకు తెలుసు అందుకే జైలుకు వెళ్తా అని ముందే చెప్తున్నారు. కేటీఆర్ ఏనాడు ప్రజలను కలువలేదు..ఇప్పుడేమో స్వాతంత్ర సమర యోధుడు లెక్క మాట్లాడుతున్నారు.’ అని కొండా సురేఖ మండిపడ్డారు.కవితకు ప్రాధాన్యత ఇస్తున్న కేసీఆర్..కవిత జైల్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. ఆమె బయటకు రాగానే మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. కేసీఆర్ కవితకు ప్రాధాన్యత ఇస్తున్నారట. కేటీఆర్‌ను పట్టించుకోవడం లేదట. కేసీఆర్ కుటుంబంలో కవిత - హరీష్ రావు ఒక్కటి అయ్యారని చర్చ జరుగుతుంది. బాల్క సుమన్, గాధరి కిషర్ అప్పట్లో ఆర్ ప్రవీణ్ కుమార్‌పై ఆరోపణలు చేశారు. ఆయన అవినీతి పాల్పడినట్లు అప్పటి బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.కేటీఆరే కాదు కేసీఆర్ కూడా జైలుకే..జైలుకు పోవాలని కేటీఆర్‌కు ఉబలాటంగా ఉన్నట్లు ఉంది. సరైన ఆధారాలు దొరికినప్పుడు జైలుకు పంపుతాం. సమయం వచ్చినప్పుడు జైలుకు కచ్చితంగా పోతావు కేటీఆర్. ఆధారాలు రాగానే కవిత జైలుకు వెళ్ళింది. కేటీఆర్ కూడా వెళ్తాడు. కేటీఆర్ మాత్రమే కాదు కవిత - కేసీఆర్ కూడా జైలుకు వెళ్తారు. -
బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
-
భార్యలు ధర్నా చేస్తే భర్తల్ని సస్పెండ్ చేస్తారా?
సాక్షి,హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ పోలిసుల్ని మనుషులుగా చూస్తే.. సీఎం రేవంత్ రెడ్డి మర మనుషులుగా భావిస్తున్నారని మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణలో స్పెషల్ పోలీసులు నెలలో 26 రోజులు వరుసగా విధులు నిర్వహించాలి. అనంతరం, నాలుగు రోజులు మాత్రమే సెలవు తీసుకుని వెసులు బాటు ఉంది. దీంతో తమ భర్తలు కుటుంబానికి, పిల్లలికి దూరంగా ఉండాల్సి వస్తుందంటూ నల్గొండలో పోలీస్ కుటుంబాలు ఆందోళన బాటపట్టాయి. వారి ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం విధులు నిర్వహిస్తున్న పోలీసుల్ని సస్పెండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. నల్లగొండలో భార్యలు రోడ్డెక్కితే భర్తలను సస్పెండ్ చేయడం దారుణం. సస్పెండ్ చేసిన కానిస్టేబుల్స్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. పోలీసులే నిరసన చేయటమంటే దేశ భద్రతకు సంబంధించిన అంశంగా చూడాలి. భర్తలు ఇబ్బందులు పడ్తుంటే భార్యలు సమ్మె చేస్తే తప్పేంటి. పోలీసులే సమ్మె చేయటం దేశంలోనే తొలిసారి. 26రోజులు పొడవునా డ్యూటీ చేస్తే 4రోజులు సెలవు ఇస్తామనడం దారుణం. పాత పద్దతిలో 15రోజులు డ్యూటీ చేస్తే..4రోజులు సెలవులు ఇవ్వాలి. తెలంగాణ పోలీసుల్లో అశాంతి ఉంది. ఇది ప్రమాదకరం. తెలంగాణలో శాంతిభద్రతలు దారుణంగా పడిపోయాయి. హైదరాబాద్‌లో వృద్ద దంపతులను హత్య చేస్తే కనీసం సీసీ టీవీలు పనిచేయటం లేదు. హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా సమీక్ష చేశారా?.కేటీఆర్, హరీష్ రావు మీద ఎన్ని కేసులు పెట్టారనే దానిపై మాత్రమే రేవంత్ సమీక్ష చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలపై పెట్రోల్ పోయాలన్న మైనంపల్లిపై సుమోటోగా కేసు నమోదు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన మీద కాకుండా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులకే రేవంత్ సమయం కేటాయిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. -
సునీల్ పోస్టులో తప్పేముంది?.. ఏపీ సర్కార్‌పై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ పీవీ సునీల్‌కుమార్‌పై ఏపీ ప్రభుత్వ దాడిని ఖండిస్తున్నానని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్ చేశారు. ఆయన ట్విట్టర్లో పెట్టిన పోస్టులో తప్పేముందంటూ ప్రశ్నించారు. సునీల్‌పై చంద్రబాబు ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని అనడం సర్వీసు రూల్ ఉల్లంఘన ఎట్లయితది? రాజ్యాంగం ఆర్టికల్ 19 మళ్లీ మళ్లీ చదవండి. అప్పుడయినా విషయం అర్థం అయితదేమో!’’ అంటూ ట్వీట్ చేశారు.సోదరులు, సాటి అధికారి పీవీ సునీల్ కుమార్ గారిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దాడిని పూర్తిగా ఖండిస్తున్న. ఆయన ట్విట్టర్లో పెట్టిన పోస్టులో తప్పేముంది? ‘మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని అనడం సర్వీసు రూలు ఉల్లంఘన ఎట్లయితది? రాజ్యాంగం ఆర్టికల్ 19 మళ్లీ మళ్లీ చదవండి. అప్పుడయినా విషయం అర్థం… pic.twitter.com/H8axZ8A8CX— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 13, 2024 కాగా, రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా హైకోర్టు, సుప్రీం కోర్టు మూడేళ్ల క్రితం తోసిపుచ్చిన ఆరోపణల ఆధారంగా కూటమి సర్కార్ తప్పుడు కేసు నమోదు చేసింది. 2021లో తనను సీఐడీ అధికారుల కస్టడీలో గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టారని.. హింసించారని నాటి ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వైద్య పరీక్షలు గతంలోనే నిర్ధారించాయి. ఆ ఆరోపణల ఆధారంగా రఘురామకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించగా, అదే ఆరోపణల ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశించేందుకు సుప్రీం కోర్టు సైతం తిరస్కరించింది. అయితే, చంద్రబాబు ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించేందుకు బరి తెగించింది.నాడు న్యాయస్థానాలు తోసిపుచ్చిన ఆరోపణలతోనే రఘురామరాజు మూడేళ్ల తరువాత మెయిల్లో ఫిర్యాదు చేయడం.. ఆ వెను వెంటనే ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు, నాటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిలతోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసులు నమోదు చేయడం విస్మయపరుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ చర్య కక్ష సాధింపే కాదు.. కోర్టు ధిక్కారమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అరాచకానికి ఈ పరిణామాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఇదీ చదవండి: సుప్రీంకోర్టు వారించినా వినరా? -
PV సునీల్ కుమార్ పై ఏపీ ప్రభుత్వ చర్యలను తప్పు బట్టిన RS ప్రవీణ్ కుమార్
-
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం
-
రఘురామపై మాజీ ఐపీఎస్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన అక్రమ కేసుల వ్యవహారంపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు. డీజీపీ ర్యాంకులో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులపై, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదైందన్న వార్త తనను షాక్‌కు గురిచేసిందని అన్నారాయన. ఈ క్రమంలో రఘురామ వ్యవహారశైలిపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎంపీ, ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజును వేధించారనే ఆరోపణలపై మాజీ సీఎం వైఎస్ జగన్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్నిఆర్ఎస్సీ తన ట్వీట్లో తప్పుబట్టారు. ఈ అంశాన్ని అప్పట్లోనే కోర్టులు విచారించాయని.. అయితే అందులో ఏమీ బయటకు రాలేదని అభిప్రాయపడ్డారు. అధికారం మారడం తప్ప మూడేళ్లలో ఏం మారిందని.. మూడేళ్ల తర్వాత అకస్మాత్తుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. .. దురదృష్టవశాత్తూ నిజాయితీగల పోలీసులు ఈ దేశంలో ప్రతీకార రాజకీయాల్లో బాధితులుగా మారుతున్నారన్న ఆర్ఎస్పీ.. గోద్రా మారణహోమంలో సత్యం, న్యాయానికి అండగా నిలిచినందుకు గుజరాత్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ సంజీవ్ భట్ ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు రఘురామకృష్ణరాజుపైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. అబద్ధాలడడం అలవాటుగా ఉన్న ఇదే రాజకీయ నాయకుడు(రఘురామను ఉద్దేశిస్తూ..).. 2021లో పార్లమెంటులో నాపై నిరాధార ఆరోపణలు చేశారు. పైగా పేదలకు విద్య అందించే విషయంలోనూ ఈ వ్యక్తి ఏనాడూ సానుకూలంగా లేడు. అలాంటిది ఆయన ఎలా మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారనేదీ ఆశ్చర్యంగా ఉంది అని ఆర్ఎస్పీ ట్వీట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర చోట్ల సీనియర్ పోలీస్ అధికారులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను సైతం ట్యాగ్ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.Shocked to hear the news of FIR on senior IPS officers(DGP rank) of AP Cadre Mr PV Sunil Kumar and Mr PSR Anjaneyulu along with former CM of AP, @ysjagan. This matter pertained to the alleged custodial torture of former MP of YSRCP, RaghuRamaKrishnam Raju @ RRR in in AP in 2021.…— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) July 13, 2024 -
కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్‌లపై పరువు నష్టం దావా: మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ క్షమాపణ చెప్పాలని మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. వీరిద్దరిపై పరువు నష్టం దావా వేస్తాను. భూ తగదాల కారణంగా కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు గురయ్యాడని జూపల్లి చెప్పుకొచ్చారు. కాగా, మంత్రి జూపల్లి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ నాకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పరువు నష్టం దావా వేస్తాను. వీరిద్దరూ నన్ను ఏ చౌరస్తాను రమన్నా వస్తాను. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. శ్రీధర్ రెడ్డి హత్యను ఖండిస్తున్నాను. శ్రీధర్ రెడ్డి హత్య కేసులో పూర్తి వివరాలు తెలియాలి అంటూనే కేటీఆర్‌ను నాపై ఆరోపణలు చేస్తున్నాడు. శ్రీధర్ రెడ్డికి తన కుటుంబ సభ్యులు, పలువురితో భూ తగాదాలు ఉన్నాయి. శ్రీధర్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి. నేను, పొంగులేటి.. కేసీఆర్‌తో విభేదించి బయటకి వచ్చాక ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కేసీఆర్‌ను నియంత అన్న ఆర్ఎస్ ప్రవీణ్ ఇప్పుడు కేసీఆర్ పంచన చేరారు. ప్రవీణ్ కుమార్ ఆత్మగౌరవం అమ్ముకున్నారు. ఒకాయన ఐపీఎస్ ఆఫీసర్, ఒకాయన ఎన్ఆర్ఐ ఇద్దరూ కలిసి బట్టకాల్చి మీద వేస్తున్నారు. నన్ను, పొంగులేటిని కేసీఆర్ బర్తరఫ్ చేసినందుకు, ప్రజలు కేసీఆర్‌ను బర్తరఫ్ చేశారు. నాపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ క్షమాపణ చెప్పాలి. శ్రీధర్‌రెడ్డి గ్రామానికి వెళ్లి కేటీఆర్ అసలు నిజాలు తెలుసుకోవాలి. నిజనిర్ధారణ చేసి తప్పు నాదుంటే ఎలాంటి చర్యలైనా తీసుకోండి’ అంటూ కామెంట్స్ చేశారు. -
కేసీఆర్‌ను ఢీకొట్టలేక కవితను జైలుకు పంపారు
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయంగా మాజీ సీఎం కేసీఆర్ ను ఢీకొట్టలేక ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవితను బీజేపీ జైలుకు పంపిందని బీఆర్ఎస్ నేతలు ఆర్. ఎస్.ప్రవీణ్‌కుమార్, బాల్క సుమన్ ఆరోపించారు. మాట వినని, అడ్డుగా ఉన్న ప్రతిపక్ష నేతలపై ఐటీ, సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తూ అక్రమ కేసు లను బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వా మ్యం ప్రమాదంలో ఉందని, దయచేసి బీజేపీకి ఎవరూ ఓటు వేయొద్దంటూ అభ్యర్థించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితతో తిహార్ జైల్లో ఆర్.ఎస్.ప్రవీణ్, బాల్క సుమన్ అరగంట పాటు ములాఖత్ అయ్యారు.అనంతరం తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. కవిత చాలా ధైర్యంగా ఉన్నారని, నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా అనే నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టి, ఆమె తరపు న్యాయవాదికి నోటీసులివ్వకుండా సీబీఐ అరెస్టు చేసిందంటేనే ఈ కేసు ఎవరి చెప్పుచేతల్లో నడస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆర్థిక నేరాలకు, ఇతర దేశాల నుంచి నగదు లావాదేవీలకు పీఎంఎల్ఏ కేసు నమోదు చేస్తారని, అసలు ఏ ఆధారా లున్నాయని పీఎంఎల్ఏ నమోదు చేశారో చెప్పా లని వారు డిమాండ్ చేశారు. ప్రముఖుల పేర్లు చెప్పాలంటూ కవితపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారనే విషయం కవిత చెప్పినట్లు తెలిపారు.తాము చెప్పినట్లు వింటే బయటకు పంపిస్తాం లేదంటే ఎన్ని రోజులైనా జైల్లోనే ఉంచుతామనే సంకేతాలను బీజేపీ ఇస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అంతా బీజేపీనే అని బాల్క సుమన్ ఆరోపించారు. లిక్కర్ స్కాంలో అరెస్టు అయ్యే వారి పేర్లను 2020లో బీజేపీ నేత మీడియా సమావేశం ద్వారా చెప్పడం.. ఆ తర్వాత నుంచి దేశవ్యాప్తంగా అరెస్టులు జరగడాన్ని మనమంతా చూస్తూనే ఉన్నామన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు, ఇంకా జరగాల్సిన ఎన్నికల్లో బీజేపీకి 220 ఎంపీ సీట్లు కూడా రావని సుమన్ జోస్యం చెప్పారు. -
‘తీహార్ జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారు’
న్యూఢిల్లీ, సాక్షి: మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ నేతలు పరామర్శించారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బాల్క సుమన్‌లు శుక్రవారం ఉదయం ఆమెను కలిశారు. కుటుంబ సభ్యులు కాకుండా పార్టీ సంబంధిత నేతలు ఆమెతో ములాఖత్ కావడం ఇదే మొదటిసారి. ములాఖత్ అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కవిత చాలా దైర్యంగా ఉన్నారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఉన్నారు.రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆ ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తారు, అందులో ఉన్నవాళ్ళందరిని దోషులుగా చేరుస్తామంటే ఎలా?. రైతు చట్టాలు సహా అనేక పాలసీలు మోదీ తీసుకొచ్చారు. అవి ఎవరి ప్రయోజనాలకోసం తీసుకొచ్చారు?. కవిత దగ్గరనుంచి ఒక్క రూపాయి డబ్బు దొరకలేదు, మనీలాండరింగ్ యాక్ట్ ఎలా వర్తిస్తుంది?. లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవు అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తారు. ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. బీజేపీ లో చేరినవారిపై ఒకలా, చేరనివారిపై మరోలా సెలెక్టీవ్ గా ఈడీ వ్యవహరిస్తోంది.విపక్షాల గొంతు నొక్కేందుకు సీబీఐ, ఈడీ ని బీజేపీ వాడుకుంటోంది. బాల్క సుమన్ మాట్లాడుతూ.. కవిత చాలా దైర్యంగా ఉన్నారు. మానసికంగా బలంగా ఉన్నారు. విపక్ష నాయకులను అణిచివేయలనే అన్యాయంగా కవితను ఈకేసులో ఇరికించారు.లిక్కర్ స్కాం కేసులో మార్చి 15వ తేదీన ఈడీ హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి రిమాండ్ మీద ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఇక.. ఈ కేసులో ఈడీ, సీబీఐ వేర్వేరుగా ఆమెను అరెస్ట్ చేయగా.. బెయిల్ కోసం ఆమె కూడా విడివిడిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రస్తుతం వాటిపై విచారణ జరుగుతోంది. అంతకు ముందు సుప్రీం కోర్టు సూచనలతో ఆమె ట్రయల్ కోర్టు(ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు)లోనే బెయిల్ పిటిషన్లు వేశారు. ఇది రాజకీయ కక్షతోనే జరిగిన అరెస్టుగా ఆమె వాదించారు. అయితే.. ఆమె బయటకు వస్తే కేసును ప్రభావితం చేస్తారని దర్యాప్తు సంస్థల వాదనలో కోర్టు ఏకీభవించింది. ఆమె బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. -
‘కాంగ్రెస్ గూండాల దాడి.. ఇదా రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం?’
సాక్షి, హైదరాబాద్: రాజకీయ ప్రత్యర్థులపై దాడి చేయటం అధికార దుర్వినియోగం చేయటమవుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. నిన్న( మంగళవారం) అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ గూండాల దాడి ఘటనలో స్థానిక పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించటంపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఇది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘ప్రేమ దుకాణం’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘ప్రత్యర్థులపై నిర్మొహమాటంగా దాడి చేయడం, అధికార దుర్వినియోగం చేయటమే. పోలీసుల దుర్వినియోగం, దాడిలో భాగం కావడం సిగ్గుచేటు. ఇది రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం. తెలంగాణ డీజీపీ.. ఈ గూండాలపై కఠిన చర్యలు తీసుకోకుండా, పోలీసులాగా ప్రేక్షక పాత్ర వహిస్తే.. మేము మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం జరిగేలా చూస్తాం’’ కేటీఆర్ ‘ఎక్స్’లో విమర్శించారు.Yahi Hai Kya Aapki “Mohabbat Ki Dukaan” @RahulGandhi ?Brazenly attacking opponents and abusing power. Shameful that police have become part of the abuse and attack @TelanganaDGP If you don’t act and book these goons and the spectator like cops, we will move the Human Rights… https://t.co/9VL4VjxD31— KTR (@KTRBRS) May 15, 2024 అచ్చంపేటలో కాంగ్రెస్ గూండాల దాడికి సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాడి జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ ట్యాగ్ చేశారు. ప్రవీణ్‌కుమార్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్‌పై విధంగా స్పందించారు. -
కాంగ్రెస్ గూటికి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సోదరుడు
హైదరాబాద్, సాక్షి: అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు షాక్ తగలనుందని తెలుస్తోంది. మాజీ ఐపీఎస్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోదరుడు ఆర్ఎస్ ప్రసన్న కుమార్ హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రెండు..మూడ్రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. బీఎస్పీ అధ్యక్ష పదవి వదిలేసి బీఆర్ఎస్లో ప్రవీణ్‌కుమార్ చేరిన కొద్ది రోజులకే నియోజకవర్గాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సొంత అన్నపైనే ప్రసన్నకుమార్ తిరుగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. తాను రాజకీయ ప్రత్యర్థిగా భావించే చల్లా వెంకట్రామిరెడ్డితో ఆర్ఎస్పీ భేటీ కావడంపై ప్రసన్న కుమార్ అలక బూనారు. ఈ క్రమంలోనే సొంత అన్నతో రాజకీయంగా విబేధించాలని సిద్ధపడినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే హస్తం నేతలతో సంప్రదింపులు జరిపిన ప్రసన్న కుమార్.. నేడో,రేపో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రసన్నకుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. -
నాగర్‌కర్నూల్ నుంచి ప్రవీణ్‌కుమార్..మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ శుక్రవారం ప్రకటించింది. మెదక్ నుంచి ఎమ్మెల్సీ పరిపాటి వెంకట్రామిరెడ్డికి, నాగర్‌కర్నూల్ నుంచి ఇటీవలే బీఎస్పీ నుంచి చేరిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు పార్టీ అధినేత కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీనితో మొత్తంగా బీఆర్ఎస్ 13 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది. మరో 4 సీట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వంటేరు పేరు వినిపించినా.. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పేరును బీఆర్ఎస్ దాదాపు నెల రోజుల క్రితమే ఖరారు చేసినా.. వివిధ కారణాలతో ప్రకటన జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే 2 రోజుల క్రితం కేసీఆర్‌ను కలిసిన వంటేరు ప్రతాప్‌రెడ్డి తనకు పోటీచేసే ఉద్దేశం లేదని చెప్పినట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జాయింట్ కలెక్టర్‌గా, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి పనిచేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పార్టీకి కంచుకోటగా ఉంది. 2014లో పార్టీ అధినేత కేసీఆర్ మెదక్ ఎంపీగా గెలిచినా రాష్ట్రంలో బీఆర్ఎస్ విజయం సాధించడంతో రాజీనామా చేసి సీఎం పదవి చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మెదక్‌లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. ఆర్థిక బలం కలిగిన వెంకట్రామిరెడ్డి వైపు మొగ్గుచూపినట్టు సమాచారం. పెండింగ్‌లో మరో నాలుగు సీట్లు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 11 సీట్లలో అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంతకుముందే ప్రకటించారు. తాజాగా ప్రకటించిన ఇద్దరి కలసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసిన స్థానాల సంఖ్య 13కు చేరింది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ సీట్లకుగాను ఇంకా నాలుగు సీట్లు హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, నల్లగొండ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ పేరు ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. మిగతా స్థానాలకు కసరత్తు కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. పెండింగ్ సీట్లకు రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని తెలిపాయి. 30వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయి సమావేశాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం మెదక్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులతో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ముఖ్య నేతలు వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, వేలేటి రాధకృష్ణశర్మ తదితరులు దీనికి హాజరయ్యారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తిరుమలకు వెళ్లడంతో భేటీకి రాలేదు. ఈ సందర్భంగా ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నేతలను కేసీఆర్ ఆదేశించారు. ఆలోగా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని మండలాల వారీగా కార్యకర్తల సమావేశాలను పూర్తి చేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులకు సూచించారు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రెండు లేదా మూడు ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేందుకు షెడ్యూల్ తయారు చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావుకు సూచించారు. బీఆర్ఎస్లోనే కొనసాగుతా: వంటేరు ప్రతాప్‌రెడ్డి మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేసిన నేపథ్యంలో.. గజ్వేల్ నియోజకవర్గ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి బీఆర్ఎస్ను వీడతారనే ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తానని వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో పనిచేసిన ప్రతాప్‌రెడ్డి.. ఆ సమయంలో రేవంత్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావులతో సన్నిహితంగా ఉండేవారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై 2014లో టీడీపీ తరఫున, 2018లో కాంగ్రెస్ తరఫున వంటేరు ప్రతాప్‌రెడ్డి పోటీ చేశారు. తర్వాత బీఆర్ఎస్లో చేరి అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. నాకు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి: వెంకట్రామిరెడ్డి మర్కూక్ (గజ్వేల్): తనను మెదక్ అభ్య ర్థిగా ప్రకటించడం పట్ల కేసీఆర్, హరీశ్‌రావులకు వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఐఏఎస్ అధికారిగా ఏడున్నరేళ్లు ఈ జిల్లాలో పనిచేశానని, తనకు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ దీనిని గుర్తించి తనకు అవకాశం ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. -
అభ్యర్థుల ఖరారు పూర్తితో.. వ్యూహాలకు కసరత్తు!
సాక్షి, మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనతో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల ప్రధాన పార్టీల లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. విజయం కోసం ప్రధాన పార్టీలు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఎంపీ అభ్యర్థులు ఎవరో తేలడంతో స్థానికంగా సమీకరణాలు సైతం శరవేగంగా మారుతున్నాయి. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కొంతమంది నాయకులతో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. 100 రోజుల్లో తాము అమ లు చేసిన పతకాలు, అభివృద్ధి పనులు, చేపట్టబోయే పనుల గురించి ఓటర్లకు వివరించాలని భావిస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్ల ముందు ఎండగట్టాలని నిర్ణయించింది. బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ పథకాలపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటన పూర్తి కాగా ఇతర నేతలను రప్పించి సభలు, రోడ్‌షోలు నిర్వహించి ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని భావిస్తోంది. నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రొఫైల్.. పేరు: రేపల్లే శివ ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులు: ప్రేమలత, సవారన్న పుట్టిన తేది: 23-11-1967 స్వస్థలం: అలంపూర్ విద్యార్హతలు: ఎంఏ(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) హార్వర్డ్ యూనివర్సిటీ, యూఎస్ఏ వృత్తి: ఐపీఎస్ అధికారి(1995 బ్యాచ్, గతేడాది ఉద్యోగానికి రాజీనామా), గురుకుల కార్యద ర్శితో పాటు ప్రభుత్వశాఖలో వివిధ హోదాలో పనిచేశారు. స్వేరోస్ సంస్థ స్థాపించి పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు. రాజకీయ అనుభవం: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ గత శాసనసభ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఇవి చదవండి: ‘పల్లా’కు మతిభ్రమించింది.. : సుంకెట అన్వేష్‌రెడ్డి -
బీఆర్ఎస్ అనూహ్య నిర్ణయం.. మెదక్ లోక్‌సభ బరిలో ఎమ్మెల్సీ
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శుక్రవారం(మార్చ్ 22) ఒక ప్రకటన విడుదల చేసింది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి పి. వెంకట్రామిరెడ్డి పోటీ చేయనున్నారు. తాజాగా రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో రానున్న లోక్‌సభ ఎన్నికలకుగాను బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ ఎంపీ సీట్లకు గులాబీ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ఈ సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. కవిత అరెస్టు కక్ష సాధింపే.. బీఆర్ఎస్ ఎంపీలు -
మళ్లీ బీఆర్ఎస్లోకి క్యూ కట్టాల్సిందే..
గజ్వేల్/సాక్షి, హైదరాబాద్: అధికారం కోల్పోగానే పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వారి గురించి ఆలోచించబో మని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌పై ప్రజా వ్యతి రేకత పెరిగి, నాలుగేళ్ల తర్వాత తిరుగుబాటుగా మారి, బీఆర్ఎస్ వంద సీట్లతో మళ్లీ అధికారాన్ని చేపట్టడం ఖాయమని అన్నారు. ప్రస్తుతం పార్టీ మారిన నేతలే తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చేందుకు క్యూ కట్టాల్సిన పరిస్థితి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాంటి వాళ్లను చేర్చుకోవద్దని కొందరు సూచించగా స్పందించిన కేసీఆర్.. మీరంతా నాయకులుగా ఎదిగితే పార్టీ మారిన వ్యక్తులను తిరిగి చేర్చుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తన అనుచరులతో కలిసి సోమవారం రాత్రి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. చంద్రబాబు రైతుల్ని ఇబ్బంది పెట్టారు ‘వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత ప్రారంభమైంది. నేను అకుంఠిత దీక్షతో మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చి ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నల్లా నీటిని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. కానీ ప్రస్తుతం మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో అర్థం కావడం లేదు. కరెంటు సరఫరా పరిస్థితి కూడా అలాగే ఉంది. నాటి ఉమ్మడి పాలనలో తెలంగాణపై కరెంటు సహా అన్ని రంగాల్లో వివక్ష కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రపంచ బ్యాంకు పిచ్చితో ఆర్థిక సంస్కరణల పేరిట రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేసే చర్యలకు పాల్పడ్డారు. చంద్రబాబుకు ఏమీ తెలియదు. అన్నీ తెలిసినట్లు నటించే వారు. విద్యుత్ కష్టాల నేపథ్యంలో చంద్రబాబును సైతం ఎదిరించా. తెలంగాణ ఉద్యమంలో నేను తిన్న తిట్లు ఎవరూ తినలేదు. నాపై దండకాలు రాసి పత్రికల్లో వేశారు. మరోవైపు రూ.5 వేల కోట్లు, కేంద్ర మంత్రి పదవి ఆఫర్ ఇచ్చి ఉద్యమం నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారు. అయినా ఏనాడూ తెలంగాణ ఉద్యమాన్ని వీడలేదు..’ అని కేసీఆర్ వెల్లడించారు. ఓటమి పార్టీకి మంచిదే.. ‘అగాథంలో ఉన్న తెలంగాణకు బీఆర్ఎస్ పాలనలో ధైర్యం వచ్చింది. ఇప్పుడిప్పుడే గాడిన పడిన ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి అధికారాన్ని అప్పగించారు. కానీ కొద్ది రోజుల్లోనే ప్రజలకు కాంగ్రెస్ పాలన అర్థమైంది. బీఆర్ఎస్ ఒక్కసారి ఓడిపోవాలని నేను కూడా భావించా. ఈ ఓటమి పార్టీకి మంచే చేస్తుంది. ఒక్కసారి ఓడితే నష్టమేమీలేదు. గాడిద వెంబడి పోతేనే కదా... గుర్రం విలువ తెలిసేది. దళితశక్తితో పాటు బహుజన శక్తి కలిసి నడవాలి దళితబంధు వల్ల ఓడిపోయామనే భావన ఎన్నికల ఫలితాల సమీక్ష తర్వాత బయటకు వచ్చింది. దళిత వర్గాలకు ఎలాంటి బ్యాంకు ష్యూరిటీలు లేకుండా రూ.10 లక్షల చొప్పున అందజేసి ఆ కుటుంబాల్లో వెలుగులు నింపడం తప్పా? దళిత సమాజం దీనిని సానుకూలంగా ఎందుకు తీసుకోలేకపోయిందో విశ్లేషించాల్సిన అవసరముంది. దళితశక్తితో పాటు బహుజన శక్తి కలిసి నడవాలి. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా సచివాలయానికి అంబేడ్కర్ పేరును పెట్టడమేగాకుండా భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం..’ అని కేసీఆర్ తెలిపారు. ప్రవీణ్‌కుమార్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తాం ‘ప్రవీణ్‌కుమార్ నిబద్ధత కలిగిన నాయకుడు. ఆయనను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా త్వరలోనే ప్రకటిస్తాం. భవిష్యత్‌లోనూ ప్రవీణ్‌కుమార్ ఉన్నత స్థానంలో ఉంటారు. ప్రవీణ్‌తో కలిసి దళిత శక్తిని ఏకం చేసేందుకు, బలహీన వర్గాలను ఏకతాటి మీదకు తెచేందుకు ఎజెండా తయారు చేయాల్సిన అవసరముంది. ఈ విధానం దేశానికే టార్చ్ బేరర్‌గా మారాలి..’ అని బీఆర్ఎస్ అధినేత పేర్కొన్నారు. అలాగైతే ప్రతిపక్ష పార్టీలో ఎందుకు చేరతా: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలంగాణ వాదం, బహుజన వాదం వేర్వేరు కాదని ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ చెప్పారు. వివక్షకు, అణిచివేతకు వ్యతిరేకంగా ఈ రెండు ఉద్యమాలు పుట్టుకొచ్చాయని తెలిపారు. తాను ప్యాకేజీ తీసుకుని బీఆర్ఎస్లో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్యాకేజీ తీసుకునే వ్యక్తినే అయితే ప్రతిపక్ష పార్టీలో ఎందుకు చేరతానని ప్రశ్నించారు. రేవంత్ బెదిరింపులు మానుకోండి ‘సీఎం రేవంత్‌రెడ్డి నన్ను పొగుడుతూనే సుతిమెత్తగా వార్నింగ్‌లు ఇస్తున్నారు. నేనూ పాలమూరు బిడ్డనే, నడిగడ్డ తిండి తిన్నవాడినే. మీ దారికి రాని వారికి బెదిరింపులు మానుకోండి. వార్నింగులు ఇచ్చి మీ హోదాను తగ్గించుకోవద్దు..’ అని ప్రవీణ్ కుమార్ సూచించారు. ఫామ్‌హౌస్‌కు వెళ్లేముందు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి చేపట్టాల్సిందిగా నన్ను సీఎం రేవంత్ ఆహ్వానిస్తే నేను తిరస్కరించిన మాట నిజమే. ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుని ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించా. అయితే నేను బీఆర్ఎస్లోకి వెళ్తే సమాధానం చెప్పాలని రేవంత్ అంటున్నారు. అయితే ఏ వేదిక మీద పనిచేయాలో చెప్పే స్వేఛ్చ తెలంగాణ ప్రజలకు లేదా. మీరు గేట్లు తెరిస్తే పిరికిపందలు, అసమర్థులు, స్వార్ధపరులు గొర్రెల మందలా వస్తున్నారు. కానీ నిజాయితీ కలిగిన నేను ఆ గొర్రెల మందలో ఒకడిని కాలేను. నేను ప్యాకేజీ తీసుకునే వాడినే అయితే రేవంత్ గేటు వద్ద ఉండే వాడిని. నేను దొంగ ఆస్తులు రక్షించుకునేందుకు వచ్చే పిరికిపందను కాను. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ కోసం వచ్చా’ అని ప్రవీణ్‌కుమార్ చెప్పారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారు ‘తరతరాల అణచివేతకు గురైన తెలంగాణకు విముక్తి కల్పించి వెలుగు వైపు నడిపించింది కేసీఆర్. ఆయన దురదృష్టవశాత్తూ అధికారంలో లేకున్నా ప్రజల గుండెల్లో ఉన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు బహుజన వాదులు కేసీఆర్ వెంట నడవాలని అనుకుంటున్నారు..’ అని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. చిన్నారికి శ్రీయా ఫూలేగా నామకరణం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకురాలు అకినేపల్లి శిరీష–ప్రవీణ్ దంపతుల ద్వితీయ కుమార్తెకు శ్రీయా ఫూలేగా కేసీఆర్ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎర్రవల్లిలో ఉన్న ఫామ్‌హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్లో చేరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి కేసీఅర్ పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు.. తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. గజ్వేల్‌లోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌కు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో తెలంగాణ విశాల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్లో చేరుతున్నానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే వెళ్లిన గొర్రెల్లాగా వచ్చిన వ్యక్తిని కాదని ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గజ్వేల్‌లోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌కు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘నిజాయితీకి కట్టుబడి ఉన్నా. ఓ వైపు మంచివాడు అంటూ నన్ను రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. స్వార్దం కోసం ఎన్ని కోట్లు తీసుకొని వెళ్తున్నావు అంటూ సోషల్ మీడియాలో అడుగుతున్నారు.డబ్బు కోసం ఆశపడిన వాడిని అయితే కాంగ్రెస్‌లో చేరుతా. బీఆర్ఎస్ కాదు. టీఎస్పీఎస్సీ చైర్మర్ ఆఫర్ ఇస్తే.. తిరస్కరించా. నా గుండెల్లో ఎప్పుడూ బహుజన వాదం ఉంటుంది. నేనెప్పుడూ బహుజనులు సంక్షేమం కోసమే పోరాడుతా. రేవంత్ రెడ్డే కాదు నేను కూడా పాలమూరు బిడ్డనే’ అని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇక.. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు బయలుదేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇతర టీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరులు అభిమానులు ఉన్నారు. -
నేడు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా బీఎస్పీకి రాజీనామా చేసిన ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ గూటికి చేరనున్నారు. సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా..‘నా రాజకీయ భవితవ్యంపై హైదరాబాద్‌లో ఆదివారం వందలాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులతో మేధోమధనం జరిపాను. ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటే నడుస్తానని మాట ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ విశాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వం, రాజ్యాంగ రక్షణ, బహుజనుల అభ్యున్నతి కోసం సోమవారం కేసీఆర్ సమక్షంలో ఆపార్టీలో చేరబోతున్నా. ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటా. వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తా’ అంటూ పోస్టు పెట్టారు. ఇదిలా ఉండగా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తరఫున సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ప్రజలకు నమస్కారం🙏 నేను నా రాజకీయ భవితవ్యం పై ఈ రోజు హైదరాబాదులో వందలాది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో మేధోమధనం జరిపాను. అట్టి సభలో రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. కానీ నా మీద నమ్మకంతో నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక… — Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 17, 2024 -
పొత్తుకు బ్రేక్.. బీఆర్ఎస్తో ఎన్నికల పొత్తుపై బీఎస్పీ వెనకడుగు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు కుదిరిందని బీఆర్ఎస్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే బ్రేక్ పడింది. బీఆర్ఎస్తో పొత్తును విరమించుకుంటున్నట్లు బీఎస్పీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. పొత్తు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇచ్చిన మాట తప్పడం తనకు ఇష్టం లేదని చెప్పడంతోపాటు తాను బీఎస్పీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం నందినగర్‌లో కేసీఆర్‌తో ప్రవీణ్‌కుమార్ శనివారం మధ్యాహ్నం సుమారు మూడు గంటలపాటు సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తన భవిష్యత్తు ప్రస్థానం బీఆర్ఎస్, కేసీఆర్‌తో కొనసాగుతుందని భేటీ అనంతరం ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. ఇదిలాఉంటే ఒకట్రెండు రోజుల్లో ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్లో చేరతారని ఆయన సన్నిహితవర్గాలు చెప్పాయి. బీఎస్పీతో పొత్తు విచ్ఛిన్నమైన నేపథ్యంలో నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రవీణ్‌కుమార్ పోటీ చేయనున్నారు. పొత్తులో భాగంగా నాగర్‌కర్నూల్, హైదరాబాద్ స్థానాలను కేటాయిస్తున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్ తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించింది. ఇదిలాఉంటే ప్రవీణ్‌కు బీఆర్ఎస్లో కీలక పదవి కూడా దక్కే అవకాశమున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌కు ఇచ్చిన మాట తప్పకూడదనే..: ప్రవీణ్ కేసీఆర్‌తో భేటీ ముగిసిన తర్వాత ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌తో కాకుండా ప్రాంతీయ పార్టీలతో బీఎస్పీ పొత్తు పెట్టుకోవాలని అందరితో చర్చించి నిర్ణయించుకున్నాం. అందులోభాగంగా బీఆర్ఎస్తో జరిగిన చర్చల ఫలితంగా నాగర్‌కర్నూల్, హైదరాబాద్ స్థానాలు కేటాయించారు. దీనికి బీఎస్పీ జాతీయ నాయకత్వం కూడా అంగీకరించినా బీఆర్ఎస్తో పొత్తు కుదుర్చుకోవడం బీజేపీకి నచ్చలేదు. పొత్తును విరమించుకోవాలని బీఎస్పీ అధిష్టానంపై బీజేపీ ఒత్తిడి తెచ్చింది. బీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు మీడియా సమావేశం పెట్టాలని బీఎస్పీ అధిష్టానం నుంచి నాకు ఆదేశాలు అందాయి. పొత్తు కోసం కేసీఆర్‌కు ఇచ్చిన మాట తప్పడం నాకు ఇష్టం లేదు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కేసీఆర్‌తో చర్చించాను. రాబోయే రోజుల్లో కేసీఆర్, బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తా. తెలంగాణ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా. బహుజన వాదాన్ని ఎన్నటికీ వీడను. తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఎస్పీ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నా. శ్రేయోభిలాషులతో చర్చించి రాజకీయ నిర్ణయం తీసుకుంటా’ అని ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఆది నుంచీ ఊగిసలాటే... లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ, బీఆర్ఎస్ నడుమ పొత్తు చర్చల్లో మొదటి నుంచీ ఊగిసలాట ధోరణి కనిపించింది. ఓ వైపు పొత్తులకు సంబంధించి కేసీఆర్‌తో చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే తాము దేశంలో ఏ పార్టీతోనూ కలిసి పోటీ చేయడం లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రకటించారు. అయితే మాయావతి ప్రకటన తెలంగాణకు వర్తించదని ప్రవీణ్ పేర్కొన్నారు. మరోవైపు మాయావతితో కేసీఆర్ మాట్లాడారని కూడా పేర్కొన్నారు. రెండు దఫాలుగా జరిగిన చర్చల్లో బీఎస్పీ మూడు సీట్లు కోరినట్లు ప్రచారం జరగ్గా.. నాగర్‌కర్నూల్, హైదరాబాద్ స్థానాలను కేటాయిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. అది జరిగి 24 గంటలు కాకమునుపే బీఎస్పీని వీడుతున్నట్లు ప్రవీణ్ ప్రకటించి కేసీఆర్‌తో భేటీ అయ్యారు.ఐపీఎస్ అధికారి నుంచి... సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసి తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ప్రవీణ్‌కుమార్ తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత గురుకులాల కార్యదర్శిగా వ్యవహరించారు. గురుకుల విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నతస్థాయికి తెచ్చేందుకు కృషి చేశారు. ‘స్వేరోస్’ సంస్థ ద్వారా గురుకులాల విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. 2021లో తన పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ప్రవీణ్‌కుమార్ అదే సంవత్సరం ఆగస్టులో మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరారు. రాష్ట్రంలో కాన్షీరాం అధ్యక్షుడిగా ఉన్న 1994 నుంచి రాజకీయ మనుగడ కోసం ప్రయత్నిస్తూ విఫలమైన బీస్పీలో ప్రవీణ్‌కుమార్ చేరడమే అప్పట్లో చర్చనీయాంశమైంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎత్తిచూపుతూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర, పర్యటనలు చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగ యువతను ఏకం చేయడంలో ఆయన సఫలీకృతమయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 107 మంది బీఎస్పీ అభ్యర్థులను బరిలో నిలిపారు. ఆయన స్వయంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ మనుగడ కోసం తాను పోరాడిన బీఆర్ఎస్తోనే కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. -
బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా
-
బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ)కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుడ్‌బై చెప్పారు. బీఎస్పీ పార్టీ తెలంగాణ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ‘బహుజన్ సమాజ్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను. నా నాయకత్వంలో తెలంగాణలో ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాల (వాటికి ఎంత మంచి ప్రాముఖ్యత ఉన్నా) వల్ల బీఎస్పీ వంటి గొప్ప పార్టీ ఇమేజ్ దెబ్బతినడం నాకు ఇష్టం లేదు’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఇటీవల బీఆర్ఎస్-బీఎస్పీ పార్టీలు లోక్‌సభ ఎన్నికల కోసం పొత్తు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. Dear fellow Bahujans, I am unable to type this message, but I must do it anyway, as the time to take new path has arrived now. Please forgive me for this post and I have no choice left. With heavy heart I have decided to leave Bahujan Samaj Party😭. I don’t want the image of… — Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 16, 2024 బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలలోని నాగర్‌ర్నూల్‌తో పాటు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బీఎస్పీ పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ చీఫ్‌గా ప్రవీణకుమార్ ప్రకటించారు. నాగర్‌కర్నూల్ స్థానం నుంచి స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్(ఆర్ఎస్పీ) ఎన్నికలో బరిలో దిగనున్నారని బీఎస్పీ ప్రకటించింది. ఇక హైదరాబాద్ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్నదానిపై బీఎస్పీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇలాంటి తరుణంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఎస్పీకి రాజీనామా చేయటం పార్టీకి పెద్ద షాక్ అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. -
బీఎస్పీకి రెండు సీట్లిచ్చిన బీఆర్ఎస్.. ‘ఆర్ఎస్పీ’ పోటీ అక్కడి నుంచే..
సాక్షి,హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)తో పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా బీఎస్పీకి బీఆర్ఎస్ రెండు సీట్లు కేటాయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ శుక్రవారం(మార్చ్15) ఒక ప్రకటన విడుదల చేసింది. పొత్తులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలలోని నాగర్‌ర్నూల్‌తో పాటు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బీఎస్పీ పోటీ చేయనుంది. నాగర్‌కర్నూల్ స్థానం నుంచి స్వయంగా బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్(ఆర్ఎస్పీ) ఎన్నికలో బరిలో దిగనున్నారని బీఎస్పీ ప్రకటించింది. ఇక హైదరాబాద్ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్నదానిపై బీఎస్పీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా, ఇప్పటివరకు మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను 11 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఖరారైంది. తాజాగా నాగర్‌కర్నూల్, హైదరాబాద్ లోక్‌సభ స్థానాలను పొత్తులో భాగంగా బీఎస్పీకి కేటాయించడంతో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేయాల్సి ఉంది. అభ్యర్థులను ప్రకటించాల్సిన నియోజకవర్గాల జాబితాలో సికింద్రాబాద్, నల్లగొండ, భువనగిరి, మెదక్ ఉన్నాయి. కాంగ్రెస్ జాబితా వెలువడిన తర్వాత మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌పైనా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో ఈ నెల 23న బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. అభ్యర్థులు ఖరారైన చోట బహిరంగ సభలు, ప్రచార షెడ్యూల్‌పై స్థానికంగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నేతలను కేసీఆర్ ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం. ఇదీ చదవండి.. మరో ఇద్దరికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ -
TS: బీఆర్ఎస్కు కోనప్ప గుడ్‌బై..! మంత్రి పొంగులేటితో కీలక భేటీ
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బుధవారం ఉదయం తెలంగాణ సెక్రటేరియట్లో రాష్ట్ర రెవెన్యూ,సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చాంబర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న మీడియా ప్రతినిధులతో ఆయన ముచ్చటించారు. కార్యకర్తలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపెట్టుకుంటున్నట్లు మంగళవారం రెండు పార్టీల అధ్యక్షులు ప్రెస్మీట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. బీఎస్పీతో పొత్తు విషయంలో అసంతృప్తికి గురైన కోనప్ప బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే కోనప్ప సచివాలయానికి వచ్చి సీఎం రేవంత్ మంత్రి వర్గంలో కీలక మంత్రిగా పేరున్న పొంగులేటితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సిర్పూర్ నుంచి కోనప్పపై పోటీ చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు కొనసాగితే తన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం అని భావించిన కోనప్ప పార్టీ మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కోనప్ప, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మధ్య ఉంటుందని అందరూ భావించినప్పటికీ సిర్పూర్ నుంచి అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇదీ చదవండి.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ధర్నా -
బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు ఖరారైంది. కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కలిసి పొత్తుపై చర్చించారు. అయితే.. తెలంగాణను కాపాడేందుకే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటున్నామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కలిసి ఆయన మీడియా ముందు మాట్లాడారు. బీఆర్ఎస్, బీఎస్పీ చాలా అంశాల్లో కలిసి పని చేసింది. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాం. కేవలం ఆర్ఎస్ ప్రవీణ్‌తోనే ఇప్పడు మాట్లాడాం. రేపు బీఎస్పీ అధినేత్రి మాయవతితో మాట్లాడతా. కచ్చితంగా కలిసి పోటీ చేస్తాం. సీట్ల పంపకాలపై త్వరలోనే ప్రకటన చేస్తాం అని కేసీఆర్ చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. నాలుగు నెలలు కాకముందే కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్‌తో రాజ్యాంగానికి ముప్పు ఉంది. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది. ఆ రెండు పార్టీలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మా స్నేహం తెలంగాణ ను పూర్తిగా మారుస్తుంది అని అన్నారు. నాగర్‌కర్నూల్ నుంచి పోటీ? ఇక పొత్తు ఖరారు నేపథ్యంలో.. లోక్‌సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. మంగళవారం కేసీఆర్ అధ్యక్షతన మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటరీ స్థాయి సమావేశం జరిగింది. అయితే.. మహబూబ్ నగర్ లోక్‌సభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి పేరును కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. కానీ, నాగర్ కర్నూల్ పార్లమెంటరీ స్థానం సమావేశం మాత్రం జరగలేదు. రెండ్రోజుల తర్వాత సమావేశం ఉంటుందని చివరి నిమిషంలో ప్రకటించడంతో.. అక్కడి కీలక నేతలు తెలంగాణ భవన్ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో.. ప్రవీణ్‌కుమార్ పేరు పరిశీలన కోసమే ఈ మీటింగ్ వాయిదా పడి ఉండొచ్చన్న సంకేతాలు బలపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి.. బీజేపీలో చేరారు. ఇటీవల బీజేపీ ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాలో రాములు తనయుడు భరత్‌కు నాగర్ కర్నూల్ సీటు కేటాయించింది కమలం పార్టీ. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఈ స్థానానికి గట్టి పోటీనే ఉంది. అయితే.. సీనియర్ నేత మల్లు రవిని పార్టీ బరిలో నిలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారితో నంది నగర్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆ పార్టీ ప్రతినిధుల బృందం. pic.twitter.com/bynXDHVXMB — BRS Party (@BRSparty) March 5, 2024 -
మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి
సూర్యాపేట రూరల్: సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీల పథకాల కంటే ముందు రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన తమ పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలంలోని ఇమాంపేట గురుకుల పాఠశాలలో వైష్ణవి మృతికి పాఠశాల ప్రిన్సిపాల్, ఆర్సీఓలే కారణమని తల్లిదండ్రులు ఆ పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు ప్రవీణ్ కుమార్ హాజరై తల్లిదండ్రులను ఓదార్చిన అనంతరం మాట్లాడారు. ‘సీఎం ఆరు గ్యారంటీలు అమ లు చేయకపోయినా మాకు నష్టం లేదు. ఇందు కోసమేనా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి మిమ్మ ల్ని అధికారంలోకి తీసుకొచ్చింది. ఆదాయం వచ్చే శాఖలకు మంత్రులను కేటాయించారే గానీ గిరి జన సంక్షేమ శాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించకపోవడం బాధాకరం. భువనగిరి గురుకులంలో ఇద్దరు విద్యార్థినులు చనిపోతే రెండు నిమిషాలు కూడా మౌనం పాటించకపోవడం హేయమైన చర్య’ అని ఆవేదన వ్యక్తంచేశారు. వైష్ణవి మృతిపై విచారణ జరిపి ఘటనకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలన్నారు. మృతురాలి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. 3 గంటలకు పైగా ఆందోళన కొనసాగ డంతో 3 కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది. కలెక్టర్ పాఠశాల వద్దకు రావాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఎస్పీ నాగభూషణం, సీఐ రాజశేఖర్‌తో పాటు మరో ఇద్దరు సీఐలు, ఎస్సైలు గురుకుల పాఠశాల వద్దకు వచ్చారు. వైష్ణవి కుటుంబానికి న్యాయం చేస్తామని ప్రవీణ్‌కుమార్‌కు వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు. -
ఐపీఎస్ అధికారి బయోపిక్.. ఆ రోజే రిలీజ్!
నంద కిషోర్ హీరోగా నటించిన చిత్రం ప్రవీణ్ IPS (ఇక ప్రజా సేవలో). ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఐరా ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై మామిడాల నీల నిర్మించిన ఈ మూవీ ఈ నెల 16న రిలీజ్ కానుంది. శనివారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు, ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల ప్రవీణ్ IPS ట్రైలర్ విడుదల చేశారు. సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. అలాంటి సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి సి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ... ప్రవీణ్ IPS జన హృదయాలను కదిలిస్తుందన్నారు. చాలామంది ఆదర్శాల కోసం సినిమాలు తీస్తే వాటిని జనం ఆదరించరని ఒక తప్పుడు అభిప్రాయం ఉందన్నారు. ‘మాల పిల్ల’, ‘రైతుబిడ్డ’ వంటి సినిమాల్లో ఆదర్శమే చూపించారని, ఆదర్శం (ఐడియలిజం) అనేది జన హృదయాలను తాకుతుందన్నారు. నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా అనేక విప్లవాత్మక మార్పులు విద్యారంగంలో తీసుకొచ్చారని అన్నారు. పూర్ణ మలావతి, ఆనంద్ లతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహింపజేశారని గుర్తు చేశారు. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం చాలా గొప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది నా తొలి చిత్రం డైరెక్టర్ దుర్గా దేవ్ నాయుడు మాట్లాడుతూ... ఇది నా తొలి చిత్రం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జీవితాన్ని మూడు పార్టులుగా తీయాలి. కానీ సెలెక్టివ్ అంశాలను తీసుకొని ప్రవీణ్ IPS మూవీ తీశాం. ఆయన నాకు ఇన్స్పిరేషన్. వివేక్ కూచిభోట్ల గారు లేకపోతే నాకు ఈ సినిమా అవకాశం వచ్చేది కాదని చెప్పారు. తనకు అన్ని విషయాల్లో అండగా నిలిచినందుకు వివేక్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో కష్టాలు పడ్డారు ASKES ఫౌండేషన్ చైర్మన్ కొల్లూరి సత్తయ్య మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నో కష్టాలను భరించి ఐపీఎస్ అధికారిగా ఎన్నో సేవలు చేశారని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా పేద పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని కోచింగ్ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రవీణ్ IPS మూవీ హిట్ కావాలని ఆకాంక్షించారు. చదవండి: రెండేళ్లుగా అదే తెలుసుకున్నా.. ఒంటరితనమే బాగుంది! -
బహుజనవాదం .. బహుదూరం
సాక్షి, హైదరాబాద్/ ఆసిఫాబాద్: బహుజన సమాజ్ పార్టీకి మరోసారి చుక్కెదురైంది. బహుజనవాదం నినాదంతో రాష్ట్రంలో కొన్ని సీట్లతో పాటు మెరుగైన ఓట్ల శాతం సాధించాలని కలలుగన్న బీఎస్పీ ఆశలు నీరుగారి పోయాయి. ఐపీఎస్ అధికారిగా స్వచ్చంద పదవీ విరమణ పొంది బీఎస్పీ సారథ్య బాధ్యతలు తీసుకొన్న ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ సారథ్యంలో 108 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీకి రెండు చోట్ల మాత్రమే డిపాజిట్ దక్కింది. అందులో ఒకటి ప్రవీణ్‌కుమార్ పోటీ చేసిన సిర్పూరు కాగా, రెండోస్థానం పటాన్చెరు. సిర్పూరులో గెలుపుపై ఆశలు రేకెత్తించిన ప్రవీణ్‌కుమార్‌కు లభించిన ఓట్లు 44,646. ఇక్కడ అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు విజయం సాధించగా, ప్రవీణ్ కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. దళిత, గిరిజన బహుజనుల ఓట్లపై గంపెడాశెలు పెట్టుకున్న ప్రవీణ్‌కుమార్ స్థానికేతరుడు కావడం కూడా ఇక్కడ ఆయన విజయావకాశాలను దెబ్బతీసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్పను తెలంగాణేతరుడుగా ప్రచారం చేయడంలో ప్రవీణ్‌కుమార్ విజయం సాధించినప్పటికీ, హరీశ్‌బాబు స్థానికుడు కావడంతో ఓట్లన్నీ గంపగుత్తగా పోలయినట్లు తెలుస్తోంది. కాగా పటాన్చెరులో చివరి నిమిషంలో బీఎస్పీ టికెట్టుపై పోటీ చేసిన కాంగ్రెస్ రెబల్ నీలం మధుకు 46,162 ఓట్లు మాత్రమే లభించి మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి 7వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ రెండోస్థానంలో నిలిచారు. ఇక ప్రవీణ్‌కుమార్ సోదరుడు ప్రసన్న కుమార్ స్వచ్చంద విరమణ చేసి ఆలంపూర్ నుంచి పోటీ చేయగా, కేవలం 4,711 ఓట్లు మాత్రమే లభించాయి. వీరు కాకుండా పెద్దపల్లి నుంచి పోటీ చేసిన దాసరి ఉష 10,315 ఓట్లు సాధించగా, సూర్యా పేటలో వట్టి జానయ్యకు 13,907 ఓట్లు దక్కా యి. చొప్పదండి నుంచి పోటీ చేసిన శేఖర్‌కు 5,153 ఓట్లు లభించాయి. ఇలా మరికొన్ని స్థానాల్లో స్వ ల్పంగా ఓట్లు మాత్రమే సాధించి బహుజనవాదం వినిపించడంలో ఆ పార్టీ విఫలమైంది. ప్రవీణ్‌కుమార్‌కు నిరాశ బహుజన వాదం నినా దంతో కుమురంభీంజిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో పాగా వేయా లని ఆశపడిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమా ర్కు నిరాశ తప్పలేదు. దళితులు, గిరిజనులు, బుద్ధిస్టుల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఆర్ఎస్పీ పోటీకి మొగ్గు చూపారు. పోలింగ్ సరళిని బట్టి ఆ పార్టీకి అధిక సంఖ్యలో ఓట్లు పడ్డాయని విశ్లేషకులు భావించారు. అయితే ఆ పార్టీ నాయకులు వేసిన అంచనాలు తారుమారయ్యాయి. -
అందరి తెలంగాణగా మార్చడమే లక్ష్యం : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
సాక్షి,హైదరాబాద్ : కొందరి తెలంగాణను అందరి తెలంగాణ చేయడమే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సాక్షి టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. దొరల తెలంగాణ కాకుండా పేదల తెలంగాణగా మార్చుదామనేది బీఎస్పీ ఆలోచన అని తెలిపారు. తెలంగాణలో దొరలు వదిలిపెట్టిపోయిన గడీలు గడిచిన తొమ్మిదేళ్లలో మళ్లీ పునర్మిర్మాణమయ్యాయన్నారు. బాంచన్ కాల్మొక్త అనే సంస్కృతి తెలంగాణలో పోలేదని చెప్పారు. రాజ్యాధికారంతోనే బాంచన్ కాల్మొక్త సంస్కృతి పూర్తిగా పోతుందని ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. స్పష్టమైన ప్రణాళికతో అన్ని వర్గాలను కలుపుకుని కృషి చేస్తే రాజ్యాధికారం తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధించి, వీలైతే రాజ్యాధికారం చేపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లో మధుకోడా ఒక్కడే ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు. దళితులు ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే సరిపోదని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంటేనే రాజ్యాధికారం వచ్చినట్లవుతుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి సీఎం అయిన తర్వాత బహుజనులకు రాజ్యాధికారంవచ్చిందన్నారు. మయావతి హయాంలో దళితులకు భూముల పంపిణీ జరిగిందని, మహిళలకు రక్షణ కల్పించిందని చెప్పారు. మాయావతి పాలన వల్ల బహుజనుల రెండు, మూడు తరాలు బాగుపడ్డాయని తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రిని కలిసి వారి ఆలోచనలు చెప్పుకునే అవకాశం తెలంగాణలో ఏ బ్యూరోక్రాట్‌కు లేదన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు కానిస్టేబుల్ ఆపితే ప్రగతిభవన్ గేటు వద్ద నుంచే వెనక్కు వెళ్లిన సందర్భాలున్నాయన్నారు. గురుకులాల సెక్రటరీగా వెళ్లిన వెంటనే దళిత, నిమ్న, వెనుకబడిన, అణగారిన అనే పదాలను నిషేధించి స్వేరో అనే పదాన్ని తీసుకొచ్చానని తెలిపారు. బీఎస్పీ మేనిఫెస్టోలో పెట్టిన 10 లక్షల ఉద్యోగాలు మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కాదని, ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగాల అన్నీ కలిపి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇవేకాక మరిన్ని విషయాలను ప్రవీణ్‌కుమార్ సాక్షి టీవీతో పంచుకున్నారు. -
ఖాకి చొక్కా విడిచి ఖద్దరుతో బహుజన రాజ్యాధికారం సాధ్యమేనా ?
-
ప్రగతిభవన్‌లో ఎంట్రీపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అమరవీరుల త్యాగాలను కళ్లారా చూశాను. తెలంగాణలో బాన్చన్ కల్చర్ సజీవంగా ఉందన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నన్ను హిందూ వ్యతిరేకి అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. కాగా, ఆర్ఎస్పీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రగతి భవన్‌లోకి సీఎస్‌లకు ఎంట్రీ నిరాకరించిన సందర్భాలున్నాయి. అపాయిమెంట్ ఉంటేనే లోపలికి అనుమతించేవారు. చాలా మంది గంటలు గంటలు బయట వేచి చూడటం నాకు తెలుసు. ఏ విధంగా అభివృద్ధి చేయాలో అని అధికారులను ఏనాడూ అడగలేదు. అధికారులు చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదు. తెలంగాణలో అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్చ బ్యూరోక్రాట్స్‌కు లేదు. ఎంతమంది తెలంగాణ బిడ్డలకు కేటీఆర్ ఉద్యోగాలు ఇచ్చారు?. కుట్రలతో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మాయావతి ఏడు లక్షల ఎకరాల భూమిని పంచారు. బడుగు, బలహీన, వెనుకబడిన అనే పదాలను నిషేధించాలి. మేం బీఫాంలు ఎప్పుడూ అమ్ముకోలేదు. మేము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. అసత్యాన్ని అతికేలా చెప్పడే బీజేపీ సిద్ధాంతం. బీసీలకు అడుగడుగునా బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. స్వేరోస్ అంటే ఆకాశమే హద్దుగా అని అర్థం. అంకితభావంతో పనిచేసే వాళ్లను ఎప్పుడూ పార్టీ వదులుకోదు. పేద పిల్లలు ఎప్పుడూ కూలీలుగానే ఉండాలా?. బీఎస్పీ పార్టీకి డబుల్ డిజిట్లో సీట్లు వస్తాయి. పెద్ద కంపెనీల్లో ఒక్క పేదవాడైనా పెద్ద హోదాలో ఉన్నాడా?. ఈసారి 80 శాతం టికెట్లు మా పార్టీ వారికే ఇచ్చాం. ఏపీలో ఇంగ్లీష్ మీడియం బోధన నిర్ణయాన్ని సమర్థిస్తాను. మాతృభాషతో పాటు ఇంగ్లీష్ బోధనను ప్రమోట్ చేయాలి. ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చి ఏపీ ప్రభుత్వం మంచి పనిచేసింది. జీవితంలో ఎదగాలంటే ప్రతీ ఒక్కరికీ చదువు అవసరం. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలి’ అంటూ కామెంట్స్ చేశారు. -
అధికారంలోకి వస్తే పది లక్షల ఉద్యోగాలు
వేములవాడ: బీఎస్పీ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యో గాలిచ్చి నిరుద్యోగులకు బాసటగా నిలుస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఇందులో మహిళలకే 5 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చా రు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇక్కడ ప్రకృతి ఆగ్రహించి టెంట్లను కూల్చి వేసినట్లుగానే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. ఏనాడూ రాని దొరలు ఇప్పుడు ఓటుకు రూ.2 వేలు ఇస్తామంటూ మన ఇంటికి వస్తున్నారన్నారు. ఒక్కసారి ఓటు అమ్ముకుంటే మన బిడ్డల భవిష్యత్‌ను బొంద పెట్టుకున్నట్లేనని హెచ్చరించారు. రాష్ట్రంలో బీఎస్పీ ప్రభుత్వం రాగానే భూమిలేని ప్రతీ నిరుపేదకు ఎకరం భూమి ఇస్తామని భరోసా ఇచ్చారు. కేసీఆర్ మూడెకరాలు ఇస్తామని నమ్మబలికి దళితులకు చెందిన 35 వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. గల్ఫ్ బాధితుల కోసం రూ.500 కోట్లు కేటాయిస్తామన్న కేసీఆర్ వాగ్దానం ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గల్ఫ్ బాధితులకోసం రూ.5 వేల కోట్లతో ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కులాలవారీగా కాంట్రాక్టులు కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. ఎమ్మెల్సీ కవిత అక్రమంగా రూ.100 కోట్లు ఢిల్లీకి పంపిందని, ఆమె రూ.20 లక్షల ఖరీదైన వాచ్ ధరిస్తుందని ఆరోపించారు. పార్టీ వేములవాడ అభ్యర్థి, విద్యావంతుడైన డాక్టర్ గోలి మోహన్‌కు కాకుండా ఎవరికి ఓటు వేసినా మీ జీవితాలు నాశనమేనన్నారు. కూలిన టెంట్లు.. పలువురికి గాయాలు సభ ప్రారంభంలో వేములవాడ అభ్యర్థి గోలి మోహన్ మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన సుడిగాలితో టెంట్లు కూలిపోయాయి. అనుకోని ఈ ఘటనతో పలువురు మహిళలు, జర్నలిస్టులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి పరామర్శించారు. -
అధికార మార్పిడి జరగాలి! : ప్రవీణ్‌కుమార్
మహబూబ్‌నగర్: పొలాల్లో పంట మార్పిడి ఎలా చేస్తారో.. అలాగే రాజకీయాల్లోనూ అధికార మార్పిడి జరగాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ, నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా అయిజలో మాట్లాడుతూ బీఎస్పీ అభ్యర్థులు ఎవరూ శ్రీమంతులు కారని, కష్టార్జితాన్ని నమ్ముకొనే మీ ముందుకు వచ్చారన్నారు. వాళ్ల వలే ఓటుకు వెయ్యి ఇచ్చి, 90 ఎంఎల్ బాటిల్, ఇంటి వద్ద ఉచితంగా భోజనాలు పెట్టే వాళ్లు కాదన్నారు. కానీ, ఐదేళ్లు రోజుకు మూడు పూటల తిండిపెట్టే విధంగా మీ అందరినీ తయారు చేయడానికి వచ్చిన వారన్నారు. వాల్మీకులు, కుర్వ సోదరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎంత మందికి టికెట్ ఇచ్చిందని ప్రశ్నించారు. బీఎస్పీ మహబూబ్‌నగర్, వనపర్తిలో వాల్మీకులకు టికెట్లు ఇచ్చినట్లు గుర్తుచేశారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టీ రిజర్వేషన్ పెంచి వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేరుస్తామన్నారు. ఈ అలంపూర్ గడ్డలో పుట్టిన.. ఇదే తుంగభద్ర నీళ్లు తాగిన.. ఇదే నడిగడ్డ గాలి పీల్చిన.. ఇదే నడిగడ్డలో మొలకెత్తిన విత్తనాలు తిని పెరిగి ఈ స్థాయికి వచ్చానన్నారు. అలంపూర్, సిర్పూర్ బీఎస్పీకి రెండు కళ్లలాంటివని, తప్పకుండా రెండు చోట్ల గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఇవి చదవండి: జీఓ 69ను బొందపెట్టి.. కొడంగల్‌ను ఎండపెట్టిండు.. : రేవంత్‌రెడ్డి -
కోనప్ప Vs ఆర్ఎస్ ప్రవీణ్ గా మారిన సిర్పూర్ రాజకీయం
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలో శాసనసభ ఎన్నికలు సెగ పుట్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సిర్పూర్ బరిలో నిలిచిన బీఆర్ఎస్, బీఎస్పీ అభ్యర్థులు ‘నువ్వా– నేనా’ అన్నట్లు సిగపట్లకు దిగుతుండటంతో నియోజకవర్గంలో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రచారంలో భాగంగా ఇరు పార్టీల శ్రేణులు బాహాబాహీకి దిగుతుండటం ఘర్షణకు దారితీస్తోంది. అభ్యర్థులు ఏకంగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి వెళ్లడంతో ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనని రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు.. ప్రత్యారోపణలు రాష్ట్రంలోనే వరుస పరంగా నంబర్– 1 నియోజకవర్గమైన సిర్పూర్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోనేరు కోనప్ప నాలుగోసారి బరిలో ఉన్నారు. రావి శ్రీనివాస్, పాల్వాయి హరీశ్‌బాబు, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేశారు. కాగా.. 2014లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో కోనేరు కోనప్ప బీఎస్పీ తరఫున ఎన్నికల్లో నిలబడి గెలిచి.. బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు అదే బీఎస్పీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్(ఆర్ఎస్పీ) కోనప్పకు పోటీగా నిలబడ్డారు. కోనప్పను కచ్చితంగా ఓడించి తీరుతానని ఆర్ఎస్పీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాపకింద నీరులా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఎస్పీ దూసుకెళ్లేలా ప్రణాళికలు రచించారు. గ్రామం, మండలం, పట్టణం.. ఇలా ఇంటింటా తిరుగుతూ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఒక దశలో ‘కోనేరు కోనప్ప.. కలప దొంగ’ అంటూ మీడియా ముందు తీవ్ర ఆరోపణలు చేయడం.. అందుకు కౌంటర్‌గా కోనప్ప ‘మర్డర్లు చేసిన ఘనత మాకే ఉంది. ఎన్కౌంటర్లు కూడా మేమే చేపించాం. పరిటాల రవిని మేమే చంపించాం. బెల్లంపల్లి, కరీంనగర్లో హత్యలు మేమే చేపించాం. ప్రవీణ్‌కుమార్ ఒక పొలిటికల్ టూరిస్ట్’ అంటూ ఆర్ఎస్పీపై ప్రత్యారోపణలు చేశారు. అప్పటి నుంచి ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ శ్రేణుల్లో ఘర్షణ వాతావరణం.. నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీఎస్పీలకు చెందిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు వర్గాలుగా విడిపోయి ప్రచారంలో పాల్గొంటున్నారు. శ్రేణుల ప్రచారం తారస్థాయికి చేరడమే కాకుండా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నెల 11న కాగజ్‌నగర్ పట్టణంలోని బస్టాండ్ ఏరియాలో బీఎస్పీ కార్యకర్త షేక్ ఆసిఫ్‌ను బీఆర్ఎస్ నాయకుడు కోనేరు ఫణితోపాటు పలువురు ఆకారణంగా దాడిచేయడమే కాకుండా చంపుతామని బెదిరించినట్లు ఆరోపిస్తూ బాధితుడు ఆసిఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పోలీసులు ఫణితోపాటు పలువురిపై కేసు సైతం నమోదు చేశారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీల్లో ఉన్న అసంతృప్తులకు అభ్యర్థులు గాలం వేస్తుండటం.. భారీ ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చి తమవైపు తిప్పుకోవడం పరిపాటిగా మారింది. పార్టీ ఫిరాయింపులు గెలుపోటములపై ప్రభావం చూపుతుండటంతో అభ్యర్థులు దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఫలితంగా ప్రచారంలో ప్రత్యర్థులపై దాడులకు దిగడానికి సైతం వెనుకాడకపోవడంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆదివారం రాత్రి కాగజ్‌నగర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయబస్తీలో ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అనంతరం బీఆర్ఎస్ ప్రచార రథం డైవర్‌పై దాడి చేశారంటూ ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. తమ ప్రచారాన్ని అడ్డుకోవడమే కాకుండా అన్యాయంగా కేసు పెట్టారని నిరసన తెలుపుతూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్పీ కాగజ్‌నగర్ పోలీసు స్టేషన్లో బైఠాయించారు. పోలీసులు చివరకు ఇరువర్గాల అభ్యర్థులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. అయితే ఇలాంటివి పునరావృతమైతే మాత్రం నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం పోలీసులకు సవాలుగా మారనుంది. -
కేసీఆర్‌ను జైలుకు పంపడం ఖాయం
పెద్దపల్లిరూరల్: కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కోట్లాది రూపాయలు దిగమింగిన సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబసభ్యులను జైలు కు పంపడం ఖాయమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రూ.లక్షన్నర కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగిపోతోందని, అందుకు కల్వకుంట్ల కుటుంబసభ్యులే కారకులని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావంతులైన నిరుద్యోగ యువతశక్తిని నీరుగార్చారని ఆరోపించారు. ఇప్పుడు ఏంచేయాలో తెలియక విద్యావంతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రతి ఏటా రంజాన్ పండుగకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసుడే తప్ప మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించలేనిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇఫ్తార్ విందులు కావు.. న్యాయం కావాలని మైనారిటీలు అడుగుతున్నారని పేర్కొన్నారు. సభలో పార్టీ నాయకులు ఈర్ల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ సీఎం అభ్యర్థి బయోపిక్.. టీజర్ రిలీజ్
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఓ వైపు అన్ని పార్టీల నాయకులు, ఓటర్లని ప్రసన్నం చేసుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే టైంలో ఆయా పార్టీలు.. సినిమాలతోనూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇప్పటికే 'కేసీఆర్' సినిమా రానుండగా, ఇప్పుడు మరో పార్టీ తరఫున పోటీలో ఉన్న ముఖ్యమంత్రి అభర్థి బయోపిక్ విడుదలకు సిద్ధమైంది. (ఇదీ చదవండి: తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్‌బాబు.. త్వరలో శుభకార్యం!) నీల మామిడాల నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా 'ప్రవీణ్ ఐపీఎస్'. షూటింగ్ అంతా పూర్తి చేసుకుని ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. నవంబరులో ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసి, ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఐపీఎస్ మాజీ అధికారి, ప్రస్తుత బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియోలో.. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఎలివేషన్ ఇచ్చేలా డైలాగ్ పెట్టారు. తప్పితే క్యారెక్టర్స్‌ని పెద్దగా చూపించలేదు. అయితే ఈ సినిమాలో నందకిషోర్, రోజా హీరో హీరోయిన్గా నటిస్తున్నారు. దుర్గా దేవ్ నాయుడు దర్శకుడు. నవంబరు చివర్లో ఎన్నికల జరగడానికి ముందే ఈ సినిమా రిలీజ్ కానుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) -
ప్రగతిభవన్ నుంచి కేసీఆర్‌ను సాగనంపాలి
మెట్పల్లి(కోరుట్ల)/జగిత్యాలటౌన్: తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబాన్ని ప్రగతిభవన్ నుంచి సాగనంపాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మినీ స్టేడియంలో బహుజన రాజ్యాధికార గర్జన సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో ఒక్కశాతం ఉన్న వర్గానికి అధికారం అప్పగిస్తే బహుజనులకు న్యాయం జరగదన్నారు.టీఎస్పీఎస్సీని మంత్రి కేటీఆర్ తన దోపిడీకి అడ్డాగా మార్చుకున్నారని, ఒక్కో పరీక్ష పేపర్‌ను ఆయన రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు అమ్ముకున్నారని ఆరోపించారు. పరీక్షలు వాయిదా పడటం వల్ల మనస్తాపం చెందిన ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్య చేసుకుంటే, కేటీఆర్ దానిని వక్రీకరిస్తూ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తే రూ.5 వేల కోట్లతో గల్ఫ్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. బహుజనులు ఎక్కువగా ఉన్న కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా దొరలు గెలవడం సమంజసం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న పూదరి నిషాంత్ కార్తికేయను గెలిపించాలని కోరారు. మాజీ జెడ్పీటీసీ పూదరి అరుణ, జిల్లా ఇన్చార్జి పుప్పాల లింబాద్రి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీ రద్దుకు తొలి సంతకం తమ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేస్తూ తొలి సంతకం చేయడంతో పాటు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకు అండగా నిలుస్తామని బీఎస్పీ చీఫ్ ప్రవీణ్‌కుమార్ హామీ ఇచ్చారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన బీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ ఏక్ నంబర్ అయితే బేటా కేటీఆర్ దస్ నంబర్ అని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్‌రావు అంబులెన్సుల్లో డబ్బులు పంపిణీ చేస్తారని అనుమానంగా ఉందని అన్నారు. -
ఎమ్మెల్యే కోనప్పపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
-
20 మందితో బీఎస్పీ తొలి జాబితా
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. తాను ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్టు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కో–ఆర్డినేటర్, ఎంపీ రాంజీ గౌతమ్‌తో కలసి పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రవీణ్‌కుమార్ విడుదల చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే 20 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటిస్తున్నామని, త్వరలో మరికొందరు అభ్యర్థులను వెల్లడిస్తామని చెప్పారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే మోదీ ప్రకటనలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రధాని మోదీ పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ప్రకటనలు చేశారని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఆచరణలో అమలుకాని హామీలతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మేనిఫెస్టోలు ఉంటున్నాయని విమర్శించారు. అధికారాన్ని అట్టిపెట్టుకోవాలనే ఉద్దేశంతోనే సమగ్ర కుటుంబ సర్వేను కేసీఆర్ బయటపెట్టడం లేదని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో చేసిన సర్వేను రహస్యంగా ఉంచడం ఎందుకని నిలదీశారు. బీఎస్పీ ప్రజాబలం ఉన్న పార్టీ అని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ధనబలమే తప్ప ప్రజాబలం లేదని వ్యాఖ్యానించారు. బీఎస్పీ తొలి జాబితా ఇదీ.. సిర్పూర్ – ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, జహీరాబాద్ – జంగం గోపి, పెద్దపల్లి – దాసరి ఉష, తాండూరు – చంద్రశేఖర్ ముదిరాజ్, దేవరకొండ – ముడావత్ వెంకటేశ్ చౌహాన్, చొప్పదండి – కొంకటి శేఖర్, పాలేరు – అల్లిక వెంకటేశ్వర్రావు, నకిరేకల్ – మేడి ప్రియదర్శిని, వైరా – బానోత్ రాంబాబు నాయక్, ధర్మపురి – నక్క విజయ్ కుమార్, వనపర్తి– నాగ మోని చెన్నరాములు, మానకొండూరు – నిషాని రామచందర్, కోదాడ – పిల్లిట్ల శ్రీనివాస్, నాగర్ కర్నూల్ – కొత్తపల్లి కుమార్, ఖానాపూర్ – బన్సీలా ల్ రాథోడ్, ఆందోల్ – ముప్పారపు ప్రకాశ్, సూర్యా పేట – వట్టే జానయ్య యాదవ్, వికారాబాద్ – గో ర్లకాడి క్రాంతికుమార్, కొత్తగూడెం– ఎర్ర కామేశ్, జుక్కల్– ప్రద్న్య కుమార్ మాధవరావు ఏకాంబర్. -
ఆ గొంతులన్నీ మూగబోయాయి
SAS (అందోల్): రాష్ట్ర సాధన ఉద్య మంలో పాటల రూపంలో ఉత్తేజపరిచిన గొంతులన్నీ మూగబో యాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ‘బీఎస్పీ శక్తి ప్రదర్శన’ నియోజకవర్గ ఇన్చార్జ్ ముప్పారం ప్రకాశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ కవులు, కళాకారులందరూ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల గొంతుకల కోసం బీఎస్పీలోకి రావాలని పిలుపునిచ్చారు. విప్లవా త్మకమైన పాటలను రాసిన వారిని, పాడిన వారిని గుర్తు చేసుకుంటూ పాటలు పాడుతూ అక్కడున్న వారిని ఆయన ఉత్తేజపరిచారు. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ కోసమే రూ.2 వేల కోట్లతో కొండపోచమ్మ రిజర్వాయర్‌ను రెండేళ్లలో పూర్తిచేశారని, సంగమేశ్వర, బస్వవేశ్వర ఎత్తిపోథల పథకానికి రూ.4 వేల కోట్లు మంజూరు చేయకపోతే క్రాంతి కిరణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు నటరాజన్ పాల్గొన్నారు. జర్నలిస్టుపై దాడిచేస్తే స్పందించని ఎమ్మెల్యే అందోల్‌లో అధికార పార్టీ నాయకుల అహంకారానికి అల్లాదుర్గం సాక్షి దినపత్రిక జర్నలిస్టుపై దాడిచేయడమే నిదర్శనమన్నారు. జర్నలిస్టు ఎమ్మె ల్యేగా ఉన్నా క్రాంతికిరణ్ జర్నలిస్టుపై జరిగిన దాడిని ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు. ఆయ న్ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. -
ఫాంహౌస్‌లలో నీలి జెండాలు పాతుతాం
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): రాజకీయ నాయకుల ఫౌంహౌస్‌లలో నీలి జెండాలు పాతేస్తామని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బహుజన్ సమాజ్ పార్టీయేనని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బుధవారం సిద్దిపేటలో నిర్వహించిన బహుజన దండయాత్ర సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో ఉన్న బహుజనులందరూ బీఎస్పీకి ఓటు వేస్తారన్నారు. దళితబంధు, బీసీబంధు, మైనార్టీబంధు, ఎస్టీబంధులతో పాటుగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దుకాణాన్ని సైతం ప్రజలు బంద్ పెట్టడం ఖాయమని చెప్పారు. బహుజనులకు కావాల్సింది గొర్రెలు, చేపలు కాదని, బీఎస్సీ అధికారంలోకి వస్తే బహుజనులు రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, కంప్యూటర్ ఇంజనీర్లు అయ్యే అవకాశం ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ను ఓడించేందుకు గజ్వేల్ బహుజనులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. -
ఒంటరిగానే పోటీచేస్తాం: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
అచ్చంపేట/ కల్వకుర్తి రూరల్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. ఆదివారం రాత్రి నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట లో నిర్వహించిన నల్లమల నగారా సభలో, అంతకు ముందు కల్వకుర్తిలో మీడియాతో ఆయన మాట్లా డారు. రాజ్యాధికారం కోసం బహుజనులు ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని, బీసీలకు తమ పార్టీ 70 స్థానాలను కేటాయిస్తుందని చెప్పారు. సూర్యాపేటలో జానయ్యపై చేస్తున్న దాడులను, మణిపూర్, భూపాల్ దాడులను ఖండిస్తున్నామన్నా రు. ఒక శాతం ఉన్న దొరలు 99 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణ పేదలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. తాము ఎవరి వైపున ఉండమని.. రాజ్యాంగం వైపు ఉంటామని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. -
బీఎస్పీ అధికారంలోకి వస్తే 33 జిల్లాల్లో 33 సైనిక్ స్కూళ్ల ఏర్పాటు
హన్మకొండ చౌరస్తా, నయీంనగర్: వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ గెలిచి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 సైనిక్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని, ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.7,500 అందిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హామీనిచ్చారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో మంగళవారం ‘బహుజన విద్యార్థి భరోసా’సభలో బీఎస్పీ విద్యార్థి మేనిఫెస్టోను విడుదల చేశారు. బీఎస్పీ హామీలివే... పూలే విద్యార్థి భరోసా పేరుతో కాలేజీ విద్యార్థులకు అన్ని ప్రభుత్వ రంగ వాహనాల్లో ప్రయాణంలో 50 శాతం రాయితీ కల్పిస్తామని తెలిపారు. ప్రతి మండలం నుంచి వంద మందికి విదేశీ విద్య అందిస్తామని, అందులో 50మంది విద్యార్థినులు ఉంటారని వెల్లడించారు. రాష్ట్రంలోని 10లక్షల మందికి ఉన్నత విద్య కల్పిస్తామని, కేజీ నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు కోడింగ్ భాష నేర్పుతామని హామీనిచ్చారు. 8నుంచి 12 తరగతి విద్యార్థులకు 4వ భాషగా కోడింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నేర్పిస్తామన్నారు. విద్యార్థి, నిరుద్యోగ ఆత్మహత్యలు లేకుండా కార్యాచరణ రూపొందిస్తామని, విద్యార్థులకు ఉద్యోగాలు రాకపోతే కాంట్రాక్టర్లను చేస్తామని వాగ్దానం చేశారు. శ్రీకాంతాచారి పేరు తో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, పేపర్ లీకేజీలు లేకుండా చర్యలు చేపడతామని, పూర్ణ, ఆనంద్ క్రీడా స్ఫూర్తితో ప్రతి జిల్లాలో అంతర్జాతీ య ప్రమాణాలతో క్రీడా స్టేడియాలను నిర్మిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. అసెంబ్లీ జరుగుతుండగా గద్దర్ మరణ వార్త తెలిసినా సీఎం కేసీఆర్ కనీసంగా స్పందించలేదని, సంతాప తీర్మానం చేయలేదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. -
హలో కేటీఆర్‌గారూ.. ఈ ఫొటో గుర్తుందా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల అమ్మకంపై బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌పై సెటైర్లు వేశారు. ‘ప్రభుత్వ భూముల వేలం పాటను ఆపివేయాలి. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మానుకోవాలి’అంటూ కేటీఆర్ ఓ ప్లకార్డు ప్రదర్శిస్తున్న పాత ఫొటోను జత చేస్తూ శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ‘తమరు ప్రతిపక్షంలో ఉంటే చెప్పేవి శ్రీరంగనీతులు, అధికారంలోకి వచి్చన తర్వాత ఆ నీతులు ఎక్కడో కొట్టుకొని పోయినయి! ఐనా చెప్పిందల్లా చేయడానికి మీరేమన్నా సన్నాసులా (నాన్న గారి మాటల్లోనే)!. మీరు మీ పత్రికల ద్వారా గతాన్ని తుడిచేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ చరిత్రను మరిచిపోయేంత సన్నాసులం మేం కాదు. 75 ఏళ్ల నుంచి 99 శాతం ఉన్న బహుజనులు 1శాతం ఉన్న ఆధిపత్య పాలకులకు ఓట్లేసి గెలిపిస్తే పేదల భూములను కాపాడలేదు సరికదా అమాంతంగా మింగేసిండ్రు. బీఎస్పీ అధికారంలోకి వచి్చన వెంటనే పేదల భూములకు రక్షణ కలి్పస్తాం’అని తన ట్వీట్లో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. కాగా వందల కోట్లకు అసైన్డ్ భూములను కొంటున్న కేసీఆర్, కేటీఆర్ బినామీల నుంచి భూములను తిరిగి తీసుకుంటామని, వాటిని పేద రైతులకు పంచుతామని ట్విట్టర్లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. నిన్న కోకాపేట, రేపు బుద్వేల్, ఎల్లుండి ఆర్ఆర్ఎర్ చివరికి మిగిలేది గోచి గుడ్డనే అని ఎద్దేవాచేశారు. హలో... @KTRBRS గారు గీ ఫోటో గుర్తుందా? తమరు ప్రతిపక్షంలో ఉంటే చెప్పేవి శ్రీరంగనీతులు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నీతులు ఎక్కడో కొట్టుకొని పోయినయి! ఐనా చెప్పిందల్లా చేయడానికి మీరేమన్నా సన్నాసులా(నాన్న గారి మాటల్లోనే) ! మీరు మీ పత్రికల ద్వారా గతాన్ని తుడిచేయాలని శతవిధాలా… pic.twitter.com/XdWrEhdOtz — Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) August 4, 2023 -
తలాయి జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలి
బెజ్జూర్: ప్రాణహిత నదిపై తలాయి జలవిద్యుత్ కేంద్రాన్ని ఎందుకు నిర్మించడంలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. ‘ఓటు మీదే–నోటు మీదే‘ నినాదంతో పార్టీ సిర్పూర్ ఇన్చార్జి అర్షద్ హుస్సేన్ చేపట్టిన యాత్ర మండలంలోని పలు గ్రామాల్లో శనివారం కొనసాగింది. తలాయి గ్రామ సమీపంలో నిర్మించతలపెట్టిన జల విద్యుత్కేంద్రం స్థలాన్ని ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తలాయి జలవిద్యుత్ కేంద్రం నిర్మిస్తే ఎన్నో ప్రయోజనాలున్నాయని, దీనికి అనుసంధానంగా ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తే ఇక్కడున్న బీడు భూములన్నీ సస్యశ్యామలమవుతాయని తెలిపారు. ఆదివాసీ, గిరిజనుల బతుకులు బాగు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆదివాసీలకు పోడు పట్టాలివ్వడంలో, రిజర్వేషన్లు పెంచడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. శిథిలావస్థకు చేరిన కృష్ణపల్లి ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. 150 మంది విద్యార్థులన్న పాఠశాలలో సరిపడా టీచర్లు లేరని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజాసమస్యలు పరిష్కరించడంలో పూర్తి గా విఫలమయ్యారని ఆరోపించారు. బీఎస్పీ అధికా రంలోకి వస్తే వెంటనే ఆదివాసీ గూడేల్లో ప్రతీ నిరుపేదకు ఇల్లు నిర్మించే బాధ్యత తీసుకుంటామని, ప్రజాసమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
హైదరాబాద్‌లో అంబేడ్కర్ భారీ విగ్రహం.. మాయావతి ఫైర్
సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ పేరుతో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం స్వార్థ రాజకీయాలు చేస్తోందని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి మండిపడ్డారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలంటున్న కేసీఆర్.. ఆ మహానుభావుడి విగ్రహాల సాకుతో అణగారిన వర్గాలను మరోసారి ఏమార్చేందుకు వస్తున్నారని విమర్శించారు. బీఎస్పీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో ‘తెలంగాణ భరోసా సభ’ జరిగింది. మాయవతి ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు భూమి లేని దళితులకు మూడెకరాల భూమిని ఉచితంగా ఇచ్చానని.. కేసీఆర్ ఆ పథకాన్ని కాపీకొట్టి ఎన్నికల హామీగా ఇచ్చారని మాయావతి చెప్పారు. కానీ కేసీఆర్ దళితులకు భూమి పంపిణీ చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఎస్పీ బలోపేతం అవడంతో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. కేసీఆర్ పాలనలో అన్నివర్గాలకు ఇబ్బంది కేసీఆర్ సర్కార్ తీరుతో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, ముస్లిం తదితర అణగారిన వర్గాలన్నీ ఇబ్బంది పడుతున్నాయని మాయావతి ఆరోపించారు. బిహార్‌లో తెలంగాణకు చెందిన దళిత ఐపీఎస్‌ను చంపిన హంతకుడిని అక్కడి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేస్తే.. సీఎం కేసీఆర్ కనీసం కూడా ప్రశ్నించలేదేమని నిలదీశారు. అంబేడ్కర్, కాన్షీరాం స్ఫూర్తితో బీఎస్పీ అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని.. భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి వస్తే యూపీలో అమలుచేసిన సంక్షేమ పథకాలను ఇక్కడా అమలు చేస్తామని మాయావతి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోని పేదలు, రైతులు, కూలీలు, నిరుద్యోగులు, మైనారిటీవర్గాలతో పాటు ఉన్నత వర్గాల్లోని పేదలకు కూడా బీఎస్పీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తున్నాయని.. కానీ నిరుద్యోగులకు ఇవ్వాల్సింది భృతి కాదని, ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక్కడ అధికారంలోకి వస్తే ప్రవీణ్‌కుమారే సీఎం తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్‌కుమారే ముఖ్యమంత్రి అని మాయావతి ప్రకటించారు. ఆయన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి, పేదలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారని.. అలాంటి వ్యక్తి సీఎం అయితే తెలంగాణ అభివృద్థి చెందుతుందని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం, లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామగ్రామాన బీఎస్పీని బలోపేతం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీఎస్పీ పాత్ర కీలకమని, పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు తెలిపామని మాయావతి గుర్తు చేశారు. బీఎస్పీకి భయపడే అంబేడ్కర్ విగ్రహం: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ప్రగతిభవన్ మీద నీలి జెండా ఎగరవేయడం ఖాయమని, తెలంగాణను దోపిడీ దొరల నుంచి విముక్తి చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఏనాడూ అంబేడ్కర్ ఫోటోకు, విగ్రహానికి దండ వేయని కేసీఆర్.. బీఎస్పీకి భయపడే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టారని పేర్కొన్నారు. తాను బీఎస్పీలో చేరిన తర్వాతే దళిత బంధు పథకాన్ని తెచ్చారన్నారు. ‘దళితబంధు’లో ఎమ్మెల్యేలు మూడు లక్షల రూపాయల చొప్పన కమీషన్లు తీసుకుంటున్నట్టు స్వయంగా చెప్పిన కేసీఆర్.. దమ్ముంటే ఆ ఎమ్మెల్యేల పేర్లను ఏసీబీకి ఇవ్వాలని సవాల్ చేశారు. రైతులు పంట నష్టపోయి కష్టాలు పడుతుంటే.. కేసీఆర్ ప్రగతిభవన్‌లో మహారాష్ట్ర వాళ్లను పార్టీలో చేర్చుకునే పనిలో ఉన్నారని, తెలంగాణ ప్రజాధనాన్ని మహారాష్ట్ర వ్యక్తులకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో ఒక్కో ఉద్యోగాన్ని రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రతీ నెలా ఒకటో తేదీన జీతం తీసుకునే కేసీఆర్.. ఉద్యోగులకు మాత్రం 10వ తేదీన జీతాలు ఇస్తున్నాడని ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. పేద ఆర్టిజన్ కార్మికుల మీద ఎస్మా కింద కేసులు పెట్టారని, నెలకు 4లక్షలకుపైగా జీతం తీసుకుంటున్న కేసీఆర్‌పై ఎస్మా ప్రయోగించాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం నాడు తాము గజ్జె కట్టామని.. ఇప్పుడు అన్యాయం జరిగితే గల్లా పడతామని హెచ్చరించారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. భూమి లేని వారికి ఎకరం భూమి ఇస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో బీఎస్పీ తెలంగాణ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్, ఏపీ అధ్యక్షుడు పరంజ్యోతి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేశ్ చౌహాన్, అరుణ, సంజయ్ కుమార్, దాసరి ఉష తదితరులు పాల్గొన్నారు. -
గ్రూప్–1 టాపర్ ఎవరో చెబితే ప్రభుత్వం కూలుతుంది: ఆర్ఎస్ ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ గ్రూప్–1 మొదటి ర్యాంకు ఎవరిదో చెబితే బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్‌లకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా గ్రూప్–1 టాపర్లు ఎవరో ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంగళవారం బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ భోరోసా దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ సిబ్బంది, ఈ కేసులో నిందితులైన రాజశేఖర్‌రెడ్డి, దాసరి కిషోర్‌లకు గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 150 మార్కులకుగాను 120 మార్కులు సాధించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు తెలిసిన వారే టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఉన్నారని, అందువల్ల ఆ కమిషన్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. ఏ నిరుద్యోగ బిడ్డల త్యాగం వల్ల తెలంగాణ వచి్చందో, ఆ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు అమ్ముకుంటోందని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ‘టెన్త్’లో అలా.. టీఎస్పీఎస్సీలో ఇలా.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ‘సిట్’విచారణ నత్తనడకన సాగుతోందని... నిందితులను బాధితులుగా చూపే ప్రయత్నం జరుగుతోందని దుయ్యబట్టారు. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు 48 గంటల్లోనే పాత్రదారులు, సూత్రదారులను అరెస్ట్ చేశారని... కానీ టీఎస్పీఎస్సీ కేసులో సూత్రదారులు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నందునే ఇప్పటివరకు అరెస్టు చేయలేదని ఆరోపించారు. ఈ కేసుపై స్పందించకుండా ముఖ్యమంత్రి మౌనం వహిస్తున్నారంటే తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ముఖ్యమంత్రి గద్దె దిగాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే అమరవీరుల స్థూపం వద్దకు రావాలని, తాము పేపర్ లీక్‌కు సంబందించి ఆధారాలతో వస్తామని ఆయన సవాల్ చేశారు. 18న నిరసన దీక్ష... టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిరుద్యోగులకు న్యాయం చేసేలా ప్రతిపక్ష పారీ్టలంతా ఏకతాటిపైకి రావాలని ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. అలాగే కొత్త కమిషన్ వేశాకే పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్‌తో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అన్ని పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలతో ఈ నెల 18న ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేయనున్నట్లు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సీఎంకు 25 ప్రశ్నలు రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం కేసీఆర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు వాడుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మంగళవారం బీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలను ఓటుబ్యాంకుగా చూడటమే తప్ప చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 2016లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికైనా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని... కానీ గతంలో దళిత, బహుజనులకు ఇచ్చిన హామీల సంగతేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా 25 ప్రశ్నలతో సీఎంకు రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ -
కేటీఆర్‌ను విచారిస్తే నిజాలు తెలుస్తాయి
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలో సీఎం కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందని తాను మొదటి నుంచి వ్యక్తం చేస్తున్న అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్–1 సహా మిగిలిన పరీక్ష పేపర్ల లీకేజీలో ఐటీ శాఖకు ప్రత్యక్ష సంబంధం ఉందన్నట్లుగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు ఈ వ్యవహారంలో సంబంధం ఉందని ఆయన మాటల ద్వారానే తెలుస్తోందని, ఆయనను సిట్ విచారిస్తే నిజాలు తెలుస్తాయని అన్నారు. మంగళవారం ఆయన బీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రూప్–1 ప్రిలిమ్స్ కటాఫ్ మార్కుల వివరాలను ఇప్పటికీ అధికారికంగా వెల్లడించకున్నా జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో, సిరిసిల్లలో ఎంతమంది పరీక్ష రాస్తే ఎందరు క్వాలిఫై అయ్యారో కేటీఆర్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. కేటీఆర్‌కు ఆ డేటా టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డిగానీ, కమిషన్ సభ్యులుగానీ ఇచ్చారా అని అనుమానం వ్యక్తం చేశారు. పేపర్ల కుంభకోణానికి తనకు సంబంధం లేదంటూనే టీఎస్పీఎస్సీ తరపున కేటీఆర్ వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు మాత్రమే లీకేజీ అంశాలను వెల్లడించాల్సి ఉండగా, ఆ సంస్థ అధికార ప్రతినిధిగా కేటీఆర్ ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ ఆఫీస్ ఈ వ్యవహారంలో రిమోట్‌గా పనిచేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులకు నోటీసులు ఇస్తూ కేటీఆర్‌కు మాత్రం డేటా ఇస్తున్నారన్నారు. పేపర్ లీకేజీపై చైర్మన్ జనార్దన్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కమిషన్ చైర్మన్, సభ్యుల హస్తం ఉందని ఆరోపించారు. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ తారుమారు చేశారనే అనుమానం బలపడుతోందని, కీలకమైన సాక్ష్యాలను చెరిపివేశారనే అనుమానం కూడా కలుగుతోందన్నారు. 80 నుంచి 90 మార్కులుపైగా వచ్చిన వాళ్ల ఓఎంఆర్ షీట్లను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. -
నిందితులను రక్షించడానికే సిట్: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
బిజినేపల్లి: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిందితులను పట్టుకోవడానికి కాకుండా..అసలు నిందితులను రక్షించడానికే పనిచేస్తుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. పేపర్ లీక్ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ బోర్డుకు, ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధాలున్నాయనే ఆరోపణలు రోజురోజుకూ బలపడుతున్నాయన్నా రు. టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుడు లింగారెడ్డి పీఏకు గ్రూప్–1లో 127 మార్కులు ఎలా వచ్చాయని, ముఖ్యమంత్రికి ఓఎస్డీగా పనిచేసే రాజశేఖర్‌రెడ్డికి లింగారెడ్డి స్వయంగా మేనబావని తెలిపారు. రాజ్యాధికార యాత్ర లో భాగంగా శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో ప్రవీణ్ కుమార్ పర్య టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిట్ ఈ కేసులో అసలు దోషులను వదిలేసి, కిందిస్థాయిలో 12 మందిని అరెస్టు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 2009 బ్యాచ్‌కు చెందిన 200 మంది ఎస్సైల పదోన్నతుల ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టారని, అలాంటి ఫైల్స్ చూడని హోంమంత్రిపై త్వర లోనే మిస్సింగ్ కంప్లైంట్ చేస్తామన్నారు. ప్రభుత్వానికి పనిచేయాల్సిన అడ్వొకేట్ జనరల్ కవిత లిక్కర్ స్కాం కేసు కోసం ఈడీ ముందు ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. -
బీఆర్ఎస్, బీజేపీలవి దొంగాటలు
ఆలంపూర్: ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే బీఆర్ఎస్, బీజేపీ దొంగాటలు అడుతున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలో బీఎస్పీ బహుజన రాజ్యాధికార యాత్ర శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా ఆలంపూర్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ బీసీ రిజర్వేషన్‌ను 27 నుంచి 50 శాతానికి ఎందుకు పెంచడం లేదని సీఎం కేసీఆర్‌ను నిలదీశారు. బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వానికి వస్తున్న అడ్డంకులేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల గురించి ఎమ్మెల్యేలెవరైనా మాట్లాడితే వారిని ప్రగతిభవన్‌లోకి అడుగు పెట్టనీయరని, అందుకే వారు క్యాంపు కార్యాలయాలకే పరిమితమయ్యారని అన్నా రు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు మహిళారిజర్వేషన్లు గుర్తుకు వచ్చాయని, అందుకే నిరాహార దీక్ష చేస్తానని అంటున్నారని అన్నారు. తెలంగాణలో 2014 నుంచి 2018 వరకు ఒక్క మహిళామంత్రి లేరని, అప్పుడు ఎందుకు కవితకు నిరాహార దీక్ష ఆలోచన రాలేదని ప్రశ్నించారు. బీఎస్పీ కేవలం మహిళల గురించే కాదు బీసీలు, మైనారీ్ట, ఎస్టీల రిజర్వేషన్ల కోసం కూడా పోరాడుతుందన్నారు. రూ.3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో ముస్లింల కోసం ఒక శా తం కంటే తక్కువగా నిధులు కేటాయించడం శోచనీయమని అన్నారు. ముస్లింల పై సానుభూతి వ్యక్తం చేసే పారీ్టలు ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సమావేశంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కేశవరావు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మహిళా కనీ్వనర్ రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. -
దళితబంధు.. బీఆర్ఎస్ కార్యకర్తలకు విందు
జన్నారం (ఖానాపూర్): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం బీఆర్ఎస్ కార్యకర్తలకు విందుగా మారిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. మంగళవారం బీఎస్పీ రాజ్యాధికార యాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా జన్నా రం మండలం ధర్మారం, కామన్పల్లి, ఇందన్పల్లి, జన్నారం గ్రామాల్లో పర్యటించారు. జన్నారంలో ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. దళితబంధు పథకం ప్రకటనకే పరిమితమైందని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులతోపాటు గిరిజనేతరులు కూడా అటవీ హక్కు పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు. టైగర్‌జోన్ పేరుతో అడవిలో ఉన్న గిరిజనులు, గిరిజన గ్రామాలను తరలించడం సరికాదన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సర్పంచ్ల ఆత్మహత్యలకు కారణమవుతున్న ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రవీణ్ పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు రమేశ్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాథోడ్ బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు
ఉట్నూర్/ఇంద్రవెల్లి: రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో పర్యటించారు. ముందుగా ఉట్నూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ధరణి పోర్టల్ పనితీరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అనంతరం ఐబీ చౌరస్తాలో మాట్లాడుతూ, పేదలకు మెరుగైన విద్య, వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో కాంగ్రెస్, బీజేపీలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. సచివాలయం గుమ్మటాలు కూల్చుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. కూల్చాల్సింది గుమ్మటాలు కాదని.. రాష్ట్రంలో అవినీతిలో కురుకుపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడి, బీఎస్పీని ఆదరించాలన్నారు. అనంతరం యాత్ర పెర్కగూడ, శ్యాంపూర్, యోందా, ఉమ్రి, నర్సాపూర్, గోట్టిపటార్ మీదుగా ఇంద్రవెల్లి చేరుకుంది. ఇంద్రవెల్లిలోని బుద్ధనగర్, ప్రబుద్ధనగర్, సట్వాజిగూడ, బుర్సన్‌పటర్ గ్రామాల్లో యాత్ర సాగింది. -
తాను పోటీచేసే అసెంబ్లీ స్థానంపై క్లారిటీ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
-
TS: బీఎస్పీకి కంచుకోట ఉందా? అక్కడి నుంచే ప్రవీణ్ కుమార్ పోటీ!
ఆ నియోజకవర్గం BSP కంచుకోటగా చెబుతారు. ఆ బహుజనుల కోట నుంచే పార్టీ రాష్ట్ర చీఫ్ ఎన్నికల బరలో దిగబోతున్నారా? అక్కడి నుంచే పోటీ చేయడానికి ప్రవీణ్‌కుమార్ భావించడానికి కారణం ఏంటి? నియోజకవర్గంలో ప్రవీణ్ పర్యటన ఎన్నికల యాత్రేనా? కుమ్రంబీమ్ జిల్లాలోని సిర్పూర్ టి నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీకి బలమైన స్థావరంగా భావిస్తారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రెండు సీట్లలో అనుహ్యంగా BSP రెండు స్థానాల్లో విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ టి నియోజకవర్గం నుండి BSP రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ బరిలో దిగాలని భావిస్తున్నారట. అందులో బాగంగానే బహుజన రాజ్యదికార యాత్రను ఐదురోజుల పాటు ఈ నియోజకవర్గంలో ప్రవీణ్ నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల యాత్రలో తెలంగాణ సర్కారు వైఫల్యాలను ఇంటింటికి తీసుకువెళ్లుతున్నారు. ఈ సందర్భంగా బహుజన రాజ్యం తెచ్చేందుకు మద్దతివ్వాలని ప్రజలను కోరుతున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే కోనేటి కోనప్ప విఫలం చెందారని విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. గుడ్‌బై ఐపీఎస్.. ఛలో అసెంబ్లీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ..ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్‌కుమార్ బహుజన సమాజ్ పార్టీ ద్వారా ప్రజా జీవితంలోకి అడుగు పెట్టారు. రాబోయే ఎన్నికలే ఆయన ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికలు. సిర్పూర్ నియోజకవర్గం నుంచే ఎన్నికల బరిలోకి దిగాలని భావించిన ప్రవీణ్ అక్కడి పరిస్థితులు అధ్యయనం చేసేందుకే యాత్ర నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం లో దళిత, గిరిజన, మైనారీటీ, బీసీ ఓటర్లు భారీగా ఉన్నారు. ఆయా వర్గాలే అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. పైగా 2014లో ఇక్కడ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అందుకే సిన్సియర్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న ప్రవీణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తే మళ్ళీ బలహీనవర్గాల ప్రజలంతా మద్దతిస్తారనే అంచనాతోనే ఈ స్థానంపై కన్నేసారని తెలుస్తోంది. పైగా స్థానిక ఎమ్మెల్యే కోనప్ప పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని టాక్. ఎమ్మెల్యేపై వ్యతిరేకత బిఎస్పీకి అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. తాను ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ...జనరల్ సీటులో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఎంత పెద్ద నాయకులైనా రిజర్వుడు కేటగిరికి చెందినవారైతే..ఆ స్థానాల్లోనే పోటీ చేస్తారు. కాని దానికి భిన్నంగా అందరివాడిగా గుర్తింపు పొందాలని భావిస్తున్న ప్రవీణ్‌కుమార్ జనరల్ సీటునే ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారంటూ ప్రచారం సాగుతున్నా..పార్టీ నాయకత్వం మాత్రం దీనిపై ఇంకా ప్రకటన చేయలేదు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
బీఆర్ఎస్, బీజేపీ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాయి
కాగజ్‌నగర్‌టౌన్: ప్రశ్నించే గళాలను అణచివేయడా నికి బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు కుట్రలు చేస్తు న్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ కుట్రల్లో భాగంగా తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తన ఆపిల్ సెల్‌ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నట్లు ఆ సంస్థ తనకు మెయిల్ పంపించిందని తెలిపారు. ప్రవీణ్‌కుమార్ చేపట్టిన రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్ర సోమవారం కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బహుజన రాజ్యం కోసం తాను చేస్తున్న పోరాటాన్ని జీర్ణించుకోలేక, బీఎస్పీకి పెరుగుతున్న ఆదరణను తట్టు కోలేక ప్రభుత్వాలు ఇలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఈ పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాగా, రైతుస్వరాజ్య వేదిక నాయకులను ఉద్దేశించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, రైతులకు పల్లా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు ఎక్కువయ్యాయని, పేదల భూములను ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిడాం గణపతి, జిల్లా అధ్యక్షుడు ఆకుల సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలి.. సీఎంకు ప్రవీణ్‌కుమార్ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ రిజర్వే షన్లను 27% నుంచి 50 శాతానికి పెంచా లని, బీసీ జన గణన ను చేపట్టాలని ప్రభు త్వాన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశా రు. తెలంగాణలో బీసీల జనాభా 50 శాతా నికిపై ఉన్నా విద్య, ఉద్యోగాలు సహా అన్ని రంగాల్లో బీసీల వాటా 27శాతమే ఉందన్నారు. పెరిగిన జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వే షన్లు కల్పించాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 50% నిధులను బీసీలకు కేటా యించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, సమగ్ర కుటుంబ సర్వే నివేదికను బహిర్గతపరచాలని డిమాండ్ చేశారు. బీసీల సమస్యలను తక్షణ మే పరిష్కరించకపోతే ప్రభుత్వం రాజీనామా చేసి గద్దెదిగాలని లేఖలో డిమాండ్ చేశారు. చదవండి: రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ?.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం.. -
బంగారు తెలంగాణ దొరలకే పరిమితమైంది
సాక్షి, పెద్దపల్లి: బంగారు తెలంగాణ దొరల ఇంటికే పరిమితమైందని, పేదలకు ఇళ్లు లేవు, ఇంటికి తలుపులు లేవని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మంగళవారం పెద్దపల్లి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ దోచుకోడానికే అధికారంలోకి వచ్చాయని, అందుకే దొరల పాలన అంతం చేసి పేదల రాజ్యం తెచ్చుకోవాలన్నారు. ఒకవైపు మహిళల రక్షణ కోసం షీ టీమ్‌లు అని డబ్బాలు కొడుతున్నారని.. మరోవైపు బాలికలపై అధికార పార్టీ నేతలు అత్యాచారాలు చేస్తున్నారని ఆరోపించారు. -
పోలీసు నియామకాల నిబంధనలను మార్చాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో ఉన్న నియమ నిబంధనలను మార్చాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. మూడు ఈవెంట్స్ తప్పనిసరి చేయడంపై పునరాలోచించాలని, ఎత్తును మాన్యువల్‌గా కొలవాలని, షాట్‌పుట్ లైన్ మీద పడినా క్యాలిఫై చేయాలని కోరారు. సోమవారం బీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఈసారి పరుగు పందెంలో పురుషులకు 1,600 మీటర్లు, అమ్మాయిలకు 800 మీటర్లు పెట్టడం నిరుద్యోగులను ఇబ్బందులకు గురిచేయడమనే అన్నారు. లాంగ్‌జంప్ 3.8 మీటర్లు పరిగణనలోకి తీసుకోవాలని, ఎత్తు కొలిచే సందర్భంలోనూ సాంకేతిక లోపంతో చాలా మంది అభ్యర్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎత్తును మ్యానువల్‌గా కొలవాలని కోరారు. చాలా గ్రామాల్లో సరైన గ్రౌండ్స్ లేవని, పీఈటీ కూడాలేని పరిస్థితుల్లో మూడు ఈవెంట్స్ తప్పనిసరి చేయడం సరికాదని, ఎక్కువ మంది హాజరు కాకూడదనే కుట్రపూరితంగా ఇలా చేస్తున్నారని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నికల సమయంలో ఉద్యోగాలంటూ అభ్యర్థులను ఆందోళనలకు గురి చేయడం ఏమిటని నిలదీశారు. నిబంధనలను మార్చకపోతే బీఎస్పీ నిరవధిక పోరాటం చేస్తుందని హెచ్చరించారు. -
రాష్ట్రంలో దౌర్జన్యకర పాలన
ధన్వాడ: రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు దౌర్జన్యం చేస్తూ ప్రజలను భయపెడుతూ పాలన సాగిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. శనివారం ధన్వాడ మండలంలోని గున్ముక్లలో ఆయన పర్యటించి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు కండువా కప్పి బీఎస్పీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి గల్లీలో బెల్ట్‌షాపులు పెట్టి కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను తాగుబోతులుగా చేసేందుకు యత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రులు ప్రజలను వైద్యం పేరుతో దోచుకుంటున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీని ఆదరించాలని, తాము అధికారంలోకి వస్తే భూమి లేని వారికి ఎకరాభూమి ఇస్తామని, బెల్ట్‌షాపులను పాలబూతులుగా మారుస్తామని, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూలు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాస్ కుటుంబీకులను ప్రవీణ్‌కుమార్ పరామర్శించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ డీఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మద్యంతో వచ్చే డబ్బులా? ప్రజల భవిష్యత్ ముఖ్యమా..
బాలానగర్: సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మద్యం ద్వారా వచ్చే రూ.35 వేల కోట్లు కావాలా.. 3.77 కోట్ల మంది ప్రజల బంగారు భవిష్యత్ కావాలా అని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఓ తండాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విద్యార్థిని కుటుంబాన్ని ప్రవీణ్‌కుమార్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మద్యం మత్తులోనే ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పారు. చక్కగా ఇంగ్లిష్ మాట్లాడే విద్యార్థులు తయారవుతున్న ఈ తరుణంలో గల్లీ గల్లీలో బెల్టు షాపులు ఏర్పడటంతో.. మద్యానికి అలవాటు పడిన యువకులు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎంతోమంది పిల్లల భవిష్యత్ నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మీకేమో లిక్కర్ స్కాములు.. మాకేమో మరణ శయ్యాలా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాలిక ఆత్మహత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కటుంబానికి న్యాయపరంగా అండగా ఉంటామన్నారు. ఆయన వెంట బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్ బాలవర్ధన్‌గౌడ్, మండల కోఆర్డినేటర్ యాదయ్య తదితరులుఉన్నారు. -
లిక్కర్ స్కాంపై పెదవి విప్పరెందుకు?
ఖమ్మం/మామిళ్లగూడెం: ప్రతి అంశంపై మీడియా సమావేశాలు పెట్టి గంటల తరబడి మాట్లాడే సీఎం కేసీఆర్.. లిక్కర్ స్కాంపై ఎందుకు పెదవి విప్పడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. తన కూతురు కవితను లిక్కర్ స్కాం నుంచి కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాంతాచారి వంటి ఎంతోమంది అమరులు సాధించిన తెలంగాణ నేడు స్కాంలకు నిలయంగా మారిందన్నారు. రాష్ట్రంలో మోసాలు, అవినీతి పెరిగిపోయాయని, సీబీఐ కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న కేసులకే అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అధికారులు, కవిత విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆధారాలు కూడా దొరకకుండా మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీజేపీకి చెందిన బీఎల్ సంతోష్ రూ.వందల కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తే ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు. ఆపరేషన్ ఆకర్‡్ష రాజ్యాంగ విరుద్ధమన్నారు. -
లిక్కర్ స్కాంలో ప్రభుత్వం
అలంపూర్/అలంపూర్ రూరల్: టీఆర్ఎస్ ప్రభుత్వం లిక్కర్ స్కాంలో మునిగిపోయిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. గురువారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో నిర్వహించిన బీఎస్పీ పాదయాత్ర ముగింపు సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకులు ఈ స్కాంలో రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన డబ్బును ఇతర దేశాలు, రాష్ట్రాల్లో లిక్కర్ ఇతర దందాల్లో పెట్టుబడులు పెట్టారని విమర్శించారు. ఇందులోని నిందితులు తమ సెల్ఫోన్లను సైతం పగలగొట్టారని, ఇలాంటి నీచమైన పనిని కరడు కట్టిన నేరస్తులు సైతం చేయరని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు దమ్ముంటే బీసీల కులగణన చేపట్టి, రిజర్వేషన్లు పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. -
ముందస్తు ఎన్నికలు ఖాయం: ఆర్.ఎస్.ప్రవీణ్
కామారెడ్డి టౌన్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. సీఎం కేసీఆర్ అకస్మాత్తుగా ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి జిల్లాల పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వెనక ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఉండి ఉండవచ్చన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్కు ఎలాంటి సిద్ధాంతం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఎజెండాతో ఏర్పాటైన పార్టీని దేశవ్యాప్తంగా ప్రజలు ఎలా ఆదరిస్తారని ప్రశ్నించారు. బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో పలువురు రైతులు, సైనికులకు ఆర్థిక సాయం చేసినంత మాత్రాన ప్రజలు ఆదరించరని తెలిపారు. కమ్యూనిస్టుల మద్దతు తీసుకుని, వందలమంది నాయకులను మోహరించి, రూ.500 కోట్లు ఖర్చు చేస్తేగానీ మునుగోడు ఉపఎన్నికలో గెలవలేదని ప్రవీణ్ ఎద్దేవాచేశారు. బీఎస్పీ కార్యకర్తలు గ్రామగ్రామాన నూతన కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. త్వరలో బహుజన రాజ్యాధికార యాత్ర కామారెడ్డి జిల్లాలో చేపడతామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్‌రాజు, జిల్లా ఇన్చార్జులు సురేశ్‌గౌడ్, సాయిలు, జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్, మహిళా కన్వీనర్ వసంత తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలి
నాంపల్లి: బీసీ రిజర్వేషన్లను యాభై శాతానికి పెంచాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఏసీగార్డ్స్ అడ్వకేట్స్ కాలనీలోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల పెంపు–బీఎస్పీ భవిష్యత్తు కార్యాచరణ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. జనాభా దామాషా పద్ధతిలో బీసీ రిజర్వేషన్లు 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, క్రీమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని కోరారు. కాలేల్కర్, మండల్ కమిషన్ల సిఫార్సులను అమలు చేయకుండా ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో కూడా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో దేశవ్యాప్తంగా బీసీల కోసం 8617 టీచింగ్ పోస్టుల భర్తీకి అనుమతి ఉన్నా ఉద్దేశపూర్వకంగా 4821 పోస్టులను ఖాళీగా ఉంచారని నిందించారు. దర్యాప్తులు, ఐటీ దాడుల పేరుతో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని దుయ్యబట్టారు. పథకం ప్రకారమే రెండు ప్రభుత్వాలు దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలివ్వకుండా ఫారెస్టు అధికారులను చంపుతున్నారని ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం నుంచి తమ పార్టీ కార్యాచరణ ప్రారంభం అవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయానంద రావు, రాష్ట్ర మైనార్టీ కన్వీనర్ అబ్రార్, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, అధికార ప్రతినిధులు సాంబశివగౌడ్, అరుణ, డాక్టర్ వెంకటేష్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో ఆరు నెలల్లో ఎన్నికలు ఖాయం
సిద్దిపేటజోన్: తెలంగాణలో ఆరు నెలల్లో ఎన్నికలు రావడం ఖాయమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తూ బుధవారం సిద్దిపేటలోని పార్టీ కార్యాలయంలో తన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఎస్పీ శ్రేణులకు కేవలం 180 రోజుల సమయం ఉందని, గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మరో 55 మంది కార్యకర్తలను తయారు చేయాలని, సామాజిక మాధ్యమాల్లో కాకుండా బహుజన కార్యకర్తలు గ్రామాల్లో ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకుగాను ‘మై బీఎస్పీ టాక్ ఇన్’అనే పోర్టల్ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. తనపై కేసులు పెట్టినా, బెదిరింపులకు పాల్పడినా భయపడేదిలేదన్నారు. ఇదీ చదవండి: డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లైన్ క్లియర్.. లబ్ధిదారుల ఎంపిక షురూ! -
బీజేపీ, టీఆర్ఎస్ రెండూ దొంగ పార్టీలే: ఆర్ఎస్పీ
కొల్లాపూర్ రూరల్: బీజేపీ, టీఆర్ఎస్ రెండూ దొంగ పార్టీలేనని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని కుడికిల్లలో ఇటీవల పోడు భూముల సమస్యలతో నార్లాపూర్, కుడికిల్ల గ్రామాల రైతుల ఘర్షణలో గాయపడిన దళిత రైతులను పరామర్శించారు. అనంతరం ప్రవీణ్ విలేకరులతో మాట్లాడుతూ అంగట్లో సరుకుల మాదిరిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రెండు పార్టీలు ముందుగా మాట్లాడుకునే ఈ తతంగాన్ని నడిపాయని ఆరోపించారు. కొనుగోలుకు గురైన ఎమ్మెల్యేలను దించి.. బీఎస్పీ పార్టీ వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
మునుగోడులో ఓటమి ఒప్పుకున్న టీఆర్ఎస్
మునుగోడు: ఎనిమిదేళ్లు గా ప్రజా సమస్యలు పట్టించుకోని సీఎం కేసీఆర్.. మునుగోడు ఉప ఎన్నికకు మంత్రులు, ఎమ్మెల్యేలను కలిపి.. మొత్తం 88 మందిని పంపడం ద్వారా పరో క్షంగా ఓటమిని అంగీకరించారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. గురువారం ప్రవీణ్‌కుమార్ మునుగోడు మండలం కొంపల్లి, చల్మెడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రోజు కూడా ఫామ్ హౌస్‌ని వదిలి బయటకురాని సీఎం.. నేడు కేవలం ఒక ఎంపీటీసీ పరిధిని ఎంచుకొని ప్రచారం చేయడం ఆయన అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు. వెల్మకన్నె గ్రామానికి ప్రచారానికి వెళ్లి మహిళలతో మాట్లాడారు. మాటల సందర్భంలో తాము ఎప్పుడూ ఏసీ కారులో తిరగలేదని ఆ మహిళలు చెప్పారు. దీంతో ప్రవీణ్‌కుమార్ వారిని కారులో ఎక్కించుకుని కాసేపు తిప్పారు. -
కూతురు కోసమే ఢిల్లీకి సీఎం కేసీఆర్
చండూరు : మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బంధువు అభిషేక్‌రావు అరెస్టయ్యారని, తర్వాత ఎమ్మెల్సీ కవిత అరెస్టవుతుందని తెలిసి..తన కూతుర్ని కాపాడుకోవడం కోసమే కేంద్రంలో మంతనాలు జరపడానికి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం పరిధిలోని చండూరు, తుమ్మలపల్లి, దోనిపాముల, కొండాపురం, నెర్మట గ్రామాలలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, ఒప్పందం ప్రకారం కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. స్కాంలు, కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయే నాయకులను, దోపిడీ పార్టీలను ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. ఉపఎన్నికల్లో గెలవడం కోసం ఆధిపత్య పార్టీలు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయన్నారు. ఈ ఉప ఎన్నిక కొండ చిలువకు, చలి చీమలకు మధ్య యుద్ధంగా అభివర్ణించారు. ఇప్పటికీ చండూరులో బుడగ జంగాలు, ఎరుకల కులాలు చెత్త ఏరుకుని బతుకుతున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్పీ పార్టీని ఆదరించి..ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు జగన్నాథ్‌గౌడ్, ప్రమీల, నిర్మల, సుజాత, గణేశ్, శివ పాల్గొన్నారు. -
దేశాన్ని దోచుకునేందుకే బీఆర్ఎస్
మునుగోడు: తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో దోచుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు దేశాన్ని కూడా దోచుకునేందుకు బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం కాన్షీరాం వర్థంతి సందర్భంగా నల్లగొండ జిల్లా మునుగోడులోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన ధూంధాం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు చేపడుతోందన్నారు. సీఎం కేసీఆర్ తనకు ఆదాయం వస్తే చాలు, ప్రజల ఆరోగ్యాలు తనకు అవసరం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నియంత పాలన, దేశంలో మతతత్వ పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్, బీజేపీలను మునుగోడు ఉపఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. బహుజనుల రాజ్యాధికారం సాధించేందుకు కాన్షీరాంను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కాన్షీరాం స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని మునుగోడు ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి అందోజు శంకరాచారిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ మునుగోడు అభ్యర్థి అందోజు శంకరాచారి తదితరులు పాల్గొన్నారు. -
మునుగోడు ఉప ఎన్నిక; బీఎస్పీ అభ్యర్థిగా యువ నాయకుడు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థిని బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఆందోజు శంకరాచారిని తమ పార్టీ తరపున పోటీకి నిలబెడుతన్నట్టు ఆయన వెల్లడించారు. శనివారం శంకరాచారికి పార్టీ తరపున బిఫాం అందించారు. ఉన్నత విలువలున్న యువనాయకుడు శంకరాచారిని గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. కలుద్దాం- నిలుద్దాం- గెలుద్దాం నినాదంతో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ నవంబర్ 3న జరగనుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా ప్రజాగాయకుడు గద్దర్‌ను ఖరారు చేశామని ఆ పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక మునుగోడులో విజయం కోసం రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ముఖ్య నేతలను రంగంలోకి దించాయి. మునుగోడులో విజయం ఎవరిని వరిస్తుందో నవంబర్ 6న వెల్లడవుతుంది. (క్లిక్ చేయండి: పదోసారి పోటీ.. మునుగోడులో విజయం నాదే) -
మునుగోడులో సారా, కూర, ఖారతో ప్రలోభాలు
మర్రిగూడ: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ సారా, కూర, ఖార ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని మర్రిగూడ, యరగండ్లపల్లి, తిరగండ్లపల్లి, లెంకలపల్లితోపాటు మరికొన్ని గ్రామాల్లో బహుజన రాజ్యాధికారయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. 70 రోజులుగా 23 వేల మంది వీఆర్ఏలు శాంతియుతంగా సమ్మె చేస్తుంటే లాఠీచార్జి చేయించి అణచివేసే ప్రయత్నం చేస్తూ.. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడడం అమానుషమన్నారు. కాగా, మర్రిగూడ మండలంలోని పీహెచ్‌సీని ప్రవీణ్‌కుమార్ సందర్శించారు. అదే సమయంలో నడవలేక ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధుని కుటుంబీకులు మోసుకెళ్తున్న దృశ్యం చూసి తాను కూడా చేయివేసి సాయం చేశారు. చదవండి: బీజేపీకి కొత్త పేరు చెప్పిన కేటీఆర్ -
దోచుకున్న సొమ్ముతో విమానాల కొనుగోలు: ఆర్ఎస్ ప్రవీణ్
మర్రిగూడ: ఎంతో మంది త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో నేడు కేసీఆర్ కుటుంబపాలన కొనసాగుతోందని, దోచుకున్న సొమ్ముతో విమానాలు కొంటున్నారంటే పాలన ఏవిధంగా ఉందో అర్ధమవుతుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఆయన శుక్రవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో బహుజన రాజ్యాధికార యాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. గ్రామాల్లో వన భోజనాలు, బతుకమ్మ చీరలతో మాయమాటలు చెబుతూ మత్తులో ముంచడం టీఆర్ఎస్ పార్టీకే చెల్లుతుందన్నారు. ఫార్మా కంపెనీలు, రీజినల్ రింగురోడ్ల పేర్లతో బడుగు, బలహీనవర్గాల భూములను లాక్కొంటున్నారని, అగ్రవర్ణాల వారి భూములను అలాగే ఉంచుతున్నారని ఆరోపించారు. చదవండి: సాగరహారంపై ‘పిట్ట పోరు’.. కేటీఆర్–రేవంత్‌ల మాటల యుద్ధం -
కేసీఆర్‌కు 300 ఎకరాలు ఎందుకు?
సంస్థాన్‌నారాయణపురం: ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 300 ఎకరాల భూమి ఉంది, పేదలకు మాత్రం ఎకరం భూమి లేదు, సరైన ఇళ్లు లేవు’ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం జనగాంలో గురువారం బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, రాజగో పాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి భూమి దున్నగలరా, విత్తనాలు వేయగలరా, కలుపు తీయగలరా? వారికి వందల ఎకరాల భూమి ఎందుకు’అని ప్రశ్నించారు. గిరిజనులు చదును చేసి సాగు చేసుకుంటున్న భూములను గుంజుకుంటున్నారని, పట్టాలివ్వకుండా అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బహుజన రాజ్యం వస్తే ప్రతి నిరుపేద కుటుంబానికి ఎకరం భూమితో పాటు పట్టాలు ఇస్తామని ప్రవీణ్‌కుమార్ హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగాలు ఇవ్వడం లేదని, నాయకులు మాత్రం విదేశాల్లో కూడా వ్యాపారం చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని దుయ్యబట్టారు. ఓట్ల సమయంలో పేదలకు డబ్బు, మద్యం పంచి ఎన్నికల అనంతరం అభివృద్ధికి దూరంగా ఉంచుతున్నారని విమర్శించారు. చదవండి: బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు.. సీఆర్పీఎఫ్ జవాన్ నిర్వాకం -
ప్రజలసొమ్ముతో టీఆర్ఎస్ నేతల దావత్‌లు
సంస్థాన్ నారాయణపురం: నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సంపాదించిన సొమ్ముతోనే మనకు దావతులు ఇస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం యాద్రాది భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని మల్లారెడ్డిగూడెం, గుజ్జ తదితర గ్రామాలలో ఆయన పర్యటించారు. పాదయాత్ర చేస్తూ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దావతులు, డబ్బు, చీరలు పంచడం తప్ప టీఆర్ఎస్కు అభివృద్ధి చేతకాదని విమర్శించారు. చదవండి: ప్రాజెక్టులకు సహకరించని రాష్ట్ర సర్కారు -
ఎనిమిదేళ్లలో రూ.5 లక్షల కోట్ల అప్పు
చౌటుప్పల్: కేసీఆర్ తన ఎనిమిదేళ్ల పాలనలో రూ.5 లక్షల కోట్ల అప్పు చేశారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. బీఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర ఆదివారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం, చౌటుప్పల్, తంగడపల్లి గ్రామాల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా చిరు వ్యాపారులు, వివిధ రంగాల కార్మికులతో ఆయన ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్గమధ్యంలో చాకలి ఐలమ్మ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సర్దార్ సర్వాయి పాపన్నల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి స్కీంలతో సీఎం కేసీఆర్ కోట్లు సంపాదించారని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చేవి స్కీంలు కాదని, అన్నీ స్కాంలేనని అన్నారు. స్కీంల ద్వారా పేదల పేరు చెప్పుకొని టీఆర్ఎస్ నాయకులు జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం నాసిరకం బతుకమ్మ చీరలు పంచుతూ మహిళలను అవమానపరుస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని గుజరాత్ షేఠ్లకు అమ్ముతోందని ధ్వజమెత్తారు. మునుగోడు ఎన్నికల కోసం కేంద్రహోంమంత్రి అమిత్ షా తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి రూ.150 కోట్లు ఇచ్చారని ఆయన ధ్వజమెత్తారు. -
ఉప ఎన్నిక కోసమే ‘గిరిజన బంధు’
చౌటుప్పల్ రూరల్: మునుగోడు ఉప ఎన్నిక కోసమే సీఎం కేసీఆర్ గిరిజన బంధు పథకాన్ని తెస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. గిరిజనులపై అంత ప్రేమ ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసీ బిడ్డ ముర్ముకు ఎందుకు ఓటేయలేదని, అగ్రవర్ణానికి చెందిన యశ్వంత్ సిన్హాకు ఎందుకు మద్దతిచ్చారని ఆయన ప్రశ్నించారు. ప్రవీణ్‌కుమార్ చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర గురవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాన్‌పేట, మల్కాపురం, ఖైతాపురం, ఎనగంటితండా, పీపల్‌పహాడ్, డి.నాగారం గ్రామాల్లో కొనసాగింది. -
‘పేదల ప్రాణాలతో ప్రభుత్వ చెలగాటం’
ఇబ్రహీంపట్నం: ప్రజల సొమ్ము దోచుకుంటూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు కోల్పోయిందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కు.ని. ఆపరేషన్లు వికటించి మృత్యువాత పడిన సీతారాంపేటకు చెందిన లావణ్య, లింగంపల్లికి చెందిన సుష్మ కుటుంబ సభ్యులను ఆదివారం సాయంత్రం అయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం డాక్‌బంగ్లాలో ఏర్పాటు చేసిన మిడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు వస్తే నలుగురి ప్రాణాలను తీశారని ఆరోపించారు. ఈ అంశంపై అసెంబ్లీలో ఒక్కముక్కా ప్రస్తావించకపోవడం సీఎం అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మంత్రులు, ముఖ్యమంత్రి రాకపోవడం సిగ్గుచేటన్నారు. ఇతర రాష్ట్రాలు తిరిగి రైతులకు డబ్బులు ఇచ్చేందుకు, డిల్లీకి వెళ్ళి రాజకీయాలు చేసేందుకు వీలవుతోంది కానీ... ఓట్లు వేసిన ప్రజలు పుట్టెడు శోకంలో ఉంటే వారిని పరామర్శించి, ఆదుకునేందుకు సమయం దొరకడంలేదా? అని ప్రశ్నించారు. విద్యార్థుల, పేద ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోన్న ఈ దోపిడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలకు 50 లక్షల ఎక్స్‌గ్రేషియాను చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, వారి పిల్లల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని, ఆపరేషన్లు చేసిన వైద్యులపై, పర్యవేక్షించని సిబ్బందిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. -
మునుగోడు బరిలో ఉంటాం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బిజినేపల్లి: త్వరలో జరగబోయే మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వెల్గొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. మునుగోడు ప్రజలు తమ పార్టీ అభ్యర్థిని ఆదరిస్తా రన్న నమ్మకం ఉందన్నారు. అనంతరం రాబోయే అసెంబ్లీ ఎన్ని కల్లో కూడా తాము పూర్తిస్థాయిలో అభ్యర్థులను నిలబెడతామని వెల్లడించారు. చదవండి: బీజేపీకి తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి: రేవంత్ -
మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. మునుగోడు ప్రజలు రాజగోపాల్‌రెడ్డికి బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అన్ని స్థానాల్లోనూ బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని, బీఎస్పీ గెలుపు చారిత్రక అవసరమన్నారు. సామాజిక న్యాయం అజెండాగా ఉప ఎన్నికల్లోకి వెళ్తామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. నాలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ప్రవీణ్ కుమార్ అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని సమస్యలను తప్పించుకోవడానికి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. చదవండి: కాంగ్రెస్ గూటికి చెరుకు సుధాకర్.. మునుగోడు ఉపఎన్నికలో సామాజిక అస్త్రంగా!