కాంగ్రెస్‌ గూటికి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సోదరుడు | RS Praveen Kumar Brother Prasanna Likely To Join Congress Soon | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గూటికి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సోదరుడు

Apr 10 2024 10:28 AM | Updated on Apr 10 2024 10:28 AM

RS Praveen Kumar Brother Prasanna Likely To Join Congress Soon - Sakshi

సొంత అన్న పైనే తిరుగుబాటు లేవనెత్తి.. తన రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలపడం సహించలేక.. 

హైదరాబాద్‌, సాక్షి: అలం‍పూర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు షాక్‌ తగలనుందని తెలుస్తోంది. మాజీ ఐపీఎస్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ సోదరుడు ఆర్‌ఎస్‌ ప్రసన్న కుమార్‌ హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రెండు..మూడ్రోజుల్లో సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. 

బీఎస్పీ అధ్యక్ష పదవి వదిలేసి బీఆర్‌ఎస్‌లో ప్రవీణ్‌కుమార్‌ చేరిన కొద్ది రోజులకే నియోజకవర్గాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సొంత అన్నపైనే ప్రసన్నకుమార్‌ తిరుగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. తాను రాజకీయ ప్రత్యర్థిగా భావించే చల్లా వెంకట్రామిరెడ్డితో ఆర్‌ఎస్పీ భేటీ కావడంపై ప్రసన్న కుమార్‌ అలక బూనారు. ఈ క్రమంలోనే సొంత అన్నతో రాజకీయంగా విబేధించాలని సిద్ధపడినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. 

ఇప్పటికే హస్తం నేతలతో సంప్రదింపులు జరిపిన ప్రసన్న కుమార్‌.. నేడో,రేపో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రసన్నకుమార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్‌ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement