brother
-
ప్రియురాలి మెడలో మూడు ముళ్లు.. ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి వేడుక (ఫోటోలు)
-
ప్రియాంక చోప్రా సోదరుడి హల్దీ వేడుక (ఫోటోలు)
-
కూటమి @ ఫ్యామిలీ ప్యాక్
కూటమి సర్కారు ఫ్యామిలీ సర్కస్ మాదిరి మారింది. సర్కారులో ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును సైతం కేబినెట్లోకి తీసుకుంటామని చంద్రబాబు చేసిన ప్రకటన రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారితీసింది. వాస్తవానికి పార్టీలో అత్యంత కీలకమైనవ్యక్తులకు నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనివాళ్లకు మాత్రమే ఇలా ఎమ్మెల్సీగా గెలిపించి మంత్రిగా చేస్తారు.. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా పొంగూరు నారాయణ, లోకేష్ వంటివాళ్లకు మంత్రిగా స్థానం కల్పించారు. మొన్నటికి మొన్న వైయస్ జగన్ కేబినెట్లోనూ ఓడిపోయినా మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడొచ్చిన చిక్కంతా కూటమిలో ఫ్యామిలీ ఫ్యాక్స్ ఎక్కవైనాయి అనేది చర్చకు వచ్చింది.కూటమి ధర్మం అంటూ చంద్రబాబు చేస్తున్న చేష్టలు దిగజారినట్లుగా ఉంటున్నాయని అంటున్నారు. వాస్తవానికి తాజాగా ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకు ఇస్తారని ఊహాగానాలు వచ్చాయి. పవన్ సైతం ఆ అంశాన్ని చర్చించేందుకు ఢిల్లీ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ మూడు సీట్లలో ఒకటి బిజెపి.. రెండు తెలుగుదేశం వాళ్ళు ఎగరేసుకుపోవడంతో నాగబాబుకు రాజ్యసభ ప్రాప్తం లేకుండా పోయింది. దీంతో ఆయన్ను సంతుష్టుణ్ణి చేసేందుకు కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.నామినేటెడ్ పదవుల విషయంలో కూడా మొదటినుంచీ కష్టపడినవాళ్లకు కాకుండా పైరవీకారులకు, డబ్బులు ఇచ్చేవాళ్లకే ప్రాధాన్యం దక్కిందన్న మూతి విరుపులు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. జనసేన పార్టీలో నాగబాబు పాత్ర, పార్టీ నిర్వహణ .. ఆర్థికవ్యవహారాలు వంటి అంశాల్లో అయన వ్యవహారశైలి మీద తీవ్ర విమర్శలు ఉన్నాయి. టిక్కెట్ల కోసం డబ్బులు కలెక్షన్ చేశారని. కార్యకర్తలను సాంతం వాడేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.అయినా సరే డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు కావడం.. పైగా ఎలాగైనా చట్టసభకు వెళ్లాలన్న కోరిక నాగబాబుతో ఉండడంతో ఆయన్ను ఈవిధంగా సంతృప్తి పరుస్తున్నట్లు టీడీపీ క్యాడర్ చెప్పుకుంటోంది. ఇప్పటికే టీడీపీలో సీనియర్లు అయిన యనమల రామకృషుడు,, కిమిడి కళావెంకట్రావు, పత్తిపాటి పుల్లారావు వంటివాళ్లకు మంత్రిపదవుల్లేక వట్టి ఎమ్మెల్యేలుగా జనాల్లోకి వెళ్లలేక అవమానభారం మోస్తుంటే ఇప్పుడు ఏమీలేని నాగబాబును ఎలా మంత్రిని చేస్తున్నారు అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికే చంద్రబాబు.. అయన కుమారుడు లోకేష్ అధికారంలో ఉన్నారు.. ఇక శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు. అయన అన్నకొడుకు రామ్మోహన్ నాయుడు (కేంద్ర మంత్రి)గా ఉన్నారు. అలవిమాలిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులూ ఇప్పుడు ఆహామీల సంగతిపక్కనబెట్టి అధికారాన్ని పంచుకోవడంలో బిజీ అయ్యారని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు.బాబు మాటలు.. నీటి మూటలునీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. అనడమే కాకుండా ప్రతి వ్యక్తికీ ఒక పథకాన్ని ప్రకటించారు. అవేం అమలుకాకపోగా గతంలో జగన్ ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేసారు . పైగా ఇప్పటికే 75 వేల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు రెండుసార్లు పెంచి జనం నడ్డివిరగ్గొట్టారు. ఆ వైఫల్యాలను జనం ప్రస్తావించకుండా ఉండేందుకు ఒక నెల తిరుమల లడ్డులో కొవ్వు అంటూ.. ఇంకో నెల సోషల్ మీడియా అరెష్టులు.. ఇంకోసారి ఇంకేదో అంశాన్ని తెరమీదకు తెచ్చి జనం దృష్టిని మళ్లిస్తూ వస్తున్నారు.ఇదీ చదవండి: డైలాగులకూ చేతలకూ పొంతనుండొద్దా?ఫ్రీ ఇసుక లేకపోగా దాని ధర ఆకాశాన్ని అంటింది. మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎక్కడ రూపాయి ఉంటె అక్కడికి వాలిపోతున్నారు. ఇక పవన్ సైతం పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఖజానా ఖాళీగా ఉంది.. ఏమి చేయలేకపోతున్నాం అని వగచారు. సంపద సృష్టిస్తాం అని చెప్పుకుని గెలిచాక ఈ చేతగాని ఏడుపులు ఎందుకు అంటూ ప్రజలనుంచి విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగానే నాగబాబుకు మంత్రిపదవి అంటూ చంద్రబాబు సరికొత్త కాన్సెప్ట్ ను బయటకు తీశారు. మొత్తానికి కూటమి సర్కారు జల్సా చేస్తోంది తప్ప ప్రజలకు చేస్తున్నదేం లేదని అంటున్నారు. నాగబాబు మంత్రి అయితే జబర్దస్త్ కామెడీ మొత్తం కేబినెట్లోనే ఉంటుందని అంటున్నారు-సిమ్మాదిరప్పన్న -
నేరుగా ఓటీటీలో రిలీజైన తెలుగు డబ్బింగ్ సినిమా
టాలీవుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్.. తమిళంలోనూ హీరోయిన్గా పలు సినిమాలు చేస్తోంది. అలా చేసిన లేటెస్ట్ మూవీ 'బ్రదర్'. జయం రవి హీరో. కొన్నిరోజుల క్రితం తమిళ వెర్షన్ ఓటీటీలో రిలీజ్ కాగా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ ఎలాంటి హడావుడి లేకుండానే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ 'బ్రదర్' సంగతేంటి? ఏ ఓటీటీలో ఉంది?అక్కా తమ్ముళ్ల ఫ్యామిలీ డ్రామా స్టోరీలతో ఇదివరకే చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి ఓ మూవీనే 'బ్రదర్'. రూ.30 కోట్ల బడ్జెట్ పెడితే.. రూ.5 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. కంటెంట్ మరీ రొటీన్‌గా ఉండటమే దీనికి కారణం. స్టార్ యాక్టర్స్ బోలెడంతమంది ఉన్నాసరే సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: రోహిణి ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించింది?)దీన్ని తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ తమిళ రిజల్ట్ చూసి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. జీ5లో ప్రస్తుతం తెలుగు, తమిళ వెర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీ డ్రామాస్ అంటే ఇష్టముంటే దీనిపై లుక్కేయొచ్చు.'బ్రదర్' విషయానికొస్తే.. అన్యాయాన్ని తట్టుకోలేని కార్తి (జయం రవి), తనతో పాటు కుటుంబాన్ని కూడా తలనొప్పిగా మారతాడు. న్యాయం కావాలని గొడవలు పడే ఇతడితో.. లా డిగ్రీ చేయిస్తే అయినా సరే బాగుపడతాడేమోనని తండ్రి భావిస్తాడు. కానీ అక్కడా నిరాశే. కనీసం అక్క ఆనంది(భూమిక) దగ్గరకు పంపిస్తే బాగుపడతాడేమోనని ఆశపడతారు. కానీ కార్తి వల్ల వాళ్ల కుటుంబం చిక్కుల్లో పడుతుంది. చివరకు వీటిని కార్తి ఎలా పరిష్కరించాడన్నది మిగతా కథ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య 'కంగువ') -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. రాబోయే గురువారం 'పుష్ప 2' రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈవారం పెద్ద సినిమాలేం రిలీజ్ కాలేదు. 'రోటి కపడా రొమాన్స్', 'ఉద్వేగం', 'ఝాన్సీ ఐపీఎస్' లాంటి తెలుగు మూవీస్ తోపాటు 'భైరతి రణగల్' చిత్రం థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇక ఓటీటీలోకి శుక్రవారం ఒక్కరోజే 28 మూవీస్-వెబ్ సిరీసులు వచ్చేశాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలో ఉందనేది చూద్దాం.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి మళ్లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ)ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన మూవీస్ జాబితా (నవంబర్ 29)అమెజాన్ ప్రైమ్బ్లడీ బెగ్గర్ - తమిళ సినిమాహార్డ్ నార్త్ - ఇంగ్లీష్ సిరీస్ఓషినోకో - జపనీస్ సిరీస్ద వైల్డ్ రోబో - ఇంగ్లీష్ మూవీద వరల్డ్ అకార్డింగ్ టూ కలిబ్ - ఇంగ్లీష్ సినిమాహార్ట్ బీట్స్ - హిందీ సిరీస్నెట్ఫ్లిక్స్ట్వాస్ ద టెక్స్ట్ బిఫోర్ క్రిస్మస్ - ఇంగ్లీష్ సినిమాఏ రాయల్ డేట్ ఫర్ క్రిస్మస్ - ఇంగ్లీష్ మూవీబ్రింగింగ్ క్రిస్మస్ హోమ్ - ఇంగ్లీష్ సినిమాక్రిస్మస్ ఆన్ విండ్ మిల్ వే - ఇంగ్లీష్ చిత్రంలవ్ నెవర్ లైస్: సౌతాఫ్రికా - ఇంగ్లీష్ సిరీస్పారిస్ క్రిస్మస్ వాల్ట్జ్ - ఇంగ్లీష్ మూవీసెన్నా - పోర్చుగీస్ సిరీస్సికందర్ కా మఖద్దర్ - తెలుగు డబ్బింగ్ సినిమాస్వింగ్ ఇన్ టూ రొమాన్స్ - ఇంగ్లీష్ మూవీద లేటర్ డేటర్స్ - ఇంగ్లీష్ సిరీస్ద స్నో సిస్టర్స్ - నార్వేజియన్ సినిమాద ట్రంక్ - కొరియన్ సిరీస్లక్కీ భాస్కర్ - తెలుగు మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)హాట్స్టార్బీటల్స్ 64 - ఇంగ్లీష్ సినిమాపారాచూట్ - తెలుగు డబ్బింగ్ సిరీస్ఆహాఇష్ష్ - తమిళ సిరీస్తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి - తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)జీ5బ్రదర్ - తమిళ మూవీడివోర్స్ కే లియే కుచ్ బీ కరేగా - హిందీ సిరీస్వికటకవి - తెలుగు సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)సోనీ లివ్డోప్ గర్ల్స్ - ఇంగ్లీష్ సిరీస్సన్ నెక్ట్స్కృష్ణం ప్రణయ సఖి - కన్నడ సినిమామనోరమ మ్యాక్స్హెర్ - మలయాళం సిరీస్బుక్ మై షోఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ - ఇంగ్లీష్ సినిమాజస్ట్ వన్ స్మాల్ ఫేవర్ - స్పానిష్ మూవీ(ఇదీ చదవండి: పుష్ప 2: ఐదు కట్స్ చెప్పిన సెన్సార్ బోర్డ్.. నిడివి ఎంతంటే?) -
మైకేల్ జాక్సన్ సోదరుడు టిటో జాక్సన్ కన్నుమూత
వాషింగ్టన్: పాప్ దిగ్గజం మైకేల్ జాక్సన్ సోదరుడు టిటో జాక్సన్ ఇక లేరు. ప్రఖ్యాత జాక్సన్5 పాప్ గ్రూప్ సభ్యుడైన 70 ఏళ్ల టిటో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి కారణం తెలియరాలేదు. మైకేల్‌తో పాటు ఇతర సోదరులు జాకీ, జర్మైన్, మార్లోన్లతో కలిసి జాక్సన్5 పేరిట టిటో పలు పాప్ ప్రదర్శనలిచ్చారు. జాక్సన్5 ఖాతాలో ఏబీసీ, ద లవ్ యూ సేవ్, ఐ వాంట్ యూ బ్యాక్ వంటి పలు హిట్లున్నాయి. 1964లో ఏర్పాటైన ఈ గ్రూపు ప్రేక్షకులను ఉర్రూతలూపింది. 1980లో ప్రతిష్టాత్మక హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ అందుకుంది. 1997లో రాక్ అండ్ రోల్ హాలాఫ్ ఫేమ్‌లో చోటుచేసుకుంది. గ్రూప్‌లో టిటో వయోలిన్ వాయించేవారు. ఆయన చివరిదాకా ప్రదర్శనలిస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 10న జర్మనీలో తుది ప్రదర్శన ఇచ్చారు. టిటో ముగ్గురు కుమారులు కూడా 3టీ గ్రూప్ పేరిట పాప్ సంగీతంలో ప్రసిద్ధులే. -
సీఎం సోదరుడు ఇంటికి హైడ్రా నోటీసులు
-
జాలి లేని దేవుడా... ఎంత పని జేత్తివిరా?
ఖమ్మంరూరల్: తల్లి గర్భం నుంచి సెకన్ల తేడాతో లోకంలోకి వచ్చిన వారిద్దరూ కలిసే పెరిగారు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఉద్యోగాలు సాధించి కూలీనాలి చేస్తూ తమను పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని భావించాలనే తపనతో కష్టపడుతున్నారు. ఇంతలోనే వీరిని మృత్యువు ఒకేసారి బలి తీసుకుంది. 22ఏళ్లుగా కలిసి పెరుగుతున్న సోదరులను కలిపే తీసుకెళ్లిన జాలి లేని మృత్యువును శాపనార్ధాలు పెడుతున్న వారి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాద ఘటన ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి సమీపాన మంగళవారం చోటు చేసుకుంది. నిరుపేద కుటుంబం...ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెంకు చెందిన అత్తులూరి నర్సింహారావు, రమాదేవి దంపతులు కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మహేష్, నవీన్(22) కవల కుమారులు ఉన్నా రు. సోదరులిద్దరు డిగ్రీ పూర్తిచేయగా గ్రూప్స్‌తో పాటు పోలీసు ఉద్యోగ నియామక పరీక్షలకు సిద్ధమవుతూ కొన్నాళ్లుగా ఖమ్మంలోని ఓ సెంటర్లో శిక్షణ పొందుతున్నారు. మంగళవారం ఉదయం తల్లి రోజులాగే కూలీ పనులకు వెళ్లగా తండ్రి ఇంకో గ్రామానికి వెళ్లాడు. దీంతో సాయంత్రం సోదరులిద్దరూ బైక్‌పై స్నేహితుడైన భద్రాద్రి జిల్లా సుజాతనగర్‌కు చెందిన పవన్‌తో కలిసి తమ అమ్మమ్మ ఊరైన కూసుమంచి మండలం పెరికసింగారం బయలుదేరారు. అక్కడ వీరి మేనమామ మెకానిక్ షెడ్ నిర్వహిస్తుండడంతో అప్పుడప్పుడు వెళ్లి కాసేపు గడిపి వచ్చేవారు. అలాగే, మంగళవారం కూడా వెళ్లిన సోదరులు గమ్యస్థానానికి చేరలేదు.ఆటో రూపంలో వచ్చిన మృత్యువుకవల సోదరులు మహేష్, నవీన్‌తో పాటు వారి స్నేహితుడు పవన్ బైక్‌పై పెరికసింగారం వెళ్తుండగా మార్గమధ్యలో మద్దులపల్లి వద్ద ఎదురుగా వచ్చిన ట్రాలీ ఆటో వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేష్, నవీన్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే, పవన్‌కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. కాగా, అమ్మమ్మ దగ్గరకు వెళ్తున్నామని చెప్పి బయలుదేరిన మహేష్, నవీన్ మృతి చెందారని తెలియడంతో స్వగ్రామమైన దానవాయిగూడెంతో పాటు అమ్మమ్మ ఊరైన పెరికసింగారంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. కలిసి జన్మించిన కుమారులు కలిసే పెరిగి కుటుంబానికి అండగా నిలుస్తారని భావిస్తున్న తరుణంలో ఒకేసారి కన్ను మూయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రెక్కల కష్టంతో కుమారులిద్దరిని చదివించామని, ఉద్యోగాలు సాధించేందుకు శిక్షణ పొందుతుండగా ఇలా జరిగిందని వారు రోదిస్తున్న తీరుతో అంతా కంటతడి పెట్టారు. ఈమేరకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా తల్లిదండ్రులు, బంధువులు రాత్రంతా రోదిస్తూ అక్కడే గడిపారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామారావు తెలిపారు. -
రక్షాబంధన్: అన్నకు ప్రాణం పోసిన చెల్లెలు
అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. చెల్లెలంటే ప్రాణమిచ్చే అన్న.. అన్నయ్యంటే ప్రాణం పెట్టే చెల్లెళ్లను మనం చూసే ఉంటాం. ఇటువంటి కథనాలను మనం వినే ఉంటాం. అయితే అంతకుమించిన అనుభంధం రాజస్థాన్‌లోని ఈ అన్నాచెల్లెళ్లది.రాజస్థాన్‌లోని రామ్‌గఢ్‌కు చెందిన ఒక సోదరి తన సోదరునికి కిడ్నీని దానం చేయడం ద్వారా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. వీరు ఆస్పత్రిలోనే రక్షాబంధన్ వేడుకను జరుపుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే ఉపాధ్యాయురాలు సునీతా బుడానియా తన కిడ్నీని తన సోదరుడు దేవేంద్ర బుడానియాకు దానం చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.2016లో దేవేంద్ర బుడానియా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపధ్యంలో అతని బంధువైన బీర్బల్ బుడానియా అతనికి కిడ్నీని దానం చేశారు. అయితే ఆ కిడ్నీ ఎనిమిదేళ్ల తర్వాత పనిచేయడం మానేసింది. దీంతో దేవేంద్రకు మరోమారు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో దేవేంద్ర సోదరి సునీత తన అన్నకు తన కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా సునీతతో మీడియాతో మాట్లాడుతూ వివాహం అయినంతమాత్రన ఆడపిల్లకు పుట్టింటితో సంబంధం ముగిసిపోదని, అది ఇంకా పెరుగుతుందని అన్నారు. ఆడపిల్లకు అటు పుట్టినిల్లు, ఇటు అత్తారిల్లు అనే విధంగా బాధ్యతలు పెరుగుతాయన్నారు. తాను తన సోదరునికి కిడ్నీని దానం చేయడాన్ని సంతోషంగా భావిస్తున్నానని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్న వీరిద్దరూ త్వరలోనే డిశ్చార్జి కానున్నారు. -
రాఖీ కడితే ఊరు వదలాల్సివస్తుందట!
దేశ వ్యాప్తంగా ఈరోజు (సోమవారం) రాఖీ వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామంలోని ప్రజలు రాఖీ పండుగ చేసుకోరు. దీని వెనుక వారు ఒక కారణాన్ని చూపుతుంటారు. రాఖీ చేసుకుంటే అన్నదమ్ములు ఊరు వదలాల్సి వస్తుందని వారు చెబుతుంటారు.యూపీలోని సంభాల్ జిల్లా బేనిపూర్ చక్ గ్రామంలో మచ్చుకైనా రాఖీ వేడుకలు కనిపించవు. రక్షాబంధన్ పేరు వినగానే ఇక్కడి ప్రజలు హడలిపోతుంటారు. రాఖీ నాడు తన సోదరి ఏదైనా బహుమతి అడిగితే, సర్వం కోల్పోయి, ఇంటిని విడిచి వెళ్లాల్సి వస్తుందని ఇక్కడి అన్నదమ్ములు భయపడుతుంటారు.గ్రామ పెద్దలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతంలో ఒకప్పుడు యాదవులు, ఠాకూర్ల ఆధిపత్యం ఉండేదట. నాడు ఇక్కడి జమిందారు ఠాకూర్ కుటుంబానికి చెందినవాడు. అయితే అతనికి మగ సంతానమే లేదట. దీంతో ఒకసారి రాఖీ పండుగనాడు యాదవుల ఇంటి ఆడపిల్ల ఆ ఠాకూర్‌కు రాఖీ కట్టి, అతని జమిందారీని కానుకగా అడిగిందట.ఈ నేపధ్యంలో నాడు యాదవులకు, ఠాకూర్లకు వివాదం జరిగిందని చెబుతారు. చివరికి ఆ ఠాకూర్ తన జమిందారీని యాదవులకు అప్పగించి, ఊరు విడిచి వెళ్లాల్సి వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. నాటి నుంచి ఈ గ్రామంలో ఎవరూ రాఖీ పండుగను చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అది ఈ నాటికీ గ్రామంలో కొనసాగుతోంది. -
అన్న, వదినను రోడ్డుపై కట్టేసిన తమ్ముడు
సిద్దిపేట కమాన్: అప్పు చెల్లించడం లేదని అన్నా, వదినలను.. ఓ ప్రబుద్ధుడు తన భార్య, కొడుకుతో కలిసి గ్రిల్స్‌కు కట్టేశాడు. సిద్దిపేటలో శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసుల కథనం ప్రకారం.. దొంతరబోయిన పర్శరాములు, తార దంపతులు ఏడో తరగతి చదివే తమ కుమార్తెతో సిద్దిపేట కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం ఇళ్లలో నివసిస్తున్నారు. పర్శరాములు భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. అవసరాల నిమిత్తం నాసర్పూరలో నివసిస్తున్న సొంత తమ్ముడు దొంతరబోయిన కనకయ్య వద్ద 8 నెలల క్రితం రూ.1.20 లక్షలు అప్పు తీసుకున్నాడు. నాలుగు నెలల క్రితం రూ.లక్ష తిరిగి చెల్లించాడు. ఈ క్రమంలో శుక్రవారం కౌన్సిలర్ కనకరాజు.. పర్శరాములుకు ఫోన్ చేసి డబ్బుల వివాదంపై మాట్లాడేందుకు తన ఇంటికి రమ్మన్నాడు. దీంతో పర్శరాములు తన భార్య తారతో కలిసి నాసర్‌పూరకు వచ్చారు. అన్నదమ్ముల మధ్య గొడవ జరగడంతో కనకరాజు ఆగ్రహం వ్యక్తం చేసి వారిద్దరిని బయటకు పంపించారు. బకాయి ఉన్న రూ.20వేలు, వడ్డీ డబ్బులు చెల్లించాలని తమ్ముడు కనకయ్య, అతడి భార్య భాగ్య, వీరి కుమారుడు భాను కలసి.. పర్శరాములు, అతని భార్య తారను కొట్టి నాసర్‌పూర హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు వద్ద ఉన్న గ్రిల్స్‌కు తాడుతో కట్టేశారు. స్థానికులు కలి్పంచుకుని వారిని విడిపించడంతో బాధితులు సిద్దిపేట వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తమ్ముడు మాట వినడం లేదని.. అన్న విషాదం!
ఆదిలాబాద్: మద్యానికి బానిసై తమ్ముడు ఏ పనిచేయడం లేదని, తన మాట వినడం లేదని మనస్తాపంతో అన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని మస్కాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై లింబాద్రి కథనం ప్రకారం.. పట్టణంలోని పద్మావతినగర్ కాలనీకి చెందిన లోనికి సత్తవ్వ, పెంటయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.పెద్ద కుమారుడు శివకుమార్(33) మలేషియా వెళ్లి మూడు నెలల క్రితమే ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో కుటుంబీకులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కాగా, తమ్ముడు రాకేశ్ ఇంటి వద్దే ఉంటూ జులాయిగా తిరుగుతున్నాడు. పలుమార్లు అతన్ని హెచ్చరించినా మార్పురాలేదు. దీంతో శివకుమార్ మనస్తాపం చెంది శనివారం రాత్రి మస్కాపూర్ శివారులోని ఓ వేప చెట్టుకు తాడుతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
అక్క రాఖీకి వస్తానంది: శ్రేయ సోదరుడు
ఢిల్లీలోని ఒక కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థుల మృతి చెందడం అందరినీ కలచివేసింది. మృతుల కుటుంబ సభ్యులు తమవారిని తలచుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఐఏఎస్ కావాలనే కలతో ఆ కోచింగ్ సెంటర్లో చేరిన శ్రేయ యాదవ్ కూడా ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోయింది.టీవీలో వస్తున్న వార్తలు చూశాకనే తమ శ్రేయ ఈ లోకంలో ఇక లేదని తెలిసిందని ఆమె కుటుంబ సభ్యులు రోదిస్తూ మీడియాకు తెలిపారు. మీడియాతో మాట్లాడిన శ్రేయ సోదరుడు.. అక్క రాబోయే రక్షాబంధన్‌కు వస్తానని హామీ ఇచ్చిందని చెబుతూ కంటనీరు పెట్టుకున్నాడు. ఇంటిలోని పెద్ద సంతానం మృతి చెందడంలో ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరికీ సాధ్యంకావడం లేదు.ఘజియాబాద్‌లో ఉంటున్న శ్రేయ మామ ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించిన వార్త టీవీలో చూడగానే శ్రేయకు ఫోన్ చేశాను. ఎటువంటి సమాధానం రాలేదు. వెంటనే కోచింగ్ ఇన్స్టిట్యూట్ సిబ్బందితో మాట్లాడటానికి ప్రయత్నం చేశాను. వారి నుంచి కూడా ఎటువంటి సమాధానం రాలేదు. చివరికి కోచింగ్ సెంటర్ దగ్గరకు వెళ్లగా, అక్కడి సిబ్బంది శ్రేయ మృతిచెందిందని చెప్పారుగానీ, ఆమె ముఖం చూపించలేదు. ఎందుకని అడిగితే ఇది పోలీసు కేసు అని చెప్పారని ధర్మేంద్ర తెలిపారు. -
18 ఏళ్ల తర్వాత తప్పిపోయిన సోదరుడిని కలిపిన ఇన్‌స్టా రీల్!
లక్నో: ఇంటి నుంచి తప్పిపోయిన పులువురిని సోషల్ మీడియా వాళ్ల కుటుంబాలకు చేరవేస్తోంది. తప్పినపోయిన వారు చేస్తున్న ఇస్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలు వైరల్‌గా మారటంతో వాళ్ల కుటుంబ సభ్యులు గుర్తిపట్టి మరీ అక్కున చేర్చుకుంటున్నారు. అయితే ఇలాంటి ఉద్విగ్నభరిత సీన్స్‌ను చాలా సినిమాల్లో చూశాం. కానీ, ఇప్పుడు అచ్చం ఇలాంటి ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది.చిన్నప్పుడు ఉద్యోగం కోసం ముంబై వెళ్లిపోయిన సోదరుడిని ఒక అక్క ఇన్స్టాగ్రామ్ రీల్లో చూశారు. ఆయనకు విరిగిన పన్ను ఉండటంతో తన సోదరుడేనని ఆమె గుర్తుపట్టారు. ఈ ఘటన ఆయన వెళ్లిపోయిన 18 ఏళ్ల తర్వాత జరగింది. ఇన్స్టాగ్రామ్ రీల్లో కనిపించటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని హతిపూర్‌కు చెందిన రాజ్‌కుమారి మొబైల్లో ఒక రీల్స్ చూస్తుండగా, అందులోని వ్యక్తిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. విరిగిన ఆయన పన్ను చూసి 18 ఏళ్ల కిందట ఇంట్లో నుంచి ముంబై వెళ్లిన తన సోదరుడు బాల్ గోవింద్‌లా ఉన్నాడని అనుమానించారు. వెంటనే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన్న సంప్రదించారు. అనంతరం చిన్నప్పడు తను సోదరుడితో గడిపిన విషయాలు ప్రస్తావించారు. పాత విషయాలకు ఆయన కూడా స్పందించడంతో.. తన సోదరుడేనని రాజ్ కుమారి నిర్ధారణ చేసుకున్నారు. దీంతో రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఉంటున్న ఆయన 18 ఏళ్ల తర్వాత అక్కను, బంధువులను కలుసుకున్నారు. తప్పిపోయిన తన సోదరుడిని సోషల్‌మీడియానే కలిపిందని రాజ్‌కుమారి ఆనందం వ్యక్తం చేశారు. -
హుషారుగా బ్రదర్ హుడ్ డే...
నగరానికి చెందిన ఫ్రీమేసన్స్ సంస్థ ఆధ్వర్యంలో యూనివర్సల్ బ్రదర్ హుడ్ డే ఆదివారం సందడిగా జరిగింది. ఇందులో భాగంగా మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా వాక్‌థాన్‌ను నిర్వహించారు. హానికారక డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని విన్నవిస్తూ నిర్వహించిన ఈ వాక్‌థాన్ అబిడ్స్ నుంచి మొజంజాహీ మార్కెట్ వరకూ కొనసాగింది. ఫ్రీమేసన్స్కు చెందిన సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
తమ్ముడి ‘నీట్’ రాసేందుకు ఎంబీబీఎస్ అన్న.. తరువాత?
దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ దేశవ్యాప్తంగా ఆదివారం జరిగింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో గల అంత్రి దేవి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన నీట్ కేంద్రంలో చీటింగ్ కేసు వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే జోధ్‌పూర్ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న భగీరథ్ రామ్ తన తమ్ముడి స్థానంలో నీట్ పరీక్ష రాయడానికి అంత్రి దేవి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలకు వచ్చాడు. అతనిని చూసిన ఎగ్జామినర్‌కు అనుమానం రావడంతో ఆరా తీశారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు భగీరథరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన తమ్ముడు గోపాల్ రామ్ స్థానంలో పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చానని తన తప్పును ఒప్పుకున్నాడు.నీట్ పరీక్ష నిర్వహణకు బార్మర్‌లోని ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరంలోని ఆంత్రి దేవి స్కూల్లో నకిలీ అభ్యర్థిని గుర్తించినట్టు తమకు సమాచారం అందిందని బార్మర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ జస్రామ్ బోస్ తెలిపారు. పోలీసులు పరీక్షా కేంద్రానికి చేరుకుని నకిలీ అభ్యర్థిని విచారించగా, నిందితుడు డమ్మీ అభ్యర్థి అని తేలింది. ఈ ఉదంతంలో పోలీసులు భగీరథ్ రామ్, అతని తమ్ముడు గోపాల్‌రామ్‌లను అరెస్ట్ చేశారు.భగీరథ రామ్ జోధ్‌పూర్ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థి. తమ్ముడిని డాక్టర్ని చేసేందుకు మున్నా భాయ్ తరహాలో నకిలీ అభ్యర్థిగా పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చాడు. అయితే ఇంతలోనే పోలీసులకు పట్టబడ్డాడు. ప్రస్తుతం పోలీసులు ఈ సోదరులిద్దరినీ విచారిస్తున్నారు. -
కాంగ్రెస్ గూటికి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సోదరుడు
హైదరాబాద్, సాక్షి: అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు షాక్ తగలనుందని తెలుస్తోంది. మాజీ ఐపీఎస్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోదరుడు ఆర్ఎస్ ప్రసన్న కుమార్ హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రెండు..మూడ్రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. బీఎస్పీ అధ్యక్ష పదవి వదిలేసి బీఆర్ఎస్లో ప్రవీణ్‌కుమార్ చేరిన కొద్ది రోజులకే నియోజకవర్గాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సొంత అన్నపైనే ప్రసన్నకుమార్ తిరుగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. తాను రాజకీయ ప్రత్యర్థిగా భావించే చల్లా వెంకట్రామిరెడ్డితో ఆర్ఎస్పీ భేటీ కావడంపై ప్రసన్న కుమార్ అలక బూనారు. ఈ క్రమంలోనే సొంత అన్నతో రాజకీయంగా విబేధించాలని సిద్ధపడినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే హస్తం నేతలతో సంప్రదింపులు జరిపిన ప్రసన్న కుమార్.. నేడో,రేపో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రసన్నకుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. -
స్టార్ హీరోయిన్ తమ్ముడి నిశ్చితార్థం..ఈమె మూడో అమ్మాయి (ఫొటోలు)
-
కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: భూ కబ్జా కేసులో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. ఆదిభట్ల పోలీసులు మంగళవారం కన్నారావును అరెస్ట్ చేశారు. మరోవైపు.. అదే సమయంలో కన్నారావు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు రిజెక్ట్ చేసింది. మన్నేగూడలో రెండు ఎకరాలను కబ్జా చేసేందుకు యత్నించారన్న కేసులో కన్నారావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో కన్నారావుతో పాటు మరో 38 మందిపై కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేయగా, మరో 28 మంది పరారీలో ఉన్నారు. అరెస్టైన వారిలో కన్నారావు ప్రధాన అనుచరుడు డానియల్ సైతం ఉన్నాడు. ఈ కేసులో కన్నారావు సింగపూర్ పారిపోయి ఉంటాడన్న అనుమానాల మధ్య లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు కూడా. ఈలోపు ముందస్తు బెయిల్ కోసం కన్నారావు హైకోర్టును ఆశ్రయించాడు. అయితే.. తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. అంతకు ముందు.. కేసు కొట్టివేయాలని కోరుతూ కన్నారావు వేసిన క్వాష్ పిటిషన్‌ను సైతం హైకోర్టు కొట్టివేసింది. ఇదిలా ఉంటే.. కన్నారావుపై 147,148,447,427,307,436,506,r/w149 IPC సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరికాసేపట్లో కన్నారావును పోలీసులు రిమాండ్ చేయనున్నారు. -
ఎమ్మెల్యే సోదరుడు మధు అరెస్టు
పటాన్ చెరు టౌన్, పటాన్చెరు: అక్రమ మైనింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోద రుడు గూడెం మధుసూదన్ రెడ్డిని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీసులు శుక్రవారం తెలవారుజా మున అరెస్టు చేశారు. పటాన్చెరు మండలం లక్డా రం గ్రామంలో మధుసూదన్ రెడ్డికి చెందిన సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్‌పై వచ్చిన ఆరోపణలపై సంగారెడ్డి ఆర్డీవో ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ తని ఖీలు చేపట్టి అక్రమాలు నిజమేనని తేల్చింది. దీంతో పటాన్చెరు తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేర కు పోలీసులు 379, 447, 427, 409, 420 ఐపీసీ సెక్షన్ 3 పీడీపీపీ యాక్ట్ సెక్షన్ 21, 23, 4 క్లాస్ (1),4 క్లాస్ (1)ఏ కేసు నమోదు చేసి శుక్రవారం తెల్లవారుజామున గూడెం మధును అరెస్టు చేశారు. రిమాండ్‌కు తరలించే ముందు ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు పటాన్‌చెరుకు కాకుండా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరచగా మూడో అదనపు మేజిస్ట్రేట్ 14 రోజులపాటు రిమాండ్ విధించారు. అనంతరం కందిలోని జిల్లా జైలుకు తరలించారు. మంత్రి దామోదర ఆదేశాలతోనే అక్రమ కేసులు: ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోదరుడుమధుసూదన్ రెడ్డి అరెస్టును మాజీమంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో చేరాలి.. లేకుంటే అక్రమ కేసులు నమోదు చేస్తాం’’ అన్న విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతోనే తమ పార్టీ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. బెదిరింపులకు భయపడం?: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తాను తప్పు చేస్తే మూడుసార్లు గెలిచేవాడిని కాదని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో పదేళ్లలో ఎవరి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. 2012–13లో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పూర్తి అనుమతితోనే క్వారీలను ప్రారంభించామని గుర్తు చేశారు. చట్టపరంగా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, బెదిరింపులకు భయపడబోమన్నారు. సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. -
‘సోదరుడిపై సీఎం మమత ఫైర్.. అన్ని బంధాలు తెంచుకున్నా’
కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకేసారి మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి దూసుకెళ్తున్నారు. అయితే అభ్యర్థుల ఎంపికపై సొంతపార్టీ నాయకులే ఆమెపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీఎం మమతా.. సోదరుడు బాబున్ బెనర్జీ కీలకమైన హౌరా లోక్‌సభకు ప్రకటించిన అభ్యర్థిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎంపీ ప్రసూన్ బెనర్జీకి సీఎం మమతా మరోసారి హౌరా స్థానం నుంచి అవకావం కల్పించారు. దీనిపై దీదీ సోదరుడు బాబున్ బెనర్జీ విమర్శించారు. ‘హౌరాకు ఎంపిక చేసిన అభ్యర్థి విషయంలో నేను సంతోషంగా లేను. ఆయన ఎంపిక సరైంది కాదు. అక్కడ చాలా సమర్థులైన నేతలు ఉన్నారు. వారందిరినీ కాదని ప్రసూన్ తిరిగి అభ్యర్థిగా ఎంపిక చేయటం సరికాదు’ అని బాబున్ అన్నారు. మరోవైపు బాబున్ బెనర్జీ బీజేపీలో చేరుతున్నారని ఊహాగానాలు వచ్చాయి. అయితే తాను ఏ పార్టీలో చేరనని.. మమాతా బెనర్జీతో ఉన్నానని, దీదీతోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తాను ఎంపిక చేసిన అభ్యర్థులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అడ్డం తిరుగుతున్న బాబున్ బెనర్జీపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘నేను, నా కుటుంబం.. బాబున్ బెనర్జీతో సంబంధాలను వదులుకున్నాం. ప్రతి ఎన్నికల ముందు బాబున్ ఏదో ఒక సమస్యను తెరపైకి తీసుకువస్తాడు. అత్యాశ గల వ్యక్తులను నేను ఇష్టపడను.. కుటుంబ రాజకీయాలను నేను ప్రోత్సహించను. అందుకే నేను హౌరా స్థానంలో ప్రసూన్‌కు టికెట్ కేటాయించా. సోదరుడు బాబున్తో అన్ని సంబంధాలు తెంచుకున్నా’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. బాబున్ బెనర్జీ ఎప్పుడూ తన సోదరి సీఎం మమత బెనర్జీని విభేదిస్తూనే ఉంటారని తెలుస్తోంది. ఇక.. కరోనా సమయంలో కూడా బాబున్ బెనర్జీ కోవిడ్ నింబంధనలు ఉల్లంఘించటంతో సీఎం మమతా ఆగ్రహానికి గురయ్యారు. చదవండి: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఢిల్లీలో మరో రెండు మెట్రో కారిడార్లు -
US: రెండేళ్ల తమ్ముడిని కాల్చి చంపిన మూడేళ్ల అన్న
ఒహియో: అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోని సిన్సినాటి నగరంలో దారుణ ఘటన జరిగింది. మూడేళ్ల అన్న రెండేళ్ల వయసున్న తన తమ్ముడిని తుపాకీతో కాల్చి చంపాడు. తర్వాత విచారణలో పోలీసులడిగితే టీవీలో స్పైడర్ మ్యాన్ ప్రోగ్రామ్ చూసి తండ్రి టేబుల్ డ్రాలో ఉన్న గన్ తీసి తమ్ముడిని కాల్చానని చెప్పాడు. ఈ సమాధానంతో విస్తుపోవడం పోలీసుల వంతైంది. అసలు సంఘటన వివరాల్లోకి వెళితే కెంటాన్ కౌంటీలో తల్లిదండ్రులకు చెందిన ఫుల్ లోడెడ్ గన్‌తో మూడేళ్ల బాలుడు తన తమ్ముడిని కాల్చి చంపాడు. దీంతో తీవ్ర గాయాలైన బాలుడి తమ్ముడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తల్లిదండ్రులు నిర్లకక్ష్యంగా ఫుల్ లోడెడ్ తుపాకీని పిల్లలకు అందుబాటులో ఉంచడం వల్లే ఈ దారుణ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. దీంతో బాలుడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఇళ్లలో ఉన్న తుపాకులపై తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరోసారి గుర్తు చేసిందని పోలీసులు అంటున్నారు. ఇదీచదవండి.. తగ్గిన భారత టూరిస్టులు.. పెరిగిన చైనా వాటా -
సోదరుడే కాలయముడై..
మైసూరు: ఇతర మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే కోపంతో చెల్లిని సొంత అన్న చెరువులోకి తోసేయగా.. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి కూడా జలసమాధి అయ్యింది. ఈ దారుణం మైసూరు జిల్లా హుణసూరు తాలూకా మరూరు గ్రామంలో జరిగింది. వివరాలు.. మరూరుకు చెందిన సతీశ్, అనిత(43) దంపతుల కుమారుడు నితిన్ కూలి పనులకు వెళ్తుండగా.. ధను శ్రీ(18) బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. ఈక్రమంలో మారూరుకు పొరుగున ఉన్న హనగోడు గ్రామానికి చెందిన ఇతర మతస్తుడైన యువకుడిని ధనుశ్రీ ప్రేమిస్తోంది. ఈ విషయం తెలిసిన నితిన్ తరుచూ ధనుశ్రీతో గొడవ పడేవాడు. మంగళవారం సాయంత్రం బంధువులకు బాగా లేదంటూ నితిన్ బైక్‌పై తన సోదరి ధనుశ్రీని, తల్లి అనితను బయటకు తీసుకెళ్లాడు. ఊరి బయట ఉన్న చెరువు వద్ద ధనుశ్రీ ప్రేమ విషయమై వారి మధ్య గొడవ జరిగింది. ఇంతలో పట్టరాని కోపంతో నితిన్ తన చెల్లి చేతులను టవల్‌తో కట్టేసి చెరువులోకి తోసేశాడు. ఆ వెంటనే కుమార్తెను కాపాడుకునేందుకు తల్లి అనిత కూడా చెరువులోకి దూకింది. దీంతో తల్లిని రక్షించేందుకు నితిన్ నీటిలోకి దూకాడు. కానీ తల్లీకూతురు నీళ్లలో మునిగి మరణించారు. ఆ తర్వాత నితిన్ ఇంటికి వచ్చి తండ్రి సతీశ్‌కు ఈ విషయం తెలియజేశాడు. బుధవారం ఉదయాన్నే గ్రామస్తులు, ఫైర్ సిబ్బంది చెరువులో గాలించి అనిత, ధనుశ్రీ మృతదేహాలను బయటకు తీశారు. హుణసూరు రూరల్ పోలీసులు నితిన్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
రోహిత్ శర్మ సొంత తమ్ముడి కవల పిల్లల బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
బీజేపీ ఎంపీ సొదరుడి అరెస్ట్.. కొత్త చిక్కుల్లో ప్రతాప్ సింహ!
బెంగళూరు: పార్లమెంట్ అలజడి విషయంలో వార్తల్లో నిలిచిన మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ సోదరుడు విక్రమ్ సింహను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. కోట్ల విలువ చేసే 126 చోట్లను నరికివేసినట్లు అభియోగాలు ఉన్న ఓ కేసులో అతన్ని కర్ణాటకలోని హసన్ జిల్లా అటవీశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెట్ల నరికివేత నేరానికి విక్రమ్ సింహ పాల్పడినట్లు అటవీ అధికారులు వద్ద ఆధారాలు ఉండటంతో అతన్ని పట్టుకోవడానికి ప్రత్నించారు. అయితే అప్పటికే విక్రమ్ సింహ పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు, అటవీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో విక్రమ్ సింహ పట్టుబడ్డారు. అటవీ శాఖ పోలీసులు విక్రమ్ సింహను హసన్ జిల్లా తీసుకువచ్చి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. మరోవైపు.. ఇప్పటికే పార్లమెంట్ అలజడి విషయంలో సతమతమవుతున్న బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహకు తన సోదరుడి అరెస్ట్.. మరో కొత్త చిక్కు తెచ్చిపెట్టినట్లు అయింది. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం నుంచి పార్లమెంట్ సందర్శన పాసులు పొందిన ఆగంతకులు పార్లమెంట్లో అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. కాగా.. పార్లమెంట్ భదత్ర వైఫల్యంపై ఎంపీ ప్రతాప్ సింహను సస్పెండ్ చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టారు. అదేవిధంగా ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని ఆందోళనకు దిగిన 146 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. చదవండి: మన్మోహన్ సింగ్‌పై పవార్ కీలక వ్యాఖ్యలు -
ఆ కొత్త సీఎంకు ఏటా 20 వేల రాఖీలు..
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రాష్ట్రంలోని మహిళల నుంచి ఎంతో ఆదరణ లభించింది. మహిళలకు సంక్షేమ పథకాలు అందించడంలో శివరాజ్ సింగ్ ముందున్నారనే వాదన వినిపిస్తుంటుంది. రాష్ట్ర ప్రజలు ఆయనను ముద్దుగా ‘మామ’ అని పిలుచుకుంటారు. శివరాజ్‌కు ఇంతటి ప్రజాదరణ ఉన్నప్పటికీ, భారతీయ జనతా పార్టీ అతని స్థానంలో మోహన్ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసింది. అయితే మోహన్ యాదవ్ కూడా రాష్ట్రంలోని మహిళల ఆదరణకు దక్కించుకున్నారు. గడచిన పదేళ్లుగా తన అసెంబ్లీ నియోజకవర్గంలోని 20 వేల మంది అక్కాచెల్లెళ్లు ఆయనకు రాఖీ కడుతున్నారు. మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. శివరాజ్ స్థానంలో మోహన్ యాదవ్ పేరును సీఎం పదవికి ప్రకటించడం వెనుక కారణాలపై చర్చ మొదలైంది. మహిళా ఓటర్లలో ఆయనకున్న ప్రజాదరణ కూడా ఇందుకు ఒక కారణమంటున్నారు. పదేళ్ల క్రితం మోహన్ యాదవ్ రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా ఉజ్జయినిలోని బాగ్పురా, గోపాల్పురా ప్రాంతాలకు చెందిన వెయ్యిమంది మహిళలు మోహన్ యాదవ్‌కు రాఖీ కట్టారు. ఆ సంఖ్య నేడు 20 వేలకు చేరుకుంది. రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లకు మోహన్ యాదవ్ కానుకలు ఇస్తుంటారు. మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ ఆనందీబెన్ కూడా మోహన్ యాదవ్‌కు రాఖీ కట్టారు. మోహన్ యాదవ్‌కు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఒక సోదరి పేరు గ్యారాసి బాయి, మరొక సోదరి పేరు కళావతి యాదవ్. అతనికి ఇద్దరు సోదరులు నంద్లాల్ యాదవ్, నారాయణ్ యాదవ్. మోహన్ యాదవ్ ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారు. కళావతి యాదవ్ రాజకీయాల్లో కూడా చురుకుగా ఉన్నారు ఉజ్జయినిలోని వివిధ ప్రాంతాల నుండి ఆరుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కళావతి యాదవ్ ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షురాలిగా ఉన్నారు. మోహన్ యాదవ్‌కు భార్య సీమా యాదవ్, కుమారులు అభిమన్యు యాదవ్,వైభవ్ యాదవ్, కుమార్తె ఆకాంక్ష యాదవ్ ఉన్నారు. ఇది కూడా చదవండి: 2001- 2023.. అదే డిసెంబరు 13.. పార్లమెంట్ దాడుల్లో తేడా ఏమిటి? -
Abhiram Wedding : టాలీవుడ్ హీరో రానా తమ్ముడి గ్రాండ్ వెడ్డింగ్ (ఫొటోలు)
-
Virat Kohli Brother Vikas Family: విరాట్ కోహ్లి సొంత అన్నా- వదిన.. ఫ్యామిలీని చూశారా?
-
Abhiram Daggubati Marriage: రానా తమ్ముడి అభిరామ్ పెళ్లి ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే?
-
కామారెడ్డిలో రేవంత్ రెడ్డి తమ్ముడు హల్ చల్
-
'బర్రెలక్క' తమ్ముడిపై దాడి..! ఓట్లు చీల్చుతుందనే భయంతోనే ఇలా..
సాక్షి, మహబూబ్‌నగర్: నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్కకు ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆమె తమ్ముడు భరత్‌పై పెద్దకొత్తపలి మండలం వెన్నచెర్లలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు తాను ఓట్లు చీల్చుతాననే భయంతో దాడులకు తెగబడుతున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరికాదని శిరీష వాపోయింది. ఆమె తమ్ముడిపై దాడిని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తప్పుబట్టారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా నిర్వహించాలని, పోటీలో ఉన్న వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందిస్తూ ఈ దాడి అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆమెకు, కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆయన డీజీపీ, ఎన్నికల ప్రధాన కార్యదర్శిని కోరారు. సీపీఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు, పలు ప్రజా సంఘాల నాయకులు దాడిని ఖండించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్‌రెడ్డి కూడా దాడి హేయనీయమన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించాలని, మహిళా అభ్యర్థిపై దాడికి ప్రయత్నించడం, ఆమె సోదరునిపై దాడికి పాల్పడడం దారుణమన్నారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదన్నారు. ఈ దాడి ఘటనపై కొల్లాపూర్‌లో సోషల్‌మీడియాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇవి చదవండి: 'యుద్ధానికి సిద్ధంగా ఉండాలి' : విజయశాంతి -
'ఎన్టీఆర్ సినిమాతో చంద్రమోహన్‌కు చేదు అనుభవం'.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ మరో సినీ దిగ్గజం, కళామతల్లి ముద్దుబిడ్డ చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విభిన్నమైన పాత్రలతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. 1966లో రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. (ఇది చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!) దాదాపుగా 55 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగారు. దశాబ్దాల పాటు కెరీర్ కొనసాగించిన చంద్రమోహన్ అప్పటి స్టార్ హీరోయిన్లందరితో సినిమాలు చేశారు. అనారోగ్యంతో కన్నుమూసిన గతంలో పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన శోభన్ బాబు, నాగేశ్వరరావు, రామారావుతో తన అనుభవాలను పంచుకున్నారు. రామారావు చిత్రం సందర్భంగా ఆయనకెదురైన ఓ చేదు అనుభవాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం. గత ఇంటర్వ్యూలో చంద్రమోహన్ మాట్లాడుతూ..'నాగేశ్వరరావు, నేను దాదాపు 40 సినిమాలు చేశాం. అయితే రామారావుతో నాకు ఎక్కువగా అవకాశాలు రాలేదు. కానీ ఓసారి ఎన్టీఆర్ సినిమా వల్ల చేదు అనుభవం ఎదుర్కొన్నా. అది ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేనిది. ఆ సమయంలో ఎన్టీఆర్‌కు తమ్ముడిగా మొదట నన్ను ఎంపిక చేశారు. కానీ ఏమైందో తెలియదు కానీ.. చివరికీ బాలయ్యను తీసుకున్నారు. ఆ క్షణం నేను చాలా బాధపడ్డా. కానీ.. ఆ తర్వాత అదే సినిమాను తమిళంలో రీమేక్ చేసినప్పుడు ఎంజీఆర్ తమ్ముడిగా చేసే అవకాశం నాకు లభించింది. ఎన్టీఆర్ సినిమా సెట్లో జరిగిన ఘటన వల్లే నాకు ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రం వల్లే నాకు తమిళంలో మంచి గుర్తింపు వచ్చింది.'అని అన్నారు. తన కెరీర్లో దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన చంద్రమోహన్.. చివరిసారిగా గోపిచంద్ నటించిన ఆక్సిజన్ చిత్రంలో కనిపించారు. కాగా.. అనారోగ్య కారణాలతో ఇవాళ మరణించారు. (ఇది చదవండి: రూ.100 కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్, చివరి దశలో సింపుల్‌గా..) -
కన్నీళ్లకే కన్నీళ్లొచ్చె: సోదరి మృతదేహాన్ని నడుముకు కట్టుకుని..
ఉత్తరప్రదేశ్‌లో హృదయాలను కలచివేసే ఉదంతం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఔరయ్య జిల్లాలో ఆరోగ్య సేవల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందనేది మరోమారు వెల్లడయ్యింది. నవీన్ బస్తీ వెస్ట్‌లో నివాసం ఉంటున్న ప్రబల్ ప్రతాప్ సింగ్ కుమార్తె అంజలి (20) పొరపాటున వేడి నీటితో నిండిన బకెట్‌లోని వాటర్ హీటర్‌ను ముట్టుకుని విద్యుదాఘానికి గురై, అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యులు అంజలి చనిపోయిందని నిర్ధారించారు. అంజలి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అందుబాటులో ఎలాంటి వాహనం లేదు. దీంతో మృతురాలి సోదరుడు సాహసం చేశాడు. ఆ మృతదేహాన్ని బైక్‌పై ఉంచి, దానిని చున్నీతో తన నడుముకు కట్టుకుని, వెనుకగా మరో సోదరిని కూర్చోబెట్టుకుని బైక్‌ను ఇంటివైపు నడిపాడు. ఇందుకు 15 నిముషాల సమయం పట్టింది. దీనిని గమనించి కూడా ఆసుపత్రి సిబ్బంది తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించారు. ఈ ఉదంతం గురించి సీహెచ్‌సీ సూపరింటెండెంట్ మాట్లాడుతూ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వాహనం కావాలని తమను అడిగితే, ఏర్పాటు చేసేవారమని తెలిపారు. కాగా జిల్లాలో రెండు అంబులెన్సులు మాత్రమే ఉన్నాయి. అవి ఔరయ్య ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునేందుకు రెండున్నర గంటలు పడుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: హిమాలయాలు క్యాన్సిల్.. ప్రచారం షురూ: ఉమాభారతి యూటర్న్! -
ప్రముఖ నటి ఇంట్లో తీవ్ర విషాదం..!
ప్రముఖ కోలీవుడ్ నటి ఇంట్లో విషాదం నెలకొంది. నటి బాబిలోనా సోదరుడు విఘ్నేష్ కుమార్ అలియాస్ విక్కీ ఇటీవల చెన్నైలోని తన నివాసంలో అనుమానాస్పద రితీలో మృతి చెందారు. విఘ్నేష్ వయస్సు 40 ఏళ్లు కాగా.. ప్రస్తుతం చెన్నైలోని సాలిగ్రామం దశరథపురం అపార్ట్మెంట్లో చాలా ఏళ్లుగా ఒంటరిగానే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన అతని స్నేహితుడు విరుగంబాక్కం పోలీసులకు సమాచారమిచ్చారు. అపార్ట్మెంట్లోని బెడ్రూమ్లో విగతజీవిగా పడి ఉన్న విఘ్నేశ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కిల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతని తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాబిలోనా సోదరుడిని కొద్ది రోజుల క్రితం చెన్నైలోని వలసరవాక్కంలో సాధారణ పెట్రోలింగ్‌లో పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. మద్యం మత్తులో గొడవ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. విఘ్నేష్‌కు క్రిమినల్ ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. గతంలోనూ అతను అనేక నేరాలకు పాల్పడినట్లు సమాచారం. కాగా.. నటి బాబిలోనా శాస్త్ర (2000), ఇష్క్ కా ఆచార్ (2004), లెవెల్ క్రాస్ (2002) వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో నిర్మలా ఆంటీ అనే చిత్రంలో కనిపించారు. అందాల ఆరబోతతో తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో సెక్సీ నటిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు కుటుంబానికి చెందిన ఆమె అసలు పేరు భాగ్యలక్ష్మి కాగా.. పారిశ్రామికవేత్త సుందర్ బాబుల్ రాజును 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. -
రూట్ మార్చిన స్టార్ హీరో.. అలాంటి మూవీలో
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న నటుడు జయం రవి. ఈయన నయనతారతో కలిసి నటించిన 'ఇరైవన్' చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. మరోపక్క 'సైరన్' మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్. తాజాగా జయం రవి 30వ సినిమా టైటిల్‌ని వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు. ఈ చిత్రానికి 'బ్రదర్' అనే టైటిల్ నిర్ణయించారు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఎం.రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. నటరాజన్, భూమిక, శరణ్య, గణేష్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హరీశ్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తున్న జయం రవి.. ఇప్పుడు రూట్ మార్తి కుటుంబ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నటిస్తున్నాడు. చైన్నె, హైదరాబాద్, ఊటీ, కొడైక్కెనాల్ ప్రాంతాల్లో షూటింగ్ చేస్తామని దర్శకుడు చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఒక్క ఫైట్ సీన్.. ఆ హీరో జీవితాన్నే ముగించింది!) Excited to be a '#Brother,' a word that connects us all ♥️ Releasing worldwide in Tamil & Telugu !!! #BrotherMovie #BrotherFirstLook Happy #VinayagarChathurthi @rajeshmdirector @jharrisjayaraj @screensceneoffl @priyankaamohan @bhumikachawlat @vivekcinema@saranyaponvanan… pic.twitter.com/YvUQMHMJLl — Jayam Ravi (@actor_jayamravi) September 18, 2023 -
మిస్టర్ ఇడియట్ వస్తున్నాడు
హీరో రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ఇడియట్’. సిమ్రాన్ శర్మ హీరోయిన్. గౌరీ రోణంకి దర్శకత్వంలో జేజేఆర్ రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శుక్రవారం మాధవ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘మిస్టర్ ఇడియట్’లోని మాధవ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శక–నిర్మాత కె. రాఘవేంద్రరావు విడుదల చేశారు. ‘‘మిస్టర్ ఇడియట్’ ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు గౌరీ రోణంకి. ‘‘నవంబరులో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత జేజేఆర్ రవిచంద్. -
అన్నపై ఒక్కసారిగా.. పదునైన ఆయుధంతో.. తమ్ముడి వీరంగం!
మహబూబ్‌నగర్: దామరగిద్ద పోలీస్‌స్టేషన్ పరిధిలో అన్నను చంపిన తమ్ముడిపై యావజ్జీవ కారాగార జైలు శిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ తీర్పునిచ్చారు. కేసు వివరాల్లోకి వెళితే.. 2021 ఏప్రిల్ 7న గుండు స్వామి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ గోవర్ధన్ నిందితుడు బ్యాగరి బుగ్గప్పపై కేసు నమోదు చేశారు. దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లికి చెందిన బ్యాగరి బుగ్గప్పకు తన అన్న హన్మంతుకు భూతగాదాలు ఉన్నాయి. ఈ విషయంలో గ్రామ పెద్దలు, కులస్తుల సమక్షంలో మాట్లాడిన బ్యాగరి బుగ్గప్ప రాజీకి వచ్చారు. అదే ఏడాది ఏప్రిల్ 6 బొంబాయి హన్మంతు అలియాస్ బ్యాగరి హన్మంతు (55) రాత్రి పొలం వద్ద వరి చేనుకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. గమనించిన బుగ్గప్ప వరి పొలం వద్ద వెళ్లి తన అన్నతో గొడవపడుతుండగా పక్క పొలంలో ఉన్న బ్యాగరి బాలప్ప గమనించి విడిపించేందుకు ప్రయత్నించాడు. అతనిని పక్కకు నెట్టి తన చేతిలో ఉన్న పదునైన ఆయుధంతో హన్మంతును పొడవగా స్పృహతప్పి పడిపోయినట్లు తెలిపారు. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందాడు. ఘటనపై అప్పటి సీఐ శ్రీకాంత్‌రెడ్డి నేర పరిశోధన చేసి నేరస్తునిపై కోర్టులో చార్జిషీట్ వేశారు. నేరము రుజువు కావడంతో జిల్లా జడ్జి నిందితుడికి శిక్ష ఖరారు చేశారు. -
అక్కకు 95, తమ్ముడికి 85
సుభాష్‌నగర్: సుదీర్ఘకాలంగా మంచానికే పరిమితమైన అక్కతో రాఖీ కట్టించుకొని ఆమె ముఖంలో ఆనందం నింపాడొక తమ్ముడు. సూరారం ప్రాంతానికి చెందిన అనసూయ (95) కొంత కాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. గురువారం రాఖీ పండుగ కావడంతో.. ఆమె సోదరుడైన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కోల ఈశ్వరయ్య (85) అక్క వద్దకు వచ్చి రాఖీ కట్టించుకున్నాడు. సోదరుడు రాఖీ కట్టించుకోవడానికి రావడంతో అనసూయ కన్నీటి పర్యంతమైంది. తమ్ముడికి మిఠాయి తినిపించి ఆశీర్వచనాలు అందజేసింది. -
రక్షా బంధన్ రోజున ఇలాంటి తీర్పు ఇస్తాననుకోలేదు
క్రైమ్: ‘‘ఆత్మీయ అనుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్. ఒక సోదరుడు తన సోదరిని తన చివరి శ్వాస వరకు కాపాడుకోవడానికి ప్రతిజ్ఞ చేసే పర్వదినం ఇది. అలాంటి పండుగనాడు ఇలాంటి తీర్పు ఇవ్వాల్సి రావడం దిగ్భ్రాంతికరం. కానీ, ఈ కేసులో నిందితుడు దుర్మార్గుడు. అందుకే ఇలాంటి శిక్ష విధిస్తున్నా’’ అంటూ జస్టిస్ ఎస్ సాహూ వ్యాఖ్యలు చేశారు. ఒడిశా హైకోర్టు బుధవారం సంచలన కేసులో.. అంతే సంచలన తీర్పు వెల్లడించింది. తన చెల్లిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డ మృగానికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష సరైందేనని తెలిపింది. ట్రయల్ కోర్టు విధించిన ఈ శిక్షను సమర్థిస్తూనే.. మరో రెండేళ్ల పాటు శిక్షను పొడిగిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు హైకోర్టు న్యాయమూర్తి సాహూ. మల్కన్‌గిరికి చెందిన నిందితుడు.. 2018-19 మధ్య తల్లిని చంపేస్తానని బెదిరించి సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల ఆ బాలిక గర్భం కూడా దాల్చింది. తల్లికి విషయం తెలిసి స్థానిక అధికారుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. కొడుకుపైనే న్యాయపోరాటానికి దిగింది. స్థానిక నేతల అండతో కేసు నుంచి తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు నిందితుడు. అయితే.. చివరకు న్యాయమే నెగ్గింది. ఈ కేసుకు సంబంధించి మల్కన్‌గిరి జిల్లా కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై నిందితుడు హైకోర్టుకు వెళ్లగా.. ఇలాంటి మృగానికి శిక్ష సరైందేనని జడ్జి చెబుతూ అదనంగా మరో రెండేళ్ల శిక్ష, రూ. 40 వేల జరిమానా విధించారు. -
రక్షాబంధన్ సాక్షిగా.. తమ్ముడి కోసం అక్క కిడ్నీ దానం..
రాయ్‌పూర్: అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తు చేస్తుంది రాఖీ పౌర్ణమి. సంతోషంగా జీవతాంతం కలిసి ఉండాలని కోరుకుంటూ అన్నదమ్ముల్లకు ఆడపిల్లలు రాఖీ కడుతారు. వారి రక్షణ ఎప్పుడూ తనకు ఉండాలని కోరుకుంటారు. పండగపూట సోదరి కళ్లలో ఆనందం చూడటానికి ఓ మంచి గిఫ్ట్‌తో అన్నాదమ్ముళ్లు సర్ప్రైజ్ చేస్తుంటారు. అయితే.. చత్తీస్‌గఢ్‌లో మాత్రం ఓ సోదరి తమ్ముడి మీద ప్రేమతో ఓ కిడ్నీనే దానంగా ఇస్తోంది. ఓం ప్రకాశ్(48), ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌వాసి. గత ఏడాది మే నెల నుంచే అతను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఓ కిడ్నీ 80 శాతం, మరో కిడ్నీ 90 శాతం వ్యాధి బారినపడ్డాయి. డయాలసిస్‌తో కాలం వెల్లదీస్తున్నాడు. అనేక ఆస్పత్రులకు తిరిగిన అనంతరం కిడ్నీ మార్పిడికి కుటుంబ సభ్యులు సిద్ధపడ్డారు. దీంతో కిడ్నీదాత కావాలని డాక్టర్లు చెప్పారు. దీంతో తమ్ముడి కోసం ఓం ప్రకాశ్ పెద్ద అక్క శీలాభాయ్ పాల్ ముందుకు వచ్చింది. రాయ్‌పూర్‌లోని టిక్రపారలో ఉంటున్న ఆమె తమ్ముడి సమస్య తెలిసి వెంటనే కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడింది. పరీక్షల అనంతరం ఆమె కిడ్నీ ఓం ప్రకాశ్‌కు సెట్ అవుతుందని డాక్టర్లు తెలిపారు. సెప్టెంబర్ 3వ తేదీన ఆపరేషన్ జరనుంది. తమ్ముడంటే ప్రేమ అని తెలిపిన శీలాభాయ్.. అతనితో కలిసి జీవితాంతం బతకాలని కోరుకుంటున్నానని చెప్పారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు ఇంకా మూడు రోజులు ఉండగా.. నేడు శీలాభాయ్ తన తమ్ముడు ఓం ప్రకాశ్‌కి రాఖీ కట్టింది. తన తమ్ముడు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించింది. ఇదీ చదవండి: Raksha Bandhan 2023 Special: ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు? ఆ టైంలోనే రాఖీ కట్టాలా! -
రాఖీ సంబురాల్లో కాబోయే మెగా కోడలు.. సోషల్ మీడియాలో వైరల్!
త్వరలోనే మెగా కోడలిగా అడుగుపెట్టబోతోన్న టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఇప్పటికే వరుణ్ తేజ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ముద్దుగుమ్మ ఈ ఏడాది చివర్లోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేదికతో పాటు పెళ్లి తేదీపై కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట తన రిలేషన్‌ను అఫీషియల్‌గా ప్రకటించి ఉంగరాలు కూడా మార్చుకున్నారు. (ఇది చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్' చిరంజీవి చేయాల్సింది.. కానీ! ) అయితే ప్రస్తుతం తన ఫ్యామిలీతో ఉన్న లావణ్య త్రిపాఠి తాజాగా రక్షాబంధన్ సందర్భంగా ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో అన్న, వదినతో కలిసి రక్షాబంధన్ వేడుక జరుపుకున్నారు. అన్నా, చెల్లెల్ల అనుబంధం ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడిచ్చిన వరలాంటిదని అన్నారు. ఇన్‌స్టాలో లావణ్య రాస్తూ..' అన్న, వదినకు రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు. మీపై ప్రేమ రోజు రోజుకు ఇంకా పెరుగుతూనే ఉంది.' అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు సైతం లావణ్యకు హ్యాపీ రాఖీ అంటూ అభినందనలు తెలుపుతున్నారు. (ఇది చదవండి: ఆనంద్ దేవరకొండ సినిమాకు హీరోయిన్గా ప్రగతి.. బేబీకి నో ఛాన్స్) View this post on Instagram A post shared by Lavanya tripathi (@itsmelavanya) -
గుండెపోటుతో అన్న మృతి.. కడసారి రాఖీ కట్టి..
సాక్షి, పెద్దపల్లి జిల్లా: సంతోషంగా అన్నకు రాఖీ కట్టడానికి వచ్చిన సోదరి షాక్‌కు గురైంది. కళ్ల ముందు అన్న విగతజీవిగా ఉండడాన్ని చూసి ఆమె గుండెలు అవిసెలా రోదించింది. అంత దుఖంలో అన్న మృతదేహానికి ఆమె రాఖీ కట్టి తన రక్తసంబంధాన్ని ప్రదర్శించింది. ఈ హృదయ విదారకమైన దృశ్యం చూసి గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్టలో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కనకయ్యకి.. రాఖీ పండగ సందర్బంగా రాఖీ కట్టడానికి ఆయన చెల్లెలు గౌరమ్మ ఇంటికి వచ్చింది. సంతోషంగా వచ్చిన ఆమెకు అన్న కనకయ్య గుండెపోటుతో మృతి చెందాడని తెలిసి సొమ్మసిల్లిపడిపోయింది. అన్న మృతిని తట్టుకోలేకోపోయిన గౌరమ్మ బోరున విలపించింది. పుట్టెడు దుఃఖంలోనూ కడసారిగా అన్న మృతదేహానికి చెల్లెలు గౌరమ్మ రాఖీ కట్టి సాగనంపింది. చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం -
‘అత్యంత క్రూరుడైన సోదరుడు!’.. బెంబెలెత్తిస్తున్న కుర్రాడి రాఖీ ఖర్చుల లిస్టు!
రక్షాబంధన్.. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు తమ ఆత్మీయతను వ్యక్తపరిచేరోజు. ఆ రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కడతారు. ఈ సందర్భంగా సోదరులు తమ సోదరీమణులకు జీవితాంతం రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు. అయితే సోదరులు ఈ వాగ్దానంతో పాటు తమ సోదరీమణులకు ఏదైనా కానుక ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ విషయంలో సోదరులు మల్లగుల్లాలు పడుతుంటారు. కాగా ఒక కుర్రాడు రాఖీ రోజున తనకు అయ్యే ఖర్చుకు సంబంధించి ఒక లిస్టు తయారు చేశాడు. దానిని సోషల్ మీడయాలో షేర్ చేయగా, అది వెంటనే వైరల్‌గా మారింది. అతను తనకు వరుసకు సోదరీమణులయ్యేవారికి రాఖీ రోజున ఎంత మొత్తంలో డబ్బులు ఇవ్వాలో ఆ పోస్టులో రాశాడు. పిన్ని కూతురికి 11 రూపాయలు. ఎదురింటిలోని చెల్లెలికి 10 రూపాయల డైరీ మిల్క్ చాక్లెట్ స్కూల్లోని చెల్లెలికి 21 రూపాయలు. ట్యూషన్లోని చెల్లెలికి 11 రూపాయలు. డైరీ మిల్క్ చాక్లెట్. ఇంకా ఎక్కువ మంది సోదరీమణులు వస్తే వారికి 5 రూపాయల పర్క్ చాక్లెట్ నా సొంత సోదరికి ఒక రూపాయికి లభించే 2 ఎక్లెయిర్స్ టోఫీలు ఈ కుర్రాడు రాఖీకి తనకు అయ్యే మొత్తం ఖర్చును 80 రూపాయలలో అడ్జెస్ట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. @indian.official.memes అనే పేజీలో దీనిని షేర్ చేశారు. దీనిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ షేర్ చేశారు. ఈ పోస్టును చూసిన యూజర్లు దీనిని లైక్ చేస్తున్నారు. వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకూ 2000 మందికి పైగా లైక్ చేశారు. ఒక యూజర్ ఇలా రాశాడు.. ‘ఈ కుర్రాడు తన సొంత సోదరికి కేవలం ఒక రూపాయి విలువ చేసే 2 చాక్లెట్లు మాత్రమే ఇస్తున్నాడు. ఎంత క్రూరమైన సోదరుడు’ అని రాయగా మరొక యూజర్ ‘వావ్ బ్రదర్, వాట్ యాన్ ఐడియా’ అని రాశాడు. ఇంకొక యూజర్ ‘ఇతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి’ అని రాశాడు. ఇది కూడా చదవండి: యాంకర్ సల్మా సుల్తానా హంతకుడెవరు? మూలన పడిన కేసు ఎలా బయటకు వచ్చింది? -
తల్లి చేతులు అణిచింది.. అన్న కాళ్లు నొక్కి పెట్టాడు.. తండ్రి చేతుల్లో పాశవిక పరువు హత్య!
ఆమె భర్త ఆ సమయంలో సోదరి ఇంటికి వెళ్లాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇంతలో ఆమె సోదరుడు, తల్లి, తండ్రి ఆమె ఇంటికి వచ్చారు. తల్లి ఆమె చేతులను గట్టిగా అదిమిపట్టుకుంది. సోదరుడు ఆమె కాళ్లను నొక్కిపెట్టాడు. తండ్రి ఆమె గొంతు నొక్కాడు. తరువాత ఆమె మృతదేహాన్ని కారులో ఉంచి, తమ గ్రామానికి తీసుకువెళ్లి, అక్కడున్న ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి, అక్కడ కుమార్తె మృతదేహాన్ని దహనం చేశారు. అయితే ఆమె భర్తకు ఈ విషయం తెలియదు. గ్రామంలోని అతని స్నేహితులు అతనికి ఫోన్ చేసి, నీ భార్య చనిపోయిందని, దహన సంస్కారాలు కూడా పూర్తయ్యాయని తెలిపారు. దీంతో అతను తన అత్తామామలపై అనుమానంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పరువు హత్యకు పాల్పడిన మృతురాలి తల్లిదండ్రులతో పాటు సోదరుడిని అరెస్టు చేశారు. కాగా నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. పండుగ పూట దారుణం ఈ ఘటన ఆగస్టు 17న ఉదయం 11 గంటలకు జరిగింది. అంజలి(22) అనే మహిళ హరియాణాలోని గురుగ్రామ్‌లోని సెక్టార్ 102లో గల రాఫ్ ఆల్యాస్లోని ఫ్లాట్ నంబరు 201లో భర్త సందీప్‌తో పాటు ఉంటోంది. అంజలి బీఎస్సీ పూర్తి చేసింది. ఆమె భర్త అతని సోదరి ఇంటికి తీజ్ ఉత్సవం సందర్భంగా మిఠాయిలు ఇచ్చేందుకు వెళ్లాడు. ఇంతలో అంజలి ఇంటికి ఆమె తండ్రి కుల్దీప్, తల్లి రింకీ, సోదరుడు కుణాల్ వచ్చారు. వారు ఒక్కసారిగా అంజలిపై దాడి చేశారు. తండ్రి ఆమె గొంతునొక్కి హత్య చేశాడు. తరువాత వారు అంజలి మృతదేహాన్ని తమ కారులో ఉంచి, తమ గ్రామమైన సురౌతికి చేరుకున్నారు. తరువాత ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో అంజలి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తొలుత గ్రామస్తులకు ఈ విషయం తెలియలేదు. తరువాత అసలు విషయం వెలుగు చూసింది. కుమార్తె బ్రాహ్మణ యువకుడిని వివాహం చేసుకున్నదని.. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అంజలి భర్తకు ఫోన్ చేసి విషయం తెలిపాడు. వెంటనే సందీప్ తన భార్య అంజలిని ఆమె తల్లిదండ్రులు, సోదరుడు హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసు గురించి పోలీసు ఉన్నతాధికారి వరుణ్ దహియా మాట్లాడుతూ ఇది పరువు హత్య అని తెలిపారు. అంజలి జాట్ కుటుంబానికి చెందినది, సందీప్ బ్రాహ్మణుడని, ఇద్దరూ ప్రేమించుకుని, 2022 డిసెంబరు 19న ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారని తెలిపారు. అయితే వారు తమకు పెద్దల నుంచి ముప్పు ఉందని గ్రహించి, అప్పటి నుంచి గురుగ్రామ్‌లో ఉండసాగారు. పథకం ప్రకారం పరువు హత్య అంజలి ప్రేమ వివాహం చేసుకోవడం ఆమె ఇంటిలోని వారికి ఏమాత్రం నచ్చలేదు. అందుకే వారు ఒక పథకం ప్రకారం అంజలిని హత్య చేశారని పోలీసు అధికారి వరుణ్ తెలిపారు. కాగా అంజలి సోదరుడు కుణాల్ కూడా ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతను తన సోదరిని హత్య చేసేందుకు ఒక పథకం ప్రకారం ఆమె భర్త సందీప్‌తో పరిచయం పెంచుకుని వారుంటున్న అపార్ట్మెంట్లోని మరో ఫ్లాట్‌లో కాపురం పెట్టాడు. ఆగస్టు 17న సందీప్ తీజ్ ఉత్సవం సందర్భంగా అతని సోదరి ఇంటికి వెళ్లాడు. ఈ విషయాన్ని కుణాల్ తన తల్లిదండ్రుకు తెలిపాడు. వెంటనే వారు అంజలి ఇంటికి చేరుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అంజలి తండ్రి ఒక ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేస్తుంటాడని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి వరుణ్ దహియా తెలిపారు. ఇది కూడా చదవండి: నాడు కుక్క మాంసంపై నిషేధం.. నేడు ఎత్తివేత.. మధ్యలో ఏం జరిగింది? -
ముస్లిం గాయకుడు భజన కీర్తన పాడాడని... ఇంతకన్నా ఘోరం ఎక్కడైనా ఉంటుందా?
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌నగర్‌కు చెందిన ఒక ముస్లిం గాయకుడు భజన కీర్తన పాడటం వివాదాస్పదంగా మారి, అతని తమ్ముని హత్యకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భజన పాట పాడటంపై తలెత్తిన వివాదంలో గాయకుని సోదరుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు. ఈ ఘటనలో మృతి చెందిన ఖుర్షీద్(17) గాయకుడు ఫర్మానీ నాజ్‌కు వరుసకు సోదరుడు అవుతాడు. ఈ ఘటన రతన్‌పురీ పరిధిలోని ముహమ్మద్‌పుర్ మాఫీ గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మహాశివుని కీర్తిస్తూ సాగే ‘హర హర శంభో’ అనే పాటను ముస్లిం గాయకుడు నాజ్ గత ఏడాది పాడాడు. ఈ నేపధ్యంలో దేవబంద్‌కు చెందిన ఒక ముస్లిం మతపెద్ద ఇది మత విశ్వాసాలకు విరుద్దమంటూ అతనిపై ఫర్మానా జారీ చేశారు. అయితే నాజ్ ముస్లిం మతపెద్ద తీర్మానాన్ని తప్పుబడుతూ కళాకారులకు ఎటువంటి మతం ఉండదని, తానేమీ తప్పు చేయలేదని పేర్కొన్నారు. నాజ్ గతంలో సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్-12లో కూడా పాల్గొన్నారు. నాజ్ నిర్వహిస్తున్న యూ ట్యూబ్ చానల్‌కు 4.5 మిలియన్లకు మించిన సబ్స్క్రైబర్లు ఉన్నారు. కాగా నాజ్ సోదరుడు ఖుర్షీద్ హత్య కేసులో పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురిని అద్నాన్, వాజిద్, జుబేర్‌లుగా పోలీసులు గుర్తించారు. వారంతా కూడా గాయకుడు నాజ్‌కు వరుసకు సోదరులే కావడం విశేషం. ప్రస్తుతం పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్య రామమందిరానికి 400 కేజీల తాళం -
గ్రాండ్‌గా బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్సే తమ్ముడి రిసెప్షన్ (ఫోటోలు)
-
'బేబీ' వైష్ణవి తమ్ముడు ఎలా ఉన్నాడో చూశారా? (ఫొటోలు)
-
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
విడాకులు తీసుకున్న నటి.. నేను సరైన పనే చేస్తున్నా
బాలీవుడ్లో బుల్లితెర నటి, యూట్యూబ్ వ్లాగర్‌గా చారు అసోపా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ సుష్మితా సేన్ బ్రదర్ అయిన రాజీవ్ సేన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. జూన్ 9, 2019న గోవాలో వీరి వివాహం ఘనంగా జరిగింది. 2021లో వారికి పాప జన్మించడంతో జియానా అని పేరుపెట్టుకున్నారు. వారి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో జూన్ 8న విడాకులు తీసుకున్నారు. తాజాగా తన మాజీ భర్త రాజీవ్ సేన్ గురించి తను మొదటి వీడియో షేర్ చేసింది. ఆమె యూట్యూబ్‌లోని తన వ్లాగ్‌లో విడాకుల కోసం కోర్టుకు వెళ్లే ముందు తన ఆలోచనలు ఎలా ఉన్నాయో పంచుకుంది. (ఇదీ చదవండి: వైరల్ అవుతున్న రకుల్ డ్రెస్.. అతను పట్టుకోవడంతో..!) ఆ వీడియోలో విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్న ప్పుడు తీసిన సన్నివేశాలను ఇలా పంచుకుంది. 'నేను కొంచెం ఆందోళనగా ఉన్నాను, నేను సరైన పని చేస్తున్నానని నాకు తెలుసు, కానీ ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ అదే ఆందోళనను అనుభవిస్తారని భావిస్తున్నాను. విడాకుల ద్వారా...రాజీవ్ ఎల్లప్పుడూ జియానా తండ్రిగా ఉంటాడు. అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు జియానాను కలుసుకోవచ్చు'. అని తెలిపింది. ఆమె వ్లాగ్పై పలువురు నెటిజన్లు మద్దతుగా నిలిచారు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదర్కొనేందుకు సిద్దంగా ఉండాలని వారు కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Charu Asopa (@asopacharu) (ఇదీ చదవండి: ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది: తమన్నా) -
మహారాష్ట్ర రాజకీయంలో కలకలం.. చంపేస్తామంటూ మరో నేతకు బెదిరింపులు..
మహారాష్ట్ర: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు బెదిరింపు కాల్స్ రావడం మహారాష్ట్ర రాజకీయంలో కలకలం రేపింది. అయితే.. తాజాగా శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్..తనకూ, తన సోదరుడు ఎమ్మెల్యే సునీల్ రౌత్‌కు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. చంపేస్తామంటూ దుండగులు బెదిరించినట్లు పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతిపక్షాలను భయాందోళనకు గురి చేసేందుకే దుండగులు ఈ చర్యకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కూడా ఇలాంటి బెదిరింపులను కోరుకుంటోందని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడబోనని గతంలోనూ ఇలాంటివే వచ్చాయని ఆయన అన్నారు. దీని వెనుక 40 మందితో కూడిన సూపర్ పవర్‌గా పిలిచే ఓ అదృశ్య శక్తి దాగి ఉందంటూ భాజపాపై పరోక్ష విమర్శలు చేశారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదీ చదవండి: గాడ్సే, ఆప్టే పుత్రులు ఎవరో?.. ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్.. -
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి.. (ఫొటోలు)
-
రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్‌బాస్ విన్నర్ నుంచి ఆర్ఆర్ఆర్ నాటునాటు సాంగ్‌తో స్టార్ అయిపోయాడు. హైదరాబాద్‌లోని బస్తీ నుంచి ప్రపంచం మెచ్చేస్థాయికి ఎదిగాడు. అంతలా పేరు సంపాదించుకున్నారు మన తెలుగు కుర్రాడు. సింగర్‌గానే కాకుండా పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. (ఇది చదవండి: కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటావ్? అని నా భార్య ప్రశ్నించింది: మనోజ్) తాజాగా రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి నెలకొంది. తన తమ్ముడు నిఖిల్ సిప్లిగంజ్ వివాహా వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ రాజకీయ నాయకులు, బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. రాహుల్ దగ్గరుండి తమ్ముడి పెళ్లి పనులు చూసుకున్నారు. తమ్ముడి పెళ్లిలో దిగిన ఫోటోలను రాహుల్ సిప్లిగంజ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇవీ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ పెళ్లికి తెలంగాణ మంత్రులు, భాజపా నాయకులు హాజరయ్యారు. (ఇది చదవండి: బస్తీ కుర్రోడి నుంచి ఆస్కార్ వరకు.. రాహుల్ కెరీర్ సాగిందిలా) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) -
చెరువు వైపు చూస్తూ మొరుగుతున్న కుక్క.. పరిశీలనగా చూసి నివ్వెరపోయిన జనం!
తమ పెంపుడు కుక్కకు చెరువులో స్నానం చేయించాలని ఆ అన్నాచెల్లెలు ఎంతో ముచ్చటపడ్డారు. అయితే అదే వారిపాలిట శాపంగా మారింది. స్థానికంగా ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని డోంబివలీ దావాడీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అన్నాచెల్లెళ్లు తమ పెంపుడు కుక్కను తీసుకుని చెరువుకు వెళ్లారు. అక్కడ దానికి స్నానం చేయించాలని అనుకున్నారు. అయితే ఊహించని విధంగా వారు లోతైన నీటిలో మునిగిపోయారు. ఈ పరిస్థితిని గమనించిన కుక్క పెద్దగా మొరగడం ప్రారంభించింది. అయితే దాని ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు. ఉమేష్‌నగర్‌కు చెందిన రంజిత్ రవీంద్రన్(22),కీర్తి రవీంద్రన్(16) కుటుంబంతో పాటు ఉంటున్నారు. రంజిత్ ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థి. కీర్తి ఈ ఏడాదే 12వ తరగతిలో చేరింది. వారి తల్లిదండ్రులు ఏదోపనిమీద తమ గ్రామానికి వెళ్లారు. దీంతో ఇంటిలో ఈ అన్నాచెల్లెళ్లలోపాటు వారి పెంపుడు కుక్క కూడా ఉంది. ఆదివారం ఈ అన్నాచెల్లెళ్లు స్కూటర్‌పై కుక్కను తీసుకుని గావ్‌దేవి చెరువు దగ్గరకు వెళ్లారు. అక్కడ ఆ కుక్కకు స్నానం చేయించాలనుకున్నారు. ఈ నేపధ్యంలో వారు చెరువులోకి దిగినవెంటనే మునిగిపోయారు. అయితే కుక్క ఈ ప్రమాదం నుంచి బయటపడింది. వారిద్దరూ చెరువులో మునిగిపోవడాన్ని చూసిన ఆ కుక్క పెద్దగా మొరగడం ప్రారంభించింది. కొద్దసేపటి తరువాత కుక్క అలా మొరుగుతుండటాన్ని గమనించిన గ్రామస్తులకు ఏదో అనుమానం కలిగింది. వారు సంఘటనా స్థలానికి వచ్చి.. ఆ అన్నా చెల్లెళ్లు మునిగిపోయి ఉండటాన్ని గమనించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో భారీ సంఖ్యలో గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువులో రెండు గంటలపాటు చేసిన ప్రయత్నాల అనంతరం ఆ అన్నాచెల్లెళ్ల మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. అనంతరం ఆ మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆ అన్నాచెల్లెళ్లు చదువు అంటే ఎంతో ఆసక్తి చూపేవారు. కీర్తి 10వ తరగతిలో 98శాతం మార్కులను సంపాదించింది. ఈ అన్నాచెల్లెళ్లద్దరూ ఆ కుక్కను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. -
దుమ్మురేపుతున్న సామ్ కర్రన్.. ఓరేంజ్ లోే తిడుతున్న ఫ్యాన్స్
-
ప్రముఖ నటి ఇంట్లో తీవ్ర విషాదం..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. శాండల్‌వుడ్ నటి అనితా భట్ సోదరుడు గుండెపోటుతో మరణించారు. దీంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇటీవల గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. సోదరుని మరణాన్ని తలుచుకుంటూ కన్నీటి పర్యంతమైంది. అనితా ట్వీట్లో రాస్తూ.. 'నిన్న నా గుండె ముక్కలైంది. కార్డియాక్ అరెస్ట్‌తో మా సోదరుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఈ బాధను మాటల్లో వర్ణించలేను. అతను తిరిగి రాలేడనే చేదు నిజాన్ని అంగీకరించక తప్పదు. దయచేసి అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. ఈ కష్ట సమయంలో మీ అందరి ఆశీస్సులు కావాలి.' అంటూ పోస్ట్ చేసింది. సోదరునితో చిన్నప్పుడు దిగిన ఫోటోను షేర్ చేస్తూ అనితా భావోద్వేగానికి లోనైంది. కాగా.. అనితా భట్ 2008లో సైకో అనే సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఆమె దశవాల, సిల్క్, సుగ్రీవ, పరపంచ, రాజ్ బహదూర్, టగరు, డేస్ బోరాపూర్, హోసా క్లైమాక్స్ లాంటి చిత్రాలలో నటించింది. A piece of my heart tore apart yesterday. My brother left us due to cardiac arrest. No words can explain the pain we are going through and the bitter truth we need to accept is he won't come back. Please bless him to get Sadgati. Need lots of yours blessing now 🙏🏻 pic.twitter.com/Ww9QOs1wog — Anita Bhat (@IamAnitaBhat) April 10, 2023 -
సోదరుడితో గొడవ, తెగని పంచాయితీ.. కోపంలో చైనా ఫోన్ మింగేసిన యువతి
భోపాల్: ఇంట్లో పిల్లలు అలగడం, కోపడడం మనం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో చిన్నారులు తొందర పడి ఏది పడితే అది చేస్తూ ఉంటారు. కొందరు తమను తామే గాయపరుచుకుంటే.. ఇంకొందరు ఇతరులకు గాయం చేస్తుంటారు. ఏదేమైనా ఆ తర్వాత పరిణామాలను మాత్రం వాళ్లు ఊహించరు. సరిగ్గా ఈ తరహా ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. సోదరుడిపై కోపంతో ఓ యువతి ఏకంగా ఫోన్ మొత్తాన్ని మింగేసింది. ఆ తర్వాత ఏమైందంటే? వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో 18 ఏళ్ల యువతి తన సోదరుడితో చైనా మొబైల్ ఫోన్ విషయంలో గొడవ మొదలైంది. వీరిద్దరి మధ్య మొదలైన ఈ సమస్యకు ఎంతసేపటికి పరిష్కారం లభించలేదు. దీంతో ఆ యువతికి పట్టారని కోపం వచ్చింది. ఆవేశంలో గొడవకు కారణమైన ఫోన్‌ను తీసుకుని ఆ యువతి ఆమాంతం మింగేసింది. కోపంతో సెల్‌ఫోన్ మింగిన వెంటనే ఆమెకు విపరీతమైన కడుపునొప్పి, నిరంతరం వాంతులు అవుతూ వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను గ్వాలియర్స్‌లోని జయరోగ్య ఆసుపత్రి (జేఏహెచ్)కి తీసుకెళ్లారు. వైద్యులు అల్ట్రాసౌండ్, ఇతర పరీక్షలు నిర్వహించి యువతి కడుపులో మొబైల్ ఫోన్ ఉందని తేల్చారు. ఆ తర్వాత వైద్యుల బృందం ఆపరేషన్ చేసి ఆమె కడుపులో ఉన్న మొబైల్ ఫోన్‌ను విజయవంతంగా బయటకు తీశారు. వైద్యులు దాదాపు రెండు గంటల పాటు ఎమర్జెన్సీ సర్జరీ చేసి యువతి కడుపులోంచి మొబైల్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని జయరోగ్య ఆసుపత్రి వైద్యులు తెలిపారు. -
Umesh Pal kidnapping case: గ్యాంగ్‌స్టర్ అతిక్‌ని దోషిగా తేల్చిన కోర్టు!
2006 ఉమేష్‌పాల్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్‌ను ప్రయాగ్‌రాజ్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. అతిక్‌తోపాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ కేసులో అతిక్ అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్ సహా మరో ఏడుగురిని నిర్ధోషులుగా ప్రకటించింది. 2006లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో కీలక సాక్షి ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో కీలక నిందితులుగా ఉన్న అతిక్, అతని సోదరుడిని నేడు ప్రయాగ్‌రాజ్ కోర్టు ముందు హజరు పరిచారు. కాగా యూపీ పోలీసు కస్టడీలో తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆరోపిస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిని అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది. ఇది ఈ కోర్టు జోక్యం చేసుకునే కేసు కాదని తేల్చి చెప్పింది. దీనికోసం కావాలంటే హైకోర్టుని ఆశ్రయించమని చెప్పింది. ఈ మేరకు అతిక్ అహ్మద్, అతని సోదరుడిని భారీ భద్రత మధ్య ప్రయాగ్‌రాజ్‌లోని నైని సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు యూపీ పోలీసులు. భారీ బందోబస్తు నడుమ అతిక్ అహ్మద్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని కోర్టుకు తరలించారు. ఇదిలా ఉండగా, 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు తానే సాక్షినని ఉమేష్‌పాల్ పోలీసులను ఆశ్రయించాడు. 2006లో ఉమేష్ పాల్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోమంటూ అతిక్ ఒత్తిడి చేశాడు. అందుకు నిరాకరించడంతో కిడ్నాప్ చేసేందుకు యత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఉమేష్. ఐతే అతను కిడ్నాప్ కేసు విచారణ రోజే పట్టపగలే అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. దీంతో ఈ కేసు విషయమై అతిక్ అహ్మద్, అతని సోదరుడి తోసహా మరో నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. (చదవండి: జైలు నుంచి రాను..ఆ శిక్ష ఏదో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విధించండి) -
రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
-
జల్సాల కోసం అక్క ఇంటికే కన్నం
అన్నమయ్య : జల్సాల కోసం అక్క ఇంటికే కన్నం వేసి దోచుకున్న వ్యక్తిని అరెస్ట్ చేసి, బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ కే.రామమోహన్ బుధవారం మీడియాకు తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు..బి.కొత్తకోట నగర పంచాయతీ తాకాటంవారిపల్లెకు చెందిన డి.ఓబులేసు (28) మద్యం, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఓబులేసుకు కూలీపనితో సంపాదించే డబ్బు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓబులేసు అక్క ఉత్తమ్మ తాకాటంవారిపల్లెలోని ఇంటిలో ఉంటోంది. ఆమెకు బి.కొత్తకోటలోనూ ఇల్లు ఉంది. గతనెల 11న తాకాటంవారిపల్లెలోని ఇంటికి తాళంవేసి బి.కొత్తకొటకు వచ్చింది, పది రోజుల తర్వా తిరిగి తాకాటంవారిపల్లెకు వెళ్లింది. తాళం తీసి లోపలికి వెళ్లింది. బీరువా పగులగొట్టి ఉండటం గమనించింది. వెంటనే బీరువాలో చూడగా గలు చోరీకి గురైనట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు చేధించేందుకు పోలీసులు బెంగళూరు, మైసూర్లో దర్యాప్తు చేశారు. పలువురి అదుపులోకి తీసుకుని విచారించారు. అయినా నిందితులు ఎవరో తేలకపోవడంతో స్థానికులపై అనుమానంతో నిఘా వేసి దర్పాప్తు ప్రారంభించడంతో బుధవారం నిందితుడు ఓబులేసు బత్తలాపురం క్రాస్ వద్ద ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. చోరీపై విచారించగా ఉత్తమ్మ ఇంటికి కన్నంవేసింది సొంత తమ్ముడు ఓబులేసు అని నిర్ధారణ అయింది. గతనెల 11వ తేది రాత్రి 11 గంటల సమయంలో అక్క ఉత్తమ్మ ఇంటి తాళాలు తీసి లోపలికి ప్రవేశించి బీరువాలోని నగలను చోరీ చేసినట్టు నిర్ధారించారు. నిందితుని నుంచి రూ.1.24 లక్షల విలువైన ఒక నక్లెస్, జత కమ్మలు, జత జాలర్లులను స్వాధీనం చేసుకుని నిందితున్ని అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుడిని మదనపల్లె కోర్టుకు తరలించినట్టు ఎస్ఐ చెప్పారు. -
ముఖంపై నీళ్లు పోసినందుకు ఏకంగా 30 ఏళ్లు జైలు శిక్ష!
కొన్ని దేశాల్లో చిన్న నేరాలకే పెద్ద పెద్ధ శిక్షలు విధిస్తారు. నేరాలు జరగకుండా ఉండేందుకు ఇలా చేస్తుంటారా? లేక మరేదైనా కారణమో తెలియదు. కానీ ఆ శిక్షలు చూస్తే మనకే చాలా సిల్లీగా అనిపిస్తుంది. నిందితుడు చేసింది నేరంగా పరిగణించేది కాకపోయినా..ఘోరమైన శిక్షలు విధిస్తుంటారు. అచ్చం అలానే 65 ఏళ్ల వృద్ధుడు దారుణమైన శిక్ష ఎదర్కొంటున్నాడు. అతడు చేసిన నేరం, పడిన శిక్ష! చూస్తే ఏంటిదీ?.. అనిపిస్తుంది. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాకు చెందిన 64 ఏళ్ల డేవిడ్ షెర్మాన్ పావెలన్స్ అనే వ్యక్తిని ఫ్లోరిడా పోలీసులు అరెస్టు చేశారు. పైగా అతడిపై ఘోరమైన ఆరోపణలు చేస్తూ.. సీరియస్ కేసుగా నమోదు చేశారు. ఇంతకీ అతడు చేసిన నేరం ఏంటంటే.. తన సోదరుడి ముఖంపై కూల్ వాటర్‌ని పోశాడు. రెండు గ్లాస్‌ల వాటర్‌ని అతని ముఖంపై పోసి తనని చనిపోయేలా భయబ్రాంతులకు గురి చేశాడంటూ అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐతే అందువల్ల అతనికి ఎలాంటి హాని గానీ, గాయాలు గానీ కాలేదు. షెర్మాన్ చర్యకు తాను చాలా భయపడిపోయానంటూ కేసు నమోదు చేయించాడు. ఆ వృద్ధుడిని ఈ విషయమై విచారించగా.. ఫ్రిజ్‌లో ' కీ లైం పై' అనే కేకులాంటి స్వీట్ తినేందుకు అలా చేశానని చెబుతున్నాడు. ఆ స్వీట్‌ని తన సోదరుడు చాలా రోజులుగా ఫ్రిజ్‌లో ఉంచాడని, తనకు తినాలనిపించడంతో సోదరుడికి తెలియకుండా తినేసినట్లు తెలిపాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ వచ్చిందని, తాను సోదరుడిని కూల్ చేసేందుకు చల్లటి వాటర్ అతడి నెత్తిమీద నుంచి పోసినట్లు తెలిపాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న షెర్మాన్ సోదరుడు అతడిని కటకటాల పాలు చేశాడు. అతను గనుక నేరం చేసినట్లు తేలితే గనుక అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష తోపాటు పెద్ద మొత్తంలో జరిమాన కూడా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధికారుల కూడా అతడి దూకుడు ప్రవర్తన ఇతరుల ప్రాణాలను ప్రమాదకరంగా ఉందంటూ త్రీవమైన కేసుగా పరిగణించి మరీ నమోదు చేయడం గమనార్హం. Florida Man Faces Up to 30 Years for Dumping Water on Older Brother in Argument Over Key Lime Pie https://t.co/jYkWyrPF71 pic.twitter.com/4P2FVbtQVC — Florida Man (@FloridaMan__) February 24, 2023 (చదవండి: ఐక్యత శక్తి ఏంటో చూపించిన గొంగళిపురుగులు..హర్ష గోయెంకా ట్వీట్) -
17 గంటలపాటు ఆ శిథిలాల కిందే.. తమ్ముడి కోసం ఆ చిన్నారి..
టర్కీలో ఘోరమైన భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భవనాలన్నీ పేకమేడల్లా కూలిపోయి శిథిలాల నగరంగా మారింది. ఎటు చూసినా మనసును కలిచి వేసే దృశ్యాలే. తల్లులను పోగొట్టుకున్న చిన్నారులు ఒకవైపు పిల్లలను పోగొట్టుకుని గర్భశోకంతో ఆక్రందనలు చేస్తున్న తల్లిదండ్రులు మరోవైపు. అక్కడి కన్నీటి రోదనలు ప్రకృతే విలపించేలా విషాదంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఒక వైరల్ ఫోటో అందరి హృదయాలను ద్రవింపచేసింది. ఆ ఫోటోలో ఇద్దరు చిన్నారులు శిథిలాల కింద తమను కాపాడే వారి కోసం బిక్కు బిక్కుమంటూ ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు ఉంది. అందులో ఆ చిన్నారి తన తమ్ముడి తలపై చేయి వేసి శిథిలాల కింద నలిగిపోకుండా కాపాడుతోంది. వాళ్లు అలా శిథిలాల కింద సుమారు 17 గంటల పాటు చిక్కుపోయినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఫోటోను ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మహ్మద్ సఫా ట్విట్టర్లో షేర్ చేశారు. ఆయన ట్విట్టర్లో.." ఆ ఏడేళ్ల బాలిక తమ్ముడిని రక్షించుకోవడానికి పడుతున్న తాపత్రయం మనసును పిండేస్తుంది. ఈ ఫోటోని ఎవరూ షేర్ చేయలేదు, ఆ చిన్నారి చనిపోక మునుపే షేర్ చేయండి. ఆ చిన్నారులు బతకాలని కోరుకుందాం. పాజిటివ్‌గా ఆలోచిద్దాం" అని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు తమ్ముడి మీద ఆ చిన్నారికి ఉన్న ప్రేమకు ఫిదా అవుతూ..ఏ అక్క చేయని సాహసం చేస్తోంది ఆ చిన్నారి. వారిద్దరూ బతకడమే గాక ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ..ట్వీట్లు చేశారు. The 7 year old girl who kept her hand on her little brother's head to protect him while they were under the rubble for 17 hours has made it safely. I see no one sharing. If she were dead, everyone would share! Share positivity... pic.twitter.com/J2sU5A5uvO — Mohamad Safa (@mhdksafa) February 7, 2023 (చదవండి: ఆ విమానం కూలి మంటల్లో చిక్కుకుంది..కానీ ఆ ఇద్దరు పైలట్లు..) -
'రేసుగుర్రం' విలన్ రవికిషన్ ఇంట విషాదం
ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రామ్ కిషన్ శుక్లా గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా రవికిషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఆయన కన్నుమూసినట్లు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. కాగా రామ్ కిషన్ శుక్లా ముంబైలో ఉంటూ ప్రొడక్షన్ పనులు చూసుకుంటేవారు. నిన్న(ఆదివారం)రామ్ కిషన్ శుక్లా తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆసుపత్రిలో చేర్చించారు. చికిత్స పొందుతూనే ఆయన కన్నుమూశారు. ఇదిలా ఉంటే రవికిషన్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన రేసుగుర్రం చిత్రంలో ‘మద్దాలి శివారెడ్డి’పాత్రతో తెలుగు వారికి దగ్గరైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. दुःखद …मेरे बड़े भाई श्री रामकिशन शुक्ला जी का अचानक ह्रदय गति रुकने के कारण मुंबई के नानावटी अस्पताल में दोपहर 12 बजे निधन हो गया है । महादेव से प्रार्थना है की अपने श्री चरणों में स्थान दे ओम् शान्ति शान्ति शान्ति 🙏 pic.twitter.com/TViOuakWcl — Ravi Kishan (@ravikishann) February 5, 2023 -
పూజా హెగ్డే ఇంట పెళ్లి సందడి.. ఫొటోలు షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’
‘బుట్ట బొమ్మ’ పూజా హెగ్డే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ‘ఒకలైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ అనంతరం ముంకుందా, డీజే, మహర్షి, అరవింద సమేత, అలా వైకుంఠపురంలో చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ఇదే క్రమంలో ఆమెకు బాలీవుడ్ ఆఫర్స్ సైతం క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో పలు చిత్రాలు చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా పూజ హెగ్డే ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆమె సోదరుడు రిషబ్ హెగ్డే వివాహం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభంగా జరిగింది. శివానీ శెట్టి అనే యువతితో అతడి పెళ్లి జరిగింది. ఈ పెళ్లిలో పూజా సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోయింది. ఈ వేడుకలో పూజా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను పూజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘మా అన్నయ్య ఓ ఇంటివాడు అయ్యాడు. తన ప్రేమను కలుసుకున్నాడు. ఈ వారం అంతా చాలా ఉరుకులు పరుగులుగా గడిచింది. మా ఇంట పెళ్లి సందడి మొదలైనప్పటి నుంచి నేను చిన్న పిల్లలా నవ్వుతూ.. ఆనందంతో కన్నీళ్లు పెట్టాకుంటూనే ఉన్నాను’ అంటూ బుట్ట బొమ్మ ఎమోషనల్ అయ్యింది. ఈ సందర్భంగా తన జీవితంలో మరో ఫేజ్‌కు వెళ్లిన తన అన్నయ్య పూజా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) చదవండి: తారకరత్న గురించి గుడ్‌న్యూస్ చెప్పిన మంచు మనోజ్ నయనతార భర్త విగ్నేశ్ శివన్‌కు షాక్ ఇచ్చిన స్టార్ హీరో -
సోదరుడి వివాహవేడుకలో పూజా హెగ్డే అల్లరి.. ఫొటోలు వైరల్
-
Kushboo: సీనియర్ నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం..
సీనియర్ నటి ఖుష్బూ సుందర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె సోదరుడు అబ్దుల్లా ఖాన్ కన్నుమూశారు. ఈ విషయంపై ఖుష్బూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్చేసింది. 'మనకు ఇష్టమైన వాళ్లు ఎప్పుడూ మనతోనే ఉండాలని కోరుకున్నప్పటికీ వోడ్కోలు చెప్పే సమయం స్తుంది. ఈరోజుతో మా అన్నయ్య ప్రయాణం ముగిసింది. ఆయన ప్రేమ,గైడెన్స్ ఎప్పుడూ ఉంటుంది. అన్నయ్య కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.అన్నయ్య చెప్పినట్లుగా.. జీవిత ప్రయాణాన్ని దేవుడే నిర్ణయిస్తాడు. అన్నయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా' అంటూ ఖుష్బూ భావోద్వేగానికి లోనైంది. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖుష్బూ సోదరుడు అబ్దుల్లా ఖాన్ నేడు(శనివారం)తుదిశ్వాస విడిచారు. ఈయన కూడా కొన్ని సినిమాల్లో నటించారు. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
Viral Video: అన్న, చెల్లెల బాండింగ్ చూస్తే ముచ్చటేస్తుంది ..!
-
‘సారీ.. అన్నయ్య మిస్ యూ’.. అంటూ మెసెజ్ పెట్టి..
సాక్షి, సిరిసిల్ల: ‘సారీ అన్నయ్య.. మిస్ యూ’ అంటూ మెసేజ్ చేసి తంగళ్లపల్లి మండలం చింతలఠాణాకు చెందిన గొడుగు దినేశ్(21) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన గొడుగు అంజయ్య భార్య 15 ఏళ్ల క్రితం చనిపోగా ముగ్గురు కొడుకులు వెంకటేశ్, గణేశ్, దినేశ్‌లను పెంచి పెద్ద చేశాడు. పెద్దకొడుకు వెంకటేశ్ వివాహం కాగా.. చిన్న కొడుకు దినేశ్‌కు మేనమామ కూతురితో పెళ్లి చేయాలనుకున్నారు. ఆ అమ్మాయిని దినేశ్ నిరాకరించారు. దీంతో దినేశ్, గణేశ్‌లకు ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేయాలని తండ్రి అంజయ్య సంబంధాలు చూస్తున్నాడు. మేనమామ కూతురికి శనివారం మరో అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. తాను నిరాకరించిన అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరడం.. తనకు దొరక్కపోవడంతో మనస్థాపానికి గురైన దినేశ్ శనివారం మధ్యాహ్నం మేకలు కాసేందుకు గ్రామ శివారులోని కొడిషల్‌గుట్టకు వెళ్లాడు. అక్కడి నుంచి తన పెద్దన్న వెంకటేశ్‌కు ఫోన్‌చేసి తనకు బతకాలని లేదని చెప్పి కాల్ కట్ చేశాడు. వెంకటేశ్ తన తండ్రి అంజయ్యకు సమాచారం ఇవ్వగా శనివారం నుంచి దినేశ్ కోసం గాలించారు. ఆదివారం తెల్లవారుజామున కొడిషల్‌గుట్ట ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. మృతుని తండ్రి అంజయ్య ఫిర్యాదుతో తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ రిలేషన్‌ని వద్దన్నారని...ప్రియురాలి సోదరుడు, తండ్రిపై దాడి
ఒక వ్యక్తి తమ సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నారని ప్రియురాలి తండ్రి సోదరుడుపై పదునైనా ఆయుధంతో దాడి చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని రంసోల్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...సమల్ అనే వ్యక్తి కాలియాపాణిలోని మార్కెట్ వద్ద ఉన్న ప్రియురాలి సోదరుడు జితేంద్ర వద్దకు వచ్చి పదునైనా ఆయుధంతో దాడి చేశాడు. దీంతో అతని కేకలు విన్న అతని తండ్రి సంతోష్ జితేంద్రను రక్షించడానికి అడ్డుగా వచ్చాడు. దీంతో సమల్ అతడి తండ్రి సంతోష్‌పై కూడా కత్తితో దాడి చేశాడు. దీంతో ఈ ఘటనలో తండ్రి కొడుకులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు బీరెస్ సమల్ అలియాస్ సంతను బాధితుడు జితేంద్ర సోదరితో సంబంధం పెట్టుకున్నాడు. ఐతే సమల్ వివాహితుడు కావడంతో జితేంద్ర, అతని తండ్రి వారి సంబంధాన్ని వ్యతిరేకించారు. దీంతో కోపం పెంచుకున్న సమల్ వారిపై అతి కిరాతకంగా దాడి చేశాడు. దీంతో స్థానికులు సమల్‌ను పారిపోకుండా అడ్డుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని బాధితులను ఆస్పత్రులకు తరలించారు. ఐతే బాధితుడు జితేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని, అతడి తండ్రి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహించిన స్థానికులు ఆగ్రహంతో నిందితుడి ఇంటిని కూల్చివేసి, నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: షాకింగ్ ఘటన: రాత్రికి రాత్రే రోడ్డుని మాయం చేసిన దొంగలు) -
Crime: ప్రాణం తీసిన పక్కింటి కుర్రాడి ప్రేమ
పక్కింటి కుర్రాడు.. అదీ వేరే వర్గానికి చెందిన వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపిస్తోందని తెలిసి ‘వద్దని’ చెల్లెలిని వారించాడు ఆ అన్న. అయినా ఆమె వినలేదు. అతనితో మాటలు కొనసాగిస్తూనే వచ్చింది. ఈ క్రమంలో వాళ్లిద్దరూ మరింత చనువుగా ఉండడం చూసి రగిలిపోయాడు ఆ అన్న. అతనిలో కోపం కట్టలు తెంచుకుని.. ఆమెను అతి దారుణంగా హతమార్చాడు. ఉత్తర ప్రదేశ్ గోండాలో పరువు హత్య కలకలం సృష్టించింది. 16 ఏళ్ల టీనేజర్‌ను ఆమె సోదరుడే అత్యంత పైశాచికంగా హతమార్చాడు. మూడు నెలల కిందట పక్కింటి కుర్రాడితో వాట్సాప్ ఛాటింగ్ చేస్తూ ఆమె అన్న కంటపడింది. దీంతో ఆమెను చితకబాది.. అతనికి దూరంగా ఉండాలని వారించాడు. అయినా ఆమె వినలేదు. ఈసారి ఏకంగా ఫోన్లో మాట్లాడుతూ దొరికిపోవడంతో.. ఆమెతో గొడవకు దిగాడు. ఏం చేస్తావో చేస్కో అంటూ తెగేసి చెప్పేసరికి ఆ అన్నలో కోపం కట్టలు తెంచుకుంది. ఆ వెంటనే ఇద్దరూ చనువుగా మాట్లాడుకుంటూ అతని కంటపడ్డారు. గురువారం రాత్రి ఓ పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేసి చంపేశాడు. ఆపై కాట్రా బజార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పరువు హత్య కోణంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే మూడేళ్ల కిందట నిందితుడి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లి సోదరితో కలిసి దామోదర్ గ్రామంలోకూలీ పనులు చేసుకుంటూ స్థిరపడ్డాడు. అయితే వేరే వర్గానికి చెందిన కుర్రాడితో తన చెల్లెలు చనువుగా ఉండడాన్ని తట్టుకోలేకపోయాడు. ఇదీ చదవండి: అశ్లీల సైట్లు చూసే అత్యాచారం చేశారట! -
రాజీవ్ వల్ల నా కెరీర్ నాశనమైంది.. భర్త వేధింపులపై తొలిసారి నోరు విప్పిన నటి
మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ విడాకులు వ్యవహరం మరోసారి వార్తల్లో నిలిచింది. సుష్మితా తమ్ముడు రాజీవ్ సేన్ టీవీ నటి చారు అసోపాను 2019లో జూన్‌లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసింది. ప్రస్తుతం వారికి 11 నెలల కూతురు ఉంది. అయితే పెళ్లయిన ఏడాదిన్నరగే విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చారు. అయితే తమ కూతురి కోసం కలిసి ఉండాలనుకుంటున్నామంటూ ఇటీవల తమ విడాకులను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రకటించిన రెండు నెలలకే మళ్లీ ఈ జంట విడిపోతున్నామంటూ తాజాగా మరో ప్రకటన చేసింది. తాజాగా దీనిపై నటి చారు అసోపా స్పందించింది. ముంబై మీడియాతో ముచ్చటించిన ఆమె తన భర్త రాజీవ్ సేన్ పెట్టిన ఇబ్బందులపై తొలిసారి నోరు విప్పింది. తన భర్త వల కెరీర్ నాశనమైందంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది. అంతేకాదు తన ప్రెగ్నెన్సీ సమయంలో రాజీవ్ తనని మోసం చేశాడంటూ ఆమె వాపోయింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘వివాహమైన నాటి నుంచి రాజీవ్ నన్ను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాడు. అతడి వల్ల మానసికంగా కృంగిపోయాను. పెళ్లయిన కొద్ది రోజులకే మా మధ్య గొడవలు మొదలయ్యాను. అలా గొడవ జరిగిన ప్రతిసారి రాజీవ్ నన్ను వదిలి వెళ్లిపోయేవాడు. కరోనా సమయంలో కూడా మూడు నెలలు నాకు దూరంగా వెళ్లిపోయాడు. ఫోన్ నంబర్లు బ్లాక్ చేశాడు. అతడు ఏమైపోయాడో తెలియక ఆందోళనకు గురయ్యాను’ అని చెప్పింది. అలాగే ‘‘ఆ బాధ నుంచి బయటపడటం కోసం మళ్లీ వర్క్‌పై దృష్టి పెట్టాను. ‘అక్బర్ కా బల్ బీర్బల్’తో తిరిగి షూటింగ్ పాల్గొన్న. అయితే నేను వర్క్ చేయడం మొదలుపెట్టిన కొన్నిరోజులకే రాజీవ్ తిరిగి వచ్చాడు. నా వర్క్ విషయంలో జోక్యం చేసుకోవడం మొదలు పెట్టాడు. నాకు దూరంగా ఉండాలంటూ నా కోస్టార్స్ అందరికీ మెసేజ్‌లు పెట్టడం, బెదిరించడం చేశాడు. రాజీవ్ తీరుకు నన్ను ఓ సమస్యలా భావించిన నిర్మాతలు షో నుంచి తొలగించేశారు. దీంతో నేను విడాకులకు అప్లయ్ చేశాను. విడాకులు వద్దని, నన్ను బాగా చూసుకుంటానని రాజీవ్ మాట ఇవ్వడంతో విడాకుల పత్రాలను వెనక్కి తీసుకున్నా. అయినా రాజీవ్ తన తీరు మార్చుకోలేదు. కొన్నిరోజులకే మళ్లీ నన్ను వేధించడం మొదలు పెట్టాడు. అందుకే ఇప్పుడు అతడితో విడిపోవాలని నిర్ణయించుకున్నా’’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. -
నేను కూన రవికుమార్ బ్రదర్‌ని.. జాగ్రత్త.. ఇక్కడే పాతేస్తా..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఎంత ధైర్యం రా.. నాకే నోటీసు ఇస్తావా.. నువ్వు ఏమనుకుంటున్నావ్.. నేను కూన రవికుమార్ బ్రదర్‌ని.. జాగ్రత్త.. ఇక్కడే పాతేస్తా...’ అంటూ టీడీపీ నాయకుడు కూన రవి సోదరుడు, కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణ ఓ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఉద్యోగిపై రెచ్చిపోయారు. అంతటితో ఆగలేదు.. ఏకంగా కొట్టేసేంతలా చెయ్యి ఎత్తి బెదిరించారు. నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. రాయలేని భాషలో పరుష పదజాలంతో వీరంగం సృష్టించారు. తాను కాంట్రాక్ట్ తీసుకున్న రోడ్డు పనులను పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ కేసీహెచ్ మహంతిపైనే దౌర్జన్యానికి దిగారు. ఈనెల 10న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ‘సాక్షి’ ఆరా తీయగా అసలు విషయాలు తెలిశాయి. అలవాటు ప్రకారమే.. టీడీపీ నేతల రౌడీయిజం ఆగలేదు. పదవులు పోయి మూడేళ్లయినా అధికార దర్పం దిగలేదు. సామాన్య ప్రజలను తిట్టినట్టు అధికారులపై విరుచుకుపడుతున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఇప్పటికే అనేక మార్లు అధికారులకు బెదిరింపులు, దాడులు చేసిన ఘటనలు ప్రజలకు తెలుసు. కేసులు నమోదై, అరెస్టుల వరకు వెళ్లాయి. అయినా వారి పంథా మారడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపైన జులుం ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా కూన రవికుమార్ మాదిరిగా ఆయన సోదరుడు కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణ దౌర్జన్య కాండకు దిగారు. శ్రీకాకుళంలోని పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజినీర్ కార్యాలయంలో బరితెగించి వ్యవహరించారు. తాను వేస్తున్న రోడ్డు పనుల విషయంలో నిబంధనలు పాటించడం లేదని, నాణ్యతా లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసుకోవాలని చెప్పినందుకు అసిస్టెంట్ ఇంజినీర్ మహంతిని కొట్టేంత పనిచేశారు. కార్యాలయంలో అందరి ఉద్యోగుల ముందే అసిస్టెంట్ ఇంజినీర్ మీదకొచ్చి దౌర్జన్యం చేయడమే కాకుండా చెయ్యి ఎత్తి తన అహంకారాన్ని ప్రదర్శించారు. దౌర్జన్యానికి మారుపేరైన కూన రవికుమార్.. సోదరుడు కావడంతో తోటి సిబ్బంది కూడా చోద్యం చూశారే తప్ప తప్పు అని చెప్పలేకపోయారు. దీంతో తనకు జరిగిన అవమానాన్ని బయటకు చెప్పుకోలేక, పై అధికారులు ముందుకు రాక అసిస్టెంట్ ఇంజినీర్ మహంతి కుంగిపోతున్నారు. యూనియన్ లీడరైన తనకే ఇలా జరిగితే.. మిగతా ఉద్యోగుల మాటేంటని బాధపడుతున్నారు. పనుల్లో నిర్లక్ష్యం.. శ్రీకాకుళం మండలం ఎన్‌హెచ్–16 (శాస్త్రుల పేట) నుంచి సానివాడ మీదుగా వప్పంగి వరకు రూ.2.69 కోట్ల పీఎంజీఎస్‌వై నిధులతో బీటీ రోడ్డు నిర్మాణానికి గత ఏడాది మే 24న అగ్రిమెంట్ కుదిరింది. ఈ ప్రకారం ఏడాదిలోగా పనులను పూర్తి చేయాల్సిందిగా కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణతో పీఆర్ పీఐయూ విభాగం అగ్రిమెంట్ అయ్యింది. అయితే కాలపరిమితి పూర్తయినప్పటికీ ఏడాది కాలంలో ఒక్క రాయి కూడా వేయలేదు. తీరా ఇంజినీరింగ్ అధికారులు గట్టిగా అడిగితే.. కోవిడ్ కారణంగా రోడ్డు నిర్మాణం ప్రారంభించలేదంటూ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది నవంబర్ నెలాఖరు వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్‌కు వెసలు బాటు కల్పించారు. దీంతో మే నెల నుంచి రోడ్డు పనులు ప్రారంభించినప్పటికీ.. నిబంధనలకు పూర్తిగా పాతరేశాడు. దీంతో ఏఈ మహంతి నిర్మాణ పనులపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ అలార్మింగ్ లెటర్(లోటుపాట్లు సరిచేసుకోండని చెప్పే పత్రం) ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆ విషయం తెలుసుకున్న కూన సత్యనారాయణ ఈ నెల 10న పీఆర్ డివిజనల్ కార్యాలయానికి వచ్చి వీరంగం వేశారు. ఏఈ మహంతిపై దురుసుగా ప్రవర్తించాడు. తొలుత అసిస్టెంట్ ఇంజినీర్‌తో వాగ్వాదం చేసి.. ఆ తర్వాత పళ్లు బిగించి కళ్లు ఎర్రజేసి, కొట్టడానికి చెయ్యెత్తారు. నోటికి వచ్చినట్లు బూతులు తిట్టి, పాతేస్తానంటూ బెదిరించి దౌర్జన్యానికి దిగారు. అసిస్టెంట్ ఇంజినీర్ చేసేదేమి లేక ‘కొట్టేయండి సార్.. కొట్టేస్తే మీకు హ్యాపీగా ఉంటుంది కదా’ అని నిస్సహాయంగా స్పందించారు. అయినా కూన వెనక్కి తగ్గలేదు. ఆ సమయంలో పీఏ టు ఈఈ, మరో ముగ్గురు నా కేడర్ ఏఈలు, క్లరికల్ స్టాఫ్ అంతా ఉన్నారు. కానీ కూనకు భయపడి ఎవరూ ఏమీ అనలేకపోయారు. దీంతో ఆ అసిస్టెంట్ ఇంజినీర్ తనకు జరిగిన అవమానాన్ని దిగమింగుకుని కుమిలిపోతున్నారు. (క్లిక్ చేయండి: అక్రమ వ్యాపారాలకు కేరాఫ్ అచ్చెన్న అనుచరుడు!) -
ఆత్మహత్య చేసుకోవడం ఎలా? నటిస్తూ.. పాఠశాల విద్యార్థి మృతి
సాక్షి, తమిళనాడు: చెన్నై పుళల్ సమీపంలో శనివారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నటించిన పాఠశాల విద్యార్థి.. గొంతుకు దారం బిగుసుకుని ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. చెన్నై పుళల్ సమీపంలోని బుద్దాగరం గ్రామం కామరజర్ నగర్‌కు చెందిన శ్రీనివాసన్ రెండో కుమారుడు కార్తీక్(11). అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తన ఇద్దరు సోదరులకు ఎదురుగా గదిలో పరుపు మీద కుర్చీ వేసుకుని నైలాన్ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఎలా..? అని కార్తీక్ నటించి చూపిస్తూ ఉన్నాడు. ఇందుకోసం కుర్చీపైకి ఎక్కి నిలబడి ఫ్యాన్ కొక్కికి నైలాన్ తాడు తగిలించి, మరో కొనను కార్తీక్ మెడకు చుట్టుకుని నటించాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా కుర్చీ కింద పడి పోవడంతో కార్తీక్ మెడకు నైలాన్ తాడు బిగుసుకుని మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పుళల్ పోలీసులు పాఠశాల విద్యార్థి కార్తీక్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: మహిళ కిడ్నాప్.. సామూహిక అత్యాచారం? -
వింత మనుషులు.. చీకటి గదిలో నుంచి వెలుగులోకి..
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: మూడేళ్లుగా చీకటి గదిలో మగ్గిన జీవితాల్లో వెలుగులు నిండాయి. స్వీయ నిర్బంధంలో ఉన్న అన్నా చెల్లెళ్లు పోలీసుల చొరవతో జనంలోకి వచ్చారు. అనంతపురం నగరంలోని వేణుగోపాల్ నగర్ ఆటోస్టాండ్ సమీపంలో నివాసముండే అన్నా చెల్లెళ్లు తిరుపాల్, కృష్ణవేణి, లక్ష్మి తల్లిదండ్రుల మరణంతో తీవ్రంగా కుంగిపోయి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇంటి నుంచి వచ్చే దుర్గంధాన్ని భరించలేక స్థానికులు పోలీసులకు తెలపడంతో ఈ అన్నా చెల్లెళ్ల దయనీయ స్థితి వెలుగులోకి వచ్చింది. చదవండి: ఛీ..ఛీ..ఇదేం పాడు పని...ఫ్యామిలీ రెస్టారెంట్లో... శుక్రవారం సాయంత్రం పోలీసులు వారి ఇంటికి వచ్చి అన్నా చెల్లెళ్లతో మాట్లాడారు. తిరిగి శనివారం ఉదయం స్థానిక కార్పొరేటర్ సుజాత, ఇన్చార్జి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, మునిసిపల్ కమిషనరు కె.భాగ్యలక్ష్మి వారి ఇంటికి వెళ్లారు. మురికి కూపంగా ఉన్న బాధితుల ఇంటిని శుభ్రం చేయించారు. విద్యుత్తు, నీటి సరఫరాను పునరుద్ధరించారు. అన్నా చెల్లెళ్లకు ఆహారం, కొత్త దుస్తులు అందజేశారు. అన్నా చెల్లెళ్లకు స్నానం చేయించి, దుస్తులు మార్చి జన జీవన స్రవంతిలోకి తెచ్చారు. ఇన్నాళ్లూ ఆ ఇంటిని చూసి భయపడిన వీధిలోని చిన్నారులు సైతం వారితో మాట్లాడేలా పోలీసులు మమేకం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో వీరికి ఈ సహాయం చేసినట్లు ఇన్చార్జి డీఎస్పీ తెలిపారు. నాడెంతో వైభవం శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం దంపెట్ల చెర్లోపల్లికి చెందిన అంబటి రామయ్య, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం మదిగుబ్బకు చెందిన లక్ష్మిదేవి దంపతులు 50 ఏళ్ల క్రితం అనంతపురానికి వచ్చి స్థిరపడ్డారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు సంతానం. స్థానిక పాతూరు పూల మండీల పక్కనే ఉన్న వీధిలో అంబటి రామయ్య హోటల్ నడిపేవారు. బాగానే సంపాదించారు. పెద్ద కుమార్తెను కనగానపల్లి మండలం భానుకోటకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటికే అల్లుడికి మరో మహిళతో పెళ్లయిందని తెలిసి కుమార్తెను ఇంటికి తెచ్చుకున్నారు. చిన్న కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంది. రామయ్య వయసు మళ్లి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మూడేళ్ల క్రితం భార్య లక్ష్మీదేవి కూడా మృతి చెందింది. తల్లిదండ్రుల మరణం తర్వాత అన్నా చెల్లెళ్లు తిరుపాల్, కృష్ణవేణి, లక్ష్మి కుంగిపోయారు. పిల్లలను చిన్నప్పటి నుంచి పెద్దగా బయటకు పంపకపోవడంతో అటు బంధువులు, ఇటు ఆత్మీయులు పెద్దగా లేరు. చిన్న చెల్లెలు, ఆమె భర్త ఎప్పుడైనా ఇంటికి వెళ్లినా, అన్నా చెల్లెళ్లు వారిని కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో క్రమేణా వారూ దూరమయ్యారు. తిరుపాల్ బయటకు వెళ్లినప్పుడు ఏదో ఒకటి తేవడం, దాంతోనే ముగ్గురూ సరిపెట్టుకోవడంతో బక్కచిక్కిపోయారు. చివరకు స్థానికుల సమాచారంతో పోలీసులు స్పందించి వారికి కొత్త వెలుగు ప్రసాదించారు. -
అమ్మ కావాలి.. కన్నీరు పెట్టించిన విషాద ఘటన..
ముప్పాళ్ల(పల్నాడు జిల్లా): క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఆలనా పాలనా చూడాల్సిన తల్లి క్షణికావేశంతో ఆత్మహత్యకు ప్రయత్నించి కన్నబిడ్డకు అమ్మప్రేమను దూరం చేయగా, తన తోబుట్టువులా భావించే మనిషి కళ్ల ముందే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తే ఆమెను కాపాడే ప్రయత్నంలో మరో వ్యక్తి మృతి చెందిన విషాదకర సంఘటన పల్నాడు జిల్లాలో సోమవారం జరిగింది. రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. చదవండి: బీచ్‌లో రిప్ కరెంట్.. వేరీ డేంజర్.. గజ ఈతగాళ్లు కూడా తప్పించుకోలేరు.. కాలువలో దూకిన చెల్లి, ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన సోదరుడు ఇద్దరూ మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలోని నార్నెపాడు సమీపంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన శానంపూడి హరినాథ్‌రెడ్డికి నాలుగేళ్ల కిందట ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన కృష్ణవేణి(22)తో వివాహం జరిగింది. వారికి రెండున్నరేళ్ల బాబు ఉన్నాడు. ఏడాది కిందట ప్రమాదం జరిగి హరినాథ్‌రెడ్డికి కాలు విరిగింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. 15 రోజుల కిందట భర్తతో గొడవ పడి ఆమె పుట్టింటికి వెళ్లింది. హరినాథ్‌రెడ్డి వరుసకు బావ అయిన మోదుగుల వెంకటరమణారెడ్డి(47)ని తన భార్య, కుమారుడిని తీసుకురావాలని కోరారు. ఆ నేపథ్యంలో వెంకటరమణారెడ్డి ఏల్చూరు వెళ్లి ఆమె తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడాడు. కృష్ణవేణి, ఆమె కుమారుడు మహీందర్‌రెడ్డిని తీసుకుని తన ద్విచక్రవాహనంపై పాకాలపాడు బయలుదేరాడు. మండల పరిధిలోని నార్నెపాడు రోడ్డు వద్ద గల గుంటూరు బ్రాంచి కాలువ వద్దకు రాగానే ఆమె బైకు ఆపమని కోరింది. బైకు ఆపగా వెళ్లి కాలువలో దూకింది. ఈ హఠాత్తు పరిణామంతో ఖంగుతిన్న వెంకటరమణారెడ్డి బండిపై బాలుడిని కూర్చోబెట్టి ఆమెను కాపాడేందుకు కాలువలో దూకాడు. అప్పటికే నీటి ప్రవాహంలో ఆమె మునిగి పోయింది. అక్కడే ఉన్న స్థానికులు వెంకటరమణారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో అతను మునిగిపోయాడు. అతని మృతదేహాన్ని బయటకు తీయగా, ఆమె మృతదేహం కనిపించలేదు. నీటి ఉధృతిని మరో కాలువకు మళ్లించి గాలింపు చేపట్టారు. కాసేపటికి మృతదేహం లభ్యమైంది. ఇరువురి మృతదేహాలను శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం.పట్టాభిరామయ్య తెలిపారు. అమ్మ కావాలి... అమ్మ కావాలి అంటూ బాలుడు ఏడుస్తున్న తీరు చూపరులను కన్నీరు పెట్టించింది. అప్పటి వరకు తనతోపాటు వచ్చిన అమ్మ, మామయ్యలు కనిపించకపోవటంతో పాటు, జనాలు పెద్దఎత్తున గుమికూడి ఉండటంతో ఏమి జరిగిందో తెలియక బాలుడు విలపించసాగాడు. కొద్దిసేపటికి మృతుల బంధువులు అక్కడికి చేరుకుని బాలుడిని ఓదార్చారు. వెంకటరమణారెడ్డికి భార్య ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఈ సంఘటనతో రెండు కుటుంబాల్లోను విషాదఛాయలు అలముకున్నాయి. -
Hyderabad: మూడేళ్లుగా చెల్లెలిపైనే అఘాయిత్యం..
సాక్షి, హైదరాబాద్: చెల్లెలిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డ దారుణం నగరంలో వెలుగు చూసింది. నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేపాల్‌కు చెందిన కుటుంబం హిమాయత్‌నగర్‌లో స్థిరపడింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2019లో బాలిక వయస్సు 16 సంవత్సరాలు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు రోహన్ నాయుడు తన చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే వారూ పట్టించుకోలేదు. దీనిని అసరగా తీసుకున్న రోహన్ నాయుడు చెల్లిని భయపెడుతూ అప్పటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు లైంగిక దాడిచేశాడు. ఇదిలా ఉండగా జూన్‌లో బాధితురాలు నేపాల్‌కు వెళ్లి వచ్చింది. తిరిగి వచ్చి ఓ హాస్టల్లో ఉంటోంది. అయినా ఆమెను ఫోన్‌చేస్తూ వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు ఆగస్టు 30న నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రోహన్‌నాయుడుపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. చదవండి: గుజరాత్లో కారు బీభత్సం.. ఆరుగురు మృతి -
నడి రోడ్డు పై హత్య... సోదరుడిని చంపాడన్న కోపంతో...
న్యూఢిల్లీ: సోదరుడిని హత్య చేశారన్న కోపంతో ప్రతీకారం తీర్చుకునేందుకు వెళ్లిన ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆగస్టు 13న ఢిల్లీలోని తిమార్పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితుడు సునీల్ గున్నిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఆగస్టు 12న సునీల్ సోదరుడుని కొంతమంది వ్యక్తులు చంపారని ఢిల్లీ పోలీస్ నార్త్ డిప్యూటి కమిషనర్ సాగర్ సింగ్ కల్సి తెలిపారు. ఆ తర్వాత రోజు సునీల్ తన సోదరుడిని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్లి రాహుల్, అజయ్, ముఖేష్ అతని సహచరుల చేతిలో హత్యకు గురయ్యాడు. తొలుత సునీల్ రాహుల్, అజయ్, ముఖేష్ వారి సహచరుల మధ్య గొడవ జరిగిందని చెప్పారు. ఆ తర్వాత వారంతా సునీల్‌ని దారుణంగా కొట్టి పరారయ్యినట్లు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన సునీల్‌ని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. వాస్తవానికి సునీల్ తన సోదరుడిని చంపారన్న కోపంతో నిందితులపై దాడి చేసేందుకు కొడవలితో వెళ్లాడని అన్నారు. ఐతే వారంతా సునీల్ వద్ద నుంచి కొడవలిని లాక్కుని, కర్రలు, రాడ్లతో దాడి చేశారని పోలీసులు తెలిపారు. (చదవండి: స్కాట్లాండ్లో పలమనేరు విద్యార్థి మృతి) -
ఖమ్మం: టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణహత్య
-
తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడి దారుణ హత్య!
సాక్షి, ఖమ్మం: జిల్లా రాజకీయాల్లో ఓ దారుణ హత్య కలకలం రేపుతోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడి తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతో కొడవళ్లతో దారుణంగా హతమార్చారు దుండగులు. ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి వరుసకు సోదరుడు అవుతాడు కృష్ణయ్య. అయితే.. సీపీఎంతో విభేదించి.. టీఆర్ఎస్లో చేరాడు కృష్ణయ్య. ఆపై తుమ్మలకు ప్రధాన అనుచరుడిగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఈ హత్యోదంతానికి సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ఇదీ చదవండి: దారుణాతీ దారుణం .. దళిత చిన్నారిని కొట్టి చంపిన టీచర్ -
ఇదేం పెళ్లి?
సాధారణంగా పెళ్లంటే ఎవరు వచ్చినా రాకున్నా వధూవరులైతే పెళ్లిపీటలెక్కుతారు. కానీ తన పెళ్లికి పెళ్లికొడుకే గైర్హాజరైతే..?! అయినా పెళ్లి ప్రక్రియ నిరాటంకంగా జరిగిపోతే! పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియారా లియోన్‌లో ఇటీవల ఇదే విచిత్రం చోటుచేసుకుంది. చైనా ఫుట్‌బాల్ లీగ్ నుంచి స్వీడన్‌కు చెందిన మాల్మో ఎఫ్‌సీ అనే పుట్‌బాల్ క్లబ్లో ఇటీవల చేరిన మొహమ్మద్ బుయా టురే అనే 26 ఏళ్ల ఫుట్‌బాలర్ తన ప్రేయసితో పెళ్లికి సిద్ధమయ్యాడు. అయితే పెళ్లి రోజునే తొలి మ్యాచ్ ఆడేందుకు వీలుగా ప్రాక్టీస్ సెషన్లో తప్పనిసరిగా పాల్గొనాలంటూ చివరి నిమిషంలో క్లబ్ నిర్వాహకుల నుంచి అతనికి పిలుపు వచ్చింది. ఇక చేసేదేమీ లేకపోవడంతో టురే తన సోదరుడిని వరుడి స్థానంలో కూర్చోబెట్టి స్వీడెన్ వెళ్లిపోయాడు! దీంతో పెళ్లి దుస్తులు ధరించడం దగ్గర్నుంచి వధువుతో కలిసి కేక్ కటింగ్ చేయడం వరకు అతనే పెళ్లి తంతునంతా కానిచ్చాడు. పెళ్లి ఫొటోలు, వీడియోల్లో దర్జాగా భార్యకాని భార్యతో కలసి పోజులిచ్చాడు!! ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారడంతో టురే స్పందించాడు. పెళ్లికి ముందు రోజే తామిద్దరం పెళ్లి దుస్తుల్లో ఫొటోలు, వీడియోలు దిగామంటూ వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. అయితే మ్యాచ్‌ల కారణంగా ఇంతవరకు తన ‘భార్య’ను కలుసుకోవడం వీలుకాలేదని.. త్వరలోనే ఆమెను స్వీడన్ రప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు. అయితే టురే చేసిన ‘పని’ని కొందరు తప్పుబడుతుంటే మరికొందరు మాత్రం ఇదే అసలైన ‘వృత్తి ధర్మం’ అంటూ అతన్ని వెనకేసుకొస్తున్నారు. -
జడ్చర్లలో దారుణం... చెల్లిని ప్రేమించాడని చంపేశారు
జడ్చర్ల: తన చెల్లిని ప్రేమించిన యువకుడిని ఆమె సోదరులు దారుణంగా హత్య చేసిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలో జరిగింది. సీఐ రమేశ్‌బాబు కథనం ప్రకారం.. మండల పరిధిలోని కిష్టారం గ్రామానికి చెందిన సింగిదాస్ కృష్ణ (24) అదే గ్రామానికి చెందిన యువతి నందిని (17) ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒకే కులానికి చెందిన వారు కావడంతో మరింత దగ్గరయ్యారు. ఈ విషయం సదరు యువతి సోదరులు సింగిదాస్ మోహన్, సింగిదాస్ విజయ్‌కి తెలిసింది. కాగా, మంగళవారం రాత్రి మొహర్రం వేడుకల్లో అందరూ నిమగ్నమైన సమయంలో గ్రామశివారులోని మొక్కజొన్న చేనులో కలుసుకోవడానికి కృష్ణ, నందిని వెళ్లారు. ఇది గమనించిన ఆమె సోదరులు అక్కడకు చేరుకుని కృష్ణ కడుపులో కత్తితో పొడవడంతో పేగులు, అవయవాలు బయటకు వచ్చాయి. తనను ఎలాగైనా కాపాడాలని కృష్ణ వేడుకోవడంతో వారే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి, వెంటనే చికిత్స కోసం మహబూబ్‌నగర్ సమీపంలోని ఏనుగొండ ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 8 గంటలకు మృతి చెందాడు. కృష్ణ ఆటో నడుపుతుంటాడని తల్లిదండ్రులు జంగమ్మ, బాలయ్య కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితులు జడ్చర్ల పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం.