
బెంగుళూరు: వారు ముగ్గురు అక్కతమ్ముళ్లు. ఒకరంటే ఒకరికి ప్రాణం. 50 యేళ్ల వయసు పైబడిన, పెళ్లిళ్లు అయ్యి తమకంటూ సొంతగా కుటుంబాలు ఏర్పడిన తరువాత వారి కూడా వారి ప్రేమ తగ్గలేదు. అందుకేనేమో ఒకరు చనిపోయారని తెలియగానే మరో ఇద్దరు కూడా ప్రాణాలు విడిచారు. ఈ హృదయ విదారకమైన ఘటన కర్ణాటకలోని బెళగావిలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని బెళగావి సమీపంలోని పంత్బలేకుంద్రి గ్రామానికి చెందిన అబ్దుల్ మాజిద్ జమదార్(57)కు ఇద్దరు అక్కలు. ఒకరు హుస్సేన్ బీ ముల్లా(64), మరొకరు సహారాబీ సనాది(70). వారు చిన్నప్పటి నుంచి ఒకరంటే మరొకరికి ఎంతో ఇష్టంతో పెరిగారు. వారి తమ్ముడు అబ్దుల్ మాజిద్ డయాబెటిస్ పెషంట్. మాజిద్‌కు గుండె నొప్పి నొప్పి రావడంతో అతనిని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. కరోనా టైం కావడంతో కరోనా పరీక్ష నిర్థారణ రిపోర్టు లేకపోతే హాస్పటల్‌లో చేర్చుకోమని చాలా ఆసుపత్రులు తిప్పి పంపేశాయి.
చదవండి: తెల్లారిన బతుకులు..
దీంతో కుటుంబ సభ్యులు మాజిద్‌ను బెలగావిలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. అతడికి అక్కడ కోవిడ్-19 పరీక్షను నిర్వహించారు. అయితే పరీక్ష ఫలితం రాకముందే, తీవ్రమైన గుండెనొప్పితో మాజీద్ జమదార్ మరణించాడు. అయితే కరోనా రిపోర్టులో మాత్రం అతనికి నెగిటివ్ వచ్చింది. మాజీద్ మరణ వార్త తెలియగానే చిన్నక్క హుస్సేన్ బీ ముల్లాకు గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. పెద్దక్క సహారాబీ సనాది సైతం తమ్ముడి మృతదేహాన్ని ఇంటికి తరలించే క్రమంలో గుండెపోటుతో చనిపోయింది. దీంతో ఆ ఇళ్లు చీకటిగా మారిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ముగ్గురు అక్కాతమ్ముళ్లకు బేలగావికి 15 కిలోమీటర్ల దూరంలోని వారి స్వగ్రామమైన పంత్బలేకుంద్రి గ్రామంలో ఒకేచోట అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Comments
Please login to add a commentAdd a comment