![Navagraha Fame Actor Giri Dinesh Passes Away](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/323.jpg.webp?itok=Tds9CMEF)
కర్ణాటక: నవగ్రహ కన్నడ చలనచిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమై అనేక కన్నడ చిత్రాల్లో నటించిన గిరి దినేస్(45) గుండెపోటుతో మృతిచెందారు. కన్నడ సూపర్ స్టార్ దర్శన్ హీరోగా తన సోదరుడు దినకర్ దర్శకత్వం వహించిన నవగ్రహ చిత్రంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ 2008లో విడుదలైంది.
ఆ చిత్రంలో శెట్టి పాత్రను పోషించడం ద్వారా గిరి దినేష్ పాపులర్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత ఆయనకు కోలీవుడ్‌లో మంచి అవకాశాలే దక్కాయి. ఇంట్లో పూజ గదిలో పూజ చేస్తుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.కుటుంబ సభ్యులు ఆయన్ను తోణం ఆస్పత్రికి తరలించగా అప్పటికే తుదిశ్వాస వదిలినట్లు వైద్యులు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment