Video: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. 50 మంది ప్రాణాలు కాపాడిన కండక్టర్ | Bengaluru bus driver dies of heart attack conductor stops vehicle | Sakshi
Sakshi News home page

Video: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. 50 మంది ప్రాణాలు కాపాడిన కండక్టర్

Published Thu, Nov 7 2024 1:04 PM | Last Updated on Thu, Nov 7 2024 1:09 PM

Bengaluru bus driver dies of heart attack conductor stops vehicle

ఇటీవల గుండెపోటు మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. చిన్న పిల్లల నుంచి యువకులు, మధ్య వయస్సు వారు ఇలా అందిరినీ ఆకస్మిక గుండెపోటు కలవరానికి గురిచేస్తోంది. తాజాగా బస్సు నడుపుతుండగా డ్రైవర్‌ ఉన్నట్టుండి గుండెపోటుకు గురయ్యాడు. అయితే గమనించిన కండక్టర్‌  అప్రమత్తతో వెంటనే బస్సును రోడ్డు పక్కన సురక్షితంగా నిలిపడంతో పెను ప్రమాదం తప్పింది.  ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.

బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ పరిధిలోని దాసనపుర బస్‌ డిపోలో  కిరణ్‌(39) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. . నెలమంగళ నుంచి యశ్వంత్‌పూర్‌కు బస్సు నడుపుతుండగా అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చి స్పృహ కోల్పోయాడు. బస్సులోని సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

డ్రైవర్ కుప్పకూలడంతో బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న బస్సును రాసుకుంటూ వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన బస్సులోని కండక్టర్ డ్రైవర్‌ను లేపే ప్రయత్నం చేస్తూనే డ్రైవింగ్ సీట్లోకి వెళ్లి బస్సును సురక్షితంగా నిలిపివేశాడు. దీంతో బస్సులోని 50 మంది ప్రాణాలు నిలిచాయి. ఆ తర్వాత డ్రైవర్ కిరణ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. బస్సును నిలిపివేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కండక్టర్‌ను ఆర్టీసీ అధికారులు ప్రశంసించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement