
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో పెను ప్రమాదం తప్పింది. రహదారిపై వెళ్తున్న బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సు దిగి ప్రయాణికులను ఖాళీ చేయడంతో ప్రమాదం తప్పింది. ఎంజీ రోడ్డులో కోరమంగళ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఈ ఈ ఘటన వెలుగు చూసింది.
నగరం నడిబొడ్డున ఎంజీ రోడ్డులోడ్రైవర్ ఇంజన్ స్టార్ట్ చేయడంతో బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్‌లో బస్సులోని వారందరినీ కిందకు దింపాడు. అయితే బస్సు మాత్రం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. బస్సు నుంచి మంటలు, పొగలు రావడంతో చుట్టు పక్కల జనాలు భయబ్రాంతులకు గురయ్యారు.
ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అక్కడే ఉన్న వారు బస్సు కాలిపోవడాన్ని వీడియో తీశారు. ఇందులో అగ్నిమాపక సిబ్బంది దానిని ఆర్పడానికి ప్రయత్నించినప్పుడు బస్సులో మంటలు, పొగలు పైకి లేవడం కనిపిస్తోంది. అయితే ఇంజిన్ బాగా వేడెక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు బీఎంటీసీ వర్గాలు తెలిపాయి.
🚨 A BMTC bus caught fire 🔥 at MG Road. No casualties reported. 🚒
Source: @bangalore360_#Bengaluru #BMTC pic.twitter.com/SlZuGQz2Om— North BangalorePost (@nBangalorepost) July 9, 2024