conductor
-
బస్సు కండక్టర్ టికెట్ మెషీన్నే కొట్టేశాడు!
మలక్‌పేట(హైదరాబాద్): ప్లాట్‌ఫాంపై ఆగి ఉన్న బస్సులోని కండక్టర్ టికెట్ మెషీన్‌ను గుర్తు తెలియని వ్యక్తి కొట్టేశాడు. మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో సూర్యాపేట డిపో బస్సు నగరానికి చేరుకుంది. తిరిగి సూర్యాపేటకు వెళ్లే క్రమంలో దిల్సుఖ్నగర్ బస్టాండ్‌లోని 2 నంబర్ ప్లాట్‌ఫాంపై డ్రైవర్ బస్సు ఆపాడు. కండక్టర్ కృష్ణవేణి టికెట్ మెషీన్ తన బ్యాగులో పెట్టి కంట్రోలర్ వద్ద వెళ్లి వచ్చి చూసేసరికి కన్పించలేదు. బ్యాగులో టికెట్ మెషీన్, సెల్‌ఫోన్, పాస్‌బుక్ ఉన్నట్లు పోలీసులకు కండక్టర్ ఫిర్యాదు చేశారు. కండక్టర్ బస్సు దిగిన తర్వాత డ్రైవర్ కార్గో కేంద్రానికి వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన ఆగంతకుడు బ్యాగును అపహరించాడు. ఇందంతా మూడు నిమిషాల్లోనే జరిగిందని కండక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్లాల్ తెలిపారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
నమ్మించి నట్టేట ముంచిన కండక్టర్
కర్ణాటక: బస్సు కండక్టర్ యువతికి టికెట్ ఇస్తూ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడునెలలకే ముఖం చాటేశాడు. వివరాలు.. ఎంఎస్ పాళ్య బీఎంటీసీ డిపోకి చెందిన కండక్టర్ కం డ్రైవర్‌గా పని చేస్తున్న మంజునాథ్.. రోజు ఎంఎస్ పాళ్య నుంచి యలహంకకు బస్సును నడిపేపాడు. ఆ బస్సులో ప్రయాణించే యువతికి టికెట్ ఇస్తూ మాటలు కలిపాడు. తనకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్న సంగతి చెప్పకుండా, ప్రేమ అంటూ యువతి వెంటపడి ఒప్పించాడు. ఇద్దరూ జాలీ ట్రిప్‌లకు వెళ్లేవారు. కండక్టర్ ప్రవర్తన సరిలేదని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఈ పెళ్లిని వ్యతిరేకించారు. కానీ మంజునాథ్ మాయలో పడిన యువతి వివాహం చేసుకొంది. మొదటి పెళ్లాంతో నెలమంగలలో కుటుంబం ఉందని తెలిసి యువతి భర్తని నిలదీసింది. దీంతో నువ్వు నాకు వద్దంటూ అతడు దూరం పెట్టాడు. మూడునెలల గర్భంతో ఉన్న యువతి.. అన్యాయం జరిగిందంటూ పోలీస్ కమిషనర్, మహిళా సహయవాణికి ఫిర్యాదు చేశారు. తనకు భర్త కావాలి. కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి కావాలంటూ యువతి డిమాండ్ చేసింది.అన్న కూతురిని ప్రేమిస్తున్నాడని.. -
‘చిల్లర’ పొరపాట్లు.. పెద్ద శిక్షలు!
టికెట్ జారీ యంత్రం (టిమ్) ద్వారా కండక్టర్ విధులను కూడా నిర్వహించే డ్రైవర్ అతను. బస్సు నడుపుతుండగా రిజర్వేషన్ చేయించుకొని తదుపరి స్టాప్‌లో ఎక్కాల్సిన ప్రయాణికుడు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ మాట్లాడుతుండగా ఫొటో తీసిన ఓ ప్రయాణికుడు దాన్ని సోషల్ మీడియాలో ఉంచడంతో డ్రైవర్‌ను ఉన్నతాధికారులు తొలుత సస్పెండ్ చేసి ఆ తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే ఇంటి ఫోన్ కాల్స్ మాట్లాడుతూ సస్పెండ్ అయిన చరిత్ర ఆయనకు ఉందని.. అందుకే తొలగించాల్సి వచ్చిందనేది అధికారుల మాట.ఒకేసారి నలుగురు ప్రయాణికులు ఎక్కారు. ఆ తొందరలో పొరపాటున పురుష ప్రయాణికుడికి కండక్టర్ జీరో టికెట్ (మహాలక్ష్మి పథకంలో మహిళలకు జారీ చేయాల్సిన టికెట్) జారీ చేశాడు. తదుపరి స్టాప్‌లో చెకింగ్ సిబ్బంది తనిఖీ చేసి కండక్టర్‌పై కేసు నమోదు చేశారు. దాని ఆధారంగా ఉద్యోగం నుంచి తొలగించారు. కావాలనే జీరో టికెట్ జారీ చేసి టికెట్ చార్జీ రుసుము తీసుకున్నాడన్నది తనిఖీ సిబ్బంది ఆరోపణ.సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ‘చిల్లర’కారణాలతో గత మూడేళ్లలో వందలాది మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. విధుల్లోకి తిరిగి తీసుకోవాలని ఎన్నిసార్లు వేడుకున్నా (అప్పీళ్లు) కుదరదని సంస్థ తేలి్చచెప్పడంతో వారంతా తాజాగా మూకుమ్మడిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పరిణామం ఆర్టీసీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తీవ్రంగా పరిగణిస్తూ..: ఆర్టీసీలో ‘చిల్లర’వివాదాలు కొత్తకాదు. టికెట్ల జారీలో జరిగే పొరపాట్లను సంస్థ తీవ్రంగా పరిగణిస్తోంది. రూ. 10 తేడా వచి్చనా విధుల నుంచి తప్పిస్తోంది. ఇక డ్రైవింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని సైతం తొలగిస్తోంది. మూడేళ్లుగా వివిధ కారణాలతో ఏకంగా 600 మందికి ఉద్వాసన పలికింది. అయితే వారంతా డిపో మేనేజర్ మొదలు ఎండీ వరకు అన్ని కార్యాలయాల చుట్టూ తిరుగుతుండటంతో గత నెలలో అప్పీళ్ల మేళా నిర్వహించింది. వివిధ కోణాల్లో వారి కేసులను సమీక్షించి 180 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంది. మిగతా 420 మందిని మాత్రం పక్కనపెట్టేసింది.దీంతో వారంతా సంస్థ తీరును నిరసిస్తూ రోడ్డెక్కారు. వేతన సవరణ, పాత బకాయిలు, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు చెల్లింపు సహా వివిధ డిమాండ్లపై నిత్యం కారి్మకులు గొంతెత్తుతున్న వేళ 420 మంది రోడ్డెక్కడం ఆర్టీసీకి తలనొప్పిగా మారింది. ఉద్వాసనకు గురైన వారి వాదన ఓ రకంగా ఉంటే అధికారుల మాట మరోరకంగా ఉంటోంది. వారిలో ఎవరి వాదన సరైందో తేలాల్సి ఉంది.వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ‘టిమ్’లో టికెట్ ప్రింట్ కాకపోవడం వల్ల పెన్నుతో టికెట్ నంబర్ రాసే క్రమంలో చేసిన పొరపాటుకు ఓ డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు. టిమ్ యంత్రం వాడకంలో చిన్న పొరపాట్లు చేసిన మరికొందరిని తప్పించారు. చిన్నచిన్న సమస్యలు, చిల్లర విషయాలపై ఆర్టీసీ యాజమాన్యం ఏకంగా ఉద్యోగాలు తీసేస్తే ఎలా? ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొందరు కూలీలుగా మారుతున్నారు. అలా వారం క్రితం ఓ మాజీ కండక్టర్ గుండెపోటుతో చనిపోయాడు. వెంటనే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. – ఉద్యోగాలు కోల్పోయిన ఆర్టీసీ సిబ్బంది బృందం ప్రతినిధి రాజేందర్ ఊరికే ఉద్యోగాలు తొలగించం.. ఆర్టీసీ కారి్మకులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వారి సంక్షేమానికే ప్రయతి్నస్తాం తప్ప వారి ఉద్యోగాలు తొలగించాలని చూడం. ఓ తప్పు చేసినట్లు తేలితే వివిధ కోణాల్లో సమీక్షించడంతోపాటు ఆ ఉద్యోగి గత చరిత్రను పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ఒకట్రెండు సార్లు తప్పు చేస్తే హెచ్చరించి వదిలేస్తాం. తప్పును పునరావృతం చేస్తే వేటు వేస్తాం. మద్యం సేవించి విధులకు వచ్చే డ్రైవర్ల విషయంలో మాత్రం కఠినంగా ఉంటాం. – ఓ ఆర్టీసీ అధికారి మాట -
ప్రకాశం జిల్లా కామెపల్లిలో తాగుబోతు వీరంగం
-
Video: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. 50 మంది ప్రాణాలు కాపాడిన కండక్టర్
ఇటీవల గుండెపోటు మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. చిన్న పిల్లల నుంచి యువకులు, మధ్య వయస్సు వారు ఇలా అందిరినీ ఆకస్మిక గుండెపోటు కలవరానికి గురిచేస్తోంది. తాజాగా బస్సు నడుపుతుండగా డ్రైవర్ ఉన్నట్టుండి గుండెపోటుకు గురయ్యాడు. అయితే గమనించిన కండక్టర్ అప్రమత్తతో వెంటనే బస్సును రోడ్డు పక్కన సురక్షితంగా నిలిపడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పరిధిలోని దాసనపుర బస్ డిపోలో కిరణ్(39) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. . నెలమంగళ నుంచి యశ్వంత్‌పూర్‌కు బస్సు నడుపుతుండగా అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చి స్పృహ కోల్పోయాడు. బస్సులోని సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.డ్రైవర్ కుప్పకూలడంతో బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న బస్సును రాసుకుంటూ వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన బస్సులోని కండక్టర్ డ్రైవర్‌ను లేపే ప్రయత్నం చేస్తూనే డ్రైవింగ్ సీట్లోకి వెళ్లి బస్సును సురక్షితంగా నిలిపివేశాడు. దీంతో బస్సులోని 50 మంది ప్రాణాలు నిలిచాయి. ఆ తర్వాత డ్రైవర్ కిరణ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. బస్సును నిలిపివేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కండక్టర్‌ను ఆర్టీసీ అధికారులు ప్రశంసించారు.In Bengaluru: When the bus driver suffered a heart attack, BMTC bus conductor Obalesh jumped on the driver’s seat and took control of the steering🫡 (Sadly Bus Driver Passed away due to Cardiac arrest) https://t.co/PgpTz6ENxt— Ghar Ke Kalesh (@gharkekalesh) November 6, 2024 -
TSRTC: ఆధార్ విషయమై కండక్టర్‌పై దాడి
కుషాయిగూడ: ఆధార్ విషయంలో ఓ ప్రయాణికురాలు, కండక్టర్ ఘర్షణ పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఆధార్‌ను కండక్టర్ నిరాకరించడంతో ఆగ్రహించిన ప్రయాణికురాలు కండక్టర్ పట్ల దురుసుగా వ్యవహరించి చేయి చేసుకుంది. దీంతో కండక్టర్ పోలీసులను ఆశ్రయించడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. పైగా పోలీస్‌స్టేషన్ గేటు వద్ద బైఠాయించి ధర్నాకు దిగింది. ఈ క్రమంలో పోలీసులు తప్పని పరిస్థితుల్లో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఈనెల 4న చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించారు. 4న ఈసీఐఎల్ నుంచి ఉప్పల్ వెళ్తున్న (ఏపీ29, జెడ్ 3181) ఆర్టీసీ బస్సులో కొయ్యల సరిత అనే ప్రయాణికురాలు ఎక్కింది. కండక్టర్ గద్ద శ్రీదేవి టికెట్ తీసుకుంటుండగా.. సదరు ప్రయాణికురాలు సరిత ఆంధ్రప్రదేశ్ అడ్రస్‌తో ఉన్న ఆధార్‌ను చూపింది. ప్రభుత్వ నింబంధనల మేరకు తెలంగాణ ఆధార్ మాత్రమే చెల్లుబాటు అవుతుందని, ఇది చెల్లదని టికెట్ కొనుగోలు చేయాలని కండక్టర్ సూచించింది. దీంతో ఆగ్రహించిన ఆమె కండక్టర్‌తో గొడవకు దిగి, కండక్టర్‌పై చేయి చేసుకుంది. దీంతో కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకన్న తెలిపారు. ప్రయాణికురాలిపై గతంలోనూ పలు కేసులు పలువురు ప్రభుత్వ అధికారులను గతంలో బ్లాక్ మెయిల్ చేసిన ఘటనల్లో సరితపై అంబర్పేట్, భూపాలపల్లి జిల్లా వెంకటపురం, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. -
కండక్టర్‌కు కత్తిపోట్లు..బస్సులో ప్రయాణికుడి బీభత్సం
బెంగళూరు: నగరంలోని ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్నాడు. ఇది గమనించిన బస్సు కండక్టర్ అతడిని పైకి రమ్మన్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఆ యువకుడు కండక్టర్‌పై కత్తితో దాడి చేశాడు. ఇంతటితో ఆగకుండా తోటి ప్రయాణికులను బస్సు దిగాలని బెదిరించాడు. బస్సు అద్దాలను సుత్తితో ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించాడు. కత్తి దాడిలో కండక్టర్ యోగేష్(45)కు గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కత్తిదాడికి పాల్పడ్డ యువకుడిని జార్ఖండ్‌కు చెందిన హరీశ్సిన్హా(28)గా గుర్తించారు. ఇతడు కాల్సెంటర్లో పనిచేస్తూ గత నెలలో ఉద్యోగం కోల్పోయాడు. మంగళవారం(అక్టోబర్1) జరిగిన ఈ ఘటనకు సంబంధించి హరీశ్సిన్హాపై వైట్‌ఫీల్డ్ ఏరియా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Stabbing inside BMTC Bus Shocks #BengaluruBPO employee who was fired from his job, stabs a conductor inside BMTC bus near ITPL Whitefield Conductor Yogesh reportedly asked the accused not to stand near the door, in a fit of rage the accused stabbed the conductor multiple… pic.twitter.com/AhwqUoAYPZ— Nabila Jamal (@nabilajamal_) October 2, 2024 ఇదీ చదవండి: పుణెలో కుప్పకూలిన హెలికాప్టర్..ముగ్గురు మృతి -
చిన్నారికి జీవితకాలం ఉచిత బస్సు పాస్
గద్వాల క్రైం: గద్వాల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణికి స్టాఫ్‌నర్సు సహాయంతో కండక్టర్ సుఖ ప్రసవం చేయడంపై ఆర్టీసీ యాజమాన్యం, ఎండీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులో పురుడు పోసుకున్న ఈ చిన్నారికి జీవితకాలంపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. గద్వాల మండలంలోని కొండపల్లికి చెందిన గర్భిణి సంధ్య సోమవారం రాఖీ పండుగ కోసం ఆర్టీసీ బస్సులో వనపర్తికి వెళ్తుండగా పురిటి నొప్పులు రావడంతో మార్గమధ్యలోనే కండక్టర్ భారతి స్టాఫ్‌నర్సు అలివేలు సహాయంతో సుఖ ప్రసవం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం మంగళవారం హైదరాబాద్‌లోని బస్ భవన్లో కండక్టర్ భారతి, స్టాఫ్‌నర్సు అలివేలు, బస్సు డ్రైవర్ అంజిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. మహిళకు ప్రసవం చేసేందుకు సహకరించిన స్టాఫ్‌నర్సు అలివేలుకు ఏడాదిపాటు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సీవోవో రవీందర్, సిబ్బంది మునిశేఖర్, కృష్ణకాంత్, శ్రీదేవి, జ్యోతి, గద్వాల డిపో మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
శభాష్ భారతి.. కండక్టర్‌కు సజ్జనార్ అభినందనలు
మహబూబ్ నగర్, సాక్షి: రక్షాబంధన్ నాడు బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్ భారతికి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం తరపున ఎండీ సజ్జనార్ అభినందనలు తెలిజేశారు. ‘ కండక్టర్ సమయస్పూర్తితో వ్యవహారించి నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే.. సామాజిక బాధ్యతగా సేవాస్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటుతుండటం గొప్ప విషయం’అని ఎక్స్‌లో పేర్కొన్నారు.రాఖీ పండుగ రోజు తెలంగాణ ఆర్టీసి బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గద్వాల డిపోనకు చెందిన గద్వాల-వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధనన్ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ జి.భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. పండంటి ఆడబిడ్డకు మహిళ జన్మనిచ్చారు. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. రాఖీ పండుగ నాడు #TGSRTC బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి… pic.twitter.com/nTpfVpl5iT— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) August 19, 2024 -
బస్సు అద్దాన్ని పగులగొట్టి...కండక్టర్‌పై పామును విసిరి...
నల్లకుంట (హైదరాబాద్): మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ నల్లకుంట ప్రాంతంలో హల్చల్ చేసింది. చెయ్యెత్తినా సిటీ బస్సు ఆపకపోవడంతో ఆగ్రహంతో బీర్ బాటిల్ విసిరేయడమే కాకుండా.. ప్రశ్నించిన లేడీ కండక్టర్‌పై పామును విసిరేసింది. జవహర్‌నగర్ ప్రాంతానికి చెందిన బేగం (50) గురువారం సాయంత్రం విద్యానగర్–ఎన్సీసీ గేటు మధ్య రహదారిపై నిలుచుంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆమె ఆ ఇరుకైన రోడ్డులోని లక్కీ ఎక్స్ రోడ్ వద్ద సిటీ బస్సుల్ని ఆపే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ‘107 వీ’సర్వీస్ నెంబర్ కలిగిన బస్సు అక్కడకు రావడంతో ఆపాలంటూ బేగం చెయ్యి ఎత్తింది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకున్న డ్రైవర్ ఆపకుండా ముందుకు వెళ్లారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన బేగం తన చేతిలో ఉన్న సంచి నుంచి బీర్ బాటిల్ తీసి బస్సు వైపు విసిరింది. దీంతో బస్సు వెనుక అద్దం పగిలిపోయింది. లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపడంతో కిందికి దిగి వచ్చిన కండక్టర్ స్వప్న బేగంను నిలదీశారు. మద్యం మత్తులో ఉన్న బేగం తన చేతి సంచి నుంచి పామును బయటకు తీసి కండక్టర్‌పై విసిరారు. పాము పక్కకు పడటంతో కండక్టర్‌కు ముప్పు తప్పింది. బేగం అంతటితో ఆగకుండా కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. ఈలోపు సమాచారం అందుకున్న నల్లకుంట పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పాము కోసం స్నేక్ క్యాచర్ల సాయంతో వెతికినా ఫలితం దక్కలేదు. కండక్టర్ ఫిర్యాదు మేరకు బేగంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బేగంపై బస్సు అద్దాన్ని «ధ్వంసం చేయడం, కండక్టర్‌తో దురుసుగా ప్రవర్తించడం, పాము పట్ల అమానుషంగా ప్రవర్తించడం తదితర ఆరోపణలతో కేసు నమోదైంది. -
ప్రాణాలు కాపాడిన కండక్టర్
-
సడన్ బ్రేక్ వేసిన డ్రైవర్.. బలైన కండక్టర్
భూదాన్‌పోచంపల్లి : ఆర్టీసీ బస్సు డ్రైవర్ సడన్‌బ్రేక్ వేయడంతో ఫుట్‌బోర్డు నుంచి జారి కిందపడి కండక్టర్ మృతిచెందాడు. భూదాన్‌పోచంపల్లి జలాల్పురం గ్రామశివారులో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 50 మందికి పైగా ప్రయాణికులతో ఆదివారం సాయంత్రం 6.20గంటలకు పోచంపల్లి నుంచి సొంత డిపోకు బయలుదేరింది. బస్సులో బిహార్ రాష్ట్రానికి చెందిన కోళ్ల ఫారాల్లో పనిచేసే దాంజిరామ్ కూడా జలాల్పురం వరకు టికెట్ తీసుకున్నాడు.బస్సు జలాల్పురం దాటగానే కండక్టర్ దేవినేని సత్తిరెడ్డి(59) ప్రయాణికులకు టికెట్లు ఇస్తూ ముందు ఫుట్‌బోర్డు వైపు వచ్చాడు. ఇదే క్రమంలో దాంజిరామ్ తాను దిగాల్సిన స్టేజీ దాటిపోతుందని భావించి వేగంగా కదులుతున్న బస్సులోంచి ఒక్కసారిగా కిందికి దూకాడు. గమనించిన బస్సుడ్రైవర్ పోచంపల్లికి చెందిన మక్తాల సాయి సడెన్ బ్రేక్ వేయడంతో ముందు ఫుట్‌బోర్డు సమీపంలో ఉన్న కండక్టర్ బస్సులోంచి జారి కిందరోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. బస్సులోంచి దూకిన దాంజిరామ్ తలకు తీవ్రగాయాలు కాగా అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన కండక్టర్ సత్తిరెడ్డి హైదరాబాద్‌లోని మన్సురాబాద్‌లో స్థిరనివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. బస్సు డ్రైవర్ మక్తాల సాయి ఏడాది క్రితం భూదాన్‌పోచంపల్లి మండల శివారులో బైక్‌ను ఢీకొట్టి వాహనదారుడి మృతికి కారణమయ్యాడు. దాంతో అప్పుడు ఇతనిపై కేసు నమోదయ్యింది. ఈ మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్‌రెడ్డి తెలిపారు. -
గుండెపోటుతో కండక్టర్ మృతి
ఆదిలాబాద్: మండల కేంద్రానికి చెందిన దాసరి శివరాజ్(57) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శివరాజ్ కుమార్ భైంసా డిపోలో ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి తన కుమారుడు కృష్ణ పైచదువుల కోసం అమెరికా వెళ్తుండగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కుటుంబ సభ్యులంతా వీడ్కోలు పలికి హైదరాబాద్‌లోని ఇంటికి వచ్చారు. అంతలోనే గుండెపోటు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. కుమారుడికి సమాచారం అందించడంతో తిరుగు పయనమయ్యాడు. మంగళవారం జరిగిన అంతక్రియలో డిపో మేనేజర్ అమృత పాల్గొని నివాళులర్పించారు. -
కండక్టర్ బలవన్మరణం!
రంగారెడ్డి: అనారోగ్య సమస్యలు భరించ లేక ఓ ఆర్టీసీ కండక్టర్ పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆలూరులో సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కుమ్మరి ప్రభాకర్(39) ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కొన్ని రోజులుగా కడుపునొప్పి తదితర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగానికి కూడా వెళ్లడం లేదు. ఆయన భార్య నవనీత తన పిల్లలతో సహా పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నెల 23న ప్రభాకర్ భార్యాపిల్లలను చూసి మధ్యాహ్నం స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం ఉదయం పురుగు మందు సేవించి వచ్చి ఇంటి ఎదుట పడిపోవడంతో స్థానికులు గమనించి చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కండక్టర్ కుటుంబానికి రూ. 50 లక్షల సాయం అందించిన టీఎస్ఆర్టీసీ
హైదరాబాద్: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) అండగా నిలిచింది. కండక్టర్ అకాల మరణంతో విషాద చాయాలుఅలుముకున్న ఆ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్ బొల్లం సత్తయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జగిత్యాల నుంచి వరంగల్ వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సును రాంగ్ రూట్లో వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మల్యాల-బలవంతాపూర్ స్టేజీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో బాధిత కండక్టర్ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ నేపధ్యంలో యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్, రూపే కార్డు బాధిత కుటుంబానికి అక్కరకొచ్చింది. సిబ్బంది, ఉద్యోగుల సాలరీ అకౌంట్స్‌ను ఇటీవల యూబీఐకి మార్చింది టీఎస్ఆర్టీసీ యాజమాన్యం. ఆర్థిక ప్రయోజనాలతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్, రూపే కార్డు తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో సంస్థలోని ఉద్యోగులందరూ వారు నివసిస్తున్న ప్రాంతాల్లోని యూబీఐ బ్రాంచీల్లో సంస్థ సూచించిన ఖాతాను తెరిచి రూపే కార్డులను తీసుకున్నారు. ఈ ఖాతా, కార్డు ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉండటంతో ఉద్యోగులకు ఎంతో ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. ప్రమాదాలు జరిగిన సమయంలో సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కింద (ఉద్యోగి వేతనం ప్రకారం) కనీసం రూ.40లక్షలు, రూపే కార్డు కింద మరో రూ.10లక్షలను యూబీఐ అందజేస్తోంది. ఈ మేరకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జగిత్యాల డిపో కండక్టర్ బొల్లం సత్తయ్య కుటుంబానికి రూ.50 లక్షల విలువైన 2 చెక్కులను యూబీఐ అధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మంగళవారం బస్‌భవన్‌లో అందజేశారు. రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించడంపై కండక్టర్ సత్తయ్య భార్య బొల్లం పుష్ఫతో పాటు కొడుకు ప్రవీణ్ కుమార్, కూతురు మాధవీలత సంతోషాన్ని వ్యక్తం చేశారు. చెక్కులను అందజేసిన అనంతరం సజ్జనర్ మాట్లాడుతూ.. తన తప్పు ఏమీ లేకపోయినా రోడ్డు ప్రమాదంలో సత్తయ్య అకాల మరణం చెందటం దురదృష్టకరమన్నారు. ఉద్యోగుల సంక్షేమానికె తమ సంస్థ అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు గుర్తు చేశారు. కుటుంబపోషణలో పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంస్థ అండగా నిలుస్తుందని, ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఎంతో ఉపకరిస్తుందన్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఆర్థిక ప్రయోజనాలతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ గా ఉద్యోగుల ఖాతాలను యాజమాన్యం మార్చడం జరిగిందని చెప్పారు. సంస్థలోని ప్రతి ఉద్యోగి సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్‌కు ఖాతాను మార్చుకోవాలని సూచించారు. కొన్ని పథకాలు ఆపద సమయంలో అక్కరకు వస్తాయని, ఇందుకు ఇదే ఉదాహరణ అని, వాటిని వినియోగించుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదని సూచించారు. ఈ అవకాశాన్ని కల్పించిన యూబీఐకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఈడీలు ఎస్.కృష్ణకాంత్, వినోద్ కుమార్, యూబీఐ జనరల్ మేనేజర్ పి.క్రిష్ణణ్, రీజినల్ హెడ్ డి.అపర్ణ రెడ్డి, డిప్యూటీ రీజినల్ హెడ్ జి.వి.మురళీ కృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మహిళలు టికెట్లు కొనరు..కండక్టర్లకు చిక్కులు
రాయచూరు రూరల్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఐదు గ్యారంటీ కార్డు పథకాల్లో భాగంగా కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనే వాగ్దానం కండక్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మహిళలు టికెట్ తీసుకోకుండా కండక్టర్లతో గొడవలు పడుతున్న ఘటనలు రోజూ జరుగుతున్నాయి. కాగా చెకింగ్ సిబ్బంది కండక్టర్లనే బాధ్యులను చేస్తున్నారు. వివరాలు.. శుక్రవారం భాల్కి నుంచి బీదర్ మీదుగా హైదరాబాద్ వెళుతున్న బస్సును ఖానాపూర్ వద్ద అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో టికెట్ తనిఖీ అధికారులు ఓ మహిళ వద్ద టికెట్ లేకపోవడంపై కండక్టర్‌పై మండిపడ్డారు. ఆమెకు టికెట్ ఎందుకివ్వలేదని నిలదీశారు. ఉచిత రవాణా సదుపాయం అంటూ ప్రకటించిన నేపథ్యంలో తాను టికెట్ తీసుకోలేదని ప్రయాణికురాలు చెప్పినా అధికారులు కండక్టర్‌ను మందలించి క్రమశిక్షణ చర్యలకు పూనుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన కండక్టర్ రామకృష్ణ డ్యూటీ ముగిసిన అనంతరం బీదర్ డిపో ముందు తాడుతో ఉరి వేసుకునేందుకు యత్నించాడు. తోటి సిబ్బంది, ఉద్యోగులు గమనించి కండక్టర్‌ను రక్షించారు. -
ఆర్టీసీ బస్సు బీభత్సం.. కండక్టర్ భర్తపై దూసుకెళ్లి..
సాక్షి, నెల్లూరు జిల్లా: కావలి ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ కండక్టర్ భర్తపై బస్సు దూసుకెళ్లింది. భార్య సుభాషిణిని గ్యారేజీలో వదిలి తిరిగి బైకుపై వెళ్తుండగా బస్సు ఢీకొంది. ఈ ఘటనలో అక్కడికక్కడే సుబ్బారాయుడు మృతి చెందాడు. ఆర్టీసీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. చదవండి: హెల్త్ వర్కర్‌తో అనుచిత ప్రవర్తన.. ఒక్కసారిగా షాకైన మహిళ! -
మంటల్లో చిక్కుకున్న బస్సు..అదే టైంలో కండక్టర్ నిద్రిస్తుండటంతో..
బస్టాప్ వద్ద పార్క్ చేసి ఉన్న ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో బస్సులో కండక్టర్ నిద్రించగా, బస్టాప్‌లోని రెస్ట్‌రూంలో డ్రైవర్ నిద్రించడానికి వెళ్లాడు. దీంతో కండక్టర్ ఈ ప్రమాదం బారినపడి..తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బెంగుళూరులోని లింగధీరహల్లిలో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(బీఎంటీసీ) బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. బీఎంటీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో..అదే సమయంలో ఆ బస్సులో కండక్టర్ నిద్రపోతున్నాడు. దీంతో అతను మంట్లో చిక్కుకుని..80 శాతం కాలిన గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఐతే బస్సు డ్రైవర్(39) ప్రకాశ్ ఆ సమయంలో బస్టాప్‌లోని రెస్ట్ రూంలో నిద్రపోవడంతో అతను సురక్షితంగా ఉన్నాడు. అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఆర్టీసీ డీసీపీ పేర్కొన్నారు. ఐతే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు అధికారులు. (చదవండి: భారతీయులు అలాంటివి అనుమతించరు! సమాచార మంత్రి ఫైర్) -
ఒక్క రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు..చివరకు..
బెంగళూరు: మనం ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు టికెట్ తీసుకుంటే కండక్టర్ ఒక్కోసారి చిల్లర లేదని చెబుతుంటాడు. కొన్నిసార్లు టికెట్ వెనకాల రాసి దిగేటపుడు తీసుకోమంటాడు. దీంతో కొంతమంది ఒక్క రూపాయి, రెండు రూపాయల చిల్లరను కండక్టర్‌కే వదిలేసి వెళ్తుంటారు. కానీ కర్ణాటకకు చెందిన ఒ వ్యక్తి మాత్రం ఇలా కాదు. తనకు రావాల్సిన ఒక్క రూపాయిని కూడా వదులుకోలేదు. దీని కోసం వినియోగదారుల కోర్టు వరకు వెళ్లి విజయం సాధించాడు. ఏం జరిగిందంటే? ఒక్క రూపాయి కోసం కోర్టు వరకు వెళ్లిన ఇతని పేరు రమేశ్ నాయక్. 2019లో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్(బీఎంటీసీ) బస్సు ఎక్కి శాంతి నగర్ నుంచి మజెస్టిక్ బస్ డిపో వరకు టికెట్ తీసుకున్నాడు. టికెట్ ధర. రూ.29. దీంతో కండక్టర్‌కు రూ.30 ఇచ్చాడు రమేశ్. మిగతా ఒక్క రూపాయి చిల్లర ఇవ్వమని అడిగాడు. ఇందుకు కండక్టర్ అతనిపై కోపపడ్డాడు. చిల్లర లేదు ఇవ్వనని గట్టిగా అరిచాడు. కండక్టర్ తీరు చూసి వాపోయిన రమేశ్.. బీఎంటీసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లు కూడా పట్టించుకోలేదు. అతనికి ఒక్క రూపాయి తిరిగి ఇవ్వలేదు. ఇక లాభం లేదని భావించిన రమేశ్ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. రూ.15వేలు పరిహారంగా ఇప్పించాలని కోరాడు. ఈ విషయాన్ని పరిశీలించిన న్యాయస్థానం బీఎంటీసీకి షాక్ ఇచ్చింది. రమేశ్‌కు రూ.2,000 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. న్యాయప్రక్రియకు అయిన ఖర్చు కోసం మరో రూ.1,000 అదనంగా చెల్లించాలని చెప్పింది. 45 రోజుల్లోగా పరిహారం అందజేయాలని పేర్కొంది. ఒకవేళ చెప్పిన తేదీలోగా పరిహారం ఇవ్వకపోతే ఏటా రూ.6,000 వడ్డీ కింద చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. విషయం రూపాయి గురించే కాదు.. అయితే ఈ వ్యవహారంలో బీఎంటీసీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఇది బస్సుల్లో రోజూ జరిగే సాధారణ విషయమేమని, సేవల్లో ఎలాంటి లోపం లేదని వాదించింది. రమేశ్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది. న్యాయస్థానం మాత్రం వీరి వాదనను తోసిపుచ్చింది. ఇది ఒక్క రూపాయి చిల్లర విషయం గురించి మాత్రమే కాదని, వినియోగదారుడి హక్కు అంశమని స్పష్టం చేసింది. కండక్టర్ ప్రవర్తించిన తీరును తప్పుబట్టింది. పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. చదవండి: గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 70 చోట్ల ఎన్ఐఏ దాడులు.. -
వైరల్ వీడియో: మద్యం తాగి బస్సు ఎక్కిన వ్యక్తి.. కిందకు తోసేసిన బస్సు కండక్టర్
-
కండక్టర్‌ను వదిలేసి బస్సు రయ్
కర్ణాటక : కండక్టర్‌ను డ్రైవరు మరచిపోయి బస్సుతో బయల్దేరాడు. కొన్ని కిలోమీటర్లు వెళ్లాక సంగతిని తెలుసుకుని బస్సును నిలిపాడు. ఈ సంఘటన కొప్పళ జిల్లా బస్టాండులో చోటుచేసుకుంది. బస్సు కెఎ–37,ఎఫ్–0678, కొప్పళ బస్టాండ్ నుంచి మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరింది. దాదాపు 5 కి.మీ ప్రయాణించిన తరువాత ఓజనహళ్లి వద్దకు చేరుకోగా ప్రయాణికులు టికెట్ కోసం కండక్టర్ ఏడీ అని వెతకసాగారు. అప్పుడు బస్సు డ్రైవర్‌కు అర్థమైంది. వెంటనే అక్కడే బస్సును ఆపివేసి కండక్టర్‌కు కాల్ చేశారు. మీ వల్ల ఆలస్యమైందని ప్రయాణికులు డ్రైవర్‌కు చీవాట్లు పెట్టారు. కండక్టర్ బస్సు ఎక్కకపోతే నేనేం చేయాలని డ్రైవర్ వాపోయాడు. కండక్టర్ మరో బస్సులో అక్కడికి చేరుకుని టికెట్లు కొట్టడంతో అంతా సద్దుమణిగింది. -
బస్‌లో టిక్కెట్ గొడవ.. కండక్టర్ మృతి
సాక్షి, చెన్నై: టిక్కెట్ తీసుకోమన్న కండక్టర్‌ను ఓ మందుబాబు కొట్టి చంపేశాడు. మధురాంతకం సమీపంలో శనివారం ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాలు.. కోయంబేడు నుంచి విల్లుపురానికి ప్రభుత్వ బస్సు ఉదయం బయలుదేరింది. ఇందులో కళ్లకు రిచ్చికి చెందిన పెరుమాల్(56) కండక్టర్‌గా ఉన్నారు. మధురాంతకం బైపాస్‌లో ఓ యువకుడు బస్సులోకి ఎక్కాడు. టిక్కెట్టు తీసుకోవాలని కండక్టర్ ఆ యువకుడికి సూచించాడు. మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు తననే టిక్కెట్టు అడుగుతావా...? అంటూ కండక్టర్‌పై దాడి చేశాడు. ఇతర ప్రయాణికులు అడ్డుకుని.. మార్గం మధ్యలోని అయ్యనార్ ఆలయం వద్ద ఆ యువకుడిని కిందికి దింపేశారు. కాసేపటికే..మృతి బస్సు కొంత దూరం వెళ్లగానే కండెక్టర్ స్పృహ తప్పాడు. దీనిని గుర్తించిన డ్రైవర్, ఇతర ప్రయాణికులు మేల్ మరువత్తూరు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కండెక్టర్ మరణించినట్లు వైద్యులు తేల్చారు. ఆయన ఛాతిపై ఆ మందుబాబు బలంగా కొట్టడం వల్లే మరణించి ఉంటాడని నిర్ధారించారు. మేల్ మరువత్తూరు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు సమీప గ్రామానికి చెందిన మురుగన్(35)గా గుర్తించి అరెస్టు చేశారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెరుమాల్ కుటుంబానికి రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. చదవండి: వాట్ ఏ స్కెచ్: ప్రేమోన్మాది యాసిడ్ దాడి.. రెండువారాల తర్వాత సన్యాసి గెటప్‌లో.. -
ఇంటి నుంచి వెళ్లిపోయిన నలుగురు ఆడపిల్లలు.. కారణం తెలిసి అవాక్కయిన తల్లిదండ్రులు
సాక్షి, బళ్లారి: పబ్జీలు, రియాలటీషోలతో ప్రభావితమైన నలుగురు చిన్నారులు ఏదైనా సాధించాలనే తపనతో ఉన్నఫళంగా ఇళ్లు వదిలారు. బస్సు ఎక్కి బెంగళూరు చేరుకోగా డ్రైవర్, కండక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి వారిని సురక్షితంగా పోలీసులకు అప్పగించారు. వివరాలు.. బళ్లారిలోని పార్వతీనగర్‌లో నివాసం ఉంటున్న రెండు కుటుంబాలకు చెందిన దాదాపు పదేళ్ల వయసున్న ఆడపిల్లలు నలుగురు గతనెల 26న మధ్యాహ్నం ఇళ్లు వదిలారు. ఏదైనా సాధించేందుకు వెళ్తున్నామని, అంతవరకు తాము ఎక్కడున్నా పట్టించుకోవద్దని సెల్ఫోన్లో రికార్డు చేశారు. బళ్లారిలోని కొత్త బస్టాండుకు వెళ్లి బెంగళూరు బస్సు ఎక్కారు. వారి వెంట పెద్దలు లేకపోవడంతో డ్రైవర్, కండక్టర్ ఆరా తీశారు. కుటుంబ సభ్యుల వద్దకు వెళ్తున్నట్లు నమ్మబలికారు. అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో బెంగళూరులో బస్సు దిగకుండా భయం భయంగా దిక్కులు చూస్తుండటంతో డ్రైవర్, కండక్టర్‌కు అనుమానం వచ్చి ఉప్పారపేటె పోలీసు స్టేషన్లో అప్పగించారు. మరో వైపు తమ పిల్లలు కనిపించడం లేదని తల్లిదండ్రులు గాలింపు చేపట్టారు. ఉప్పారపేటె పోలీసు స్టేషన్లో చిన్నారులు ఉన్న విషయం సామాజిక మాధ్యమాల్లో రావడంతో తల్లిదండ్రులు వెళ్లి బళ్లారికి తీసుకొని వచ్చారు. బస్సు డ్రైవర్ రవికుమార్, కండక్టర్ నవాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: Divya Hagaragi Arrested: దివ్య మొబైల్ ముక్కలు! -
బస్సులో చిల్లర అడిగితే జైలుశిక్ష..
సాక్షి,శివాజీనగర(కర్ణాటక): బస్సుల్లో చిల్లర డబ్బు కోసం కండక్టర్‌ను ప్రయాణికులు అడగడం, కొన్నిసార్లు గొడవ జరగడం అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో కూడా ఈ ఉదంతాలు నవ్విస్తాయి. చిల్లర ఇవ్వాల్సిందేనని ప్రయాణికులు కండక్టర్లపై ఒత్తిడి తెస్తుండడాన్ని అరికట్టడానికి వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ వివాదాస్పద పోస్టర్లను బస్టాండ్లలో అతికించింది. సంస్థ ఏకపక్ష ధోరణిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆ పోస్టర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇంతకీ పోస్టర్లో ఏముందంటే.. బస్సుల్లో చిల్లర అడగడం ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడమే అవుతుంది. నేరం రుజువైతే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది అని పోస్టర్లో హెచ్చరిక ఉంది. చిల్లర అడిగితే జైలుకు పంపుతారా, ఇదెక్కడి చోద్యం అని ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. -
బస్సులో యువకుల హంగామా.. మాస్క్‌లేకుండా.. ఉమ్ముతూ..
బెంగళూరు: దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, వైరస్ ఉధృతి మాత్రం ఇంకా తగ్గలేదు. అందుకే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన, కొవిడ్ ఆంక్షలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. కాగా, చాలా చోట్ల.. ప్రజలు కరోనా నిబంధనలను అతిక్రమిస్తున్న సంఘటనలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా, ఒక బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులను మాస్క్ పెట్టుకొమ్మని అడిగినందుకు కండక్టర్‌ను చితకబాదారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచోసుకుంది. కెఎస్‌ఆర్‌టీసీకి చెందిన బస్సు గత గురువారం బెంగళూరు-హైద్రాబాద్ మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో చదాలపూర్ గేట్ వద్ద ఇద్దరు యువకులు బస్సు ఎక్కారు. వీరిద్దరు మాస్క్‌ను పెట్టుకోలేదు. పైగా బస్సులో ఎక్కడంటే అక్కడ ఉమ్మివేయసాగారు. దీంతో తోటి ప్రయాణికులు కండక్టర్‌ను పిలిచి చెప్పారు. దీంతో కండక్టర్ వారిని మాస్క్ ధరించమని చెప్పాడు. ఈ క్రమంలో ఆ యువకులిద్దరు కండక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా.. ఇష్టం వచ్చినట్టు దూషించి, దాడికి కూడా తెగబడ్డారు. కాసేపు బస్సులో నానా హంగామా సృష్టించారు. దీంతో బస్సులోని ప్రయాణికులు ఆ యువకులిద్దరిని పట్టుకుని, దేహశుద్ధి చేసి బస్సును నేరుగా చిక్కబల్లాపూర్‌లోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితులలో ఒకరిని కుప్పహల్లి గ్రామానికి చెందిన చిరంజీవిగా గుర్తించారు. మరో యువకుడు తప్పించుకున్నాడు. అయితే, నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడిన కండక్టర్ కృష్ణయ్యను చిక్కబల్లాపూర్‌లోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. కాగా, కేసును నమోదు చేసుకున్న పోలీసులు మరో నిందితుని కోసం గాలిస్తున్నారు. -
డిపో ఎదుట ఓ కండక్టర్ ఆవేదన
పరిగి: ఉద్యోగంలోకి తీసుకోకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని ఓ కండక్టర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈమేరకు డిపో ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. వివరాలు.. పరిగి ఆర్టీసీ బస్ డిపోలో మాణిక్‌నాయక్ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో గతేడాది ఆయన విధుల్లో ఉన్న బస్సులో టీసీలు తనిఖీలు చేసి అతడిపై అభియోగం మోపారు. ఓ ప్రయాణికురాలి వద్ద టికెట్ మిస్ కావటంతో కండక్టర్, డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు. ఇందులో కండక్టర్ టికెట్ ఇచ్చినప్పటికీ తానే పోగొట్టుకున్నానని ప్రయాణికురాలు లిఖితపూర్వకంగా రాసిచ్చింది. అనంతరం కొద్ది నెలలకు డ్రైవర్‌ను మాత్రమే విధుల్లోకి తీసుకున్నారు. ఇటీవల మాణిక్‌నాయక్ భార్య అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలైంది. ఏడాదిగా వేతనం లేకపోవటం, భార్య అనారోగ్యానికి గురవడంతో కుటుంబం గడవటం కష్టంగా మారింది. ఈక్రమంలో బుధవారం ఆయన పరిగి డిపో ఎదుట బైఠాయించాడు. తనను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేశాడు. ఈ విషయమై పరిగి డీఎం సుబ్రహ్మణ్యంను వివరణ కోరగా.. మాణిక్నాయక్పై సస్పెన్షన్ ఎత్తివేయటానికి ఉన్నతాధికారుల నుంచి ఆర్డర్ రావాల్సి ఉందన్నారు. ఆయన సస్పెన్షన్‌లో ఉన్నందున సగం వేతనం వచ్చేలా అకౌంటెంట్‌తో మాట్లాడతానని స్పష్టం చేశారు. -
విధుల్లో ఆర్టీసీ కండక్టర్లు
రాజంపేట: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని శాఖల సేవలను వినియోగించుకుంటోంది.ఈ నేపథ్యంలో జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలో కండక్టర్లను వినియోగించుకుంటోంది. 560 మందిని వారి సొంత ప్రాంతాల్లోని పోలీసుశాఖకు అటాచ్ చేశారు. శుక్రవారం రాజంపేట డిపో పరిధిలోని నందలూరుకు చెందిన 13 మంది కండక్టర్లను స్థానిక పోలీసుస్టేషన్‌కు అటాచ్ చేశారు. వీరికి స్ధానిక ఎస్ఐ ప్రసాద్‌రెడ్డి కరోనా కట్టడికి సంబంధించిన విధులు, ప్రాంతాలను కేటాయించారు. జిల్లాలో డిపోల వారీగా.. జిల్లాలో డిపోల వారీగా రాజంపేటలో 90, కడప 90, ప్రొద్దుటూరు 100,రాయచోటి 100, జమ్మలమడుగు 70,పులివెందుల 60,మైదుకూరు 50 మంది కండక్టర్లను కరోనా వైరస్ నివారణ బాధ్యతలను అప్పగించారు. ఈ విషయంపై ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ జీవీనరసయ్య ‘సాక్షి’మాట్లాడుతూ కరోనా కట్టడికి చర్యలు చేపట్టే అవకాశం ప్రభుత్వం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. -
మహిళతో బస్సు కండక్టర్ అసభ్య ప్రవర్తన!
బెంగుళూరు: బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ పట్ల కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పట్టపగలే మహిళ చెయ్యి పట్టుకుని వికృతంగా ప్రవర్తించిన ఘటన కర్ణాటక రోడ్డు రవాణ సంస్థ(కేఎస్ఆర్టీసీ) బస్సులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని పుత్తూరు డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహించే ఓ ప్రబుద్ధుడు ప్రయాణికురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. పుత్తూరు నుంచి హసన్‌కు బస్సులో ఓ మహిళ ప్రయాణిస్తోంది. మధ్యాహ్న సమయం కావడం.. బస్సులో ఎవరూ లేకపోవడంతో కండక్టర్ ప్రయాణికురాలిని లైంగికంగా వేధించాడు. ఈ క్రమంలోనే ఆమె పక్క సీట్లోకి వెళ్లి మెల్లగా మాటలు కలిపాడు. తర్వాత చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. సదరు మహిళ కండక్టర్‌ను వారించే ప్రయత్నం చేసిన ఈ ప్రబుద్ధుడు పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకొని సదరు మహిళ అతగాడు చేస్తున్న వికృత చేష్టలను తన మొబైల్ ఫోన్లో బంధించింది. బస్సు హసన్‌కు చేరుకోగానే బస్సు దిగిన ఆ మహిళ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో పాటు కేఎస్ఆర్టీసీ అధికారులకు పంపించింది. వెంటనే ఈ ఘటనపై సంస్థ యాజమాన్యం స్పందించి దీనిపై దర్యాప్తుకు ఆదేశించింది. ఆడపిల్లలపై జరుగుతున్న అఘాత్యాలు ఇప్పటిదాకా క్యాబ్‌లు, ఆటోలకే పరిమితం కాగా.. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో అది కూడా బస్సు కండక్టర్ ఈ దారుణానికి పాల్పడటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా కండక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ఈ కండక్టర్.. కాబోయే కలెక్టర్?
తీరిక లేకుండా కండక్టర్ ఉద్యోగం. పెద్ద పెద్ద అకాడమీల్లో శిక్షణ పొందలేదు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు ఉన్న వనరులతోనే సివిల్స్ వైపు సాగిపోతున్నాడో యువ కండక్టర్. దూరవిద్యలో డిగ్రీ, పీజీలు చేసి సివిల్స్ పరీక్షల్లో మెయిన్స్‌ను అధిగమించాడు. కర్ణాటక, యశవంతపుర: పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చని నిరూపించే పనిలో ఉన్నారు బస్సు కండక్టర్ ఒకరు. మండ్య జిల్లా మళవళ్లికి చెందిన ఎన్సీ మధు బెంగళూరులోని కొత్తనూరు 34వ బీఎంటీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నాడు. తన 19 ఏటనే కండక్టర్ కొలువు సాధించాడు. చదువు అంటే ఎంతో ఇష్టం కావడంతో మధు ఐఏఎస్ కావాలని కలగన్నాడు. అందుకోసం దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీని పూర్తి చేశాడు. 2014లో కేఎఎస్, 2018, 2019లో యుపీఎస్సీ పరీక్షలను రాశాడు. 2019లో కన్నడ మాధ్యమంలో సివిల్స్ రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. రాజనీతి శాస్త్రం, జనరల్ స్టడీస్‌ను ఎంపిక చేసుకొని రాసిన మెయిన్స్ పరీక్షల్లో పాసై ఇంటర్వ్యూకు ఎంపిక కావడం విశేషం. మార్చి 25న ఢిల్లీలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇంటర్వ్యూలో పాసైతే కలెక్టర్ లేదా ఎస్పీ ఏదైనా సాధించినట్లే. రెండుసార్లు పరాజయం 2014లో కేఎఎస్ పరీక్ష , 2018లో సివిల్స్ రాసినా ఫలితం లేదు. నిరుత్సాహం పడకుండా ఈసారి సాధించాలనే పట్టుదలతో యూ ట్యూబ్‌లో సివిల్స్ పరీక్షల మెళకువలు నేర్చుకున్నాడు. తన మొబైల్ ఫోన్లో యూ ట్యూబ్ ద్వారా కోచింగ్ తీసుకుంటూ సన్నద్ధమయ్యాడు. 2019లో యుపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ రాసి సత్తా చాటాడు. రోజూ 5 గంటలు వీడియోలతో కోచింగ్ తాను ఎక్కడా కోచింగ్‌కు వెళ్లలేదని, రోజు ఐదు గంటల పాటు యూ ట్యూబ్‌లోలో కోచింగ్ తరగతులను చూస్తూ పరీక్షకు సిద్ధమైనట్లు మధు చెబుతున్నాడు. తనకు యూ ట్యూబే మార్గదర్శనమని చెప్పాడు. ఇప్పుడు ఇంటర్వ్యూపై దృష్టి పెట్టినట్లు తెలిపాడు. -
రూపాయి కోసం ముష్టియుద్ధం
కర్ణాటక ,తుమకూరు: ఒక్క రూపాయి కోసం రక్తం చిందింది. ఎవరో ఒకరు సర్దుకునిపోయి ఉంటే సరిపోయేదానికి బాహాబాహీ తలపడడంతో అందరూ విస్తుపోయారు. రూపాయి చిల్లర విషయమై కండక్టర్–ప్రయాణికుని మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటన మధుగిరి తాలూకా చిక్కపాలనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం మధుగిరి నుంచి బెంగళూరుకు బయలుదేరిన కేఎస్ఆర్టీసీ బస్సులో నాగేనహళ్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాదనాయకనహళ్లికి వెళ్లడానికి టికెట్ తీసుకున్నాడు. తన స్టాప్ సమీపిస్తుండడంతో తనకు ఇవ్వాల్సిన ఒక్క రూపాయి చిల్లర ఇవ్వాలంటూ ప్రయాణికుడు కంబయ్య కండక్టర్ అజ్జప్పను అడిగాడు. అయితే తన వద్ద చిల్లర లేదని కండక్టర్ బదులివ్వడంతో ఇదే విషయమై ప్రయానికుడు, కండక్టర్‌తో వాగ్వాదానికి దిగాడు. ప్రయాణికుడికి రక్తగాయాలైన దృశ్యం టికెట్ మిషన్‌తో కండక్టర్ వీరంగం : ఇది శృతి మించడంతో కంబయ్య, అజ్జప్ప ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో కండక్టర్ అజ్జప్ప టికెట్ మిషన్‌తో కంబయ్యపై దాడి చేయడంతో కంబయ్యకు గాయాలయ్యాయి. గమనించిన ప్రయాణికులు ఇరువురిని విడిపించి కండక్టర్ అజ్జప్పపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మధుగిరి పోలీసులు కంబయ్యను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రూపాయి ఇవ్వకుండా రక్తం వచ్చేలా కొట్టిన కండక్టర్ దురుసుతనంపై ప్రయాణికులు మండిపడ్డారు. ఈ గొడవ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
ఆర్టీసీ సమ్మె : కత్తెర పట్టిన కండక్టర్
నిర్మల్ అర్బన్: ఓ ఆర్టీసీ కండక్టర్ కత్తెర పట్టాడు. ఆర్టీసీ సమ్మె కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో కుటుంబ పోషణ నిమిత్తం కులవృత్తిని చేపట్టాడు. నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్ కాండ్లీకి చెందిన మహిపాల్ గతంలో సెలూన్ నిర్వహించేవాడు. 2009లో ఆర్టీసీ కండక్టర్‌గా విధుల్లో చేరాడు. అప్పటి నుంచి కులవృత్తిని వదిలేశాడు. నిర్మల్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాడు. వచ్చే జీతంలో ఇంటి కిస్తీలు చెల్లిస్తూ.. పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలో కార్మికులంతా సమ్మెలో పాల్గొన్నారు. అప్పటికే నెల జీతం రావాల్సి ఉంది. సమ్మె కారణంగా మరో నెల జీతం రాకుండా పోయింది. రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఏం చేయాలో పాలుపోక కులవృత్తి అయిన.. తనకు వచ్చిన పనిని చేపడుతున్నాడు. సమస్యల పరిష్కారం కోసం అటు సమ్మెలో పాల్గొంటూ.. కుటుంబ పోషణ కోసం కులవృత్తిని చేపడుతున్నాడు. -
కండక్టర్ అంత్యక్రియల్లో పోలీసుల అత్యుత్సాహం
సాక్షి, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లాలోని ఆత్మకూరులో ఆర్టీసీ కండక్టర్ రవీందర్ అంతిమయాత్రలో గందరగోళం చోటుచేసుకుంది. అంతిమయాత్రను త్వరగా ముగించాలని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. కుటుంబ సభ్యులు, అంతిమయాత్రలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహించిన పోలీసు కమిషనర్ మధు ఆర్టీసీ కార్మికులపై చేయి చేకున్నారు. పోలీసుల తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పోలీసులు తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతిమయాత్రను ఆపి.. రవీందర్ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన ఆర్టీసీ కండక్టర్ రవీందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు భారీ కాన్వాయ్‌తో రవీందర్ మృతదేహాన్ని ఆయన స్వస్థలం వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరుకు తరలించారు. రవీందర్‌కు భార్య రజిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవీందర్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 29వ రోజుకు చేరింది. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. చదవండి: ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె -
డోర్ మూయకుంటే డ్రైవర్, కండక్టర్‌పై చర్యలు
తమిళనాడు, తిరువొత్తియూరు: ప్రయాణిస్తున్న బస్సు తలుపులు మూయకుంటే డ్రైవర్, కండక్టర్లపై చర్యలు తీసుకుంటామని రవాణశాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ తరపున నిత్యం 19 వేల బస్సులు నడుస్తున్నాయి. ఇందులో చెన్నై, కోవై, మదురై, తిరుచ్చి నగరాలకు వెళ్లే బస్సుల్లో రద్దీ ఉంటుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో పాఠశాల, కళాశాల విద్యార్థులు, ప్రజలు ఫుట్‌బోర్డుపై వేలాడుతున్నట్టు ప్రయాణం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బస్సు తలుపులను మూయడానికి వీలు పడడం లేదు. తద్వారా పెద్ద ప్రమాదం జరుగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బస్సు ఫుట్‌రోడ్డుపై నుంచి కింద పడిన కొన్ని సంఘటనలు ఉన్నాయని, ఈ ప్రమాదాలను నివారించటానికి తప్పనిసరిగా డ్రైవర్లు బస్సు ప్రయాణిస్తున్న సమయంలో డోర్లు మూసి ఉంచాలని లేని పక్షంలో బస్సు డ్రైవర్, కండక్టర్లకు నోటీసులు పంపించి చర్యలు తీసుకుంటామని రవాణ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. -
కండక్టర్ నగదు బ్యాగ్‌తో ఉడాయించిన యువకుడు
కర్ణాటక ,బొమ్మనహళ్లి : ప్రయాణికుడిలా బస్సులోకి వెళ్లి కండక్టర్ నగ దు బ్యాగ్‌తో ఉడాయిస్తున్న ఓ వ్యక్తిని స్థానికుల సహాయంతో కండక్టర్ పట్టుకుని చితకబాదిన ఘటన సోమవారం కేఎస్ఆర్టీసీ బస్టాండు వద్ద చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం ఆనేకల్ నుంచి బెంగళూరు నగరానికి వస్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సు మహిళా కండక్టర్, ఎంట్రీ కోసం తన నగదు బ్యాగ్‌ను సీట్‌పై ఉంచి డిపోలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఓ యువకుడు బస్సులోకి ప్రవేశించి బ్యాగ్ తీసుకుని పారిపోతుండగా గుర్తించిన కండక్టర్ గట్టిగా అరవడంతో స్థానికులు గుర్తించి దుండగుడిని పట్టుకుని చితకబాది నగదు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. -
‘ఓడి’పోవాల్సిదే!
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ ఆర్టీసీలో ఓడీల(అదర్ డ్యూటీస్) దందా జోరుగా సాగుతోంది.సాధారణంగా దీర్ఘకాలిక అనారోగ్యంతోబాధపడుతున్న కండక్టర్, డ్రైవర్లకు రన్నింగ్ డ్యూటీ నుంచి కొంతకాలం మినహాయింపు ఇచ్చేందుకు ‘ఇతర విధుల’కు బదిలీ చేస్తారు. కేవలం ఎండీ స్థాయిలో మాత్రమే జరగాల్సినఓడీ (అదర్ డ్యూటీ).. ఇటీవలఎండీ అనుమతులు లేకుండానే డిపో మేనేజర్లు, రీజనల్ మేనేజర్ల స్థాయిలో ఎడాపెడా జరిగిపోతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓడీ బదిలీ పొందిన వారు ఆరు నెలల్లో తిరిగి తమ పూర్వ విధుల్లో చేరాల్సి ఉండగా.. చాలా మంది ఓడీ విధుల పునరుద్ధరణ లేకుండానే ఏళ్ల తరబడి అదే ఓడీ పైనే కొనసాగుతున్నారు. దీంతో ప్రతి డిపోలో సీనియర్ల పదోన్నతులకు గండి పడుతోంది. ఏళ్ల తరబడి కండక్టర్లు, డ్రైవర్లుగా పనిచేసిన వారు ఎలాంటి పదోన్నతి లేకుండానే ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తోందని కొన్ని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓడీ నిబంధనలు ఇవీ.. సాధారణంగా ధీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులకు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఓడీ ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కూడా వారు అనారోగ్యంతో బాధపడుతున్నట్టయితే ఎండీ మరికొంత కాలం పాటు పొడిగిస్తారు. అనారోగ్యంతో బస్సులు నడపలేని డ్రైవర్లు, టికెట్లు ఇవ్వలేని కండక్టర్లకు ఈ అవకాశం కల్పిస్తారు. ఓడీ బదిలీ పొందిన వారు డిపోల్లో, బస్టేషన్లలోను, బస్టాపుల్లో కంట్రోలర్లు, పాయింట్‌మెన్‌గా సాధారణ విధుల్లో కొనసాగుతారు. కొందరు క్లర్క్‌లుగా పనిచేస్తారు. డిపో మేనేజర్లు తమ అవసరాలకు అనుగుణంగా ఇతరత్రా విధులను కూడా వీరికి అప్పగిస్తారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారితో పాటు, ప్రతి డిపోలో ఒకరిద్దరు సీనియర్లకు ‘నాన్ మెడికల్’ కేటగిరీ కింద ఓడీ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఎలాంటి ఓడీ అయినా పొందాలంటే మాత్రం ఎండీ అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందే. కానీ ఇక్కడ అవేమీ పట్టించుకోకుండా కిందిస్థాయిలోనే ఓడీలు ఇచ్చేస్తున్నారు. అర్హత ఉన్నా సున్నే.. ఏకపక్షంగా జరుగుతున్న ఈ వ్యవహారంలో ప్రధాన కార్మిక సంఘాలకు చెందిన కొందరు నాయకులే అడ్డగోలు బదిలీల కోసం అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. మెడికల్, నాన్ మెడికల్ కేటగిరీల్లో తమకు నచ్చిన వారికి ఓడీ ఇచ్చేవిధంగా ఒత్తిడి తెస్తున్నారు. దీంతో నిజంగా అనారోగ్యంతో బాధపడుతూ ఓడీ కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశం లభించడం లేదు. గుండె జబ్బులు, వెన్నునొప్పి, పక్షవాతం వంటి రోగాలతో బాధపడుతున్న వారికి వైద్యుల సూచన మేరకు ఓడీ ఇవ్వాలి. ఇలాంటి ఉద్యోగులు నెలల తరబడి అధికారులు చుట్టూ తిరుగుతుండగా, కేవలం కార్మిక సంఘాలు సూచించిన వారికి మాత్రమే క్షణాల్లో ఓడీలు ఇచ్చేస్తున్నారని, అర్హత ఉన్నవారికి మాత్రం అన్యాయం జరుగుతోందని వివిధ డిపోలకు చెందిన సీనియర్ డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘20 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి ఎలాంటి పదోన్నతులు లేవు. కేవలం డ్రైవర్, కండక్టర్‌గానే ఉన్నారు. చివరకు అలాగే ఉద్యోగ విరమణ చేస్తున్నారు. కానీ అధికారుల ప్రాపకంతో, కార్మిక సంఘాల మద్ధతు ఉన్నవారికి ఎలాంటి సీనియారిటీ లేకున్నా, అనారోగ్యం లేకపోయినా ఓడీ ఇచ్చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం’ అని కుషాయిగూడ డిపోకు చెందిన ఓ డ్రైవర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆ డిపోలో పనిచేస్తున్న ఓ జూనియర్ మహిళా కండక్టర్‌కు ఈసీఐఎల్ బస్‌స్టేషన్‌లో పాయింట్ డ్యూటీ అప్పగించడంపట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క కుషాయిగూడలోనే కాకుండా నగరంలోని 29 డిపోల్లోనూ ఓడీల్లో నిబంధనలు పాటించడం లేదని కండక్టర్లు, డ్రైవర్లు చెబుతున్నారు. కార్మిక నేతలు కాకున్నా ‘రిలీఫ్’ ప్రతి డిపోలో కార్మిక సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులకు ‘రిలీఫ్’నిస్తారు. కార్మికుల సమస్యల కోసం, సంఘాల అవసరాల కోసం ఇలా వారు చేసే విధుల నుంచి రిలీఫ్‌ను పొందడం కార్మిక సంఘాల హక్కుల్లో భాగమే. కానీ కార్మిక సంఘాల నాయకత్వంలో లేనివారు కూడా ఆయా సంఘాల ప్రతినిధులుగా కొనసాగుతూ విధులకు గైర్హాజరుగుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి డిపోలో కనీసం 20 మంది కండక్టర్లు, డ్రైవర్లు ఇలా విధులకు డుమ్మా కొడుతున్నట్టు సమాచారం. స్తంభిస్తున్న సర్వీసులు అసలే సిబ్బంది కొరతతో నగరంలో ప్రతిరోజు వేల కొద్దీ ట్రిప్పులు నిలిచిపోతున్నాయి. ఇక ఇలాంటి సంస్థాగతమైన లోపాలు అందుకు మరింత కారణమవుతున్నాయి. ప్రతి డిపోలో పెద్ద సంఖ్యలో సర్వీసులు నిలిచిపోవడంతో సాయంత్రం సెకండ్ షిఫ్టు ట్రిప్పులకు బ్రేక్ పడుతోంది. దీంతో ఎప్పుడొస్తుందో, అసలు వస్తుందో రాదో తెలియని బస్సుల కోసం లక్షలాది మంది ప్రయాణికులు బస్టాపుల్లో పడిగాపులు కాస్తున్నారు. పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి ప్రయాణికుల నిరాదరణ, మెట్రో రైలు రాక మరిన్ని నష్టాలను తెచ్చిపెడుతోంది. దీనికి ఓడీ దందా మరింత తోడవుతోంది. -
కండాక్టరమ్మ
అనిత డాక్టరమ్మ కాదు. కండక్టరమ్మ. ప్రయాణికులను గమ్యం చేరుస్తూనే.. ప్రాణాంతక తలసేమియా నుంచి చిన్నారుల ఊపిర్లను నిలుపుతున్నారు! ప్రాణం పోసేవారే కాదు.. ప్రాణం పోయాలని తపించేవారూ డాక్టర్లే. అందుకే ఆమె కండాక్టరమ్మ. అరవై ఏళ్ల అత్తగారు కోడలి ముందుకు వచ్చి, ‘ఆ చిన్నపిల్లల కోసం నీవు చేస్తున్న సేవకు నా పెన్షన్‌లో మూడొంతులమ్మా’ అంటూ డబ్బులు కోడలి చేతిలో పెట్టింది. అత్త చూపిన ఔదార్యం కోడలు అనిత సేవను మరింత ముందుకు కొనసాగించేలా చేసింది. అత్తతో పాటు భర్త, తోటికోడలు, బావ, మరిది ‘మేమూ సాయం చేస్తామం’టూ తలా ఓ చేయి కలిపారు. కుటుంబంలో అందరూ చేయీ చేయీ కలిపితే కొండంత పనైనా దూదిపింజెంత తేలికవుతుందనిపించింది అనితకు. అలా తమందరి వేతనంలో నుంచి కొంత భాగంతో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను విగతజీవులుగా మారకుండా కాపాడేందుకు వినియోగిస్తున్నారు అనిత.. ఆమె ‘సంకల్ప’బలంతో నేడు వందలాది తలసేమియా చిన్నారులు ఊపిరి నిలుపుకొని హాయిగా చిరునవ్వులు చిందిస్తున్నారు. మొగ్గ రాలిపోవడం.. దగ్గరగా చూసి! ఖమ్మం ఆర్టీసీ బస్సు డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు పొద్దుటూరి అనిత. స్థానిక ఇందిరానగర్ కాలనీలో ఉమ్మడి కుటుంబంతో కలిసి ఆమె నివాసం ఉంటున్నారు. ఎనిమిదేళ్ల క్రితం సమీప బంధువు కుమారుడు తలసేమియా వ్యాధితో బాధపడుతూ మరణించాడు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు పడిన బాధను చూసిన అనిత ‘ఈ వ్యాధితో పసిమొగ్గలు రాలిపోతుంటే చూస్తూ ఊరుకోవడమేనా, ఏమీ చేయలేమా..? అని ఆలోచించారు. ఎలాగైనా ఇలాంటి పిల్లలకు బాసటగా నిలవాలని అనుకున్నారు. ‘కదిలిన’.. కుటుంబం తొలుత ఒంటరిగానే తలసేమియా పిల్లలకు సేవ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు అనిత. వచ్చే వేతనంలో నుంచి కొంత మొత్తాన్ని తలసేమియా పిల్లలకు ఉచితంగా రక్తం అందించడానికి ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు హోంగార్డుగా పనిచేస్తున్న అనిత భర్త రవిచంద్ర ప్రోత్సాహం తోడైంది. అత్త చంద్రలీల, తోడికోడళ్లు పావని, ప్రియ, బావ ఉదయ్‌భాస్కర్, మరిది వంశీకిరీటి ఆర్థికంగా సహాయం చేస్తామని ముందుకొచ్చారు. అలా ఇంట నిలిచిన అనిత బయట గెలవడానికి బయల్దేరారు. 2010లో తలసేమియా వ్యాధిగ్రస్తులను అన్ని విధాలుగా ఆదుకోవాలనే లక్ష్యంతో ‘సంకల్ప’ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. నిరాశ ఎదురైనా వెరవలేదు! సేవ స్వచ్ఛందమైనా ఇందుకోసం సహకరించే వారే కొరవడటంతో పిల్లలకు ఇవ్వాల్సిన రక్తం కోసం ఎక్కని గడప లేదు.. అడగని సంస్థా లేదు అన్న రీతిలో తన లక్ష్య సాధన కోసం అందరినీ అభ్యర్థించారు అనిత. మొదట్లో ‘ఇదేమి సేవ.. ఎంత చేసినా ఎక్కువ కాలం బతకని పిల్లల కోసం ఎందుకింత ఆరాటం. వాళ్లేమైనా నూరేళ్లూ బతికి బట్టకడతారా.. ’ అంటూ నిరుత్సాహంగా మాట్లాడినవారే ఎక్కువ. అయినప్పటికీ అనిత మాత్రం కుటుంబ సభ్యుల అండతో రక్త సేకరణకు పూనుకున్నారు. మొదట్లో.. కుటుంబంలో ఎవరి పుట్టిన రోజులు, పెళ్లి రోజులు వచ్చినా బంధుమిత్రులను కలుపుకుంటూ రక్తదాన శిబిరాలను నిర్వహించేవారు. ఈ క్రమంలో తలసేమియా వంటి భయంకర వ్యాధితో పిల్లలు అనుభవిస్తున్న నరకం, వారి తల్లిదండ్రులు పడుతున్న మానసిక క్షోభను సమాజానికి అర్థమయ్యేలా చెప్పడంలో కొన్నాళ్లలోనే అనిత అనితర సాధ్యురాలు అనిపించుకున్నారు. దాంతో జిల్లాల్లోని తలసేమియా వ్యాధిగ్రస్తులకు అనిత అందిస్తున్న సేవలు అందరి దృష్టిలో పడ్డాయి. యజ్ఞంలా.. ప్రతినెలా రక్త సేకరణ! తలసేమియా వ్యాధి కారణంగా పిల్లలు చిరుప్రాయంలోనే మరణించిన ఘటనలు తరచూ నమోదు అయ్యేవి. అనిత ‘సంకల్ప’ సంస్థ ఆచరణలోకి వచ్చాక జిల్లాలో తలసేమియా వ్యాధి వల్ల మరణించిన వారి సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తోంది. తొలుత రెండు, మూడు బ్యాగుల రక్త సేకరణ నుంచి ప్రారంభమైన అనిత సేవ.. నేడు నెలకు 250 బ్యాగుల రక్తం సేకరించి చిన్నారులకు ఎక్కించే స్థాయికి చేరింది. ఈ రక్తం ఇస్తేనే ఆ నెలకు 180 మంది చిన్నారుల ఆయుష్షు మరో నెలకు పొడిగించబడుతుంది! దాంతో ప్రతినెలా ఈ రకమైన రక్తయజ్ఞం చేయడం ఆమెకు అలవాటైంది. ఒకవైపు కండక్టర్ వృత్తి చేస్తూ.. మరోవైపు సంసారం చక్కదిద్దుకుంటూ, భర్త, అత్త, తోటికోడళ్ల సహకారంతో ‘సంకల్ప’ స్వచ్ఛంద సంస్థను దిగ్విజయంగా నడిపిస్తున్నారు అనిత. ఇప్పుడు తలసేమియా వ్యాధి బాధితులకు రక్తం లోటు లేదు. ప్రతి 15 రోజులకోసారి 180 మంది బాధితులకు రక్తం ఎక్కించడానికి కావాల్సినంత రక్తం ఆమె స్థిరీకరించుకోగలిగారు. కష్టార్జితాన్ని ఖర్చుపెట్టాకే.. ఇంటి నుంచి మొదలైన ఆర్థిక సహాయంతో పాటు దాతల సహకారమూ తోడై ఇప్పుడు ప్రతి నెలా రూ.3లక్షల వరకు తలసేమియా వ్యాధిగ్రస్తులకు కావాల్సిన మందులను అనిత ఆధ్వర్యంలోని ‘సంకల్ప’.. ఉచితంగా పంపిణీ చేస్తోంది. ‘మా కష్టార్జితాన్ని సేవకు వినియోగించిన తర్వాతే దాతలను ఆశ్రయిస్తామ’న్న అనిత ఆలోచన మరికొందరు సమాజ సేవకులను ఈ సేవలో పాలుపంచుకునేలా చేసింది. తలసేమియా బాధితులకు సేవ చేస్తున్నందుకు, సదస్సుల ద్వారా ప్రజలలో తలసేమియా పట్ల అవగాహన కల్పిస్తున్నందుకు ఈ ఏడాది జూలై నెలలో ఉత్తమ మోటివేటర్ అవార్డును గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా అందుకున్నారు అనిత. ‘మేము సైతం’ తలసేమియా వ్యాధి ప్రధానంగా మేనరికపు వివాహాల వల్ల సంతానానికి సంక్రమిస్తుంది. ఆరు నెలల నుంచి ఒకటిన్నరేళ్ల వయసులో ఈ వ్యాధిని గుర్తిస్తే సకాలంలో వ్యాధి నివారణ చర్యలు చేపట్టి.. మరణం అంచున ఉన్న వారిని సైతం కాపాడే అవకాశం ఉంది. ఈ వ్యాధి బాధితుల్లో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ఉండదు.. అందుకే ప్రతి 15, 20 రోజులకోసారి శుద్ధి చేసిన రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. ఇది శ్రమతో కూడిందే కాదు.. ఖర్చుతో కూడుకున్నది. అయితే అనిత చేసిన ధైర్యం అందరినీ ఆలోచింపజేసింది. మేము సైతం అంటూ జిల్లాలోని పలువురు వైద్యులు, పోలీస్ అధికారులూ బాసటగా నిలిచారు. జాతీయపర్వదినాలలో రక్తదాన శిబిరాల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ‘సంకల్ప’ సంస్థకు శివ బ్లడ్ బ్యాంక్ యజమాని రాజేశ్గార్గె సేవలు తోడయ్యాయి. అలాగే పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కూరపాటి ప్రదీప్, అంకుర ఆస్పత్రి వైద్యులు డాక్టర్ రాకేశ్ తలసేమియా బాధిత చిన్నారులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. – మాటేటి వేణుగోపాల్, సాక్షి, ఖమ్మం -
కొండగట్టు ప్రమాదం; బస్సు కండక్టర్ స్పందన
సాక్షి, కరీంనగర్: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాస్‌తో పాటు 60 మందికి పైగా ప్రాణాలు కొల్పోయారు. మరికొందరు ప్రాణాలతో పోరాడుతున్నారు. అయితే ఈ ప్రమాదం పూర్తిగా ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డ కండక్టర్ పరమేశ్వర్ మాట్లాడుతూ.. బస్సు ఫిట్నెస్ సరిగా లేకపోవడంతో.. ఘాట్ రోడ్లో బ్రేక్ ఫెయిల్ అయి ఉంటుందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను బస్సు చివరలో ఉన్నానని అన్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ గట్టిగా అరిచాడని వెల్లడించారు. బస్సు కండీషన్‌పై, ప్రయాణికుల రద్దీపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తమపై ఒత్తిడి పెంచినట్టు తెలిపారు. ఘాట్ రోడ్డులో శ్రావణమాసం నుంచే బస్సులు నడుపుతున్నట్టు ఆయన తెలిపారు. బస్సులో మొత్తం 114 మంది ఉన్నారని.. అందులో 96 మందికి టికెట్ ఇచ్చానని పేర్కొన్నారు. నలుగురు చిన్నపిల్లలు కాగా, ఏడు ఎనిమిది మందికి పాసులు ఉన్నాయని.. జెఎన్టీయూ వద్ద బస్సు ఎక్కిన ఆరుగురికి ఇంకా టికెట్లు ఇవ్వలేదని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇంధనం పొదుపులో శ్రీనివాస్ ఉత్తమ డ్రైవర్ అందుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇంధనం పొదుపు కోసం డ్రైవర్ ఘూట్ రోడ్లో న్యూట్రల్లో వచ్చాడనే ఆరోపణలను పరమేశ్వర్ ఖండించలేదు. ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆయన తెలిపారు. -
చిల్లర దాడి
దొడ్డబళ్లాపురం: కేవలం ఆరు రూపాయల చిల్లర కోసం ఒక ప్రయాణికుడు కండక్టర్‌పై దాడికి పాల్పడిన ఘటన విజయపుర జిల్లా ఇండి తాలూకాలో చోటుచేసుకుంది. సులేమాన్ అనే ప్రయాణికుడు గురువారం తాంబా గ్రామంలో కేఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కాడు. చిల్లరలేకపోవడంతో కండక్టర్ ఇన్నూసాబ్ ఉస్మాన్‌సాబ్ టిక్కెట్ వెనుక రూ.6 చిల్లర రాసి ఇచ్చాడు. బస్సు గమ్యస్థలానికి వచ్చినా కండక్టర్ చిల్లర ఇవ్వలేదన్న కోపంతో సులేమాన్ గొడవపడ్డాడు. చివరకు డిపోకు వెళ్లి చిల్లర డబ్బు తీసుకున్నాడు. శుక్రవారం బస్సు తాంబా గ్రామానికి రాగా సులేమాన్ సదరు కండక్టర్‌పై ఇనుపరాడ్‌తో తలపై బాదాడు. దీంతో కండక్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు స్పందించి బాధితుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ప్రాణం తీసిన స్వలింగ సంపర్కం
అన్నానగర్: కరూర్‌లో బుధవారం బెదిరించి స్వలింగ సంపర్కానికి పాల్పడ్డ విషయం కన్నవారికి చెపుతానని చెప్పిన పాఠశాల విద్యార్థిని మినీబస్సు కండక్టర్ హత్య చేశాడు. ఈ ఘటన కరూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. కరూర్ జిల్లా క.పరమత్తి సమీపంలో ఉన్న విసువనాథపురికి చెందిన విశ్వనాథన్ కుమారుడు చిరంజీవి (13). ఇతను అదే ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన చిరంజీవి సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కన్నవారు కుమారుడి కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికారు. అయినా చిరంజీవి ఆచూకీ తెలియలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఎంజీఆర్‌నగర్ కాలువ సమీపంలో ఉన్న సీలైకోడులో ఓ బాలుడి మృతదేహం ఉన్నట్లు స్థానికులు క.పరమత్తి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా మృతి చెందిన విద్యార్థి చిరంజీవి అని తెలిసింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో చిరంజీవిని విశ్వనాథపురి సలైవైక్కల్ వీధికి చెందిన ప్రైవేట్ మినీ బస్సు కండక్టర్ ప్రదీప్ (19) మంగళవారం సాయంత్రం తీసుకుని వెళ్లినట్లుగా స్థానికులు తెలిపారు. అనంతరం ప్రదీప్‌ను పట్టుకుని పోలీసులు విచారణ చేయగా దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు వచ్చాయి. పాఠశాల ముగిసి ఇంటికి వెళుతున్న చిరంజీవిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అతన్ని బెదిరించి స్వలింగ సంపర్కానికి పాల్పడ్డాడు. భయపడిన చిరంజీవి విషయాన్ని తల్లిదండ్రులకు చెపుతానని తెలిపాడు. దీంతో ఆగ్రహం చెందిన ప్రదీప్ చొక్కాతో నోరు, ముక్కు గట్టిగా నులిమి పట్టుకున్నాడు. ఊపిరి ఆడక చిరంజీవి సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. పోలీసులు ప్రదీప్‌ను అరెస్టు చేశారు. -
నిజాయతీ చాటిన బస్ కండక్టర్, డ్రైవర్
గుంటూరు: బస్సులో కాష్‌బ్యాగ్ మర్చిపోయిన బాధితులకు ఆర్టీసీ బస్ కండక్టర్, డ్రైవర్ కాష్‌బ్యాగ్‌ను అందజేసి నిజాయతీ చాటుకున్నారు. ఈ సంఘటన మంగళగిరి పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. మంగళగిరి డిపో మేనేజర్ విజయకుమార్ తెలిపిన వివరాల ప్రకారం పిడుగురాళ్ల సమీపంలో ఇనుమట్ల గ్రామానికి చెందిన సత్యనారాయణ మంగళవారం గుంటూరులో ఆర్టీసీ బస్టాండ్‌లో బస్ ఎక్కి విజయవాడలో ఉన్న తన కుమారుడి వద్దకు బయల్దేరాడు. ఈ క్రమంలో విజయవాడ ఐస్‌ఫ్యాక్టరీ దగ్గర బస్ దిగి కొంత దూరం వెళ్లిన తర్వాత తనతో పాటు తెచ్చుకున్న రూ.78వేల కాష్‌బ్యాగ్ బస్సులో వదిలివేసినట్లు గుర్తించాడు. హుటాహుటిన విజయవాడ బస్టాండ్‌కు వెళ్లి అక్కడ ఆర్టీసీ అధికారులను విచారించగా, ఆ బస్సు మంగళగిరి డిపోకు చెందినదిగా తెలుసుకుని, మంగళగిరి చేరుకున్నాడు. జరిగిన విషయాన్ని మంగళగిరి డిపో మేనేజర్‌కు బాధితుడు వివరించారు. అయితే అప్పటికే బస్ కండక్టర్ కె.పద్మ, డ్రైవర్ ఏ.డిల్లీరావులు బస్సులో మర్చిపోయిన క్యాష్ బ్యాగ్ వివరాలను తనకు తెలిపినట్లు డిపో మేనేజర్ విజయ్‌కుమార్ వెల్లడించారు.. సత్యనారాయణను విచారించి ఆ కాష్‌బ్యాగ్ అతనిదే అని నిర్థారించి ప్రయాణీకుల సమక్షంలో ఆయనకు డిపో మేనేజర్ బ్యాగ్ అందజేశారు. విధి నిర్వహణలో నిబద్ధత పాటించి, నిజాయతీగా వ్యవహరించిన బస్ కండక్టర్, డ్రైవర్లను డిపో మేనేజర్, ఆర్టీసీ సిబ్బంది, తదితరులు అభినందించారు. ఆర్టీసీ అధికారులకు, బస్ కండక్టర్, డ్రైవర్లకు బాధితుడు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. -
టిక్కెట్ కొనమన్నందుకు దాడి
అన్నానగర్: మహిళ పోలీసును టిక్కెట్ కొనమన్నందుకు ఆగ్రహంతో ప్రభుత్వ బస్సు కండక్టర్, డ్రైవర్‌పై దాడి చేసిన సంఘటన గురువారం రాత్రి శివగంగై జిల్లాలో కలకలం రేపింది. సదరు మహిళా పోలీసు చర్యను ఖండిస్తూ రవాణా శాఖ కార్మి కులు శుక్రవారం ఉదయం బస్సులను నిలిపివేసి ఆందోళన నిర్వహించారు. శివగంగై జిల్లా, తిరుపుత్తూర్ నుంచి గురువారం రాత్రి 10 గంటల సమయంలో మాణామదురైకి ప్రభుత్వ బస్సు బయలుదేరింది. బస్సుని డ్రైవర్ సెంథిల్ కుమార్ నడిపాడు. శివగంగై రాగానే బస్సులో ఓ మహిళ ఎ క్కింది. బస్సు కండక్టర్ మురుగానందం ఆమెను టిక్కెట్ తీసుకోవాలని కోరాడు. సదరు మహిళ తాను తిరువాడనై పోలీస్‌స్టేషన్‌లో పోలీసులుగా పని చేస్తున్నానని, టిక్కెట్ తీసుకోనని బదులిచ్చిం ది. కండక్టర్ ఆమెను పోలీస్ ఐడెంటీ కార్డు చూపాలని, లేకపోతే టిక్కెట్ తీసుకోవాలని కోరాడు. దీంతో టిక్కెట్ కన్న మహిళ మాణామదురైలో బ స్సు దిగగానే తొటి పోలీసులకు విషయాన్ని తెలి పింది. ఆ సమయంలో పని ముగించుకుని బస్సు ని మాణామదురై సిప్కాట్ బస్సు డిపోలో నిలిపి, అక్కడున్న విశ్రాంతి గదిలో కండక్టర్ మురుగానం దం, డ్రైవర్ సెంథిల్‌కుమార్ నిద్రిస్తున్నారు. అర్థరాత్రి 12 గంటల సమయంలో పోలీసులు డిపోకి వెళ్లి నిద్రిస్తున్న ఇద్దరిపై తీవ్రంగా దాడి చేసి మా ణామదురై పోలీస్‌స్టేషన్‌కి తీసుకొచ్చి జైల్లో ఉంచా రు. దీనిపై సమాచారం అందుకున్న రవాణా శాఖ కార్మికులు శుక్రవారం వేకువజామున మాణామదురై డిపో నుంచి బస్సులను నడపకుండా ఆందోళనకు దిగారు. జిల్లాలోని తిరుప్పువణం, శివగంగై, తిరుప్పత్తూర్, దేవకోట, కారైక్కుడి ఆరు డిపోల్లో ఉదయం 7 గంటల వరకు బస్సులు తీయలేదు. దీనికి సంబంధించి రవాణా శాఖ అధికారులు మాణామదురై పోలీసు స్టేషన్‌కి వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న మురుగానందం, సెంథిల్ కుమార్‌ను విడిపించి చికిత్స కోసం శివగంగై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అధికారుల చర్చల అనంతరం రవాణా సిబ్బంది బస్సులను నడిపారు. -
సార్ కోసం..బస్సు ఖాళీ
బద్వేలు(అట్లూరు): ప్రయాణికుల శ్రేయస్సే ఆర్టీసీ లక్ష్యం అని అధికారులు పదే పదే గొప్పలు చెబుతుంటారు. కానీ అందుకు విరుద్ధంగా ప్రయాణికులను గాలికొదిలేసి సార్.. సేవలో మునిగిపోయి తీరిగ్గా ఖాళీ సీట్లతో బస్సు వెళ్లిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ప్రయాణికుల వివరాల మేరకు.. బద్వేలు డిపోకు చెందిన ఏపీ04జెడ్0290 నెంబరుగల బస్సు శుక్రవారం ఉదయం ప్రయాణికులతో నెల్లూరుకు బయలు దేరేందుకు సిద్ధంగా ఉంది. ఈబస్సు 6.45 గంటలకు బయలు దేరాలి. 7.15 గంటలు అయినా బయలు దేరలేదు. బస్సు ఎందుకు బయలు దేరలేదని కండక్టరును ప్రయాణికులు అడిగారు..డీఎం సార్ నేనూ వస్తున్నా.. అంతవరకు బయలు దేరవద్దన్నారు.. సమాధానమిచ్చారు. దీంతో కొంత మంది ప్రయాణికులు వేరే డిపోకు చెందిన బస్సులో బయలు దేరారు. ఈ విషయం మీడియాకు తెలిసి ఫొటోలు తీస్తుండగా వెంటనే కండక్టర్ డీఎంకు సమాచారం అందించారు. ఆయన హుటాహుటీన బస్సు ఎక్కి బయలు దేరి వెళ్లారు. దీంతో సగం బస్సు ఖాళీగానే బయలు దేరింది. -
టికెట్ కష్టమ్!
చార్మినార్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న సిటీ బస్సును డ్రైవర్ ఉన్నట్టుండి రోడ్డు పక్కన ఆపేశాడు. ‘వెనుక వచ్చే బస్సులో ఎక్కిస్తాను, పదండి’అంటూ కండక్టర్ ప్రయాణికులకు సూచించాడు. బస్సు పాడైందేమోనని భావించి ప్రయాణికులంతా వెళ్లిపోయారు. బస్సు పాడైతే ఇలా వేరే బస్సుల్లో ప్రయాణికులను పంపటం సహజం. అయితే ఇక్కడ సమస్య బస్సుది కాదు.. టికెట్ జారీ చేసే యంత్రానిది (టిమ్). అది పాడైంది.. బస్సు కదలనంది!! సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల క్రితం ఆర్టీసీలో టిమ్ (టికెట్ జారీ చేసే యంత్రం) విధానం ప్రవేశపెట్టారు. కానీ అప్పట్లో నాణ్యమైన యంత్రాలు సరఫరా కాలేదు. ఫలితంగా వాటిలో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. చార్జింగ్ మొదలు.. టికెట్‌ను వెలుపలికి తరలించే గేర్ల వరకు అన్నీ సమస్యలే. కండక్టర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో అధికారులు పాత టికెట్లతో ఉన్న ట్రేను కూడా బస్సులో ఉంచుతూ వస్తున్నారు. ఎక్కడైనా సమస్య ఏర్పడి యంత్రం పనిచేయకుంటే పాత పద్ధతిలో టికెట్లు ఇస్తూ వచ్చారు. అయితే ఏప్రిల్ ఒకటి నుంచి పాతతరం టికెట్ల జారీని పూర్తిగా నిలిపేశారు. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. పాతవి ఆపేసి.. కొత్తవి నిలిపేసి.. టిమ్‌ల జీవితకాలం మూడేళ్లు. కానీ తరచూ మొరాయిస్తుండటం, సిటీలో టికెట్ల జారీ ఎక్కువగా ఉండటంతో మరింత దెబ్బతిన్నాయి. దీంతో వాటి స్థానంలో కొత్త యంత్రాలను జారీ చేయాలని నిర్ణయించిన అధికారులు.. కొన్ని కొనుగోలు చేశారు. వాటిని మూడు నెలల పాటు పరిశీలించారు. కొత్త యంత్రాలు కావటంతో సమస్యలు లేకుండా పనిచేశాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటి నుంచి పాత టికెట్ల విధానాన్ని పూర్తిగా ఎత్తేసి, టికెట్ల ముద్రణను కూడా నిలిపేశారు. అయితే నిధుల సమస్యతో చాలినన్ని యంత్రాలు సమకూరలేదు. దీంతో ఇప్పటికీ పాత యంత్రాలనే వాడుతున్నారు. యంత్రాలు చెడిపోతే టికెట్ల జారీ సాధ్యం కావటంలేదు. పాత తరం టికెట్లు కూడా అందుబాటులో లేకపోవటంతో ప్రయాణికులకు టికెట్లు ఇవ్వలేని పరిస్థితి. దీంతో బస్సులను ఆపేసి ప్రయాణికులను దింపేయాల్సిన పరిస్థితి నెలకొంది. చార్జ్ కావు.. చార్జ్ చేయరు.. ఒక టిమ్‌ను ఫుల్ రీచార్జి చేస్తే 16 గంటలపాటు పనిచేయాలి. కానీ కొన్ని అంతసేపు పని చేయలేకపోతున్నాయి. కొన్ని యంత్రాలు సరిగా చార్జ్ కావటం లేదు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కొన్ని ఫుల్ చార్జ్ కాకుండానే బస్సుల్లోకి చేరుతున్నాయి. మరోవైపు తొలి షిఫ్ట్ పూర్తి చేసుకున్న కండక్టర్ రెండో షిఫ్ట్‌లో వచ్చే కండక్టర్‌కు టిమ్‌ను అప్పగించాలి. ఈలోపే అది నిలిచిపోయే సమస్య వస్తోంది. దీంతో ఒక్కో షిఫ్ట్‌కు ఒక్కో యంత్రం ఇవ్వాలని నిర్ణయించారు. అది జరగాలంటే భారీగా యంత్రాలు కొనాల్సి ఉంది. కానీ ఆర్టీసీ వద్ద డబ్బులు లేక కొనలేదు. పాత టికెట్లు ఇవ్వాల్సిందే.. బస్సు చెడిపోతే దాన్ని బాగు చేసేందుకు నగరంలో ప్రస్తుతం రిలీఫ్ వ్యాన్లు ఉన్నాయి. ఐదు ద్విచక్ర రిలీఫ్ వాహనాలున్నాయి. వీటిలో పది చొప్పున స్పేర్ టిమ్‌లు ఉంచి, బస్సులో యంత్రం పాడైనట్టు తెలియగానే అక్కడికి వెళ్లి ఇవ్వాలని నిర్ణయించారు. కానీ కొత్తవి రాకపోవటంతో అది ఇంకా అమలు కావటం లేదు. కొత్త టిమ్‌లు రాకముందే పాత పద్ధతిలో టికెట్ల జారీని పూర్తిగా నిలిపివేయటంపై డిపో స్థాయి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం కండక్టర్లకు రూ.3 వేల నుంచి రూ.4 వేల విలువైన మినిమమ్ డినామినేషన్లతో కూడిన పాత టికెట్లు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో బస్సు కండక్టర్ మృతి
నిర్మల్ జిల్లా : సిర్గాపూర్ గ్రామ బస్టాండ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. నిర్మల్-భైంసా రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళా కండక్టర్ మృతిచెందింది. తెల్లవారుజామున విధులకు వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కండక్టర్ మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భర్త వస్తాడనుకుంటే..
అద్దంకి: బైకు అదుపు తప్పి కింద పడటంతో ఆర్టీసీ కండక్టరు మృతి చెందిన ఘటన మండలంలోని కలవకూరు రహదారిలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. బంధువులు తెలిపిన సమాచారం మేరకు వెల్లంపల్లి గ్రామానికి చెందిన ఉదయరామిరెడ్డి (42) ఆర్టీసీలో కండక్టరుగా పనిచేస్తున్నాడు. అద్దంకి మండలంలోని కలవకూరు గ్రామానికి చెందిన జయంతిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం అద్దంకి ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్నాడు. బుధవారం సింగరకొండ క్షేత్రంలో తన బంధువుల వివాహానికి హాజరయ్యాడు. అనంతరం అత్తగారి గ్రామమైన కలవకూరులో ఉన్న తన భార్యను తీసుకుని రావడానికి రాత్రి సమయంలో బైకుపై బయలు దేరాడు. ఈ నేపథ్యంలో బైకు సింగరకొండపాలెం నుంచి కలవకూరు గ్రామ మధ్యలోని మలుపులో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో కిందపడిపోయాడు. రాత్రి సమయం కావడంతో ఎవరూ గమనించలేదు. ఎన్నోసార్లు ఫోన్ చేసిన భార్య.. భర్త వచ్చి తనను బైకుపై అద్దంకి తీసుకెళ్తానని చెప్పిన తరువాత, ఎంతసేపటకీ రాకపోవడంతో, ఎన్నోసార్లు ఫోన్ చేసింది. ఎంతకీ ఫోన్ బదులు రాకపోవడంతో అనుమానించింది. వెంటనే బంధువులు, పెళ్లివారిని విచారించగా, రాత్రి సమయంలోనే బయలుదేరి వెళ్లాడని చెప్పారు. దీంతో వారు దారి వెంట వెతుకుతూ ఫోన్ చేయసాగారు. రోడ్డు మలుపులో ఆయన ఫోన్ రింగ్ కావడంతో అక్కడ చూడగా, గుంతలో పడిపోయిన బైకు, దూరంగా మృతిచెంది ఉన్న రామిరెడ్డి కనిపించారు. ఈ దృశ్యం చూసిన భార్య, బంధువులు భోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతునికి ఇరువురు కుమారులున్నారు. -
ఈ ప్రయాణం సురక్షితమా?
ఆర్టీసీ ప్రయాణం సురక్షితం..సుఖవంతం అంటూ ప్రకటనలు గుప్పించే యాజమాన్యం ఆచరణలో ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేస్తోంది. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకుండా ఒకరికే డ్రైవర్, కండక్టర్ బాధ్యతలు అప్పగిస్తూ అధిక భారం మోపుతోంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చవలసిన గురుతర బాధ్యత ఉన్న డ్రైవర్లపై ఇలా అదనపు ఒత్తిడి పెంచడం తగదని కార్మిక సంఘాల నాయకులు పదేపదే చెబుతున్నా పట్టించుకోవడం లేదు. తూర్పుగోదావరి, కొత్తపేట/రావులపాలెం: ఆర్టీసీలో డ్రైవర్ బస్సును నడపాలి..కండక్టర్ ప్రయాణికులకు టిక్కెట్స్ ఇచ్చి డబ్బు వసూలు చేయాలి..అలా ఇద్దరూ ఎవరి డ్యూటీ వారు చేయాలి. కానీ ఎంతోకాలంగా ఒక్కరితోనే అనేక సర్వీసుల్లో డ్యూటీ చేయిస్తున్నారు. జిల్లాలోని ఆర్టీసీ డిపోల ద్వారా 40 సర్వీసుల్లో ఒక్క డ్రైవరే డ్యూటీ చేస్తుండగా, 80 సర్వీసుల్లో ఇద్దరు డ్రైవర్లు డ్యూటీ చేస్తున్నారు. ఒకపక్క బస్సును నడుపుతూనే మరోపక్క టిక్కెట్స్ ఇచ్చి డబ్బు వసూలు చేయాలి. ఈ విధానం వల్ల వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. రెండు డ్యూటీలు ఒక్కరే చేస్తున్న సర్వీసులకు అదనపు సమయం కేటాయించకుండా ఇద్దరు ఉన్న సర్వీసులకు ఇచ్చిన సమయమే ఈ సర్వీసులకూ కేటాయిస్తున్నారు. దీంతో నిర్దేశించిన సమయానికి సర్వీస్‌ను గమ్యస్థానానికి చేర్చడంతో పాటు కండక్టర్ డ్యూటీ చేయాలి. ఇద్దరు ఉన్న సర్వీసు తిరిగి గమ్యస్థానానికి చేరాక డ్రైవర్ బస్సును డిపోలో స్వాధీనం చేస్తారు. కండక్టర్ ఎస్‌ఆర్‌తో పాటు టిమ్ యంత్రాన్ని, నగదును అప్పగిస్తారు. కానీ ఒక్కరు డ్యూటీ సర్వీసులో రెండు విధులు డ్రైవర్ ఒక్కరే చేయాల్సి వస్తోంది. దీంతో సుమారు రెండు గంటలు అదనంగా పనిచేయాల్సి వస్తోంది. ప్రమాదకరంగా ప్రయాణం బస్‌ను ఎంత జాగ్రత్తగా నడుపుతున్నా.. ఎదుటి వాహన చోదకులు లేదా బాటసారి సక్రమంగా ప్రయాణించకపోతే ప్రమాదం జరుగుతుంది. బస్ స్టార్ట్ చేసి ఆపే వరకూ డ్రైవర్ ముందు రోడ్డుపైన, సైడ్ మిర్రర్స్ వైపు చూస్తూ ఉండాలి. కానీ రెండు డ్యూటీలు చేస్తున్న డ్రైవర్ ఒకవైపు బస్సును నడుపుతూ మరోవైపు టిక్కెట్స్ ఇవ్వాలి. డబ్బు తీసుకోవాలి. ప్రయాణికుడు టిక్కెట్‌కు తగిన సొమ్ము కాకుండా పెద్ద నోట్లు ఇస్తే తిరిగి చిల్లర చెల్లించాలి. ఈ తతంగమంతా పూర్తయ్యాక బస్ స్టార్ట్ చేద్దామంటే సమయం సరిపోదు. దాంతో బస్ రన్నింగ్‌లో ఉండగానే రెండు డ్యూటీలు చేస్తున్నారు. ఎవరి డ్యూటీ వారు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఖాళీలు భర్తీ చేయాలని కార్మిక సంఘాల నాయకులు, ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రెండు డ్యూటీలతోఅభద్రతా భావం ఆర్టీసీలో ఒక్కరే డ్రైవర్ డ్యూటీతో పాటు కండక్టర్ డ్యూటీ కూడా చేయడంతో అభద్రతాభావానికి గురవుతున్నారు. ఆ సర్వీసులకు అదనపు సమయం కూడా కేటాయించడంలేదు. దానితో డ్రైవర్లు తీవ్ర వత్తిడికి లోనవుతున్నారు. సంస్థ ఖర్చును తగ్గించుకోవడానికి కార్మికులపై ఈ విధంగా భారం పెంచడం మంచిది కాదు. 12 ఏళ్లుగా కండక్టర్ పోస్టులను భర్తీ చేయడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. – జి.చిరంజీవి, రీజనల్ సెక్రటరీ, ఎంప్లాయీస్ యూనియన్, రాజమహేంద్రవరం -
కనికరం లేని కండక్టర్
తిరువొత్తియూరు: ఉచిత బస్‌పాస్ చెల్లదని కంటి చూపు లేని విద్యార్థిని మార్గమధ్యలో బస్సు నుంచి కిందకు దింపేశాడు ఓ కండక్టర్. కడలూరు జిల్లా విరుదాచలంకు చెందిన మాయవేల్ (20) కంటిచూపు లేని విద్యార్థి. ఇతను విల్లుపురం లా కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇతను దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత బస్‌పాస్‌తో కళాశాలకు బస్సు తో వెళ్లి వస్తుంటాడు. మంగళవారం బన్రూటి నుంచి విల్లుపురానికి రావడానికి ప్రభుత్వ బస్సు ఎక్కాడు. బస్సు కదలిన కొద్ది సమయానికి కండక్టర్ మాయవేల్ను టికెట్ తీసుకోమని కోరాడు. అతను ఉచిత బస్సు పాస్‌ను కండక్టర్ చేతికి ఇచ్చాడు. అది చూసిన కండక్టర్ అది చెల్లదని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఆగ్రహం చెందిన కండక్టర్ మాయవేల్ను మార్గమధ్యలో బస్సు నుంచి కిందకు దింపేశాడు. దీనిపై ఫిర్యాదు ఇవ్వడానికి మాయవేల్ విల్లుపురం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ కలెక్టర్‌ను కలవడానికి వీలుకాకపోవడంతో విల్లుపురం బస్‌డిపో జనరల్ మేనేజర్ వద్ద కండక్టర్‌పై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు దీనిపై విచారణ చేస్తామని అతనికి హామీ ఇచ్చారు. -
కేసీఆర్‌పై కామెంట్స్.. కండక్టర్‌కు కష్టాలు
హైదరాబాద్ : సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వ్యక్తులపై తెలంగాణలో కూడా చర్యలు మొదలయ్యాయి. ప్రభుత్వ పెద్దలను అవమానిస్తే చర్యలు తప్పవంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించినట్లుగానే ఆ తరహా చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విధానాలను, ముఖ్యమంత్రిని, ప్రజాప్రతినిధులను విమర్శిస్తున్న వారిపై అవమానిస్తున్నారు, అతిక్రమిస్తున్నారనే పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగానే తెలంగాణలో కూడా ఆ తంతు మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఆర్టీసీ సంస్థ అధికారులను విమర్శించారనే పేరిట డీ సంజీవ్ అనే బస్సు కండక్టర్‌కు నోటీసులు పంపించారు. నిజమాబాద్ డిపో 1లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన ఫేస్బుక్, వాట్సాప్ వేదికలుగా చేసుకొని కేసీఆర్‌ను, అధికారులను విమర్శిస్తున్నారని, దీనిపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులకు కూడా ఆర్టీసీ ఫిర్యాదు చేసింది. విచారణ చేసి ఆ వివరాలు తమకు ఇవ్వాలని కూడా కోరింది. -
పోలీస్ వర్సెస్ కండక్టర్.. వైరల్ వీడియో
మహబూబ్‌నగర్ క్రైం : ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకోలేదని ఓ మహిళ పోలీస్ కానిస్టేబుల్.. కండక్టర్ ఇద్దరు ఘర్షణకు దిగారు. బుధవారం ఉదయం మహబూ బ్‌నగర్ నుంచి నవాబుపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ రజితకుమారి ఎక్కింది. అయితే బోయపల్లి గేట్ దాటిన తర్వాత బస్సు కండక్టర్ శోభారాణి టికెట్ తీసుకోవాలని సూచించగా.. కానిస్టేబుల్ తన దగ్గర ఉన్న జిరాక్స్ ఐడీ కార్డు చూపించింది. అయితే దీనిని పరిగణలోకి తీసుకోరని, వారెంట్ ఉంటే చూపించాలని కోరింది. అయితే నా దగ్గర వారెంట్ లేదు, పోలీస్ డ్రెస్ ఉంటే టికెట్ అడగరని చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే ఇరువురి మధ్య మాటకు మాట పెరిగింది. ఈ క్రమంలో కానిస్టేబుల్ రజితకుమారి కండక్టర్‌పై దాడికి పాల్పడింది. ఇరువురు ఘర్షణ పడుతున్న సమయంలో అందులో ఉండే ఓ ప్రయాణికుడు వీడియో తీసి వాట్సాప్‌లో పోస్టు చేశారు. అయితే ఈ ఘటనలో నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో ఇరువురి మధ్య రాజీ కుదుర్చారు. అయితే నిబంధనల ప్రకారం పోలీస్ సిబ్బంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే సమయంలో డ్రెస్‌లో ఉన్న, ఐడీ ఉన్న టికెట్ తీసుకోవాలని కేవలం దూరం ప్రయాణాలకు వెళ్లే సమయంలో వారెంట్ ఉంటే తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఘటనపై ఎస్పీ అనురాధ విచారణకు ఆదేశించారు. -
పసికందుతో కండక్టరమ్మ విధులు
-
‘నిర్భయ’ ఘటనలో మరో కండక్టర్ అరెస్ట్
నిందితులు సెంట్రల్ జైలుకు తరలింపు చెన్నై: తమిళనాడు సేలం సమీపంలో బస్సులో విద్యార్థిని అత్యాచారానికి గురైన ఘటనలో మరో బస్ కండక్టర్ విజయన్ (22)ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నలుగురినీ పోలీసులు బుధవారం సేలం మహిళా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం సెంట్రల్ జైలుకి తరలించారు. వీరానం ప్రాంతానికి చెందిన విజయన్ పాత బస్టాండు నుంచి జంక్షన్ వరకు వెళ్లే బస్సులో కండక్టర్‌గా ఉన్నాడు. ఇతనికి బాలికతో పరిచయం ఉన్నట్లు సమాచారం. ముఖ్య నిందితుడిగా ఉన్న పెరుమాళ్‌కు బాలికను విజయనే పరిచయం చేసినట్లు పోలీసులు తెలిపారు. సేలం పేర్లాండ్స్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల విద్యార్థినిపై సోమవారం రాత్రి 10 గంటల సమయంలో బస్సు డ్రైవర్ మణిమన్నన్ (33), రెండో డ్రైవర్ అధికారిపట్టి మురుగన్ (35), కండక్టర్ పెరుమాళ్ (22)లు బస్సులో అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విద్యార్థిని కేకలతో స్థానికులు ముగ్గురికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విద్యార్థినిని పోలీసులు సేలం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి, వైద్య పరీక్షలు నిర్వహించారు. -
తక్కువ ఎత్తుంటే కండక్టర్ ఉద్యోగమివ్వరా!
టీఎస్ఆర్టీసీ చర్యలపై హైకోర్టు విస్మయం సాక్షి, హైదరాబాద్: ఎత్తు తక్కువ ఉన్నారన్న కారణంతో ఓ మహిళకు కారుణ్య నియామకం కింద కండక్టర్ పోస్టు ఇవ్వడానికి టీఎస్ఆర్టీసీ నిరాకరించడంపై ఉమ్మడి హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కండర్ పోస్టుకు అవసరమైన ఇతర అర్హతలన్నీ ఉన్నప్పటికీ, ఎత్తు తక్కువ ఉన్నారన్న కారణంతో కారుణ్య నియామకాన్ని తిరస్కరించడానికి వీల్లేదంది. ఎత్తుతో నిమిత్తం లేకుండా బి.అన్నపూర్ణ, రహీమా, కె.అనితకు కండక్టర్ పోస్టులు ఇవ్వాలని ఆర్టీసీకి స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఇటీవల తీర్పు వెలువరించారు. గతంలో 150 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఎత్తు ఉన్న మహిళలకు కండక్టర్ పోస్టులు ఇచ్చారని, వారు ఇప్పుడు ఆ పోస్టుల్లో కొనసాగుతున్నారని న్యాయమూర్తి తన తీర్పులో గుర్తు చేశారు. తక్కువ ఎత్తు మహిళలు కండక్టర్ విధులను నిర్వర్తించేటప్పుడు గాయాలపాలయ్యే అవకాశం ఉందన్న ఆర్టీసీ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. మహిళల పట్ల వివక్షను రూపుమాపేందుకు అంతర్జాతీయ ఒప్పందంపై భారత్ సంతకం చేసిందని న్యాయమూర్తి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కీలకమైన ప్రభుత్వ సంస్థ టీఎస్ఆర్టీసీ ఉద్యోగ కల్పనలో వివక్షను రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
యువతితో బస్సులో కండక్టర్ అసభ్య ప్రవర్తన
బెంగళూరు : టికెట్ ఖరీదు పోనూ మిగతా చిల్లర ఇవ్వాలని అడిగిన యువతి పట్ల బెంగళూరు మెట్రో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(బీఎంటీసీ) బస్సు కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. లవ్ లెటర్ ఇస్తే చిల్లర ఇస్తానని చెబుతూ లైంగిక వేధింపులకు పాల్ప డ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు వివరాలను ఫేస్బుక్లో ఉంచింది. దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ కేసులో ఇలాగే జరిగిందంటూ ఆ పోస్ట్‌లో ఉదహరించింది. అయితే ఈ విషయం మీడియాలో ప్రసారం కావడంతో పాటు బాధితురాలితో ఫోన్లో మాట్లాడించేందుకు ప్రయత్నాలు జరగటంతో ఆమె తన ఫేస్ బుక్ పోస్ట్‌ను తొలగించింది. కాగా ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సౌత్‌జోన్ డీసీపీ డాక్టర్ శరణప్ప నిన్న మీడియాకు వెల్లడించారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న యువతి జనవరి 10న రాత్రి 8.30 గంటల సమయంలో విధులు ముగించుకొని రాగిగుడ్డ బస్టాప్ నుంచి ఉత్తరహళ్లికి వెళ్లే బస్సు ఎక్కింది. బస్సు బనశంకరి బస్టాండుకు చేరుకోగానే చాలా మంది దిగేశారు. దీంతో తనకివ్వాల్సిన చిల్లర ఇస్తే దిగిపోతానని చెప్పింది. ఈ సందర్భంలో కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. భయాందోళనకు గురైన యువతి బస్సు ఆపాలని కోరినప్పటికీ డ్రైవర్ కూడా పట్టించుకోలేదు. తనకు లవ్ లెటర్ ఇస్తే చిల్లర ఇస్తానని కండక్టర్ వేధించాడు. వెనుక సీట్లలో కూర్చున్న నలుగురు యువకులు ముందుకొచ్చి యువతికి అండగా నిలబడటంతో కండక్టర్ వెనక్కి తగ్గి మిగతా చిల్లర ఇచ్చాడు. అప్పుడు కూడా ఆ యువతి చేతులు తాకి అసభ్యంగా వ్యవహరించాడు. బస్సు దిగాక సదరు యువతి ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు సుబ్రమణ్యపుర పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు కండక్టర్‌తో పాటు బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. కాగా బస్సులో యువతిపై వేధింపులకు పాల్పడలేదని డ్రైవర్, కండక్టర్ తెలిపారని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించేందుకు బీఎంటీసీ ఎండీ అందుబాటులో లేదు. -
ఆర్టీసీ కండక్టర్ బ్యాగ్‌లో నగదు చోరీ
రూ.7 వేలు అపహరణ మాచర్ల: పట్టణం నుంచి పిడుగురాళ్లకు బయలుదేరిన ఆర్టీసి బస్సు కండక్టర్ బ్యాగ్‌లో ఉన్న రూ.7వేల నగదును పట్టణ శివారులోని గుంటూరు రోడ్డులోని చెన్నకేశవనగర్‌లో చోరీ చేసిన సంఘటన సంచలనం కలిగించింది. మాచర్ల ఆర్టీసి డిపోకు చెందిన ఏపీ 07 వై 5219 బస్సులో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సుజాత టిక్కెట్లు కొడుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె బ్యాగ్‌లోని రూ.7 వేలను చోరీ చేశారు. టిక్కెట్లు కొడుతూ చిల్లర ఇచ్చేందుకు బ్యాగ్‌లో చూడగా రూ.7500లో రూ.7 వేలు నగదు చోరీకి గురైనట్టు గమనించిన ఆమె ఆవేదనతో ఆర్టీసి డిపో అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంబంధిత బస్సును పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించి బస్సులో ఉన్న ప్రతి ఒక్కరినీ తనిఖీ చేశారు. అనంతరం చోరీకి పాల్పడిన వ్యక్తి గురించి పోలీసులు విచారణ ప్రారంభించారు. నోట్ల మార్పిడి, డిపాజిట్ల కార్యక్రమం ప్రారంభమయ్యాక పట్టణంలో మూడుసార్లు బ్యాంక్‌ల వద్ద నగదు చోరీకి గురికాగా నాలుగోసారి ఆర్టీసీ బస్సులో కండక్టర్ బ్యాగ్‌లో నగదు మాయం కావడం సంచలనం కలిగించింది. చోరీపై కండక్టర్ సుజాత సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వేలమందిని ఆదుకుంటున్న ఫేస్ బుక్ పేజీ!
కేరళః సామాజిక మాధ్యమాలతో చెడు అలవాట్లకు బానిసలౌతున్నవారు కోకొల్లలుగా కనిపిస్తున్న నేటి తరుణంలో.. ఆ బస్ డ్రైవర్ మాత్రం సద్వినియోగపరచుకున్నాడు. ప్రజాసేవే లక్ష్యంగా తాను స్వయంగా ఓ ఫేస్ బుక్ పేజీని సృష్టించి.. సోషల్ మీడియా పవర్ తో ప్రజల్లో సామాజిక మార్పు తెచ్చేందుకు కృషి చేశాడు. 'ఉయ్ హెల్ప్' పేరిట రూపొందించిన వేదిక ద్వారా పేదలకు సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టాడు. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ (కెఎస్ ఆర్టీసీ) లో కండక్టర్ గా పనిచేస్తున్న వినోద్.. ఆర్థికంగా వెనుకబడిన వారికి, పేదలకు సేవలు అందించాలనుకున్నాడు. 2011 లో ఉధృతంగా కొనసాగుతూ, ఎంతో ప్రజాదరణ పొందుతున్న సోషల్ మీడియా శక్తిని... తమ రాష్ట్ర ప్రజల్లో సామాజిక మార్పుకోసం వినియోగించాలని నిశ్చయించుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా 'ఉయ్ హెల్ప్' పేరున ఫేస్ బుక్ పేజీని ప్రారంభించి, పేద ప్రజలకు సహాయం అందించేందుకు వేదికగా మార్చాడు. ఆ పేజీ వినోద్ వంటి సేవా తత్పరత కలిగిన ఎంతోమందిని ఆకట్టుకుంది. గ్రూప్ ద్వారా రక్తదానం కార్యక్రమం ప్రారంభించిన వినోద్ బృందం, రక్తదానం చేసేవారినుంచి సేకరించి అవసరమైన వారికి అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం బ్లడ్ డొనేషన్.. ఈ గ్రూప్.. ప్రధాన కార్యక్రమంగా మారిపోయింది. 'బ్లడ్ డోనర్స్ కేరళ' పేరున పేజీలో ప్రత్యేక గ్రూప్ ఏర్పడింది. కొందరు ఔత్సాహికులు ఆయా ప్రాంతాల్లోని వాట్సాప్ గ్రూప్ ల ద్వారా ఈ బ్లడ్ డొనేషన్ గ్రూప్ కు సహకరిస్తున్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనివారికైనా రక్తం అవసరమైనప్పుడు తక్షణమే అందించేందుకు బృదంలోని సభ్యులు సహకరిస్తున్నారు. అంగమలై, అలువా, కోలన్ చ్చేరీ, ఎర్నాకుళం, ఎడప్పల్లీ, పెరంబవూర్ వంటి ప్రాంతాల్లోని గ్రూప్ సభ్యులను సోషల్ మీడియా ద్వారా సంప్రదిస్తే, డోనర్లు వారికి రక్తం అందించేందుకు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం గ్రూప్ ద్వారా రక్తం అందించే సభ్యులు 10,000 మంది వరకూ ఉన్నారు. అంతేకాదు గ్రూప్ సభ్యుల ఇళ్ళలో జరిగే వేడుకల సందర్భంలోనూ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరిస్తున్నారు. ఇటీవల గ్రూప్ సభ్యుల్లోని ఓ వ్యక్తి తన పెళ్ళి వేడుకలో బంధువులతో రక్తదానం చేయించడంతోపాటు, తాను స్వయంగా రక్తాన్ని అందించాడు. గత సంవత్సర కాలంలో వినోద్ గ్రూప్ సుమారు 60 రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి, రక్తం సేకరించడంతోపాటు, రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమం ద్వారా వేలకొద్దీ యూనిట్ల రక్తాన్ని సేకరించడంతోపాటు... అవసరమైనవారికి అందించేందుకు సహాయపడింది. రక్తదానం ఒక్కటే కాక పేద పిల్లలకు చదువు చెప్పించేందుకు, అనాధలకు, వృద్ధాశ్రమాలకు ఆహారం అందించేందుకు కూడ వేలకొద్దీ సభ్యులున్న ఈ గ్రూప్ సహకరిస్తోంది. -
అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా
♦ డ్రైవర్, కండక్టర్ సహా 15 మందికి గాయాలు ♦ రాయిలాపూర్ గేటు వద్ద ఘటన ♦ డ్రైవర్ నిర్లక్ష్యమేనంటున్న పోలీసులు కౌడిపల్లి: అదుపు తప్పడంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. డ్రైవర్, కండక్టర్ సహా 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కౌడిలిపల్లి మండలం రాయిలాపూర్ గేట్ సమీపంలో మెదక్-నర్సాపూర్ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. బాధితులు, ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ డిపోకు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు (నం: టీఎస్ 15జెడ్ 0116) గురువారం ఉదయం మెదక్ నుంచి జేబీఎస్‌కు వెళ్తుంది. బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. రాయిలాపూర్ గేట్ వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. రాయిలాపూర్ గేట్ వద్ద ప్రయాణికులు లేకపోవడంతో ఆగకుండా వెళ్లింది. సమీపంలో రోడ్డుపైబైక్లు ఆపుకుని నలుగురు వ్యక్తులు ఉండటంతో వారిని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించగా అదుపుతప్పిన బస్సు రోడ్డు కుడివైపునకు దూసుకెళ్లింది. అక్కడే గ్రామానికి మంచినీటిని సరఫరాచేసే బోరుమోటార్‌ను ఢీకొని సమీపంలోని మామిడి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సంగమేశ్వర్ (మెదక్), కండక్టర్ అనిత (గౌతాపూర్)తోపాటు ప్రయాణికులు గూడ లక్ష్మి(మెదక్), కౌ డిపల్లి అంతయ్య (కొడిపాక), సాలె నర్సింలు (దేవులపల్లి), సాదుల లక్ష్మీనర్సమ్మ (కిష్టాపూర్), రమ, బద్రి కావ్య, వీరరాజు (సరూర్‌నగర్), బానూబీ (మెదక్), సఫబేగం, షేక్‌అలీ (నర్సాపూర్), జలాల్పూర్ సుధాకర్ (కౌడిపల్లి), ర్యాగ ల్ల శ్రీకాంత్ (కొల్చారం), నరహరి (ధర్మాసాగర్) గాయపడ్డారు. ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి తనసిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆటోలో నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సహాయక చర్యలు... బస్సు బోల్తా పడటంతో ప్రయాణికులు ఆర్తనాదాలతో మిన్నంటాయి. బస్టాండ్ వద్ద ఉన్న కాజిపేటకు చెందిన జహంగీర్‌తోపాటు రాయిలాపూర్ వాసులు బస్సు అద్దాలను ధ్వంసం చేసి క్షతగాత్రులను బయటకు తీశారు. వారిని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. స్వల్పగాయాలైన వారిని వేరు బస్సులో తరలించారు. డ్రైవర్ సంగమేశ్వర్‌ను నర్సాపూర్‌లో ప్రథమ చికిత్స అనంతరం బంధువులు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. నర్సాపూర్ ఆసుపత్రి వైద్యులు బాధితులకు చికిత్సలు నిర్వహించారు. డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం వల్లే బస్సు బోల్తాపడిందని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. డ్రైవర్‌కు తప్పిన ప్రమాదం... బస్ బోల్తా పడటంతో డ్రైవర్ సంగమేశ్వర్‌గౌడ్‌కు గాయాలతో తప్పించుకున్నారు. బస్సు బోరు బావిని ఢీకొనడంతో బోల్తా పడ్డ ప్రదేశంలో బోరుబావిలోని పైప్ డ్రైవర్ సీటుకు పక్కనే తేలింది. కొద్దిలో డ్రైవర్ తలకు తగిలే ప్రమాదం ఉండేదని పలువురు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకోగలిగారు. -
ప్రజాసేవే ఆ బస్ కండక్టర్ పరమార్థం..!
ప్రయాణీకులకు ఆ బస్ కండడక్టర్ అంటే వల్లమాలిన అభిమానం... ప్రతిరోజూ తన బస్ లో ప్రయాణించే వారికోసం అతడు ప్రత్యేక సేవలు అందిస్తూ మన్ననలు పొందుతున్నాడు. ప్రజాసేవే పరమార్థంగా భావించి... తరచుగా వచ్చే వారికోసం ప్రత్యేక సదుపాయాన్ని కల్పించాడు. ఆధునిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకొని అందరికీ ఆప్తుడయ్యాడు. కేరళ అర్బన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో పని చేస్తూ.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. 39 ఏళ్ళ షిజు... తిరువనంతపురం లో బస్ కండక్టర్ గా పనిచేస్తున్నాడు. కెయు ఆర్టీసీ... నెయ్యట్కింకర నుంచి టెక్నో పార్క్ వరకు ప్రతిరోజూ నడిపే ఓల్వో బస్ లో ప్రత్యేక సేవలు అందిస్తూ... రోజువారీ ప్రయాణీకులకు తల్లో నాలుకయ్యాడు. ఇటీవల ప్రతివారికీ అందుబాటులోకి వచ్చిన సామాజిక మాధ్యమం వాట్సాప్ ను వినియోగించి.. రెగ్యులర్ పాసింజర్ల గ్రూప్ ను క్రియేట్ చేశాడు. గ్రూప్ లో తమ బస్ ప్రయాణం మొదలైనప్పటినుంచీ చివరి స్టేజ్ దాకా అప్ డేట్స్ అందిస్తుంటాడు. షిజు బస్ లో సుమారు ఏభైమంది రెగ్యులర్ ప్రయాణీకులున్నారు. వీరంతా అతడి సేవలను అమితంగా కొనియాడుతున్నారు. షిజు ప్రత్యేక సౌకర్యం అందించడం తమకెంతో ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారు. వాట్సాప్ అప్ డేట్స్ ఇవ్వడం వల్ల తాము ఇంటినుంచీ మరీ ముందుగా బయల్దేరాల్సిన అవసరం లేదని... దీంతో ఎంతో సమయం కలసి వస్తోందని అంటున్నారు. అంతేకాదు అతడు ఏసీని అదుపులో ఉంచడం, టికెట్స్ అందించడం, ప్రయాణీకులకు ప్రశాంతతను కలిగించే మ్యూజిక్ ను ప్లే చేయడం వంటి మరెన్నో ప్రత్యేక విషయాలను పాటిస్తాడని ఓ ప్రయాణీకుడు రాహుల్ చెప్తున్నాడు. వాట్సాప్ గ్రూప్ లో అప్ డేట్స్ ను కూడ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ షిజు అందరి మన్ననలూ పొందుతున్నాడు. -
కదులుతున్న స్కూల్ బస్సులో దారుణం..
ఉజ్జయిని: అభంశుభం తెలియని నాలుగేళ్ల నర్సరీ విద్యార్థినిపై స్కూల్ బస్సు కండక్టర్ దారుణానికి పాల్పడ్డాడు. కదులుతున్న బస్సులోనే ఆ చిన్నారిని అత్యాచారం చేశాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఈ ఘటన జరిగింది. మంగళవారం సాయంత్రం స్కూలు నుంచి విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు బస్సులో పంపారు. బస్సులో విద్యార్థులందరూ దిగిన తర్వాత బాధిత బాలిక మాత్రమే మిగిలింది. ఆ సమయంలో కండక్టర్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ తర్వాతి ఇంటి దగ్గర ఆ చిన్నారిని దింపారు. బాధితురాలు జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. -
ఎస్సై అనుచిత ప్రవర్తన - పరిస్థితి ఉద్రిక్తం
ప్రయాణికుల కోసం బస్సు ఆపి.. పక్కన టీ తాగుతున్న కండక్టర్‌పై దురుసుగా ప్రవర్తించిన ఎస్సైపై ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం ప్రాంతంలో కృష్ణా జిల్లా బంటుమిల్లిలో చోటుచేసుకుంది. బంటుమిల్లి నుంచి మచిలీపట్నం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు బంటుమిల్లి ప్రధాన సెంటర్లో రోడ్డు పక్కన ఆపి ఉంది. బస్సు కండక్టర్ పక్కనే ఉన్న హోట్‌లో టీ తాగుతున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన స్థానిక ఎస్సై పి.వాసు బస్సు ఆగి ఉండటాన్ని గమనించి కండక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థులు వచ్చే టైం అయిందని, ఐదు నిమిషాలు ఆగితే వెళ్లిపోతామని కండక్టర్ నచ్చజెప్పారు. ఇదేమీ పట్టించుకోని ఎస్సై.. కండక్టర్ చొక్కా పట్టుకుని అసభ్యంగా దూషిస్తూ ఆయన చేతిలో ఉన్న టికెట్ల యంత్రాన్ని (టిమ్స్) లాక్కుని వెళ్లాడు. పరిస్థితి గమనించిన ప్రయాణీకులు ఎస్సై తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన ఆర్టీసీ యూనియన్ నేతలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
మహిళపై డ్రైవర్, కండక్టర్ గ్యాంగ్ రేప్
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. బస్సులో ఓ మహిళపై డ్రైవర్, కండక్టర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి కొట్వాలి ప్రాంతంలో 40 ఏళ్ల మహిళ బస్సు కోసం ఎదురు చూస్తుండగా, ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ బ్రీజేంద్ర, కండక్టర్ జితేంద్ర ఆమెను బలవంతంగా బస్సులోకి లాక్కెళ్లారు. అనంతరం ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలు అలారం మోగించడంతో స్థానికులు వచ్చి నిందితులను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపారు. -
వివాహేతర సంబంధానికి అడ్డమని భర్త దారుణం
-
బోల్తా పడిన ఆర్టీసి బస్సు - కండక్టర్ మృతి
-
ఎకసెక్కాలుగా ఉందా?
కామెడీ సీన్ ప్రశాంతంగా ఊరు వెళదామని బస్ ఎక్కుతాడు గురులింగం. సీటు దొరికింది. కూర్చున్నాడు. ఓ పల్లెటూరి అతను ఓ పేద్ద మూటతో బస్ ఎక్కాడు. ఇక అక్కడ నుంచి మన గురులింగం పాట్లు ఏంటో మీరే చూడండి. కండక్టర్: ఏ ఊరికి పోవాలి? పల్లెటూరాయన: ఏ ఊరు పోతే నీ కెందుకయ్యా? డ బ్బులు తీసుకుని టికెట్ కొట్టంతే! ఇరుకుపాలెం అంటే ఎకసకాలుగా ఉందే! కండక్టర్:ఈ మూటకు లగేజి కట్టాలి. పల్లెటూరాయన: ఇరుకుపాలెం అంటే ఎకసకాలు కాకపోతే ఈ మూటకు లగేజి కొడతావా నువు... కండక్టర్:ఎక్స్ట్రా బరువుందిగా... పల్లెటూరాయన: నా మూట నా నెత్తి మీదే ఉంటుంది. నీ బస్సులో పెడితే లగేజి కొట్టు! (పక్కనే ఉన్న గురులింగాన్ని కొడతూంటాడు) గురులింగం: ఏంటయ్యా నీ గోల? పల్లెటూరాయన: మరేంటండీ! ఎట్టా మాట్లాడుతున్నాడండీ ఆయన? కండక్టర్:డబ్బులివ్వు... పల్లెటూరాయన: ఇస్తానండీ! ఎగ్గొడతామా (మూటను గురులింగం మీద పడేస్తాడు) గురులింగం: ఏందయ్యా ఇది? పల్లెటూరాయన: అందరం కలిసి వెళ్తున్నాం ఆ మాత్రం సర్దుకోలేరా. ఇదిగోండి డబ్బులు (అని కండక్టర్‌కి డబ్బులిస్తాడు) కండక్టర్: ఏంటిది? పది పైసలు తగ్గాయి? పల్లెటూరాయన: నా దగ్గర లేవు, అరె లేవని చెప్తున్నా కదా కండక్టర్:ఇవ్వు...ఇవ్వక పోతే దించేస్తా పల్లెటూరాయన: ఏంటి....!పదిపైసలు లేకపోతే దించేస్తావా? 50 మందున్నారు బస్సులో. 10 పైసలు సర్దుకోలేవా నువు! గురులింగం: నువ్వు అన్యాయంగా మాట్లాడుతున్నావ్. పదిపైసలు ఇవ్వాలి పల్లెటూరాయన: మరైతే ఇచ్చేయ్ గురులింగం: నాకేంటి సంబంధం పల్లెటూరాయన: నువ్వెందుకు మాట్లాడావ్? బస్సులో ఇంతమంది ఉన్నారు నువ్వెందుకు మాట్లాడావ్. మేము మేమూ ఏదో మాట్లాడుకుంటాం, సర్దుకుంటాం. (అంటూ కండక్టర్ వైపు తిరిగి) అది కాదన్నా పదిపైసలు లేకపోతే సర్దుకోవాలి గాని సర్దుకుపోతే ఎట్లా! పల్లెటూరాయన: టైమెంత అయిందండీ? గురులింగం: 9:10(ఒక్కటి కొడతాడు) గురులింగం: ఏంటయ్యా కొడతావ్ పల్లెటూరాయన: ఏంటండీ? ఇందాకట్నుంచి చూస్తున్నా ఇరుకుపాలెం అంటే ఎకసెక్కాలుగా ఉందా? ఏం అడిగాను? గురులింగం: టైం అడిగావ్ పల్లెటూరాయన: మీరు నాకు ఏం చెప్పారు గురులింగం: 9:10 (మళ్లీ కొట్టాడు) గురులింగం: కొడతావేంటి? పిచ్చిపిచ్చిగా ఉందా? టైం 9 :10 అయింది పల్లెటూరాయన: చంపేస్తా నిన్ను అసలు... నిన్నేం అడిగాను ? నువ్వేం చెప్పావ్ ? గురులింగం: 9: 10 (మళ్లీ కొట్టాడు) పల్లెటూరాయన: తొమ్మిందయిందనో, పది అయిందనో చెప్పాలి. 9, 10 అంటావా... (ఇంతలో బస్ రైల్వే క్రాసింగ్ దగ్గర ఆగింది) పల్లెటూరాయన: గేటేశారా..? గురులింగం: గేటేశారు కాబట్టే బస్ ఆగింది పల్లెటూరాయన: రైలొస్తుందటారా? గురులింగం: (కోపంగా విసుగ్గా చూస్తాడు) పల్లెటూరాయన: ఏంటండీ కోపం... ఏమన్నావండీ! ఇరుకుపాలెం అంటే ఎకసెకాలుగా ఉంది! (కొంతసేపటికి మళ్లీ) పల్లెటూరాయన: రైలొచ్చినప్పుడు గేటేస్తారా? గేటేసినప్పుడు రైలొస్తదంటారా? గురులింగం: బస్సు వస్తే గేటేస్తారు. రైలొస్తే గేటు తీస్తారు! పల్లెటూరాయన: అంత చమత్కారం ఎందుకులెండి! అంటే... సర్కార్ అంటారా...మెయిల్ అంటారా? గురులింగం: అంత అవసరమా అది! పల్లెటూరాయన: అవసర మే! గురులింగం: సర్కార్ అయింటుంది (ఒక్కటి కొట్టి) పల్లెటూరాయన: ఏంటి ఏంటది... సర్కారా అది? గురులింగం: కొడతావా ఏంటి కొడతావ్ పల్లెటూరాయన: చంపేయాలి నిన్ను గురులింగం: చేయి చేస్కోకు బాగోదు చెబుతున్నా! పల్లెటూరాయన: రైలొస్తుందటావా? గురులింగం: రాదు విమానం వస్తుంది పల్లెటూరాయన: ఏంటి?(మళ్లీ కొడతాడు) గురులింగం: కొడతావ్ ఏంటి... పల్లెటూరాయన: ఇరుకుపాలెం అంటే ఎక్కసక్కాలుగా ఉందా? రైలొస్తుందా అంటే విమానం వస్తుందంటావా! ఏ రైలొస్తుందో చెప్పు (చెప్పనని సైగ చేస్తాడు.. పల్లెటూరతను మళ్లీ కొడతాడు) పల్లెటూరాయన: ఏ మాట్లాడలేవా? ఇట్టిట్టా అంటావ్! ఎన్ని పెట్టెలుంటాయో చూసి చెప్పు..! గురులింగం: ఒకటి.. రెండు... ఎనిమిది మొత్తం ఎనిమిది పెట్టెలు. సర్కారు... (మళ్లీ కొడతాడు) గురులింగం: ఏంటయ్యా కొడతావ్. నువ్వేనా 8 పెట్టెలుంటే సర్కారన్నావ్ పల్లెటూరాయన: 8 పెట్టెలున్న ప్రతీదీ సర్కారు అయిపోతదా అది గూడ్స్! (గురులింగం తలబాదుకుంటాడు) వెంకటేశ్ హీరోగా నటించిన ‘ధర్మచక్రం’ సినిమాలోని ఈ హాస్య సన్నివేశంలో గురులింగంగా ఏవీయస్ నటిస్తే, అతనిని ముప్పుతిప్పలు పెట్టే పల్లెటూరి వ్యక్తిగా బ్రహ్మానందం నటించారు. - శశాంక్.బి పల్లెటూరాయన: ఏంటది సర్కారా? సర్కార్‌కి ఎన్ని పెట్టెలు ఉంటాయో తెలుసా నీకు? గురులింగం: నాకు తెలీదు పల్లెటూరాయన: తెలీదా గురులింగం: తెలీదు పల్లెటూరాయన: ఇంత చదువుకున్నావ్ సర్కార్‌కు ఎన్ని పెట్టెలుంటాయో తెలీదా నీకు... ఎనిమిది పెట్టెలుంటాయ్ లెక్కపెట్టు! -
కదులుతున్న బస్సులో ప్రయాణికురాలిపై అత్యాచారం
జైపూర్: ప్రయాణికులను సురక్షితంగా చేర్చాల్సిన డ్రైవర్, కండక్టరే కర్కశంగా కదులుతున్న బస్సులోనే ఓ మహిళ(36)పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఉదంతం రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలోని పిలానీ ప్రాంతంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని పిలానీ నుంచి హరియాణాలోని లోహారుకు వెళ్తున్న స్లీపర్ బస్సులో ఈ ఘటన జరిగింది. ‘బస్సులో నేను ఒక్కదానినే ఉన్నాను. మొదట నాపై కండక్టర్ కాలియా(36) అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత డ్రైవర్ కూడా నాపై అత్యాచారం చేశాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో వదిలివెళ్లారు’ అని ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొందని పోలీసు అధికారొకరు తెలిపారు. -
కండక్టర్‌పై చేయి చేసుకున్న టీడీపీ నాయకుడు
కొయ్యూరు పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు {పతిగా కేడిపేట స్టేషన్లో ఫిర్యాదు కొయ్యూరు: విధుల్లో ఉన్న ఆర్టీసీ కం డక్టర్‌పై చేయిచేసుకున్నందుకు మం డల టీడీపీ అధ్యక్షుడు ఎస్కె బ షీర్‌ఖాన్‌పై కొయ్యూరు ఇన్చార్జీ ఎస్ఐ మధుసూధన్ మంగళవారం కేసు నమోదు చేశారు. విధులకు ఆ టం కం కలిగించడంతోపాటు తనపై చే యిచేసుకున్నారని బాధిత కండక్టర్ సీహెచ్ వెంకటేశ్వరరావు పోలీసుల కు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. టీడీపీ నేత ఎస్కె బషీర్‌ఖాన్ తమ్ముడి భార్య (మరదలు) సోమవారం రేవళ్ల బస్సులో కేడిపేట నుంచి కొయ్యూరు వచ్చా రు. బస్సు ఖాళీ లేకపోవడంతో ఆమెను వెనక్కు జరగాలని కండక్టర్ కోరారు. అయితే అక్కడ ఏమి జరిగిందో తెలియక పో యినా ఆమె రాజేంద్రపాలెంలో బ స్సు దిగి ఇంటికి వచ్చాక, కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించారని బం ధువులకు తెలి పారు. దీంతో కోప్రోది కుడైన ఖాన్ రేవళ్ల నుంచి తిరిగి వ స్తున్న బస్సును అతని షాపు వద్ద ఆపి కండక్టర్, డ్రైవర్‌ను కిందకు దించారు. అక్కడ తనపై చేయిచేసుకున్నారని కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. కండక్టర్ యూని యన్ నాయకులతో వచ్చి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించారంటూ మ హిళ కేడిపేట పోలీసుస్టేష్‌న్‌లో ఫిర్యా దు చేశారని ఎస్ఐ తెలిపారు. -
చిల్లర గొడవలకు త్వరలో కాలం చెల్లు
సాక్షి, ముంబై : ఇక మీదట బెస్ట్ బస్సు ప్రయాణికులు చిల్లర కోసం కండక్టర్‌తో గొడవకు దిగాల్సిన అవసరమే లేదు. బెస్ట్ సంస్థ కొన్ని బస్సుల్లో ఏర్పాటు చేసిన ఆర్ఎఫ్ఐడీ వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఈ వ్యవస్థ వల్ల ప్రయాణికులు తమ కార్డులను వినియోగించగానే టికెట్ తాలూకు సొమ్ము అందులో నుంచి దానంతట అదే తీసుకుంటుంది. ఈ వ్యస్థ అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉందని సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రయాణికులు తమ ప్రీపెయిడ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) కార్డును బస్సుల్లో అమర్చిన ఈ-వాలిడేషన్ ముందు డిస్ప్లే చేస్తారు. దీంతో చార్జీ మొత్తం అందులో నుంచి తగ్గిపోతుంది. ఈ వ్యవస్థను బెస్ట్‌కు చెందిన శీతల బస్సుల్లో ఏర్పాటు చేశారు. ఈ-వాలిడేటర్‌ను బస్సు ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాలవద్ద ఏర్పాటు చేశారు. బస్సుల్లోకి ప్రవేశించే ముందు ప్రయాణికులు తమ ఆర్ఎఫ్ఐడీ కార్డులను ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు బస్సులో నుంచి దిగే సమయంలో కూడా తిరిగి కార్డును ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది. దీంతో వీరు ఎంత దూరం ప్రయాణించారో అంత దూరం వరకు చార్జీ ప్రీపెయిడ్ కార్డులో తగ్గిపోతుంది. ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని బెస్ట్ సంస్థ జనరల్ మేనేజర్ ఓ.పి.గుప్తా పేర్కొన్నారు. అయితే ఈ వ్యవస్థ ఏర్పాటు కారణంగా తలుపులను మూసి ఉంచాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ-వాలిడేటర్లు మామూలు బస్సుల్లో పని చేయవన్నారు. మరోవైపు కండక్టర్లు ఎప్పటి మాదిరిగానే టికెట్లను జారీ చేయొచ్చు. ప్రయాణికులకు కూడా కార్డు విషయంలో తమ సహాయ సహకారాలు అందిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. -
రేపు జెడ్పీ చైర్మన్ ఎన్నిక
కండక్టర్ విధులను కూడా నిర్వర్తించడం ఆర్టీసీ డ్రైవర్లకు పెద్ద సమస్యగా మారింది. ఒకే సమయంలో డ్రైవింగ్‌తో పాటు టికెట్ల జారీపై దృష్టి పెట్టాల్సిరావడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. డ్రైవింగ్‌పై ఏ మాత్రం ఏకాగ్రత చెదిరినా ప్రమాదాలు జరిగే అవకావం ఉండడం, మరోవైపు నగదు వసూళ్లలో తేడా వ స్తే జేబుకి చిల్లుపడే అవకాశం ఉండడంతో అడకత్తెరలో పోక చెక్కలా మారారు. డ్రైవింగ్ విధులను డ్రైవర్, టికెట్ల జారీని కండక్టర్ మాత్రమే చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆర్టీసీ అధికారులు అమలు చేయకపోవడంపై విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. చైర్మన్ ఎన్నిక ఆదివారం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఎన్నికను సజావుగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఎలా జరుగుతుందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 24 మంది సభ్యులతో జిల్లాపరిషత్ చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది. మెజార్టీ సభ్యులు లేకున్నా టీడీపీ ఎలాగైనా జిల్లా పరిషత్ చైర్మన్ గిరిని దక్కించుకునేందుకు పలురకాల కుట్రలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీకి చెందిన పలువురు సభ్యులను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తోంది. కోట్లు గుమ్మరిస్తామంటూ టీడీపీ నేతలు ఆశ చూపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొందరు సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. వారి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు, బెదిరించారు. వారిని సైతం ప్రలోభపెట్టారు. అయినా సరే కొం దరు మినహా మిగిలిన సభ్యులు అధికార పార్టీ ప్రలోభాలకు లొంగలేదు. మాటపై నిలబడ్డారు. తమను గెలి పించిన పార్టీని ,నేతలను వదలమంటూ విశ్వాసం చూపారు. ప్రాణా లు పోయినా పార్టీ వెన్నంటే ఉంటామంటూ ప్రమాణాలు చేశారు. అయినా సరే అధికార బలంతో టీడీపీ దౌర్జన్యానికి దిగి నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రకే మాయని మచ్చ తెచ్చింది. జిల్లాపరిషత్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జిల్లాపరిషత్ సభా మందిరంలో దుశ్శాసన పర్వానికి తెరలేపింది. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ సాక్షాత్తు కలెక్టర్ శ్రీకాంత్ ముందున్న మైక్‌ను విసిరి పారేసి ఆయన్ను దుర్భాషలాడారు. అయినా సరే కలెక్టర్ నోరుమెదప లేదు. ‘నవ్వి పోదురుగాక మాకేటి సిగ్గు’ అన్నట్టు పోలీసులు చోద్యం చూస్తుండిపోయారు. ఈ ఘటన రాష్ట్ర స్థాయిలో జిల్లా పరువు తీసింది. అధికార పార్టీ దౌర్జన్యాలను చూసి జనం అసహ్యించుకుంటున్నా టీడీపీ నేతలు మాత్రం అక్రమాలను ఆపలేదు. వైఎస్సార్సీపీ సభ్యులను కిడ్నాప్ చేశారంటూ తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నానికి దిగారు. అయినా సరే మెజార్టీ సభ్యులతో జిల్లాపరిషత్ చైర్మన్ గిరిని దక్కించుకుంటామని వైఎస్సార్సీపీ నేతలు ధీమాగా ఉన్నారు. అందరి సహకాంతో విజయం ఖాయమంటున్నారు. ఎన్నికల కమిషన్, హైకోర్టు జోక్యంతో అధికార పార్టీ ఆందోళనలో ఉన్నట్టు తెలిసింది. గతంలో మాదిరి అధికారం అడ్డుపెట్టి ఎన్నికను అడ్డుకోవడం వీలుకాక పోవ చ్చని వారు భావిస్తున్నారని సమాచారం. ఈ సారైనా పోలీసులు ఎన్నికల కమిషన్,హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఎన్నికను సజావుగా నిర్వహిస్తారా లేక మళ్లీ అధికార పార్టీ నేతలకు తొత్తులగా వ్యవహ రిస్తారా అన్నది ఆదివారం తేలుతుంది. -
మాకొద్దు విధులు
- ‘టిమ్’ విధులతో డ్రైవర్ల ఆందోళన - రెండు విధులు నిర్వహించడం కష్టమని ఆవేదన - అధికారుల నుంచి వేధింపులు - జిల్లా నుంచి రోజుకు 86 బస్సుల రాకపోకలు - పొరుగు జిల్లావాసుల కష్టాలు ఆదిలాబాద్ కల్చరల్ : జిల్లాలోని ఆరు డిపోల్లో కండక్టర్ లేకుండా టికెట్ ఇష్యూ మిషన్(టిమ్)తో డ్రైవింగ్ వ్యవస్థ కొనసాగుతోంది. అధికారులు డ్రైవర్లకు ఇష్టం లేకున్నా డ్రైవింగ్‌తోపాటు టికెట్ ఇచ్చే విధులు నిర్వహించాలని వేధిస్తున్నారు. ఇలా చేయని వారికి వారం, పది రోజులపాటు విధులు కేటాయించడం లేదు. దీంతో ఆ కార్మికుడి వేతనంలో సుమారు రూ.3 వేల వరకు కోత పడుతుంది. రీజినల్‌లో 86 టిమ్‌తో బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఇందులో ఆదిలాబాద్ డిపో నుంచి 27, ఆసిఫాబాద్ 12, భైంసా 2, మంచిర్యాల 23 , నిర్మల్ 20, ఉట్నూర్ నుంచి 2 బస్సులు టిమ్ డ్రైవర్లతో రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి హైదరాబాద్, కరీంనగర్, గుంటూర్, ఇతరత్రా ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. మానసిక ఒత్తిళ్లతో ప్రమాదాలు కండక్టర్ లేకుండా టికెట్లు ఇచ్చుకుంటూ డ్రైవింగ్ చేయాలంటే డ్రైవర్లు జంకుతున్నారు. బస్సు నడుపుతూ.. ప్రయాణికులను పర్యవేక్షిస్తూ.. టికెట్లు ఇస్తూ.. లోపల పరిశీలిస్తూ బస్సు నడపాలంటే భయపడుతున్నారు. అధిక మంది ప్రయాణిస్తున్నప్పుడు, రాత్రి వేళల్లో మానసిక వేదనకు గురవుతున్నారు. అందరూ టికెట్ తీసుకున్నారా.. బస్సు ఆగిన ప్రాంతంలో దిగారా.. అలా పలు కారణాలతో ప్రయాణికులతోనూ తిప్పలు పడుతూ ఆర్టీసీ టిమ్ డ్రైవర్లు నరకయాతన పడుతున్నారు. కండక్టర్, డ్రైవర్ ఇద్దరు పనులు ఒక్కరే చేయాల్సి రావడంతో మానసికంగా కృంగిపోతున్నారు. బస్సు నడిపే సమయంలో ఒత్తిళ్లకు గురికావడంతో వారి ఏకాగ్రత పూర్తిస్థాయిలో కేటాయించలేక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్టీసీ ఉన్నతాధికారులు, కార్మిక సంఘాలు పట్టించుకుని ఎవరి విధులు వారికి కేటాయిస్తే సులభం అవుతుంది. భవిష్యత్‌లో కండక్టర్ భద్రమేనా? ఆర్టీసీలో టిమ్ డ్రైవర్ విధానాలతో కండక్టర్ ఉద్యోగాలకు యాజమాన్యం మంగళం పాడే అవకాశం ఉంది. జిల్లాలో గత విధానాన్ని బట్టి చూస్తే 86 మంది డ్రైవర్లతోపాటు 86 మంది కండక్టర్ విధులు నిర్వర్తించేవారు. కానీ, ప్రస్తుతం తరుణంలో టిమ్ విధానంతో డ్రైవర్లే కండక్టర్ల విధులు నిర్వహిస్తుండటంతో భవిష్యత్తులో కండక్టర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఆర్టీసీలో కండక్టర్ విధానం ప్రస్తుతం సాగుతున్నా భవిష్యత్తులో పూర్తిస్థాయిలో తీసేయనున్నారని సమాచారం. దీంతో కండక్టర్లలో ఆందోళన నెలకొంది. ఇటు డ్రైవర్లు, కండక్టర్లు టిమ్ డ్రైవర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వాసుల కష్టాలు మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చిన సుమారు 30 మంది వరకు జిల్లాలో పనిచేస్తున్నారు. 2010లో వారికి జిల్లాలో వారి అవసరం ఉందని తీసుకొచ్చిన ప్రస్తుతం వారికి కష్టాలు తప్పడం లేదు. వారిలో టిమ్ విధులు చేయాలని డ్రైవర్లను వే ధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. టిమ్ చేయని పక్షంలో వారికి విధుల్లోకి తీసుకోవడం లేదు. గత్యంతరం లేని స్థితిలో డ్రైవర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వారి జిల్లాకు వారిని పంపించే యత్నం కూడా చేయడం లేదు. తిప్పలు పెడుతూ విధులు చేయించుకుంటున్నారని, నిబంధలకు విరుద్ధంగా వాహనాలు నడపమని వేధిస్తున్నరని కార్మికులు ఆరోపిస్తున్నారు. -
మహిళా కండక్టర్ దారుణహత్య
భర్తే హంతకుడు మనస్పర్థల వల్లే దారుణం కాచిగూడలో ఘటన కాచిగూడ,న్యూస్‌లైన్: కట్టుకున్న భార్యను కడతేర్చాడో ఓ కిరాతక భర్త. ఆదివారం పట్టపగలు..అంతా చూస్తుండగానే కత్తితో విచక్షణారహితంగా పొడిచి దారుణహత్య చేశాడు. బుద్ధిమంతుడిలా వెంటనే పోలీసుస్టేషన్‌కెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించి కాచిగూడ ఏసీపీ రంజన్త్రన్‌కుమార్, తోటి ఉద్యోగులు తెలిపిన ప్రకారం..ప్రకాశం జిల్లా ఎర్రగుంటపాలెం ప్రాంతానికి చెందిన జమునారాణి (41) కాచిగూడ డిపోలో కండక్టర్. ఈమెకు గతంలో వివాహం జరగ్గా..కూతురు పుట్టిన తర్వాత భర్త వదిలేశాడు. ఉద్యోగరీత్యా కొంతకాలంగా నగరంలో ఉంటోంది. కాగా కానిస్టేబుల్‌గా పనిచేస్తూ 2003లో డిస్మిస్ అయిన వెంకటేష్‌నాయక్ (44)తో జమునారాణికి పరిచయం ఏర్పడింది. వెంకటేష్‌నాయక్ మొదటి భార్య కవిత అతన్ని వదిలేయడంతో జమునారాణిని 2004లో రెండోవివాహం చేసుకున్నాడు. వీరిద్దరిది రెండో వివాహమే. గత పదేళ్లుగా జమునారాణి-వెంకటేష్‌నాయక్ దంపతులు నగరంలో కలిసే ఉన్నారు. వీరికి పాప కూడా ఉంది. వెంకటేష్‌నాయక్ ఉద్యోగం లేకపోవడంతో పనిచేయకుండా తాగుడుకు బానిసై నిత్యం భార్యతో గొడవపడుతుండేవాడు. నాలుగునెలల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడి గొడవజరగడంతో జమునారాణి ఉద్యోగానికి సెలవుపెట్టి వెళ్లిపోయింది. ఇలా దూరంగా ఉంటుండగా..జమున ఇటీవలే నగరానికొచ్చి బర్కత్‌పురలోని ఓ ప్రైవేట్ వర్కింగ్ ఉమెన్స్‌హాస్టల్‌లో ఉం టూ కండక్టర్‌గా పనిచేస్తోంది. ద్వేషం పెంచుకొని : భార్య విధులకు వస్తుందన్న విషయం తెలుసుకున్న వెంకటేశ్ ఆమె వద్దకు వెళ్లి ఇంటికి రావాలని కోరాడు. దీనికి నిరాకరించడంతో ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. ఎలాగైనా భార్యను హత్య చేయాలని పథకం వేసి ఆదివారం మధ్యాహ్నం బర్కత్‌పురలోని హాస్టల్ నుంచి విధులకు హాజరయ్యేందుకు నడుచుకుంటూ వస్తుండగా సరిగ్గా కాచిగూడ బస్‌స్టేషన్ వద్ద జమునారాణిపై విచక్షణ రహితంగా కత్తితో దాడిచేసి పొడిచాడు. ఈ ఘటన చూసిన పలువురు భయంతో పరుగులుదీశారు. ఘటన జరిగిన వెంటనే వెంకటేష్‌నాయక్ కాచిగూడ పోలీసుస్టేషన్‌కు చేరుకుని లొంగిపోయాడు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న జమునారాణిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఘటనాస్థలాన్ని ఏసీపీ రంజన్త్రన్‌కుమార్, సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ జగదీశ్వర్‌రావు, క్లూస్‌టీం సిబ్బంది, కాచిగూడ ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్రావు తదితరులు సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఆమె మృతిపట్ల డిపో కార్మికులు, తోటి ఉద్యోగులు సంతాపం ప్రకటించారు. -
చేయని నేరానికి...
ఆయన పేరు వీఎస్‌రెడ్డి. కోడ్ నెం. ఈ.412461. కడప ఆర్టీసీడిపోలో కండక్టర్‌గా ఏడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. 10.5.2014న బద్వేల్ సర్వీసుకు వెళ్లారు. నాల్గొవ ట్రిప్‌లో ఆర్టీసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సిద్దవటం నుంచి వచ్చిన ఇరువురు ప్రయాణికులకు ఒకే వ్యక్తి రెండు టికెట్లు తీసుకున్నాడు. టికెట్లు ఉన్న ప్రయాణికుడు మధ్యలో దిగిపోయాడు. ఇంకో ప్రయాణికుడు పాతబస్టాండు వరకూ బస్సులో వచ్చారు. తనిఖీల సందర్భంగా... మేము కలిసే వచ్చాం.. టికెట్‌కు డబ్బులు తీసుకున్నారు.. మాకు కండక్టర్ ఇచ్చిన టికెట్ ఇదేనంటూ మరో ప్రయాణికుడు బుకాయించాడు. అంతే వాస్తవాలతో నిమిత్తం లేకుండా కేసు నమోదు.. ఆపై చార్జీ మెమో.. అనంతరం సస్పెండ్ చేశారు. సాక్షి ప్రతినిధి, కడప: ‘అరిటాకు వెళ్లి ముళ్లుపై పడ్డా.. ముళ్లు వచ్చి ఆకుపై పడ్డా చినిగేది అరిటాకే’ అన్న సామెత తుచ తప్పకుండా ఆర్టీసీ కార్మికులకు వర్తిస్తోంది. ప్రయాణికులు చేసిన, చేస్తున్న పొరపాట్లు కండక్టర్లకు వేదనను మిగిలుస్తున్నాయి. తనిఖీ అధికారులు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. విచారణలో అలసత్వం కారణంగా కార్మిక కుటుంబాలు నడిరోడ్డుపై పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. విధినిర్వహణలో నిక్కచ్చిగా పనిచేస్తున్నా వే ధింపులు తప్పడం లేదని పలువురు వాపోతున్నారు. అంతా నీతిపరులేనా అన్న ప్రశ్న ఉదయించవచ్చు. చేయని తప్పుకు నేరాన్ని అపాదించడం ఎంతమాత్రం సరైంది కాదని పలువురు ఆక్షేపిస్తున్నారు. వీఎస్‌రెడ్డి లేదా ఎండీ భూషణంలకు అప్పగించిన టికెట్లు.. ప్రయాణికులకు పోను మిగిలిన టికెట్లు,, చార్ట్‌లో నమోదైన టికె ట్ల వివరాలను పరిశీలిస్తే వాస్తవంగా తప్పు చేశారా.. సంస్థను మోసం చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారా అన్న విషయం తేటతెల్లమవుతుంది. ఇవేమీ పట్టించుకోకుండా కేసులు నమోదు చేయడం.. ఆపై సస్పెండ్ చేయడం ఆర్టీసీలో రివాజుగా మారిందని పలువురు కార్మికులు వాపోతున్నారు. విచారణలో అలసత్వం.... కండక్టర్లు తప్పులు చేశారని ఆరోపణలు రాగానే స్పందించే యంత్రాంగం ఆపై విచారణలో వాస్తవమా? కాదా? అన్న విషయం నిర్ధారణ చేసి తగిన విధంగా స్పందించకుండా మిన్నకుండిపోతోంది. జిల్లా వ్యాప్తంగా ఎన్నో కేసులు పెండిం గ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కడప డిపో పరిధిలోనే ఎనిమిది మంది కార్మికులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కేవలం ప్రయాణికులు తనిఖీ అధికారులను మభ్యపెట్టడం కారణంగా కేసులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. కుటుంబాలను వీధులపాలు చేసుకోలేని కార్మికులు దళారులను ఆశ్రయించి సస్పెన్షన్‌ను తొల గించుకుంటున్నట్లు తెలుస్తోంది. నాకు ఎలాంటి సంబంధంలేదు.. అక్రమ సస్పెన్షన్‌ను ఎత్తివేయండి మహాప్రభో అని మొరపెట్టుకుంటున్న వారిని కనికరించడం లేదు. ఈవిషయమై ఆర్టీసీ కడప డిపోమేనేజర్ శ్రీనివాసలురెడ్డిని వివరణ కోరేందకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. ఫోన్ సైతం లిప్ట్ చేయలేదు. -
డ్రైవర్లకు ‘కండక్టర్’ విధులొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు టికెట్లు జారీ చేసే టిమ్స్ మెషిన్‌ను డ్రైవర్ చేతిలో పెట్టి కండక్టర్ విధులనూ చేయించాలనే ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇద్దరి విభిన్న బాధ్యతలు ఒక్కరికే అప్పగించడం మోటారు వాహనాల చట్టం నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పింది. బస్సులో కండక్టర్ విధులనూ డ్రైవర్లే నిర్వహించాలంటూ ఒత్తిడి చేయవద్దని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి 2011లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆర్టీసీ యాజమాన్యం అప్పీల్ దాఖలు చేసింది. ఇదే అంశంపై నెల్లూరుకు చెందిన డి.ప్రభుకిషోర్, మరో 14 మంది పిల్ దాఖలు చేశారు. వీటినీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. ఆర్టీసీ తరఫున వాదనలు వినిపించేందుకు సంబంధిత న్యాయవాది హాజరు కాకపోవడంతో ఆ సంస్థ అప్పీల్‌ను కొట్టివేసింది. పిల్‌పై పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎస్‌ఏకే మైనుద్దీన్ వాదనలు వినిపిం చారు. సింగిల్ జడ్జి తీర్పును పరిశీలించిన ధర్మాసనం దాన్ని సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
బస్సు ఇబ్బందులపై కండక్టర్‌దే బాధ్యత!
సాక్షి, ముంబై: వర్షాకాలంలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై విధి నిర్వహణలో ఉన్న కండక్టరే స్వయంగా డిపోలో ఫిర్యాదు చేయాలని బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ప్రయాణికులకు బస్సులో ఎదురయ్యే లీకేజీ, మూసుకోని, తెరుచుకోని కిటికీలు తదితర ఇబ్బందుల నుంచి త్వరలో విముక్తి లభించనుంది. వర్షాకాలం వచ్చిందంటే అనేక బస్సుల్లో టాప్ నుంచి లీకేజీ సమస్యలు ఎదురవుతాయి. గత్యంతరం లేక ప్రయాణికులు తడుస్తూ అలాగే ప్రయాణించాల్సి వస్తోంది. కిటికీల పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంటుంది. కిటికీలు బిగుసుకుపోవడంతో అవి సరిగా పనిచేయవు. వాటిని మూయాలన్నా, తెరవాలన్నా పెద్ద ప్రహసనమే. ఇలాంటి పరిస్థితులు దాదాపు అన్ని బస్సుల్లోనూ దర్శనమిస్తున్నాయి. బస్సు డిపోలోకి రాగానే వీటిపై సంబంధిత సిబ్బందికి ఫిర్యాదు చేయాలని వర్షాకాలం ప్రారంభంలోనే కండక్టర్లందరికీ బెస్ట్ పరిపాలన విభాగం ఆదేశించింది. కాని కండక్టర్లు దాన్ని పట్టించుకోవడం లేదు. డ్యూటీ పూర్తికాగానే కండక్టరు, డ్రైవర్ బస్సును డిపోలో నిలిపి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీన్ని సీరియస్‌గా పరిగణించిన బెస్ట్ అధికారులు ఇక నుంచి ఇలాంటి ఫిర్యాదులు తప్పకుండా చేయాలని ఉత్తర్వులు జారీచేశారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందుకు కండక్టర్‌కు ఒక మార్కర్ కూడా ఇచ్చారు. లీకేజీ జరుగుతున్న చోట గుండ్రంగా మార్కింగ్ చేయాలని సూచించింది. పనిచేయని కిటికీలను గుర్తించి అక్కడ కూడా ఒక గుర్తు పెట్టాలని సూచించారు. బస్సు డిపోలోకి రాగానే సంబంధిత సిబ్బందికి ఫిర్యాదుచేస్తే వారు వెంటనే స్పందించి మరమ్మతులు చేస్తారు. అయితే బస్సుల తయారీలో ఎలాంటి లోపం లేదని బెస్ట్ అధికారి ఒకరు చెప్పారు. కాగా బస్సులు బెస్ట్ అధీనంలోకి వచ్చిన తర్వాత డిపోల్లో ప్లాజ్మా టీవీలు, సీసీ కెమెరాలు, స్పీకర్లు బిగించే పనులు జరుగుతాయి. అందుకు అవసరమైన వైరింగ్ పనులకు డ్రిల్లింగ్ చేయాల్సి వస్తుంది. దీంతో టాప్ లేదా బస్సు బాడీకి కొంతమేర హాని జరుగుతుంది. దీంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే వర్క్ షాపులో బస్సు బాడీ తయారుచేసే సమయంలోనే వీటిని అమర్చేలా చర్యలు తీసుకుంటే ఈ ఇబ్బందులు ఉండవని మరో అధికారి అభిప్రాయపడ్డారు.