కదులుతున్న స్కూల్ బస్సులో దారుణం..
ఉజ్జయిని: అభంశుభం తెలియని నాలుగేళ్ల నర్సరీ విద్యార్థినిపై స్కూల్ బస్సు కండక్టర్ దారుణానికి పాల్పడ్డాడు. కదులుతున్న బస్సులోనే ఆ చిన్నారిని అత్యాచారం చేశాడు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఈ ఘటన జరిగింది.
మంగళవారం సాయంత్రం స్కూలు నుంచి విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు బస్సులో పంపారు. బస్సులో విద్యార్థులందరూ దిగిన తర్వాత బాధిత బాలిక మాత్రమే మిగిలింది. ఆ సమయంలో కండక్టర్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ తర్వాతి ఇంటి దగ్గర ఆ చిన్నారిని దింపారు. బాధితురాలు జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.