ఎకసెక్కాలుగా ఉందా? | Brahmanandam,AVS Comedy Scene in Bus | Sakshi
Sakshi News home page

ఎకసెక్కాలుగా ఉందా?

Published Sun, Jun 21 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 4:04 AM

ఎకసెక్కాలుగా ఉందా?

ఎకసెక్కాలుగా ఉందా?

కామెడీ సీన్
ప్రశాంతంగా ఊరు వెళదామని బస్ ఎక్కుతాడు గురులింగం.
సీటు  దొరికింది. కూర్చున్నాడు.
ఓ పల్లెటూరి అతను ఓ పేద్ద మూటతో బస్ ఎక్కాడు.
ఇక అక్కడ నుంచి మన గురులింగం పాట్లు ఏంటో మీరే చూడండి.


కండక్టర్: ఏ ఊరికి పోవాలి?
పల్లెటూరాయన:  ఏ ఊరు పోతే నీ కెందుకయ్యా? డ బ్బులు తీసుకుని టికెట్ కొట్టంతే! ఇరుకుపాలెం అంటే ఎకసకాలుగా ఉందే!

కండక్టర్:ఈ మూటకు లగేజి కట్టాలి.
పల్లెటూరాయన: ఇరుకుపాలెం అంటే ఎకసకాలు కాకపోతే ఈ మూటకు లగేజి కొడతావా నువు...

కండక్టర్:ఎక్స్‌ట్రా బరువుందిగా...
పల్లెటూరాయన: నా మూట నా నెత్తి మీదే ఉంటుంది. నీ బస్సులో పెడితే లగేజి కొట్టు! (పక్కనే ఉన్న గురులింగాన్ని కొడతూంటాడు)
గురులింగం: ఏంటయ్యా నీ గోల?
పల్లెటూరాయన: మరేంటండీ! ఎట్టా మాట్లాడుతున్నాడండీ ఆయన?
 
కండక్టర్:డబ్బులివ్వు...
పల్లెటూరాయన: ఇస్తానండీ! ఎగ్గొడతామా
(మూటను గురులింగం మీద పడేస్తాడు)
గురులింగం: ఏందయ్యా ఇది?
పల్లెటూరాయన: అందరం కలిసి వెళ్తున్నాం ఆ మాత్రం సర్దుకోలేరా. ఇదిగోండి డబ్బులు (అని కండక్టర్‌కి డబ్బులిస్తాడు)
 
కండక్టర్: ఏంటిది? పది పైసలు తగ్గాయి?
పల్లెటూరాయన: నా దగ్గర లేవు, అరె లేవని చెప్తున్నా కదా
 
కండక్టర్:ఇవ్వు...ఇవ్వక పోతే దించేస్తా
పల్లెటూరాయన: ఏంటి....!పదిపైసలు లేకపోతే దించేస్తావా? 50 మందున్నారు బస్సులో. 10 పైసలు సర్దుకోలేవా నువు!
గురులింగం: నువ్వు అన్యాయంగా మాట్లాడుతున్నావ్. పదిపైసలు ఇవ్వాలి
పల్లెటూరాయన: మరైతే ఇచ్చేయ్

గురులింగం: నాకేంటి సంబంధం
పల్లెటూరాయన: నువ్వెందుకు మాట్లాడావ్? బస్సులో ఇంతమంది ఉన్నారు నువ్వెందుకు మాట్లాడావ్. మేము మేమూ ఏదో మాట్లాడుకుంటాం, సర్దుకుంటాం. (అంటూ కండక్టర్ వైపు తిరిగి) అది కాదన్నా పదిపైసలు లేకపోతే సర్దుకోవాలి గాని సర్దుకుపోతే ఎట్లా!
   
పల్లెటూరాయన: టైమెంత అయిందండీ?
గురులింగం: 9:10(ఒక్కటి కొడతాడు)
గురులింగం: ఏంటయ్యా కొడతావ్
పల్లెటూరాయన: ఏంటండీ? ఇందాకట్నుంచి చూస్తున్నా ఇరుకుపాలెం అంటే ఎకసెక్కాలుగా ఉందా? ఏం అడిగాను?

గురులింగం:  టైం అడిగావ్
పల్లెటూరాయన: మీరు నాకు ఏం చెప్పారు

గురులింగం: 9:10 (మళ్లీ కొట్టాడు)
గురులింగం: కొడతావేంటి? పిచ్చిపిచ్చిగా ఉందా? టైం 9 :10 అయింది
పల్లెటూరాయన: చంపేస్తా నిన్ను అసలు... నిన్నేం అడిగాను ? నువ్వేం చెప్పావ్ ?

గురులింగం: 9: 10 (మళ్లీ కొట్టాడు)
పల్లెటూరాయన: తొమ్మిందయిందనో, పది అయిందనో చెప్పాలి. 9, 10 అంటావా...
(ఇంతలో బస్ రైల్వే క్రాసింగ్ దగ్గర ఆగింది)
పల్లెటూరాయన: గేటేశారా..?

గురులింగం: గేటేశారు కాబట్టే బస్ ఆగింది
పల్లెటూరాయన: రైలొస్తుందటారా?

గురులింగం: (కోపంగా విసుగ్గా చూస్తాడు)
పల్లెటూరాయన: ఏంటండీ కోపం... ఏమన్నావండీ! ఇరుకుపాలెం అంటే ఎకసెకాలుగా ఉంది! (కొంతసేపటికి మళ్లీ)
పల్లెటూరాయన: రైలొచ్చినప్పుడు గేటేస్తారా? గేటేసినప్పుడు రైలొస్తదంటారా?

గురులింగం: బస్సు వస్తే గేటేస్తారు. రైలొస్తే గేటు తీస్తారు!
పల్లెటూరాయన: అంత చమత్కారం ఎందుకులెండి! అంటే... సర్కార్ అంటారా...మెయిల్ అంటారా?

గురులింగం: అంత అవసరమా అది!
పల్లెటూరాయన: అవసర మే!

గురులింగం: సర్కార్ అయింటుంది
(ఒక్కటి కొట్టి)
పల్లెటూరాయన: ఏంటి ఏంటది... సర్కారా అది?

గురులింగం: కొడతావా ఏంటి కొడతావ్
పల్లెటూరాయన: చంపేయాలి నిన్ను

గురులింగం: చేయి చేస్కోకు బాగోదు చెబుతున్నా!
పల్లెటూరాయన: రైలొస్తుందటావా?

గురులింగం: రాదు విమానం వస్తుంది
పల్లెటూరాయన: ఏంటి?(మళ్లీ కొడతాడు)

గురులింగం: కొడతావ్ ఏంటి...
పల్లెటూరాయన: ఇరుకుపాలెం అంటే ఎక్కసక్కాలుగా ఉందా? రైలొస్తుందా అంటే విమానం వస్తుందంటావా! ఏ రైలొస్తుందో చెప్పు (చెప్పనని సైగ చేస్తాడు.. పల్లెటూరతను మళ్లీ కొడతాడు)
పల్లెటూరాయన: ఏ మాట్లాడలేవా? ఇట్టిట్టా అంటావ్! ఎన్ని పెట్టెలుంటాయో చూసి చెప్పు..!

గురులింగం: ఒకటి.. రెండు... ఎనిమిది
మొత్తం ఎనిమిది పెట్టెలు. సర్కారు...
(మళ్లీ కొడతాడు)

గురులింగం:  ఏంటయ్యా కొడతావ్. నువ్వేనా 8 పెట్టెలుంటే సర్కారన్నావ్
పల్లెటూరాయన: 8 పెట్టెలున్న ప్రతీదీ సర్కారు అయిపోతదా అది గూడ్స్!
(గురులింగం తలబాదుకుంటాడు)
వెంకటేశ్ హీరోగా నటించిన ‘ధర్మచక్రం’ సినిమాలోని ఈ హాస్య సన్నివేశంలో గురులింగంగా ఏవీయస్ నటిస్తే, అతనిని ముప్పుతిప్పలు పెట్టే పల్లెటూరి వ్యక్తిగా బ్రహ్మానందం నటించారు.
 - శశాంక్.బి
 
పల్లెటూరాయన: ఏంటది సర్కారా?
సర్కార్‌కి ఎన్ని పెట్టెలు ఉంటాయో తెలుసా నీకు?
 
గురులింగం: నాకు తెలీదు
 పల్లెటూరాయన: తెలీదా

గురులింగం: తెలీదు
పల్లెటూరాయన: ఇంత చదువుకున్నావ్ సర్కార్‌కు ఎన్ని పెట్టెలుంటాయో తెలీదా నీకు... ఎనిమిది పెట్టెలుంటాయ్ లెక్కపెట్టు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement