బస్టాప్ వద్ద పార్క్ చేసి ఉన్న ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో బస్సులో కండక్టర్ నిద్రించగా, బస్టాప్‌లోని రెస్ట్‌రూంలో డ్రైవర్ నిద్రించడానికి వెళ్లాడు. దీంతో కండక్టర్ ఈ ప్రమాదం బారినపడి..తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బెంగుళూరులోని లింగధీరహల్లిలో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(బీఎంటీసీ) బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. బీఎంటీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో..అదే సమయంలో ఆ బస్సులో కండక్టర్ నిద్రపోతున్నాడు. దీంతో అతను మంట్లో చిక్కుకుని..80 శాతం కాలిన గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఐతే బస్సు డ్రైవర్(39) ప్రకాశ్ ఆ సమయంలో బస్టాప్‌లోని రెస్ట్ రూంలో నిద్రపోవడంతో అతను సురక్షితంగా ఉన్నాడు. అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఆర్టీసీ డీసీపీ పేర్కొన్నారు. ఐతే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు అధికారులు.
(చదవండి: భారతీయులు అలాంటివి అనుమతించరు! సమాచార మంత్రి ఫైర్)
Comments
Please login to add a commentAdd a comment