sleeping
-
పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన లారీ
పుణే: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు గాయాలపాలయ్యారు. మహారాష్ట్రలోని పుణే నగరంలో ఆదివారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అమరావతికి చెందిన కార్మికులు వారి కుటుంబాలతోపాటు రెండు రోజుల క్రితం ఉపాధి కోసం పుణేకు వచ్చారు. వఘోలి ప్రాంతంలోని కెస్నాడ్ ఫటా ఫుట్‌పాత్‌పై వీరంతా నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 12.55 గంటల సమయంలో అదుపు తప్పిన ఓ ట్రక్కు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైగా దూసుకెళ్లింది. ఘటనలో రెండేళ్లలోపు ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు చనిపోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ గజానన్ టొట్రేను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
చలికాలంలో ఎందుకంత నిద్రమత్తు? నిపుణులు చెప్పే సమాధానం ఇదే..
చల్లగా ఉండే శీతాకాలంలో వెచ్చగా దుప్పటి కప్పుకుని మరింతసేపు పడుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. అటువంటప్పుడు బద్ధకం ఎక్కువై ఉదయాన్నే నిద్ర లేవడం కష్టమవుతుంది. ఇది దినచర్యను ప్రభావితం చేస్తుంది. అయితే చలికాలంలో మనం ఎందుకు ఎక్కువసేపు నిద్రపోతామో మీకు తెలుసా? ఎందుకు ఇలా బద్ధకం ముంచుకొస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? దీనికి కారణం చల్లని వాతావరణమే కారణం అనుకుంటే.. అదొక్కటే సరైన కారణం కాదు.డి విటమిన్ లోపంశీతాకాలంలో రాత్రి సమయం ఎక్కువసేపు ఉంటుంది. పగటి సమయం తక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ఫలితంగా బద్ధకంతో పాటు అధిక నిద్ర మొదలవుతుంది. ఇవేకాకుండా శీతాకాలంలో అధిక నిద్రకు అనేక కారణాలున్నాయి.మెలటోనిన్ హార్మోన్ పెరుగుదలశీతాకాలపు రాత్రులలో తగినంతగా నిద్ర పోయిన తరువాత కూడా బద్ధకం ఆవరిస్తుంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం శీతాకాలంలో శరీరంలో మెలటోనిన్ హార్మోన్ స్థాయి గణనీయంగా పెరుగుతుంది. ఈ మెలటోనిన్ అధిక సమయం నిద్రకు కారణంగా నిలుస్తుంది. మెలటోనిన్ హార్మోన్ అధికంగా పెరగడం వల్ల మన నిద్రలో ఆటంకాలు ఏర్పడతాయి. ఈ కారణంగా కొంతమందికి రోజంతా బద్ధకంగా అనిపిస్తుంది.మెలటోనిన్ హార్మోన్ శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతుంది. దీనివలన నిద్ర వస్తుంది. బయటి కాంతి తగ్గినప్పుడు ఇది నిద్రపోయే సమయం అనే సంకేతాన్ని మెదడుకు అందిస్తుంది. శీతాకాలంలో తక్కువ కాంతి కారణంగా మెలటోనిన్ ప్రభావం చాలాసేపు కొనసాగుతుంది. అందుకే చలికాలంలో ఉదయంపూట అధిక సమయం నిద్రపోతుంటాం.బాడీ టైమ్ టేబుల్ అస్తవ్యస్తంమనిషికి నిద్ర అలవాటు సిర్కాడియన్ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. సిర్కాడియన్ ప్రక్రియ అంటే మన శరీరానికి సంబంధించిన అంతర్గత సమయ పట్టిక. ప్రతి కణం నియమిత తీరులో దాని పనిని అది చేస్తుంటుంది. కొన్ని అంశాలు మన సిర్కాడియన్ను అంటే మన జీవ గడియారాన్ని ప్రభావితం చేస్తాయి. ఇందులో పర్యావరణం, ఉష్ణోగ్రత, సూర్యకాంతి వంటి మొదలైన అంశాలు ఉన్నాయి. మారుతున్న వాతావరణం కూడా సర్కాడియన్ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మన జీవ గడియారంలో స్వల్ప మార్పులు ప్రారంభమవుతాయి. శీతాకాలంలో నిద్రపోయే సమయాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మనకు ఎక్కువసేపు నిద్రపోవాలని అనిపిస్తుంది.శరీరానికి వెచ్చదనాన్ని అందించడంచలి పెరిగినప్పుడు వెచ్చగా ఉండటానికి మనం ఉన్ని దుస్తులను ధరిస్తాం. చాలా చల్లని లేదా చాలా వేడి ఉష్ణోగ్రతలు శరీరంపు సహజ నిద్ర ప్రక్రియకు అంతరాయం కలిగిస్తాయి. వెచ్చదనాన్ని అందించే దుస్తులు నిద్ర ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి. ఫలితంగా మరింతసేపు నిద్రపోవాలని అనిపిస్తుంది.అతిగా ఆహారం తీసుకోవడంచలికాలంలో చాలామంది అతిగా ఆహారాన్ని తీసుకుంటారు. ఇది జీర్ణ వ్యవస్థ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఫలితంగా బద్దకంగా అనిపించి, మరింత సేపు నిద్రపోతుంటాం. శీతాకాలంలో వెచ్చదనం కోసం చాలామంది నాన్ వెజ్ తింటుంటారు. ఈ నాన్‌వెజ్‌ను జీర్ణం చేసుకునేందుకు జీర్ణవ్యవస్థ ఇబ్బంది పడుతుంది. చలికాలంలో అధికంగా తినడం పలు అనారోగ్యం సమస్యలకు దారితీస్తుంది.అధిక నిద్రను ఎలా నివారించాలి?చలికాలంలో వ్యాయామం చేయకపోవడం, వేపుడు పదార్థాలు తినడం, అస్తవ్యస్తమైన జీవనశైలి, బలహీనమైన రోగనిరోధక శక్తి, జలుబు, ఫ్లూ వంటివి కూడా అధిక నిద్రకు కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు. అధిక నిద్రను నివారించడానికి పగటిపూట వీలైనంత ఎక్కువ సమయం సూర్యరశ్మిలో ఉండే ప్రయత్నం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. పగటిపూట నిద్రపోకుండా ఉండటానికి నిత్యం బిజీగా ఉండేందుకు ప్రయత్నించాలని వైద్యులు చెబుతున్నారు.చలికాలంలో రాత్రి భోజనంలో అధికంగా తినడం మానుకోవాలని, ఆకు కూరలు, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవద్దని చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు నీరు తాగితే, ఉదయం నిద్ర లేవడం సులభం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. రోజూ ఒకే సమయంలో నిద్రపోవడం- మేల్కొనడం వల్ల శరీర గడియారం క్రమపద్ధతికి అలవాటు పడుతుంది. నిద్రలేచిన వెంటనే స్నానం చేయండి. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిచడంతో పాటు చురుకుదనాన్ని అందిస్తుంది. ఇది కూడా చదవండి: Year Ender 2024: అత్యంత ప్రజాదరణపొందిన వెడ్డింగ్ డెస్టినేషన్స్ -
నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్‌ని కరిగించే బెడ్‌టైమ్ 'టీ'..!
చాలామంది బానపొట్టతో ఇబ్బంది పడుతుంటారు. ఏ డ్రెస్ వేసుకోవాలన్న ఇబ్బెట్టుగా ఈ పొట్ట కనిపిస్తుంది. దీన్ని తగ్గించుకోవడం కూడా అంత ఈజీ కాదు. కాస్త శారీరక శ్రమతో పట్టుదలతో కష్టపడితే బెల్లీఫ్యాట్ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారు జస్ట్ ఈ టీతో నిద్రపోతున్నప్పుడే ఈ ఫ్యాట్‌ని కరిగించేసుకుని ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు ఖ్యాతీ రూపానీ. రాత్రిపూట చిరుతిళ్లకు బదులుగా ఈ బొడ్డు బస్టింగ్ టీని సేవించడం మేలని అన్నారు. ఇంతకీ ఏంటా 'టీ'? అదెలా తయారు చేస్తారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఈ టీ కోసం..వాము, సొంపు గింజలు: వాము శరీంలోని అధిక నీటి శాతాన్ని తగ్గించి, పొట్ట ఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది. ఇక సొంపు జీర్ణక్రియకు, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.పసుపు: ఇది ప్రసిద్ధ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పవర్‌హౌస్. ఇది శరీర కొవ్వుని నియంత్రించడంలో సమర్ధవంతంగా ఉంటుంది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. పైగా పరోక్షంగా బరువుని కూడా తగ్గిస్తుంది. ధనియాలు: ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి, జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతాయి. ఇది కూడా బరువు నిర్వహణకు ఉపయోగపడుతుంది. తయారీ విధానం: టేబుల్ స్పూన్ వాము, సొంపు తీసుకోవాలి. దీనికి 1/4 టీస్పూన్ తాజా పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర గింజలను జోడించాలి.ఆ తర్వాత 500-600 ml నీరు పోసి స్టవ్‌పై బాగా మరిగించాలి. 15 నిమిషాల తర్వాత వడకట్టి వేడివేడిగా ఆస్వాదించాలి. ప్రయోజనాలు..హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా PCOS, అడెనోమయోసిస్ సమస్యలకు చెక్ పెడుతుంది. జీవక్రియ, ఇన్సులిన్ పనితీరును మెరుగ్గా ఉంచుతుందిబరువు నిర్వహణకు ఉపయోగపడుతుందిమంచి నిద్రను ప్రోత్సహిస్తుందినిద్రవేళల్లో ఈ టీని ఆరోగ్యకరంగా తయారుచేసుకుని తాగితే బెల్లీఫ్యాట్ కరగడమే గాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని పోషకాహారనిపుణురాలు ఖ్యాతీ రూపానీ చెబుతున్నారు.(చదవండి: అన్నం సయించనప్పుడు ఇలా తీసుకుంటే మేలు..!) -
కునుకు తీస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారా ?
-
కునుకు తీస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారా? రూ.41 లక్షలు కట్టండి!
ఎప్పుడైనా మనిషికి అలసట కలిగిందంటే నిద్ర వచ్చేస్తుంది. కొంతమంది ఉద్యోగం చేసే సమయంలో కూడా నిద్రపోతారు. అలాంటి వారిని కంపెనీలు మందలిస్తాయి. అయితే చైనాకు చెందిన ఓ కంపెనీ మాత్రం ఉద్యోగిని జాబ్ నుంచి తీసేసింది.ఒక్కసారి పనిలో నిద్రపోవడం వల్ల కంపెనీ జాబ్ నుంచి తొలగించడం.. ఏ మాత్రం సమంజసం కాదని భావించిన ఉద్యోగి, ఆ కంపెనీపై దావా వేశారు. ఏకంగా రూ. 3,50,000 యువాన్స్ (రూ. 41.6 లక్షలు) అందుకున్నాడు.జాంగ్ సుమారు 20 సంవత్సరాలకు పైగా జియాంగ్సు ప్రావిన్స్‌లోని తైక్సింగ్‌లోని ఒక కెమికల్ కంపెనీలో డిపార్ట్మెంట్ మేనేజర్‌గా పనిచేశారు. అయితే ఒకరోజు పని అర్ధరాత్రి వరకు పొడిగించారు. దీంతో కొంత అలసట కారణంగా.. నిద్రపోయాడు. ఇది మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.కంపెనీలో నిద్రపోయాడనే కారణంగా హెచ్ఆర్ డిపార్ట్మెంట్.. జీరో టాలరెన్స్ డిసిప్లిన్ విధానాన్ని జాంగ్ ఉల్లంఘించారని ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. తనను జాబ్ నుంచి తీసేయడం అన్యాయమని.. కంపెనీకి వ్యతిరేకంగా చట్టపరమైన చర్య తీసుకోవాలని జాంగ్ నిర్ణయించుకున్నాడు. అనుకున్న విధంగానే కోర్టును ఆశ్రయించారు.ఉద్యోగంలో నిద్రపోవడం అదే మొదటిసారి, అంతే కాకుండా.. నేను నిద్రపోవడం వల్ల కంపెనీకి తీవ్రమైన నష్టం జరగలేదు అని కోర్టులో వెల్లడించారు. 20 ఏళ్ళు జాంగ్ కంపెనీకి అందించిన సేవ, ఆయన పొందిన ప్రమోషన్స్, జీతాల పెరుగుదల వంటి వాటిని పరిశీలించిన కోర్టు అతని అనుకూలంగా తీర్పునిస్తూ.. పరిహారంగా రూ. 41.6 లక్షలు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. -
ఒకే సమయం నిద్రతో ఒత్తిడికి కళ్లెం
న్యూఢిల్లీ: నిద్ర. అలసిన శరీరాన్ని అమాంతం ఆక్రమించి మరోలోకానికి తీసుకెళ్లే అదృశ్యదేవత. అలాంటి నిద్రాదేవత ఆవాహన చిన్నారుల్లో రోజూ ఒకేసమయంలో జరిగితే ఒనగూరే ప్రయోజనాలు అంతాఇంతా కాదని తాజా పరిశోధనాలో వెల్లడైంది. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలోని పరిశోధకులు ఈ మేరకు ఆరేళ్ల వయసు చిన్నారులపై ఒక విస్తృతస్థాయి, సుదీర్ఘ పరిశోధన చేశారు. పుట్టినప్పటి నుంచి రెండున్నరేళ్ల వయసు వచ్చే వరకు కొందరు చిన్నారులను వారి తల్లిదండ్రులు శ్రద్ధాసక్తులతో పెంచేలా ఆ పేరెంట్స్‌కు శిక్షణనిచ్చారు. చిన్నారి వేర్వేరు సందర్భాలకు తగ్గ భావోద్వేగాలు, శారీరక అవసరాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తీరుస్తూ వారి ఆలనాపాలనా బాధ్యతలను చక్కగా నెరవేర్చేలా చూశారు. మారాంచేసినపుడు గారాబం చేయకుండా పరిస్థితిని చక్కగా విడమరిచి చెప్పేలా తల్లిదండ్రులకు తగు తరీ్ఫదునిచ్చారు. అలసపోయి నిద్రలోకి జారుకునేటపుడు నిద్రకు అనువైన వాతావరణం ఉండేలా చూడడం, దీపాలన్నీ ఆర్పేసి చిన్నారులను వీపుపై తడుతూ బుజ్జిగించి పడుకోబెట్టడం వంటివి చేయాలని పరిశోధకులు సూచించారు. పరిశోధనలో ఏం తేలింది? ఇలా చేయడం వల్ల చిన్నారులు రోజూ ఒకే సమయానికి పడుకోగలిగారు. నిద్రసమయం కూడా దాదా పు వారి వయసుకు తగ్గట్లు ఉండేది. దీంతో చిన్నారులు తమ దైనందిన జీవితంలో చవిచూసిన భావోద్వేగాలను చక్కగా నియంత్రించుకోవడం పరిశోధకులు గమనించారు. ఒకే సమయంలో నిద్రపోవడం వల్ల గాఢ నిద్ర సాధ్యమైంది. ‘‘స్థిరమైన నిద్రాకాలం అనేది పిల్లల ఎదుగుదలకూ ఎంతో తోడ్పడింది. నిద్రసరిగా పట్టకపోవడం వంటి సమస్యలు వీరిలో తలెత్తలేదు’’అని పరిశోధకులు చెప్పారు. సంబంధిత వివరాలు డెవలప్మెంటల్ అండ్ బిహేవియర్ పిడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇతర చిన్నారుల్లో ఇబ్బందులు పరిశోధనకు ఎంచుకున్న పిల్లలతో పోలిస్తే అస్తమానం అస్తవ్యస్త్య సమయాల్లో నిద్రించే పిల్లల్లో భావోద్వేగాలపై నియంత్రణ చాలా తక్కువగా ఉందని ఈ అధ్యయనంలో కీలక పరిశోధకుడు అద్వా డాడ్జీ చెప్పారు. ఈయన పెన్సిల్వేనియా స్టేట్ వర్సిటీలో బిహేవియర్ హెల్త్ విభాగంలో సేవలందిస్తున్నారు. పరిశోధకులు పిల్లలు రోజు ఏ సమయానికి నిద్రపోతున్నారు, ఎంతసేపు నిద్రపోతున్నారు, గాఢనిద్ర వివరాలు తెల్సుకునేందుకు వాళ్ల మణికట్టుకు మానిటర్లను అమర్చారు. ఎలాంటి ప్రయోగాలు చేశారు? ఒకేసమయంలో నిద్రించే పిల్లలకు ఒక పెద్ద బొమ్మల సమూహం నుంచి ఒకేఒక్క బొమ్మను తీసుకుని ఆడుకోవాలని సూచించారు. ప్రతి బొమ్మను విడివిడిగా ఒక చిన్న పెట్టెలో తాళం వేసి దాచారు. ఆ పెట్టెల తాళంచెవులను ఇచ్చి తెరచి తీసి ఆడుకోవాలని సూచించారు. ఏ తాళంచెవికి ఏ పెట్టే తెరచుకుంటుందో కనిపెట్టేందుకు.. ఒకేసమయంలో నిద్రించే పిల్లలు మాత్రం శ్రద్ధగా ఒక్కో పెట్టెను తాళంచెవితో తెరచే ప్రయత్నంచేశారు. నిద్రానియమంలేని పిల్లలు మాత్రం ఒక్కో పెట్టెను తెరిచే ఓపికలేక ఆవేశంతో ఆ తాళం చెవులను విసిరిపారేశారు. మరో ప్రయోగంలో రెండు రకాల పిల్లలను ఒకచోటచేర్చి కలిసి ఆడుకోండని సూచించారు. ఈ సందర్భంలోనూ నిద్రనియంత్రణ ఉన్న పిల్లలు తోటి పిల్లలతో కలిసి ఆడుకునే ప్రయత్నంచేశారు. కొందరు పిల్లలను వారంలో ప్రతి రోజూ ఒక 20 నిమిషాలు ముందుగా లేదా 20 నిమిషాలు ఆలస్యంగా నిద్రపోయేలా చేశారు. ఇంకొందరిని వారంరోజులపాటు ఏకంగా రెండు గంటలు ముందుగా లేదంటే ఆలస్యంగా నిద్రపోనిచ్చారు. 20 నిమిషాల తేడాతో నిద్రించిన పిల్లల్లో భావోద్వేగాల నియంత్రణ చాలా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. -
తండ్రికొడుకు ప్రాణం తీసిన మంచం
సేలం: ఇనుప మంచం పడి తండ్రి, కుమారుడు మృతి చెందిన ఘటన దిండుగల్ లో ఆదివారం వేకువజా మున చోటు చేసుకుంది. దిండుగల్ సమీపంలో ఉన్న సానర్పట్టి కాలియమ్మన్ కోవిల్ వీధికి చెందిన గోపీకన్నన్ (35) టైలర్‌గా పని చేస్తున్నాడు. ఇతని భార్య యోగేశ్వరి (32) నత్తం ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తుంది. వీరికి కుమారుడు కార్తిక్ (10) ఐదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం రాత్రి యోగేశ్వరి పనికి వెళ్లడంతో ఇంట్లో గోపీకన్నన్ మద్యం మత్తులో ఇనుప మంచంపై పడుకుని నిద్రపోయాడు. అతని పక్కన నేలపై కార్తిక్ పడుకున్నాడు. ఈ స్థితిలో వేకువజామున ఇనుప మంచం బోల్టు ఊడి కింద పడింది. దీంతో మంచం మధ్యలో తల చిక్కుకుని గోపికన్నన్ కింద పడుకుని ఉన్న కుమారుడు కార్తిక్‌పై పడ్డాడు. దీంతో తండ్రీ, కొడుకులు మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున లోగేశ్వరి తన భర్త, కుమారుడిని తనిఖీ చేసేందుకు వెళ్లింది. విరిగిన ఇనుప మంచంలో తన భర్త, కొడుకు చనిపోయి పడి ఉండటాన్ని ఆమె గుర్తించింది. ఆమెతో పాటు ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. సానర్పట్టి పోలీసులు కేసు నమోదు చేశారు -
వీకెండ్ హాయిగా నిద్రపోతే, ఆ ముప్పు 20 శాతం తగ్గుతుంది!
మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అంతేకాదు నిరంతరం వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజా పరిశోధన సరికొత్త విషయాన్ని గుర్తించింది. కంటి నిండా నిద్రపోతే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని తెలుసు, కానీ వారాంతాల్లో ఎక్కువగా నిద్రపోవడం వల్ల కూడా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని ఒక అధ్యయనంలో తేలింది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ సమావేశంలో సమర్పించిన ఒక అధ్యయనం ప్రకారం, వారాంతాల్లో నిద్ర తప్పిన వ్యక్తుల్లో గుండె జబ్బుల ముప్పు 20శాతం తగ్గుతుంది. ముఖ్యంగా వారమంతా పని ఒత్తిడిలో ఉండి సరిగా నిద్రపోని వారికి వీకెండ్ నిద్ర గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొత్త పరిశోధన వెల్లడించింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, వారాంతాల్లో నిద్రపోవడం తరచుగా ఆలస్యంగా నిద్రపోయే వారికి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. వృత్తిరీత్యా స్లీపింగ్ సైకిల్ సరిగా లేని వ్యక్తులకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుందని వివరించింది.ఆధునిక జీవనశైలి తరచుగా పని వారంలో నిద్రలేమికి గురయ్యేవారికి ఇది ఉపయోడ పడనుంది. చైనాలోని బీజింగ్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజ్లోని ఫువై హాస్పిటల్‌లోని స్టేట్ కీ లాబొరేటరీ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్‌కు చెందిన స్టడీ కో-రచయిత మిస్టర్ యంజున్ సాంగ్ మాట్లాడుతూ, "తగినంత పరిహార నిద్ర గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వారం రోజుల్లో నష్టపోయిన నిద్రకు పరిహారంగా వారాంతపు రోజుల్లో క్రమం తప్పకుండా నిద్రను భర్తీ చేసుకునే వారిలో ఈ ఫలితం స్పష్టంగా కనిపిస్తుందని ఈ అధ్యయనం తెలిపింది. -
ఈ డ్రైఫ్రూట్‌తో నిద్రలేమికి చెక్!
నిద్రలేమి అనేది నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల వారిని వేధిస్తున్నసాధారణ సమస్యగా మారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం..శారీర మానసిక ఆరోగ్యం కోసం నాణ్యమైన నిద్ర అత్యంత అవసరం. అయితే చాలామందికి సరైన నిద్ర లేకపోవడానికి ప్రధాన కారణాలు జీవనశైలి, ఆహార సమస్యలే అని చెబుతున్నారు నిపుణులు. ఈ నిద్ర సమస్య విటమిన్లు ఏ, సీ, డీ, ఈ, కే, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాల లోపం వల్లే వస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఈ లోపాన్ని అధిగమించేందుకు పోషకాలతో నిండిన ఈ డ్రైఫ్రూట్ తీసుకోమని సూచిస్తున్నారు. ఇంతకీ ఏంటా డ్రైఫ్రూట్? నిద్రలేమికి ఎలా సహాయపడుతుందంటే?నిద్రలేమికి పిస్తాపప్పు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఇది నిద్రలేమి సమస్యకు సహజ సప్లిమెంట్లా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మెలటోనిన్ స్లీప్ హార్మోన్‌తో లోడ్ చేయడబడి ఉంటుంది. మంచి నిద్ర సహాయకారిగా పిస్తాపప్పులను పేర్కొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం చీకటికి ప్రతిస్పందనగా మెలటోనిన్‌ని ఉత్పత్తి చేస్తుంది. పిస్తాపప్పులు తీసుకుంటే సహజంగానే ఇది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుందట.సుమారు 100 గ్రాముల షెల్డ్ పిస్తాలో 23 mg మెలటోనిన్ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే.. నిద్రలేమి కోసం వాడే మెలటోనిన్ సప్లిమెంట్లలో కంటే ఎక్కువ. అంతేగాదు పిస్తాలో మెగ్నీషియం, విటమిన్ బీ6 పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి మంచి ప్రశాంతమైన నిద్రను అందించడంలో చక్కగా ఉపయోగపడతాయి. ఎప్పుడు తింటే మంచిదంటే..మెగ్నీషియం, మెలటోనిన్ మాత్రలు వేసుకోవడం కంటే నిద్రవేళకు ఒక గంట ముందు కొన్ని పిస్తాలను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని పచ్చిగా లేదా షెల్డ్గా తీసుకోవచ్చు లేదా మంచి రుచి కోసం కాల్చి తినవచ్చు. ఇక్కడ పరిమితికి మించి తీసుకోకూడదని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది అదనపు కేలరీలను అందిస్తుంది. అందులోనూ రాత్రిపూట తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మంచి నిద్ర కోసం చేయాల్సినవి..ప్రతిరోజూ నిర్ణిత సమయానికే నిద్రపోవాలని చెబుతున్నారు నిపుణులు పడుకునే ముందు కనీసం రెండు గంటల ముందు స్క్రీన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయాలి.ఎల్లప్పుడూ మీ పడకగదిలో ఉష్ణోగ్రతను 65–68°F మధ్య ఉంచండి.అలాగే నిశబ్దంగా ఉండేలా ఫ్యాన్, ఎయిర్ కండీషనర్‌ని చూసుకోండికెఫిన్ తాగవద్దు, ఎక్కువ భోజనం చేయవద్దు అలాగే నిద్రవేళల్లో ఆల్కహాల్ లేదా నికోటిన్‌ని ఉపయోగించవద్దు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండిపగటిపూట చురుకుగా ఉండేలా చూసుకుంటే బాగా నిద్రపోవచ్చు ఒత్తిడి, ఆందోళన, చింతించడం లాంటివి దూరం చేసుకోండి. (చదవండి: నటి డైసీ రిడ్లీకి 'గ్రేవ్స్ వ్యాధి': ఎందువల్ల వస్తుందంటే..?) -
సిద్దరామయ్యకు స్లీపింగ్ కష్టాలు
-
నిద్రలో తేడాలొచ్చినా టైప్-2 డయాబెటిస్ ముప్పు
టైప్ 2 డయాబెటిస్ ప్రపంచవ్యాప్తంగా కలవర పెడుతున్న సమస్య. దాదాపు 90 నుండి 95శాతం ఈ తరహా డయాబెటిస్తో బాధపడుతున్నారు. 2021లో ప్రపంచంలో 540 మిలియన్ల మధుమేహ కేసులు (ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్, 2021) ఉన్నట్లు అంచనా. ఒత్తిడి, నిశ్చల జీవనశైలి , నాణ్యత లేని, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వంటి కారణాలతో మధుమేహం విస్తరిస్తోంది. అయితే తాజా అధ్యయనం ప్రకారం అతిగా నిద్రపోవడం వల్ల కూడా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందట.మనిషి ఆరోగ్యంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అయితే సమయా పాలన పాటించని నిద్రకూడా ప్రమాదమే అంటున్నారు. హెచ్చు తగ్గుల నిద్రకు మన ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. నిద్ర వ్యవధిని తరచూ మార్చుకునే వారికి డయాబెటిస్ బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని తాజా పరిశోధన ద్వారా తెలుస్తోంది. ఈ పరిశోధన ప్రకారం తమ నిద్ర వ్యవధిని 31 నుంచి 45 నిముషాల పాటు మార్చుకోవడం (నిద్ర వ్యవధి ఎక్కువ/తక్కువ చేయడం) వల్ల 15 శాతం డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది. ఈ వ్యవధి గంటకు మించి ఉంటే ఆ ప్రమాదం 59 శాతం పెరుగుతుంది. అతి నిద్ర కారణంగా కారణంగా డయాబెటిస్ సోకే అవకాశాలు 34 శాతం అధికంగా ఉంటుంది.జూలై 2024 అధ్యయనం మరియు డయాబెటిస్ కేర్‌లో దీన్ని ప్రచురించారు. యూకే బయో బ్యాంక్ ద్వారా పరిశోధకులు యాక్సిలోమీటర్లు (స్మార్ట్ వాచ్) ద్వారా 84 వేల మంది నిద్ర నమూనాలను పరిశీలించారు. అతి నిద్ర, నిద్ర లేమి రెండూ కూడా డయాబెటిస్‌కు దారితీసే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. నిద్రలేమి కారణంగా శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలహీనం కావడమే కాక, తీవ్ర రక్తపోటు, ఊబకాయం, మానసిక ఒత్తిడి, హృద్రోగ సంబంధ వ్యాధులు సోకే అవకాశాలు అధికంగా ఉంటాయని పరిశోధన పేర్కొంది. క్రమరహిత నిద్ర అనేది ఆధునిక జీవనశైలితో ముడిపడి ఉన్న ఆరోగ్య సమస్య. వృత్తి, ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, కుటుంబ కట్టుబాట్ల కారణంగా ప్రజలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు, ఇది వారి నిద్రపై ప్రభావం చూపుతుంది. నిద్రకు ముందు మొబైల్ ఫోన్ల వంటి డిజిటల్ పరికరాల వినియోగం పెరగడం మరో ప్రధాన అంశం. మొబైల్ ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పేలవమైన నిద్ర భవిష్యత్తులో మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. -
వామ్మో..! ఇలా కూడా నిద్రపోతారా?
‘నిద్రపోయే ముందు మీరు ఏం చేస్తారు?’ అనే ప్రశ్నకు– ‘చక్కని సంగీతం వింటాను. నచ్చిన పుస్తకం చదువుకుంటాను’... ఇలాంటి జవాబులు వినిపించడం సాధారణమే. అయితే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ టియా విల్సన్ నోటి నుంచి వచ్చిన మాట విని నెట్ లోకులు షాకు అయ్యారు. ‘సౌకర్యవంతంగా. సుఖంగా నిద్రపోవడానికి నా భుజాన్ని డిస్లొకేట్ చేస్తాను. నిద్ర నుంచి లేచిన తరువాత తరిగి యథాస్థానంలో అమర్చుకుంటాను’ అంటుంది విల్సన్. ‘జోక్ చేస్తోందా?’ అనుకోవద్దు. ఆమె చెప్పింది నిజమే. ఎహ్లర్స్ డాన్లోస్ సిండ్రోమ్ (ఈడీఎస్)తో బాధపడుతోంది టియా విల్సన్. ‘ఈడీఎస్’ అనేది జన్యుపరమైన రుగ్మత. చర్మం సాగదీయబడినట్లుగా ఉంటుంది. కీళ్లు వదులవుతాయి. చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. భుజాన్ని డిస్లొకేట్ చేసినప్పుడు అచేతనంగా మారి వేలాడబడుతున్నట్లుగా ఉంటుంది. కొద్దిరోజుల క్రితం ‘హౌ ఐ స్లీప్’ క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో టియా విల్సన్ పోస్ట్ చేసిన ఈ వీడియో రెండు మిలియన్ల వీక్షకుల గుండెలను చెమ్మగిల్లేలా చేసింది. View this post on Instagram A post shared by Tia Wilson (@tortillawilson) (చదవండి: ఈ దొంగతనమనేది ఒక పెద్ద జబ్బు..చివరికి?) -
చంద్రబాబు పాలన.. నిద్రపోతున్న ప్రభుత్వ ఆఫీసర్లు..
-
అర్ధరాత్రి దాటాక, ఎక్కువ లైట్లో పనిచేస్తున్నారా? అయితే ఆ రిస్క్ ఎక్కువే!
మనిషి ఆరోగ్య జీవనానికి నిద్ర చాలా అవసరం. ఆహారంతో పాటు రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరి. లేదంటే అనేక ప్రమాదకరమైన అనారోగ్యాల్ని కొని తెచ్చుకున్నట్టే ఈ విషయం మనలో చాలా మందికి తెలుసు. అయితే అర్థరాత్రి దాకా మెలకువతో ఉండటం మాత్రమే కాదు, ఎక్కువ వెలుగులో ఉన్నా ప్రమాదమేనని తాజా అధ్యయనం చెబుతోంది.85వేల మంది వ్యక్తులపై జరిపిన భారీ అధ్యయనంలో, ఫ్లిండర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు రాత్రిపూట కాంతికి ఎక్స్పోజ్ కావడం మూలంగా (పగటిపూట కార్యకలాపాలతో సంబంధం లేకుండా) టైప్-2 మధుమేహం ముప్పును పెంచుతుందని గుర్తించారు.రాత్రి ఆలస్యంగా నిద్రకుపక్రమించడం వల్ల సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుందని ఇది జీవక్రియలో మార్పులకు దారితీస్తుందని కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ నుండి అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రచయిత ఆండ్రూ ఫిలిప్స్ తెలిపారు. ఇన్సులిన్ స్రావం, గ్లూకోజ్ జీవక్రియ మార్పుల కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ఇది ప్రభావితం చేస్తుందని, చివరికి టైప్-2 డయాబెటిస్‌కి దారి తీస్తుందని తెలిపారు. 2013 -2016 మధ్య కాలంలో యూకే బయెబ్యాంకు డాటాతో, ఒక వారం పాటు మణికట్టు కాంతి సెన్సార్లను ధరించి 84,790 మంది ఈ స్టడీలో పాల్గొన్నారు. తొమ్మిదేళ్ల తర్వాత అంచనాల ప్రకారం 13 మిలియన్ గంటల లైట్-సెన్సర్ డేటాతో తరువాతి జీవితంలో మధుమేహం వచ్చే ప్రమాదం 67శాతంఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. జీవనశైలి, షిఫ్ట్ డ్యూటీలు, సమయానికి నిద్రపోకపోవడం లాంటివి షుగర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయన్న విషయాన్ని పరిగణనలో తీసుకున్న పరిశోధకులు, అర్థరాత్రి 12.30 నుంచి ఉదయం 6 గంటల మధ్య ఎక్కువ కాంతికి ప్రభావితమవ్వడం కూడా అనారోగ్య సమస్యల్ని మరింత పెంచుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమయంలో ఎక్కువ లైట్‌కు ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడాలని, తద్వారా టైప్-2 మధుమేహం ముప్పు నుంచి తప్పించు కోవచ్చని సూచించారు.రాత్రి సమయంలో ప్రకాశవంతమైన వెలుగులో ఉండటం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువని ఫిలిప్స్ తెలిపారు. లైట్ ఎక్ప్పోజర్కి, మధుమేహం ముప్పుకు ఉన్న సంబంధాన్ని తమ పరిశోధనలో గుర్తించామన్నారు. సో.. ఈ తరహా డయాబెటిస్ నుంచి తప్పించు కోవాలంటే రాత్రిపూట పని చేసేటపుడు, ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవడం లేదా సాధ్యమైనంత చీకటి వాతావరణాన్ని సృష్టించుకోవడం సులభమైన మార్గమని సూచించారు. -
పాత జీన్స్ ప్యాంటులతో స్లీపింగ్ బ్యాగ్‌లు..ఒక్కో జీన్స్‌కి ఏకంగా..!
మన ఉపయోగించే బట్టల వల్ల కాలుష్యం ఏర్పడుతుందని తెలుసా..!. ఏటా వేల బట్టలు చెత్త కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. వాటిని కాల్చడం వల్ల మరింత కాలుష్యం ఏర్పడుతుంది. అవి మట్టిలో కలిసిపోయేందుకు చాలా టైం పడుతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం పర్యావరణవేత్తలు పలు మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు కూడా. ముఖ్యంగా జీన్స్ లాంటి దుస్తులు అంతతేలిగ్గా మట్టిలో కలిసిపోవు. పైగా దీని తయారీ కోసం ఎన్ని నీళ్లు ఖర్చుఅవుతాయో వింటే షాకవ్వుతారు. అలాంటి పాత జీన్స్ రీసైకిల్ చేసి ఉపయోగపడేలా చక్కగా రూపాందిస్తున్నాడు 16 ఏళ్ల యువకుడు. అంతేగాదు పర్యావరణ సంరక్షణలో తన వంతు పాత్ర పోషిస్తూ అందిరిచేత శెభాష్ అని ప్రశంలందుకుంటున్నాడు. అతనెవరంటే..ఢిల్లీకి చెందిన 16 ఏళ్ల నిర్వాన్ సోమనీ మన ఇంట్లో ఉండే దుస్తులు, వాటికి ఉపయోగించే రంగులు వల్ల ఎంత కాలుష్యం ఏర్పడతుందో తెలుసుకున్నాడు. అదీగాక ఏటా ఈ దుస్తులు వ్యర్థాలు ఎంతలా కుప్పలుగా పేరుకుపోతున్నాయో గమనించాడు. పర్యావరణ సమస్యకు చక్కటి పరిష్కారం చూపించ్చేలా ఏదైనా చేయాలనుకున్నాడు. అలా అతడి దృష్టి జీన్స్ దుస్తులపై పడింది. అప్పుడే.. ఒక్కో జీన్స్ తయారీకి ఏకంగా పదివేల లీటర్లు అవుతుందని, తెలుసుకుని షాక్ అవ్వుతాడు. ఐదు జతల జీన్స్‌కి ఏకంగా 50 వేల లీటర్ల అవుతాయా అని విస్తుపోయాడు. అంత నీటిని ఖర్చు చేస్తున్న ఈ జీన్స్‌లు సౌకర్యవంతంగా వినియోగించేలా రీ సైకిల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలోనే ప్రాజెక్ట్ జీన్స్ పేరుతో స్లీపింగ్ బ్యాగ్‌లు తయారు చేయడం ప్రారంభించాడు. కొన్ని కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు సహాయంతో నిర్వాణ్ వేల జతలు జీన్స్‌లు సేకరించాడు నిర్వాన్. వాటితో దాదాపు 900 స్లీపింగ్ బ్యాగ్‌లను రూపొందించాడు. అవి ఎవరికీ ఇస్తారంటే..ఢిల్లీలో చలికాలంలో రోడ్లపై నిద్రించే నిరాశ్రయులకు స్లిపింగ్ బ్యాగ్‌లు అందిస్తున్నాడు నిర్వాన్. సాధారణంగా మనం వారికి దుప్పట్లు ఇస్తుంటాం. అయితే అది పరిష్కారం కాదు. అవి కొంతకాలం తర్వాత చిరిగిపోతాయి. నిద్రపోయేలా పరుచుకుని పడుకోవడం కుదరదు కూడా. దీంతో ఈవిషయమై లోతుగా ఆలోచించి మరీ ఇలా స్లీపింగ్ బ్యాగ్‌లు రూపొందించాడు. అవి బెడ్ మాదిరిగా ఉండి..దాని లోపల పడుకోవచ్చు. ఎలా అంటే.. పడుకునే బెడ్ కమ్ దుప్పటిగా ఉంటుంది. ఇది వారికి సౌకర్యవంతంగా, ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. మిగతా దుస్తులు కంటే జీన్స్ చాలా దృఢంగా ఉంటుంది. అంత ఈజీగా చీరగదు కాబట్టి నిరాశ్రయులకు, అభాగ్యులకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నాడు నిర్వాన్. తనకు ఈ ఆలోచన రావడానికి కారణం వాళ్లమ్మ దుస్తుల దుకాణమేనని చెబుతున్నాడు. అక్కడ చాలా మెటీరియల్‌లు కుట్టగా చాలా దుస్తుల వేస్టేజ్ వస్తుంది. వాటిలో కొంత మేర ఏదో రకంగా ఉపయోగిస్తాం. మిగతా చాలా వరకు వేస్ట్ అయ్యేది. దాన్ని ఉపయోగిస్తూ ఏదైనా చేయగలనా అనుకున్నాను అలా ఈ స్లీపింగ్ బ్యాగ్‌లు తయారు చేసినట్లు వివరించాడు. గతేడాది టర్కీలో భూకంపం వచ్చి నిరాశ్రయులుగా మారిన ప్రజల కోసం దాదాపు 400 స్లీపింగ్ బ్యాగ్‌లను అందజేశాడు నిర్వాన్. మన అలమార్లో వృధాగా పడి ఉన్న జీన్స్‌ని అతడి కంపెనీకి అందజేస్తే మన వంతుగా పర్యావరణ సంరక్షణలో బాధ్యత తీసుకున్నట్లే అవుతుంది. ఈ పర్యావరణ కోసం అందరూ ఇలాంటి పలు కార్యక్రమాలు చేసి మన పుడమతల్లిని కాలుష్యం కోరల నుంచి కాపాడుకుందాం!.(చదవండి: ఆరు తరాలు, 185 మంది సభ్యులు..ఇప్పటికి ఒకే ఇంటిలో..) -
ఆరోజు రాత్రి వరకు అబ్బాయి.. లేచిన వెంటనే అమ్మాయిగా మార్పు..!
ప్రస్తుతం టెక్నాలజీకి తగ్గ రేంజ్లో ఘరానా దోపిడీలు, హైటెక్ మోసాలు ఊహకందని విధంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వైద్య రంగంలో మరింత ఘోరం. మనుషులకు తెలియకుండా అవయవాలు దోచేసుకుని వారి జీవితాలను నరకప్రాయంగా మార్చిన ఉదంతాలు కోకొల్లలు. వైద్యో నారాయణ హరిః అన్న వాక్యం వెలవెలబోయేలా ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అలాంటి దిగ్బ్రాతికర ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..సంజ్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల ముజాహిద్‌కి ఆ రోజు రాత్రితో తాను అతడుగా ఉండటం ఆఖరు అని ఊహించలేదు. ఆ రాత్రి తన పాలిట కాళరాత్రిగా మారి జీవితాన్ని శాపంగా మారుస్తుందని కలలో కూడా అనుకోలేదు. నిద్ర పోయేంతరకు మగవాడిగా ఉన్నవాడు కాస్త మేలుకునేటప్పటికీ 'ఆమె'గా మారిపోయాడు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. బాధితుడు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దిగ్బ్రాంతికర ఘటన బేగ్రాజ్పూర్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముజాహిద్ గత రెండేళ్లుగా ఓం ప్రకాష్ అనే వ్యక్తి చేతిలో వేధింపులకు గురవ్వుతున్నట్లు తెలిపారు. తనతో కలిసి జీవించాలని ఉందంటూ ఓం ప్రకాష్ మజిహిద్ తనతు చెప్పేవాడని మజిహిద్ పేర్కొన్నాడు. అయితే దీన్ని తన సమాజం, కుటుంబం అంగీకరించిందని ముజాహిద్ వ్యతిరేకించడంతో బెదిరింపులకు దిగేవాడని వాపోయాడు. అస్సలు తాను ఆస్పత్రికి రాలేదనని ఓం ప్రకాశ్‌నే ఇక్కడకు తీసుకొచ్చాడని చెప్పుకొచ్చాడు. పడుకుని లేచి చూచేటప్పటికీ లింగ మార్పిడి శస్త్ర జరిగిపోయిందని భోరును విలపిస్తున్నాడు ముజాహిద్. ఓం ప్రకాష్ వైద్యలతో కుమ్మకై తనకు ఈ ఆపరేషన్ చేయించినట్లు చెబుతున్నాడు. ఆ తర్వాత ఓం ప్రకాష్ తన వద్దకు వచ్చి మగవాడిని కాస్త స్త్రీగా మార్చాను. "ఇక నువ్వు నాతోనే జీవించాలి లేదంటే నీ తండ్రిని చంపి మీకున్న భూమిని కూడా లాక్కుని లక్నో పారిపోతానని బెదిరించాడని". ముజాహిద్ కన్నీటి పర్యంతమయ్యాడు. అంతేగాదు ఆస్పత్రి రికార్డులో సైతం అతడికి ఏదో వైద్య సమస్యతో అక్కడకు వచ్చినట్లు ఉండటం గమనార్హం. ఈ మేరకు బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు ముజఫర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఓం ప్రకాష్‌ని అరెస్టు చేయడమే గాక ఈ కేసుతో సంబంధం ఉన్న ఆస్పత్రి సిబ్బందిని కూడా క్షణ్ణంగా విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘనపై బీకేయూ కార్యకర్తల రైతు నాయకుడు శ్యామ్‌పాల్ స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మెడికల్ కాలేజ్ వద్ద నిరసనకు దిగారు. ఈ ఆస్పత్రిలో బాధితుల సమ్మతి లేకుండానే అవయవాల మార్పిడి, లింగ మార్పిడి వంటి రాకెట్లు గుట్టుచప్పుడు కాకుండా జరుగిపోతున్నాయని ఆరోపించారు. ఇలాంటి దారుణ ఘటన జరగడం బాధకరమని, వెంటనే అందుకు గల బాధ్యుల తోపాటు ఈ ఘటనలో పాల్గొన్న వారిని కూడా గట్టిగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, పోలీసులు ఆందోళనకారులు నిరసనలను విరమింప చేయడమే కాకుండా ఈ ఘటపై సత్వరమై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. (చదవండి: బీచ్‌లో సరదాగా జంట ఎంజాయ్ చేస్తుండగా..అంతలోనే..) -
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
కొందరికీ షాపింగ్ అంటే మహా ఇష్టం. చూసిందల్లా కొంటుంటారు. పాపం బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకుని కొందామన్నా సాధ్యం కాదు కొందరికీ. ఎంతలా కంట్రోల్‌గా ఉందామన్న ఆ వస్తువు కొనేదాక నిద్రపట్టని వాళ్ల గురించిn కూడా విన్నాం. కానీ నిద్రలో షాపింగ్ చేసే వ్యాధి గురించి విన్నారా? ఔను..! ఈ వ్యక్తులు నిద్రలోనే తెలియకుండానే షాపింగ్ చేస్తుంటారు. మెలుకవ వచ్చాక గానీ అసలు విషయం తెలియదంట. వామ్మో.. ఇదేం వ్యాది!. ఇలాంటివి కూడా ఉంటాయా అనుకోకండి. అలాంటి అరుదైన వ్యాధితోనే బాధపడుతోంది ఓ మహిళ.యూకేకి చెందిన 42 ఏళ్ల కెల్లీ నైప్స్ పారాసోమ్నియా ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీన్ని అరుదైన పారాసోమ్నియా స్లీపింగ్ డిజార్డర్‌గా పిలుస్తారు. ఈ డిజార్డర్ కారణంగా ఆమె నిద్రలోనే ఆన్లైన్ షాపింగ్ చేసేస్తుందట. ఏకంగా పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు దగ్గర నుంచి ఫ్రిడ్జ్ వంటి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా కొనుగోలు చేసేస్తుంది. వాటి బిల్లను కూడా క్రెడిట్ కార్డులతో చెల్లించేస్తుందట. మేలుకువ వచ్చాక మొబైల్ చూసుకుంటే గానీ తెలియదంట. తన అకౌంట్లో డబ్బు కట్ అయ్యాక గానీ అసలు విషయం తెలుసుకులేకతున్నాని చెబుతుంది. ఇలా నిద్రలో తనకు తెలియకుండానే షాపింగ్ చేసి లక్షల్లో డబ్బుల పోగొట్టుకున్నానని చెబుతోంది. దీంతో ఆమెకు ప్రతి రాత్రి భయానకంగా మారిపోయింది. "తన జీవితంలో ప్రతి రాత్రి ఓ పీడకల మాదిరిగా అయిపోతోందని బాధపడుతోంది. తన క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలన్నీఫోన్లోనే సేవ్ అయ్యి ఉంటాయట. ఐతే ఈ మాయదారి జబ్బు కారణంగా తన బ్యాంక్ వివరాన్ని సైబర్ నేరాగాళ్లకు చెప్పేయడం కూడా జరిగిందంట. దీంతో వాళ్లు ఆమె ఖాతా నుంచి సుమారు రూ. 20 వేలకు పైగా తస్కరించారట కూడా. అయితే ఈలోగా తాను తన బ్యాంక్ లావాదేవీలను లాక్ చేసేయడంతో కొద్ది మొత్తంలోనే డబ్బును కోల్పోయానని అంటోంది." కెల్లీ. ఇక సమస్య నుంచి బయటపడేందుకు ముక్కుకి శ్వాస సంబధ సమస్యల నిమిత్తం అమర్చుకునే పరికరాన్ని ధరించి పడుకుంటుంది. ఈ డివైజ్ ముక్కు నుంచి హెడ్ వరకు కదలకుండా అటాచ్ అయ్యేలా డివైజ్ ఉంటుంది. కాబట్టి నిద్రలోనే తనకు తెలయకుండా చేసే విచిత్రమైన పనుల నుంచి ఉపశమనం పొందొచ్చనేది కెల్లీ ఆశ. అయితే కెల్లీ సమస్య నుంచి బయటపడలేదు సరికదా..!ఈ పరికరాన్ని కూడా నిద్రలో తనకు తెలియకుండానే తీసేస్తుందంట. ఈ సమస్య కారణంగా తాను అప్పులు పాలవ్వుతున్నానని కెల్లీ ఆవేదనగా చెప్పుకొచ్చింది. అయితే దీనికి చికిత్స లేదు. తనకు తానుగా బయటపడాలని సంకల్పించుకుంటేనే సాధ్యమని చెబుతున్నారు వైద్య నిపుణులు.పారాసోమ్నియా స్లీపింగ్ డిజార్డర్ అంటే..ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి నిద్రలోనే నడవడం /మాట్లాడటం / తినడం/ ఏమైన ఇతర కార్యకలాపాల్లో పాల్గొనడం వంటివి ఏ మాత్రం పూర్తి అవగాహనతో చేయరు. ఆ టైంలో వారికి మెదడు పాక్షికంగా మేల్కొని ఉంటుంది. ఎవరైనా ఆ వ్యక్తులను గమనించి గట్టిగా అదిలిస్తే తిరిగి స్ప్రుహలోకి వస్తారు. ఇలాంటివన్నీ రాత్రి మొదటి జామునే జరుగుతాయట. చిన్నారుల్లోనూ, కొందరూ పెద్దల్లోనూ నిద్రలోనే నడవడం/మాట్లాడటం వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి. అయితే ఈ డిజార్డర్ తీవ్రంగా ఉంటేనే ఇలా సమస్యలు ఫేస్ చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: అనారోగ్యంలోనూ... నీట్ టాపర్‌గా!) -
నిద్దురలో బాగా గురక కొడ్తున్నారా! అయితే ఈ దిండు..
కొందరు నిద్రపోయేటప్పుడు గురక తీస్తుంటారు. గాఢనిద్రలో ఎవరు తీసే గురక వారికి తెలియదు గాని, వారితో పాటు ఒకే గదిలో పడుకునేవారికి నిద్రాభంగమవుతుంది. రకరకాల శారీరక సమస్యల వల్ల ఇలా గురక వస్తుంటుంది. గురకను అరికట్టడానికి ఇప్పటి వరకు ప్రత్యేకమైన ఔషధాలు, చికిత్సలు ఏవీ లేవు. అయితే, ఈ స్మార్ట్ తలదిండు గురకను ఇట్టే అరికడుతుందని చెబుతున్నారు.ఈ స్మార్ట్ దిండును కెనడియన్ కంపెనీ డెరుక్కి తయారు చేసింది. ఇది యాప్ ద్వారా పనిచేస్తుంది. నిద్ర తీరు తెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, తేడాలు ఉన్నట్లయితే యాప్ ద్వారా సమాచారం అందిస్తుంది. గురక మొదలయ్యే సూచన రాగానే, తల భంగిమను మార్చుకునేలా చేస్తుంది. స్లీప్ ఆప్నియా వంటి వ్యాధులను అరికట్టడానికి ఈ స్మార్ట్ దిండు బాగా ఉపయోగపడుతుంది. ఈ యాంటీ స్నోర్ పిల్లో గురక బాధను 89 శాతం వరకు నివారిస్తుందని తయారీదారులు చెబుతున్నారు. దీని ధర 699 డాలర్లు (రూ.58,212).ఇవి చదవండి: Children's Story: ఉత్తమ శిష్యుడు! 'మేము సర్వసంగ పరిత్యాగులం'.. -
హెల్త్: నిద్రలేమి సమస్యా? అయితే ఇలా చేయండి!
ఆరోగ్యంగా ఉండటానికి సరైన తిండి, శరీరానికి తగిన వ్యాయామాలతో పాటు కంటినిండా నిద్ర కూడా అంతే అవసరం. అయితే కొంతమంది జీవన శైలి, మానసిక ఒత్తిడి కారణంగా సరిగా నిద్రపోవడం లేదు. అటువంటి వారు నిద్రమాత్రలకు బదులు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని పండ్లు తీసుకుంటే సరిపోతుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా శరీరాన్ని రక్షించుకోవచ్చు. అరటి పండు.. నిద్రలేమితో బాధపడుతున్న వారు పడుకునే సమయంలో అరటిపండును తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో ఉండే గుణాలు శరీరంలోని ఒత్తిడిని సులభంగా తగ్గించి నిద్రను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈరోజు అరటి పండ్లతోపాటు చెర్రీలను కూడా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కొంతమంది తరచుగా నిద్ర పోయినట్లే పోయి మేల్కొంటారు. అయితే ఇలాంటివారు చెర్రీస్తో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ రసాన్ని తాగడం వల్ల చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. నిద్రను మెరుగుపరిచేందుకు పైనాపిల్ జ్యూస్ ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి నిద్రలేని సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ జ్యూస్‌ను తీసుకోవాలి. పైనాపిల్‌లో మెలటోనిన్, విటమిన్ సి, మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు దీనితో జ్యూస్‌ని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కివీ పండ్లు.. ద్ర సమస్యలతో బాధపడేవారు కివి పండ్లను కూడా తీసుకోవచ్చు. ఇందులో ఉండే గుణాలు కూడా నిద్ర స్థాయులను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. యాపిల్.. యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ యాపిల్ తింటే వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. రాత్రి పూట తినడానికి యాపిల్ అనేది బెస్ట్ స్నాక్‌గా చెపొ్పచ్చు. రాత్రి ఆకలి వేస్తే ఎలాంటి సందేహం లేకుండా యాపిల్ తినండి. ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. నిద్ర అనేది బాగా పడుతుంది. బొప్పాయి.. బొప్పాయిలో విటమిన్ సి, ఇ, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు హాయిగా నిద్ర పోయేలా చేస్తాయి. నిద్ర లేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు రాత్రి పూట బొప్పాయి తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇవి చదవండి: Summer Season: డీ హైడ్రేషన్‌తో ఇబ్బందా? నివారించండి ఇలా.. -
హెల్త్: ఏంటీ అలసటగా ఉందా..? బహుశా ఇలా చేస్తున్నారా..!?
మనలో చాలా మంది పొద్దున్నే నిద్ర లేవడానికి ఫోన్లో రెండు మూడు అలారాలను సెట్ చేస్తారు. కానీ, వాటిని కట్ చేసి మళ్లీ పడుకుంటారు. ప్రతిరోజూ ఇలాగే జరుగుతుంటుంది. ఆ తర్వాత తమని తాము తిట్టుకుంటూ ఉంటారు. శరీరానికి తగినంత విశ్రాంతి లభించక ఇలా అవుతోందా? లేక నిజంగానే బద్ధకంగా ఉంటుందా? బద్ధకానికి, విశ్రాంతికి విభజనరేఖ ఏమిటి? ఉత్సాహకరమైన ఉదయాన్ని ప్రారంభించడానికి నిద్ర మంచం మీద నుండి లేవడం అనే కష్టం నుంచి బయటపడటానికి సులువైన టెక్నిక్స్ కొన్నిటిని తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు అలారం సెట్ చేసి పెట్టుకుంటారు. ఉదయాన్నే ఆ అలారం మోగగానే మెలకువ వచ్చినా, లేవకుండా అలారం ఆఫ్ చేసి మళ్లీ పడుకుంటారు. నిద్ర రాకపోయినా అలాగే పడక నుంచి బయటకు రాకుండా ఉంటారు. దీంతో నిద్ర పోకపోయినా అలాగే పడుకోవడం వల్ల సమయం వృథా అవుతుందని నమ్ముతారు. అయితే విశ్రాంతి కోసం కొంత సమయాన్ని బద్ధకంగా గడిపినా ఫర్వాలేదు. కానీ, విశ్రాంతి కోసం పనిని పక్కన పెట్టడం వల్ల ఇబ్బందుల్లో పడవచ్చు. స్క్రీన్.. కలిగించే ఒత్తిడి చాలా మంది బెడ్ మీద ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడటం, మెయిల్స్ లేదా సోషల్ మీడియా వార్తలు చూడటం చేస్తుంటారు. దీనివల్ల కొంత సమయం బాగానే గడిచిపోతుందని అనిపించవచ్చు. విశ్రాంతి పొందుతున్నాం అనే భావన కూడా కలగవచ్చు. కానీ ఎక్కువసేపు పడుకుని స్క్రీన్‌ని, అందులోని సమాచారాన్ని చూడటం వల్ల బ్రెయిన్ ఒక విధమైన అసౌకర్యానికి, ఒత్తిడికి లోనవుతుంది. ఉదయం లేస్తూనే ఫోన్ తీసుకొని వచ్చిన నోటిఫికేషన్లు, మెసేజ్‌లు చూసే అలవాటును వదులుకోవాలి. మీతో మీరు.. రోజువారీ దినచర్యను ఎలాప్రారంభించాలో తెలుసుకోవడం మనందరికీ చాలా ముఖ్యం. మంచం మీద నుంచి లేచి, బయటకు వచ్చిన వెంటనే ఒత్తిడిని పెంచే పనులను ప్రారంభించవద్దు. ఉదయం నిద్రలేచిన వెంటనే మీకోసం మీరు కొంత సమయం కేటాయించుకోవాలి. ఈ సమయంలో ప్రశాంతతను కలిగించే సంగీతాన్ని వింటూ సులభంగా చేయదగిన పనులను ఎంచుకోవాలి. ఈ విధానం వల్ల ఆ రోజు మొత్తంలో చేయదగిన పనులను చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. అరగంట లోపు ఓకే! ఉదయం నిద్రలేచిన తర్వాత కాసేపు అలాగే పడుకోవడం దినచర్యలో భాగమైతే ప్రతిరోజూ చేయవచ్చు. నిద్రలేచిన తర్వాత ఎంతసేపు మంచం మీద పడుకోవాలో నిర్ణీత నియమాలు లేవు. అయితే, 15 నుంచి 30 నిమిషాల తర్వాత బెడ్‌ను వదిలేయడం మంచిది. శరీరం మాట వినాలి విశ్రాంతి నిద్రకు ప్రత్యామ్నాయం కాదు. కానీ, కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత మంచిగా అనిపిస్తే అది నిద్రతో సమానంగా లేకపోయినా కచ్చితమైన ప్రయోజనాలను పొందవచ్చు. విశ్రాంతి అవసరమైతే శరీరం మాట వినిపించుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలి అనిపించినప్పుడు దానిని పాటించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జ్ఞాపకశక్తి బాగుంటుంది. కొంతమంది వారాంతాల్లో రోజంతా మంచం పైనే బద్ధకంగా దొర్లుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏ పనీ చేయలేకపోయాం అనే అపరాధ భావనకు లోనవుతారు. దీనివల్ల కొన్ని ముఖ్యమైన పనులు పూర్తికాక కొత్త చిక్కులు ఎదురయే ప్రమాదం ఉంది. అందువల్ల నిద్రపోవాలి అని అనిపించిన ప్పుడు నిద్ర పోవడమే మంచిది. మంచి నిద్ర కోసం.. రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా, తిరిగి ఉదయం నిద్రలేచేలా స్థిరమైన షెడ్యూల్‌ని పాటించాలి. వారాంతాల్లో కూడా ఇదే నియమాన్ని పాటించాలి. నిద్రపోయే ముందు వేడినీటి స్నానం, ధ్యానం, పుస్తకం చదవడం, సంగీతం వినడం ప్రయోజనకరం. నిద్రపోయే ముందు మొబైల్‌ను దూరంగా ఉంచాలి. సోషల్ మీడియాను చూడటం పూర్తిగా మానుకోవాలి. త్వరగా జీర్ణం కాని ఆహారం, కెఫిన్, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. ఇవి చదవండి: వేగంగా బరువు తగ్గేందుకు సింపుల్ చిట్కాలివిగో! -
సుష్టిగా తిన్నాక ‘కునుకు’ మంచిదే, కానీ ఈ డేంజర్ కూడా ..!
పగటిపూట అన్నం తిన్నవెంటనే కాసేపు కునుకు తీయడం చాలామందికి అలవాటు. అందులోనూ వేసవి వచ్చిందంటే కాసేపైనా నిద్రపోవాల్సిందే. అయితే ఇది మన ఆరోగ్యానికి అసలు మంచిదా? కాదా? ఎంతసేపు కునుకు తీస్తే మంచిది? పగటిపూట నిద్రపోవడం కొంతవరకూ మంచిదే. పని నుంచి కొంచెం విశ్రాంతి తీసుకోవడంతో అలసట దూర మవుతుంది. ప్రశాంతంగా, కొత్త ఉత్సాహంగా వచ్చినట్టుగా అనిపిస్తుంది.అందుకనే దీన్ని పవర్ న్యాప్ అని అంటారు. మధ్యాహ్నం నిద్ర అనేది మితిమీరితే మాత్రం హానికరమైన ప్రభావం తప్పదంటున్నారు నిపుణులు. పగటి నిద్ర పనికి చేటు అన్నట్టు ఆరోగ్యానికి కూడా ముప్పే. మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం. ఇదిరాత్రిపూట నిద్రను ప్రభావితం చేస్తుంది. మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 20 శాతం కంటే ఎక్కువ పెరుగుతుందని మెడికల్ జర్నల్ ఆఫ్ అమెరికన్ అకాడెమీ ఆఫ్ న్యూరాలజీ గతంలో చేసిన అధ్యయనం చెబుతోంది. అంతేకాదు మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం 25 శాతం ఉంటుందట. కొలెస్ట్రాల్ స్థాయిలలో ఆటంకాలు ఎక్కువ నిద్రను కోల్పోయే రూపంలో కూడా గుర్తించవచ్చని అధ్యయనంలో వెల్లడైంది. వీరికి మినహాయింపు ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంగా ఉన్న వారు గరిష్ఠంగా 90 నిమిషాల పాటు నిద్రపోవచ్చట. మిగిలినవారు గరిష్ఠంగా 10 నిమిషాల నుంచి అరగంట లోపు మాత్రమే పడుకోవాలి. పగటి నిద్ర నష్టాలు ♦ ఊబకాయం ♦ రాత్రి నిద్రకు భంగం, బాడీ బయలాజికల్ సైకిల్ దెబ్బతింటుంది ♦ రాత్రి నిత్ర లేకపోతే అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె జబ్బులు, ఆందోళన లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం. ♦ డిప్రెషన్ -
రిఫ్రెష్ అవుదామని టీ తెగ తాగేస్తే..ఆ శక్తి తగ్గిపోతుంది!
అలసిన శరీరాన్ని సేదతీర్చడంలోనూ, మనసును సాంత్వన పరచడంలోనూ టీ ని మించింది లేదని అందరూ అంటారు. అలాగని టీ ఎక్కువగా తాగడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువసార్లు టీ తాగితే శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుందంటున్నారు. టీలో అధికంగా ఉండే టానిన్ ఐరన్ శోషణను నిరోధిస్తుంది. ఐరన్ లోపం వల్ల శరీరంలో బలహీనత, అలసట, నిద్రలేమి, అనేక ఇతర సమస్యలు పెరుగుతాయి. టీ లో కెఫిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది విశ్రాంతి లేకపోవడం, నిద్ర లేకపోవడం, వికారం వంటి దుష్ప్రభావాలకు కారణమవుతుంది. జీర్ణ సమస్యలు ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో జీర్ణ సమస్యలు వస్తాయి. ఇది గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది జీర్ణశక్తిని ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. గుండెల్లో మంట ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గుండెల్లో మంట పుడుతుంది. దీని కారణంగా ఆహార నాళంలో యాసిడ్ ఏర్పడి యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలతో పాటు పుల్లని తేన్పులు, వికారం కలుగుతాయి. నిద్ర సమస్యలు... కొంతమందికి రాత్రి నిద్రపోయే ముందు టీ తాగడం అలవాటు. అయితే ఇది వారి నిద్రపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. ఇది రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన సమస్యను కలిగిస్తుంది. రాత్రి పడుకునే ముందు టీ కి బదులు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం మంచిది. పేగులపై దుష్ప్రభావం... అధికంగా తాగే టీ మన పేగులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువగా టీ తీసుకునే వ్యక్తులు కెఫిన్, టానిన్ల కారణంగా ఆందోళన, ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. -
ఇవి మార్చితే.. చావును ఏమార్చినట్టే!
మన నిత్య జీవన విధానం, అలవాట్లు వంటివి మన జీవితకాలంపై ప్రభావం చూపుతాయన్నది తెలిసిందే. మరి ఏయే అలవాట్లు, పద్ధతులు మార్చుకుంటే.. 'మరణం' మనకు ఎంతెంత దూరం జరుగుతుందో తెలుసా.. దానిపై ఓ విస్తృత అధ్యయనం జరిగింది. 2011-2013 మధ్య 40 నుం 90 ఏళ్ల మధ్య వయసున్న ఏడు లక్షల మందిపై జరిపిన పరిశోధనలో ఆరు కీలక అంశాలను గుర్తించారు. వీటిని పాటించని వారితో పోలిస్తే.. పాటిందే వారిలో మరణ ప్రమాదం ఎంతవరకు తగ్గుతుందన్నది తేల్చారు. ముఖ్యంగా వ్యాయామం చేయనివారితో పోలిస్తే.. వారంలో కనీసం 150 నిమిషాల సాధారణ వ్యాయామం లేదా 75 నిమిషాల కఠిన వ్యాయామం చేసేవారు. మరణానికి దూరంగా ఉంటారని గుర్తించారు. మానసిక ఒత్తిడి, ఆందో నియంత్రించుకోగలిగితే 29 శాతం, డ్రగ్స్‌కు దూరంగా ఉంటే 380 మరణం రిస్క్ ను తప్పించుకున్నట్టేనని తేల్చారు. చదవండి: Alexi Navalni: కుటుంబ సభ్యులనూ వదలని పుతిన్ దేనిని పాటిస్తే మరణ ప్రమాదం ఎంత శాతం తగ్గుతుంది? -
మంచు పాన్పు
చలికాలపు రాత్రి నిద్రొస్తే మనమంతా బిర్రుగా ముసుగు తన్నిపడుకుంటాం. కానీ ఈ మంచు ఎలుగుబంటి మాత్రం సుఖమనిన ఇదియెగాద అనుకుంటూ మంచుపాన్పుపై హాయిగా నిద్రపోయింది. ఐస్‌బర్గ్‌పై ఎలుగు నిద్రపోతున్న ఫొటోను బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ నీమా సరిఖానీ తీశారు. ఈ ఫొటో.. పీపుల్స్ ఛాయిస్ సంస్థ చేపట్టిన ఓటింగ్‌లో పాల్గొన్న వేలాది మందికి తెగ నచ్చేసింది. దీంతో నీమాను పీపుల్స్ ఛాయిస్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారంతో సత్కరించారు. నార్వేకు చెందిన స్వాల్బార్డ్ ద్వీపసమూహంలో ఉత్తర ధృవానికి అత్యంత సమీప ఐస్‌బర్గ్‌ల వద్ద ఈ ఫొటోను తీశారు. -
ఏంటి? కనీసం 6 గంటలైనా నిద్ర పోవట్లేదా..!
'రోజుకు మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? పగలు ఎన్ని గంటలు? రాత్రి ఎన్ని గంటలు? కనీసం ఆరు గంటలైనా నిద్రపోతున్నారా? లేదంటే.. మీ హెల్త్ డేంజర్ జోన్లో ఉన్నట్టే. అవును. ఇది నిజమేనని ఓ అధ్యయనం వెల్లడించింది.' రోజు మొత్తంలో కనీసం ఆరు గంటలైనా నిద్రపోని వారిలో గుండెకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందట. నిద్రలేమి కారణంగా తీవ్ర ఒత్తిడి పెరగడమే కాకుండా అది శరీరంలోని రక్తప్రసరణపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది. తద్వారా రక్తనాళాల్లో ఒత్తిడి ఏర్పడి అది మెల్లగా గుండెపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. ముఖ్యంగా రాత్రివేళల్లో నిద్ర మంచిదని అధ్యయనంలో రుజువైంది. రాత్రివేళల్లో ఆరు గంటలు కంటే తక్కువ సమయం నిద్రించినవారిలో 27 శాతం మేర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధ్యయన వేత్తలు గుర్తించారు. అందుకే ఎంత ఒత్తిడి ఉన్నా.. ఎన్ని పనులు ఉన్నా.. నిద్రించేందుకు సమయాన్ని కేటాయిస్తే.. ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇవి చదవండి: ఇయర్ వాక్స్.. లాభమా? నష్టమా?