
కలల్లో రకరకాల కలలు ఉంటాయి. మనల్ని సంతోషపరిచి పదేపదే గుర్తు చేసుకునే కలలు కొన్ని అయితే, గుర్తు చేసుకోవడానికి కూడా గజగజలాడే భయానక కలలు కొన్ని. ‘మంచి కలలు వచ్చే ఛాయిస్ మన చేతిలో ఉంటే బాగుండేది’ అని కూడా బోలెడుసార్లు అనిపిస్తుంది. అయితే ఇది అత్యాశ కాదని నిద్రలో మంచి కలలు రావడం మన చేతిలోనే ఉందని అంటున్నారు స్వప్న విశ్లేషకురాలు, ‘ది డ్రీమ్ డిక్షనరీ: ఫ్రమ్ ఏ టు జెడ్’ పుస్తక రచయిత్రి చెయాంగ్. మంచి కలలు రావడానికి ఆమె బోలెడు టిప్స్ చెప్పారు. అందులో కొన్ని...
► పడుకునే ముందు కిటికీలో నుంచి ఆకాశంలోని చంద్రుడిని పదినిమిషాల పాటు ధ్యానస్థితిలో చూడండి. చంద్రుడు కనిపించకపోతే అందమైన చంద్రుడి బొమ్మను చూస్తూ నిద్రపోండి. కమ్మని కలలు వస్తాయి.
►పర్పుల్, సిల్వర్, గ్రీన్, బ్లూ దుస్తులు ధరించి నిద్రకు ఉపక్రమిస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది. మంచి కలలు వస్తాయి.
►మంచి కల రావాలంటే మంచి నిద్ర రావాలి. మీకు బాగా బోర్ కొట్టే పుస్తకం చదవండి చాలు. నిద్రను ఆపడం ఎవరి తరం కాదు!
చదవండి: