dreams
-
తీవ్రమైన పగటి కలలతో విసిగిపోయారా? నియంత్రణ ఎలా?
డాక్టరు గారూ! నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. నాకీ మధ్య పగటి కలలు ఎక్కువగా వస్తున్నాయి. క్లాసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, నడుస్తున్నా, ఏ పనిలో ఉన్నా, ఏవేవో పగటి కలలు వస్తున్నాయి. కలెక్టర్‌ను చూస్తే కలెక్టర్ అయినట్లు, పోలీస్ అఫీసర్‌ను చూస్తే ఎస్.పి. ని అయినట్లు, సినిమాలో హీరోయిన్ను చూస్తే నేను కూడా హీరోయిన్ అయినట్లు, ఇలా రకరకాలుగా పగటి కలలు, ఊహలు వస్తున్నాయి. ఆటోలో బస్సులో వెళుతున్నప్పుడు ఇవి మరీ ఎక్కువగా వస్తున్నాయి. అలా వచ్చినప్పుడల్లా చాలా హాయిగా ఉంటుంది. దాంట్లోంచి బయట పడగానే అయ్యో! ఇది నిజం కాదా అని చాలా బాధ కలుగుతుంది. క్లాసులో ఇలా కలలు రావడం వల్ల చదువు కూడా దెబ్బతింటోంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అని ఆందోళనగా ఉంది. ఈ ఊహల్లోంచి బయట పడే మార్గం చెప్పండి – ప్రణీత, మహబూబ్ నగర్ఇలా కలలు, పగటి కలలు కనడం మనిషికి చాలా సహజం. ఈ ప్రపంచంలో అసలు కలలు–పగటి కలలు ఎప్పుడో ఒకసారి కనని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇలా పగటి కలలు... అంటే ‘డే డ్రీమింగ్’ యుక్త వయసులో చాలా సహజం. మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురైనవారు, ‘ఎ.డి.హెచ్.డి.’ అంటే నిలకడ, ఏకాగ్రత లేకుండా ఓవర్ యాక్టివ్‌గా ఉండేవారిలో కూడా ఈ పగటి కలలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. మనం అనుకున్నవన్నీ నిజ జీవితంలో సాధించలేనప్పుడు, కొంత సేపైనా ఊహాలోకంలో విహరించి, నిజజీవితంలో పొందలేనివి ఇలా ఊహల్లోనైనా పొంది మనిషి తృప్తి పొందాలనుకుంటాడు. ఎడారిలాంటి మన జీవితాలకు పగటి కలలు ఒక ‘ఒయాసిస్’ లాగా పనిచేస్తాయి. అసంతృప్తితో ఉన్న మనసుకు ఈ పగటికలలు కొంత ఊరట కలిగించి, మన బాధలకు సమస్యలకు ఒక ‘ఔట్లెట్’ లాగా పనిచేసి మనల్ని సంతృప్తి పరుస్తాయి. మరికొందరికి పగటికలలు, వారిలో ‘క్రియేటివిటీ’ పెరిగేందుకు, జీవిత సమస్యలనుండి కొన్ని పరిష్కారాలు పొందేందుకు కూడా తోడ్పడతాయి. చదవండి: మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్ఒకే ఒక్క శ్వాసతో రికార్డ్: భారతీయ మత్స్య కన్య సక్సెస్ స్టోరీ!కానీ ‘అతి సర్వత్రా వర్జయేత్!’ అన్నట్లు ఏదైనా అతిగా ఉంటేనే ఇబ్బంది. వాస్తవాన్ని పూర్తిగా మరచి, పగలంతా పగటి కలల్లో, విహరించడమనేది అంత మంచిది కాదు. దీనివల్ల మీ చదువు, ఇతర పనులు దెబ్బతింటాయి. మీరు మీ జీవిత గమ్యాలను ప్రతిరోజు స్మరించుకుంటూ, వాటిని సాధించేందుకు, మీ శక్తియుక్తులను పూర్తిగా వినియోగించండి. ఏకాగ్రత నిగ్రహ శక్తి, పెంచుకునేందుకు సరైన నిద్ర, ధ్యానం, ప్రాణాయామం, మైండ్‌ఫుల్‌నెస్, ఉపయోగపడతాయి. మీకిష్టమైన వేరే వ్యాపకాలపై ధ్యాస పెట్టండి. జీవితంలో పగటి కలలు ఒక భాగమే తప్ప పగటి కలలే జీవితం కారాదు! -
వందేళ్లకు కల నిజమైంది.. ఏడు ఖండాలూ చుట్టేసిన బామ్మ
‘బాబుమొషాయ్! జిందగీ బడీ హోనీ చాహియే, లంబీ నహీ’ ఆనంద్ సినిమాలో ఫేమస్ డైలాగిది. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎన్ని జ్ఞాపకాలు మిగుల్చుకునేలా జీవితాన్ని ఆస్వాదించామన్నదే ముఖ్యమని సారాంశం. 102 ఏళ్ల ఈ బామ్మ ఎక్కువ కాలం బతకడమే గాక తనకు నచ్చినట్టుగా జీవిస్తూ అరుదైన జ్ఞాపకాలను ఎంచక్కా పోగేసుకుంటోంది. ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’ అంటూ ఏడు ఖండాలను చూడాలన్న తన కలను నిజం చేసుకున్నారు. ఆ సాహస మహిళ అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన డొరోతీ స్మిత్. ఇటీవలే ఆ్రస్టేలియా వెళ్లడం ద్వారా తన ట్రావెల్ బకెట్ లిస్టులో చివరి కోరికనూ తీర్చేసుకున్నారు. కాలిఫోర్నియాలో రెడ్‌వుడ్స్ రిటైర్మెంట్ విలేజ్‌లో ఉంటున్న స్మిత్‌కు ప్రపంచమంతా తిరగాలన్నది చిరకాల కల. ఆ క్రమంలో ఆరు ఖండాలూ తిరిగినా ఆ్రస్టేలియా మాత్రం అలా పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఓ కథ కోసం స్మిత్ వద్దకు వెళ్లిన అమ్మర్ కిండిల్, స్టఫాన్ టేలర్ అనే యూట్యూబర్లకు ఈ విషయం తెలిసింది. ఆమె కలను ఎలాగైనా పూర్తి చేయాలనుకున్నారు. డెస్టినేషన్ ఎన్ఎస్డబ్లూ అనే ట్రావెల్ సంస్థ, క్వాంటాస్ విమానయాన సంస్థలతో కలిసి స్మిత్ ఆ్రస్టేలియా పర్యటన కోసం తమ వంతు సాయం అందించారు. ఇంకేముంది! స్మిత్ ఎంచక్కా తన కూతురు అడ్రియన్‌తో కలిసి ఇటీవలే ఆ్రస్టేలియా సందర్శించారు. క్వాంటాస్ విమానంలో దర్జాగా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించడం విశేషం! అంతేకాదు, టేకాఫ్‌కు ముందు పైలట్లు, సిబ్బంది ఆమెను సన్మానించారు కూడా. ఆస్ట్రేలియాలో సిడ్నీ హార్బర్ క్రూయిజ్‌ను ఆస్వాదించారు. వైల్డ్ లైఫ్ జూను సందర్శించారు. ఒపేరా హౌస్, బొండీ బీచ్ వంటి ఐకానిక్ ప్రదేశాలన్నీ కలియదిగిగారు. ‘‘వయసైపోయింది, ఇప్పుడేం చేస్తాం లెమ్మని ఎప్పుడూ అనుకోకండి. ప్రయతి్నస్తే అద్భుతాలు చేయగలరు, చూడగలరు. కదలకుండా కూర్చుంటే తుప్పు పట్టిపోతారు. అదే తిరిగితే అలసిపోతారు. నేను అలా అలసిపోవాలనే నిర్ణయించుకున్నాను’’ అని సీనియర్ సిటిజన్లకు హితవు కూడా చెప్పారు స్మిత్. అంతేకాదు, ‘‘ఆస్ట్రేలియా అద్భుతంగా ఉంది. అక్కడి ప్రజలు ఆకర్షణీయంగా ఉన్నారు. ఆహారం, వాతావరణం అన్నీ బాగున్నాయి’’ అంటూ కితాబిచ్చారు కూడా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కలలో ఏనుగు కనిపిస్తే..? ఏమవుతుంది?
ఎవరికైనా సరే కలలు రావడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కలలో పర్వతాలు .. నదులు .. అడవులు .. జంతువులు కనిపిస్తూ ఉంటాయి. పులులు .. సింహాలు .. ఏనుగులు కనిపించడం జరుగుతూ ఉంటుంది. అలాంటి జంతువులు కలలో కనిపించి నప్పుడు భయం కలుగుతుంది. మరుసటి రోజు ఉదయం ఆ విషయాన్ని ఇతరులతో పంచుకుని, ఏం జరుగుతుందోననే ఆందోళనకి లోనవుతుంటారు. అయితే కలలో ఏనుగు కనిపిస్తే మంచిదేనని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఏనుగు కుంభస్థలం .. లక్ష్మీదేవి నివాస స్థానంగా చెప్పబడుతోంది. అందువలన కలలో ఏనుగు దర్శనం వలన సంపదలు లభిస్తాయని అంటారు. ఏనుగును దర్శించుకోవడం వలన దారిద్య్రం .. దుఃఖం దూరమవుతాయని చెబుతారు. అదృష్టం .. ఐశ్వర్యం చేకూరతాయని నమ్ముతారు. ఆయా పుణ్య క్షేత్రాల్లో గజ వాహనంగా ఏనుగులు భగవంతుడి సేవలో తరిస్తుంటాయి. గజ ముఖంతోనే వినాయకుడు తొలి పూజలు అందుకుంటూ ఉంటాడు .. అందరి విఘ్నాలను తొలగిస్తూ ఉంటాడు. అలాంటి ఏనుగును కలలోనే కాదు .. బయట చూసినా ఇలాంటి ఫలితాలే కలుగుతాయట. ఇదీ చదవండి : Diwali 2024 దీపావళి లక్ష్మీపూజ : మీ ఇల్లంతా సంపదే! -
కలే నిజమైంది.. ప్రాణాలు కాపాడింది!
మనలో చాలా మందికి పీడకలలు వస్తుంటాయి. ఉలిక్కిపడి లేచి హమ్మయ్య నిజం కాదు గదా అని ఊపిరి పీల్చుకుంటాం. అయితే తమ కలలు చాలావరకు నిజం అవుతూ ఉంటాయని కొంతమంది చెబుతారు. యూకేలోని మహిళకు ఇలాగే జరిగిందట. తన కలే తన జీవితాన్ని కాపాడింది అంటోంది.. వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.మెట్రో నివేదిక ప్రకారం యూకేకు చెందిన వ్యాపారవేత్త 46 ఏళ్ల షార్లెట్ వ్రోకి ఒక విచిత్రమైన కల(2021లో ) వచ్చింది. తనకు రొమ్ములో ఒక గడ్డ ఉన్నట్టు, డాక్టరు మాట్లాడుతున్నట్టు కల వచ్చింది. అంతేకాదు ఆ వైద్యుడు బ్రెస్ట్ కేన్సర్ అని చెప్పినట్టుగా కూడా చాలా స్పష్టంగా వినిపించింది. దీంతో చటుక్కున మెలకువ వచ్చింది. అప్పటికి సమయం తెల్లవారుజామున 4 గంటలు అయింది.లేచి భయంతోనే రొమ్ములను చెక్ చేసుకుంది. నిజంగానే కలలో కనిపించిన ప్రదేశంలోనే చేతికి ఒక ముద్దలాగా తగిలింది. ఇది కలా? నిజమా అనుకుంటూనే వెంటనే వైద్యులను సంప్రదించింది. స్కానింగ్‌లు, పరీక్షల తరువాత ఆమెకు ట్రిపుల్ నెగెటివ్ కేన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. భర్త, పిల్లల సహకారంతో కేన్సర్ చిక్సితను మొదలు పెట్టింది. కీమోథెరపీ చేయించుకుంది. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు మాస్టెక్టమీ, రేడియోథెరపీ ,మళ్లీ కీమోథెరపీలు జరిగాయి. చివరికి 2023 మార్చి నాటికి ఆమెకు కేన్సర్ నయమైంది.''నా కలలు..సినిమా చూస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఉంటాయి. నిజంగా ఆకలవల్లే భయంకరమైన కేన్సర్‌ను తొందరగార్తించి జయించగలిగాను లేదంటే పరిస్థితి ఏంటో ఊహించడానికి కూడా భయంగా ఉంది. కొంతమంది ఇది యాదృచ్ఛికం అన్నారు. కానీ విశ్వం లేదా మరెవరో ముందస్తుగా నన్ను ఇలా హెచ్చరించి ఉంటారనే కచ్చితంగా నమ్ముతున్నాను. ఎప్పటికీ కృతజ్ఞురాలిని’’కాగాభవిష్యత్తు గురించి సమాచారం అందించే, లేదా హెచ్చరించే కలలను ''ప్రికోగ్నిటివ్ డ్రీమ్స్'' అంటారట. 900 మందిపై జరిపిన ఒక అమెరికన్ అధ్యయనంలో 33 శాతం మంది పాల్గొనేవారు ఒక కలను గుర్తుకు తెచ్చుకోవడం, ఆ కల నిజం కావడం సంభవించిందట. -
బిడ్డ పుట్టినట్టు, ఏడుస్తున్నట్టు కల వస్తే.. అపశకునమా!
నిద్రలో కలలు అందరికీ వస్తుంటాయి. రకరకాల కలలు. కొన్ని అస్పష్టంగా, అల్లిబిల్లిగా అల్లుకుంటాయి. మరి కొన్ని కళ్లముందే జరిగినట్టు చాలా స్పష్టంగా గుర్తు ఉంటాయి. సాధారణంగా వాటిని చాలావరకు మరచిపోతాం. ఒక్కోసారి అస్సలు పట్టించుకోం. డ్రీమ్ సైన్స్ ప్రకారం మన మనసులోని భావాలకు, మన జీవితంలోని అంశాలకు కలలు ప్రతిరూపాలట. కొన్ని కలలు మర్చిపోనీయకుండా వెంటాడుతుంటాయి. ఎవరితోనో పెళ్లి జరిగిపోతున్నట్టు, ఏదో కొండలోయల్లోకి జారిపోతున్నట్టు, ఎంత పరిగెత్తాలన్నా పరిగెత్తలేక నిస్సత్తువగా ఉన్నట్టు కల వస్తూ ఉంటాయి. ఉలక్కి పడి లేచి ..హమయ్య కలే కదా అనుకుంటాం. కానీ కొన్ని మాత్రం మనల్ని కుదురుగా ఉండనీయవు. అలా ఎలా? అనుకుంటూ ఉంటాం. నిజానికి మన జీవితంలో మనం చేసేది, చేయలేనిది మన కలలో మాత్రమే కనిపిస్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో బిడ్డకు జన్మనిస్తే, దాని అర్థం ఏమిటి? అనే దాన్ని పరిశీలిస్తే.. కలలో బిడ్డ పుట్టడం, ఏడ్వటం ప్రొఫెషనల్ డ్రీమ్ అనలిస్ట్ , రచయిత లారీ క్విన్ లోవెన్‌బర్గ్ ప్రకారం, శిశువు కలలో కనిపిస్తే కొత్త ప్రారంభానికి సూచిక. చేస్తున్న పనిలో పెరుగుదల లేదా అభివృద్ధిని సూచించే సానుకూల సంకేతమని లోవెన్‌బర్గ్ చెప్పారు. ఒకవేళ బిడ్డ ఏడుస్తున్నట్టు, అలా వదిలేసినట్టు కల వస్తే.. చేయాల్సిన పనిని నిర్లక్ష్యం చేస్తున్నట్టు. పాప ఏడుపు ఆపకుండా, డ్రీమ్ బేబీ అసహనంగా ఏడుస్తుంటే జీవితంలో కొత్త విషయం లేదా కొంత అంశం మీ దృష్టి అవసరమనేదానికి సూచన అని లోవెన్‌బర్గ్ వివరించాడు. స్వప్న శాస్త్రం ప్రకారం మీరు కలలో పుట్టిన బిడ్డను చూసినట్లయితే అది శుభసూచకమట. మన జీవితంలో కొత్త అదృష్టం ప్రకాశించబోతోంది అని అర్థమట. జీవితంలో చాలా ఆనందం ,సంపద వస్తాయని భావిస్తారు. వెల్.. చెడు అంటే భయపడాలిగానీ, కొత్త సంతోషంగా వస్తోంది అంటే ఆనందమేగా! నిజానికి శతాబ్దాలుగా కలలపై పరిశోధనలు జరుగుతున్నాయి. నాగరితక ఆరంభంలో భూలోక ప్రపంచం , దేవతల మధ్య కలలను ఒక మాధ్యమంగా భావించేవారు. వాస్తవానికి, కలలకు కొన్ని ప్రవచనాత్మక శక్తులు ఉన్నాయని గ్రీకులు , రోమన్లు విశ్వసించేవారు. పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకు సిగ్మండ్ ఫ్రాయిడ్ , కార్ల్ జంగ్ కలలు కనడం గురించి విస్తృతంగా తెలిసిన కొన్ని ఆధునిక సిద్ధాంతాలను ముందుకు తెచ్చారు. తీరని కోరికలు ప్రతిరూపం కలలని ఫ్రాయిడ్ అంటే, కలలకు మానసిక ప్రాముఖ్యత ఉందంటాడు కార్ల్ జంగ్ అంటాడు. కానీ వాటి అర్థం గురించి భిన్నమైన సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. న్యూరోబయోలాజికల్ సిద్ధాంతంప్రకారం అసలు కలలకు అర్థం లేద. అవి మన జ్ఞాపకాల నుండి యాదృచ్ఛిక ఆలోచనలు ఎలక్ట్రికల్ బ్రెయిన్ ఇంపల్షన్స్ మాత్రమే. ఏ కల అయినా శుభమా? లేదా అశుభమా? అనేదాన్ని పక్కన పెట్టి.. ఆ కలల్ని మన జీవితంతో అన్వయం చేసుకొని సమీక్షించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు.అర్థం పర్థంలేని కలల గురించి ఊరికే టెన్షన్ పడి ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం కంటే అలా వదిలేయడమే బెటర్. -
ముంబయిలో ఫ్లాట్.. నాలుగు రోజులు నరకం చూశా: హీరోయిన్
రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ భామ నర్గీస్ ఫక్రీ. ఆ తర్వాత మద్రాస్ కేఫ్, హౌస్‌ఫుల్, మైన్ తేరా హీరో, అజహర్ లాంటి చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ పవన్ కల్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా ఓటీటీలో కూడా అరంగేట్రం చేసేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం దిల్లీ ఉంటోన్న ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను పంచకుంది. తాజా ఇంటర్వ్యూకు హాజరైన భామ ముంబయిలో తనకు ఎదురైన భయంకరమైన రోజులను గుర్తు చేసుకుంది. (ఇది చదవండి: హీరోయిన్‌కు అసభ్యకరంగా విష్ చేసిన హీరో.. ఏకంగా ఆ వీడియోతో! ) నర్గీస్ ఫక్రీ మాట్లాడుతూ..'ముంబయిలోని బాంద్రాలో ఓ అపార్ట్మెంట్లో నివసించేదాన్ని. మేముండే ప్రాంతం హిల్ రోడ్. మా అపార్ట్‌మెంట్‌కు సమీపంలో శ్మశానవాటిక ఉంది. అక్కడ ఉన్నప్పుడు నాకు భయంకరమైన కలలు వచ్చేవి. భయంతో తెల్లవారుజామున 3 గంటలకే లేచేదాన్ని. కలలో ఓ వ్యక్తి దెయ్యంలా కనిపిస్తూ.. నన్ను స్మశానవాటికకు తీసుకువెళతాడు. అక్కడ తను స్మశానవాటికలో మనుషుల ఎముకలు తీసి నన్ను తినమని చెప్పేవాడు. అలా వరుసగా నాలుగు రోజులు అదే కల వచ్చిందని. దీంతో భయంతో వణికిపోయా.' తెలిపింది. నర్గీస్ ఫక్రీ మాట్లాడుతూ.. 'అలా నాలుగు రోజులు పీడకలలు రావడంతో నాకు భయం వేసి వెంటనే ఆ ఫ్లాట్ ఖాళీ చేసి దిల్లీకి వచ్చేశా. అంతే కాకుండా నా రూమ్ ఖాళీ చేసేటప్పుడు ఆరు చనిపోయిన పక్షి పిల్లలు కనిపించాయని ప్యాకర్స్ నాతో చెప్పారు. అది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అసలు అక్కడ ఏమి జరుగుతుందో నాకర్థం కాలేదు.' అంటూ ఆ భయానకమైన రోజుల గురించి చెప్పుకొచ్చింది. అందుకే ఆ ఇంటిని వదిలి దిల్లీకి వెళ్లానని నర్గీస్ ఫక్రీ తెలిపారు. న్యూయార్క్‌లో జన్మించిన బాలీవుడ్ భామ.. యూరప్, ఆగ్నేయాసియాలో పెరిగింది. బాలీవుడ్ చిత్రాలలో నటించడానికి ముందు మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. (ఇది చదవండి: ప్రతి సినిమా ఓ పాఠం నేర్పించింది: రాజమౌళి ఎమోషనల్ ట్వీట్ ) -
అతిగా పగటి కలలు.. కలిగే నష్టాలేంటో తెలుసా?
లండన్: పగటి కలలు.. ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణం. మనసుకు ఉల్లాసం కలిగించడంతోపాటు విసుగు, ఒంటరితనం నుంచి ఉపశమనం కల్పిస్తాయి. మనసులో మెదిలే ప్రతికూల భావాల నుంచి బయటపడడానికి కలలను ఆశ్రయిస్తుంటారు. అంతేకాదు.. పగటి కలలతో మనుషుల్లో సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుందని గతంలో పరిశోధనల్లో తేలింది. పేదవాడు క్షణాల్లో ధనవంతుడిగా మారిపోవడం పగటి కలల్లోనే సాధ్యం. అయితే, ఇలాంటి కలలు ఒక పరిమితి వరకు అయితే ఫర్వాలేదు. మితిమీరితే అనర్థాలు తప్పవని యూకే సైంటిస్టులు చెబుతున్నారు. మేల్కొని ఉన్నప్పుడు సగం సమయం కలల్లోనే గడిపితే వాటిని మితిమీరిన పగటికలలు అంటారు. ఒక్కోసారి మనకు తెలియకుండానే ఇలా జరగొచ్చు.అయితే.. ఇలాంటి వాటితో పలు మానసిక రుగ్మతలు తలెత్తుతాయట. ఆందోళన, కుంగుబాటు, అబ్సెసివ్ కంపల్సన్ డిజార్డర్(ఓసీడీ) వంటి ముప్పు ఎదురవుతుందని సైంటిస్టులు గుర్తించారు. జనాభాలో 18 ఏళ్లు దాటిన వారిలో 2.5 శాతం మంది మితిమీరిన కలలతో ఇబ్బందులు పడుతున్నట్లు తేలింది. మాల్ అడాప్టివ్ డే డ్రీమింగ్(ఫాంటసీ డిజార్డర్) అనేది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తోందట. ఇజ్రాయెల్ హైఫా యూనివర్సిటీకి చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ ఎలి సోమర్.. బ్రిటన్ సహాకారంతో నిర్వహించిన ఓ అధ్యయనం ద్వారా ఈ డిజార్డర్‌ను తెర మీదకు తీసుకొచ్చారు. అంటే.. ఇలాంటి కలల ద్వారా సానుకూలత కంటే.. ప్రతికూల ధోరణే మనిషిలో పెరిగిపోతుందన్నమాట. ధ్యానం ద్వారా పగటి కలలను నియంత్రించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. -
కలలు కల్లలు.. కలవరపెడుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: దేశంలో ఉన్నత ప్రమాణాలున్న విద్యాసంస్థల్లో పెరిగిçపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలు కలవరం రేపుతున్నాయి. ఇతర విద్యాసంస్థలకు మార్గదర్శకంగా నిలవాల్సిన ఈ సంస్థలు బ్రిలియంట్ విద్యార్థుల బలవన్మరణాలతో వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఈ సంస్థల్లో ప్రవేశించిన విద్యార్థులు, వారి తల్లితండ్రుల కలలు కల్లలు చేస్తున్నాయి. బంగారు భవిష్యత్తును ఊహించుకుని ఆ సంస్థల్లో అడుగిడుతున్న విద్యార్థులు అక్కడ ఒత్తిడి, వివక్ష, బెదిరింపులు, సరైన మార్గదర్శనం లేక బలవంతంగా తనువులు చాలిస్తున్నారు. కట్టడి నుంచి ఒక్కసారిగా స్వేచ్ఛా ప్రపంచంలోకి ప్రవేశిస్తున్న విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటూ కన్నవారికి శోకం మిగిలిస్తున్నారు. ఇక్కడ విజయం సాధించకపోతే భవిష్యత్తు లేదన్నట్లుగా కుంగిపోతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లతోపాటు కేంద్ర విశ్వవిద్యాలయాల్లో రాత్రింబవళ్లు కష్టపడితే గానీ సీటు రాదు. మంచి ర్యాంకులతో చేరుతున్న విద్యార్థులు అక్కడికెళ్లిన తరువాత సామాజిక పరిస్థితులు, విద్యా విధానం పూర్తి భిన్నంగా ఉండటంతో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు. సహచరæ విద్యార్థులతో పోల్చుకుని కూడా నిరాశా నిస్పృహల్లోకి వెళ్తున్నారు. దీంతో వారు ఆత్మహత్యల వైపు మళ్లుతున్నారు. ఏనిమిదేళ్లలో 130 మంది దేశవ్యాప్తంగా గత ఎనిమిదేళ్లలో 130 మంది వరకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థుల బాగోగులను చూడాల్సిన ఆయా సంస్థల్లోని అధ్యాపకుల సరైన పర్యవేక్షణ లేకపోవడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ఇలా బలవన్మరణాలు చేసుకుంటున్న వారిలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులే ఉండటం గమనార్హం. ఇంటర్మీడియెట్ వరకు అధ్యాపకులు పూర్తిస్థాయిలో వారికి ప్రతీ అంశంలో సహకారం అందిస్తారు. అయితే, ప్రీమియర్ విద్యాసంస్థల్లో చేరే విద్యార్థులకు అవసరమైన మానసిక ధైర్యం, అక్కడ ఎలా మసలుకోవాలి లాంటి వాటి గురించి వివరించకపోవడం వల్ల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయన్న అభిప్రాయం ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచి్చన వారు ఈ సంస్థల్లో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. 2014 నుంచి ఇప్పటివరకు ఐఐటీల్లో 38 మంది, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 39 మంది, ఎన్ఐటీల్లో 32 మంది, ఐఐఎంలలో ఐదుగురు, ఐఐ ఎస్సీ అండ్ ఐఐఎస్ఈఆర్లో తొమ్మిది మంది, ట్రిపుల్ ఐటీల్లో నలుగురు, కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చే విద్యాసంస్థల్లో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటీవలే ఐఐటీ హైదరాబాద్‌లో... ఇటీవలే హైదరాబాద్ ఐఐటీకి సంబంధించి ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం విదితమే. ఇక్కడ ఎంటెక్ చదువుతున్న రాహుల్ హాస్టల్ గదిలోనే మంచానికి ఉరేసుకోగా.. ఈ మధ్యనే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థి సంగారెడ్డిలో లాడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైకి చెందిన మరో ఐఐటీ విద్యార్థి కూడా హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నారు. కుల వివక్ష నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కొన్ని ఘటనలు సంచలనంగా మారుతుంటే.. మరికొన్ని కేసులు పెద్దగా పట్టించుకోకుండానే ముగిసిపోతున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులుగా గుర్తించిన వారిపై చర్యలు లేకుండా ముగుస్తున్నాయి. గత ఏప్రిల్‌లో ఖరగ్‌పూర్ ఐఐటీలో హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ బోధించే ప్రొఫెసర్ దళితులను, ఆదివాసీ విద్యార్థులను అవమానించేలా మాట్లాడటంతో పెద్దఎత్తున నిరసన పెల్లుబుకడంతో ఆ ప్రొఫెసర్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. సాధారణ విద్యార్థుల ఆత్మహత్యలూ ఎక్కువే.. దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. 2017లో 9,905 మంది, 2020లో 12,526 మంది, 2021లో 13,089 మంది విద్యార్థులు బలవన్మరణం పొందారు. గతేడాది 18 ఏళ్లలోపు వయసున్నవారు 10,732 మంది ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షల్లో ఫెయిలవడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారే ఇందులో అధికంగా ఉండటం గమనార్హం. విద్యార్థుల ఆత్మహత్యలు మహారాష్ట్ర (1,834)లో ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్ (1,308), తమిళనాడు (1,246), కర్ణాటక (855), ఒడిశా (834) నిలిచాయి. మొత్తం విద్యార్థుల బలవన్మరణాల్లో గ్రాడ్యుయేట్, ఆపైస్థాయి వారి శాతం 4.6గా ఉంది. మరో విద్యార్థి ఇలా కావొద్దు బలవన్మరణం వల్ల తల్లిదండ్రులకు శోకం మిగల్చడం తప్ప... సాధించేది ఏమీ ఉండదు. ప్రతిభ ఉన్న విద్యార్థులే ఇలాంటి విద్యాసంస్థల్లో చేరుతారు. వారికి సరైన మార్గదర్శనం ప్రొఫెసర్లు చేయాలి. మా అబ్బాయి రాహుల్ ఆత్మహత్య చేసుకునే రకం కాదు. అంతకు ముందే పుట్టిన రోజు జరుపుకున్నాడు. షిర్డి వెళ్లి వచ్చాం. ఎక్కడా డిప్రెషన్‌కు గురైనట్లు కనిపించలేదు. ప్రొఫెసర్ల ఒత్తిడి ఉండొచ్చని భావిస్తున్నా. ఏదైనా లోతుగా విచారణ జరపాలని జిల్లా ఎస్పీని కోరా. ల్యాప్‌టాప్ ఇప్పటి వరకు మాకు ఇవ్వనేలేదు. మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఆత్మహత్యలు ఎవరూ చేసుకోవద్దు. ఇది లేకపోతే భవిష్యత్తు లేదనే భావన విరమించుకోండి. –ఐఐటీ హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తండ్రి మధుసూధన్‌రావు మానసిక ధైర్యం ప్రధానం విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలి. ఇంటర్ వరకు ఉన్న వాతావరణానికి æఐఐటీ, ఎన్ఐటీల్లో వాతావరణం భిన్నంగా ఉంటుంది. విద్యా బోధనలో మార్పులు ఉంటాయి. స్వేచ్ఛ ఉంటుంది. స్వతంత్రంగా నేర్చుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఎప్పుడూ చదువు కోసమేకాకుండా.. వారు మానసికంగా దృఢంగా ఉండేలా ధైర్యం చెప్పాలి. సహచర విద్యార్థులు కూడా తోటి విద్యార్థులు డిప్రెషన్లో ఉన్నట్టు తెలియగానే ధైర్యం చెప్పాలి, అధికారుల దృష్టికి తీసుకురావాలి. అప్పుడు సరైన కౌన్సెలింగ్ తీసుకుని ధైర్యం నింపేందుకు వీలవుతుంది. – ఎన్వీ రమణారావు, ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ క్యాంపులు అవసరం వివిధ సాంస్కృతిక నేపథ్యాల్లో పెరిగిన వాతావరణానికి.. ఐఐటీల్లోని వాతావరణం పూర్తిభిన్నంగా ఉండటంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. ఇతర నేపథ్యం నుంచి వచి్చన సహచర విద్యార్థులతో కలవలేకపోవడం, వారితో పోల్చుకుని కుంగుబాటుకు గురికావడం, తక్కువ మార్కులొస్తే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సరైన ప్లేస్మెంట్లు రావనే భయాలు, బాగా మార్కులు తెచ్చుకుని పెద్ద పెద్ద ప్యాకేజీలు తెచ్చుకోవాలనే తల్లితండ్రుల అంచనాలు చేరుకోకపోవడం వంటివి ప్రభావం చూపిస్తున్నాయి. ఉన్నత చదువు, సంబంధిత అంశాల ఒత్తిళ్లతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా అన్ని విద్యాసంస్థల్లో ‘మెంటల్ హెల్త్ అవేర్నెస్’క్యాంపులు నిర్వహించాలి. విద్యార్థులు ఒత్తిడికి లోనైనప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తున్నాయి? సహ విద్యార్థులు, ఇతరుల ద్వారా ఆయా దశలను ఎలా గుర్తించాలనే దానిపై పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలి. ఐఐటీలు, ఎన్ఐటీల వంటి చోట్ల సైకాలజిస్టులను పెట్టినా.. ఒత్తిళ్లు, ఇతర అంశాలపై సరైన అవగాహన కలి్పంచడం లేదు. క్లాస్‌లు జరిగేప్పుడు, డైనింగ్, టీవీ హాల్ తదితర చోట్ల జనరల్ అంశాలపైనా అవగాహన కల్పించాలి. –వీరేందర్, సైకాలజిస్ట్ చదవండి: మూడు పదులు నిండకుండానే 'గుండెపోట్లు'.. కారణాలివే.. -
ప్రేమించే జీవితం..: వాయిదా వేసిన కలలు... నిజం చేసుకుంటున్న వేళ..
పురుషులతో పోల్చితే స్త్రీల కలలు ఎప్పుడూ వెనకబాటులోనే ఉంటాయి. కుటుంబ బాధ్యతల కారణంగా తమ కలలను చంపుకునో లేక వాయిదా వేసుకునో రోజులను వెళ్లదీసే మహిళల సంఖ్యే ఎక్కువ. అలాంటి ప్రపంచం నుంచి వచ్చినవారిలో ముక్తాసింగ్ ఒకరు. కలలను వాయిదా వేసుకుంటూ, మధ్య మధ్య వాటిని వదలకుండా బతికించుకునే ప్రయత్నం జీవితమంతా చేస్తూనే ఉన్న ముక్తాసింగ్ ఒక కళాకారిణి, రచయిత్రి. ఆరుపదుల వయసులో మోడలింగ్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ‘రిటైర్ అయ్యే వయసులో పని చేయడం గర్వంగా ఉంది’ అంటూ తన గురించి చెప్పే ముక్తాసింగ్ గురించి తెలుసుకుంటే తమ జీవితంలోనూ ఇవి ప్రేరణ నింపే విషయాలు అనుకోకుండా ఉండరు. గురుగ్రామ్‌లో ఉంటున్న ముక్తా ఈ 60 ఏళ్ల వయసులో మోడలింగ్ చేస్తూ, పెయింటింగ్స్ వేస్తూ తన కలలు ఇప్పుడెలా నిజం చేసుకుంటున్నారో గమనిస్తే... ‘మనలో చాలామంది వయసు పెరిగేకొద్దీ హుందాగా కనిపించాలని లేని భారమేదో మోస్తున్నట్టుగా ఉండాలనుకుంటాం. కానీ, ఉత్తమంగా ఉండాలని కోరుకుంటే మెరుగైన ఆరోగ్యం కోసం ప్రయత్నిస్తాం. ఫలితంగా జీవన ప్రమాణాలను పెంచుకుంటాం’ అంటారు ముక్తా. బాధ్యతల బరువు నుంచి.. ఫైటర్ పైలట్‌ని వివాహం చేసుకుంది ముక్తాసింగ్. అతని కెరియర్, ఆశయాలు, తరచూ బదిలీలు జరగడంతో ఆమె తన కలలను అణిచివేసుకుంది. పిల్లలు పుట్టడం, వారిని చూసుకోవడం, అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకోవడంలో ఏళ్లకేళ్లు గడిపేసింది. అన్ని దశల్లోనూ ఊపిరి సలపని బాధ్యతలు. నలుగురిని ఆలోచింపజేసే వ్యాసాలు రాయడం అంటే ఇష్టం. కానీ, చేయలేకపోయేది. అయినప్పటికీ ఎంతో కొంత తీరిక చేసుకుని వార్తాపత్రికలకు, మ్యాగజైన్ల కు వ్యాసాలు పంపేది. కానీ, పూర్తి సమయం తన కెరీర్‌కు కేటాయించలేకపోతున్నాను అని మధనపడేది. సంగీతం ఆంటే ఎనలేని ప్రేమ. పెయింటింగ్ చేయాలనే ఆలోచనతో సంగీత చిహ్నాలను కాన్వాస్‌పై చిత్రించేది. అప్పుడు చేయలేని పనులు ఈ వయసులో చేస్తోంది. అత్యంత ప్రజాదరణ పొందిన గాయనీగాయకుల ముఖచిత్రాలను చిత్రిస్తోంది. ఫ్రీలాన్సర్‌గా వార్తాపత్రిక లకు కథనాలు రాస్తుంది. ఆలోచింప జేసిన జీవనం వీటిన్నింటి ద్వారా ఏదైనా సొంతంగా చేయాలనే ఆలోచన ఎప్పుడూ ఉండేది. కానీ, నాడు బాధ్యతల నడుమ సరైన వేదికేదీ దొరకలేదు. దీంతోపాటు తన కలలను కనుల వెనుకే దాచేసుకొని కుటుంబాన్ని ముందుకు నడిపించింది. తనలో దాగున్న కళను నలుగురితో పంచుకోవడానికి ఓదార్పుగా ఇన్స్టాగ్రామ్ పేజీ దొరికింది. ఉన్న కొద్దిసమయంలో చేసే కళను పోస్ట్ చేయడం, నలుగురికి పరిచయం చేయాలని తపిస్తోంది. చాలాసార్లు తన తల్లి అనారోగ్యం ఆమెను ఆలోచింపజేసింది. దినచర్యపై శ్రద్ధ పెట్టడం చేసేది. ఫిట్నెస్ గురించి పట్టించుకునేది. పిల్లలు స్థిరపడ్డారు. అదేపనిగా కురుస్తున్న వాన కాస్త తెరిపి ఇచ్చినట్టు అనిపించింది. మార్చిన అవకాశం తెలిసినవారి పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ ఒక ఫ్యాషన్ డిజైనర్ పరిచయం అవడంతో ముక్తాసింగ్ జీవిత గమనమే మారిపోయింది. ఆ డిజైనర్ ముక్తాని తన డ్రెస్‌లకు మోడలింగ్ చేయమని కోరింది. ‘ఈ వయసులో మోడలింగ్ ఏంటి?’ అని చాలా మంది నిరుత్సాపూరితమైన మాటలు అన్నప్పటికీ పట్టుదలతో మోడలింగ్ అవకాశాన్ని ఎంచుకుంది. ఈ కొత్త ఇన్నింగ్స్‌తో ఆమె కుటుంబం కూడా సంతోషించింది. ఇదే రంగంలో ఇంకా మంచి అవకాశాలు ఆమెకోసం వస్తున్నాయి. ‘పదవీ విరమణ అంచున ఉన్నప్పుడు పని చేయడం గర్వంగా ఉంది’ అంటారు ముక్తా. వృద్ధాప్యాన్ని చాలా ఆకర్షణీయంగా అవకాశంగా మార్చుకున్న వ్యక్తుల చిత్రాలు కూడా తన సోషల్‌మీడియా పేజీ ద్వారా పోస్ట్ చేస్తుంది. వారిలో స్టీవ్ టైలర్, అగాథాక్రిస్టి, మహారాణి గాయత్రీదేవి, రవీంద్రనాథ్ ఠాగూర్..ల చిత్రాలు ఉన్నాయి. ‘ఎన్ని పనులున్నా ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టడం వల్ల నాకు మరో అవకాశం వచ్చింది. పెరిగే వయసును స్వీకరించాలి. అలాగే, మన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి మనదైన శైలిని చూపడమూ నేర్చుకోవాలి. మనమంటే ఏంటో కూడా నలుగురికి తెలియజేయాలి’ అని చెప్పే ముక్తా సింగ్ మాటలు రిటైర్మెంట్ దశలో ఉన్న అందరిలోనూ తప్పక ఆలోచనను కలిగిస్తాయి. -
దశాబ్దాల కల నెరవేర్చిన సీఎం జగన్
-
నువ్వు లేవు.. నీ డ్రీమ్స్ అలాగే ఉన్నాయ్!
Sushant Singh Rajput Birth Anniversary: చెదరని చిరునవ్వు, భవిష్యత్తంతా ఈ కుర్రాడిదే అన్నంత అద్భత నటన. అతని టాలెంట్ చూసి పెద్ద స్టార్ అవుతాడు అనుకున్నారు అంతా. కానీ అంతలోనే అనూహ్యంగా ఆ చుక్కల్లో కలిసిపోయాడు. అతడే బాలీవుడ్ విలక్షణ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. కరియర్లో ఎదుగుతున్న తరుణంలో అకస్మాత్తుగా ప్రపంచానికి గుడ్ బై చెప్పేశాడు. రెండేళ్ల క్రితం సుశాంత్ అకాలమరణం యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. జనవరి 21 సుశాంత్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పుట్టినరోజు. సుశాంత్ ఈ లోకంలో ఉండి ఉండే ఈ రోజు తన 36వ బర్త్‌డేను సోదరీమణులు, అభిమానుల మధ్య గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేవాడు. బట్..అన్నీ మనం అనుకున్నట్టు జరగవు మిస్ యూ బ్రో అంటూ అభిమానులు సుశాంత్‌ను గుర్తు చేసుకుంటున్నారు. నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మకు శాంతి కలగాలి..హ్యాపీ బర్త్‌డే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంటున్నారు. సుశాంత్ కలగన్న ఆ 50 డ్రీమ్స్ తమకు స్పూర్తి అని కమెంట్ చేస్తున్నారు. 1986 జనవరి 21 న పాట్నాలో కృష్ణ కుమార్ సింగ్, ఉషా సింగ్ దంపతులకు పుట్టాడు సుశాంత్ సింగ్. నటన అంటే మక్కువతో మోడల్‌గా రాణించాడు. ఆ తరువాత కిస్ దేశ్ మే హై మేరా దిల్ అనే టీవీ సీరియల్‌తో 2008లో టీవీ నటుడిగా బుల్లితెరకు పరిచయమయ్యాడు. అలా 2013లో కోటి ఆశలతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాడు. తొలి మూవీ ‘కై పో చే’ లో నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు. అలా తనకంటూ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా, పెద్దోళ్ల అండ లేకపోయినా స్వశక్తితో ఎదిగాడు. బుల్లితెర మీద తిరుగులేని స్టార్ ఇమేజ్ అందుకున్న యువ నటుడు బిగ్ స్క్రీన్‌పై కూడా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, డిటెక్టివ్ బ్యోమ్కేష్ భక్షి, ‘పీకే’, ‘ఎం.ఎస్. ధోని : ద అన్‌టోల్డ్ స్టోరీ’, ‘రాబ్తా’, ‘కేదార్ నాథ్’, ‘చిచ్చోరే’, ‘దిల్ బెచారా’ లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న సుశాంత్. చదువుకునే రోజుల్లో జీనియస్ అని పేరు తెచ్చుకుని జాతీయ స్థాయి ఒలింపియాడ్ ఫిజిక్స్‌లో విజేతగా నిలిచాడు. సుశాంత్ కేవలం హీరోగానే కాదు, డ్యాన్సర్‌గా, దాతగా పేరు తెచ్చుకున్నాడు. A place where WWW was invented. A place that discovered the God (damn:) particle. A place of numerous divine collisions. A place where Matter matters. 😉 A big thanks to #CERN for being so welcoming and making my dream come true. —Dream 17/50 ✅ #livingMyDreams#lovingMyDreams pic.twitter.com/LEnwdSmwSw — Sushant Singh Rajput (@itsSSR) October 15, 2019 కమర్షియల్‌గా సక్సెస్‌ను సాధిస్తూ కరియర్ అలా సాగుతున్నతరుణంలో నెపోటిజమో, మానసిక ఒత్తిడో, ధైర్యాన్ని కోల్పోయాడో తెలియదు కానీ 2020 జూన్ 14 న శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ముంబైలోని అతని అపార్ట్మెంట్లో ఉరివేసుకుని చనిపోవడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, ప్రకృతి, క్రికెట్, విమానాన్ని నడపడం, అంతరిక్షం, మొక్కలు నాటడం, సిక్స్ ప్యాక్ బాడీ, ఒక పుస్తకం రాయడం,లాంబోర్గిని కారు ఇలాంటి 50 కలల్ని రాసిపెట్టుకున్న సుశాంత్ అర్థాంతరంగా తనువు చాలించడం ఒక మిస్టరీ. ఆత్మహత్యే అని పోలీసులు చెప్పినా, చిచ్చోరే సినిమాద్వారా ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని సందేశం ఇచ్చిన హీరో సుశాంత్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. Like the shadow I am and I am not... ~ Jalaluddin Rumi ❤️ pic.twitter.com/Ejj1X6LSyV — Sushant Singh Rajput (@itsSSR) October 26, 2019 -
రామ చిలుకలు కలలోకి వచ్చాయా.. మీ పంట పండినట్టే..!
Parrots In Dreams: మనిషి నిద్రించే సమయంలో కలలు రావడం సర్వసాధారణం. కలలో మనుషులు, జంతువులు, పక్షులు, ఎత్తయిన శిఖరాలు, జలపాతాలు, లోయలు ఇలా ఎన్నో కనిపిస్తుంటాయి. అయితే కలలోకి కొన్ని రకాల పక్షులు వస్తే అదృష్టం, సంతోషం.. కొన్ని జాతుల పక్షులు కనిపిస్తే సమస్యలు ఎదురవుతాయని శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా రామచిలుకలు కలలోకి వస్తే ఆ మనిషి పంట పండినట్టేనట. ఇలా జరగడం వల్ల వ్యాపార రంగాల్లో గుర్తింపు, గౌరవంతో పాటు ఆకస్మిక ధనలాభం, అధిక మొత్తంలో లాభాలు కలుగుతాయట. కాబట్టి కలలో రామచిలుకలు కనిపించడం శుభసూచకమేనని చాలామంది విశ్వసిస్తారు. అలాగే, పిచ్చుకలు, నెమలి, గరుడ పక్షి, కొంగ కనిపించడం కూడా శుభ సంకేతమేనట. ఈ పక్షులు కలలోకి వస్తే.. కష్టాలు తొలగిపోయి కుటుంబాల్లో ఆనందాలు నెలకొనడంతో పాటు సంపద వృద్ధి, వివాహం, సంతానప్రాప్తి కలుగుతాయట. అయితే, కలలో కాకి కనిపిస్తే మాత్రం దురదృష్టమని.. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందని కొందరు నమ్ముతారు. చదవండి: విటమిన్ బి12 లోపం ఉందా..? ల్యాబ్‌కు వెళ్లక్కర్లేదు.. ఇలా చేస్తే తెలుస్తుంది..! -
కమ్మని కలలు రావాలంటే.. మనచేతుల్లోనే!
కలల్లో రకరకాల కలలు ఉంటాయి. మనల్ని సంతోషపరిచి పదేపదే గుర్తు చేసుకునే కలలు కొన్ని అయితే, గుర్తు చేసుకోవడానికి కూడా గజగజలాడే భయానక కలలు కొన్ని. ‘మంచి కలలు వచ్చే ఛాయిస్ మన చేతిలో ఉంటే బాగుండేది’ అని కూడా బోలెడుసార్లు అనిపిస్తుంది. అయితే ఇది అత్యాశ కాదని నిద్రలో మంచి కలలు రావడం మన చేతిలోనే ఉందని అంటున్నారు స్వప్న విశ్లేషకురాలు, ‘ది డ్రీమ్ డిక్షనరీ: ఫ్రమ్ ఏ టు జెడ్’ పుస్తక రచయిత్రి చెయాంగ్. మంచి కలలు రావడానికి ఆమె బోలెడు టిప్స్ చెప్పారు. అందులో కొన్ని... ► పడుకునే ముందు కిటికీలో నుంచి ఆకాశంలోని చంద్రుడిని పదినిమిషాల పాటు ధ్యానస్థితిలో చూడండి. చంద్రుడు కనిపించకపోతే అందమైన చంద్రుడి బొమ్మను చూస్తూ నిద్రపోండి. కమ్మని కలలు వస్తాయి. ►పర్పుల్, సిల్వర్, గ్రీన్, బ్లూ దుస్తులు ధరించి నిద్రకు ఉపక్రమిస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది. మంచి కలలు వస్తాయి. ►మంచి కల రావాలంటే మంచి నిద్ర రావాలి. మీకు బాగా బోర్ కొట్టే పుస్తకం చదవండి చాలు. నిద్రను ఆపడం ఎవరి తరం కాదు! చదవండి: నిద్రలేమిని గుర్తించడం ఎలా? నిద్దుర కరువైతే కష్టాలే! -
స్టీవ్ జాబ్స్ కలను నెరవేర్చిన యాపిల్ సీఈఓ
కాలిఫోర్నియా: మొబైల్ ఫోన్లను సాంకేతింగా, ఆకర్శనియంగా తీర్చిదిద్దడంలో యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఓ ట్రెండ్ సెట్ చేశారు. కాగా స్టీవ్ జాబ్స్ 2011సంవత్సరంలో క్యాన్సర్‌తో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీవ్ జాబ్స్, టిమ్ కుక్‌లు ఇద్దరు సాంకేతికంగా యాపిల్‌ను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు. స్టీవ్ మరణించాక కుక్ సీఈఓగా బాధ్యతలు చేపట్టే సమయానికి 400 బిలియన్ డాలర్లు మాత్రమే యాపిల్ వద్ద మూలధనంగా ఉండేది. కానీ ఇప్పుడు కుక్ సారథ్యంలో యాపిల్ సంస్థ ఆదాయం ఐదు రెట్లు పెరిగింది. ప్రస్తుతం యాపిల్ సంస్థ మార్కెట్లో ఐఫోన్లతో తన హవా కొనసాగిస్తు యూఎస్‌లో 2 ట్రిలియన్ డాలర్ల ఆదాయం సాధించిన మొదటి కంపెనీగా రికార్డు సృష్టించింది. యాపిల్ సంస్థ బ్రాండ్ కోల్పోకుండా కుక్ తీవ్రంగా శ్రమించారు. ఆయన ఎదుర్కొన్న ముఖ్య సవాళ్లు: ఎఫ్‌బీఐ విపరీత ఆంక్షలు, చైనాతో యూఎస్ ట్రేడ్ వార్, కరోనా వైరస్, ఆర్థిక మాంధ్యం ఇన్ని సమస్యలను అధిగమంచి యాపిల్‌ను ఉన్నత స్థానంలో కుక్ నిలిపాడు. పౌర హక్కులు, పునరుత్పాదక శక్తి లభ్యతపై తన అభిప్రాయాన్ని ప్రపంచానికి చెప్పి మేధావుల మన్ననలను అందుకున్నారు. వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక సాఫ్టవేర్, వారంటీ ప్రోగ్రామ్‌లు సంగీతం, వీడియో, ఆటలు తదితర విభాగాలను ప్రారంభించి వినియోగదారులను ఆకట్టుకోవడంలో విజయం సాధించారు. ఎంటర్టైన్మెంట్ యాప్ నెట్ఫ్లక్స్ను కొనుగోళ్లు చేసి కుక్ తన సత్తా చాటాడు. కంపెనీలకు రేటింగ్ ఇచ్చే ఫార్చ్యూన్ సంస్థ యాపిల్ 50 బిలియన్ వార్షిక ఆదాయాన్ని సంపాదిస్తున్నట్టు పేర్కొంది. మరోవైపు ఇవ్స్ సంస్థ అంచనా ప్రకారం యాపిల్ సేవల విభాగంలో 750బిలియన్ డాలర్ల మూలధనం ఉన్నట్లు తెలిపింది. స్టీవ్ జాబ్స్ కలలు కన్న యాపిల్ సంస్థను కుక్ నెరవేరుస్తున్నారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: శాంసంగ్‌కు బై, ఆపిల్‌కు సై : వారెన్ బఫెట్ -
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్... 50 కలలు
బంగారంలాంటి కెరీర్, మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చాలా తొందరపడ్డాడు. 34 ఏళ్లకే జీవితాన్ని ముగించుకున్నాడు. ఏడాది క్రితం తనకు 50 కలలు ఉన్నట్లు ట్వీటర్ ద్వారా తెలిపాడు. ఆ 50 కలలను ఓ పేపర్లో ‘50 డ్రీమ్స్ ఆఫ్ మై లైఫ్ అండ్ కౌంటింగ్’ అని రాసి షేర్ చేశాడు కూడా. ఆయనకున్న 50 కలల్లో 11 కలలు నెరవేరాయి కూడా. సుశాంత్ ఆత్మహత్యతో మిగిలిన కలలు మాత్రం కల్లలుగానే మిగిలిపోయాయి.. ఆయన కన్న కలల్లో ప్రధానమైనవి కొన్ని... ► విమానాన్ని నడపడం నేర్చుకోవడం ఆయన మొదటి కల ► ఐరన్ మ్యాన్ ట్రయథ్లాన్‌కు సిద్ధం కావడం ► ఎడమ చేతితో క్రికెట్ మ్యాచ్ ఆడటం ► మోర్సె కోడ్ నేర్చుకోవడం ► చిన్నారులు అంతరిక్షం గురించి తెలుసుకునేందుకు సహాయం చేయడం ► ఒక టెన్నిస్ ఛాంపియన్ పాత్రలో నటించడం ► నాలుగు క్లాప్ పుషప్‌లు చేయడం ► ఒక వారం పాటు చంద్రుడు, అంగాకరుడు, బృహస్పతి, శని గ్రహాలను పర్యవేక్షించడం ► ఒక బ్లూ హోల్లో ఈత కొట్టడం ► డబుల్ స్లిట్ ప్రయోగం చేసేందుకు ప్రయత్నించడం ► కొన్ని వేల మొక్కలు నాటడం ► ఇంజినీరింగ్ చదివిన ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించి స్నేహితులతో ఓ సాయంత్రం సరదాగా గడపడం ► ఇస్రో లేదా నాసా వర్క్‌షాపులకు వంద మంది పిల్లల్ని పంపించడం. ► కైలాశ్ (పర్వతం)పై ధ్యానం చేయడం ► ఒక పుస్తకం రాయడం ► యూరోపియన్ న్యూక్లియర్ రీసెర్చి సంస్థ అయిన సీఈఆర్ఎన్ను సందర్శించడం ► ఆరు నెలల్లోనే సిక్స్ ప్యాక్స్ శరీరాన్ని పొందడం ► చూపులేని వారికి కోడింగ్ నేర్పించడం ► అడవిలో ఒక వారం రోజుల పాటు గడపడం ► వైదిక జ్యోతిష్య శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం ► డిస్నీలాండ్‌కి వెళ్లడం ► అమెరికాలోని లిగోని సందర్శించడం ► ఒక గుర్రాన్ని పెంచుకోవడం ► కనీసం పది రకాల నృత్యాలను నేర్చుకోవడం ► ఉచిత విద్య కోసం కృషి చేయడం. సుశాంత్ ఫర్ ఎడ్యుకేషన్ పేరిట ఆయన విద్యార్థులకు సహాయం కూడా చేసేవారు. ► అండ్రొమేడా అనే పాలపుంతను ఒక శక్తివంతమైన టెలిస్కోప్ సాయంతో పరిశీలించడం ► మంచుతో నిండిపోయిన అంటార్కిటికా ఖండాన్ని సందర్శించడం ► మహిళలు స్వీయ రక్షణ నైపుణ్యాలు నేర్చుకునేలా సహాయం చేయడం ► వ్యవసాయం నేర్చుకోవడం ► పిల్లలకు డ్యాన్స్ నేర్పించడం ► రెండు చేతులతో బాణాలు వేసేలా శిక్షణ పొందడం ► తనకు ఇష్టమైన 50 పాటలకు గిటార్ నేర్చుకోవడం ► ఒక ఛాంపియన్‌తో చెస్ ఆడటం ► లాంబోర్గిని కారును సొంతం చేసుకోవడం ► సైమాటిక్స్ ప్రయోగాలు చేయడం ► భారత సైన్యంలో చేరేలా విద్యార్థులు సిద్ధమయ్యేందుకు సహాయం చేయడం ► సముద్ర అలలపై సర్ఫింగ్ చేయడం ► యూరప్ మొత్తం రైలులో ప్రయాణించడం ఆయన చివరి కల సుశాంత్ కలల్లో తీరినవి... విమానాన్ని నడపడం నేర్చుకోవడం, ఐరన్ మ్యాన్ ట్రయథ్లాన్‌కు సిద్ధం కావడం, ఎడమ చేతితో క్రికెట్ మ్యాచ్ ఆడటం, యూరోపియన్ న్యూక్లియర్ రీసెర్చి సంస్థ అయిన సీఈఆర్ఎన్ను సందర్శించడం, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీని సందర్శించడం, బ్లూ హోల్లో ఈత కొట్టడం, సెనోట్లో ఈదడం (సున్నపురాయి భూమి కుంగిపోవడంతో సహజంగా ఏర్పడిన నీటి కొలను), డిస్నీల్యాండ్కి వెళ్లడం, అండ్రొమేడా అనే పాలపుంతను ఒక శక్తివంతమైన టెలిస్కోప్ సాయంతో పరిశీలించడం, రెండు చేతులతో బాణాలు వేసేలా శిక్షణ పొందడం, సైమాటిక్స్ ప్రయోగాలు చేయడం (ప్రకంపనలకు సంబంధించి). -
సుశాంత్ తన చేత్తో రాసుకున్న కోరికల జాబితా ఇదే!
ముంబై: యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) మరణవార్త బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. సుశాంత్ బాంద్రాలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకుని మరణించడం అందరిని షాక్‌కు గురిచేసింది. ఈ నేపథ్యంలో సుశాంత్‌కు సంబంధించిన ప్రతి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇందులో భాగంగా సుశాంత్ 50 'కలల' జాబితా వైరల్ అయ్యింది. దీనిని సుశాంత్ 2019 సెప్టెంబర్‌లో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తన చేతితో రాసిన కలల పుస్తకాన్ని అభిమానాలతో పంచుకున్నాడు. (రియా చక్రవర్తిని విచారించిన పోలీసులు) విమానం నడపడం నేర్చుకోవడం, ఎడమ చేతితో క్రికెట్ మ్యాచ్ ఆడటం, రైలులో యూరప్ ప్రయాణించడం, 100 మంది పిల్లలను ఇస్రో, నాసా వర్క్‌షాపులకు పంపడం ఇలా చాలానే కోరికలను ఆ పుస్తకంలో సుశాంత్ రాసుకొచ్చాడు. ఈ జాబితాలో సుశాంత్ వ్యక్తిగతం.. అతడు ఎలాంటివాడో, పరులకు ఎలాంటి సాయం చేయాలనుకునే వాడో అన్ని కలిసి ఉన్నాయి. వీటితో పాటు, ఆత్మరక్షణలో మహిళలకు శిక్షణ ఇవ్వడం, పిల్లలకు నృత్యం ఎలా చేయాలో నేర్పించడం, ఛాంపియన్‌తో చెస్ ఆడటం, యోగా నేర్చుకోవడం కూడా సుశాంత్ కోరికల జాబితాలో ఉన్నాయి. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, అతని మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని, అతడు హత్య చేయబడ్డాడని అతని మేనమామ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం వచ్చిన సుశాంత్ పోస్ట్ మార్టం రిపోర్టు ఈ ఆరోపణలు తప్పని తేల్చింది. అతడు ఆత్మహత్య చేసుకొనే చనిపోయాడని శవ పరీక్ష ఫలితాలలో తేలింది. సుశాంత్ మరణించడంతో అతని బృందం అభిమానులకు కొన్ని విజ్ఞప్తులు చేసింది. "సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇకపై మనతో లేరని పంచుకోవడం మాకు చాలా బాధ కలిగిస్తోంది. ఇటువంటి బాధాకర సమయంలో మా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని మీడియాను అభ్యర్థిస్తున్నాం’ అని పేర్కొంది. ముంబై పోలీసు ప్రతినిధి డిసిపి ప్రణయ్ అశోక్ కూడా ఆదివారం సుశాంత్ ఆత్మహత్య చేసుకొని మరణించారనే వార్తను ధ్రువీకరించారు. (ఆ ‘దెయ్యమే’ సుశాంత్‌ను పీడించింది!) The heartbreaking end of a dreamer: the 50 dreams of #SushantSinghRajput pic.twitter.com/VPgR8Tr0qJ — Mahim Pratap Singh (@mayhempsingh) June 14, 2020 -
కలను నిజం అనుకొని నిశ్చితార్థపు ఉంగరాన్ని..
-
కలను నిజం అనుకొని నిశ్చితార్థపు ఉంగరాన్ని..
కాలిఫోర్నియా : నిద్రలో వచ్చే కలలు ఉదయం లేచేసరికి గుర్తుండం చాలా అరుదు. అయితే అలా వచ్చిన కలలు వాస్తవంలో జరుగుతాయా లేదా అంటే చెప్పడం కష్టం. కానీ ఓ మహిళ మాత్రం తనకు నిద్రలో వచ్చిన కలను వాస్తవం అనుకొని నిద్రలోనే తన నిశ్చితార్థపు ఉంగరాన్ని మింగేసింది. ఈ విచిత్ర ఘటన కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. వివరాలు.. కాలిఫోర్నియాలోని శాన్‌డియాగోకు చెందిన జెన్నా ఎవాన్స్ అనే మహిళకు ఇటీవలే బాబీ హోవెల్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే ఓ రాత్రి జెన్నా నిద్రలో ఉండగా.. ఆమెకు ఓ విచిత్రమైన కల వచ్చింది. జెన్నా, బాబీతో కలిసి ఓ రైలులో ప్రయానిస్తుండగా వారిని దొంగలు వెంబడించినట్లు కల వచ్చింది. ఈ క్రమంలో వారి నుంచి రక్షించుకోవడానికి తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి నోటిలో వేసుకొని మింగేయమని బాబీ సలహా ఇచ్చాడు. అయితే ఇప్పటి వరకు జరిగింది కలే కాబట్టి బాగానే ఉంది. అయితే ఇక్కడే అసలు విషయం దాగుంది. నిద్రలో వచ్చిన కలను వాస్తవం అనుకొని జెన్నా తన చేతికి ఉన్న ఉంగరాన్నినిజంగానే మింగేసింది. అనంతరం ఉదయం లేచిన ఆ మహిళ తన చేతిని చూసుకోగా ఉంగరం కనిపించలేదు. ఆ విషయాన్ని వెంటనే జెన్నా తనకు కాబోయే భర్తకు చెప్పింది. దీంతో డాక్టర్ వద్దకు వెళ్లి ఎక్స్‌రే తీయించుకున్నారు. ఎక్స్‌రే అనంతరం వైద్యుడు ఆ ఉంగరం కడుపులోనే ఉందని నిర్ధారించి చెప్పాడు. అప్పడు అసలు విషయం బయట పడింది. నిద్రలో వచ్చిన కలను నిజం అనుకొని ఉంగరాన్ని మింగేసినట్లు గుర్తించిన ఆ జంట చివరికి వైద్యుడి సహాయంతో ఎండోస్కోపి ద్వారా ఆ ఉంగరాన్ని బయటకు తీయించారు. ఉంగరం తిరిగి తన వద్దకు చేరుకున్నందుకు ఆనందంగా ఉందని, ఇదోక హాస్యాస్పదమైన కథ అంటూ ఈ విషయాన్నంతా జెన్ని తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. కాగా వీరిద్దరు వచ్చే నెలలో టెక్సాస్‌లో వివాహం చేసుకోనున్నారు. -
దెయ్యం – భయం
రోజులు గడుస్తున్నాయి. కాలేజీకి వెళ్లడం, రావడం ఇదే పని. ఓ రోజు కాలేజ్ అయ్యాక తొందరగా ఇంటికి వచ్చి బ్యాగ్ బెడ్ మీద పడేసి బయటకు జంప్ అవుతుంటే ‘‘ఒరేయ్! ఏదన్న తిని పోరా’’ అని అమ్మ వంట గది నుంచే అరిచింది. ‘‘ఆకలైతలేదమ్మా!’’ అని గట్టిగా అంటూనే బయటపడ్డా. అదే రోజు రాత్రివరకు బయట షికార్లు కొట్టి, అమ్మకు ఫోన్ చేసి చెప్పా – ‘‘అమ్మా! ఇవ్వాళ లేటయితది’’. అమ్మ తిట్టాల్సిందంతా తిట్టి, జాగ్రత్త చెప్పి ‘సరే’ అంది. నా ఫ్రెండ్ అర్జున్‌తో కలిసి ఓ హాలీవుడ్ హర్రర్ ఫిల్మ్‌కి వెళ్లా. సినిమా ఎంత భయంకరంగా ఉందో మాటల్లో చెప్పలేను. సినిమా చూస్తున్నంతసేపు భయపడుతూనే ఉన్నా, కానీ చూడాలి అనిపిస్తోంది.‘‘ఏంది మామా! హర్రర్ సినిమాలు ఈ రేంజ్లో ఉంటాయా! నాకు భయమైతుంది. పోదామా?’’ అని అర్జున్ నా చెవిలో అరుస్తున్నాడు.‘‘నాకేం తెలుసురా! ఇంట్లో హర్రర్ సినిమాలు చూస్తే పెద్దగా భయం కాలేదు కానీ థియేటర్లో చూస్తే మాత్రం చాలా భయమైతుందిరా! సర్లే, మొత్తం సినిమా చూసే పోదాం’’ అన్నా. ఆ దెయ్యాలు, ఆ సౌండు, దెయ్యాలు మనుషుల రక్తాలు తాగడాలు.. వణుకుతూనే సినిమా చూస్తూ కూర్చున్నాం. సినిమా అయ్యాక, ‘ఇంకోసారి చీకట్లో ఇలాంటి హర్రర్ సినిమాలకు రావొద్దురా’ అనుకున్నాం. అసలే చీకటి. హర్రర్ సినిమా చూసి ఇంటికి వెళ్తున్నాం. ఇద్దరం ఏం మాట్లాడుకోవట్లేదు. సడెన్‌గా, ‘‘రామ్! దెయ్యాలు ఎలా ఉంటాయో తెలుసా’’ అని వాడు నావైపు చూస్తూ అడిగాడు.‘‘ఈ టైమ్‌లో దెయ్యాల గురించి డిస్కషన్ ఏందిరా! నాకేం తెల్వదు.’’ అన్నాను భయపడుతూనే. ‘‘రామ్! నేను దయ్యాన్ని చూశా.’’ అని ఆగాడు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. భయమేసింది. ‘‘ఎక్కడరా?’’ అనడిగా. ‘‘నువ్వేం భయపడకు. ఇప్పుడు కాదులే! చిన్నప్పుడు..’’ అని గట్టిగా నవ్వాడు. నాకు ఆ భయంలో వాడి మీద కోపమొచ్చింది. ఇంటికొచ్చేశాం. వాడిల్లు, మా ఇల్లు పక్కపక్కనే. ఇంటికి చేరేసరికి భయం కాస్త పోయింది. రాత్రి కలలు భయపెట్టాయి కానీ, పొద్దున్నే లేచి ఇంట్లోనే ఉన్నా అని నమ్మకం కలిగాక నాకు నేనే నవ్వుకున్నాను. ఆ తర్వాతిరోజు ఏదో ఫంక్షన్ ఉందని ఇంట్లోవాళ్లు ఊరెళ్లారు. నేను, తమ్ముడు ఎప్పట్లానే కాలేజీకి వెళ్లిపోయాం. నేను కాలేజీ నుంచి ఇంటికొచ్చేసరికి ఇంటిముందు జనం. ‘ఏమైంది.. ఏమైంది..’ అని పరిగెత్తాను. అక్కడున్న వాళ్లెవరూ ఏం చెప్పట్లేదు. పక్కింటి ఆంటీని అడిగా – ‘‘ఏమైందాంటీ?’’ అని. ‘‘మీ తమ్ముడు ఇందాకే వచ్చి వెళ్లిండు. తాళంచెవి కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత గంట నుంచి ఇగో.. ఇట్ల సౌండ్..’’ అని భయంతో చెప్పింది. ‘‘అరెయ్ రామ్! కొంపదీసి ఇంట్లో దయ్యముందారా?’’ అన్నాడు నన్ను చూసి అటు దూరంనించి నడుచుకుంటూ వచ్చిన అర్జున్. రాత్రి భయపెట్టింది చాలనట్లు ఇంకా భయపెడుతున్నాడు.డోర్ ఓపెన్ చేసి వెళ్దామంటే కీ లేదు. జనం మొత్తం వచ్చేస్తున్నారు. అయ్యో ఇంట్లో ఏదో చొరబడిందని భయపెట్టిస్తున్నారు. ఓ పెద్ద మనిషైతే ‘‘మొన్ననే ఒక దెయ్యాన్ని చూశిన. ఈ ఇంట్లనే జొరబడ్డదేమో!’’ అన్నాడు. ఈ కాలంలో దయ్యాలుంటాయా అని అనిపించినా నాకూ భయం పెరిగిపోతూనే ఉంది. కీ కోసం తమ్ముడికి కాల్ చేశా. వాడు రావడానికి అరగంట పడుతుందన్నాడు.లాభం లేదు. తాళం పగలగొట్టాలి. కానీ లోపల్నించి వస్తోన్న సౌండ్? భయం పెరుగుతూనే ఉంది. తమ్ముడి కోసం ఎదురుచూశా. వాడు రావడమే అందరం తలుపు పక్కన భయపడుతూ నిలబడ్డాం. కాసేపట్లో నిజంగానే హర్రర్ సినిమా లైవ్‌లో కనబడుతుంది అనుకుంటున్నా. లోపల్నించి ఎవరో బలంగా తలుపును కొడుతున్నారు. ‘‘నా వల్ల కాదు. అమ్మో దయ్యముందేమో!’’ అని నేను దూరంగా పరిగెత్తా. ‘‘ఎవరూ లోపల?’’ అని అరిచా గట్టిగా. అటువైపు నుంచి మాటలు రాలేదు కానీ డోర్‌ను గట్టిగా తంతూ ఓ వింత సౌండ్ మళ్లీ వినిపించింది. ‘తలుపు తీయ్’ అంటున్నారు అందరూ. కానీ ఎవ్వరూ ముందుకు కదలట్లేదు. మా తమ్ముడైతే దూరంగా వెళ్లి నిలబడ్డాడు అప్పటికే.‘‘అర్రె! ఏం భయంరా. అందరం ఉన్నాంగా! మేం దూరంగా నిలబడుతాం’’ అని నన్ను డోర్ దగ్గర వుంచి అందరు దూరంగా వెళ్లిపోయారు. ‘‘తలుపు తీయ్.. తలుపు తీయ్..’’ అని అరుస్తున్నారు. ఇక లాభం లేదని తాళంచెవి పెట్టి, తలుపు తీసి వెంటనే వెనక్కి పరిగెత్తుకొచ్చాను. అందరూ భయంభయంగా తలుపు వైపే చూస్తున్నారు. ఇంట్లోంచి ఎప్పుడూ వినని విధంగా సౌండ్ చేసుకుంటూ ఓ కుక్క బయటకు వచ్చి అందరిని చూసి భయపడి రెండు నిమిషాల్లో సందు దాటేసింది. అది వెళ్లిపోయాక అందరూ ఒకటే నవ్వులు. ‘భయపడి సచ్చినం కదరా!’ అనుకున్నారు అందరూ. అసలు విషయం ఏమైందంటే, మధ్యాహ్నం తమ్ముడు ఇంటికొచ్చి అన్నం తిని వెళ్లాడు. ఆ టైమ్‌లో ఆ కుక్క ఇంట్లో జొరబడింది. ఆ తర్వాత వాడు అది చూసుకోకుండా తాళమేస్కొని బయటికెళ్లాడు. దాన్ని చూసి వీళ్లంతా దయ్యమనుకొని భయపడ్డారు. నన్నూ భయపెట్టి పడేశారు. – రమేశ్ రాపోలు, నల్లగొండ. -
కలవరమా?
కలలు మీ గురించి చాలా విషయాలు చెబుతాయి తెలుసా? కలలు మనలో నిక్షిప్తమైన భావోద్వేగాల ఫలితం. మానసిక స్థితినే కాదు, చాలా సమస్యలకు పరిష్కారాలు చెబుతాయంటారు డ్రీమ్ ఎక్స్‌పర్ట్‌లు. కావాలంటే సెల్ఫ్ చెక్ చేసుకోండి. 1. నాలో నిగూఢమైన భావోద్వేగాలను కలలు ప్రతిఫలిస్తాయని నేననుకుంటాను. ఎ. అవును బి. కాదు 2. నాకొచ్చే కలలు సాధారణంగా మంచిగా, హాయిగా ఉంటాయి ఎ. అవును బి. కాదు 3. నా కలల్లో ఎక్కువ వివరాలుంటాయి. ఎన్నో రంగులు కనిపిస్తాయి ఎ. అవును బి. కాదు 4. ఒకే కల కొద్ది నెలల వ్యవధిలో మళ్లీమళ్లీ వస్తుంటుంది. ఎ. అవును బి. కాదు 5. సాధారణంగా నాకు పీడకలలు వస్తుంటాయి. భయపెడుతుంటాయి. (ఏడాదిలో కనీసం నాలుగైదు సార్లు..) ఎ. అవును బి. కాదు 6. ఉదయం లేవగానే రాత్రి నాకొచ్చిన కలల గురించి ఆలోచిస్తుంటాను. ఎ. అవును బి. కాదు 7. నా కలలు ఎక్కువగా చీకటిగా, అస్పష్టంగా ఉంటాయి. ఎ. అవును బి. కాదు 8. ఒక్కోసారి నాకు సెక్స్ గురించి కలలు వస్తుంటాయి. ఎ. అవును బి. కాదు 9. దేవుళ్ళూ, ఏవో తెలియని దివ్యలోకాల గురించి కలలు వస్తుంటాయి. ఎ. అవును బి. కాదు 10. నాకొచ్చే కలలు తర్వాత పెద్దగా గుర్తుండవు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ఎకి 8 పాయింట్లు వస్తే మీరు మీ కలలు ఇచ్చే సందేశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. స్థిరంగా, సంతృప్తిగా జీవనం సాగిస్తుంటారు. క్రియేటివ్‌గా ఉంటారు. మీకు సంబంధించిన అంశం గురించి మీ కలలు ఏవైనా సందేశాలు ఇస్తుండచ్చు. డ్రీమ్ డైరీలో వాటిని సమీక్షించుకోండి. బి కి 8 పాయింట్లు వస్తే, కలల్ని మీరు పట్టించుకోరని అర్థం. మీరు ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని, ఆందోళన చెందుతున్నారనడానికి సూచన. తీరని కోరికలేవో ఉన్నాయని అర్థం. -
కాజల్ కల ఏంటో తెలుసా?
తమిళసినిమా: భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరూ కలలు కంటారు. అలాంటివి చదువుకునే రోజుల్లో బీజం పడుతుంది. అయితే చాలా మంది కోరుకున్న లక్ష్యం వైపు పయనించలేరు. అందుకు పరిస్థితులో, మరేదైనా కారణం కావచ్చు. ఇక సినీతారలు ఇందుకు అతీతం కాదు. అనుకున్నవన్నీ జరగవు కదా! కొందరు చిన్నతనం నుంచి నటి కావాలని ఆశపడుతుంటారు. మరి కొందరు వేరే రంగంలో రాణించాలని ఆశించి, అనూహ్యంగా సినిమారంగంలోకి ప్రవేశిస్తుంటారు. నటి కాజల్ అగర్వాల్ ఈ రెండవ కోవకు చెందిన నటేనట. తాను అనూహ్యంగానే నటినయ్యాను అంటోంది కాజల్ అగర్వాల్. అయితే చాలా మంది మాదిరిగానే తనకు జీవితంలో ఒక డ్రీమ్ ఉందని, అది నెరవేరలేదని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ అమ్మడి డ్రీమ్ ఏమిటో తెలుసా? అంతరిక్షంలో అడుగు పెట్టిన తొలి మహిళగా కల్పనాచావ్లాలా తానూ అంతరిక్షంలోకి వెళ్లిరావాలని కలలు కన్నానని చెప్పింది. అయితే పరిస్థితుల ప్రభావం తనను నటిని చేశాయని అంది. అయితే నిజజీవితంలో నెరవేరని ఆ కలను నట జీవితంలోనైనా నెరవేర్చుకోవాలని ఆశగా ఉందని చెప్పింది. అలాంటి అవకాశం వస్తే వదులుకోనని కాజల్ అంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడికి ఇక్కడ ఒక అవకాశం కూడా లేకపోవడం గమనార్హం. తెలుగు, హిందీ భాషల్లో బిజీగానే ఉంది. ఈ బ్యూటీ కలను నిజం చేయడానికి ఏ దర్శక, నిర్మాత ముందుకొస్తారో చూడాలి. -
ఆ రాజు ‘కల’ చెదిరింది
(లక్కింశెట్టి శ్రీనివాసరావు) కల చెదిరింది. క«థ మారింది. కన్నీరే ఇక మిగిలింది..ఒక కంట గోదావరి, మరో కంట పురుషోత్తపట్నం కలిసి ఒక్కసారే ఉప్పొంగాయా అన్నట్టుగా ఆ ‘రాజు’కు బాధ తన్నుకొచ్చింది. ఒకప్పుడు మహారాజులు ఏలిన పరగణాన్ని పాలిస్తున్న ఈ రాజుకు మంత్రి అవ్వాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం రెండున్నరేళ్లుగా ఎన్నో నిరీక్షణలు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం ఆ రాజు తనకు రాజ్యాన్ని అప్పగించిన ‘చంద్ర’గిరి చక్రవర్తిపై ఈగ వాలితే చాలు కరవాలం ఝుళిపించడం అలవాటు చేసుకున్నారు. పనిలో పనిగా చంద్రగిరి చక్రవర్తి అనుంగుల ద్వారా రాయ‘బేరాలు’ కూడా నడిపారు. ఇంత చేసినా ఆ రాజు చిల్లర చేష్టలతో ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. రాజ్యాధికారం ఇక రెండేళ్లు మిగిలి ఉంది. మంత్రి అవ్వాలనే కోరిక ఎలా సాకారం చేసుకోవాలనే ఆలోచనలు చేస్తున్న సమయంలో తన రాజ్యంలో రైతులకు నీరందిస్తామనే ఎత్తిపోతల పథకం ఒకటి అందివచ్చింది. ఇంతకంటే చక్కని అవకాశం భవిష్యత్తులో మరొకటి దొరకదనే నిశ్ఛయానికి ఆ రాజు వచ్చేశారు. స్వయానా చంద్రగిరి చక్రవర్తి చేతుల మీదుగా భూమిపూజ చేసేందుకు సన్నాహాలు చేశారు. గోదావరి నీరు ఎత్తిపోసే పురుషోత్త రాజ్యంలో జరగాల్సిన కార్యక్రమాన్ని తన రాజకీయ చతురతతో తన రాజ్యంలోకి మార్చుకోగలిగారు. సేనాధిపతుల ద్వారా పాఠశాలర«థాలను చంద్రగిరి చక్రవర్తి సభకు తరలించి జనాన్ని భారీగానే రప్పించాడు. రాజ్యంలో కరువు కాటకాలతో పట్టెడన్నం లేక రాజ్యాలు వదిలిపోయే జనం కోసం ఎంతో చేశానని నిండు సభలో ఆ రాజు చక్రవర్తి వద్ద ఘనంగా చెప్పుకున్నారు. అది అంత సత్యం కాదని ఆ చక్రవర్తికి తెలుసు. అయినా నిండు సభలో వాస్తవం చెప్పలేక అభినందించేశారు. ఇంకేముంది మంత్రి పదవి ఖాయమని మనసులో రాజు చాలా సంతోషంగా కనిపించారు. సామంతులుచే ‘మా రాజు’కు మంత్రి కావాలంటూ నినాదాలు చేయించడంతో చక్రవర్తి నోటి వెంట ‘మంత్రి అంటే మాటలా తమ్ముళ్లూ... చాలా మంది సామంతులు క్యూలో ఉన్నారనడంతో కిరీటం పడిపోయినంతపనైంది. ఎక్కడో 70, 80 మైళ్ల దూరంలో జరగాల్సిన చక్రవర్తి కార్యక్రమాన్ని తన రాజకీయ వ్యూహంతో అష్టకష్టాలు పడి తన రాజ్యంలో పెట్టుకున్నందుకు చివరకు ఏమి మిగిలిందని జుట్టు పీక్కున్నారు ఆ రాజు. -
సొంతింటి కలను నిజం చేస్తాం
‘రాకీ’ మేనేజింగ్ డైరెక్టర్ రామయ్య వేణు నేడు చక్రద్వారబంధంలో భూమి పూజ దానవాయిపేట (రాజమహేంద్రవరం) : సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే ధ్యేయమని రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామయ్య వేణు తెలిపారు. రాజమహేంద్రవరం బలరామ కృష్ణరాజు నగర్‌లోని సంస్థ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన వెంచర్ చంద్రిక అవంతిక (ది ప్రిన్సెస్ ఆఫ్ రాజమహేంద్రవరం) వివరాలను వెల్లడించారు. రాజానగరం మండలం చక్రద్వారబంధంలోని జీఎస్ఎల్ ఆసుపత్రి వెనుక ఉన్న తొమ్మిది ఎకరాల పదిసెంట్లలో గంగ, గోదావరి, యమున, సరస్వతి, కృష్ణ, తుంగభద్ర, కావేరీ, నేత్రావతి, అర్కావతి, బ్రహ్మపుత్ర తదితర నదుల పేరులతో 11 బ్లాక్‌లుగా విభజించి, వాటిలో 480 ప్లాట్లు నిర్మిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన భూమిపూజ శనివారం అర్ధరాత్రి 3.38 నిమిషాలకు జరుగుతుందన్నారు. ఈ వెంచర్లో టూ బెడ్ రూమ్ ప్లాట్ రూ.16 లక్షలు, త్రీ బెడ్ రూమ్ ప్లాట్ రూ.22 లక్షలకు అందిస్తున్నట్లు తెలిపారు. వెంచర్ ప్రారంభించిన రెండు మాసాల వ్యవధిలో సుమారు 200 ప్లాట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయన్నారు. 22 ఏళ్ల అనుభవంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేస్తున్న ఈ వెంచర్లో సూపర్ మార్కెట్, పార్కు, ఆసుపత్రి, క్లబ్‌హౌస్, జీమ్, యోగా రూమ్, కాన్ఫరె¯Œ్సహాలు, స్విమ్మింగ్ ఫూల్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రెండేళ్లలో వెంచర్‌ను పూర్తిస్థాయిలో వినియోగదారులకు అందిస్తామన్నారు. అనంతరం చంద్రిక అవంతిక బ్రోచర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రామకృష్ణ, సుబ్బారావు, కోటేశ్వరరావు, కిరణ్, శ్యామ్, శేఖర్, స్వామి, శ్రీధర్, అకీర్, రాజు పాల్గొన్నారు. -
దృశ్యకావ్యం
ఎన్నో భావాలు.. మరెన్నో అనుభూతులు సరదాలు..సరసాలు బాల్యంలో చిరునవ్వులు వద్ధాప్యంలో బొసినవ్వులు ప్రేమకావ్యాలు...సుందరదశ్యాలు పదహణాల పడుచు అందాలు నూనూగమీసాల చిలిపితనాలు కష్టాలు..కన్నీళ్లు ఇవన్నీ జస్ట్ వన్ క్లిక్.. ఆ క్లిక్‌లో కిక్ ఎక్కించే ఫ్లాష్బ్యాక్లుంటాయి. జస్ట్ ఫీల్... నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ డే . -
కలలు చెప్పే కథలు...
డ్రీమ్స్ కలలకు అర్థాలు ఉండవు. అన్వయాలు మాత్రమే ఉంటాయి. అన్వయం అంటే... అలా జరిగింది కాబట్టి, ఇలా కల వచ్చింది అనుకోవడం. లేదా ఇలా కల వచ్చింది కనుక అలా జరగబోతోందని భావించడం. కల కలే. నిజం నిజమే. రెంటికీ పోలిక లేదు. పొంతన లేదు. అయినప్పటికీ కలలు.. ‘తేలిగ్గా తీసి అవతల పడేయవలసిన’ కేటగిరీలో ఉండిపోలేదు! కలలపై పరిశోధనలు జరిగాయి. జరుగుతున్నాయి. కలలకు అర్థాలను వెతుకుతున్నారు. అంతరార్థాలను బయటికి లాగుతున్నారు. ఎంత వెతికినా, ఎంత లాగినా... కల అంతు చూడ్డం మనిషికి ఒక కలలానే మిగిలిపోయింది. మరి.. కొన్ని కలలెందుకు నిజం అయ్యాయి? కొన్ని నిజాలెందుకు కలలుగా కనిపించాయి? కల నిజం అవడం యాదృచ్ఛికం కావచ్చు. నిజం కల అవడం... కలవరింత కావచ్చు. ఏమైనా కలలు ఇంట్రెస్టింగ్. అవి కొత్త లోకాలను చూపిస్తాయి. కొత్త ఊహల్లో తేలియాడిస్తాయి. కొత్త భయాలను కలిగిస్తాయి. కొన్నిసార్లు ఉన్న భయాలనూ పోగొడతాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం ఏమంటే.. తీరని కోరికలు కలలుగా వస్తాయని! వస్తాయి సరే. తీరినట్టు వస్తాయా? తీరనట్టే వస్తాయా? ఎలాగైనా రావచ్చు. ఇక ఎప్పటికీ తీరనట్టు కూడా రావచ్చు. ఫ్రాయిడ్ పందొమ్మిదో శతాబ్దపు ఆస్ట్రియా న్యూరాలజిస్టు. సైకోఎనాలసిస్కి పితామహుడు. కలల్ని ఆయన డీసైఫర్ చేశారు. కలల కొలనులో ఈతకొట్టి లోపల ఏం మున్నదీ పైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఫ్రాయిడ్ చెప్పేదాన్ని బట్టి కలలన్నిటీనీ ఒకే మూసలో పెట్టి చూడ్డానికి లేదు. ఏ కలని, ఆ కలగానే ఎనలైజ్ చేయాలి. అప్పుడు ఆ కల దేనికి సంకేతమో తెలిసే అవకాశం ఉంటుందట! ఫ్రాయిడ్ తర్వాత ఆ స్థాయిలో కలల్ని విశ్లేషించి గూఢార్థాలు కనిపెట్టిన ఆధునిక సైకాలజిస్ట్ ఇయాన్ వాలెస్. ఆయన 1,80,000 కలల్ని కాచి వడబోశారు. ‘టాప్ 100 డ్రీమ్స్’ అనే పుస్తకం రాశారు. అందుల్లోంచి మళ్లీ సర్వసాధారణంగా మనకు వచ్చే కొన్ని కలలను ప్రత్యేకంగా వేరు చేసి, వాటికి వాలెస్ చెప్పిన అర్థాలను, తీసుకోవలసిన జాగ్రత్తలను, కలల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. కలలు... అర్థాలు * ఎవరో తరుముతున్నట్లుగా వస్తే: లైఫ్‌లో ఏదో సమస్య మిమ్మల్ని వెంటాడుతోంది. దాన్ని పరిష్కరించుకోలేక, దాన్నుంచి తప్పించుకుపోవాలని చూస్తున్నారు. లేదా ఆ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు. అదే కలలో మీరు పరుగెత్తాలని ప్రయత్నిస్తున్నా కూడా మీ కాళ్లు మొరాయిస్తూ, మీరు ఉన్నచోటనే ఉండిపోతున్నట్లు కల వస్తే మీలో ఆత్మవిశ్వాసం కొరవడిందని అర్థం. * ఏం చేయాలి? మీలోని జీవన నైపుణ్యాలకు పదును పెట్టుకోడానికి ఇదొక అవకాశం. మీ శక్తి ఏమిటో గ్రహించి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చెయ్యండి. * నలుగురి మధ్య దిగంబరంగా...: ఇలా కల వస్తే.. మీరు గుర్తింపు కోరుకుంటున్నారని. అది మీకు లభ్యం కావడం లేదని! ఎలాగైనా గుర్తింపు సంపాదించాలని తపిస్తున్నారని. ఏం చేయాలి? ధైర్యం చేయాలి. జనం మధ్యకు రావాలి. చొరవ చూపాలి. మీ శక్తియుక్తుల్ని నిరూపించుకోవాలి. * పరీక్షకు ప్రిపేర్ కానట్లు...: జీవితం విసురుతున్న సవాళ్లను ఎదుర్కొలేనేమో అనే భయం మీలో ఉంది. ఓడిపోతానేమో, నెగ్గుకు రాలేనేమో, వైఫల్యం చెందుతానేమో, పరాజయం పాలౌతానేమో అనే నెగిటివ అలోచనలు మిమ్మల్ని నడిపిస్తున్నాయని ఈ కలకు అర్థం. * ఏం చేయాలి? మీ నైపుణ్యాన్ని, సామర్థ్యాలను కలిపి విజయసాధనకు కృషి చెయ్యాలి. * దెయ్యాలు: కలలో తరచు దెయ్యాలు కనిపిస్తుంటే కనుక.. జీవితానికి, సమాజానికి మీరు దూరంగా ఉంటున్నట్లు లెక్క. * ఏం చెయ్యాలి? మనుషుల్లో కలవాలి. మంచి మంచి విషయాలు షేర్ చేసుకోవాలి. * గాలిలో ఎగురుతున్నట్లు: సామాజిక పోకడలకు అనుగుణంగా వెళ్లాలని ఈ కల సూచిస్తోంది. అదే సమయంలో జీవితంలోని సమస్యల విషయంలో ఓపికగా, నేర్పు ప్రద ర్శించాలని చెబుతోంది. * ఏం చెయ్యాలి? మన జీవితం మీద మనం అదుపు సాధించాలి. పట్టువిడుపులతో ఒడుపుగా విజయ శిఖరాలను అందుకోవాలి. * పడిపోయినట్లు: మంచం మీది నుంచి పడిపోయినట్లు కనుక కల వస్తే... నిజ జీవితంలో దేని కోసమో మీరు గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారని. ఆ ప్రయత్నం విఫలం కాకూడదని దృఢనిశ్చయంతో ఉన్నారని. ఏం చేయాలి? మీ మీద మీరు నమ్మకం ఉంచండి. జరిగేది జరగనివ్వండి. మీరు చేయదలచుకున్నది చేసేయండి. * పళ్లు రాలిపోతున్నట్లు వస్తే: పళ్లు (దంతాలు) ఆత్మవిశ్వాసానికి, శక్తికి సంకేతాలు. పళ్లు రాలిపోతున్నట్టు కల వస్తే, ఆ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే సంఘటనలు ఏవో మీ నిజ జీవితంలో జరగబోతున్నాయని అర్థం. * ఏం చేయాలి? జీవితంలో మీరు మార్పు కోరుకుంటున్నారనే దానికి ఈ కల సూచన కావచ్చు. లేదా మీరు పరిష్కరించుకోవలసిన ఒక సమస్యను మీకు గుర్తు చేయడం అంతరార్థం కావచ్చు. సమస్య పరిష్కారం కోసం పాజిటివ్ ఎనర్జీతో ప్రయత్నించండి. * పాములు: పాములు... దాగి ఉన్న భయాలకు చిహ్నాలు. పాములు కలలోకి రావడం అన్నది ఓ హెచ్చరిక కావచ్చు. పొంచి ఉన్న ప్రమాదాల నుంచి మిమ్మల్ని అప్రమత్తం చేయడం కావచ్చు. * ఏం చేయాలి? భయాలను ధైర్యంగా ఎదుర్కోండి. జీవితంలో ఎదురవుతున్న అవరోధాలను నేర్పుగా తొలగించుకుంటూ ముందుకు వెళ్లండి. * మరణం: జీవితంలో ఊహించని పరిణామాలు ఏవో సంభవించబోతున్నాయనేందుకు చావు కలను ఒక సూచనగా పరిగణించాలి. ఒక ముగింపునకు, ఒక ప్రారంభానికి ఇలాంటి కలలు ప్రతీకలు. * ఏం చేయాలి? మరణానికి సంబంధించిన కలలు ఆత్మపరిశీలనకు, ఎదుగుదలకు సోపానాలు. * అదుపు తప్పిన వాహనాలు: విజయానికి చేరువ చేసే దారిలో మీ ప్రయాణం అదుపు తప్పుతోందని అర్థం కావచ్చు. ప్రస్తుతం ఉన్న ఒక చెడు అలవాటు త్వరలోనే ఒక దీర్ఘ వ్యసనంగా మారబోతోందన్న దానికి ఇదొక సూచన కావచ్చు. * ఏం చేయాలి? రిలాక్స్ అవండి. పట్టు వదలండి. దూకుడు తగ్గించి మీ గమ్యానికి చేరుకునే ప్రయత్నం చేయండి. ముందే కలగన్నారు! 1. అబ్రహాం లింకన్ తన హత్య గురించి. 2. కార్ల్ జంగ్ ప్రపంచ యుద్ధం గురించి. 3. ప్రిన్సెస్ డయానా తన దుర్మరణం గురించి. 4. ఐన్‌స్టీన్ ‘థియరీ ఆఫ్ రిలేటివిటీ’ గురించి. 5. ల్యారీ పేజ్ గూగుల్ ఐడియా గురించి. 6. కొంతమంది అమెరికన్లు 9/11 ఘటన గురించి. సృజనాత్మక స్వప్నాలు (క్రియేటివ్ డ్రీమ్స్) ది స్ట్రేంజ్ కేస్ ఆఫ్ డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్: రాబర్ట్ లూయీ స్టెవెన్సన్ ఈ పుస్తకాన్ని తనకొచ్చిన కల ఆధారంగా రాశారు! అలా తొలి చిత్తు ప్రతిని కేవలం మూడు రోజుల్లో ఆయన పూర్తి చేశారట. కుబ్లా ఖాన్: సామ్యూల్ టేలర్ కొలెరిడ్జ్.. ఓపియం మత్తులో నిద్రలోకి జారి కనిన కలలోంచి గుర్తు చేసుకున్న సంఘటనల ఆధారంగా కుబ్లా ఖాన్ అనే కవితను రాశారు. టెర్మినేటర్: జేమ్స్ కామెరాన్ జ్వరంలో ఉన్నప్పుడు వచ్చిన కథ ఆధారంగానే టెర్మినేటర్ సినిమా తయారైంది. ఫ్రాంకెయిన్స్టెయిన్: మేరీ షెల్లీ చారిత్రక నవల ఫ్రాంకెయిన్స్టెయిన్ 1816లో ఆమెకు వచ్చిన ఒక కల ఆధారంగా రూపుదిద్దుకుంది. ఆ పుస్తకం 1818లో పబ్లిష్ అయింది. ట్విలైట్ సీరీస్: 2003 జూన్ 2న స్టెఫీన్ మేయర్‌కి వచ్చిన ఒక కలే, ఆ తర్వాత ‘ట్విలైట్’ సీరీస్‌కి కథాంశం అయింది. కల వచ్చిన మూడు నెలల్లో ఆమె తొలి పుస్తకాన్ని పూర్తి చేశారు. -
ఈ అతివలు.. కలల రథ సారథులు
ఆకాశంలో సగం.. అవకాశాల్లో మాత్రం వెనుకంజే.. అన్న నానుడిని తిరగరాశారీ అమ్మాయిలు. సాంకేతిక కోర్సులు పూర్తిచేసి కంప్యూటర్ కెరీర్ వైపు పరుగులు తీస్తున్న ఈ తరం యువతులకు భిన్నంగా కొత్త పంథాను అనుసరించారు. మొక్కవోని దీక్ష, పట్టుదలతో ముందడుగు వేసి సవాళ్ల రైలు బండికి సారథులుగా నిలిచారు. హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మక మెట్రో రైలు ప్రాజెక్టులో కీలకమైన అత్యాధునిక కలల మెట్రో రైళ్లు నడిపే ‘ట్రెయిన్ ఆపరేటర్లు’గా ఏడుగురు అమ్మాయిలు ఎంపికయ్యారు. మెట్రో రైళ్ల నిర్వహణ సంస్థ కియోలిస్ (ఫ్రాన్స్) కంపెనీ నిర్వహించిన ఐదు కఠిన పరీక్షల్లో ఉత్తీర్ణులై.. ఉప్పల్ మెట్రో డిపోలో ఆరు నెలలపాటు ఇచ్చిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. మెట్రో రైళ్లు డ్రైవర్ అవసరం లేని ‘కమ్యునికేషన్ బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ వ్యవస్థ’ ఆధారంగా పనిచేసినప్పటికీ ఈ రైళ్లను సురక్షితంగా నడిపేందుకు అవసరమైన విభిన్న సాంకేతిక అంశాలపై తర్ఫీదు పొందారు. ఇప్పటి వరకు ఉప్పల్ మెట్రో డిపోలో రైళ్లను నడిపిన ఈ అమ్మాయిలు త్వరలో మెట్రో పట్టాలపై రైళ్లను పరుగులు పెట్టించనున్నారు. ఈ సందర్భంగా వారిని ‘సాక్షి’ పలకరించింది. - సాక్షి, హైదరాబాద్ ఉద్విగ్నంగా ఉంది మెట్రో రైలు నడపడం చాలా ఉద్విగ్నంగా ఉంది. కొరియాలో తయారైన ఈ ఆధునిక రైళ్లను మన నగరంలో నడపడం గొప్ప విషయం. ఇందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నా. నేను ఎలక్ట్రానిక్స్ అండ్ క మ్యూనికేషన్స్లో డిప్టొమా పూర్తి చేశాను. అయితే అమ్మాయిలంటే కంప్యూటర్ జాబ్‌లకే పరిమితం అంటే నాకు నచ్చదు. - కె.మాధురి వరసాయి అవకాశాలిస్తే మహిళలు సత్తా చాటుతారు అవకాశాలు లభిస్తే మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారన్నదే చిన్నప్పటి నుంచి నేను నమ్మిన ఫిలాసఫి. నేను ట్రిపుల్ఈ లో డిప్లొమా పూర్తిచేశాను. ఏడాదిపాటు బీహెచ్ఈఎల్ సంస్థలో అసిస్టెంట్‌గా పనిచేశాను. కియోలిస్ సంస్థ నిర్వహించిన ఐదు రకాల పరీక్షలను పాస్ అయి ట్రెయిన్ ఆపరేటర్‌గా ఎంపికయ్యాను. - ఎన్.రాధ కంప్యూటర్ జాబ్ అంటే బోరింగ్ నేను ట్రిపుల్‌ఈలో బీఈ పూర్తిచేశాను. రెండున్నరేళ్లపాటు సిమెన్స్ సిస్టమ్స్ సంస్థలో డిజైన్ ఇంజనీర్‌గా పనిచేశాను. ఆఫీసు జాబ్ బోరింగ్ అనిపించింది. అందుకే ఛాలెంజింగ్ కెరీర్‌ను ఎంచుకున్నాను. - పి.శ్రీలేఖ గొప్ప ఉద్యోగం అనుకుంటున్నా నేను ట్రిపుల్ఈ లో డిప్లొమా పూర్తిచేశాను. సబ్జెక్ట్‌కు సంబంధించిన కోర్ జాబ్ మాత్రమే చేయాలనుకున్నాను. ఈ సంస్థలో అవకాశం వచ్చింది. ఇంజనీరింగ్ పూర్తిచేయాలన్నది నా లక్ష్యం. ఇది గొప్ప ఉద్యోగమని భావిస్తున్నా. - ఈ.అనూషా దేవి అమ్మా నాన్నల ప్రోత్సాహంతోనే.. మా నాన్న అప్పారావు ప్రైవేటు సెక్యూరిటీ గార్డు. అమ్మ ఆదిలక్ష్మి గృహిణి. చదువంటే నాకు బాగా ఇష్టం. అందుకే మా అమ్మానాన్నలు చాలా కష్టపడి చదివించారు. వారి ప్రోత్సాహంతోనే నేను ఈసీఈలో డిప్లొమా పూర్తిచేశాను. ప్రస్తుతం ఆపరేటర్‌గా ఎంపికయ్యా. - జి.శ్యామలాదేవి 400 కిలోమీటర్లు నడిపితే.. మొత్తం 400 కి.మీ. ఎలివేటెడ్ మార్గంలో రైళ్లను విజయవంతంగా నడిపితే కమర్షియల్ ఆపరేటర్‌గా ధ్రువీకరణ పత్రాన్ని కియోలిస్ సంస్థ వారికి అందజేస్తుంది. రోజుకు ఎనిమిది గంటల చొప్పున వారానికి 48 గంటలపాటు ఆపరేటర్‌గా విధులు నిర్వహించాలి. వీరికి ప్రారంభ వేతనం సుమారు రూ. 25 వేలు. ఏడాదికి 10 నుంచి 15 శాతం చొప్పున వేతనంలో పెరుగుదల ఉంటుంది. భవిష్యత్తులో మహిళలకు మరింత ప్రాధాన్యం ట్రెయిన్ ఆపరేటర్లకు మూడు నెలల పాటు తరగతి గదిలో, మరో మూడునెలలు క్షేత్రస్థాయిలో సురక్షితంగా మెట్రో రైళ్లు నడిపేలా శిక్షణనిచ్చాం. ప్రస్తుతం మూడు కారిడార్లలో నడిచే 57 రైళ్లను నడిపేందుకు 57 మంది ఆపరేటర్లను ఎంపికచేసి శిక్షణనిచ్చాం. వీరిలో ఏడుగురు అమ్మాయిలున్నారు. భవిష్యత్ అవసరాన్ని బట్టి వీరి సంఖ్య పెరగవచ్చు. ఎంపికలో మహిళలకు సముచిత ప్రాధాన్యం ఇస్తాం. - కె.బి.ఆర్.సి.మూర్తి, శిక్షణ కార్యక్రమం హెడ్, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ -
అపరిచితుల అడ్రస్ ఇదిగో!
స్వప్నలిపి అప్పుడప్పుడూ కలలో కొందరు అపరిచితులు కనిపిస్తారు. వారిని ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండరు. కానీ కల నుంచి బయటికి వచ్చిన తరువాత కూడా వారి ముఖాలు గుర్తుండిపోతాయి. ఇంతకీ ఎవరీ అపరిచితులు? మనలోని భయాలు, విభిన్న భావోద్వేగాలే మానవరూపాలై కలలో కనిపిస్తాయి. కొన్నిసార్లు ఒక వ్యక్తి మనకు కలలో కనిపిస్తాడు. అతడు అదేపనిగా మీపై కేకలు వేస్తూనే ఉంటాడు... ఈ కల మర్మం ఏమిటంటే, ఒక విలువైన అవకాశం మీకు వచ్చినట్లే వచ్చి కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల దాన్ని వదులుకోవాల్సి రావడం. కొన్నిసార్లు పై నుంచి కింది వరకు నల్లటి దుస్తులు వేసుకొని, చింతనిప్పుల్లా కనిపించే కళ్లతో ఒక వ్యక్తి కనిపిస్తాడు. మీ వైపు కోపంగా చూస్తుంటాడు. ‘నా మీద ఫలానా వాళ్లు ఫిర్యాదు చేస్తారేమో’ ‘నా మీద దాడి జరుగుతుందేమో’ అనేటటువంటి భయాలు మనసులో గూడు కట్టుకున్నప్పుడు ఎవరో భయపెడుతున్నట్లుగా ఈ కలలు వస్తాయి. కలలో కనిపించే అపరిచితుల గురించి స్థూలంగా చెప్పాలంటే, మన అంతః చేతనలోని రహస్య భావోద్వేగాలు, సకారణ, అకారణ భయాలు... సందర్భాన్ని బట్టి కలల్లో నిర్దిష్టమైన రూపాన్ని ధరిస్తాయి. -
కల నెరవేరింది
కన్న కలలు నెరవేరాలని ఎవరైనా ఆశిస్తారు. అనుకున్నవన్నీ జరగవన్నట్టు.. చేతిదాకా వచ్చిన అవకాశం అనూహ్యంగా జారిపోతుంది. మళ్లీ అలాంటి అవకాశం వరిస్తే ఆ ఆనందానుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే నటి అనుష్క ఉన్నారు. నేటి మేటి నటి ఈ బ్యూటీ. అయితే అనుష్కకు అంత సులభంగా ఈ స్థాయి దక్కలేదు. కోలీవుడ్ తొలి రోజుల్లో విజయం ముఖం చాటేసిందీమెకు. ఫలితం ఐరన్‌లెగ్ ముద్ర. అలాంటి నటి ఇప్పుడు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జోడీ కట్టే స్థాయికి చేరుకున్నారు. ఇదే విషయాన్ని అనుష్క ప్రస్తావిస్తూ రజనీకాంత్ సరసన నటించిన తరువాత తన నటన జీవితం పరిపూర్ణం అయ్యిందన్నారు. తన సినీ జీవితాన్ని ఒక ప్రణాళిక ప్రకారం తీర్చిదిద్దుకోలేదని అందువలన కొంతకాలం పరిశ్రమలో స్థబ్దతగా ఉండిపోయానని అన్నారు. అదేవిధంగా ఇంతకుముందు ఒకసారి సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించే అవకాశాన్ని కోల్పోయానని, అలాంటిది లింగా చిత్రం ద్వారా అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ చిత్ర షూటింగ్ మొత్తం యూనిట్ అంతా రజనీకాంత్ అంటే అభిమానంగా ఉండేవారన్నారు. ఇక ఆయన వ్యక్తిత్వం గురించి తానిప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదన్నారు. రజనీ గొప్ప మానవతావాది అని అన్నారు. నేటికీ సెట్లో ఆయన ఎనర్జీ రిమార్కబుల్ అని పేర్కొన్నారు. లింగా ఒక చిత్రం మాత్రమే కాదని ఆ చిత్రంలో నటించడం ఒక గొప్ప అనుభవం అని అన్నారు. రజనీకాంత్ నుంచి నిర్మాత, దర్శకుడు, ఛాయాగ్రాహకుడు అంటూ లింగా యూనిట్‌తో పనిచేయడం గ్రేట్ జర్నీ అని పేర్కొన్నారు. కెఎస్ రవికుమార్ లాంటి వేగంగా చిత్రాన్ని పూర్తిచేసే దర్శకుడు ఎవరినీ చూడలేదని అన్నారు. లింగా చిత్రంలోని మరో హీరోయిన్ సోనాక్షిసిన్హా గురించి అనుష్క మాట్లాడుతూ ఇది ఆమెకు దక్షిణాదిలో తొలి చిత్రం అన్నారు. అయినా తమ కుటుంబంలో ఒక భాగం అయిపోయారని, భవిష్యత్తులో ఆమెను మరిన్ని దక్షిణాది చిత్రాలలో చూస్తామని అన్నారు. ప్రస్తుతం అజిత్ సరసన నటిస్తున్న ఎన్నై అరిందాల్ చిత్ర షూటింగ్ కోసం చెన్నైలోనే ఉన్నానని, లింగా చిత్రాన్ని ఇక్కడ తన స్నేహితులతో కలసి ప్రేక్షకుల మధ్య థియేటర్లో చూడనున్నట్లు అనుష్క తెలిపారు. -
ఏపీపై కలలు కనడానికి చాలా టైం ఉంది
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సాక్షి, హైదరాబాద్: ఎప్పుడూ తాను కన్న కలలు నిజమవుతాయని పార్లమెంటరీ వ్యవహా రాల మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నేను కలలు కనడం తక్కువే. కన్న కలల్లో వచ్చినవన్నీ జరిగాయి. చిన్నప్పుడు పార్టీ కార్యకర్తగా పోస్టర్లు అంటించేటప్పుడు వాజ్‌పేయి ప్రధాని కావాలని కల కన్నా. నిజమైంది. ఆయన వద్ద మంత్రిగా పనిచేశా. బీజేపీకి కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ రావాలని కలగన్నా. మోడీ ఆధ్వర్యంలో అదీ జరిగింది. మహారాష్ట్రలో పార్టీ గెలిచినట్టు కలొచ్చింది. అదీ నెరవేరింది. కోల్‌కతా (పశ్చిమ బెంగాల్) వైపు కలలొస్తున్నాయి. అదీ నెరవేరుతుంది’’ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి కలలు రావడం లేదా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘చూద్దాం. చాలా టైం ఉందిగా’’ అని ఆయన బదులి చ్చారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగకుండా కాంగ్రెస్ పార్టీ తమాషాలు చేస్తోందని వెంకయ్య విమర్శించారు. రాజ్యాంగం పట్ల నమ్మకమే లేని కమ్యూనిస్టులు కూడా రాజ్యాం గం గురించి మాట్లాడుతున్నారంటూ సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు కె. లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
చుక్కల ఆకాశంలోకి...చక్కగా ప్రయాణమై!
రాత్రిపూట ఆకాశంలో చుక్కలను చూస్తుంటే...ఎంత కాదన్నా భావుకత తన్నుకు వస్తుంది. ఆకాశంలోకి వెళ్లి చుక్కలతో చక్కగా మాట్లాడాలనే కల కంటాం కూడా. అది వాస్తవరూపం దాల్చని అందమైన కల. అయితే రాత్రి వచ్చే కలలకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. భేషుగ్గా...ఆకాశదేశానికి వెళ్లి అందమైన చుక్కలతో తనివితీరా మాట్లాడవచ్చు. కొద్దిమందికి చుక్కల దగ్గరికి వెళ్లినట్లు కల వస్తుంటుంది. దీని అర్థం ఏమిటో తెలుసుకుందాం... ఆకాశం అనేది మనలో ఎప్పటి నుంచో ఉన్న సుదీర్ఘ లక్ష్యం అయితే, అక్కడికి వెళ్లి చుక్కలను పలకరించడం అనేది లక్ష్యాన్ని చేరుకోవడాన్ని లేదా చేరువ కావడానికి చేసే ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఇక ప్రేమికుల విషయంలో అయితే ‘ప్రేమ ఫలించడం’ అనే అర్థంలో దీన్ని చూడవచ్చు. మాటమాత్రంగా కూడా ఎప్పుడూ ఊహించని అవకాశాలు వచ్చి సంభ్రమాశ్చర్యాలకు గురిచేసినప్పుడు కూడా ఇలాంటి కలలు వస్తుంటాయి. ఆకాశంలో చుక్కలు ఉన్నట్టుండి రాలిపడడం, లేదా ఆకాశం నల్లగా మారి చుక్కలు కనిపించకపోవడం అనేది... మంచి అవకాశం ఒకటి వచ్చినట్లే వచ్చి చేజారడాన్ని సూచిస్తుంది. కొన్ని మానసిక విశ్లేషణల ప్రకారం, వచ్చే జన్మ లక్ష్యాలను ఇప్పుడే నిర్దేశించుకొని వాటి గురించి ఎక్కువగా ఆలోచించేవారికి కూడా చుక్కల మధ్య విహరించినట్లు కలలు వస్తాయి. ఆధ్యాత్మిక విశ్లేషణల ప్రకారం అయితే, సరికొత్త జ్ఞానానికి చేరువ కావడాన్ని ఈ కల సూచిస్తుంది. శాస్త్రసాంకేతిక విషయాల మీద ఆసక్తి ఉన్నవాళ్లకు, అంతరిక్షం ఎప్పుడూ ఒక ప్రహేళిక లాంటిదే. వారిలో ఎప్పటికప్పుడు ఎన్నో ప్రశ్నలు మొలకెత్తుతుంటాయి. వాటికి సమాధానాలు మాత్రం అంత తేలిగ్గా దొరకవు. అలాంటి వారు ఆకాశంలోకి వెళ్లి చుక్కలతో మాట్లాడడం అనేది... సమాధాన తృష్ణను ప్రతిబింబిస్తుంది. -
దేవుడు ప్రత్యక్షమై.. ఏం చెప్పాడంటే..!!
-
కలలో కల్లోల సముద్రం
స్వప్నలిపి మన కలలో అప్పుడప్పుడు... సముద్రం ముందు మౌనంగా కూర్చొని ఉంటాం. కొన్నిసార్లు సముద్రం ఏ శబ్దం లేకుండా మౌనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కొన్నిసార్లు దిక్కులు పిక్కటిల్లేలా ఊగిపోతుంది. కల్లోల కడలిగా మారుతుంది. నిజానికి కొద్దిమంది, సముద్రాన్ని ఏ సినిమాల్లోనో తప్ప ఎక్కడా చూసి ఉండరు. ‘సముద్రాన్ని చూడలేదు’ అనే నిరాశ, చూడాలనే కోరిక ఇలా కలగా వస్తుందా? కానే కాదు. కలలో కనిపించే సముద్రం జీవితానికి ప్రతీకలాంటిది. నిశ్శబ్దంగా ఉండే సముద్రం... మీలోని అసాధారణమైన అంతర్గత శక్తిని, భావోద్వేగ, ఆధ్యాత్మిక సమన్వయాన్ని ప్రతిబింబిస్తుంది. సముద్రం, అల్లంత దూరాన నిండు చంద్రుడు కనిపిస్తే... మీ జీవితం సుఖసంతోషాలతో హాయిగా గడిచిపోతుందని అర్థం. ఇక కల్లోల సముద్రం మీలో ఉండే...అసాధారణమైన ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే, ఎలాంటి విషమ పరిస్థితిని అయినా తట్టుకోగలిగే సామర్థ్యం మీలో ఉన్నట్లు అర్థం. కేవలం శక్తిసామర్థ్యాలకు సంబంధించిన విషయాలనే కాకుండా, రకరకాల పరిస్థితుల ఆధారంగా ఉత్పన్నమయ్యే మానసికస్థితిగతులను ‘కడలి కల’ ప్రతిఫలిస్తుంది. ఉదా: మీలో మానసిక ప్రశాంతత లోపించిన సంఘటన ఏదైనా జరిగినప్పుడు...కల్లోలకడలికి సంబంధించిన కలలు వస్తుంటాయి. ఫ్రాయిడ్ ప్రకారం: దూరంగా కనిపిస్తున్న సముద్రం... మీకు విశ్రాంతి లేని విషయాన్ని సూచిస్తుంది. మీరు ఏదైనా విషయాన్ని కనుగోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు...సముద్రంలో ఈత కొడుతున్నట్లు కల వస్తుంది. ‘నా నిర్ణయాన్ని అమలు చేయడానికి ఇది సరియైన సమయం’ అని మనసులో బలంగా అనుకున్నప్పుడు కూడా ఇలాంటి కలలు వస్తాయి. -
నయవంచన
ప్రతి ఆడపిల్లా బోలెడన్ని కలలు కంటుంది. అవి నిజం కావాలని పూజలు, ప్రార్థనలు చేస్తుంది. డెబోరా కూడా అలానే చేసింది. కానీ ఆమె కలలు నిజం కాలేదు. కోరుకున్న జీవితం దక్కలేదు. ఎందుకంటే ఓ వంచకుడిని ప్రేమించింది. నయవంచనకు గురై జీవితాన్నే కోల్పోయింది. అమెరికాలో సంచలనం సృష్టించిన నర్తకి డెబోరా ఫ్లారెస్ నార్వేజ్ హత్యోదంతం... నేటి ‘నిజాలు దేవుడికెరుక’లో! డిసెంబర్ 12, 2010. లాస్ వేగాస్ (అమెరికా)లోని లగ్జర్ హోటల్... ‘‘తొమ్మిదిన్నరవుతోంది. ఇంతవరకూ డెబోరా రాలేదు. ఇలా అయితే ఎలా?’’... చిందులు తొక్కుతున్నాడు ఫ్రాన్సిస్. క్లారా నిలబడి చూస్తోంది. ‘‘మాట్లాడవేం... డెబోరా ఏమయ్యింది?’’... మరోసారి ఉరిమాడు. ‘‘నాకు మాత్రం ఏం తెలుసు సర్. సాయంత్రం ఆరున్నరకే ఇంటికెళ్లిపోయింది. ఫ్రెష్ అయ్యి ఎనిమిది గంటల కల్లా వచ్చేస్తానంది. రాలేదు. ఫోన్ చేస్తే తీయడం లేదు.’’ ‘‘ఇవన్నీ నాకు తెలిసినవే. కొత్త విషయాలేమైనా ఉంటే చెప్పు.’’ ఒళ్లు మండింది క్లారాకి. ‘రిహార్సల్స్ మేనేజర్ అయినంత మాత్రాన ఇంత ఎగరాలా’ అనుకుంది మనసులో. పైకి మాత్రం నవ్వు ముఖం పెట్టింది. ‘‘తను ఎప్పుడూ ఇలా చేయదుగా సర్. తనకేం పని వచ్చిందో ఏమో.’’ తల పంకించాడు ఫ్రాన్సిస్. అతడికి తెలుసు డెబోరా ఎంత నిబద్ధత గల అమ్మాయో. అందుకే ఇక ఆ విషయం వదిలేసి తన పనిలో పడిపోయాడు. అలా చేసి తనెంత తప్పు చేశాడో తర్వాతి రోజుకానీ అర్థం కాలేదతడికి. మరునాడు సాయంత్రం షో టైమవుతున్నా డెబోరా రాలేదు. ఫ్రాన్సిస్‌కి టెన్షన్ పెరిగిపోయింది. అందరూ వచ్చేదే డెబోరాని చూడ్డానికి. తను లేకుండా షో ఎలా చేయాలి? ‘‘ఏంటి క్లారా ఇది? ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పొచ్చు కదా. ముందే ప్రిపేరవడమో, షో క్యాన్సిల్ చేయడమో చేసేవాళ్లం కదా’’... విసుక్కున్నాడు. ‘‘పని తప్ప మరో ప్రపంచమే లేనట్టుగా ఉండే అమ్మాయి ఇలా చేస్తే, తనకి ఏమయ్యిందోనని కంగారుపడటం మానేసి తిట్టుకోవడం ఏమైనా బాగుందా సర్?’’ చివ్వున తలెత్తి చూశాడు ఫ్రాన్సిస్. తను అలా ఆలోచించలేకపోయానే అని సిగ్గుపడుతున్నట్టుగా ఉంది అతడి చూపు. ‘‘సారీ క్లారా... షోని క్యాన్సిల్ చేద్దాం’’ అన్నాడు స్వరం తగ్గించి. తలాడించింది క్లారా. ఇద్దరూ స్టేజివైపు నడిచారు. డిసెంబర్ 13... రాత్రి పది కావస్తోంది. ‘‘లగ్జర్ హోటల్లో జరిగిన డ్యాన్స్ షోలో కలకలం రేగింది. ప్రముఖ డ్యాన్సర్ డెబోరా ఫ్లారెస్ నార్వేజ్ లేనందున షో క్యాన్సిల్ చేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించడంతో డెబోరా అభిమానులు నిరాశకు లోనయ్యారు.’’ టీవీలో వార్తలు చూస్తోన్న షానన్ షాకయ్యింది. ‘డెబోరా లేక షో క్యాన్సిలయ్యిందా? అదెలా? తనెప్పుడూ అలా చేయదే’ అంటూ ఫోన్ చేతిలోకి తీసుకుని డెబోరాకి కాల్ చేసింది. తీయలేదు. వెంటనే క్లారా నంబర్ డయల్ చేసింది. ముందు రోజు నుంచీ జరిగినదంతా వివరించింది క్లారా. షానన్ మనసు కలవరపడింది. తన స్నేహితురాలికి ఏమయ్యిందో ఏమోనని కంగారుపడింది. వెంటనే లాస్ వేగాస్ పోలీసులకు ఫోన్ చేసింది. హుటాహుటిన తనూ బయలుదేరింది. డిసెంబర్ 14... ఉదయం పదకొండు... లాస్‌వేగాస్ పోలీస్ స్టేషన్. ‘‘మేము ఎంక్వయిరీ చేస్తున్నాం మిస్ షానన్... ఇంకా ఏమీ తెలియలేదు.’’ ‘‘నాకేదో భయంగా ఉంది సర్.’’ ‘‘మీకు తనెప్పటి నుంచి పరిచయం?’’ ‘‘మేం పదిహేనేళ్ల నుంచీ ఫ్రెండ్సమి. రోజూ ఏదో ఒక సమయంలో కలుసు కుంటాం. తన షో ఏదీ మిస్ కాను. కానీ ఆఫీసు పనిమీద నాలుగు రోజుల క్రితం వేరే ఊరికెళ్లాను. అందుకే ఈ షోకి లేను. టీవీలో తన గురించిన న్యూస్ చూడగానే మనసు ఏదో కీడు శంకించింది. వెంటనే బయలుదేరి వచ్చేశాను.’’ అలాగా అన్నట్టు తలూపాడు ఇన్స్పెక్టర్. ‘‘డెబోరా అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ రప్పించాను. మీరు కూడా రండి చూద్దాం’’ అంటూ లేచాడు. అతడిని అనుసరించింది షానన్. వీడియో రన్ అవుతోంది. సమయం ఏడవుతుండగా మెరూన్ కలర్ షెవరోలెట్ కారు వచ్చి గ్యారేజ్‌లో ఆగింది. క్షణం తరువాత 31 యేళ్ల డెబోరా దిగింది. ముదురురంగు స్కర్టు, జీన్స్ కోటు, మోకాళ్ల వరకూ నల్లని బూట్లు వేసుకుంది. భుజానికి తెల్లని జిమ్ బ్యాగ్, చేతిలో బ్రౌన్ కలర్ హ్యాండ్ బ్యాగ్ ఉన్నాయి. కారు లాక్ చేసి లోనికి వెళ్లిపోయింది. ‘‘అంటే తను ఫ్లాట్‌కి వచ్చింది. కానీ తనని ఎవరూ చూడలేదు. ఫ్లాట్‌లోనూ లేదు. అంటే మళ్లీ ఎక్కడికైనా వెళ్లిందా?’’ సందేహాన్ని వ్యక్తం చేశాడు ఇన్స్పెక్టర్. అతడి అనుమానం నిజమే అయ్యింది. ఇరవై నిమిషాల తరువాత డెబోరా తన కారులో మళ్లీ ఎక్కడికో బయలుదేరింది. ‘‘తను ఎక్కడికో వెళ్లింది సర్. అక్కడే ఏదో జరిగి ఉంటుంది’’... షానన్ గొంతు బాధతో జీరబోయింది. తడిసిన కళ్లను తుడుచుకుని అంది... ‘‘గ్రిఫిత్‌ను అడిగితే ఏమైనా తెలుస్తుందేమో సర్.’’ చురుక్కున చూశాడు ఇన్స్పెక్టర్. ‘‘గ్రిఫిత్ ఎవరు?’’ ‘‘డెబోరా మాజీ బాయ్‌ఫ్రెండ్ సర్. తనూ డ్యాన్సరే.’’ ‘‘యు మీన్... జేసన్ గ్రిఫిత్?’’ అవునన్నట్టు తలూపింది షానన్. వెంటనే ఆమెను తీసుకుని గ్రిఫిత్ దగ్గరకు బయలుదేరాడు ఇన్స్పెక్టర్. డెబోరా వచ్చిందా అని అడిగితే... 12వ తేదీ సాయంత్రం వచ్చిందని, ఆరింటికి వెళ్లిపోయిందని చెప్పాడు గ్రిఫిత్. మేం మాజీ ప్రేమికులం, తన దగ్గర ఉన్న నా వస్తువుల్ని తిరిగివ్వడానికి వచ్చింది తప్ప ఆమెతో తనకే సంబంధం లేదని చెప్పాడు. అతడి మాటల్లో తడబాటు లేకపోవడంతో పోలీసులకు వెనుదిరగక తప్పలేదు. డెబోరా ఫ్లాట్ తనిఖీ చేశారు. అనుమానించదగ్గవేమీ కనిపించలేదు. కారు కోసం వెతికారు. నాలుగు రోజుల తరువాత లాస్ వేగాస్‌కి కొన్ని కిలోమీటర్ల దూరంలో... రోడ్డు పక్కన కనిపించింది. అయితే దాని వల్ల కూడా ఏ ఆధారమూ దొరకలేదు. దాంతో కేసునెలా ఛేదించాలా అన్న ఆలోచనలతో పోలీసుల బుర్ర వేడెక్కింది. దాదాపు 25 రోజుల తర్వాత వారి బుర్రలను చల్లబరిచే ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. అవతలి వ్యక్తి చెప్పింది వినగానే సబార్డినేట్స్‌ని తీసుకుని హుటాహుటిన బయలుదేరాడు ఇన్స్పెక్టర్. జనవరి 8... 2011. డౌన్‌టౌన్ దగ్గరున్న బొనాంజా వే లో దూసుకుపోతోన్న పోలీసు జీపు... ఓ చోట రోడ్డుకు కాస్త దూరంగా విసిరేసినట్టుగా ఉన్న ఓ ఇంటి ముందు ఆగింది. జీపు దిగి ఒక్క అంగలో లోనికి నడిచాడు ఇన్స్పెక్టర్. సబార్డినేట్స్ అతడిని అనుసరించారు. లోనికి వెళ్తూనే ‘సెర్చ్’ అన్నాడు ఇన్స్పెక్టర్. వెంటనే అందరూ వెతుకులాట మొదలుపెట్టారు. మొదటి అంతస్తులో ఓ మూలన ఉన్న పెద్ద పెద్ద నీలిరంగు ప్లాస్టిక్ టబ్బుల మీద పడింది వారి చూపు. వాటి నిండా కంకర నింపి ఉంది. మధ్యలో ఏదో నల్లని కవర్ లాంటిది కనిపించింది. వెంటనే ఆ కవర్ని పట్టి లాగారు. తెరచి చూసి తుళ్లిపడ్డారు. అందులో తొడవరకూ నరికేసిన ఓ ఆడపిల్ల కాలు ఉంది. కడుపులో దేవినట్టయ్యింది. డబ్బా లోపలున్న కంకరంతా బయటకు తీస్తే అడుగున ఇంకో పాలిథీన్ కవర్ కనిపించింది. అందులో రెండో కాలు ఉంది. ఆ పక్కనే ఉన్న మరో రెండు టబ్బుల్లో కూడా పాలిథీన్ కవర్లున్నాయి. వాటిలో డెబోరా తల, చేతులు, బట్టల్లేని మొండెం ఉన్నాయి. ‘‘మైగాడ్’’ అన్నాడు ఇన్స్పెక్టర్ వాటిని చూస్తూనే. మిగతావారంతా అవాక్కయి చూస్తూండిపోయారు. ఆ భాగాలన్నింటినీ తీసి ఓ సంచీలో వేసుకుని పోలీస్ స్టేషన్‌కి బయలుదేరారు. గ్రిఫిత్‌ను అరెస్ట్ చేసి సెల్‌లోకి తోశారు. ‘‘లేదు సర్. డెబ్బీని నేను చంపలేదు’’ ... పోలీస్ స్టేషన్ గోడలు దద్దరిల్లేలా కేకలు పెట్టాడు గ్రిఫిత్. కానీ ఇన్స్పెక్టర్ లెక్కచేయలేదు. ఎందుకంటే గ్రిఫితే డెబోరాని చంపాడనటానికి అతడి దగ్గర కచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. డెబోరా కేసును పరిష్కరించలేక మల్లగుల్లాలు పడుతున్న సమయంలో కేలీ కసోర్సో అనే మహిళ ఫోన్ చేసింది. గ్రిఫిత్ తన స్నేహితుడని, అతడు తన ఫ్రెండ్ కొలంబియాతో కలిసి తన ఇంటికొచ్చాడని, ఓ పెద్ద నీలిరంగు టబ్‌ని తన ఫ్లాటులో కొన్ని రోజులు ఉంచుకోవాలని కోరాడని, అందులో ఏముందని అడిగితే ‘డెబోరా’ ఉందని చెప్పాడని, దాంతో తాను వెళ్లిపొమ్మని అరిచానని చెప్పింది. ఆమె మాటలకు అనుమానం వచ్చిన పోలీసులు గ్రిఫిత్ మీద కన్నేశారు. అతని స్నేహితుడు కొలంబియాని పట్టుకుని తమ స్టయిల్లో విచారించారు. దాంతో అసలు విషయం బయటపడింది. డెబోరా గ్రిఫిత్ని ప్రేమించింది. గుడ్డిగా నమ్మింది. అతడితో అన్నీ పంచుకుంది. ఫలితంగా గర్భం దాల్చింది. పెళ్లి చేసుకుందామంటే, తానింకా ఎదగాలన్నాడు. అబార్షన్ చేయించాడు. అయినా ఆమె అతణ్ని ప్రేమిస్తూనే ఉంది. కానీ అతడు మాత్రం ఆమెను వంచించాడు. నిర్లక్ష్యం చేశాడు. విడిపోవడం మంచి దన్నాడు. తనకు ఇష్టం లేకపోయినా అతడి సంతోషం కోసం సరేనంది డెబోరా. కానీ తర్వాత తెలిసింది... తన కడుపులో పిండం పెరుగుతోందని. దాంతో అతడికి ఫోన్ చేసింది. విషయం చెప్పింది. జరిగిం దేదో జరిగిపోయింది పెళ్లి చేసుకుందా మంది. ఈ బిడ్డనైనా నాకివ్వు అంటూ ప్రాధేయపడింది. మాట్లాడుకుందాం రమ్మ న్నాడు. ఆనందంగా వెళ్లిన ఆమెకి విశ్వ రూపం చూపించాడు. ప్రేమ లేదన్నాడు. పెళ్లి కుదరదన్నాడు. ఆమె ఒత్తిడి చేయ డంతో ఆవేశపడ్డాడు. తల మీద కొట్టి చంపేసి, శవాన్ని టబ్బులో పెట్టాడు. పోలీసులు పరిశోధన తీవ్రస్థాయిలో ఉండటంతో తీసుకెళ్లి పారేయలేకపోయాడు. కొన్నిరోజులు కేలీ ఇంట్లో దాచాలనుకున్నాడు. కానీ ఆమె నో అనడంతో, కొలంబియాతో కలిసి దేహాన్ని ముక్కలు చేసి, కాంక్రీట్ టబ్బుల్లో పెట్టాడు. ‘‘ప్రేమించిన అమ్మాయిని మోసగించావ్. పెళ్లి చేసుకోమంటే ప్రాణాలు తీశావ్. ప్రేమ విలువ తెలియని నీలాంటి నీచుణ్ని ప్రేమించడం ఆమె దురదృష్టం’’ ... గ్రిఫిత్ కళ్లలోకి చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్. అతగాడి కళ్లలో పశ్చాత్తాపం కనిపిస్తుందేమోనని వెతికాడు. అలాంటిదేమీ కనిపించలేదు. ఇప్పటికీ తాను నేరం చేయలేదనే అంటున్నాడు గ్రిఫిత్. చట్టానికి చిక్కకుండా తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నెల 23వ తేదీన తుది తీర్పు వెలువడవచ్చు. మరి అతడి నేరం నిరూపణ అవుతుందా? ఆ వంచకుడికి శిక్ష పడుతుందా? అతడిని ప్రేమించినందుకు ప్రాణాలనే కోల్పోయిన డెబోరాకి న్యాయం జరుగుతుందా? - సమీర నేలపూడి -
మనీ మనీ...
స్వప్నలిపి కొందరికి అదే పనిగా డబ్బు కలలోకి వస్తుంటుంది. లాటరీ ఏదో గెలుచుకున్నట్లు... ఒక్కసారిగా ధనవంతుడై పోయినట్లు, భూమిని తవ్వుతుంటే కట్టలు, కట్టలుగా డబ్బు వస్తున్నట్లు... ఇలాంటి విచిత్రమైన కలలు కూడా వస్తుంటాయి. దీని అర్థం...డబ్బు మీద విపరీతమైన వ్యామోహం ఉన్నట్లు కాదు. ఒక విధంగా చెప్పాలంటే, కలలో కనిపించే ‘డబ్బు’ అసలు డబ్బు కానే కాదు. మరి ఏమిటి? విజయం. ఆత్మవిశ్వాసం. విలువలు... వీటిని డబ్బు ప్రతిబింబిస్తుంది. మన మీద మనకు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు అది విజయానికి దారి చూపుతుంది. ఇక్కడ ‘ఆత్మవిశ్వాసం’ అనేది విలువైన పాత్రను పోషిస్తుంది. ఆ విలువ ‘డబ్బు’ రూపంలోనో, ‘బంగారం’ రూపంలోను ప్రతిఫలిస్తుంది.హృదయానికి సంబంధించిన రకరకాల అనుభూతులు కూడా డబ్బు రూపంలో కలలోకి వస్తాయి. ఉదా: ఒక అమ్మాయిని ప్రేమించారు. ఇప్పుడు ప్రపంచంలో మీకు అత్యంత విలువైనది ఈ ‘ప్రేమ’ మాత్రమే. ఆ విలువ ‘డబ్బు’గా కలలో దర్శనమిస్తుంది. డబ్బుకు సంబంధించి మరికొన్ని కలలు... బ్రీఫ్‌కేస్‌లో డబ్బును భద్రంగా తీసుకువెళుతుంటే, దొంగలు దాడి చేసి దోచుకెళతారు. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరో జేబు కొట్టేస్తారు...ఇలాంటి కలలు కూడా వస్తుంటాయి. డబ్బును కోల్పోవడం అనేది లక్ష్యానికి దూరం కావడాన్ని, ఆత్మీయులు దూరం కావడాన్ని, నిత్యజీవితంలోని అశాంతిని సూచిస్తుంది. మానసికంగా బలహీనంగా ఉన్న సందర్భంలో కూడా ఇలాంటి కలలు వస్తుంటాయి. ‘నా జీవితం నా చేతుల్లో లేకుండా పోయింది’ అని కుమిలిపోతున్నప్పుడు కూడా డబ్బు దొంగిలించబడినట్లు కలలు వస్తుంటాయి. చివరగా ఒక్క మాట: ఈసారి డబ్బు కలలో కనిపించినా లేదా డబ్బు దొంగిలించబడినట్లు కల వచ్చినా...మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. కొత్త విషయాలు తెలియవచ్చు. ప్రయత్నించి చూడండి! -
కలలో పిల్లలు... వాళ్ల నవ్వులు
స్వప్న లిపి కొన్ని కలలు... నిద్ర లేవగానే గుర్తు తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటాయి. కొన్ని మాత్రం మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకునేలా ఆహ్లాదకరంగా ఉంటాయి. వాటిలో ఒకటి... కలలో పిల్లలు కనిపించడం. వాళ్ల నవ్వులు నిద్రలో కూడా మన పెదాల మీద చిరునవ్వును పూయిస్తాయి. కలలో పిల్లలు కనిపించడానికి అర్థం ఏదైనా ఉందా? ఉంది. అదేమిటంటే... చిన్నపిల్లలు కలలో కనిపించడం అనేది... మీ స్వచ్ఛమైన హృదయాన్ని ప్రతిబింబించడం లాంటిది. ‘పిల్లలు’ స్వచ్ఛత, అమాయకత్వం, మంచితనం... తదితర లక్షణాలకు ప్రతీక. కలలో... చిన్న పిల్లలు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే...మీరు మది నిండా సంతోషంగా ఉన్నారని అర్థం. కలలో పిల్లలు కనిపించడం అనేది, మీలో మీకు కనిపించని శక్తులు...మిమ్మల్ని పలకరించడం కూడా. ‘ఫలానా పని నేను చేయలేను’ అని ఎలాంటి ప్రయత్నం లేకుండానే ఓటమికి సిద్ధపడతారు కొందరు. ్ఞ్ఞ్ఞ్ఞ్ఞనిజానికి, ప్రయత్నిస్తే తేలికగా విజయం సాధించే సామర్థ్యాలు వారిలో ఉంటాయి. ‘‘నువ్వు చేయగలవు. ఆ శక్తి నీలో ఉంది’’ అని సన్నిహితులు చెప్పినా పెద్దగా పట్టించుకోరు. అలా అని మానసికంగా ప్రశాంతంగా కూడా ఉండరు. ‘‘నేను...లేనిపోని భయాలను ఊహించుకుంటున్నాను’’ అని మనసులో మథనపడుతున్నప్పుడు... ఈ ఆలోచనే కలగా వస్తుంది. ఆ కలలో పిల్లలు కనిపించడం, మనలోని సామర్థ్యాన్ని ప్రతిబింబించడం లాంటిది. పిల్లలు కలలో కనిపించడం అనేది... ఒక కొత్త ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది. ‘నేను అలా కాదు. ఇలా ఉండాలనుకుంటున్నాను’ అని ఒక నిర్ణయానికి బలంగా వచ్చినప్పుడు, ఆ నిర్ణయం పిల్లల నవ్వుల రూపంలో కలలో ప్రతిఫలిస్తుంది. -
మెరికలు చూపిన మార్గంలో..
ప్రేరణ విజయం వైపు సాగిపోయేలా నిత్యం స్ఫూర్తిని రగిలించే ఒక కథానాయకుడి(హీరో)ని ఆదర్శంగా తీసుకోవడం ప్రతి వ్యక్తికీ ఎంతో అవసరం. ఎందుకంటే.. గొప్ప కలలు కనేలా హీరోలు మనల్ని ప్రేరేపిస్తారు. ప్రేరణ అందిస్తారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా మనోస్థైర్యం కలిగిస్తారు. ఒకవేళ మనం నిరాశ అనే సంద్రంలో మునిగిపోయినప్పుడు వారు తమ హిత వచనాలతో ధైర్యం నింపుతారు. నిక్షేపంగా బయటకు రావడానికి అవసరమైన గుండెనిబ్బరాన్ని మనలో కల్గిస్తారు. ఎల్లప్పుడూ ఒక్కరేనా! మన ఆదర్శ కథానాయకుడు ఎల్లప్పుడూ ఒక్కరే ఉండాలనే నియమం లేదు. జీవితంలో నానాటికీ మారిపోయే పరిణామాలు, పరిస్థితులను బట్టి హీరోలు సైతం మారుతుంటారు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే.. హీరోలు పరిపూర్ణులుగా ఉండాలనుకోవడం అత్యాశే అవుతుంది. అలా కోరుకుంటే నిరాశ చెందక తప్పదు. మనకు అసలు హీరోలే వద్దనుకొనే దశ రావడం బాధాకరం! మొదటి హీరో.. నాన్న నా హీరో ఎవరనే ప్రశ్న తరచుగా మనసులో మొలకెత్తుతూ ఉంటుంది. నా జీవితంలో పలువురు కథానాయకులున్నారు. వారిలో కొందరు ముఖ్యుల గురించి ప్రస్తావించడం ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నా..! జీవితంలోని మొదటి హీరోల్లో ఒకరు నా తండ్రి. మనలో చాలామందికి మొదటి హీరో తండ్రే కావడంలో ఆశ్చర్యం లేదు. నా తండ్రి చేసే పనుల నుంచి ఒక బాలుడిగా నేను ఎంతో స్ఫూర్తిని, ప్రేరణను పొందేవాడిని. మా నాన్న కేరళలోని ఓ కుగ్రామం నుంచి ముంబై మహానగరానికి వచ్చారు. ఇక్కడే ఇంజనీరింగ్ చదివారు. ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకున్నారు. హిందీ భాషలో నిష్ణాతుడిగా మారారు. ఆ భాషను మరొకరికి బోధించే స్థాయికి ఎదిగారు. నేను హిందీలో మాట్లాడడం, రాయడం ఆయన దగ్గరే నేర్చుకున్నాను. మనచుట్టూ ఉండేవారితో ఎలా వ్యవహరించాలనే విషయాన్ని ఆరేళ్ల వయస్సులో నాన్న వద్ద నేర్చుకున్నాను. నేను ఎప్పటికీ మర్చిపోలేని రెండు ముఖ్యమైన పాఠాలు.. కారు డ్రైవర్‌ను ‘డ్రైవర్’ అని కాకుండా పేరు పెట్టి పిలవడం. మా డ్రైవర్ నాకు ‘డ్రైవర్’ కాదు.. నాథూ భయ్యా. మరొకటి.. నా పుస్తకాల సంచిని నేనే మోసుకుపోవడం! ఉన్నదానితోనే సాధించేలా.. స్కూల్లో ఉన్నప్పుడు నాకు క్రికెట్ అంటే విపరీతమైన ఆసక్తి ఉండేది. అప్పుడు సునీల్ గవాస్కర్ రూపంలో ఓ హీరో దొరికాడు. ఆయన గొప్ప పొడగరి కాదు. పొట్టిగా ఉంటాడు. మైదానంలోకి దిగాడంటే.. హెల్మెట్ ధరించకుండానే ప్రపంచంలోకెల్లా అత్యంత వేగవంతమైన బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనేవాడు. శారీరకంగా పొట్టిగా ఉండడాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నానని గవాస్కర్ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. బౌన్సర్లను ధీటుగా ఎదుర్కొనేందుకు తన శారీరక ప్రతికూలతే అనుకూలంగా మారిందని వెల్లడించాడు. తన ఇంట్లోని చిన్న బాల్కనీలోనే క్రికెట్ సాధన చేసేవాడినని, బంతులను సూటిగా బాదాలనే పాఠం అక్కడే అలవడిందని పేర్కొన్నాడు. గవాస్కర్ చెప్పిన ఈ రెండు విషయాలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మనలో ఉన్నదానితోనే అనుకున్నది సాధించేందుకు కృషి చేయాలి. మనలో లేని దాని గురించి ఫిర్యాదులు చేస్తూ కాలం గడిపితే ప్రయోజనం శూన్యం. ‘కెరీర్స్ 360’ సౌజన్యంతో.. -
రోజంతా చేతులు కడుగుతున్నారా?
స్వప్నలిపి ఒక కల తరచుగా వస్తుంటుంది... ఆ కలలో చేతులు కడుగుతూ కనిపిస్తాం. కొన్నిసార్లు అయితే మరీ విచిత్రమైన కల కూడా వస్తూ ఉంటుంది. మరే పని లేనట్లు రోజంతా చేతులను కడుగుతూనే ఉంటాం. ‘ఆరోగ్య స్పృహ నాలో ఎక్కువైందా?’ ‘శుభ్రత గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానా?’ ఇలాంటి సందేహాలు మదిని చుట్టుముడతాయి. నిజానికి ఆరోగ్యానికి సంబంధించిన స్పృహకూ, ఈ కలకూ ఎలాంటి సంబంధం లేదు! మరి ఈ కల ఉద్దేశం ఏమిటి? మనకు కొన్ని పశ్చాత్తాపాలు ఉంటాయి. వాటిని చెప్పుకోవాల్సిన వారి దగ్గర చెప్పుకుంటే మనసు శాంతిస్తుంది. అక్కడితో ఆ పశ్చాత్తాపానికి చెల్లుచీటీ దొరుకుతుంది. కానీ అన్నీ సందర్భాల్లోనూ అది కుదరకపోవచ్చు. అది ఒక బాధగా మనసులో మిగిలిపోవచ్చు. ‘చేతులు కడుక్కోవడం’ అనేది పశ్చాత్తాపానికి సంబంధించిన భావనకు ప్రతీక. కొన్నిసార్లు... మనం అత్యంత వినయంగా చేతులు కట్టుకున్నట్లుగా కల వస్తుంది, ఎదురుగా మాత్రం ఎవరూ కనిపించరు! మనకు బాగా నచ్చిన వ్యక్తి, గౌరవించే వ్యక్తి, అభిమానించే వ్యక్తి... కలవడానికి అందుబాటులో ఉండనంత దూరంలో ఉన్నప్పుడు, లేదా ఏవో కారణాల వల్ల కలవడానికి కుదరనప్పుడు ఇలాంటి కలలు వస్తుంటాయి. -
తల్లిదండ్రుల కలలు నెరవేర్చండి
తల్లిదండ్రుల కలలు నెరవేర్చండి కొరుక్కుపేట, విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను, ఉపాధ్యాయుల ఆంక్షాంక్షలను నెరవేర్చాలని కేవీటీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత కేవీ తిరుపతయ్య పేర్కొన్నారు. చెన్నై విల్లివాక్కంలోని శ్రీ కనకదుర్గా మహోన్నత పాఠశాల (ఎస్‌కేడీటీ) 67వ వార్షికోత్సవాన్ని పాఠశాల ఆవరణలో శుక్రవారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల అధ్యక్షులు ప్రముఖ డాక్టర్ సీఎంకే రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఆయన మా ట్లాడుతూ ప్రతి విద్యార్థీ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకున్నప్పుడే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందాన్ని పొందుతారని తెలిపారు. పాఠశాల అధ్యక్షులు సీఎంకె రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ సి.మోహన్‌రెడ్డి, తెలుగు అభివృద్ధికి, తెలుగు విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా మార్చి 16న జరగబోయే ముప్పేరం విళాను సీఎంకేరెడ్డి బాధ్యతగా తీసుకుని తెలుగు వారి సత్తాను చాటాలని కోరారు. సీఎంకే రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రేతర ప్రాంతంలో తెలుగు పాఠశాలను ఏర్పాటు చేసుకుని 67 ఏళ్లుగా తెలుగు విద్యార్థుల కోసం పాటుపడుతున్నామని తెలిపారు. మాతృభాష మీద భక్తికి, గౌరవానికి శ్రీ కనకదుర్గ పాఠశాల నిదర్శనంగా నిలుస్తుందన్నారు. మార్చి 16న నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్న ముప్పేరం విళాలో తెలుగు వారందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. దక్షిణ భారత వైశ్య మండలి అధ్యక్షుడు ఎం.సి.నారాయణగుప్త మాట్లాడుతూ కనకదుర్గ పాఠశాల విద్యార్థులు విద్యతో పాటు ఆటపాటలలోను ప్రతిభ చూపడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సన్ టీవీ ఫేం చలన చిత్ర నిర్మాత, నటుడు మెర్క్యురీ సత్య, నటీమణి విదర్ష, జయశీల, డాక్టర్ సి.మోహనరెడ్డి ఉత్తమ ప్రతిభకనబరచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కేవీటీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కె.వి.తిరుపతయ్య పాఠశాలకు వాటర్ ప్యూర్‌ఫైర్ పరికరాన్ని విరాళంగా అందచేస్తామని చెప్పారు. అదే విధంగా మెర్క్యురీ సత్య పాఠశాలలో మంచి మార్కులు సాధిం చిన విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేస్తామని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేఎల్వీ ప్రసాదరావు పట్నాయక్, ఫిజిక్స్ ఉపాధ్యాయురాలు ఎం.నిర్మల పదవీ విరమణ పొం దగా వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముందుగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు కేక పుట్టించాయి. -
కలలు కంటే సరిపోదు...
1920... సిడ్నీ క్రికెట్ గ్రౌండ్.. యాషెస్ టెస్టు మ్యాచ్.... 12 ఏళ్ల కుర్రాడు ఆ మ్యాచ్ చూస్తున్నాడు. మ్యాచ్ ముగిశాక అతడి తండ్రి వచ్చి ‘ఎలా ఉంది మ్యాచ్’ అని అడిగారు. ‘నాకేం సంతృప్తి లేదు. నేను ఆడితేనే నాకు తృప్తి’ అని ఆ బుడత జవాబిచ్చాడు. వెంటనే తండ్రి నవ్వారు... ‘కలలు కంటే సరిపోదు. కష్టపడాలి’ అని చెప్పారు. కట్ చేస్తే... ఆ కుర్రాడు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడు బ్రాడ్‌మన్. ఒక్కసారిగా బ్రాడ్‌మన్ గొప్ప క్రికెటర్ కాలేదు. 12 ఏళ్ల వయసులో అందరికంటే భిన్నంగా ప్రాక్టీస్ చేసేవారు. గోల్ఫ్ బంతిని వాటర్ ట్యాంక్‌కేసి కొట్టేవారు. అది తిరిగి వేగంగా వచ్చే క్రమంలో వివిధ రకాల షాట్లు ఆడేవారు. బౌలర్ సాయం లేకుండా, కోచ్ అండ లేకుండా తనకు తానే ప్రాక్టీస్ చేసేవారు. ఈ శిక్షణ తన కెరీర్లో చాలా ఉపయోగపడింది. తొలిసారి క్రికెట్ ఆడే అవకాశం మాత్రం బ్రాడ్‌మన్‌కు గమ్మత్తుగా వచ్చింది. 12 ఏళ్లప్పుడు తన అంకుల్ కెప్టెన్‌గా ఉన్న బోరల్ జట్టుకు బ్రాడ్‌మన్ స్కోరర్‌గా పనిచేశాడు. ఒక ఆటగాడు తక్కువ కావడంతో ఆ జట్టులోకి వచ్చాడు. అరంగేట్రంలోనే 37, 29 స్కోర్లతో నాటౌట్‌గా నిలిచాడు. తదనంతరం అదే జట్టులో ఉంటూ డబుల్, ట్రిపుల్ సెంచరీలతో విరుచుకుపడడంతో జాతీయ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 1928లో తొలిసారి ఆస్ట్రేలియా తరఫున ఆడాడు. బ్రాడ్‌మన్ ఆడినంత కాలం ఆసీస్ అజేయశక్తి. తన సంచలన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన ‘బాడీలైన్’ బౌలింగ్‌ను కూడా ఇంగ్లండ్ ఆచరణలోకి తెచ్చింది బ్రాడ్‌మన్ జోరును ఆపడానికే. 99.96 సగటుతో కెరీర్‌ను ముగించిన బ్రాడ్‌మన్ రికార్డును భవిష్యత్‌లోనూ ఎవరూ అందుకోలేరనడం అతిశయోక్తి కాదు.