కల నెరవేరింది | Anushka Shetty's Performance In Lingaa | Sakshi
Sakshi News home page

కల నెరవేరింది

Published Sat, Dec 13 2014 2:36 AM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

కల నెరవేరింది - Sakshi

కల నెరవేరింది

కన్న కలలు నెరవేరాలని ఎవరైనా ఆశిస్తారు. అనుకున్నవన్నీ జరగవన్నట్టు.. చేతిదాకా వచ్చిన అవకాశం అనూహ్యంగా జారిపోతుంది. మళ్లీ అలాంటి అవకాశం వరిస్తే ఆ ఆనందానుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే నటి అనుష్క ఉన్నారు. నేటి మేటి నటి ఈ బ్యూటీ. అయితే అనుష్కకు అంత సులభంగా ఈ స్థాయి దక్కలేదు. కోలీవుడ్ తొలి రోజుల్లో విజయం ముఖం చాటేసిందీమెకు. ఫలితం ఐరన్‌లెగ్ ముద్ర. అలాంటి నటి ఇప్పుడు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జోడీ కట్టే స్థాయికి చేరుకున్నారు.

ఇదే విషయాన్ని అనుష్క ప్రస్తావిస్తూ రజనీకాంత్ సరసన నటించిన తరువాత తన నటన జీవితం పరిపూర్ణం అయ్యిందన్నారు. తన సినీ జీవితాన్ని ఒక ప్రణాళిక ప్రకారం తీర్చిదిద్దుకోలేదని అందువలన కొంతకాలం పరిశ్రమలో స్థబ్దతగా ఉండిపోయానని అన్నారు. అదేవిధంగా ఇంతకుముందు ఒకసారి సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించే అవకాశాన్ని కోల్పోయానని, అలాంటిది లింగా చిత్రం ద్వారా అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ చిత్ర షూటింగ్ మొత్తం యూనిట్ అంతా రజనీకాంత్ అంటే అభిమానంగా ఉండేవారన్నారు. ఇక ఆయన వ్యక్తిత్వం గురించి తానిప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదన్నారు. రజనీ గొప్ప మానవతావాది అని అన్నారు. నేటికీ సెట్‌లో ఆయన ఎనర్జీ రిమార్కబుల్ అని పేర్కొన్నారు. లింగా ఒక చిత్రం మాత్రమే కాదని ఆ చిత్రంలో నటించడం ఒక గొప్ప అనుభవం అని అన్నారు. రజనీకాంత్ నుంచి నిర్మాత, దర్శకుడు, ఛాయాగ్రాహకుడు అంటూ లింగా యూనిట్‌తో పనిచేయడం గ్రేట్ జర్నీ అని పేర్కొన్నారు.

కెఎస్ రవికుమార్ లాంటి వేగంగా చిత్రాన్ని పూర్తిచేసే దర్శకుడు ఎవరినీ చూడలేదని అన్నారు. లింగా చిత్రంలోని మరో హీరోయిన్ సోనాక్షిసిన్హా గురించి అనుష్క మాట్లాడుతూ ఇది ఆమెకు దక్షిణాదిలో తొలి చిత్రం అన్నారు. అయినా తమ కుటుంబంలో ఒక భాగం అయిపోయారని, భవిష్యత్తులో ఆమెను మరిన్ని దక్షిణాది చిత్రాలలో చూస్తామని అన్నారు. ప్రస్తుతం అజిత్ సరసన నటిస్తున్న ఎన్నై అరిందాల్ చిత్ర షూటింగ్ కోసం చెన్నైలోనే ఉన్నానని, లింగా చిత్రాన్ని ఇక్కడ తన స్నేహితులతో కలసి ప్రేక్షకుల మధ్య థియేటర్‌లో చూడనున్నట్లు అనుష్క తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement