Iron Leg
-
లైంగిక వేధింపులపై ఆమె ఏమన్నారంటే..
కోలీవుడ్‌లో పాపులర్ నటి ప్రియాభవానీ శంకర్. టీవీ.యాంకర్‌గా పేరు తెచ్చుకుని ఆపై బుల్లితెరకు రంగప్రవేశం చేసి, ఆ తరువాత సినీ కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే తొలి చిత్రం మేయాదమాన్ తరువాత ఆశించిన విజయాలు మాత్రం ఈమెను వరించడం లేదని, దీంతో అమ్మడిపై ఐరన్ లెగ్ ముద్ర వేయడానికి చిత్ర పరిశ్రమలో ఒక వర్గం రెడీగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ప్రియా భవానీశంకర్ నటిస్తున్న చిత్రాల్లో కమలహాసన్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ఇండియన్ 2, ఎస్జే.సూర్య సరసన నటిస్తున్న బొమ్మై చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు తనకు సక్సెస్‌లు రావడం లేదన్న కొరతను తీరుస్తాయనే నమ్మకాన్ని ఈమె ఒక ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినీరంగంలో జరుగుతున్న లైంగిక వేధింపులపై స్పందిస్తూ ఇలాంటివి సినిమా రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆ రంగం, ఈ రంగం అని చూడకుండా అన్ని రంగాల్లోనూ మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని అలాంటి వారు ధైర్యంగా బయటకు చెప్పాలన్నారు. అంతకంటే ముఖ్యం వారు చెప్పింది సమాజం వినాలన్నారు. అదే విధంగా వారిని తక్కువగా చూడడం మానుకోవాలన్నారు. తమకు జరిగిన అక్రమాలపై స్పందించాలి గానీ, ఇప్పుడు చెబుతున్నారేమిటి, ముందే చెప్పొచ్చుగా అంటూ విమర్శంచకూడదన్నారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గొంతు విప్పాలన్నారు. కాగా బొమ్మై చిత్రం ఈ నెల 16న తెరపైకి రానుంది. -
కుప్పంలో ఐరన్ లెగ్
-
పూజా హెగ్డే ఐరన్ లెగ్ సెంటిమెంట్!
కల్పితాల కథ సినిమా. ఊహలకు ప్రతి రూపమే చిత్రం. అందుకే ఇది అందరికీ అందమైన రంగుల కల అయ్యింది. ఈ రంగుల ప్రపంచంలో స్థానం కోసం అందరూ శక్తి వంచన లేకుండా శ్రమిస్తారు. అయితే ఎవరు ఎప్పుడు అందలం ఎక్కుతారో ఊహాతీతమే. ఇక్కడ పైకి వస్తారు అనుకున్న వాళ్లు కనుమరుగవుతారు.. సినిమాకు పనికి రారు అని అవమానాలను ఎదుర్కొన్న వారు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. ఇది సినీ జగం. ఇందుకు చిన్న ఉదాహరణ నటి పూజా హెగ్డే. ఈమె నటిగా దశాబ్దం పూర్తి చేసుకుంది. తమిళం, తెలుగు, హిందీ చిత్రాలతో ఇండియన్ స్టార్ హీరోయిన్గా వెలిగిపోతోంది. అయితే తనకు ఇవి అంత సులభంగా రాలేదంటుందీ అమ్మడు. అపజయాలకు కుంగిపోకుండా, మనస్తాపానికి గురి కాకుండా మనో ధైర్యంతోనే ముందుకు అడుగులు వేయడంతోనే ఈ స్థాయి సాధ్యమైందని పేర్కొంది. 2012 ముఖముడి అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది నటి పూజా హెగ్డే. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఆ తరువాత 2014లో ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్లో ప్రవేశించింది. అక్కడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత హిందీలో మొహంజదారో చిత్రంలో నటించింది. దీంతో బాలీవుడ్ ఆశలు అడియాశలే అ య్యాయి. అయినా మొక్కవోని ఆత్మస్థైర్యంతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకే నడిచింది. అందుకే ఇప్పుడు అగ్ర నటిగా వెలుగుతుంది. ఈ విషయాన్ని ఒక కార్యక్రమంలో ఆమె తెలిపింది. పై స్థాయికి చేరుకోవడానికి చాలా శ్రమించానని చెప్పింది. అయితే ఇప్పుడు తాను ఒక ప్రముఖ నటినని భావించలేదంది. స్టార్ నటిననే అంతస్తును తలకెక్కించుకోలేదని, ఇప్పటికీ నేల మీదే నిలబడ్డానని చెప్పింది. అయితే ఆదిలో తనను ఐరన్ లెగ్ అన్న వాళ్లే ఇప్పుడు నంబర్ వన్ హీరోయిన్ అంటున్నారని పేర్కొంది. సినిమా రంగంలో నంబర్ వన్ అనే అంతస్తు శాశ్వతం కాదన్న విషయం తనకు తెలుసంది. అందుకే దాని గురించి అస్సలు పట్టించుకోలేదని చెప్పింది. ఇక్కడ సరిగా నటించకపోతే ఎంతటి వారినైనా ప్రేక్షకులు ఇంటికి పంపించేస్తారని, వారికి నచ్చితే కొత్త వారిని కూడా ఉన్నత స్థాయిలో కూర్చొబెడుతారని నటి పూజా హెగ్డే పేర్కొంది. -
నన్ను ఐరన్ లెగ్ అన్నారు.. అవమానాలు ఎదుర్కొన్నా: స్టార్ హీరోయిన్
Keerthi Suresh Reveals About Her Struggles At Her Movie Career Early Days: టాలీవుడ్, కోలీవుడ్‌ల్లో టాప్ హీరోయిన్లలో కీర్తి సురేష్ కూడా ఒకరు. ప్రస్తుతం స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా మారిపోయింది. అయితే కెరీర్ ఆరంభంలో తాను కూడా అవమానాలు ఎదుర్కొన్నాని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ఈ విషయాలను ప్రస్తావించింది. 'హీరోయిన్గా నా కెరీర్ మలయాళ చిత్ర పరిశ్రమతో మొదలైంది. నా ఫస్ట్ మూవీ సెట్స్ మీదకి వెళ్లిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. రెండవ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. దీంతో నాది ఐరన్ లెగ్ అని ప్రచారం చేశారు. తర్వాత కొన్ని అవకాశాలు కూడా చేజారాయి. ఇలా అవమానాలు ఎదుర్కొన్నా. అయినా ఆ విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళ్లా. నా పనితీరే నాకు విజయాన్ని అందించింది. సక్సెస్ మాత్రమే అవమానాలను ప్రశంసలుగా మార్చగలదని నేను భావించాను' అంటూ చెప్పుకొచ్చింది.ఇటీవలె గుడ్‌లక్ సఖితో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో మహేశ్‌బాబుతో సర్కారు వారి పాట, చిరంజీవితో భోళా శంకర్ చిత్రాలు చేస్తుంది. -
ఐరన్‌లెగ్ అనేది నెగటివ్ అయింది
గునుపూడి విశ్వనాథ శాస్త్రి... ఈ పేరంటే ఏ కొద్ది మందికో తప్ప బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. అదే ఐరన్‌లెగ్ శాస్త్రి అంటే తెలిసిపోతుంది. తనదైన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఐరన్‌లెగ్ శాస్త్రి 14వ వర్ధంతి నేడు. 2006లో ఆయన మరణించారు. తండ్రి వర్ధంతి సందర్భంగా గునుపూడి సాయిదుర్గా ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘మా నాన్నగారు 7వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత పౌరోహిత్యం చేపట్టారు. హైదరాబాద్ వచ్చాక సినిమా కార్యక్రమాలకు పౌరోహిత్యం చేసేవారు. అలా ఏర్పడిన పరిచయంతో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణగారు ‘ప్రేమఖైదీ’లో నాన్నకి అవకాశమిచ్చారు. అయితే గునుపూడి విశ్వనాథశాస్త్రి పేరు స్క్రీన్ నేమ్‌గా బాగోదని ఐరన్‌లెగ్ శాస్త్రి అని పెట్టారు. ‘ఏవండీ ఆవిడ వచ్చింది, జంబలకిడి పంబ’ సినిమాలు నాన్నకి మంచి బ్రేక్ ఇచ్చాయి. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. అయితే ఐరన్‌లెగ్ శాస్త్రి పేరు పాజిటివ్‌గా కంటే నెగటివ్‌గా క్లిక్ అయింది. నిజంగానే తను ఐరన్‌లెగ్ అని భావించారేమో పౌరోహిత్యానికి పిలవడం మానేశారు. 42ఏళ్లకే నాన్న మాకు దూరమయ్యారు. ఎంబీఏ చేసిన నేను సీఏ ఫైనలియర్ చేస్తున్నాను. నటన మీద ఆసక్తితో ‘ఐరన్‌లెగ్’, ‘ఐరన్‌లెగ్ 2.0’ వంటి షార్ట్ ఫిల్మ్స్ చేశా. ‘జంబలకిడి పంబ’లో నటించా. సంపూర్ణేశ్‌బాబు ‘రాధాకృష్ణ’లో మంచి పాత్ర ఇప్పించారు. మరో సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇంకో సినిమాలో నటిస్తున్నా’’ అన్నారు. -
ఐరన్ లెగ్ ముద్ర వేశారు
‘‘కెరీర్ ప్రారంభంలో నేను చేసిన రెండు మూడు సినిమాలు సరిగ్గా ఆడలేదు. దాంతో నా మీద ‘ఐరన్ లెగ్’ అని ముద్ర వేశారు’’ అని తనకు జరిగిన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు తాప్సీ. యాక్టర్‌గా మీ ప్రయాణంలో మీకు ఎదురైన చేదు అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్నకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ – ‘‘సౌత్‌లో నాకు ఎదురైన చేదు అనుభవం ఏంటంటే.. నన్ను ఐరన్ లెగ్ అనడం. సినిమాకు కథ రాసింది నేను కాదు, తీసింది నేను కాదు. ఆ సినిమాల్లో మూడు పాటలు, నాలుగు సీన్లలో ఉన్నాను. పెద్ద నిర్మాతలు, పెద్ద దర్శకుడు అనే కారణంతో ఆ సినిమాలు చేశాను. కేవలం ఆ కారణాలతో సినిమా చేయడం నా తప్పే. అయితే ఆ సినిమాలు ఆడకపోవడాన్ని నా మీద తోసేయడం కరెక్ట్ కాదనిపించింది. అలాగే బాలీవుడ్లో ఓ అవార్డు షోకు వెళ్లాను. అక్కడ నన్ను ఆరో వరసలో కూర్చోబెట్టారు. ముందు వరసలో కూర్చునే అంత అర్హత నాకు లేదనుకున్నారేమో? ‘చష్మె బద్దూర్’ సినిమా క్యాస్టింగ్ డైరెక్టర్ అయితే ‘సినిమాలో నువ్వే వరస్ట్ చాయిస్ అని తిట్టారు’’ అని షేర్ చేసుకున్నారు. -
అందుకే నాది గోల్డెన్ లెగ్: ఎమ్మెల్యే రోజా
సాక్షి, అమరావతి: తిరుగులేని మెజారిటీతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని వైఎస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. జగన్‌ను ప్రజలు ఎంత అభిమానిస్తున్నారనే దానికి తాజా ఎన్నికల ఫలితాలే తిరుగులేని నిదర్శనమన్నారు. వైఎస్సార్ఎల్పీ సమావేశానికి శనివారం ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై బాధ్యత కూడా చాలా పెరిగిందన్నారు. మొదటి సంవత్సరంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని జగన్ చెప్పారని.. ఇప్పటివరకు ఏ సీఎం కూడా ఇలా చెప్పలేదని గుర్తుచేశారు. తన తండ్రిలా రాష్ట్ర ప్రజలను ఆయన అభిమానించారని, ప్రజల కష్టాలు దూరం చేయాలనుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సిద్ధమయ్యారన్నారు. ఇతర పార్టీల మద్దతు తీసుకోకుండా చంద్రబాబు పోటీ చేస్తే ఎలావుంటుందో ఈ ఎన్నికల్లో తేలిపోయిందన్నారు. ఆయన అనుభవం ఎంత శాతం ఉందో చంద్రబాబు వెనుకున్న ఎమ్మెల్యేలను చూస్తే తెలుస్తుందన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చే సమయంలో తాను ఎమ్మెల్యేగా ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. తన మీద ఐరన్ లెగ్ ముద్ర వేసి వైఎస్ జగన్ నుంచి తనను దూరం చేయడానికి టీడీపీ నాయకులు చాలా కుట్రలు చేశారని ఆరోపించారు. తిరుగులేని ఆధిక్యంతో జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని, తనది గోల్డెన్ లెగ్ అని టీడీపీ నాయకులు ఇప్పటికైనా తెలుసుకోవాలని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. -
ఇప్పటివరకు ఏ సీఎం కూడా ఇలా చెప్పలేదు
-
కుంతియా వల్లే కాంగ్రెస్ సర్వనాశనం
సాక్షి, హైదరాబాద్: గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్‌సింగ్ లాంటి నాయకులు ఇన్‌చార్జీలుగా ఉండాల్సిన రాష్ట్రానికి ఆర్.సి.కుంతియా అనే ఐరన్‌లెగ్‌ను ఇన్చార్జిగా నియమించినందువల్లే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమైందని కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు. ‘ఉత్తమ్, కుంతియాకు హఠావో... కాంగ్రెస్‌కు బచావో’అని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారని పేర్కొన్నారు. సోమవారం ఇక్కడి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపై సమీక్ష ఎవరు చేయమన్నారని ప్రశ్నించినందుకే తనపై దాడికి ఉసిగొల్పారని, తనపైకి వచ్చిన వారికి గట్టిగానే సమాధానం చెప్పి తాను సమావేశం నుంచి బయటకు వచ్చానన్నారు. తనను సస్పెండ్ చేశామని టీపీసీసీ చెబుతోందని, ఏఐసీసీ సభ్యుడినయిన తనను సస్పెండ్ చేసే అధికారం వీళ్లకెక్కడిదని ఆయన ప్రశ్నించారు. తనను సస్పెండ్ చేయాలని అధిష్టానం చెబితే దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ ఎక్కడ ఉందని నిలదీశారు. గత ఎన్నికల్లో తనను ఓడించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కుట్ర చేశారని, గెలిస్తే సీఎం పదవికి అడ్డం వస్తాననే ఉద్దేశంతో తనను ఓడించాలని పలువురికి ఫోన్లు చేసి పురమాయించారని ఆరోపించారు. తనతోపాటు చాలామందిని ఓడించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. టీఆర్ఎస్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని, టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ వివరాలన్నింటితో త్వరలోనే ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. బడా ఐరన్‌లెగ్, చోటా ఐరన్‌లెగ్ కలసి రాష్ట్రంలో పార్టీని తమిళనాడు తరహాలో నాశనం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. వారి ఆటలు సాగనివ్వబోనని, వారి భరతం పడతానని, కాంగ్రెస్‌పార్టీ పక్షాన పోరాడుతానని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ అన్నట్టు నిజంగా వీళ్లు ఇడియట్లేనని, సిగ్గూశరం లేనోళ్లని, మొత్తం తెలంగాణ కాంగ్రెస్‌పార్టీని ప్రక్షాళన చేయాలని అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినా, మండలిలో పార్టీ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేసినా ఈ నాయకులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇంకా ఈయనే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతూ పదవిని పట్టుకుని వేలాడుతున్నారని, వీళ్ల మొహాలు చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయలేదని, కేసీఆర్ మొహం నచ్చినందుకే ఆయనకు ఓట్లేశారని సర్వే అన్నారు. రాష్ట్రంలో కొత్త వారికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అప్పగించాలని డిమాండ్ చేశారు. అధిష్టానం ఆశీర్వాదం తనకుందని, తనకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
‘రేవంత్‌ది ఐరన్ లెగ్’
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి పార్టీలో కొనసాగడం వల్లే టీడీపీ ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఆయనది ఐరన్ లెగ్ అని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయా పార్టీల ఎమ్మెల్యేలు వలస వెళ్లారని ఆయన గుర్తు చే శారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలసి గురువారం విలేకరులతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబు, లోకేశ్, రేవంత్ ఎంత తిరిగినా ఫలితం లేకుండా పోయిందని, వారికి ఒక్క సీటు మాత్రమే వచ్చిందన్నారు. తెలంగాణలో టీడీపీ బతికి బట్టకట్టే పరిస్థితి లేదని, హైటెక్ సిటీ కట్టింది తానే అని చంద్ర బాబు గొప్పలు చెప్పుకున్నా, ఆ డివిజన్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే గెలిచిందన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని రేవంత్‌ను హెచ్చరించారు. -
కల నెరవేరింది
కన్న కలలు నెరవేరాలని ఎవరైనా ఆశిస్తారు. అనుకున్నవన్నీ జరగవన్నట్టు.. చేతిదాకా వచ్చిన అవకాశం అనూహ్యంగా జారిపోతుంది. మళ్లీ అలాంటి అవకాశం వరిస్తే ఆ ఆనందానుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే నటి అనుష్క ఉన్నారు. నేటి మేటి నటి ఈ బ్యూటీ. అయితే అనుష్కకు అంత సులభంగా ఈ స్థాయి దక్కలేదు. కోలీవుడ్ తొలి రోజుల్లో విజయం ముఖం చాటేసిందీమెకు. ఫలితం ఐరన్‌లెగ్ ముద్ర. అలాంటి నటి ఇప్పుడు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జోడీ కట్టే స్థాయికి చేరుకున్నారు. ఇదే విషయాన్ని అనుష్క ప్రస్తావిస్తూ రజనీకాంత్ సరసన నటించిన తరువాత తన నటన జీవితం పరిపూర్ణం అయ్యిందన్నారు. తన సినీ జీవితాన్ని ఒక ప్రణాళిక ప్రకారం తీర్చిదిద్దుకోలేదని అందువలన కొంతకాలం పరిశ్రమలో స్థబ్దతగా ఉండిపోయానని అన్నారు. అదేవిధంగా ఇంతకుముందు ఒకసారి సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించే అవకాశాన్ని కోల్పోయానని, అలాంటిది లింగా చిత్రం ద్వారా అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ చిత్ర షూటింగ్ మొత్తం యూనిట్ అంతా రజనీకాంత్ అంటే అభిమానంగా ఉండేవారన్నారు. ఇక ఆయన వ్యక్తిత్వం గురించి తానిప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదన్నారు. రజనీ గొప్ప మానవతావాది అని అన్నారు. నేటికీ సెట్లో ఆయన ఎనర్జీ రిమార్కబుల్ అని పేర్కొన్నారు. లింగా ఒక చిత్రం మాత్రమే కాదని ఆ చిత్రంలో నటించడం ఒక గొప్ప అనుభవం అని అన్నారు. రజనీకాంత్ నుంచి నిర్మాత, దర్శకుడు, ఛాయాగ్రాహకుడు అంటూ లింగా యూనిట్‌తో పనిచేయడం గ్రేట్ జర్నీ అని పేర్కొన్నారు. కెఎస్ రవికుమార్ లాంటి వేగంగా చిత్రాన్ని పూర్తిచేసే దర్శకుడు ఎవరినీ చూడలేదని అన్నారు. లింగా చిత్రంలోని మరో హీరోయిన్ సోనాక్షిసిన్హా గురించి అనుష్క మాట్లాడుతూ ఇది ఆమెకు దక్షిణాదిలో తొలి చిత్రం అన్నారు. అయినా తమ కుటుంబంలో ఒక భాగం అయిపోయారని, భవిష్యత్తులో ఆమెను మరిన్ని దక్షిణాది చిత్రాలలో చూస్తామని అన్నారు. ప్రస్తుతం అజిత్ సరసన నటిస్తున్న ఎన్నై అరిందాల్ చిత్ర షూటింగ్ కోసం చెన్నైలోనే ఉన్నానని, లింగా చిత్రాన్ని ఇక్కడ తన స్నేహితులతో కలసి ప్రేక్షకుల మధ్య థియేటర్లో చూడనున్నట్లు అనుష్క తెలిపారు. -
నా దేహమే దేవాలయం
నా దేహం దేవాలయం లాంటిది. ఎవరి కోసమో నేను మారను అంటున్నారు నటి శ్రుతిహాసన్. ఇంతకు ఈ బ్యూటీ దేని గురించి మాట్లాడుతున్నారు? ఏమిటా కథా చూద్దామా? ప్రస్తుతం హాట్ హీరోయిన్ అంటే ఈ ముద్దుగుమ్మనే. ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. అయితే శ్రుతిహాసన్ రూటేవేరు. మొదట పరభాషల్లో విజయకేతనం ఎగురవేసి ఆ తర్వాత సొంత గడ్డపై విజయం సాధించారు. అదే విధంగా కోలీవుడ్‌లో ఐరన్ లెగ్ ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు గోల్డెన్ లెగ్ అనిపించుకునేంతగా ఎదిగారు. అదే విధంగా తాను ఒక భాషకు పరిమితమయిన నటిని కాదు భారతీయ నటినని గర్వంగా చెప్పుకుంటున్న శ్రుతి, తాను చెప్పాలనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా వెల్లడిస్తారు. గ్లామర్ అంటే అర్థం ఏమిటని ప్రశ్నించే ఈ జాణ అందాల ఆరబోత విషయంలో విమర్శలను మూట గట్టుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారంలో శ్రుతిహాసన్ వివరణ ఏమిటో ఆమె మాటల్లోనే చూద్దాం.... నా దేహం దేవాలయం లాంటిది. దాన్ని ఎవరు ఎలా చూసినా నాకు అభ్యంతరం లేదు. అందాల ఆరబోత అంటూ కొందరు గగ్గోలు పెడుతున్న విషయం నాకు తెలుసు. అయితే కొన్ని చిత్రాలకు గ్లామరనేది చాలా అవసరం. పాత్రల స్వభావాన్ని బట్టి గ్లామర్ మోతాదు ఉంటుంది. దాన్ని కొందరు కోరుకుంటున్నారు. మరికొందరు ఇష్టపడటం లేదు. ఏదేమయినా ఎవరి కోసమో తాను తన వైఖరిని, నైజాన్ని మార్చుకోవలసిన అవసరం లేదు అని తేల్చేశారు. -
మహాపురుషుడై ఉండాలి
మహా పురుషుడిలాంటి మగాడు కావాలని కోరుకుంటున్నారు శ్రుతిహాసన్. అపజయాలు, విజయానికి నాంది అంటారు. నటి శ్రుతిహాసన్ విషయంలోనూ అది నిజమైంది. ఈ బ్యూటీ ఒకటి కాదు, రెండు కాదు (తమిళం, తెలుగు, హిందీ) మూడు భాషల్లో నటించినా తొలి చిత్రాలు నిరాశపరచాయి. అలాంటి నటికి ట్రేడ్ ఐరన్ లెగ్ ముద్ర వేయకుండా ఉంటుందా? శ్రుతి అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. అయితే అలాంటి ప్లాప్‌ల నుంచి దశల వారీగా హిట్స్‌తో దూసుకుపోతోంది. తొలుత తెలుగులో సక్సెస్‌ను అందుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా పూజై చిత్రంలో తమిళంలో ఐరన్‌లెగ్ ముద్ర నుంచి బయటపడ్డారు. త్వరలో బాలీవుడ్‌లోనూ విజయబావుటా ఎగురవేయడానికి సిద్ధం అవుతున్న ఈ బబ్లీగర్ల్తో చిన్న ఇంటర్వ్యూ ఇంతకుముందు తమిళ చిత్రాలపై సీత కన్నేశారనే ప్రచారానికి మీ సమాధానం? మొదట నేను తమిళ నటిననే ప్రస్తావించకండి. నేను భారతీయ నటిని. నాన్న దక్షిణ భారతానికి చెందిన వారు. అమ్మ ఉత్తర భారతానికి చెందినవారు. ఇక ఇల్లు నిజమైన భారత్ విలానే. అందుకే నేను భారతీయ నటినంటున్నాను. ఏ భాషలో మంచి అవకాశం లభిస్తే ఆ భాషలో నటిస్తున్నాను. అందువలన ఏడాదిలో ఎన్ని తమిళ చిత్రాలు చేయాలి, ఎన్ని తెలుగు, హిందీ చిత్రాలు అంగీకరించాలన్న డైరీ నా వద్ద లేదు. మీ నాన్న వైవిధ్యభరిత చిత్రాలకు ప్రాధాన్యత నిస్తుంటే మీరు కమర్షియల్ బాటపడుతున్నారేమిటి? నేను నటించిన 3 చిత్రం వైవిధ్యభరిత కథా చిత్రం కాదా? నా వరకు నేను అన్ని రకాల పాత్రలు పోషించాలనుకుంటున్నాను. పూజై చిత్రం కమర్షియల్ ఫార్మెట్లో వున్నా ఆ చిత్రం లో నా పాత్రను దర్శకుడు హరి చక్కగా తీర్చిదిద్దారు. మరో విషయం ఏమిటంటే మా నాన్నతో నన్ను పోల్చకండి. ఆయన స్థాయి వేరు. నా స్థాయి వేరు. మీరు నాన్న కూతురా? అమ్మ కూతురా? వారిద్దరూ లేకపోతే నేను లేను. ఈ పట్టికలో నా చెల్లెల్ని కూడా చేర్చుకోండి. ఈ ముగ్గురే నా లోకం. వీరు లేకపోతే నేను లేను. మీ చెల్లెలు అక్షరకు నటనకు సంబంధించిన టిప్స్ ఇస్తారా? నిజం చెప్పాలంటే అక్షర చాలా తెలివైన అమ్మాయి. నేను టిప్స్ ఇచ్చేంత చిన్న పిల్ల ఏమి కాదు. తనే చాలా విషయాల్లో నాకు టిప్స్ చెబుతుంటుంది. బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో గ్లామరస్ పాత్రల్లో రెచ్చిపోతున్నారనే ప్రచారం ఉంది కదా? గ్లామర్‌కు హద్దు లేమిటన్న విషయం నాకు తెలియదు. పాత్ర స్వభావాన్ని బట్టి నటిస్తుంటాను. నచ్చితే చూడండి. లేకపోతే చూడకండి. మీ నాన్న కమలహాసన్ పక్కా నాస్తికుడు. మీరేమో గుళ్లు, గోపురాలు తిరుగుతూ ఆస్తికురాలనిపించుకుంటున్నారే? నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువే. కుమారస్వామి నా ఇష్టదైవం. నా తండ్రి ఇచ్చిన స్వతంత్రమే నన్ను ఆస్తికురాలిని చేశాయి. పెళ్లెప్పుడు చేసుకుంటారు? కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? అందరమ్మాయిలు తన మగడు మహాపురుషుడులా ఉం డాలని కోరుకుంటారు. నేను అంతే. మంచి మనసు, మంచి చావ కలిగిన వాడై ఉండాలి. ఇక ఇంటిలో నాకు పెళ్లి కొడుకును చూస్తారా? అన్న విషయం తెలియదు. ప్రేమ వివాహమే జరుగుతుందనుకుంటున్నాను. -
జోరు తగ్గిన టాలీవుడ్ లక్కీ హీరోయిన్
-
అన్ని వర్గాలనూ మోసగించారు
* టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా *డ్వాక్రా రుణాలు అణాపైసలతో సహా రద్దు చేస్తామన్నారు * ఇప్పుడు మాట మార్చి సంఘానికి రూ. లక్ష సాయం అంటున్నారు * అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచుతామని ఇచ్చిన హామీ ఏమైంది? * నేతన్నల రుణాలను ఎప్పుడు మాఫీ చేస్తారు? * బాబు అన్ని పథకాలకూ ‘షరతులు వర్తిస్తాయి’ అంటున్నారని ఎద్దేవా * ‘ఐరెన్‌లెగ్’ అని రోజాపై వ్యక్తిగత విమర్శలు చేసిన బొజ్జల * బొజ్జలకంటే పెద్ద ఐరన్‌లెగ్ ఎవరూ లేరని ధీటుగా బదులిచ్చిన రోజా * వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంజాద్‌బాషా మైక్ కట్ చేసిన స్పీకర్ * సభ్యునికి 5 నిమిషాల సమయమివ్వాలన్న జగన్, స్పందించని సభాపతి * ఎస్సీ ఎస్టీల నిధులను దారి మళ్లించబోమన్న మంత్రి రావెల * పద్దులకు ఆమోదం అనంతరం సోమవారానికి సభ వాయిదా సాక్షి, హైదరాబాద్: రైతులు, మహిళలు, చేనేత కార్మికులు, మైనార్టీలు.. సమాజంలోని అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయమాటలు చెబుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మె ల్యే రోజా ధ్వజమెత్తారు. పద్దుల మీద గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆమె ప్రభు త్వ వైఫల్యాలను ఎండగట్టారు. 2014ను మహి ళా నామ సంవత్సరమని చెబుతున్న టీడీపీ.. మహిళలకు అన్యాయం చేస్తోందని విమర్శిం చారు. రూ. 14,204 కోట్ల డ్వాక్రా రుణాలను అణాపైసలతో సహా రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీలు గుప్పిం చిన టీడీపీ నేతలు.. ఇప్పుడు మాట మార్చారని, సంఘాల బలోపేతానికి రూ.లక్ష సాయ మందిస్తామని కొత్త పాట అందుకున్నారని ధ్వజమెత్తారు. మీకు ఓట్లేసి గెలిపించిన మహిళలు తిరగపడుతున్నారని చెప్పారు. సీఎం సొంత నియోజకవర్గం కుప్పం లోని గుడిపల్లె మండలం శెట్టిపల్లెలో మహిళలు ఐకేపీ అధికారుల మీద తిరగబడటం ఇందుకు ఉదాహరణని తెలిపారు. డ్వాక్రా సంఘాలను కేంద్రం ప్రవేశపెడితే ఆ ఘనత తనదేనని చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అప్పులు, వడ్డీల్లో కూరుకొని అల్లాడుతున్న మహిళలకు ఏం జవాబు చెబుతారని ప్రభుత్వా న్ని నిలదీశారు. శ్రీనిధి బ్యాంక్ ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలిస్తామని జీవో 389 ఇచ్చారని, ఇప్పుడు అసలు, వడ్డీ కలిపి చెల్లించాలం టూ శ్రీ నిధి ఎండీ జూలై 1న నోటీసులు ఇచ్చారని తెలి పారు. బెల్ట్ షాపులు మూసేయించామని ఘనం గా ప్రభుత్వం చెబుతున్న మాటల్లో వాస్తవం లే దన్నారు. ఫోన్ చేస్తే మద్యం బాటిళ్లు గ్రామాల్లోకి వస్తున్నాయని, టీడీపీ కార్యకర్తలకు ఇది ఉపాధి హామీగా మారిందని అన్నారు. అంగన్వాడీల జీతాల పెంపు ఎప్పుడు? అంగన్వాడీ, ఆశా వర్కర్స్ జీతాలు పెంచుతామని ఎన్నికల్లో టీడీపీ హామీ ఇచ్చిందని, బడ్జెట్లో ఆ ఊసే లేదని రోజా విమర్శించారు. గతంలో వైఎస్సార్ రెండుసార్లు జీతాలు పెంచారని, మళ్లీ పెంచుతామని 2009 ఎన్నికల్లో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన మరణం తర్వా త అంగన్వాడీ, ఆశా వర్కర్స్ గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. వారి జీతాలను రూ.10 వేలు చేయాలన్నారు. వికలాంగుల పింఛన్‌ను వైఎస్ ఏడు రెట్లు పెంచారని రోజా గుర్తు చేశారు. చంద్రబాబు కేవలం లక్ష మందికి రూ.75 చొప్పున పింఛన్ ఇస్తే, వైఎస్ 8.5 లక్షల మందికి రూ. 500 పింఛన్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. సంక్షేమ పథకాలు ప్రజలను సోమరిపోతులను చేస్తాయని, వ్యవసాయం దండగని చంద్రబాబు చెప్పిన విషయాన్నీ గుర్తు చేశారు. చేనేత రుణాలు రద్దు చేస్తామని చెప్పిన టీడీపీ, ఇప్పుడు చేనేత కార్మికుల గురించి ప్రభుత్వం మాట్లాడటమే లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతేమిటని ప్రశ్నిస్తే, బడ్జెట్లో నిధులెందుకు కేటాయించలేదని నిల దీస్తే.. టీడీపీ లేనిపోని విమర్శలకు దిగుతోందని దుయ్యబట్టారు. గతంలో ఏదో జరిగిందని విమర్శలు చేయకుండా, ఇప్పుడు ఏం చేస్తారో సమాధానం చెప్పాలన్నారు. మహిళలు, మైనార్టీలు, రైతులు, చేనేత కార్మికులు, బీసీలకు ఏం జవా బు చెబుతారని నిలదీశారు. ‘‘మనం రోడ్ల మీద హోర్డింగ్స్ చూస్తుంటాం. జీరో శాతం వడ్డీ అని రాస్తారు. కానీ కింద చిన్న చుక్క పెట్టి ‘కండిషన్స్ అప్లయ్’ అని కనిపించీ కనిపించకుండా రాస్తారు. అలాగే వేలుమీద ఓటు సిరా చుక్క పడిన తర్వాత రుణమాఫీకి ‘కండిషన్స్ అప్లయ్’ అంటున్నారు చంద్రబాబు’’ అంటూ ఎద్దేవా చేశారు. మాయ మాటలు చెప్పి ఓట్లే యించుకున్న టీడీపీ అధికారంలోకి వచ్చాక మాటమారుస్తోందని, ప్రజల్ని మభ్య పెడుతుందని ఆమె ధ్వజమెత్తారు. బీసీ ముసుగేసుకొస్తే నమ్మరు: కాలువ బీసీల గురించి రోజా మాట్లాడటం పట్ల చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీ ముసుగు వేసుకొచ్చి మాట్లాడితే నమ్మే పరిస్థితుల్లో బీసీలు లేరన్నారు. బీసీ కుటుంబ కోడలుగా తాను మాట్లాడుతున్నానని రోజా ధీటుగా సమాధానం ఇచ్చారు. ఐరన్‌లెగ్ అని ఎగతాళి చేసిన టీడీపీ రోజా మాట్లాడుతున్నప్పుడు.. ‘ఐరెన్ లెగ్’ అంటూ టీడీపీ సభ్యులు వ్యాఖ్యానించడం వినిపించింది. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జోక్యం చేసుకొని.. రోజా టీడీపీలో ఉన్నప్పుడు ఇచ్చిన పత్రికా ప్రకటన చదివి వినిపించారు. ఆయన కూడా ‘ఐరెన్ లెగ్’ అని ఎగతాళిగా మాట్లాడారు. దానిని రోజా తిప్పుకొడుతూ ‘మంత్రి బొజ్జలే ఐరెన్ లెగ్. ఆయనతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడే చంద్రబాబు కారు కింద బాంబు పేలింది. ఆయన కంటే పెద్ద ఐరెన్ లెగ్ ఎవరు?’ అని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకున్న వైఎస్: జగన్ వ్యవసాయాన్ని దండగ అని చంద్రబాబు ఎక్కడా అనలేదని మంత్రి పల్లె రఘునాథరెడ్డి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంలో ప్రతిపక్ష నేత జగన్ జోక్యం చేసుకొని.. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చిన తర్వాత ఒక్కో కుటుంబానికి రూ. 1.5 లక్షల సహాయం అందించారని గుర్తు చేశారు. వైఎస్ హయాంలోనే గిరిజనులకు ఇళ్లు: రాజన్నదొర వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బలహీన వర్గాలకు 48 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే అందులో 60 శాతం ఎస్సీ, ఎస్టీలవేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర చెప్పారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి బిల్లులు ఇవ్వడం లేదన్నారు. అక్రమాలు ఉంటే విచారణ జరిపి కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, కానీ పేదలకు ఇచ్చే ఇల్లు-బిల్లు ఆపొద్దని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీలకు భూములిచ్చిన ఘనత వైఎస్‌కే చెందుతుందన్నారు. సంక్షేమ పథకాల చిరునామా వైఎస్: ఉప్పులేటి సంక్షేమ పథకాలకు మానవతా దృక్పథంతో అర్థం చేసుకున్న నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని విపక్ష ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కొనియాడారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి ప్రణాళికా వ్యయం కేటాయించలేదని విమర్శించారు. నిధుల్లేకుండా పథకాలు ఎలా అమలు చేస్తారో చెప్పాలని నిలదీశారు. అంజాద్ బాషా మైక్ కట్ చేసిన స్పీకర్ మైనార్టీ సంక్షేమం గురించి క్లారిఫికేషన్ అడగడానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషాకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. ‘ముస్లింలకు వైఎస్ 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. తర్వాత అనివార్య కారణాలవల్ల 4 శాతానికి తగ్గించారు..’ అని మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారు. ప్రసంగానికి అవకాశం లేదని స్పీకర్ చెప్పారు. విపక్ష నేత జగన్ జోక్యం చేసుకొని మైనార్టీ నాయకుడికి ఐదు నిమిషాల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా స్పీకర్ సానుకూలంగా స్పందించలేదు. టీడీపీ హయాం బీసీలకు స్వర్ణయుగం బీసీలకు టీడీపీ హయాం స్వర్ణయుగమని, బడుగు బలహీన వర్గాలకు ఎన్టీఆర్ పెద్దపీట వేశారని టీడీపీ సభ్యుడు కె.రవికుమార్ తెలిపారు. బీసీలకు అన్యాయం చేశారంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ను విమర్శించారు. ఆయన చేసిన విమర్శలకు స్పందించడానికి, క్లారిఫికేషన్ తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలన్న విపక్ష సభ్యుల వినతిని స్పీకర్ పట్టించుకోలేదు. విపక్ష సభ్యులు సభకు అంతరాయం కలిగిస్తే.. వైఎస్సార్సీపీకి కేటాయించిన సమయంలో కోత విధిస్తామని హెచ్చరించారు. నిధులను దారిమళ్లించం: మంత్రి రావెల ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కేటాయించిన నిధులను గతంలో మాదిరి దారి మళ్లించకుండా ఖర్చు చేస్తామని పద్దులపై జరిగిన చర్చకు జవాబిస్తూ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ మంత్రి రావెల కిషోర్‌బాబు చెప్పారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు నిధులు తక్కువే కేటాయించారని, మళ్లీ ఆర్థిక మంత్రిని కలిసి మరిన్ని నిధులివ్వాలని కోరతామని మంత్రి పీతల సుజాత తెలిపారు. పద్దులకు సభ ఆమోదం తెలిపాక సోమవారానికి వాయిదా వేశారు. 3 సార్లు మైక్ కట్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళల రుణాల మాఫీ హామీ అంశంపై గురువారం శాసనసభలో గందరగోళం చెలరేగింది. డ్వాక్రా రుణాల మాఫీ అంశంపై చర్చకోసం విపక్ష సభ్యులు ఉప్పులేటి కల్పన, రోజాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరిం చారు. అయితే చర్చకు రోజా పట్టుబట్టడంతో స్పీకర్ ఒక్క నిమిషం మాట్లాడేందుకు అనుమతించారు. కానీ రోజా ‘ఈ ప్రభుత్వం...’ అం టూ ఉండగానే.. ‘నో.. నో.. ఈ అంశంపై చర్చ లేద’ంటూ స్పీకర్ మైక్‌ను కట్‌చేశారు. దీనిపై విపక్ష సభ్యులు వాదనకు దిగడంతో మరోసారి అనుమతించారు. రోజా మైకు అందుకుని.. ‘ఎన్నికల ప్రణాళికలో డ్వాక్రా మహిళలకు రుణాలు పూర్తిగా రద్దు చేస్తామని టీటీపీ హామీ ఇచ్చింది’ అంటూ ఉండగానే మళ్లీ మైక్ కట్ చేశారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు పోడి యం ముందుకు వెళ్లి నిరసన తెలిపారు. విపక్ష సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో 5 నిమిషాలు గడిచాక రోజా మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించారు. ఈసారి ఆమె.. ‘14 వేల 200 కోట్ల రూపాయలు పూర్తిగా రద్దు...’ అంటూ ఉండగానే మైక్ కట్ అయిపోయింది. ఈ చర్చను అనుమతించబోనని స్పీకర్ స్పష్టం చేస్తూ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపడుతున్న ట్టు ప్రకటించారు. నిమిషం కాకుండానే మైకు ఎందుకు కట్ చేస్తున్నారంటూ విపక్ష సభ్యులు స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈలోగా మం త్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పీలేరు నియోజకవర్గంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులపై చింతల రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. కానీ సభలో గందరగోళం నెలకొని ఉండటంతో ఆయనేం చెప్పారో ఎవరికీ అర్థం కాలేదు. పరిస్థితి అదుపులో లేకపోవడంతో స్పీ కర్ 9.15 గంటలప్పుడు సభను వాయిదా వేశారు. తిరిగి 10.47 గంటలకు ప్రారంభమయ్యేసరికి ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. -
'కాంగ్రెస్‌ను వదలనంటున్న రాహుల్ గ్రహం'
-
గంటాది ఐరెన్ లెగ్
=టీడీపీలోకి వస్తే పార్టీ చిన్నాభిన్నం =అయ్యన్నపాత్రుడు ధ్వజం విశాఖపట్నం, న్యూస్‌లైన్: ‘జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావుది ఐరెన్ లెగ్. ఆయన ఏ పార్టీలో అడుగుపెడితే ఆ పార్టీ భూస్థాపితమవుతుంది. టీడీపీలో అడుగుపెట్టగానే పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ప్రజారాజ్యంలోకి వెళ్లాక ఆ పార్టీ కనుమరుగైంది. చివరగా కాంగ్రెస్‌లోకి వెళితే ఇప్పుడు ఆ పార్టీ కూడా ఉనికిని కోల్పోయింద’ంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. కోటవురట్ల మండలం రాజుపేట బీసీ కాలనీ ఓటర్లను రాజుపేట పంచాయితీలో ఉంచాలంటూ కలెక్టర్‌ను కోరేందుకు వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాడుగుల ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుతో కలిసి సోమవారం కలెక్టరేట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. గంటా మళ్లీ టీడీపీలోకి వస్తే తమ పార్టీ కూడా చిన్నాభిన్నమైపోతుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. గంటా టీడీపీలోకి రావడాన్ని తాను వ్యతిరేకించడం లేదని, రాజకీయాల్లో విలువలు లేని గంటాలాంటి దొంగలను పార్టీలోకి తీసుకోవాలా? వద్దా? అన్నది పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడే నిర్ణయించుకోవాలన్నారు. రాష్ట్రంలో అవినీతికి ఆజ్యం పోసిన వ్యక్తి చంద్రబాబని లోగడ గంటా ఆరోపించిన విషయాన్ని గుర్తుచేశారు. మరో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా జగన్‌ను విమర్శించారని, ఆయన వైఎస్సార్సీపీలో చేరుతుండడాన్ని చూస్తే రాజకీయ నాయకులపై ప్రజలకు ఎలాంటి అభిప్రాయం కలుగుతందని ప్రశ్నించారు. కలెక్టరేట్‌పై గంటా కన్ను.. విశాఖ కలెక్టర్ కార్యాలయం పాతబడి పోయిందని, దానిని విశాలమైన స్థలంలో పునఃనిర్మించాలని గంటా చెబుతుండటాన్ని బట్టి ఆయన కన్ను కలెక్టరేట్‌పై పడినట్లుందని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖలో పోర్టు, కలెక్టరేట్లే అతి పురాతన కట్టడాలన్నారు. వీటిలో పోర్టు ద్వారా ఇప్పటికే అక్రమంగా వందల కోట్లు ఆర్జించిన గంటా ఇప్పుడు కలెక్టరేట్‌ను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ, నర్సీపట్నం బస్టాండ్, జీవీఎంసీ క్వార్టర్స్ స్థలాలను లాంగ్లీజ్, పీపీపీ ద్వారా ఇప్పటికే ఆక్రమించారని ఆరోపించారు.