Priya Bhavani Shankar urges victims of sexual harassment to speak up - Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులపై ఆమె ఏమన్నారంటే..

Jun 15 2023 7:01 AM | Updated on Jun 15 2023 10:26 AM

Priya Bhavani Shankar urges victims of molested harassment to speak up - Sakshi

కోలీవుడ్‌లో పాపులర్‌ నటి ప్రియాభవానీ శంకర్‌. టీవీ.యాంకర్‌గా పేరు తెచ్చుకుని ఆపై బుల్లితెరకు రంగప్రవేశం చేసి, ఆ తరువాత సినీ కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే తొలి చిత్రం మేయాదమాన్‌ తరువాత ఆశించిన విజయాలు మాత్రం ఈమెను వరించడం లేదని, దీంతో అమ్మడిపై ఐరన్‌ లెగ్‌ ముద్ర వేయడానికి చిత్ర పరిశ్రమలో ఒక వర్గం రెడీగా ఉన్నారనే టాక్‌ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ప్రియా భవానీశంకర్‌ నటిస్తున్న చిత్రాల్లో కమలహాసన్‌ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ఇండియన్‌ 2, ఎస్‌జే.సూర్య సరసన నటిస్తున్న బొమ్మై చిత్రాలు ఉన్నాయి.

ఈ చిత్రాలు తనకు సక్సెస్‌లు రావడం లేదన్న కొరతను తీరుస్తాయనే నమ్మకాన్ని ఈమె ఒక ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినీరంగంలో జరుగుతున్న లైంగిక వేధింపులపై స్పందిస్తూ  ఇలాంటివి సినిమా రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆ రంగం, ఈ రంగం అని చూడకుండా అన్ని రంగాల్లోనూ మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని అలాంటి వారు  ధైర్యంగా బయటకు చెప్పాలన్నారు.

అంతకంటే ముఖ్యం వారు చెప్పింది సమాజం వినాలన్నారు. అదే విధంగా వారిని తక్కువగా చూడడం మానుకోవాలన్నారు. తమకు జరిగిన అక్రమాలపై స్పందించాలి గానీ, ఇప్పుడు చెబుతున్నారేమిటి, ముందే చెప్పొచ్చుగా అంటూ విమర్శంచకూడదన్నారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గొంతు విప్పాలన్నారు. కాగా బొమ్మై చిత్రం ఈ నెల 16న తెరపైకి రానుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement