‘రేవంత్‌ది ఐరన్ లెగ్’
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి పార్టీలో కొనసాగడం వల్లే టీడీపీ ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఆయనది ఐరన్ లెగ్ అని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయా పార్టీల ఎమ్మెల్యేలు వలస వెళ్లారని ఆయన గుర్తు చే శారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలసి గురువారం విలేకరులతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబు, లోకేశ్, రేవంత్ ఎంత తిరిగినా ఫలితం లేకుండా పోయిందని, వారికి ఒక్క సీటు మాత్రమే వచ్చిందన్నారు.
తెలంగాణలో టీడీపీ బతికి బట్టకట్టే పరిస్థితి లేదని, హైటెక్ సిటీ కట్టింది తానే అని చంద్ర బాబు గొప్పలు చెప్పుకున్నా, ఆ డివిజన్‌లో కూడా టీఆర్‌ఎస్ పార్టీనే గెలిచిందన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని రేవంత్‌ను హెచ్చరించారు.