‘‘కెరీర్ ప్రారంభంలో నేను చేసిన రెండు మూడు సినిమాలు సరిగ్గా ఆడలేదు. దాంతో నా మీద ‘ఐరన్ లెగ్’ అని ముద్ర వేశారు’’ అని తనకు జరిగిన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు తాప్సీ. యాక్టర్‌గా మీ ప్రయాణంలో మీకు ఎదురైన చేదు అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్నకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ – ‘‘సౌత్‌లో నాకు ఎదురైన చేదు అనుభవం ఏంటంటే.. నన్ను ఐరన్ లెగ్ అనడం. సినిమాకు కథ రాసింది నేను కాదు, తీసింది నేను కాదు.
ఆ సినిమాల్లో మూడు పాటలు, నాలుగు సీన్లలో ఉన్నాను. పెద్ద నిర్మాతలు, పెద్ద దర్శకుడు అనే కారణంతో ఆ సినిమాలు చేశాను. కేవలం ఆ కారణాలతో సినిమా చేయడం నా తప్పే. అయితే ఆ సినిమాలు ఆడకపోవడాన్ని నా మీద తోసేయడం కరెక్ట్ కాదనిపించింది. అలాగే బాలీవుడ్‌లో ఓ అవార్డు షోకు వెళ్లాను. అక్కడ నన్ను ఆరో వరసలో కూర్చోబెట్టారు. ముందు వరసలో కూర్చునే అంత అర్హత నాకు లేదనుకున్నారేమో? ‘చష్మె బద్దూర్’ సినిమా క్యాస్టింగ్ డైరెక్టర్ అయితే ‘సినిమాలో నువ్వే వరస్ట్ చాయిస్ అని తిట్టారు’’ అని షేర్ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment