thapsee
-
హీరోలు లేకపోయినా.. సినిమాను నడిపించిన హీరోయిన్స్
సినిమాలో గ్లామర్ కావాలి.. అందుకేగా హీరోయిన్... స్పెషల్ సాంగ్ అదిరిపోవాలి... ఉన్నారుగా హీరోయిన్లు.. స్పెషల్ సాంగ్ చేసే తారలు.. ‘ఫీమేల్ స్టార్స్’ అంటే.. ఇంతకు మించి పెద్దగా ఆలోచించరు. హీరోయిన్లు కూడా గ్లామరస్ క్యారెక్టర్స్‌కి సై అంటారు. అయితే గ్లామర్‌కి అతీతంగా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ వస్తే వెంటనే ఒప్పేసుకుంటారు. సవాల్‌గా తీసుకుని ఆ పాత్రలను చేస్తారు. రిస్కీ ఫైట్స్ చేయడానికి కూడా వెనకాడరు. 2022 ఇలాంటి పాత్రలను చాలానే చూపించింది. హీరోయినే హీరోగా వచ్చిన లేడీ ఓరియంటెడ్ చిత్రాల గురిం తెలుసుకుందాం. ‘మహానటి’ (2018) చిత్రంలో సావిత్రి పాత్రలో అద్భుతంగా అభినయిం, లేడీ ఓరియంటెడ్ ఫిలింస్‌కి ఓ మంచి చాయిస్ అయ్యారు కీర్తీ సురేశ్. ఆ తర్వాత ఆమె ‘పెంగ్విన్ మిస్ ఇండియా వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేశారు. ఇక ఈ ఏడాది ‘గుడ్‌లక్ సఖి’, ‘సాని కాయిదమ్’ (తెలుగులో ‘చిన్ని’) వంటి కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నగేశ్ కుకునూరు దర్శకత్వంలో వచ్చిన ‘గుడ్‌లక్ సఖి’ జనవరి 28న థియేటర్స్‌లో విడుదలకాగా, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కింన ‘సాని కాయిదమ్’ మే 6 నుంచి డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ గ్రామీణ యువతి జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో ఎలా బంగారు పతకం సాధింంది? అన్నది ‘గుడ్‌లక్ సఖి’ కథ. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునే ఓ కానిస్టేబుల్ ఆవేదన నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘చిన్ని’. ఇక ఇప్పటికే పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసిన ప్రియమణి ఈ ఏడాది ‘భామాకలాపం’ చేశారు. అభిమన్యు దర్శకత్వంలో రపొందిన ఈ సినివ ఫిబ్రవరి 11 నుం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో పక్కింటి విషయాలపై ఆసక్తి చూపిస్తూ, ఓ కుకింగ్ యూట్యూబ్ చానెల్‌ను రన్ చేసే అనుపమ ఇరుకుల్లో పడుతుంది. ఓ వ్యక్తి హత్యకి సంబంధింన మిస్టరీ నుంచి తనను కాపాడుకునే అనుపమ పాత్రను ప్రియమణి చేశారు. మరోవైపు ఐదారేళ్లుగా బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ సినివలు చేస్తున్న తాప్సీ 2019లో వచ్చిన ‘గేమ్ ఓవర్’ తర్వాత తెలుగులో ఈ ఏడాది ‘మిషన్ ఇంపాజిబుల్’లో నటించారు. చైల్డ్ ట్రాఫికింగ్ (న్నారుల అక్రమ రవాణా) నేపథ్యంలో రపొందిన ఈ చిత్రానికి ఆర్ఎస్ స్వరప్ దర్శకుడు. చిన్నారులను చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా బారి నుం రక్షించే శైలజ పాత్రను తనదైన శైలిలో చేసి, మెప్పించారు తాప్సీ. ఏప్రిల్ 1న ఈ త్రం విడుదలైంది. ఇంకోవైపు నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటింన ‘బ్లడీ మేరీ’ త్రం ఏప్రిల్ 15 నుం ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హ్యమన్ ట్రాఫికింగ్ ముఠా నేరాలకు మర్డర్, రివెంజ్ అంశాల టచ్ ఇచ్చి ఈ సినివను తెరకెక్కించారు చందు మొండేటి. అనాథ నర్సు మేరీ పాత్రలో నటించారు నివేదా పేతురాజ్. ఇక ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ (1996) తర్వాత ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఓ లీడ్ రోల్ చేసిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్‌కుమార్ దర్శకత్వంలో రపొందిన ఈ సినివలో టైటిల్ రోల్ చేశారు సుమ. అడిగినవారికి సాయం చేస్తూ, శుభ కార్యాలప్పుడు గ్రామస్తులకు ఈడ్లు (చదివింపులు) ఇచ్చే మంచి మనసు ఉన్న మనిషి జయమ్మ. హఠాత్తుగా జయమ్మ భర్తకు గుండెపోటు వస్తుంది. కానీ ఆ సమయంలో గ్రామస్తులు జయమ్మకు సహాయం చేయకపోగా, కొందరు విమర్శిస్తారు. ఆ తర్వాత జయమ్మ ఏం చేసింది? కుటుంబాన్ని ఎలా చక్క దిద్దుకుంది? అన్నదే కథాంశం. మే 6న ఈ సినిమా రిలీజైంది. ఇంకోవైపు పదేళ్ల తర్వాత అంటే 2012లో వచ్చిన ‘అందాల రాక్షసి’ చిత్రం తర్వాత హీరోయిన్ లావణ్యా త్రిపాఠి చేసిన మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా ‘హ్యాపీ బర్త్‌డే’అని చెప్పుకోవచ్చు. రితేష్ రానా తెరకెక్కింన ఈ చిత్రం జూలై 8న రిలీజైంది. దేశంలో గన్ కల్చర్‌ను ప్రోత్సహించే విధంగా ఓ కేంద్రమంత్రి గన్ బిల్లు ప్రతిపాదనను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఫ్యాంటసీ జానర్లో సాగే ఈ చిత్రంలో గన్ కల్చర్‌కు, హ్యాపీ అనే అమ్మాయి బర్త్‌డేకి ఉన్న సంబంధం ఏంటి? అనేది ప్రధానాంశం. ఇక ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’ ఆధారంగా రీమేక్ అయిన చిత్రం ‘శాకినీ డాకినీ’. రెజీనా, నివేదా థామస్ టైటిల్ రోల్స్‌లో ఈ చిత్రాన్ని దర్శకుడు సుదీర్ వర్మ తెరకెక్కించారు. అమ్మాయిలను కిడ్నాప్ చేసి, అక్రమాలకు పాల్పడే ఓ ముఠా ఆట కట్టించే ఇద్దరు ఉమెన్ ట్రైనీ పోలీసాఫీసర్ల సాహసాల ఇతివృత్తంగా ఈ సినిమా సాగుతుంది. మరోవైపు సమంత తన కెరీర్లో దాదాపు యాభై సినివలు చేస్తే, వాటిలో ‘యూ టర్న్’, ‘ఓ బేబీ’... లాంటి లేడీ ఓరియంటెడ్ ఫిలింస్ కూడా ఉన్నాయి. ఈ జాబితాలో ఈ ఏడాది ‘యశోద’ చిత్రం చేరింది. సమంత టైటిల్ రోల్లో హరి–హరీష్ దర్శకత్వంలో రపొందిన ఈ చిత్రం నవంబరు 11న రిలీజైంది. సరోగసీ సాకుతో మహిళలపై అఫయిత్యాలకు పాల్పడే ఓ ముఠా గుట్టును పోలీస్ ఆఫీసర్ యశోద ఎలా బయటపెట్టింది? అనే నేపథ్యంలో ‘యశోద’ సినిమా సాగుతుంది. అలాగే సమంత టైటిల్ రోల్ చేసిన మరో చిత్రం ‘శాకుంతలం’ ఈ ఏడాదే విడుదల కావాల్సింది. అయితే వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ మైథలాజికల్ ఫిల్మ్‌కు గుణశేఖర్ దర్శకుడు. ఇక ఐదారేళ్లుగా ప్రతి ఏడాదీ నయనతార నటింన ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అయినా వీక్షకుల ముందుకు వస్తోంది. ఈ ఏడాది ఆమె నటింన ‘ఓ2’ త్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్లాట్ఫామ్లో జూన్ 17 నుం స్ట్రీమింగ్ అవుతోంది. జీఎస్ విఘ్నేష్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ కథలో పార్వతిని ట్రాప్ చేస్తారు. సడన్‌గా అక్కడ ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతాయి. ఆ పరిస్థితుల నుంచి పార్వతి ఎలా బయటపడింది? తన కొడుకును ఎలా కాపాడుకోగలిగింది? అన్నదే కథ. అలాగే నయనతార నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘కనెక్ట్’ ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఇక అనుపమా పరమేశ్వరన్ నటింన తాజా చిత్రం ‘బటర్ ఫ్లై’. గంటా సతీష్ బాబు ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం ఈ 29 నుం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. వీరితో పాటు మరికొందరు హీరోయిన్లు ‘కథనాయిక ప్రాధాన్యం’గా సాగే చిత్రాల్లోనూ, వెబ్ సిరీస్‌లోనూ నటించారు. ఈ ప్రాజెక్ట్స్‌లో కొన్ని సక్సెస్ కాగా, కొన్ని ఫెయిల్ అయ్యాయి. అయితే నటనపరంగా మాత్రం హీరోయిన్లు హిట్టే. -
శారీరకంగా, మానసికంగా కాస్త డిఫరెంట్‌గా..
‘శారీరకంగా, మానసికంగా కాస్త డిఫరెంట్‌గా కనిపించాలి.. ఓకేనా’ అంటే, మరో మాట మాట్లాడకుండా ‘ఓకే’ చెప్పేస్తారు కొందరు స్టార్స్. అలాంటి క్యారెక్టర్లను సవాల్‌గా తీసుకుని, తమలోని ఆర్టిస్ట్‌ని ప్రూవ్ చేసుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తారు. కొందరు స్టార్స్ ఈ మధ్య అలా డిఫరెంట్‌గా కనిపించే మిషన్ మీద ఉన్నారు. కొంచెం ‘డిఫరెంట్’గా కనిపించే ఆ క్యారెక్టర్ల గురించి తెలుసుకుందాం. ఎంత డబ్బైనా ఆఫర్ చేయండి? ఎంతటి దావత్నైనా ప్లాన్ చేయండి? సాయంత్రం ఆరు దాటితే అడుగు బయటపెట్టేదే లే అంటున్నారు వెంకటేశ్. ఇటు వెంకటేశ్ వెండితెర కో బ్రదర్ వరుణ్ తేజ్ కూడా గలాగలా మాట్లాడమంటే కాస్త గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మాట్లాడుతున్నారు. ఈ కో బ్రదర్స్‌కు ఈ పరిస్థితి తెచ్చిపెట్టింది ‘ఎఫ్ 3’ చిత్రమే. ‘ఎఫ్ 2’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జీవితంలో డబ్బు ప్రధానమా లేక బంధాలు ముఖ్యమా? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే ఈ చిత్రంలో రే చీకటి ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేశ్, నత్తితో ఇబ్బందిపడే వ్యక్తి పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారు. ఈ చిత్రంలో సునీల్, సోనాలీ చౌహాన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ‘ఎఫ్ 3’ చిత్రం ఈ ఏడాది మే 27న విడుదల కానుంది. మరోవైపు మాటల్లేవ్ అంటున్నారు హీరో సూర్య. ప్రముఖ దర్శకుడు బాల దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ బధిర (చెవుడు, మూగ) వ్యక్తి పాత్రలో సూర్య నటిస్తారనే ప్రచారం సాగుతోంది. బాల దర్శకత్వంలో వచ్చిన ‘నంద’, ‘పితామగన్’ (తెలుగులో ‘శివపుత్రుడు’) తదితర చిత్రాల్లో నటించారు సూర్య. అలాగే బాల తెరకెక్కించిన ‘అవన్ ఇవన్’ (తెలుగులో వాడు–వీడు) చిత్రంలో అతిథి పాత్రలో నటించారు. తాజాగా బాల దర్శకత్వంలో సూర్య చేయనున్న సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ఆరంభం కానుంది. ఇంకోవైపు ప్రముఖ నటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ఓ చిత్రంలో మోనోఫోబియాతో బాధపడుతున్న రచయిత పాత్ర చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం ద్వారా సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఒక ప్రమాదం ఓ రచయిత జీవితాన్ని ఎలా మార్చేసింది? అతను ఎదుర్కొంటున్న సమస్య మరో పెద్ద సమస్యకు కారణం అయితే దాన్ని ఎలా అధిగమించాడు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక అటు హిందీవైపు వెళితే చాలెంజింగ్ రోల్స్ చేస్తూ, దూసుకెళుతున్న తాప్సీ నటించిన తాజా చిత్రం ‘బ్లర్’. కంటి చూపుకి సంబంధించిన కథ ఇది అని టైటిలే చెప్పేస్తోంది. ఈ చిత్రకథ నచ్చి లీడ్ రోల్ చేయడానికి అంగీకరించడంతో పాటు తాప్సీ ఓ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ‘జూలియాస్ ఐస్’ అనే స్పానిష్ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ ‘బ్లర్’లో క్రమ క్రమంగా కంటిచూపు మందగించే పాత్ర చేశారు తాప్సీ. చూపు మెరుగుపడడానికి శస్త్ర చికిత్స చేయించుకుని, కళ్లకు బ్యాండేజ్‌తో తాప్సీ కనిపించే సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సీన్లలో నటించే ముందు నిజంగానే తాప్సీ కళ్లకు బ్యాండేజ్ వేయించుకుని, ఓ పన్నెండు గంటల పాటు అలానే తన పనులు చేసుకున్నారట. క్యారెక్టర్లోకి పూర్తిగా ఒదిగిపోవాలనే ఇలా చేశారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అజయ్ బెహల్ ఈ చిత్రానికి దర్శకుడు. కొంచెం కొంచెంగా చూపు మందగించే పాత్రను తాప్సీ చేస్తే ‘బ్లైండ్’ చిత్రంలో సోనమ్ కపూర్ పూర్తిగా కళ్లు కనిపించని యువతిగా నటించారు. ఓ ప్రమాదంలో చూపు కోల్పోవడం, చేస్తున్న పోలీస్ జాబ్‌కు ఫుల్ స్టాప్ పడడం, ఆ తర్వాత ఏం జరిగింది? అనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. కొరియన్ సినిమా ‘బ్లైండ్’కి రీమేక్‌గా అదే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందింది. షోమే మఖీజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ గత ఏడాదే పూర్తయింది. త్వరలో ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని సమాచారం. ఇక్కడ పేర్కొన్న స్టార్స్ మాత్రమే కాదు.. మరికొందరు కూడా కొంచెం ‘డిఫరెంట్’ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నారు. -
నిర్మాతగా మారిన హీరోయిన్ తాప్సీ
‘‘నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు కెరీర్ తేలికగా వెళ్లదని, ఎదుర్కోడానికి ఈత నేర్చుకుంటానని నాకు తెలియదు. కానీ నిలదొక్కుకున్నాను. నా ప్రతిభని, పనితీరుని నమ్మి, నా మీద ప్రేమాభిమానాలు కనబర్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది’’ అన్నారు తాప్సీ. ‘అవుట్‌సైడర్స్ ఫిల్మ్స్’ పేరుతో తాప్సీ ఓ నిర్మాణ సంస్థను ఆరంభించారు. ‘సూపర్ 30’, ‘83’, ‘సూర్మ’, ‘ముబారకాన్’ వంటి చిత్రాలను నిర్మించి, ప్రస్తుతం తనతో ‘రష్మీ రాకెట్’ చిత్రాన్ని నిర్మిస్తున్న రచయిత ప్రంజల్ ఖంద్ దియాతో కలిసి తాప్సీ ‘బ్లర్’ అనే సినిమా నిర్మించనున్నారు. ‘‘నాలా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇక్కడికొచ్చి నిలదొక్కుకోవాలనుకునేవాళ్లకు మా ప్రొడక్షన్ హౌస్ తలుపులు తెరిచి ఉంటాయి’’ అన్నారు తాప్సీ. జీ స్టూడియోస్‌తో కలిసి ‘బ్లర్’ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో తాప్సీ లీడ్ క్యారెక్టర్ చేయనున్నారు. ‘బీఏ పాస్’, ‘సెక్షన్ 375’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అజయ్ బెహల్ ఈ చిత్రానికి దర్శకుడు. -
ఏడుసార్లు చెంపదెబ్బ తిన్నా
ఆర్టిస్టుల తప్పిదం వల్లో, సాంకేతిక కారణాల వల్లో, దర్శకుడు సంతృప్తి చెందకపోవడం వల్లో కొన్నిసార్లు చేసిన సన్నివేశాన్నే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తుంది. ‘తప్పడ్’ సినిమా షూటింగ్లో అలాంటి సందర్భమే ఒకటి ఎదురైందట తాప్సీకి. ఒక సన్నివేశం కోసం ఆమె సుమారు ఏడుసార్లు చెంపదెబ్బ తిన్సాలి వచ్చిందట. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తాప్సీ నటించిన తాజా చిత్రం ‘తప్పడ్’ (చెంపదెబ్బ అని అర్థం). ఈ సినిమాలో ఓ సన్నివేశంలో తాప్సీ చెంపదెబ్బ తినాలి. సినిమాలో చాలా కీలకమైన సన్నివేశం అది. కథను మలుపు తిప్పే చెంపదెబ్బ అది. కరెక్ట్‌గా రావడం కోసం సుమారు ఏడు టేక్‌లు చేశారట తాప్సీ, నటుడు పావైల్ గులాటీ. అంటే... ఏడుసార్లు చెంప దెబ్బ తిన్నారట తాప్సీ. ‘‘చెంపదెబ్బ కొట్టడానికి నా కోస్టార్ పావైల్ సంకోచించారు. చాలా టెన్షన్ పడ్డారు. ఆరు టేక్‌లు పూర్తయ్యాయి. సరిగ్గా రావడం లేదు. ‘ఏం ఆలోచించకు. లాగిపెట్టి కొట్టేయ్’ అన్నాను. ఏడో టేక్ సరిగ్గా వచ్చింది’’ అని ఆ సీన్ తీయడానికి వెనక జరిగిన స్టోరీ చెప్పారు తాప్సీ. ‘తప్పడ్’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. -
వందకి వంద
‘సూర్మా’లో హాకీ ప్లేయర్, ‘సాండ్ కీ ఆంఖ్’లో షూటర్.. ఇలా క్రీడలకు సంబంధించిన పాత్రలను తాప్సీ ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇప్పుడు దేశం గర్వపడేలా చేసిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పాత్రలో ఆమె కనిపించనున్నారు. ‘శభాష్ మిథు’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలోని తాప్సీ లుక్‌ని బుధవారం విడుదల చేశారు. రాహుల్ థొలాకియా దర్శకత్వంలో వయాకామ్ 18 స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘‘నా జీవిత కథను ప్రపంచానికి చూపిస్తున్నందుకు థ్యాంక్స్ వయాకామ్ 18. మీరు కచ్చితంగా అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారు’’ అని మిథాలీ ట్వీట్ చేశారు. అలాగే తాప్సీ పోస్టర్ చాలా బాగుందని ప్రశంసించారామె. ‘‘ఇప్పటివరకు నన్ను మీకు నచ్చిన క్రికెట్ క్రీడాకారుడు ఎవరు? అని చాలామంది అడిగారు. అయితే వాళ్లను మీ అభిమాన క్రికెట్ క్రీడాకారిణి ఎవరు? అని అడగాలి. అలాగే వాళ్లు క్రికెట్‌ని ఇష్టపడుతున్నారా? లేదా ఏ జెండర్ (ఆడ లేక మగ) ఆడుతున్నారనేదాన్ని బట్టి వాళ్ల ఇష్టం ఆధారపడి ఉంటుందా? ఏది ఏమైనా ‘మిథాలీ.. మీరు ఓ గేమ్ చేంజర్’’ అని పోస్టర్ రిలీజ్ సందర్భంగా తాప్సీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తాప్సీ లుక్‌కి వందకు వంద మార్కులు పడ్డాయి. 2021 ఫిబ్రవరి 5న ఈ చిత్రం విడుదల కానుంది. -
ఒక్క సినిమా చూడండి.. ఐదు సినిమాలొస్తాయి
‘బద్లా, గేమ్ ఓవర్, మిషన్ మంగళ్, సాంద్ కీ ఆంఖ్’.. ఈ ఏడాది హిందీలో విడుదలైన ఈ నాలుగు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ తాప్సీ నటించారు. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. దీంతో హిందీ పరిశ్రమలో కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలంటే దర్శక–నిర్మాతలు తాప్సీ పేరును ఓసారి పరిశీలించే స్థాయికి ఎదిగారామె. తాప్సీయే కాదు విద్యాబాలన్, దీపికా పదుకోన్, కంగనా రనౌత్, ఆలియా భట్ వంటి అగ్ర కథానాయికలు కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలవైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే విషయం గురించి గోవాలో జరుగుతున్న ‘ఇఫీ’ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో ‘ఉమెన్ ఇన్ లీడ్’ అనే అంశంపై తాప్సీ మాట్లాడుతూ – ‘‘మీరు ఒక మంచి ప్రేక్షకుడిగా ఉండాలనుకుంటే థియేటర్స్‌కు వెళ్లి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చూడండి. ఒక్క సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద విజయం సా«ధిస్తే ఐదు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ సెట్స్‌పైకి వెళతాయి. ఇది కథానాయికలకు ఎంతో మేలు చేస్తుంది. కొత్తగా రావాలనుకునే హీరోయిన్స్‌లో కూడా ఆత్మవిశ్వాసం నింపినవారవుతారు’’ అని అన్నారు. -
రష్మీ... ద రాకెట్
నిప్పు రవ్వ వెలిగిస్తే చాలు రాకెట్ రివ్వున ఆకాశంలోకి పరిగెడుతుంది. ‘గెట్ సెట్ గో’ అనే పదాలు వింటే చాలు రష్మీ కూడా రాకెట్లా దూసుకుపోతుంది. ఆమె పరుగు వేగాన్ని చూస్తే కచ్చితంగా రష్మీ ద రాకెట్ అనాల్సిందే. గుజరాత్‌కు చెందిన అథ్లెట్ రష్మి పాత్రలో తాప్సీ నటించనున్న చిత్రం ‘రష్మీ ద రాకెట్’. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి రోనీ స్క్రూవాల్లా నిర్మాత. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ‘‘కొన్నిసార్లు ముందుకు దూసుకువెళ్లాలంటే కొన్ని అడుగులు వెనక్కి వేయాలి. కొత్త ట్రాక్‌లో రేస్‌కి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది’’ అని తాప్సీ పేర్కొన్నారు. పరుగు పందెంలో తన సత్తా చాటే క్రీడాకారిణిగా ఇందులో తాప్సీ కనిపించనున్నారు. ఇదో ఊహాజనిత కథ అని, ఏ అథ్లెట్ బయోపిక్ కాదని సమాచారం. -
ఐరన్ లెగ్ ముద్ర వేశారు
‘‘కెరీర్ ప్రారంభంలో నేను చేసిన రెండు మూడు సినిమాలు సరిగ్గా ఆడలేదు. దాంతో నా మీద ‘ఐరన్ లెగ్’ అని ముద్ర వేశారు’’ అని తనకు జరిగిన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు తాప్సీ. యాక్టర్‌గా మీ ప్రయాణంలో మీకు ఎదురైన చేదు అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్నకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ – ‘‘సౌత్‌లో నాకు ఎదురైన చేదు అనుభవం ఏంటంటే.. నన్ను ఐరన్ లెగ్ అనడం. సినిమాకు కథ రాసింది నేను కాదు, తీసింది నేను కాదు. ఆ సినిమాల్లో మూడు పాటలు, నాలుగు సీన్లలో ఉన్నాను. పెద్ద నిర్మాతలు, పెద్ద దర్శకుడు అనే కారణంతో ఆ సినిమాలు చేశాను. కేవలం ఆ కారణాలతో సినిమా చేయడం నా తప్పే. అయితే ఆ సినిమాలు ఆడకపోవడాన్ని నా మీద తోసేయడం కరెక్ట్ కాదనిపించింది. అలాగే బాలీవుడ్లో ఓ అవార్డు షోకు వెళ్లాను. అక్కడ నన్ను ఆరో వరసలో కూర్చోబెట్టారు. ముందు వరసలో కూర్చునే అంత అర్హత నాకు లేదనుకున్నారేమో? ‘చష్మె బద్దూర్’ సినిమా క్యాస్టింగ్ డైరెక్టర్ అయితే ‘సినిమాలో నువ్వే వరస్ట్ చాయిస్ అని తిట్టారు’’ అని షేర్ చేసుకున్నారు. -
కొత్త లుక్‌లో థ్రిల్
సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సినిమాల్లో భయపెట్టడానికి దెయ్యం, పాడుబడిన భవంతులు, చీకట్లో కొన్ని సన్నివేశాలు తీయడం కామన్. ఇవేమీ లేకుండా ఓ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ప్లాన్ చేశారు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. తాప్సీ ముఖ్య పాత్రలో నటించనున్నారు. ఇది వరకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ‘మన్మర్జియా’, ఆయన నిర్మాణంలో వచ్చిన ‘సాంద్ కీ ఆంఖే’లో హీరోయిన్గా నటించారు తాప్సీ. ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ విశేషాలను తాప్సీ తెలుపుతూ – ‘‘ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడనటువంటి అంశాలు మా సినిమాలో ఉంటాయి. ఈ సినిమాలో పలు గెటప్స్‌లో కనిపిస్తాను. గుర్తుపట్టలేనటువంటి లుక్ కాదు కానీ ఇప్పటివరకూ మీరు చూడని గెటప్‌లో మాత్రం కచ్చితంగా కనిపిస్తాను. షూటింగ్ మొత్తం విదేశాల్లో చేస్తాం. అనురాగ్‌తో సినిమా అంటే మానసికంగా ప్రిపేర్ అయ్యుండాలి. షూటింగ్ ముందు ఏదో ఓ బాంబ్ వేస్తాడు. ‘మన్మర్జియా’ షూటింగ్ రెండు రోజుల ముందు జుత్తు మొత్తం రంగు వేసుకోమన్నాడు. అందుకే ఈసారి నేను రెడీగా ఉన్నాను. గుండు చేయించుకోవడానికి తప్ప ఏం చేయమన్నా చేయడానికి సిద్ధంగానే ఉన్నాను (నవ్వుతూ)’’ అన్నారు. -
తలకిందుల ఇంట్లో తమన్నా!
ఇంట్లోని గడియారం, అల్మరా, అద్దం.. ఇలా అన్ని వస్తువులు తలకిందులుగా కనిపిస్తున్నాయి. అదే ఇంట్లో ఉన్న తమన్నా మాత్రం కుర్చీలో దర్జాగా కూర్చుని నవ్వుతున్నారు. విశేషం ఏంటంటే.. తమన్నా కూర్చున్న కుర్చీ మాత్రం తలకిందులుగా లేదు. ఇక్కడున్న ఫొటో చూశారుగా. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా తమిళ చిత్రంలోని స్టిల్ ఇది. రోహన్ వెంకటేశన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘పెట్రోమాక్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌ను తాప్సీ విడుదల చేశారు. ఈ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... తెలుగులో హిట్ సాధించిన ‘ఆనందోబ్రహ్మ’ సినిమాకు ‘పెట్రోమాక్స్’ తమిళ రీమేక్ అని టాక్. తెలుగు వెర్షన్లో తాప్సీ నటించిన విషయం తెలిసిందే. అందుకే తమిళ రీమేక్‌ని ఆమె చేతుల మీదుగా విడుదల చేయించి ఉంటారు. -
త ప్లేస్‌లో తా?
మూడో రాజుగారి గదిలోకి ఇటీవల తమన్నా గృహప్రవేశం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే తమన్నా ప్లేస్‌లోకి తాప్సీ రానున్నారని లేటెస్ట్ టాక్. ఓంకార్ దర్శకత్వంలో ఇటీవల ‘రాజుగారి గది 3’ మొదలైంది. ఈ చిత్రాన్ని ఓక్ ఎంటర్‌న్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ‘రాజుగారి గది 2’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమా స్క్రిప్ట్ పరంగా కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి తమన్నా తప్పుకున్నారట. దీంతో చిత్రబృందం తాప్సీతో సంప్రదింపులు జరుపుతున్నారన్నది తాజా సమాచారం. -
నిర్ణయం నాదే
వరుస అవకాశాలతో బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు హీరోయిన్ తాప్సీ. అయినప్పటికీ ఏడాదికి సౌత్‌లో కనీసం ఒక్క సినిమా అయినా చేస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన ‘గేమ్ ఓవర్’ చిత్రం నటిగా మరింత పేరు తెచ్చిపెట్టింది. ఆమె క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా హిందీ వెర్షన్‌ని కూడా రిలీజ్ చేశారు. సౌత్‌లో సినిమాలు చేయడం గురించి తాప్సీ మాట్లాడుతూ –‘‘ప్రస్తుతం హిందీ సినిమాలతో కాస్త బిజీగా ఉన్నా ఏడాదికి సౌత్‌లో ఓ చిత్రంలో నటించేలా ప్లాన్ చేసుకుంటున్నాను. మొదట్లో ‘ఓ పెద్ద హీరో డేట్స్ మా దగ్గర ఉన్నాయి.. మీ టు మంత్స్ డేట్స్ మాకు కావాలి’ అని నిర్మాతలు అడిగేవారు. కానీ, హిందీ సినిమాల కోసం ఆరు నెలల ముందే నా డేట్స్ బుక్కైపోయి ఉంటాయి. కానీ, ఇప్పుడు నేను నటిస్తున్న సౌత్ సినిమాల్లో నేనే ప్రధానపాత్రధారిగా ఉంటున్నాను. స్క్రిప్ట్ నచ్చితే నా నిర్ణయం ప్రకారం డేట్స్‌ని బట్టి సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాను’’ అని తాప్సీ అన్నారు. -
నేను స్టార్‌ని కాను
బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్లో టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్నారు హీరోయిన్ తాప్సీ. వీలైనప్పుడు సౌత్‌లోనూ సినిమాలు చేస్తున్నారు. ఇంతలా అవకాశాలు తాప్సీ వెంట పడుతున్నా తానేమీ స్టార్‌ని కాదంటున్నారామె. ఈ విషయం గురించి తాప్సీ చెబుతూ– ‘‘ఇండస్ట్రీలో సూపర్‌స్టార్ ఒకరే ఉంటారు.. మిగిలిన వారంతా స్టార్స్. బాలీవుడ్లో సల్మాన్‌ఖాన్, షారుక్‌ఖాన్ సినిమాలు ఎలా ఉన్నా ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రం ఓ రేంజ్లో ఉంటాయి. కానీ నా సినిమాలకు ఆ రేంజ్ కలెక్షన్స్‌ను నేను ఊహించుకోలేను. నేను ఎలాంటి సినిమా చేశా? మిగతా స్టార్స్ ఎవరు? ఏ జానర్? అని ఆలోచించకుండా కేవలం సినిమాలో తాప్సీ ఉందని ఆడియన్స్ టికెట్స్ కొంటారో అప్పుడే నన్ను నేను ఓ స్టార్‌గా ఫీల్ అవుతాను. అప్పటివరకు నేను యాక్టర్‌ని మాత్రమే. స్టార్‌ని కాను. కథలో నా పాత్రకు ప్రాధాన్యం ఉండే నిడివి ఎక్కువా? తక్కువా? అని ఆలోచించను’’ అని చెప్పారు తాప్సీ. ‘మిషన్‌మంగళ్, సాండ్‌కి ఆంఖ్, గేమ్ ఓవర్’ చిత్రాల షూటింగ్స్‌ను కంప్లీట్ చేసిన తాప్సీ కొత్త సినిమాల కోసం కథలు వినే పనిలో పడ్డారు. -
ఆట ముగిసింది
గేమ్ ఓవర్ అంటున్నారు తాప్సీ. ఇంతకీ ఏ ఆట? ఎవరు ఎవరితో ఆడారు? చివరికి ఎవరి ఆట ముగిసింది? అన్నది తెలియాలంటే ఈ నెల 14 వరకూ వేచి చూడాల్సిందే. తాప్సీ లీడ్ రోల్లో అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఓవర్’. వై నాట్ స్టూడియోస్ పతాకంపై ఎస్.శశికాంత్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శశికాంత్ మాట్లాడుతూ– ‘‘భారతీయ సినీ చరిత్రలో ఇంత వరకూ రాని సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. వెన్నులో వణుకు పుట్టించే కథ, కథనాలు ఈ థ్రిల్లర్ మూవీ ప్రత్యేకతలు. హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి హిందీలో సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1200కు పైగా స్క్రీన్స్‌లో సినిమా రిలీజవుతోంది. మూడు భాషల్లోని చిత్ర ప్రముఖులు ‘గేమ్ ఓవర్’ ట్రైలర్‌ను చూసి ప్రశంసలతో ట్వీట్స్ చేయటంతో ప్రేక్షకుల్లో మా చిత్రంపై అంచనాలు పెరిగాయి. మా బ్యానర్లో వచ్చిన ‘లవ్ ఫెయిల్యూర్’,‘గురు’ చిత్రాల విజయాల సరసన ఈ ‘గేమ్ ఓవర్’ నిలుస్తుంది’’ అన్నారు. ‘‘గేమ్ ఓవర్’ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను కలిగిస్తుంది. అశ్విన్ శరవణన్ తెరకెక్కించిన తీరే దీనికి కారణం’’ అన్నారు తాప్సీ. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: ముత్తురామలింగం, సహ నిర్మాత: చక్రవర్తి రామచంద్ర. -
వన్ ప్లస్ వన్
ప్రొఫెషనల్ లైఫ్‌ని ఎంత పక్కాగా ప్లాన్ చేసుకుంటారో అంతే బాగా పర్సనల్ లైఫ్‌ని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు తాప్సీ. రెండేళ్ల క్రితం ముంబైలో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్న ఈ బ్యూటీ తాజాగా మరో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌కి ఓనర్‌గా మారారు. గతంలో తాను ఉన్న అపార్ట్మెంట్లోనే తాప్సీ ఈ కొత్త ఫ్లాట్‌ను తీసుకున్నారని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఇంటీరియర్ డెకరేషన్ వర్క్ జరుగుతోందట. తాప్సీ సిస్టర్ శాగున్ దగ్గరుండి మరీ ఈ పనులన్నీ చూసుకుంటున్నారట. ఇలా పర్సనల్‌గా కూడా తాప్సీ మంచి జోరుమీద ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.... ఇటీవల ‘బద్లా’ చిత్రంతో సూపర్ సక్సెస్‌ను అందుకున్న తాప్సీ ‘సాండ్‌కీ అంఖే, మిషన్ మంగళ్’ అనే హిందీ సినిమాలను పూర్తి చేశారు. తమిళం, తెలుగు భాషల్లో తాప్సీ నటించిన ‘గేమ్ ఓవర్’ చిత్రం జూలై 14న విడుదల కానుంది. బాలీవుడ్లో తాప్సీ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకున్న నిర్మాతలు ఈ సినిమా హిందీ వెర్షన్‌ను కూడా రిలీజ్ చేస్తున్నారు. హిందీలో అనురాగ్ కశ్యప్ ఈ చిత్రం విడుదల చేయనున్నారు. -
ఆటకి డేట్ ఫిక్స్
గేమ్ ఫినిష్ చేశారు హీరోయిన్ తాప్సీ. మరి.. ఎలా ఆడారు? అనే విషయాన్ని మాత్రం వెండితెరపై చూడాల్సిందే. తాప్సీ ప్రధాన పాత్రలో అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఎస్. శశికాంత్ నిర్మించిన చిత్రం ‘గేమ్ ఓవర్’. చక్రవర్తి రామచంద్ర సహ–నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. జూన్ 14న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఈ చిత్రకథ విన్నప్పుడు సరికొత్తగా ఉందనిపించింది. విజయం సాధించే చిత్రం అనిపించింది. ‘ఆనందోబ్రహ్మ’ తర్వాత నా చిత్రాలపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ చిత్రం వమ్ము చేయదు’’ అన్నారు తాప్సీ. ‘‘సరికొత్త కథ, కథనాలతో తెలుగు, తమిళ భాషల్లో ఈ ‘గేమ్ ఓవర్’ చిత్రాన్ని నిర్మించాం. మా గత చిత్రాలు ‘లవ్ ఫెయిల్యూర్’, ‘గురు’ విజయాల సరసన ఈ చిత్రం కూడా నిలుస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా తప్పకుండా అలరిస్తుంది’’ అన్నారు దర్శకుడు అశ్విన్. ఈ చిత్రానికి సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్, లైన్ ప్రొడ్యూసర్: ముత్తు రామలింగం. -
సూపర్ బ్యాలెన్స్
సౌత్‌లో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్లో జోరుమీదున్నారు. సినిమా వెంట సినిమాను జెట్ స్పీడ్‌లో పూర్తి చేస్తున్నారామె. ఇటీవల ‘సాండ్ కీ అంఖే’ అనే సినిమాను పూర్తి చేశారు. బాలీవుడ్లో తాప్సీ బిజీగా ఉన్నా సౌత్‌ను నెగ్లెట్ చేయడం లేదు. సౌత్‌లో 2017లో ‘ఆనందో బ్రహ్మ’, 2018 ‘నీవెవరో’ సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఈ ఏడాది ‘గేమ్ ఓవర్’ అనే బైలింగ్వల్ (తెలుగు, తమిళం) సినిమాను రిలీజ్‌కు రెడీ చేశారు. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను దర్శకుడు అనురాగ్ కశ్యప్ బాలీవుడ్లో రిలీజ్ చేయనున్నారు. మరి.. ఈ ఏడాది తాప్సీ నటించబోయే సౌత్ సినిమా ఏంటి? అనేగా మీ డౌట్. ఆమె ఓ తమిళ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ టాక్. ‘జయం’ రవి హీరోగా అహ్మద్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. కథ పరంగా ఇద్దరు హీరోయిన్స్‌కు చోటుందట. ఒక హీరోయిన్ పాత్ర కోసం తాప్సీని సంప్రదించి, అహ్మద్ కథ వినిపించడంతో ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్. ఇలా సౌత్, నార్త్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ కెరీర్‌ను సూపర్ బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకెళ్తున్నారు తాప్సీ. -
స్క్రీన్ టెస్ట్
1932లో తెలుగు సినిమా ప్రస్థానం ‘భక్తప్రహ్లాద’తో మొదలైంది. ఆ చిత్రానికి ప్రముఖ దర్శకుడు హెచ్.ఎమ్.రెడ్డి. అదే టైటిల్‌తో 1967లో మరోసారి చిత్రపు నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కింది. రెండు చిత్రాలు పేరు తెచ్చుకున్నాయి. ఇలా హిట్ టైటిల్ రిపీట్ అయితే అదో అదనపు పబ్లిసిటీ అవుతుంది. అలా ఒకే పేరుతో విడుదలైన పలు సినిమాల గురించి ఈ వారం క్విజ్... 1. 1957లో రిలీజైన ‘మాయాబజార్’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. అదే టైటిల్‌తో 2006లో మరో సినిమా విడుదలైంది. మొదటి ‘మాయాబజార్’ దర్శకుడు కె.వి.రెడ్డి. 2006లో వచ్చిన సినిమా దర్శకుడు ఎవరు? ఎ) ఇంద్రగంటి మోహనకృష్ణ బి) నీలకంఠ సి) రవిబాబు డి) చంద్రసిద్ధార్థ్ 2.1989లో మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్‌హిట్ లవ్ స్టోరీ ‘గీతాంజలి’. అదే పేరుతో 2014లో విడుదలైన హారర్ చిత్రం ‘గీతాంజలి’కి దర్శకుడు రాజకిరణ్. కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డి లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రంలో టైటిల్ రోల్ ప్రాత పోషించిన హీరోయిన్ ఎవరో గుర్తుందా? ఎ) ‘కలర్స్’ స్వాతి బి) నందితారాజ్ సి) అంజలి డి) తేజస్వి మడివాడ 3. అక్కినేని, సావిత్రి జంటగా నటించిన ‘దేవదాసు’ సినిమా గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. 1953లో ఆ సినిమా విడుదలైంది. 1974లో హీరో కృష్ణ, 2006లో హీరో రామ్, 2018లో నాగార్జున ఈ పేరుతో మళ్లీ సినిమాలు చేశారు. రామ్ ‘దేవదాస్’ ద్వారా హీరోయిన్గా పరిచయమైన కథానాయిక ఎవరో కనుక్కోండి? ఎ) షీలా బి) హన్సిక సి) జెనీలియా డి) ఇలియానా 4. యన్టీఆర్, కృష్ణ హీరోలుగా 1973లో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం చేశారు. తర్వాత 2012లో దర్శకుడు పూరి జగన్నాథ్ అదే పేరుతో ఓ సినిమా తీశారు. ఆ సినిమాలో హీరో ఎవరో తెలుసా? ఎ) రానా బి) రవితేజ సి) రామ్ డి) కల్యాణ్ రామ్ 5. 1987లో చిరంజీవి, సుహాసిని జంటగా తమిళ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆరాధన’. అదే పేరుతో 1962లోనే యన్టీఆర్ ‘ఆరాధన’ చేశారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిందెవరో తెలుసా? ఎ) వాణిశ్రీ బి) సావిత్రి సి) జమున డి) కృష్ణకుమారి 6. కృష్ణ నటించిన 200వ చిత్రం ‘ఈనాడు’. ఆ సినిమా సూపర్‌హిట్. అదే పేరుతో 2009లో కమల్ హాసన్ హీరోగా నటించారు. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో మరో తెలుగు హీరో పోలీసాఫీసర్‌గా నటించారు. ఎవరా హీరో? ఎ) నాగార్జున బి) వెంకటేశ్ సి) రాజశేఖర్ డి) చిరంజీవి 7. 1979లో వచ్చిన యన్టీఆర్ ‘వేటగాడు’ సూపర్ హిట్. అదే టైటిల్‌తో 1995లో రాజశేఖర్ హీరోగా సినిమా చేశారు. 1979లో విడుదలైన ‘వేటగాడు’ చిత్రంలో ‘పుట్టింటోళ్లు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు...’ అనే సూపర్‌హిట్ క్లబ్ సాంగ్‌లో యన్టీఆర్‌తో కాలు కదిపిన ప్రముఖ డాన్సర్ పేరేంటి? ఎ) అనురాధ బి) జ్యోతిలక్ష్మీ సి) జయమాలిని డి) హలం 8. కె.విశ్వనాథ్ కెరీర్‌లోని అద్భుతమైన చిత్రాల్లో ‘శంకరాభరణం’ ఒకటి. ఆ సినిమా 1980లో విడుదలైంది. 2015లో విడుదలైన ‘శంకరాభరణం’ చిత్రంలో కథానాయకుడు ఎవరు? ఎ) నితిన్ బి) నవదీప్ సి) సిద్ధార్థ్ డి) నిఖిల్ 9. 1988 ‘ఘర్షణ’, 2004 ‘ఘర్షణ’ మంచి విజయం సాధించాయి. రెండు చిత్రాల్లోని పాటలు సూపర్‌హిట్. పాత ‘ఘర్షణ లోని ‘ఒక బృందావనం సోయగం...’ పాటను చిత్ర పాడారు. తర్వాతి ‘ఘర్షణ’లో ‘చెలియ చెలియ చెలియ చెలియా, అలల ఒడిలో ఎదురు చూస్తున్నా...’ పాట పాడిన గాయని ఎవరో తెలుసా? ఎ) కౌసల్య బి) శ్రేయా గోషల్ సి) మల్గాడి శుభ డి) ఎస్పీ శైలజ 10. ‘పెళ్లి పుస్తకం’ అనగానే బాపు–రమణలు గుర్తుకు వస్తారు. అదే పేరుతో మరోసారి ఓ సినిమా విడుదలైంది. మొదటిసారి విడుదలైన ‘పెళ్లి పుస్తకం’ చిత్రంలో హీరో రాజేంద్రప్రసాద్, రెండో సారి విడుదలైన చిత్రంలో హీరో ఎవరు? ఎ) రాహుల్ రవీంద్రన్ బి) నవీన్ చంద్ర సి) సుశాంత్ డి) సుమంత్ 11. 1989లో విడుదలైన జంధ్యాల దర్శకత్వం వహించిన చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. అదే పేరుతో కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డి హీరోగా మరో సినిమా తెరకెక్కింది. ఆ చిత్రంలో ఆయన సరసన హీరోయిన్గా నటించిన నటి ఎవరో తెలుసా? ఎ) ఈషా రెబ్బా బి) కృతీ కర్భందా సి) తాప్సీ డి) పూర్ణ 12. అక్కినేని, సావిత్రి జంటగా నటించిన చిత్రం ‘పవిత్రబంధం’. అదే పేరుతో వెంకటేశ్ హీరోగా ఓ సినిమా లె రకెక్కింది. ఆ చిత్రంలో ఆయన సరసన హీరోయిన్గా నటించిందెవరో గుర్తుందా? ఎ) ఆమని బి) మీనా సి) సౌందర్య డి) రోజా 13. 1968లో విడుదలైన చిత్రం ‘రాము’. యన్టీఆర్ సరసన జమున కథానాయికగా నటించారు. 1987లో బాలకృష్ణ ‘రాము’ పేరుతో సినిమా చేశారు. ఆయన సరసన నటించిన నటి ఎవరో తెలుసా? ఎ) సుహాసిని బి) రజని సి) రాధ డి) భానుప్రియ 14. కమల్‌హాసన్ ‘సత్య’ చిత్రంతో మంచి పేరు సంపాదించారు. ఆ సినిమా 1988లో విడుదలైంది. పదేళ్ల తర్వాత అదే పేరుతో ఓ సినిమా విడుదలై సంచలనం సృష్టించింది. రామ్‌గోపాల్‌వర్మ నిర్మించి, దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో హీరో జె.డి చక్రవర్తి సరసన నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) ఊర్మిళ మటోండ్కర్ బి) ఆంత్రమాలి సి) నిషాకొఠారి డి) మధుషాలిని 15. 1955లో విడుదలైన ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన క్లాసికల్ మూవీ ‘మిస్సమ్మ’. ఆ చిత్రంలో ‘మిస్సమ్మ’ గా సావిత్రి నటిస్తే 2003లో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘మిస్సమ్మ’ వచ్చింది. 2003 ‘మిస్సమ్మ’ ఎవరో తెలుసా? ఎ) సిమ్రాన్ బి) భూమికా చావ్లా సి) త్రిష డి) రమ్యకృష్ణ 16. 1948లో ఓసారి, 1970 మరోసారి, 1995లో ఇంకోసారి ఇలా అనేక సార్లు ‘ద్రోహి’ టైటిల్‌తో సినిమాలు విడుదలయ్యాయి. 1948 సినిమాకు ఎల్వీ. ప్రసాద్, 1970 సినిమాకు కె.బాపయ్య దర్శకులు. 1995లో విడుదలైన సినిమాకు దర్శకుడు ఎవరో తెలుసా? ఎ) కమల్ హాసన్ బి) సురేశ్ కృష్ణ సి) పి.సి. శ్రీరామ్ డి) అర్జున్ 17. 1951 నాటి ‘మల్లీశ్వరి’ చిత్రంలో టైటిల్ రోల్‌ను భానుమతి పోషించారు. 2004 ‘మల్లీశ్వరి’లో టైటిల్ రోల్ చేసిన నటి ఎవరు? ఎ) కత్రినాకైఫ్ బి) టబు సి) అంజలా జవేరి డి) ప్రీతి జింతా 18. చిత్తూరు నాగయ్య హీరోగా కాంచనమాల హీరోయిన్గా బి.ఎన్. రెడ్డి దర్శకత్వం వహించిన 1939 నాటి చిత్రం ‘వందేమాతరం’. రాజశేఖర్ హీరోగా నటించగా టి.కృష్ణ 1985లో ‘వందేమాతరం’ టైటిల్‌తో సినిమా తీశారు. ఆ చిత్రంలో హీరోయిన్ ఎవరు? ఎ) విజయశాంతి బి) సుహాసిని సి) సుమలత డి) రాధిక 19. 1978లో విడుదలైన ప్రేమకావ్యం ‘మరోచరిత్ర’. బాలచందర్ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో కమల్‌హాసన్, సరిత జంటగా నటించారు. 2010లో ‘దిల్’ రాజు అదే టైటిల్‌తో ఓ సినిమా నిర్మించారు. ఆ చిత్రంలో హీరో ఎవరో తెలుసా? ఎ) ఆర్య బి) భరత్ సి) ప్రిన్స్ డి) వరుణ్ సందేశ్ 20. 1963లో ఓసారి, 2018లో ఓసారి ‘నర్తనశాల’ సినిమా విడుదలైంది. 1963లో విడుదలైన ‘నర్తనశాల’ లో అభిమన్యుడు పాత్రను పోషించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) యన్టీఆర్ బి) శోభన్‌బాబు సి) అక్కినేని నాగేశ్వరరావు డి) కాంతారావు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) సి 3) డి 4) బి 5) ఎ 6) బి 7) సి 8) డి 9) బి 10) ఎ 11) డి 12) సి 13) బి 14) ఎ 15) బి 16) సి 17) ఎ 18) ఎ 19) డి 20) బి నిర్వహణ: శివ మల్లాల -
ప్రేమరాగం పాడతారా?
కవి, గేయ రచయితగా మారనున్నారట బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్. ఇందుకోసం బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రంగం సిద్ధం చేస్తున్నారట. ప్రముఖ కవి, గేయ రచయిత సాహిర్ లుధియాన్వీ బయోపిక్‌ను తెరెకెక్కించాలని భన్సాలీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. షారుక్ ఖాన్, ఐశ్యర్యా రాయ్, దీపికా పదుకోన్, ప్రియాంకా చోప్రా, ఇర్ఫాన్‌ఖాన్... తారాగణంగా ఇలా పలువురి పేర్లు పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ బయోపిక్‌లో అభిషేక్ బచ్చన్, తాప్సీల పేర్లు హీరోహీరోయిన్లుగా వినిపిస్తున్నాయి. ఇటీవల వీరిద్దరికీ ఈ సినిమా కథను నరేట్ చేశారట భన్సాలీ. సాహిర్గా అభిషేక్ బచ్చన్, ఆయన ప్రేయసి అమ్రితా ప్రీతమ్‌గా తాప్సీ కనిపిస్తారని లేటెస్ట్ బాలీవుడ్ ఖబర్. సాహిర్, అమ్రితా చాలా ఘాటు ప్రేమ అట. ఈ లవ్‌స్టోరీకి రచయిత జస్మీత్ రీన్ దర్శకత్వం వహిస్తారట. ఈ సంగతి ఇలా ఉంచితే... అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన ‘మన్మర్జియాన్’ చిత్రంలో తాప్సీ, అభిషేక్ బచ్చన్ కలిసి నటించిన విషయం తెలిసిందే. మరి.. రెండోసారి కూడా వీరి జోడి కుదిరేనా? ప్రేమరాగం పాడేనా? లెటజ్ వెయిట్ అండ్ సీ! -
ఆ ఫీలింగ్ కలగలేదు!
ఇప్పటివరకు సౌత్‌లో సత్తా చాటి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు కథానాయిక నిత్యామీనన్. ఈ ఏడాది ఆమె నార్త్ వైపు(బాలీవుడ్) కూడా దృష్టిసారించారు. ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) మార్స్ మిషన్ ఆధారంగా తెరకెక్కుతోన్న హిందీ చిత్రం ‘మిషన్ మంగళ్’ సినిమాలో నిత్యామీనన్ శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. అక్షయ్ కుమార్, విద్యాబాలన్, సోనాక్షీ సిన్హా, తాప్సీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హిందీలో ఆమె ‘బ్రీత్ 2’ అనే వెబ్ సిరీస్‌లో అభిషేక్ బచ్చన్‌కు జోడీగా నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇన్ని రోజులు సౌత్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన మీరు ఇప్పుడు నార్త్ ఇండస్ట్రీలో ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటున్నారు అన్న ప్రశ్నను నిత్యామీనన్‌ను అడిగినప్పుడు–‘‘హిందీ పరిశ్రమలో నేను ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను కానీ ఇక్కడి వారికి నేను తెలుసు. నా సినిమాలు కొన్ని హిందీలో డబ్ అయ్యాయి. న్యూ కమర్‌ని అని, అవుట్‌సైడర్‌ని అన్న ఫీలింగ్ కలగలేదు నాకు. తక్కువ కాలంలోనే స్నేహితులుగా కలిసిపోయాం. ఇప్పుడు నేను హిందీలో చేస్తున్న రెండు ప్రాజెక్ట్స్‌కు కెమెరామెన్స్ తమిళులే. వారితో నేను తమిళంలోనే మాట్లాడుతున్నాను. అక్కడ కంఫర్ట్‌గానే ఉంది. ‘మిషన్ మంగళ్’ సినిమాలో నా షూటింగ్ పూర్తికావొచ్చింది. బ్రీత్ వెబ్‌సిరీస్ ‘బ్రీత్ 2’లో నటిస్తున్నా. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘ఐరన్‌లేడీ’ సినిమాలో లీడ్ రోల్ చేయడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు. -
నా కళ్లు తెరిపించింది
2018 బాలీవుడ్ బాగా కలిసొచ్చింది తాప్సీకి. మూడు హిట్స్ అందుకోవడమే కాకుండా నటిగా అద్భుతమైన మార్కులు సంపాదించారామె. లేటెస్ట్గా యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో కలసి ‘పతీ పత్నీ అవుర్ వో’ అనే చిత్రం రీమేక్‌లో నటించడానికి అంగీకరించారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కావాలి. అయితే చివరి నిమిషంలో ఈ సినిమాలో హీరోయిన్ తాప్సీ కాదని చిత్రబృందం అనౌన్స్ చేయడంతో ఆమె షాక్ అయ్యారు. ఈ విషయం గురించి తాప్సీ మాట్లాడుతూ –‘‘ఈ సినిమా కోసం నా షెడ్యూల్ అంతా సెట్ చేసుకొని వాళ్లకు డేట్స్ ఇచ్చాను. నేను హీరోయిన్ కాదని తెలియడంతో షాక్ అయ్యాను. దర్శక–నిర్మాతలను అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఈ విషయంపై ఎంత క్లారిటీ తెచ్చుకుందామనుకున్నా జవాబు చెప్పకుండా మాట దాటేస్తున్నారు. ఈ విషయం కొంచెం ముందే తెలిసినా ఈ సినిమా కోసం సర్దుబాటు చేసిన డేట్స్ వేరే సినిమాలకైనా ఇచ్చేదాన్ని. ఈ సంఘటన వల్ల ఇకనుంచైనా జాగ్రత్తగా ఉండాలనే విషయం అర్థం అయింది. ఒక విధంగా చెప్పాలంటే జరిగిన సంఘటన నా కళ్లు తెరిపించింది’’ అని తాప్సీ పేర్కొన్నారు. -
ఐయామ్ లక్కీ
కెరీర్ తొలి దశలో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ చాలామంది నటీమణులు తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. తాజాగా ఓ ఈవెంట్లో ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి మాట్లాడారు తాప్సీ. ‘‘నా తొలి తెలుగు, హిందీ, తమిళం చిత్రాలు సక్సెస్ సాధించాయి. దాంతో ఆఫర్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం రాలేదు. క్యాస్టింగ్ కౌచ్ లాంటి అనుభవాలు నేను ఎదుర్కోలేదు. ఆ విధంగా నేను చాలా అదృష్టవంతురాలిని. కానీ, కొన్ని భయంకరమైన కథనాలు విన్నాను. నాకెలాంటి చెడు అనుభవాలు ఎదురు కాలేదని అలాంటివి జరగవనుకోవడం పొరపాటు. స్త్రీ, పురుష సమానత్వం లేకపోవడం, పవర్‌ని దుర్వినియోగం చేయడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ, క్యాస్టింగ్ గురించి బయటకు వచ్చి అందరూ మాట్లాడటం మొదలుపెట్టాక మార్పు తెలుస్తోంది. ఇవాళ సినిమా సెట్స్‌లో పురుషుల ప్రవర్తన చాలా మారింది. జాగ్రత్తగా ఉంటున్నారు. మేం పబ్లిక్ పర్సనాల్టీ కాబట్టి, సినిమా ఇండస్ట్రీ మీద అందరికీ ఆసక్తి ఉంటుంది కాబట్టి మా గురించి రాస్తారు. అయితే ఇలాంటి సంఘటనలు సినిమా ఇండస్ట్రీలోనే జరుగుతాయనుకోకూడదు. ప్రతి చోటా జరుగుతుంటాయి’’ అని పేర్కొన్నారు తాప్సీ. -
అది బోనస్ మాత్రమే!
చేతి నిండా అవకాశాలతో తాప్సీ డైరీ ఫుల్‌గా ఉంది. నార్త్‌లో మంచి జోరు మీదున్న తాప్సీ సౌత్‌లోనూ అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, తాప్సీ కలిసి నటించిన ‘పింక్’ సినిమా సూపర్‌హిట్ కావడం వల్లే బీ టౌన్లో తాప్సీ క్రేజ్ పెరిగిందని కొందరి మాట. ఈ విషయం గురించి ఆమెను అడిగితే..‘‘ప్రస్తుతం హిందీలో నాకు అవకాశాలు పెరిగాయి. కానీ ‘పింక్’ సినిమా సక్సెస్ నా లైఫ్‌లో పెద్దగా మార్పు తీసుకురాలేదు. నా కెరీర్ తొలినాళ్లో నేను నటించిన ‘ఆడుకాలమ్’ సినిమా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. అంతకన్నా ఇంకేం కావాలి. బాలీవుడ్‌కి రావడానికి ముందు నా కెరీర్లో బాక్సాఫీస్ సక్సెస్, ఫెయిల్యూర్స్‌ను చూశాను. ‘పింక్’ సినిమా సక్సెస్ ఒక బోనస్ మాత్రమే. గెలుపోటములను నేను అంత సీరియస్‌గా తీసుకోను. అలా జరిగిపోతుంటాయంతే. కానీ, నన్ను నేను సీరియస్‌గా తీసుకుంటాను’’ అని పేర్కొన్నారామె. ప్రస్తుతం ‘మిషన్ మంగళ్’ అనే హిందీ చిత్రంతోపాటు, సౌత్‌లో ‘గేమ్ ఓవర్’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు తాప్సీ. ‘పింక్’ సినిమా తర్వాత అమితాబ్, తాప్సీ కలిసి నటించిన ‘బద్లా’ సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. -
భయమే బాధ్యత
ఏదైనా సులువుగా వస్తే దాని విలువ మనకు తెలియదంటారు. అలాగే.. జర్నీ సులువుగా సాగినా కిక్ ఉండదు అంటున్నారు తాప్సీ. ఇండస్ట్రీలో తన ప్రయాణం గురించి తాప్సీ మాట్లాడుతూ– ‘‘ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రయాణం సులువు అవ్వలేదు. సులువుగా ఉండకూడదు కూడా. ఒక్కసారి అన్ని పనులు మనం కష్టపడకుండా వస్తే మనల్ని మనం గొప్పగా భావించడం మొదలుపెడతాం. ఇండస్ట్రీలో ఏదీ శాశ్వతం కాదు. ఇవాళ అభిమానులు పంచే ప్రేమ రేపు వేరే వాళ్ల పళ్లెంలోకి వెళ్లిపోవచ్చు. స్థిరత్వం అనేది ఉండని ఫీల్డ్ చిత్ర పరిశ్రమ. ఇది బావుంది కదా అని రిలాక్స్ కూడా అవ్వకూడదు. నా పాత సినిమాను ప్రేమించారు కదా చాలులే అనుకుంటే అక్కడే ఆగిపోతావు. అలా ఉండకుండా ప్రతి క్షణం భయం ఎంతో కొంత ఉంటుంది. ఆ భయమే బాధ్యత తీసుకొస్తుంది. ఎత్తుకు తీసుకువెళ్తుంది’’ అని పేర్కొన్నారు తాప్సీ. ప్రస్తుతం ఆమె ‘గేమ్ ఓవర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
నా మనస్సాక్షిని చంపుకోలేను!
సినిమా: కోలీవుడ్, టాలీవుడ్ అంటూ దక్షిణాదిలో నటిగా పేరు తెచ్చుకుని ఆ తరువాత బాలీవుడ్లో సెటిల్ అయిన నటి తాప్సీ. ఈ మధ్య తనకు సంబంధం లేని విషయాల్లో కూడా నేనున్నానంటూ బయలుదేరుతుంది తాప్సీ. ఈ అమ్మడి వ్యవహారం ఎటుదారి తీస్తుందో తెలియదుగానీ బింకాలు మాత్రం బాగానే పోతోంది. అసలు కథేంటంటే తెలుగులో బాలకృష్ణ సరసన వీరభద్ర, తమిళంలో విశాల్‌కు జంటగా తీరాద విళైయాట్టు పిళ్లై చిత్రాల్లో హీరోయిన్గా నటించిన తనూశ్రీదత్తా గురించి అప్పట్లో పెద్దగా తెలియని వారుంటారేమోగానీ ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ప్రముఖ బాలీవుడ్ నటుడు నానాపటేకర్ వంటి వారు తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ సంచలన ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కింది.ఈ విషయంలో నటి తనూశ్రీదత్తాపై విమర్శించేవారి సంఖ్యతో పాటు మద్దతిచ్చే వారి సంఖ్యంగా బాగానే ఉంది. ఎప్పుడో పదేళ్ల ముందు జరిగిన సంఘటనలను ఇప్పుడు బయట పెట్టడం ఏమిటని విమర్శిస్తున్న వాళ్ల మధ్య తనూశ్రీదత్తా ఆరోపణలకు ఆధారాలున్నాయని ఆమెకు మద్దతుగా నిలిచేనటి తాప్సీ లాంటి వారు ఉన్నారు.అసలు తనూశ్రీ గురించి నటి తాప్సీ ఏమందో చూద్దాం. సంఘటన జరిగినప్పుడే దాని గురించి బహిరంగంగా చెప్పవచ్చుగా అని నేను తనూశ్రీదత్తాను అడగను. ఆమె ఇంతకు ముందే పిర్యాదు చేసింది. అయితే అప్పట్లో ఆమెను గొంతు నొక్కే ప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది. దీంతో తనూశ్రీ ఇప్పుడు వాయిస్ పెంచింది. నాకు ఆమె మీద గానీ, తన ఉద్దేశంపైగానీ ఎలాంటిసందేహాలు లేవు. ఆమె అసభ్య సంఘటనకు గురైంది. అందుకు ఆధారాలు ఉన్నాయి. అందుకే 10 ఏళ్ల తరువాత గానీ, 40 ఏళ్ల తరువాత గానీ ఫిర్యాదు చేయడం పెద్ద విషయం కాదు. ఆ సంఘటనకు సంబంధించిన ప్రశ్నలకు తనూశ్రీ దత్తా చాలా ధైర్యంగా బదులిస్తున్నారు. అందులో ఆమె నిజాయితీ తెలుస్తోంది. తనూశ్రీదత్తాను చూసి ఆమెలా బాధింపునకు గురైనవారు ముందుకొచ్చి ధైర్యంగా చెప్పాలన్నది నా భావన. ఆమె విషయంలో నా మనసుకు అనిపించింది నేను మాట్లాడుతున్నాను. నేను నా మనసాక్షిని చంపుకుని జీవించలేను. ఇతరులేమనుకుంటారు అని భయపడుతూ జీవించలేను. నాకు నచ్చిన విధంగానే జీవిస్తాను. నా మససు స్వచ్ఛంగా ఉండబట్టే రాత్రుల్లో ప్రశాంతంగా నిద్రించగలుగుతున్నాను అని తాప్సీ పేర్కొంది. నటుడు నానాటేకర్ నటి తనూశ్రీదత్తాతో అసభ్యంగా ప్రవర్తించలేదని, అసలు అలాంటి సంఘటనే జరగలేదని చెబుతున్నారు. నటి తనూశ్రీ దత్తా వద్ద అధారాలున్నాయని నటి తాప్సీ ఆమెకు వకాల్తా పలుకుతోంది. మరో పక్క నానాపటేకర్ ఈ వ్యవమారంలో నటి తనూశ్రీదత్తాకు నోటీసులు పంపారు. దీంతో ఈ రచ్చ ఎటు దారి తీస్తుందోనన్న ఆసక్తి సినీవర్గాల్లో నెలకొంది.