నా కారణం నాకు ఉంది | Tapasi Pannu has expressed his anger over the media | Sakshi

నా కారణం నాకు ఉంది

Jun 3 2018 1:06 AM | Updated on Jun 3 2018 1:07 AM

Tapasi Pannu has expressed his anger over the media - Sakshi

తాప్సీ

నవాజుద్దీన్‌ సిద్ధిఖీ బాలీవుడ్‌లో టాప్‌ క్లాస్‌ యాక్టర్‌గా పేరు పొందారు. అంత పేరు తెచ్చుకున్న ఆయన పక్కన యాక్ట్‌ చేయడానికి తాప్సీ నిరాకరించారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, తాప్సీలతో ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ తెరకెక్కించాలనుకున్నారట దర్శకుడు హనీ త్రెహాన్‌. కానీ ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారట తాప్సీ. దీనికి కారణం సిద్ధిఖీతో ఈక్వేషన్‌ సరిగ్గా లేకపోవటమే అని బాలీవుడ్‌లో కామెంట్‌ వినిపించింది. దీనికి సమాధానమిస్తూ – ‘‘మీ (వార్త ప్రచురించిన ఓ వెబ్‌సైట్‌ని ఉద్దేశించి) హెడ్‌లైన్స్‌ కోసం ఏవేవో కారణాలు రాయొద్దు.

ఏదైనా విషయం గురించి సగం సగం తెలిసినప్పుడు సమాచారం అని రాసుకోవాలి. అంతే కానీ అంతా తెలిసినట్టు మా మీద తోసేయడం సరికాదు. యాక్టర్‌గా నాకు  చాలా అవకాశాలు వస్తూ ఉంటాయి. అన్నింటికీ ‘యస్‌’ చెప్పాలంటే కష్టం. ఏదైనా సినిమా ఒప్పుకోకపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ నేను మాత్రం ‘పర్టిక్యులర్‌ యాక్టర్‌తో కలసి నటించను’ అనే కారణంతో ఎప్పుడూ నో చెప్పను. హనీ తెహ్రాన్‌ తన ఫస్ట్‌ సినిమాకే నన్ను తీసుకోవాలనుకోవటం చాలా హ్యాపీ. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ గారి టాలెంట్‌ మీద నాకు చాలా గౌరవం ఉంది. త్వరలోనే ఆయనతో యాక్ట్‌ చేస్తానని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు తాప్సీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement