Navajuddin Siddiqui
-
నన్ను స్టార్ అనొద్దు!
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలక్షణమైన పాత్రలు చేస్తూ మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. అయితే తనను ‘స్టార్’ అని మాత్రం పిలవొద్దంటున్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ– ‘‘నన్ను స్టార్ యాక్టర్ అని పిలవడం ఇష్టం లేదు. నా దృష్టిలో ‘స్టార్, సూపర్‌స్టార్, మెగాస్టార్’ అనే ట్యాగ్స్ మార్కెటింగ్ స్ట్రాటజీకి సంబంధించినవి. ఒక వేళ నన్ను నేను ఒక స్టార్‌గా భావించి గర్వపడితే నాకు తెలియకుండానే నాలోని నటుడి ఎదుగుదలకు నేను అడ్డుకట్ట వేసినవాణ్ణి అవుతాను. నా నటనా నైపుణ్యం కూడా మెల్లిగా తగ్గిపోతుంది. మూసధోరణి పాత్రలకు అలవాటు పడిపోతాను. ఒక్కసారి స్టార్ అనే ఛట్రంలో ఇరుక్కుపోతే విభిన్నమైన పాత్రలు చేయలేం. నటులు అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటారు. అందుకే నన్ను స్టార్ అని పిలవొద్దు’’ అని పేర్కొన్నారు. -
ముంబైలో అణుబాంబు పేలుణ్ణి సైఫ్ అడ్డుకున్నాడా..!
సాత్వికత రావాలంటే తామస చర్య తప్పదేమో! యుద్ధం తర్వాతే కదా.. ప్రశాంతత ఏలుతుంది! నేటి భారతం .. కలియుగ విషబీజమని నమ్మి.. దీని గర్భాన్ని పేల్చి..సత్యయుగానికి పురుడు పోయాలని రాసిన కథే..సేక్రెడ్ గేమ్స్–2.. ‘‘ఇండియాను నాశనం చేయాలని పాకిస్తాన్... కక్ష్య తీర్చుకునే ప్రయత్నంలో ఇండియా.. జోక్యం చేసుకోవాలని అమెరికా.. ఆ జోక్యాన్ని సహించని చైనా... ఇదంతా చూస్తూ ఊరక ఉండని రష్యా.. ఇలా అన్ని దేశాలు పిచ్చిపట్టిన కుక్కల్లా కాట్లాటకు దిగుతాయి. ప్రపంచం ముగిసిపోతుంది. అప్పుడు కొత్తగా ఇంకో లోకం ఏర్పడుతుంది. అదే సత్యయుగం. ఆ కాలం తర్వగా రావాలంటే ఈ కాలం త్వరగా ముగిసిపోవాలి. దానికి నువ్వే కర్తవు.. ’’ గురూజీ తన శిష్యుడితో చెప్పిన మాట. సేక్రెడ్ గేమ్స్ థీమ్ కూడా ఇదే. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ సెకండ్ సీజన్ అంతా దీనిచుట్టే తిరుగుతుంది. గతానికి, వర్తమానానికి మారుతూ సాగే ఆ కథ క్లుప్తంగా ఇక్కడ.. బాంబ్ పేలుళ్లతో ముంబై భూస్థాపితం కాబోతోంది.. ముంబైని కాపాడమని మాఫియా డాన్ గణేష్ గైతొండే (నవాజుద్దీన్ సిద్దిఖీ) ఇన్స్పెక్టర్ సర్తాజ్ (సైఫ్ అలీ ఖాన్)కు చెప్తాడు. ముందు అసలు గైతొండేను పట్టుకుంటే డొంక కదులుతుందని బంకర్లో దాక్కున్న గైతొండేని అరెస్ట్ చేయబోతాడు సర్తాజ్. పట్టుబడడం ఇష్టం లేని గైతొండే తనను తాను కాల్చుకుంటాడు తుపాకితో. ఇక్కడితో ఫస్ట్ సీజన్ ఎండ్ అవుతుంది. సెకండ్ సీజన్లో.. ఆత్మహత్యా యత్నం చేసిన గైతోండే కెన్యాలో ప్రత్యక్షమవుతాడు. అతణ్ణి అక్కడికి తీసుకెళ్లింది ఎవరో కాదు రా ఏజెంట్ కుసుమ్ దేవి యాదవ్ (అమృతాసుభాష్) అని సెకండ్ సీజన్ ప్రారంభంలోనే తెలుస్తుంది. గైతొండేని పావుగా ఉపయోగించి ముంబైలో పేలుళ్లకు కుట్ర పన్నుతున్నదెవరో తెలుసుకోవడానికి ఆమె అలా చేస్తుంది. కెన్యాలో డ్రగ్స్, వెపన్స్ వ్యాపారంలోకి గైతొండే అడుగుపెట్టేలా చేస్తుంది కుసుమ్ దేవి యాదవ్. ఆ వ్యాపారం ద్వారా మళ్లీ ఇండియాతో సంబంధాలు పెంచుకుంటాడు గైతొండే. ఆ సమయంలోనే అతని పార్ట్నర్ త్రివేది.. అతణ్ణి క్రొయేషియాలో ఉన్న గురుజీ (పంకజ్ త్రిపాఠీ)దగ్గరకు తీసుకెళ్తాడు. ఆ గురుజీ తనను తాను అవతార పురుషుడిగా భావిస్తుండడమే కాక తన అనుయాయులనూ నమ్మిస్తూంటాడు. తన దగ్గరున్న కాలగ్రం«థంలోని బోధనలతో గైతొండే మనసులో తండ్రిగా స్థానం సంపాదించుకుంటాడు. తను ఏం చెబితే అదే నిజమని గైతొండే విశ్వసించేటట్టు తయారు చేసుకుంటాడు గురూజీ. గైతొండే కూడా గురుజీ సాంగత్యంలో ప్రశాంతతను ఆస్వాదిస్తుంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ఆశ్రమాన్ని కన్ఫెషన్ బాక్స్లా భావిస్తుంటాడు. సేక్రెడ్ గేమ్స్–2లోని నటీనటులు సర్తాజ్ సింగ్.. తన తండ్రి కానిస్టేబుల్ దిల్బాఘ్సింగ్కు గురూజీతో, గైతొండేతో లింక్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఇన్స్పెక్టర్ సర్తాజ్సింగ్కు. అసలు ఆ గురూజీ ఎవరో తెలుసుకోవడానికి ముంబైలో ఉన్న ఆశ్రమానికి వెళ్తాడు సర్తాజ్. అక్కడే గురూజీ అనుంగు శిష్యురాలైన బత్యా (కల్కి కొచ్లిన్)తో స్నేహమేర్పడుతుంది. ఆ బోధనలకు అతనూ ఆకర్షితుడవుతాడు. తన జీవితంలోని విషాదాలన్నిటికీ అక్కడ సాంత్వన పొందుతూంటాడు. అయితే అప్పటికే గురూజీ చనిపోయి ఉంటాడు. గురూజీ ఎలా చనిపోయాడో తెలుసుకునే ముందు అసలు దిల్బాఘ్ సింగ్‌కి గైతొండే, గురూజీలతో ఉన్న సంబంధం గురించి..దిల్బాఘ్ సింగ్... గురూజీని గుడ్డిగా అనుసరించే అనుచరుల్లో ఒకడిగా ఉండడమే కాక సత్యయుగాన్ని తీసుకురావాల్సిన గురూజీ బాధ్యతల్లో పాలుపంచుకునే భారాన్నీ మోస్తూంటాడు. గైతొండేకు గురూజీని పరిచయం చేయడమే దిల్బాఘ్ భుజాల మీదున్న భారం. ఒక సందర్భంలో గైతొండేను రక్షిస్తాడు దిల్బాఘ్. కానుకల ద్వారా ఆ కృతజ్ఞతను తీర్చుకోవాలనుకుంటాడు గైతొండే. ప్రత్యుపకారం చేయాలని ఉవ్విళ్లూరుతున్న అతని స్థితి చూసి.. అతణ్ణి గురూజీకి పరిచయం చేయాల్సిన కరెక్ట్ టైమ్ ఇదేనని గ్రహిస్తాడు దిల్బాఘ్. ‘‘తిరిగి నువ్వు నాకు సాయం చేయాల్సిన పనేంలేదు కాని నేను దేవుడిగా భావిస్తున్న గురూజీని ఒకసారి కలువు చాలు’’ అని చెప్తాడు గైతొండేతో. అలా మొదటిసారి గురూజీ గురించి తెలుసుకుంటాడు గైతొండే. గురూజీ మరణం.. ‘‘అహం బ్రహ్మాస్మి’’ అంటూ మార్దవ స్వరంతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్న గురూజీ మెదడు ఒక క్రౌర్యమని తెలుసుకున్న గైతొండే హతాశుడవుతాడు. తనను అడ్డం పెట్టుకొని టెర్రరిస్ట్ సంస్థలతో కలిసి ముంబైని భూస్థాపితం చేయాలని ప్లాన్ చేస్తున్నాడని అర్థమై గురూజీని చంపేస్తాడు గైతొండే. వర్తమానంలో.. అలా గురూజీ మరణించిన తర్వాతే ఆ ఆశ్రమానికి వస్తాడు సర్తాజ్. అప్పటికే అంటే అతని టీన్స్‌లోనే సర్తాజ్ తండ్రీ చనిపోతాడు. ఆడియో ద్వారా, బత్యా ద్వారా గురూజీ ఉపన్యాసాలతో ప్రభావితుడై ఆ భావజాలంలో మునగబోతున్న సర్తాజ్కు ఒకరోజు.. గురూజీ కలలు కన్న సత్యయుగం గురించి చెప్తుంది బత్యా. దానికోసం వేసిన ముంబై పేలుళ్ల పథకానికీ అతని సహాయం అడుగుతుంది. యాజ్‌యూజువల్‌గా షాక్ అవుతాడు సర్తాజ్. ‘‘మీరంతా ఒక పిచ్చిలోకంలో బతుకుతున్నారు’’ అంటూ అక్కడినుంచి వెళ్లిపోతాడు. కాని ముంబై పేలుళ్ల కుట్రను భగ్నం చేయాలంటే బత్యాతో స్నేహం నటించాలని మళ్లీ ఆశ్రమానికి వెళ్తాడు సర్తాజ్. ఈలోపు గురూజీని చంపేసిన గైతొండేని పట్టుకోవాలని ఆశ్రమంలోని వారికి పురమాయిస్తుంది బత్యా. జోజో అనే జూనియాక్టర్స్ సప్లయర్, బ్రోతల్ హౌజ్ ఓనర్‌ను ఎరగా వేసి గైతొండేను పట్టుకునే ప్రయత్నం మొదలుపెడ్తారు వాళ్లు. అది తెలుసుకున్న గైతొండే జోజోను చంపేస్తాడు. ఇటువైపు సర్తాజ్ కూడా బత్యాను తుపాకితో కాల్చి.. ఆశ్రమంలోని కాలగ్రంథాన్ని తీసుకెళ్లిపోతాడు. అప్పటికే.. ముంబై నడి బొడ్డున ఉన్న ఓ పార్కింగ్ కాంప్లెక్స్‌లో న్యూక్లియర్ బాంబ్‌ను సెట్‌చేసి పెడ్తాడు పాకిస్తాన్ ఏజెంట్ షాహిద్ ఖాన్. అతను ఎవరో కాదు సర్తాజ్ పెద్దమ్మ కొడుకే. ఇండియా, పాకిస్తాన్ విభజన సమయంలో లాహోర్ నుంచి ఇండియాకు వస్తూన్నప్పుడు బార్డర్లో సర్తాజ్ పెద్దమ్మను కిడ్నాప్ చేసి లాహోర్‌కే తీసుకెళ్లిపోతారు ముస్లింలు. ఈ కుటుంబం మళ్లీ లాహోర్‌కు వెళ్లి.. ఆమెను వెదికే పరిస్థితి ఉండదు. దాంతో ఆమె అక్కడే పాకిస్తాన్‌లోనే ఉండిపోయి ముస్లిం వ్యక్తికే భార్య అయి.. షాహిద్‌ఖాన్‌కు తల్లి అవుతుంది. ఈ విషయం ఇటు సర్తాజ్కు, అటు షాహిద్ ఖాన్‌కూ తెలియదు. ఇక బాంబు సంగతికి వస్తే.. గురూజీ ఆధ్వర్యంలో కొందరు రాజకీయ నేతలు, పోలీస్ అధికారుల అండదండలతో తయారైన ఆ న్యూక్లియర్ బాంబు .. హిరోషిమాను పేల్చిన అణుబాంబు కన్నా అరవై రెట్ల అధిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఆ బాంబు సమాచారం తెలిసిన వెంటనే ఆ స్థలానికి వెళ్లిన పోలీసు అధికారుల మీద కాల్పులు జరుపుతాడు అక్కడే పొంచి ఉన్న షాహిద్ ఖాన్. ఈలోపు కాల గ్రంథంతో అక్కడికి చేరుకుంటాడు సర్తాజ్. బాంబ్‌ను నిర్వీర్యం చేసే సైంటిస్ట్ ఆ పాస్వర్డ్ ప్యాటర్న్ కనుక్కోలేక ఉన్న అయిదు ఎటెంప్ట్స్‌లో రెండిటిని వృథా చేస్తుంది. అది పేలడానికి ఎనిమిది నిమిషాల టైమే ఉంటుంది. షాహిద్ ఖాన్‌ను పట్టుకొని టార్చర్ పెట్టినా పాస్వర్డ్ చెప్పడు. ఆగ్రహావేశంలో అతణ్ణి కాల్చేస్తాడు సర్తాజ్. ఇంక బాంబ్‌ను నిర్వీర్యం చేయడం అసాధ్యమని అక్కడినుంచి వెళ్లిపోతారంతా. సర్తాజ్ మాత్రం అక్కడే ఉండి ఆ కాలగ్రంథంలోని ప్యాటర్న్స్‌తో ట్రై చేస్తూంటాడు. చివరి ఎటెంప్ట్తో సెకండ్ సీజన్ ఎండ్ అవుతుంది. ఈ ఎండ్లెస్ ఎండ్ మూడో సీజన్ ఉందేమోనన్న క్లూనిస్తోంది కాని ఉంటుందన్నట్టుగానైతే ప్రకటించలేదు దర్శక నిర్మాతలు. ఇంతకన్నా ఏం కావాలి? స్టార్స్‌తో నేనెప్పుడూ వర్క్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్. సైఫ్ చాలా ఇంటెలిజెంట్, బాగా చదువుతాడు.. ప్రతి విషయాన్ని శ్రద్ధగా విని అంతే శ్రద్ధతో ఎక్స్‌ప్రెస్ చేస్తాడు. ఒక డైరెక్టర్‌కి ఇంతకన్నా ఏం కావాలి? దాంతో అతణ్ణి డైరెక్ట్ చేయడం డే వన్ నుంచే నాకు ఈజీ అయిపోయింది. సెట్స్‌లో పాలిటిక్స్ గురించి డిస్కస్ చేసేవాడు.. పాత్రలో ఇమిడిపోవడానికి. – నీరజ్ ఘేవాన్ (మసాన్ ఫేం)..సేక్రెడ్ గేమ్స్2లో సైఫ్ అలీ ఖాన్ ఎపిసోడ్స్‌ను డైరెక్ట్ చేశాడు. ఆడియెన్స్నుఇన్వాల్వ్ చేయడానికి.. సేక్రెడ్ గేమ్స్ ఫస్ట్ సీజన్ పట్ల ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. సెకండ్ సీజన్ పట్లా లేవు క్రైమ్, పాలిటిక్స్, రెలీజియన్, టెర్రరిజం అన్నీ కలిసి జటిలంగా అనిపిస్తాయి. నవాజ్.. నేను అనుకున్నదానికన్నా గొప్పగా చేశాడు. ఫస్ట్ సీజన్లో కొన్ని విమర్శలు వచ్చాయి. ఒక కథ చెప్తున్నప్పుడు ఆడియెన్స్‌ను అందులో ఇన్వాల్వ్ చేయడానికి ఆ కాలమాన పరిస్థితులను, అప్పుడు జరిగిన సంఘటనలు, సందర్భాలనూ కథలో చూపించాల్సి ఉంటుంది. సేక్రెడ్ గేమ్స్ క్రెడిట్ అంతా టీమ్‌దే. ఎస్పెషల్లీ వరుణ్ గ్రోవర్, విక్రమ్‌చంద్ర, పూజ, స్మిత, వసంత్, ధ్రువ్, నిహిత్.. అందరిదీ. – అనురాగ్ కశ్యప్ ఆర్జీవీ ఇందులో రామ్‌గోపాల్‌వర్మ మీద ఒక స్పూఫ్ ఉంటుంది. కెన్యాలో ఉన్న గైతొండే.. తన గురించి మరిచిపోయిన ముంబైకి తన జీవిత చరిత్రను సినిమాగా తీసి గుర్తుచేయాలనుకుంటాడు. మాఫియా డాన్స్ మీద సినిమా తీయడానికి రామ్ జీ వర్మ (రామ్‌గోపాల్ వర్మ పాత్ర)ను మించిన డైరెక్టర్ లేడని తెలుసుకొని అతణ్ణి ఆఫ్రికా రప్పించి సినిమా తీయిస్తాడు గైతొండే. ఇరవై నాలుగ్గంటలూ సెల్‌ఫోన్ చూసుకుంటూ, టెక్స్ట చేసుకుంటూ.. ఆర్జీవీ బాడీ లాంగ్వేజ్‌ను, మ్యానరిజమ్స్‌ను, శ్రీదేవి పట్ల అతనికున్న అబ్సేషన్ను అద్భుతంగా అభినయించాడు రామ్ జీ వర్మగా నటించిన విజయ్ మౌర్య. చేయను.. చూస్తా.. నిజానికి ఆ ఎపిసోడ్లో ఆ డైరెక్టర్ రోల్‌కి రామ్‌గోపాల్ వర్మనే అడిగాడట అనురాగ్ కశ్యప్. ‘‘నేను చేయను. కాని ఎవరు చేశారో.. ఎలా చేశారో సిరీస్‌లో చూస్తా. అసలు నువ్వు నన్నెలా చూశావో .. చూస్తున్నావో.. తెలుస్తుంది ఆ రోల్‌తో’’ అని అనురాగ్‌తో అన్నాడట ఆర్జీవీ. – సరస్వతి రమ -
ఖాన్ల పని అయిపోలేదు
2018లో సల్మాన్, ఆమిర్, షారుక్ ఖాన్లు నటించిన ‘రేస్ 3, థగ్స్ ఆఫ్ హిందోస్తాన్, జీరో’ చిత్రాలు విఫలం కావడంతో బాలీవుడ్లో ‘ఖాన్ల పని అయిపోయింది. ఖాన్‌దాన్‌కి చుక్కెదురు’ అనే కామెంట్లు వినిపించాయి. అయితే బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీ మాత్రం ‘ఒక్క సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన ఖాన్ల పని అయిపోయిందనుకోకూడదు’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘సినిమాల్లో మార్పు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. సినిమాల్లో స్థిరంగా ఉండేది మార్పు మాత్రమే. ఇలా మార్పుకి కారణమైన శేఖర్ కపూర్, అనురాగ్ కశ్యప్, రామ్‌గోపాల్ వర్మ లాంటి దర్శకులను అభినందించాలి. ఈ మధ్య చాలామంది కొత్త తరం సినిమాలు వస్తున్నాయంటున్నారు. అవి ఎప్పుడూ ఉండేవే. వీటితో ఖాన్ల సినిమాలు పోల్చి వాళ్ల పనైపోయింది అనుకోకూడదు. ఇండస్ట్రీ అలా వర్క్ అవ్వదు’’ అని అన్నారు. -
బ్యాడ్ లక్
‘పేట్టా’ సినిమాతో తమిళ పరిశ్రమకు పరిచయమయ్యారు బాలీవుడ్ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీ. తన పాత్రకు మంచి అభినందనలు అందుకుంటున్నారాయన. తమిళ సూపర్ స్టార్ రజనీతో యాక్ట్ చేశారు. మరి కమల్‌తో ఎప్పుడు యాక్ట్ చేస్తారు అని ఇటీవల ఓ సందర్భంలో నవాజుద్దిన్ని అడగ్గా ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. ‘‘నేను ఆల్రెడీ కమల్ హాసన్‌తో నటించాను. ‘హే రామ్’ సినిమాలో నాకు ఆ అవకాశం దొరికింది. కానీ, నా బ్యాడ్ లక్ ఆ సీన్స్ ఎడిటింగ్‌లో కట్ అయిపోయాయి. ఆ తర్వాత ‘అభయ్’ సినిమాకి హిందీ డైలాగ్ కోచ్‌గా పని చేశాను కూడా’’ అని పేర్కొన్నారు నవాజుద్దిన్. -
మిస్టర్ సింగార్ సింగ్
విలక్షణ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ‘పేట్టా’ సినిమాతో సౌత్‌కు వస్తున్నారు. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘పేట్టా’ చిత్రాన్ని ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీంతో ఈ సినిమాలో కీలక పాత్రలు చేసిన నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్‌సేతుపతి, బాబీ సింహా ఇలా ఒక్కొక్కరి లుక్‌ను విడుదల చేస్తున్నారు. ఇటీవల విజయ్‌సే తుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ లుక్స్‌ను రిలీజ్ చేశారు. జీతూ పాత్రలో విజయ్‌సేతుపతి నటించగా, సింగార్ సింగ్ పాత్రలో నవాజ్ కనిపిస్తారు. అలాగే ఈ సినిమాలోని ‘మరణ మాస్..’ అనే సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇప్పుడు ఈ సినిమాలోని మరో సాంగ్ ‘ఉల్లాలా...’ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ కానుంది. త్రిష, సిమ్రాన్, మేఘా ఆకాష్, మాళవికా మోహనన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. -
బాషా తర్వాత పేట్టా!
సంక్రాంతి పండక్కి వెండితెరపై రజనీకాంత్ సందడి చేయడం కన్ఫార్మ్ అయిపోయింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం ‘పేట్టా’. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, సిమ్రాన్, త్రిష, మేఘా ఆకాష్, మాళవిక మోహనన్ కీలక పాత్రలు పోషించారు. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ సిని మాను సంక్రాంతి పండక్కి రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ‘‘అవును... తలైవర్ (నాయకుడు) రజనీకాంత్ సంక్రాంతికి వస్తున్నారు’’ అని కార్తీక్ సుబ్బరాజ్ పేర్కొన్నారు. ‘‘రజనీకాంత్‌సార్ సరసన నటిస్తానని ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు సిమ్రాన్. డైరెక్టర్లు మహేంద్రన్, శశికుమార్, నటులు బాబీ సింహా, సనత్‌రెడ్డి తదితరులు నటించిన ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. ఈ సినిమా జనవరి 10న విడుదల అవుతుందని కోలీవుడ్ టాక్. రజనీకాంత్ కెరీర్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచి, ట్రెండ్ సెట్ చేసిన ‘బాషా’ తర్వాత సంక్రాంతికి విడుదలవుతున్న ఆయన సినిమా ‘పేట్టా’ కావడం విశేషం. ఈ సంగతి ఇలా ఉంచితే.. రజనీకాంత్ నటించిన ‘2.ఓ’ ఈ నెల 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
ఇప్పుడు కో–స్టార్‌గా...
రజనీకాంత్ ‘పేట్టా’లోని తారాగణం రోజు రోజుకీ భారీగా మారుతోంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహాలు ఎంటరయ్యారు. తాజాగా ఈ టీమ్‌లోకి తమిళ దర్శకుడు మహేంద్రన్ కూడా జాయిన్ అయ్యారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘పేట్టా’. రజనీకాంత్‌తో ‘ముల్లుమ్ మలరుమ్, జానీ’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన మహేంద్రన్ ఈ సినిమాలో మంచి పాత్ర పోషిస్తున్నారు. పదేళ్లుగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న మహేంద్రన్ విజయ్ ‘తేరీ’తో నటుడిగా ఇండస్ట్రీకు కమ్ బ్యాక్ ఇచ్చారు. అంతకుముందు ఆయన దర్శకుడిగా మాత్రమే చేసేవారు. కమ్‌బ్యాక్‌లో ఒకప్పుడు తాను సూపర్ హిట్ సినిమాలు తీసిన హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మహేంద్రన్‌కి ఓ కొత్త ఎక్స్పీరియన్స్. ప్రస్త్రుతం వారణాసీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. -
చదివేస్తున్నారు
కైసా హై? క్యా కర్తా హై? అని హిందీ లాంగ్వేజ్‌లో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీని ప్రశ్నలు అడిగితే తమిళంలో ఆన్సర్స్ చెబుతున్నారు. ఎందుకంటే రజనీకాంత్‌కు దీటుగా డైలాగ్స్ చెప్పాలని తమిళ డైలాగ్స్ ప్రిపేర్ అవుతున్నారాయన. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో త్రిష, సిమ్రాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలో కనిపించన్నారు. 19 ఏళ్ల సినీ ప్రస్థానంలో బాలీవుడ్లో ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేసిన ఆయన ఈ సినిమాతో కోలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ‘‘నా తొలి తమిళ సినిమాకు డైలాగ్స్ ప్రిపేర్ అవుతున్నాను. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని ఓ ఫొటోను షేర్ చేశారు సిద్ధిఖీ. ఫొటో చూస్తుంటే నవాజుద్దీన్ శ్రద్ధగా చదివేస్తున్నట్లు అనిపిస్తోంది కదూ. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
సూపర్ స్టార్ సినిమాలో...
రజనీకాంత్ హీరోగా ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తారని, నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర చేయనున్నారని ఇటీవల చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు నటి సిమ్రాన్, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీలు ఈ సినిమా యూనిట్లోకి జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సిమ్రాన్‌ని ఏ పాత్రకు తీసుకున్నారనేది బయటపెట్టలేదు. అయితే కోలీవుడ్ ఊహల ప్రకారం ఆమెకు రజనీ సరసన నటించే గోల్డెన్ చాన్స్ దక్కిందట. ఈ సినిమాలో బాబీ సింహా, సానత్ రెడ్డి, మేఘా ఆకాశ్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. -
నా కారణం నాకు ఉంది
నవాజుద్దీన్ సిద్ధిఖీ బాలీవుడ్లో టాప్ క్లాస్ యాక్టర్‌గా పేరు పొందారు. అంత పేరు తెచ్చుకున్న ఆయన పక్కన యాక్ట్ చేయడానికి తాప్సీ నిరాకరించారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. నవాజుద్దీన్ సిద్ధిఖీ, తాప్సీలతో ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కించాలనుకున్నారట దర్శకుడు హనీ త్రెహాన్. కానీ ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారట తాప్సీ. దీనికి కారణం సిద్ధిఖీతో ఈక్వేషన్ సరిగ్గా లేకపోవటమే అని బాలీవుడ్లో కామెంట్ వినిపించింది. దీనికి సమాధానమిస్తూ – ‘‘మీ (వార్త ప్రచురించిన ఓ వెబ్‌సైట్‌ని ఉద్దేశించి) హెడ్‌లైన్స్ కోసం ఏవేవో కారణాలు రాయొద్దు. ఏదైనా విషయం గురించి సగం సగం తెలిసినప్పుడు సమాచారం అని రాసుకోవాలి. అంతే కానీ అంతా తెలిసినట్టు మా మీద తోసేయడం సరికాదు. యాక్టర్‌గా నాకు చాలా అవకాశాలు వస్తూ ఉంటాయి. అన్నింటికీ ‘యస్’ చెప్పాలంటే కష్టం. ఏదైనా సినిమా ఒప్పుకోకపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ నేను మాత్రం ‘పర్టిక్యులర్ యాక్టర్‌తో కలసి నటించను’ అనే కారణంతో ఎప్పుడూ నో చెప్పను. హనీ తెహ్రాన్ తన ఫస్ట్ సినిమాకే నన్ను తీసుకోవాలనుకోవటం చాలా హ్యాపీ. నవాజుద్దీన్ సిద్ధిఖీ గారి టాలెంట్ మీద నాకు చాలా గౌరవం ఉంది. త్వరలోనే ఆయనతో యాక్ట్ చేస్తానని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు తాప్సీ. -
రియల్ మామ్
మామ్.... శ్రీదేవి జీవించిన సినిమా. కూతురికి జరిగిన అన్యాయానికి లోపల్లోపలే కుమిలిపోతూ తమ రాత ఇంతేనని తలపట్టుకుని ఏడుస్తూ కూర్చునే అమ్మ కాదు. బిడ్డ క్షోభను తీర్చడానికి తన బతుకును పణంగా పెట్టే సాహసానికి ఒడిగడుతుంది... విజయం సాధిస్తుంది ఈ అమ్మ. ఆమె పేరు దేవకి సబర్వాల్ (శ్రీదేవి). ఢిల్లీలోని ఓ పెద్ద స్కూల్లో బయాలజీ టీచర్. అదే స్కూల్లో తన కూతురు ఆర్యా పన్నెండో తరగతి చదువుతుంటుంది. అయితే ఆమెకు దేవకి సవతి తల్లి. దేవకి.. ఆర్యాను కూడా తన కడుపున పుట్టిన చిన్న కూతురు ప్రియాలాగే చూసుకున్నా సవతి తల్లిని తల్లిగా ఆమోదించదు ఆర్యా. స్కూల్లో పిలిచినట్టుగానే ఇంట్లో కూడా ‘మామ్’ (మేడమ్) అనే పిలుస్తుంది. కూతురి ప్రవర్తనకు నొచ్చుకుంటుంటాడు తండ్రి ఆనంద్. సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు. ‘‘నాన్నా... అమ్మ తర్వాత నీ జీవితంలోకి ఇంకో స్త్రీ రావచ్చు. కాని కూతురి జీవితంలోకి ఇంకో అమ్మ రాదు. దయచేసి నన్ను ప్రెషర్ చేయొద్దు ఈ విషయంలో’’ అని చెప్తుంది తండ్రితో. ఇటు బిడ్డ బిహేవియర్‌తో భార్య ఏం ఫీలవుతుందోనని సతమతమవుతుంటాడు ఆనంద్. అతను భావిస్తున్నట్టుగానే పెద్ద కూతురి పద్ధతికి దేవకి మనసు చివుక్కుమంటుంటుంది కాని ఆర్యా స్థానంలో ఉండి ఆలోచిస్తుంటుంది. తన స్నేహితులకు ఆర్యాను తన కూతురుగా పరిచయం చేయడాన్ని కూడా ఆ పిల్ల సహించదు. ఆ విషయాన్ని మొహమ్మీదే స్పష్టం చేస్తుంది. అలాగని దేవకికి పుట్టిన ప్రియతో సొంత అక్కలాగే మెదులుతుంది మళ్లీ. దేవకిని తల్లిగా తప్ప మిగతా అన్ని విషయాలను యాక్సెప్ట్ చేస్తుంది. ఈ విషయం అర్థం చేసుకున్న దేవకి ఆనంద్‌తో అంటుంది.. ‘‘ఆర్యాకు మన పరిస్థితి అర్థం చేయించడం కాదు.. మనమే ఆర్యాను అర్థం చేసుకోవాలి’’ అని. వాలంటైన్స్ డే ఆర్యాపై ఆమె క్లాస్మేట్ అబ్బాయి ఒకడు క్రష్ పెంచుకుంటాడు. అస్తమానం ఏవేవో మెసేజెస్ పంపిస్తుంటాడు. ఆర్యా చిరాకుపడుతుంటుంది. ఒకసారి క్లాస్‌లో దేవకి లెసన్ చెప్తుంటే ఏదో బూతు వీడియో పంపిస్తాడు. తన పక్కనే ఉన్న స్నేహితురాలికి చూపించి ఏవగించుకుంటుంది ఆర్యా. ఈ కలకలంతో దేవకి వాళ్ల బెంచ్ దగ్గరకు వచ్చి ఏం జరిగిందంటూ ఆ సెల్ ఫోన్ తీసి చూస్తుంది. విస్తుపోయి ఆ అబ్బాయి సెల్ లాక్కుని కిటికీలోంచి బయటకు పారేస్తుంది. ఈ విషయం మనసులో పెట్టుకొని పగ పెంచుకుంటాడు ఆ అబ్బాయి. ఇదిలా ఉండగా వాలంటైన్స్ డేకి ఓ రిసార్ట్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు ఆర్యా ఫ్రెండ్స్. తండ్రిని పర్మిషన్ అడుగుతుంది. అది చాలా దూరం. వద్దు అని దేవకి అంటుంది. నేను మా నాన్నను అడుగుతున్నాను అంటూ తండ్రిని బతిమాలుతుంది. రాత్రి పన్నెండు కల్లా ఇంటికి వచ్చేస్తాను అని మాటిచ్చి తండ్రి దగ్గర అనుమతి తీసుకుంటుంది. తెల్లవారి తండ్రి బిజినెస్ ట్రిప్ మీద అమెరికా వెళ్తాడు. వాలంటైన్స్ డై రోజు రాత్రి పార్టీకి ఆర్య వెళ్తుంది. అక్కడ తనకు ఇష్టమైన అబ్బాయిని ప్రపోజ్ చేయాలనుకుంటుంది. కాని అతను ఇంకో అమ్మాయితో కనిపించే సరికి ఇక అక్కడ ఆర్యాకు ఉండాలనిపించదు. ఫ్రెండ్‌తో చెప్పి వెళ్లిపోదామంటుంది. కాని ఫ్రెండ్ అప్పటికే తాగిన మత్తులో ఉండడం వల్ల క్యాబ్ బుక్ చేద్దామని కాస్త పక్కకు వెళ్తుంటే క్లాస్‌లో తన మీద క్రష్ పెంచుకున్న అబ్బాయి అండ్ గ్యాంగ్ కనిపిస్తారు. ఆ అబ్బాయి ఆర్యాను తనతో డ్యాన్స్ చేయమని అడుగుతాడు. ఆర్యా తిరస్కరించి క్యాబ్ బుక్ చేయడానికి బయటకు వెళ్తుంది. ఆ అవమానాన్ని తట్టుకోలేని ఆ క్లాస్మేట్ తనతోపాటే ఉన్న తన కజిన్, కార్ డ్రైవర్‌కి చెప్పి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలంటాడు. ఆ రిసార్ట్ వాచ్‌మన్‌తో కలిసి ఆర్యాను కిడ్నాప్ చేస్తారు. అంతకుముందే ఆర్యాకు దేవకి కాల్ చేస్తుంది బయలుదేరమని. క్యాబ్ బుక్ చేస్తున్నాను,... 45 నిమిషాల్లో ఉంటాను ఇంట్లో అని చెప్తుంది ఆర్యా. కాని రెండున్నర గంటలు గడిచినా ఆర్య రాకపోయేసరికి కంగారు పడ్తుంది. ఫోన్ చేస్తుంటే కూడా ఆర్యా ఎత్తకపోయేసరికి దేవకి కంగారు భయంగా మారుతుంది. గటేరులో... రాత్రి రెండున్నర గంటలకు కార్లో రిసార్ట్‌కు బయలుదేరుతుంది దేవకి. అక్కడ ఆర్యాతోపాటు వెళ్లిన వాళ్లను ఆరా తీస్తుంది. ఆర్యా అప్పుడే వెళ్లిపోయింది అంటారు. కాళ్లు చేతులు వణుకుతాయి దేవకికి. నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుంది. కంప్లయింట్ ఇస్తుంది. వాలంటైన్స్ డే కదా... ఏ బాయ్ఫ్రెండ్తోనో వెళ్లి ఉంటుంది. ఎంజాయ్ చేసి వస్తుందిలే అని పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతుంది. మీకిలాంటివన్నీ మామూలే కావచ్చు, కాని మాకు కాదు. నా కూతురు అలాంటిది కాదు అని తీవ్రంగానే చెప్పి తన కూతురు జాడ వెతకమని సీరియస్‌గా అంటుంది. అక్కడే ఉన్న ఓ ప్రైవేట్ డిటెక్టివ్ దయాశంకర్ కపూర్ (నవాజుద్దీన్ సిద్దిఖీ)దేవకి బయటకు వెళ్లగానే వెంటే వెళ్లి తన గురించి చెప్పి బిజినెస్ కార్డ్ ఇస్తాడు. అవసరం ఉంటే కాంటాక్ట్ చేయమని. తనకు అవసరం లేదని చెప్తుంది. ‘‘నాకూ ఓ కూతురు ఉంది. మీ బాధను అర్థం చేసుకోగలను. అందుకే హెల్ప్ చేయగలను అంటున్నా’’ అని చెప్తాడు. ఇదిలా ఉంటే మార్నింగ్ వాక్కు వెళ్లిన వాళ్లు పద్ధెనిమిదేళ్ల ఓ అమ్మాయి గటేరులో పడి ఉండడం చూసి హాస్పిటల్లో చేరుస్తారు. ఆ అమ్మాయి ఆర్యా అని తెలిసి దేవకికి కబురు పంపిస్తారు. పరీక్షలో ఆమె గ్యాంగ్ రేప్‌కి గురయిందని తేలుతుంది. అపస్మారక స్థితిలో ఉన్న బిడ్డను చూసి గుండె పగిలేలా ఏడుస్తుంది దేవకి. భర్తకు ఫోన్ చేస్తుంది వెంటనే రమ్మని. ఒక్కొక్కరుగా... విషయం కోర్ట్ వరకూ వెళ్తుంది. రేప్ చేసింది ఆర్యా క్లాస్మేట్ అయిన ఆ అబ్బాయి, కజిన్, వాళ్ల డ్రైవర్, వాచ్‌మన్ అని ఆర్యా చెప్తుంది. కాని డబ్బుతో మేనేజ్ చేసి నిర్దోషులుగా బయటకు వస్తారు. ఈ కేస్‌ను డీల్ చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్ ఫ్రాన్సిస్ మాథ్యూ (అక్షయ్ ఖన్నా) కూడా ఖంగు తింటాడు. ఎలాగైనా వాళ్లకు శిక్ష పడేలా చేయాలని సరైన సాక్ష్యాలను వెదికే పనిలో ఉంటాడు. ఇంకో వైపు ఆర్యా లోకంతో సంబంధంలేనిదానిలా అయిపోతుంది. దేనికీ స్పందించదు. గది నుంచి బయటకు రాదు. జరిగిన సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా కంపించిపోతుంటుంది. అర్ధరాత్రి లేచి షవర్ కింద కూర్చుని శరీరాన్ని తొలి చేసుకునే ప్రయత్నం చేస్తుంటుంది. బిడ్డ మానసిక స్థితి అర్థమైన దేవకికి కంటి మీద కునుకు ఉండదు. దాంతో దయాశంకర్ కపూర్‌ను కలుస్తుంది. ఆ నలుగురి వివరాలు తీసుకుంటుంది. వాచ్‌మన్ క్యాస్ట్రేషన్కు లోనవుతాడు. ఆర్యా క్లాస్మేట్ వాళ్ల కజిన్ యాపిల్ సీడ్స్ పౌడర్ (ఇది సైనైడ్లాంటిది) కలిసి ఉన్న ప్రొటీన్ షేక్ తాగడం వల్ల పక్షవాతానికి లోనై చావుకి దగ్గరవుతాడు. ఇది చేసింది అతని కజినే అని పోలీస్ ఎంక్వయిరీలో తేలి ఆర్యా క్లాస్మేట్ జైలు పాలవుతాడు. వీళ్లందరూ వరుసగా ఇలా పనిష్మెంట్కు గురవుతుంటే అటు పోలీస్ ఫ్రాన్సిస్, ఇటు ఆర్యా ఆశ్చర్యపోతారు. ఆర్యా కాస్త తేలికపడుతుంది. ఫ్యామిలీ అంతా కుఫ్రీ పోదామని అడుగుతుంది తండ్రిని. వెళ్తారు. అయితే పోలీస్ ఫ్రాన్సిస్‌కు దేవకి మీద అనుమానం మొదలై గమనిస్తుంటాడు. వాళ్లను మట్టుబెడుతుంది దేవకే అని నిర్థారణకూ వస్తాడు. చట్టాన్ని ఆమె చేతుల్లోకి తీసుకోకుండా ఆపాలనుకుంటాడు. ఇంతలోకే ఆర్యా క్లాస్మేట్ కజిన్ వాళ్ల డ్రైవర్‌కు దయాశంకర్ మీద డౌట్ వచ్చి నివృత్తి చేసుకుని అతన్ని చంపేస్తాడు, కుఫ్రీకి వస్తాడు దేవకీని మట్టుబెట్టడానికి. ఫ్రాన్సిస్ కూడా చేరుకుంటాడు అతన్ని ఫాలో అవుతూ. దేవకి మీద దాడి చేస్తాడు డ్రైవర్. అక్కడే ఉన్న ఆర్యానూ చంపాలనుకుంటాడు కాని దేవకి చెప్పడంతో ఆర్యా అక్కడి నుంచి పారిపోతుంది. మంచులో ఛేజింగ్.... చివరకు దేవకి చేతికి చిక్కుతాడు డ్రైవర్. వెనకే పోలీస్. తన గన్ ఇస్తాడు చంపేదుంటే దాంతో చంపమని. తన తల్లి తన కోసం ఎంత చేసిందో అప్పుడు అర్థమవుతుంది ఆర్యాకు. అప్పడు పిలుస్తుంది ‘మామ్’ (అమ్మ) అని. దేవకి ఆ డ్రైవర్‌ను చంపేస్తుంది. బిడ్డ తల్లిని అక్కున చేర్చుకుంటుంది. గుండెలవిసేలా ఏడుస్తుంది దేవకి. సవతి తల్లిని రాక్షసిగా కాకుండా... బిడ్డను అర్థం చేసుకునే రియల్ మామ్లా చూపించిందీ సినిమా. ఓ పాశవిక చర్యకు బలైన అమ్మాయి పట్ల కుటుంబం ఎలా ప్రవర్తించాలో చెప్తుంది. ఎలాంటి నైతిక అండ ఉండాలో వివరిస్తుంది. ఈ సినిమా షూటింగ్ విరామ సమయాల్లో కూడా శ్రీదేవి తన పిల్లలకు ఫోన్ చేయలేదట. గ్యాప్ గ్యాప్‌కి ఫోన్ చేసే అమ్మ ఫోన్ చేయట్లేదేంటి అని శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ తన అక్క జాన్వీని అడిగేదట. ‘ఈ సినిమాలో అంత లీనమయ్యా... ఆర్యా ప్లేస్‌లో నా కూతరే ఉందనుకున్నా’ అని చెప్పింది శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో. ఆ మాట నిజమే అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. ఆమేజాన్ ప్రైమ్‌లో దొరకొచ్చు. ఆల్ఫా మూవీస్ చానల్లో కూడా తరచుగా ఈ సినిమా ప్లే అవుతోంది. – శరాది -
వచ్చింది మర్చిపోయేలా చేసిన సినిమా...
దీలో హవా చల్ రహా హై అంటే... వాడి టైమ్ బాగుంది అన్నట్టు! ‘నవా హవా’ అంటే కొత్తగాలి వీస్తోందని! అయినా కొండ అడ్డం ఉంటే గాలి ఎలా వీస్తుంది? నవాజ్ సిద్దిఖి కూడా అలాగే ఆలోచించాడు. అమ్మ ఆశీర్వాదం అన్న ఉలి పట్టుకుని నమ్మకం అన్న ఒక సుత్తిని సంపాదించి ఏకంగా ఆ కొండనే తవ్వేశాడు. ఇది నవాజ్ నిజజీవితంలో కథ... తను నటించిన ‘మాంఝీ’ సినిమా కథ కూడా! నేనేదో పుట్టను పర్వతం చేస్తున్నాననుకుంటే... క్లారిటీ కోసం ఈ కొండ గాలిని స్పృశించి చూడండి. వచ్చే నెల బాలీవుడ్లో ఒక సినిమా రిలీజ్ కానుంది. పేరు ‘మాంఝీ’. కొండను లొంగదీసిన ఒక అసామాన్యుడి కథ అది. బిహార్‌లోని గయ దగ్గర దారికి అడ్డంగా ఉండే కొండ వల్ల దశరథ్ మాంఝీ అనే రైతుకూలీ భార్య సకాలంలో వైద్యం అందక మరణించింది.కొండ లేకుంటే పట్టణానికి దారి దగ్గరయ్యేది. కొండ వల్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడంతో ప్రమాదంలో ఉన్నవారి ప్రాణం పోతోంది. దీనిని ఆపాలి అనుకున్న మాంఝీ కొండ మీద తిరగబడ్డాడు. ఎందరు హేళన చేస్తున్నా వినకుండా కేవలం ఒక సుత్తీ శానంతో 22 ఏళ్ల పాటు ఒక్కడే దారిని తొలిచి పల్లెకూ పట్టణానికి మధ్య దూరాన్ని 55 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లకు తగ్గించాడు. అందుకే అందరూ అతణ్ణి ‘మౌంటేన్ మేన్’ అని కీర్తించారు.అయితే ఆ పాత్రను పోషించిన నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా అంతకు ఏ మాత్రం తక్కువ కాదు. జేబులో రూపాయి లేదు. ఊరి నుంచి డబ్బు అందుతుందిలే అనుకోవడానికి ఉత్తరప్రదేశ్‌లోని పల్లెలో ఉన్న తల్లిదండ్రులకే తినడానికి తిండి లేదు. తను పెద్ద కొడుకు. ఏదైనా సంపాదించి పెట్టాల్సింది పోయి మిగిలిన ఎనిమిది మంది తోబుట్టువులను వాళ్ల భారానికే వదిలిపెట్టి వచ్చే శాడు. ముంబైలో ఎవరూ తెలియదు. వేషం కావాలి సార్ అని అడిగితే- రంగు తక్కువగా పొట్టిగా ఉత్త పల్లెటూరి బైతులా ఉన్న ఇతణ్ణి చూసి ప్రతి ఒక్కరూ ఈసడించడమే. రూమ్మేట్కు వంట వండే షరతు మీద కొంతకాలం రూమ్ సంపాదించాడు. నటన నేర్పిస్తానంటూ వర్క్‌షాప్‌లు పెట్టి యాభై వంద వస్తే పొట్ట పోసుకున్నాడు. పేవ్మెంట్ మీద దనియాలు అమ్మాడు. ఎక్స్ట్రా వేషాలు కట్టి గుంపులో గోవిందయ్యగా బతికాడు. నిజంగా చాలా కఠినమైన రోజులు అవి. భవిష్యత్తు అనే పర్వతానికి మొదలేదో మొన ఏదో తెలియని రోజులు. తల్లి అప్పుడప్పుడు ఉత్తరం రాసేది. ఏరా.. ఏదైనా చాన్స్ దొరికిందా... లేదమ్మా... దొరుతుందిలే అని జవాబు రాసేవాడు. తల్లి ధైర్యం చెబుతూ మళ్లీ రాసేది.ఏం కాదులేరా... చెత్తను కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకు ఎత్తి పారేస్తారు. నువ్వు మనిషివి. నీకు అవకాశం రాకుండా ఉంటుందా అని చెప్పేది. అది అబద్ధమే. కొడుక్కి ధైర్యం చెప్పడానికి ఏ తల్లయినా రాసే మాటే. కాని ఆ అబద్ధాన్ని అతడు నమ్మేవాడు. ఎప్పటికైనా తనకూ రోజు వస్తుందని ఎదురు చూసే వాడు. నిజంగానే ఆ రోజు రావడానికి పన్నెండేళ్లు పట్టింది. నీ అభిమాన నటుడు ఎవరు అని అడిగితే ఎవరైనా సరే పెద్ద పెద్ద పేర్లు చెప్పడానికి ఇష్టపడతారు. కాని నవాజుద్దీన్ సిద్దిఖీని అడిగితే ‘దాదా కోండ్కే’ పేరు చెబుతాడు. డబుల్ మీనింగ్ డైలాగులతో సినిమాలు తీసి వరుసగా తొమ్మిది సిల్వర్‌జూబ్లీ హిట్స్ కొట్టి గిన్నెస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కిన మరాఠా సూపర్‌స్టార్ దాదా కొండ్కే. అతడి సినిమాల్లో ఏమున్నా తెర మీద అతడు నటించే తీరు మాత్రం ప్రతి ఒక్కరినీ అబ్బుర పరుస్తుంది. ముజఫర్‌నగర్ జిల్లాలోని సొంత పల్లె బుధానాలో చిన్నప్పుడు కోండ్కే సినిమాలను చూసే నటన మోజులో పడ్డాడు నవాజుద్దీన్. అసలు ఇంత ఈజ్‌గా ఏ మాత్రం ఇన్హిబిషన్స్ లేకుండా ఎలా నటించగలడు అని వెర్రెత్తిపోయాడు. చేస్తే ఇలా యాక్ట్ చేయాలి ఇంత ఈజ్‌గా చేయాలి అని నిశ్చయించుకున్నాడు. అప్పుడు పడ్డ పురుగు బిఎస్సీ చదివినా లోపల పురుగు తొలుస్తూనే ఉంది. కొన్నాళ్లు గుజరాత్ ఆయిల్ కంపెనీల్లో కెమిస్ట్‌గా పని చేశాడుగానీ గల్ఫ్ నుంచి వచ్చే క్రూడాయిల్ని టెస్ట్ చేస్తూ గడిపే ఆ పనిలో తన జీవితం శిథిలం అయిపోతుందని అనిపించింది. అప్పటికే అక్కడ నటన మొదలెట్టాడు. నాటక సమాజాలలోని మిత్రులు నవాజ్ యాక్టింగ్ గమనించి- నువ్వుండాల్సింది ఇక్కడ కాదు... ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో అక్కడకు వెళ్లు అని సలహా ఇవ్వడం మొదలుపెట్టారు. ఢిల్లీ రానైతే వచ్చాడుగానీ బతకడం ఎలా? గోడ మీద యాడ్ కనిపించింది- సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. పగటి డ్యూటీ అయితే చేస్తాను అని చెప్పి చేరిపోయాడు. పగలు పనికి. రాత్రి నాటకానికి. అలా చదువుకుంటూ నాటకాలు వేసుకుంటూ సెక్యూరిటీ గార్డ్‌గా తినడానికి రొట్టె సంపాదించుకుంటూ 1998 ప్రాంతంలో ముంబై చేరుకున్నాడు. ఏదో స్టూడియోలో ఏదో సినిమా షూటింగ్. డెరైక్టర్ ఎవరు అనడిగితే తెలుగతను పేరు రామ్‌గోపాల్ వర్మ అని చెప్పారు. నేరుగా కలవొచ్చా.. అని అడిగితే కుదర్దు ఆయన అదో టైప్ అని సమాచారం. సరే ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా అక్కడే కుర్చీలో కూచుని సీన్ రాసుకుంటున్న గడ్డం మనిషి కనిపించాడు. పేరు అనురాగ్ కశ్యప్ అట. ఆ సినిమాకు రైటర్ అట. సార్... నాకు వేషం ఇప్పించండి- ఎన్ఎస్డి నుంచి వచ్చాను అని నవాజ్ అతనికి తను చేసిన ఓ నాటకంలోని బిట్ చేసి చూపించాడు. అతడికి నచ్చింది. సిగరెట్ ఆఫర్ చేస్తూ- మిత్రమా... నువ్వు ఎక్కడ ట్రైన్ అయ్యావనేది నాకు అనవసరం. ఎంత బాగా చేయగలవు అనేదే ముఖ్యం. నువ్వు బాగా చేస్తున్నావు. కాని నా ఖర్మ కొద్దీ నేను కూడా లాటరీలు కొడుతున్నాను. నా రోజులు బాగున్నప్పుడు నీకు తప్పకుండా అవకాశం ఇస్తాను... అన్నాడు. అయితే ఆ అవకాశం వెంటనే రాలేదు. బొంబాయిలో సినిమా కష్టాలు. భయంకరమైన ఆకలి పస్తులు. తట్టుకోలేక చివరకు యాడ్స్‌లో కూడా ఎక్స్ట్రాగా కనిపించాడు. సచిన్ టెండూల్కర్ నటించిన ఒక యాడ్‌లో వెనుక బట్టలు ఉతుకుతూ ఉండే ధోబీలలో నవాజుద్దీన్ సిద్దిఖ్ ఒకడు. ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు... ఎన్నో సంవత్సరాలు అలా గడిచిపోయాయి. కాని విశేషం ఏమంటే నవాజుద్దీన్ తనను తాను పతనం కాకుండా కాపాడుకున్నాడు. కులరాజకీయాలు, హత్యలు, బందిపోటు దొంగతనాలు ఇవి నిత్యం ఉండే గ్రామంలో పుట్టి పెరిగి కూడా చదువుకోగలిగాడు. రకరకాల వ్యసనాలు, పతనాలు, పలాయనాలు ఉండే ముంబైలో అన్నాళ్లు ఖాళీగా ఉండి కూడా ఏకాగ్రతను కాపాడుకుంటూ ఏ పని కోసం వచ్చాడో ఆ పనికే నిబద్ధుడై ఉన్నాడు. అలాంటి వాడికి తప్పకుండా అవకాశం వస్తుంది. నవాజుద్దీన్‌కి కూడా వచ్చింది. సినిమా పేరు బ్లాక్ ఫ్రైడే. 1993 నాటి ముంబై పేలుళ్ల మీద తీసిన సినిమా అది. డెరైక్టర్ అనురాగ్ కశ్యప్. అందులో పోలీసుల చేతికి చిక్కి చిత్రహింసల పాలయ్యే ముస్లిం కుర్రాడి వేషం నవాజ్ చేశాడు. కొద్దిపాటి మాటలే ఉంటాయి. కాని చూసినవాళ్లకు కన్నీళ్లు తిరుగుతాయి. ఇతడెవడో ఈ వేషానికి బాగున్నాడు అని పోలీస్ టార్చర్ ఉన్న ప్రతి వేషానికీ బాలీవుడ్లో నవాజుద్దీన్‌ని పిలవడం మొదలుపెట్టారు. అలాంటివే ఆరు వేషాలు వచ్చాయి. ఆ తర్వాత 2010లో పీప్లీ లైవ్ వచ్చింది. లోకల్ రిపోర్టర్ రాకేష్‌గా అదరగొట్టాడు. 2011లో మరో రెండు సినిమాలు రిలీజయ్యాయి. కహానీ... గ్యాంగ్స్ ఆఫ్ వాసెపూర్. ఎవరీ పొట్టి మిరపకాయ్ అని అందరూఆశ్చర్యపోయారు. అంతవరకూ ఒకటీ అరా ప్లేట్లో పడేస్తూ వచ్చి బాలీవుడ్ ఇండస్ట్రీ దేశవిదేశాల్లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో నవాజుద్దీన్ నటనకు వచ్చిన ప్రశంసలు చూసి సందేహాలు మాని అతణ్ణి సంపూర్ణంగా అంగీకరించింది. కాలం పుటం పెట్టడం అంటే ఇదే కాబోలు. ఒకప్పుడు చిన్న పంచె ముతక చొక్కా కట్టుకొని తన పల్లెలో పొలాల్లో ఆవారాగా తిరిగిన నవాజుద్దీన్ సిద్దిఖీ 2012 కాన్స్ ఫిల్మ్ ఫిస్టివల్‌లో తన సినిమా ‘మిస్ లవ్లీ’ ప్రదర్శన సందర్బంగా రెడ్ కార్పెట్ మీద బ్లాక్ టక్సెడో ధరించి హుందాగా అడుగులు వేశాడు. అమితాబ్ బచ్చన్ పోస్టర్లు ఉన్న తన ఇంటి వీధిలో తన పోస్టర్లు కనిపించేలా చేశాడు. ఇది కొండల్ని పిండికొట్టడం లాంటి పనే. నవాజుద్దీన్ సిద్ధిఖీ చేశాడు. ఎందుకంటే తాను ఆ పని చేయగలను అని గట్టిగా నమ్మాడు. ది లంచ్‌బాక్స్, కిక్, బద్లాపూర్, బజ్రంగీ భాయ్‌జాన్... ఇవన్నీ నవాజుద్దీన్ సిద్ధిఖీ నటన వలన మెరిసిన సినిమాలు. షారూక్ ఖాన్‌తో ‘రయీస్’ రాబోతూ ఉంది. సల్మాన్, షారూక్ తర్వాత ఆమిర్‌ఖాన్‌ను ఛాలెంజ్ చేయడం ఎంత పని? ‘నేను ప్రపంచంలో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకునే నటుణ్ణి కావాలి’ అంటాడు నవాజుద్దీన్.ఎందుకంటే ‘స్టార్ నటుడు కాదు. కాని స్టార్‌కు ఎక్కువ చెల్లిస్తారు. మరి నటుడికెందుకు తక్కువ ఇస్తారు’ అంటాడు. బాలీవుడ్లో రాబోయే రోజుల్లో అత్యంత ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసే నటుడిగా నవాజుద్దీన్ సిద్దిఖీ కనిపించవచ్చు. అతడి కోసమే మంచి మంచి సినిమాలు తీయవచ్చు.ఈ ఒడ్డూ ఈ పొడవు ఉన్న వాడు ఇంత చేయగలడా అని అనిపించవచ్చు. నిజమే. నవాజుద్దీన్ ఐదున్నర అడుగుల వాడు మాత్రమే. కాని చేతిలో నటన, నైపుణ్యం అనే సుత్తీ శానంలు ఉన్నాయని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. అవి ఉన్నవాడికి ఏ పర్వతమైనా ఒక లెక్కా? వచ్చింది మర్చిపోయేలా చేసిన సినిమా... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన నవాజుద్దీన్ సిద్ధిఖీ సినిమా ‘మిస్ లవ్లీ’. దర్శకుడు అషిమ్ అహ్లువాలియా. బాలీవుడ్లో తయారయ్యే సిగ్రేడ్ పోర్నో మూవీల మీద తీసిన సినిమా అది. కథాంశం రీత్యా సినిమాలోని పాత్రలకు బి- గ్రేడ్, సి- గ్రేడ్ ఆర్టిస్టులను తీసుకున్నారు. ముఖ్యపాత్రకు నవాజుద్దీన్‌ని తీసుకున్నారు. మొదటి రోజు డెరైక్టర్ అతడి దగ్గరకు వచ్చి చెప్పాడు- మీకు చాలా వచ్చు. నేర్చుకున్నారు. కాని ఈ సినిమాలో మీ పక్కన ఉన్నది చాలా నాసీరకం నటులు. మీరు ఏమీ చేయకండి. ఏది చేసినా వీళ్ల స్థాయికి దిగి చేయండి అన్నాడు. నేర్చుకున్నదంతా మర్చిపోయి చేయాల్సిన సందర్భం అది. పండితుడు పామరస్థాయి దిగడమే అసలైన పాండిత్యం కదా అంటాడు నవాజుద్దీన్ ఆ సినిమా చేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ. సాక్షి ఫీచర్స్ ప్రతినిధి