![Nawazuddin Siddiqui Says He Does not Like to Call Himself a Star - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/28/Nawazuddin_Siddiqui.jpg.webp?itok=S1V36MNf)
నవాజుద్దీన్ సిద్ధిఖీ
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలక్షణమైన పాత్రలు చేస్తూ మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. అయితే తనను ‘స్టార్’ అని మాత్రం పిలవొద్దంటున్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ– ‘‘నన్ను స్టార్ యాక్టర్ అని పిలవడం ఇష్టం లేదు. నా దృష్టిలో ‘స్టార్, సూపర్‌స్టార్, మెగాస్టార్’ అనే ట్యాగ్స్ మార్కెటింగ్ స్ట్రాటజీకి సంబంధించినవి.
ఒక వేళ నన్ను నేను ఒక స్టార్‌గా భావించి గర్వపడితే నాకు తెలియకుండానే నాలోని నటుడి ఎదుగుదలకు నేను అడ్డుకట్ట వేసినవాణ్ణి అవుతాను. నా నటనా నైపుణ్యం కూడా మెల్లిగా తగ్గిపోతుంది. మూసధోరణి పాత్రలకు అలవాటు పడిపోతాను. ఒక్కసారి స్టార్ అనే ఛట్రంలో ఇరుక్కుపోతే విభిన్నమైన పాత్రలు చేయలేం. నటులు అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటారు. అందుకే నన్ను స్టార్ అని పిలవొద్దు’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment