
మరో క్రేజీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజై హిట్ కొట్టినప్పటికీ.. పెద్దగా టైమ్ తీసుకోకుండా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. నెలలోపే ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. ఇది తమిళ మూవీ. కానీ తెలుగులో నేరుగా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)
తమిళ హీరో కవిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'స్టార్'. సినిమా హీరో అవ్వాలనుకునే ఓ యువకుడి కథతో దీన్ని తెరకెక్కించారు. మే 10న తమిళంలో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీని తెలుగు వెర్షన్ కూడా థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ ఎందుకో కుదర్లేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేశారు. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో 'స్టార్' స్ట్రీమింగ్ అవుతోంది.

'స్టార్' కథ విషయానికొస్తే.. పాండియన్ (లాల్) ఓ ఫొటోగ్రాఫర్. కొడుకు కలై (కవిన్)ని సినిమా యాక్టర్ చేయాలని అనుకుంటాడు. తండ్రి ప్రోత్సాహం వల్ల చిన్నప్పటి నుంచే సినిమాలంటే పిచ్చితో కలై పెరుగుతాడు. పెరిగి పెద్దయిన తర్వాత ముంబైలో యాక్టింగ్ కోర్సు పూర్తి చేస్తాడు. హీరోగా అవకాశం వస్తుంది. కానీ ఓసారి యాక్సిడెంట్ అయి ముఖమంతా అందవికారంగా తయారవుతుంది. ఇలాంటి కలై.. చివరకు యాక్టర్ అయ్యాడా? లేదా? అనేదే తెలియాలంటే 'స్టార్' చూసేయాల్సిందే.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
Comments
Please login to add a commentAdd a comment