Star
-
చదువు పూర్తవగానే కొత్తిల్లు కొన్న డ్యాన్సర్.. గృహప్రవేశం (ఫోటోలు)
-
వలపు వలలో త్రిబుల్ స్టార్ అధికారి!
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా : ‘కంచె చేను మేసింద’న్న చందంగా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పులివెందుల సబ్ డివిజన్లో యథేచ్ఛగా ఇలాంటి ఘటనలు తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల అండదండలు ఉంటే చాలు ఎలాంటి అడ్డదారులు ఎంచుకున్నా పర్వాలేదన్న ధోరణి అధికంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో అసలైన హత్యాయత్నం కేసులు నీరు గార్చడం, వాదులాటలపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం సర్వసాధారణమవుతోంది. అందులో భాగంగా మోట్నూతలపల్లెకు చెందిన గంగాధర్ ఆత్మహత్య వెలుగులోకి వచ్చింది.తెరవెనుక చక్రం తిప్పిన మహిళ..పులివెందుల మండలం మోట్నూతలపల్లి గ్రామానికి చెందిన గంగాధర అనే వ్యక్తి మంగళవారం పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే. ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తే విస్తు పోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మృతి చెందిన గంగాధర్‌కు ఓ మహిళకు మధ్య విభేదాలున్నాయి. సదరు మహిళకు త్రిబుల్ స్టార్ అధికారితో కొద్దికాలంగా సాన్నిహిత్యం ఉన్నట్లు సమాచారం. ఆమె విభేదాలతో నిమిత్తం లేకుండా మరో చిన్న కొట్లాటలో గంగాధర్ చిక్కుకున్నాడు. అంతే తెరవెనుక సదరు మహిళ చక్రం తిప్పింది. అంతే వేగంగా గంగాధర్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. అంతటితో పోలీసు అధికారుల చర్యలు ఆగిపోలేదు. త్రిబుల్ స్టార్ అధికారితో సాన్నిహిత్యం ఉన్న మహిళను సంతృప్తి పర్చేందుకు గంగాధర్‌కు పోలీసుల వేధింపులు అధికమయ్యాయి. వెరసి పోలీసుస్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి చనిపోవడం గమనార్హం.గతంలోనూ లైంగిక ఆరోపణలు..ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు త్రిబుల్ స్టార్ అధికారి గతంలో రాయచోటి ప్రాంతంలో పనిచేస్తుండగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. తన కింది స్థాయి సిబ్బంది కుటుంబ సభ్యురాలితో సాన్నిహిత్యం కొనసాగించారు. ఈ విషయం తెలుసుకున్న సదరు సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. తర్వాత కాలంలో సైతం ఆమెతో సాన్నిహిత్యం కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పటికీ సంబంధబాంధవ్యాలు కొనసాగుతున్నట్లు సమాచారం. సదరు మహిళకు రాయచోటిలో ఏకంగా ఇల్లు నిర్మిస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ ఇంటి నిర్మాణానికి పులివెందుల టీడీపీ నాయకులు చేస్తున్న అనైతిక కార్యకలాపాల ద్వారా లభించే సొమ్ము వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. గంగాధర్ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకునే దిశగా.. పులివెందులలో పోలీసు స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకున్న మోట్నూతలపల్లె గంగాధర్ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో త్రిబుల్ స్టార్ అధికారి నిమగ్నమైనట్లు సమాచారం. గంగాధర్ మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు మంగళవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. దాంతో బిత్తర పోయిన సదరు అధికారి మొత్తం వ్యవహారం బహిర్గతమవుతుందని నోట్ల కట్టలతో నోరు మూయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర హోంమంత్రి అనిత మాత్రం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు, చట్టాన్ని అతిక్రమించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించమని నిత్యం ప్రకటిస్తుంటారు. అయితే పోలీసుశాఖకు ఎలాంటి మచ్చ తెచ్చినా టీడీపీ నేతల సిఫార్సులుంటే ఎలాంటి చర్యలు ఉండవని పులివెందుల సబ్ డివిజన్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పలు ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి. ఎస్పీ గాడిలో పెడతారా?!జిల్లాలో కొంతమంది పోలీసు అధికారులు ఖాకీ వనంలో కలుపు మొక్కలుగా తయారయ్యారు. చట్టాన్ని పరిరక్షించాల్సింది పోయి వారే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అక్రమ ఆదాయం కోసం అర్రులు చాస్తూ, ఈజీ మనీ కోసం అడ్డదారులు ఎంచుకున్నారు. అధికార పార్టీ నేతల అండదండలు ఉంటే చాలు ఉద్యోగ నిర్వహణ ఎలా ఉన్నా ఇబ్బంది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా నూతన ఎస్పీగా ఈజీ అశోక్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు. మొత్తం వ్యవస్థకే మచ్చ తెస్తున్న కలుపు మొక్కలను.. కళంకితులను గాడిలో పెట్టా ల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. మరి జిల్లా పోలీసు బాసు ఏమేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే. -
ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్‌గా 11 ఏళ్ల చిన్నారి..!
చిన్నపిల్లలు వయసుకు మించి అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తే ఏ తల్లిదండ్రులైన గర్వంగా ఫీలవ్వుతారు. అలాంటి ప్రతిభతోనే అందర్ని ఆకర్షించి ఆశ్చర్యపరుస్తోంది ది బిలియనీర్స్ డాటర్' మూ అబ్రహం. జస్ట్ 11 ఏళ్లకే ఒక్క వీడియోతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. తల్లిదండ్రుల వ్యాపారంలో చేదుడువాదుగా ఉండి లాభాల బాట పట్టిస్తోంది.లవ్ లగ్జరీ స్టోర్(Love Luxury store) వ్యవస్థాపకులు ఆడమ్(Adam), ఎమిలీ అబ్రహం(Emily Abraham) దంపతులు కుమార్తె మూ అబ్రహం(Moo Abraham). సోషల్ మీడియోలో కొన్ని వీడియోలు కట్టిపడేస్తుంటాయి. అలాంటి ఓ వీడియోతో ఒక్కసారిగా ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది మూ అబ్రహం అనే పదకొండేళ్ల చిన్నారి. వాళ్లకు ఉన్న లగ్జరీ స్టోర్‌లోని అత్యంత ఖరీదైన బ్రాండెడ్ హెర్మ్స్ బ్యాగులు, రోలెక్స్ , పాటెక్ ఫిలిప్ వాచీలు వంటి యాక్సెసరీల ధరల, వాటి నాణ్యత గురించి అలవొకగా చెప్పే ఓ వీడియోని ది బిలియనీర్స్ డాటర్(The Billionaire's Daughter) పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆమె తల్లి ఎమిలీ. ఆ వీడియోకి విశేష స్పందన వచ్చి.. మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. నిజానికి తమ బిజినెస్ ఊపందుకునేలా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలనుకున్నారు ఆ దంపతులు. అందులో భాగంగా ఆ దంపతులు తమ కుమార్తెతో సరదాగా తమ బ్రాండ్ల వివరాలను చెప్పిస్తూ వీడియో చేశారు. ఆ ఒక్క వీడియో ఆమెను ఏ రేంజ్ స్టార్‌గా మార్చిందంటే..ఏకంగా సోషల్ మీడియా మేనేజర్ వచ్చి ఆ చిన్నారి చేత వీడియో చేయించుకునే స్థాయికి ఇమేజ్ పెరిగింది. నిజానికి అంతకు మందు ఆ దంపతులు తమ వ్యాపారానికి సంబంధించిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో పోస్ట్ చేవారు. కానీ అవేమి వీక్షకులను ఆకర్షించలేకపోయాయి. కానీ మూ చెప్పే విధానం.. మార్కెటింగ్ స్ట్రాటజీ పట్టినట్టుగా ప్రతి యాక్సెసరీల ధరను అలవోకగా చెప్పేస్తుంది. ఏది మన్నికగా ఉంటుంది. మనకున్న బడ్జెట్‌కి అనుగుణంగా ఏది ఎంచుకుంటే మంచిది అనేవి అద్భుతంగా చెబుతుంది. ఫ్యాషన్‌కి సంబంధించిన వీడియోలో ఈ చిన్నారి వీడియోలకే విశేష ఆదరణ ఉంది. ఈ చిన్నారి కేవలం హైఎండ్ బ్రాండ్ల వీడియోలనే కాదు తనకంటూ సొంతంగా సోషల్ మీడియా ఖాతాను మెయింటైన్ చేస్తుంది. దాన్ని ఆమె తల్లిందండ్రులు హ్యాండిల్ చేస్తారు. అందులో కూడా ఏ ధరకు ఎలాంటి బ్రాండెడ్ ప్రొడక్ట్ దొరకుతుందనే అవగాహనను కూడా కల్పిస్తోంది. ధరకు తగ్గ లగ్జరీ ప్రొడక్ట్ ఎలా ఐడింటిఫై చేయాలో కూడా టక్కున చెప్పేస్తుంది ఈ చిన్నారి మూ. నిజానికి పెద్ద సేల్స్ మేనేజర్ల కూడా ఒక ప్రొడక్ట్‌ని అమ్మేందుకు, దాని వివరాలు చెప్పేందుకు ఎంతో ప్రయాసపడుతుంటారు. అదేం పెద్ద కష్టం కాదంటూ ఇంత చిన్న వయసులో అలవొకగా చెప్పేస్తున్న మూ అబ్రహంని చూస్తుంటే అబ్బురపడకుండా ఉండలేం కదూ..!. View this post on Instagram A post shared by Love PreLove (@lovepreloveuk) (చదవండి: చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలు..దెబ్బకు 60 కిలోలు తగ్గింది..!) -
స్టార్ సిమెంట్‌లో అ్రల్టాటెక్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అ్రల్టాటెక్ సిమెంట్ తాజాగా స్టార్ సిమెంట్‌లో మైనారిటీ వాటా కొనుగోలు చేస్తోంది. ప్రమోటర్ల నుంచి మొత్తం 8.69 శాతం వాటా సొంతం చేసుకోనున్నట్లు అ్రల్టాటెక్ పేర్కొంది. ఇందుకు రూ. 851 కోట్లు వెచి్చంచనుంది. దక్షిణాది కంపెనీ ఇండియా సిమెంట్స్‌లో ఇటీవలే ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అ్రల్టాటెక్ నియంత్రిత వాటాను సొంతం చేసుకుంది. మరోవైపు అదానీ గ్రూప్ సైతం ఇతర సంస్థల కొనుగోళ్లు, సొంత ప్లాంట్ల ఏర్పాటుతో సిమెంట్ రంగంలో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. పోటా పోటీగా.. అటు అ్రల్టాటెక్, ఇటు అదానీ గ్రూప్ దిగ్గజం అంబుజా సిమెంట్స్ ఇతర సంస్థల కొనుగోళ్లు, సొంత ప్లాంట్ల ఏర్పాటు ద్వారా సామర్థ్య విస్తరణను చేపడుతున్నాయి. లక్ష్యాలకు అనుగుణంగా చిన్న సిమెంట్ కంపెనీలను కొనుగోలు చేస్తున్నాయి. వెరసి గత రెండేళ్లలో ఇండియా సిమెంట్స్, కేశోరామ్ సిమెంట్ బిజినెస్, ఆర్ఏకేడబ్ల్యూసీటీని సొంతం చేసుకుంది. ఇదేవిధంగా సంఘీ ఇండస్ట్రీస్, పెన్నా ఇండస్ట్రీస్‌సహా ఇటీవలే ఓరియంట్ సిమెంట్‌ను అంబుజా సొంతం చేసుకుంది. తద్వారా 2024లో అదానీ సిమెంట్ సామర్థ్యం 100 ఎంటీపీఏకు చేరింది. కంపెనీ రెండేళ్ల క్రితం హోల్సిమ్ నుంచి 70 ఎంటీపీఏ సామర్థ్యాలను కొనుగోలు చేయడం ద్వారా సిమెంట్ రంగంలోకి ప్రవేశించింది. మరోపక్క 156.66 ఎంటీపీఏ సామర్థ్యంతో అ్రల్టాటెక్ మార్కెట్ లీడర్‌గా నిలుస్తోంది. ఆధిపత్యాన్ని నిలుపుకునే బాటలో 2027కల్లా 200 ఎంటీపీఏ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. బ్లాక్ డీల్ ద్వారా ఎన్ఎస్ఈ బ్లాక్ డీల్ గణాంకాల ప్రకారం అల్ట్రాటెక్ సిమెంట్ 3.36 కోట్లకుపైగా స్టార్ సిమెంట్ షేర్లను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 227.7 సగటు ధరలో వీటిని సొంతం చేసుకుంది. వీటి విలువ రూ. 766 కోట్లుకాగా.. 8.32 శాతం వాటాకు సమానం. స్టార్ సామర్థ్యమిలా.. మేఘాలయ సంస్థ స్టార్ సిమెంట్ 7.7 ఎంటీపీఏ స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. షేరుకి రూ. 235 మించకుండా స్టార్ సిమెంట్‌లో 8.69 శాతం వాటాకు సమానమైన 3.7 కోట్ల షేర్ల కొనుగోలుకి బోర్డు అనుమతించినట్లు అల్ట్రాటెక్ వెల్లడించింది. వెరసి రూ. 851 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. దీంతో స్టార్ సిమెంట్ ప్రమోటర్ గ్రూప్‌లోని రాజేంద్ర చమారియా, ఆయన కుటుంబీకుల వాటాలను సొంతం చేసుకుంది. అయితే ఇతర ప్రమోటర్లు(సెంచురీ ప్లై) వాటాలను ఆఫర్ చేయలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. స్టార్ సిమెంట్‌లో ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ వాటా 66.47 శాతంగా ఉంది. -
christmas2024 ప్రియుడితో యానిమల్ బ్యూటీ చెట్టాపట్టాల్ (ఫొటోలు)
-
అక్కడ ఏడాదికి 21 గంటలే
అనగనగా అదో గ్రహం. నెఫ్ట్యూన్ సైజులో ఉంటుంది. దానిపై ఒక ఏడాదిలో కేవలం 21 గంటలే ఉంటాయి! అది మాతృ నక్షత్రానికి అతి సమీపంగా ఉండటమే ఇందుకు కారణమట. దాంతో నక్షత్రం చుట్టూ ఆ గ్రహం పరిభ్రమణం కేవలం 21 గంటల్లో పూర్తయిపోతోందని సైంటిస్టులు కనిపెట్టారు. టీఓఐ–3261గా పిలిచే ఈ గ్రహం, దాని తాలూకు నక్షత్రమండలం వయసు 650 కోట్ల ఏళ్లని అంచనా. తొలుత బృహస్పతి పరిమాణంలో ఉన్న ఈ గ్రహం నిరంతరం ద్రవ్యరాశిని కోల్పోతూ చిన్నదవుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. దాని మాతృనక్షత్రపు ఆకర్షణ శక్తే ఇందుకు ప్రధాన కారణమని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పరిమాణంలో నెఫ్ట్యూన్‌కు సమానంగా ఉన్నా ద్రవ్యరాశి మాత్రం దానితో పోలిస్తే రెట్టింపుగా ఉందట! టీఓఐ–3261 ఉనికి గ్రహాల ఆవిర్భావానికి సంబంధించిన ప్రస్తుత సిద్ధాంతాలన్నింటినీ సవాలు చేస్తుండటం విశేషం. ఎందుకంటే మాతృ నక్షత్రానికి అంత దగ్గరగా ఉండే గ్రహాలపై దట్టమైన వాయువులతో కూడిన వాతావరణం నిలిచి ఉండటం దాదాపుగా అసాధ్యమన్నది శాస్త్ర ప్రపంచంలో ఇప్పటిదాకా ఉన్న భావన. దాంతో గ్రహాల పుట్టుకకు సంబంధించి మనకు తెలియని కొత్త కోణాలకు టీఓఐ–3261 దారి చూపుతుందని భావిస్తున్నారు. అందుకే దానిపై వాతావరణాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాలూకు పరారుణ కాంతి టెక్నాలజీ సాయంతో లోతుగా పరిశోధించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త ఎమ్మా నబ్బీ ఆధ్వర్యంలోని సైంటిస్టుల బృందం అధ్యయనంలో వెల్లడైన ఈ విశేషాలను ఆస్ట్రానామికల్ జర్నల్‌లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రారాజు ఆగమనానికి... ‘అడ్వెంట్’
విశ్వవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాస సమాజాలు అన్నీ ఆచరించే పెద్ద పండుగ క్రిస్మస్, క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని అర్థం. క్రీస్తు జన్మదినం జరుపుకునే డిసెంబర్ 25కి ముందు నాలుగు వారాల నుంచి ముందస్తు క్రిస్మస్ వేడుకలు ప్రారంభిస్తారు. దీనినే ‘అడ్వెంట్’ అంటారు. లాటిన్ భాషలోని అడ్వెంటస్ అనే పదం దీనికి మూలం. అడ్వెంట్ అంటే ఆగమనం/ రాకడ/ ఆహ్వానం అని అర్థం. డిసెంబర్ 24 సాయంత్రంతో అడ్వెంట్ ముగుస్తుంది.అడ్వెంట్ నాలుగు వారాల్లో దేవాలయాల్లో ముందస్తు క్రిస్మస్ వాతావరణం ఏర్పడుతుంది. అడ్వెంట్ తొలి ఆదివారమే పెద్ద నక్షత్రాన్ని అలంకరిస్తారు. ఏసు జననానికి ముందు ఆకాశంలో పుట్టిన కొత్త నక్షత్రానికి గుర్తుగా నక్షత్రాన్ని అలంకరించడంతో క్రిస్మస్ పండుగ వాతావరణం ఏర్పడుతుంది. దేవాలయాల్లోనూ క్రిస్మస్ చెట్టును అలంకరించి రంగురంగుల దీపాలతో అలంకరణలు చేసి ముస్తాబు చేస్తారు. పచ్చని చెట్టు ప్రేమకు, శాంతికి, జీవిత విలువలకు ప్రతీక. అడ్వెంట్ నాలుగు వారాల్లో వరుసగా మూడు వారాలు ఊదారంగు మైనపు వత్తులూ, చివరివారం గులాబి రంగు మైనపు వత్తి వెలిగిస్తారు.ఈ అన్ని రోజుల్లో జరిగే ప్రార్థనలో ప్రేమ –ఆనందం, విశ్వాసం – శాంతికి గుర్తుగా రంగురంగుల మైనపు వత్తులు వెలిగించడం క్రీస్తుశకం 567 నుండి కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ వారు ప్రారంభించారు. ఈ నాలుగు వారాలూ దేవాలయం ప్రధాన పీఠభాగం (ఆల్టార్)ని ఉదారంగు వస్త్రాలతో అలంకరిస్తారు. దేవాలయ అధిపతులు కూడా అదే రంగు వస్త్రాలను ధరిస్తారు. ఊదారంగు రాచరికానికి గుర్తు. రారాజు ఆగమనానికి ఆహ్వానం పలకడానికి సమాజాన్ని సిద్ధం చేయడంలో మతాధిపతులు ప్రార్థనా సమావేశాలు నిర్వహిస్తారు. అడ్వెంట్ కాలమంతా తెల్లవారుజామునే ప్రార్థనలు నిర్వహించి, సమాజానికి క్రిస్మస్ ఆగమన సందేశం ఇస్తారు.అడ్వెంట్ కాలంలోనే క్రిస్మస్ కారల్స్ ప్రధాన భూమిక పోషిస్తాయి. యువకులు, పెద్దలు ఒక సమూహంగా ఏర్పడి ఆ యా గృహాలు సందర్శించి పాటలు, నృత్యాలతో పండుగ ఉత్సాహాన్ని నింపుతారు. ఈ నేపథ్యంలోనే ఆ యా ప్రాంతాల్లోని అనాథలను గుర్తించి వస్త్రాలు, ఆహారం పంచి ఇస్తారు. ‘నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించ’మన్న సందేశం అక్షరాలా పాటిస్తారు. అడ్వెంట్ వల్ల ఏసును హృదయంలో ప్రతిష్టించుకుని తప్పులు పునరావృతం కాకుండా ఆత్మక్షాళనం గావించుకోవడం ప్రధాన కర్తవ్యం. వ్యక్తిగత శుద్ధితో పాటు సమాజ ప్రక్షాళన జరుపుకుని మానవ సమాజమంతా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఆనందించడం, ఒకరికొకరు చేయూతను అందించుకోవడం అడ్వెంట్ కాలంలో చేయవలసిన కర్తవ్యం.– ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి(నవంబర్ 24న అడ్వెంట్ ప్రారంభం) -
ఏక్..దో..తీన్..అన్‌స్టాపబుల్ అంటున్న స్టార్ హీరోయిన్ను గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
తారను మాయం చేయనున్న జాబిల్లి
అంతరిక్షంలో అరుదైన ఘట్టం చోటుచేసుకోనుంది. ఆకాశంలో అత్యంత కాంతివంతమైన నక్షత్రం స్పైకా. భూమి నుంచి రాత్రిపూట స్పష్టంగా చూడగలిన ఈ నక్షత్రం నవంబర్ 27న దాదాపు గంటపాటు కనిపించదు. భూమికి, ఆ నక్షత్రానికి మధ్య చంద్రుడు వస్తుండటమే ఇందుకు కారణం. అమెరికా తూర్పు ప్రాంతంతో పాటు కెనడాలో దీన్ని చూడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. 27న ఉదయం 5.50కు స్పైకా అదృశ్యమై గంట తర్వాత మళ్లీ దర్శనమివ్వనుంది. భూమి నుంచి 250 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న స్పైకా నీలం, తెలుపు కాంతులతో వెలిగిపోతూంటుంది. భూమి నుంచి నేరుగా చూడగలిగిన అతి పెద్ద నక్షత్రాల్లో ఇదొకటి. అంతరిక్ష వింతలపై ఆసక్తి ఉన్నవారిని నవంబర్ నెలలో మరో మూడు ఘట్టాలు ఊరిస్తున్నాయి. బృహస్పతి, శని, అంగారక గ్రహాలు రాత్రిపూట ఎంచక్కా దర్శనమివ్వనున్నాయి. అవి భూమికి సమీపంగా వస్తాయని టెలిస్కోపు లేకున్నా బైనాక్యులర్లతో వాటిని స్పష్టంగా చూడొచ్చని నాసా పరిశోధకులు తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Subrahmanyan Chandrasekhar: చుక్కల్లో చంద్రుడు
నక్షత్రాల జీవిత చరిత్రను వెల్లడించిన శాస్త్రజ్ఞులు ప్రపంచంలో కొద్ది మందే ఉన్నారు. వారిలో ఒకరే సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా ఆయన సాధించిన ఘనతను ఒకసారి గుర్తు చేసుకుందాం. అలాగే ఆయనకు ప్రముఖ భౌతిక శాస్త్రేవత్త సర్ సీవీ రామన్‌తో గల సంబంధం ఏమిటో కూడా తెలుసుకుందాం.నక్షత్రాలపై పరిశోధనలు సాగించిన ప్రముఖ శాస్త్రవేత్తలు కోపర్నికస్, గెలీలియో, కెప్లర్, న్యూటర్ మొదలైన వారు వేసిన బాటలో పయనించి, నోబెల్ బహుమతిని సాధించిన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ దక్షిణ భారతానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. ఆయన 1910 అక్టోబర్ 19న అవిభక్త భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రం(ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది)లోని లాహోర్ పట్టణంలో సీతాలక్ష్మి, చంద్రశేఖర సుబ్రహ్మణ్య అయ్యర్ దంపతులకు జన్మించారు.హైస్కూలు, కాలేజీ చదువులను మద్రాస్ (చెన్నై)లో పూర్తిచేశారు. 1953లో డాక్టర్ చంద్రశేఖర్ అమెరికా పౌరసత్వం స్వీకరించకపోతే, ఆయనను మన భారతీయ శాస్త్రవేత్తగా ప్రపంచానికి సగర్వంగా ప్రకటించుకునే వాళ్లం. తన 19వ ఏట ఉన్నత విద్యాభ్యాసం కోసం ఓడ మీద ఇంగ్లాండు వెళ్లిన ఆయన ఖగోళ శాస్త్ర సంబంధిత విషయాలపై అధ్యయనం సాగించారు. 1935 జనవరి 11న తన మిత్రుడు విలియం మాక్ క్రీ తో కలిసి ఇంపీరియల్ కాలేజీ నుంచి బర్లింగ్టన్ హౌస్ వెళ్లిన ఆయన తన పరిశోధనా పత్రాన్ని వేదికపై చదివి, భౌతిక ఖగోళ శాస్త్రవేత్తలను మంత్రుముగ్ధులను చేశారు. దీంతో కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజీ ఫెలోషిప్‌కు ఎన్నికయ్యారు. అక్కడ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్‌ను అందరూ ముద్దుగా ‘చంద్ర’ అని పిలిచేవారు.ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్య దశలు ఉన్నట్టే నక్షత్రాల్లోనూ పరిణామ దశలుంటాయని ‘చంద్ర’ తెలిపారు. వీటిలో చెప్పుకోదగ్గవి అరుణ మహాతార (రెడ్‌జెయంట్), శ్వేత కుబ్జ తార (వైట్‌డ్వార్ఫ్), బృహన్నవ్య తార (సూపర్నోవా), నూట్రాన్ తార, కృష్ణ బిలం (బ్లాక్‌హోల్) అనే దశలు ముఖ్యమైనవని పేర్కొన్నారు. తారలపై అవగాహనను పెంచే సిద్ధాంతాలను, పరిశోధనలను అందించిన చంద్రశేఖర్ 1983లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు.సాపేక్ష, క్వాంటం సిద్ధాంతాల్లోని అంశాల ఆధారంగా నక్షత్రాల పరిణామాలకు సంబంధించిన పరిస్థితులను చంద్రశేఖర్ విశ్లేషించారు. ఒక నక్షత్రం వైట్‌డ్వార్ఫ్ దశకు చేరుకోవాలంటే ఎలాటి పరిస్థితులుండాలో తెలియజేసిన సిద్ధాంతమే 'చంద్రశేఖర్ లిమిట్'గా పేరొందింది. దీని ప్రకారం సూర్యుని ద్రవ్యరాశి కన్నా 1.44 రెట్లకు తక్కువ ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాలే వైట్‌డ్వార్ఫ్‌గా మారుతాయి. అంతకు మించిన ద్రవ్యరాశి ఉంటే అవి వాటి కేంద్రకంలోని గురుత్వశక్తి ప్రభావం వల్ల కుంచించుకుపోయి సూపర్నోవాగా, న్యూట్రాన్‌స్టార్‌గా మారుతూ, చివరికి బ్లాక్‌హోల్ (కృష్ణబిలం)గా అయిపోతాయని చంద్రశేఖర్ సిద్ధాంతీకరించారు.ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతులను మన దేశంలో ఒకే కుటుంబంలోని ఇద్దరు మేథావులు సాధించడం ఓ అరుదైన విషయం. వారిలో ఒకరు నోబెల్ పొందిన శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ కాగా, రెండో వ్యక్తి ఆయన అన్నకొడుకు సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. 1995 ఆగస్టు 21న అమెరికాలో తన 85వ ఏట చంద్రశేఖర్ గుండె సంబంధిత వ్యాధితో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: భారత దౌత్యవేత్తలపై నిఘా: కెనడా -
ఈ విషయం తెలుసా? ఈ సాలీడు కుడితే.. ఇక అంతే!
ప్రపంచంలోని సాలెపురుగుల్లోకెల్లా ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఏదో బూజు గూడు అల్లుకునే మామూలు సాలెపురుగే అనుకుంటే పొరపాటే! ఇది కుట్టిందంటే, ఇక అంతే సంగతులు! ‘సిడ్నీ ఫన్నెల్ వెబ్ స్పైడర్’ అనే ఈ సాలెపురుగు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి వంద కిలోమీటర్ల వ్యాసార్ధం పరిధిలోని అడవుల్లో కనిపిస్తుంది. ఒక్కోసారి ఈ సాలెపురుగులు ఇళ్లల్లోకి కూడా చేరుతుంటాయి.ఈ సాలెపురుగు కుట్టినప్పుడు శరీరంలోకి చేరే విష పదార్థాలు నిమిషాల్లోనే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. తక్షణ చికిత్స అందించకుంటే, అరగంటలోనే ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తుతుంది. ఈ సాలెపురుగు కాటు వల్ల మనుషులకు ప్రాణాపాయం ఉంటుంది గాని, కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇదొక అరుదైన విశేషం.ఒళ్లంతా ముళ్లున్న స్టార్ఫిష్..సముద్రంలో స్టార్‌ఫిష్‌లు అరుదుగా కనిపిస్తాయి. స్టార్ఫిష్లలో మరీ అరుదైనది ఈ ముళ్ల స్టార్ఫిష్. ఇది సముద్రం లోలోతుల్లో ఉంటుంది. ఒళ్లంతా ముళ్లు ఉండటం వల్ల దీనిని ‘క్రౌన్ ఆఫ్ థాన్స్ స్టార్ఫిష్’ అని అంటారు.ఈ ముళ్ల స్టార్‌ఫిష్‌లు రకరకాల రంగుల్లో ఉంటాయి. ఎక్కువగా నలుపు, ముదురు నీలం, ఊదా, ఎరుపు, గోధుమ రంగు, బూడిద రంగుల్లో ఉంటాయి. ఇవి ఎక్కువగా పగడపు దిబ్బలను ఆశ్రయించుకుని బతుకుతాయి. పర్యావరణ మార్పుల వల్ల పగడపు దిబ్బలు రంగు వెలిసిపోతుండటం, పగడపు దిబ్బల విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతుండటంతో ఈ ముళ్ల స్టార్ఫిష్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పగడపు దిబ్బలను కాపాడుకునేందుకు తగిన చర్యలు చేపట్టకుంటే, ఈ ముళ్ల స్టార్ఫిష్ జాతి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది.అత్యంత పురాతన గుహాచిత్రాలు..ప్రపంచంలో పురాతన మానవులు సంచరించిన ప్రదేశాల్లో పలుచోట్ల ఆనాటి మానవులు చిత్రించిన గుహాచిత్రాలు బయటపడ్డాయి. సహస్రాబ్దాల నాటి గుహాచిత్రాలు పురాతన మానవుల ఆదిమ కళా నైపుణ్యానికి అద్దంపడతాయి. ఇటీవల ఇండోనేసియాలోని సూలవేసీ దీవిలో అత్యంత పురాతన గుహాచిత్రాలు బయటపడ్డాయి. ఈ దీవిలోని మారోస్ పాంగ్కెప్ ప్రాంతానికి చెందిన లీంగ్ కరాంపాంగ్ సున్నపురాతి గుహల్లో ఈ పురాతన చిత్రాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.వీటిలో ఎర్రరంగుతో చిత్రించిన మూడడుగుల పంది బొమ్మ, చిన్న పరిమాణంలో నిలబడి ఉన్న భంగిమలో మూడు వేటగాళ్ల బొమ్మలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన పురాతత్త్వ శాస్త్రవేత్తలు ఈ గుహాచిత్రాలపై క్షుణ్ణంగా పరిశోధనలు జరిపారు. గుహ లోపలి భాగంలో ఒకే రాతిపై వరుసగా చిత్రించిన ఈ బొమ్మలను కార్బన్ డేటింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరీక్షించి, ఇవి కనీసం 51,200 ఏళ్ల కిందటివని అంచనాకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దొరికిన గుహా చిత్రాలలో ఇవే అత్యంత పురాతనమైన గుహా చిత్రాలని గ్రిఫిత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాక్సిమ్ ఆబర్ట్ వెల్లడించారు. -
ప్యారిస్ ఒలింపిక్స్ : రొమాంటిక్ లవ్ ప్రపోజల్, వైరల్ వీడియో
సిటీ ఆఫ్ లవ్.. ప్యారిస్. తన ఇష్టసఖి మనసు గెల్చుకునేందుకు విశ్వక్రీడావేదికను ఎంచుకున్నాడు. ఈ రొమాంటిక్ స్టోరీ ఇంటర్నెట్లో సందడి చేస్తోంది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఈ చైనీస్ జంట వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో చైనీస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ హువాంగ్ యాకియోంగ్, జెంగ్ సివీ స్వర్ణం గెలిచి తమ కలను సాకారం చేసుకున్నారు. కానీ బోయ్ ఫ్రెండ్ డైమండ్ రింగ్‌ను సొంతం చేసుకుంటానని ఊహించలేదు..హువాంగ్. స్టోరీ ఏంటంటే..:తన లవ్ ప్రపోజల్‌కు ఇంతకంటే మంచి సమయం ఏముంటుంది అనుకున్నాడో ఏమో గానీ చైనీస్ షట్లర్ లియు యుచెన్, తన ప్రేయసి విజయ సంబరాల్లో మునిగి తేలుతున్న వేళ మోకాళ్లపై వంగి ‘జీవితాంతం నిన్ను ప్రేమిస్తా.. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ హువాంగ్ యాకియోంగ్కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేశాడు. దీంతో సిగ్గుల మొగ్గ అవ్వడం ఆమె వంతైంది. సోషల్ మీడియాలో ఈ ప్రేమికులకు అభినందనలు వెల్లువెత్తాయి. లియు యుచెన్ ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలవలేదు కానీ ఒలింపిక్ బంగారు పతక విజేతను గెల్చుకున్నాడు అంటూ అభినందించారు. పురుషుల డబుల్స్‌లో టోక్యో-2020 రజత పతకాన్ని గెల్చుకున్నాడు లియు."I’ll love you forever! Will you marry me?""Yes! I do!" OMG!!! Romance at the Olympics!!!❤️❤️❤️Huang Yaqiong just had her "dream come true", winning a badminton mixed doubles gold medal🥇with her teammate Zheng SiweiThen her boyfriend Liu Yuchen proposed! 🎉🎉🎉 pic.twitter.com/JxMIipF7ij— Li Zexin (@XH_Lee23) August 2, 2024శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ బ్యాడ్మింటన్‌లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ వోన్ హో- జియోంగ్ నా-యూన్ (21-8, 21-11)పై చైనాకు చెందిన జెంగ్ సివీ మరియు హువాంగ్ యా కియోంగ్ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నారు.కాగా అర్జెంటీనాకు చెందిన హ్యాండ్‌బాల్ స్టార్ పాబ్లో సిమోనెట్, మహిళల ఫీల్డ్ హాకీ క్రీడాకారిణి మరియా పిలార్ కామ్పోయ్ లవ్ స్టోరీ కూడా ప్యారిస్ ఒలింపిక్స్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమెకు పెళ్లి ప్రతిపాదన తెచ్చేందుకు తొమ్మిదేళ్లు వెయిట్ చేసిన మరీ ఆమె మనసు దోచుకున్నాడు -
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మరో క్రేజీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజై హిట్ కొట్టినప్పటికీ.. పెద్దగా టైమ్ తీసుకోకుండా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. నెలలోపే ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. ఇది తమిళ మూవీ. కానీ తెలుగులో నేరుగా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)తమిళ హీరో కవిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'స్టార్'. సినిమా హీరో అవ్వాలనుకునే ఓ యువకుడి కథతో దీన్ని తెరకెక్కించారు. మే 10న తమిళంలో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీని తెలుగు వెర్షన్ కూడా థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ ఎందుకో కుదర్లేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేశారు. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో 'స్టార్' స్ట్రీమింగ్ అవుతోంది.'స్టార్' కథ విషయానికొస్తే.. పాండియన్ (లాల్) ఓ ఫొటోగ్రాఫర్. కొడుకు కలై (కవిన్)ని సినిమా యాక్టర్ చేయాలని అనుకుంటాడు. తండ్రి ప్రోత్సాహం వల్ల చిన్నప్పటి నుంచే సినిమాలంటే పిచ్చితో కలై పెరుగుతాడు. పెరిగి పెద్దయిన తర్వాత ముంబైలో యాక్టింగ్ కోర్సు పూర్తి చేస్తాడు. హీరోగా అవకాశం వస్తుంది. కానీ ఓసారి యాక్సిడెంట్ అయి ముఖమంతా అందవికారంగా తయారవుతుంది. ఇలాంటి కలై.. చివరకు యాక్టర్ అయ్యాడా? లేదా? అనేదే తెలియాలంటే 'స్టార్' చూసేయాల్సిందే.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
Kajal Aggarwal: అందమైన చందమామ.. వయ్యారి సత్యభామ (ఫోటోలు)
-
Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
-
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు ఉంటాయి. ప్రకృతికి మించి అద్భుతమైనది మరోకటి లేదు. దానికి మించి మనిషి తాను ఏదో కనిపెట్టాలనుకుంటే విధి చేసే మరింత విచిత్రంగా ఉంటుంది. చివరికి మనిషిని సమస్యలో పెట్టి అతడి వాళ్ల నుంచి సమస్యకు పరిష్కరం దొరికేలా చేస్తుంది విధి. అలాంటి రెండు ఆసక్తికర విషయాలు చూద్దామా..!స్టార్ఫిష్లా ఉండే పూలునక్షత్రాకారంలో ఉండే ఈ పూలను స్టార్ఫిష్ కాక్టస్ ఫ్లవర్స్ అని, స్టార్ ఫ్లవర్స్ అని అంటారు. బ్రహ్మజెముడు జాతికి చెందిన ఒక ఎడారి మొక్కకు ఈ పూలు పూస్తాయి. ఇవి అరచేతి విస్తీర్ణాన్ని మించి చాలా పెద్దగా ఉంటాయి. ఇవి ఊదా, ముదురు ఎరుపు, లేత ఎరుపు, పసుపు, గోధమ రంగుల్లో ఉంటాయి. ఈ పూలు చూడటానికి అందంగానే ఉన్నా, వీటి నుంచి వెలువడే కుళ్లిన మాంసం వాసనను భరించడమే కష్టం. కనిపెట్టిన మెషిన్ గన్తోనేఅమెరికాలో జన్మించిన బ్రిటిష్ ఆవిష్కర్త హైరమ్ స్టీవన్ మాక్సిమ్ మొట్టమొదటి ఆటోమేటిక్ మెషిన్ గన్ను రూపొందించాడు. ఆ మెషిన్ గన్‌తో టెస్ట్ ఫైరింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన శబ్దానికి ఆయన బధిరుడిగా మారాడు. ఆ తర్వాత ఆయన కొడుకు హైరమ్ పెర్సీ మాక్సిమ్ సైలెన్సర్‌ను కనిపెట్టాడు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?) -
కలల సాకారం కోసం పోరాడితేనే 'స్టార్'
'ప్రతి ఒక్కరూ కలలు కనాలి, వాటి సాకారం కోసం కృషి చేయాలి' అనే అబ్దుల్ కలాం సూక్తి ఆధారంగా తీసిన సినిమా 'స్టార్'. ఇలన్ దర్శకుడు. 'దాదా' ఫేమ్ కవిన్ హీరో. అతిథి పొహంగర్, కీర్తీ మురుగన్ హీరోయిన్స్. రైస్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్, శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. ఈ నెల 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలు పంచుకున్నారు.(ఇదీ చదవండి: సమ్మర్ స్పెషల్.. ఓటీటీలో 100 సినిమాలు/ సిరీస్‌లు)1980ల్లో మధురైకు చెందిన ఓ కుర్రాడు.. సినిమా నటుడు కావాలనే కలతో చెన్నైకి చేరుకుంటాడు. అతడు తన కల నెరవేర్చుకోవడానికి చేసే పోరాటమే 'స్టార్' సినిమా. ఇకపోతే దర్శకుడు తనకు కథ చెప్పిన విధానం నచ్చిందని హీరోగా చెప్పగా.. ఈ చిత్రంపై తనకు పూర్తి నమ్మకం ఉందని దర్శకుడు ఇలన్ ధీమా వ్యక్తం చేశాడు.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్) -
Naila Grewal HD Photos: తమాషా అనుకుంది, కట్ చేస్తే ఓటీటీ స్టార్ అయిపోయింది! (ఫొటోలు)
-
Gal Gadot: నాలుగోసారి ఆడపిల్లకు జన్మనిచ్చిన వండర్ ఉమెన్.. పేరేంటో తెలుసా? (ఫోటోలు)
-
స్టార్ చెఫ్‌కు 'మిషెలాన్ స్టార్' అవార్డు
‘అబ్బో! ఇప్పుడు తినాలా!’ అని బద్దకించే వాళ్లను కూడా ఆవురావురుమంటూ తినేలా చేసింది ముంబైకి చెందిన గరీమా అరోరా. వంటల తత్వాన్ని ఒడిసిపట్టిన గరీమా చెఫ్, రెస్టారెంట్ నిర్వాహకురాలిగా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. తాజాగా... ‘మిషెలాన్ స్టార్’ అవార్డ్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా ప్రత్యేకత సాధించింది గరీమా అరోరా. ప్రపంచ వ్యాప్తంగా ‘ఔట్ స్టాండింగ్ కుకింగ్’కు సంబంధించి చెఫ్‌లకు ఇచ్చే ఫ్రాన్స్ దేశపు అత్యున్నత అవార్డ్ మిషెలాన్ స్టార్. నా సక్సెస్‌మంత్ర పురాణాల నుంచి చరిత్ర వరకు వంటలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటాను. మన భారతీయ పురాతన వంటకాల నుంచి ప్రేరణ పొందుతాను. సంప్రదాయ, ఆధునిక పద్ధతులను మిళితం చేస్తాను. స్థానికంగా దొరికే పదార్థాలను ఉపయోగిస్తాను. – గరీమా అరోరా గరీమా ఫుడ్ ఫిలాసఫీ ఏమిటీ? ‘వంటకం ఎలా ఉండాలంటే తినే వ్యక్తి చుట్టుపక్కల ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోవాలి. ఆస్వాదన మీద తప్ప మరే విషయం మీద దృష్టి మళ్లకూడదు’. కొత్త వంటకాలను రుచి చూడడం, కొత్త వం.టకాలు తయారు చేసి ఇతరులకు పరిచయం చేయడం అంటే గరీమాకు ఇష్టం. ఆ ఇష్టమే ‘చెఫ్’ అయ్యేలా చేసింది. గరీమాకు థాయిలాండ్‌లో ‘గా’ పేరుతో ఇండియన్ రెస్టారెంట్ ఉంది. ఊహించని సమ్మేళనాలతో దినుసులు, రకరకాల వంటకాల ఘుమఘుమలతో అతిథులను ఆశ్చర్యపరచడంలో ‘గా’ ముందు ఉంటుంది. ‘ఏడు నెలల పిల్లాడిని చూసుకోవడం, బిజినెస్, కిచెన్ పనులను సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నా టీమ్‌ను నా శక్తిగా చెబుతాను. రకరకాల కస్టమర్లు, లేటునైట్లు. పని ఒత్తిడి ఉన్నా, నేను అందుబాటులో లేకపోయినా రెస్టారెంట్ సజావుగా సాగేలా చేస్తారు. వారి సపోర్ట్ లేకపోతే కుటుంబ బాధ్యతలు, వ్యాపార పనులను సమన్వయం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. మిషెలాన్ స్టార్ అవార్డ్ గెలుచుకోవడంలో తగిన సహాయ సహకారాలు అందించి టీమ్ నన్ను ముందుకు నడిపించింది. రెస్టారెంట్లో పనిచేయడం లేదా నిర్వహించడం అంత సులభం కాదు. ఎంతో అంకితభావం ఉండాలి. కష్టపడే తత్వం ఉండాలి. ఇంట్లో వాళ్లతో హాయిగా మాట్లాడానికి కూడా సమయం దొరకకపోవచ్చు. సెలవులు, పండగలు, ఫంక్షన్లు మిస్ కావచ్చు. అన్నిటినీ తట్టుకోగలిగితే ఎన్నో సాధించవచ్చు’ అంటున్న గరీమా అరోరా మరిన్ని పురస్కారాలు గెలుచుకోవాలని ఆశిద్దాం. ఇవి చదవండి: 'ఇండిగ్యాప్'తో ఆరోగ్యం, అధికాదాయం! -
ఆ తార అస్తమయం వెనక...!
అది 2009. అనంతాకాశంలో ఒక తార ఉన్నట్టుండి మాయమైంది. అది సైంటిస్టులను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. నక్షత్రాలు మరణించడం వింతేమీ కాదు. అరుదు అంతకన్నా కాదు. కానీ అందుకు ఒక క్రమం ఉంటుంది. తమ జీవిత కాలంలో చివరి ఏడాదిలో అవి అత్యంత ప్రకాశవంతంగా మారతాయి. అనంతరం సూపర్ నోవాగా పిలిచే బ్రహా్మండమైన పేలుడుకు లోనవుతాయి. అలా శక్తినంతా కోల్పోయి మరుగుజ్జు తారలుగా మిగిలిపోతాయి. నెమ్మదిగా అంతర్ధానం చెందుతాయి. కానీ... సూర్యుని కంటే ఏకంగా 25 రెట్లు పెద్దదైన ఎన్6946– బీహెచ్1 అనే నక్షత్రం మాత్రం ఏదో మంత్రం వేసినట్టు ఉన్నపళంగా మాయమైపోయింది! మనకు 2.2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అది కూడా తొలుత మరణానికి సిద్ధమయ్యే ఇతర తారల మాదిరిగానే 10 లక్షల సూర్యులకు సమాన తేజంతో వెలిగిపోయింది. దీన్ని గమనించిన సైంటిస్టులు, మరో సూపర్ నోవా చోటు చేసుకోనుందనే అనుకున్నారు. కానీ జరగకపోగా, అది వెలుగులన్నీ కోల్పోయింది. అలాగే క్రమంగా మాయమైపోయి ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి కారణాలపై ఇప్పుడు బోలెడంత చర్చ జరుగుతోంది. కృష్ణబిలం మింగింది.. కాదు... ఈ తార విచిత్ర అంతర్ధానాన్ని ’జరగని సూపర్ నోవా’గా అప్పట్లో కొందరు సైంటిస్టులు పిలిచారు. బహుశా ఆ నక్షత్రాన్ని ఏదో కృష్ణబిలం మింగేసిందని వారు ప్రతిపాదించారు. అలా అది కూడా కృష్ణబిలంగానే మారిందని సూత్రీకరించారు. ఆ ఉద్దేశంతోనే దాని పేరు చివరన బీహెచ్1 అని చేర్చారు. అయితే అది సరికాదని మరికొందరు సైంటిస్టులు తాజాగా వాదిస్తున్నారు. దీనికి సంబంధించి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇటీవల సేకరించిన పరిణామాల్ని విశ్లేíÙంచిన మీదట ఆ వాదనకు బలం చేకూరుతోంది. బీహెచ్1 తార ఉన్న చోట అతి ప్రకాశవంతమైన పరారుణ కాంతిని జేమ్స్ వెబ్ గమనించింది. అది మూడు వేర్వేరు రకాల కాంతి అని కూడా చెబుతున్నారు. బహుశా పలు నక్షత్రాలు పరస్పరం కలిసిపోయి పెను తారగా మారాయనేందుకు ఇది నిదర్శనమని అంటున్నారు. కానీ సూపర్ నోవాగా మారకుండా అది ఎలా అంతర్ధానం అయిందన్న కీలక ప్రశ్నకు మాత్రం ఇంకా బదులు దొరకాల్సే ఉంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
కుక్కలా మారిన వ్యక్తి..ఆడ కుక్కతో ప్రేమలో..
ఓ జపాన్ వ్యక్తి ఇటీవల కుక్కలా మారి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి ఓ ప్రముఖ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో.. కుక్కలా మారిన తర్వాత తన అసాధారణ జీవితం ఎలా ఉందో వివరిస్తూ..చాలా షాకింగ విషయాలు చెప్పాడు. అతడు చెప్పిన విషయాలు చూస్తే వామ్మో ఇవేం కోరికలు అనిపించేలా ఉన్నాయి. వివరాల్లోకెళ్తే..ఇటీవలే జపాన్‌కి చెందిన వ్యక్తి తనకెంతో ఇష్టమైన "కోలీ" అనే కుక్కలా మారి ఆశ్చర్యపర్చాడు. అందుకోసం ఎన్నో కంపెనీలు సంప్రదించగా ఓ కంపెనీ ముందుకు వచ్చి కుక్కను తలిపించే కాస్ట్యూమ్ డిజైన్ చేసేందుకు ముందుకు వచ్చింది. . ఇటీవలే అచ్చం కుక్కలా కనిపించే ఆ కాస్ట్యూమ్ని ధరించి వీధుల్లో హల్చల్ చేసి నెట్టింట వైరల్‌గా మారాడు కూడా. ఇప్పుడా వ్యక్తి తనకు ఇలా కుక్క జీవితం ఎంతో నచ్చిందని చెబుతున్నాడు. కుక్క మాదిరిగా నాలుగు కాళ్లపై నడవడం ఇబ్బందిగా ఉన్నా సంతృప్తిగా ఉందని చెప్పడం విశేషం. ఆ వ్యక్తి ఆ కుక్కలా కనిపించే కాస్ట్యూమ్స్ కోసం ఒకటి, రెండు కాదు ఏకంగా రూ. 12 లక్షలు ఖర్చుపెట్టాడు. అంత ఖర్చుపెట్టాడు కాబట్టి ఇష్టపడక ఏం చేస్తాడులే! అని అనుకోకండి. పైగా కుక్కలా అసాధారణ జీవితం గడుపుతున్న అతడికి కలుగుతున్న కోరికలు వింటే మాత్రం ఓర్నీ ఇవేం కోరికలు అని నోరెళ్లబెట్టడం ఖాయం. ఇంతకీ ఆ కుక్కలా మారిన వ్యక్తి తనలానే కుక్కలా మారాలనుకునే స్త్రీ కూడా ఉంటే బాగుండనని, ఆమెతో ప్రేమలో పడాలని అనుకుంటున్నాడట. అంతేకాదు కుక్కలా ఉన్న తనకు సినిమాలో నటించే అవకాశం వస్తే బావుండనని అంటున్నాడు. ఒక్క అవకాశం ఇస్తే తానేంటో చూపించుకుంటానని చెబుతున్నాడు. ఇలా జీవితం గడపడం ఎంత అసౌకర్యంగా అసాధారణంగా ఉన్నా తనకు అలా ఉండటమే ఇష్టమని తేల్చి చెప్పాడు. కోలీ జాతి కుక్కలంటే తనకెంతో ఇషమని అలా ఉండాలన్న కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉందని మరీ చెబుతున్నాడు. ఓర్నీ వెర్రీ వెయ్యి రకాలు అంటే ఏంటో అనుకున్నాం. ఇలానే ఉంటుందేమో కదా!. (చదవండి: వధువు ఎంట్రీ మాములుగా లేదుగా!ఐడియా అదుర్స్) -
మొన్ననే హీరో పెళ్లి.. ఇప్పుడు కొత్త సినిమా
'డాడా' లాంటి హిట్ సినిమాతో ప్రూవ్ చేసుకున్న నటుడు కవిన్.. మరో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. దీనికి 'స్టార్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 'ప్యార్ ప్రేమ కాదల్' ఫేమ్ ఇళన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎళిల్ అరసు ఛాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. రైస్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్, 'విరూపాక్ష'తో హిట్ కొట్టిన శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. (ఇదీ చదవండి: బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) ఇప్పటికే షూటింగ్ ప్రారంభించారు. చైన్నె, ముంబైలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుందని దర్శకుడు మీడియాకు చెప్పుకొచ్చారు. ఇందులో ముంబై బ్యూటీ హీరోయిన్ కాగా, మలయాళ నటుడు కీలక పాత్ర చేస్తున్నట్లు చెప్పారు. యువన్ శంకర్ రాజా స్వరపరిచిన ఇంట్రో సాంగ్ కోసం భారీ సెట్‌ను వేసి వేసినట్లు చెప్పారు. యువన్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 31న 'స్టార్' స్పెషల్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఇకపోతే కవిన్.. మొన్న పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కొత్త సినిమా ప్రకటించాడు. (ఇదీ చదవండి: పబ్లిక్‌లో హీరోయిన్‌కి ముద్దుపెట్టిన తెలుగు డైరెక్టర్) View this post on Instagram A post shared by Kavin M (@kavin.0431) -
‘మమ్మల్ని గోకితే రిజల్ట్ ఇలానే ఉంటుంది’
సాక్షి, కృష్ణా: సాయి ధరమ్ తేజ్-పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమా వివాదంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి స్పందించారు. విజయవాడలో బుధవారం ఆయన సాక్షిటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా బ్రో చిత్ర నిర్మాత విశ్వప్రసాద్‌కు, హీరో సాయి ధరమ్ తేజ్‌కు.. పనిలోపనిగా పవన్‌కు ఆయన చురకలు అంటించారు. ‘‘నేను చేసినవి ఆరోపణలే అయితే.. వాస్తవాలు దాచాల్సిన అవసరం ఏముంది?. పవన్ రెమ్యునరేషన్ ఎంత? సినిమాకు పెట్టుబడి ఎంత? కలెక్షన్స్ ఎంత?. వాస్తవాలు చెప్పడానికి భయపడుతున్నాడా? లేదంటే దాస్తున్నాడా?. నిజాలు దాస్తున్నారంటే ఏదో ఉందనేగా అర్థం అని అంబటి అనుమానం వ్యక్తం చేశారు. దానకర్ణుడు, సమాజశ్రేయస్సు కోరే వ్యక్తి అని చెప్పే పవన్ ఎందుకు వాస్తవాలు దాస్తున్నాడు. తన నీతి, నిజాయితీ నిరూపించుకోవాలంటే సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్.. కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఎంతో చెప్పాల్సిన అవసరం పవన్‌కు కచ్చితంగా ఉంది అని అంబటి డిమాండ్ చేశారు. బ్రో సినిమానే ఒక స్కాం నూటికి నూరు శాతం బ్రో విషయంలో చాలా పెద్ద వ్యవహారం ఉంది. చంద్రబాబు ప్యాకేజ్ విశ్వప్రసాద్ ద్వారా అందింది. ఒక స్కామ్ మాదిరిగా ఈ ప్యాకేజ్ వ్యవహారం జరుగుతోంది. ఇదంతా వాళ్లు ఆడే గేమ్ ప్లాన్. అంకెలు చెబితే దొరికిపోతామని భయపడుతున్నారు. అందుకే చెప్పడం లేదు అని అంబటి ఆరోపించారు. మమ్మల్ని గోకితే ఇలాగే ఉంటుంది సినిమాను సినిమాలాగే చూడాలంటున్నాడు ఈ చిత్ర హీరో సాయి ధరమ్ తేజ్. సినిమాలను సినిమాగానే తీయండి. మధ్యలో మమ్మల్ని గోకడమెందుకు?. మమ్మల్ని గోకితే .. ఇలానే ఉంటుంది. నా మీద పుంఖాను పుంఖాలుగా వెబ్ సిరీస్ తీసుకోండి.. నాకేం అభ్యంతరం లేదు. అందులో సాయిధరమ్ తేజ్ , పవన్ కళ్యాణ్ ను పెట్టి.. విశ్వప్రసాద్ తో తీయించండి. పవన్ కల్యాణ్ అన్ని సినిమాల గురించి నేను పట్టించుకోలేదు. మీ సినిమాలు మీరు తీసుకుంటే ఏమీ ఉండదు. మమ్మల్ని గోకితే ఇలానే ఉంటుంది. ఇదే ఈ కథలో నీతి అని తెలిపారాయన. ఇక అంబటి ఢిల్లీ పర్యటన గురించి, దానికి బ్రో చిత్ర వివాదానికి ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘ నేను ఢిల్లీ ఎందుకు వెళ్తున్నానో చెప్పను. ముఖ్యమైన అంశం మీద వెళ్తున్నా. అక్కడ మా పార్టీ ఎంపీలను కలుస్తా’’ అని సమాధానం ఇచ్చారు. -
ఆయనకు ‘కొంటె’ భార్య కావాలి.. ఇమ్రాన్‌ఖాన్‌కు నాలుగో భార్యనవుతా..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందంటూ యూకేకు చెందిన ఓ టిక్ టాక్ స్టార్ ప్రపోజ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయనకు నాలుగో భార్యనవుతానని చెప్పిన ఓ వీడియో హల్చల్ చేస్తోంది. అవిశ్వాస పరీక్షలో ఓడిపోయి పదవి నుంచి వైదొలిగిన నాటి నుంచి ఇమ్రాన్ ఖాన్ రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.. ఇలాంటి సమయంలో యూకేకు చెందిన జియా ఖాన్ అనే టిక్‌టాకర్ ఈ ప్రతిపాదన చేసింది. ‘‘ఆయన ముందు జెమీమాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అందమైన ఓ జర్నలిస్టు ఆయనకు రెండో భార్యగా వచ్చింది. మూడోసారి ఓ సంప్రదాయబద్ధమైన మహిళను వివాహమాడారు. ఇప్పుడు ఆయన జీవితంలో గ్లామర్ నింపాల్సిన అవసరం ఉంది. ఆయనకో కొంటె భార్య కావాలి. నేను ఆయనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నాలుగో భార్యగా ఉండాలనుకుంటున్నా. ఇందుకోసం బుష్రా బీబీతో బంధాన్ని తెంచడానికైనా నేను సిద్ధమే. ఆయన వయసు 70 ఏళ్లు. అయినా నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆయన ఇమ్రాన్ ఖాన్ ’’ అంటూ ఆ వీడియోలో జియా ఖాన్ కొంటెగా చెప్పింది. ఇమ్రాన్ ఖాన్ రాజకీయంగా కేసులు, అరెస్టులతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు కొత్త అభిమాని లభించారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చదవండి: అందాల పోటీల్లో భార్య ఓటమి.. కోపంతో భర్త ఏం చేశాడంటే.. -
మరో డైరెక్టర్ ని పాన్ ఇండియా కి తీసుకు వెళ్లనున్న అల్లు అర్జున్
-
మెగా ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న రామ్ చరణ్
-
హీరోయిన్స్ గా ఎంట్రీకి రెడీ అవుతున్న టాలీవుడ్ స్టార్ డాక్టర్స్
-
హిట్ కోసం ప్రభాస్ సూపర్ ప్లాన్
-
ప్రభాస్ కి ఎంతమాత్రం కలిసిరాని 2022 ..!
-
సాయి పల్లవిని పాన్ ఇండియా స్టార్ ని చేస్తున్న శేఖర్ కమ్ముల
-
IPL 2023: కోట్లు ఇచ్చారు... కోట్లు తెచ్చుకునేదెలా?
పెట్టుబడిగా పెట్టిన ప్రతీ రూపాయిపై కనీస లాభం సంపాదించడమే వ్యాపారం... ముంబైలో అంబానీ అయినా ఊర్లో కిరాణా కొట్టు నడిపే వ్యక్తి అయినా ఈ విషయంలో ఒకేలా ఆలోచిస్తారు. మరి ఐపీఎల్లో ప్రసారహక్కుల కోసం వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టిన సంస్థలు ఈ విషయంలో ఎలాంటి వ్యూహాలతో ఉంటాయి? ఐదేళ్ల కాలానికిగాను వారు చెల్లించబోయే మొత్తానికి ‘గిట్టుబాటు’ అవుతుందా! ప్రసార హక్కుల కోసమే మూడు వేర్వేరు సంస్థలు కలిపి బీసీసీఐకి రూ. 48,390.32 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఐపీఎల్ ఎలా ఉండబోతోంది? కేవలం వ్యాపార ప్రకటనలతోనే తమ పెట్టుబడితో పాటు లాభాలను తీసుకోవడం ఈ సంస్థలకు సాధ్యమేనా! ఇంకా చెప్పాలంటే ఈ భారీ మొత్తం వల్ల ఐపీఎల్లో ఎలాంటి మార్పులు వస్తాయనేది ఆసక్తికరం! రూ. 118.02 కోట్లు... టీవీ, డిజిటల్ విభాగాలు కలిపి చూస్తే ఒక్కో ఐపీఎల్ మ్యాచ్‌కు ప్రసారకర్తలు చెల్లించబోయే మొత్తం ఇది. ఇంకా వివరంగా చెప్పాలంటే 410 మ్యాచ్‌లలో మ్యాచ్‌కు 40 ఓవర్ల చొప్పున (ఎక్స్ట్రా బంతులు కాకుండా) 98,400 బంతులు... అంటే ఒక్కో బంతి విలువ అక్షరాలా 50 లక్షలు! టీవీలో అయితే ‘స్టార్’ సంస్థ ప్రతీ మ్యాచ్‌కు కనీసం రూ. 57.5 కోట్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ‘వయాకామ్–18’ కంపెనీ ప్రతీ మ్యాచ్‌కు రూ. 50 కోట్ల కేవలం ప్రసార హక్కులకు మాత్రమే బీసీసీఐకి చెల్లించబోతోంది. దీనికి అదనంగా ఆయా సంస్థలకు బోలెడు ఖర్చులు! మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం కోసం కెమెరాలు, ఇతర సాంకేతిక సౌకర్యాలు ఏర్పాటు, కామెంటేటర్లు, ఉద్యోగులకు చెల్లింపులు, ఇతర సాధారణ ఖర్చులకు సొంత డబ్బు వాడాల్సిందే. ఇలాంటి స్థితిలో ఒక్కో మ్యాచ్‌కు వారు ఆశించే మొత్తం తిరిగి రావడం సాధ్యమేనా! ప్రసారకర్తల కోసం ఐపీఎల్ వీక్షణంలో కూడా పలు మార్పులకు బీసీసీఐ అంగీకరించవచ్చు. ప్రకటనలే ప్రధానం... ఇన్నింగ్స్‌కు 2 చొప్పున ‘స్ట్రాటజిక్ బ్రేక్’లతో పాటు ఓవర్ల మధ్యలో విరామ సమయం తదితరాలు కలిపి ప్రస్తుతం ప్రకటనల కోసం గరిష్టంగా ఒక టి20 మ్యాచ్‌లో 2,400 సెకన్లు (40 నిమిషాలు) అందుబాటులో ఉన్నాయి. 2022 ఐపీఎల్ మ్యాచ్‌లకు 10 సెకన్ల ప్రకటనకు సుమారు రూ.15 లక్షల వరకు ‘స్టార్’ వసూలు చేసింది. దీంతో పాటు ‘కో ప్రజెంటర్’ పేరుతో గరిష్టంగా ఒక్కో వ్యాపార సంస్థ నుంచి రూ. 180 కోట్ల వరకు... అసోసియేట్ స్పాన్సర్ ద్వారా గరిష్టంగా రూ. 105 కోట్ల వరకు తీసుకుంది. ఇతర అనుబంధ అంశాలు (ఫోర్లు, సిక్స్‌లు, ఫాస్టెస్ట్ బాల్) తదితరాల ద్వారా మరో రూ. 300 కోట్లు, హైలైట్స్ ప్యాకేజీల ద్వారా రూ. 200 కోట్ల వరకు అదనంగా ‘స్టార్’ ఖాతాలో చేరాయి. ఇది ఐపీఎల్ ప్రకటనలకు సంబంధించి తాజా పరిస్థితి. సాధారణంగా ప్రతీ ఏటా ఐపీఎల్ ప్రకటనల రేటు సుమారు 10–15 శాతం పెరుగుతోంది. అయితే ఇప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారం చూస్తే ఇది సరిపోదు. కనీసం 80 శాతం వరకు రేటు పెంచాల్సి ఉంటుంది. ఇది అంత సులు వేమీ కాదు. లీగ్‌పై ఎంత క్రేజ్ ఉన్నా... ప్రకటన దారులు అంత సులువుగా ముందుకొస్తారా అనేది ప్రశ్న. ఈ ఏడాదితో పోలిస్తే మున్ముందు మ్యాచ్‌ల సంఖ్య పెరగడం సానుకూలాంశం కాగా... అభిమానులు రెండున్నర నెలలు సుదీర్ఘంగా సాగే లీగ్‌పై ఒకే స్థాయిలో ఆసక్తి చూపిస్తారా అనేది సందేహమే. 2022లోనే వ్యూయర్షిప్ 30 శాతం తగ్గినా... దాని ప్రభావం తాజా వేలంపై పడలేదు కాబట్టి సమస్య గా అనిపించలేదు. కానీ మున్ముందు చెప్పలేం. అయితే అన్ని లెక్కలు చూసుకున్నాకే పెద్ద సంస్థలు హక్కుల కోసం బరిలోకి దిగి ఉంటాయి. కాబట్టి బయటకు కనిపించని లెక్కలూ ఉండవచ్చు! ఇలా కూడా జరగొచ్చు... ఇంత భారీ మొత్తానికి హక్కులు అమ్మిన తర్వాత రాబోయే సీజన్లలో ప్రసారకర్తల భిన్న డిమాండ్లను బోర్డు సహజంగానే గౌరవించాల్సి రావచ్చు. ‘స్ట్రాటజిక్ టైమౌట్’లను 5 ఓవర్లకు ఒక్కోసారి చొప్పున మ్యాచ్‌కు ఆరు వరకు పెరిగే అవకాశం ఉంది. మ్యాచ్‌లో ఎక్కడ వీలైతే అక్కడ ప్రకటనలు పెట్టుకునే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి సహజంగానే మ్యాచ్ వ్యవధి కూడా పెరగడం ఖాయం. కాస్త వ్యంగ్యంగా చెప్పాలంటే ప్రకటనల మధ్యలో ఐపీఎల్ మ్యాచ్ చూడాల్సి రావచ్చు! డిజిటల్ కోసం భారీ మొత్తం చెల్లించిన ‘రిలయన్స్’ ఐపీఎల్ కోసం ఎక్కువ మొత్తంతో ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ఆఫర్ చేసే అవకాశమూ ఉంది. ఈ భారీ ఒప్పంద ప్రభావం పడే కీలక అంశాన్ని చూస్తే ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక టి20 సిరీస్‌లకు మంగళం పలికినట్లే! ఐపీఎల్ ప్రభావం, దానితో ముడిపడి ఉన్న డబ్బు, ఐసీసీని శాసించగలిగే బీసీసీఐని చూస్తే ప్రపంచకప్‌లో మినహా ఇతర అంతర్జాతీయ టి20లు కనిపించకపోవచ్చు. అన్నింటికి మించి ఫాంటసీ లీగ్‌లు, క్రికెట్ బెట్టింగ్ మరింతగా విజృంభించడం ఖాయం! సాక్షి క్రీడా విభాగం -
నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి.. కానీ అక్కడ మాత్రం లాబొరేటరీలో..!
నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి కదా, మరి లాబొరేటరీలో నక్షత్రం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? నిజమే! లాబొరేటరీలోనే ఇటీవల ఒక బుల్లి నక్షత్రాన్ని తయారు చేశారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు. ఆక్స్ఫర్డ్ సమీపంలోని ‘జాయింట్ యూరోపియన్ టారస్’ (జేఈటీ) లాబొరేటరీలో దీనిని తయారు చేసినట్లు యూకే అటామిక్ ఎనర్జీ అథారిటీ (యూకేఏఈఏ) వెల్లడించింది. ఈ బుల్లి నక్షత్రం ద్వారా కేవలం ఐదు సెకండ్లలోనే ఏకంగా 59 మెగాజౌల్స్ శక్తిని ఉత్పత్తి చేసి, 1997 నాటి రికార్డును శాస్త్రవేత్తలు బద్దలు కొట్టారని యూకేఏఈఏ ప్రకటించింది. ఐదు సెకండ్లలో ఈ బుల్లి నక్షత్రం ద్వారా ఉత్పత్తి చేసిన శక్తితో ఐదు సెకండ్ల పాటు 35 వేల ఇళ్ల విద్యుత్ అవసరాలను తీర్చవచ్చు. ఇది కేవలం ప్రయోగాత్మకంగా నమూనాలా ఉత్పత్తి చేసిన విద్యుత్తు మాత్రమే! ఐదు సెకన్ల ప్రయోగం కోసం ఇందులో కేవలం 0.1 మిల్లీగ్రాము డీయుటేరియం, ట్రిటియమ్ కణాలను ఉపయోగించారు. ఇవి రెండూ హైడ్రోజన్‌కు చెందిన ఐసోటోప్లు. న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా పనిచేసే ఈ బుల్లి నక్షత్రం పూర్తిస్థాయిలో పనిచేస్తే, ఇది ఏకంగా సూర్యుడికి పదిరెట్ల వేడిమిని ఉత్పత్తి చేయగలదు. దీని ద్వారా కాలుష్యంలేని విద్యుత్తును చిరకాలం సరఫరా చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అంతర్జాతీయ ప్రాజెక్టు నిజానికి 1980లలోనే మొదలైంది. ఇది విజయవంతమైతే, 2050 నాటికి ప్రపంచమంతటికీ కాలుష్యంలేని విద్యుత్తును సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయని వివరిస్తున్నారు. చదవండి: లేడీ ఇన్ బ్లాక్.. చావు అంచుల దాకా వెళ్లి బతికాడు.. ఇప్పటికి మిస్టరీగానే -
ఉత్పాతం నుంచి ఉత్పత్తి
ఒక తార జన్మించాలంటే ఒక నిహారిక మరణించాలని ఇంగ్లిష్ సూక్తి. ఒక గ్రహం జన్మించాలంటే అంతకన్నా ఎక్కువ ఉత్పాతం జరగాలంటున్నారు సైంటిస్టులు. శిశువుకు జన్మనిచ్చేందుకు తల్లి పడేంత కష్టం గ్రహాల పుట్టుక వెనుక ఉందంటున్నారు. తాజాగా ఇందుకు బలమైన సాక్ష్యాలు లభించాయి. గ్రహాల పుట్టుక ఒక తీవ్రమైన, విధ్వంసకర ప్రక్రియని ఖగోళ శాస్త్రజ్ఞులు విశదీకరిస్తున్నారు. హబుల్ టెలిస్కోపు తాజాగా పంపిన చిత్రాలను శోధించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చారు. గురుగ్రహ పరిమాణంలో ఉన్న ఒక ప్రొటో ప్లానెట్ పుట్టుకను హబుల్ చిత్రీకరించింది. ఒక నక్షత్రం చుట్టూ తిరిగే వాయువులు, ధూళితో కూడిన వాయురూప ద్రవ్యరాశిని(గ్యాసియస్ మాస్) ప్రొటో ప్లానెట్‌గా పేర్కొంటారు. ఈ గ్యాసియస్ మాస్పైన ధూళి, వాయువుల ఉష్ణోగ్రతలు తగ్గి అవి చల్లారే కొద్దీ ఘన, ద్రవ రూపాలుగా మారతాయి. అనంతరం ప్రొటోప్లానెట్ సంపూర్ణ గ్రహంగా మారుతుంది. సౌరవ్యవస్థలో అతిపెద్ద గ్రహాలను(శని, గురుడు, యురేనస్, నెప్ట్యూన్) జోవియన్ గ్రహాలంటారు. మిగిలిన ఐదు గ్రహాలతో పోలిస్తే వీటిలో వాయువులు, ధూళి శాతం ఎక్కువ. ఈ జోవియన్ ప్లానెట్లు కోర్ అక్రేషన్ ప్రక్రియలో ఏర్పడ్డాయని ఇప్పటివరకు ఒక అంచనా ఉండేది. భారీ ఆకారంలోని ఘన సమూహాలు ఢీకొనడం వల్ల ప్రొటో ప్లానెట్లు ఏర్పడతాయని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. ఇది డిస్క్ ఇన్‌స్టెబిలిటీ (బింబ అస్థిరత్వ) సిద్ధాంతానికి వ్యతిరేకం. డిస్క్ ఇన్‌స్టెబిలిటీ ప్రక్రియ ద్వారా జూపిటర్ లాంటి గ్రహాలు ఏర్పడ్డాయనే సిద్ధాంతాన్ని ఎక్కువమంది సమర్థిస్తారు. తాజా పరిశోధనతో కోర్ అక్రేషన్ సిద్ధాంతానికి బలం తగ్గినట్లయింది. వేదనాభరిత యత్నం ఒక నక్షత్ర గురుత్వాకర్షణకు లోబడి అనేక స్టెల్లార్ డిస్కులు దాని చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. కొన్ని లక్షల సంవత్సరాలకు ఈ స్టెల్లార్ డిస్క్‌లు చాలా కష్టంమీద సదరు నక్షత్ర గురుత్వాకర్షణ శక్తికి అందులో పడి పతనం కాకుండా పోరాడి బయటపడతాయని, అయితే నక్షత్ర ఆకర్షణ నుంచి పూర్తిగా బయటకుపోలేక ఒక నిర్ధిష్ఠ కక్ష్యలో పరిభ్రమిస్తూ క్రమంగా ప్రొటోప్లానెట్లుగా మారతాయని డిస్క్ ఇన్‌స్టెబిలిటీ సిద్ధాంతం చెబుతోంది. ఒక నక్షత్రం చుట్టూ తిరిగే దుమ్ము, ధూళి, వాయువులు (డస్ట్ అండ్ గ్యాస్ మాసెస్), అస్టరాయిడ్లవంటి అసంపూర్ణ ఆకారాలను స్టెల్లార్ డిస్క్లంటారు. తాజా చిత్రాలు ఇన్‌స్టెబిలిటీ సిద్ధాంతానికి బలం చేకూరుస్తున్నాయి. ఈ పరిశోధన వివరాలు జర్నల్ నేచుర్ ఆస్ట్రానమీలో ప్రచురించారు. తాజాగా కనుగొన్న ప్రొటోప్లానెట్ (ఆరిగే బీ– ఏబీ అని పేరుపెట్టారు) 20 లక్షల సంవత్సరాల వయసున్న కుర్ర నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోందని నాసా పేర్కొంది. మన సౌర వ్యవస్థ కూడా సూర్యుడికి దాదాపు ఇంతే వయసున్నప్పుడు ఏర్పడింది. ఒక గ్రహం ఏ పదార్ధంతో ఏర్పడబోతోందనే విషయం అది ఏర్పడే స్టెల్లార్ డిస్కును బట్టి ఉంటుందని సైంటిస్టులు వివరించారు. కొత్తగా కనుగొన్న ఏబీ గ్రహం మన గురు గ్రహం కన్నా 9 రెట్లు బరువుగా ఉందని, మాతృనక్షత్రానికి 860 కోట్ల కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తోందని పరిశోధన వెల్లడించింది. హబుల్ టెలిస్కోప్ 13 సంవత్సరాల పాటు పంపిన చిత్రాలను, జపాన్‌కు చెందిన సుబరు టెలిస్కోప్ పంపిన చిత్రాలను పరిశీలించి ఈ గ్రహ పుట్టుకను అధ్యయనం చేశారు. దీనివల్ల మన సౌర కుటుంబానికి సంబంధించిన మరిన్ని రహస్యాలు బయటపడతాయని ఆశిస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
నక్షత్రం పుట్టిందోచ్.. ఫోటోలు రిలీజ్ చేసిన నాసా
అద్భుతాల నిలయం ఖగోళం. అనాది కాలం నుంచి ఖగోళ విషయాలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నా ఇప్పటికీ మనకు తెలిసింది చాలా చాలా తక్కువ. అందుకే అంతుచిక్కని విషయాలను ఖగోళ రహస్యంగా పేర్కొంటారు. పాలపుంతలు, కృష్ణబిలాలు, నక్షత్రాలు , గ్రహాలు, ఉపగ్రహాలు, అస్టరాయిడ్స్ వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు అమెరిక స్పేస్ ఏజెన్సీ నాసా ఎప్పటి నుంచో ప్రయోగాలు, పరిశోధనలు చేస్తూనే ఉంది. ఇటీవల నవజాత నక్షత్రానికి సంబంధించి కొన్ని అద్భుతమైన దృశ్యాలను నాసా విడుదల చేసింది. హబుల్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో నాసా ఈ చిత్రాలను తీసింది. హెర్బిగ్ హెరో ఆబ్జెక్ట్ ఖగోళంలో కొత్తగా ఆవిష్కృతమైన నక్షత్రం నుంచి నిరంతరం వాయువులు నిరంతరం బయటకు ఎగజిమ్ముతుంటాయి. ఇవి వందల కిలోమీటర్ల దూరం వరకు ఖగోళంలో ప్రయాణిస్తాయి. ఆ సమయంలో అవి తమలోని ఎలక్ట్రాన్లను కోల్పోతుంటాయి. ఈ ప్రయాణ సమయంలో ఏదైనా గాలి మేఘాలు ఎదురైనప్పుడు వాటిని చీల్చుకుంటూ ముందుకు వెళ్తాయి. ఈ క్రమంలో ఖగోళంలో అద్భతమైన దృశ్యాలు వెలువడుతాయి. సింపుల్‌గా దీన్నే హెర్బిగ్ హెరో ఆబ్జెక్ట్ అంటారు. These stars may be young but they're mighty. 💪 This @NASAHubble image features a relatively rare celestial phenomenon, occuring when newly formed stars expel very narrow jets of rapidly moving ionized gas: https://t.co/eMNA1A5wHc pic.twitter.com/VL2Nky3A36 — NASA (@NASA) September 5, 2021 చదవండి : ఆకాశంలో ఒక్కసారిగా పేలిపోయిన రాకెట్....! -
భారీ ప్రయోగానికి సిద్ధమైన అమెరికా..ఏకంగా నక్షత్ర శక్తినే..!
కోతల్లేని, కాలుష్యం ఊసే లేని, కారుచౌక విద్యుత్ అందరికీ అందుబాటులోకి వస్తే...? ఈ ఊహే అద్భుతం. కానీ వీలవుతుందా? అన్న ప్రశ్న కూడా మనల్ని వెంటాడుతుంది. సూర్యుడిలో జరిగే ‘తంతు’ను భూమ్మీద కృత్రిమంగా సృష్టిస్తే చాలు... ఇది సాధ్యమే. ఈ దిశగా శాస్త్రవేత్తలు చేస్తున్నప్రయత్నాల్లో ఇటీవలే ఓ మేలి మలుపు చోటుచేసుకుంది. నక్షత్ర శక్తిని మనకు మరింత దగ్గర చేసింది! మనకు అణుశక్తి గురించి తెలుసు కదా.. అణువులను విచ్ఛిన్నం చేయడం ద్వారా పుట్టే శక్తిని విద్యుత్‌గా ఇందులో మార్చుకుంటాం. నక్షత్రాల్లోనూ ఇలాంటి ప్రక్రియే జరుగుతుంటుంది కానీ... పూర్తిగా వ్యతిరేకమైన పద్ధతిలో. అంటే ఇక్కడ అణువులు విడిపోవు. విపరీతమైన వేడి, ఒత్తిళ్ల కారణంగా ఒక దాంట్లో ఒకటి కలిసిపోతుంటాయి. దీన్నే కేంద్రక సంలీన ప్రక్రియ అని పిలుస్తుంటారు. ఈ ప్రక్రియను భూమ్మీద కృత్రిమంగా సృష్టించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ.. అమెరికాలోని లారెన్స్ లివర్మూర్ నేషనల్ లేబొరేటరీ (ఎల్ఎన్ఆర్ఎల్)లో గత నెల 8న ఈ ప్రయోగాల్లో తొలిసారి ఉపయోగించిన శక్తి కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలిగారు. 192 లేజర్ కిరణాలను ఉపయోగించి కొన్ని మిల్లీమీటర్ల సైజున్న ఇంధనాన్ని బాగా వేడెక్కించగా లేజర్ కిరణాల కోసం ఖర్చు పెట్టిన శక్తి కంటే 1.3 మెగాజౌళ్ల శక్తి అదనంగా పుట్టింది. కిలో ముడిచమురు ద్వారా పుట్టే శక్తిలో ఇది మూడు శాతం! రెండు పద్ధతులు.. కేంద్రక సంలీన ప్రక్రియను సాధించేందుకు ప్రస్తుతం రెండు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఎల్‌ఎన్‌ఆర్‌ఎల్‌లో అనుసరించిన ఇనర్షియల్ కన్ఫైన్మెంట్ కాగా.. అయస్కాంతాల సాయంతో ప్లాస్మాను నియంత్రించేది ఇంకోటి. ఇనర్షియల్ కన్ఫైన్మెంట్లో శక్తిమంతమైన లేజర్లను అతితక్కువ కాలం (సెకనులో వందకోట్ల వంతు) ప్రయోగిస్తారు. ఇది సంలీన ప్రక్రియను మొదలుపెడుతుంది. శక్తిమంతమైన లేజర్లు, ఇతర టెక్నాలజీలు అందుబాటులో లేని కారణంగా ఇప్పటివరకూ శాస్త్రవేత్తలు రెండో పద్ధతిపైనే ఎక్కువ ఆధారపడేవారు. ఎల్‌ఎన్‌ఆర్‌ఎల్‌లోని నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీలో 192 లేజర్ కిరణాలను గది మధ్యలో ఉంచిన మిలీమీటర్ల సైజున్న లోహంపై పడేలా చేసినప్పుడు ఎక్స్‌రే కిరణాలు వెలువడి లోహం వేడెక్కుతుంది. అదే సమయంలో ఇంధనాన్ని పీడనానికి గురిచేస్తుంది. ఈ క్రమంలో ఉపయోగించిన దానికంటే ఎక్కువ శక్తి పుట్టినప్పటికీ వాణిజ్యస్థాయిలో విద్యుదుత్పత్తికి ఇది సరిపోదు. ఉపయోగించిన ఇంధనం కంటే కనీసం వంద రెట్లు ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. నిధుల వరద... ఫ్యూజన్ ప్రయోగాల కోసం ఇటీవలి కాలంలో నిధుల వరద పారుతోంది. ఈ ప్రక్రియ ద్వారా ఇంకో 20 ఏళ్లలో వాణిజ్యస్థాయి విద్యుదుత్పత్తి సాధ్యమని నమ్ముతున్న కొందరు ఇప్పటివరకూ సుమారు 200 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టారు. ఇది ప్రభుత్వ రంగ సంస్థలు పెడుతున్న ఖర్చుకు ఎన్నో రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. సాంకేతిక పరిజ్ఞాన రంగంలో వేగంగా వస్తున్న మార్పుల కారణంగా ఫ్యూజన్ రియాక్టర్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని వీరు అంచనా వేస్తున్నారు. అయితే ప్రపంచం మొత్తం ఈ ఫ్యూజన్ రియాక్టర్లను ఏర్పాటు చేసేందుకు కొంత సమయం పట్టడం గ్యారంటీ. అన్నీ సవ్యంగా సాగితే 2060 నాటికి ప్రపంచ విద్యుత్ అవసరాల్లో ఒకశాతం ఫ్యూజన్ రియాక్టర్ల ద్వారా అందవచ్చునని ఒక అంచనా. సాధించాల్సింది ఇంకా ఉంది... లారెన్స్ లివర్మూర్ నేషనల్ లేబొరేటరీలో జరిగిన ప్రయోగంతో కేంద్రక సంలీన ప్రక్రియ మనకు అందినట్టేనా? ఊహూ. ఇంకా ప్రయాణించాల్సిన దూరం చాలానే ఉంది. కేంద్రక సంలీన ప్రక్రియల ద్వారా పుట్టే శక్తి అనంతమని... కాలుష్యం అస్సలు ఉండదని కూడా దశాబ్దాలుగా తెలుసు కానీ.. ఇప్పటివరకూ సాధించింది కొంతే. దీనికి కారణాలు లేకపోలేదు. అణువులను లయం చేయగల స్థాయిలో ఇంధనాన్ని వేడి చేయడం... సంలీనం ద్వారా పుట్టిన వేడిని నియంత్రించడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారాలు. 1997లో జాయింట్ యూరోపియన్ టోరస్లో అయస్కాంతాలను ఉపయోగించి 16 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసినా అందుకోసం 23 మెగావాట్ల విద్యుత్‌ను ఉపయోగించారు. 1960లలో సోవియట్ యూనియన్ అభివృద్ధి చేసిన ఫ్యూజన్ రియాక్టర్లతో పలు దేశాలు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాయి. ఫ్రాన్స్‌లో మన దేశంతోపాటు సుమారు 35 దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐటీఈఆర్ కూడా ఇలాంటిదే. ఇందులో విపరీతమైన వేడెక్కిన ఇంధనాన్ని (ప్లాస్మా రూపంలో ఉంటుంది)ని అయస్కాంతాల సాయంతో నియంత్రిస్తుంటారు. ఇందులో 50 మెగావాట్ల విద్యుత్‌తో 500 మెగావాట్లు ఉత్పత్తి చేసేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. 2025 చివరి నాటికి ఈ ఐటీఈఆర్లో ప్లాస్మా సిద్ధమవుతుందని, ఐదేళ్ల తరువాత అంటే 2030 నాటికి తొలి ప్రయోగం జరగవచ్చునని అంచనా. యూకే కూడా ఇటీవలే అయస్కాంత శక్తితో పనిచేసే ఓ ఫ్యూజన్ రియాక్టర్‌ను అభివృద్ధి చేసి 2040 నాటికల్లా అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించే లక్ష్యంతో పనిచేస్తోంది. మరోవైపు చైనా 2040 నాటికి, యూరప్ 2050 నాటికి మరిన్ని ఫ్యూజన్ రియాక్టర్లను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ -
ఫస్ట్‌డేట్ రోజే విషాదం: టిక్‌టాక్ స్టార్ కాల్చివేత
కాలిఫోర్నియా: అమెరికాలోని కరోనా థియేటర్లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన టిక్‌టాక్ స్టార్ ఆంథోనీ బరాజాస్ (19) తుది శ్వాస విడిచాడు. గతం వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆంథోనీ మెదడులోని తీవ్ర గాయాల కారణంగా చనిపోయినట్టు కాలిఫోర్నియా పోలీసులు ప్రకటించారు. గత నెల 26 న దక్షిణ కాలిఫోర్నియాలోని కరోనా థియేటర్లో హారర్ మూవీ "ది ఫరెవర్ పర్జ్" ప్రదర్శిస్తున్న సమయంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సినిమా ముగిసిన తర్వాత, ఆడిటోరియం శుభ్రం చేస్తున్నథియేటర్ ఉద్యోగులు రక్తపు మడుగులో పడిఉన్న ఇద్దరు బాధితులను గుర్తించారని రివర్సైడ్ కౌంటీ ప్రాసిక్యూటర్ మైక్ హెస్ట్రిన్ ఒక ప్రకటనలో తెలిపారు. చాలా సమీపంనుంచి ఇద్దర్నీ తలపై గురిపెట్టి మరీ కాల్చిన ఈ ఘటనలో ఆంథోనీ ఫ్రెండ్ రైలీ గుడ్రిచ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రంగా గాయపడిన ఆంథోనీని ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. కానీ ఫలితం లేకపోవడంతో వైద్యులు లైఫ్ సపోర్టు తొలగించారు. దీంతో అతను సోమవారం తుదిశ్వాస విడిచినట్టు కాలిఫోర్నియా అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా అతని కుటుంబానికి, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇది అనాలోచిత చర్యగా ప్రకటించారు. ఈ ఘటనలో నిందితుడు జోసెఫ్ జిమెనెజ్ (20)ను అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. రైలీ గుడ్రిచ్ (ఫైల్ ఫోటో) చెరగని చిరునవ్వు, దయగల హృదయం ఆంథోనీ సొంతం.తన గురించి తెలిసిన వారందరికీ అతడొక గిప్ట్..ఆయనలేని లోటు తీరనిది అంటూ ఆంథోనీ కుటుంబం నివాళులర్పించింది. అటు ఆంథోనీ అకాల మరణంపై స్నేహితులు తీవ్ర విచారం చేశారు. ఫస్ట్ డేట్లోనే ప్రాణాలు కోల్పోయిన ఆంథోనీ, రైలీని తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు ఆంథోనీ బరాజాస్ అవయవాలను దానం చేయన్నారని అతని స్నేహితుడు మాలిక్ ఎర్నెస్ట్ ట్విట్ర్లో తెలిపారు. కాగా ఆంథోనికి టిక్‌టాక్‌లో దాదాపు 10 లక్షల మంది, ఇన్‌స్టాలో 50 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. హైస్కూల్ స్థాయిలో అద్భుతమైన సాకర్ ప్లేయర్‌గా పాపులర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆంథోని లైఫ్ సపోర్ట్‌లో ఉన్నప్పుడు వైద్య ఖర్చుల నిమిత్తం ‘గోఫండ్‌మీ’ ద్వారా 80వేల డాలర్లకు పైగా విరాళాలు రావడం గమనార్హం. నిందితుడు నజోసెఫ్ జిమెనెజ్(ఫైల్ ఫోటో) -
టిక్‌టాక్ స్టార్ దుర్మరణం, షాక్‌లో ఫ్యాన్స్: వైరల్ వీడియో
బీజింగ్: లైవ్ స్ట్రీమ్ వీడియో షూట్ చేస్తూ చైనీస్ టిక్‌టాక్ స్టార్ జియావో క్యుమీ (23) దుర్మరణం పాలైన ఘటన షాక్‌కు గురిచేసింది. టిక్‌టాక్ వీడియో రికార్డ్ చేస్తూ 160 అడుగుల నుంచి కింద పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రొఫెషనల్ క్రేన్ ఆపరేటర్‌గా పనిచేసే జియావో ఆ క్రేన్ నుండే పలు వీడియోలు తీస్తూ ఉండేది. ఇలా అనేక వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ స్టార్‌గా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే సహోద్యోగులంతా ఇంటికి వెళ్లి పోయిన తరువాత క్రేన్ క్యాబిన్లో కూర్చుని వీడియో తీసుకోవడానికి ప్రయత్నించింది జియావో. కానీ ఇంతలోనే అదుపు తప్పి కింద పడిపోయింది. ఫోన్ చేతిలో పట్టుకుని కింద పడిపోతున్న దృశ్యాలు వీడియోలో అస్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. టిక్‌టాక్ చైనీస్ వెర్షన్ డౌయిన్ ప్లాట్‌ఫాంలో లక్షమంది మందికి పైగా ఫాలోవర్లో జియావో క్యుమీ చైనాలో అత్యంత ప్రజాదరణ పొందారు. ఇద్దరు బిడ్డల తల్లి అయిన ఈమె డ్యాన్స్ వీడియోలు కూడా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాయి. దీంతో జియావో ఆకస్మిక మరణం అభిమానులను తీవ్ర విషాదంలోకి ముంచింది. కాగా ఇటీవల హాంగ్‌కాంగ్‌కు చెందిన డేర్‌డెవిల్ ఇన్ఫ్లూయెన్సర్ సోఫియా చుంగ్ జలపాతం సమీపంలో ఇన్స్టాగ్రామ్ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే. -
Manjarabad Fort: మంజారాబాద్.. స్టార్ఫోర్ట్
ఆకాశంలో మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాన్ని చూడాలంటే తలెత్తి చూస్తే చాలు. నేల మీద ఉన్న ఈ నక్షత్రాన్ని చూడాలంటే మాత్రం ఆకాశంలో విహరించాల్సిందే. ఈ టూర్లో ఈ నక్షత్రకోటతోపాటు పశ్చిమ కనుమల ప్రకృతి విన్యాసాలన్నీ ఆస్వాదించవచ్చు. కర్ణాటక ఊటీ... నక్షత్రం ఆకారంలో ఉన్న ఈ కోట కర్ణాటక, హసన్ జిల్లాలో ఉంది. ఈ కోట సందర్శన పెద్ద సాహసం అనే చెప్పాలి. నాచు మధ్య జాగ్రత్తగా అడుగులు వేస్తూ దిగుడుబావి ఒడ్డుకు చేరడం యువతకే సాధ్యం. ఏడాది మొత్తం ఇక్కడ చల్లగానే ఉంటుంది. ఈ చల్లదనానికి పశ్చిమ కనుమల పచ్చదనం కూడా కారణమే. సక్లేశ్‌పురా నుంచి ఈ కోటకు ప్రయాణం మొదలైనప్పటి నుంచి కాఫీ గింజల పరిమళం ఉత్సాహాన్నిస్తుంది. ఆకాశాన్నంటుతున్న పోక చెట్లు మీ ప్రయాణం కూడా ఆకాశం వైపేనని గుర్తు చేస్తాయి. యాలకుల చెట్లు వాతావరణాన్ని సుగంధభరితం చేస్తుంటే మిరియాల గుత్తులు ఒకింత ఘాటు వాసనతో ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్నిస్తుంటాయి. చల్లటి వాతావరణంలో గొంతు గరగర అనిపిస్తే రెండు మిరియాలను నమిలితే పర్యటన ఆరోగ్యంగా ముందుకు సాగుతుంది. మధ్యలో చిన్న చిన్న నీటి కాలువలు పాదాలను కడుగుతుంటాయి. కొండల్లో ప్రవహించే స్వచ్ఛమైన నీరు చల్లగా పాదాలను స్పృశిస్తుంటే చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఈ హిల్స్టేషన్ను ఊటీతో పోలుస్తారు. ఊటీ సంపన్నుల పర్యాటక క్షేత్రం అయితే ఇది పేదవారి పర్యాటక ప్రదేశమని చెబుతారు. మంచులో మెరిసిన నక్షత్రం... హసన్ జిల్లా కేంద్రానికి 45 కి.మీల దూరంలో మల్నాడు రీజియన్, సక్లేశ్‌పురా పట్టణానికి దగ్గరలో ఉన్న స్టార్ఫోర్ట్ అసలు పేరు మంజారాబాద్ కోట. మంజు అంటే కన్నడలో మంచు అని అర్థం. ఎప్పుడూ మంచు తెర కమ్మినట్లే ఉంటుంది ఇక్కడి వాతావరణం. ఇది మైసూరు పాలకుల వేసవి విడిదిగా ఉండేది. ఈ కోటలో పెద్ద ఆయుధాగారం ఉండేదని ఇప్పుడున్న ఆనవాళ్లు చెబుతుంటాయి. మైసూర్ కోట నుంచి ఈ కోటకు రహస్య మార్గం ఉండేదని స్థానిక కథనం. ఎనిమిది కోణాల నిర్మాణం ఇది. నిజానికి దీనిని ఎనిమిది రెక్కల పద్మం ఆకారం అనే చెప్పాలి. అయితే మూలలు కోసుగా కోణాకారంలో ఉండడంతో నక్షత్రకోటగా వాడుకలోకి వచ్చింది. -
ప్లీజ్.. గర్భవతిని! నా పోర్న్ వీడియోల్ని తీసేయండి
కెరీర్లో ఉన్నంత కాలం అవకాశాల కోసం ప్రయత్నిస్తూ.. రాణిస్తూ, ఆపై ఫేమ్ తెచ్చిన ఇండస్ట్రీపై విమర్శలు చేయడం అడల్ట్ స్టార్లకు అలవాటైన పనే. మియా ఖలీఫా, సన్నీ లియోన్ లాంటి మాజీ పోర్న్ స్టార్స్ వ్యతిరేక కామెంట్లు చేసిన వాళ్లే. ఇక ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి చేరింది లానా రోడ్స్. చికాగో ఇల్లినాయిస్లో పుట్టిన పెరిగిన ఈ 25 ఏళ్ల మాజీ అడల్ట్ స్టార్ అసలు పేరు అమరా మాపుల్. టీనేజీలోనే పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి లానా రోడ్స్‌గా ఫేమ్ సంపాదించుకుంది. మొదట మోడలింగ్, యూట్యూబ్, ఇన్ఫ్లుయెన్సర్గా పేరు సంపాదించుకుంది. 2016 అడల్ట్ సినిమాల్లోకి అడుగుపెట్టి.. రెండేళ్లపాటు స్టార్‌డమ్‌ను కొనసాగించింది. కొంతకాలం క్రితం కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె.. ప్రస్తుతం హ్యారీ జోసే పాడ్‌కాస్ట్ ‘టాప్ ఇన్’లో పని చేస్తోంది. ఇక అప్పటి నుంచి ఇండస్ట్రీపై తరచూ విమర్శలు చేస్తోంది. తాజాగా తాను గర్భవతిని అనే బాంబ్ పేల్చిన లానా.. తన గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి వీడియోల్ని తొలగించాలని విజ్ఞప్తి చేస్తోంది. ‘‘ప్రస్తుతం నేను గర్భంతో ఉన్నా. నాకు పుట్టే బిడ్డకు నా గతం గురించి తెలిసినా.. ఆ జ్ఞాపకాలు అందకూడదనే అనుకుంటున్నా. అందుకే నిజాయితీగా కోరుతున్నా. దయచేసి అడల్ట్ వెబ్సైట్లు ఆవీడియోలను తొలగించండి. అవకాశం దొరికితే నేనే కాలంలో వెనక్కి వెళ్తా. అలాంటి పనులకు దూరంగా ఉంటా. నా గౌరవాన్ని నేను కాపాడుకుంటా’’ అని పశ్చాత్తాప పడింది లానా. ఇక అంతేకాదు సెక్స్ వర్కర్స్‌తో ఇంటెరాక్షన్ ద్వారా.. వాళ్ల మానసిక సంఘర్షణను అందరికీ తెలియజేసేలా ప్రోగ్రామ్‌లు చేస్తోందామె. వాళ్లకు(అడల్ట్ వెబ్సైట్లకు) కొంత కాలం అవకాశం ఇవ్వాలనుకంటున్నా.. అవసరమైతే న్యాయపరమైన చర్యల దిశగా ఆలోచిస్తా అని చెప్తోంది లానా. చదవండి: అడల్ట్ సినిమాలతో మియా ఖలీఫా సంపాదనెంతో తెలుసా? ఇంతకీ తండ్రెవరు? మైక్ మజ్లక్ అమెరికన్ నటుడు, పాపులర్ వ్లోగర్. లానా రోడ్స్‌తో చాలాకాలంగా రిలేషన్షిప్ కొనసాగించాడు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. కొన్ని నెలల క్రితం వీళ్లిద్దరూ విడిపోయారు. దీంతో లానా కడుపులో బిడ్డకు తండ్రి అతనేనా? అనే అనుమానం ఆమె అభిమానులకు వ్యక్తం అవుతోంది. అయితే ఈ ప్రశ్నకు ఆమె ‘బిడ్డ పుట్టాక డీఎన్ఏ టెస్ట్ చేస్తే తెలుస్తుంద’ని సరదా సమాధానం ఇచ్చింది. చదవండి: పాక్ చేష్టలపై మియా ఖలీఫా ఫైర్ -
ఖగోళంలో భారీ విస్పోటనం.. పలు పరిశోధనలకు ఆటంకం!
విశ్వంలో అంతుచిక్కని దృగ్విషయాలు ఎన్నో జరుగుతుంటాయి. వాటిని ఛేదించడం కోసం మానవుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్ని దృగ్విషయాల చిక్కుముడి విప్పి ఇప్పటికే కొంతమేరకు విజయాన్ని సాధించాడు. అందులో చెప్పుకోదగినదే.. ఈవెంట్ హారిజోన్.. ఈ ఈవెంట్ మొట్టమొదటి సారిగా కృష్ణ బిలాల( బ్లాక్‌హోల్) ఫోటోను తీయడానికి ఉపయోగపడింది. కాగా ప్రస్తుతం నైరుతి ఆఫ్రికాలోని నమీబియా శాస్త్రవేత్తల బృందం సుదూరాన ఉన్న గెలాక్సీలో జరిగిన నక్షత్ర భారీ విస్పోటనాన్ని గుర్తించారు. సుమారు ఈ నక్షత్ర ద్రవ్యరాశి సూర్యుడి ద్రవ్యరాశి కంటే 10 రెట్లు ఎక్కువ. ఈ విస్పోటనం ద్వారా అత్యంత ప్రకాశవంతమైన, శక్తివంతమైన గామా-రే పేలుళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. గామా రే పేలుళ్ల నుంచి అత్యంత శక్తివంతమైన రేడియేషన్ వెలువడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రేడియేషన్ విశ్వంతరాలపై జరుగుతున్న పరిశోధనలపై ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గామా రే పేలుడు భూమి నుంచి సుమారు ఒక బిలియన్ కాంతి సంవత్పరాల దూరంలో జరిగింది. కాగా ఈ విస్పోటనం భూ గ్రహానికి అత్యంత సమీపంలో జరిగింది. సాధారణంగా గామా రే పేలుళ్లు భూమి నుంచి 20 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో జరుగుతుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పేలుడు ప్రస్తుతం ఉన్నగామా రే పేలుళ్ల సిద్ధాంతాన్ని సవాలు చేస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీటిపై శాస్త్రవేత్తలు జరిపిన పరిశీలనలో ఎక్స్ రే, గామా పేలుళ్లలో భారీగా సారుప్యతలు ఉన్నాయని వెల్లడించారు. ఈ పరిశీలనకు సంబంధించిన విషయాలను డ్యూయిష్ ఎలెక్ట్రోనెన్-సింక్రోట్రోన్ (DESY) లో ప్రచురించారు. ఇది జర్మనీకి చెందిన అతిపెద్ద శాస్త్రీయ సంస్థ అంతేకాకుండా హెల్మ్హోల్ట్జ్ అసోసియేషన్‌లో భాగం.ఈ పేలుళ్లలకు సంబంధించిన సిములేషన్ వీడియోను ఈ సంస్థ పోస్ట్ చేసింది. కాగా ఈ పేలుడు నుంచి వెలువడే అత్యంత ప్రకాశంతమైన నీలి రంగు కాంతిని కొన్ని సంవత్సరాల తరువాత భూమిపై చూడవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. అసలు ఏంటి ఈ గామా రే పేలుళ్లు... సాధారణంగా నక్షత్రాలు తమ జీవితకాలన్ని ముగిసిపోయి, సూపర్నోవాగా రూపాంతరం చెంది అప్రకాశవంతమైన వస్తువులుగా మారి క్రమేపి కృష్ణబిలాలుగా మారుతుంటాయి. నక్షత్రాల్లో పేలుళ్లు సంభవించినప్పుడు అత్యంత శక్తివంతమైన ఎక్స్ రే, గామా దృగ్విషయాలు వెలువడుతుంటాయి. గామా-రే పేలుళ్లు సుదూరంగా ఉన్న గెలాక్సీలలో జరిగే అపారమైన శక్తివంతమైన పేలుళ్లు. ఈ పేలుళ్లు విశ్వంలో సంభవించే అత్యంత ప్రకాశవంతమైన, శక్తివంతమైన విద్యుదయస్కాంత సంఘటనలు. గామా రే పేలుళ్లు కొన్ని సార్లు పది మిల్లీసెకన్ల నుంచి కొన్ని గంటల వరకు జరుగుతుంటాయి. -
నేడు ఆకాశంలో క్రిస్మస్ స్టార్
వాషింగ్టన్: నేటి రాత్రి ఆకాశంలో గొప్ప ఘటన సంభవించబోతోంది. దాదాపు 800 సంవత్సరాల తర్వాత మన సౌరకుటుంబంలోని శని, బృహస్పతి గ్రహాలు పక్కపక్కనే కనిపించబోతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో నైరుతి వైపు ఈ గ్రహాలు కనిపిస్తాయి. ఇలా రెండు గ్రహాలు చలికాలంలో ఓ చోట చేరితే దాన్ని ‘క్రిస్మస్ స్టార్’ అని పిలుస్తారు. ప్రస్తుతం దీనికి నాసా శాస్త్రవేత్తలు ‘క్రిస్మస్ స్టార్ ఆఫ్ 2020’ అని పేరు పెట్టారు. ఇలాంటి ఘటనను మళ్లీ చూడాలంటే మరో 60 సంవత్సరాలు ఆగాలని, 2080లో మళ్లీ కనిపిస్తుందని అంతరిక్ష శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గెలీలియో టెలిస్కోప్ కనుగొన్న 13 సంవత్సరాల తర్వాత, 1623లో జూపిటర్ చుట్టూ నాలుగు నక్షత్రాలను గుర్తించారు. వాటిని అప్పట్లో జూపిటర్ చందమామలుగానూ, శాటర్న్ వృత్తంగానూ గుర్తించారు. నాసా పేర్కొంది. ఇలాంటి ఓ ఘటన జరగడం గత 400 ఏళ్లలో ఇదే మొదటి సారి అని తెలిపారు. డిసెంబర్ 21కి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజున ఉత్తరార్థగోళంలో పగలు అత్యంత తక్కువగానూ, దక్షిణార్థగోళంలో పగలు అత్యంత ఎక్కువ సమయం పాటు ఉండనుంది. -
400 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ అద్భుతం..
న్యూయార్క్ : సోమవారం(రేపు) ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రెండు పెద్ద గ్రహాలైన శని, బృహస్పతిలు చాలా దగ్గరగా, ఒకే వరుసలోనికి రానున్నాయి. దీన్నే ‘క్రిస్మస్ స్టార్’ అని పిలుస్తారు. ఇది అత్యంత అరుదుగా జరిగే సంఘటన. ఇక మళ్లీ 60 ఏళ్ల తర్వాతే ఇది జరుగుంది. అంటే 2080లో శని, బృహస్పతిలు చాలా దగ్గరగా, ఒకే వరుసలోకి వస్తారన్న మాట. ఇలాంటి ఘట్టం దాదాపు 400 ఏళ్ల తర్వాత చోటుచేసుకోబోతోందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శని, బృహస్పతి దగ్గరగా, ఒకే వరుసలోకి వచ్చే సంఘటన రాత్రి పూట జరిగి దాదాపు 800 ఏళ్లు అయిందని పేర్కొన్నారు. గెలీలియో టెలీస్కోప్ను కనిపెట్టిన 13 ఏళ్ల తర్వాత 1623లో ‘క్రిస్మస్ స్టార్’ ఆవిష్కృతం అయిందని అంటున్నారు. -
నక్షత్రానికి సుశాంత్ పేరు నిజం కాదు
బాలీవుడ్లో అర్ధాంతరంగా నేల రాలిన తార సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. అతని చావుతో యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో బిహార్‌లోని పర్నియాలో ఓ రహదారికి సుశాంత్ పేరును పెట్టి అభిమానం చాటుకున్నారు. అమెరికాలోని రక్ష అనే ఓ అభిమానైతే ఏకంగా ఆకాశంలోని నక్షత్రాన్ని కొనుగోలు చేసి దానికి సుశాంత్ పేరును నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ ఫొటో కూడా జత చేశారు. ప్రతి ఒక్కరూ దీన్ని నిజమనే నమ్మి ఆమె అభిమానం చాటుకున్న తీరుకు అబ్బురపడ్డారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవమని అధికారులు స్పష్టం చేశారు. (సుశాంత్ కుక్క మరణం: నిజమేనా?) అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య(ఐఏయూ) శాస్త్రవేత్త ఒకరు మాట్లాడుతూ.. రాజ్‌పుత్ పేరు మీద ఎలాంటి నక్షత్రం లేదని వివరణ ఇచ్చారు. ఐఏయూ ఓటింగ్ సభ్యుడు డా. అశ్విన్ శేఖర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ సెలబ్రిటీ కానీ, ఎవరి పేరైనా సరే నక్షత్రానికి పెట్టే హక్కు అంతర్జాతీయ ఖగోళ సమాఖ్యకు మాత్రమే ఉంది అని తెలిపారు. అయితే చాలామంది తమకు నచ్చిన పేర్లను తారలకు పెట్టినట్లు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. దీంతో అసలు సుశాంత్ పేరున నక్షత్రం అనే వార్త తప్పని రుజువైంది. కాగా జూన్ 14న ముంబైలోని తన స్వగృహంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే (నక్షత్రానికి సుశాంత్ పేరు) -
నక్షత్రానికి సుశాంత్ పేరు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఖగోళం అంటే ఎంత ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆవిషయం తన అభిమానులందరికి కూడా తెలుసు. నటుడిగా మారిన తర్వాత కూడా ఆస్ట్రో ఫిజిక్స్‌పై సుశాంత్ అనేక అధ్యయనాలు చేశారు. విశ్వంలో ఉండే తారా మండలాన్ని చూడటానికి ఖరీదైన ఓ టెలిస్కోప్‌ను కొనుగోలు చేశారు. తనకు వీలు దొరికినప్పుడల్లా ఆ టెలిస్కోప్ నుంచి విశ్వంలోకి చూస్తూ ఉండే వారని ఆయనకు సన్నిహితంగా ఉండే వారు తెలిపారు. సుశాంత్ ఇష్టాలు తెలిసిన ఒక అభిమాని ఆయనకు గొప్పగా నివాళి ప్రకటించారు.అమెరికాలో ఉంటున్న రక్ష అనే అభిమాని ఒక నక్షత్రాన్ని కొనుగోలు చేసి దానికి సుశాంత్ పేరు పెట్టారు. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. (నేనూ కూడా నెపోటిజం బాధితురాలినే! ) ‘సుశాంత్ అద్భుతమైన వ్యక్తి. అతనికి నివాళులు అర్పించడంలో కొంత ఆలస్యం చేశాను. ఈ చీకటి ప్రపంచంలో ఆయన ఒక స్వచ్ఛమైన రత్నం లాంటివాడు. ఆయన మరింతగా మెరవాలి. ఆయన పేరు మీద ఉన్న నక్షత్రాన్ని ఆయన టెలిస్కోప్‌తో కొనడం చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి ఆ తార మరింత ప్రకాశవంతంగా మెరువాలి. అని రక్ష అనే అభిమాని ట్వీట్ చేశారు. విశ్వంలో ఉంటే తారల్లో ఒకటైన RA 22.121 కు జూన్ 25,2020 నుంచి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌గా నామకరణం చేశారు. ఆ మేరకు ఖగోళ శాస్త్ర సంస్థ మాకు హక్కులు కల్పించింది. ఆ తారకు సంబంధించిన హక్కులు, కాపీరైట్స్ మాకు లభించాయి అని కూడా రక్ష పేర్కొన్నారు. చంద్రమండలంపై కూడా సుశాంత్ భూమిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. (‘సుశాంత్‌తో నేను మాట్లాడితే అలా జరిగేది కాదేమో’) -
కరోనా : ఎగతాళి చేసిన టిక్‌టాక్ స్టార్ కు పాజిటివ్
భోపాల్ : కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశ ప్రజలంతా లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తోంటే..మధ్యప్రదేశ్‌కు చెందిన టిక్‌టాక్ స్టార్ ఒకరు నిర్లక్ష్యంగా ప్రవర్తించి, చివరకు మహమ్మారి కోరలకు చిక్కాడు. మాస్క్ లను ధరించడాన్ని ఎగతాళి చేశాడు. మాస్క్ లను కాదు దేవుడ్నినమ్ముకోండి అంటూ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో ప్రగల్భాలు పలికాడు. ప్రస్తుతం అతగాడు ఇపుడిక దేవుడే దిక్కు అంటూ ఆసుపత్రి బెడ్ మీదకు చేరాడు. తన చుట్టుపక్కల వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేశాడు. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా నాకోసం ప్రార్థించండి అంటూ మరో రెండు వీడియోలను అప్లోడ్ చేశాడు. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) కోవిడ్-19 నుండి రక్షణ కోసం ముసుగులు ఉపయోగించడాన్ని ఎగతాళి చేసిన 25 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్ సోకింది. జబల్పూర్ లోని తన సోదరి ఇంటికి వెళ్లిన తరువాత ఈ యువకుడికి కరోనా లక్షణాలు కల్పించడంతో పరీక్షలు నిర్వహించారు. చివరికి పాజిటివ్ అని తేలడంతో బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి పాలైన తరువాత కూడా వార్డు నుండే వీడియోలను అప్లోడ్ చేశాడు. త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలంటూ తన అనుచరులను కోరాడు. కరోనా వైరస్ కారణంగా టిక్‌టాక్ వీడియోలను అప్లోడ్ చేయలేను. దయచేసి మద్దతుగా నిలవండి..నా కోసం ప్రార్థించండి అంటూ వీడియోల్లో వేడుకున్నాడు. దీన్ని గమనించిన పోలీసు అధికారులు ఎట్టకేలకు శుక్రవారం అతని ఫోన్‌ను లాక్కున్నారు. అంతేకాదు అతని బాధ్యతా రాహిత్యానికిగాను వైద్య సిబ్బంది, కుటుంబం, పొరుగువారితో సహా 50 మంది నిర్బంధంలోకి వెళ్లాల్సి వచ్చింది. కాగా సాగర్ జిల్లాలో ప్రాణాంతక వైరస్ వచ్చిన మొదటి కేసు ఇదే కావడంతో కలెక్టర్ ప్రీతి మైథిల్ ప్రజలను భయపడవద్దని కోరుతూ ఒక సందేశాన్ని విడుదల చేశారు. ఆందోళన అవసరం లేదని రోగి ఆరోగ్యపరిస్థితి స్థిరంగా ఉందని ప్రకటించారు. చదవండి : రఘురామ్ రాజన్‌కు అరుదైన గౌరవం -
క్రిస్మస్: దారి చూపిన స్టార్
సాక్షి, నాగార్జునసాగర్(నల్గొండ) : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రైస్తవులు ఇంటింటికీ పైభాగాన క్రిస్మస్ స్టార్‌ను అమర్చుతారు. సెమి క్రిస్మస్ నుంచి ఈ స్టార్స్‌ను ఏర్పాటు చేస్తారు. బుధవారం క్రిస్మస్ పండుగ ఉండటంతో నందికొండ మున్సిపాలిటీ కాలనీల్లో ఉన్న అన్ని ప్రముఖ ఫ్యాన్సీ షాపుల్లో క్రిస్మస్ స్టార్స్ విక్రయించేందుకు సిద్ధంగా ఉంచారు. క్రీస్తు జన్మించిన స్థలానికి మార్గం చూపిన తారగా దీనిని భావిస్తారు. క్రిస్మస్ సార్స్ ప్రాధాన్యత... క్రిస్మస్ స్టార్స్ గురించి పూర్వీకులు ఈ విధంగా చెప్పారు. ఏసుక్రీస్తు జన్మించిన వెంటనే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుట్టింది. మిగతా నక్షత్రాలకంటే అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతున్న ఆ నక్షత్రం వైపే అందరి దృష్టిపడింది. ఆకాశంలో ఏదైన కొత్తగా ప్రకాశవంతంగా పుట్టిందని జగతిని కాపాడేందుకు గొప్పవారు జన్మించినట్టే అనే నమ్మకంతో ఆ తార వైపు పయనించసాగారు. తూర్పుదేశ జ్ఞానులు ఆకాశంలో ప్రకాశిస్తున్న తార ఎటు కదిలితే అటు పయనించారు. ఈ నక్షత్రం జెరుసలెంలోని బెత్లహంలో పశువులకొట్టం వద్ద తనప్రయాణాన్ని ఆపింది. పశువుల కొట్టం వద్ద తూర్పుదేశ జ్ఞానులు అప్పుడే జన్మించిన ఏసును కనుగొన్నారు. ఈ విధంగా పలుప్రాంతాలకు చెందిన వారు జగతి మేలుకోసం జన్మించిన ఏసుకు కానుకలుగా బంగారం, సాంబ్రాణి, సుగంధ పరిమళాలతో కూడిన బోళమును సమర్పించారు. అప్పటినుంచి క్రైస్తవుల్లో నక్షత్రానికి ప్రాధాన్యత ఏర్పడింది. క్రీస్తు జన్మించిన ప్రదేశానికి దారి చూపిన నక్షత్రానికి గుర్తుగా అందరూ తమ ఇళ్లల్లో క్రిస్మస్ స్టార్స్ ఏర్పాటు చేస్తారు. క్రిస్మస్కు నెలరోజుల ముందుగానే ఈ స్టార్‌ను ఉంచుతారు. క్రిస్మస్ను తెలియజేస్తుంది క్రిస్మస్ పండుగకు ముందు క్రైస్తవులందరూ తమ ఇళ్లల్లో స్టార్స్‌ను ఉంచుతారు. అర్థమవుతుంది. చాలా సంతోషంగా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటాం. – డి.కోటేశ్వర్రావు, సాగర్ అధిక సంఖ్యలో ఆరాధించే దేవుడు క్రీస్తు అధికసంఖ్యలో ఆరాధించే దైవం ఏసు క్రీస్తు. ప్రతి క్రైస్తవుడు ఘనంగా జరుపుకునే ఈ పండుగలో క్రిస్మస్ స్టార్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తాం. ఇంటి ఎదుట క్రిస్మస్స్టార్ను అలంకరించగానే ఇంట్లో పండుగ వాతావరణం వచ్చేస్తుంది. – విజయప్రభావతి, హిల్‌కాలనీ -
నన్ను స్టార్ అనొద్దు!
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలక్షణమైన పాత్రలు చేస్తూ మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. అయితే తనను ‘స్టార్’ అని మాత్రం పిలవొద్దంటున్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ– ‘‘నన్ను స్టార్ యాక్టర్ అని పిలవడం ఇష్టం లేదు. నా దృష్టిలో ‘స్టార్, సూపర్‌స్టార్, మెగాస్టార్’ అనే ట్యాగ్స్ మార్కెటింగ్ స్ట్రాటజీకి సంబంధించినవి. ఒక వేళ నన్ను నేను ఒక స్టార్‌గా భావించి గర్వపడితే నాకు తెలియకుండానే నాలోని నటుడి ఎదుగుదలకు నేను అడ్డుకట్ట వేసినవాణ్ణి అవుతాను. నా నటనా నైపుణ్యం కూడా మెల్లిగా తగ్గిపోతుంది. మూసధోరణి పాత్రలకు అలవాటు పడిపోతాను. ఒక్కసారి స్టార్ అనే ఛట్రంలో ఇరుక్కుపోతే విభిన్నమైన పాత్రలు చేయలేం. నటులు అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటారు. అందుకే నన్ను స్టార్ అని పిలవొద్దు’’ అని పేర్కొన్నారు. -
స్ట్రీట్ ఫైటర్
‘శరణం గచ్ఛామి’ ఫేమ్ నవీన్ సంజయ్, హీన అచ్చర జంటగా ఓ సినిమా రూపొందుతోంది. మాల్యాద్రి మామిడి (ప్రదీప్) దర్శకత్వం వహిస్తున్నారు. సహస్ర మూవీ మేకర్స్ పతాకంపై శ్రీహరి పల్లపు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘స్టార్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. నవీన్ సంజయ్ మాట్లాడుతూ–‘ఇందులో నేనొక స్ట్రీట్ ఫైటర్‌గా చేస్తున్నాను. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన శ్రీహరి, మాల్యాద్రిగార్లకు థ్యాంక్స్’’ అన్నారు. మాల్యాద్రి మామిడి మాట్లాడుతూ– ‘‘పక్కా కమర్షియల్ ఎంటరై్టనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. హీరో హీరోయిన్లపై కొన్ని మెయిన్ టాకీ పార్ట్ హైదరాబాద్‌లో చిత్రీకరించాం. దీంతో షూటింగ్ 30శాతం పూర్తి అయింది. ఈ నెలాఖరులో ప్రారంభించే సెకండ్ షెడ్యూల్‌తో 70శాతం చిత్రీకరణ పూర్తి అవుతుంది’’ అన్నారు. ‘‘మాల్యాద్రి చెప్పిన కథ నచ్చిన వెంటనే సినిమాని సెట్స్ పైకి తీసువెళ్లి, మొదటి షెడ్యూల్ పూర్తి చేశాం. మేం అనుకున్న దానికంటే సినిమా చాలా బాగా వస్తోంది’’ అన్నారు శ్రీహరి పల్లపు. హీన అచ్చర, నటి అపూర్వ శర్మ మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.యమ్. స్వామి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి కుమార్. -
నిజామాబాద్‌లో స్టార్ వార్..
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి ముఖ్యనేతలు ఉమ్మడి జిల్లా బాట పట్టారు. ఇప్పటికే మూడు చోట్ల పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలను నిర్వహించిన టీఆర్ఎస్ మరో నాలుగు చోట్ల బహిరంగసభలకు ఏర్పాట్లు చేసింది. సోమవారం కేసీఆర్, మంగళవారం ప్రధాన మంత్రి మోదీ ప్రచార సభలకు రానున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ సభను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. సాక్షి, నిజామాబాద్: జిల్లాకు అగ్రనేతలొస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ పార్టీల ముఖ్యనేతలు జిల్లా బాట పట్టారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచార సభలను నిర్వహించాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నిర్ణయించాయి. ఇప్పటికే మూడు చోట్ల ఎన్నికల ప్రచార సభలను నిర్వహించిన టీఆర్ఎస్ మరో నాలుగు చోట్ల జరగనున్న బహిరంగసభలకు ఏర్పాట్లు చేసింది. ఈనెల 27న నిజామాబాద్ నగరంలో జరగనున్న భారీ బహిరంగసభకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. స్థానిక గిరిరాజ్ కళాశాల మైదానంలో బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభలు సోమవారం జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో కామారెడ్డి, డిచ్పల్లి (నిజామాబాద్ రూరల్), బోధన్, బాల్కొండల్లో ఈ సభలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్ కూడా మరోమారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ బహిరంగ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కామారెడ్డిలో రాహల్‌గాంధీ సభ జరిగింది. అగ్రనేతల రాకతో జిల్లాలో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాని హోదాలో తొలిసారి .. నరేంద్రమోదీ ప్రధాన మంత్రి హోదాలో జిల్లాకు తొలిసారిగా రానున్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో పర్యటించిన ఆయన ఈసారీ ఎన్నికల ప్రచారం కోసం జిల్లాకు వస్తున్నారు. సభను నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించాలని నిర్ణయించిన ఆ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ మైదానాన్ని పోలీసు బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. మోదీ బహిరంగసభ ఏర్పాట్లను ఆ పార్టీ కేంద్ర మంత్రి జేపీనడ్డా పరిశీలించారు. మోదీ బహిరంగసభ జిల్లాలోని బీజేపీ అభ్యర్థుల్లో నూతనోత్సాహం నింపుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరో కేంద్ర సహాయ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ నగరంలో చాయ్‌పే చర్చలో పాల్గొన్నారు. అలాగే స్వామి పరిపూర్ణనంద, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్, ఎల్లారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గాల్లో పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగసభలను నిర్వహించిన టీఆర్ఎస్ ఈనెల 26న ఉమ్మడి జిల్లాలో నాలుగు చోట్ల వరుస సభలను నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం కామారెడ్డి బహిరంగ సభ అనంతరం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని డిచ్పల్లి వద్ద, అలాగే బోధన్ నియోజకవర్గ కేంద్రంలో, బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్‌లో సభలను నిర్వహిస్తోంది. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల పరిధిలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను, కార్యకర్తలను ప్రజలను తరలించేందుకు ఆ పార్టీ అభ్యర్థులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎల్లారెడ్డి, ఆర్మూర్‌లలో నిర్వహించిన కేసీఆర్ సభలతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చింది. రాహుల్ సభ నిర్వహించే యోచన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ మరోమారు జిల్లాకు రానున్నారు. ఇప్పటికే కామారెడ్డిలో కాంగ్రెస్ రాహుల్‌గాంధీ బహిరంగసభను నిర్వహించిన విషయం విధితమే. ఈసారి నిజామాబాద్ జిల్లా పరిధిలోని బోధన్‌లో గానీ, ఆర్మూర్‌లో గానీ ఈ సభను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. వీలైతే జిల్లా కేంద్రంలో రాహుల్ సభను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా స్టార్ క్యాంపెయినర్లతో ప్రచార కార్యక్రమాలకు కార్యచరణ రూపొందిస్తోంది. పలుచోట్ల రేవంత్‌రెడ్డితో రోడ్‌షోలు, సభలను నిర్వహించే యోచనలో ఉంది. విజయశాంతి వంటి నేతలు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి. మొత్తం మీద అగ్రనేతల ప్రచారంతో జిల్లా హోరెత్తనుంది. -
ఆ ఆకుపచ్చ జెండాలపై బదులివ్వండి
న్యూఢిల్లీ: నెలవంక, నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ రంగు జెండాలను దేశంలో ఎగరేయరాదంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. దేశవ్యాప్తంగా భవనాలు, మతపరమైన ప్రాంతాల్లో ఈ జెండాలను నిషేధించడంపై అభిప్రాయం చెప్పాలం టూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఆకుపచ్చ రంగు జెండాలపై షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ వసీమ్ రిజ్వీ వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున సమాధానం చెప్పేందుకు వీలుగా అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ఈ పిటిషన్ కాపీని అందించాలని రిజ్వీకి ధర్మాసనం సూచించింది. నెలవంక, నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ జెండాలు ‘‘ఇస్లాం విరుద్ధం’’ అని, అవి పాకిస్తాన్‌లోని ఓ రాజకీయ పార్టీ జెండాను తలపించేలా ఉన్నాయని రిజ్వీ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
రూ.6,138 కోట్లు : క్రికెట్ చరిత్రలో మరో సంచలనం
ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలు... ఏం ఫర్వాలేదు! బోర్డులో గొడవలు, వర్గ పోరాటాలు... వచ్చే నష్టమేమీ లేదు!! సుప్రీం కోర్టులో కేసులు, లోధా కమిటీ పంచాయితీలు... ఆటకు సంబంధం లేని వ్యవహారాలు!!! గత కొన్నేళ్లలో భారత క్రికెట్‌కు సంబంధించి మైదానం బయటి వ్యవహారాలు, వివాదాలు, వార్తలు ఎన్నో ఎన్నెన్నో... కానీ ఇదంతా టీ కప్పులో తుఫాన్లాంటిదే తప్ప ఆటను కబళించే సునామీ అసలే కాదనేది క్రికెట్ ప్రపంచం గుర్తించిన సత్యం. కమాన్ ఇండియా అంటూ క్రికెట్లో లీనమైపోయే సగటు అభిమానికి కావాల్సింది మ్యాచ్ వినోదం మాత్రమే. భారత జట్టు విజయం సాధించడం... కోహ్లి పరుగుల వరద, భువీ వికెట్ల జాతర మాత్రమే! క్రికెట్‌నే శ్వాసించే మన ఫ్యాన్స్ పిచ్చి ప్రేమే ఇప్పుడు బీసీసీఐకి కాసుల పంట పండిస్తోంది. సరిగ్గా ఈ అభిమానమే పెట్టుబడిగా కోటానుకోట్ల రూపాయల కాసులతో ప్రసారకర్తలు మరోసారి సిద్ధమైపోయారు. పైసాకు పైసా లాభం తెచ్చి పెట్టగల శక్తి క్రికెట్‌కే ఉందని వారు నమ్మారు. అందుకే భారత్ గడ్డపై వచ్చే ఐదేళ్లలో జరిగే 102 అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం స్టార్ ఇండియా సంస్థ ఏకంగా రూ. 6,138.10 కోట్లు చెల్లించనుంది. అంటే ఒక్కో మ్యాచ్‌కు రూ. 60.17 కోట్లు బోర్డు ఖాతాలో పడుతుంది. భారత క్రికెట్ విలువ కించిత్ కూడా తగ్గలేదని ఈ ఒప్పందం మరోసారి నిరూపించింది. గత సెప్టెంబర్‌లో ఐపీఎల్ హక్కులతో రూ.16,347.5 కోట్లు ఆర్జించిన బోర్డు ఖజానా ఇప్పుడు మరింత బరువెక్కింది! న్యూఢిల్లీ: భారత్‌లో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల ప్రసారహక్కుల కోసం జరిగిన పోటీలో మరోసారి స్టార్ ఇండియాదే పైచేయి అయింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ–వేలంలో తన ప్రత్యర్థులు సోనీ, రిలయన్స్ జియోలను వెనక్కి తోసి హక్కులను సొంతం చేసుకుంది. వేలంలో స్టార్ రూ. 6 వేల 138 కోట్ల 10 లక్షలకు హక్కులు గెలుచుకుంది. బుధవారం రూ. 6,032.5 కోట్ల వద్ద నిలిచిన వేలం గురువారం కూడా కొనసాగింది. మరో 105.5 కోట్లు అదనంగా పెరిగిన తర్వాత సోనీ, జియో సంస్థలు తమ వల్ల కాదంటూ పోటీ నుంచి తప్పుకున్నాయి. వేలంలో సోనీ రూ.6118.59 కోట్లు కోట్ చేసి ఇదే తమ గరిష్ట మొత్తంగా ప్రకటించేసింది. దాంతో మరింత ముందుకు వెళ్లిన స్టార్ విజేతగా నిలిచింది. దీని ప్రకారం వచ్చే ఐదేళ్లలో భారత్‌లో జరిగే మ్యాచ్‌ల ప్రపంచవ్యాప్త టీవీ ప్రసారాలు, డిజిటల్ ప్రసారాల గ్లోబల్ కన్సాలిడేటెడ్ బిడ్ (జీసీఆర్) స్టార్ సొంతమైంది. ఐదేళ్ల క్రితం ఇదే తరహాలో ప్రసార హక్కుల కోసం స్టార్ రూ.3,851 కోట్లు చెల్లించింది. దాంతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా 59 శాతం ఎక్కువ విలువ పెరగడం మరో విశేషం. తాజా ఒప్పందం ప్రకారం స్టార్ ఒక్కో మ్యాచ్ కోసం బోర్డుకు రూ.60.17 కోట్లు చెల్లిస్తున్నట్లు లెక్క. ఇప్పటికే ప్రతిష్టాత్మక ఐపీఎల్ హక్కులు కూడా ఉన్న స్టార్ గుత్తాధిపత్యంతో భారత క్రికెట్‌పై తమకు ఉన్న పట్టును మరింత పెంచుకుంది. ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్ కోసం అదే స్టార్ రూ.54.5 కోట్లు చెల్లిస్తోంది. క్రికెట్లోని రెండు ‘అత్యంత విలువైన’ ప్రసార హక్కులతో పాటు ఐసీసీ టోర్నీల హక్కులు కూడా స్టార్ వద్దే ఉండటం విశేషం. తాజా ఒప్పందంలో భారత పురుషుల జట్ల అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు భారత మహిళల క్రికెట్ జట్టు ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లు, పురుషుల దేశవాళీ టోర్నీల ప్రసార హక్కులు కూడా స్టార్కే చెందుతాయి. ఐపీఎల్ ఆదాయం 50–50 ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసే విషయంలో స్టార్, దూరదర్శన్ మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న వివాదానికి తెర పడింది. గురువారం ముగిసిన తుది భేటీ అనంతరం ప్రకటనలో ఆదాయాన్ని చెరి సగం పంచుకునేందుకు ఇరు సంస్థలు అంగీకరించాయి. ఏ రకంగా చూసినా ఇది ప్రభుత్వ సంస్థ ప్రసారభారతికి పెద్ద విజయం లాంటిదే. అయితే దూరదర్శన్ ఛానల్స్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు ఒక గంట ఆలస్యంగా (ఢిఫర్డ్ లైవ్) ప్రసారమవుతాయి. సంక్షిప్తంగా... ►హక్కుల వ్యవధి: 2018–2023 (ఐదేళ్లు) ►మొత్తం మ్యాచ్‌లు: 102 (22 టెస్టులు, 45 వన్డేలు, 35 టి20లు) ►ఒక్కో మ్యాచ్‌కు చెల్లించే మొత్తం: రూ. 60.17 కోట్లు ►ప్రస్తుతం స్టార్ చేతిలో ఉన్న ప్రసార హక్కులు: ఐసీసీ టోర్నీలు, ఐపీఎల్, భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లలో జరిగే మ్యాచ్‌లు. ►ప్రస్తుతం సోనీ చేతిలో ఉన్న ప్రసార హక్కులు: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, యూఏఈలలో జరిగే మ్యాచ్‌లు. మా మ్యాచ్‌లు ప్రసారం చేయరా ప్లీజ్! ఒకప్పుడు క్రికెట్ మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు దూరదర్శన్ను వేడుకున్న రోజుల నుంచి నేడు ప్రపంచ క్రికెట్‌ను శాసించే వరకు బీసీసీఐ ఎదిగిన వైనం అనూహ్యం, అసాధారణం. ‘బంగారు బాతు’లాంటి విశేషణాలను క్రికెట్ దాటుకొని చాలా కాలమైంది. ఇప్పుడు భారత బోర్డు ఏం చేసినా కనకవర్షం కురవడమే. గత పాతికేళ్లలో భారత క్రికెట్ ప్రసారహక్కుల ప్రస్థానాన్ని ఒక్కసారి చూస్తే... ►1992: భారత క్రికెట్ మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు దూరదర్శన్ రూ. 5 లక్షల ఎదురు డబ్బులు డిమాండ్ చేసింది. ►1993: భారత్‌లో ఇంగ్లండ్ పర్యటన హక్కులు (6 లక్షల డాలర్లు–ట్రాన్స్‌వరల్డ్ ఇంటర్నేషనల్) ►1993: హీరో కప్ (5 లక్షల 50 వేల డాలర్లు–ట్రాన్స్‌వరల్డ్ ఇంటర్నేషనల్) ►1999: ఐదేళ్ల కాలానికి 54 మిలియన్ డాలర్లు (దూరదర్శన్) ►2006: 22 టెస్టులు, 55 వన్డేలు (612 మిలియన్ డాలర్లు – నింబస్) ►2010: నాలుగేళ్లకు 436 మిలియన్ డాలర్లు (నింబస్) – విలువ పడిపోయింది ►2012: ఆరేళ్ళకు 750 మిలియన్ డాలర్లు (స్టార్) ►2018: ఐదేళ్లకు 944 మిలియన్ డాలర్లు (స్టార్) -
హబుల్‌కు చిక్కిన సుదూ..ర నక్షత్రం!
వాషింగ్టన్ : భూమికి 500 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ నక్షత్రాన్ని హబుల్ టెలిస్కోప్ గుర్తించింది. ఈ నక్షత్రానికి ఇకారస్ అని నామకరణం చేశారు. ఈ బ్లూస్టార్ కిరణాలు భూమిని చేరడానికి 900 కోట్ల సంవత్సరాలు పడుతుందంటే అది ఎంత దూరంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోని ఏ టెలిస్కోప్తోనూ ఇంత దూరంలో ఉన్న నక్షత్రాలను చూడటం సాధ్యం కాదు. అయితే గ్రావిటేషనల్ లెన్సింగ్ టెక్నిక్ ఉపయోగించి ఇంత దూరంలో ఉన్న నక్షత్రాన్ని గుర్తించిన ఆస్ట్రోనామర్స్ కొత్త రికార్డును సృష్టించారు. ఇంత పెద్ద, ఒంటరి నక్షత్రాన్ని చూడటం ఇదే తొలిసారి అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ పాట్రిక్ కెల్లీ చెప్పారు. అక్కడ మనం సాధారణంగా ఒంటరి గెలాక్సీలను చూడొచ్చు. కానీ ఈ నక్షత్రం మాత్రం మనం అధ్యయనం చేయగల ఒంటరి నక్షత్రం కంటే వంద రెట్ల దూరంలో ఉంది అని కెల్లీ తెలిపారు. గ్రావిటేషనల్ లెన్స్‌తోపాటు హబుల్ టెలిస్కోప్‌కు ఉన్న అత్యంత శక్తిమంతమైన రెజల్యూషన్ సాయంతో ఆస్ట్రోనాట్స్ ఇకారస్ను అధ్యయనం చేయగలరు. -
ఐపీఎల్ సందడి షురూ
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ అభిమానుల వేసవి వినోదం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభానికి మరో నెల రోజుల సమయం ఉంది. అయితే టోర్నీ ప్రసారకర్త ‘స్టార్ స్పోర్ట్స్’ దీనికి సంబంధించి ప్రచార కార్యక్రమాలను నగరంలో ప్రారంభించింది. బుధవారం శంకరపల్లిలోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ ప్రత్యేక షో జరిగింది. ‘గేమ్ ప్లాన్ ఇన్ యువర్ సిటీ’ పేరుతో ఈ కార్యక్ర మం నిర్వహించారు. పేస్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు దీపక్ హుడాతో పాటు మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఇందులో పాల్గొన్నారు. పాఠశాలకు చెందిన విద్యార్థులతో వీరంతా ఐపీఎల్‌కు సంబంధించి అనేక అంశాలపై చర్చించారు. లీగ్ విశేషాలు, వారు మ్యాచ్‌లను అనుసరిస్తున్న తీరుకు సంబంధించిన వివిధ విశేషాలతో ఈ ఇష్టాగోష్టి కార్యక్రమం సాగింది. క్రికెటర్లతో ముచ్చటించిన విద్యార్థులు లీగ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలతో పలు ప్రశ్నలు సంధించగా...ముగ్గురు క్రికెటర్లు వారికి సమాధానమిచ్చారు. గేమ్ ప్లాన్ కార్యక్రమాన్ని స్టార్ దేశంలోని ఎనిమిది ఐపీఎల్ ఫ్రాంచైజీ నగరాల్లో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తొలి షో హైదరాబాద్‌లో జరిగింది. ఐపీఎల్ 2018లో సన్‌రైజర్స్ జట్టు సభ్యులుగా ఉన్న తన్మయ్ అగర్వాల్, మెహదీ హసన్ కూడా విద్యార్థులతో క్రికెట్ ఆడి సరదాగా గడిపారు. ఇదంతా ఐపీఎల్ పుణ్యమే... భారత జట్టు యువ ఆటగాళ్లు ఇటీవల అద్భుతంగా రాణిస్తుండటంతో ఐపీఎల్ ముఖ్య పాత్ర పోషించిందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా బుమ్రా, భువనేశ్వర్, పాండ్యాలు టీమిండియాలో కీలక ఆటగాళ్లుగా మారడంలో లీగ్‌దే పాత్ర అని అన్నాడు. లీగ్ ఆరంభమైన కొత్తలో వన్డేల్లో ఆటనే టి20ల్లో ఆడే ప్రయత్నం చేశారని...అది తప్పని నిరూపిస్తూ ఐపీఎల్ అసలు సిసలు టి20 క్రికెట్‌ను చూపించిందని చోప్రా వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ జట్లలో కొందరు మినహా ఎక్కువ మంది ఆటగాళ్లు మారిపోవడంతో 2018 సీజన్ కొత్తగా కనిపించడం ఖాయమన్న చోప్రా...సన్‌రైజర్స్ జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోందని చెప్పారు. మరో వైపు శ్రీలంకలో జరిగే ముక్కోణపు టి20 సిరీస్‌లో మ్యాచ్ అవకాశం లభిస్తే తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తానని దీపక్ హుడా విశ్వాసం వ్యక్తం చేశాడు. -
అనాథల అమ్మ
నంద్యాలటౌన్: ఆమె గిరిజన మహిళ. చదివింది ఇంటర్. ఆర్థిక, రాజకీయ బలం లేదు. కుటుంబ సభ్యులందరూ కులవృత్తి అయిన బుట్టలు అల్లుకునేవారే. సమాజ సేవ చేయాలన్న తలంపుతో ఆమె స్టార్ సొసైటీ స్థాపించారు. బడి బయట ఉన్న బాల కార్మికులను, అనాథ పిల్లలను అక్కున చేర్చుకొని ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆమె సేవలకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అవార్డులు సైతం వరించాయి. అందరిచేత మన్ననలు అందుకుంటున్న ఎరుకలి రాజేశ్వరమ్మ స్ఫూర్తిగాథ ఇదీ.. గోస్పాడు గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ, సుబ్బరాయుడుల రెండో సంతానం రాజేశ్వరమ్మ. వీరికి ఎలాంటి ఆస్తులు లేవు. గుడిసెలో జీవనం. బుట్టలు అల్లుకుని జీవించారు. తలిదండ్రుల రెక్కల కష్టంతో రాజేశ్వరమ్మ ఒకటి నుంచి పదో తరగతి వరకు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఇంటర్ నంద్యాలలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. ఆర్థిక కారణాలతో తల్లిదండ్రులు చదువు మాన్పించడంతో కొన్ని రోజులు ఇంటి వద్దనే ఉంటూ బుట్టలు అల్లేవారు. ఈ సమయంలో సమాజ సేవ చేయాలనే తలంపు వచ్చింది. తనలాంటి పేదలకు సాయం చేయా లనే ఆలోచనతో తన స్నేహితుడైన సుబ్బరాయుడుతో కలిసి స్టార్ సొసైటీని 2000 సంవత్సరంలో స్థాపించారు. ఈ స్టార్ సొసైటీ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్చేవారు. రాజేశ్వరి సేవలను గుర్తించిన బాలకార్మిక పునరావాస సంస్థ అధికారులు స్టార్ సొసైటీకి ఎన్సీఎల్పీ కింద ప్రభుత్వ నిధులతో బాల కార్మిక పాఠశాలను మంజూరు చేశారు. ప్రస్తుతం 50 మంది బాలకార్మిక విద్యార్థులతో ఈ పాఠశాల నంద్యాల పట్టణంలోని నందమూరినగర్‌లో విజయవంతంగా కొనసాగుతోంది. అలాగే అహోబిలం లో మరో పాఠశాలను 50 విద్యార్థులతో ప్రభు త్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. స్నేహితుడైన సుబ్బరాయుడును 2007లో ఈమె ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కలిసి స్టార్ సొసైటీ సేవలను విస్తరించారు. నిరాశ్రయులకు వసతి గృహం.. నంద్యాల పట్టణంలోని నందమూరినగర్‌లో 2015లో నిరాశ్రయుల వసతి గృహం ఏర్పాటు చేశారు. అనాథ పిల్లలందరినీ వసతి గృహంలో చేర్చుకొని వారికి ఉచిత భోజనం, వసతితో పాటు విద్యాబుద్ధులను నేర్పిస్తున్నారు. నంద్యాల డివిజన్లో తప్పిపోయిన పిల్లలు, అనాథ పిల్లలు కనిపిస్తే పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు రాజేశ్వరమ్మకు ఫోన్ చేస్తున్నారు. సొంత ఖర్చులతో నిర్వహిస్తున్న ఈ వసతి గృహం అనతి కాలంలోనే జిల్లాలో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఇక్కడ 30మంది ఆశ్రయం పొందుతున్నారు. పురస్కారాలివీ.. ♦ 2010లో ఉత్తమ ఎన్జీఓగా గుర్తింపు ♦ 2011లో గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ ♦ 2011లో రాజీవ్ విద్యామిషన్ ద్వారా అవార్డు అందజేత ♦ ఉత్తమ మహిళగా గుర్తించి 2017 మార్చిలో అవార్డు అందజేత ♦ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలుగా నియామకం. సేవలు ఇవీ.. స్టార్ సొసైటీ ద్వారా రాజేశ్వరమ్మ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నంద్యాల పట్టణంలో టైలరింగ్ ప్రోగ్రాం కింద 2 వేల మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించారు. అప్పటి జిల్లా కలెక్టర్ విజయమోహన్ చేతుల మీదుగా కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలకు డీఆర్డీఏ సహకారంతో ఉచితంగా కుట్టుమిషన్లను ఇప్పించారు. రాజీవ్ విద్యా మిషన్ ద్వారా ప్యాపిలి మండలం పీఆర్‌పల్లె గ్రామంలో వలసల నివారణ ప్రభుత్వం కేంద్రాన్ని స్థాపించగా.. పలువురు విద్యార్థులను రాజేశ్వరమ్మ ఈ కేంద్రంలో చేర్పించి జిల్లా కలెక్టర్ చేత ప్రశంసలు పొందారు. -
ఆ అమ్మాయిది మూలా నక్షత్రమా?!
వివాహ పొంతనలకు జాతకం తీసుకోగానే ‘‘అమ్మో అమ్మాయిది అశ్లేష నక్షత్రం అట అత్తగారికి గండం మాకు ఆ సంబంధం వద్దనీ, మూల నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే మామగారు చని పోతారని, జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన కన్యను తెచ్చుకుంటే కోడలి బావగారు చనిపోతారని, విశాఖ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అయితే ఆఖరి మరిది చనిపోతాడని, మఖ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని తెచ్చుకుంటే ఇంట్లో ఎవరైనా పోవచ్చని... ఇలా చాలా మూఢ నమ్మకాలు పాతుకు పోయి ఉన్నాయి. ఈ నక్షత్రాలలో పుట్టినవారు పెళ్లికి పనికిరారా? వారిని చేసుకోకూడదా? అంటే శాస్త్రం ఇలాంటి మాటలు ఎప్పుడూ చెప్పదు! నక్షత్రాల వల్ల జరిగితే మంచి జరుగుతుంది గాని చెడు జరగదు. నక్షత్రాలపై మీకు ఏదైనా సంశయం ఉంటే అది వివాహం చేసుకున్న భార్యాభర్తలకే వర్తిస్తుంది కాని, తల్లితండ్రులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు వర్తించదు. కాబట్టి జాతకంలో అన్నిటికీ పొంతన కుదిరితే నక్షత్రం పేరు మీద అనవసరంగా భయానికి లోనై విద్య, వినయం, వివేకం, గుణం, సాంప్రదాయం, సంస్కారం, రూపం గల వధువులను విసర్జించవద్దు. ఏమాత్రం సంకోచం లేకుండా మీరు ఆ కన్యను కోడలిగా తెచ్చుకోవచ్చు. -
అరుదైన కంపించే నక్షత్రం!
వాషింగ్టన్: సూర్యుడి పరిమాణంలో ఉండి కంపించగల ఓ అరుదైన నక్షత్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ భారీ నక్షత్రం ఏడు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు అమెరికాలోని సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ఫార్లే ఫెర్రాంటీ తెలిపారు. ఈ నక్షత్రం మూడు వేర్వేరు దిశల్లో కంపించగలదని (సంకోచించడం, వ్యాకోచించడం) చెప్పారు. మన పాలపుంతలో దాదాపు వంద బిలియన్ల కంటే ఎక్కువ నక్షత్రాలు ఉన్నాయని, కానీ ఇలాంటి అరుదైనవి కేవలం ఏడు మాత్రమే ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. అందులో ప్రస్తుతం కనుగొన్న నక్షత్రం ఒకటి అని తెలిపారు. వక్రంగా ఉండే ఈ నక్షత్రాలు విశ్వం గురించి, దాని మూలాల గురించి మరింత అధ్యయనం చేసేందుకు తోడ్పడతాయి. -
ఇంటూరులో 25 అడుగుల క్రిస్మస్ స్టార్
ఇంటూరు (అమృతలూరు): గ్రామాల్లో క్రిస్మస్ సందడి నెలకొంది. డిసెంబర్ మొదటి వారం నుంచే గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తుండటంతో చర్చిల వద్ద, క్రిస్టియన్ సోదరుల నివాసాల వద్ద భారీ స్టార్లను ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో ఇంటూరు గ్రామంలో చెరువు వద్ద 25 అడుగుల భారీ స్టార్‌ను శుక్రవారం రాత్రి ఏర్పాటు చేశారు. విద్యుద్దీపాలను అమర్చడంతో కాంతులీనుతూ విశేషంగా ఆకట్టుకుంటోంది. -
మెగాస్టార్ మూవీ సూపర్‌హిట్ కావాలి
అంతర్వేదిలో హీరో సాయి ధరమ్‌తేజ హోమం అంతర్వేది (సఖినేటిపల్లి) : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం పూర్తిస్థాయిలో విజయం సాధించాలని, ఆయన పూర్తి ఆరోగ్యంతో ఈ చిత్రానికి పని చేయాలని కోరుకుంటూ ఆయన మేనల్లుడు, యువ హీరో సాయి ధరమ్‌తేజ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి బుధవారం హోమం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్, మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన హీరోలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల హోమాలు నిర్వహించారని తెలిపారు. అభిమానులు కూడా ఆరోగ్యంగా ఉండాలని హోమంలో తాను ప్రార్థించానన్నారు. తాను ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘నక్షత్రం’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నానని, కొత్త చిత్రాన్ని త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ సరసన 'కంచె' ఫేమ్ ప్రగ్యా జైశ్వాల్ కూడా పోలీసు అధికారిణి పాత్రలో కనిపించనుంది. చిరంజీవి యూత్ రాష్ట్ర అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు, రావి మురళి, గుండాబత్తుల తాతాజీ, అడబాల రాజప్ప, నామన నాగభూషణం, అధిక సంఖ్యలో అభిమానులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
ఇంటర్నెట్ స్టార్ గా రెండు నెల్ల చిన్నారి!
శాన్ ఫ్రాన్సిస్కోః ఆ అమెరికా బుజ్జాయి ఇప్పుడు ఇంటర్నెట్ స్టార్ అయిపోయింది. మెత్తని పట్టు కుచ్చులాంటి నల్లని కురులతో అభిమానుల మనసు దోచేస్తోంది. తల్లిదండ్రులిద్దరూ కూతురుతో తీసుకున్న సెల్ఫీ.. సోషల్ మీడియాలో పోస్టు చేసిన నాలుగు రోజులకే యూజర్లను అమితంగా ఆకట్టుకుంది. రెండు నెలల పాపను చూసి ముగ్ధులైన బంధువులు, స్నేహితులు ఆమె చిత్రాన్ని ఇతర మాధ్యమాల్లో షేర్ చేయడంతో లక్షలమంది అభిమానాన్ని చూరగొంటోంది. శాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన డేవ్.. మెకెంజీ కెప్లాన్ ల ముద్దుల కూతురు ఇసాబెల్లె. అమాయకంగా కనిపించే తమ ముద్దుల పాపతో తీసుకున్న సెల్ఫీ గత శుక్రవారం మెకెంజీ కెప్లాన్.. సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది. అసాధారణమైన, ఒత్తైన కురులతో కనిపిస్తున్న చిన్నారి ఇసా..చిత్రాన్ని చూసి ముగ్ధులైన స్నేహితులు, బంధువులు మరుసటిరోజు ఇతర సైట్లకు సైతం షేర్ చేయడంతో ఇప్పుడా ఫొటో ఇంటర్నెట్ లో వైరల్ లా వ్యాపించింది. ఓరెగాన్ లో నివసించే ఇసాబెల్లె కజిన్.. 'మై బేబీ కజిన్' టైటిల్ తో సామాజిక నెట్వర్కింగ్ సైట్ రెడ్డిట్ లో షేర్ చేయడంతోపాటు.. నా చెల్లి జుట్టు చూస్తే అంకోర్మాన్యాన్లోలా ఉంది అంటూ షేర్ సేసిన కొద్ది గంటల్లోనే రెడ్డిట్ హోం పేజీలో పాపులర్ అయిపోయింది. ఫొటోషాప్ లో చిత్రాలకు మార్పులు, చేర్పులు చేసి, వాటికి ఇతర వినియోగదారులను ఓట్లు వేయమంటూ అడిగే సబ్ రెడ్డిట్ లో కూడ ఈ అందాల బొమ్మ చేరిపోయింది. ఇంకేముందీ ఇసాబెల్లే చిత్రానికి వినియోగదారులు వందలకొద్దీ ఓట్లు కురిపించారు. అమెను ఓ స్టార్ గా మార్చేశారు. పసిడి కాంతుల పాపాయిని అభిమానులు మారియో లోపెజ్ తో పోల్చారు. జన్యుపరమైన కారణాలవల్లే ఇటువంటి ఒత్తైన జుట్టు వచ్చే అవకాశం ఉందని శిశు వైద్యురాలు.. డేవ్ పక్లన్ షు తెలిపారు. వంశ పారంపర్యంగా కూడ ఇటువంటి కురులు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. దీంతో కెప్లాన్ తమ కుమార్తె అందమైన కురులకు తానే కారణమంటూ మురిసిపోతోంది. పైగా మూడు నెలల వయసున్నపుడే తన జుట్టు కళ్ళపై పడేట్టు ఉండేదని తన అమ్మ చెప్పేదంటూ జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. తమ బిడ్డ ఎంతోమంది వినియోగదారులకు ఆనందాన్నివ్వడంతో పాటు ఫొటోషాప్ ఇమేజెస్ లో చోటు సంపాదించడం తమకెంతో సంతోషంగా ఉందని ఇసాబెల్లె తల్లిదండ్రులు పొంగిపోతున్నారు. -
విశ్వంలో మరో 100 గ్రహాలు!
వాషింగ్టన్: విశ్వంలో ఉన్న ఇతర గ్రహాల అన్వేషణ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన కెప్లర్ వ్యోమనౌక కొత్త గ్రహాలను కనుగొంది. వేరే నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న 100కు పైగా గ్రహాలను తన రెండో దశలో కెప్లర్ (కె-2 మిషన్) గుర్తించింది. యాంత్రిక లోపాల వల్ల ఈ కెప్లర్ దారి తప్పింది. కొత్త గ్రహాలు నక్షత్రం చుట్టూ తిరుగుతూ కెప్లర్ను దాటినపుడు నక్షత్రాల వెలుగుకు అడ్డు రావడంతో చిన్న మచ్చ ఏర్పడుతుంది. దీన్ని బట్టి అవి ఆ నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలుగా అంచనా వేశారు. 2013 మేలో కెప్లర్‌తో సంబంధాలు తెగాయి. అయితే దీన్ని ఆ తర్వాత శాస్త్రవేత్తలు తిరిగి గుర్తించి, టెలిస్కోప్ సాయంతో వెంబడిస్తున్నారు. ఈ గ్రహాలతోపాటు మరిన్ని గుర్తించే సామర్థ్యం కె-2కు ఉందని ఇయాన్ క్రాస్‌ఫీల్డ్ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఈ కెప్లర్ను ప్రయోగించిన మొదటి 80 రోజుల్లో దాదాపు 60 వేల నక్షత్రాలను గుర్తించిందని, 7 వేలకు పైగా వెలుతురు విరజిమ్మే సిగ్నల్స్‌ను కనుగొందని ఆయన తెలిపారు. కొత్త గ్రహాల అన్వేషణ కోసం పాలపుంత మొత్తం గాలించేందుకు కెప్లర్ను 2009లో ప్రయోగించారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం..
ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్ జిలా సిరిసిల్ల పట్టణంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మండలంలోని గోపాలపల్లికి చెందిన సందిరి శంకర్(53), తార(50) సిరిసిల్లలోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా వివాహాలు పూర్తయ్యాయి. శంకర్, తార ఇద్దరే అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, శంకర్‌కు అనారోగ్యంతో వారు మనస్తాపం చెందారు. బుధవారం తెల్లవారుజామున వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తార మృతి చెందగా, తీవ్ర కాలిన గాయాలతో శంకర్ పరిస్థితి విషమంగా ఉంది. అతడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - పూరీ జగన్నాథ్
-
అందాల రాక్షసి పుట్టింది ఈ రోజే
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - కృష్ణ వంశీ
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - సూర్య
-
అమితాబ్‌ని అకట్టుకున్న మనం మూవీ
-
గ్రహకాల పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
డైట్‌సెట్ - 2014 భూగోళశాస్త్రం బొమ్మనబోయిన శ్రీనివాస్ సీనియర్ ఫ్యాకల్టీ, హన్మకొండ 1. భూమికి అతిదగ్గరగా ఉన్న నక్షత్రం? సూర్యుడు 2. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టేకాలం? 8 నిమిషాలు 3. యురేనస్, నెఫ్ట్యూన్, ఫ్లూటోలకు మరో పేరు? యురేనస్‌ను వరుణ గ్రహమని, నెప్ట్యూన్‌ను ఇంద్రగ్రహమని, ఫ్లూటోను యముడు అని పిలుస్తారు 4. సూర్యుడి నుంచి దూరంలో 3వ స్థానంలో ఉండే గ్రహం? భూమి 5. అతి ఎక్కువ ఉపగ్రహాలున్న గ్రహం? శని 6. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ఏమని పిలుస్తారు? పాలవెల్లి (ఆకాశగంగ) 7. సూర్యగోళం భూమి కంటే ఎన్ని రెట్లు పెద్దది? 1.3 మిలియన్లు 8. సూర్యగ్రహంపై ఉష్ణోగ్రత ఎంత? సూర్యుని ఉపరితలంపై 6000ని సెంటి గ్రేడ్, కేంద్రంలో 10 లక్షల డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది 9. సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం? బుధుడు 10. భూమి, సూర్యుని నుంచి సగటున ఎంత దూరంలో ఉంది? 149.5 మిలియన్ల కి.మీ. 11. ఉపగ్రహాలు లేని గ్రహాలు? బుధుడు, శుక్రుడు 12. భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం? చంద్రుడు 13. చంద్రునికి, భూమికి మధ్య సగటు దూరం? 3,84,365 కి.మీ. 14. సూర్య కుటుంబంలో అంతర గ్రహాలుగా వేటిని పిలుస్తారు? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు (కుజుడు) 15. {Vహాలన్నింటిలో అతిపెద్ద గ్రహం? గురుడు (బృహస్పతి/జుపిటర్) 16. {Vహాల పరిమాణంలో భూమి ఎన్నోది? 5వది 17. {Vహకాల పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు? చాంబర్లీన్, మౌల్టన్ 18. సౌరకుటుంబంలో తిరిగే శిలాశకలాలను ఏమని పిలుస్తారు? లఘుగ్రహాలు (ఆస్ట్టరాయిడ్స) 19. భూమిపై రాత్రి, పగలు దేనివల్ల ఏర్పడతాయి? భూభ్రమణం 20. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టే సమయం? 23 గం. 56 నిమిషాల 4.09 సెకన్లు 21. భూ పరిభ్రమణం వల్ల ప్రధానంగా భూమిపై జరిగే పరిణామం? రుతువులు ఏర్పడడం 22. భూ పరిభ్రమణానికి పట్టే కాలం? 365 1/4 రోజులు 23. భూమి, సూర్యుడికి మధ్య అత్యధిక దూరం ఉండే స్థితిని ఏమంటారు? అపహేళి (ఇది జూలై 4న సంభవిస్తుంది) 24. సూర్యుడు, భూమికి మధ్య అత్యల్ప దూరం ఉండే స్థితిని ఏమంటారు? పరిహేళి (జనవరి 3న ఏర్పడుతుంది) 25. విషవత్తులు అంటే? భూమధ్య రేఖపై సూర్యకిరణాలు లంబం గా పడే రోజుల్లో రాత్రి, పగటి సమయాలు సమానంగా ఉంటాయి. మార్చి 21, సెప్టెంబరు 23 తేదీల్లో ఈవిధంగా ఉంటుంది. ఈ రెండు రోజులను విషవత్తులు అంటారు. 26. ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూనాభి ద్వారా గీసిన ఊహారేఖను ఏమంటారు? అక్షం 27. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష్య అంటారు. ఆ కక్ష్య పొడవు? 965 మిలియన్ కి.మీ. 28. కర్కట, మకర రేఖలపై సూర్యకిరణాలు లంబంగా ఎప్పుడు పడతాయి? సూర్యకిరణాలు కర్కటరేఖ ప్రాంతంలో జూన్ 21న, మకర రేఖ ప్రాంతంలో డిసెంబరు 22న లంబంగా పడతాయి 29. భూ ఉపరితలం నుంచి భూమిలోపలికి వెళ్లే కొద్దీ ప్రతి 32 మీటర్లకు ఎంత ఉష్ణోగ్రత పెరుగుతుంది? 1ని సెంటిగ్రేడ్ 30. భూ వ్యాసార్ధం ఎంత? 6440 కి.మీ. 31. భూ నాభి వద్ద సుమారుగా ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది? 6000ని సెంటిగ్రేడ్ 32. భూ ఉపరితలంపైనున్న పొరను ‘సియాల్(Sia)’ అంటారు. ఈ పొరలో ఏ రసాయనాల మిశ్రమం ఉంటుంది? సిలికా (i), అల్యూమినియం(A) 33. సియాల్ కింద ఉన్న పొరను ఏమంటారు? సియాల్ కింద ఉన్న పొరను ‘సిమా (Sima)’గా పిలుస్తారు. ఈ పొరలో సిలికా (Si), మెగ్నీషియమ్ (Mg)ల మిశ్రమం ఉంటుంది 34. నిఫె పొరలో వేటి మిశ్రమం ఉంటుంది? సియా కింది పొరను ‘నిఫె(Nife)’ అంటారు. దీనిలో నికెల్ (Ni), ఇనుము (Fe)ల మిశ్రమం ఉంటుంది. 35. భూమి లోపలికి పోయేకొద్దీ ఉష్ణోగ్రత, పీడనంలో మార్పులు? పెరుగుతాయి 36. భూగోళాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించే రేఖ? భూమధ్య రేఖ (0ని అక్షాంశ రేఖ) 37. భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన ఊహారేఖలను ఏమంటారు? అక్షాంశాలు 38. 23బీని ఉత్తర అక్షాంశరేఖను, 23బీని దక్షిణ అక్షాంశ రేఖను ఏమని పిలుస్తారు? ర్కటరేఖ, మకరరేఖ 39. భూగోళంపై ఎన్ని రేఖాంశాలుంటాయి? 360. వీటిని మధ్యాహ్న రేఖలని కూడా పిలుస్తారు. 40. లండన్‌లో ‘గ్రీనిచ్’ మీదుగా పోయే రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారు. ఇది ఎన్ని డిగ్రీల రేఖాంశం? 0ని రేఖాంశం 41. భూమి తన చుట్టూ తాను 1ని దూరం తిరగడానికి పట్టే కాలం? 4 నిమిషాలు 42. సూర్యుడు, చంద్రుడు, భూమి వరుసగా ఒకే సరళరేఖపై ఉన్నప్పుడు ఏర్పడే గ్రహణం? సూర్య గ్రహణం. ఇది అమావాస్య రోజుల్లో ఏర్పడుతుంది. 43. సూర్యుడు, భూమి, చంద్రుడు వరుసగా ఒకే సరళరేఖపై ఉన్నప్పుడు ఏర్పడే గ్రహణం? చంద్రగ్రహణం. ఇది పౌర్ణమి రోజుల్లో ఏర్పడుతుంది. 44. {పచ్ఛాయ, పాక్షిక ఛాయ అంటే ఏమిటి? భూమిలో సగం మాత్రమే సూర్యుడికి ఎదురుగా ఉంటుంది. మిగతా సగభాగం తన నీడలోనే ఉండి చీకటిగా ఉంటుంది. ఆ నీడ భాగాన్ని ‘ప్రచ్ఛాయ (్ఖఝఛట్చ)’ అంటారు. ఆ నీడ చుట్టూ ఉన్న భాగాన్ని ‘పాక్షిక ఛాయ (్క్ఛఠఝఛట్చ)’ అంటారు. 45. భూమివైపు నిరంతరం ప్రసరించే సూర్య శక్తిని ఏమంటారు? సూర్యపుటం 46. భూమి గ్రహిస్తున్న శక్తిలో పరావర్తనం అవుతున్న శక్తి శాతాన్ని ఏమంటారు? ఆల్బిడో 47. సూర్యుని నుంచి నిరంతరం విడుదల చేసే శక్తిని ఏమంటారు? సౌరవికిరణం 48. సూర్యుని వ్యాసం, భూమి వ్యాసం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ? 100 రెట్లు 49. భూమి సగటున ఒక చ.సెం.మీ. ఉపరితల విస్తీర్ణానికి నిమిషానికి ఎన్ని కేలరీల శక్తికి సమానమైన,సూర్యపుటాన్ని గ్రహిస్తుంది? 2 కేలరీలు 50. భూమి ఆల్బిడో ఎంత? 30 శాతం 51. భూమి ఉపరితలం సరాసరి ఉష్ణోగ్రత? 13ని సెల్సియస్ 52. ఒక ప్రదేశం ఉష్ణోగ్రతను ఎలా కొలుస్తారు? ఉష్ణమాపకం ద్వారా 53. ఒకే ఉష్ణోగ్రతలున్న ప్రదేశాలను కలుపుతూ గీసే రేఖలను ఏమంటారు? సమోష్ణోగ్రత రేఖలు 54. భూమధ్యరేఖ నుంచి దూరంగా పోయే కొద్దీ పగటి ప్రమాణంలో జరిగే మార్పు? పెరుగుతుంది 55. వేసవి కాలంలో 0ని అక్షాంశం (భూమధ్య రేఖ) వద్ద పగటి ప్రమాణం ఎంత? 12 గంటలు 56. వేసవిలో 90ని అక్షాంశం వద్ద పగటి ప్రమాణం ఎంత? ఆరు నెలలు 57. అపహేళి సమయంలో (జూలై 4) భూమి నుంచి సూర్యుని దూరం ఎంత? 152 మిలియన్ కి.మీ. 58. పరిహేళి సమయంలో (జనవరి 3) భూమి నుంచి సూర్యుడి దూరం ఎంత? 147 మిలియన్ కి.మీ. 59. వాతావరణం కింద ఉండే పొరలు ఎలా వేడెక్కుతాయి? భూవికిరణం ద్వారా 60. మిస్ట్రాల్, బోరా అనేవి? శీతల పవనాలు 61. ఎడారుల్లో వీచే ఉష్ణ పవనాలను ఏమంటారు? ఫాన్, ఛినూక్ 62. భూమిపై నుంచి సగటున ప్రతి వేయి మీటర్ల ఎత్తుకు పోయేకొద్దీ ఎన్ని సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత తగ్గుతుంది? 6ని సెంటిగ్రేడ్. దీన్ని సాధారణ క్షీణతా క్రమం అంటారు. 63. వాతావరణ పీడనాన్ని ఎలా కొలుస్తారు? భారమితితో 64. వాతావరణ పీడన విస్తరణను ఏ రేఖల ద్వారా చూపుతారు? సమభార రేఖలు 65. పొడిగా ఉండే గాలి కంటే నీటి ఆవిరి బరువు ఎలా ఉంటుంది? తక్కువగా 66. భూభ్రమణం వల్ల ఉత్పత్తి అయ్యే శక్తిని ఏమంటారు? కొరియాలిస్ ఎఫెక్ట్ 67. బాష్పీభవనం అంటే? ద్రవరూపంలోని నీరు ఆవిరి రూపంలోకి మారడం 68. ఉత్పతనం అంటే? ఘనరూపంలోని మంచు ద్రవరూపంలోకి మారకుండానే నేరుగా వాయురూపంలోకి మారే ప్రక్రియ 69. {దవీభవనం అంటే? నీటి ఆవిరి నీరుగా లేదా మంచుగా మార్పు చెందడం 70. ఫాన్, ఛినూక్, లూ, బోరా, మిస్ట్రాల్, శాంటా అనేవి? స్థానిక పవనాలు 71. {పపంచ పంచదార గిన్నెగా ప్రసిద్ధి చెందిన దేశం? క్యూబా 72. భూకంపాల వల్ల తీవ్ర నష్టాలకు గురయ్యే ప్రాంతం? భూకంప అధికేంద్రం వద్ద ఉండే ప్రాంతం 73. భూకంపం వల్ల భూ ఉపరితలంపై అధిక నష్టాలకు కారణమవుతున్న తరంగాలు? ’L’ తరంగాలు 74. భూకంప తరంగాలను గుర్తించి నమోదు చేసే పరికరం? సిస్మోగ్రాఫ్ 75. భూకంప తరంగాల తీవ్రతను దేనితో కొలుస్తారు? రిక్టర్ స్కేల్ 76. సముద్ర భూతలంపై ఏర్పడే భూకంపాలను ఏమంటారు? సునామీలు (జపనీస్ పదం) 77. మనదేశంలో అధికంగా భూకంపాలకు గురయ్యే ప్రాంతం? అసోం 78. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు? 8848 మీటర్లు (ప్రపంచంలోనే ఎత్తైది) 79. ఏ సముద్రంలో అతి తక్కువ లవణీయత ఉంది? బాల్టిక్ సముద్రం 80. అతి ఎక్కువ లవణీయత ఉండే సముద్రం? మృతసముద్రం (Dead Sea) 81. సూర్య చంద్రుల గురుత్వాకర్షణ ప్రభావంతో సముద్రాల నీటి మట్టాల్లో ఏర్పడే హెచ్చుతగ్గులను ఏమంటారు? పోటుపాటులు 82. భూ ఉపరితలంపై సముద్రాలు ఎంత ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నాయి? 71% 83. భూ ఉపరితలానికి దిగువన ఏర్పడిన శిలాద్రవాన్ని ‘మేగ్మా’ అంటారు. భూ ఉపరి తలాన్ని చేరిన శిలాద్రవాన్ని ఏమంటారు? లావా 84. నిద్రాణాగ్ని అగ్నిపర్వతాలకు ఉదాహరణ? ఫ్యూజియామ (జపాన్), హేల్యకోలా (హవాయి) చక్రవాతాలు - వాటి పేర్లు - హిందూ మహాసముద్రంలో ఏర్పడేవి - తుఫాన్లు (సైక్లోన్స) - పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడేవి - టైఫూన్లు - మెక్సికో సింధు శాఖ, కరేబియన్ సముద్రంలో ఏర్పడేవి- హరికేన్లు - ఆస్ట్రేలియాలో ఏర్పడేవి - విల్లీ విల్లీ ఆదిమజాతులు - నివసించే ప్రాంతాలు - రెడ్ ఇండియన్లు - అమెజాన్ నదీ పరివాహ ప్రాంతం - పిగ్మీలు - కాంగో నదీ ప్రాంతం - సమాంగ్లు, సకామిలు - మలేషియా అడవులు - హెడ్ హంటర్స - బోర్నియో ద్వీపం - కాబు - సుమత్రా ద్వీపం - బుష్మెన్ - కలహరి ఎడారి -
సూర్యుడికి పొరుగున హిమ నక్షత్రం!
మన సౌర కుటుంబానికి పొరుగున.. కేవలం 7.2 కాంతి సంవత్సరాల దూరంలోనే ఉన్న అతి చల్లని నక్షత్రం ఇది. పేరు ‘వైజ్ జే085510.83071442.5’. ఇప్పటిదాకా కనుగొన్న బ్రౌన్ డ్వార్ఫ్ నక్షత్రాల్లో ఇదే అత్యంత చల్లనిదట. ఇదెంత చల్లగా ఉంటుందంటే.. మైనస్ 48-13 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రతతోనే ఉంటుందట. అంటే.. ఇదో మంచు నక్షత్రం అన్నమాట. మన సూర్యుడిలాంటి నక్షత్రాలు కేంద్రక సంలీనం చర్య వల్ల హైడ్రోజన్‌ను హీలియం వాయువులుగా మారుస్తూ నిరంతరం అంతులేని వేడి, వెలుగులు, రేడియేషన్ విరజిమ్ముతుంటాయి. కానీ బ్రౌన్ డ్వార్ఫ్ వంటి మరుగుజ్జు నక్షత్రాలలో చాలా తక్కువ ద్రవ్యరాశి ఉంటుంది కాబట్టి.. వాటిలో కేంద్రక సంలీనం చర్యలు జరగవు. అందువల్ల అవి చల్లగానే ఉంటాయి. తాజా మరుగుజ్జు నక్షత్రం ద్రవ్యరాశి గురుగ్రహం కన్నా 10 రెట్లు మాత్రమే ఎక్కువ కావడంతో ఇది పూర్తిస్థాయి నక్షత్రంగా మారలేకపోయిందట. దీనిని అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన వైజ్, స్పిట్జర్ స్పేస్ టెలిస్కోపుల ద్వారా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కెవిన్ లూమన్ కనుగొన్నారు. ఇలాంటి నక్షత్రాలపై అధ్యయనం ద్వారా అతిచల్లని గ్రహాలపై వాతావరణాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
తారలకు తాత..
ఇది విశ్వంలోనే అత్యంత పురాతనమైన నక్షత్రం ఫొటో. దీని వయసు 1,370 కోట్ల ఏళ్లు. భూమికి 6 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ తారను ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బిగ్‌బ్యాంగ్ తర్వాత ఇది ఏర్పడిందని చెబుతున్నారు. తొలి తరం నక్షత్రాలను అధ్యయనం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
నిన్ను నువ్వు తెలుసుకో...
అది ఓ ఆరునక్షత్రాల సమూహం. ఆ ఆరు నక్షత్రాలను కలిపి కృత్తిక అంటారు. ఆ కృత్తికా నక్షత్రాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మనం కొలిచే దైవం. శివపార్వతుల పుత్రుడు. ఈ నక్షత్రం నుంచి ఈ భూమిపైకి ఎందరెందరో దివ్యపురుషులు, రుషులు, మహర్షులు అవతరించారు. అలా అవతరించిన సుబ్రహ్మణ్య అంశే వెంకట రమణ. ధ్యాన నిమగ్నుడైన ఆయనను మొదటిసారిగా చూసి, దివ్యదృష్టితో దర్శించి, రమణ మహర్షిగా సంబోధించి, స్తుతించి, స్తోత్రం చేసినవారు కావ్యకంఠ గణపతిముని. ఆ తరువాత ఎందరో అధికార, అనధికార ప్రముఖులు, పెద్దలు రమణాశ్రమంలో ఆయనను దర్శించుకుని తమ సమస్యల నుంచి ఉపశాంతి పొందారు. క్రీ.శ. 1879, డిసెంబర్ 29 అర్ధరాత్రి అంటే తెల్లవారితే 30న మదురైకి 30 మైళ్ల దూరంలోని తిరుచ్చలికి చెందిన సుందరేశ్వర్, అళగమ్మాళ్ దంపతులకు వారి కులదైవమైన వెంకటేశ్వరస్వామి అనుగ్రహంతో జన్మించిన వెంకట రమణే, అనంతర కాలంలో రమణ మహర్షిగా, అరుణాచల రమణుడిగా పేరొంది, ఖండాంతర ఖ్యాతిగాంచారు. భగవంతుణ్ణి నీ అంతర్నేత్రంలో దర్శించడానికి తగిన ఉత్తమమైన, సరళమైన ఆధ్యాత్మికమార్గం మౌనమే అని తన జీవితం ద్వారా మనకు రుజువు చేసిన ఆధ్యాత్మిక సంపన్నులు భగవాన్ రమణ మహర్షి. నిశ్శబ్దాన్ని ఆశ్రయంగా చేసుకుని చేసే మౌనసాధన వల్లే ఈశ్వర సాక్షాత్కారమవుతుందంటారాయన. రమణ మహర్షి అరుణాచలంలో అడుగిడినప్పటినుంచి చాలాకాలం వరకు మౌనంలోనే ఉన్నారు. ఆయనకు చదవనూ రాయనూ వచ్చనే సంగతి ఎవరికీ తెలియదు. భక్తులు అడిగిన ఆధ్యాత్మిక సంబంధమైన ప్రశ్నలకు ముత్యాల్లాంటి చేతిరాతలో సమాధానాలు రాసి చూపుతూ ఉండేవారు. కొన్నాళ్ల తర్వాత జిజ్ఞాసువులైన భక్తులపట్ల ఆదరంతో పెదవి విప్పి పరిమితంగా మాట్లాడేవారు. అవి భక్తుల సందేహాలను తీర్చేవి. కాని వారి సహజస్థితి మౌనమే. వారి మౌనం దక్షిణామూర్తి రూపాన్ని తలపింపచేసేది. మౌనం ద్వారానే ఆత్మజ్ఞానాన్ని, ఆత్మానందాన్ని, చిత్తశాంతిని భక్తులకు అనుగ్రహించిన దివ్యజ్యోతి స్వరూపులు భగవాన్ రమణులు. రమణుల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పాశ్చాత్యులకు పరిచయం చేసినవారిలో ప్రధానమైనవాడు పాల్ బ్రింటన్. ఎన్నో ప్రశ్నలు భగవాన్ను అడుగుదామని అనేక సంశయాలతో రమణుల చెంతకు అరుణాచలం వచ్చాడు పాల్ బ్రింటన్. దాదాపు రెండుగంటలసేపు మహర్షి సమక్షంలో కూర్చున్నారు. వారిద్దరి మధ్యా మౌనమే తప్ప మాట లేదు. తాను అడగదలచుకున్న ప్రశ్నలు ఏవీ ఆయనను అడగలేదు బ్రింటన్. అయితేనేం, అప్రతిహతమైన శాంతి ప్రవాహం అన్ని దిక్కుల నుండి అతనిలోకి వెల్లువలా ప్రవేశించింది. మనస్సు సంపూర్ణశాంతితో నిండి నిశ్చలస్థితిలో నిలిచింది. రమణ మహర్షి దీర్ఘమౌనంలోని అంతరార్థాన్ని గ్రహించిన బ్రింటన్ ఆయనకుశిష్యుడై భగవాన్ జ్ఞానసంపదను ప్రపంచానికి పంచారు. అత్యుత్తమ జ్ఞానసాధనమైన మౌనాన్ని గురించి రమణ మహర్షి ఇలా చెబుతారు. ‘గురువు అనుగ్రహానికి ఉత్తమోత్తమ రూపం మౌనమే. అదే అత్యుత్తమ ఉపదేశం కూడా. మౌనంలోనే సాధకుని ప్రార్థన పరాకాష్ఠకు చేరుతుంది. గురువు మౌనంలో ప్రతిష్థితుడైతే, సాధకుని మనస్సు దానంతట అదే విశుద్ధిని పొందుతుంది’’ అన్నది రమణుల మౌనబోధ. ఆయన సందేశమూ, ఉపదేశమూ ఎప్పుడూ ఒకటే. ‘నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వు ఎవరో తెలిస్తే ఈ సమస్తం తెలుస్తుంది. దేహమే నేను అనే సంకుచిత భావనే అహానికి, ప్రారబ్ధకర్మలకు కారణమవుతుంది. జన్మజన్మల కర్మబంధానికి హేతువు అవుతుంది. ఒక్కసారి దేహభావన తొలగిందంటే కర్మబంధం పటాపంచలవుతుంది’ అరుణాచలంలో అడుగిడినప్పటి నుండి సిద్ధిని పొందేవరకు అణగారినవారు, ఉన్నతకులాలవారు, పశువులు, పక్షులు, జంతువులు, వృక్షాలు అనే భేదం లేక అందరినీ సమానంగా ప్రేమించి, ఆదరించి, వెలలేని ఆధ్యాత్మిక జ్ఞానసంపదను అందించిన రమణ మహర్షి సిసలైన స్థితప్రజ్ఞులు. కేవలం తన ఉనికిమాత్రం చేతనే భక్తుల జీవితాలలో వెలుగు నింపారు. నేటికీ ఎందరో భక్తుల హృదయాలలో వెలుగుతున్నారు. అరుణాచలంపై ఇప్పటికీ రమణీయంగా వెలుగొందుతున్నారు. - శింగమల బ్రహ్మానందరెడ్డి మనస్సే అన్నింటికీ మూలం. అది పుట్టగానే అన్నీ పుడతాయి. అది అణిగితే అన్నీ అణుగుతాయి. అన్నింటికీ కారణమైన ఆ మనస్సును అదుపులో పెట్టుకోవడమే ఆధ్యాత్మిక సాధన. - భగవాన్ రమణ మహర్షి