టిక్‌టాక్ స్టార్ జియావో క్యుమీ(ఫైల్ ఫోటో)
బీజింగ్: లైవ్ స్ట్రీమ్ వీడియో షూట్ చేస్తూ చైనీస్ టిక్‌టాక్ స్టార్ జియావో క్యుమీ (23) దుర్మరణం పాలైన ఘటన షాక్‌కు గురిచేసింది. టిక్‌టాక్ వీడియో రికార్డ్ చేస్తూ 160 అడుగుల నుంచి కింద పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ప్రొఫెషనల్ క్రేన్ ఆపరేటర్‌గా పనిచేసే జియావో ఆ క్రేన్ నుండే పలు వీడియోలు తీస్తూ ఉండేది. ఇలా అనేక వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ స్టార్‌గా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే సహోద్యోగులంతా ఇంటికి వెళ్లి పోయిన తరువాత క్రేన్ క్యాబిన్లో కూర్చుని వీడియో తీసుకోవడానికి ప్రయత్నించింది జియావో. కానీ ఇంతలోనే అదుపు తప్పి కింద పడిపోయింది. ఫోన్ చేతిలో పట్టుకుని కింద పడిపోతున్న దృశ్యాలు వీడియోలో అస్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో ఈ వీడియో వైరల్ అయింది.
టిక్‌టాక్ చైనీస్ వెర్షన్ డౌయిన్ ప్లాట్‌ఫాంలో లక్షమంది మందికి పైగా ఫాలోవర్లో జియావో క్యుమీ చైనాలో అత్యంత ప్రజాదరణ పొందారు. ఇద్దరు బిడ్డల తల్లి అయిన ఈమె డ్యాన్స్ వీడియోలు కూడా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాయి. దీంతో జియావో ఆకస్మిక మరణం అభిమానులను తీవ్ర విషాదంలోకి ముంచింది. కాగా ఇటీవల హాంగ్‌కాంగ్‌కు చెందిన డేర్‌డెవిల్ ఇన్‌ఫ్లూయెన్సర్ సోఫియా చుంగ్ జలపాతం సమీపంలో ఇన్‌స్టాగ్రామ్ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment