Crane
-
Delhi Airport: రన్‌వే వద్ద భారీ క్రేన్.. ప్రమాదంలో పడ్డ విమానాలు
న్యూఢిల్లీ: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) అధికారులు విధినిర్వహణలో భాగంగా చేసిన ఓ పని వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను రిస్క్‌లో పడేసింది. రోడ్డు నిర్మాణం కోసం ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని 11ఆర్ రన్‌వే సమీపంలో ఉంచిన ఒక పొడవాటి క్రెయిన్ కారణంగా విమానాలకు ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్(ఐఎల్ఎస్) సిగ్నల్ అందలేదు. ఎయిర్‌పోర్టు వద్ద దట్టంగా పొగమంచు ఏర్పడినపుడు విమానాలకు విజిబిలిటీ పూర్తిగా తగ్గుతుంది. ఇలాంటి సందర్భాల్లో వాటి సేఫ్ ల్యాండింగ్‌కు ఐఎల్ఎస్ సిగ్నల్ నావిగేషన్ ఉపయోగపడుతుంది. ఈ విషయం వారం తర్వాత అధికారుల దృష్టికి రావడంతో వారు కంగారుపడ్డారు. క్రేన్ కారణంగా సిగ్నల్ సరిగా అందకపోవడంతో 100 దాకా విమానాలు గత వారం ఆలస్యంగా ల్యాండ్ అవడమే కాకుండా కొన్ని విమానాలను ఏకంగా మళ్లించే పరిస్థితి ఏర్పడిందని అధికారులు నిర్ధారించారు. ‘ఐఎల్ఎస్ సిగ్నల్‌లో అంతరాయం వల్ల కొన్ని విమానాలు రన్‌వే సెంటర్ లైన్ నుంచి 10 నుంచి 20 ఫీట్ల దూరం పక్కకు ల్యాండ్ అయ్యాయి’అని ఎయిర్‌పోర్టు అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్‌పోర్టు అధికారులు విమానాల ల్యాండింగ్‌కు అనుమతించకుండా ఉండాల్సిందని నిపుణులు అంటున్నారు. ఢిల్లీ-జైపూర్ నేషనల్ హైవేకు అనుసంధానించే అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్డును ఢిల్లీ ఎయిర్‌పోర్టు పక్కనే నేషనల్ హైవే అథారిటీ నిర్మిస్తోంది. ఈ నిర్మాణంలో భాగంగానే ఎన్హెచ్ఏఐ భారీ క్రేన్‌ను వినియోగించింది. ఇదీచదవండి..సూరీడు కనిపించి ఏడు రోజులైంది -
‘కొంగకు వారు.. వారికి కొంగ’.. జంతు ప్రేమకు నిదర్శనం!
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీకి చెందిన ఆరిఫ్ అతని ఫ్రెండ్ కొంగ మధ్యగల స్నేహబంధాన్ని స్థానికులు కథలు కథలుగా చెబుతుంటారు చాలామంది ఇటువంటి కథలను ఎక్కడా వినివుండరు. ఈ ఉదంతం ఎంతవరకూ చేరిందంటే యూపీ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం ఆరిఫ్, ఆ కొంగను కలుసుకున్నారు. అనంతరం ఆయన ఆ కొంగను జూపార్కుకు తరలించారు. అయినా గ్రామంలోని వారెవరూ ఆ కొంగను మరచిపోలేరు. ఆ కొంగకు గ్రామంలోని వారంతా స్నేహితులే. ఆ కొంగ గ్రామంలోని వారందరితో కలసిమెలసి ఉండేది. గ్రామంలోని వారంతా ఆ కొంగ అంటే ఎంతో ప్రేమ చూపించేవారు. ఆరిఫ్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగే ఆ కొంగ ప్రతీరోజూ ఉదయాన్నే తన అరుపులతో అందరినీ నిద్ర నుంచి లేపేది. అనంతరం స్థానికుల మధ్య కలివిడిగా తిరిగేది. కొంగను చూసినవారంతా దానికి ఫొటోలు తీసేవారు. కుద్రహా బ్లాక్ పరిధిలోని రోహరి గ్రామం.. కైద్హవా తాల్ సమీపంలో ఉంది. తాల్లో ఇసుకబట్టీలు ఉన్నాయి. ఉదయం కాగానే ఈ ప్రాంతం నుంచి ఒక కొంగవచ్చి గ్రామంలో కలివిడిగా తిరుగుతుంటుంది. ఊరి జనం దానిని చూడగానే స్నేహ పూర్వంగా ఉంటూ, దానికి ఏదో ఒక ఆహారం అందించేవారు. గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారం సాగుతూ వస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి సమీపంలోని ఇటుకబట్టీ దగ్లర కూలీలకు విచ్రితమైన రీతిలో రెండు గుడ్లు లభించాయి. వాటిని కూలీలు.. కొన్ని కొంగల దగ్గర విడిచిపెట్టారు. తరువాత ఆ గుడ్ల నుంచి కొంగ పిల్లలు బయటకు వచ్చాయి. కొద్ది రోజుల తరువాత ఒక కొంగ పిల్ల చనిపోయింది. మిగిలిన మరో కొంగను ఆ బట్టీలో పనిచేసే కూలీలు గ్రామానికి తీసుకువచ్చి, అక్కడ విడిచిపెట్టారు. ప్రస్తుతం ఆ కొంగ ఆ గ్రామంలో లేకపోయినా, స్థానికులు దానిని తలచుకోని రోజుంటూ ఉండదు. ఆరిఫ్ ఆ కొంగను ఎంతో ప్రేమగా సాకేవాడు. ఇది కూడా చదవండి: నడక చైర్‌లోని పసివాడు.. పైకప్పు కూలిపోయేంతలో.. వైరల్ వీడియో! -
ప్రపంచ చరిత్రలో అత్యంత క్రూరమైన శిక్ష.. ఏనుగును క్రేన్‌కు బిగించి..
ప్రపంచంలోని పలు దేశాల్లో క్రూరమైన రాజుల పాలన సాగిందనే విషయం మనం చరిత్రలో చూసివుంటాం. వారు విధించే శిక్షలు వెన్నులో వణుకుపుట్టించేవని కూడా వినివుంటాం. అయితే అంతకన్నా అత్యంత క్రూరమైన యజమాని గురించి, అతను విధించిన హేయమైన శిక్ష గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏనుగును క్రేన్‌కు బిగించి, అందరి ముందు దానికి శిక్ష విధించాడంటే.. అతను ఎంత క్రూరమైనవాడో ఇట్టే గ్రహించవచ్చు. ఏనుగు ఏం తప్పు చేసిందని.. అత్యంత సాధు జంతువుగా పేరొందిన ఏనుగుకు శిక్ష విధించాడంటే అతని నిర్దయ ఏపాటితో ఇట్టే అర్థమవుతుంది. అది 1816, సెప్టెంబరు 13.. అమెరికాలో అత్యంత హేయంగా ఒక ఏనుగును క్రేన్‌కు వేలాడదీసి మరణశిక్ష విధించారు. ఆ ఏనుగు పేరు మేరీ. అది తన మావటివాడిని కాలితో తొక్కి చంపేసిందని దానికి ఇంత దారుణమైన శిక్ష విధించాడు. చరిత్ర అందించిన సమాచారం ప్రకారం ఆ ఏనుగు ఆకలితో అల్లాడిపోతూ అదుపుతప్పింది. దానిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన మావటివాడు దాని చెవిపై గట్టిగా కొట్టాడు. అంతే.. ఆ ఏనుగు కోపంతో.. ఒక్కసారిగా తన పాదంతో ఆ మావటివాడిని తొక్కి చంపేసింది. ఆ ఏనుగు ఒక సర్కస్‌లో పనిచేస్తుండేది. మావటివాడిని తొక్కి చంపేయడంతో ఆ ఏనుగుపై స్థానికులకు ఆగ్రహం కలిగింది. క్రేన్‌కు వేలాడదీసి.. జనాగ్రహాన్ని చూసిన సర్కస్ యజమాని అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఏనుగుకు మరణశిక్ష విధించాలనుకున్నాడు. దానిని చంపివేస్తున్నట్లు వెంటనే ప్రకటించాడు. ఇందుకోసం 100 టన్నుల బరువు ఎత్తగల ఒక ప్రత్యేకమైన క్రేన్ తెప్పించాడు. ఏనుగు మెడను తాడుతో కట్టేందుకు ఒక ప్రత్యేకమైన తాడును కూడా తెప్పించాడు. క్రేన్ సాయంతో ఏనుగు మెడకు ఉరితాడు బిగించి, దానికి బహిరంగంగా జనసమూహం మధ్యలో మరణశిక్ష విధించాడు. ఇది కూడా చదవండి: గుడ్లను యూరిన్‌లో ఉడికించి, ఉప్పుకారం జల్లి.. -
యూపీలో మరో వ్యక్తి కొంగ స్నేహం..ఏం జరుగుతుందో చూడాలి..
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ రైతు ఆరిఫ్ ఖాన్ గుర్జార్ గాయపడిన కొంగను కాపాడినందుకు అతనిపైకేసు నమోదైన సంగతి తెలిసిందే. రైతు ఆరిఫ్ ఆ కొంగను కాపాడటంతో అతనితోనే ఉండిపోవడంతో వారి మధ్య స్నేహం ఏర్పడింది. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొట్టింది. దీంతో అటవీ అధికారులు వన్యప్రాణి సంరక్షణ పేరుతో అతని నుంచి కొంగను వేరుచేసి సంరక్షణ కేంద్రానికి తరలించిన ఉదంతం మరువుక మునుపే అచ్చం అలాంటి కొంగ స్నేహమే యూపీలో మరొకటి చోటుచేసుకుంది. అయితే ఈ వ్యక్తికి మాత్రం కొంగతో స్నేహం చాలా యాదృచ్ఛికంగా జరిగింది. ఈ మేరకు యూపీలోని మౌకీకి చెందిన రామ్‌సముజ్ యాదవ్ అనే వ్యక్తికి తన పొలంలో ఈ కొంగ కనిపించింది. దానికి అనుకోకుండా ఒకరోజు ఆహారం పెట్టడం జరిగింది. అలా రెండు సార్లు చేశాడు. అంతే ఆ కొంగ అతని వద్దకు పదేపదే రావడం జరిగింది. దీంతో ఆయన ఆ కొంగను మిగతా కొంగల గుంపులో వదిలేసినా, వేరు చేసేందుకు యత్నించినా అది మాత్రం ఆయన్ను వదిలిపెట్టలేదు. ఇలా ఏడాదిగా ఆ వక్తితో ఈ కొంగ స్నేహం చేస్తోంది. రాజ్‌సముజ్ పిలుపు వినగానే వచ్చే ఈ కొంగ.. ఆయన ఎక్కడకు వెళ్తుంటే అది అక్కడకు వెళ్తోంది. వాస్తవానికి యూపీ రాష్ట్ర పక్షి అయినా ఈ కొంగను 1972 వన్యప్రాణి చట్టం కింద పెంచుకోవడం నేరం, పైగా ఇవి రెడ్‌లిస్ట్ పెట్ బర్డ్స్ జాబితాలో ఉండటంతో ఇవి పెంచడం చట్ట విరుద్ధం. కాగా, అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ విషయం అటవీ అధికారుల దృష్టికి చేరితే ఏం జరుగుతుందో చూడాలి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్లు పెట్టారు. #WATCH | Heartwarming bonhomie between a Sarus crane and Mau's Ramsamuj Yadav in Uttar Pradesh I had found it on the farm where I had fed it once. After feeding it twice initially, it started to come to me repeatedly. It roams around freely in the village: Ramsamuj Yadav pic.twitter.com/W9Fw3Ozwdu — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 15, 2023 (చదవండి: మోదీ నమ్మశక్యంకాని గొప్ప దార్శనికుడు..అమెరికా మంత్రి పొగడ్తల జల్లు) -
కొంగను కాపాడిన వ్యక్తిపై కేసు.. మండిపడ్డ మాజీ సీఎం!
లక్నో: గాయపడిన ఓ కొంగను కాపాడిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంద్ఖా గ్రామంలో ఆరిఫ్ ఖాన్ గుర్జార్‌కు గతంలో ఓ సారస్ కొంగ గాయంతో తన పోలంలో కనిపించింది. వెంటనే చికిత్స చేసి కొన్నాళ్లు పాటు ఆ కొంగను కాపాడుతూ వచ్చాడు ఆరిఫ్. ఆ పక్షి కొలుకున్న తర్వాత తనను కాపాడిన వ్యక్తితోనే ఉండిపోయింది. అయితే ఇటీవల ఈ విషయం అటవీ అధికారులకు తెలియడంతో ఆ కొంగను స్వాధీనం చేసుకున్నారు. ఈ పక్షి తన సహజ వాతావరణంలో జీవించేందుకు వీలుగా రాయ్‌బరేలీలోని సమస్పూర్ అభయారణ్యంలోకి మార్చినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆరిఫ్ ఖాన్ గుర్జార్‌కు నోటీసు జారీ చేసి అతని స్టేట్మెంట్ను రికార్డ్ చేయడానికి ఏప్రిల్ 4న గౌరీగంజ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కార్యాలయంలో హాజరు కావాలని కోరారు. అసిస్టెంట్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (గౌరీగంజ్) రణవీర్ సింగ్ జారీ చేసిన నోటీసు ప్రకారం, వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ పక్షిని తీసుకెళ్లిన ఒక రోజు తర్వాత, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ చర్యను ఖండించారు. అంతేకాకుండా ప్రధాని నివాసంలో ఉన్న నెమళ్లను తీసుకెళ్లే ధైర్యం ఎవరికైనా ఉందా అని పరోక్షంగా అధికారులను ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఆరీఫ్ ఖాన్ గుర్జార్ మాజీ ముఖ్యమంత్రితో కలిసి వేదికపై కూర్చున్నారు కానీ మాట్లాడలేదు. ఇదిలా ఉండగా.. ఆరిఫ్ సమ్మతితోనే కొంగను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ పక్షులు ఎప్పుడూ జంటగా జీవిస్తాయని, అది ఒంటరిగా నివసిస్తున్న నేపథ్యంలో దాని మేలుకే సంరక్షణ కేంద్రానికి తరలించామన్నారు. -
Viral Video: ప్రాణాలను కాపాడిన వ్యక్తితో కొంగ స్నేహం.. అతడు ఎక్కడికి వెళ్తే అక్కడికెళ్తోంది
-
భారీ క్రేన్ వచ్చేసిందోచ్!
అనంతపురం సిటీ/క్రైం: అనంతపురానికి ఆదివారం ఓ భారీ క్రేన్ చేరుకుంది. దీనిని ప్రత్యేక వాహనంలో చైన్నె నుంచి తీసుకువచ్చారు. నగరంలోని టవర్‌క్లాక్ సమీపంలో చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ) పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఈ క్రమంలో విద్యుత్ లైన్‌కు పైన గడ్డర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందు కోసం చైన్నె పోర్టు నుంచి 700 టన్నుల బరువున్న భారీ క్రేన్‌ను తెప్పించారు. రైల్వే ఉన్నతాధికారుల నుంచి అనుమతులు అందగానే గడ్డర్లను ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయనున్నారు. అనంతరం 45 రోజుల్లో మిగిలిన పనులు పూర్తి చేసి జాతికి అంకింతమివ్వనున్నారు. ఈ అంశానికి సంబంధించి రైల్వే శాఖ ఉన్నతాధికారులతో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, స్థానిక రైల్వే అధికారులు పలుమార్లు చర్చించారు.sr -
క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యం.. కాలేజీ విద్యార్థిని బలి
సాక్షి, బెంగళూరు(బనశంకరి): క్రేన్‌డ్రైవర్ నిర్లక్ష్యానికి విద్యార్థిని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కళాశాలనుంచి ఇంటికి వెళ్తుండగా క్రేన్ ఢీకొని గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నూర్‌పీజా అనే విద్యార్థిని మృతి చెందింది. వివరాలు.. వైట్‌ఫీల్డ్ సమీపంలోని కన్నమంగల నివాసి నూర్‌పీజా(19) ఈనెల 2న ఇంటికి కాలినడకన బయల్దేరింది. కన్నమంగల గేట్ వద్ద ఓ క్రేన్‌ను డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ వచ్చి నూర్‌పీజాను ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించగా రెండురోజులపాటు చావుబతుకుల మధ్య పోరాడుతూ శుక్రవారం మృతి చెందింది. క్రేన్ యజమాని పెరియస్వామిపై యువతి తండ్రి రెహమాన్‌ఖాన్ వైట్‌ఫీల్డ్‌పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: (Hyderabad: ప్రాణం తీసిన వేగం.. ఇద్దరు బీబీఏ విద్యార్థుల దుర్మరణం) -
చైనా కర్కశత్వం.. వారిని పశువులకన్నా హీనంగా క్రేన్ల సాయంతో..!
బీజింగ్: కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో కోవిడ్ రోగుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు దారుణంగా ఉంది. కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న క్రమంలో పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షల విధించింది జిన్‌పింగ్ ప్రభుత్వం. ఈ క్రమంలో కోవిడ్ సోకిన ఓ రోగిని క్రేన్ ద్వారా తీసుకెళ్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు చైనా ప్రభుత్వం, అధికారుల తీరుపై మండిపడుతున్నారు. రోగులను పశువలకన్నా హీనంగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఆంక్షలు విధించిన ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఓ భవనంలోని కిటికీలోంచి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సామాజిక దూరం పాటించే క్రమంలో వైరస్ సోకిన వ్యక్తిని క్రేన్ సాయంతో తీసుకెళ్లారు. ట్విటర్లో ఈ వీడియోను ఇప్పటి వరకు 221వేల మంది వీక్షించారు. 1.8వేల లైకులు వచ్చాయి. చైనాలో కరోనా వైరస్ కట్టడికి జీరో కోవిడ్ పాలసీని అవలంభిస్తోంది జిన్‌పింగ్ ప్రభుత్వం. కరోనా కేసులు వచ్చిన ప్రాంతంలో కఠిన లాక్డౌన్లు విధిస్తున్నారు. కీలక నగరాల్లో లాక్డౌన్లు విధించటం ద్వారా ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉన్నందున చైనా ప్రభుత్వంపై అంతర్జాతీయంగానూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ తొలిసారి గుర్తించిన వూహాన్ నగరంలో మళ్లీ లాక్డౌన్ విధించటం ఆందోళన కలిగిస్తోంది. అక్టోబర్ 26 నుంచి 30వ తేదీ వరకు లాక్డౌన్ విధించగా.. 8 లక్షల మందిపై తీవ్ర ప్రభావం పడింది. 中国式现代化。【方老师,投稿一个防疫大革命的荒谬视频。一个阳性患者被吊机吊出小区,因为他们不敢进去接,也不想患者的细菌留在地板上,这样能保证最小的接触面积。】 pic.twitter.com/2BM3Afm3V6 — 方舟子 (@fangshimin) October 25, 2022 ఇదీ చదవండి: పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా?.. అమెరికా ఆధిపత్యానికి రోజులు దగ్గర పడ్డాయ్ -
వరల్డ్ ఫస్ట్..రేసింగ్ కార్ కన్నా వేగంగా పని..
కార్ల రేస్‌లకు సంబంధించిన పోటీలను టీవీలో చూస్తున్నప్పుడు కొన్ని అత్యంత వేగంగా పల్టీలు కొడుతుండటం చూస్తుంటాం. ప్రమాదానికి గురైన కార్లను రేస్‌కు అడ్డు రాకుండా అంతే వేగంగా తొలగించే కార్యక్రమం కూడా జరుగుతుంటుంది. ఇప్పటివరకు ఈ పనిని పురుషులే చేసేవారు. కానీ, ఈ ప్రపంచంలోకీ ఓ మహిళ అడుగుపెట్టి, తన సత్తా చాటుతోంది. దీంతో వరల్ట్ ఫస్ట్ ఫిమేల్ క్రేన్ డ్రైవర్‌గా 30 ఏళ్ల మరియన్ అల్–బజ్ గుర్తింపు పొందింది. రేస్ పోటీల్లో క్రేన్ డ్రైవర్‌గా ఓ మహిళ నియమితురాలవడం ప్రపంచమంతా గుర్తించదగిన విషయంగా అరబ్ ట్రిబ్యూన్ ప్రకటించింది. ‘మోటార్ ఇంజిన్ల పట్ల ఆమెకున్న మక్కువే ఈ ఏడాది దిరియా ఇ–ప్రిక్స్ 2022లో పాల్గొనేలా చేసింద’ని స్పష్టం చేసింది. పురుషాధిపత్య రంగంలో ఆల్–బజ్ చూపిన సాహసం ఎంతోమంది మహిళల్లో స్థైర్యాన్ని నింపుతోంది. అల్–బజ్ 13 ఏట నుండి వాహనాలను నడపడంలో ఆసక్తి చూపింది. ఈ విషయాల గురించి ఆమె ఇలా ప్రస్తావిస్తుంది. ఆసక్తి నేర్పిన పాఠం ‘ఒక మహిళ ఈ రంగంలోకి ప్రవేశించగలదని ఎవరూ ఎప్పుడూ అనుకొని ఉండరు. మెకానికల్ ప్రపంచమంటేనే పురుషుల ఆధిపత్య వృత్తి. మా నాన్నకు మెకానిక్ పని అంటే చాలా ఇష్టం. ఆయన వద్ద చాలా పాత కార్లు ఉన్నాయి. వాటిని రిపేర్ చేసి, మళ్లీ మార్కెట్లోకి తీసుకువస్తాడు. నా చిన్నప్పటి నుంచి నాన్న చేసే పనిని ఆసక్తిగా చూస్తుండేదాన్ని. మెల్ల మెల్లగా నైపుణ్యాలను తెలుసుకుంటూ, పెంచుకుంటూ వచ్చాను. ఎప్పుడైనా, దేనిలోనైనా ప్రతిభ చూపాలనుకుంటే మా పేరెంట్స్ నాకు పూర్తి మద్దతు ఇస్తారు. అలా చదువుతోపాటు మెకానిక్ పరిజ్ఞానం కూడా అబ్బింది. సాధనతోనే చేరువైన కల ప్రతి కార్తోనూ ఎగ్జిబిషన్స్ లేదా రేసుల్లో పాల్గొనేదాన్ని. దీంతో నా కలను మరింత ముందుకు తీసుకెళ్లగలిగాను. నా ఇన్నేళ్ల జీవితంలో కార్లనే అపరిమితంగా ఇష్టపడ్డాను. రేసింగ్, డ్రిఫ్టింగ్‌లో తగినంత అనుభవం ఉంది. జూన్, 2018లో అరబ్ కంట్రీలో మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేయడంతో రేస్, డ్రైవర్, మెకానిక్ ల వంటి పాత్రలు మహిళలకు అవకాశాలు దక్కేలా చేశాయి. మెకానిక్‌ను కావాలనే నా లక్ష్య సాధనకు ఇది కూడా ఉపయోగపడింది. ఇప్పుడు వీధిలోంచి వెళ్తే చాలు... చుట్టూ ఉన్నవారు నా గురించి తెలుసుకోవడం, గుర్తుపట్టి పలకరించడం, ప్రోత్సహించడం, నా నుంచి నేర్చుకోవాలని ఆసక్తి చూపుతుండటం నాకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. కష్టమైన ఛాలెంజ్ ఈ ఏడాది జరిగిన ఇ–ప్రిక్స్‌లో ఫైర్, రికవరీ, ఫాగ్, ట్రాక్‌సైడ్ వంటి నాలుగు రకాల మార్షల్స్ ఉన్నాయి. వీటిలో నా సామర్థ్యాలను చూసి అధికారులు రికవరీ మార్షల్ బృందానికి రిఫర్ చేశారు. రేసు జరిగేటప్పుడు ట్రాక్‌పై ప్రమాదం జరిగితే వెనువెంటనే వారు తగిన చర్యలు తీసుకుంటారు. ఇన్నాళ్లూ రికవరీ మార్షల్‌గా ఉండటం మహిళలకు కష్టమైన పనిగా పరిగణించ బడింది. సర్క్యూట్లో ప్రమాదం జరిగినప్పుడు వీలైనంత త్వరగా కార్లను తీయడానికి క్రేన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. నా పని ఎంత వేగంగా చేయాలంటే రేసు ప్రవాహానికి అడ్డుపడనంత స్పీడ్‌గా ఉండాలి. ఏదైనా కారు రోడ్ బ్లాక్‌కు కారణమయితే, ఇతర రేసర్లకు అడ్డు అవుతుంది. అందుకే, ఈ వృత్తిలో ఏమాత్రం అలక్ష్యం చేయకుండా ప్రతి క్షణం అలర్ట్‌గా ఉండాలి’ అని తన పని గురించి వివరిస్తుంది అల్–బజ్. ఈ యువ డ్రైవర్ నేర్చుకున్నది మెకానిక్ పని. చదువు మాత్రం పూర్తి భిన్నమైది. లెబనాన్‌లో సైకాలజీ అండ్ మీడియాకు సంబంధించిన కోర్సులు పూర్తి చేసింది. కానీ, మోటార్ కార్ల ప్రపంచంలో తనని తాను నిరూపించుకోవడానికి ముందుంటుంది. తన మెకానిక్ నైపుణ్యాలతో ఇతరులకు శిక్షణ కూడా ఇస్తోంది. సొంతంగా ఆటోమొబైల్ రిపేర్ షాప్‌ను నిర్వహించాలనుకుంటున్న అల్–బజ్ డేరింగ్ డ్రైవర్‌గా మన్ననలు అందుకుంటోంది. -
భారీ కొండచిలువను ఎత్తిన క్రేన్! వైరల్ వీడియో వెనుక కథేంటంటే..
FactCheck On Giant Phython Crane Video: ‘‘7కొండల్లో 32అడుగుల కొండచిలువ. తిరుమలలో పాపవినాశనం వెళ్ళే దారిలో అతిథిగృహం నిర్మాణం కోసం స్థలం పరిశుభ్రం చేస్తుంటే 32 అడుగుల కొండచిలువ కనబడింది’’.. అంటూ ఫేస్బుక్లో కొందరి అకౌంట్ల నుంచి ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అఫ్కోర్స్.. ఈ ప్రచారం ఫేక్ అని తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో ఏ వీడియో ఎప్పుడు వైరల్ ఎప్పుడు.. ఎందుకు అవుతుందో? అందులో ఎంత వాస్తవం ఉందనేది కనిపెట్టడమూ ఈమధ్య కాలంలో కొంచెం కష్టంగా మారిందనుకోండి. అసలు విషయంలోకి వెళ్తే.. భారీ సైజులో ఉన్న కొండచిలువను క్రేన్ అమాంతం ఎత్తేసిన వీడియో గత వారం రోజులుగా ఇంటర్నెట్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియో ఎక్కడిదన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే తాజా వీడియో మాత్రం మన దేశంలోదే కాదన్న విషయం వెలుగు చూసింది. వీడియో ఇమేజ్ ద్వారా రివర్స్ చెక్ ఆప్షన్‌తో ఈ వీడియోకు సంబంధించి కొన్ని వివరాలు సేకరించాం. అక్టోబర్ 12న ‘టమన్ పెండిడికన్’(tamanpendidikan) అనే వెబ్సైట్ ద్వారా ఈ వీడియో గురించి మొదటి పోస్ట్ పడింది. అయితే పోస్ట్‌లోని భాష ఆధారంగా ఆ వెబ్సైట్ ఇండోనేషియన్ వెబ్‌సైట్‌గా నిర్ధారణ అయ్యింది. అదేరోజు ఓ ఇండోనేషియన్ యూట్యూబ్ ఛానెల్లో కూడా అప్లోడ్ అయ్యింది. Whopper 100kg python caught in Dhanbad, Jharkhand ▪️The reptile, measuring 6.1m & weighing about 100kg, is one the largest & longest ever caught #Dhanbad #Jharkhand #India #Forest #Snakes pic.twitter.com/8TmNm9DREy — 🌎 Sarwar 🌐 (@ferozwala) October 16, 2021 ఆ తర్వాత ఇది ఇండోనేషియాకు చెందినది కాదని.. మలేషియాకు సంబంధించిన వీడియో అని ప్రచారం మొదలైంది. ఆ వెంటనే ఈ భారీ కొండచిలువ చైనా-మయన్మార్ బార్డర్లో దొరికిందని, కాదు.. మేఘాలయాకు చెందినది అని, కాదు కాదు.. ఈ వీడియో జార్ఖండ్ ధన్‌బాద్(మనదేశం)లోనిదేనంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే కొన్ని హిందీ వెబ్సైట్లు ఇది అసలు మన దేశంలో కాదనే విషయాన్ని ఫ్యాక్ట్‌చెక్ ద్వారా నిర్ధారణ చేశాయి. అసలు ఇంతకీ ఈ వీడియో కొత్తదేనా? లేదంటే పాతదా? అనే విషయం కూడా తేలాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ గతంలో ఇలా భారీ పాములు కనిపించిన సందర్భాల్లో చంపిన దాఖలాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ తరుణంలో ఆ భారీ పామును ప్రాణాలతో ఉంచారా? అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జంతు పరిరక్షణ సంఘాలవాళ్లు. ప్రస్తుతానికి ఈ వీడియో యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ స్టేటస్‌లతో ఇంటర్నెట్ను విపరీతంగా షేక్ చేస్తోంది. చదవండి: ఒకటి కాదు.. రెండు ప్రాణాలు కాపాడిన పోలీసాయన(VIRAL) -
టిక్‌టాక్ స్టార్ దుర్మరణం, షాక్‌లో ఫ్యాన్స్: వైరల్ వీడియో
బీజింగ్: లైవ్ స్ట్రీమ్ వీడియో షూట్ చేస్తూ చైనీస్ టిక్‌టాక్ స్టార్ జియావో క్యుమీ (23) దుర్మరణం పాలైన ఘటన షాక్‌కు గురిచేసింది. టిక్‌టాక్ వీడియో రికార్డ్ చేస్తూ 160 అడుగుల నుంచి కింద పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రొఫెషనల్ క్రేన్ ఆపరేటర్‌గా పనిచేసే జియావో ఆ క్రేన్ నుండే పలు వీడియోలు తీస్తూ ఉండేది. ఇలా అనేక వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ స్టార్‌గా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే సహోద్యోగులంతా ఇంటికి వెళ్లి పోయిన తరువాత క్రేన్ క్యాబిన్లో కూర్చుని వీడియో తీసుకోవడానికి ప్రయత్నించింది జియావో. కానీ ఇంతలోనే అదుపు తప్పి కింద పడిపోయింది. ఫోన్ చేతిలో పట్టుకుని కింద పడిపోతున్న దృశ్యాలు వీడియోలో అస్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. టిక్‌టాక్ చైనీస్ వెర్షన్ డౌయిన్ ప్లాట్‌ఫాంలో లక్షమంది మందికి పైగా ఫాలోవర్లో జియావో క్యుమీ చైనాలో అత్యంత ప్రజాదరణ పొందారు. ఇద్దరు బిడ్డల తల్లి అయిన ఈమె డ్యాన్స్ వీడియోలు కూడా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాయి. దీంతో జియావో ఆకస్మిక మరణం అభిమానులను తీవ్ర విషాదంలోకి ముంచింది. కాగా ఇటీవల హాంగ్‌కాంగ్‌కు చెందిన డేర్‌డెవిల్ ఇన్ఫ్లూయెన్సర్ సోఫియా చుంగ్ జలపాతం సమీపంలో ఇన్స్టాగ్రామ్ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే. -
వైరల్: మొసలిపై కొంగ సవారీ .. నోరెళ్లబెట్టిన నెటిజన్లు
మొసలిని చూస్తే ఎవరైనా భయపడతారు. ఇక అదే మొసలి నీటిలో ఉంటే.. దానికి వెయ్యి ఏనుగుల బలం ఉన్నట్లేనని ప్రతీ ఒక్కరికీ తెలిసిన విషయమే. ఆ ప్రాంతంలో ఏ జంతువు అయినా దానికి ఆహారం కావాల్సిందే. అంతెందుకు ఆకారంలో పెద్దగా ఉండే ఏనుగు కూడా నీళ్లలో మొసలికి చిక్కితే దాని పరిస్థితి దబిడిదిబిడే మరి. కానీ నాకివన్నీ తెలియదు భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నాది అన్నట్లు ప్రవర్తించింది ఓ కొంగ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. ఓ కొంగ మొసలిని చూసి భయపడటం కాదు కదా ఏకంగా దాని మీద ఎక్కి మరీ సవారీ చేసింది. అంతేనా, ఆ కొంగ ఎంచక్కా రైడ్ చేస్తున్నట్లు ఫోజులిస్తూ మనకు కనిపిస్తుంది. ఇంతలో అనుకోకుండా అక్కడికి మరో రెండు మొసళ్ళు వచ్చాయి. అవి ఈ కొంగ పని పడతాయని అనుకున్నారు ఈ వీడియో చూసిన వాళ్లంతా కానీ, ఆ మొసళ్ళు కూడా కొంగను చూసి సైలెంట్‌గా వెళ్లిపోయాయి. అలానే కొంగ నిల్చున్న మొసలి కూడా ఏమీ ఆ పక్షిని గాయపరచకుండా జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకువెళ్లడం మరో వింత. మామూలుగా అయితే ఇలాంటి సంఘటనలు జరగడం అరుదు. అందుకే ఈ వీడియో చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. కొందరు ఆ కొంగ ధైర్యాన్ని మెచ్చుకోగా, మరికొందరు ఆ మొసలి, కొంగ స్నేహితులేమో అని కామెంట్స్ పెడుతున్నారు. చదవండి: వామ్మో.. గాల్లో బంతిలా ఎగిరి కిందపడ్డ ‘సివంగి’ -
శభాష్! క్రేన్ సాయంతో వ్యక్తిని కాపాడిన పోలీసులు
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పట్టణ పరిధిలోని 3వ వార్డు రంగధాంపల్లి గ్రామంలోని పాఠశాల సమీపంలోని ఓ బావిలో ప్రమదవశాత్తు పడిన వ్యక్తిని గ్రామస్తుల సహకారంతో బయటకు తీసినట్టు సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయినట్టు శుక్రవారం ఉదయం గుర్తించిన స్థానికులు బ్లూకోట్ సిబ్బంది శ్రీనివాస్, వినోద్లకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో క్రేన్ ఉపయోగించి బావిలో పడిన వ్యక్తిని బయటకు తీశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అతని వివరాలు ఆరా తీయగా తమది సిద్దిపేట పట్టణంలోని బారాఇమాం చౌరస్తా ప్రాంతానికి చెందిన కొండపాక కనకయ్యగా తెలిపారు. పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారికి అప్పగించారు. -
నిమజ్జన ఖర్చు ఘనంగానే ఉంది..
సాక్షి, సిటీబ్యూరో: గణనాథుడి నిమజ్జన ఖర్చు ఘనంగానే ఉంది. క్రేన్ల అద్దె, కార్మికుల వేతనాలు తదితరాల కోసం జీహెచ్ఎంసీ రూ.కోట్లలోనే ఖర్చు చేస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం నగరంలోని 32 చెరువుల్లో నిమజ్జనాలు చేస్తుండగా... ఇక చిన్నాచితకా కొలనులకు లెక్కే లేదు. హుస్సేన్‌సాగర్ సహా జోన్ల పరిధిలోని 32 చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన క్రేన్లను జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం సమకూరుస్తోంది. బుధవారం నుంచి ప్రారంభమైన నిమజ్జనాలు ఈ నెల 15 వరకు కొనసాగుతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా చెరువుల్లో నిమజ్జనమయ్యే విగ్రహాల సంఖ్యకు అనుగుణంగా క్రేన్లు, సిబ్బందిని వినియోగిస్తున్నారు. నిమజ్జనం జరిగే గంటలను పరిగణనలోకి తీసుకొని అవసరమయ్యే కార్మికులను బ్యాచ్‌ల వారీగా వినియోగించనున్నట్లు... వేతనాలనూ గంటల వారీగా చెల్లించనున్నట్లు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటి ‘సాక్షి’కి తెలిపారు. క్రేన్ల దగ్గర అవసరాన్ని బట్టి నలుగురు, ఎనిమిది మంది, 12 మంది కార్మికులతో కూడిన బ్యాచ్‌లను ఏర్పాటు చేశారు. ప్రాథమిక అంచనా మేరకు క్రేన్ల అద్దె, సిబ్బంది వేతనాలకు దాదాపు రూ.8.24 కోట్లు ఖర్చు కానుండగా... ఆయా ప్రాంతాల్లోని నిమజ్జనాల పరిస్థితులు, పోలీసుల నుంచి అందుతున్న సమాచారం తదితర పరిగణనలోకి తీసుకుంటే వ్యయం రూ.9 కోట్లకు చేరే అవకాశముందని పేర్కొన్నారు. కార్మికులు ఇలా... 8 మంది బ్యాచ్‌లు – 1,300 (10,400 మంది కార్మికులు) 12 మంది బ్యాచ్‌లు – 164 (1,968 మంది కార్మికులు) నలుగురు ఉండే బ్యాచ్‌లు – 776 (3,104 మంది కార్మికులు) మొత్తం బ్యాచ్‌లు – 2,240, మొత్తం కార్మికులు – 15,472 ఖర్చు ఇలా... క్రేన్ల అద్దె ♦ 15 టన్నుల క్రేన్లకు గంటకు రూ.5,241 చొప్పున మొత్తం రూ.3,04,39,728. ♦ 30–70 టన్నుల క్రేన్లకు గంటకు రూ.6,825 చొప్పున మొత్తం రూ.2,03,11,200. ♦ మొబైల్ క్రేన్లకు గంటకు రూ.5,241 చొప్పున మొత్తం రూ.2,44,02,096. కార్మికుల వేతనాలు ♦ 8 మంది బ్యాచ్‌కు రూ.3,794 చొప్పున రూ.49,32,200 ♦ 12 మంది బ్యాచ్‌కు రూ.5,664.50 చొప్పున రూ.9,28,978 ♦ నలుగురి బ్యాచ్‌కు రూ.1,897 చొప్పున రూ.14,72,072 ♦ మొత్తం ఖర్చు రూ.8,24,86,274 ఏ క్రేన్లు ఎన్ని? 15 టన్నుల క్రేన్లు – 52 30–70 టన్నుల క్రేన్లు – 41 మొబైల్ క్రేన్లు – 164 మొత్తం క్రేన్లు – 257 మొత్తం పని గంటలు – 13,440 -
పోర్టులో మరో ప్రమాదం
సాక్షి, పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): ఇటీవల ఔటర్ హార్బర్లో హెచ్‌పీసీఎల్‌కు చెందిన నిర్వహణ టగ్‌లో జరిగిన భారీ ప్రమాదాన్ని మరిచిపోకముందే సోమవారం విశాఖ పోర్టు డబ్ల్యూక్యూ–1 బెర్త్‌పై నిలిపి ఉంచిన మొబైల్ క్రేన్ (ఎంఈఎల్ లీబెర్ 400) హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో క్రేన్ క్యాబిన్ పూర్తిగా దగ్ధం అయింది. పీపీపీ పద్ధతిలో పోర్టులో పనులు నిర్వహిస్తున్న సీ పోల్ కంపెనీకి చెందిన హార్బర్ మొబైల్ క్రేన్ (హెచ్ఎంసీ) ఇన్నర్ హార్బర్లోని డబ్ల్యూక్యూ–1 బెర్త్ మీద నిలిపి ఉంచిన ఎం.వి.ఎస్ ఫాల్కన్ నౌకలోకి ఇనుప ఖనిజాన్ని లోడ్ చేస్తోంది. కాగా సాయంత్రం 5.30 గంటల సమయంలో క్రేన్ ఇంజిన్ రూము(క్యాబిన్) లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. పరిస్థితిని గమనించిన డ్రైవరు వేగంగా స్పందించి క్రేన్‌ను నౌకకు దూరంగా తీసుకువెళ్లి నిలిపేసి.. తాను కిందికి దూకేశాడు. ఇంజిన్ రూములో షార్ట్ సస్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు పోర్టు అధికారులు పేర్కొన్నారు. పోర్టు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దాదాపు గంటసేపు శ్రమించి మంటలను ఆదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదంలో క్రేన్ ఇంజిన్ రూమ్ పూర్తిగా కాలిపోయింది. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. అయితే నష్టం భారీ స్థాయిలోనే ఉంటుందని తెలిసింది. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, అగ్ని ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం అంచనా వేస్తున్నామని, ప్రాణనష్టం, వ్యక్తులు గాయాలపాలవ్వడం వంటి సంఘటనలు జరగలేదని పోర్టు యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. మంటలను అదుపుచేసిన తరువాత డబ్ల్యూక్యూ–1 బెర్త్‌మీద కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే పోర్టులో కొద్దిరోజుల తేడాలోనే రెండు భారీ ప్రమాదాలు సంభవించడం చర్చనీయాంశంగా మారింది. -
జాలరికి చిక్కిన భారీ చేప
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని రత్నగిరిలో చేపల వేటకు వెళ్లిన జాలరిని అదృష్టం వరించింది. జాలరి వలకు ఏకంగా 2400 కిలోల బరువు కలిగిన నాలుగు చేపలు చిక్కాయి. చేపలను బయటికి లాగేందుకు క్రేన్‌ను తెప్పించారంటే వాటి బరువు ఏపాటిదో తెలుస్తోంది. సాధారణంగా ఇక్కడి జలాల్లో లభ్యమయ్యే వాఘిల్ చేప బరువు 50 నుంచి 60 కిలోల మధ్య ఉంటుండగా, తాజాగా వలకు చిక్కిన చేప ఒక్కోటి 500 కిలోల బరువుంది. ఈ వార్త స్ధానికుల ద్వారా వ్యాపించడంతో సమీప ప్రాంతాల నుంచి భారీ చేపలను చూసేందుకు జనం పెద్దసంఖ్యలో గుమికూడారు. ఒక్కో చేప ఖరీదు రూ 15,000 నుంచి రూ 20,000 వరకూ ఉంటుందని చెబుతున్నారు. -
వైరల్ ఫోటో ; మండిపడుతోన్న నెటిజన్లు
ఇస్లామాబాద్ : గత కొన్నిరోజులుగా సోషల్‌మీడియాలో ఒక ఫోటో తెగ వైరలవుతోంది. ఆ ఫోటో చూసిన జంతు ప్రేమికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంతకు ఆ ఫోటోలో ఏం ఉంది అంటే ఒక ఎద్దును క్రేన్ సాయంతో మూడంతుస్తుల భవనం మీద నుంచి కిందకు దించుతున్నారు. ప్రమాదంలో ఉన్న దాన్ని కాపాడటం కోసం కిందకు దించుతున్నారనుకుంటే పోరపాటే. ఎందుకంటే వారు ఆ ఎద్దును త్యాగం(వధించడం) కోసం తీసుకోస్తున్నారు. అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ ఒకరు తీసిన ఈ ఫోటో గురించే ఇప్పుడు నెట్టింట్లో పెద్ద చర్చ జరుగుతోంది. వివరాల ప్రకారం మరికొద్దిరోజుల్లో ముస్లింలు పవిత్రంగా భావించే ఈద్ అల్ అధా/బక్రీద్ పండుగ సందర్భంగా కరాచీకి చెందిన ఒక వర్తకుడు తన ఎద్దును స్థానిక పశువుల సంతలో అమ్మాలనుకున్నాడు. అందుకోసం తన మూడంతుస్తుల బిల్డింగ్ మేడ మీద ఉన్న ఎద్దును క్రేన్ సాయంతో కిందకు దించుతున్నాడు. అందులో భాగంగా ఎద్దును తాళ్లతో బంధించాడు. దాని మూతిని కూడా తాడుతో కట్టి క్రేన్‌తో కిందకు దించాడు. అంతేకాక దాని కొమ్ములకు పాకిస్తాన్ జెండాలను కట్టాడు. ఈ ఫోటో చూసిన జంతు ప్రేమికులు.. ‘క్రూరమైన చర్య’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ‘నువ్వు శాఖాహారివి కాబట్టే జంతు సంరక్షణ అంటూ మాట్లాడుతున్నావు. అయితే నీ మాటలను ఎవరూ పట్టించుకోరు. జీవహింస అంటూ కూర్చుంటే ఇంత రుచికరమైన మాంసం ముక్కలు ఎక్కడి నుంచి వస్తాయి’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈద్ అల్ అధా/ బక్రీద్‌ను ముస్లింలు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. ఈ రోజే ఇబ్రహీం ప్రవక్త తన కుమారిన్ని బలి ఇవ్వడానికి సిద్దపడ్డారు. అందుకు గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ రోజున బక్రీద్ పండుగను జరుపుకుంటారు. మన దేశంలో ఈ నెల 22న బక్రీద్‌ను జరుపుకోనున్నారు. -
బ్యాడ్ టైంలో..గుడ్ టైం అంటే ఇదే
బీజింగ్: కన్నుమూసి తెరిచేలోపు అనూహ్యంగా ఓ డ్రైవర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అద్భుతానికే ఆశ్చర్యం వేసేలా ఉన్న ఈ మిరాకిల్ వీడియో ఇపుడు నెట్లో వైరల్ గా మారింది. డెయిలీ మెయిల్ రిపోర్ట్ ప్రకారం చైనాలో ఝుజాయ్ ప్రావిన్స్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఖరీదైన ఆడి కారుపై సడెన్‌గా ఓ భారీ క్రేన్ వచ్చి పడింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. అయితే డ్రైవర్(29) మాత్రం స్వల్ప గాయాలతో బయటకు రావడం వీడియోలో చూడొచ్చు. ఏం జరిగిందో తెలియక బిక్కుబిక్కుమంటూ పగిలిపోయిన అద్దం నుంచి డ్రైవర్ బయటకు రావడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. డ్రైవర్ కాలి మడమ విరగడంతో అతన్ని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అకస్మాత్తుగా ఘటన జరగడంతో అసలు ఏం జరిగిందో అర్థం కాలేదంటూ డ్రైవర్ బేల ముఖం పెట్టాడు. మరోవైపుఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. -
చెట్టును నాటారు..!
చెట్టును నాటడమేమిటనుకుంటున్నారా.. ఇది నిజమే నండి. నందికొట్కూరు మండలం 10 బొల్లవరం గ్రామంలో పంచాయతీ కార్యాలయం నిర్మించేందుకు స్థలాన్ని ఎంపిక చేశారు. ఆ స్థలంలో జీగు వృక్షం (పాలకొమ్మ చెట్టు) ఉంది. దానిని నరికి వేయకుండా రూ. 10 వేలు ఖర్చు పెట్టి క్రేన్ ద్వారా కుంటకు అందుబాటులో నాటించారు. జీగు చెట్టు కొమ్మ లేనిది హిందువులు పెళ్లిళ్లు చేసుకోరు. చెట్టును రక్షించిన సర్పంచు అనురాధ గ్రామ ప్రజలు అభినందించారు. - నందికొట్కూరు -
చెరకు మద్దతు ధర రూ.2,650
కేసీపీ సీవోవో జీ వెంకటేశ్వరరావు ఉయ్యూరు : చెరకు 2016–2017 సీజన్‌కు టన్ను మద్దతు ధర రూ.2650 కేసీపీ యాజమాన్యం ప్రకటించింది. 2017–18 సీజన్‌కు సంబంధించి రాయితీలను పెంచింది. స్థానిక కర్మాగార కాన్ఫరెన్స్ హాల్లో సీవోవో జీ వెంకటేశ్వరరావు, జీఎం (కేన్) వీవీ పున్నారావు మద్దతు ధర, ప్రోత్సాహకాలపై చెరకు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు, కర్మాగార వ్యవసాయ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించి యాజమాన్య నిర్ణయాలను శనివారం వెల్లడించారు. సీవోవో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ చక్కెర కర్మాగారం మద్ధతు ప్రకటించలేదన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తామే తొలిసారిగా టన్ను మద్ధతు ధర రూ.2,650 (రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే రూ.60లు పర్చేజ్ ట్యాక్స్‌తో కలుపుకుని) చెల్లించేందుకు నిర్ణయించామన్నారు. పంచదారకు మంచి ధర ఉంటే టన్నుకు మరో రూ.50లు పెంచే అవకాశం ఉందని చెప్పారు. తొలుత చెరకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఎస్వీ కృష్ణారావు, ప్రతినిధులు మోటూరి వెంకటేశ్వరరావు, చెన్నుపాటి పూర్ణచంద్రరావు, వింతా శ్రీనివాసరెడ్డి, చాగంటి తిమ్మారెడ్డి, వంగా లింగారెడ్డి, ఎలికారెడ్డి కోటిరెడ్డిలతో నిర్వహించిన సమావేశంలో మద్దతు ధర రూ.2800 ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాయితీలు ప్రకటన..! రాయితీలపై సీవోవో జీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత సీజన్లో మొక్కతోటకు రూ.10 వేలు రాయితీగా ఇస్తే వచ్చే సీజన్‌కు సబ్సిడీని ఎకరాకు రూ.15 వేలుకు పెంచడం జరిగిందన్నారు. -
క్రేన్ కూలి వినాయక విగ్రహం ధ్వంసం
బంజారాహిల్స్: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. విగ్రహాన్ని క్రేన్ సహాయంతో లారీలోకి చేర్చే క్రమంలో విగ్రహం కుప్పకూలింది. బంజారాహిల్స్‌లో ఈ ఘటన జరిగింది. రోడ్ నెం. 14లోని వెంకటేశ్వరనగర్‌లో బంజారా యూత్ అసోసియేషన్ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణలోని మండపంలో 18 అడుగుల ఎత్తున్న వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గురువారం మధ్యాహం ఒంటి గంట ప్రాంతంలో భారీ క్రేన్ సహాయంతో వినాయకుడిని ఆలయ ముఖద్వారం పై నుంచి రోడ్డుపై ఉన్న లారీలోకి చేర్చుస్తుండగా క్రేన్ హుక్కు ఊడిపోయింది. దీంతో క్రేన్ ఒక వైపునకు ఒరిగిపోవడంతో ఆలయ ముఖద్వారం పై నుంచే విగ్రహం కిందపడి కుప్పకూలింది. లారీలోకి విగ్రహాని ఎక్కించే దృశ్యాన్ని తిలకించేందుకు వందలాది మంది అక్కడికి వచ్చారు. అయితే.. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి అపాయం జరగలేదు. సరిగ్గా విగ్రహం కూలిన చోటే ఓ బాలుడు నిలబడి.. గణేశుడ్ని క్రేన్లోకి ఎక్కించే దృశ్యాన్ని చూస్తున్నాడు. విగ్రహం పడిపోతున్న విషయం గమనించిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ ఆ బాలుడిని క్షణాల్లో అక్కడి నుంచి పక్కకు లాగడంతో పెనుప్రమాదం తప్పింది. క్రేన్ సామర్థ్యం తక్కువగా ఉండటం, విగ్రహం ఎత్తు, బరువు ఎక్కువగా ఉండటం ఈ ఘటనకు కారణంగా పోలీసులు నిర్ధారించారు. మరో క్రేన్‌ను తెప్పించి, రెండు గంటల అనంతరం కిందపడ్డ విగ్రహాన్ని సరి చేసి లారీలోకి ఎక్కించి ట్యాంక్‌బండ్‌కు ఊరేగింపుగా తీసుకెళ్లారు. కాగా, ఘటనాస్థలంలో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో ఏడీఈ గోపాలకృష్ణ వచ్చి సరఫరాను నిలిపివేసి మరమ్మతు పనులు చేపట్టారు. ఘటనా స్థలాన్ని బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సందర్శించారు. -
బేగంపేటలో కూలిన విమానం
క్రేన్ ఒరిగి కింద పడటంతో రెండు ముక్కలు... ఓ భవనం నేలమట్టం విమాన తరలింపు క్రమంలో బేగంపేట ఎయిర్‌పోర్టులో ఘటన ఇరవై టన్నుల భారీకాయం... నూట డెబ్భైమంది సామర్థ్యం... వినువీధిలో వేల కిలోమీటర్లు దూసుకుపోయే విహంగాన్ని భువిపై ఒక్క అడుగు కదిపించలేకపోయారు. ఆరు భారీ క్రేన్లు... వాటికి అండగా ఆరు ప్రొక్లైనర్లు... వీటన్నింటినీ నడిపించి కార్యం చక్కబెట్టడానికి వందల సంఖ్యలో సిబ్బంది, నిపుణులు, అధికారులు. అంతా కలసి రెండే రెండు కిలోమీటర్లు రోడ్డు మార్గం గుండా తరలించడానికి డెబ్భైరెండు గంటలుగా చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. వేల మీటర్ల ఎత్తుకెగరగల ఎయిర్‌బస్‌ను క్రేన్‌తో పట్టుమని పదడుగులు కూడా లేపలేక ఎత్తినచోటే కుదేశారు. ఫలితంగా మూడు రోజుల శ్రమ మూడే నిమిషాల్లో నీరుగారిపోయింది. క్రేన్ తీగ తెగి కింద పడ్డ ‘ఎయిర్ ఇండియా 320 ఎయిర్‌బస్’ చూస్తుండగానే రెండు ముక్కలైంది. బేగంపేట విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. భారీ ఆస్తినష్టం జరిగినా అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. - హైదరాబాద్ ఎక్కడ.. ఎందుకు? ఎయిర్ ఇండియాకు చెందిన భారీ ఎయిర్‌బస్ 320 బేగంపేట విమానాశ్రయంలో మూడేళ్లుగా నిరుపయోగంగా ఉంది. దీని పొడవు 111 అడుగులు. బరువు 20 టన్నులు. దీన్ని విమానాశ్రయం సమీపంలోని ఎయిర్ ఇండియాకు చెందిన ‘సెంట్రల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’ (సీటీఐ)కి తరలించాలని అధికారులు నిర్ణయించారు. బోయిన్పల్లి ఓల్డ్ ఎయిర్‌పోర్టు రోడ్డు గుండా బాలానగర్ వెళ్లే మార్గంలో ఉన్న సీటీఐలో ఎయిర్ ఇండియా స్టాఫ్‌కు శిక్షణ ఇచ్చేందుకు విమానాన్ని ఉపయోగించుకోవాలన్నది లక్ష్యం. మూడు రోజుల కసరత్తు... విమానాన్ని తరలించేందుకు సీటీఐ అధికారులు మూడు రోజులు కసరత్తు చేశారు. తొలుత విమానంలోని సీట్లు, కాక్‌పిట్‌లోని ఇంజిన్లను తొలగించారు. ఖాళీ బాడీని భారీ క్రేన్ ద్వారా సీటీఐకి తీసుకువెళ్లాలనుకున్నారు. విద్యుత్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసుల అనుమతులు తీసుకుని వారిని అప్రమత్తం చేశారు. ఎయిర్‌పోర్డు ప్రహరీతో పాటు ఓల్డ్ ఎయిర్‌పోర్టు రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్, కేబుల్స్‌ను యుద్ధప్రాతిపదికన తొలగించారు. భారీ ఏర్పాట్లు... జాగ్రత్తలు ఎయిర్‌బస్‌ను తీసుకెళ్లే భారీ క్రేన్‌తో పాటు మరో ఐదు క్రేన్లు అదనంగా తెప్పించారు. రోడ్డుకు అడ్డంగా ఉండే బండరాళ్లు, చెట్లు తొలగించేందుకు ఆరు ప్రొక్లైనర్లు రప్పించారు. ప్రమాదాలు సంభవిస్తే వెంటనే స్పందించేలా రెండు అంబులెన్సులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది కలపి దాదాపు 300 మంది ఇదే పనిలో తలమునకలయ్యారు. శనివారం రాత్రి 11.30 గంటల నుంచే ఓల్డ్ఎయిర్పోర్టు గుండా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కిలోమీటర్ దూరం వరకు పాదచారులను సైతం అనుమతించలేదు. తెల్లవారుజాము 3.30 గంటలు... ఎయిర్‌లైన్స్ నిపుణుల నేతృత్వంలో ఆదివారం తెల్లవారు జాము 3.30 గంటల ప్రాంతంలో భారీ క్రేన్ ఎయిర్‌బస్‌ను పైకి లేపింది. దాన్ని క్రేన్బేస్పై అమర్చేందుకు మూడు గంటలుగా అంతా శ్రమిస్తున్నారు. ఉదయం 6.30... అంతా సిద్ధం.. మరో పది నిమిషాల్లో క్రేన్ బయలుదేరుతుందని ట్రాఫిక్ పోలీసులకు సమాచారం. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు, పాదచారుల రాకపోకల్ని పోలీసులు నియంత్రిస్తున్నారు. అంతలోనే అవాంతరం. ఆకాశంలోకి ఎత్తిన విమానాన్ని బేస్‌పై కూర్చోబెట్టే క్రమంలో తీగ తెగి క్రేన్ కుడివైపునకు ఒరిగింది. అధికారులు అప్రమత్తమయ్యే లోపే క్షణాల్లో విమానం రహదారి పక్కనే ఉన్న ఓ భవనంపై పడి రెండు ముక్కలుగా విడిపోయింది. భవనం నేలమట్టమైంది. ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అంచనా. కట్టుదిట్టంగా తీసుకున్న జాగ్రత్తల ఫలితంగా ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం తరలింపు బాధ్యతలను దుర్గా క్రేన్స్ సంస్థ తీసుకుంది. వారి తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంత భారీ విమానాన్ని క్రేన్ ద్వారా తరలించడం సరైంది కాదని నిపుణులు అంటున్నారు. 3 రోజుల్లో తొలగింపు విరిగిపోయిన విమాన శకలాలను మూడు రోజుల్లో తొలగిస్తాం. అప్పటి వరకు ఈ మార్గంలో రాకపోకలపై ఆంక్షలుంటాయి. ఈ విమానం మూడేళ్లుగా సర్వీసులో లేదు. మా ఇన్స్టిట్యూట్లో డోర్ మెయింటెనెన్స్, కాక్‌పిట్ మెయింటెనెన్స్, అత్యవసర సమయాల్లో ప్రయాణికుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో శిక్షణలు ఇచ్చేందుకు మాత్రమే ఎయిర్‌బస్ బాడీని తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. - కెప్టెన్ సోమన్ అతులా , సీటీఐ మరిన్ని ఫోటోలకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఆ విమానాన్ని ఐదు ముక్కలు చేసి...
సికింద్రాబాద్: బేగంపేట విమానాశ్రయం సమీపంలో కూలిపోయిన విమానాన్ని తరలించే చర్యలకు ఆటంకం ఏర్పడింది. భారీ క్రేన్, ఓ చిన్న క్రేన్ సాయంతో ఏడు గంటల పాటు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ప్రయత్నాలను నిలిపివేశారు. ఐదు భాగాలుగా విడగొట్టి ఫిరోజ్‌గూడ గోదాముకు తరలించాలని అధికారులు ప్రణాళిక రచించారు. కాగా, క్రేన్ నుంచి కిందపడిపోయి విరిగిపోయిన విమానం శకలాలను మూడురోజుల్లో తోలగిస్తామని ఎయిర్ ఇండియా సెంట్రల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన కెప్టెన్ సోమన్ అతులా తెలిపారు. కూలిన విమానం మూడేళ్లుగా సర్వీసులో లేని విమానంగా చెప్పారు. తమ ఇనిస్టిట్యూట్‌లో డోర్ మెయింటనెన్స్, కాక్‌పిట్ మెయింటనెన్స్, అత్యవసర సమయాల్లో ప్రయాణికుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో శిక్షణలు ఇచ్చేందుకు మాత్రమే ఎయిర్‌బస్ బాడీని తీసుకెళ్లే ప్రయత్నం చేశామన్నారు. విమాన శకలాలను తరలించే వరకు ఓల్డ్ ఎయిర్‌పోర్టు రహదారిపై వాహనాలు, వ్యక్తుల రాకపోకల పట్ల ఆంక్షలు విధిస్తున్నట్టు చెప్పారు. విమానం తరలింపునకు మూడు రోజులుగా కసరత్తు బేగంపేట విమానాశ్రయంలో ఎయిర్ఇండియాకు చెందిన 320 ఎయిర్‌బస్ అనే భారీ విమానం మూడేళ్లుగా నిరుపయోగంగా ఉంది. ఈ విమానాన్ని బోయిన్పల్లి ఒల్డ్ ఎయిర్‌పోర్టు రోడ్డు నుంచి బాలానగర్ వెళ్లేదారిలోని బేగంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సమీపంలో ఉన్న ఎయిర్ ఇండియా సెంట్రల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (సీటీఐ)కు తీసుకువెళ్లేందుకు ఆదివారం చేసిన ప్రయత్నంలో ప్రమాదం జరిగింది. విమానం గోడపై కూలిపోయింది. ఎందుకోసం.... ఇక్కడి సెంట్రల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణలో ఉన్న ఎయిర్ ఇండియా సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కోసం ఈ విమానాన్ని తీసుకెళ్లాలనుకున్నారు. విమానంలోని సీట్లను, కాక్‌పిట్‌లోని ఇంజిన్లను విడదీశారు. ఖాళీగా ఉన్న బాడీని భారీ క్రేన్ ద్వారా సీటీఐకి తీసుకువెళ్లాలనుకున్నారు. ఇందుకు సీటీఐ అధికారులు మూడు రోజుల పాటు కసరత్తు చేశారు. విద్యుత్, ట్రాఫిక్ పోలీసుల అనుమతులు తీసుకుని వారిని అప్రమత్తం చేశారు. ఎయిర్‌పోర్టు ప్రహరీగోడను తొలగించారు. ఓల్డ్ఎయిర్పోర్టు రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్, కేబుల్, నెట్ వైర్లను యుద్దప్రాతిపదికన తొలగించారు. ముందు జాగ్రత్తగా విమాన తరలింపు జరుగుతున్న స్థలానికి కిలోమీటర్ దూరం వరకు పాదచారులను సైతం అనుమతించలేదు. ఈ జాగ్రత్తల ఫలితంగానే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. -
బేగంపేటలో విమానం కూలిందిలా..
హైదరాబాద్: బేగంపేట విమనాశ్రయం నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన కండీషన్లో లేని విమానాన్ని ఎయిరిండియా సెంట్రల్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు ఆదివారం తెల్లవారుజామున తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ఎక్కువ బరువున్న విమానాన్ని తరలించడానికి ఒకే క్రేన్‌ను ఉపయోగించారు. దీంతో విమాన బరువుకు క్రేన్ కుంగిపోయింది. విమానం అక్కడున్న గోడ మీద పడగా క్రేన్ విమానం మీద పడిపోయింది. అయితే రోడ్డు పక్కనే విమానం కనబడటంతో కొందరు ఎంతో ఆసక్తితో దాన్ని వీడియో తీశారు. సరిగ్గా అదే సమయంలో క్రేన్ కుంగి విమానం కూలిపోవడం వీడియోలో రికార్డయింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతానికి సమీపంలో ఎవరు లేకపోవడంతో.. పెను ప్రమాదం తప్పింది.