![Crane Near Delhi Airport Caused Delay And Deviated Landing Of Flights - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/6/flight.jpg.webp?itok=Yo-FYxWJ)
న్యూఢిల్లీ: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు విధినిర్వహణలో భాగంగా చేసిన ఓ పని వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను రిస్క్‌లో పడేసింది. రోడ్డు నిర్మాణం కోసం ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని 11ఆర్ రన్‌వే సమీపంలో ఉంచిన ఒక పొడవాటి క్రెయిన్ కారణంగా విమానాలకు ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్(ఐఎల్‌ఎస్) సిగ్నల్ అందలేదు. ఎయిర్‌పోర్టు వద్ద దట్టంగా పొగమంచు ఏర్పడినపుడు విమానాలకు విజిబిలిటీ పూర్తిగా తగ్గుతుంది. ఇలాంటి సందర్భాల్లో వాటి సేఫ్ ల్యాండింగ్‌కు ఐఎల్‌ఎస్ సిగ్నల్ నావిగేషన్ ఉపయోగపడుతుంది.
ఈ విషయం వారం తర్వాత అధికారుల దృష్టికి రావడంతో వారు కంగారుపడ్డారు. క్రేన్ కారణంగా సిగ్నల్ సరిగా అందకపోవడంతో 100 దాకా విమానాలు గత వారం ఆలస్యంగా ల్యాండ్ అవడమే కాకుండా కొన్ని విమానాలను ఏకంగా మళ్లించే పరిస్థితి ఏర్పడిందని అధికారులు నిర్ధారించారు. ‘ఐఎల్‌ఎస్ సిగ్నల్‌లో అంతరాయం వల్ల కొన్ని విమానాలు రన్‌వే సెంటర్ లైన్ నుంచి 10 నుంచి 20 ఫీట్ల దూరం పక్కకు ల్యాండ్ అయ్యాయి’అని ఎయిర్‌పోర్టు అధికారి ఒకరు తెలిపారు.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్‌పోర్టు అధికారులు విమానాల ల్యాండింగ్‌కు అనుమతించకుండా ఉండాల్సిందని నిపుణులు అంటున్నారు. ఢిల్లీ-జైపూర్ నేషనల్ హైవేకు అనుసంధానించే అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్డును ఢిల్లీ ఎయిర్‌పోర్టు పక్కనే నేషనల్ హైవే అథారిటీ నిర్మిస్తోంది. ఈ నిర్మాణంలో భాగంగానే ఎన్‌హెచ్‌ఏఐ భారీ క్రేన్‌ను వినియోగించింది.
Comments
Please login to add a commentAdd a comment