Delhi airpoirt
-
Air India: 20 గంటలు ఆలస్యం.. కేంద్ర మంత్రిత్వశాఖ నోటీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానం గంటల తరబడి ఆలస్యం కావడంపై కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన విమానం దాదాపు 20 గంటలు ఆలస్యంగా కారణంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి విమానంలోనే కూర్చోవాల్సి రావడం, ఏసీ కూడా పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు కొందరైతే స్పృహతప్పి పడిపోయారు. కొన్ని అనివార్య కారణాల వల్ల విమానం ఆలస్యమైందని, ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. అయితే అసలే 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఢిల్లీలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యట్లు ఎందుకు చేపట్టలేదో వివరణ ఇవ్వాలని కేంద్రమంత్రిత్వశాఖ విమానయాన సంస్థను కోరింది.కాగాఎయిరిండియా కు చెందిన బోయింగ్ 777 విమానం 200 మంది ప్రయాణికులతో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు దిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బయల్దేరాలి.. కానీ దాదాపు ఆరు గంటలు ఆలస్యమైంది. రాత్రి 8 గంటలకు రీ షెడ్యూల్ చేశారు. సాంకేతిక సమస్యలతో విమానం మార్చారు. దీంతో ప్రయాణికులు రాత్రి 7.20 గంటలకు మరో విమానంలో బోర్డింగ్ అయ్యారు. అనంతరం విమానం మళ్లీ ఆలస్యమని ప్రకటన చేశారు.అయితే అప్పటికే ప్రయాణికుల బోర్డింగ్ పూర్తవ్వగా వారిని బయటకు వెళ్లేందుకు సిబ్బంది అనుమతించలేదు.న్ని గంటల పాటు వారు విమానంలోనే కూర్చోవాల్సి వచ్చింది. దీనికితోడు ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. తిరిగి విమానాశ్రయానికి వెళ్లేందుకు గేట్లు కూడా తెరవకపోవడంతో ప్రయాణికులు దాదాపు గంటపాటు ఏరోబ్రిడ్జిలో వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో వృద్ధులు, పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. -
Delhi Airport: రన్‌వే వద్ద భారీ క్రేన్.. ప్రమాదంలో పడ్డ విమానాలు
న్యూఢిల్లీ: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) అధికారులు విధినిర్వహణలో భాగంగా చేసిన ఓ పని వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను రిస్క్‌లో పడేసింది. రోడ్డు నిర్మాణం కోసం ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని 11ఆర్ రన్‌వే సమీపంలో ఉంచిన ఒక పొడవాటి క్రెయిన్ కారణంగా విమానాలకు ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్(ఐఎల్ఎస్) సిగ్నల్ అందలేదు. ఎయిర్‌పోర్టు వద్ద దట్టంగా పొగమంచు ఏర్పడినపుడు విమానాలకు విజిబిలిటీ పూర్తిగా తగ్గుతుంది. ఇలాంటి సందర్భాల్లో వాటి సేఫ్ ల్యాండింగ్‌కు ఐఎల్ఎస్ సిగ్నల్ నావిగేషన్ ఉపయోగపడుతుంది. ఈ విషయం వారం తర్వాత అధికారుల దృష్టికి రావడంతో వారు కంగారుపడ్డారు. క్రేన్ కారణంగా సిగ్నల్ సరిగా అందకపోవడంతో 100 దాకా విమానాలు గత వారం ఆలస్యంగా ల్యాండ్ అవడమే కాకుండా కొన్ని విమానాలను ఏకంగా మళ్లించే పరిస్థితి ఏర్పడిందని అధికారులు నిర్ధారించారు. ‘ఐఎల్ఎస్ సిగ్నల్‌లో అంతరాయం వల్ల కొన్ని విమానాలు రన్‌వే సెంటర్ లైన్ నుంచి 10 నుంచి 20 ఫీట్ల దూరం పక్కకు ల్యాండ్ అయ్యాయి’అని ఎయిర్‌పోర్టు అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్‌పోర్టు అధికారులు విమానాల ల్యాండింగ్‌కు అనుమతించకుండా ఉండాల్సిందని నిపుణులు అంటున్నారు. ఢిల్లీ-జైపూర్ నేషనల్ హైవేకు అనుసంధానించే అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్డును ఢిల్లీ ఎయిర్‌పోర్టు పక్కనే నేషనల్ హైవే అథారిటీ నిర్మిస్తోంది. ఈ నిర్మాణంలో భాగంగానే ఎన్హెచ్ఏఐ భారీ క్రేన్‌ను వినియోగించింది. ఇదీచదవండి..సూరీడు కనిపించి ఏడు రోజులైంది -
కస్టమ్స్ ఆఫీసర్లమని చెప్పి 4 లక్షలు దోపిడీ
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా నుండి భారత్ వచ్చిన 53 ఏళ్ల మహమ్మద్ సులేమాన్ ను కస్టమ్స్ ఆఫీసర్లమని చెప్పి ఇద్దరు ఆగంతకులు అతను కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తాన్ని దోచుకుని నడిరోడ్డుపై వదిలేశారు. దిక్కుతోచని స్థితిలో సులేమాన్ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ ప్రకారం.. రాజస్థాన్‌లోని అజ్మీర్ కు చెందిన మొహమ్మద్ సులేమాన్ సౌదీ అరేబియాలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ సంపాదించుకునే సామాన్యుడు. చాలాకాలం తర్వాత భారత్ వచ్చిన సులేమాన్ కు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అడుగు పెడుతూనే ఇద్దరు వ్యక్తులు బురిడీ కొట్టించారు. తమను తాము కస్టమ్స్ అధికారులుగా పరిచయం చేసుకున్న ఆ ఇద్దరూ అక్కడి నుండి అతడిని నేరుగా పార్కింగ్ ఏరియాకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే సులేమాన్ నుండి పాస్ పోర్టు సహా అన్ని వస్తువులను లాక్కున్నారు దుండగులు. అక్కడి నుండి కారులో మహిపాల్ పూర్ వైపుగా తీసుకెళ్లి మార్గమధ్యలో ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఆపి.. ఈ ఫోన్ ఎక్కడిది? ఈ కరెన్సీ నీకెలా వచ్చిందని ప్రశ్నించి సులేమాన్ ఫోన్ తోపాటు అతని వద్దనున్న 19000 సౌదీ రియాద్లు(4.15 లక్షలు), రూ.2000 నగదును దోచుకున్నారు. నిలువుదోపిడీ పూర్తయిన తర్వాత దుండగులు సులేమాన్ ను కార్లో తీసుకెళ్లి జనసంచారం లేనిచోట దింపేసి ఉన్నతాధికారులతో తిరిగి వస్తామని చెప్పి వెళ్లిపోయారు. అప్పటికి గాని జరిగిందేంటో అర్ధం కాని సులేమాన్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇది కూడా చదవండి: దేశంలో ఏం జరుగుతోందో తెలియాలంటే మణిపూర్ వెళ్లి చూడండి.. -
సిబ్బందితో ప్యాసింజర్ గొడవ.. విమానం గాల్లో ఉండగానే వెనక్కి..
న్యూఢిల్లీ: సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు రచ్చ రచ్చ చేశాడు. ఫ్లయిట్ గాల్లో ఉండగా సిబ్బందితో గొడవకు దిగాడు. వాళ్లతో ఫైట్ చేశాడు. దీంతో వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించాడు పైలట్. తిరిగి ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. అనంతరం సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి ప్రయాణానికి అంతరాయం కల్గించిన ప్యాసింజర్‌ను కిందకు దింపేశారు. అతనిపై ఫిర్యాదు చేసి విమానాశ్రయంలోని పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత విమానం మళ్లీ లండన్ బయల్దేరి వెళ్లింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ ఇండియా నిర్వాహకులు అధికారకంగా స్పందించాల్సి ఉంది. ప్యాసింజర్ సిబ్బందితో ఎందుకు గొడవపడ్డాడనే విషయం తెలియాల్సి ఉంది. కాగా.. ఇటీవలి కాలంలో కొందరు ప్రయాణికులు విమానాల్లో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఓ ప్యాసింజర్ తప్పతాగి తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో ఘటనలో ఓ ప్యాసింజర్ విమానంలో స్మోకింగ్ చేసి హల్ చల్ చేశాడు. మరో ఘటనలో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు తోటి ప్యాసింజర్లతో గొడవకు దిగి నానా హంగామా చేశాడు. చదవండి: Corona Virus: జాగ్రత్త! కేసులే కాదు.. మరణాలూ పెరుగుతున్నాయ్.. -
Pawan Khera: విమానం నుంచి దించేసి మరీ అరెస్ట్!
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఇవాళ పెద్ద పొలిటికల్ హైడ్రామా నడిచింది. కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా అరెస్ట్ వ్యవహారం జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. గురువారం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి రాయ్‌పూర్(ఛత్తీస్‌గఢ్) బయల్దేరిన ఆయన్ని.. సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు అసోం పోలీసులు. విమానం నుంచి దించేసి మరీ.. రెండు గంటల పాటు ఆగి మరీ అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌ను ఖండిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్ పార్టీ. పవన్ ఖేరా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి. రాయ్‌పూర్‌లో జరగబోయే ఏఐసీసీ ప్లీనరీ కోసం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఇండిగో విమానంలో బయలుదేరాల్సి ఉంది. ఇంతలో సడన్ ఎంట్రీ ఇచ్చిన అసోం పోలీసులు.. ఆయన్ని విమానం నుంచి దించేశారు. ఆ సమయంలో ఆయన వెంట ఉన్న సీనియర్లు అడ్డుకునే యత్నం కూడా చేశారు. ఆపై రెండు గంటల తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ చూపించి అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ.. సుమారు 50 మందికి పైగా కాంగ్రెస్ నేతలు విమానం టేకాఫ్ కానివ్వకుండా అడ్డుకుంటూ నిరసనకు దిగారు. బోర్డింగ్ పాస్ ఉన్న అరెస్ట్ చేశారంటూ ఆందోళన చేపట్టారు. ఇక పోలీసులు తీసుకెళ్తుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. తొలుత పోలీసులు వచ్చి మీ బ్యాగేజీతో సమస్య అని చెప్పారు. కానీ, నేను ఒక హ్యాండ్ బ్యాగ్‌తో మాత్రమే బయల్దేరాను. అందుకే అనుమానం వచ్చింది. ఆపై వాళ్లు మీరు విమానంలో ప్రయాణించలేరు. డీసీపీ వచ్చి మిమ్మల్ని కలుస్తారు అంటూ చెప్పారు. చాలా సేపు ఎదురుచూసినా ఆయన రాలేదు అని ఖేరా తెలిపారు. చివరకు పోలీసులు ఆయన్ని వ్యాన్ ఎక్కించి అదుపులోకి తీసుకున్నారు. मुझे कहा गया कि आपके सामान को लेकर कुछ समस्या है, जबकि मेरे पास केवल एक हैंडबैग है। जब फ्लाइट से नीचे आया तो बताया गया कि आप नहीं जा सकते हैं। फिर कहा गया- आपसे DCP मिलेंगे। मैं काफी देर से इंतजार कर रहा हूं। नियम, कानून और कारणों का कुछ अता-पता नहीं है। : @Pawankhera जी pic.twitter.com/637WUlBDpJ — Congress (@INCIndia) February 23, 2023 ఇక ఈ పరిణామంపై కాంగ్రెస్ సీనియర్ కేసీ వేణుగోపాల్(అరెస్ట్ సమయంలో ఆయన కూడా పవన్ వెంట ఉన్నారు) ట్వీట్ చేశారు. మోదీ ప్రభుత్వం గూండా రాజ్యంగా వ్యవహరిస్తోందని, పవన్ఖేరాను బలవంతంగా నోరు మూయించే సిగ్గుమాలిన చర్యకు దిగిందని విమర్శించారాయన. అలాగే.. పార్టీ మొత్తం పవన్‌కు అండగా ఉంటుందని ప్రకటించారు. మరోవైపు ఇది సుదీర్ఘ పోరాటమని, దేనికైనా సిద్ధమంటూ పవన్ ఖేరా ప్రకటించారు. ఆ కామెంట్‌తో మొదలు.. ఇదిలా ఉంటే.. పవన్ ఖేరా తాజాగా ఓ ప్రెస్మీట్లో హిండెన్‌బర్గ్-అదానీ అంశంపై మాట్లాడారు. ఈ క్రమంలో.. పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయి జేపీసీ(జాయింట్ పార్లమెంటరీ కమిటీ)లపై అభ్యంతరం లేనప్పుడు.. నరేంద్ర గౌతమ్ దాస్.. క్షమించాలి..(పక్కనే ఉన్న ఓ నేతను అడిగి మరీ) దామోదర్‌దాస్ మోదీ ఎందుకు ఇబ్బందిగా ఫీలవుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆపై ‘పేరేమో దామోదర్‌దాస్, పని మాత్రం గౌతమ్‌దాస్(అదానీని ఉద్దేశిస్తూ..) కోసం’ అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. ప్రధాని మోదీ తండ్రి ప్రస్తావన తెచ్చి మరీ పవన్ ఖేరా చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. పవన్ ఖేరాతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా క్షమాపణలు తెలియజేయాలని బీజేపీ మండిపడుతోంది. ఈ మేరకు నిరసన ప్రదర్శనలు కూడా కొనసాగించింది. మరోవైపు ఆయనపై పలువురు బీజేపీ నేతలు ఫిర్యాదులు కూడా చేశారు. Make no mistake- pathetic remarks by courtier Pawan Khera on PM’s father have blessings of the top levels of Congress, which is full of entitlement and disdain against a person of humble origins being PM. India will not forget or forgive these horrible remarks of Congressmen. — Himanta Biswa Sarma (@himantabiswa) February 20, 2023 -
ప్రయాణికుడి మృతి.. వెనక్కి వచ్చిన విమానం
US Passenger Dies Onboard Air India Flight Returns To Delhi : ఢిల్లీ నుంచి అమెరికా వెళ్తున్న విమానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి నేవార్క్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. విమానం టేకాఫ్ అయిన మూడు గంటలకు ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో విమానం ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. (చదవండి: లండన్ - హైదరాబాద్ ఫ్లైట్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో లీక్.. అత్యవసర ల్యాండింగ్..) "ఎయిరిండియా ఢిల్లీ-నెవార్క్ (యూఎస్) విమానంలో వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా.. టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత విమానం ఢిల్లీకి తిరిగి వచ్చింది" అని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు వార్తా సంస్థ ఏఎన్ఐకి తెలిపారు. "డిసెంబర్ 4న, తన భార్యతో కలిసి నెవార్క్‌కు ప్రయాణిస్తున్న ఒక అమెరికి పౌరుడు మరణించిన కారణంగా ఢిల్లీ నుంచి నెవార్క్‌కి వెళ్లే ఫ్లైట్ నంబర్ ఏఐ-105 తిరిగి వచ్చింది" అని తెలిపారు. (చదవండి: ‘దేశంలో రాజాలు ఎందరున్నా.. మహారాజా ఒక్కడే’) విమానాశ్రయ వైద్యుల బృందం విమానం వద్దకు చేరుకుని.. ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అతను చనిపోయినట్లు నిర్ధారించారు. మరణించిన వ్యక్తి అమెరికన్ కాగా.. భార్యతో కలిసి అతడు ప్రయాణం చేస్తున్నాడు. విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని.. తిరిగి ఇదే విమానం.. శనివారం సాయంత్రం 4 గంటలకు కొత్త టీంతో అమెరికా ప్రయాణం అయ్యిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. చదవండి: సొంతింటికొస్తున్న విమానం -
PV Sindhu: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పీవీ సింధుకు ఘనస్వాగతం
-
అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి!
న్యూఢిల్లీ : కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రతిచోట థర్మల్ స్క్రీనింగ్ చేయడం తప్పని సరిగా మారింది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిని ఏయిర్ పోర్టులోనే స్క్రీనింగ్ చేసి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 14 రోజుల పాటు క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ నుంచి తప్పించుకొని ఓ వృద్ధుడు పరారైన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు.. గార్డెన్ ప్రాంతానికి చెందిన హర్జిత్ సింగ్(72) అనే వ్యక్తి శనివారం AI 1916 విమానంలో కజకిస్తాన్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. విమానాశ్రమంలో దిగిన అనంతరం అధికారుల కళ్లు గప్పి టెర్మినల్ -3 వద్ద ఉన్న స్క్రీనింగ్ హాల్ నుంచి తప్పించికొని పరారయ్యాడు. (సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటానని చెప్పి..) ఈ విషయంపై ఎయిర్‌పోర్టు అధికారులు పోలీసులకు సమాచారమివ్వగా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సింగ్ ఉద్దేశపూర్వకంగా స్క్రీనింగ్ విధానాన్ని తప్పించుకొని వెళ్లినట్లు అధికారులు పోలీసులకు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రయాణీకుడు ఎయిర్‌పోర్టు అధికారులు ఇచ్చిన మొబైల్ నెంబర్, ఇంటి చిరునామా ప్రస్తుతం వాడుకలో లేనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎయిర్‌పోర్టులోని సీసీటీవీ ఫుటేజీ సహాయంతో సింగ్ విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లిన వెహికిల్ ఆధారంగా ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో నిందితుడిని పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి అతడిని 14 రోజులు క్వారంటైన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. (లగ్జరీ బైక్‌పై చీఫ్ జస్టిస్; ఫోటోలు వైరల్) -
తొలిరోజే 630 విమానాలు రద్దు
న్యూఢిల్లీ/బెంగళూరు: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల నిలిచిపోయిన విమాన సర్వీసులు రెండు నెలల తర్వాత సోమవారం పునఃప్రారంభమయ్యాయి. స్వస్థలాలకు వెళ్లేందుకు విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయాలకు చేరుకున్నారు. ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టులు కొంత రద్దీగా కనిపించాయి. ఢిల్లీ నుంచి మొదటి విమానం ఉదయం 4.45 గంటలకు పుణేకు బయలుదేరింది. ముంబై నుంచి తొలి ఫ్లైట్ ఉదయం 6.45 గంటలకు బిహార్ రాజధాని పట్నాకు బయలుదేరింది. అయితే, కరోనా భయంతో విమానాల రాకపోకలకు కొన్ని రాష్ట్రాలు ఆసక్తి చూపకపోవడం, కొన్ని ఎయిర్‌పోర్టుల్లో పరిమిత సంఖ్యలోనే విమానాలకు అనుమతించడంతో తొలిరోజే 630 విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని విమానయాన పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు విమానాల సర్వీసులను ఇప్పుడే ప్రారంభించడానికి విముఖత వ్యక్తం చేశాయి. అలాగే ముంబై, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రధాన ఎయిర్‌పోర్టుల నుంచి సర్వీసుల సంఖ్యను కుదించారు. రాష్ట్రాల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వ ప్రకటన మేరకు సోమవారం 630 విమానాలను రద్దు చేశారు. ఈ విషయం తెలియక చాలామంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు చేరుకున్నారు. విమానాలు రద్దయ్యాయని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దేశీయ విమాన సేవలు పునఃప్రారంభం అయ్యాక తొలిరోజు సోమవారం 532 విమానాలు రాకపోకలు సాగించాయని, 39,231 మంది ప్రయాణించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ చెప్పారు. మంగళవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. 28 నుంచి పశ్చిమ బెంగాల్లో విమానయాన సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. మున్ముందు దేశీయ విమానాలు, ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్గదర్శకాలు పాటిస్తేనే..: ప్రయాణికుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు విమానయాన శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఫేస్ మాస్కులు ధరించిన వారినే విమానాల్లోకి అనుమతించాలని పేర్కొంది. విమానాల్లో ఆహారం సరఫరా ఉండరాదంది. మొబైల్ ఫోన్లు ఉన్నవారు ఆరోగ్యసేతు యాప్‌లో తమ ఆరోగ్యం వివరాలు నమోదు చేయాలని, లేనివారు సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం సమర్పించాలని సూచించింది. టికెట్ల ధరల విషయంలోనూ పరిమితి విధించింది. తమ రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టులకు విమానాల్లో చేరుకునేవారి విషయంలో సొంతంగా క్వారంటైన్ నిబంధనలు అమలు చేస్తామని కర్ణాటక, తమిళనాడు, కేరళ, బిహార్, పంజాబ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు ప్రకటించాయి. వివాదంలో కేంద్ర మంత్రి సదానంద కేంద్ర మంత్రి సదానంద గౌడ వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో బెంగళూరు వచ్చి, క్వారంటైన్‌కు వెళ్లకుండా, నేరుగా ఇంటికి వెళ్లడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. నిత్యావసర వస్తువుల కిందకు వచ్చే ఔషధ విభాగ ఇన్చార్జి మంత్రిగా తనకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ఔషధాల ఉత్పత్తి, సరఫరా తదితర కీలక అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన తను క్వారంటైన్లో ఉండటం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. నిత్యావసర వస్తు విభాగాలకు చెందినవారికి కేంద్రం మినహాయింపు ఇచ్చిందని కర్ణాటక ప్రభుత్వం కూడా పేర్కొంది. అయితే, గౌడ తీరుపై సోషల్ మీడియాలో పలు విమర్శలు వచ్చాయి. నిబంధనలు సామాన్యులకే కానీ, వీఐపీలకు కాదంటూ పలువురు వ్యాఖ్యానించారు. జూన్ 6 వరకు అన్ని సీట్లలో కూర్చోవచ్చు ఎయిర్ ఇండియాను అనుమతించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు జూన్ 6 వరకు నడిపే అంతర్జాతీయ విమానాల్లో మధ్య సీటుని సైతం భర్తీ చేసుకునేందుకు ఎయిర్ ఇండియాను సుప్రీంకోర్టు అనుమతించింది. విమానయాన సంస్థల లాభం కంటే ప్రజల ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వానికీ, ఎయిర్ ఇండియాకీ స్పష్టం చేసింది. జూన్ 6 తరువాత మాత్రం బాంబే హైకోర్టు ఆదేశాలననుసరించి ఎయిర్ ఇండియా విమానాల్లో మధ్య సీటుని తప్పనిసరిగా ఖాళీగా ఉంచాలని తేల్చింది. మధ్యసీటు ఖాళీగా ఉంచాలన్న హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్రం, ఎయిర్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రంజాన్ సందర్భంగా కోర్టుకి సెలవు ఉన్నప్పటికీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారించింది. విమానాల్లో భౌతిక దూరం ఆవశ్యకతను అధికారులు గుర్తించాలని, కోవిడ్ నేపథ్యంలో దగ్గరగా కూర్చోవడం ప్రమాదమని నొక్కి చెప్పింది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయిన విమానమైతే జూన్ 6 వరకు మధ్య సీటుని భర్తీచేసుకునే అవకాశాన్నిస్తున్నట్టు తెలిపింది. -
‘లేచి నిలబడు..డ్రామా ఆపమంటూ అరిచారు’
న్యూఢిల్లీ : వెన్నెముక గాయంతో బాధ పడుతున్న తనను ఢిల్లీ ఎయిర్‌పోర్టు సిబ్బంది ఇబ్బందులకు గురిచేశారని అమెరికా జాతీయురాలు విరాళీ మోదీ(28) ఆరోపించారు. దివ్యాంగుల హక్కుల కార్యకర్తగా పనిచేస్తున్న విరాళీ... 2006లో జరిగిన ఓ ప్రమాదం కారణంగా తీవ్ర గాయాపాలయ్యారు. ఈ క్రమంలో ఆమె వెన్నెముక పూర్తిగా దెబ్బతిన్నది. దాంతో ప్రయాణాల్లో భాగంగా తనతో పాటు ఎల్లప్పుడూ వీల్ చెయిర్‌ను వెంటతీసుకు వెళ్తారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ నుంచి ముంబైకి విమానంలో ప్రయాణించిన తనకు చేదు అనుభవం ఎదురైందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ మేరకు...‘ నాకున్న అసౌకర్యం కారణంగా వీల్ చెయిర్‌ను కార్గోలో పంపిస్తారు. నాకు సహాయం చేసేందుకు, నన్ను సీట్లో కూర్చోబెట్టేందుకు పోర్టర్ సహాయం తీసుకుంటాను. అయితే మీ మహిళా అధికారి కారణంగా నాకు ఈరోజు చేదు అనుభవం ఎదురైంది. లేచి నిలబడాలంటూ పదే పదే నన్ను ఆమె ఇబ్బంది పెట్టారు. నేను నిలబడలేనని నా సహాయకులు చెప్పినా ఆమె వినలేదు. కావాలంటే నన్ను తనిఖీ చేసుకోమని సూచించినా వినలేదు. సీనియర్ అధికారిని తీసుకు వచ్చి నన్ను చూపించారు. నా పాస్‌పోర్టు చూసిన తర్వాత నేను వీల్ చెయిర్ యూజర్‌ను అనే విషయం వాళ్లకు బోధపడింది. అప్పటి దాకా డ్రామా ఆపమంటూ ఇష్టం వచ్చినట్లుగా నన్ను నానా మాటలు అన్నారు’ అంటూ భద్రతా విభాగం అధిపతి(సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్)కి చేసిన ఈ-మెయిల్‌ను విరాళీ ట్విటర్లో షేర్ చేశారు. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా గతంలో కూడా తనకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయంటూ విరాళీ ఆరోపించగా ఎయిర్‌పోర్టు అధికారులు ఆమె మాటలను కొట్టిపారేశారు. “YOU HAVE TO STAND UP FOR SECURITY CHECKING! STOP DOING DRAMA!,” - The CISF at Delhi airport said this to me. @jayantsinha @CISFHQrs @DelhiAirport @debolin_sen @BookLuster @guptasonali PLEASE RT - THIS TREATMENT TOWARDS THE DISABLED IS RIDICULOUS pic.twitter.com/WGYFULblUm — Virali Modi (@Virali01) 9 September 2019 -
రన్‌వే మూశారు..చార్జీలు పెంచారు!
న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలోని మూడు రన్వేలలో ఒకదాన్ని మూసివేయడంతో ప్రయాణికులపై అదనపు భారం పడింది. దీనికి తోడు వారాంతంలో డిమాండ్ పెరగడంతో ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు టికెట్ల ధరలు గరిష్టంగా 86 శాతం పెరిగాయి. ఒక రన్‌వేను మరమ్మతుల నిమిత్తం 13 రోజుల పాటు మూసివేశారు. దీని వల్ల విమానాల రాకపోకలు 50 వరకు తగ్గనున్నాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లే విమానాల చార్జీలు దాదాపు 57 శాతం పెరిగాయి. -
‘బాంబు’ జోక్ ఎంతపని చేసింది!
న్యూఢిల్లీ: వారిద్దరు స్నేహితులు.. ఇండోర్ చెందిన వారు గురువారం ఢిల్లీ విమానాశ్రయం నుంచి సొంతూరికి బయలుదేరారు. విమానం ఎక్కేందుకు క్యూలో నిలబడినప్పుడు ఓ మిత్రుడు సరదాగా జోక్ చేశాడు. ‘దయచేసి.. నేను బాంబు తీసుకెళ్లవచ్చా’ అని స్నేహితుడితో అన్నాడు. ఈ మాట ఇండిగో ఎయిర్‌లైన్ సిబ్బంది చెవిన పడింది. వారేదో నిజంగా ‘బాంబు’తో ఎక్కుతున్నట్టు హడలిపోయిన సిబ్బంది వెంటనే సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్)కు ఈ విషయాన్ని చేరవేశారు. ఎయిర్పోర్ట్ భద్రతను పర్యవేక్షించే సీఐఎస్ఎఫ్ బలగాలు వెంటనే ఆ స్నేహితులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నాయి. వారిని చాలాసేపు విచారించి.. ప్రశ్నించి.. వారి వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని నిర్ధారించికున్న తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులని వదిలేశారు. కానీ, ఆ ఇద్దరు సరదాగా వేసిన జోక్.. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిన్నపాటి బాంబు కలకలాన్ని రేపింది. సరదాకు ‘బాంబు’ అన్న పదాన్ని ఉచ్చరించినందుకు చిక్కుల్లో పడ్డ ఆ ఇద్దరు స్నేహితులు బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. ఇటీవలికాలంలో ఉగ్రవాద ముప్పు భారీగా పొంచి ఉన్న నేపథ్యంలో ఏ చిన్న అనుమానమున్నా.. విమానాశ్రయంలో కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నారు. గత నెల ఓ కశ్మీరి మెడికల్ విద్యార్థిని కూడా ఇలాగే చిక్కుల్లో పడ్డారు. ఆమె బ్యాగుపై ‘ఇందులో బాంబు ఉండొచ్చు’ అన్న గ్రాఫిటీ ఉండటంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించి వదిలేశారు.