న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానం గంటల తరబడి ఆలస్యం కావడంపై కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన విమానం దాదాపు 20 గంటలు ఆలస్యంగా కారణంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి విమానంలోనే కూర్చోవాల్సి రావడం, ఏసీ కూడా పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు కొందరైతే స్పృహతప్పి పడిపోయారు.
కొన్ని అనివార్య కారణాల వల్ల విమానం ఆలస్యమైందని, ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. అయితే అసలే 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఢిల్లీలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యట్లు ఎందుకు చేపట్టలేదో వివరణ ఇవ్వాలని కేంద్రమంత్రిత్వశాఖ విమానయాన సంస్థను కోరింది.
కాగాఎయిరిండియా కు చెందిన బోయింగ్ 777 విమానం 200 మంది ప్రయాణికులతో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు దిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బయల్దేరాలి.. కానీ దాదాపు ఆరు గంటలు ఆలస్యమైంది. రాత్రి 8 గంటలకు రీ షెడ్యూల్ చేశారు. సాంకేతిక సమస్యలతో విమానం మార్చారు. దీంతో ప్రయాణికులు రాత్రి 7.20 గంటలకు మరో విమానంలో బోర్డింగ్ అయ్యారు. అనంతరం విమానం మళ్లీ ఆలస్యమని ప్రకటన చేశారు.
అయితే అప్పటికే ప్రయాణికుల బోర్డింగ్ పూర్తవ్వగా వారిని బయటకు వెళ్లేందుకు సిబ్బంది అనుమతించలేదు.న్ని గంటల పాటు వారు విమానంలోనే కూర్చోవాల్సి వచ్చింది. దీనికితోడు ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. తిరిగి విమానాశ్రయానికి వెళ్లేందుకు గేట్లు కూడా తెరవకపోవడంతో ప్రయాణికులు దాదాపు గంటపాటు ఏరోబ్రిడ్జిలో వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో వృద్ధులు, పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment