delay
-
ప్రజాప్రతినిధులు లేని పాలన ఇంకెన్నాళ్లు?
సాక్షి, ముంబై: దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని కలిగిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)కు గత మూడేళ్లుగా ఎన్నికలు జరగలేదు. దీంతో మూడేళ్లుగా ప్రజాప్రతినిధులు లేకుండానే మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిపాలన కార్యకలాపాలు జరుగుతున్నాయి. రాజకీయ పరిణామాల రీత్యా...వాయిదా 2022, మార్చి 7న మున్సిపల్ కార్పొరేటర్ల పదవీకాలం ముగిసింది. వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల కారణంగా వాయిదాపడుతూ వచ్చాయి. గత మూడేళ్లలో, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలన బాధ్యతలను మొదట ఇక్బాల్ సింగ్ చాహల్ ఆ తరువాత భూషణ్ గగ్రానీ స్వీకరించారు. ఈ మూడేళ్లలో వీరిద్దరూ మున్సిపల్ కమిషనర్లు స్వయంగా మూడు బడ్జెట్లను సమర్పించారు. ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా నగరానికి అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టారు. మున్సిపల్ ఎన్నికలు జరగకపోయినా మూడేళ్ల వ్యవధిలో రూ.6,000 కోట్ల విలువైన వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నలిచ్చారు. ముఖ్యంగా రోడ్లు, మురుగునీటి శుద్ధి, డీశాలినేషన్ ప్రాజెక్టులు, దహిసర్–భయందర్ లింక్ రోడ్డులకు అనుమతులు మంజూరుచేశారు. ప్రభుత్వ అప్పుల పెరుగుదల.... 2024–25 ఆరి్థక సంవత్సరానికి మున్సిపల్ కార్పొరేషన్ అప్పులు రూ.1.90 లక్షల కోట్లుగా తేలింది. తాజా లెక్కల ప్రకారం, ఈ సంఖ్య రూ.2,32 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో, బడ్జెట్ వ్యయంపై బహిరంగ చర్చ జరగలేదు. కమిషనర్లు పరిపాలించడమేమిటి? కమిషనర్ల ఆధ్వర్యంలో బీఎంసీ పరిపాలన జరగడమేమిటంటూ విపక్ష పారీ్టలు విమర్శిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు లేని పాలన ప్రజాస్వామిక విధానాలకు విరుద్ధమని, ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా కీలక నిర్ణయాలు అమల వుతున్నాయని ఆరోపిస్తున్నాయి. మున్సిపల్ పాలనలో పారదర్శకత లేదని, పెద్ద మొత్తంలో నిధులు ఖర్చవుతున్నాయని మండిపడుతున్నాయి. మరో 6–7 నెలల తర్వాతే! ప్రస్తుత పరిస్థితి దృష్యా ఎన్నికలు మరో 6-7 నెలలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 1984లో అప్పటి కమిషనర్ డి.ఎం.సుక్తాంకర్ కార్యనిర్వాహక పాలన తర్వాత మళ్లీ 38 ఏళ్లకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజాప్రతినిధులు లేకుండా పాలన జరుగుతోంది. అయితే ఈసారి ఇది మరింత ఎక్కువ కాలం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నగర అభివృద్ధి, ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని త్వరలో ఎన్నికలు నిర్వహించాలని పలువురు నాయకులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పంచాయతీ ఎన్నికల జాప్యం.. సంక్షేమానికి విఘాతం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల జాప్యం కారణంగా ప్రజాభివృద్ధికి విఘాత కలుగుతోందని పంచాయతీరాజ్ వ్యవహారాలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక అభివృద్ధి నిధులు నిలిచిపోయాయని గుర్తుచేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ తగు చర్యలు చేపట్టాలని స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తమ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ (2025–26) నివేదికను బుధవారం పార్లమెంట్‌కు సమర్పించింది. ఇందులో పంచాయతీ ఎన్నికల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ‘73వ రాజ్యాంగ సవరణ ద్వారా అన్ని రాష్ట్రాలు గ్రామ స్థాయిలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ఈ(3) ప్రకారం పంచాయతీ ఎన్నికలను ఆ గ్రామపంచాయతీ కాలపరిమితి ముగిసేలోపు లేదంటే రద్దయ్యాక ఆరు నెలల వ్యవధిలోపు పూర్తి చేయాలి. ఒక రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కచ్చితంగా పాటించాల్సిన రాజ్యాంగపరమైన నిబంధన’ అని కమిటీ పేర్కొంది. ‘‘ పుదుచ్చేరి (2011), కర్ణాటక (2021), మహారాష్ట్ర (2022), మణిపూర్ (2022), లక్షద్వీప్ (2022), అస్సాం(2023), జమ్మూకశ్మీర్ (2023), లద్దాఖ్ (2023)లలో వివిధ కారణాల వల్ల పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్‌లలో 2024 ఏడాదిలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ఇంకా నిర్వహించలేదు’’ అని కమిటీ తెలిపింది. ఈ విషయంలో సంబంధిత రాష్ట్ర హైకోర్టు, ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయతీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాయని తెలిపింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం వల్ల గ్రామ అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాలకు కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు ఆగిపోయాయని పేర్కొంది. ‘‘ఈ గ్రాంట్లు, నిధులు మంజూరు పంచాయతీలకు సకాలంలో సాకారం అయి ఉంటే ఆయా గ్రామాల ప్రజలు వివిధ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి ఫలాలను అందుకుని ఉండేవారు’’ అని కమిటీ వ్యాఖ్యానించింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగని కారణంగా నిధుల లభ్యత లేకపోవడంతో గ్రామాల్లో ప్రజల పరిస్థితి మెరుగ్గా లేదని రాష్ట్రాల పర్యటనల్లో తేలినట్లు కమిటీ పార్లమెంట్ దృష్టికి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించేలా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సత్వరం అత్యున్నత స్థాయి చర్యలు చేపట్టాలని కమిటీ సిఫార్సు చేసింది.‘ఉపాధి’కి నిధులు పెంచాలిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకానికి నిధులు పెంచాలని, కార్మికుల కనీస వేతనాలను పెంచాలని కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ‘ గతంతో పోలిస్తే 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోనూ గ్రామీణ ఉపాధి పథకానికీ కేటాయింపులు తగ్గాయి. ఇప్పుడు కేవలం రూ.86,000 కోట్ల కేటాయింపులు చేశారు. గ్రామాల్లో తీవ్ర పేదరికం, నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న గ్రామీణులకు ఉపాధిహామీ పథకం ఇన్నాళ్లూ కీలకమైన రక్షణచట్రంగా నిలిచింది. కరోనా కాలంలో కోట్లాది మంది పేదలను ఈ పథకం ఆదుకుంది. అణగారిన వర్గాలకు ఉపాధిని కల్పించే ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు తగినంత బడ్జెట్ కేటాయింపులు చేయడం చాలా అవసరం. అందుకే ఈ పథకానికి కేటాయింపులు సమధికంగా పెంచాలి. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖపై గ్రామీణాభివృద్ధి శాఖ ఒత్తిడి తీసుకురావాలి’’ అని కమిటీ సిఫార్సు చేసింది. పెరుగుతున్న జీవన వ్యయం, గ్రామీణ కార్మికుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రోజువారీ వేతన రేట్లు తగిన విధంగా సవరించాలని సూచించింది. -
ఎయిర్ ఫోర్స్ వన్ కోసం పాత విమానాలకు మార్పులు చేయిస్తాం
వాషింగ్టన్: కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం బోయింగ్ కంపెనీ ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలను అందజేయడంలో ఆలస్యం చేస్తుండటంపై అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా బోయింగ్ పాత విమానాలను కొనుగోలు చేసి, వాటిని అవసరాలకు అనుగుణంగా మార్చనున్నామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడి పర్యటనల కోసం ప్రత్యేకంగా వాడే ‘ఎయిర్ ఫోర్స్ వన్’విమానాలను బోయింగ్ కంపెనీ రూపొందిస్తుంది. రెండు విమానాలను కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఖరీదు చాలా ఎక్కువైందంటూ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలో కాంట్రాక్టును మార్చారు. మారిన నిబంధనల ప్రకారం 2024లోనే బోయింగ్ మొదటి విమానాన్ని అందజేయాల్సి ఉంది. కానీ, ఉద్యోగుల సమ్మె, కరోనా మహమ్మారి వంటి కారణాలతో ఆ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయి పనులు నిలిచిపోయాయి. తాజా అంచనాల ప్రకారం, మొదటిది 2027లో, 2028లో ట్రంప్ పదవి నుంచి దిగిపోయే సమయానికి రెండో విమానం అందుతుంది. 35 ఏళ్లనాటి బోయింగ్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’విమానంలో బుధవారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..బోయింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కాంట్రాక్టుకు ప్రత్యామ్నాయం చూస్తున్నామన్నారు. యూరప్ కంపెనీ ఎయిర్ బస్ నుంచి కొంటారా అన్న ప్రశ్నకు ఆయన.. అలాంటిదేమీ లేదన్నారు. విదేశీ కంపెనీ కంటే స్వదేశీ కంపెనీకి ప్రాధాన్యం ఇస్తామన్నారు. బోయింగ్ కంపెనీకే చెందిన వాడిన విమానాన్ని కొని, దానిలో మార్పులు చేయిస్తామని చెప్పారు. ఖరీదు ఎక్కువనే కారణంతో ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో డిజైన్ చేసిన కొత్తతరం వీసీ–25బీ రకం విమానాలను సైతం ట్రంప్ తిరస్కరించారు. గాలిలో ఉండగానే ఇంధనం నింపుకునే సౌకర్యంతోపాటు అధ్యక్షుడికి అవసరమైన మరెన్నో ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఇలా ఉండగా, అధ్యక్షుడు ట్రంప్ శనివారం బోయింగ్ 747–800 రకం కొత్త విమానాన్ని పరిశీలించారని వైట్ హౌస్ తెలిపింది. ఇందులో అత్యాధునిక హార్డ్‌వేర్, ఇతర సాంకేతిక ప్రత్యేకతలను ఆయన తెలుసుకున్నారు. అదేవిధంగా, పామ్‌బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కు చేసిన ఉన్న ఖతార్ రాజకుటుంబానికి చెందిన 15 ఏళ్లనాటి ప్రైవేట్ విమానం లోపల కూడా ఆయన తిరిగి చూశారని తెలిపింది. -
విమానం ఆలస్యం..హీరో విజయ్ దేవరకొండ సహా పలువురి ఎదురుచూపులు
సాక్షి,హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శుక్రవారం(ఫిబ్రవరి7) ఉదయం 9 గంటలకు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన విమానం మధ్యాహ్నం 2 గంటల వరకు బయలుదేరలేదు. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతోనే టేకాఫ్ కాలేదని స్పైస్‌జెట్ సంస్థ తెలిపింది. దీంతో ఆ విమానంలో వెళ్లాల్సిన వారంతా ఉదయం నుంచి విమానాశ్రయంలోనే వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.విమానంలో ప్రముఖ టాలీవుడ్ హీరో విజయదేవరకొండతో పాటు పలువురు ఇతర సినీ ప్రముఖులు ఐఏఎస్‌లు,ఐపీఎస్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. విమానం ఎప్పుడు వెళుతుందో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారంతా స్పైస్‌జెట్ విమానయాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.30 వేలు పెట్టి టికెట్ కొన్నా తమకు ఈ ఇబ్బందులేంటని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించేందుకు హైదరాబాద్ నుంచి చాలా మంది కుంభమేళాకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు శంషాబాద్ నుంచి విమానంలో ప్రయాగ్‌రాజ్‌కు వెళుతున్నారు. -
సంక్రాంతి రద్దీ.. ప్రయాణికులకు చుక్కలే!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ మొదలైంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో నగర వాసులు సొంత ఊళ్లకు తరలివెళ్తున్నారు. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్ రైళ్లలో రిజర్వేషన్లు పూర్తిగా నిలిచిపోయి రిగ్రేట్ దశకు చేరాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి టెర్మినల్ నుంచి కాకినాడ, తిరుపతి, విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాలకు కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్తుండగా.. అరకొరగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు ఏ మాత్రం ప్రయాణికుల డిమాండ్లను భర్తీ చేయడం లేదు. మరోవైపు అన్ని ప్రత్యేక రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అతికష్టంగా బెర్తులు సంపాదించి రైలెక్కినా గంటల తరబడి పట్టాలపైనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరితే మరుసటి రోజు మధ్యాహ్నం 12 దాటినా విశాఖకు చేరుకోలేకపోయామని కూకట్‌పల్లికి చెందిన కృష్ణారావు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి శబరిమలకు నడిచే రైళ్లు కూడా అయ్యప్ప భక్తులకు నరకం చూపుతున్నాయి. రెండు రోజులు గడిచినా హైదరాబాద్ నుంచి శబరిమలకు, తిరిగి అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోలేకపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చార్జీలు కూడా ‘ప్రత్యేకమే’.. ⇒నగరం నుంచి ప్రతి రోజు సుమారు వందకు పైగా రెగ్యులర్ రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. సుమారు 2.5 లక్షల మంది ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం రోజుకు మరో 50 వేల మంది అదనంగా బయలుదేరే అవకాశం ఉంది. ఈ డిమాండ్ మేరకు అదనపు రైళ్లు లేవు. కొన్ని రైళ్లలో బెర్తులు, అదనపు బోగీలు ఏర్పాటు చేశారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మాత్రం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. కానీ ఈ రైళ్లలో చార్జీలు కూడా ఎక్కువే. సాధారణ చార్జీలపై 25 శాతం వరకు అదనపు చార్జీలు విధిస్తారు. అయినప్పటికీ మరో గత్యంతరం లేక ప్రత్యేక రైళ్లను ఆశ్రయించే ప్రయాణికులకు రైళ్లలో పడిగాపులు తప్పడం లేదు. ⇒ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పట్టాలపై రైళ్ల ఒత్తిడి పెరిగిందని, దీంతో సకాలంలో సిగ్నల్స్ లభించకపోవడం వల్ల జాప్యం చోటుచేసుకుంటోందని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ ఆలస్యం ప్రయాణికుల పండగ సంతోషాన్ని ఆవిరి చేస్తోంది. కనిష్టంగా 3 నుంచి గరిష్టంగా 12 గంటల వరకు కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గతంలో ఇలాంటి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెల్లువెత్తినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. సంక్రాంతి సందర్భంగా బయలుదేరిన ప్రయాణికులు భోగి పండగ రోజు కూడా సొంత ఊళ్లకు చేరుకోలేకపోయారు. ప్రస్తుతం మరోసారి అదే పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. ఆర్టీసీ సైతం అదే బాటలో.. ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సుల పేరిట 50 శాతం అదనపు దోపిడీకి దిగింది. ఏపీతో పాటు, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో కూడా 25 శాతం నుంచి 50 శాతం వరకు అదనపు వసూళ్లకు పాల్పడుతోంది. చివరకు దివ్యాంగుల పాస్‌లను అనుమతించకుండా ఇష్టారాజ్యంగా చార్జీలు విధిస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారు 6 వేలకు పైగా అదనపు బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజులుగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఎల్బీనగర్, ఉప్పల్, హయత్‌నగర్, ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర ప్రాంగణాలుప్రయాణికులతో సందడిగా మారాయి.ప్రైవేట్ బస్సుల దోపిడీ.. సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలుగా దారి దోపిడీకి పాల్పడుతున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖకు లగ్జరీ రూ.1800 వరకు ఉంటుంది. ఇప్పుడు ఆ చార్జీ రూ.3000 వరకు చేరింది. అలాగే ఏసీ బస్సుల్లో రూ.2500 నుంచి ఏకంగా రూ.5000 వరకు పెరిగినట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిల్లిపాదీ కలిసి వెళితే చార్జీల కోసమే రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోందని ఏఎస్రావు నగర్‌కు చెందిన మల్లికార్జున్‌రావు చెప్పారు. అలాగే.. హైదరాబాద్ నుంచి కాకినాడ, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాలకు సైతం ప్రైవేట్ బస్సుల దోపిడీ విమాన చార్జీలను తలపిస్తోంది.సాక్షి ఎఫెక్ట్.. బస్సులు సీజ్‌అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తున్నప్రైవేట్ వాహనాల దందాపై సాక్షి వరుస కథనాలు ఇచ్చింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఎల్బీనగర్ లో ప్రైవేట్ వాహనాలపై ఆర్టిఏ అధికారుల కొరడా జులిపించారు. సంక్రాంతికి అధిక బస్సు చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ వాహనాలపై ఆర్టిఏ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలోని టీం అడ్డుకుంది. దాదాపు 20 బస్సులపై కేసు నమోదు చేశారు. ఇక.. పెద్ద అంబర్ పేట్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారుల సీజ్ చేశారు. మరోవైపు.. రాజేంద్రనగర్ ఆరాంఘడ్ చౌరస్తా వద్ద రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల ఈ ఉదయం 4 గంటల నుంచే తనిఖీ చేపట్టారు. చెన్నై, తిరువంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి నుండి హైదరాబాద్ వస్తున్న బస్సులను తనిఖీలు చేస్తున్నారు . ఈ క్రమంలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నట్రావెల్స్‌పై కేసులు నమోదు చేస్తున్నారు. 11 బస్సుల పై కేసు నమోదు అయినట్లు సమాచారం. -
ఏపీలో ప్రభుత్వ టీచర్లకు అందని జీతాలు
సాక్షి, విజయవాడ: ఏపీలో ప్రభుత్వ టీచర్ల (Government teachers)కు జీతాలు అందలేదు. 4వ తేదీ వచ్చిన కూడా ఉపాధ్యాయులకు చంద్రబాబు సర్కార్ (Chandrababu Govt) జీతాలు చెల్లించలేదు. ప్రతి నెలా 1వ తేదీన జీతాలు(Salaries) ఇస్తామని మేనిఫెస్టోలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ.5 వేల కోట్లు అప్పు తెచ్చి కూడా టీచర్లకి కూటమి ప్రభుత్వం జీతాలు చెల్లించలేదు. ప్రభుత్వ తీరుపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం. దాన్ని ఒక్క నెల ముచ్చటగా మార్చేసింది. తొలి నెల మినహా తర్వాత నెల నుంచి ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు, పెన్షనర్లు అందరికీ పెన్షన్లు జమ చేయడం లేదు. నూతన సంవత్సరంలోనూ నాలుగో తేదీ వచ్చినప్పటికీ వేతనాల కోసం సుమారు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఉపాధ్యాయులతోపాటు పలు శాఖల్లోని ఉద్యోగులకు ఈ నెల ఒకటో తేదీన వేతనాలు అందలేదు.ఇదీ చదవండి: ‘చంద్రబాబుగారూ.. ఇంత ద్రోహమా? ఇంతటి బరితెగింపా?’రెండో తేదీ కొంత మంది ఉద్యోగులకు వేతనాలను ప్రభుత్వం జమ చేయగా, అయితే 4వ తేదీ కూడా ఉపాధ్యాయులు ఎవరికీ జీతాలు అందలేదు. జీతాల కోసం ప్రతి నెలా ఎదురుచూపులు తప్పడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత నెల కూడా ఉపాధ్యాయులకు ఒకటో తేదీన వేతనాలు జమచేయలేదు. ప్రతి నెలా 6, 7 తేదీల వరకు జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. -
స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడువు ముగిసిన గ్రామపంచాయతీలు, మండల పరిషత్, జిల్లా ప్రజాపరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన నిర్ధారిస్తారన్న దానిపై ప్రభుత్వపరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. రిజర్వేషన్ల ఖరారుకు కుల గణన ప్రాతిపదికగా తీసుకోవాలా.. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సిద్ధం చేసిన తాజా ఓటర్ల జాబితాను లెక్కలోకి తీసుకోవాలా.. అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకోలేకపోతోంది. కాగా ఈ నెలతో బీసీ కమిషన్ కాలపరిమితి ముగియనుండగా.. ఎన్నికలు నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది. కులగణనతో ఆలస్యం... కులగణన ద్వారా రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలు, గ్రామాల స్థాయి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభాపై లెక్కలు తీసి రిజర్వేషన్ల నిర్ధారణ అనేది సుదీర్ఘ కసరత్తుతో పాటు చాలా రోజులు పట్టనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తాజా ఓటర్ల జాబితాలు తీసుకుని మండలాలు, గ్రామస్థాయిల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభాపై అంచనాకు వచ్చి స్థానిక స్థాయిలోనే రిజర్వేషన్ల ఖరారు అనేది ఇప్పుడు ప్రభుత్వం ఎదుట మార్గాంతరంగా ఉంది.ఈ ప్రక్రియను పంచాయతీరాజ్, ›గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపడితే 2, 3 నెలల్లోగా ఓటర్ల జాబితాల ఆధారంగా రిజర్వేషన్లు నిర్థారించేందుకు అవకాశముందని అటు బీసీ కమిషన్, ఇటు అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు గరిష్టంగా 21 శాతమే రిజర్వేషన్లు అందుతున్నాయి. అయితే ఈ రిజర్వేషన్లను వారి జనాభాకు అనుగుణంగా 42 శాతానికి పెంచుతామని, ఉప కులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీనిచి్చన విషయం తెలిసిందే. ఈ హామీ అమలుకు రాష్ట్ర బీసీ కమిష¯Œన్ ద్వారా చర్యలు చేపట్టాల్సి ఉంది.సుప్రీంకోర్టు గతంలోనే ‘ట్రిపుల్ టెస్ట్’పేరిట స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర గ్రూపులకు రిజర్వేషన్లపై మార్గదర్శకాలు జారీ చేసింది. స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటుతనంపై బీసీ కమిష¯న్ ద్వారా విచారణ జరపాలని, ఆయా చోట్ల (స్థానిక స్థాయిలో) ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏయే నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలో తేల్చాలని పేర్కొంది. మొత్తంగా రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చూడాలని స్పష్టం చేయడంతో బీసీ కమిషన్ కసరత్తుకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ అమలు ఏ మేరకు సాధ్యమనే మీమాంస వ్యక్తమవుతోంది. సీఎం వచ్చాక స్పష్టత వస్తుందా? ఈ నెలాఖరుతో రాష్ట్ర బీసీ కమిష¯న్Œ చైర్మన్, సభ్యుల పదవీ కాలం పూర్తి కానుండగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీకాలం సెపె్టంబర్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్ చైర్మన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తే ఈ ఎన్నికలను సజావుగా సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ నెల 14 తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ల ప్రతినిధి బృందం యూఎస్, దక్షిణ కొరియాల పర్యటన నుంచి తిరిగి వచ్చాక దీనిపై స్పష్టత వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమాన ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీ వెళ్లాల్సిన ఆకాశ ఎయిర్ లైన్స్ విమానం ఆలస్యం అయింది. సోమవారం ఉదయం 5 గంటలకు వెళ్లాల్సిన విమానం ఇప్పటికి బయలుదేరలేదు. ఇప్పటికి వెళ్లకపోవటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసల్యంపై ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘‘ఎడ్ల బండైనా ఎక్కుతాను.. ఎయిర్ ఇండియా విమానం ఎక్కను’’
బెంగళూరు: టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా విమానంలో ఎదురైన చేదు అనుభవంపై ఓ ప్రయాణికుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకెప్పుడూ ఎయిర్ఇండియా విమానం ఎక్కబోనని, దానికంటే ఎడ్లబండి నయం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య కొండవార్ అనే ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగి ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టారు. బెంగళూరు నుంచి పుణెకు వెళ్లడానికి ఎయిర్ఇండియా విమానం ఎక్కినపుడు ఎదురైన సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ‘నాకు గొప్ప గుణపాఠం చెప్పినందుకు థ్యాంక్యూ. చివరకు ఎడ్లబండి అయినా ఎక్కుతాను కానీ ఇంకెప్పుడు మీ విమానంలో ప్రయాణించను. అవసరమైతే డబుల్ పే చేసి టైమ్‌కి వచ్చే విమానాల్లో వెళ్తాను. Dear @AirIndiaX , Thank you for teaching me a very valuable lesson last nightNever and I mean it with all seriousness - I am never flying Air India Express or Air India in my life again - I will pay 100% extra cost if needed but will take other airlines that are on time (only…— Aditya Kondawar (@aditya_kondawar) June 25, 2024 జూన్ 24 రాత్రి 9.50 గంటలకు టేకాఫ్ కావాల్సిన విమానం అర్ధరాత్రి 12.20 గంటలు దాటిన తర్వాత బయల్దేరింది. ఎక్కిన తర్వాత విమానం మొత్తం ఒకటే వాసన. సీట్లు చాలా మురికిగా ఉన్నాయి. వాటి నిండా మరకలే. నాకు టాటా గ్రూప్‌పై అమితమైన గౌరవం ఉంది. అలాగే వారినుంచి ఎప్పుడూ నాణ్యమైన సేవలను ఆశిస్తాను. కానీ నా అనుభవం మాత్రం భయంకరం’అని పోస్టులో తెలిపారు. ఈ పోస్టుపై ఎయిర్ ఇండియా స్పందించింది. ‘అసౌకర్యానికి చింతిస్తున్నాం. మా పరిధిలోలేని కారణాల వల్ల విమానం ఆలస్యమైందని దయచేసి గమనించండి. మీకు ఎదురైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం. ఎయిరిండియాలో ప్రయాణించొద్దనే నిర్ణయంపై పునరాలోచించండి’అని కోరింది. -
ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రత.. విమానంలో సాంకేతిక లోపం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఢిల్లీ నుంచి బెంగాల్‌లోని బాగ్డోగ్రా వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో విమానం బయలుదేరడం రెండు గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏసీ పనిచేయకపోవడంతో విమానంలో గాలి లేక కొందరు అస్వస్థతకు గురయ్యారు. విమానం డోర్ మూసివేయడంతో వేడి తీవ్రత ఎక్కువైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై స్పందించిన ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. ‘ప్రయాణికుల భద్రతకు ఇండిగో ప్రాధాన్యతనిస్తుంది. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటున్నాం. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’అని తెలిపింది. -
Air India: 20 గంటలు ఆలస్యం.. కేంద్ర మంత్రిత్వశాఖ నోటీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానం గంటల తరబడి ఆలస్యం కావడంపై కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన విమానం దాదాపు 20 గంటలు ఆలస్యంగా కారణంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి విమానంలోనే కూర్చోవాల్సి రావడం, ఏసీ కూడా పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు కొందరైతే స్పృహతప్పి పడిపోయారు. కొన్ని అనివార్య కారణాల వల్ల విమానం ఆలస్యమైందని, ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. అయితే అసలే 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఢిల్లీలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యట్లు ఎందుకు చేపట్టలేదో వివరణ ఇవ్వాలని కేంద్రమంత్రిత్వశాఖ విమానయాన సంస్థను కోరింది.కాగాఎయిరిండియా కు చెందిన బోయింగ్ 777 విమానం 200 మంది ప్రయాణికులతో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు దిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బయల్దేరాలి.. కానీ దాదాపు ఆరు గంటలు ఆలస్యమైంది. రాత్రి 8 గంటలకు రీ షెడ్యూల్ చేశారు. సాంకేతిక సమస్యలతో విమానం మార్చారు. దీంతో ప్రయాణికులు రాత్రి 7.20 గంటలకు మరో విమానంలో బోర్డింగ్ అయ్యారు. అనంతరం విమానం మళ్లీ ఆలస్యమని ప్రకటన చేశారు.అయితే అప్పటికే ప్రయాణికుల బోర్డింగ్ పూర్తవ్వగా వారిని బయటకు వెళ్లేందుకు సిబ్బంది అనుమతించలేదు.న్ని గంటల పాటు వారు విమానంలోనే కూర్చోవాల్సి వచ్చింది. దీనికితోడు ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. తిరిగి విమానాశ్రయానికి వెళ్లేందుకు గేట్లు కూడా తెరవకపోవడంతో ప్రయాణికులు దాదాపు గంటపాటు ఏరోబ్రిడ్జిలో వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో వృద్ధులు, పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. -
నిలిచిపోయిన విమానం.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం 8 గంటలు ఆలస్యమైంది. ప్రయాణికులు ఎక్కిన తర్వాత విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఎంతకూ కదలకపోవడంతో క్యాబిన్ లోపల వారంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.తర్వాత కొద్ది సేపటికి విమానం నుంచి ప్రయాణికులను దిగాల్సిందిగా సిబ్బంది కోరారు. విమానం నుంచి దిగిన వారంతా ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. కొందరు ప్రయాణికులైతే అలసిపోయారు. విమానంలో ఎయిర్‌కండీషన్ కూడా పనిచేయకపోవడంతో తమ పరిస్థితి మరీ దయనీయంగా మారిందని ప్రయాణికుల్లోని ఓ జర్నలిస్టు ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. ఈ పోస్టును విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్యాగ్ చేశారు.ఎయిర్ఇండియా ప్రైవేటైజేషన్ పూర్తగా ఫెయిలైందనడానికి ఇది నిదర్శనమని ఫైర్ అయ్యారు. ఈ పోస్టుకు స్పందించిన ఎయిర్ఇండియా సంస్థ తమ విమానం ఆలస్యమవడంపై విచారం వ్యక్తం చేసింది. ఇటీవలే ముంబై నుంచి శాన్ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్ఇండియా విమానం కూడా ఆరు గంటలు ఆలస్యమైంది. ఈ విమానంలో కూడా ఏసీ లేకుండా ప్రయాణికులు ఆరు గంటల పాటు ఇబ్బందులు పడుతూ కూర్చోవాల్సివచ్చింది. -
‘వందేభారత్’ నత్తనడక..
హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్ విజయవాడకు అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చి వందేభారత్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ, ఆ రోజు రైలు దాదాపు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. తక్కువ టికెట్ ధర ఉన్న రైళ్ల కంటే ఆలస్యంగా అది విజయవాడకు చేరింది. వందేభారత్ సర్విసు మొదలైన 16 నెలల కాలంలో ఈ తరహా సమస్యలు తక్కువే, కానీ, ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్నాయి. వెంటవెంటనే ఏర్పడుతుండటం ఇటు ప్రయాణికులకు చికాకు తెప్పిస్తుండగా, రైల్వే అధికారులను కలవరపెడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వే ఆధునికతకు అద్దంపడుతూ దూసుకొచ్చిన ‘వందేభారత్’కూ సాంకేతిక సమస్యలు తప్పడం లేదు. రైళ్లలో సాంకేతిక సమస్యలు సాధారణమే అయినా, క్రమంగా ఆ సమస్య పెరుగుతోంది. దూర ప్రాంతాల మధ్య తిరిగే సాధారణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకు మూడు జతల రేకు(ఓ రైలు సెట్) ఉంటుంది.ప్రయాణ సమయం దాదాపు 26 గంటలు తీసుకునే హైదరాబాద్–ఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకుంటే.. హైదరాబాద్‌లో ఉదయం ఒక రైలు బయలు దేరగా, దాని ఒక జత రైలు అదే రోజు ఢిల్లీలో బయలుదేరుతుంది. మరో జత రైలు దారిలో ఉంటుంది. తక్కువ దూరం తిరిగే వాటికి రెండు జతలుంటాయి. » హైదరాబాద్–విశాఖపట్నంలాంటి సాధారణ దూరం తిరిగే (సగం రోజు ప్రయాణ సమయం) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తీసుకుంటే.. ఒక రైలు హైదరాబాద్‌లో బయలుదేరుతుంటే, అదే సమయానికి దాని జత రైలు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. » హైదరాబాద్‌లో ఉదయం బయలుదేరే తిరుపతి వందేభారత్ రైలు, అదే రోజు మధ్యాహ్నం తిరుపతి చేరుకొని, కాసేపటికే అక్కడ బయలుదేరి రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంటుంది. దేశంలోని అన్ని వందేభారత్ రైళ్లది ఇదే తీరు. ఇక్కడే ఇప్పుడు సమస్య ఏర్పడుతోంది. ఒక చోట రైలు బయలుదేరేప్పుడు సాంకేతిక సమస్య ఏర్పడి ఆలస్యంగా బయలుదేరితే, గమ్యస్థానం చేరి, తిరిగి అక్కడ బయలుదేరేందుకు జాప్యం తప్పటం లేదు. » ఈనెల 16న విశాఖపట్నంలో హైదరాబాద్ వచ్చే వందేభారత్ రైలు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. విజయవాడలో మరో రెండు గంటలు ఆలస్యమైంది. వెరసి ఐదు గంటలు ఆలస్యంగా హైదరాబాద్ చేరుకుంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు తిరుగుప్రయాణం ఉండాల్సి ఉండగా, ఐదు గంటలు ఆలస్యంగా రాత్రి 8 గంటలకు ఆ రైలు బయలుదేరాల్సి వచ్చింది. ఒక కోచ్‌లో సాంకేతిక సమస్య తలెత్తితే రైలు ఆగిపోవాల్సిందే.. ఇక వందేభారత్ డిజైన్ కూడా ఈ జాప్యానికి మరో కారణమవుతోంది. ఇది సంప్రదాయ ఎక్స్‌ప్రెస్ రెళ్లకు భిన్నంగా ఉంటుంది. డెమూ, మెమూ తరహాలో రెండు ఇంజిన్లు రైలులో అంతర్భాగంగా ఉంటాయి. మూడునాలుగు కోచ్‌లు కలిపి ఒక సెట్‌గా ఉంటుంది. దీనికి పవర్‌కార్ జత కలిసి ఉంటుంది. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లు కూడా ఇదే డిజైన్‌తో ఉంటాయి. ఓ కోచ్‌లో సాంకేతిక సమస్య తలెత్తితే, ఆ కోచ్ ఉండే సెట్ మొత్తాన్ని తొలగించి దాని స్థానంలో మరో సెట్ చేర్చి రైలును పంపేస్తారు. తర్వాత.. సాంకేతిక సమస్య తలెత్తిన కోచ్‌ను డిపోనకు తీసుకెళ్లి మరమ్మతు చేస్తారు. ఇందుకోసం స్పేర్ కోచ్‌లను అందుబాటులో ఉంచుతారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ సర్విసుకు 12 కోచ్‌లతో కూడిన రెండు రేక్‌లు స్పేర్ విధుల్లో ఉన్నాయి. కానీ వందేభారత్‌కు స్పేర్ చోక్ సెట్లు లేవు. ఓ కోచ్‌లో సమస్య తలెత్తితే దానికి మరమ్మతు చేసేవరకు మొత్తం రైలును నిలిపివేయాల్సిందే. వారంరోజుల క్రితం విశాఖపట్నం నుంచి ఐదు గంటలు ఆలస్యంగా రావటానికి ఇదే కారణమైంది. -
ఈసారి ఇంకా ఆలస్యంగా టీఎస్ఈఏపీ కౌన్సెలింగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి కౌన్సెలింగ్ ఈ ఏడాది మరింత ఆలస్యమయ్యేలా కన్పిస్తోంది. ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ ఇప్పటికీ మొదలవ్వకపోవడం ఈ అనుమానా లకు తావిస్తోంది. ఇంజనీరింగ్‌కు సంబంధించిన కొన్ని బ్రాంచీల్లో సీట్ల పెంపునకు పెద్ద ఎత్తున దరఖాస్తులొచ్చాయి. మరికొన్ని బ్రాంచీల్లో సీట్ల కుదింపును కాలేజీలు కోరుకుంటున్నాయి. వీట న్నింటిపైనా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సీట్లపై స్పష్టత వచ్చినప్పటికీ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు కాలేజీలకు అను బంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం యూనివర్సిటీ బృందాలు కాలే జీలను సందర్శించాల్సి ఉంటుంది. మౌలిక వస తులు ఏ మేరకు ఉన్నాయి? ఫ్యాకల్టీ పరిస్థితి ఏమిటి? అనే అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అన్ని అర్హతలు ఉన్నప్పుడు మాత్రమే అనుబంధ గుర్తింపు ఇస్తారు. అప్పుడే కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొనే వీలుంటుంది. కానీ ఇప్ప టివరకు ఇందుకు సంబంధించిన సమావేశమే జరగలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆలస్యానికి కారణాలేంటి? రాష్ట్ర ఈఏపీసెట్ మే 7వ తేదీ నుంచి మొదలై 11తో ము గుస్తుంది. నెల రోజుల్లో ఫలి తాలు వెల్లడిస్తారు. అదే రోజు కౌన్సెలింగ్ తేదీలనూ ప్రకటిస్తారు. కౌన్సెలింగ్ మొదలయ్యే నాటికి రాష్ట్రంలోని 175 కాలేజీల్లో ఉండే కన్వీనర్ కోటా సీట్లను బ్రాంచీల వారీగా వెల్లడించాల్సి ఉంటుంది. గత ఏడాది లెక్కల ప్రకారం 90 వేలకు పైగా ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది మొత్తం 14 వేల సీట్లు కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో పెరిగాయి. ఈ ఏడాది కూడా మరి కొన్ని సీట్లు పెంచాలని కాలేజీలు కోరుతు న్నాయి. గత ఏడాది తనిఖీల ప్రక్రియపై ఆరో పణలు వచ్చాయి. మౌలిక వసతులు, సరైన అధ్యాపకులు లేకుండా అనుబంధ గుర్తింపు ఇచ్చి నట్టు కొన్ని వర్సిటీలపై విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి ప్రత్యేక బృందాలను నియమించాలని నిర్ణయించారు. వసతులు లేని కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచి సీట్ల కుదింపు అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ ఆల స్యమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అయితే కౌన్సెలింగ్ సకాలంలోనే జరుగుతుందని భావిస్తు న్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. -
ప్రాజెక్టులపై రూ.4.4 లక్షల కోట్ల అదనపు భారం
న్యూఢిల్లీ: మౌలిక రంగానికి సంబంధించి 421 ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం కారణంగా వ్యయం రూ.4.40 లక్షల కోట్ల మేర పెరిగినట్టు కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ నివేదిక తెలిపింది. ఈ ప్రాజెక్టులన్నీ కూడా రూ.150 కోట్లు అంతకుమించి నిర్మాణ వ్యయంతో కూడినవి కావడం గమనార్హం. మొత్తం1,831 ప్రాజెక్టులకు గాను 421 ప్రాజెక్టులు పెరిగిపోయిన వ్యయాలతో నత్తనడకన సాగుతుంటే, 845 ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమైనట్టు తెలిపింది. ‘‘మొత్తం 1,831 ప్రాజెక్టుల అసలు నిర్మాణ వ్యయం అంచనా రూ.25.10 లక్షల కోట్లు కాగా, వీటి నిర్మాణం పూర్తయ్యే నాటికి వ్యయం 29.51 లక్షల కోట్లుగా ఉంటుంది. దీనివల్ల నిర్మాణ వ్యయ భారం 17.54 శాతం మేర అంటే, రూ.4.40 లక్షల కోట్లు పెరిగింది’’అని వివరించింది. 2023 నవంబర్ నాటికి ఈ ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చు రూ.15.58 లక్షల కోట్లుగా ఉంది. అంటే మొత్తం అంచనాలో 53 శాతం వ్యయం చేశారు. ఆలస్యమైన 845 ప్రాజెక్టుల్లో 204 ప్రాజెక్టులకు సంబంధించి జాప్యం 1–12 నెలల మధ్య ఉంటే, 198 ప్రాజెక్టులు 13–24 నెలల ఆలస్యంగా, 322 ప్రాజెక్టులు 25–60 నెలలు, 121 ప్రాజెక్టులు 60 నెలలకు పైగా జాప్యంతో కొనసాగుతున్నాయి. భూ సమీకరణ, అటవీ, పర్యావరణ అనుమతుల్లో జాప్యం, మౌలిక సదుపాయాల మద్దతు లేకపోవడం సకాలంలో నిర్మాణాలు పూర్తి కాకపోవడానికి, వ్యయాలు పెరిగిపోవడానికి కారణాలుగా ఉన్నాయి. -
పొగమంచు ఎఫెక్ట్‌తో పలు విమానాలు దారి మళ్లింపు
సాక్షి,న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో విమానాల రాకపోకలకు పొగ మంచు అడ్డం పడింది. ప్రతికూల వాతావరణం దృష్ట్యా విమానాలు ల్యాండ్ కాలేకపోతున్నాయి. దీంతో పలు విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే దారి మళ్లించిన విమానాల సమాచారాన్ని అధికారులు తెలియజేశారు. మరోవైపు హైదరాబాద్ నుంచి ఉదయం 6.15కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని(AI559) జైపూర్‌కు దారి మళ్లించారు. ఈ విమానంలోనే వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. దీంతో ఆయన 11 గంటలకు జరుగనున్న పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌కు ఆలస్యంగా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు అఖిలపక్ష సమావేశం పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం. ఉదయం 11గం.లకు పార్లమెంటు లైబ్రరీ భవనంలో ఈ భేటీ జరగనుంది. వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు అవుతుండగా.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ఎజెండాగా ఈ భేటీ జరుతోంది. ఇదిలా ఉంటే.. డిసెంబర్ 4 నుంచి 22 వరకూ కొనసాగనున్నాయి పార్లమెంటు శీతాకాల సమావేశాలు. -
మిజోరంలో ఓట్ల లెక్కింపు 4న
న్యూఢిల్లీ: íఇటీవల ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న ఒకే రోజు మొదలవుతుందని ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మిజోరంలో మాత్రం ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు శుక్రవారం ఈసీ తెలిపింది. క్రైస్తవులు మెజారిటీ కలిగిన ఈ రాష్ట్రానికి చెందిన వివిధ వర్గాల ప్రతినిధులు 3వ తేదీ, ఆదివారం తమకు ఎంతో ప్రత్యేకమైనది అయినందున ఓట్ల లెక్కింపు వాయిదా వేయాలని కోరినట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు కౌంటింగ్‌ను ఒక రోజు అంటే 4వ తేదీకి వాయిదా వేసినట్లు వివరించింది. -
గవర్నర్‌పై సుప్రీంకోర్టులో కేరళ పిటిషన్
న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులకు అంగీకారం తెలపడంలో రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్ విపరీతమైన జాప్యం చేస్తున్నారని కేరళ ప్రభుత్వం ఆక్షేపించింది. బిల్లులకు త్వరగా అంగీకారం తెలిపేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ లు చేసింది. ప్రజల హక్కులను గవర్నర్ అగౌరవపరుస్తున్నారని పేర్కొంది. ప్రస్తుతం 8 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. వాటిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలియజేసింది. ఇవన్నీ ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులేనని ఉద్ఘాటించింది. -
మా ఆదేశాలే అపహాస్యమా?
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, వారి వర్గం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్ చేస్తున్న జాప్యంపై సుప్రీంకోర్టు మండిపడింది. దీనిపై నిర్ణయాన్ని ఆయన నిరవధికంగా వాయిదా వేస్తూ పోజాలరని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ‘‘స్పీకర్ కాస్త విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మేం భావించాం. నిర్దిష్ట కాలావధిలోగా ఈ అంశాన్ని పరిష్కరించాల్సిందిగా గత విచారణ సమయంలోనే ఆయనకు మేం స్పష్టంగా నిర్దేశించాం. ఇందుకు కాలావధి కూడా పెట్టుకోవాల్సిందిగా సూచించాం. ఆయన దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్టు కని్పంచాలి. కానీ ఈ అంశంపై అసలు విచారణే జరపడం లేదు’’ అంటూ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు తలంటిపోశారు. ‘‘గత జూన్ నుంచీ ఈ విషయం అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. మేమంతా గమనిస్తూనే ఉన్నాం. అసలు స్పీకర్ ఏమనుకుంటున్నారు? మా ఆదేశాలనే అపహాస్యం చేస్తారా? ఇదేమైనా ఆషామాషీ విషయమని అనుకుంటున్నారా?’’ అంటూ ఆగ్రహించారు. ‘‘ఈ విషయంలో స్పీకర్‌కు కచి్చతంగా ‘సలహా’ అవసరం. వెంటనే ఎవరైనా ఆ పని చేయడం మేలు‘‘ అని స్పీకర్ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సీజేఐ సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకపోతే ఈ మొత్తం ప్రక్రియకు అర్థమే లేకుండా పోతుందన్నారు. ఈ అంశాన్ని ఎప్పట్లోగా తేలుస్తారో స్పష్టంగా పేర్కొంటూ మంగళవారం నాటికి తమకు టైమ్‌లైన్‌ను సమరి్పంచాలని ఆదేశించారు. లేదంటే ఈ విషయమై తామే నేరుగా ఆదేశాలిస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. స్పీకర్‌ను బాధ్యున్ని చేయాల్సి వస్తుంది! మహారాష్ట్రలో పలువురు ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలు రద్దు చేయాలంటూ శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత ఉద్ధవ్‌ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం ముందు శుక్రవారం విచారణ కొనసాగింది. ఠాక్రే వర్గం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు కొనసాగించారు. దీనిపై జూలై 14న స్పీకర్‌కు ధర్మాసనం నోటీసులు జారీ చేసినా ఇప్పటికీ ఏమీ జరగలేదని సీజేఐ దృష్టికి తెచ్చారు. దాంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదుటి పక్షం వారి వాదనలను పరిగణనలోకి తీసుకోవడం, ఇందులో పలు అంశాలను స్పీకర్ ముందుగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్న సొలిసిటర్ జనరల్ మెహతా వివరణతో సంతృప్తి చెందలేదు. ‘‘ఈ విషయమై మేం జూలై 14న స్పష్టమైన సూచనలు జారీ చేశాం. సెప్టెంబర్ 18న ఆదేశాలు కూడా వెలువరించాం. అయినా స్పీకర్ చేసిందేమీ లేదు. కనుక రెండు నెలల్లోగా దీనిపై ఆయన నిర్ణయం తీసుకోవాలని మేం ఆదేశించక తప్పడం లేదు’’ అన్నారు. ‘‘స్పీకర్ పదవికున్న హుందాతనం దృష్ట్యా తొలుత మేం టైంలైన్ విధించలేదు. కానీ ఆయన తన బాధ్యతలను నెరవేర్చకపోతే అందుకు బాధ్యున్ని చేయక తప్పదు’’ అని అన్నారు. -
కన్నీటి వాగు
కెరమెరి(ఆసిఫాబాద్): పత్తి చేనులో పురుగు మందు పిచికారీ చేస్తూ విష ప్రభావానికి గురైన లక్మాపూర్ రైతు మాలోత్ లక్ష్మణ్ (50)ను వాగు దాటించి ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో మృతి చెందాడు. లక్ష్మణ్ శుక్రవారం తన పత్తి పంటకు పురుగు మందు పిచికారీ చేస్తుండగా విషప్రభావంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. గమనించిన సమీప రైతులు ఆయనను ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును కష్టంగా దాటించి.. కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత ఉట్నూ ర్ సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా.. అర్ధరాత్రి 12 గంటలకు పరిస్థితి విషమించి మృతి చెందాడు. శనివారం కూడా వాగు ఉధృతి తగ్గక పోవ డంతో మృతదేహాన్ని మంచంపైనే వాగు దాటించారు. కాగా ఈ నెల 8న ‘ప్రాణాలు పోయా కా స్పందిస్తారా..?’ అన్న శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైన రోజే మృతి చెందడం గమనార్హం! ఆలస్యం కాకుంటే.. లక్ష్మణ్ తన చేనులో పడిపోగా.. వాగు దాటించి కెరమెరి పీహెచ్‌సీకి చేర్చడానికి రెండు గంటల సమయం పట్టింది. దీంతో ప్రాథమిక చికిత్స అందడం ఆలస్యమైంది. అక్కడి నుంచి ఉట్నూర్, ఆ తర్వాత ఆదిలాబాద్ రిమ్స్‌కు చేరేసరికి లక్ష్మణ్ పరిస్థితి విషమించింది. రిమ్స్ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. సకాలంలో తీసుకొస్తే ప్రాణాలు దక్కేవని రిమ్స్ వైద్యులు పేర్కొన్నట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. -
ఒకట్రెండు త్రైమాసికాలు సవాళ్లే
ముంబై: వ్యాపార ఒప్పందాల విషయంలో జాప్యం జరుగుతోందని మధ్య స్థాయి ఐటీ కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ తెలిపింది. రాబోయే ఒకట్రెండు త్రైమాసికాలు సవాళ్లు ఉంటాయని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ కల్రా శుక్రవారం తెలిపారు. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, కోవిడ్ మహమ్మారి వంటి సవాళ్లను కంపెనీ చవిచూసిందని అన్నారు. ‘ప్రస్తుతం ఒప్పందాల ముగింపునకు ఎక్కువ సమయం పడుతోంది. సగటు సమయం సుమారు మూడు నెలల నుండి 4–6 నెలలకు చేరింది. జూన్ త్రైమాసికంలో కొత్త ఒప్పందాల విలువ మార్చి త్రైమాసికంతో పోలిస్తే రూ.2,050 కోట్ల నుంచి రూ.1,943 కోట్లకు పడిపోయింది. అయితే ఒప్పందాల విషయమై పలు సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయి. కంపెనీ ఆదాయ వృద్ధి మార్చి త్రైమాసికంతో పోలిస్తే దాదాపు 3 శాతం క్షీణించి రూ.2,321 కోట్లకు పడిపోయింది. నిర్ణీత సమయాల్లో మొత్తం 800 మంది ఫ్రెషర్లను బోర్డులోకి తీసుకురావడానికి కంపెనీ కట్టుబడి ఉంది. మార్చితో పోలిస్తే జూన్ క్వార్టరులో ప్రాఫిట్ మార్జిన్ 0.5 తగ్గి 14.9 శాతంగా ఉంది. నికరలాభం 8.1 శాతం ఎగసి రూ.229 కోట్లను తాకింది. కొత్తగా 240 మంది చేరికతో మొత్తం సిబ్బంది సంఖ్య జూన్ చివరినాటికి 23,130కి చేరింది. కోల్‌కత, కొచి్చలో నూతనంగా కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’ అని సందీప్ వెల్లడించారు. -
ద్రవ్యోల్బణంపై రుతుపవనాల ప్రభావం
ముంబై: భారత్‌లో రుతువవనాలు ఆలస్యం అవ్వడం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తుందని జర్మనీకి చెందని డాయిష్ బ్యాంక్ అంచనా వేసింది. మే నెల ద్రవ్యోల్బణం డేటా శాంతించినట్టు అధికారిక గణాంకాలు చూపించినా కానీ, ఈ విషయంలో సంతృప్తి చెందడానికి లేదని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (202324)లో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఇది ఆర్బీఐ అంచనా 5.1 శాతానికి దగ్గరగానే ఉంది. విశ్లేషకులు అయితే 5 శాతంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ‘‘రుతుపవన వర్షాలు ప్రస్తుతం సాధారణ స్థాయికి 53 శాతం తక్కువగా ఉన్నాయి. వర్షపాతం బలహీనంగా ఉన్నప్పుడు ఆహారం ధరలు పెరిగిపోతాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. అందుకని, భారత్‌కు సంబంధించి ద్రవ్యోల్బణం రిస్క్‌ల విషయంలో ఇప్పటి వరకైతే సంతృప్తికి అవకాశం లేదు’’అని డాయిష్ బ్యాంక్ తెలిపింది. జూలై, ఆగస్ట్‌లో ఆహార ధరలు పెరగకుండా, అదృష్టం తోడయితేనే రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం, అంతకంటే తక్కువలో ఉండొచ్చని పేర్కొంది. వర్షాకాలంలో జూలై నెల కీలకమని, సాధారణంగా ఆహార ధరలు ఈ నెలలోనే ఎక్కువగా పెరుగుతాయని వివరించింది. చివరిగా 2009, 2014 సంవత్సరాల్లో వర్షాలు తక్కువగా ఉన్న సందర్భాల్లో జూలైలోనే ధరలు అధికంగా పెరిగినట్టు గుర్తు చేసింది. ఇప్పటి వరకు నైరుతి రుతుపవన సీజన్లో 53 శాతం వర్షపాతం తక్కువగా ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించడం గమనార్హం. కూరగాయాల్లో ఎక్కువగా డిమాండ్ ఉండే ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, టమాటోల ధరలు రానున్న నెలల్లో గణనీయంగా పెరగొచ్చని డాయిష్ బ్యాంక్ అంచనా వేసింది. 2023లో ఎల్‌నినో రిస్క్ ఉన్నందున వర్షాలు ఆలస్యంగా రావడం ద్రవ్యోల్బణం పరంగా ఆందోళన కలిగించే అంశమని అభిప్రాయపడింది. వృద్ధిపైనా ప్రభావం రుతుపవనాలు బలహీనంగా ఉంటే అది దేశ జీడీపీ వృద్ధిపైనా ప్రభావం చూపించొచ్చని డాయిష్ బ్యాంక్ తెలిపింది. వర్షాలు నిరాశపరిచి, వ్యవసాయ వృద్ధి 2004, 2009, 2014 కరువు సంవత్సాల్లో మాదిరే 1 శాతం స్థాయిలో ఉంటే, జీడీపీ వృద్ధి 0.30 శాతం తగ్గిపోవచ్చని అంచనా వేసింది. -
జూన్ రెండోవారం దాటినా.. వర్షాల జాడేది? ఇంకా మండుతున్న ఎండలు
మే నెల ముగిసింది.. సాధారణంగా జూన్ ఒకటో తేదీన కేరళలోకి రుతుపవనాలు ఎంటర్ అవుతాయి. ఒక వారం రోజులు అటూ ఇటూగా ఈ ప్రక్రియ కొనసాగుతుంటుంది. కానీ జూన్ రెండోవారం దాటినా ఇంకా వరణుడి జాడ మాత్రం కనిపించడం లేదు. ఇంకా భానుడి భగభగలతో జనాల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసలు ఎందుకీ పరిస్థితి ఉంది? వర్షాకాలం మొదలైనా ఇంకా ఎందుకు ఎండలు మండిపోతున్నాయి? అసలు వర్షాలు పడేదెప్పుడు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం. గడిచిన 15 రోజుల్లో జిల్లాలో సాధారణ వర్షపాతం 75.3. మిల్లీ మీటర్లు నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు ఒక్క చినుకు కూడా రాలలేదు. నైరుతి రుతు పవనాలు ఇంకా కేరళ తీరాన్ని తాకలేదు.మండుతున్న ఎండలు చూస్తుంటే ఇప్పట్లో వర్షాలు కురిసే పరిస్థితి కనబడడం లేదు. వర్షాకాలంలోనూ ఇంకా ఎండలు మండిపోతూనే ఉన్నాయి. జూన్ రెండో వారం దాటినా.. ఇంకా రాష్ట్రంలో భానుడు సెగలు కక్కుతున్నాడు. రికార్డు స్థాయిలో పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మేర రికార్డ్ అవుతున్నాయి. ప్రస్తుతం హీట్‌వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాకాలం కాస్త ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది.ప్రతి ఏటా జూన్ మాసం నుంచే వర్షాలు ప్రారంభమవుతాయి. కానీ ఈసారి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. జూన్ మొదటి వారంలోనే కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఆలస్యంగా అంటే, 8వ తేదీన కేరళను తాకాయి. అక్కడి నుంచి రుతుపవనాలు విస్తరించడానికి 5 రోజుల సమయం పడుతుంది.నైరుతి రుతుపవనాల రాక ఆలస్యంతోనే ఎండలు మండిపోతున్నాయని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో పశ్చిమ దిశ, ఉత్తర దిశ నుంచి గాలులు వీస్తున్నాయని, ఆ కారణంగా ఇంకా ఎండలు మండుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే మరో రెండు, మూడు రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రుతుపవనాల రాక ఆలస్యం అయినా ఒక్కసారి అవి ఎంటర్ అయ్యాక సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు. -
TS: పాఠశాలకు చేరని ‘పాఠాలు’!
సాక్షి, హైదరాబాద్: స్కూళ్లు తెరిచేలోగా పాఠశా లలకు పాఠ్య పుస్తకాలు చేరుస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన కార్యాచరణకు ఆమడ దూరంలో ఉంది. మరో రెండురోజుల్లో స్కూళ్లు తెరుస్తున్నా ఇప్పటివరకు ఒక్క పుస్తకం కూడా పాఠశాళలకు చేరలేదు. ముద్రణ పూర్తయిన పుస్తకాలు ఎక్కడిక క్కడే ఉండిపోయాయి. వాటిని విద్యార్థులకు అందించే బాధ్యత హెచ్‌ఎంలదే అని విద్యాశాఖ చెబుతుండగా తమకేం సంబంధం లేదని హెచ్ఎంలు స్పష్టం చేస్తుండటంతో పుస్తకాలు జిల్లా కేంద్రాల్లోనే మగ్గుతున్నాయి. పుస్తకాలను గుట్టలుగా పడేయడంతో కొన్నిచోట్ల ఎలుకలు కొడుతున్నాయి. సరైన సదు పాయం లేని స్కూళ్లలో వర్షం వస్తే తడిసిపోయే ప్రమాదముందని అంటున్నారు. ఈ నెల 12న స్కూళ్లు తెరుచుకోనుండగా ఇప్పుడు హడావుడి చేసినా నెలాఖరుకు కూడా వాటిని పంపడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 100 శాతం పూర్తికాని ముద్రణ విద్యాశాఖ అడకమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 15 నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు ప్రారంభించాలి. రాష్ట్రవ్యాప్తంగా 28,77,675 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నారు. వీరికి ఉచితంగా పుస్తకాలు అందించాల్సి ఉంది. సబ్జెక్టులు, లాంగ్వేజీలు కలిపి 1,63,78,607 పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. గత ఏడాది ముద్రించినవి పోను, ఇంకా 1,57,48,270 పుస్తకాలు అందించాలి. ఇందులో ఇప్పటివరకు 1,35,85,185 పుస్తకాలు ముద్రించారు. వీటిని జిల్లా కేంద్రాలకూ చేరవేశారు. ఇంకా 14 శాతం పుస్తకాల ముద్రణ పూర్తి కావలసి ఉండటంతో.. ఇప్పుడున్నవి పంపిణీ చేసినా, కొన్ని స్కూళ్ళకు పుస్తకాల కొరత ఏర్పడనుంది. రవాణా టెండర్లు ఏమయ్యాయి? ముద్రణ అనంతరం జిల్లా కేంద్రాలకు చేరిన పుస్తకా లను హెచ్ఎంలు తమ పాఠశాలలకు తీసుకు వెళతారు. ఇందుకయ్యే ఖర్చంతా ముందుగా హెచ్ఎంలే భరించి ఆ తర్వాత విద్యాశాఖకు బిల్లులు పెట్టి తీసుకుంటారు. అయితే గత రెండేళ్లుగా బిల్లులు రాలేదని హెచ్ఎంలు అంటున్నారు. ఈ కారణంగా వారు పుస్తకాలు తీసుకెళ్లట్లేదు. దీంతో పుస్తకాల రవా ణాకు టెండర్లు పిలవాలని పాఠశాల విద్య డైరెక్టర్ ఇటీవల అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. టెండర్లు ఆహ్వానించే గడువు కూడా ఈ నెల 15 వరకూ పెట్టారు. అయితే ఇప్పటివరకు ఒకటి, రెండు జిల్లాల్లో తప్ప ఎక్కడా టెండర్లు పిలవలేదు. దీంతో టెండర్లు దాఖలయ్యేదెప్పుడు? ఖరారు చేసేదెప్పుడు? టెండర్ దక్కించుకున్న సంస్థ పుస్తకాలు చేరవేసేదెప్పుడు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బడులు తెరిచాక పుస్తకాలు అందించకపోతే పిల్లలకు పాఠాలు చెప్పేదెలా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పుస్తకాలు లేకుంటే ఎలా..? పుస్తకాల చేరవేతకు టెండర్లు పిలవమని ఉన్నతాధికారులు చెప్పినా, అది అమలుకు నోచుకోవడం లేదు. జూన్ 12న స్కూళ్ళు తెరిచేలోగా పుస్తకాలు అందకపోతే బోధనకు ఇబ్బంది అవుతుంది. డీఈవోలు తక్షణమే ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేయాలి. వంద శాతం పుస్తకాలు ఉంటేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. –పి.రాజా భానుచంద్ర ప్రకాశ్ (తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు) -
తెలుగు రాష్ట్రాల్లో మరో 10 రోజులపాటు ఉష్ణతాపం
-
బోనస్ ఇస్తాంలే కాస్త ఆగండి.. జాయినింగ్ ఆలస్యం చేస్తున్న యాక్సెంచర్
ఇటీవల 19,000 మంది ఉద్యోగుల తొలగింపును ప్రకటించిన యాక్సెంచర్ కొత్త ఉద్యోగుల జాయినింగ్‌ను కూడా ఒక సంవత్సరం వరకు ఆలస్యం చేస్తోంది. కంపెనీ కొత్త ఉద్యోగుల జాయినింగ్ తేదీని ఎప్పుటికప్పుడూ పొడిగిస్తూ వస్తున్న సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. (Vodafone Idea 5G: వోడాఫోన్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు ముగిసిన నిరీక్షణ!) తమకు ప్రస్తుతం కొత్త ఉద్యోగుల అవసరం లేనందునే యాక్సెంచర్ కొత్త ఉద్యోగుల జాయినింగ్ తేదీలను పొడిగిస్తూ వస్తున్నట్లు తెలిసింది. పరిస్థితి ఇలా ఉంటుందని ముందే తెలిస్తే తాము మరేదైనా కంపెనీలో చేరేవాళ్లమని, కానీ యాక్సెంచర్ జాయినింగ్‌ను నెలల తరబడి ఆలస్యం చేస్తూ వస్తోందని అభ్యర్థులు నిట్టూరుస్తున్నారు. తమ క్లయింట్ల అవసరాలకు తగ్గట్టుగా కొత్త ఉద్యోగుల జాయినింగ్ తేదీలను సర్దుబాటు చేస్తున్నట్లుగా యాక్సెంచర్ ప్రతినిధి రాచెల్ ఫ్రే ఈమెయిల్ ద్వారా తెలియజేశారు. ఇలా ఎంతమంది అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ జాప్యం ఇలాగే కొనసాగుతుందా అనే విషయాలపై స్పష్టత లేదు. (Akshata Murthy: బ్రిటన్ ప్రధాని సతీమణి చేతికి ఒక్క రోజులో రూ.68 కోట్లు..) యాక్సెంచర్ తనకు యూకేలో కన్సల్టింగ్ ఉద్యోగం ఇచ్చిందని, వచ్చే జూన్‌లో ఉద్యోగంలో చేరాల్సి ఉండగా జాయినింగ్ తేదీని అక్టోబరు నెలకు మార్చిందని ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఓ అభ్యర్థి బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థకు తెలియజేసింది. జాయినింగ్ తేదీని మళ్లీ 2024 సంవత్సరం ప్రారంభానికి మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఆ ఉద్యోగం వదిలివేయాలని నిర్ణయించుకున్నారు. అయితే జాయినింగ్ ఆలస్యానికి యాక్సెంచర్ రిక్రూటర్ ఆ ఈమెయిల్లో క్షమాపణలు కోరారు. ఇలా జాయినింగ్ ఆలస్యం అయిన వారికి కంపెనీ అదనపు బోనస్ ఇవ్వనున్నట్లు తెలిసింది. యాక్సెంచర్‌లో జాయినింగ్ ఆలస్యం కావడం పట్ల విసుగు చెందిన కొందరు అభ్యర్థులు రెడ్డిట్ ఫోరమ్‌లలో కూడా తమ నిరాశను వ్యక్తం చేశారు. (Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి...) -
మరోసారి దాడి.. విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ ఆలస్యం
విశాఖ: రైల్వే శాఖ హెచ్చరికలు జారీ చేసినా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు. తెలుగు రాష్ట్రాల వందే భారత్ రైలుపై మరోసారి రాళ్లదాడి జరిగింది. బుధవారం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దారిలో.. ఖమ్మం-విజయవాడ మధ్య రైలుపై రాళ్లు విసిరిన అగంతకులు. దీంతో.. C8 కోచ్ అద్దాలు పగిలిపోయాయి. కోచ్ మరమ్మత్తుల నేపథ్యంలో ఇవాళ(గురువారం) విశాఖ నుంచి రైలు ఆలస్యంగా బయలుదేరుతోంది. విశాఖ నుంచి 5.45కు బయలుదేరి వెళ్లాల్సిన వందే భారత్ ఆలస్యం..షెడ్యూల్ కంటే ఆలస్యంగా 9-.45కి బయలుదేరనుంది. గతంలోనూ ఈ రూట్లో వందే భారత్‌పై రాళ్ల దాడులు జరిగాయి. ఫిబ్రవరిలో ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో, అంతకు ముందు సైతం ఓసారి ఇలాగే దాడి జరిగింది. వరుసగా రైళ్లపై రాళ్ల దాడి జరగడంతో దక్షిణమధ్య రైల్వే సీరియస్‌గా స్పందించింది. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రాళ్లదాడికి పాల్పడే నిందితులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. అంతేకాదు.. ఇలా నేరం చేసిన వారిపై కేసులు నమోదు చేసిన కేసుల్లో 39 మందిని అరెస్టు చేశారు కూడా. ఇదిలా ఉంటే.. శనివారం కొత్తగా సికింద్రాబాద్-తిరుపతి రూట్లో వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. -
ఉప్పల్ తిప్పల్.. మోదీ పోస్టర్ల కలకలం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి పోస్టర్ల కలకలం రేగింది. ఉప్పల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లు వెలిశాయి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ జాప్యంపై మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. ‘‘మోదీ గారు.. ఈ ఫ్లై ఓవర్ పనులు ఇంకా ఎన్నాళ్ళు? తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం’’ అని వెలిసిన పోస్టర్లు దారి పొడవునా కనిపిస్తున్నాయి. ఉప్పల్ నుండి ఘట్కేసర్ వెళ్ళే వరంగల్ హైవే పై కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ఐదేళ్లలో సగం పనులు కూడా పూర్తి కాలేదు. దీంతో.. ఆ రూట్లో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. పనులు నడుస్తుండడంతో సాయంత్రం వేళ్ల ఉప్పల్, మేడిపల్లి మధ్య ప్రయాణం గంటకు పైనే పడుతోంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లేవారు ఉప్పల్ రింగ్‌రోడ్డు, బోడుప్పల్, మేడిపల్లి, చెంగిచర్ల చౌరస్తాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారాంతాల్లో అయితే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటోంది. దీంతో వాహనదారులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు పోస్టర్ రాజకీయం తెర మీదకు వచ్చింది. ఉప్పల్ వరంగల్ హైవేపై.. ఉప్పల్ - మేడిపల్లి మధ్య ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు భారత్‌మాల పథకం కింద రూ.626.80 కోట్ల వ్యయంతో 6.2 కిలోమీటర్ల దూరంతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. ఉప్పల్ జంక్షన్ నుంచి మేడిపల్లి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ దాకా ఈ ఫ్లైఓవర్ వేయాలని భావించింది కేంద్రం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. 2018 మేలో ఈ ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన చేశారు. జూలైలో పనులు ప్రారంభం కాగా.. 2020 జూన్ వరకు నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చేపట్టిన.. ఈ 45 మీటర్ల ఆరులేన్ల కారిడార్ పనులు నెమ్మదిగా సాగుతోంది. మరోవైపు ఈ నిర్మాణ పనులతో ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. కారిడార్ పనులు పూర్తయితేనే రోడ్డు పనులు పూర్తిచేస్తామని అధికారులు అంటున్నారు. దీంతో ప్రజలు నిత్యం నరకయాతన పడుతున్నారు. హైదరాబాద్ లో మళ్ళీ పోస్టర్ల కలకలం ఉప్పల్ - నారపల్లి ఫ్లైఓవర్ 5 ఏండ్లు అయినా 40% పూర్తి కాలేదు.. ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు మోడీ గారు అంటూ ఫ్లైఓవర్ పిల్లర్లపై వెలసిన పోస్టర్లు.#ModiDisasterForIndia#ModiHataoDeshBachao pic.twitter.com/tAXRBbull3 — Latha (@LathaReddy704) March 28, 2023 -
విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ ఆలస్యం.. కారణం ఏంటంటే..
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మూడు గంటల ఆలస్యంగా బయలుదేరింది. ఖమ్మం వద్ద రైలు భోగి సి-12 కోచ్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. దీంతో.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో పగిలిపోయింది. ఆ కోచ్ అద్దాలను మార్చడంతో రైలు బయలుదేరడం ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. రైలు కోచ్ సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు పోలీసులు. వాళ్లను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. Modi sir,Indian Railway ,I have planned my journey in #VandeBharatexpress Train need to start at vijayawada @10.05 AM but train is delayed is by above 3 hours late..its not about speed...Indian Railways needs to respect piblic time also #PMOIndia #NarendraModi #IndianRailways — raf (@Hampi786) February 4, 2023 -
విమానం టేకాఫ్ ఆలస్యం.. ప్రయాణికులు, సిబ్బంది మధ్య రచ్చ
ఇటీవల కాలంలో పలు విమానాల్లో అనుచిత ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. విమానాల్లో సాంకేతిక లోపాలు, ప్రయాణికుల అసభ్య ప్రవర్తన వంటివి ఆందోళన రేపుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మరోటి చేరింది. విమానం టేకాఫ్ ఆలస్యం కావడంతో ప్రయాణికులకు సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగింది. ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లాల్సిన 8721 స్పైస్ జెట్ విమానం షెడ్యూల్ ప్రకారం ఉదంయ 7.20 గంటలకు టెర్మినల్ 3 నుంచి బయల్దేరాల్సి ఉంది. అయితే దాదాపు మూడు గంటలు ఆలస్యంగా అంటే 10.10 గంటలకు బయల్దేరింది. అయితే ముందుగా వాతావరణం అనుకూలించడంతో విమానం టేకాఫ్‌కు ఆలస్యం అవుతోందని ఎయిర్‌లైన్ సిబ్బంది ప్రయాణికులకు తెలియజేశారు. అనంతరం కొద్ది సమాయానికి సాంకేతిక లోపం కారణంగా విమానం ఆలస్యం అవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో విమానంలోకి ఎక్కి రెండున్నర గంటలకు పైగా నిరీక్షించిన ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. విమానం బయలుదేరడంలో ఆలస్యం కావడంపై విమానాశ్రయంలోని ఎయిర్‌లైన్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. చివరకు ఉదయం 10.10 గంటలకు ఆ విమానం టేకాఫ్ అయ్యింది. చదవండి: వాహనదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్‌పై రూ.2 సెస్..ఎక్కడంటే? -
ఫూల్స్‌ని చేయడం ఆపేయండి! వీడియో కాల్లో పుతిన్ ఫైర్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వీడియో కాల్లో ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్‌పై సీరియస్ అయ్యారు. దేశ పౌర సైనిక విమాన ఒప్పందం విషయంలో జాప్యం చేస్తున్నందుకు మంటురోవ్‌పై పుతిన్ మాటల తుటాలు పేల్చారు. ఈ మేరకు బుధవారం రష్యా ప్రభుత్వ టెలివిజన్ ప్రసారంలో.. ప్రభుత్వాధికారల సమావేశంలో జరిగిన ఒక వీడియో కాల్లో పుతిన్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి, ఉప ప్రధాని మంటురోవ్‌పై విరుచుకుపడ్డారు. 2023 ఏడాదికి సంబంధించి పౌర సైనిక విమాన ఒప్పందాలను ఒక నెలలోపు పూర్తి చేయాలని గట్టిగా హెచ్చరించారు. వాస్తవానికి రష్యా విమానాయన సంస్థ ఏరోప్లాట్తో దాదాపు 175 బిలియన్ల రూబిళ్లు(రూ. 21 వేల కోట్లు) విలువైన ఒప్పందాలు ఏర్పాటు చేసే బాధ్యత మంటురోవ్‌పై ఉంది. ఐతే సైనిక విమాన కాంట్రాక్ట్‌లు ఏవి సిద్ధంగా లేకపోవడంతోనే పుతిన్ తీవ్ర అసహనానికి గురైనట్లు అధికారికి వర్గాల సమాచారం. దీనికి మీరు చాలా వ్యవధి తీసుకుంటున్నారంటూ తిట్టిపోశారు. సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని గట్టిగా నొక్కిచెప్పారు. అయినా మీరు ఇప్పటివరకు ఏ ఎంటర్‌ప్రైజెస్‌తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదన్న విషయం తనకు తెలసునంటూ సీరియస్ అయ్యారు. ఒకవేళ ఒప్పందాలు పూర్తి అయితే గనుక ఎప్పుడూ సంతకాలు చేశారో చెప్పగలరా! అని గట్టిగా నిలదీశారు. ముందు మీరు అందర్నీ ఫూల్స్‌ని చేయడం ఆపేయండి అంటూ ఉపప్రధాని మంటురోవ్కి గట్టిగా చురకలంటించారు. బాగా ఉత్తమంగా ప్రయత్నించాలని చూడొద్దు, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని సాధ్యమైనంత తొందరగా.. కేవలం ఒకనెలలోపే ఈ ఒప్పందాలను పూర్తి చేసేలా ప్రయత్నించండి అంటూ పుతిన్ డిప్యూటి ప్రధాన మంత్రి మంటురోవ్కి గడువు కూడా ఇచ్చారు. దీనికి ఉప ప్రధాని మంటూరోవ్ పుతిన్‌కి సమాధానం ఇస్తూ..అందుకు సంబంధించిన ఆర్డర్లు సిద్ధంగానే ఉన్నాయని, తొందరగా పూర్తి చేసేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఐతే రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాత్రం అధ్యక్షుడి పుతిన్‌కి మంటురోవ్ పనితీరుపై ఎలాంటి ఫిర్యాదుల లేవని క్రెమ్లిన్ మీడియాకి చెప్పాడం గమనార్హం. Russian aviation industry didn't receive a single contract to produce a passenger plane in 2022. pic.twitter.com/9xwHYTBC3X — Anton Gerashchenko (@Gerashchenko_en) January 11, 2023 (చదవండి: క్రిమియాకు ఎందుకంత క్రేజ్? ) -
వేలాది ఉద్యోగాల కోత మాత్రమేనా..అమెజాన్ మరో సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక మాంద్యం హెచ్చరికల మధ్య టెక్ దిగ్గజం అమెజాన్ మరో కీలకనిర్ణయం తీసుకుంది. పదివేలకుపైగా ఉద్యోగులకు ఉద్వాసన పలకడమేకాదు.. కొత్త నియామకాలను కూడా ఆలస్యం చేస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో జాయిన్ కావాల్సిన యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ల జాయింనింగ్స్ కూడా వాయిదా వేసుకుంది. (చదవండి: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్: ‘సీక్రెట్’ ఫీచర్ ఒక్కసారే!) తాజా నివేదికల ప్రకారం అమెజాన్‌లో కొత్త నియామకాలు 2023, మే నాటికి ప్రారంభం కావాల్సిఉంది. కానీ ప్రస్తుత గ్లోబల్ మాంద్యం పరిస్థితుల కారణంగా ఈ నియామకాలను 2023 చివరి వరకు పొడిగిస్తోందని తెలుస్తోంది. ఈమేరకు వారికి ఇంటర్నల్ మెయిల్లో సమాచారం అందించిందట. ఆర్థిక సవాళ్ల దృష్ట్యా, నియామకాలలో కొందరికి ప్రారంభ తేదీలను ఆరు నెలల వరకు ఆలస్యం చేస్తున్నామనీ, అలాగే ఆలస్యం కారణంగా ప్రభావితమైన కొత్త ఉద్యోగులకు పరిహారం చెల్లిస్తామని కూడా అమెజాన్ తెలిపింది. ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ నిబంధనలకు కట్టుబడి ఉన్నామంటూ వారికి ఈ మెయిల్ సందేశాన్ని పంపింది. అంతేకాదు కంపెనీలో జాయిన్ అయ్యారా లేదా అనేదానితో సంబంధం లేకుండా 13వేల డాలర్లు (దాదాపు రూ. 10 లక్షలు) ఒకేసారి చెల్లింపును అందుకుంటారని ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. (ఇది కూడా చదవండి: నథింగ్ స్మార్ట్‌ఫోన్ (1)పై బంపర్ ఆఫర్: ఏకంగా 22 వేల తగ్గింపు ) కాగా వార్షిక నిర్వహణ ప్రణాళిక సమీక్షలో భాగంగా, సర్దుబాట్లలో భాగంగా అమెజాన్ ఉద్యోగుల తొలగింపులకు నిర్ణయించింది. రిటైల్ , మానవ వనరుల విభాగాలలో 10వేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత తాజా పరిణామం సంచలనంగా మారింది. మరోవైపు ఉద్యోగుల కోతను సమర్ధించుకున్న అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ 2023లో మరిన్ని తొలగింపులు ఉంటాయనే సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. -
గంటల తరబడి నిరీక్షణ తర్వాత ట్రైయిన్ ఎంట్రీ..ఒక్కసారిగా ప్రయాణికుల రియాక్షన్
వాస్తవానికి మనం ఏదైనా ఊరు లేదా యాత్రకు వెళ్లేటప్పుడూ ట్రైయిన్/బస్సు లేదా విమానం కోసం ఒక్కోసారి గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. సరిగ్గా ఆ రోజు వాతావరణం బాగోకపోవడమో లేక ఆ వాహనాల్లో సమస్య తలెత్తడం వంటి తదితర కారణాల రీత్యా ఆలస్యమైపోతుంది. దీంతో ఎవరికైనా సహజంగా కోపం, చిరాకు వంటివి వచ్చేస్తాయి. దెబ్బకు మళ్లీ ఎక్కడకి వెళ్లకూడదు అనుకునేంత చిర్రెత్తుకొస్తుంది. అచ్చం అలాంటి ఘటన ఒక రైల్వేస్టేషన్‌లోని ప్రయాణకులకు ఎదురైంది. అ లాంటి ఇలాంటి లేటు కాదు ఏకంగా 9 గంటలకు పైగా ట్రైయిన్ కోసం నిరీక్షించారు. అన్ని గంటలు అంటే కచ్చితంగా బాబోయ్ అసలు ట్రైయిన్ వస్తుందా రాదా! అన్నంత చిరాకొచ్చి వెళ్లిపోవాలనుకుంటాం. కానీ ఇక్కడ రైల్వేస్టేషన్లో వందలమంది ప్రయాణికులు ట్రైయిన్కోసం అలా పడిగాపులు కాచి ఉన్నారే తప్ప అసహనంగా కూడా లేరు. ఎట్టకేలకు తొమ్మిది గంటల ఆలస్యం తర్వాత ట్రైయిన్ రానే వచ్చింది. అంతే ప్రయాణకులంతా ఒక్కసారిగా విజిల్స్ వేస్తే ఏదో సాధించేసినట్లుగా ఫీలవుతూ హయిగా ఆ రైలు ఎక్కేసారు. అంతేకాదు దూరం నుంచి చిన్న లైటు వెలుగుతో హారన్ వేయిగానే ఎదురుచూస్తున్న ప్రయాణికుల మొహాలు చిచ్చబుడ్డిల్లా వెలిగిపోయాయి. ఐతే ఇంతకీ అదే ఏ స్టేషన్ ఎక్కడ జరిగిందనేది తెలయాల్సి ఉంది. అందుకు సబంధించిన వీడియోని హార్దిక బొంతు అనే సోషల్ మీడియా వినియోగదారుడు ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఐతే నెటిజన్లు మాత్రం ఇండియాలో ప్రజలు ఏ సమస్యనైనా ఇలానే సహనంతో నవ్వుతూ ఎదుర్కొంటారు, ఇదే ఈ దేశంలోని అసలైన అందం అని కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. Our train got late by 9 hours. This is how people reacted when it arrived. pic.twitter.com/8jteVaA3iX — Hardik Bonthu (@bonthu_hardik) November 27, 2022 (చదవండి: ఎంతపనిచేసింది ఆ దోమ..నాలుగు వారాల కోమా, ఏకంగా 30 సర్జరీలా!) -
న్యాయమూర్తుల నియామకంలో ఏమిటీ జాప్యం?
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం కోసం కొలీజియం చేసిన సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం సత్వరం నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తుండడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీరు విసుగు తెప్పించేలా ఉందని ఆక్షేపించింది. జడ్జీల నియామకాల ప్రక్రియకు భంగం కలిగించవద్దని సూచించింది. జడ్జీలను నిర్దేశిత గడువులోగా నియమించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది ఏప్రిల్ 20న టైమ్‌లైన్ ప్రకటించింది. ఈ టైమ్‌లైన్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ కౌల్, జస్టిస్ ఓజాల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎప్పుటికప్పుడు ప్రకటించడం లేదని అటార్నీ జనరల్ వెంకటరమణికి ధర్మాసనం తెలియజేసింది. వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది. తమ అసహనాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేసింది. త్రిసభ్య ధర్మాసనం నిర్దేశించిన టైమ్‌లైన్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. కొలీజియం ఒకసారి ఒక పేరును సిఫార్సు చేసిందంటే, అక్కడితో ఆ ఆధ్యాయం ముగిసినట్లే. వాటిపై ప్రభుత్వం మళ్లీ సంప్రదింపులు జరిపే పరిస్థితి ఉండకూడదు’’ అని ఉద్ఘాటించింది. కొన్ని పేర్లు ఏడాదిన్నర నుంచి పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపింది. జడ్జీలుగా పదోన్నతి పొందాల్సిన వారు ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం కారణంగా వెనక్కి తగ్గుతున్నారని ధర్మాసనం పేర్కొంది. ‘‘ఈ కేసులో ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తున్నాం. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి’’ అని ఏజేకు సూచించింది. తాము చట్టపరంగా నిర్ణయం తీసుకొనే పరిస్థితి తేవొద్దని కేంద్రానికి సూచించింది. నియామకాల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. ఉన్నత పదవుల్లో ఉంటూ అనుచిత వ్యాఖ్యలా? కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజుపై ధర్మాసనం ఆగ్రహం కొలీజియం వ్యవస్థ పట్ల కేంద్ర న్యాయ శాఖ కిరణ్ రిజిజు ఇటీవల చేసిన వ్యా్ఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తలను సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రిజిజు వ్యాఖ్యలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు అలా మాట్లాడడం సమంజసం కాదని పేర్కొంది. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టం కార్యరూపం దాల్చకపోవడం పట్ల కేంద్రం బహుశా అసహనంగా ఉన్నట్లు కనిపిస్తోందని జస్టిస్ ఎస్కే కౌల్ అన్నారు. కానీ న్యాయమూర్తుల నియామకంలో చట్ట నిబంధనలను పాటించకపోవడానికి అది కారణం కారాదని స్పష్టం చేశారు. ఆ పేర్లపై అభ్యంతరాలున్నాయి: కేంద్రం హైకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేసిన 20 పేర్లను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ‘‘ఆ పేర్లపై చాలా గట్టి అభ్యంతరాలున్నాయి. కనుక మీ సిఫార్సులను పునఃపరిశీలించండి’’ అని సూచించింది!! కేంద్రం తిప్పి పంపిన ఈ 20 పేర్లలో 11 కొలీజియం రెండోసారి సిఫార్సు చేసినవి కావడం విశేషం! మిగతా తొమ్మిదేమో కొత్త పేర్లు. తాను స్వలింగ సంపర్కినని బాహాటంగా ప్రకటించిన అడ్వకేట్ సౌరభ్ కృపాల్ పేరు కూడా తిప్పి పంపిన జాబితాలో ఉంది. ఆయన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బి.ఎన్.కృపాల్ కుమారుడు. ఢిల్లీ హైకోర్టు కొలీజియం ఆయన పేరును 2017లో కొలీజియానికి సిఫార్సు చేసింది. దానిపై కొలీజియం మూడుసార్లు విభేదించింది. జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే సీజేఐగా ఉండగా కృపాల్ గురించి ప్రభుత్వం నుంచి మరింత సమాచారం కోరారు. అనంతరం 2021లో జస్టిస్ రమణ సీజేఐగా కృపాల్ పేరును ఢిల్లీ హైకోర్టు జడ్జిగా సిఫార్సు చేశారు. -
వైద్య శాఖలో నోటిఫికేషన్లు వాయిదా!.. ఆలస్యానికి కారణం ఇదే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ పరిధిలో పోస్టుల నోటిఫికేషన్లు వాయిదా పడనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం నుంచి రోస్టర్ వివరాలు వచ్చాకే నోటిఫికేషన్లు జారీ చేస్తామని పేర్కొన్నాయి. దీనికి ఎన్ని రోజులు పడుతుందనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా 10,028 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. చదవండి: టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ 'మరో ప్రస్థానం' అందులో ఇప్పటికే 969 ఎంబీబీఎస్ అర్హతగల సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజారోగ్య సంచాలకుడి పరిధిలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 211 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే వారం అర్హత సాధించిన వారి జాబితాను ప్రదర్శించనున్నారు. అభ్యంతరాలు స్వీకరించాక తుది జాబితా విడుదల చేస్తారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు నిర్ణయానికి ముందే ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చినందున యథాతధంగా భర్తీ ప్రక్రియ జరగనుంది. 9 వేల పోస్టుల్లో గిరిజన రిజర్వేషన్ల పెంపు ఎంబీబీఎస్ అర్హత కాకుండా స్పెషలిస్టు వైద్యులు, నర్సింగ్, ఏఎన్ఎం పోస్టులకు నోటిఫికేషన్లు జారీ కావాల్సి ఉంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ పూర్తయ్యాక వీటికి నోటిఫికేషన్లు జారీ చేయాలని బోర్డు భావించగా.. గిరిజన రిజర్వేషన్ల పెంపుతో వాయిదా పడ్డాయి. కొత్త రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి రోస్టర్ వివరాలు అందాక విడతల వారీగా 9వేలకుపైగా పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేస్తామని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. కొత్త రిజర్వేషన్ల ప్రకారం.. ఈ పోస్టుల్లో 900కుపైగా ఉద్యోగాలు గిరిజనులకే దక్కనున్నాయి. -
డబుల్‌పేమెంట్ జరిగిందా? స్టాక్మార్కెట్లో నష్టాలా? రిఫండ్ ఎలా?
ప్ర. నా పాన్ అకౌంటు, బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేశాను. డిపార్ట్మెంట్ వారు ‘‘రిఫండ్ ఫెయిల్’’ అని మెసేజీలు పంపుతున్నారు. బ్యాంకు వారిని సంప్రదిస్తే, ‘‘ఈ సమస్య మాది కాదు.. ఆదాయ పన్ను శాఖదే’’ అంటున్నారు. ఏం చేయాలి? – రాజు లక్ష్మి, ఈమెయిల్ ద్వారా జ. ఇటువంటి సమస్యలు చాలా వస్తున్నాయి. నిజంగా రెండూ అనుసంధానం అయిన పక్షంలో ‘‘రిఫండ్ ఫెయిల్’’ అయిందంటున్నారు కాబట్టి రెండు వైపులా చెక్ చేయండి. బ్యాంకులో మళ్లీ సంబంధించిన కాగితాలివ్వండి. ఆ తతంగం ముగిసిన తర్వాత డిపార్ట్మెంట్ సైట్లోకి వెళ్లి మీ రిఫండ్ క్లెయిమ్ బ్యాంకు వివరాలను అప్డేట్ చేసి, రీవేలిడేట్ చేయండి. సాంకేతిక సమస్యల వల్ల రికార్డులను అప్డేట్ చేయడంలో జాప్యం జరుగుతోంది. రీవేలిడేట్ చేసిన తర్వాత రిఫండు వస్తుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రాసెసింగ్‌లో ఉండి ఉంటే ఫర్వాలేదు. లేదంటే పోర్టల్‌లో ఒక కంప్లెయింట్ ఇవ్వండి. గ్రీవెన్సును నమోదు చేయవచ్చు. ( జ. సీపీసీ నుండి 143 (1) సమాచారం వచ్చింది. ‘‘సమాచారం మెయిల్‌కి పంపుతున్నాము. డిమాండ్ ఉంది .. చెల్లించాలి’’ అని ఉంది. ఏం చేయాలి. – కర్ణ, ఈ–మెయిల్ ద్వారా జ. గత వారాల్లో 143 (1) సమాచారం గురించి సవివరంగా తెలియజేశాం. 143 (1) సెక్షన్ సమాచారం కోసం, మెయిల్ కోసం వేచి ఉండండి. ఆ ఆర్డరులో ఏయే కారణాల వల్ల డిమాండ్ ఏర్పడిందో విశ్లేషించండి. అది కరెక్టు అయితే చెల్లించండి. కాకపోతే విభేదిస్తూ జవాబు ఇవ్వవచ్చు. సరిదిద్దవచ్చు. తగినకాలంలో సమాధానం ఇవ్వడం మర్చిపోవద్దు. ప్ర. నేను ఉద్యోగిని. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా. నష్టం వచ్చింది. జీతం రూ. 5,00,000 దాటింది. రిటర్ను వేయాలా? ట్యాక్స్ ఎంత చెల్లించాలి? – మహ్మద్ షకీర్, ఈ–మెయిల్ ద్వారా జ. ఒక వ్యక్తికి ఒక పాన్ ఉండాలి. అలాంటి వ్యక్తి ఎన్ని సోర్స్‌ల ద్వారా ఆదాయం వచ్చినా ఒకే రిటర్నులో చూపించి ఒకేసారి వేయాలి. మీరు మీ జీతం వివరాలు, స్టాక్ మార్కెట్ వ్యవహారాలతో కలిపి ఒక రిటర్ను వేయాలి. స్టాక్ మార్కెట్లో 31-03-2023 నాటికి ఏర్పడ్డ లాభనష్టాలను తేల్చి, తెలుసుకుని వేయాలి. మీ బ్రోకింగ్ సంస్థ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. అన్ని వివరాలుంటే తప్ప పన్ను భారం నిర్ధారించలేము. ప్ర. ప్రభుత్వం డిడక్ట్ చేసిన టీడీఎస్ ఫారం 26ఏఎస్‌లో నమోదు కాలేదు. ఆ మేరకు డైరెక్టుగా చెల్లించి, రిటర్న్ దాఖలు చేశాను. ఈ నెలలో టీడీఎస్ పద్దులు నమోదయ్యాయి. – సుధా భరత్, ఈ-మెయిల్ ద్వారా జ. ఫారం 26ఏఎస్‌లో చెల్లింపుల గురించి మనం గత వారమే తెలుసుకున్నాం. ఎంట్రీలు ఆలస్యంగా పడటం, పడకపోవడం, తప్పులు పడటం వంటి ఉదాహరణలు ఎన్నో ఉంటున్నాయి. మీ కేసులో డబుల్ పేమెంటు జరిగినట్లు. మీరు చేసిన చెల్లింపు, టీడీఎస్ ఒకే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినట్లయితే ఈ లోపల డిపార్టుమెంటు వారు అసెస్మెంటు చేసి రిఫండు ఇస్తారు. లేదా మీ అంతట మీరే స్వయంగా రివైజ్ చేసుకోవచ్చు. ఏదేనీ కారణం వల్ల ఎంట్రీలు తప్పుగా పడితే సరిదిద్దండి. సంవత్సరం మారితే డబుల్ పేమెంటు కాదు. ఒకే సంవత్సరానికి సంబంధించి, ఒకే ఆదాయం అయితే మీకు రిఫండు వస్తుంది. కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య -
కెనడా స్టూడెంట్ వీసా రాలేదని యువకుడి ఆత్మహత్య.. చనిపోయిన మరుసటి రోజే!
చండీగఢ్: కెనడా స్టూడెండ్ వీసా ఆలస్యం అయ్యిందని 23 ఏళ్ల ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే దురదృష్టవశాత్తు అతను మరణించిన రెండు రోజులకే వీసా వచ్చింది. ఈ విషాద ఘటన హర్యానా కురుక్షేత్ర జిల్లాలో చోటుచేసుకుంది. షాబాద్ సబ్ డివిజన్లో గోర్ఖా గ్రామానికి చెందిన వివేక్ సైనీ అలియాస్ దీపక్ డిగ్రీ పూర్తి చేశాడు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ఉన్నత చదువులు కెనడాలో చదివి అక్కడే స్థిరపడాలని అనుకున్నాడు. తల్లిదండ్రులు ఓకే చెప్పడంతో వీసా కూడా అప్లై చేశాడు. దీపక్ కొన్ని నెలల కిందట స్నేహితులతో కలిసి కెనడా స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేశాడు. ఇటీవల వారికి వీసాలు వచ్చాయి. అయితే తనకు వీసా రాకపోవడంపై అతడు నిరాశ చెందాడు. దీంతో జన్సా సమీపంలోని కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ దీపక్‌కు వీసా గురువారం వచ్చింది. అయితే అప్పటికే యువకుడు ఆచూకీ కనిపించకుండా పోయాడు. కొడుకు మిస్ అవ్వడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల అనంతరం కెనాల్లో దీపక్ మృతదేహం లభ్యమైంది. పోస్ట్‌మార్టం అనంతరం దీపక్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే గురువారమే దీపక్ ఇంటికి వీసా వచ్చిందని ఆ గ్రామ మాజీ సర్పంచ్ గుర్నామ్ సింగ్ తెలిపాడు. అప్పటికే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితులకు అప్పటికే వీసా రావడం, తనకు ఇంకా రాలేదనే మనస్థాపంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. చదవండి: తల్లీ కూతుళ్ల ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్టు ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
క్షమాపణలు కోరిన బ్రిటిష్ హై కమిషనర్: వీడియో వైరల్
న్యూఢిల్లీ: యూకే వీసా అనుమతుల్లో జాప్యం విషయమై భారత్‌లోని బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ స్పందించారు. వీసాలు అనుమతుల్లో జాప్యం గురించి వివరిస్తూ ట్విట్టర్ వేదికగా ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఈ మేరకు అలెక్స్ వీడియోలో....యూకే వీసాల విషయమై ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఎల్లిస్ ఇలా అన్నారు. " మీలో చాలా మంది 15 రోజుల పని నిమిత్తం యూకేకి వెళ్లడానికి వీసాలను దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలాంటి వాటికి సంబంధించి పలు వీసా అప్లికేషన్స్ వచ్చాయి. ఆయా వీసాల ప్రాసెసింగ్‌కి సమయం పడుతోంది. ఈ ఆలస్యం కారణంగా నష్టపోతున్న ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నాను. కోవిడ్ అనంతరం యూకే వీసాలకు డిమాండ్ పెరింగింది. అంతేకాకుండా రష్యా ఉక్రెయిన్ల యుద్ధం వల్ల కూడా ఈ డిమాండ్ మరింత ఎక్కువైందని చెప్పారు. అలాగే ఈ వీసా ప్రక్రియ వేగవంతం చేసుకునేలా ప్రజలకు శిక్షణ ఇస్తాం. మొదటగా చాలాముంది ప్రాదాన్యత ఇచ్చే వీసా సేవనే మీకు అందుబాటులో ఉంచుతాం. అలాగే మీ వద్ద కావల్సిన సరైన పత్రాలు ఉన్నయని నిర్థింరించడంలో మాకు సహకరించండి. అలాగే మీ వీసా సురక్షితంగా ఉండే వరకు మీ విమాన టిక్కెట్‌కు కట్టుబడి ఉండొద్దు. యూకే వీసాలు పరిమితి గడువులోగా మంజూరయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కేవలం సందర్శకుల వీసాలు జారీ చేయడానికే ప్రస్తుతం ఆరువారాల సమయం పడుతుంది. కొన్నిరకాల వీసా అప్లికేషన్లకు మూడువారాలకు పైగా పట్టొచ్చు. సాధ్యమైనంత త్వరగా ఈ ఈ వీసాలు జారీ చేసేలా తాము కృషి చేస్తున్నాం" అని అన్నారు. A lot of you have been in touch about visa delays; many apologies, as I know this is causing a lot of problems. Here’s what we’re doing, and what you can do. pic.twitter.com/QJm7HceDq6 — Alex Ellis (@AlexWEllis) August 12, 2022 (చదవండి: International Youth Day 2022: యంగిస్తాన్!) -
సీనియర్లు అయితే హెల్త్ క్లెయిమ్ ఆలస్యం
న్యూఢిల్లీ: వృద్ధులు (60 ఏళ్లు దాటిన వారు) హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో కొంత సమయం తీసుకుంటున్నారు. 60 ఏళ్లలోపు వారితో పోలిస్తే వారం ఆలస్యంగా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్టు ‘సెక్యూర్ నౌ’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తెలిసింది. ఆస్పత్రిలో చేరినా కానీ, తమ చికిత్స గురించి బీమా సంస్థకు సమాచారం ఇచ్చే విషయంలో వారు జాప్యం చేస్తున్నారు. నగదు రహిత చికిత్సను వృద్ధులు ఎంపిక చేసుకోపోతే, వారు క్లెయిమ్‌లను కచ్చితత్వంతో దాఖలు చేసేందుకు ఆస్పత్రులు, బీమా సంస్థలు, మధ్యవర్తులు సాయం అందించాలని మెహతా సూచించారు. 60 ఏళ్లలోపు వారికి క్లెయిమ్ పరిష్కారం అయ్యేందుకు 23 రోజుల సయం పడుతోంది. అదే సీనియర్ సిటిజన్లు అయితే 28 రోజుల సమయం తీసుకుంటోంది. ఇతరులతో పోలిస్తే వృద్ధులు ఎక్కువ ప్రీమియం చెల్లిస్తారన్న విషయాన్ని మెహతా గుర్తు చేశారు. 30 ఏళ్ల వ్యక్తికి ప్రీమియం రూ.10,365గా ఉంటే, 45 ఏళ్లకు ఇది రూ.15,239, 60 ఏళ్లకు రూ.31,905 అవుతున్నట్టు చెప్పారు. ఇక 75 ఏళ్ల వయసులో వీరు రూ.66,368 చెల్లించాల్సి వస్తుందన్నారు. డయేరియా, కేన్సర్, ప్రొస్టేట్ పెరుగుదల సమస్య, కరోనరీ గుండె జబ్బులకు క్లెయిమ్ నిష్పత్తి (వృద్ధులకు) తక్కువగా ఉంటున్నట్టు ఈ సర్వే గుర్తించింది. -
ప్యాసింజర్ రైళ్ల రద్దు.. ఆలస్యం! కారణం ఏంటంటే..
దేశవ్యాప్తంగా పలు ప్యాసింజర్ రైళ్లను అర్ధాంతరంగా ఇండియన్ రైల్వేస్ రద్దు చేస్తోంది. అంతేకాదు చాలావరకు ప్యాసింజర్ రైళ్లు విపరీతమైన ఆలస్యంతో నడుస్తున్నాయి. ఈ పరిణామాలేవీ ఊహించని ప్రయాణికులు.. ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకీ ఎందుకంటారా?.. తీవ్రమైన బొగ్గు కొరత. అవును.. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత కొనసాగుతోంది. వేసవి కావడం.. విద్యుత్ వినియోగం పెరిగిపోవడంతో బొగ్గుకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో.. విద్యుత్ సంక్షోభం తలెత్తే ఘటింకలు మోగుతుండడంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. బొగ్గు సరఫరా కోసం మార్గం సుగమం చేసేందుకే ప్యాసింజర్ రైళ్లను రద్దుచేయడం, ఆలస్యంగా నడపడం చేస్తోంది రైల్వే శాఖ. అంతేకాదు గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతంగా బొగ్గు లోడ్‌ను గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నాలు చేస్తోంది. భారత్‌లో 70 శాతం కరెంట్ బొగ్గు నుంచే ఉత్పత్తి అయ్యేది. అలాంటిది దేశంలో ప్రస్తుతం అనేక ప్రాంతాలు చాలా గంటలు కరెంట్ కోతను ఎదుర్కొంటున్నాయి. కొన్ని పరిశ్రమలు అయితే ఈ శిలాజ ఇంధనం కొరత కారణంగా ఉత్పత్తిని తగ్గించేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ఆజ్యం పోసిన అధిక ఇంధన ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం కష్టపడుతున్న సమయంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. మొత్తంగా 670 ప్యాసింజర్ ట్రిపులను మే 24వ తేదీవరకు రద్దు చేసినట్లు.. మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు నొటిఫై చేసింది రైల్వేస్. అయితే ఏయే రూట్లలో ప్రయాణాలు రద్దు అనేది ప్రయాణికులే గమనించాలని కోరింది. అలాగే ప్యాసింజర్ రైళ్ల అంతరాయం తాత్కాలికం మాత్రమేనని, అతిత్వరలోనే పరిస్థితి చక్కబడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఇండియన్ రైల్వేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్‌కృష్ణ బన్సాల్. ప్రయాణికులు సహకరించాలని ఆయన కోరుతున్నారు. బొగ్గు సరఫరాలో అంతరాయాలకు భారతీయ రైల్వే తరచు విమర్శలు ఎదుర్కొనడం సహజంగా మారింది. సరిపడా క్యారేజీలు లేకపోవడం వల్ల ఎక్కువ దూరాలకు ఇంధనాన్ని తీసుకెళ్లడం కష్టంగా ఉంటోంది. అలాగే రద్దీగా ఉండే మార్గాల్లో ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు తమ తమ ప్రయాణాల కోసం తంటాలు పడుతుంటాయి. కొన్నిసార్లు సరుకులు ఆలస్యం అవుతాయి. అయినప్పటికీ, గనులకు దూరంగా ఉన్న వినియోగదారుల కోసం క్యారియర్ బొగ్గు రవాణా కొనసాగుతోంది. ఢిల్లీలో పరిస్థితి ఘోరం ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే బొగ్గు కొరత తీవ్రంగా మారుతోంది. దీంతో డిల్లీ సర్కార్.. కేంద్రం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఢిల్లీకి అవసరమయ్యే 30 శాతం పవర్‌ను దాద్రి-2, ఊంచహార్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం వాటిలో బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే.. అవి పని చేయడం ఆగిపోతాయని ఢిల్లీ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. మెట్రో రైళ్లతో పాటు ఆస్పత్రుల్లోనూ కరెంట్ సరఫరా నిలిచిపోతుందటూ ఢిల్లీ సర్కార్ ఒక ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. -
సూపర్వైజర్ పోస్టుల భర్తీ ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని సూపర్వైజర్ పోస్టుల భర్తీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయానికి ఈ పోస్టుల భర్తీ ముడిపడి ఉండటంతో ఈ ప్రక్రియ పూర్తవడానికి మరింత సమయం వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సూపర్వైజర్లను క్రమబద్ధీకరిస్తే మరింత మందికి కొత్త కొలువులు వచ్చే అవకాశముందని యంత్రాంగం భావిస్తోంది. దీంతో క్రమబద్ధీకరణ పూర్తయ్యే వరకు వేచిచూసే ధోరణిలో ఉంది. అంగన్వాడీ టీచర్లకు అవకాశమిస్తూ.. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో 420 సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి ఆ శాఖ గతేడాది నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను కొత్త అభ్యర్థులతో కాకుండా ఇప్పటికే శాఖలో కొనసాగుతున్న అంగన్వాడీ టీచర్లతోనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పదేళ్ల సీనియారిటీ, పదో తరగతి ఉత్తీర్ణత ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన పెట్టింది. ప్రస్తుతం ఈ శాఖలో కొనసాగుతున్న కాంట్రాక్టు సూపర్వైజర్లకు వెయిటేజీని ఇస్తూ వారినీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 2న అర్హత పరీక్ష పెట్టి తర్వాత ఫలితాలను వెల్లడించింది. ఈక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తయితే 420 ఉద్యోగాలను అర్హత పరీక్ష ద్వారా వడపోసిన అభ్యర్థులతోనే నేరుగా భర్తీ చేసేందుకు వీలుంటుంది. ఇతర అభ్యర్థులకు లబ్ధి జరుగుతుంది. దీంతో ఫలితాలు విడుదలైనా అర్హుల ప్రాథమిక జాబితాలను ఇంకా ఖరారు చేయలేదు. ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు సన్నాహాలు కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలు, స్థానికత తదితర అంశాలపై స్పష్టత కోసం వారి సర్టిఫికెట్ల పరిశీలన, క్షేత్రస్థాయిలో నిర్ధారణ ప్రక్రియకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఫలితాల ప్రకటన తర్వాత 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ప్రాథమికంగా ఎంపిక చేసి వారి ధ్రువపత్రాల పరీశీలనకు ఉపక్రమించింది. వ్యూహాత్మకంగా ముందస్తు ప్రక్రియ పూర్తి చేస్తే క్రమబద్ధీకరణపై స్పష్టత వచ్చాక వేగంగా నియామకాలు చేపట్టవచ్చని ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
బుక్ చేసిన నాలుగేళ్లకు డెలివరీ ప్రచారం.. టయోటా క్లారిటీ
This Toyota Car Will Deliver After 4 Years: ఆ కారును బుక్ చేసుకున్నవాళ్లు డెలివరీ కోసం నాలుగేళ్లు ఎదురుచూడక తప్పదంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో జపనీస్ కార్ మేకర్ టయోటా స్పందించింది. టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్సీ 300 కోసం ఎదురు చూడకతప్పదంటూ కొన్ని వెబ్ సైట్లలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ప్రచారం వాస్తవమని, వాహనదారులు మన్నించాలంటోంది టయోటా. నిజానికి ఈ మోడల్‌ను కిందటి ఏడాదే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. అత్యాధునిక సాంకేతికత, హై ఫీచర్లతో తీసుకొచ్చింది. 2022 మూడవ త్రైమాసికంలో మార్కెట్లోకి రావొచ్చని భావించారు. అయితే.. సెమీకండక్టర్ల కొరత వల్ల ఇప్పుడు బుక్ చేసుకున్నవాళ్లకు నాలుగేళ్ల దాకా వాహనం డెలివరీ చేయలేమని కంపెనీ తేల్చేసింది. హై ఫీచర్లు ఉండడంతో సెమీకండర్లు అధికంగా అవసరం పడుతోందని, అందుకే అవాంతరాలు ఎదురవుతున్నాయని, అయినా నాలుగేళ్లలోపే డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని టయోటా ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో ప్రభావం ఇతర మార్కెట్లపై పడనుంది. భారత మార్కెట్లో టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్సీ300 ధర కోటిన్నర రూపాయలకు పైనే ఉండొచ్చని అంచనా. ఈ వెహికిల్ 10 శాతం తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఇంజిన్‌పరంగా రెండు వేరియెంట్స్ లభించనున్నాయి. నిస్సాన్ పాట్రోల్, బెర్సిడెజ్ బెంజ్ జీఎస్, బీఎండబ్ల్యూ ఎక్స్ 6 మోడల్స్‌కు గట్టి పోటీగా దీనిని భావిస్తున్నారు. -
ఆలస్యం కానున్న ‘జేఈఈ’.. కారణం అదేనా!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ–2022 షెడ్యూల్ ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్లో మార్పులు చేయాలని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది. దీనికి తోడు కరోనా కేసులు పెరుగుతుండటాన్ని కూడా పరిగణలోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్¯ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష.. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహిస్తారు. సాధారణంగా ఈ సమయానికే షెడ్యూల్ ప్రకటించి, ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్స్ తొలి దశ పరీక్ష నిర్వహించాలి. కానీ, ఇప్పటికీ షెడ్యూల్ ప్రకటించకపోవడంతో జేఈఈ ప్రక్రియ పూర్తవడానికి వచ్చే ఏడాది చివరి వరకూ పట్టొచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, జేఈఈ మెయిన్–22ను ఎప్పుడు నిర్వహిస్తారు? ఎన్ని దశల్లో పరీక్షలుంటాయి? పరీక్ష విధానంలో మార్పులేమైనా ఉంటాయా? అనే సందేహాలు విద్యార్థుల్లో తలెత్తుతున్నాయి. రెండేళ్లుగా ఆలస్యం... ►2019 జేఈఈ షెడ్యూల్‌ను 2018, జూలై 7న ప్రకటించారు. 2019 జనవరి, ఏప్రిల్‌లో రెండు దశల్లో పరీక్ష నిర్వహించారు. ► 2020 పరీక్షల షెడ్యూల్‌ను 2019, ఆగస్టు 28న ప్రకటించారు. 2020, జనవరిలో మొదటి విడత జరిగింది. ఏప్రిల్‌లో జరగాల్సిన రెండో విడత పరీక్ష కరోనా కారణంగా సెప్టెంబర్‌లో నిర్వహించారు. ► 2021 జేఈఈ షెడ్యూల్‌ను 2020, డిసెంబర్ 16న ప్రకటించారు. 2020లో కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం పూర్తి కాకపోవడంతో పలువురు అభ్యర్థులు జేఈఈ మెయిన్‌కు హాజరు కాలేకపోయారు. దీంతో 2021 జేఈఈ మెయిన్స్‌ను నాలుగు విడతల్లో.. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) షెడ్యూల్ ఇచ్చింది. ఫిబ్రవరి, మార్చి సెషన్ల పరీక్షలు యథాతథంగా జరిగినా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్, మే సెషన్ల పరీక్షలు ఆలస్యమయ్యాయి. ఈ పరీక్షలు సెప్టెంబర్ 2కి గాని పూర్తికాలేదు. ► మూడేళ్లూ పరీక్షల షెడ్యూల్‌ను డిసెంబర్ నాటికే ప్రకటించారు. జేఈఈ మెయిన్స్–2022 షెడ్యూల్ మాత్రం ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. జేఈఈ ఆధారంగానే రాష్ట్ర ఎంసెట్... ఇంత వరకూ జేఈఈ నిర్వహణపై స్పష్టత రాలేదు. కరోనా కారణంగా మరింత ఆలస్యం చేస్తారా? ఎన్ని దఫాలుగా పరీక్ష నిర్వహిస్తారు? ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఉంటుందా? అనే సందేహాలకు స్పష్టత రావాల్సి ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా జేఈఈ ర్యాంకుల తర్వాతే రాష్ట్రంలో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. జేఈఈ ర్యాంకులు వచ్చిన వాళ్లు కేంద్ర సంస్థలకు వెళ్తున్నారు. అలా ఖాళీ అయిన ఇంజనీరింగ్ సీట్ల కోసం రాష్ట్రంలో మళ్లీ భర్తీ చేపట్టాల్సి ఉంటుంది. దీంతో జేఈఈ షెడ్యూల్ రాష్ట్ర ఎంసెట్‌పైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. -
సారీ! రిపోర్టులు మారిపోయాయి.. నీకు కరోనా లేదు!
Pilots False Positive Covid Report: కొన్ని ప్రయాణాలు మనం మధురానుభూతుల్ని ఇస్తాయి. కానీ కొన్ని ప్రయాణాలు మాత్రం మనల్ని ఆందోళనకు గురిచేయడమే కాక మళ్లీ ఇంకెప్పుడు ప్రయాణాలు చేయకూడదనే భావం కలుగుతుంది. అచ్చం అలాంటి అనుభవం బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలోని ప్రయాణీకులకు ఎదురైంది. (చదవండి: ఖరీదైన గిఫ్ట్‌ల స్థానంలో కుక్క బిస్కెట్లు, షేవింగ్ క్రీమ్‌లు) అసలు విషయంలోకెళ్లితే.....బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణీకుల బృందం ఐదు గంటలకు పైగా చిక్కుకుపోయింది. వారు పయనిస్తున్న విమాన పైలట్‌కి కరోనా పాజిటివ్ రావడంతో లండన్ నుండి బార్బడోస్‌కు బయలుదేరాల్సిన విమానాన్ని టేకాఫ్‌కు ముందు బ్రిటిష్ ఎయిర్వేస్ నిలిపివేసింది. అయితే అప్పటికప్పుడు మరో పైలెట్‌ని నియమించడం ఆలస్య అవుతుందని బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రకటించడమే కాక ప్రయాణికులను విమానంలోంచి దింపేసింది. నిజానికి ఆ విమానం అప్పటికే రెంగు గంటలు ఆలస్యం. అయితే విమానం బయలుదేరడానికి సిద్ధం అయ్యిందో లేదా మళ్లీ ఈ కారణంగా మరింత ఆలస్యం అవ్వడంతో ప్రయాణికులు ఒకింత అసహనానికి గురైయ్యారు. అంతేకాదు ఆ ప్రయాణికులదరికి బ్రిటిష్ ఎయిర్వేస్ ఆహారాన్ని అందజేసింది. అయితే ఐదు గంటల తర్వాత ప్రయాణికులందర్నీ విమానం ఎక్కేందుకు అనుమతి ఇచ్చారు. కానీ కథలో ట్విస్ట్ ఏంటంటే పైలట్‌కి కోవిడ్ అని తప్పుడు రిపోర్ట్ వచ్చింది అంటూ ఎయిర్వేస్ ప్రకటించడం గమనార్హం. అంతేకాదు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు క్షమపణలు మాత్రమే కాదు మాకు చక్కగా సహకరించినందుకు కూడా ధన్యవాదాలు అని బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రయాణికులకు తెలియజేసింది. పైగా బార్బడోస్‌లో దిగినప్పుడు ఆలస్యానికి క్షమాపణలు కోరుతూ ప్రయాణికులకు కరేబియన్ రమ్ బాటిళ్లను అందజేశారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఒక ప్రయాణికురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. (చదవండి: ఖాతాదారుడు తాకట్టు పెట్టిన ఆభరణాలను కొట్టేసిన బ్యాంక్ క్యాషియర్!) -
యూఎస్ వీసా కోసం నిరీక్షణ తప్పదు
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: విదేశీ ప్రయాణికులపై కోవిడ్–19 ఆంక్షల్ని అమెరికా ఎత్తేయడంతో చాలా మంది అగ్రరాజ్యానికి ప్రయాణమయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే వారు వీసా అపాయింట్మెంట్ కోసం మరింత కాలం నిరీక్షించాల్సిన అవసరం ఉందని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. వలసేతర వీసా కేటగిరీలో ఈ నిరీక్షణ తప్పదని పేర్కొంది. నవంబర్ 8 నుంచి అమెరికా ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండు టీకా డోసులు వేసుకున్న దాదాపుగా 30 లక్షల మంది భారతీయులు అమెరికాకు ప్రయాణం చేసే అవకాశం ఉందని తెలిపింది. ‘‘కోవిడ్ వల్ల ఏర్పడిన అంతరాయం నుంచి ఇప్పుడే కార్యకలాపాలను పునరుద్ధరిస్తున్నాం. అందువల్ల రాయబార, కాన్సులేట్ కార్యాలయాల్లో పనులు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. వీసా అపాయింట్మెంట్ కోసం ఇంకొంత కాలం ఎదురు చూడాల్సిన పరిస్థితులున్నాయి. వీలైనంత త్వరగా ఆ పనులు జరిగేలా చూస్తాం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకే పెద్ద పీట వేస్తాం’’అని పేర్కొంది. రాయబార కార్యాలయ సిబ్బంది, ప్రయాణికులు భద్రంగా ఉండడానికే ప్రాధాన్యతనిస్తూ వీసా మంజూరు ప్రక్రియని వేగవంతం చేస్తామని స్పష్టం చేసింది. లక్షల మంది భారతీయులు వీసాల పునరుద్ధరణ/ కొత్త వీసాల జారీకి ఎదురుచూస్తుండడంతో యూఎస్ ఎంబసీల నుంచి అపాయింట్మెంట్లు అంత సులువుగా లభించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్ వెళ్లేందుకు నిరీక్షిస్తున్న తెలుగువారు సైతం మరికొంత కాలం వేచిఉండాల్సి రావచ్చని యూఎస్ ఎంబసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెయిటింగ్ లిస్టు చాంతాడంత ఉందని, ఆంక్షల నుంచి ఉపశమనం లభించినా వెంటనే యూఎస్ ప్రయాణాలు సాధ్యం కాకపోవచ్చని పేర్కొంటున్నాయి. -
ఎక్స్‌ప్రెస్ రైలు ఆలస్యం.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే తొలి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్. విమానంలో ఉన్న మాదిరి సౌకర్యాలు ఉండే ఈ రైలు ఢిల్లీ నుంచి లక్నోకు రాకపోకలు సాగిస్తుంది. అయితే ఈ రైలు కచ్చితత్వం విషయంలో ప్రయోగాత్మకంగా ఓ నిబంధన విధించారు. రైలు నిర్దేశించిన సమయానికి వెళ్లకపోతే ఎంత ఆలస్యమైతే అంత పరిహారం చెల్లిస్తామని భారతీయ రైల్వే క్యాటరింగ్, పర్యాటక కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా ఆ రైలు రెండు గంటలు ఆలస్యంగా ప్రయాణించడంతో దానికి సంబంధించిన పరిహారం ప్రయాణికులకు అందిస్తున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ఎప్పుడూ చార్జీల వసూళ్లు చేయడమే తప్పా పరిహారం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ శని, ఆదివారం (ఆగస్ట్ 21, 22)లో రెండు గంటలు ఆలస్యంగా ప్రయాణించింది. ఆలస్యంగా ప్రయాణించడంతో రైలులో ప్రయాణించిన వారికి రూ.నాలుగున్నర లక్షలు పరిహారంగా చెల్లించాలని నిర్ణయించింది. మొత్తం 2,035 మంది ప్రయాణికులకు పరిహారం అందించనుంది. భారీ వర్షాల నేపథ్యంలో శనివారం సిగ్నల్ ఫెయిల్ కారణంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు రెండున్నర గంటలు ఆలస్యంగా రైలు చేరింది. ఆదివారం కూడా గంట ఆలస్యమైంది. చదవండి: అచ్చం సినిమాలా? వ్యాపారి కుమారుడు కిడ్నాప్.. దీంతో గంట ఆలస్యమైన వారికి రూ.100 చొప్పున, రెండున్నర గంటలు ఆలస్యమైన వారికి రూ.250 చెల్లించనుంది. మొత్తం రూ.4,49,600 పరిహారం ప్రయాణికులకు ఐఆర్సీటీసీ అందించనుంది. ఈ విషయాన్ని ఐఆర్సీటీసీ చీఫ్ రీజనల్ మేనేజర్ అజిత్ కుమార్ సిన్హా తెలిపారు. నిబంధనల మేరకు రైలు గంట ఆలస్యమైతే రూ.వంద చెల్లించాలనే నిబంధన ఉందని, ఆ మేరకు తాజాగా ఆలస్యమైన వారికి అంతే చొప్పున పరిహారం అందిస్తున్నట్లు వివరించారు. చదవండి: ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి.. సీఎం కేసీఆర్ -
జనవరి నుంచే ఆఫీసులకు రండి
Facebook Employees Return To Office: కరోనా-లాక్డౌన్ మొదలైన వర్క్ ఫ్రమ్ హోం ట్రెండ్.. ఇంకొన్నాళ్లు కొనసాగేలా కనిపిస్తోంది. ఇప్పటికే టెక్ కంపెనీలు కొన్ని అక్టోబర్ మధ్య నుంచి ఆఫీసులకు రావాలని తేల్చిచెప్పడంతో పాటు షరతుల మీద కొందరు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోంకి అనుమతి ఇస్తున్నాయి. ఈ తరుణంలో సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ ఫేస్బుక్ తన ఉద్యోగులకు భారీ ఊరట ఇచ్చింది. ఇక వచ్చే ఏడాది నుంచే ఆఫీసులకు రావాలని తెలియజేసింది. డెల్టా ఫ్లస్ వేరియెంట్ ఉధృతి.. తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా విజృంభిస్తోంది. దాదాపు అన్ని దేశాల్లోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. ఈ తరుణంలో ఉద్యోగులను ఆఫీసులకు రప్పించి.. వాళ్ల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేయడం ఇష్టం లేదని ఫేస్బుక్ భావిస్తోంది. ఈ మేరకు కాలిఫోర్నియా మెన్లో పార్క్ హెడ్ కార్యాలయం నుంచి ఉద్యోగులకు మెయిల్ వెళ్లింది. అందులో ‘ఇప్పట్లో ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదని. బహుశా జనవరి నుంచి ఆఫీసులకు రావాల్సి ఉండొచ్చ’ని సంకేతాలు ఇచ్చింది. చదవండి: జీతాల కట్టింగ్‌కు రెడీ, కానీ..-ఉద్యోగులు ఇక గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, యాపిల్లు వ్యాక్సినేషన్ పూర్తైన ఉద్యోగులను ఆఫీసులకు రావాల్సిందేనని ఇదివరకు చెప్పాయి. అంతేకాదు మాస్క్‌లు ధరించడం, సోషల్ డిస్టెన్స్, శానిటైజేషన్ లాంటి ఏర్పాట్లతో ఆరోగ్య భద్రతకు తమది హామీ అని ప్రకటించాయి. కానీ, వేవ్‌ల వారీగా పెరుగుతున్న కరోనా కేసులు, ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళన, విమర్శలు, పైగా ఇంటి నుంచే ఎక్కువ అవుట్‌పుట్ వస్తుండడంతో రిమోట్ వర్క్ విషయంలో ఉద్యోగుల పట్ల సానుకూల స్పందన ఇస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ కూడా జనవరి నుంచే రావాలని ఊరట ఇవ్వగా.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ఫేస్బుక్ కూడా చేరింది. మరోవైపు గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్‌లు మాత్రం అక్టోబర్ మధ్య నుంచే ఉద్యోగులను రప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. -
అనుమతుల ఆలస్యంతోనే ప్రీలాంచ్ విక్రయాలు!
నెల తర్వాత చేసే ప్రయాణం కోసం ముందుగానే విమాన టికెట్లు బుకింగ్ చేసుకుంటాం. అభిమాన హీరో సినిమా వస్తుందంటే వారం ముందే ఆన్లైన్లో టికెట్లు కొనేస్తాం. ఎందుకు? తీరా టైంకి టికెట్లు దొరకవనో లేక దొరికినా ఎక్కువ రేట్లు ఉంటాయనో కదా. పైగా ముందుగా టికెట్లు బుకింగ్ చేసుకుంటే ధర కూడా కలిసొస్తుంది. మరి, ముందస్తు బుకింగ్స్ రియల్ ఎస్టేట్‌లో చేస్తే తప్పేంటి? సాక్షి, హైదరాబాద్: ప్రీలాంచ్, సాఫ్ట్‌లాంచ్.. పేర్లు ఏవైనా వాటి అర్థం మాత్రం ఒక్కటే. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే విక్రయాలను మొదలుపెట్టడం అని! ఈ తరహా విక్రయాలు కొత్తవేం కాదు. ఎప్పటినుంచో ఉన్నవే. ప్రీలాంచ్తో కొనుగోలుదారులకు, డెవలపర్లకు ఇద్దరికీ లాభమే. కస్టమర్లకేమో ఫ్లాట్ తక్కువ ధరకు దొరికితే.. బిల్డర్లకేమో ముందుగానే కొంత సొమ్ము చేతికి అందుతుంది. ఈ సొమ్ము తక్షణమే నిర్మాణాన్ని మొదలుపెట్టడానికో లేక అనుమతుల ఫీజుల కోసమో ఉపయోగపడుతుంది. ప్రీలాంచ్లో డెవలపర్లు 10–15 శాతం వరకు ఫ్లాట్లను విక్రయిస్తుంటారు. కొందరు బిల్డర్లు తెలివిగా ఏం చేస్తారంటే.. మార్కెట్లో తమ కొత్త ప్రాజెక్ట్ తుది ధరను నిర్ణయించడం కోసమే ముందస్తు అమ్మకాలను ప్రకటిస్తుంటారు. ప్రీలాంచ్లో విక్రయాలు ఎందుకంటే.. ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ల్యాండ్ ఓనర్‌తో అగ్రిమెంట్ చేసుకున్న రోజు నుంచి అనుమతులు వచ్చే వరకు ఏడాదిన్నర కాలం పాటు డెవలపర్ వేచి చూడాలి. ఈలోపు ప్రాజెక్ట్ రుణానికి బ్యాంక్ వడ్డీ డెవలపర్ భరించాల్సిందే. కాంట్రాక్టర్లు, ఉద్యోగుల జీతభత్యాలు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు ఇవన్నీ డెవలపర్లకు భారమే. పోనీ, అనుమతుల వరకూ వేచి ఉంటే మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు. ఈలోపు డిమాండ్ అవకాశాలు కోల్పోతామనే పోటీతో డెవలపర్లు ప్రీలాంచ్ విక్రయాలను చేస్తున్నారని ఓ డెవలపర్ తెలిపారు. స్థలానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను నిర్ధారించుకున్నాకే కొనుగోలుదారులు ప్రీలాంచ్లో కొనుగోలుకు సిద్ధం కావాలి. నచ్చిన ప్రాంతం, తక్కువ ధర, పేరున్న బిల్డర్ అయితే కొనుగోలులో సందేహించాల్సిన అవసరం లేదు. సాధారణంగా నిర్మాణం పూర్తి కావడానికి 3–5 ఏళ్ల సమయం పడుతుంది. అందుకే ముందస్తుగానే కొనుగోలు చేస్తే చక్కటి లాభాల్ని అందుకోవచ్చు. అనుమతుల్లో జాప్యం ఎందుకంటే? టీఎస్–బీపాస్‌లో నిర్మాణ అనుమతులు వారం లోపే వస్తున్నాయనేది అధికారులు, లీడర్ల మాట. కానీ, వాస్తవ పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మున్సిపల్ అనుమతుల నుంచి మొదలుపెడితే రెవెన్యూ, ఇరిగేషన్, ఎన్విరాన్మెంటల్, ఫైర్, పోలీస్, ఎయిర్పోర్ట్ అథారిటీ.. ఇలా సుమారు 15 ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు తీసుకోవాలి. ఆ తర్వాత రెరా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీటి కోసం ఏడాదిన్నర పైనే సమయం పడుతుందని ఓ డెవలపర్ తెలిపారు. హెచ్ఎండీఏకు శాశ్వత కమిషనర్ లేకపోవటం, ఉన్న అధికారులు ఆఫీసులలో అందుబాటులో ఉండకపోవటం అనుమతుల ఆలస్యానికి ప్రధాన కారణాలని చెప్పారు. ఏం చేయాలంటే? హైదరాబాద్‌లో ప్రీలాంచ్లో కొనుగోలు చేసి మోసపోయామనే కస్టమర్లు చాలా తక్కువ. ఏ డెవలపర్ ప్రీలాంచ్లో విక్రయిం చేసి చేతులుదులుపుకోడు. చాలా వరకు డెవలపర్ల మీద కొనుగోలుదారులు చేసే ప్రధానమైన ఫిర్యాదులు.. గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయడం లేదనే. జీహెచ్ఎంసీతో పోల్చితే హెచ్ఎండీఏ పరిధిలో ప్రీలాంచ్ విక్రయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే జీహెచ్ఎంసీలో అధికారుల కొరత లేదు. దీంతో ఫీజు కట్టాక నెలన్నర లోపే ప్లానింగ్ అనుమతులు వస్తున్నాయి. అదే హెచ్ఎండీఏ పరిధిలో అయితే ఏడాదిన్నర అయినా గ్యారంటీ లేదు. ► హెచ్ఎండీఏకు శాశ్వత కమిషనర్‌ను, రెరాకు శాశ్వత చైర్మన్‌ను నియమించాలి. మున్సిపల్ శాఖ టౌన్‌ప్లానింగ్ విభాగంలో అధికారుల కొరతను తీర్చాలి. ► పక్క రాష్ట్రంలో లోకల్ బాడీ ఫీజులు కూడా ప్రధాన విభాగమే కలెక్ట్ చేస్తుంది. డెవలపర్లు ప్లానింగ్ అనుమతుల కోసం లోకల్ బాడీకి వెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో సమయం, అధికారుల చేతివాటం రెండూ తగ్గుతాయి. -
పెళ్లి కావడం లేదని..
మైసూరు: పెళ్లి కోసం ఎన్నిచోట్ల వెతికినా అమ్మాయి దొరకడం లేదు. నాకు ఎవరూ పిల్లను ఇవ్వడం లేదు అని ఆవేదనకు లోనైన యువకుడు ఉరేసుకుని బతుకు చాలించాడు. నంజనగూడు తాలూకాలోని కప్పసోగు గ్రామంలో సోమవారం చోటు చెసుకుంది. ప్రవీణ్ (28) అనే యువకునికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఆరు ఏడు సంవత్సరాలుగా సంబంధాలను వెతుకుతున్నారు. ఏ అమ్మాయి కూడా అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో విరక్తి చెంది ఇంట్లో దూలానికి ఉరి వేసుకున్నాడు. హుల్లహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. -
అప్పీళ్ల దాఖలులో మితిమీరిన జాప్యం
న్యూఢిల్లీ: అప్పీళ్లను దాఖలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు మితిమీరిన ఆలస్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థ సమయాన్ని వృథా చేస్తున్నందుకు వారు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, ఆ మేరకు బాధ్యులైన అధికారుల నుంచి ఖర్చులు రాబడతామని హెచ్చరించింది. అప్పీళ్ల విషయంలో నిర్ణీత కాల పరిమితిని పట్టించుకోని ప్రభుత్వాధికారులకు సుప్రీం కోర్టు వేదిక కాదని జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓ కేసులో అప్పీలు దాఖలు చేసేందుకు మధ్యప్రదేశ్ అధికారులు 663 రోజుల సమయం తీసుకోవడంపై ఈ మేరకు స్పందించింది. ‘ఇలా ఆలస్యం చేసి, ఆ అప్పీల్‌ను కొట్టివేసే పరిస్థితిని తీసుకురావడం, తద్వారా ఈ అంశాన్ని ఇంతటితో మరుగున పడేయటమే ఉద్దేశంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ‘అంతిమంగా బాధ్యులైన అధికారులు తప్పించుకుంటున్నారు. దీనిపై గతంలో పలు పర్యాయాలు హెచ్చరించినా మార్పు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి నష్టం వాటిల్లితే, సంబంధిత అధికారులను బాధ్యులుగా చేయాలి’ అని తెలిపింది. అప్పీళ్ల విషయంలో తీవ్ర ఆలస్యానికి కారణం కావడంతోపాటు, న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేసే అధికారుల నుంచి అందుకు తగ్గ ఖర్చులను వసూలు చేయాలి’ అని తెలిపింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి రూ.25 వేలను వసూలు చేయాలని ఆదేశించింది. లేకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ధిక్కార చర్యలు తప్పవని తెలిపింది. -
ఓడిపోతే.. దేశం విడిచి వెళతానేమో!
వాషింగ్టన్/విస్కాన్సిన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తికాకముందే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటమి తప్పదని సంకేతాలు అందాయో ఏమోగానీ ప్రజల తీర్పును ప్రభావితం చేయాలన్న ఆరాటం ఆయనలో కనిపిస్తోంది. ఎన్నికల్లో ఓడిపోతే అమెరికా విడిచి వెళ్లిపోతానేమోనని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడం, ఇప్పటికే భారీగా జనం మరణించడం, దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతుండడం, వర్ణ వివక్ష, తర్వాత దేశంలో వెల్లువెత్తుతున్న అశాంతి వంటివి ట్రంప్‌నకు ప్రతికూలంగా మారాయి. తాజాగా జార్జియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. ‘‘నా పరిస్థితి అంత మెరుగ్గా లేదు. ఎన్నికల్లో నెగ్గకపోతే ఏం చేస్తానో మీరు ఊహించ గలరా? బహుశా దేశం విడిచి వెళ్లిపోతానేమో! నాకు తెలియదు’’అని అన్నారు. బైడెన్ వస్తే వ్యాక్సిన్ మరింత ఆలస్యం డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గనుక అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే కరోనా వ్యాక్సిన్ రాకను మరింత ఆలస్యం చేస్తారని, వైరస్ వ్యాప్తిని మరింత పెంచుతారని ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దేశ ప్రజలను హెచ్చరించారు. శనివారం ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. బైడెన్ అధ్యక్షుడైతే అమెరికాను మూసివేస్తాడని చెప్పారు. ప్రతిపక్షాలు అమెరికన్ల జీవన విధానాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. బైడెన్ దేశ ప్రజల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తాడని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ట్రంప్ నెగ్గడానికి మిషిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయన్న వాదన ఉంది. ఈసారి ఈ రెండు రాష్ట్రాల్లో ఆయన బలం తగ్గిందని, జో బైడెన్‌కు అనుకూల పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. త్వరలోనే మిషిగాన్, విస్కాన్సిన్లో ఎన్నికలు జరగనున్నాయి. -
మూడు రోజుల నష్టాలకు బ్రేక్
రోజంతా లాభ, నష్టాల మధ్య దోబూచులాడిన సెన్సెక్స్, నిఫ్టీలు చివరకు లాభాల్లో ముగిశాయి. దీంతో గత మూడు రోజుల నష్టాలకు సోమవారం బ్రేక్ పడింది. అమెరికా ఉద్దీపన ప్యాకేజీ జాప్యం అవుతుండటంతో అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నా మన మార్కెట్ మాత్రం పెరిగింది. సెన్సెక్స్ మళ్లీ 38,000 పాయింట్లు, నిఫ్టీ 11,200 పాయింట్లపైకి ఎగబాకాయి. చివరి గంటలో కొనుగోళ్లు జోరుగా సాగడం కలసివచ్చింది. సెన్సెక్స్ 173 పాయింట్ల లాభంతో 38,051 పాయింట్ల వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 11,247 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్ షేర్లు నష్టపోయినా,విద్యుత్తు, వాహన, ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, లోహ షేర్లు లాభపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు పుంజుకొని 74.88 వద్దకు చేరింది. ఐదు సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి... సెన్సెక్స్ లాభాల్లోనే మొదలైనా వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. మళ్లీ లాభాల్లోకి వచ్చింది. రోజంతా లాభ, నష్టాల మధ్య ట్రేడైంది. సెన్సెక్స్ ఐదు సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చిందంటే ఒడిదుడుకులు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో 143 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 242 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 385 పాయింట్ల రేంజ్లో కదలాడింది. జపాన్ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. ► ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం, త్వరలో పవర్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌ను ఆరంభించనున్నదన్న వార్తలతో ఎన్టీపీసీ షేర్ 8 శాతం లాభంతో రూ.95 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే. ► 150కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, మైండ్ ట్రీ, వాబ్కో ఇండియా, థైరోకేర్ టెక్నాలజీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ సీఎల్ఎస్ఏ కొనొచ్చు అనే రేటింగ్‌ను ఇవ్వడంతో సన్ టీవీ షేర్ 6% లాభంతో రూ.426 వద్ద ముగిసింది. ► మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో ఐదు–ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ మాత్రమే నష్టపోగా, మిగిలిన 25 షేర్లు లాభపడ్డాయి. ► హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ షేర్లు కొనుగోలు చేశారన్న వార్తలతో పీటీసీ ఇండస్ట్రీస్ 20% లాభంతో రూ.699 కు చేరింది. ► దాదాపు 400 షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. పీటీసీ ఇండస్ట్రీస్, ఆప్టో సర్క్యూట్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
జాతీయ క్రీడా అవార్డులు ఆలస్యం!
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం ఆలస్యం అయ్యే సూచనలు కనబడుతున్నాయి. వైరస్ వ్యాప్తి దృష్ట్యా సామూహిక వేడుకలపై నిషేధం ఉండటంతో ఈ కార్యక్రమాన్ని నెల లేదా రెండు నెలలు వాయిదా వేసే అవకాశముంది. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతీ ఏడాది ఆగస్టు 29న జాతీ య క్రీడా అవార్డులను ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటివరకు అర్హుల జాబితా కూడా మంత్రిత్వ శాఖ సిద్ధం చేయలేదు. కనీసం సెలక్షన్ కమిటీని కూడా నియమించకపోవడం విశేషం. మరో వైపు హరియాణాకు చెందిన వుషూ ప్లేయర్ ‘శిక్షా’కు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా 22 ఏళ్ల శిక్షా వ్యవసాయ కూలీగా మారడంతో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జాతీయ సంక్షేమ నిధి నుంచి ఆమెకు రూ. 5 లక్షలు మంజూరు చేశారు. -
నాలుగు రోజులు లేటుగా నైరుతి!
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు నాలుగు రోజులు ఆలస్యంగా కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం అంచనా వేసింది. సాధారణంగా జూన్ 1న రావాల్సిన రుతుపవనాలు ఈసారి 5న వస్తాయని తెలిపింది. ఇందులో నాలుగు రోజులు అటు ఇటు తేడా ఉండవచ్చని చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఏడాదిలో నాలుగు నెలల పాటు (జూన్ – సెప్టెంబర్) వర్షాన్ని అందిస్తాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన సైక్లోన్ వల్ల అండమాన్ నికోబార్ దీవులకు మే 16నే ఆరు రోజుల ముందుగా రానున్నట్లు తెలిపింది. గతేడాది కూడా అండమాన్‌ను రెండు రోజుల ముందుగానే రుతుపవనాలు తాకినట్లు చెప్పింది. ఈ ఏడాది వర్షపాతం సాధారణంగానే ఉండవచ్చని అంచనా వేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా సాధారణ రుతు పవనాల తేదీలతో 3–7 రోజుల తేడా ఉంటుందని తెలిపింది. -
5జీ కోసం మరో రెండేళ్లు ఆగాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చేందుకు మరో రెండేళ్లు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ, టెలికాం పరిశ్రమల్లో ప్రణాళికాబద్ధంగా చేపట్టాల్సిన పనులపై కోవిడ్-19 మహమ్మారి ప్రభావంతో విపరీత జాప్యం చోటుచేసుకుంటోంది. టెలికాం శాఖ 5జీ వేలంపై ఇటీవల నిర్వహించిన సమావేశంలో 5జీ వేలం ప్రక్రియ 2021లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చర్చ సాగింది. వేలం ప్రక్రియలో జాప్యం జరిగితే అది 5జీ పరీక్షలు సంబంధిత మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాల్సిన లాంఛనాలు పూర్తయి 5జీ వాణిజ్య సేవలు 2022లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ మందగమనంతో పాటు భారత్‌లో 5జీ స్పెక్ట్రమ్ బేస్ ధర యూనిట్‌కు రూ 492 కోట్లుగా నిర్ణయించడం టెలికాం ఆపరేటర్లకు ప్రధాన అవరోధంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో బేస్ ధర అత్యధికంగా ఉందని టెలికాం దిగ్గజాలు వొడాఫోన్-ఐడియా, భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు భారత 5జీ ప్రణాళికల్లో చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలు హువేయి, జడ్టీజీల పాత్రపై కొనసాగుతున్న అనిశ్చితి సైతం భారత్‌లో 5జీ ఎంట్రీని సంక్లిష్టం చేస్తున్నాయని ఓ వార్తాసంస్థ కథనం పేర్కొంది. చదవండి : 5జీ టెక్నాలజీ: కొత్త తరం కార్లు భారత్‌లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మౌలిక సేవల కోసం చైనా కంపెనీలు హువేయి పాత్ర సందేహాస్పదంగా మారింది. అమెరికా చేపట్టిన చైనా వ్యతిరేక విధానంతో పలు దేశాలు హువేయి ద్వారా 5జీ మౌలిక సేవలను పొందేందుకు సానుకూలంగా లేవు. భారత్‌లో ఇప్పటికే టెలికాం రంగంలో తీవ్ర పోటీతో స్వల్ప మార్జిన్లతో నెట్టుకొస్తున్న టెలికాం ఆపరేటర్లు 5జీ సేవల కోసం భారీ నిధులను వెచ్చించేందుకు సిద్ధంగా లేరు. కోవిడ్-19 విపత్తు నేపథ్యంలో మొబైల్ యూజర్ల నుంచి ఖరీదైన 5జీ ప్లాన్స్‌కు ఆదరణ ఎంతమేరకు ఉంటుందనేది కూడా టెలికాం ఆపరేటర్లను ఆలోచనలో పడవేశాయి. ఇక 5జీ సేవలు ప్రధానంగా పారిశ్రామిక అప్లికేషన్స్‌కు ఉపయుక్తమని, సాధారణ యూజర్లకు 5జీ ప్రయోజనాలు పరిమితమే. ఈ పరిస్థితులను బేరీజు వేసి టెలికాం శాఖ 5జీ ఎంట్రీని మరో ఏడాది పాటు జాప్యం చేస్తోందని చెబుతున్నారు. -
జాతీయ క్రీడా అవార్డుల ప్రక్రియ ఆలస్యం
న్యూఢిల్లీ: ప్రతి యేటా ఏప్రిల్‌లోనే మొదలయ్యే జాతీయ వార్షిక క్రీడా పురస్కారాల ప్రక్రియ ఈ సంవత్సరం ఆలస్యం కానుంది. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగనుండటమే దీనికి ప్రధాన కారణం. కేంద్ర క్రీడా శాఖ ప్రతి ఏడాది ఏప్రిల్‌లో దరఖాస్తులు ఆహ్వానించేది. ‘లాక్‌డౌన్‌తో జాతీయ క్రీడా సమాఖ్యలతోపాటు క్రీడా మంత్రిత్వ శాఖలోని పలు కార్యాలయాల్లో ఇంటినుంచే పని జరుగుతోంది. దాంతో క్రీడా పురస్కారాల ప్రక్రియలో జాప్యం అనివార్యం కానుంది. వచ్చే నెలలో అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించే అవకాశముంది’ అని క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి. -
రియల్టీకి కరోనా కాటు...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ రియల్టీ రంగం మీద కరోనా వైరస్ ప్రభావం పడింది. కోవిడ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న కారణంగా గృహాల అమ్మకాలు, నిర్మాణ పనులు ఆలస్యమవుతాయని హౌజింగ్ బ్రోకరేజ్ అనరాక్ కన్సల్టెన్సీ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సుమారు 15.62 లక్షలకు పైగా గృహాలు నిర్మాణంలో ఉన్నాయని, ఇవి 2013–19 మధ్య కాలంలో ప్రారంభమైన గృహాలేనని నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిర్మాణ కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ప్రాజెక్ట్‌లలో నిర్మాణ పనులు జరగడం లేదని అనరాక్ రీసెర్చ్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. సాధారణంగా గుడిపడ్వా, అక్షయతృతీయ, నవరాత్రి, ఉగాది వంటి పర్యదినాల్లో గృహ కొనుగోళ్లు జోరుగా ఉంటాయని.. గృహ ప్రవేశాలకు ముందస్తు ప్రణాళికలు చేస్తుంటారని కానీ, కరోనా వైరస్ కారణంగా ఈసారి విక్రయాలు సన్నగిల్లాయని, గృహ కొనుగోలుదారులు గృహ ప్రవేశం చేసే అవకాశాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఇది డెవలపర్ల ఆర్థిక పరిస్థితులను దెబ్బతీస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో 64,250 గృహాలు.. నగరాల వారీగా నిర్మాణంలో ఉన్న గృహాల సంఖ్యను చూస్తే.. హైదరాబాద్‌లో 64,250 యూనిట్లు, ఎంఎంఆర్‌లో అత్యధికంగా 4.65 లక్షల గృహాలు, ఎన్సీఆర్లో 4.25 లక్షలు, పుణేలో 2.62 లక్షలు, బెంగళూరులో 2.02 లక్షలు, కోల్‌కతాలో 90,670, చెన్నైలో 54,200 యూనిట్లు ఉన్నాయి. 8–10 శాతం ఆదాయం లాస్.. నిర్మాణ సంస్థలు ఆదాయం మీద లాక్డౌన్ ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా కంపెనీల వార్షిక ఆదాయంలో నాల్గో త్రైమాసికం వాటా 30–35 శాతం వరకుంటుందని.. కానీ, ఫోర్త్ క్వాటర్లో ఆదాయం 8–10 శాతం క్షీణిస్తుందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. -
తండ్రీకూతుళ్లుగా...
అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ త్వరలోనే తండ్రీ కూతుళ్లు కానున్నారట. తండ్రీ–కూతుళ్ల బంధం మీద బాలీవుడ్ దర్శకుడు వికాశ్ బాల్ ‘డెడ్లీ’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అంత్యక్రియల కార్యక్రమం చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుందట. ఇందులో అమితాబ్ బచ్చన్, కత్రినా తండ్రీ కూతుళ్ల పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాలో నటించడానికి ఆల్రెడీ తమ అంగీకారాన్ని తెలిపారట బచ్చన్, కత్రినా. ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్‌ను మే నెలలో ప్రారంభించాలనుకున్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణను కొన్నిరోజులు ఆగి ప్రారంభించాలనుకుంటున్నారు. -
అంబులెన్స్ ఆలస్యం.. మహిళ మృతి
రాంచీ: సమయానికి అంబులెన్స్ రాక మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన జార్ఖండ్‌లో జరిగింది. గుమ్లా జిల్లాలోని సదర్ ఆస్పత్రిలో సదాన్ దేవి(48) గత నెల 29న చేరారు. అయితే ఆమె పరిస్థితి ఉన్నట్టుండి విషమంగా మారడంతో వైద్యులు రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)కు తీస్కెళ్లాల్సిందిగా శుక్రవారం మధ్యాహ్నం సూచించారు. బాధితురాలి బంధువులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే అంబులెన్స్ మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. ఆమెను రిమ్స్‌కు తరలించినా ఆలస్యం కావడంతో మరణించింది. అంబులెన్స్ డ్రైవర్ ఆలస్యం చేయడమే దీనికి కారణమని వైద్యులు తెలిపారు. -
తేజాస్ ప్రయాణీకులకు రూ 63,000 పరిహారం
సాక్షి, న్యూఢిల్లీ : అహ్మదాబాద్-ముంబై తేజాస్ ఎక్స్‌ప్రెస్ బుధవారం మధ్యాహ్నం గంట ఆలస్యం కావడంతో ప్రయాణీకులకు రూ 63,000 పరిహారం చెల్లించనున్నట్టు ఐఆర్సీటీసీ వెల్లడించింది. దేశంలో రెండో ప్రైవేట్ ట్రైన్‌గా అహ్మదాబాద్-ముంబై ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 19 నుంచి ఐఆర్సీటీసీ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం ఈ రైలు గంటా 30 నిమిషాలు ఆలస్యంగా గమ్యస్ధానానికి చేరుకుందని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు. తమ రిఫండ్ పాలసీకి అనుగుణంగా రైలులో జాప్యం జరిగినందున ప్రయాణీకులు దరఖాస్తు చేసుకోవచ్చని, వెరిఫికేషన్ అనంతరం వారికి రిఫండ్ చేస్తామని ఐఆర్సీటీసీ ప్రతినిధి పేర్కొన్నారు. తేజాస్ ఎక్స్‌ప్రెస్ అహ్మదాబాద్‌లో ఉదయం 6.42కు బయలుదేరి ముంబై సెంట్రల్‌కు మధ్యాహ్నం 1.10 గంటలకు చేరుకోవాల్సి ఉండగా 2.36 గంటలకు గమ్యాస్ధానానికి చేరుకుంది. ముంబై శివార్లలోని భయందర్, దహిసర్ స్టేషన్ల మధ్య రైలు సాంకేతిక సమస్యలతో నిలిచిపోవడంతో జాప్యం నెలకొంది. సాంకేతిక సమస్యలు సర్దుబాటు అయిన తర్వాత రైలు ముంబైకు చేరుకుందని అధికారులు తెలిపారు. ఐఆర్సీటీసీ పాలిసీ ప్రకారం రైలు గంట ఆలస్యమైతే రూ 100, రెండు గంటలు జాప్యం జరిగితే రూ 250 చెల్లిస్తారు. చదవండి : ట్రైన్ హోస్టెస్‌ల ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు.. -
మొరాయించిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్
కాజీపేట రూరల్: హైదరాబాద్ నుంచి కొత్త ఢిల్లీ వెళ్లాల్సిన తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం మార్గమధ్యలో పలు ప్రాంతాల్లో మొరాయించింది. బుధవారం ఉదయం బయలు దేరిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్ భువనగిరి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాక బ్రేక్ బోల్డు స్టార్ రిలీజింగ్ పైపు విరగగా అక్కడ 20 నిమిషాల పాటు ఆపి తాత్కాలిక మరమ్మతు చేసి, కాజీపేట పంపించారు. కాజీపేటలో మెకానిక్ సిబ్బంది కూడా 10 నిమిషాల పాటు శ్రమించి మరమ్మతు పూర్తి చేశారు. ఇక రామగుండం వెళ్లే సరికి మళ్లీ ఆగిపోయింది. దీంతో కాజీపేట నుంచి మెకానిక్ సిబ్బంది కొత్త బోల్డు స్టార్ పైప్ తీసుకెళ్లారు. అక్కడి సిబ్బందితో కలసి గంట పాటు శ్రమించి బోల్డు స్టార్‌ను తొలగించి కొత్తది అమర్చారు. ఇలా సాంకేతిక సమస్య కారణంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రెండు గంటల పాటు ఆలస్యంగా వెళ్లినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. -
ఆగని ‘మహా’ వ్యథ
సాక్షి ముంబై: అతివృష్టి లేదంటే అనావృష్టి.. ఆదుకునే నాథుడు లేడు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నెలరోజులు గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటు ఇంకా కొలిక్కి రాలేదు. రాష్ట్రపతి పాలన పెట్టడంతో తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలీక మహారాష్ట్రలో అన్నదాతలు కుంగిపోతున్నారు. గత కొన్నేళ్లుగా కరువు కోరల్లో చిక్కుకొని అల్లాడిన రైతాంగం ఈ ఏడాది కురిసిన వర్షాలకు ఆనందం చెందారు. తమ పంట పండిందని సంబరాలు చేసుకున్నారు. అయితే అక్టోబర్‌లో రుతుపవనాల తిరుగు ప్రయాణ సమయంలో భారీగా వర్షాలు కురవడంతో చేతికందిన పంట నీళ్లపాలైంది. దీంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. కేవలం మరాఠ్వాడా ప్రాంతంలో 41 లక్షల హెక్టార్లలోని పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, కందితో పాటు ఇతర పండ్ల తోటలకు తీవ్రంగా నష్టం వాటిల్లడంతో రైతన్నలు తట్టుకోలేకపోయారు. దాదాపు నెల రోజుల వ్యవధిలో 68 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఈ ఏడాది జనవరి నుంచి గణాంకాలను పరిశీలిస్తే ఈ ప్రాంతంలో 746 మంది బలవన్మరణం పొందారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై తమను ఆదుకుంటుందేమోనని రైతాంగం ఆశగా ఎదురు చూస్తున్న సమయంలోనే రాష్ట్రపతి పాలన పెట్టడంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. అయితే రాష్ట్ర గవర్నర్ పంట నష్టపోయిన వారికి ప్రతీ హెక్టార్‌కు రూ.8 వేలు, పండ్ల తోటలకు ప్రతీ హెక్టార్‌కు రూ.18 వేలు ప్రకటించడం కాస్త ఊరటనిచ్చినా కష్టాల ఊబి నుంచి రైతుల్ని బయటపడవేయలేకపోయాయి. ప్రభుత్వ లెక్కలన్నీ తప్పులే ‘సాక్షి’తో పి. సాయినాథ్ రైతు కష్టాల్లో మహారాష్ట్ర అత్యంత దయనీయ స్థితిలో ఉందని సీనియర్ జర్నలిస్టు, ది హిందూ పత్రిక గ్రామీణ వ్యవహారాల మాజీ ఎడిటర్ పి. సాయినాథ్ అన్నారు. రైతుల ఆత్మహత్య వివరాల్లో ప్రభుత్వ గణాంకాలన్నీ తప్పుడువేనని చెప్పారు. ఈ విషయమై ఆయన సాక్షితో మాట్లాడుతూ 1995 నుంచి 2015 వరకు 20 ఏళ్లలో మహారాష్ట్రలో 65 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెబుతున్నారు కానీ, ఇది సరైనది కాదని అన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గణాంకాలను సేకరించే పద్ధతిలో లోపాలున్నాయని అన్నారు. వారు సరిగ్గా లెక్కలు వేసి ఉంటే ఈ సంఖ్య ఇంకా పెరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్న డేటా కూడా మూడేళ్ల నాటిదని సాయినాథ్ వ్యాఖ్యానించారు. రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలోనే కనీసం ప్రభుత్వం కూడా లేకపోవడం పులి మీద పుట్రవంటిదేనని వ్యాఖ్యానించారు. -
ఆ విమానం రన్‌వేపైనే ఆరుగంటలు..
ముంబై : దేశ ఆర్థిక నగరం ముంబైని భారీ వర్షాలు ముంచెత్తడంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ముంబై నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వేపై ఏకంగా ఆరు గంటలకు పైగా నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. ఎయిర్‌లైన్స్ తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బుధవారం మధ్యాహ్నం 3.15 గంటలకు ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం రాత్రి 9.55 గంటల వరకూ రన్‌వేపైనే నిలిచిపోయింది. విమానం టేకాఫ్‌లో తీవ్ర జాప్యంపై ప్రయాణీకులు అసహనం వ్యక్తం చేస్తూ ట్విటర్లో కామెంట్స్ చేశారు. విమానంలోనే తమను ఆరుగంటల పాటు కూర్చోబెట్టారని, విమానం టేకాఫ్ తీసుకోదు..తమను వెలుపలికి అనుమతించరు..అసలు ఏం జరుగుతోందని పూజా రాఠీ ట్వీట్ చేశారు. మరికొందరు ఇలాంటి ఎయిర్‌లైన్స్ లైసెన్సును ఎందుకు రద్దు చేయరంటూ పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. కాగా, ముంబైలో అసాధారణ రీతిలో భారీ వర్షాలు కురవడంతో గ్రౌండ్ సపోర్ట్ సిబ్బంది, విమాన సిబ్బంది, కెప్టెన్లు సకాలంలో ఎయిర్‌పోర్టుకు చేరుకోలేదని దీంతో ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన విమానాల్లోనూ జాప్యం చోటుచేసుకుందని, సాధారణ పరిస్థితి నెలకొనేలా ప్రయత్నిస్తున్నామని ఇండిగో ఓ ప్రకటనలో వెల్లడించింది. -
టెన్త్ ఫలితాల ఆలస్యంపై స్పందించిన ఎస్ఎస్సీ బోర్డ్
-
రైళ్లు ఆలస్యం.. కారణం ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రైళ్లు ఆలస్యంగా నడవడంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రైల్వే శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంటుకు ఇచ్చిన నివేదికలో ఈ మేరకు రైల్వే శాఖను ఉతికి ఆరేసింది. ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పించడం, స్టేషన్లను అభివృద్ధి చేయడంపై రైల్వే శాఖ దృష్టి సారిస్తోంది తప్ప రైళ్ల రాకపోకలను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 15 రైల్వే స్టేషన్లను ప్రామాణికంగా తీసుకున్న కాగ్ నివేదికను రూపొందించింది. ఆయా స్టేషన్లలో రైళ్ల రాకపోకలు భారీగా పెరిగిపోయాయని చెప్పిన కాగ్, ఆ స్థాయిలో ప్లాట్ ఫాంలు, వాషింగ్ పిట్లను అందుబాటులో ఉంచలేదని ఫైర్ అయింది. ఆ 15 స్టేషన్లలో మార్చి 2017 నాటికి 2,436 రైళ్లు నడుస్తున్నాయని, అందులో 638 రైళ్లు 24 అంతకంటే ఎక్కువ కోచ్‌లతో నడుస్తున్నాయని తెలిపింది. అయితే, ఆ స్థాయిలో ప్లాట్ ఫాంలు మాత్రం లేవని చెప్పింది. ప్లాట్ ఫాంల కొరత కారణంగానే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని తేల్చి చెప్పింది. ముందు స్టేషన్లలో ప్లాట్ ఫాంలు ఖాళీ అయ్యేంత వరకూ ఔటర్ సిగ్నల్స్ వద్ద రైళ్లను ఆపేస్తున్నారని కాగ్ స్పష్టం చేసింది. అన్ని రైల్వే జోన్లు స్టేషన్ల అభివృద్ధికి ఓ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని సూచించింది. -
ఆసరా పెన్షన్ల కోసం ఎదురుచూపు
-
నవోదయం.. జాప్యం
వర్గల్(గజ్వేల్) : జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష(జేఏన్‌వీఎస్‌టీ–2018) ఫలితాల వెల్లడిలో అంతులేని జాప్యం కొనసాగుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఫలితాల జాడ లేదు. ఈక్రమంలో ఫలితాల కోసం వేచి చూడాలా? లేక ప్రైవేటు స్కూళ్లలో చేర్పించాలా? అనే సందిగ్ధంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. ఫలితాలపై ఆరా తీసే వారికి నవోదయ వర్గాలు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా(మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట) వ్యాప్తంగా ఆరో తరగతిలో కేవలం 80 సీట్లకు గాను సగటున ఒక్కో సీటుకు 100 మంది చొప్పున పోటీపడుతూ మొత్తం 8,456 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 6,623 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ లెక్కలే తల్లిదండ్రుల్లో నవోదయపై ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తుంది. ఎంట్రన్స్ నిర్వహణకు సంబంధించి సీబీఎస్ఈతో నవోదయ విద్యాలయ సమితి టైఅప్ అయ్యింది. దీని ప్రకారం ప్రవేశ పరీక్షను నవోదయ విద్యాలయ సమితి అధికారులు నిర్వహించగా, సీబీఎస్ఈ అధికారులు ప్రశ్నపత్రాలను వాల్యూయేషన్ చేసి ఫలితాలు వెల్లడిస్తారు. అక్కడి నుంచే మెరిట్, రిజర్వేషన్ప్రకారం ప్రవేశార్హత సాధించిన 80 మంది విద్యార్ధుల పేర్లతో కూడిన జాబితా విడుదల అవుతుంది. దీని ఆధారంగా ఆయా జిల్లాలలోని నవోదయ విద్యాలయాలు ఫలితాలు రిలీజ్ చేస్తాయి. ఆలస్యంగా ఎంట్రన్స్ పరీక్ష సాధారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని నవోదయ విద్యాలయాల్లో ఏటా ఫిబ్రవరి 10న ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా 2018 విద్యా సంవత్సరం కోసం వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో ప్రవేశం పొందేందుకు ఫిబ్రవరి 10న ఎంట్రస్ పరీక్ష జరుగుతుందని ప్రాస్పెక్టస్‌లో స్పష్టం చేశారు. ఏప్రిల్ లేదా మే మొదటి వారంలో ఎంట్రన్స్ ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ సరళీకరణ కోసం మాన్యువల్ పద్ధతికి స్వస్తి చెప్పి ఆన్లైన్ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. అయితే, నిర్దేశిత ప్రణాళికకు అనుగుణంగా అధికారులు ఎంట్రన్స్ నిర్వహించలేదు. నూతన విధానంలో దరఖాస్తుల సమర్పణ, సాంకేతిక సమస్యలు తలెత్తడం, కొత్త విధానానికి అనుగుణంగా సీబీఎస్ఈ ప్రణాళిక రూపొందించుకోకపోవడం తదితర కారణాలు ఎంట్రన్స్ పరీక్ష వాయిదాకు దారి తీశాయి. సాంకేతిక కారణాలు గా చూపుతూ ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన పరీక్షను నిరవదికంగా వాయిదా వేస్తున్నట్టు నవోదయ విద్యాలయ సమితి ప్రకటించింది. దా దాపు రెండున్నర నెలలు ఆలస్యంగా ఏప్రిల్ 21న ఎంపిక పరీక్ష నిర్వహించారు. దీంతో రిజల్ట్ వెల్లడిలో అంతులేని తాత్సారం కొనసాగుతోంది. జూ న్ ముగిసినా ఎంట్రన్స్ ఫలితాలు రాకపోవడంతో సీబీఎస్ఈ వైఫల్యంపై విమర్శలువస్తున్నా యి. అంతా అయోమయం ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి కాకపోవడంతో తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. నవోదయ పాఠశాలలో తమ పిల్లలను చేర్పిస్తే ఫీజుల భారం తగ్గుతుందని, నాణ్యమైన విద్యతో పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని భావించిన వారి ఆశలు అడియాసలు అవుతున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులవుతున్నా ఫలితాలు జాడలేకపోవడంతో ఆర్థిక స్తోమత కలిగిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఆర్థిక స్తోమత లేని వారు మాత్రం ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారు. గిట్లయితే నవోదయ పేరు చెడిపోతది మేము పేదోళ్లం. నవోదయల సదువుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుపడుతదని నమ్మకం. ఐదో తరగతి చదువుతుండగానే మా కొడుకుతోని నవోదయ పరీక్ష రాయించిన. సీటొస్తే ఫీజుల బాధ పోతది. బాగ చదువొస్తదనుకున్న. నమ్మకంగా సీటొస్తదనుకుంటే బడులు మొదలై నెలరోజులు దాటినా రిజల్ట్ వస్తలేదు. గిట్లయితే నవోదయ పేరు ఖరాబైతది. నమ్ముకం పోతది. బిరాన రిజల్ట్ పెడితే అయోమయం పోతది. – అశోక్, నెంటూరు ఫలితాల్లో జాప్యం వాస్తవమే.. నవోదయ ఎంట్ర¯Œస్ట్ టెస్ట్ ఫలితాల్లో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. సీబీఎస్ఈ ఫలితాల జాబితా పంపిన వెంటనే విడుదల చేస్తాం. ఆన్లైన్ నేపథ్యంలో ఫిబ్రవరి 10న జరగాల్సిన పరీక్ష ఏప్రిల్ 21కి వాయిదా పడింది. రిజల్ట్స్ కోసం తల్లిదండ్రుల నుంచి పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. జూలై మొదటి వారంలోగా రిజల్ట్స్ వస్తాయనుకుంటున్నాం. ఫలితాలు వెల్లడి కాగానే వెంటనే పత్రికల ద్వారా విడుదల చేస్తాం. తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు. – వెంకటరమణ, ప్రిన్సిపాల్, వర్గల్ నవోదయ -
క్లెయిమ్ చెల్లింపు ఆలస్యమైతే జరిమానా
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబోతున్న ‘ఆయుష్మాన్ భారత్’ పథకంలో భాగంగా ఆసుపత్రులకు క్లెయిమ్‌ల చెల్లింపులో ఆలస్యం చేసే బీమా కంపెనీలపై జరిమానా విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. క్లెయిమ్‌ల సెటిల్మెంట్కు 15 రోజుల కన్నా ఎక్కువ జాప్యం జరిగితే, చెల్లించాల్సిన మొత్తంపై సదరు బీమా కంపెనీ వారానికి ఒక శాతం చొప్పున వడ్డీ కట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ జరిమానాను బీమా కంపెనీయే నేరుగా ఆసుపత్రికి చెల్లించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే ఈ పథకంలో చేరడానికి ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఢిల్లీ, పంజాబ్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ఇంకా తమ స్పందన తెలపలేదు. -
కర్ణాటక మంత్రివర్గ విస్తరణ ఆలస్యం?
బెంగళూరు: కర్ణాటక మంత్రివర్గ విస్తరణ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నా పదవుల పంపకంలో ఏకాభిప్రాయం రాలేదు. సీఎంగా కుమారస్వామి, ఉపముఖ్యమంత్రిగా పరమేశ్వర ప్రమాణంచేయడం తెల్సిందే. కాంగ్రెస్ పార్టీ తమ కోటా కింద ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని పట్టుబడుతోందని తెలుస్తోంది. ఆర్థిక శాఖ కాంగ్రెస్ తమకే కావాలంటోంది. అయితే ఈ విషయంలో జేడీఎస్ బెట్టుగా ఉంది. సీఎం పదవిని త్యాగం చేసిన నేపథ్యంలో ఆర్థిక శాఖతో పాటు పీడబ్ల్యూడీ, ఇంధన శాఖలు కూడా తమకే ఇవ్వాలని, మొత్తంగా 22 మందికి మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరలోనే ఈ విషయాన్ని తేల్చేస్తాం’ అని కుమారస్వామి మీడియాకు తెలిపారు. -
మరణశిక్షలతో నేరాలు ఆగుతాయా?
కఠిన చట్టాలున్నా వాటి అమలు సరిగ్గా జరగకపోతే లేదా అమల్లో తీవ్ర జాప్యం జరిగితే వాటి వల్ల ప్రయోజనం ఏముంటుందన్న ప్రశ్నలు మళ్లీ ఉత్పన్నమవుతున్నాయి. పన్నెండేళ్ల లోపు పిల్లలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధించేందుకు అనుమతిస్తూ ఇటీవల కేంద్రం ఆర్డినెన్స్ జారీచేసింది. ఈ నేపథ్యంలో క్రూరమైన నేరాలు జరగకుండా ఉరిశిక్షలు ఏ మేరకు హెచ్చరికలుగా నిలుస్తాయన్నది చర్చనీయాంశమవుతోంది. ఐరాసతో సహా ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల సంఘాలు మరణశిక్షలు అమానవీయమని వీటిని రద్దు చేయాలని గట్టిగా డిమాండ్చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉరిశిక్షల అమలు వల్ల కలిగే ప్రయోజనం ఏమిటనే ప్రశ్నలు కూడా ఉద్భవిస్తున్నాయి. ముఖ్యంగా మనదేశంలోని న్యాయస్థానాల్లో కేసుల విచారణ సుదీర్ఘకాలం పాటు సాగడం వల్ల నిందితులు తీవ్ర నేరాలకు పాల్పడకుండా మరణశిక్షలు నియంత్రణగా ఉపయోగపడడం లేదని అభిప్రాయపడుతున్న వారూ ఉన్నారు. 2017 ఆఖరు నాటికి భారత్‌లో 371 మంది మరణశిక్ష పడిన ఖైదీలున్నారు. వారిలో... 1991లో శిక్ష పడిన ఖైదీ కూడా ఉన్నాడు. అంటే అతడిది 27 ఏళ్ల నిరీక్షణ. 2017లో దేశవ్యాప్తంగా వివిధస్థాయిల్లోని న్యాయస్థానాలు 109 మందికి ఉరిశిక్ష విధించాయి. 2016లో ఈ సంఖ్య 149గా ఉంది. అయితే గత పధ్నాలుగేళ్లలో కేవలం నలుగురికి మాత్రమే ఈ శిక్షను అమలుచేశారు. వీరిలోనూ ముగ్గురికి తీవ్రవాద కార్యకలాపాలు పాల్పడినందుకు, ఒకరికి మాత్రమే మైనర్‌పై లైంగికదాడి, హత్యకు పాల్పడినందుకు మరణశిక్ష విధించారు. ఉరిశిక్ష పడిన 127 మంది ఖైదీల కేసుల విచారణకు అయిదేళ్లకు పైగా, 54 మందికి పదేళ్లకు పైగా, మిగతా వారికి అయిదేళ్ల వరకు సమయం పడుతోంది. ఉరిశిక్ష రద్దుకు ఖైదీలు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లు రాష్ట్రపతి తిరస్కరణకు గురవడానికి మధ్యకాలంలో 10 నుంచి 16 ఏళ్ల శిక్షను వారు అనుభవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఢిల్లీ నిర్భయ అత్యాచారం కేసులో పడిన ఉరిశిక్షను సమీక్షించాలంటూ నలుగురిలో ఇద్దరు ఖైదీలు పెట్టుకున్న పిటీషన్‌పై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ప్రకటన వాయిదా వేసింది. ఉరిశిక్షలనేవి నేరస్థులను అంతమొందిస్తాయే తప్ప నేరాన్ని కాదంటూ ఈ ఖైదీల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ వాదించారు. ఎవరు జీవించాలి, ఎవరు మరణించాలి అన్న విషయాన్ని న్యాయస్థానాలు ఎలా నిర్ణయిస్తాయంటూ ప్రశ్నించారు. గత 14 ఏళ్లలో ఉరి అమలు 4 కేసుల్లోనే... 1993 నాటి ముంబై వరుస బాంబుపేలుళ్ల కేసులో 2015 జులై 30న యాకుబ్ మెమన్‌కు నాగ్‌పూర్ జైలులో ఉరిశిక్ష అమలుచేశారు పార్లమెంట్‌పై దాడి చేసులో మహ్మద్ అఫ్జల్ గురుకు 2013 ఫిబ్రవరి 9న ఢిల్లీ తీహార్ జైలులో శిక్ష పూర్తిచేశారు. 2008లో ముంబైపై పాక్ ముష్కరులు ఉగ్రదాడి జరిపిన కేసులో సజీవంగా పట్టుకున్న అజ్మల్ అమీర్ కసబ్‌ను 2012 నవంబర్ 21న పుణెలోని ఎరవాడ జైలులో ఉరితీశారు. టీనేజీ అమ్మాయి అత్యాచారం,హత్య కేసులో 2004 ఆగస్టు 14న పశ్చిమబెంగాల్ లోని అలీపూర్ జైలులో ధనుంజయ్ ఛటర్జీ (42)కి మరణశిక్ష అమలుచేశారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పంచాయతీ నిధులకు బ్రేకు
మోర్తాడ్(బాల్కొండ) : గ్రామాలలో వివిధ అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 14వ ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేయనీయకుండా సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ బ్రేకు వేసింది. 14వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు మంజూరైన నిధులతో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాల్సి ఉండగా ట్రెజరీ కార్యాలయాల్లో ఫ్రీజింగ్ విధించడంతో పంచాయతీ పాలకవర్గాలు అయోమయానికి గురవుతున్నాయి. ట్రెజరీ కార్యాలయాల్లో ఫ్రీజింగ్ విధించడం వల్ల ఆర్థిక సంఘం నిధులను వినియోగించలేక పోతున్నామని సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. పంచాయతీల పదవీ కాలం త్వరలో ముగిసిపోనున్న తరుణంలో చేసిన పనులకు బిల్లుల చెల్లింపు పూర్తి కాకపోవడంతో మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం ద్వారా రెండు విడతలలో నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో గ్రామాలలో నీటి సమస్య పరిష్కారం కోసం బోరుబావుల ఫ్లెష్సింగ్, పంపుసెట్ల మరమ్మతులు, కొత్త వాటిని కొనుగోలు చేయడం, మురికి కాలువల నిర్మాణం, కల్వర్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. గ్రామాలలో ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఆర్థిక సంఘం నిధులను వినియోగించాల్సి ఉంది. నిధులు జనవరి తరువాత విడుదల కాగా పంచాయతీ ఖాతాల్లో ఉన్నతాధికారులు జమ చేశారు. కాని ఇంత వరకు నిధులను వినియోగించడానికి అవకాశం రాలేక పోయింది. పంచాయతీల పరిధిలోని జనాభా ప్రకారం నిధులు విడుదల అవుతున్నాయి. పంచాయతీల జనాభాను పరిగణనలోకి తీసుకుని ఒక్కో పంచాయతీకి రూ.5 లక్షల నుంచి రూ.25లక్షల వరకు నిధులను కేటాయించారు. ఇందులో దాదాపు 20 శాతం విద్యుత్ బిల్లుల చెల్లింపులకు మినహాయిస్తున్నారు. మిగిలిన 80 శాతం నిధులను అభివృద్ధి పనుల కోసం వినియోగించాల్సి ఉంది. ప్రతి పంచాయతీకి గతంలో బీఆర్జీఎఫ్, ఉపాధి హామీ పథకం ద్వారా మెటల్ కాంపోనెంట్ తదితర నిధులు మంజూరయ్యేవి. పంచాయతీల కోసం నిర్దేశించిన కార్యక్రమాల ద్వారా నిధులు కేటాయించే విధానానికి కేంద్రం స్వస్తి పలికింది. ఫలితంగా ఆర్థిక సంఘం నిధులపైనే పంచాయతీలు ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఆర్థిక సంఘం నిధులు విడుదలైనా ట్రెజరీలలో ఫ్రీజింగ్ అమలు కావడంతో ఏమి చేయాలో పంచాయతీల పాలకవర్గాలకు పాలుపోవడం లేదు. జిల్లాలో 393 పాత పంచాయతీలు ఉండగా ఈ అన్ని పంచాయతీలలో ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలా ఉండగా పంచాయతీ పాలకవర్గాలలో ఎక్కువ భాగం అధికార పార్టీ నాయకులే ఉన్నారు. ట్రెజరీలలో ఫ్రీజింగ్ విధించిన విషయంపై తాము ఏమి మాట్లాడినా ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతుందని అధికార పార్టీ సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. పంచాయతీల ఖాతాల్లో ఉన్న నిధులను వినియోగించకుండా ప్రభుత్వం ట్రెజరీలలో ఫ్రీజింగ్ విధించడం వల్ల జిల్లాలో దాదాపు రూ.20 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ట్రెజరీలలో ఫ్రీజింగ్ ఎత్తివేసి బిల్లుల చెల్లింపులకు ఆమోదం తెలుపాలని పంచాయతీల పాలకవర్గాలు కోరుతున్నాయి. పది రోజుల్లో సమస్య పరిష్కారం కావచ్చు ట్రెజరీ కార్యాలయాల్లో ఫ్రీజింగ్‌కు సంబంధించిన సమస్య పది రోజుల్లో పరిష్కారం కావచ్చు. ఫ్రీజింగ్ ఎత్తివేసిన సమయంలో బిల్లులు చెల్లిస్తున్నాం. ప్రభుత్వం నుంచి సానుకూల వాతావరణం కనిపిస్తుంది. తొందరలోనే ఫ్రీజింగ్ నిలిపివేసి బిల్లులు చెల్లింపు చేసే అవకాశం ఉంది. – రామానాయుడు, డిప్యూటీ డైరెక్టర్, జిల్లా ట్రెజరీ శాఖ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడుతుంది ట్రెజరీ కార్యాలయాల్లో ఫ్రీజింగ్ విధిం చడం వల్ల పంచాయతీల పరిధిలో అభివృద్ధి కుంటుపడుతుంది. అభివృద్ధి పనులు వేగంగా జరుగాలంటే నిధులు ఎంతో అవసరం. కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తు ఫ్రీజింగ్ విధించడం సరికాదు. – శివన్నోల్ల వైష్ణవి, సర్పంచ్, ఏర్గట్ల ఫ్రీజింగ్ ఎత్తివేయాలి పంచాయతీ ఖాతాల్లో ఉన్న నిధులను వినియోగించడానికి ప్రభుత్వం ఫ్రీజింగ్‌ను ఎత్తివేయాలి. ట్రెజరీలలో నిధుల వినియోగంపై ఫ్రీజింగ్ విధించడం వల్ల అభివృద్ధి పనులు చేయలేక పోతున్నాం. ప్రభుత్వం చొరవ తీసుకుని ఫ్రీజింగ్ ఎత్తివేయాలి. – ఉగ్గెర భూమేశ్వర్, సర్పంచ్, తిమ్మాపూర్ -
కావేరి బోర్డు ఏర్పాటులో జాప్యంపై అసంతృప్తి
న్యూఢిల్లీ: కావేరి నదీ జలాల యాజమాన్య బోర్డు ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డు ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న చర్యలు వివరిస్తూ మే 8 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కావేరి బోర్డును నియమించే బాధ్యత కేంద్రానిదేనని, ఇందులో రాష్ట్రాల పాత్ర ఏమీ ఉండదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు సూచించింది. తమ ఆదేశాల మేరకు కావేరి జలాశయాల నుంచి తమిళనాడుకు 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేని పక్షంలో కోర్టు ధిక్కార కేసుగా భావించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరు కోరుతామని హెచ్చరించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారని, విచారణను పోలింగ్ ముగిసే దాకా వాయిదా వేయాలని వేణుగోపాల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం పక్షపాత ధోరణితో సమాఖ్య విధానానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని తమిళనాడు ఆరోపించింది. -
రజనీకాంత్ పార్టీ ఏర్పాటు ఆలస్యం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ పార్టీ ఏర్పాటు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. రజనీకాంత్ మక్కల్ మన్రం అనే వేదికను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14న పార్టీ పేరు వెలువడుతుందని, వెంటనే భారీ ఎత్తున సభ జరుగుతుందని రజనీ వర్గాలు ప్రచారం చేశాయి. కావేరి వివాదం, ఇంకా అనేక అంశాలపై ఆందోళనలు జరుగుతున్న తరుణంలో పార్టీ ఏర్పాటుకు ఇది సమయం కాదని ఇటీవల మక్కల్ మన్రం ఇన్‌చార్జ్‌లు రజనీకి సలహా ఇచ్చినట్లు సమాచారం. -
కర్ణాటక కాంగ్రెస్ తొలి జాబితా ఆలస్యం
న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ నేతల మధ్య విభేదాల కారణంగా అభ్యర్ధుల తొలి జాబితా ఆలస్యం కానుంది. ముందుగా ప్రకటించిన ప్రకారం 180 మంది అభ్యర్ధులతో తొలి జాబితా శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. అయితే, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన కేంద్ర ఎన్నికల కమిటీ రెండు సార్లు సమావేశమైనప్పటికీ అభ్యర్ధుల విషయంలో ఏకాభిప్రాయం సాధ్యం కాలేదనీ, శనివారం మరోసారి సమావేశం కానున్నారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య తెలిపారు. పార్టీ సీనియర్ నేతలంతా ఎవరికి వారు తమ సొంత జాబితా తయారు చేసుకుని రావడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన జేడీ(ఎస్), బీజేపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వటంపై కొందరు నేతలు అభ్యంతరం చెబుతున్నట్లు సమాచారం. సీఎం సిద్దరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేశ్వర, కొందరు సీనియర్ మంత్రుల కుటుంబీకులకు టికెట్లు ఇవ్వటంపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
పింఛన్ల పంపిణీలో జాప్యం
-
అదనపు ఆయ(కని)కట్టు
పాలకులు చెబుతున్న ఆయకట్టు మాటలు కనికట్టుగా మారిపోతున్నాయి. ఫలితంగా అన్నదాత ఆశలు ఆవిరవుతున్నాయి. పాలకుల మాటలపై ఆశలు పెంచుకొని రైతులు ఎదురు చూడడమే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో పనుల అంచనా విలువ పెరిగి తడిపిమోపెడవుతుంది. అయినా పనులు జరిగిన పరిస్థితులు కనిపించడం లేదు. బొబ్బిలి: వెంగళరాయ సాగర్ జలాశయం ద్వారా 24వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తున్నా అంతకు మించి సాగునీరు ఇచ్చే సామర్ధ్యం ఉందని ఉన్నతాధికారులు గుర్తించారు. అప్పటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గొల్లపల్లి వద్ద శిలాఫలకం వేసి రూ.5 కోట్లతో పనులు ప్రారంభించారు. గుత్తేదారులు, అధికారుల నిర్లక్ష్యంతో ఆ పనులు అంచనాలు పెరిగిపోయి పలుమార్లు నిలిచిపోయాయి. ఆ తరువాత 2013లో రూ.12.67 కోట్లతో ప్రారంభించిన పనులు కేవలం 18 నెలల్లో చేపడతామని చెప్పినా నత్తనడకన సాగుతున్నాయి. సీతానగరం మండలంలోని ఐదు గ్రామాలు, బొబ్బిలి మండలంలోని 13 గ్రామాల్లో 4,996 ఎకరాలకు సాగునీరందించేందుకు చేపట్టిన ఈ పనులకు సంబంధించి ఇంకా భూ సేకరణ కూడా పూర్తి కాలేదు. రాముడువలస, చింతాడ తదితర గ్రామాల్లో రైతులు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. ఇప్పటికి రెండుసార్లు గడువు పూర్తయినా కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. నేటికీ ఇంకా 25 శాతం కూడా పూర్తవని పనులు ఈ ఏడాది మార్చి నాటికి ఐదు వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉన్నా పనుల నత్తనడక కారణంగా సాధ్యమయ్యే పరిస్థితి కానరావడం లేదు. వెన్నెల బుచ్చెంపేట నుంచి కలువరాయి వరకూ గల 3.45 కిలోమీటర్ల మేర కాలు నిర్మాణం పూర్తయింది. అక్కడి నుంచి చింతాడ వరకూ గల కాలువ నిర్మాణం కోసం పది ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉంది. కానీ దీనికి పరిహారంపై రైతులు అభ్యంతరం చెబుతున్నారు. అటు కాంట్రాక్టర్ పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అయితే బిల్లులు చెల్లింపుల్లో కూడా సాగదీత ఉన్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్‌కు రూ.2.43కోట్లు చెల్లించారు. బిల్లుల పెండింగ్‌తో పాటు భూ సేకరణ అడ్డంకిగా మారింది. ఇంకా రాముడువలస, చింతాడ, కలువరాయి గ్రామాలకు చెందిన 26 మంది రైతుల నుంచి 22 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దీనిపై కనీసం కదలిక లేదు. మరో పక్క సీతానగరం మండలం ఎన్సీఎస్ సుగర్ ఫ్యాక్టరీ వద్ద రూ.3కోట్లతో అక్విడెక్ట్‌ను నిర్మించాల్సి ఉంది. ఈ నిర్మాణాలపై ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరుగుతున్నాయి. మరో పక్క అదనపు ఆయకట్టు సాధించామని అధికార పార్టీ నేతలు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎటువంటి పురోగతి లేదని, దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం మానేశారని రైతాంగం విమర్శిస్తున్నది. ఇప్పటికే వెంగళరాయ సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీరందని పరిస్థితి నెలకొందని, దీనిని పక్కన పెట్టేసిన యంత్రాంగం అదనపు ఆయకట్టును కూడా నిదానంగా పర్యవేక్షిస్తోందని ఆరోపిస్తున్నారు. పనులు జరిపిస్తున్నాం... వెంగళరాయ సాగర్ అదనపు ఆయకట్టు పనులు జరిపిస్తున్నాం. కాంట్రాక్టర్‌కు పలుమార్లు నోటీసులు ఇచ్చాం. ప్రస్తుతం బొబ్బిలి శివారులో అక్విడెక్ట్ పనులు జరుగుతున్నాయి. మార్చి నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నాం. –కె.బాలసూర్యం, డీఈఈ, బొబ్బిలి డివిజన్ -
నేటి మధ్యాహ్నం బువ్వ గడిచేదెట్టా..!
తూర్పుగోదావరి ,రాయవరం (మండపేట): మధ్యాహ్న భోజనం భేషుగ్గా ఉండాలి ... నిధులు మాత్రం అంతంతమాత్రమేనంటూ సర్కారు వ్యవహరించడంతో జిల్లాలోని మూడు లక్షల మంది విద్యార్థులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు మంగళవారం (ఈ నెల 23) ఒక రోజు సమ్మెకు పిలుపునివ్వడంతో విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో పడ్డారు. ఓ పక్క కళ్లెంలేని గుర్రంలా నిత్యావసర వస్తువుల ధరలు దౌడు తీస్తుంటే తాము పౌష్టికాహారాన్ని ఎలా అందించగలమంటూ మిడ్ డే మీల్ వర్కర్లు ఈ నెల 23న ఒక రోజు సమ్మె నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో అమలు తీరిదీ... జిల్లాలో 4,240 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలవుతుంది. 3,335 ప్రాథమిక, 321 ప్రాథమికోన్నత, 574 ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నారు. రోజుకు సరాసరిన మూడు లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తీసుకుంటున్నారు. జిల్లాలో అనపర్తి మండలం పొలమూరులోని బుద్దవరపు ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 129, రాజమహేంద్రవరంలోని ఇస్కాన్ సంస్థ ద్వారా 57, కాకినాడలోని అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ ద్వారా 84 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తుండగా, మిగిలిన పాఠశాలల్లో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు వండి వడ్డిస్తున్నాయి. జిల్లాలో 7,800 మంది మిడ్డే మీల్ వర్కర్లు పనిచేస్తున్నారు. సమ్మె ఎందుకు చేస్తున్నారంటే.. మిడ్ డే మీల్ వర్కర్లకు ప్రస్తుతం నెలకు రూ.వెయ్యి వంతున ఇస్తుండగా, కనీస వేతన చట్టం ప్రకారం రూ.18 వేలు చెల్లించాలి. ’మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదు. ’విద్యార్థులకు చెల్లించే మెనూ ఛార్జీలు పెంచాలి. ’మిడ్డేమీల్ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ పెంచాలి. ’ప్రతి నెలా ఐదో తేదీలోపు బిల్లులు చెల్లించాలి. ’ప్రస్తుతం ఇవ్వాల్సిన గతేడాది జులై, నవంబరు, డిసెంబరు నెలల బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలి. ’మధ్యాహ్న భోజన పథకంలో సరఫరా అవుతున్న బియ్యం 50 కేజీలకు దాదాపుగా నాలుగు కేజీల తరుగు వస్తోంది. దీన్ని నివారించాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో వీరు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఎలా వండి వార్చాలి.. పిల్లలంటే చాలు..ఎవరైనా ఎంతో ఇష్టంగా కొసరి కొసరి పెడతారు..కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రోజు ఇంతే..సర్దుకోండంటూ..కోత పెట్టే పరిస్థితి మధ్యాహ్న భోజన పథకంలో కనిపిస్తోంది. కూరగాయల ధరలు చూస్తే..ఆకాశన్నంటుతుంటాయి. పప్పుల ధరలు గమనిస్తే రోజు రోజుకు రాకెట్లా దూసుకుపోతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం మధ్యాహ్న భోజనానికి ఆచితూచీ గతేడాది జూన్‌లో రూ.1.35 పెంచింది. ఈ నేపథ్యంలో చేసేది లేక నీళ్ల సాంబారు..అరాకొర పప్పుతో ఆకుకూర, గుడ్డులో కోత..చాలీ చాలని భోజనం పెడుతూ పిల్లల ఉసురు పోసుకుంటున్నామని నిర్వాహకులు వాపోతున్నారు. పిల్లలు ఉదయం తినే రెండు ఇడ్లీ రూ.10 పెడితే గానీ రావడం లేదు. అలాంటిది రూ.6.48 ఇస్తే పప్పుకూర, గడ్డుకు ఏమాత్రం సరిపోతుందో ప్రభుత్వానికి తెలియంది కాదు. ఇలా మధ్యాహ్న భోజనం పథకంలో పౌష్టికాహారం లోపంతో పేద విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఈ పెంపు ఏపాటి..? ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని వండి వార్చేందుకు వంట ఖర్చుల కింద ఒక్కో విద్యార్థికి గతేడాది జూన్ నుంచి అదనంగా రూ.1.35 చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకారం ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రూ.7.18 నుంచి రూ.8.53, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ.5.13 నుంచి 6.48కు పెరిగినట్లయింది. వారానికి మూడు కోడి గుడ్లను విద్యార్థులకు అందిస్తున్నారు. కోడి గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేస్తూ ఒక్కో విద్యార్థికి ఇచ్చే మెనూ సొమ్ములో రూ. 2.30 కోత విధించింది. పెరిగిన నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ పెంపు ఏపాటివన్న విమర్శలు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీల నుంచి వినిపిస్తోంది. సాంబారు చేయాలంటే కందిపప్పుతోపాటు చింతపండు, తాలింపునకు దినుసులు, నూనె, ఉల్లిపాయలు, టమోటాతోపాటు కూరగాయలు వేయాలి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ కందిపప్పు రూ.70, చింతపండు రూ.150, కేజీ ఉల్లి రూ.50లు ఉంది. ఇలా అన్ని ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ధరలతో నాణ్యతగా వండాలని ఉపాధ్యాయులు నిర్వాహకులకు గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉంది. దీనికితోడు నెల నెలా బిల్లుల చెల్లింపులో జాప్యం కావడంతో అప్పుచేసి పప్పుకూడు పెట్టలేక..పెరిగిన ధరలతో అన్నీ తెచ్చి వండలేక కూరల తయారీ ‘మమ’ అనిపిస్తున్నారు. న్యాయమైన డిమాండ్ల సాధనకే.. న్యాయమైన డిమాండ్ల సాధనకే సమ్మె చేస్తున్నాం. ప్రభుత్వం దృష్టికి సమస్య తీవ్రతను తెలపడమే మా ఉద్దేశం. హాస్టల్ విద్యార్థులతో సమానంగా భోజన పథకం ఛార్జీలు పెంచాలి. సమ్మె విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. – చంద్రమళ్ల పద్మ, జిల్లా అధ్యక్షురాలు, మిడ్డే మీల్ వర్కర్స్ యూనియన్ ప్రతి విద్యార్థికి మిడ్డేమీల్ అందజేస్తాం.. మధ్యాహ్న భోజన పథకం నిలుపుదల కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి విద్యార్థికీ మధ్యాహ్న భోజనం అందించాలని ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశా. సమ్మె ప్రభావం మధ్యాహ్న భోజనంపై పడకుండా చూస్తాం. – ఎస్.అబ్రహం, జిల్లా విద్యాశాకాధికారి, కాకినాడ -
నేడు ఆలస్యంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్– న్యూఢిల్లీ(12723) తెలంగాణ ఎక్స్‌ప్రెస్ బుధవారం(3న) ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. నాంపల్లి నుంచి ఉదయం 6.25కు బదులు మధ్యాహ్నం 2.25కు బయలుదేరనున్నట్లు పేర్కొన్నారు. పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకల్లో అంతరాయం చోటుచేసుకున్నట్లు తెలిపారు. -
‘కార్డు’లెస్ డ్రైవింగ్!
గ్రేటర్ పరిధిలోని రవాణా శాఖలో డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ కార్డుల కొరత మళ్లీ మొదటకొచ్చింది. రూ.వేలల్లో ఫీజులు చెల్లించి డ్రైవింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైనప్పటికీ చాలా మంది వినియోగదారులకు సకాలంలో డ్రైవింగ్ లైసెన్సులు లభించడం లేదు. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ ఆర్సీలు చేతికందడం లేదు. కార్డుల తయారీ, ముద్రణకు అవసరమైన ఇంక్ రిబ్బన్ తదితర సామగ్రిని పంపిణీ చేసే కాంట్రాక్టర్ వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం, తరచూ కాంట్రాక్టర్లు మారుతుండడంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. దీంతో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్‌లు లేక వాహనదారులు జరిమానా చెల్లించాల్సి వస్తోంది. ఏడాది కాలంగా ఈ పరిస్థితి నెలకొన్నా అధికారుల్లో చలనం లేకపోవడం గమనార్హం. సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహనాల ఆర్సీ కార్డుల జారీలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. దీంతో వాహనదారులు నానాపాట్లు పడుతున్నారు. అన్ని ఆఫీసుల్లోనూ వేల సంఖ్యలో కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. సమస్య తీవ్రంగా ఉన్న ఆర్టీఏ కార్యాలయానికి కొద్ది మొత్తంలో స్టేషనరీ సరఫరా చేస్తూ అప్పటికప్పుడు దాటవేయడం మినహా శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు అధికారుల మధ్య సమన్వయలోపం కూడా కార్డుల కొరతకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వేల సంఖ్యలో పెండింగ్.... గ్రేటర్‌లోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట్, మెహిదీపట్నం, మేడ్చల్, అత్తాపూర్, కొండాపూర్, నాగోల్, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ, కూకట్పల్లి తదితర ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ప్రతిరోజు సుమారు 2000 కొత్త వాహనాలు, మరో 1500 డ్రైవింగ్ లైసెన్సులకు కార్డులను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 3500 నుంచి 4000 కార్డులు అవసరం. కార్డులతో పాటు వాటిపైన అక్షరాలను ప్రింట్ చేసేందుకు వినియోగించే రిబ్బన్‌కు కూడా డిమాండ్ మేరకు సరఫరా కావడం లేదు. గతంలో 3 నెలల గరిష్ట డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని స్టేషనరీ నిల్వలలు ఉంచేవారు. దీంతో కార్డుల ప్రింటింగ్, పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. కానీ ఏడాది కాలంగా తరచుగా కార్డుల పంపిణీలో సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల కార్డులు ఉంటే రిబ్బన్ ఉండడం లేదు. రిబ్బన్ ఉన్న చోట కార్డుల కొరత ఉంది. ఎందుకీ నిర్లక్ష్యం.... డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ సేవలను కోరే వినియోగదారులు రూ.1500 నుంచి రూ.2000 వరకు ఫీజులు చెల్లిస్తారు. తాము పొందే కార్డు చార్జీలు, రవాణా అధికారులు చేసిన సేవల రుసుము, ఆ కార్డులను ఇంటికి పంపించేందుకు అయ్యే పోస్టల్ చార్జీలతో సహా అన్ని రుసుములు కలిపి ముందుగానే డబ్బులు చెల్లిస్తారు. ఆర్టీఏ పౌరసేవల కోసం స్లాట్ నమోదు చేసుకోవడంతో పాటే ఈ ఫీజుల చెల్లింపు కూడా జరిగిపోతుంది. కానీ సేవల్లో మాత్రం తీవ్రమైన జాప్యం నెలకొంటోంది. ఇందుకు అధికారుల నిర్లక్ష్యం, సమన్వయలోపమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సంవత్సరం డిసెంబర్లోనే పాతకాంట్రాక్ట్ సంస్థ గడువు ముగిసింది. తిరిగి దాని స్థానంలో కొత్త సంస్థతో ఒప్పందం కుదుర్చుకోలేదు. అలాగని పాతసంస్థతో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించలేదు. దీంతో ఎలాంటి ఒప్పందం లేకుండానే అవసరం మేరకు పాత కాంట్రాక్టర్ నుంచి తాత్కాలిక ప్రాతిపదికపైన స్టేషనరీ కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల తరచుగా కొరత తలెత్తుతోంది. ఒక్కో ఆఫీసులో సుమారు ఐదు వేల చొప్పున కార్డులు పెండింగ్‌లో ఉంటున్నాయి. వారం రోజుల్లో వినియోగదారుడికి చేరాల్సిన లైసెన్సు నెల రోజులైనా అందడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడమే కారణం... రవాణాశాఖకు సంబంధించిన విధానపరమైన అంశాల్లో, పౌరసేవల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనేందుకు పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పటి కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ఆర్థిక శాఖకు బదిలీ అయి ఏడాది గడిచినప్పటికీ ఇప్పటి వరకు ఆయన స్థానంలో కొత్తవారిని నియమించలేదు. సీనియర్ అధికారుల్లో ఎవ్వరికీ ఆ బాధ్యతలను అప్పగించలేదు. దీంతో వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. మరోవైపు ప్రతిఫైల్‌ను ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి సెక్రెటేరియట్‌లోని రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ వద్దకు తీసుకెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఇలా వేలాది మంది వాహన వినియోగదారులకు సంబంధించిన పౌరసేవల అమల్లోనూ నిర్లక్ష్యం చోటుచేసుకొంటోంది. -
పొమ్మనలేక ‘పొగ మంచు’...
-
రాజధాని ఇంకెంత దూరం?
-
రైల్వే రెడ్‌సిగ్నల్
తిరుపతి ప్రధాన రైల్వే స్టేషనుకు రోజూ ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. తిరుమలకు వచ్చే భక్తులలో ఎక్కువమంది రైళ్ల ద్వారానే చేరుకుంటారు. దీనివల్ల స్టేషను ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంది. ఈ తాకిడిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా మరో రెండు స్టేషన్లను అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ ఐదారేళ్ల క్రితం సంకల్పించింది. అయినా నేటికీ ఈ ప్రతిపాదన పట్టాలెక్కలేదు. ఫలితంగా తిరుపతి స్టేషనులో భక్తుల కష్టాలు తీరడం లేదు. తిరుపతి అర్బన్: తిరుపతి రైల్వే స్టేషనులో రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయంగా మరో రెండు స్టేషన్లను అభివృద్ధి చేయాలన్న రైల్వే శాఖ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు. నాలుగైదేళ్ల క్రితమే ప్రతిపాదనలు, నిధుల అంచనాల ప్రణాళికలు సిద్ధం చేసి చేతులు దులిపేసుకుంది. దీంతో ప్రయాణికులకు అవసరమైన సేవలు అందించలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. పదేళ్ల క్రితం రోజుకు 10వేల మంది కూడా ప్రయాణించేవారు కాదు. ఇప్పుడు సగటున 80 వేల నుంచి లక్షవరకు వస్తూపోతున్నారు. భారీ రద్దీ ఉన్న స్టేషన్లలో తిరుపతి ఒకటి. నిధులేవీ అమాత్యా.. రైల్వేస్టేషన్‌కు తూర్పు దిక్కులోని తిరుచానూరు స్టేషన్‌ను కొత్త టెర్మినల్‌గా అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ గతంలో నిర్ణయించింది. కానీ ఇప్పుడీ కొత్త టెర్మినల్ పనులు అటకెక్కినట్లేనని రైల్వే వర్గాలే చెబు తున్నాయి. ఇంజినీరింగ్ అధికారుల ఉదాసీన నివేదికలు, డివిజన్లోని కొందరు తమదైన కమీషన్ల పర్వానికి తెరలేపడం ఇందుకు కారణంగా నిలుస్తోంది. 2016 బడ్జెట్లో ఈ టెర్మినల్ అభివృద్ధికి రైల్వేశాఖ చాలీ చాలని నిధులను విదిల్చింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు పలు పర్యాయాలు వచ్చినప్పుడు మరిన్ని నిధులు మంజూరు చేస్తామని చెప్పినా ఆచరణలో నెరవేరలేదు. ఆదిలోనే హంసపాదు పడేందుకు టీడీపీకి చెందిన టీటీడీ మాజీ చైర్మన్ స్వలాభ ఆలోచనలు తోడయ్యాయి. ఆయన తొందరపాటు ఒత్తిళ్ల వల్ల టెర్మినల్ పనులు ప్రారంభం కాలేదనే విమర్శ ఉంది. రైల్వే స్టేషన్‌ను వరల్డ్‌క్లాస్ స్థాయికి అభివృద్ధి చేసేందుకు తగిన∙స్థలం లేదు. రైల్వే మంత్రిత్వ శాఖ, బోర్డు అత్యున్నతాధికారులు ప్రత్యామ్నాయ ప్రాంతా ల్లోనే అభివృద్ధి శరణ్యమని గుర్తించారు. ఇందుకోసం తిరుపతి వెస్ట్, తిరుచానూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లను వివిధ దశల్లో పరిశీలించారు. అందులో భాగంగానే తిరుచానూరుకు ముందుగా రూ.10కోట్లు మంజూరు చేసింది. కానీ ఈ నిధులు ఎటూ చాలవు. దీంతో కొత్త నిర్మాణానికి అడ్డుకట్ట పడింది. ఏడాది క్రితమే ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళికలు ఢిల్లీకి పంపారు. రూ.10 కోట్ల బడ్జెట్‌కు అదనంగా మరో రూ.25 కోట్లు అవసరమవుతాయని అంచనాలు రూపొందించారు. అయినా పాత నిధులు రాలేదు. కొత్త నిధులకు మోక్షంలేదు. దీంతో టెర్మినల్ పనులు ముందుకు సాగడం లేదు. పత్తాలేని ‘పడమర’ అభివృద్ధి... మరో ప్రత్యామ్నాయంగా రైల్వేశాఖ పడమర స్టేషన్‌ను ప్రతిపాదించింది. పశ్చిమాన 52 ఎకరాలతో పాటు 18 ఎకరాల ప్రైవేటు స్థలముంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగేళ్ల క్రితం రైల్వే బోర్డు ఉన్నతాధికారులు, అప్పటి జీఎం వెస్ట్‌పై ఆసక్తి చూపిం చారు. డిజైనింగ్‌లు, అంచనాల ప్రతిపాదనలు తయారు చేశారు. నిర్మాణాలు చేపట్టేందుకు ప్రైవేటు ఏజెన్సీలను గుర్తించారు. కానీ ప్రస్తుత స్టేషన్ పరిసర ప్రాంతాల హోటళ్ల నిర్వాహకులు, ఇతర వాణిజ్య సముదాయాల వారు రైల్వే బోర్డుపై ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా వెస్ట్ పనులకు బ్రేకు పడింది. ఈ దశలో కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోయాయి. వెస్ట్ స్టేషన్ పనులూ నిలిచిపోయాయి. రాజకీయ పరంగా కేంద్రంపై సరైన ఒత్తిడి తెస్తే తప్ప ఈ రెండు స్టేషన్లకు కదలిక ఉండదని ప్రయాణికులంటున్నారు. ఈ మేరకు అధికారుల్లో కదిలిక వస్తుందో లేదో చూడాల్సి ఉంది. -
అక్టోబరులో హాలీవుడ్‌కు..
తమిళసినిమా: నటుడు శింబుది సపరేట్ భాణీ. సంచలనాలకు కేంద్ర బిందువుగా పేర్కొనే శింబు మరో రికార్డును సృష్టించడానికి రెడీ అవుతున్నారు. అభిమానులు శింబుకు పోటీగా భావించే నటుడు ధనుష్ ఇప్పటికే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా శింబు కూడా అదే మార్గంలో పయనించడానికి సిద్ధం అయ్యారు. వ్యత్యాసం ఏమిటంటే ధనుష్ హీరోగా హాలీవుడ్లో తెరంగేట్రం చేస్తుంటే, శింబు దర్శకుడిగా పరిచయం కానున్నారు. రెండు నెలల్లో తన చిత్రాన్ని విడుదల చేస్తానని శింబు ఆ మధ్య వెల్లడించారు. అందులో పాటలు ఉండవు, ఇంటర్వెల్ ఉండదు అని చెప్పారు గానీ అది హాలీవుడ్ చిత్రం అని తెలపకుండా సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేశారు. ఆయన చెప్పినట్లుగా అయితే ఈ చిత్రం ఇప్పటికే సెట్‌పైకి వెళ్లాల్సింది. కొందరు ప్రముఖ సాంకేతిక వర్గం ఇతర చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల హాలీవుడ్ చిత్ర ప్రారంభం ఆలస్యం అయ్యిందని శింబు తాజాగా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి మాటలను అందిస్తున్న దర్శకుడు గౌతమ్‌మీనన్ తన ధ్రువనక్షత్రం చిత్ర షూటింగ్‌తోనూ, కెమెరామెన్ సంతోష్‌శివన్ స్పైడర్ చిత్రంతోనూ బిజీగా ఉండటం వల్ల తన హాలీవుడ్ చిత్రం సెట్‌పైకి వెళ్లడానికి కాస్త ఆలస్యం జరిగిందని చెప్పారు. ప్రస్తు తం వాళ్లు ఫ్రీ అవుతుండటంతో అక్టోబరులో హాలీవుడ్ చిత్రం ప్రారంభం కానుందని తెలిపారు. డిసెంబరు చివర్లోగా చిత్రాన్ని పూర్తి చేయనున్నామని చెప్పారు. ఈ చిత్రానికి ఆంటోనీ ఎడిటింగ్, యువన్ శంకర్రా జా నేపథ్యం సంగీతం అందించనున్నారని తెలిపారు. -
సర్టిఫికెట్ల జారీలో జాప్యం చేస్తే చర్యలు: వీసీ
ఎస్కేయూ : విద్యార్థులకు సర్టిఫికెట్ల జారీలో జాప్యం చేస్తే చర్యలు తప్పవని ఎస్కేయూ వీసీ కె.రాజగోపాల్ పరీక్షల విభాగం ఉద్యోగులను హెచ్చరించారు. ప్రొవిజినల్ సర్టిఫికెట్ అందజేసేందుకు ఆ విభాగం ఉద్యోగి డబ్బు డిమాండ్ చేశారని ఓ విద్యార్థిని వర్సిటీ అధి కారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన వీసీ, రెక్టార్ హెచ్.లజిపతిరాయ్ ఆకస్మిక తనిఖీ చేశారు. సర్టిఫికెట్ల జారీలో జాప్యమెందుకని ప్రశ్నించారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేష¯Œన్ సూర్యనారాయణ, డిప్యూటీ రిజిస్ట్రార్ ప్రకాష్ పాల్గొన్నారు. -
నిలిచిపోయిన పోలవరం పనులు
-
పరిశీలన పడకేసింది..
- పూర్తికాని ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల పరిశీలన - కళాశాలల వద్ద పెండింగ్‌లో - 9.45 లక్షల దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన ఆదిలోనే చతికిలపడింది. ఈ పథకాల కింద దరఖా స్తులు స్వీకరించి రెండు నెలలు కావస్తున్నా పరిశీలన ప్రక్రియ తొలిదశకే పరిమితమైంది. 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధిం చి రాష్ట్ర వ్యాప్తంగా 13,67,592 దరఖాస్తులు వచ్చాయి. దీంతో విద్యార్థులకు ఉపకారవే తనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ లబ్ధి ఇప్పట్లో కష్టమని తెలుస్తోంది. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ ప్రక్రియకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ చివరనాటికి పూర్తి చేసి డిసెంబర్ కల్లా అర్హతలు నిర్ధారించాలి. కొత్త జిల్లాల ఏర్పాటు తో 2016–17కి సంబంధించి దరఖాస్తుల స్వీకరణలో సమస్యలు తలెత్తాయి. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ల నుంచి కుల, ఆదాయ పత్రాల జారీలో జాప్యం జరగడం తో విద్యార్థుల సౌకర్యార్థం ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకునే వెసు లుబాటు కల్పించింది. ఇలా దరఖాస్తుల స్వీక రణ ప్రక్రియ 6 నెలల పాటు కొనసాగింది. ఇక కొత్త ఏడాదిలోనే... ఈ విద్యాఏడాది మరో పక్షం రోజుల్లో ముగియనుంది. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సు లు మినహా.. ఇంటర్మీడియెట్, డిగ్రీ, పాలిటె క్నిక్ తదితర కోర్సులకు సంబంధించి వార్షిక పరీక్షలు ముగిశాయి. దీంతో ఆయా కాలేజీలకు వేసవి సెలవులు వచ్చేశాయి. విద్యార్థులు అందుబాటులో ఉన్న సమయంలోనే ఈ దరఖాస్తులు పరిశీలించాలి. కానీ అలా జరగ లేదు. దీంతో కాలేజీ యాజమాన్యాల వద్ద దాదాపు 9.45లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. జూన్ మొదటివారంలోగా దరఖాస్తుల పరిశీలన పూర్తిచేయాలని కాలేజీ యాజమాన్యాలపై సంక్షేమ శాఖ అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. కాలేజీలకు సెలవులివ్వడంతో దరఖాస్తు పూర్తయ్యే అవకాశం లేదు. దీంతో కొత్త విద్యాఏడాదిలోనే వీటి పరిశీలన పూర్తి చేస్తామని కళాశాల యాజమాన్యాలు అధికారులకు చెబుతున్నాయి. -
నీలినీడలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :డెల్టా ఆధునికీకరణ పనులు ఈ ఏడాది కూడా జరిగే అవకాశం కనబడటం లేదు. ఈ జిల్లా రుణం తీర్చుకోలేనిదంటూ ఇక్కడ పర్యటించినప్పుడల్లా ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగునీటి సమస్యలపై మాట్లాడిన పాపాన పోలేదు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి, జానంపేట అక్విడెక్ట్ వద్దకు తరచూ రావడం, మీడియాతో మాట్లాడి వెళ్లడం తప్ప జిల్లాలోని సాగునీటి ఇబ్బందులపై ఏనాడూ సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఈ ఏడాది ఆధునికీకరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ఇంకా అమోదానికి నోచుకోలేదు. దీంతో ఈ పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రూ.136 కోట్లతో 167 పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొం దించిన జల వనరుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. వీటికి జనవరి నెలలోనే అమోదం లభించి, టెండర్లు పూర్తవ్వాల్సి ఉంది. అలా జరిగి తేనే కాలువలు మూసివేసిన వెంటనే పనులు ప్రారంభించే అవకాశం ఉండేది. ఈ నెలాఖరు నాటికి కాలు వలు మూసివేసేందుకు యంత్రాంగం నిర్ణయించగా, ఆధునికీకరణ పనుల ప్రతిపాదనలకు ఆమోదం రాలేదు. ఫలితంగా టెండర్లు పిలిచే అవకా శం లేకుం డాపోయింది. ఇప్పటికప్పుడు ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. టెండర్లు ఖరారయ్యేందుకు నెల రోజులు పడుతుంది. ఒకవేళ రానున్న రోజుల్లో ఆమోదం లభించినా ఆదరాబాదరాగా పనులు చేపట్టి తూతూమంత్రంగా ముగించే ప్రమాదం ఉంది. గత ఏడాది రూ.72 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలవగా.. అప్పట్లో పనులు చేపట్టలేదు. ఈ ఏడాది ఆ పనులతో సరిపెట్టే అవకాశం కనపడుతోంది. రూ.1,300 కోట్లతో డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించినప్పటికీ ఇప్పటివరకూ రూ.700 కోట్ల విలువైన పనులు కూడా పూర్తికాలేదు. 2012లో దీర్ఘవిరామం (లాంగ్ క్లోజర్) సమయంలో మాత్రమే ఓ మాదిరిగా పనులు జరిగాయి. తర్వాత ఏటా మొక్కుబడి పనులతో సరిపెడుతూ వస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకూ రూ.112 కోట్ల విలువైన పనులు మాత్రమే చేశారు. పంట కాలువలు పూడుకుపోవడంతో చిన్నపాటి వర్షం కురిసినా పొలాలు ముంపునకు గురవుతున్నాయి. సాధారణ రోజుల్లో మాత్రం పంట కాలువల్లో నీరు పారక వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. 2015లో డిసెంబర్లో కురిసిన చిన్నపాటి వర్షాలకు 1.32 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. 2016లోనూ వర్షాలకు నారుమడులన్నీ నీట మునిగి రైతులు ఇబ్బందులు పడ్డారు. కాలువల ఆధునికీకరణ జరగకపోవడం వల్ల ఖరీఫ్‌తోపాటు రబీలోనూ నీటి సమస్యతో రైతులు కష్టాలు పడుతున్నారు. గడచిన రెండేళ్లలో అయిల్ ఇంజిన్లు, నీటి మోటార్లు ఉపయోగించకుండా రైతులు పంట పండించలేని పరిస్థితి ఏర్పడింది. -
నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ
– గ్రూప్–2 లైజన్ ఆఫీసర్ టీవీ రమేష్‌బాబు వెల్లడి కర్నూలు సీక్యాంప్: గ్రూప్–2 పరీక్షకు నిమిషం ఆలస్యం అయినా అనుమతిచ్చేది లేదని గ్రూప్–2 లైజన్ ఆఫీసర్ టీవీ రమేష్‌బాబు తెలిపారు. నగరంలోని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రూప్–2 పరీక్షా 10గంటలకు ప్రారంభం అవుతుందని, 9.45నిమిషాలకు హాల్లోకి చేరుకోవాలని సూచించారు. బ్లాక్,బ్లూ పెన్నులు తప్ప.. వేరే వస్తువులను హాల్లోకి అనుమతివ్వబోమని చెప్పారు. -
చుక్కలు చూపించిన ఇండిగో విమానం
విశాఖపట్నం: విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు మంగళవారం ఉదయం వచ్చిన కొందరు ప్రయాణికులు మధ్యాహ్నమైనా అక్కడే ఉన్నారు. ఎక్కాల్సిన విమానం వస్తుందని ఎదురుచూసిన వారికి ఎదురుచూపులే మిగిలాయి. దీంతో ఎయిర్పోర్ట్ అథారిటీపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నుంచి ఉదయం 7:55 గంటలకు బెంగళూరు బయలుదేరాల్సిన ఇండిగో విమానం మధ్యాహ్నానికి కూడా విమానాశ్రయానికి రాలేదు. ప్రయాణికుల్లో ఓ మహిళ తన తండ్రి అంత్యక్రియలకు వెళ్తుండగా.. ఇలా జరిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం అక్కడివారిని కలచివేసింది. ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు మాత్రం ప్రతికూల వాతావరణం వల్ల విమానం రావడం ఆలస్యమైందని చెబుతున్నారు. మరేదో కారణం వల్లే ఆలస్యం జరిగిందని.. అధికారులు మాత్రం ప్రతికూల వాతావరణం అంటూ సర్థిచెబుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఉపకారం... బహుదూరం...
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులు ఉపకార వేతనాలకోసం మరికొంత కాలం నిరీక్షించాల్సిందే. ఉపకార వేతనాల కోసం విద్యార్థులు పెట్టుకున్న దరఖాస్తుల పరిశీలన ప్రారంభం కాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. నెలవారీగా ఈ నిధులు విద్యార్థులకు అందాల్సినా.. దరఖాస్తు ప్రక్రియలో జాప్యం .. దరఖాస్తుల్ని పరిశీలించకపోవడం విద్యార్థు ల పాలిట శాపంగా మారింది. ఆగస్టు తొలివా రంలో దరఖాస్తుల ప్రక్రియ మొదలై సెప్టెం బర్ నాటికి ముగుస్తుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఈ ప్రక్రియలో జాప్యం నెలకొంది. కొత్త జిల్లాల ఏర్పాటు క్రమంలో నెలరోజుల పాటు మీసేవా, ఈపాస్ వెబ్సైట్ సర్వర్లు నిలిచిపోయాయి. దీంతో దరఖాస్తులను డిసెంబర్ 31 వరకు స్వీకరించారు. దరఖాస్తుల సమర్పణ గడువు ముగిసి 20 రోజులైనా వాటిని పరిశీలించకపోవడం గమనార్హం. మూడు దశల్లో పరిశీలన.. 2016–17 విద్యాసంవత్సరంలో సంక్షేమ శాఖ లకు 12.97లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిశీలన 3 దశల్లో సాగుతుంది. విద్యార్థులు సమర్పించిన దరఖాస్తులన్నీ ఆయా జిల్లాల సంక్షేమాధికారుల పరిధిలో ఉన్నాయి. ప్రతి దరఖాస్తుకు ఆధార్, బ్యాంకు పాస్‌బుక్ వివరాలను జిల్లా సంక్షేమాధికారులు కేంద్ర సర్వర్‌లో పరిశీలించి ఆమోదించాలి. ఆమోదించిన వాటిని కళాశాల యూజర్ ఐడీకి జత చేస్తారు. అక్కడ విద్యార్థి వేలిముద్రలు సేకరించిన తర్వాత సర్టిఫికెట్లను పరిశీలించి తిరిగి సంక్షేమాధికారులకు పంపాలి. సంక్షేమాధికారులు వివరాలను పరిశీలించి ఉపకారవేతనాన్ని మంజూరు చేస్తారు. ఈ ఏడాది కొత్త జిల్లాల కారణంగా జిల్లా సంక్షేమ శాఖల్లో సిబ్బంది కొరత ఉండటంతో వీటి పరిశీలన నెమ్మదిగా సాగనుంది. ప్రక్రియ ఇప్పటికిప్పుడు ప్రారంభించినా ఏప్రిల్ చివరి వారానికి ముగుస్తుంది. ఈలోపు విద్యార్థులకు వార్షిక పరీక్షలు ముగిసిపోతాయి. దీంతో పోస్టు మెట్రిక్ విద్యార్థులకు కోర్సు ముగిసిన తర్వాతే ఉపకార లబ్ధి కలగనుంది. -
నిమిషం ఆలస్యమైనా అనుమతించం
– 22న పోలీసు కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష – హాల్ టికెట్‌తోపాటు ఆధార్‌కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు చూపాలి - ఏర్పాట్లపై సమీక్షలో జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఈ నెల 22న పోలీసు కానిస్టేబుల్, 29న పోలీసు కానిస్టేబుల్ కమ్యూనికేషన్స్ మెయిన్స్ పరీక్షలకు నిమిషం ఆలస్యమైన అనుమతించమని జిల్లా ఆకే రవికృష్ణ తెలిపారు. అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సోమవారం పోలీసు కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షపై ఎస్పీ, పోలీసు కమాండ్ కంట్రోల్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన 16,800 మంది అభ్యర్థుల కోసం కర్నూలులో 27 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష ఉదయం పది నుంచి ఒంటిగంట వరకు జరుగుతుందని, అభ్యర్థులను ఉదయం 9 గంటలకు కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. సమాధానాలను బ్లాక్ లేదా బ్లూ పెన్నుతో మాత్రమే బ్లర్బు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రంలోనికి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచ్‌లు, ఇతర వస్తువులను అనుమతించమన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తోపాటు ఆధార్‌కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు చూపితేనే లోపలికి అనుమతిస్తామన్నారు. పరీక్షా కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఉండే జిరాక్స్ సెంటర్లు, హోటళ్లు, టైప్ ఇన్స్టిట్యూట్లు, నెట సెంటర్లను మూసి వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఓఎస్డీ రవిప్రకాష్, ఆడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, రీజినల్ కోఆర్డినేటర్ పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, డీఎస్పీలు రమణామూర్తి, బాబుప్రసాద్, మురళీధర్, ఏఓ అబ్దుల్ సలాం, ఆర్ఐ రంగముని పాల్గొన్నారు. -
ఆలస్యంగా నడుస్తున్న 53 రైళ్లు
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశం చలికి వనికిపోతోంది. దట్టమైన పొగమంచు వల్ల జనజీవనం స్తంభించిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా 53 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 26 రైళ్ల వేళల్లో మార్పులు చేసి.. మూడు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. పొగమంచు మూలంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఆలస్యంగా బయలుదేరనుంది. మధ్యాహ్నం 12:25 గంటలకు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. -
క్యాథే పసిఫిక్ విమానానికి సాంకేతిక లోపం
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హాంకాంగ్ వెళ్లాల్సిన క్యాథే పసిఫిక్‌కు చెందిన విమానం ఆరు గంటలుగా నిలిచిపోయింది. సాంకేతిక ఇబ్బందుల కారణంగా నిలిపివేసినట్లు శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఇంత నిర్లక్ష్యమా?
♦ హైకోర్టు జడ్జీల నియామకాల్లో జాప్యంపై సుప్రీం ఆగ్రహం ♦ న్యాయవ్యవస్థను స్తంభింపచేయలేరంటూ కేంద్రానికి చురకలు ♦ ఇది అహానికి సంబంధించిన అంశం కాదన్న సీజేఐ ధర్మాసనం న్యూఢిల్లీ: హైకోర్టులకు జడ్జీల నియామకాల్లోకేంద్ర ప్రభుత్వ జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జడ్జీల్ని నియమించకుండా ప్రభుత్వం న్యాయవ్యవస్థను స్తంభింపచేయలేదంటూ శుక్రవారం ఘాటుగా వ్యా ఖ్యానించింది. చాలా కాలం క్రితమే సుప్రీం కోర్టు కొలీజియంకు సిఫార్సులు పంపినా నిర్లక్ష్యం ఎందుకని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నిలదీసింది. అవసరమైతే న్యాయశాఖ, పీఎంఓ సిబ్బందిని కోర్టుకు రప్పిస్తామని, ఐదుగురు జడ్జీల బెంచ్‌కు కేసును బదిలీ చేస్తామంటూ హెచ్చరించింది. ‘కొలీజీయం సిఫార్సుల్లో ఏదైనా వ్యక్తి పేరుపై అభ్యంతరాలుంటే... పునఃపరిశీలన కోసం వెనక్కి పంపాలి... అంతేకానీ నియమకాల్ని కేంద్రం అడ్డుకోలేదు’ అని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వరరావుల బెంచ్ పేర్కొంది. కర్ణాటక హైకోర్టులో కోర్టు గదులున్న ఒక అంతస్తుకు తాళం వేయడాన్ని ఉదహరించింది. ‘కోర్టు గదులు మూతపడుతున్నాయి. మీరు న్యాయవ్యవస్థ మూతపడాలని కోరుకుంటున్నారా’ అని ప్రశ్నించింది. 77లో 18 పేర్లకే కేంద్రం ఆమోదం..: నియామకాలకు సంబంధించి మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్(ఎంఓపీ) ఇంకా పూర్తి కాలేదని, అందుకే ఆలస్యమవుతోందని, ఇటీవలి సుప్రీం తీర్పు నేపథ్యంలో అది తప్పనిసరంటూ రోహత్గీ వాదించగా కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నియామకాలకు ఎంఓపీ ఖరారు అడ్డంకి కాకూడదనే పాత ఎంఓపీ మేరకు నియామకాలు జరపమని న్యాయశాఖను అనుమతించిన విషయం గుర్తు చేసింది. ‘నియామకాల్లో ప్రతిష్టంభన ఉండకూడదు. కొత్త ఎంఓపీ ఖరారు కాకపోయినా నియామక ప్రక్రియ కొనసాగేందుకు మీరొప్పుకున్నారు. పాత ఎంఓపీ ప్రకారం నియామకాలు జరుపుతామని చెప్పారు’ అని గుర్తుచేసింది. కొలీజియం సిఫార్సు చేసిన 77 పేర్లలో 18 మాత్రమే ఆమోదం పొందాయని అసంతృప్తిప్రకటించింది. ‘9 నెలలుగా కొలీజియం మీకు పేర్లిస్తూనే ఉంది, పక్కన పెడుతూనే ఉన్నారు. దేని కోసం ఎదురుచూస్తున్నారు? వ్యవస్థలో మార్పు కావాలా? కొన్ని విప్లవాత్మక మార్పులు అవసరమా?’ అని ప్రశ్నించింది. కార్యనిర్వాహక వ్యవస్థ నిర్లిప్తతతో న్యాయవ్యవస్థ నిర్వీర్యం అవుతోందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ‘అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తుల నియామకాలకు 18 పేర్లను సూచిస్తే.. కేవలం 8 పేర్లే ఎంపిక చేశారు, ఇప్పుడు ఇద్దర్నే నియమించమంటున్నారు. ఫిబ్రవరి 4నే ఫైళ్లను కేంద్రానికి పంపాం. పురోగతి ఏంటో చెప్పండి? న్యాయశాఖ, పీఎంఓ అధికారుల్ని మా ముందు హాజరుకమ్మని ఆదేశించగలం. మీరే వారిని పిలవండి, వారు చెప్పేది మేం వినాలనుకుంటున్నాం’ అని ఏజీని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. ఎన్‌జేఏసీ(నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్)పై సుప్రీం తీర్పు ప్రకారం తాజా ఎంఓపీ తప్పనిసరని రోహత్గీ పేర్కొన్నారు. పోట్లాడుకునే పరిస్థితి వద్దు: సుప్రీం అనంతరం శాంతించిన బెంచ్ ‘ఇది వ్యక్తిగత విషయం కాదు. వ్యవస్థకు సంబంధించింది. వ్యవస్థలు పోట్లాడుకునే పరిస్థితి మేం కోరడం లేదు. ఇది ఎవరి అహానికీ సంబంధించిన విషయం కాదు ’ అని పేర్కొంది. న్యాయవ్యవస్థను పరిరక్షించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. 60 శాతం కంటే తక్కువ సిబ్బందితో హైకోర్టులు పనిచేస్తున్నాయని వెల్లడించింది. ఈ సందర్భంగా న్యాయవాది మాథ్యూస్ నెడుంపరా జోక్యానికి ప్రయత్నించగా .. ‘మీరు కేవలం విను. లేదంటే కోర్టు గది బయటకు పంపిస్తాను’ అంటూ సీజేఐ మండిపడ్డారు. పోలీసుల్ని పిలవాలంటూ కోర్టు గుమస్తాను ఆదేశించడంతో న్యాయవాది మిన్నకుండిపోయారు. నియమకాల్లో పురోగతి ఉండాలని ఆదేశించిన బెంచ్ విచారణను నవంబర్ 11కు వాయిదా వేసింది. కాగా, కొత్త జడ్జీల నియామకంపై ఆసక్తితో ఉన్నామని, అయితే కొలీజియం ముందు రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఎంఓపీపై నిర్ణయం వేగవంతం చేయాలని కేంద్రం తెలిపింది.. హైకోర్టుల్లో తాజా 86 మంది జడ్జీలతోపాటు 121 మంది అదనపు జడ్జీల్ని శాశ్వత జడ్జీలుగా నియమించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. -
మనం ఎక్కాల్సిన మెట్రో ఇంకెంత లేటు!
మెట్రో రైలు తొలిదశ ప్రారంభంపై వీడని సందిగ్ధం ► మియాపూర్-ఎస్ఆర్ నగర్, నాగోల్-మెట్టుగూడ రూట్లు సిద్ధం ► వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించని ఎల్అండ్టీ, ప్రభుత్వం ► వాణిజ్య స్థలాల అభివృద్ధిపై నిర్మాణ సంస్థ అంచనాలు తల్లకిందులు ► రూ. 3 వేల కోట్ల కోసం పట్టుబడుతున్న నిర్మాణ సంస్థ..? ► ఎంజీబీఎస్-ఫలక్‌నుమా అలైన్‌మెంట్‌పై కొరవడిన స్పష్టత సాక్షి, హైదరాబాద్ మెట్రో రైలు.. హైదరాబాదీల ట్రాఫిక్ కష్టాలను కొంత మేర అయినా తీర్చడానికి ఉద్దేశించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. అయితే భాగ్యనగరంలో మెట్రో రైలు ఎప్పుడు పరుగులు పెడుతుంది..? మెట్రోలో ప్రయాణించాలనే నగరవాసుల కల ఎప్పుడు తీరుతుంది..? అనే విషయాలు మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మారాయి. మెట్రో తొలి దశ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. నాగోల్-మెట్టుగూడ, మియాపూర్-ఎస్ఆర్ నగర్ రూట్లలో 20 కి.మీ. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించే విషయంలో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ, ప్రభుత్వ వర్గాలు నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నాగోల్-రహేజా ఐటీ పార్క్, జేబీఎస్- ఫలక్‌నుమా, ఎల్బీనగర్-మియాపూర్ మార్గాల్లో మొత్తం 72 కి.మీ. మార్గాన్ని 2018 డిసెంబర్ నాటికి పూర్తిచేస్తామని నిర్మాణ సంస్థ చెబుతోంది. వాస్తవానికి ప్రాజెక్టు పూర్తిచేయాల్సిన గడువు జూన్ 2017 నుంచి 2018 డిసెంబర్ వరకు పెరగడంతో తొలుత అనుకున్న అంచనా వ్యయం రూ.14 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్లకు చేరుకుంది. దీంతో సంస్థపై రూ.3 వేల కోట్ల అదనపు భారం పడుతోందని.. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తమకు చెల్లించాలని నిర్మాణ సంస్థ పట్టుబడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే నిర్మాణ సంస్థ అడిగిన మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం ససేమిరా అంటున్నట్లు సమాచారం. మరోవైపు ఎంజీబీఎస్-ఫలక్‌నుమా(5.3 కి.మీ) మార్గంలో మెట్రో అలైన్‌మెంట్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ మార్గంలో పనులు మొదలు కాకపోవడం గమనార్హం. ప్రస్తుత పురోగతి ఇదీ.. మొత్తం మూడు కారిడార్ల పరిధిలో 72 కి.మీ. మార్గంలో 2,748 పిల్లర్లకుగాను ఇప్పటివరకు 2,200 పిల్లర్ల ఏర్పాటు పూర్తరుు్యంది. 49 కి.మీ. మార్గంలో పిల్లర్లపై మెట్రో రైళ్లు రాకపోకలు సాగించేందుకు వీలుగా పట్టాలను ఏర్పాటు చేశారు. మూడు కారిడార్లలో పరుగులు పెట్టేందుకు 57 మెట్రో రైళ్లు ఉప్పల్, మియాపూర్ మెట్రో డిపోల్లో సిద్ధంగా ఉన్నాయి. వీటికి 18 రకాల సామర్థ్య పరీక్షలను ఫ్రాన్సకు చెందిన కియోలిస్ సంస్థ పూర్తిచేసింది. కాగా, నాగోల్-మెట్టుగూడా మార్గంలో స్టేషన్లు పూర్తిస్థాయిలో సిద్ధంకాగా.. మియాపూర్-ఎస్ఆర్ నగర్(12 కి.మీ.) మార్గంలో స్టేషన్లు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. ప్రస్తుతం మలక్‌పేట్, ఆలుగడ్డబావి, ఒలిఫెంటాబ్రిడ్జి, మెట్టుగూడా ప్రాంతాల్లో దక్షిణ మధ్య రైల్వే పట్టాలపై నుంచి మెట్రో రైళ్లు రాకపోకలు సాగించేందుకు వీలుగా రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ) నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. అంచనాలు తల్లకిందులు ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని పలు ముఖ్య ప్రాంతాల్లో 269 ఎకరాల విలువైన స్థలాలను 45 ఏళ్లపాటు నిర్మాణ సంస్థకు లీజుకిచ్చింది. లీజు గడువును మరో 20 ఏళ్లపాటు పొడిగించుకునే వెసులుబాటునూ కల్పించింది. ఈ స్థలాల్లో 18 చోట్ల బడా మాల్స్ నిర్మించి రియల్ ఎస్టేట్, వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేయడం ద్వారా ప్రాజెక్టుకు చేసిన వ్యయంలో 55 శాతం నిధులు రాబట్టుకోవచ్చని.. మరో 40 శాతం ప్రయాణీకుల చార్జీల ద్వారా, మరో 5 శాతం వాణిజ్య ప్రకటనల ద్వారా సమకూర్చుకోవాలని నిర్మాణ సంస్థ భావించింది. కానీ, ప్రస్తుతం రియల్ ఎస్టేట్‌లో అంతగా వృద్ధి లేనందున మూసారాంబాగ్, ఎర్రమంజిల్, పంజాగుట్ట, హైటెక్ సిటీల్లో మాత్రమే మెట్రోమాల్స్ నిర్మిస్తున్నట్లు ఎల్అండ్టీ వరా్గాలు తెలిపారు. ఈ ప్రాంతాల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా, నగరంలో ఏర్పాటుకానున్న 65 మెట్రో స్టేషన్లలో వాణిజ్య స్థలాలకు చదరపు అడుగుకు ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.150 నుంచి రూ.550 వరకు అద్దెలు వసూలు చేయాలని నిర్ణయించినప్పటికీ.. ఈ స్థలాలకు కూడా అశించిన స్థాయిలో స్పందన లేనట్టు సమాచారం. ఇప్పటివరకు స్టేషన్లలో 70 శాతం మేర రిటైల్ స్పేస్‌ను అద్దెకిచ్చినట్లు తెలిసింది. మెట్రో రైలు స్వరూపం ఇదీ.. • 2011 ఫిబ్రవరిలో ప్రారంభం • 2015 మార్చి- నాగోల్-మెట్టుగూడా రూట్(8 కి.మీ.)ను వాస్తవానికి ప్రారంభించాలనుకున్న సమయం • 2017 జూన్‌కు పూర్తి కావాలి • 2018 డిసెంబర్ వరకూ పొడిగింపు • మూడు కారిడార్ల పరిధిలో 72 కి.మీ. మార్గం • ఇప్పటి వరకూ పూర్తయిన మార్గం 49 కి.మీ. • మొత్తం పిల్లర్లు 2,748 • నిర్మాణం పూర్తయిన పిల్లర్లు 2,200 • మొత్తం మెట్రో స్టేషన్లు 65 • ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 14,000 కోట్లు • సవరించిన అంచనా వ్యయం రూ. 17,000 కోట్లు -
టీచర్ల భర్తీ మరికొన్నాళ్లు ఆలస్యం!
• విద్యాశాఖ టీచర్లే కాదు.. గురుకుల టీచర్ల భర్తీ ఆలస్యమే • గ్రూపు-2 తరువాత భర్తీకి చర్యలు చేపట్టే అవకాశం • తేలని హేతుబద్ధీకరణ, టెట్ వెయిటేజీ.. • విద్యాశాఖలో 11 వేల వరకు ఖాళీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ మరికొన్నాళ్లు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. విద్యాశాఖ పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న దాదాపు 11 వేల టీచర్ పోస్టులే కాదు.. వివిధ గురుకుల సొసైటీల పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న, కొత్తగా సృష్టించిన దాదాపు 5 వేల టీచర్ల భర్తీకి కూడా మరికొంత సమయం పట్టనుంది. వాస్తవానికి గురుకుల టీచర్ల భర్తీకి జూలైలోనే నోటిఫికేషన్ వస్తుందని భావించినా అది జరగలేదు. పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని అనుమతులు ఇంకా రావాల్సి ఉండటం, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) విషయంలో స్పష్టత రావాల్సి ఉండటం, మరోవైపు వచ్చే నెలలో గ్రూపు-2 నిర్వహణకు సంబంధించిన పనుల్లో టీఎస్పీఎస్సీ బిజీగా ఉన్న నేపథ్యంలో గురుకుల టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియకు ఇంకొన్నాళ్లు సమయం పట్టనుంది. వీటికి సంబంధించి వచ్చే నెలాఖరుకు స్పష్టత వస్తే డిసెంబర్ నాటికి పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టే అవకాశం ఉంది. హేతుబద్ధీకరణ చిక్కు..: రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయమే తీసుకోలే దు. పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణ తరువాతే వాస్తవ అవసరాల మేరకు భర్తీపై నిర్ణయం తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. అందుకే 9,500 పైగా ఖాళీల్లో విద్యా వలంటీర్లను నియమించి బోధన కొనసాగిస్తోంది. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అధికారులంతా అదే పనుల్లో బిజీ అయ్యారు. దీంతో హేతుబ ద్ధీకరణపై పెద్దగా దృష్టిసారించలేని పరిస్థితి నెలకొంది. వీలైతే సంక్రాంతి నాటికి లేదా వేసవి సెలవుల్లో హేతుబద్ధీకరణ చేపట్టే అవకాశం ఉంది. సంక్రాంతి సెలవుల్లో కనుక హేతుబద్ధీకరణ పూర్తయితే అప్పుడే టీచర ్ల భర్తీకి చర్యలు చేపట్టే వీలుంది. లేదంటే వేసవి సెలవుల తరువాతే ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల భర్తీకి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. గురుకులాల్లో ఇదీ పరిస్థితి.. : రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్, డి గ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీపై గతంలోనే ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే అందులో అన్నింటికి సంబంధించిన అనుమతులు ఇంకా వెలువడలేదు. ఆరు నెలల కిందటే 2,444 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఓకే చెప్పింది. ఆ తరువాత మరో 1,794 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఆ తరువాత మరిన్ని పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటికి సంబంధించిన ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది. మరోవైపు సంబంధిత శాఖల నుంచి ఇండెంట్లు రావాల్సి ఉంది. అర్హత పరీక్షగానే టెట్?: ఇప్పటివరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష స్కోర్‌కు (టెట్) ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ ఉంది. కానీ ఇటీవల గురుకులాల్లో భర్తీ చేసే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల పరీక్ష విధానంలో టెట్ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో టీజీటీ పోస్టులకు టెట్ అవసరమా? లేదా? అన్న సందేహం నెలకొంది. అయితే టెట్‌ను కేవలం అర్హత పరీక్షగానే చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. టెట్ స్కోర్‌కు వెయిటేజీని తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. విద్యాశాఖ మాత్రం టెట్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే రాత పరీక్షకు అనుమతించాలని పేర్కొంటోంది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని, వెయిటేజీ ఇస్తారా? లేదా? అన్నది సంబంధిత యాజమాన్యాల ఇష్టమని, టెట్ మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందేనని పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో దీనిపై కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
నేడు ఆలస్యంగా గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్: సికింద్రాబాద్–గోరఖ్‌పూర్ (12590) ఎక్స్‌ప్రెస్ నేడు (శుక్రవారం) ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీనియర్ పీఆర్వో షకీల్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఉదయం 7.20కి బయలుదేరాల్సి ఉండగా, సాంకేతిక కారణాల వల్ల మూడు గంటలు ఆలస్యంగా ఉదయం 10.20కి బయలుదేరనున్నట్లు పేర్కొన్నారు. -
మూడు రోజుల ఆలస్యంగా నోట్7
టెక్ దిగ్గజం శాంసంగ్, గెలాక్సీ నోట్7 స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను జాప్యం చేయనుందట. సెప్టెంబర్ 28న గెలాక్సీ నోట్7 అమ్మకాలను దక్షిణ కొరియాలో చేపడతామన్న శాంసంగ్, మూడు రోజుల ఆలస్యంగా అక్టోబర్ 1 నుంచి విక్రయించనునున్నట్టు ప్రకటించింది. బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో గెలాక్సీ నోట్7 అమ్మకాలను ఆపివేసి, ఆ ఫోన్లను రీకాల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం చేపడుతున్న రీకాల్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి ఈ అమ్మకాలను జాప్యం చేయనున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 2న రీకాల్ ప్రాసెస్‌ను అధికారికంగా ప్రారంభించిన శాంసంగ్, 2.5 మిలియిన్ గెలాక్సీ నోట్7లను వెనక్కి తీసుకుంది. రీకాల్ కింద రీప్లేస్‌మెంట్‌గా సురక్షితమైన బ్యాటరీ కల్గిన డివైజ్‌లను వినియోగదారులకు శాంసంగ్ ఆఫర్ చేసింది. ప్రస్తుతం రీకాల్ చేసిన గెలాక్సీ నోట్7 ఫోన్లను సురక్షితమైన బ్యాటరీతో శాంసంగ్ మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. సింగపూర్, అమెరికా వంటి మార్కెట్లలో రీకాల్ ప్రక్రియ నిదానంగా సాగుతుందని, దీనికోసం పునఃప్రారంభాన్ని జాప్యం చేయనున్నట్టు తెలిపింది. అక్టోబర్ 1 వరకు బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో ప్రభావితమైన ఫోన్లను ఎక్స్చేంజ్ చేసుకోవాలని లేని పక్షంలో రీకాల్ ప్రక్రియ మరింత కష్టతరమవుతుందని కంపెనీ పేర్కొంటోంది. రీకాల్ ప్ర్రక్రియ అనంతరం ప్రభావితమైన మార్కెట్లో మళ్లీ గెలాక్సీ నోట్7 అమ్మకాలు చేపట్టాలని శాంసంగ్ నిర్ణయించింది. కానీ రీకాల్ ప్రక్రియ ఆలస్యం మార్కెట్లోకి పునఃప్రారంభంపై దెబ్బ కొడుతోంది. రీకాల్ ప్రక్రియ అనంతరం కూడా చాలా బ్యాటరీ పేలుళ్ల ఘటనలు మార్కెట్లో సంచలనం రేపుతున్నాయి.పలు దేశాల విమానయాన అధికారులు ఇప్పటికే విమనాల్లో ఈ ఫోన్ల వాడకాన్ని నిషేధించారు. గెలాక్సీ నోట్7 వల్ల వినియోగదారులకు ఏర్పడిన అసౌకర్యానికి శాంసంగ్ సెప్టెంబర్ 25న క్షమాపణ కూడా చెప్పుకుంది. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించి, సురక్షితమైన ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెడతామని కంపెనీ చెప్పింది. -
మరుగుదొడ్లు నిర్మాణంలో జాప్యమేందుకు.?
ఖమ్మం మేయర్‌ను, అధికారులను ప్రశ్నించిన మంత్రి తుమ్మల గండుగులపల్లి(దమ్మపేట): మారుమూల గ్రామాల్లో కూడా మరుగుదొడ్లు నూరు శాతం పూర్తి అవుతున్నాయని, ఖమ్మం కార్పొరేషన్, మిగిలిన మున్సిపాలిటీల్లో.. ఎందుకు జాప్యం జరుగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మం మేయర్ పాపాలాల్‌ను, అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం మండల పరిధిలోని గండుగులపల్లి తన నివాసంలో ఉన్న మంత్రి తుమ్మలను మేయర్‌తోపాటు, జిల్లాలోని పలు శాఖల అధికారులు వచ్చి కలిశారు. ఈ సందర్బంగా తుమ్మల మాట్లాడారు. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పన్నులు సక్రమంగా వసూలు చేయాలని, పన్నులు వసూళ్లుంటేనే అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. అధికారులు నిబద్ధతతో పనిచేయాలని, అక్రమాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. పాలేరు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో అక్రమ విద్యుత్ కనెక్షన్లున్నాయని, వాటిని వెంటనే క్రమబద్ధీకరించాలని ట్రాన్స్‌కో ఎస్ఈ రమేష్‌ను ఆదేశించారు. ట్రాన్స్‌కో ఎస్ఈగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న రమేష్ ఈ సందర్భంగా మంత్రిని కలిశారు. మంత్రి తుమ్మలను కలసిన వారిలో డీసీసీబీ డైరక్టర్ పాలా నర్సారెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు పైడి వెంకటేశ్వరరావు, డొడ్డాకుల రాజేశ్వరరావు, నాయకులు పోతినేని శ్రీరామవెంకటరావు, దొడ్డాకుల గోపాలరావు, పసుమర్తి చంద్రరావు, కాసాని నాగప్రసాద్, ఎండీ వలీపాష, కురిశెట్టి సత్తిబాబు, రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు తదితరులున్నారు. -
విమానాల ఆలస్యంతో ప్రయాణికుల పాట్లు
నాలుగైదు గంటల జాప్యం పోర్టుబ్లెయిర్, దిల్లీ ప్రయాణికుల అసౌకర్యం గోపాలపట్నం: విశాఖ విమానాశ్రయం నుంచి సోమవారం పలు విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. దిల్లీ నుంచి విశాఖకు ఉదయం 9.20 గంటలకు రావలసిన ఎయిరిండియా విమానం మధ్యాహ్నం 1.50కి వచ్చింది. ఇది పోర్టుబ్లెయిర్‌కి 12.05కి వెళ్లాల్సి ఉండగా, సాయంత్రం 4.20కి బయలుదేరింది. పోర్టుబ్లెయిర్ నుంచి విశాఖకు సోమవారం మధ్యాహ్నం 2.55కి రావలసిన ఎయిరిండియా విమానం రాత్రి ఏడు గంటలకు వచ్చింది. షెడ్యూలు ప్రకారం తిరిగి దిల్లీకి సాయంత్రం 6.10కి బయల్దేరాల్సిన సర్వీసు 9.10కి దిల్లీకి బయల్దేరింది. దీంతో దేశీయ అంతర్జాతీయ ప్రయాణికులు ఆవేదన చెందారు. విమానానికి సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణాలు ఆలస్యంగా సాగినట్లు తెలిసింది. -
రైళ్లు ఆలస్యం
ఒడిశా బంద్ ఫలితం విశాఖపట్నం: ఒడిశాలో మంగళవారం జరిగిన బంద్/రైల్‌రోకో కారణంగా ఈకో రైల్వే పరిధిలో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. విశాఖపట్నం, దువ్వాడ మీదుగా రాకపోకలు సాగించాల్సిన రైళ్లు నిర్ణీత సమయంకన్నా.. అరగంట నుంచి 3 గంటలు ఆలస్యంగా చేరుకున్నాయి. భువనేశ్వర్, ఖుర్దారోడ్, భద్రక్, ధెకెనాల్, సంబల్పూర్, కటక్, పూరి, టిట్లాఘర్ ప్రాంతాల్లో నిరసనకారులు ప్రదర్శన చేపట్టి 21 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 4 పాసింజర్ రైళ్లను నిలిపివేసినట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. భువనేశ్వర్ రైల్వేస్టేషన్లో హౌరా–పూరి ఎక్స్‌ప్రెస్ (12887), హరిద్వార్–పూరి(18478)లను గంటసేపు నిలిపివేశారు. ఖుర్దారోడ్‌లో భువనేశ్వర్– బెంగళూర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18463)ని మూడు గంటలు, హౌరా– వాస్కోడిగామా అమరావతి ఎక్స్‌ప్రెస్ (18047)ను కటక్‌లో గంట, ఖుర్దారోడ్‌లో అదే రైలుని మరో అరగంట, యశ్వంత్‌పూర్–ముజాఫర్పూర్ ఎక్స్‌ప్రెస్(15228)ను కపిలాస్రోడ్డులో 3 గంటలు, పూరి–దుర్గ్(18426) ఎక్స్‌ప్రెస్‌ను నిర్గుండి వద్ద గంటన్నర, ధన్‌బాద్–భువనేశ్వర్(12831) గరీబ్‌రథ్‌ను ధేకెనాల్ వద్ద 3 గంటలు, హౌరా–చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్(12842)ను భువనేశ్వర్ వద్ద రెండుగంటలు, గురుదేవ్, పూరి–ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్, ఈస్ట్‌కోస్ట్, హౌరా–మైసూర్ ఎక్స్‌ప్రెస్, విశాఖ–అమృత్సర్, హౌరా–మైసూర్ ఎక్స్‌ప్రెస్‌లు 30 నుంచి గంట వ్యవధి మధ్యలో పలు స్టేషన్లలో నిలిపివేశారు. వీటితోపాటు పలు పాసింజర్ రైళ్లను భద్రక్, హిరాకుడ్, బుధాపంక్ ప్రాంతాల్లో నిలిపివేశారు. ఇవి ఆయా స్టేషన్లను ఆలస్యంగా చేరుకున్నాయి. -
ఉద్యోగులకు ఊరడింపేనా?
అనంతపురం అర్బన్ : ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ 43శాతం ఫిట్మెంట్ ప్రకటించి వదిలేసింది. అనుబంధ జీవో విడుదలలోనూ జాప్యం చేస్తోంది. పీఆర్సీ అరియర్స్ చెల్లింపుపై నిర్ణయం తీసుకోలేదు. రెండేళ్లుగా ఆ అరియర్స్, డీఏలు ఇచ్చే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. కనీసం ఆ ఊసే ఎత్తకపోవడంతో ఉద్యోగులు అయోమయంలో పడ్డారు. జిల్లాలో 34,900 మంది ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఆరియర్స్ రూ.260 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. రెండేళ్లవుతున్నా ఆ ఊసే ఎత్తలేదు. పదో పీఆర్సీ కింద 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. 2015 ఏప్రిల్ 1న పెరిగిన వేతనాలు అందుకుంటున్నారు. ప్రకటించిన ఫిట్మెంట్ మేరకు 2013 జూలై 1 నుంచి 2015 మార్చి 31 వరకు అరియర్స్ ఇవ్వాల్సి ఉంది. అయితే అరియర్స్‌ను 2013 జూలై 1 నుంచి 2014 జూన్ 1వ తేదీ వరకు నోషనల్ కింద పక్కన పెట్టింది. ఉద్యోగులు ఏడాది అరియర్స్ నష్టపోయారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 వరకు అంటే తొమ్మిది నెలల అరియర్స్ అందాల్సి ఉంది. సగటున ఒక్కో ఉద్యోగికి పీఆర్సీ అరియర్స్ రూ.75 వేలు అనుకున్నా.. 34,900 మందికి రూ.260 కోట్లకు పైగానే చెల్లించాల్సి ఉంది. ఎటూ తేల్చని డీఏ చెల్లింపు ఉద్యోగులకు రెండు డీఏలు ప్రభుత్వం ప్రకటించింది గానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పీఆర్సీ అరియర్స్. రెండు డీఏలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ జీవో విడుదల చేయకుండా ఉద్యోగులను అయోమయంలో పడేసింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పింఛనుదారులకూ సమస్యగానే మారింది. ఉద్యోగ విరమణ చేసినా అరియర్స్ అందుకోలేదు. వీరికి ఏవిధంగా అరియర్స్ చెల్లిస్తారనేది ప్రభుత్వం నుంచి స్పష్టత ఇవ్వలేదు. -
ఆలస్యంగా ఖరీఫ్
-
డంపింగ్ యార్డు ఏర్పాటులో జాప్యం
తిరువళ్లూరు: మున్సిపాలిటీ పరిధిలో సేకరించిన చెత్తను డంపింగ్ చేయడానికి స్థలం ఏర్పాటు చేయకపోవడంతో, ప్రభుత్వం ప్రకటించిన సేంద్రీయ ఎరువుల తయారీ పరిశ్రమ ఏర్పాటు అగమ్యగోచరంగా మారింది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరువళ్లూరు మున్సిపాలిటీలో దాదాపు లక్ష మందికి పైగా నివాసం ఉంటున్నారు. విద్యాసంస్థలు, కళాశాలలు, హోటల్స్‌తో పాటు ఇతర అవసరాల వల్ల ఏర్పడే చెత్తను మగ్గిన కుప్పలు, మగ్గని కుప్పలుగా వేరు చేసి తలకాంజేరీకి సమీపంలో డంపింగ్ చేస్తున్నారు. అక్కడ చెత్తకుప్పలు గుట్టల్లా పేరుకుపోవడంతో సమీప ప్రాంతాలకు దుర్వాసన వస్తోంది. చెత్తకుప్పలకు నిప్పు పెట్టినప్పుడు పొగలు దట్టంగా విస్తరించడం, హానికర వాయువులు వెలువడుతుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చెత్తను పడవేయడానికి కుత్తంబాక్కం సమీపంలో 110 ఎకరాల స్థలంలో డంపింగ్ యార్డును ఏర్పాటుచేసి అక్కడ సేంద్రీయ ఎరువుల తయారీ చేపట్టాలన్న ప్రభుత్వ లక్ష్యం ముందుకు సాగడం లేదు. డంపింగ్ యార్డుకు స్థలం కరువు: తిరువళ్లూరులో సేకరించే చె త్తకుప్పలను డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి అక్కడికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కుత్తంబాక్కంలో స్థానికులు డంపింగ్‌యార్డు ఏర్పాటుకు నిరసన వ్యక్తం చేయడంతో ఎగువ నల్లాటూరు వద్ద ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా ఆచరణలో సాధ్యం కావడం లేదు. దీంతో తిరువళ్లూరును పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వం ఆశయం కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి డంపింగ్ యార్డును వెంటనే ఏర్పాటు చేసి సేంద్రియ ఎరువుల తయారీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఎరువుల తయారీ పరిశ్రమకు నిధుల కొరత : తిరువళ్లూరు మున్సిపాలిటీ నుంచి భారీగా వెలువడుతున్న చెత్తవల్ల భవిష్యత్తులో ముప్పు ఏర్పడుతుందన్న కారణంతో ప్రభుత్వం ముందస్తు చర్యగా సేంద్రియ ఎరువుల తయారీ చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ ప్రక్రియ నారావారికుప్పంతో పాటు 8 మేజర్ పంచాయతీల్లో జరుగుతోంది. వాస్తవానికి సేంద్రియ ఎరువుల తయారీ ఖర్చులను ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీలే భరించాల్సి ఉంది. అయితే తిరువళ్లూరులో సేకరించిన చెత్త నుంచి సేంద్రియ ఎరువుల తయారీకి భారీగా ఖర్చు అయ్యే అవకాశం ఉండడంతో ఈ ప్రక్రియ సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తిరువళ్లూరు మున్సిపాలిటీలో సేంద్రీయ ఎరువుల తయారీకి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. ముప్పు నుంచి ఉపశమనం : ప్రస్తుతం తిరువళ్లూరులో సేకరించే చెత్తకుప్పలను తలకాంజేరి వద్ద డంపింగ్ చేస్తున్నారు. చెత్తకుప్పలు భారీగా పేరుకుపోతే నిప్పు పెట్టి కాల్చేస్తున్నారని, ఆ సమయంలో పొగలు దట్టంగా వ్యాపించడంతో పాటు హానికర వాయువులు వెలువడుతుండడంతో గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. -
విమానాలు ఆలస్యం.. ప్రయాణికుల ఇక్కట్లు
శంషాబాద్: విమానాల ఆలస్యం ప్రయాణికులకు చిరాకును తెప్పించింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు మంగళవారం ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన రెండు ఎయిర్ క్రాఫ్ట్ విమానాలు సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు విమానాలు 11.30 గంటల తర్వాత బయలుదేరతాయని విమానాశ్రయ సిబ్బంది చెప్పారు. -
'ఎయిర్ కోస్టా' ప్రయాణికుల పడిగాపులు
శంషాబాద్: హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లాల్సిన ప్రయాణికులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నారు. ఎయిర్ కోస్టా విమానం మంగళవారం ఉదయం 7 గంటలకు శంషాబాద్ నుంచి విశాఖ కు వెళ్లాల్సి ఉంది. అయితే విశాఖలో వాతావరణం అనుకూలంగా లేకపోవటంతో విమానాన్ని ఎయిర్ పోర్టు అధికారులు నిలిపివేశారు. దీంతో నాలుగు గంటలుగా ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. వాతావరణం అనుకూలించిన వెంటనే సర్వీసును పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. -
రుణాలు గోవిందా!
♦ లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వ వెబ్సైట్లో ♦ అప్లోడ్ చేయడంలో ఆలస్యం ♦ వైబ్‌సైట్‌ను మూసివేసిన సర్కారు ♦ ఎస్సీ, బీసీ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం ♦ మంజూరుకు నోచుకోని రూ. 2 లక్షలపై విలువ యూనిట్లు ♦ 271 మంది లబ్ధిదారులకు మొండిచేరుు ♦ వెబ్‌సైట్‌ను పునఃప్రారంభించాలి : ఉన్నతాధికారులు ఇందూరు : రాష్ట్ర ప్రభుత్వం రాయితీ రుణాలు అందిస్తున్న నేపథ్యంలో 2015-16 సంవత్సరానికి నాలుగు నెలల క్రితం మండల, మున్సిపల్ కార్యాలయాల్లో భారీ సం ఖ్యలో రుణాల కోసం దరఖాస్తులు వచ్చారుు. ప్రధానంగా రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు యూ నిట్ల కోసం ఒక్క రుణానికి ఇద్దరు చొప్పున పోటీ పడ్డారు. అయితే తొలుత మండల, మున్సిపల్ కార్యాలయాల్లో ఎంపిక చేసి మార్చి 28న కలెక్టర్ కార్యాలయంలో వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్లో 212 మంది, బీసీ కార్పొరేషన్లో 59 మంది, మొత్తం కలిపి 271 మందిని ఎంపిక చేశారు. జాబితాను కూడా ప్రకటించారు. అనంతరం కలెక్టర్ తో కాగితాలపై అప్రూవల్ చేయించిన ఎస్సీ, బీసీ కా ర్పొరేషన్ అధికారులు ప్రభుత్వం రుణాలు మం జూ రు చేసేందుకు ఏర్పాటు చేసిన (ఆన్లైన్ మం జూ రుకు సంబంధించిన) వెబ్సైట్లో లబ్ధిదారుల వివరా లు నమోదు చేయడం జాప్యం చేశారు. అయితే ప్రభుత్వం ఏప్రిల్ 21న వెబ్‌సైట్‌ను క్లోజ్ చే సింది. ఉన్నతాధికారులు వెబ్‌సైట్‌ను ప్రభుత్వం తెరి స్తేగాని రుణాల మంజూరు సాధ్యపడదని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏం చెయ్యాలో అర్థం కాక, రుణాలు మంజూరు కాకపోతే లబ్ధిదారులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. నిర్లక్ష్యానికి పరాకాష్ఠ రాష్ట్ర ప్రభుత్వం అధిక మొత్తంలో రుణాలకు రాయితీ ఇస్తున్నందుకు పోటీ పెరిగింది. అర్హులను గుర్తించడానికి అధికారులు సెలవు రోజుల్లో కూడా పని చేసి ఎంపిక పక్రియ పూర్తి చేశారు. కానీ ఆ తరువాత కా ర్పొరేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆన్లైన్ మం జూరుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ వెబ్సైట్లో వెంట వెంటనే వివరాలు అప్లోడ్ చేయడంలో జాప్యం చేశారు. ఒక పక్క కలెక్టర్ యోగితారాణా పారదర్శకంగా రుణాలు అర్హులకు అందించడానికి చర్యలు చేపడితే, మరో పక్క అధికారులు జాప్యాన్ని ప్రదర్శిం చి రుణాలకు ఎసరు తెచ్చారు. అదేవిధంగా రుణాలను అందించడానికి సంబంధిత శాఖల అధికారులు భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. కానీ.. ఎస్సీ, బీసీ కార్పొరేషన్లకు కొంత కాలంగా రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో వేరే శాఖలకు చెందిన అధికారు లు ఇన్‌చార్జీలుగా పని చేస్తున్నారు. ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు. వెబ్సైట్ తెరిస్తేనే ఆశలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్లైన్ మంజూరు వెబ్‌సైట్‌ను మళ్లీ తెరిచే అవకాశాలు కనపించడం లేదు. అయితే ఒక్క విషయంలో మాత్రం ఆశలు కలుగుతున్నాయి. అదేంటంటే నిజామాబాద్ జిల్లాతోపా టు కరీంనగర్,ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఇదే విధంగా జరిగింది. లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్ మంజూరు కోసం అప్లోడ్ చేయలేదు. నాలుగు జిల్లాల ఉన్నతాధికారు లు కలిసి సర్కారుపై ఒత్తిడి తెస్తే వెబ్‌సైట్‌ను తిరిగి పునఃప్రారంభించే అవకాశాలున్నాయి. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల అధికారులు తమ రాష్ట్ర ప్రధాన కార్యాలయాల అధికారులకు, ప్రభుత్వానికి లేఖల ద్వారా వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వం ఇంత వరకు వెబ్‌సైట్‌ను ప్రారంభించలేదు. -
గర్భం వాయిదానే ఉత్తమ మార్గం..!
దోమకాటువల్ల వ్యాప్తి చెందే జికా వైరస్... ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా జికా వైరస్ అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే బ్రెజిల్ లో దాదాపు పది లక్షలమందికి జికా సోకి కలకలం రేపడమే కాక మెల్లగా ఇతర ఖండాలకూ విస్తరిస్తోంది. ఈ వైరస్ గర్భిణులకు సోకితే పుట్టబోయే పిల్లలకు మెదడు లోపాలు తలెత్తే అవకాశం పెద్ద ఎత్తున ఉండటంతో డబ్ల్యూ హెచ్ వో వైరస్ ను నిలవరించేందుకు భారీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా వైరస్ వ్యాప్తి చెందుతున్న దేశాల్లోని మహిళలు గర్భధారణను ప్రస్తుత సమయంలో వాయిదా వేసుకోవడం మంచిదని హెచ్చరిస్తోంది. పిల్లల పుట్టుకలో లోపాలను నివారించడానికి వ్యాక్సిన్లకు బదులుగా ఈ పద్ధతిని పాటించడం ఉత్తమ మార్గమని చెప్తోంది. జికా వైరస్ సోకిన వెంటనే సాధారణ ప్రజల్లో లక్షణాలు పెద్దగా కనిపించకపోయినా గర్భిణులపై మాత్రం ఈ వైరస్ ప్రభావం అత్యధికంగా ఉంటోంది. జికా తల్లికి పుట్టిన బిడ్డ మెదడులోపంతో ఉండటం ప్రపంచ ఆరోగ్యసంస్థకు పెద్ద సవాలుగా మారింది. దీంతో మహిళలకు ముందు జాగ్రత్త చర్యలను సూచిస్తున్నారు. గర్భం ధరించాలనుకున్న వారు జికా వ్యాప్తి చెందుతున్న సమయంలో వాయిదా వేసుకోవాలని, వ్యాక్సిన్లు వేసినప్పటికీ జికా తల్లులకు పుట్టే బిడ్డలు మెదడు లోపాలతో పుట్టే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే జికా వ్యాప్తి చెందిన అన్ని దేశాల్లో హెచ్చరికలను జారీ చేసిన నిపుణులు.. లైంగిక కార్యకలాపాల వల్ల అనుకున్నదానికంటే ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పుట్టే పిల్లల్లో మైక్రో సెఫిలి నివారించాలంటే గర్భాన్ని వాయిదా వేసుకోవడమే సరైన మార్గమని హెచ్చరిస్తున్నారు. ఈడిస్ ఈజిప్టె రకం దోమలు కుట్టడంద్వారా జికా సంక్రమిస్తుందని మొదట్లో తెలిసినా... లైంగిక కార్యకలాపాలు, ముద్దులు, తినే వస్తువులు మార్పిడితో లాలాజలం వల్ల కూడ జికా ఒకరినుంచీ ఒకరికి సోకే అవకాశం ఉందని తాజా పరిశోధనలద్వారా కనుగొన్నారు. దీంతో కొన్ని దిద్దుబాట్లను చేసిన ఏజెన్సీలు... జికా ప్రభావిత ప్రాంతాల్లో కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇందులో భాగంగా పునరుత్పత్తి వయసులోని పురుషులు, మహిళలు గర్భధారణ జరగకుండా చూసుకోవాలని, వాయిదా వేసుకోవడం అన్నిరకాలుగా మంచిదని చెప్తున్నారు. -
ఎదురుచూపులు ఎన్నాళ్లు!
♦ బిల్లుల కోసం 2,977 మంది పడిగాపులు ♦ ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులో ఎడతెగని జాప్యం ♦ ద్విసభ్య కమిటీ తేల్చినా నిధులివ్వని సర్కారు ♦ రెండునెలలుగా ప్రభుత్వం వద్ద ఫైలు పెండింగ్ ఈమె పేరు పంబల్ల శాంతమ్మ. యాచారం మండలం, నల్లవెల్లి. రెండున్నరేళ్ల క్రితం ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. గోడలు స్లాబు లెవల్ వరకు లేచాయి. బిల్లు మాత్రం అందలేదు. రెండేళ్లుగా ఆమె బిల్లు కోసం ఎదురుచూస్తూనే ఉంది. రూఫ్ లేవల్ బిల్లు రూ.35 వేలకుపైగా రావాలి. ఇప్పటికే రూ.లక్షన్నర అప్పు చేశానని, బిల్లిస్తే ఇల్లు పూర్తి చేస్తానని చెబుతోంది శాంతమ్మ. పేదింటి కల సాకారం కాలేదు. ఇందిరమ్మ ఇళ్లకు ఇంకా మోక్షం కలగలేదు. అప్పులుచేసి ఈ పథకం కింద ఇళ్లు కట్టుకున్న బడుగులను ప్రభుత్వం కరుణించడంలేదు. ఇందిరమ్మ పథకంలో అక్ర మాలు జరిగాయని సీఐడీ దర్యాప్తు పేరిట కొన్నాళ్లు కాల యాపన చేసిన సర్కారు.. ఆ తర్వాత అర్హుల గుర్తింపు నెపంతో మరికొంత సమయాన్ని దాటవేసింది. ఆఖరికి ఈ క్రతువు ముగిసి రెండు నెలలైనా నిధులు విడుదల చేయకుండా ఫైలును పక్కనపడేసింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జిల్లావ్యాప్తంగా వేలాది మంది పేదలు సొం తింటి కోసం పునాదులు వేశారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల్లో ఈ లబ్ధిదారుల పేర్లు ఆన్లైన్లో గల్లంతయ్యాయి. ఇందిరమ్మ పథకం కింద బిల్లుల చెల్లింపులన్నీ ఆన్లైన్ ద్వారా జరుగుతాయి కనుక.. వీరికి ఇప్పటివరకు నయాపైసా అందలేదు. కనీసం వీరి ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయనే సమాచారం కూడా ప్రభుత్వం దగ్గర నమోదు కాకపోవడంతో బిల్లులు చెల్లింపులకు సాంకేతిక సమస్య అడ్డొచ్చింది. అంతలోనే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కారు.. ఇందిరమ్మ ఇళ్లపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ పథకంలో బినామీలే ఎక్కువగా ఉన్నారని భావించిన ప్రభుత్వం.. కొత్త ఇళ్ల కేటాయింపులను రద్దు చేసింది. అప్పటికే వివిధ దశల్లో ఉన్న ఇళ్లకు బిల్లుల చెల్లింపులను కూడా నిలిపివేసింది. 2,877 మంది ఎదురుచూపు 2013లో దాదాపు 3 వేల ఇందిరమ్మ గృహాలను ప్రభుత్వం మంజూరుచేసింది. వీటిలో 50శాతం ఇళ్లు పూర్తి కాగా, మిగతావి అసంపూర్తిగా ఉన్నాయి. అయితే, ఇందిరమ్మ పథకంలో అక్రమాలను వెలికితీసేంతవరకు బిల్లులు నిలిపివేయాలనే ప్రభుత్వ నిర్ణయం వీరికి ఆశనిపాతంగా మారింది. అప్పోసప్పో చేసి ఇళ్లను మొదలు పెట్టిన వారికి బిల్లులు రాకపోవడం వారిని ఆర్థికంగా దిగజార్చింది. చివరకు లబ్ధిదారుల మొర ఆలకించిన ప్రభుత్వం అర్హులైన వారిని గుర్తించేందుకు తహసీల్దార్, ఆర్డీఓ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి అర్హత నిర్ధారించాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా 2,877 ఇళ్ల శ్లాబ్‌లు పూర్తయినట్లు తేల్చాయి. వీటికి బిల్లులు చెల్లించాలని నిర్దేశించాయి. అదేసమయంలో 8,831 గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని అధికారుల కమిటీ గుర్తించింది. ఈ క్రమంలో 2,877 ఇళ్లకు రూ.14 కోట్ల మేర బిల్లులు చెల్లించాలని సిఫార్సు చేస్తూ జిల్లా గృహనిర్మాణశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రెండు నెలల క్రితం ప్రభుత్వానికి చేరిన ఈ ఫైలుకు ఇప్పటికీ మోక్షం కలగలేదు. ఇందిరమ్మ పథకం కింద పూర్తి చేసుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లిస్తామని పలు సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేస్తున్నా.. నిధుల విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు సర్కారు కరుణ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రూ.40 వేల బిల్లు రావాలె.. రూ. 40 వేల బిల్లు రావాలి. ఇందిరమ్మ ఇళ్లు వచ్చిందన్న సంతోషమే కానీ ఇంటి నిర్మాణానికి అప్పే అయింది. రెండు సార్లు రూ.60 వేల వరకు బిల్లు వచ్చింది. మిగితా రూ.40 వేల కోసం నిత్యం మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. రవాణా చార్జీలే ఖర్చువుతున్నాయి కానీ పైసా బిల్లు మాత్రం రావడం లేదు. రూ.40 వేల బిల్లుఇస్తే ఇంటి నిర్మాణం కోసం తెచ్చి అప్పులకు వడ్డీలైనా చెల్లించుకుంటాం. - పి.లింగమ్మ, (తక్కళ్లపల్లి) యాచారం మండలం -
అయ్యో.. అన్నమయ్య
♦ డ్యాం ఆధునికీకరణలో జాప్యం ♦ పర్యాటకపరంగా నోచుకోని అభివృద్ధి ♦ నరకప్రాయంగా ప్రాజెక్టు రోడ్డు ♦ డ్యాం నిర్వహణపై కలెక్టరు అసంతృప్తి రాజంపేట: చెయ్యేరు నదిపై నిర్మితమైన అన్నమయ్య జలాశయం ఆధునికీకరణలో జాప్యం కొనసాగుతోంది. బడ్జెట్లో కూడా అరకొరగా నిధులు కేటాయించడంతో అభివృద్ధికి నోచుకోని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు నిధులు పుష్కలంగా ఉన్నాయని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ వెళ్లడించడంతో ఇక ఆధునికీకరణ పనులు చేపట్టడానికి కారణాలు ఏమిటో అంతుబట్టడం లేదు. గేట్లకు రబ్బరు సీలు, గ్రీసు, పెయింటింగ్ లేక జలాశయం బోసిపోయింది. పర్యాటకపరంగా అభివృద్ధికి నోచుకోలేదు. 2.33948 టీఎంసీ స్టోరేజీ కెపాసిటీతో నిర్మితమైన జలాశయ నిర్మాణానికి తొలుత అంటే 1996-97లో రూ.68.92కోట్ల వ్యయంతో ప్రారంభించారు. అప్పటి నుంచి దశలవారీగా నిర్మాణం పూర్తి చేసుకుంది. 2001-2002లో రూ.57.347కోట్లు వ్యయం చేశారు. 2003లో వరదలకు గేట్లు డ్యామేజీ కావడంతో రూ.1.20కోట్లు 2004 జూన్ నాటికి పూర్తి చేశారు. 2003-2004 లో రూ3.కోట్లు కేటాయించారు. ఆది నుంచి అన్నమయ్య డ్యాం అరకొర నిధులతోనే ముందుకు సాగుతూ వచ్చింది. ప్రతిపాదన దశలో.. జలాశయం అభివృద్ధి చేయడానికి నిధులు కోసం ఎదురు చూపులతో కాలయాపన జరుగుతోంది. ఉన్న అరకొర నిధులకు సంబంధించి ప్రతిపాదన దశలో ఉందని సమాచారం. అంధకారంలో ఉన్న జలాశయానికి సోలార్ వెలుగులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వానికి రూ.25లక్షలతో ఎస్టిమేట్స్ వెళ్లాయి. అలాగే పెయింటింగ్ కోసం రూ.1.60కోటి నిధుల విడుదలకు సంబంధించి ఎస్టిమేట్స్ ప్రభుత్వానికి పంపారు. పవర్లైను రిపేరు కోసం రూ.1.4లక్షలు, జనరేటర్‌కు రూ. 1.63లక్షలు, క్రైన్మెయింటెనెన్స్కు రూ.136లక్షలు, ఎర్త్ డ్యాం గ్యాలరీ కోసం రూ.2.1లక్షలు, స్పిల్‌వేకు రూ.2.8లక్షలు, రబ్బర్సీలింగ్ (గేట్ల) రూ.9.9లక్షలు, స్పాట్లాగ్ ఎలిమెంట్స్ రూ.9.9లక్షలు, ఆయిల్, గేట్ మెయింటెన్స్ కోసం రూ.8.42లక్షల కోసం ప్రతిపాదనలు పంపారు. టెండర్లను కూడా త్వరలో పిలవనున్నారు. సీఈ పరిధిలో జలాశయం మెయింటెన్స్‌కు ఈ పనులు చేట్టనున్నారు. పర్యాటకపరంగా నోచుకోని అభివృద్ధి.. గత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరెడ్డి పాలనలో అన్నమయ్య డ్యాంను పర్యాటక పరంగా అభివృద్ది చేయాలని ప్రతిపాదనలు చేశారు. ఆ ప్రతిపాదనలను తర్వాత వచ్చిన పాలకులు ఆటకెక్కించారు. అలాగే పర్యాటకులు ఉండటానికి అతిథి గృహం కూడా శిధిలావస్థకు చేరుకుంది. పర్యాటకులు పోవడానికి వీలులేని విధంగా డ్యాం రోడ్డు కొనసాగుతోంది. కొన్నాళ్లుగా రోడ్డులో వెళ్లాలంటే వాహనదారులకు నరక ప్రాయం చూపిస్తోంది. ఈ డ్యాంను జిల్లా కలెక్టరు సందర్శించి డ్యాం నిర్వహణపై పెదవి విరిచారు. నిధులు ఉన్నా డ్యాం ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఏ అధికారి వచ్చినా డ్యాం గురించి నిర్వహణ లోపాలను ఎత్తిచూపడమే తప్ప మరొకటి ఉండదనే భావన పర్యాటకుల్లో నెలకొంది. -
ఓ చిన్న డ్రోన్ 55 విమానాలను ఆపేసింది!
బీజింగ్: చైనాలోని ఓ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. విమానాశ్రయం మీదుగా ఓ డ్రోన్ చెక్కర్లు కొడుతుండటంలో అధికారులు ఎక్కడి విమానాలను అక్కడే నిలిపేశారు. వివరాల్లోకి వెళ్తే.. సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్న చెంగ్డూ షాంగ్లీ అంతర్జాతీయ విమానాశ్రయం రద్దీగా ఉన్న అధికారులకు విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయం మీదుగా ఎవరు ఆపరేట్ చేస్తున్నారో తెలియని ఓ డ్రోన్ చెక్కర్లు కొడుతుండటంతో బయలుదేరటానికి సిద్ధంగా ఉన్న 55 విమానాలను కొంత సమయం పాటు అలాగే నిలిపేశారు. ప్రమాదమేమీ లేదని నిర్థారించుకున్న తరువాత విమానాలు గంటన్నర ఆలస్యంగా బయలుదేరాయి. ఆ డ్రోన్‌కు సంబంధించి అధికారులు విచారణ చేపడుతున్నారు. అయితే ఓ డ్రోన్ మూలంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలుగటం ఇదే తొలిసారని అంటున్నారు. -
దోషులను శిక్షించాలంటూ రాస్తారోకో
పెబ్బేరు: హత్య ఘటనపై పోలీసుల దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదంటూ మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు. వివరాలివీ...పెబ్బేరుకు చెందిన షకీల్ అనే వ్యక్తి పది రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదంటూ శనివారం ఉదయం 9.30 గంటల నుంచి స్థానిక ముస్లిం నాయకులు రాస్తారోకోకు దిగారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళన కారణంగా స్థానిక సుభాష్ సెంటర్లో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. -
అసెంబ్లీ కమిటీల నివేదికల అమల్లో జాప్యం తగదు
♦ సభ్యుల ఆవేదన.. ♦ సభలో ప్రస్తావించాలన్న స్పీకర్ కోడెల సాక్షి, హైదరాబాద్: శాసనసభ కమిటీల నివేదికలను సభలో ప్రవేశపెట్టిన అనంతరం వాటిని ప్రభుత్వం అమలు చేయకపోవటంపై సోమవారం స్పీకర్ అధ్యక్షతన జరిగిన ప్రాథమిక సమావేశంలో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కమిటీల నివేదికలు సభలో ప్రవేశపెట్టిన తరువాత వాటిని ప్రభుత్వం అమలు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సోమవారం అసెంబ్లీ క మిటీ హాలులో ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని ప్రజా పద్దుల కమిటీ, అంచనాల కమిటీ, ప్రభుత్వరంగ సంస్థల కమిటీల ప్రాథమిక సమావేశం జరిగింది. కమిటీలనుద్దేశించి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రసంగించారు. కార్యక్రమంలో ఆయా కమిటీల చైర్మన్లు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (పీఏసీ), మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి (ఎస్టిమేట్స్), కాగిత వెంకట్రావు (పీయూసీ), శాసనసభ ఇన్చార్జ్ కార్యదర్శి కె.సత్యనారాయణ, సభ్యులు, ప్రిన్సిపాల్ ఎకౌంటెంట్ జనరల్ (కాగ్) హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న సభ్యులు గత ఏడేళ్లుగా ఉమ్మడి, ఏపీ అసెంబ్లీలో కమిటీల నివేదికలు ప్రవేశ పెట్టడం లేదని, ఒకవేళ కొన్ని కమిటీల నివేదికలు ప్రవేశపెట్టినా వాటిని ప్రభుత్వం స్వీకరించి అమలు చేసిన దాఖలాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. కమిటీ లు సమర్పించే నివేదికలను నిర్దిష్ట గడువులోగా సభ ముందు ఉంచటంతోపాటు వాటిపై తీసుకున్న చర్యల నివేదికలను ప్రభుత్వం తెలపాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై స్పీకర్ కోడెల స్పందిస్తూ కమిటీల నివేదికలు సభలో ప్రవేశపెట్టి అమలు చేయటం అనేది చట్టబద్ధం కాదని స్పష్టం చేశారు. అయితే నివేదికలు సభలో ప్రవేశ పెట్టకపోయినా, అమలు చేయకపోయినా ప్రభుత్వాన్ని సభలో సభ్యులు ప్రశ్నించవచ్చన్నారు. రెండు విడతలుగా నిర్వహించాలి.. బడ్జెట్ సమావేశాలను రెండు విడతలుగా నిర్వహించాలని, తొలుత ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టిన తరువాత దానిపై రెండో విడత జరిగే సమావేశాల్లో చర్చించాలని కమిటీకి హాజరైన సభ్యులు స్పీకర్‌కు సూచించారు. కమిటీ సమావేశాల్లో స్పీకర్ కోడెల ప్రసంగిస్తూ కమిటీల విధివిధానాలు, పోషించాల్సిన పాత్రపై త్వరలో వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడు కమిటీలు ప్రాథమిక సమావేశం అనంతరం విడివిడిగా భేటీ అయ్యాయి. -
సీఎం టూర్ ఆలస్యం
డెంకాడ: విజయనగరం జిల్లా డెంకాడ మండలం సింగవరంలో బుధవారం రాత్రి వచ్చిన గాలివానకు సీఎం చంద్రబాబు పాల్గొనాల్సిన బహిరంగ సభా వేదిక దెబ్బతిన్నది. దీంతో ముఖ్యమంత్రి షెడ్యూల్లో మార్పు చోటు చేసుకుంది. గురువారం ఉదయం 10.30 గంటలకు చంద్రబాబు నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని కొత్త చెరువును సందర్శించి తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే, బుధవారం రాత్రి వచ్చిన గాలివానకు సభావేదిక వద్ద ప్రజలు కూర్చునేందుకు వీలుగా చేసిన ఏర్పాట్లు, టెంట్లు కూలినపోయాయి. దీంతో అధికారులు తాత్కాలికంగా పునరుద్ధరణ పనులు చేపట్టారు. అధికారులు ఇచ్చిన సమాచారంతో సీఎం మధ్యాహ్నం 1 -2 గంటల తర్వాత గ్రామానికి రానున్నట్టు సమాచారం. -
ఫలితాల కోసం ఎదురుచూపు..!
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో డిగ్రీ తృతీయ ఏడాది ఫలితాల విడుదలలో జాప్యం నెలకొంది. ఫలితాల కోసం విద్యార్థులకు నిరీక్షణ తప్పడంలేదు. ఇప్పటికే ఏయూ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ మాత్రం ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి. జిల్లా నుంచి డి గ్రీ తృతీయ ఏడాది 14,550 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మార్చి 4 నుంచి 17 వరకు పరీక్షలు జరిగాయి. ఎడ్‌సెట్, ఐసెట్, ఆసెట్, ఇతర యూనివర్సిటీల పీజీ పరీక్షలకు దరఖాస్తు చేశారు. ఫలితాలు విడుదలైతే రెట్టింపు ఉత్సాహంగా చదివేందుకు ఆస్కారం ఉన్నా విద్యార్థులకు నిరాశే మిగులుతోంది. ఇదే విషయాన్ని వర్సిటీ పరీక్షణ నిర్వహణాధికారి ప్రొఫసర్ తమ్మినేని కామరాజు వద్ద ప్రస్తావించగా మరో పది రోజుల్లో ఫలితాలు ప్రకటించేం దుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
‘నామినేటెడ్’కు ఎదురు చూపులే!
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ నేతలకు చివరకు ఎదురు చూపులే మిగిలేలా ఉన్నాయి. రేపు, మాపు అంటూ వాయిదా వేసుకుంటూ వస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా, పార్టీ శ్రేణులకు కలిసొచ్చిన పదవులు దాదాపు ఏమీ లేవు. రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్ష పదవి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వంటి ఒకటీ అరా పదవులనే భర్తీ చేశారు. గత ఏడాది జరిగిన పార్టీ 14వ ఆవిర్భావ సభ సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలోనే పదవులు భర్తీ అవుతాయని, అందరికీ అవకాశాలు వస్తాయని, తమ వంతు వచ్చేవరకు ఎదురు చూడాలని హితబోధ చేశారు. అయితే, పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు నామినేటెడ్ పదవుల భర్తీ ఇప్పట్లో లేదని తెలుస్తోంది. వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నియమించేందుకు రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు. ఇంతవరకూ జాబితాలు స్వీకరించే దశలోనే ఉంది. కాగా, ఎండోమెంట్ కమిటీలు, గ్రంథాలయ కమిటీల వంటి పదవుల భర్తీతో జిల్లా స్థాయిలో చాలా మందికి రాజకీయ నిరుద్యోగం తీరుతుంది. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, జిల్లా స్థాయి కార్పొరేషన్లు, ఇతరత్రా పదవులను భర్తీ చేస్తే ప్రభుత్వంపై ఏకంగా ఏటా రూ. 150 కోట్ల ఆర్థిక భారం పడుతుందని లెక్క తేల్చారని సమాచారం. పదవులు భర్తీ చేయక పోవడానికి ఆర్థిక భారంతో పాటు ఇతరత్రా వచ్చే ఇబ్బందులపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పదవుల పేరు చెప్పి అధికారులపై ఒత్తిళ్లు తేవడం, అవినీతి ఆరోపణలకు కారణం కావడం, నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ సమస్యలు తలెత్తడం వంటి అంశాలపైనా చర్చించారని అంటున్నారు. మొత్తంగా పార్టీకి చెడ్డపేరు వచ్చే అవకాశమే ఎక్కువగా ఉన్నప్పుడు పదవుల భర్తీ ఆలస్యం అయితే మాత్రమేంటన్న ఆలోచనతోనే మీనమేషాలు లెక్కిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీ పదవులదీ అదే పరిస్థితి గత ఏడాది పార్టీ ప్లీనరీలో రాష్ట్ర అధ్యక్షునిగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక, అంతే... పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఒక్క పదవీ భర్తీ కాలేదు. జిల్లా స్థాయిల్లోనూ జిల్లా అధ్యక్షులు మినహా కమిటీల నియామకాన్ని చేపట్ట లేదు. మొదటి నుంచి పార్టీతో ఉన్నవారే కాకుండా, టీడీపీ, కాంగ్రెస్ తదితర పార్టీల నుంచి వచ్చిన వారూ ఉన్నారు. వీరు గతంలో అధికార పార్టీల్లో ఉండి పదవులు అనుభవించినవారే. కేవలం పదవులు, విజి టింగ్ కార్డులు చూపి పైరవీలు చేసిన ఉదంతాలూ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు వీరికి నామినేటెడ్ పదవులు కానీ, పార్టీ పదవులు కానీ ఇస్తే అధికారులపై ఒత్తిడి, పనుల కోసం వెళ్ల డం వంటివి జరుగుతాయని, ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న అంచనాతోనే పదవుల పంపకం జరగలేదని చెబుతున్నారు. -
బ్యాంక్‌లు జాప్యం చేస్తున్నాయ్...
అవినీతి అధికారులపై చర్యలకు ఆలస్యం: సీవీసీ న్యూఢిల్లీ: అవినీతి బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు జాప్యం చేస్తున్నాయని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) నివేదిక పేర్కొంది. మొండి బకాయిలు భారీగా పెరిగిపోవడం, బ్యాంక్ మోసాల కేసులు అధికమవుతున్న పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు వంద మంది అవినీతి బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నాయని సీవీసీ నివేదిక తప్పుపట్టింది. సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, జనరల్ మేనేజర్ హోదాల్లో ఉన్న దాదాపు 98 మంది బ్యాంక్ అధికారులను విచారించడానికి అనుమతించాలంటూ వివిధ బ్యాంకులను గత నాలుగు నెలల నుంచి అనుమతులు కోరుతున్నామని పేర్కొంది. కానీ బ్యాంకుల నుంచి తగిన స్పందన లేదని వివరించింది. మొత్తం 43 కేసుల్లో ఎక్కువ కేసులు (7) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు చెందినవని వివరించింది. -
డ్రైవర్ నిర్లక్ష్యంతో నిలిచిన రెండు రైళ్లు
భువనగిరి (నల్గొండ జిల్లా) : డ్రైవర్ నిర్లక్ష్యంతో భువనగిరి రైల్వే స్టేషన్లో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపేశారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇంటర్సిటీ, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. అంతకుముందు సికింద్రాబాద్ వైపు వెళ్లిన ఒక గూడ్సు రైలు బగిడిపల్లి ర్వైల్వే స్టేషన్లో సిగ్నల్ ఇవ్వకున్నా ముందుకు వెళ్లిపోవడంతో గత్యంతరం లేక అదే మార్గంలో వెళ్లనున్న రైళ్లను భువనగిరిలోనే ఆపడం జరిగింది. గూడ్సు రైలు సికింద్రాబాద్ చేరేవరకూ ఈ రైళ్లను ఇక్కడే ఆపేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. గూడ్సు రైలు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థతి దాపురించిందని వారంటున్నారు. అదే మార్గంలో వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ రైళ్లను వదిలితే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున తాము ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
ఆ వీడియోలతో జాగ్రత్త!
ఢిల్లీ: మీరు ఓ ఎత్తైన కొండ అంచున నిల్చున్నప్పుడు మీకు ఎంత మానసిక ఒత్తిడి కలుగుతుందో.. అంతే ఒత్తిడి మీ స్మార్ట్ ఫోన్లో ఆలస్యంగా స్ట్రీమ్ అవుతున్న వీడియో చూస్తున్నప్పుడు కలుగుతోందని తాజా పరిశోధనలో తేలింది. స్ట్రీమింగ్ వీడియో ఆరు సెకన్లు ఆలస్యంగా ప్లే అయితే.. మ్యాథ్స్ ఎగ్జామ్ రాయడానికి ముందు ఎదుర్కునేంత ఆందోళన, అర్థరాత్రి ఒంటరిగా హారర్ సినిమా చూస్తున్నప్పుడు కలిగే ఒత్తడి కలుగుతోందని స్వీడన్ కు చెందిన కమ్యూనికేషన్ టెక్నాలజీ సంస్థ ఎరిక్సన్ వెల్లడించింది. వీడియో ఒకసారి మొదలైన తరువాత మధ్యలో ఆగిపోతే ఈ ఒత్తిడి ఇంకా పెరుగుతున్నట్లు పరిశోధనలో తేలింది. స్మార్ట్ ఫోన్లలో లైవ్ స్ట్రీమింగ్ వీడియోలు చూసే సమయంలో అవి లోడ్ కావడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా జాగ్రత్త పడాలని ఎరిక్సన్ తన నివేదికలో తెలిపింది. వెబ్ పేజీలు, వీడియోలు లోడ్ కావడంలో జరిగే ఆలస్యంతో వినియోగదారుల హార్ట్ రేట్ 38 శాతం పెరుగుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. నెట్ వర్క్ ఆపరేటర్లు సైతం ఈ ఆలస్యం మూలంగా భారీగా వినియోగదారులను కోల్పోవాల్సివస్తుందని ఎరిక్ సన్ వెల్లడించింది. -
విమానాలను ఆపేసిన శునకం
ముంబై: విమానాశ్రయంలో కుక్క హల్చల్ చేసింది. ఎయిర్ పోర్ట్ రద్దీగా ఉండే సమయంలో రన్ వే మీదకు వచ్చిన ఓ శునకం అధికారులను పరుగులు పెట్టించింది. సుమారు అరగంట పాటు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగించింది. ఆదివారం సాయంత్రం ముంబై విమానాశ్రయంలో నాలుగు ఫ్లైట్లు రన్ వే పై దిగడానికి సిద్ధంగా ఉన్న సమయంలో.. అక్కడ ఓ శునకం ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆ విమానాలను గాల్లోనే చెక్కర్లు కొట్టించారు. సుమారు అరగంట తరువాత కుక్కను అక్కడి నుండి తరిమేయడంతో విమానాలు రన్ వే పై దిగడానికి అధికారులు అనుమతించారు. రద్దీ సమయంలో విమానాల రాకపోకలకు ఆ శునకం అరగంట అంతరాయం కలిగించిందని అధికారులు తెలిపారు. సమీపంలోని మురికివాడల నుండి ముంబై విమానాశ్రయంలోకి శునకాలు ప్రవేశించి విమానాల రాకపోకలకు అంతరాయం కలిగించడం పరిపాటిగా మారింది. -
'స్టార్ట్ అప్'ల ఆలస్యానికి నేనే కారణం: ప్రణబ్
న్యూఢిల్లీ: యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా స్టార్ట్ అప్ లను ప్రారంభించడంలో భారత్ వెనుకబడిపోయిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. స్టార్ట్ అప్ ల విషయంలో దేశం ఆలస్యంగా మేల్కొందని, అందుకు కారణం కూడా తానేనని ఆవేదన చెందారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'స్టార్ట్ అప్ ఇండియా' కార్యక్రమ ప్రారంభానికి కొద్ది గంటలముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. గ్రామీణ స్థాయిలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా చేపట్టనున్న స్టార్-అప్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సిలికాన్ వ్యాలీ సీఈవోలతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న రాత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 'ప్రభుత్వం స్టార్ట్ అప్ లను బాగా ప్రోత్సహిస్తోందని మీలో చాలా మంది మాట్లాడారు. మీరన్నది సరైందే కానీ వాస్తవమేమిటంటే స్టార్ట్ అప్ ల విషయంలో ఇండియా ఇప్పుడే మేల్కొంది. జరిగిన ఆలస్యానికి భారీ మూల్యం కూడా చెల్లించుకుంటోంది. నిజానికి ఈ ప్రోత్సాహకాలు ఒక దశాబ్దం కిందటే ప్రవేశపెట్టిఉంటే గనుక పరిస్థితి మరోలా ఉండేది. ఆలస్యానికి ప్రధాన కారణం నేనేనని చెప్పక తప్పదు. ఆర్థిక మంత్రిగా(గతంలో) నూతన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంలో విఫలమయ్యా. అప్పట్లో నేను త్వరపడి ఉంటే బాగుండేది' అని ప్రణబ్ చెప్పుకొచ్చారు. స్టార్ట్ అప్ లను ప్రోత్సహించడంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ తీరును ఆయన ప్రశంసించారు. కాగా శనివారం నాటి కార్యక్రమంలో స్టార్ట్-అప్ ఉద్యమానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా స్టార్ట్-అప్‌లో ప్రారంభించిన యువ సీఈవోలు హాజరుకానున్నారు. స్టార్ట్-అప్ వర్చువల్ ఎగ్జిబిషన్‌ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. బ్యాంక్ రుణాలతో పాటు ఇతర ప్రోత్సహాకాలను యువ పారిశ్రామికవేత్తలకు కల్పించే లక్ష్యంగా స్టార్ట్-అప్ ఉద్యమం సాగనుంది. ఈ రోజు జరిగే కార్యక్రమంలో కీలక మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లకు సంబంధించిన కార్యదర్శులతో యువ పారిశ్రామికవేత్తలు ముఖాముఖీ చర్చలు జరిగే అవకాశం ఉంది. -
విశాఖ విమానాశ్రయంలో ప్రయాణికుల పడిగాపులు
గోపాలపట్నం (విశాఖ) : ముంబై నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన ప్రయాణికులు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం అర్థరాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు. కోల్‌కతాకు వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌కు చెందిన విమానం ముంబైలో శుక్రవారం రాత్రి బయలుదేరింది. అయితే కోల్‌కతాలో వాతావరణం అనుకూలించక భువనేశ్వర్‌కు మళ్లించారు. అక్కడ దిగేందుకు వీలుకాక పోవటంతో రాత్రి 11.30 గంటలప్రాంతంలో విశాఖ విమానాశ్రయంలో ల్యాండయింది. అందులోని సుమారు 180 మంది ప్రయాణికులకు స్థానికంగా వసతి కల్పించారు. ఇప్పటికీ కోల్‌కతాలో అనుకూల వాతావరణ పరిస్థితులు లేకపోవటంతో విమానం తిరిగి బయలుదేరలేదు. దీంతో వారంతా విశాఖలోనే ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
జీఎం వస్తున్నారని రైలును ఆపేశారు
శావల్యాపురం (గుంటూరు) : దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో గుంటూరు నుంచి డోన్ వెళ్లే ప్యాసింజర్ రైలును ఆకస్మికంగా నిలిపివేశారు. దీంతో గుంటూరు జిల్లాలోని శావల్యాపురం స్టేషన్లో శుక్రవారం మధ్యాహ్నం 45 నిముషాలకు పైగా రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జీఎం రవీంద్రగుప్తా నరసారావుపేట స్టేషన్‌ను సందర్శించారు. అలాగే అచ్చంపల్లి రైల్వే గేట్‌ను పరిశీలించారు. -
నేడు ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్
సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ (12723) ఆదివారం (11వ తేదీ) ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లి స్టేషన్ నుంచి ఉదయం 6.25 కు బయలుదేరవలసిన ఈ రైలు సాంకేతిక కారణాల వల్ల మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరుతుందని పేర్కొన్నారు. -
ఏపీ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టే!
-
ఎంసెట్ కౌన్సెలింగ్ మరింత ఆలస్యం
-
దర్యాప్తు ఆలస్యానికి కారణం ముఖ్యమంత్రే
భోపాల్: 'వ్యాపం కుంభకోణాన్ని మొదట గుర్తించిందే నేను. అడ్మిషన్లు, రిక్రూట్మెంట్లలో అవకతవకలు జరిగాయని తెలిసిన వెంటనే సమగ్ర దర్యాప్తుకు ఆదేశించా' అంటూ నిన్నటివరకు చెప్పుకొచ్చిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాటలు పూర్తిగా అవాస్తవాలని తేలింది. కుంభకోణం సంగతి ఆయనకు ముందే తెలుసని, ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తుకు ఆదేశించడంలో ఆలస్యం చేశారని తాజాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2007 నుంచి 2010 మధ్యకాలంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు ఆధారాలని నాటి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, నేటి ఆప్ నేత సక్లేచా ఆదివారం మీడియాకు చెప్పారుజ 'వ్యాపం ద్వారా నిర్వహించిన ప్రీ మెడికల్ టెస్టులో అక్రమాలు చోటుచేసుకున్నాయని 2009లో అసెంబ్లీ సాక్షిగా నేను ప్రశ్నించాను. వైద్య విద్యా శాఖ కూడా ఆయన వద్దే ఉన్నందున సీఎం చౌహాన్ నా ప్రశ్నకు.. 'ఆ విషయంపై సమగ్ర సమాచారాన్ని తెప్పిస్తున్నాం' అని బదులిచ్చారు. రెండేళ్ల తర్వాత మరో సభ్యుడు కూడా సభలో ఇలాంటి ప్రశ్నే లేవనెత్తాడు. అందుకు సీఎం చౌహానే మళ్లీ సమాధానమిస్తూ 'అక్రమాలకు పాల్పడిన విద్యార్థులు ఎవరనేది గుర్తించలేకపోయాం' అని సమాధానమిచ్చారు. మరో రెండేళ్లు గడిచిన తర్వాత, అంటే 2011 నవంబర్ 29 మాత్రం సీఎం సభలో ఒక ప్రకటన చేశారు. 'మొత్తం 114 మంది విద్యార్థులు అక్రమంగా అడ్మిషన్లు పొందారు' అని. రకరకాల సందర్భాల్లో సీఎం మాటలను పరిశీలిస్తే ఆయన కావాలనే కుంభకోణం వివరాలను బయటికి రానీయకుండా అడ్డుకున్నారని అర్ధమవుతుంది. తద్వారా దర్యాప్తు ఆలస్యానికి కారణం కూడా ఆయనే' అని సక్లేచా వివరించారు. -
ఉత్తమ విలన్ ఆగిపోయింది
చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్ అభిమానులకు ఇది నిరాశే. ప్రారంభం నుంచి చిక్కులు ఎదుర్కొంటున్న ఆయన నటించిన 'ఉత్తమ విలన్' చిత్రం తాజాగా చిత్ర నిర్మాతల వల్లే మరో సమస్యలో పడింది. శుక్రవారం విడుదల కావాల్సిన ఆ చిత్రం ఆగిపోయింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదల కాకుండా నిలిచిపోయింది. చిత్ర నిర్మాతలకు ఫైనాన్షియర్లకు మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలు నెలకొని చిత్ర శుక్రవారం ఉదయం వేయాల్సిన మొదటి ఆటలు నిలిపివేశారు. మరో కొన్ని గంటల్లో వారి సమస్య చర్చల ద్వారా పరిష్కారం అయ్యే అవకాశం ఉందని, శుక్రవారం తర్వాత సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్లలో ఒకరు చెప్పారు. మరొకరు మాత్రం మ్యాట్నీకిగాని, ఫస్ట్ షోకుగానీ విడుదల చేస్తారని అన్నారు. రమేశ్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎనిమిదో శతాబ్దానికి చెందిన వ్యక్తిగా.. మోడరన్ సూపర్ స్టార్‌గా కమల్ ఈ చిత్రంలో నటించారు. -
మాస్క్ మురికిగా ఉందంటూ...
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కాక్‌పిట్‌లోని ఎమర్జెన్సీ ఆక్సిజన్ మాస్క్ శుభ్రంగా లేదని పైలెట్ విమానాన్ని నడిపేందుకు నిరాకరించాడు. దాంతో విమానం మూడు గంటల పాటు నిలిచిపోయింది. వివరాల్లోకి వెళితే దీంతో 467 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి కొచ్చికి బుధవారం ఉదయం 5.35 గంటలకి బయలుదేరాల్సి ఉంది. అయితే మాస్క్ మురికిగా ఉందంటూ ఎయిర్ ఇండియా కెప్టెన్ ...విమానాన్ని నడిపేందుకు తిరస్కరించాడు. దాంతో విమాన సిబ్బంది ఆ మాస్క్‌ను కోలిన్‌తో శుభ్రపరిచినా పైలెట్ మాత్రం తన పట్టువీడలేదు. ఇంత చిన్న కారణంగా ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టవద్దని సిబ్బంది కోరినా పైలెట్ మాత్రం తాజా మాస్క్ ఉంటేనే అని షరతు పెట్టాడు. దాంతో ప్రయాణికులు మూడు గంటలపాటు పడిగాపులు పడాల్సి వచ్చింది. ఈ సంఘటన ఇతర విమాన సర్వీసులపై కూడా ప్రభావాన్ని చూపింది. మరోవైపు దీనిపై ఎయిర్ ఇండియా ఛైర్మన్ రోహిత్ నందన్ స్పందిస్తూ ఇలాంటి సిల్లీ విషయాల కారణంగా విమానాలను ఆలస్యంగా నడిపితే సహించేది లేదని స్పష్టం చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు. -
నేడు 12 గంటలు ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ (12723) నేడు (శనివారం) 12 గంటలు ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 6.25 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు సాయంత్రం 6.45 గంటలకు వెళ్లనుంది. న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన ఏపీ ఎక్స్‌ప్రెస్ పొగమంచు కారణంగా ఆలస్యంగా నడవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. -
శంషాబాద్ నుంచి వెళ్లే విమానాలు ఆలస్యం
హైదరాబాద్: పొగమంచు ప్రభావం విమానాల రాకపోకలపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లాల్సిన విమానాలు ఆలస్యమవుతున్నాయి. ఇక్కడి నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం వెళ్లాల్సిన విమానాలు గంట నుంచి 5 గంటల వరకు ఆలస్యంగా బయల్దేరనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా ఉత్తర భారతదేశంలో పొగమంచు ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. విమానాలతో పాటు రైళ్లు ఆలస్యంగా బయల్దేరుతున్నాయి. -
పొగమంచుతో రైళ్లు ఆలస్యం
న్యూఢిల్లీ: ఉత్తరాదిన చలి, పొగమంచు తీవ్రంగా ఉంది. ఢిల్లీలో దట్టమైన పొగమంచు ఆవరించింది. దీనివల్ల రైళ్ల రాకపోకలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. 50 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 12 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఉత్తరాదిన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. -
ఢిల్లీ-జమ్మూ రైలుకు బాంబు బెదిరింపు
చండీగఢ్: జమ్మూ నుంచి ఢిల్లీ వస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టినట్టు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆదివారం రాత్రి పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వద్ద రైలును ఆపివేశారు. సైన్యం, పోలీసులు రంగంలోకి దిగి నాలుగు గంటలకు పైగా రైలును తనిఖీ చేశారు. రైలులో ఎలాంటి పేలుడు పదార్థాలూ లేవని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైలులో పేలుడు పదార్థాలున్నట్టు జమ్మూకశ్మీర్ పోలీసులకు సమాచారం వచ్చింది. వారు వెంటనే పంజాబ్ పోలీసులకు ఈ విషయాన్ని చేరవేశారు. దీంతో భదత్ర సిబ్బంది అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. అనంతరం సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో రైలు బయల్దేరింది. పఠాన్‌కోట్ పాకిస్థాన్ సరిహద్దులకు దగ్గరగా ఉండటం, ఇటీవల జమ్మూలో ఉగ్రవాద దాడులు పెరిగిన నేపథ్యంలో నిఘా పెంచారు. -
ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం వద్దు
కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్: అనంతపురం అర్బన్:విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల చెల్లింపులో జా ప్యం చేయవద్దని కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ అధికారులను ఆదేశించారు. ఆయన తన చాంబర్లో బుధవారం సంక్షేమ శాఖల అధికారులుతో సమావేశమయ్యారు. ఫీజురీయిబర్స్‌మెంట్, ఉపకార వేతనాల చెల్లింపు ప్రక్రియపై సమీక్షించారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ (2013-14 సంవత్సరం) బకాయిలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.30.28 కోట్లు నిధులను మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. గిరిజన విద్యార్థులకు నూరు శాతం చెల్లింపులు పూర్తి అయ్యాయన్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి రూ.7.5 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు రూ.16 కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖ కు రూ.678 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నట్లు సంబంధిత అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత శాఖల కమీషనర్లతో మాట్లాడారు. బకాయిలను విడుదల చేసినట్లు వారు కలెక్టరుకు తెలిపారు. డిసెంబర్ మొదటి వారం నుంచి విద్యార్థులకు బకాయిలను చెల్లించాలని సూచించారు. 2014-15 సంవత్సరాలకు రెన్యూవల్, నూతన ఉపకార వేతనాలు పొందేందుకు ఈ నెల 30లోపు తమ అడ్మిషన్ల వివరాలను విద్యార్ధులు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహిద్దీన్ తెలిపారు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన నాలుగు జతల యూనిఫాంలు, బెడ్ షీట్స్, కార్పెట్లు, నోట్ బుక్స్, వర్క్ బుక్క్‌లను, కాస్మాటిక్ చార్జీల పంపిణీని శాఖ వారీగా సమీక్షించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్. సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చక్రపాణి, మైనారిటీ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల విభజనపై కేంద్రం ఆలస్యం చేస్తోంది: దేవీప్రసాద్
హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ఉద్యోగుల విభజన విషయంలో ఆలస్యం చేస్తోందని టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ అన్నారు. ఉద్యోగుల విభజనపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని గృహకల్ప ప్రాంగణంలో తెలంగాణ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. నల్లబ్యాడ్జీలతో కమలనాథన్ కమిటీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవీప్రసాద్ మాట్లాడుతూ... రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఉద్యోగులు ఏపీ ప్రభుత్వంలో పనిచేయాల్సి రావడం బాధాకరం అన్నారు. ఉద్యోగుల విభజనపై త్వరలోనే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఉద్యోగులకు అండగా ఉంటుందన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు విఠల్,హైదరాబాదు టీఎన్జీఓ అధ్యక్షుడు ముజీబ్, తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్యాసింజర్’కు కోపమొచ్చింది
‘కాకినాడ’ రైలు ఆలస్యంపై ఆగ్రహం రెండు గంటలకుపైగా రైళ్ల నిలిపివేత గోపాలపట్నం ఆర్ఆర్ఐ పాత కేబిన్వద్ద ఆందోళన విశాఖపట్నం : రైలు ప్రయాణికులు ఆగ్రహించారు. ప్యాసింజర్ రైలంటే అంత లోకువా? టికెట్ తక్కువయినంత మాత్రాన గంటల తరబడి బండిని కదలనీయరా..అంటూ ఆగ్రహించి పట్టాల మీద బైఠాయించటంతో బుధవారం పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కాకినాడ నుంచి విశాఖ వచ్చే ప్యాసింజర్ ప్రయాణికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గంటలో గమ్యానికి చేరాల్సిన రైలు రెండు గంటల తర్వాతే చేరుతుండడంపై నిరసన వెల్లువెత్తింది. చివరకు రైల్వే పోలీసుల హెచ్చరికలతో రైళ్లు బలవంతంగా కదిలాయి. వివరాలిలా ఉన్నాయి. కాకినాడ నుంచి విశాఖకు రోజూ ప్యాసింజరు రైలు నడుస్తోంది. ఇది అనకాపల్లి వరకూ బాగానే వస్తున్నా తర్వాత నత్తనడకే. గోపాలపట్నం ఆర్ఆర్ఐ పాత కేబిన్ వద్ద గంట వరకూ నిలిచి పోతోంది. ఇలా బుధవారం కూడా జరగడంతో రైల్లో ఉన్న ప్రయాణికులు వేడెక్కిపోయారు. విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులూ, ఇతర ప్రయాణికులు రైలు దిగి పట్టాలపై బైఠాయించారు. తమ కళ్ల ముందే రైళ్లన్నీ వెళ్లి పోతున్నా ఇక్కడి రైలు మాత్రం రోజూ ఆలస్యంగానే నడుస్తోందని మండిపడ్డారు. నిరసన విరమించాలని రైల్వేభద్రతాధికారులు కోరినా ప్రయాణికుల్లో వేడి చల్లారలేదు. డీఆర్ఎం వచ్చి దీనికి సమాధానం వచ్చి చెబితే కానీ ఇక్కడి నుంచి కదిలేదని లేదని హెచ్చరించారు. దాదాపు రెండు గంటలకుపైగా వాగ్వాదాలు జరిగాయి. ఈ కారణంగా వెనుక వెళ్లవలసి ఉన్న చెన్నయ్ ఎక్స్‌ప్రెస్, తిరుమల ఎక్స్‌ప్రెస్, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ఎదురుగా వెళ్లాల్సిన యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా నిలిచిపోయింది. రైల్వే అధికారుల తీరుపై ప్రయాణికుల ఆగ్రహావేశాలు పెరగడం, పరిస్థితి తీవ్రంగా మారడంతో భద్రతాధికారులు అడుగు ముందుకేసి రైలు కూత శబ్దన్ని పెద్దగా వినిపించారు. ప్రయాణికులను చెదరగొట్టి బలవంతంగా రైలును కదిలించారు. దీంతో రైలు గం. 11.40 సమయంలో వెళ్లింది. దీంతో పాటు నిలిచిపోయిన రైళ్లన్నీ కదిలాయి. ఇక్కడ రైళ్లు హటాత్తుగా నిలిచి పోవడంతో పలువురు ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
అజిత్‌ని నిరాశ పరుస్తున్న స్వీటీ...
-
ఓటరు గుర్తింపు కార్డు జారీలో జాప్యం
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మీ సేవ ద్వారా నాలుగైదు రోజుల్లో ఓటరు గుర్తింపు కార్డు పొందవచ్చుననే ఎన్నికల అధికారుల ప్రకటనలకు, అమలు జరుగుతున్న తీరుకు పొంతన లేకపోతుందని ఓటర్లు అన్నారు. ఓటరు కార్డు కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న నాలుగైదు రోజుల్లో జారీ అవుతుందని అధికారులు ప్రచారం చేశారు. దీంతో రూ.10లు చెల్లించి మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నా 40 రోజులైనా కార్డు జారీ కాలేదని ఓటర్లు చెబుతున్నారు. ప్రధానంగా సవరణలకు సంబంధించి ఓట ర్లు కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. మీ సేవ నిర్వాహకులు హోల్గ్రామ్లకు సంబంధించిన యూసీ లు సకాలంలో అందజేయడం లేదని అధికారులు చెబుతున్నారు. హోలోగ్రామ్ లేకపోవడం వల్లే కార్డులు జారీ కావడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. కారణా లు ఏవైనా ఓటరు గుర్తింపు కార్డులు మాత్రం జారీ కావ డం లేదని ఓటర్లు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. నా పేరు మజ్జి సత్యనారాయణ. గుర్ల మండలం రాగోలు గ్రామం. ఓటరు గుర్తింపు కార్డు కోసం నవంబర్ 15వ తేదీన కోట జంక్షన్ వద్ద ఉన్న మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాను. పది రోజుల తర్వాత రావాలని నిర్వాహకుడు చెప్పారు. హోలోగ్రామ్ లేనందున మరికొన్ని రోజులు పడుతుందని అన్నారు. 35 రోజుల తర్వాత వెళ్తే దరఖాస్తు చేసి ఎక్కువ రోజులయ్యాయని, మళ్లీ చేసుకోవాల్సి ఉంటుం దని నిర్వాహకుడు చెప్పారు. దీంతో నేను నిరాశ చెందాను. నా పేరు గౌసీబేగం. మా ప్రాంతం కంటోన్మెంట్. గణేష్ కోవెల వద్ద ఉన్న మీ సేవ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాను. రెండు రోజుల తర్వాత అడిగితే ఆర్డీఓ సంతకం లేక కార్డు జారీ కాలేదని నిర్వాహకులు చెప్పారు. ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోయింది. మీ సేవ నిర్వాహకులతో సమావేశమవుతాం... ఓటరు గుర్తింపు కార్డు జారీలో జాప్యమవుతున్నట్లు ఇటీవల మా దృష్టికి వచ్చింది. నిర్వాహకులకు ఉన్న సమస్యలు కూడా మాకు తెలియడం లేదు. దీనిపై సోమవారం మీసేవ నిర్వాహకులతో సమావేశం నిర్వహిస్తాం. సమస్యలు పరిష్కరించి కార్డులు జారీకి చర్యలు తీసుకుంటాం. - చిన్నారావు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్, కలెక్టరేట్ -
కేసీఆర్ వల్లే తెలంగాణ జాప్యం
రాష్ట్రపతికి జగన్ అఫిడవిట్లు ఇవ్వడమేంటి?: మోత్కుపల్లి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటులో జాప్యానికి టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు బాధ్యత వహించాలని తెలంగాణ టీడీపీ ఫోరం నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న హామీని కేసీఆర్ ఎందుకు నిలబెట్టుకోవడంలేదని ప్రశ్నించారు. కేసీఆర్ మాట తప్పడం వల్లే రాష్ట్ర విభజన ఆలస్యమవుతోందని, శుక్రవారం ఎన్టీఆర్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. తెలంగాణవాదం ముసుగులో కేసీఆర్ సమైక్యవాదం వినిపిస్తున్నారని, ఆయన తెలంగాణ ద్రోహి అని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రకటన చేసినపుడు కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ కూడా టీఆర్ఎస్ విలీనాన్ని ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు అమ్ముకోవాలనే ఎత్తుగడలో భాగంగానే కేసీఆర్ తన పార్టీని విలీనం చేయడంలేదన్నారు. కేసీఆర్ మనసులో రాష్ర్టం సమైక్యంగా ఉండాలని, వైఎస్సార్సీపీ జగన్మోహన్రెడ్డి మదిలో వెంటనే విభజన జరగాలనే భావన ఉందన్నారు. రాష్ట్రపతిని కలిసి జగన్ అఫిడవిట్లు ఇవ్వడం ఏమిటని మోత్కుపల్లి ప్రశ్నించారు. తెలంగాణవాదుల ఆకాంక్షలకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
రుణ ఘోష!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు గాను వివిధ సహకార సంస్థలు (కార్పొరేషన్లు) ఇచ్చే రాయితీ రుణాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.సర్కారు నుంచి స్పష్టత లేకపోవడం.. అధికార యంత్రాంగం అలసత్వంతో రుణాల తీరు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకే పరిమితమవుతోంది. 2013-14 సంవత్సరానికి గాను జిల్లాలోని వివిధ సహకార సంస్థలు రాయితీ రుణాల కోసం 10,731 మందిని ఎంపిక చేశాయి. అయితే ఆర్థిక సంవత్సరం ప్రారంభమై తొమ్మిది నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు కేవలం 522 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేయడం గమనార్హం. ఎంపిక సరే.. మంజూరేదీ! రాయితీ రుణాలకు సంబంధించి మండలాలవారీగా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. రుణాలపై మండలాల్లో హడావుడి చేసిన అధికారులు చివరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. రుణాల మంజూరు మాత్రం నత్తనడకన సాగుతోంది. వాస్తవానికి రుణాల మంజూరు ప్రక్రియ ఈ పాటికే పూర్తికావాల్సి ఉంది. అయితే రాయితీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఎస్సీ కార్పొరేషన్లో రుణాల మంజూరు నిలిచిపోయింది. మిగిలిన కేటగిరీల్లో రాయితీపై స్పష్టత ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ఉదాసీనతతో ఈ తంతు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. లబ్ధిదారుల్లో కలవరం.. కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రాయితీ రుణాలతో లబ్ధిదారులు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలి. యూనిట్ ఏర్పాటుకు రుణ మొత్తం పూర్తిస్థాయిలో సరిపోనప్పటికీ.. ఇతోధిక సాయం లభిస్తుంది. ఈ మేరకు ఎంపికైన లబ్ధిదారులు రుణం వస్తుందనే ఆశతో ఇప్పటికే పలుచోట్ల యూనిట్లు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికీ రుణా ల ఊసు లేకపోవడంతో లబ్ధిదారుల్లో కలవరం మొదలైంది. ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతుండడంతో రుణం వస్తుందా.. లేదా? అనే సందేహం నెలకొంది. రాయితీపై స్పష్టత లేకే.. కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రుణాలపై లబ్ధిదారుడికి ఇవ్వాల్సిన రాయితీని ప్రభుత్వం నిర్దేశించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ కార్పొరేషన్ కింద ఇచ్చే రాయితీని ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. గతంలో ఒక్కో లబ్ధిదారుడికి గరిష్టంగా రూ.30వేలు రాయితీ ఇచ్చేది. అయితే ఈ మొత్తాన్ని పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాయితీపై సందిగ్ధం నెలకొంది. అతి త్వరలో రాయితీపై స్పష్టత వస్తుందని, ఆ వెంటనే రుణాలు మంజూరు చేస్తామని షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు పీవీఎస్ లక్ష్మి ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
దక్షిణం: కామన్‌సెన్స్‌కు మించిన సలహా లేదు!
ఆలస్యం అమృతం విషం - నిదానమే ప్రధానం... ఈ రెండు సామెతలు ఒకేసారి వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఇందులో ఏదో ఒకటి తప్పనిపిస్తుంది. కానీ...రెండూ కరెక్టే. ముందు మనిషికి ఓ కామన్ సెన్స్ అంటూ ఉంటుంది కదా... దాన్ని వాడితే ఈ రెండు సామెతల్లో ఏది ఎపుడు కరెక్టో తెలుస్తుంది. స్త్రీ విషయంలో కూడా ఇంతకుమించి ఎన్నోరెట్లు కామన్సెన్స్ పనిచేయాలి. ప్రపంచంలో అబ్బాయిలు మహా అయితే పది పదిహేను రకాలు ఉంటారు. అమ్మాయిలు... ఎంత మంది ఉంటే అన్నిరకాలుగా ఆలోచిస్తారు. ఒకరి ఆలోచనా తీరు ఉన్నట్లు ఇంకొకరి ప్రవర్తన ఉండదు. అందుకే ఏ అమ్మాయి ప్రేమలో పడినా, ఏ అమ్మాయిని ప్రేమలో పడేయాలన్నా ఆ అమ్మాయి ఆలోచనా తీరుబట్టే ఉండాలి. అమ్మాయిలు అర్థం కారురా బాబూ... అనే బెంగ అక్కర్లేదు. వారు అర్థమవుతారు. కాకపోతే ఎవరికి వారు యునిక్ కాబట్టి మీక్కావల్సిన వారిని మాత్రమే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అందరూ కొన్ని కామన్ టిప్స్ చెబుతుంటారు. అవి అన్నిసార్లూ చెల్లవు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. క్రేజీగా ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారు... ఇది అబ్బాయిలు నమ్మే ఒక కామన్ సూత్రం. ఇది కొంతవరకే నిజం! ఏ బొమ్మరిల్లు సినిమానో చూసి ప్రతి అమ్మాయి మిడ్నైట్ ఐస్‌క్రీం తినడం ఇష్టపడుతుందనుకుంటే పొరపాటు. అలానే మిగతా విషయాలూ. నిజాయితీగా ఉంటే ఇష్టం... ఎందులో నిజాయితీ అన్నది పెద్ద సమస్య. నిజాయితీగా పాత గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్న చనువునంతా చెప్పేస్తే ఏ అమ్మాయి భరించగలదు? సెన్సాఫ్ హ్యూమర్ అమ్మాయిలకు ఇష్టం... అవును, కానీ అందరికీ సెటైర్లు అర్థం చేసుకునేటంత చిలిపి మనసు ఉండదు. అవి బూమ్రాంగ్లు అవ్వొచ్చు. మీ జోకులు సులువుగా క్యాచ్ చేసేటంత షార్ప్‌నెస్ ఉంటుందనే గ్యారంటీ ఏమిటి? అది కొందరమ్మాయిలకు కిక్ ఇస్తే, ఇంకొందరు దానివల్లే మనల్ని కిక్ చేయొచ్చు! ఆ వ్యక్తిని బట్టి మోతాదుండాలి. స్టేటస్‌కు పడిపోతారు... కాస్ట్లీ బైకు, కారు అందరు అమ్మాయిలను పడగొట్టలేవు. అదేనిజమైతే ఈ ప్రపంచం ఓ నెల కూడా నడవదు. కాలం మారినా... కాలం మారింది అమ్మాయిలు ఫాస్ట్ అయిపోయారు. రొమాంటిక్‌గా మాట్లాడాల్సిందే అనుకుంటున్నారా? సినిమాలు చూసి చెడిపోకండి. అందరూ అలా మారాలంటే కనీసం ఒక రెండు మూడు తరాలు మారాలి. ఇంకా మనం మొదటి తరంలోనే ఉన్నాం. కొసమెరుపు: ఇలాంటి సూత్రాలు చాలానే ఉన్నాయి. ఎన్నున్నా ఒకటి మాత్రం కామన్‌గా పనిచేస్తుంది. ఎంత శుభ్రంగా, క్రమశిక్షణగా డ్రెస్ చేస్తారు. శరీర సౌష్టవాన్ని ఎంత చక్కగా కాపాడుకుంటారన్నది మాత్రం మగాడిలో ప్రతి అమ్మాయికీ కామన్‌గా నచ్చే అంశం. ‘ఆ ముద్దు’... చాలా పాతది ఇది 2013. కానీ... ఇప్పటికీ సినిమాలో లిప్‌కిస్ పెట్టడం ఒక వార్త. రొమాంటిజమ్లో అధిక మార్కులు కొట్టేసే ఈ చర్య పాశ్చాత్యులకే కాదు, భారతీయులకీ పాతదే అంటే నమ్ముతారా. ఎనైభె సంవత్సరాల క్రితమే ఇది భారతీయ సినిమాల్లో ఉంది. అంటే భారతీయ సినిమా పుట్టిన 20 ఏళ్లకే మన వాళ్లు లిప్‌కిస్ పరిచయం చేసేశారు. 1933లో తీసిన కర్మ సినిమాలో హిమాంశు రాయి, దేవికా రాణిల ఈ మద్య ఈ ముద్దు సీను నడిచింది. బాలీవుడ్లో ఇదే తొలి రొమాంటిక్ సీన్. సామాజిక స్వాతంత్య్రం కంటే ముందుగానే భారతీయులు రొమాంటిక్ స్వాతంత్య్రం సంపాదించేశారా? - ప్రకాష్ చిమ్మల