
సీఎం టూర్ ఆలస్యం
విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పాల్గొనాల్సిన బహిరంగ సభా వేదిక దెబ్బతిన్నది.
డెంకాడ: విజయనగరం జిల్లా డెంకాడ మండలం సింగవరంలో బుధవారం రాత్రి వచ్చిన గాలివానకు సీఎం చంద్రబాబు పాల్గొనాల్సిన బహిరంగ సభా వేదిక దెబ్బతిన్నది. దీంతో ముఖ్యమంత్రి షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకుంది. గురువారం ఉదయం 10.30 గంటలకు చంద్రబాబు నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని కొత్త చెరువును సందర్శించి తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే, బుధవారం రాత్రి వచ్చిన గాలివానకు సభావేదిక వద్ద ప్రజలు కూర్చునేందుకు వీలుగా చేసిన ఏర్పాట్లు, టెంట్లు కూలినపోయాయి. దీంతో అధికారులు తాత్కాలికంగా పునరుద్ధరణ పనులు చేపట్టారు. అధికారులు ఇచ్చిన సమాచారంతో సీఎం మధ్యాహ్నం 1 -2 గంటల తర్వాత గ్రామానికి రానున్నట్టు సమాచారం.