సాక్షి, విజయనగరం: అధికారులపై ఏసీబీ దాడులు జరగడం సహజం.. కానీ మాజీ ముఖ్యమంత్రి పీఎస్ శ్రీనివాస్ ఇంటి పై దాడులు జరగడం తన రాజకీయ జీవితంలో తొలిసారి చూశానని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐటీ సోదాలకు సమాధానం చెప్పిన తర్వాతే చంద్రబాబు యాత్ర చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి పేరుతో దోపిడీ జరిగిందని ఏడు నెలల క్రితమే గుర్తించామని.. భూ సేకరణలో అవకతవకలు జరిగాయని అప్పుడే చెప్పామని పేర్కొన్నారు. (ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి..?)
అవకతవకలపై విచారణ చేయడం కక్ష సాధింపు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తిచూపితే తప్పు అని అనడం సరికాదన్నారు. గత ప్రభుత్వంలో బీసీ మంత్రులపై టార్గెట్ అనడం హాస్యాస్పదమన్నారు. తాను బీసీ మంత్రినేనని.. గతంలో పదేళ్లు మంత్రిగా పనిచేశానని తెలిపారు. చంద్రబాబు దగ్గర ఉన్నవారే బీసీ నేతలా.. తాము కాదా అని బొత్స ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని.. తప్పుడు ఆరోపణలను ప్రజలు హర్షించరని మంత్రి బొత్స పేర్కొన్నారు.(బాలయ్య తాతా.. అఫిడవిట్‌లో హెరిటేజ్ షేర్లేవీ?)
24న వసతి దీవెన ప్రారంభం..
ఈ నెల 24న వసతి దీవెన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరంలో ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. సుమారు 50వేల మంది విద్యార్థులు జిల్లాలో లబ్ధి పొందనున్నారని వెల్లడించారు. జిల్లాలో సుమారు 58 వేల మందిని ఇళ్లు, ఇంటి స్థలాల లబ్ధిదారులుగా గుర్తించామని పేర్కొన్నారు. ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీకి అవసరమైన స్థల సేకరణ జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ బలవంత భూ సేకరణ జరగలేదని.. ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.(సీఎం జగన్ టూర్ షెడ్యూల్ ఖరారు )
పేదలందరికి ఇళ్లు ఇవ్వాలన్న లక్ష్యం తో ప్రభుత్వం ముందుకెళ్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం దగ్గర సరిపడా స్థలం ఉందని.. ఎటువంటి సమస్య లేదని చెప్పారు. ఎక్కడైనా స్థలం చాలకపోతే ప్రభుత్వం నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తోందని వివరించారు. గత టీడీపీ ప్రభుత్వంలో భూసేకరణ ఎలా జరిగిందో అందరికి తెలుసునని.. జిరాయితి కి ఒకలాగా, డి పట్టాకి మరోలా ఇచ్చి ప్రజలకు అన్యాయం చేశారని విమర్శించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకెళ్తుందని ఇందులో ఎటువంటి అనుమానం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment