vijayanagaram
-
40 ఏళ్లు దాటినా పెళ్లి కావడంలేదని...
విజయనగరం క్రైమ్: నగర శివారు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి ధర్మపురిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్సై అశోక్ శుక్రవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ధర్మపురికి చెందిన సేనాపతి ఆదిలక్ష్మి (40) కొన్నేళ్లుగా తనకు పెళ్లి కావడంలేదని కుంగిపోయింది. ఇంట్లో తనతో పాటు కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ములు 40 ఏళ్లకే అకాల మరణం చెందారు. వాళ్లకు కూడా పెళ్లికాక మనోవేదనతో అకాలమృతి కావడంతో ఆదిలక్ష్మి మనస్తాపానికి గురైంది. రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ములు లేక ముగ్గురు అన్నల్లో ఒక అన్నావదిన దగ్గర ఉంటూ అన్నయ్య పిల్లలతోనే కాలం వెళ్లదీస్తోంది. ఇంట్లో వదిన కూడా తరచూ నీకు ఇంకా పెళ్లి కాలేదని మాటలతో వేధించసాగింది. అటు బయటకూడా స్నేహితులు, చుట్టుపక్కల వారు ఆదిలక్ష్మికి ఇంకా పెళ్లి కాలేదని గుసగుసలాడుకోవడం మరింతగా కంగదీసింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అప్పుడే ఆమె వదిన హుటాహుటిన నగరంలోని మహరాజా ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించగా శుక్రవారం చనిపోయినట్లు పోలీసులు ధ్రువీకరించారు. దీంతో వదిన నుంచి ఫిర్యాదు అందుకున్న ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన నందీపుర పీఠాధిపతులు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కర్ణాటకలోని విజయనగర జిల్లా నందీపుర పీఠాధిపతులు గురువారం కలిశారు. భూమిపూజకు ఆయనను ఆహ్వానించారు. ఏప్రిల్ 30న నందీపురలో ప్రపంచంలోనే ఎత్తయిన 108 అడుగుల శ్రీఅర్ధనారీశ్వరస్వామి విగ్రహానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు.వైఎస్ జగన్‌కు పీఠాధిపతులు శ్రీ డా.మహేశ్వర స్వామీజీ (నందీపుర పుణ్యక్షేత్రం), శ్రీ ష.బ్ర. పంచాక్షరి శివాచార్య స్వామీజీ (హీరే మఠం, బెన్నిహళ్ళి), శ్రీ జడేశ్వర తాత (శక్తి పీఠం, వీరాపుర), శ్రీ కృష్ణపాద స్వామీజీ (భుజంగ నగర్, సండూర్) ఆహ్వానపత్రిక అందజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ ఎంఎల్సీ డాక్టర్ ఎ.మధుసూదన్, రామచైతన్య (ఫౌండర్, అర్ధనారీశ్వర ఫౌండేషన్), వీరేష్ ఆచార్య (కో-ఫౌండర్, అర్ధనారీశ్వర ఫౌండేషన్) పాల్గొన్నారు. -
సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బలితీసుకున్న వివాహేతర సంబంధం
విజయనగరం క్రైమ్: తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన ఇంజినీరు కోనారి ప్రసాద్ (28) హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ నెల 10న హత్యకు పాల్పడిన అన్నదమ్ములైన ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేశామన్నారు. హత్య వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, బొబ్బిలి సీఐ నారాయణరావు, తెర్లాం ఎస్ఐ సాగర్‌బాబుతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మృతుడు కోనారి ప్రసాద్‌కు నెమలాం గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్‌లను భర్త అచ్యుతరావు గమనించాడు. విషయాన్ని తమ్ముడు శివకృష్ణకు చెప్పాడు. ఇద్దరూ కలిసి ప్రసాద్‌ను అంతమొందించాలని నిర్ణయించారు. బెంగళూరులో పనిచేస్తున్న ప్రసాద్ గ్రామానికి రావడంతో హత్యపథకం అమలుచేయాలని నిశ్చయానికి వచ్చారు. ఆయనతో ముందురోజు మాట్లాడారు. విజయరాంపురంలోని అమ్మమ్మవారి ఇంటికి వెళ్తున్న విషయం, తిరిగి ఏ సమయానికి వస్తాడన్న విషయం తెలుసుకున్నారు. మాట్లాడదామని నెమలాం సమీపంలోని వారి పొలాల వద్దకు పిలిచారు. ప్రసాద్‌తో శివకృష్ణ మాట్లాడుతుండగా వెనుకనుంచి తలపై కర్రతో అచ్యుతరావు బలంగా మోదాడు. తర్వాత ఇద్దరూ కలిసి కర్రలతో దాడిచేశారు. పారిపోయే ప్రయత్నంలో ప్రసాద్ కాలుజారి పిల్లకాలువలోని రాయిపై పడిపోవడంతో అక్కడకు వెళ్లి మరోసారి దాడిచేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృత దేహాన్ని రోడ్డుపై తెచ్చి పడేశారు. అనంతరం బైక్‌ను కూడా కర్రలతో ధ్వంసం చేసి రోడ్డుపై పడేసి ఇంటికి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు తొలుత ప్రమాదంగా అనుమానించారు. ఘటనా స్థలాన్ని చూసి హత్యగా అనుమానించి దర్యాప్తు చేశారు. సీఐ నారాయణరావు ఆధ్వర్యంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు. కేసును వేగవంతంగా ఛేదించిన బొబ్బిలి డీఎస్పీ, సీఐ, తెర్లాం ఎస్ఐలను ఎస్పీ అభినందించారు. -
డయేరియా గుప్పెట్లో విజయనగరం
-
మాట ఇస్తే నిలబడే పాలన మీ జగన్ ది..
-
మేమంతా సిద్ధం: చెల్లూరు సభకు పోటెత్తిన జనసునామీ (ఫొటోలు)
-
అపర భగీరథుడు వైఎస్సార్.. కరువు పుత్రుడు చంద్రబాబు..!
-
గంటపాటు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి జలాసనాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గంట పాటు నీటిపై తేలియాడుతూ..పలు యోగాసనాలు వేసి రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి(64) అందరినీ ఆకట్టుకున్నారు. జాతీయ స్విమ్మింగ్ పూల్ డేను పురస్కరించుకుని క్రీడారంగ విశిష్టత, స్విమ్మింగ్ సాధన, యోగాసనాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడానికి విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ఆక్వా స్విమ్మింగ్ పూల్‌లో మంగళవారం ఆయన కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రదర్శనను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు ప్రారంభించారు. నిర్విఘ్నంగా గంట పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం దేశ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ ముగించారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కోలగట్లను సత్కరించారు. చదవండి: బాబు, సోనియా ఏపీకి అన్యాయం చేశారా? ఇదిగో ఇలా బయటపడింది..! -
విజయనగరం: కబడ్డీ ఆటలో యువకుడు మృతి
-
పవన్ పై విజయనగరం ఎంపీ చంద్రశేఖర్ ఫైర్
-
జగనన్న కాలనీలపై జనసేన ఓవర్ యాక్షన్ చేస్తోంది : డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
-
విజయనగరం : ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో తొక్కిసలాట
-
Extramarital Affair: భర్తకు వివాహేతర సంబంధం ఉందంటూ..
విజయనగరం క్రైమ్: భర్తకు వివాహేతర సంబంధం ఉందంటూ సీసీఎస్‌లో పనిచేస్తున్న షేక్ ఇల్తామష్ భార్య దిశ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. వివరాలి ఉన్నాయి. స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పైన ఉన్న సీసీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ షేక్ ఇల్తా మష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన అతని భార్య నసీమా ఆదివారం ఫిర్యాదు చేసిందని విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని దిశ డీఎస్పీ త్రినాథ్ వెల్లడించారు. చదవండి: ఇలా చేశావేంటి అలెగ్జాండర్.. యువతిని నమ్మించి.. మోసగించి.. మరో మహిళతో.. -
‘గృహలక్ష్మి’ సీరియల్ నా జీవితానికి టర్నింగ్ పాయింట్..
విజయనగరం టౌన్: తెలుగు చలన చిత్రసీమలో దాదాపు 30 సినిమాల్లో నటించినప్పటికీ బుల్లితెర నటుడిగానే బాగా గుర్తింపు వచ్చింది. స్టార్ మాలో వచ్చే గృహలక్ష్మి సీరియల్ ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. 69 ఏళ్ల వయసులో అలవోకగా నటిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు జిల్లాకు చెందిన బొమ్మిరెడ్డిపల్లి పేర్రాజు. ఆదివారం విజయనగరం వచ్చిన ఆయన సాక్షితో కాసేపు ముచ్చటించారు. ఆ ముచ్చట్లన్నీ ఆయన మాటల్లోనే.. జిల్లా కేంద్రంలోని కానుకుర్తివారి వీధిలో పుట్టాను. చదవండి: సినీనటుడు ఆలీ సడన్ సర్ప్రైజ్.. ఎవరికీ చెప్పకుండా.. 1969లో కోరుకొండ సైనిక్ స్కూల్ జాయినై రెండేళ్ల పాటు చదివి, అనివార్య కారణాల వల్ల మధ్యలోనే చదువు ఆపేశాను. మిత్రుడు నాలుగెస్సుల రాజుతో కలిసి మెట్రిక్యులేషన్ పూర్తిచేశాను. అనంతరం ఎంఆర్ కళాశాలలో ఇంటర్, బీకామ్ పూర్తిచేశాను. ఫ్రెండ్స్‌తో కలిసి ఢిల్లీ టూర్ వెళ్లినప్పుడు ఓ పత్రికలో వచ్చిన క్లిప్లింగ్ ఆధారంగా ఇండియన్ ఎయిర్ లైన్స్‌కు దరఖాస్తు చేయగా, ట్రాఫిక్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. 28 ఏళ్ల పాటు వివిధ ప్రాంతాల్లో పనిచేసి హిందీ, తెలుగు, పంజాబీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించాను. సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఢిల్లీ టూర్‌కి వచ్చినప్పుడు నాతో బాగా మాట్లాడేవారు. ఈ సమయంలో అల్లు అరవింద్ గారితో పరిచయం జరిగింది. వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత హైదరాబాద్‌కి వచ్చాను. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ను కలవడంతో అల్లు అర్జున్ నటించిన హ్యాపీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. తర్వాత స్టాలిన్, డాన్, హోమం, తదితర 30 చిత్రాలలో నటించాను. చిత్రసీమలో అంతగా పేరు ప్రఖ్యాతులు రాకపోవడంతో టీవీ సీరియళ్లపై దృష్టి సారించాను. ఈ సమయంలో స్టార్ మాలో ప్రసారం అయ్యే ఇంటింటి గృహలక్ష్మిలో నటించే అవకాశం వచ్చింది. ఈ సీరియల్ నా జీవితానికి ఓ టర్నింగ్ పాయింట్. ఇప్పటివరకు 26 సీరియళ్లలో నటించాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో లైఫ్ మెంబర్‌గా ఉన్నాను. -
లారీ ఎక్కిన పడవ.. ఆశ్చర్యంగా ఉందే!
సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం: సముద్ర జలాల్లో తిరగాల్సిన పడవ లారీ ఎక్కింది. ఇదేంటా... అని అంతా ఆశ్చర్యంగా చూశారు. సీన్ కట్ చేస్తే ఓ పడవను లారీపై జాతీయ రహదారి మీదుగా బిహార్ నుంచి కోల్‌కతా తరలిస్తున్నారు. ఈ లారీ నాతవలస జాతీయ రహదారిపై గురువారం ప్రయాణం చేయడంతో అటుగా వెళ్లే వారంతా ఆసక్తిగా తిలకించారు. చదవండి: మహిళ మృతదేహంపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం రెండేళ్ల కుమారుడిని గొంతు కోసి చంపిన తండ్రి -
70 ఏళ్లుగా అడవిలోనే.. కర్పూరమే ఆహారంగా
విజయనగరం: పురాణాల్లోనూ, కథల్లోనూ మునులు ఒంటరిగా అడవుల్లో తపస్సులు చేసుకుంటూ ఉంటారని విని ఉంటాం కానీ చూసిన అనుభవం లేదు. కానీ ఈ ఆధునిక యుగంలో అలాంటి వాళ్లు ఉన్నారంటే నమ్మలేం కదా! కానీ పద్మావతి అనే వృద్ధురాలిని చూస్తే నమ్మక తప్పదేమో. ఆమె ఏడు దశాబ్దాలుగా ఒంటరిగా అడవిలోనే ఉంటుంది. కర్పూరాన్ని ఆహారంగా తీసుకుంటూ దైవ చింతనలోనే గడపుతూ ఉంటుందట. ఆ వివరాలు విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పెదకాద గ్రామంలోని 85 ఏళ్ల పద్మావతి అనే వృద్ధురాలు గ్రామానికి సమీపంలోని అడవిలోనే ఏడు దశాబ్దాలుగా ఒంటరిగా జీవిస్తోంది. తనని వేంకటేశ్వర స్వామి పిలుస్తున్నారంటూ.. 12 ఏళ్ల వయసులో పద్మావతి అడవిలోకి వెళ్లి.. అక్కడే నివాసం ఏర్పరుచుకుందని స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను తీసుకురావాలని ఎంతగా ప్రయత్నించిన పద్మావతి అంగీకరించేది కాదట. తన దైవం వేంకటేశ్వర స్వామి అని.. అక్కడి నుంచి రాలేనని చెప్తూ.. కొండపై విగ్రహాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటుందని అంటున్నారు స్థానికులు. ఈ క్రమంలో చుట్టుపక్కల గ్రామస్తులంతా కలిసి ఆ కొండ పై గుడి నిర్మించామని తెలిపారు. పద్మావతి భక్తుల తెచ్చే పాలు, పళ్లు, కానుకలు ఏమి తీసుకునేది కాదని, అవన్నీ మళ్లీ తిరిగి తమకే ఇచ్చేస్తుందని స్థానికులు చెబుతున్నారు. పైగా ఆహారం ఏమి తీసుకోకుండా కేవలం భక్తులు సమర్పించే కర్పూరం, అగరబత్తుల దూపం, టీ మాత్రమే తీసుకుంటుందని తెలిపారు. పద్మావతి జీవన శైలి దేవుడు ఉన్నాడు అనేదానికి నిదర్శనంగా నిలుస్తుందంటున్నారు భక్తులు -
షణ్ముఖప్రియ మన అమ్మాయే.. ఓటేసి గెలిపించండీ ప్లీజ్!
సీతానగరం(పార్వతీపురం): సుమధుర గానంతో దేశంలోని సంగీత ప్రియులు, అభిమానులను ఉర్రూతలూగిస్తున్న గాయని, సోనీ టీవీ 12వ ఇండియన్ ఐడల్ ట్రోఫీ తుది పోటీల్లో తలపడుతున్న షణ్ముఖప్రియ మన పార్వతీపురం అమ్మాయే. ప్రాథమిక విద్యాభ్యాసంతో పాటు స్వరపదనిసలను ఇక్కడే నేర్చుకున్నారు. తన గాన మాధుర్యంతో సంగీత ప్రియులను అలరిస్తున్నారు. లిటిల్ చాంప్స్, పాడుతా తీయగా వంటి పోటీల్లో పాల్గొని ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఈ నెల 15న జరిగే ఇండియన్ ఐడల్ ట్రోఫీ ఫైనల్ పోరులో నిలిచారు. ఓటేసి గెలిపించాలంటూ ఆమెతో పాటు అభిమానులు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. స్వర పరిచయం చేసిన పార్వతీపురం షణ్ముఖ ప్రియకు పార్వతీపురం పట్టణానికి విడదీయరాని బంధం ఉంది. ఆమె తల్లి రత్నమాల పట్టణంలోని అగ్రహారం వీధిలో జన్మించారు. వీణ వాయిద్యంలో దిట్ట. రత్నమాలకు వయోలిన్ విద్వాంసులు శ్రీనివాస్ కుమార్‌తో వివాహం జరిగింది. షణ్ముఖ ప్రియ అమ్మమ్మ పార్వతీపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలో ఉపాధ్యాయిని. తల్లిదండ్రులిద్దరూ సంగీత విద్వాంసులు కావడంతో చిన్నప్పటినుంచే షణ్ముఖప్రియ సంగీతంలో ఓనమాలు దిద్ది అంచెలంచెలుగా ఎదిగారు. ఆమె కుటుంబం కొన్నాళ్లు విశాఖపట్నంలోను, ప్రస్తుతం ముంబయిలో నివసిస్తున్నట్టు ఇక్కడి వివేకానంద కాలనీవాసులు చెబుతున్నారు. మన ఊరు అమ్మాయి గెలుపునకు సోనీలివ్, ఫస్ట్క్రైడాట్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని ఓటేయవచ్చు. -
విజయనగరం: టీడీపీకి మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి రాజీనామా
-
మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలపై ఆడిట్‌కు రంగం సిద్ధం
సాక్షి, విజయనగరం: మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలపై జిల్లా ఆడిట్ అధికారి ఆధ్వర్యంలో ఆడిటింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. మాన్సాస్ కార్యాలయానికి అధికారులు సోమవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆడిట్ అధికారి హిమబిందు మీడియాతో మాట్లాడుతూ, మాన్సాస్ ఆడిట్ 2004-05 నుంచి జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఆడిట్‌కి సంబంధించిన మొత్తం రికార్డులు అడిగామని.. ప్రస్తుతానికి కొన్ని హార్డ్‌కాపీలు మాత్రమే అందజేశారని తెలిపారు. పూర్తిస్థాయి రికార్డులు ఇస్తేగానీ ఆడిట్ చేయలేమని ఆమె తెలిపారు. మిగిలిన రికార్డ్స్ కోసం మాన్సాస్ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. -
పిచ్చెక్కిన పిల్లి.. అర్ధరాత్రి వీరంగం
కొమరాడ: విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయపీట గ్రామంలో ఓ పిచ్చెక్కిన పిల్లి శనివారం అర్ధరాత్రి వీరంగం సృష్టించింది. గ్రామస్తులపై దాడి చేసి దొరికినవారినల్లా కరిచింది. పిల్లి కరవడంతో ఆర్.తవిటమ్మ, జి.లక్ష్మి, ఎం.శ్రీధర్, డి.రాములనాయుడు, ఎం.గౌరునాయుడు, ఎస్.లక్ష్మి, వలంటీర్ బి.దామోదర్‌నాయుడులు గాయపడ్డారు. వీరిని రాత్రికి రాత్రే గ్రామస్తులు 108లో చినమేరింగి సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. వీరిలో ఎం.శ్రీధర్ పరిస్థితి విషమంగా ఉండడంతో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
మరాఠా మనసు గెలిచిన తెలుగోడు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మహారాష్ట్రలో మన తెలుగు రచయిత గంటేడ గౌరునాయుడుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన రాసిన గేయం మరాఠాల మనసులను హత్తుకుంది. తొమ్మిదో తరగతి తెలుగు వాచకంలో ఆయన రాసిన ‘పాడుదమా స్వేచ్ఛాగీతం’కు అక్కడి ప్రభుత్వం మొదటి పాఠ్యాంశంగా చోటు కల్పించింది. విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన గంటేడ గౌరునాయుడు గిరిజన ఆశ్రమ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. స్థానిక అంశాలకు యాస, భాషలను జోడించి వందలాది కవితలు, కథలు, గేయాలను రాశారు. తాను పనిచేస్తున్న పాఠశాల విద్యార్థులకు ఏటా గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఆలపించేందుకు కొత్త పాటను పరిచయం చేయాలని సంకల్పించుకున్నారు. ఆ ప్రయత్నంలో ఆయన కలం నుంచి జాలువారిందే.. ‘పాడుదమా స్వేచ్ఛాగీతం.. ఎగరేయుదమా జాతిపతాకం’ అనే దేశభక్తి గేయం. ఈ గీతాన్ని ఆయన గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల కోసం 1990లో రచించారు. మూడు దశాబ్దాలుగా మార్మోగుతున్న గేయం స్వాతంత్రోద్యమ ఘటనలను, అందులోని సమరయోధులను గుర్తు చేస్తూ.. నాటి సన్నివేశాలు కళ్లముందు కదలాడుతున్నట్టుగా ఈ గేయాన్ని రాశారు. అప్పట్లో ఈ పాట విన్న అనంతపురం జిల్లా కలెక్టర్ లెనిన్‌బాబు అనే గాయకుడితో పాడించి రికార్డింగ్ చేయించారు. దీనికి ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి సూర్యనారాయణరావు వాద్య సహకారాన్ని అందించారు. అనంతరం జనవిజ్ఞానవేదిక, ప్రజానాట్యమండలి తదితర సంస్థలు, సంఘాలు ప్రారంభ గీతంగా దీన్ని వినియోగించుకున్నాయి. ఇలా గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల్లో మూడు దశాబ్దాలుగా ఈ గేయం మార్మోగుతోంది. దేశం గొప్పతనం గురించి చెప్పే గేయం మా రాష్ట్రంలోని తెలుగు వాచకంలో మీరు రాసిన ‘పాడుదమా స్వేచ్ఛాగీతం’ అనే దేశభక్తి గేయం పాఠ్యాంశంగా చేర్పించాలనుకుంటున్నాం.. ఇందుకు మీ అనుమతి కావాలంటూ మహారాష్ట్ర తెలుగు విభాగం ప్రత్యేక అధికారి తులసి భరత్ భూషణ్ అడిగేసరికి ఎంతో సంతోషం కలిగింది. దేశం గొప్పతనం గురించి చెప్పే చాలా మాటలు, కథలు, గేయాలు వచ్చాయి. కానీ, గురజాడ మాటల్లో.. దేశమంటే మట్టికాదు మనుషులు. అందుకే నా రచనలో దేశం కోసం మనుషులు చేసిన వీరోచిత పోరాటాలను భావితరాలకు అందించాలనిపించింది. ఆ దిశగా ఎన్నో కవితలు, కథలు రాశాను. అందులో పాడుదమా స్వేచ్ఛాగీతం ఒకటి. –గంటేడ గౌరునాయుడు, గేయ రచయిత చదవండి: సీఎం జగన్ నన్ను బతికిస్తున్నాడమ్మా.. ‘వృథా’కు కట్టడి: మూడంచెల వ్యూహం -
ఎమ్మెల్యే కోలగట్లకు కరోనా
విజయనగరం: విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభధ్రస్వామి కరోనా బారిన పడ్డారు. శనివారం ఆయన కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. రెండు రోజులుగా తనను కలిసిన వ్యక్తులు కూడా పరీక్షించుకోవాలని కోలగట్ల కోరారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. చదవండి: ‘గ్రామీణ వికాసం’లో ఏపీ భేష్ రికవరీలో ఏపీ బెస్ట్ -
జగనాన్న విద్యా దీవెన ద్వారా ప్రతి విద్యార్థికి లబ్ది చేకూరుతుంది
-
కరోనా బారిన పడి డీఎస్పీ మృతి
సాక్షి, విజయనగరం: కరోనా బారినపడి సీసీఎస్ డీఎస్పీ జె.పాపారావు మృతి చెందారు. విశాఖలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. శ్రీకాకుళం జిల్లా సారవకోటకు చెందిన పాపారావు.. ఎస్ఐ స్థాయి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా సిసిఎస్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 7,224 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు కోవిడ్ కారణంగా 15 మంది మృతిచెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నలుగురు మరణించారు. చదవండి: గుంటూరులో దారుణం: వృద్ధురాలిపై లైంగిక దాడి దారుణం: కామంతో కళ్లు మూసుకుపోయి.. -
విజయనగరం లో రోడ్డు ప్రమాదం
-
మావోయిస్టు పేరుతో డబ్బు డీమాండ్ చేసిన వ్యక్తి అరెస్ట్
-
ప్రకృతి సేద్యం చేస్తూ ఆదర్శంగా నిలిచిన వైఎస్సార్సీపీ ఎంపీ..
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా భూమిని పరిరక్షించుకోవడం మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ఎంతో అవసరమని విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, శ్రీదేవి దంపతులు భావిస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని నాగంపేట సమీపంలోని తమ పొలంలో గత ఏడాది నుంచి ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టారు. చెరువు నీటిని వినియోగించి ఏటా రెండు పంటలు పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (ఏపిసిఎన్‌ఎఫ్) విభాగం అధికారులు, సిబ్బంది సూచనల ప్రకారం 12 ఎకరాల్లో వరి తదితర పంటలను సాగు చేస్తున్నారు. జాతీయ వ్యవసాయ కమిటీలో సభ్యులైన ఎంపీ చంద్రశేఖర్ ప్రకృతి వ్యవసాయం చేపట్టడం విశేషం. మేలైన విత్తనాన్ని ఎంపిక చేసుకొని బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తున్నారు. భూసార వృద్ధికి నవధాన్యాలను సాగు చేసి కలియదున్నుతున్నారు. ఘనజీవామృతం వేసి లైన్ సోయింగ్ చేస్తున్నారు. ద్రవ జీవామృతం ప్రతి 15 రోజులకు ఇస్తున్నారు. ఆవు పేడ, మూత్రం ఇంగువతో తయారైన ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. వీటితోపాటు మీనామృతం, కోడుగుడ్ల ద్రావణం, పుల్లటి మజ్జిగ, సప్తధాన్యాంకుర కషాయం, బ్రహ్మాస్త్రం.. అవసరం మేరకు పిచికారీ చేయటం వంటి నియమాలు పాటిస్తూ సాగు చేస్తున్నారు. చంద్రశేఖర్ సతీమణి శ్రీదేవి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతి రైతు తోనూ ప్రకృతి వ్యవసాయం చేయించాలని ఎంపీ చంద్రశేఖర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడెకరాల్లో బ్లాక్ రైస్, రెడ్ రైస్‌తో పాటు ఐదెకరాల్లో సజ్జలు, కొర్రలు, రాగులను సాగు చేయిస్తున్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి రైతులకు తాను పండించిన విత్తనాలను అందించనున్నారు. – బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం, ఇన్పుట్స్: మరిపి సతీష్‌కుమార్, చీపురుపల్లి టీవీలో సీఎం మాటలు విని.. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం మాది. మాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకత గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతుండగా ఓ రోజు టీవీలో చూసి, అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఏపీసిఎన్ఎఫ్ అధికారుల సహకారంతో 12 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి పండించాం. 18 రకాల నవధాన్యాలను కలిపి దుక్కి దున్ని పొలంలో చల్లాం. 45 రోజులు పెరిగిన తరువాత భూమిలో కలియదున్నించాం. ఎకరాకు ఒక డ్రమ్ము ఏర్పాటు చేసి 200 లీటర్ల జీవామృతం పొలంలో చల్లిస్తున్నాం. అలాగే ఎకరాకు 12 కోడిగుడ్లు, నాలుగు రకాల నూనెలతో తయారు చేసి పిచికారీ చేయించాం. 11 రకాల ధాన్యం మూడు రోజులు నానబెట్టి మొలకలు వచ్చిన తరువాత ద్రావణాన్ని మరోసారి స్ప్రే చేయించాం. వరి పంటకు ఎలాంటి తెగుళ్లు రాలేదు. ఈ ఏడాది చిరుధాన్యాలను విత్తనాల కోసం పండిస్తున్నాం. – బెల్లాన శ్రీదేవి, ఎంపీ చంద్రశేఖర్ సతీమణి -
‘అబద్ధాలు తప్ప.. ఆయన చేసిందేమీలేదు’
సాక్షి, విజయనగరం: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అబద్ధాలు తప్ప.. అభివృద్ధి చేసిందేమీలేదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతి అంటూ చంద్రబాబు పదేపదే చెప్పారని, కానీ ఎక్కడా అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. కరోనా సమయంలో కూడా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్విరామంగా సాగాయని తెలిపారు. (చదవండి: దేవాలయాలు కూల్చిన చరిత్ర టీడీపీ, బీజేపీలది..) అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే మంచి ఆలోచనతో వైఎస్ జగన్.. మూడు రాజధానులు ఏర్పాటుకు పూనుకున్నారని తెలిపారు. చంద్రబాబు.. కోర్టుకెళ్లి ప్రజల సంక్షేమానికి అడ్డుపడుతూనే ఉంటారని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సాగుతున్నాయని, కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే అమ్మ ఒడి, ఇళ్ల పట్టాల పంపిణి వంటి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.(చదవండి: టీడీపీ దౌర్జన్యం.. కర్రలతో దాడి..) -
విజయనగరం జిల్లాలో టీడీపీకి షాక్..
సాక్షి, విజయనగరం: జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఉత్తరాంధ్ర టీడీపీలో కీలక మహిళానేతగా పేరొందిన ఆ పార్టీ జిల్లా సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి పడాల అరుణ.. పార్టీకి గుడ్‌బై చెప్పారు. రాజీనామా ప్రతాన్ని పార్టీ అధ్యక్షుడికి పంపారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పడాల అరుణ పనిచేశారు. చదవండి: పల్లెల్లో చిచ్చు: టీడీపీ నయా కుయుక్తులు.. 33 ఏళ్లుగా టీడీపీలో పనిచేసినా, పావుగా వాడుకున్నారే తప్ప.. సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఇమడలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పడాల అరుణ తెలిపారు. అటు అధిష్టానం, ఇటు జిల్లా పార్టీ పెద్దలు కనీసం ప్రాధాన్యత ఇవ్వకపోవడం, రాష్ట్ర కమిటిలలో సైతం చోటు కల్పించకపోవడం వంటి కారణాలతో తీవ్ర అసంతృప్తితో ఉన్న అరుణ.. టీడీపీకి గుడ్‌బై చెప్పారు. చదవండి: మేనిఫెస్టో పేరిట మరో మోసమా చంద్రబాబూ.. -
ఆ కోళ్లు కాసులు కురిపిస్తున్నాయి..
విజయనగరం ఫోర్ట్: అందరికీ ఉద్యో గాలు అసాధ్యం. పంట పండించాలంటే ఎంతోకొంత పొలం ఉండాలి. ఇవే వీ లేని యువతకు ఓ చక్కని ఉపాధి మార్గం పెరటికోళ్ల పెంపకం. గ్రామీణ ప్రాంత రైతులే కాదు... పట్టణాల్లోని యువతకు కూడా ఇదో ఆదాయ వనరుగా మలచుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో ఏడాది పొడవునా ఆదాయం పొందడానికి ఆస్కారం ఉండే ఈ తరహా వ్యాపకం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటి పెంపకంపై పశుసంవర్థకశాఖ జేడీ ఎం.వి.ఎ.నరసింహం పలు సూచనలు చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. (చదవండి: ప్రాధేయపడినా కనికరించలేదు..) ♦రాజశ్రీ రకానికి చెందిన కోళ్లు పెంచుకుంటే అధిక ఆదాయం వస్తోంది. ఈ కోళ్లు అధిక ఉత్పాదక శక్తి కల్గి ఉండి ఏడాదికి 160 నుంచి 180 గుడ్లు పెడతాయి. ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకుంటాయి. ♦వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. పోషణ ఖర్చు తక్కువ. సాధారణ నాటు కోళ్ల మాదిరిగానే ఉంటాయి. ♦వీటి గుడ్లు నాటు కోడి గుడ్లు కన్నా పెద్దవిగా ఉంటాయి. పుంజుల్లో ఎదుగుదల నాటుకోళ్లతో పోలిస్తే ఎక్కువగా ఉండి, అధిక బరువు కల్గి ఉంటాయి. ఇవి నాటు కోళ్లమాదిరి త్వరగా మనిషికి మచ్చిక అవుతాయి. ♦రాజశ్రీ రకానికి చెందిన కోళ్లకు పొదుగు లక్షణాలు లేకపోవడం వల్ల ఈ కోళ్ల నుంచి వచ్చే గుడ్లు నాటు కోడి కిందగానీ, ఇంక్యూబేటర్ ద్వారా గాని పొదిగించి పిల్లలు పొందవచ్చు. కోడి పిల్లల సంరక్షణ: ♦నేలపై రెండు అంగుళాల మందంలో గుండ్రంగా వరి ఊకను గానీ వేరుశనగ తొక్కును గానీ పరిచి దానిపై ఒక పొర మందంగా పేపర్లు పరచాలి. ♦దానిపై ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉండే అట్ట ముక్క లు గానీ జీఐ షీట్లు గానీ అమర్చాలి. దీనిని చిక్ గార్డ్ అంటారు. ♦7 నుంచి 8 అంగుళాల వైశాల్యం ఉండే ప్రదేశం 250 కోడి పిల్లలు ఉండేందుకు సరిపోతుంది. ♦కోడి పిల్లలకు ఉష్ణోగ్రతను అందించేందుకు ఒక గొడు గు వంటి దానిని నేలపై ఉంచి అడుగు ఎత్తులో వేలాడ దీసి దానికి ఒక కోడి పిల్లకు ఒక వాట్ చొప్పున లెక్కవేసి విద్యుత్ బల్బులు అమర్చాలి. ♦100 కోడి పిల్లలకు 100 వాట్ బల్బులు సరిపోతాయి. ♦మొదటగా పిల్లలను తెచ్చిన వెంటనే బీకాంప్లెక్స్ను కలిపిన నీటిని వేరుగా ఉంచి కోడి పిల్ల ముక్కులు దానిలో ముంచి తరువాత చిక్ గార్డ్‌లోకి వదలాలి. ♦పేపర్‌పైన నూకలాగా మరపట్టిన మొక్క జొన్నను పలుచగా చల్లాలి. మొదటి వారం అంతా 24 గంటలు బల్బు వెలుగుతూ ఉండేలా చూడాలి. రెండో వారం నుంచి ఉష్ణోగ్రత తగ్గించాలి. ♦దీనికోసం గొడుగును కొంచెం ఎత్తు పెంచడం గానీ బల్బు సామర్ధ్యం తగ్గించడం గానీ చేయాలి. ♦10వ రోజున పేపర్ తీసివేసి చిక్గార్డు సైజ్ పెంచాలి. క్రమేపీ వయస్సు పెరిగిన కొద్దీ చిక్ గార్డు వెడల్పు చేస్తూ రెండో వారం చివరిలోగాని మూడవ వారంలో పూర్తిగా తీసి వేయవచ్చు. అనంతరం చిక్ గార్డు నుంచి బయటకు తీసి స్వేచ్ఛగా మెల్లగా పెరటిలోకి అలవాటు చేయాలి. ♦పెరటి కోళ్లకు దాణా కోనాల్సిన అవసరం ఉండదు. ఇవి కీటకాలు, గింజలు లేత గడ్డి ఇంట్లో ఉండే వ్యర్ధ పదార్థాలను తిని బతుకుతాయి. ♦పెరట్లో దొరికే ఆహారాన్ని బట్టి నూకలు మొక్కజొన్న తవుడుతో తయారు చేసిన సమీకృత దాణాను కూడా కొద్దిగా అందించాలి. ♦ఈ రకానికి చెందిన కోళ్లు 6 నెలల వయస్సు వచ్చేసరికి గుడ్డు పెట్టడం మొదలు పెడుతుంది. ఈ దశలో కాంతిని అందించడం అనేది ముఖ్యమైన చర్య. దీని కోసం గృహ వసతి అవసరం. ♦ఎంత కాంతి అందించాలి అనేది కాలాలను, వాతావరణ పరిస్థితులను బట్టి మారుతుంది. శీతా కాలం అయితే రాత్రి సమయాల్లో కాంతిని నాలుగు, ఐదు గంటలు పాటు, వేసవి కాలంలో రెండునుంచి 3 గంటలపాటు సూర్యాస్తమయం తరువాత అందించాలి. -
మోకరిల్లిన స్వరం
విజయనగరం ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు కరోనా బారిన పడి కోలుకున్నారు. తన పై అధికారులు తనను తిరిగి విధులకు స్వాగతిస్తున్న సందర్భంలో జిల్లా ఎస్పీ రాజకుమారి ఔన్నత్యం మీద సొంతంగా పాట రాసి, బాణీలు సమకూర్చి, పాడి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఎస్పీ ఎదుట మోకాళ్లపై కూర్చొని నమస్కరిస్తూ కన్నీళ్లతో ఆమెను కొనియాడారు. ఊహించని ఆ అభివాదానికి ఎస్పీ..స్టేజ్ పై నుంచి అతడి వద్దకు వచ్చి ఆప్యాయంగా చేయిపట్టి పైకి లేపారు. ఆ దృశ్యాన్ని చూస్తున్న వారందరి కన్నులు చెమ్మగిల్లాయి. రాజకుమారి ఎదుట కన్నీళ్లతో పాటపాడుతున్న ఎఆర్ కానిస్టేబుల్ రాంబాబు. ఖాకీ డ్రెస్ వేసుకుంటే చట్టానికి కట్టుబడి, శాంతి భద్రతల సంరక్షణే బాధ్యతగా నడుచుకోవడం తప్ప భావోద్వేగాలకు లోనవడం ఉండదు. అయితే విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి.రాజకుమారి విధి నిర్వహణలో అధికారిగా ఉంటూనే.. సిబ్బందికి ఇంటి పెద్దలా నిలబడుతున్నారు. కష్టం వస్తే ఆదుకుంటున్నారు. ఒక ఆడపడుచుగా పోలీసు కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. అందుకు తాజా నిదర్శనమే కానిస్టేబుల్ రాంబాబు కృతజ్ఞతాభివందనం. కరోనా కాలంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర అత్యవసర విధుల్లోని వారితోపాటు.. పోలీసులు కూడా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది పోలీసులు కోవిడ్ కోరల్లో చిక్కుకుంటున్నారు. ఇళ్లలోనూ, ఆస్పత్రులలోనూ ఐసోలేషన్లోకి వెళ్లిపోయి కొన్నాళ్లపాటు కరోనాతో పోరాడి విజేతలుగా తిరిగి వస్తున్నారు. ఎస్పీ రాజకుమారి ఎదుట మోకరిల్లి నమస్కరిస్తూ పాట పాడుతున్న ఎఆర్ కానిస్టేబుల్ రాంబాబు ఆ సమయంలో వీరి విధులను కూడా ఎస్పీ రాజకుమారి నిర్వహిస్తున్నారు. రేయింబవళ్లు వారి స్థానంలో తనే రోడ్ల మీద పహారా కాస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అదే సమయంలో సిబ్బంది బాగోగులను వీడియో, టెలీకాన్ఫరెన్సుల ద్వారా నిరంతరం తెలుసుకుంటున్నారు. తగిన సూచనలు ఇస్తూ ధైర్యాన్ని నింపుతున్నారు. ఆమె అందించిన తోడ్పాటుతో, ఇచ్చిన స్ఫూర్తితో మానసిక దృఢత్వాన్ని సాధించి జిల్లాలో దాదాపు నాలుగు వందల మంది పోలీసులు కరోనానుంచి బయటపడ్డారు. వాళ్లందర్నీ సత్కరించి, నిత్యావసర సరుకులు అందించి, తిరిగి విధులకు సాదరంగా ఆహ్వానిస్తున్నారు ఎస్పీ రాజకుమారి. గతంలో ఎంతోమంది సమర్థులైన అధికారులను చూసి ఉండవచ్చు.. సిన్సియర్ ఆఫీసర్ల వద్ద పనిచేసి ఉండవచ్చు. కానీ.. ఈ కష్టకాలంలో అమ్మలా ఆదరిస్తున్న రాజకుమారి వంటి అధికారి దగ్గర పనిచేయడం తమ అదృష్టం అని విజయనగరం పోలీసులు భావిస్తున్నారు. – బోణం గణేష్, సాక్షి, విజయనగరం -
సాంబశివరాజు మృతికి సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: రాజకీయ కురువృద్ధులు, వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థించారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉంటూ, మచ్చలేని నాయకుడిగా, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడు సాంబశివరాజు అని సీఎం కొనియాడారు. ఆయన మరణం విజయనగరం జిల్లాతో పాటు, రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. పెనుమత్స సాంబశివరాజు కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. (పెనుమత్స సాంబశివరాజు కన్నుమూత) తెలుగు ప్రజలకు తీరని లోటు: ధర్మాన మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు అని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేశారని, విలువలతో నిజాయితీ గా రాజకీయాలు చేశారని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాంబశివరాజు కృషి మరువలేనిది: ఆళ్ల నాని విజయనగరం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో మంచి పేరు సంపాదించిన సాంబశివరాజు మరణం ఉత్తరాంధ్ర కే కాకుండా వైస్సార్సీపీ తీరని లోటని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. వైఎస్సార్సీపీలో క్రమశిక్షణతో పార్టీ కార్యక్రమాలు ఎంతో చిత్త శుద్ధితో నిర్వహించి.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడంలో సాంబశివరాజు చేసిన కృషి మరువలేనిదని, ఈ ఆపత్కాలంలో వారి కుటుంబానికి భగవంతుడు మనో దైర్యం కలిగించాలని ప్రార్ధిస్తున్నట్టు ఆళ్ల నాని పేర్కొన్నారు. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు.. పశ్చిమగోదావరి: వైఎస్సార్సీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు మృతి పట్ల గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు సంతాపం తెలిపారు. సాంబశివరాజు మరణం తనను వ్యక్తిగతంగా తీవ్రంగా బాధించిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాంబశివరాజు నీతి నిజాయితీ కలిగి విలువలతో రాజకీయాలు నెరపిన మచ్చలేని తొలితరం రాజకీయ నాయకుడని పేర్కొన్నారు. ఏనాడు పదవుల కోసం, అధికారం కోసం పాకులాడిన వ్యక్తి కాదని, దాన ధర్మాలతో ఉన్న ఆస్తులు కరిగించుకున్న ధర్మాత్ముడని శ్రీరంగనాథ రాజు అన్నారు. గురుతుల్యులను కోల్పోయా... పెనుమత్స సాంబశివరాజు మృతి పట్ల పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని, ఎందరికో ఆదర్శప్రాయులైన సాంబశివరాజు లేని లోటు ఎవరూ తీర్చలేనిదని, ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆయన అడుగుజాడల్లో పని చేసి ఎన్నో విషయాలను నేర్చుకున్నామని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. అభివృద్ధిలో చెరగని ముద్ర.. మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మృతిపై మంత్రి అవంతి శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లోనే కాదు అభివృద్ధిలో కూడా సాంబశివరాజు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెన్నంటి నిలిచి వారి ఆశయ సాధన కోసం చివరి వరకు పనిచేసిన సాంబశివరాజు లేని లోటు పార్టీకి తీర్చలేనిదన్నారు. -
అనుమానం చిన్నారి ప్రాణాన్ని చిదిమేసింది..
డెంకాడ(విజయనగరం జిల్లా): ఆలుమగలు మధ్య తలెత్తిన అనుమానం చిన్నారి ప్రాణాన్ని చిదిమేసింది. తల్లిదండ్రులను హంతుకులుగా మార్చింది. భర్త అనుమానాన్ని భరించలేక చిన్నారిని నేలబావిలో పడేసిన దురదృష్టకర ఘటన మండలంలోని డి.తాళ్లవలస గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి భోగాపురం ఇన్చార్జి సీఐ లక్ష్మణరావు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డి.తాళ్లవలస గ్రామానికి చెందిన బంక శ్రీనుకు, పూసపాటిరేగ మండలం వెంపడాం గ్రామానికి చెందిన మహాలక్ష్మికి తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఆరు, నాలుగు సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహమైన కొంతకాలం తర్వాత భార్యాభర్తల దాంపత్య జీవితంపై అనుమానాలు చోటుచేసుకున్నాయి. పెద్దకుమార్తె పుట్టిన కొన్నాళ్లకు భార్యభర్తలు ఇద్దరికి హెచ్ఐవీ పాజిటివ్ వచ్చింది. ఈ గొడవలు నేపథ్యంలోనే రెండో కుమార్తె రమ్య (4) జన్మించింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మరింత పెరిగాయి. దీంతో కొంతకాలంగా మహాలక్ష్మి తన కన్నవారి ఇంటి వద్దే ఇద్దరు కుమార్తెలతో ఉంటోంది. అయితే, మహాలక్ష్మి తండ్రి ఈ మధ్య కాలంలో మరణించడంతో అత్తవారి ఇంటిలో అడుగుపెట్టేందుకు డి.తాళ్లవలసకు ఇద్దరు కుమార్తెలతో పాటు వచ్చింది. మళ్లీ భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తడంతో ఆదివారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో మహాలక్ష్మి తన రెండవ కుమార్తె రమ్యను గ్రామ సమీపంలో ఉన్న నేల బావిలో పడేసింది. అటువైపుగా వెళ్లిన వారు బావిలో తేలుతున్న చిన్నారి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. భర్త తన రెండవ కుమార్తె రమ్యపై ఉన్న అనుమానపు వేధింపులు భరించలేకే బావిలో పడేసినట్టు మహాలక్ష్మి పోలీసులకు వివరణ ఇచ్చింది. చిన్నారి మృతదేహాన్ని స్థానికుల సహాయంతో పోలీసులు బావిలో నుంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఘటనా ప్రదేశాన్ని విజయనగరం డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి, భోగాపురం ఇన్చార్జి సీఐ లక్ష్మణరావు, డెంకాడ, భోగాపురం ఎస్ఐలు సాగర్ బాబు, మహేష్, ఏఎస్ఐ ఎం.రాంబాబు పరిశీలించారు. నిందితుల నుంచి వివరాలు సేకరించారు. -
గ్రీన్ నేషనల్ హైవేస్ కారిడార్‌గా రాజమండ్రి–విజయనగరం ఎన్‌హెచ్
సాక్షి, అమరావతి: రాజమండ్రి–విజయనగరం జాతీయ రహదారి (516–ఈ)ని గ్రీన్ నేషనల్ హైవేస్ కారిడార్‌గా భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) గుర్తించింది. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి పునరావాస పునర్నిర్మాణ (ఆర్ అండ్ ఆర్) పనులకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సామాజిక ప్రభావ అంచనా సర్వే (సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వే) ఇటీవలే పూర్తయింది. ఆర్ అండ్ ఆర్కు మొత్తం రూ.210 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా. రాజమండ్రి–విజయనగరం జాతీయ రహదారిని ఏజెన్సీ ప్రాంతాల మీదుగా నిర్మించాలని ఎన్హెచ్ఏఐ ఈ ప్రాజెక్టును హరిత కారిడార్ ప్రాజెక్టుగా ప్రకటించింది. గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ప్రాజెక్టులుగా దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్) 782 కి.మీ. హరిత కారిడార్లను అభివృద్ధి చేయనుంది. ఇందులో ఏపీకి సంబంధించి 209 కి.మీ. వరకు తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో రెండు వరుసల రహదారిని నిర్మించనున్నారు. మూడు ప్యాకేజీల కింద ఈ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. మొదటి దశ కింద రెండు స్ట్రెచ్‌లలో రహదారి నిర్మాణానికి త్వరలో టెండర్లు ఖరారు చేయనున్నారు. మార్చి నెలాఖరున టెండర్లు ఖరారు కావాల్సి ఉండగా, కోవిడ్–19 నేపథ్యంలో కేంద్రం ఈ ప్రక్రియను వాయిదా వేసింది. రహదారి నిర్మాణానికి మొత్తం రూ.1,550 కోట్లు ► 209 కి.మీ. మేర రహదారి నిర్మాణానికి 190 హెక్టార్ల మేర భూమి అవసరం అవుతుంది. రహదారి నిర్మాణానికి రూ.1,550 కోట్ల వరకు ఖర్చవుతుంది. ► కొయ్యూరు–పాడేరు (133 కి.మీ.), పాడేరు–అరకు (49 కి.మీ.), బౌదార–విజయనగరం (27 కి.మీ.) మూడు స్ట్రెచ్‌లుగా నిర్మాణం చేపడతారు. ► ఈ ఇంటర్ స్టేట్ హైవే నిర్మాణం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలైన లంబసింగి, పాడేరు, కేడీ పేట, అరకు ప్రాంతాల మీదుగా సాగుతుంది. ► సామాజిక ప్రభావ అంచనా సర్వే పూర్తి చేసిన ఎన్హెచ్ఏఐ గ్రీవియన్స్ రీడర్స్ కమిటీ (జీఆర్సీ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ► బౌదార–విజయనగరం, పాడేరు–అరకు రెండు ప్యాకేజీలకు సంబంధించి 80 కి.మీ. రోడ్డు నిర్మాణానికి త్వరలోనే టెండర్లను ఖరారు చేయనున్నారు. -
‘ఈ జిల్లాల్లోనే పిడుగులు పడే అవకాశం ఉధృతం’
సాక్షి, విజయవాడ: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం అధికంగా ఉందని శుక్రవారం రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చిరించారు. ఉపరితల ద్రోణి కారణంగా నేటి నంచి కురిసే వర్షాలకు శ్రీకాకుళం: సీతంపేట, కొత్తూరు, పాలకొండ, బుర్జ, రేగిడి ఆమదాలవలస, సరుబుజ్జిలి, లక్ష్మీనర్సుపేట, హీరామండలం, వంగర, వీరఘట్టం విజయనగరం జిల్లా: కురుపాం, గరుగుబిల్లి, బలిజిపేట, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, పాచిపెంట, వేపాడ, సీతానగరాలు. విశాఖ జిల్లా: హుకుంపేట,అనంతగిరి, అరకులోయ మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని చెప్పారు. కావునా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపురులు చెట్లకింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూండా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని కమీషనర్ సూచించారు. (తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి) -
కష్టకాలంలో పేదలకు వైఎస్సార్సీపీ అండ
-
కరోనా నివారణకు ప్రజలంతా సహకరించాలి
-
సీఎం జగన్ భగవంతుడితో సమానం: విద్యార్థి
సాక్షి, విజయనగరం: ‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆరో తరగతి విద్యార్థి అభిమన్యు ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. విజయనగరంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అభిమన్యు మాట్లాడుతూ.. విద్యా విధానంలో సంస్కరణలు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భగవంతుడితో సమానమని అన్నాడు. పేదల కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్‌కు విద్యార్థులు, తల్లిదండ్రుల తరఫున ధన్యవాదాలు తెలపడం గౌరవంగా భావిస్తున్నానంటూ ఇంగ్లీష్‌లో ప్రసంగించాడు. ‘‘మాట తప్పను... మడమ తిప్పనని పాదయాత్రలో హామీ ఇచ్చారు. అధికారంలోని వచ్చిన తర్వాత ఆ మాటలను అక్షరసత్యం చేశారు. అమ్మఒడి పథకం తీసుకువచ్చారు. అర్హురాలైన ప్రతీ తల్లికి రూ. 15 వేలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తల్లులు ఎంత అదృష్టవంతులు. ఇక జగనన్న గోరుముద్ద పథకం.. ఒక అమృతభాండం. ఎంతో రుచికరమైన భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు. ఎన్నో వరాలు కురిపిస్తున్నారు. సీఎం జగన్ ఆకాంక్షలను విద్యార్థులు నెరవేరుస్తారని నేను మాట ఇస్తున్నా. నేను బాగా చదివి ఐఏఎస్ అవుతాను. సీఎం జగన్ విష్ణు భగవానుడి స్వరూపం’’అని జెడ్సీహెచ్‌ఎస్ విద్యార్థి అభిమన్యు పేర్కొన్నాడు. ఈ క్రమంలో తన ప్రసంగంతో ఆకట్టుకున్న అభిమన్యును సీఎం జగన్ దగ్గరకు తీసుకుని ఆశీర్వదించారు. చదువుల విప్లవం సృష్టిస్తాం: సీఎం జగన్ -
దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం
-
మాట తప్పని దేవుడు మా జగనన్న
-
నిరుపేదల జీవితాలలో మార్పు రావాలి..
-
విజయనగరం చేరుకున్న సీఎం
-
విజయనగరం చేరుకున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయనగరం చేరుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్న ఆయనకు మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. నేడు ‘జగనన్న వసతి దీవెన’ పథకానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలకు చేరుకున్న సీఎం జగన్ అక్కడ నుంచి విజయనగరం అయోధ్య మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కొద్దిసేపట్లో ‘వైఎస్సార్ జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించి.. బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అక్కడ నుంచి పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్స్‌కు చేరుకుని ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. -
డిప్యూటీ సీఎంపై అసభ్యకర పోస్టు..వ్యక్తి అరెస్టు
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది జూన్‌లో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఫేస్బుక్లో అసభ్యకర పోస్టులు పెట్టాడు. దీనిపై గత అక్టోబర్‌లో ఎల్విన్‌మెంట్ పీఎస్‌లో మంత్రి ఫిర్యాదు చేశారు. పుష్ప శ్రీవాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బెంగుళూరులలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. -
డిప్యూటీ సీఎంపై అభ్యంతరకర పోస్టులు వ్యక్తి అరెస్ట్
-
నా జీవితంలో తొలిసారి చూశా..!
సాక్షి, విజయనగరం: అధికారులపై ఏసీబీ దాడులు జరగడం సహజం.. కానీ మాజీ ముఖ్యమంత్రి పీఎస్ శ్రీనివాస్ ఇంటి పై దాడులు జరగడం తన రాజకీయ జీవితంలో తొలిసారి చూశానని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐటీ సోదాలకు సమాధానం చెప్పిన తర్వాతే చంద్రబాబు యాత్ర చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి పేరుతో దోపిడీ జరిగిందని ఏడు నెలల క్రితమే గుర్తించామని.. భూ సేకరణలో అవకతవకలు జరిగాయని అప్పుడే చెప్పామని పేర్కొన్నారు. (ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి..?) అవకతవకలపై విచారణ చేయడం కక్ష సాధింపు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తిచూపితే తప్పు అని అనడం సరికాదన్నారు. గత ప్రభుత్వంలో బీసీ మంత్రులపై టార్గెట్ అనడం హాస్యాస్పదమన్నారు. తాను బీసీ మంత్రినేనని.. గతంలో పదేళ్లు మంత్రిగా పనిచేశానని తెలిపారు. చంద్రబాబు దగ్గర ఉన్నవారే బీసీ నేతలా.. తాము కాదా అని బొత్స ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని.. తప్పుడు ఆరోపణలను ప్రజలు హర్షించరని మంత్రి బొత్స పేర్కొన్నారు.(బాలయ్య తాతా.. అఫిడవిట్లో హెరిటేజ్ షేర్లేవీ?) 24న వసతి దీవెన ప్రారంభం.. ఈ నెల 24న వసతి దీవెన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరంలో ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. సుమారు 50వేల మంది విద్యార్థులు జిల్లాలో లబ్ధి పొందనున్నారని వెల్లడించారు. జిల్లాలో సుమారు 58 వేల మందిని ఇళ్లు, ఇంటి స్థలాల లబ్ధిదారులుగా గుర్తించామని పేర్కొన్నారు. ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీకి అవసరమైన స్థల సేకరణ జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ బలవంత భూ సేకరణ జరగలేదని.. ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.(సీఎం జగన్ టూర్ షెడ్యూల్ ఖరారు ) పేదలందరికి ఇళ్లు ఇవ్వాలన్న లక్ష్యం తో ప్రభుత్వం ముందుకెళ్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం దగ్గర సరిపడా స్థలం ఉందని.. ఎటువంటి సమస్య లేదని చెప్పారు. ఎక్కడైనా స్థలం చాలకపోతే ప్రభుత్వం నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తోందని వివరించారు. గత టీడీపీ ప్రభుత్వంలో భూసేకరణ ఎలా జరిగిందో అందరికి తెలుసునని.. జిరాయితి కి ఒకలాగా, డి పట్టాకి మరోలా ఇచ్చి ప్రజలకు అన్యాయం చేశారని విమర్శించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకెళ్తుందని ఇందులో ఎటువంటి అనుమానం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. -
వాడల్లోకి వచ్చిన.. రాజుగారి అమ్మాయి
విజయనగరం, పూసపాటి రాజవంశం అమ్మాయి సంచయిత. గ్రామగ్రామం తిరుగుతోంది. ‘‘ఆడపిల్లల్ని బడికి పంపించండి’’ అని తల్లుల్ని కోరుతోంది. ఆడపిల్లల బాల్యాన్ని, చదువును నీళ్లు మోయడం కోసం బలి చేయవద్దని వేడుకుంటోంది. ‘‘నీళ్లు లేకపోవడం వల్లనే.. కేవలం నీళ్లు మోయడానికే ఆడపిల్లల్ని బడి మాన్పిస్తున్నట్లయితే... ఆ నీళ్లేదో నేనే ఇస్తాను’’ అంటోంది.. అనడమే కాదు స్కూళ్లలో సోలార్ పలకలు అమర్చి, నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ వేసవిలో మరికొన్నింటిని చేయబోతోంది. ఇదంతా ఆడపిల్లల్ని చదివించడానికే. ‘‘బడికి వచ్చి చదువుకోండి. ఇంటికి వెళ్లేటప్పుడు ఈ క్యాన్ నిండా మంచినీటిని మీ ఇంటికి పట్టుకువెళ్లండి’’ అని ఐదు లీటర్ల నీటి క్యాన్లను అమ్మాయిల చేతికి ఇస్తున్నారు సంచయిత. రాజు గారమ్మాయి తమ వాడల్లోకి వచ్చి ఇంత ఆపేక్షగా చెబుతుంటే ఏ తల్లిదండ్రులు మాత్రం అమ్మాయిల్ని బడికి పంపించకుండా ఉండగలరు? ఆమె చూపించిన ఆత్మీయతే ఆడపిల్లల్లో అక్షరాస్యత పెంచాలన్న ఆమె పనిని సులువుగా మార్చేస్తోంది. ప్యాలెస్‌లో పుట్టినా..! ‘‘నేను ప్యాలెస్‌లో పెరగలేదు, ప్రజల మధ్య పెరిగాను. మా తాత విజయరామ గజపతి రాజుగారు అభ్యుదయవాది. ఆడపిల్లలు చదువుకోవాలని, ప్రజాజీవితంలో క్రియాశీలకంగా ఉండాలని చెప్పేవారు. నా చదువంతా ఢిల్లీలోనే సాగింది. మా అమ్మ లోక్‌సభ సభ్యురాలిగా (రాణి ఉమాగజపతిరాజు) ఉన్నప్పుడు నేను చాలా చిన్నదాన్ని. ఓ సారి నా స్కూల్‌కి నెల రోజులు సెలవు పెట్టించి మరీ తనతోపాటు గ్రామాలన్నీ తిప్పి చూపించింది. ప్యాలెస్‌కి పరిమితం కాకుండా ప్రజా జీవితంలోకి వచ్చి పని చేయాలని అమ్మ చెప్పేది’’ అని చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు సంచయిత. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ ఆనర్స్, తర్వాత లా కోర్సు చేసి ఢిల్లీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు సంచయిత. లాయర్‌గా ప్రాక్టీస్ చేయడం ఆమెకంటూ ఒక ఉపాధి కోసం మాత్రమే. చుట్టుపక్కల గ్రామాల్లో బాలికల విద్య కోసం పని చేయడం ఆమెకో సంతృప్తి. ‘ఆస్తులు వస్తుంటాయి, పోతుంటాయి. మనం చదువుకున్న చదువు మనతోపాటే ఉంటుంది. చదువుతోపాటు వచ్చిన జ్ఞానం మనల్ని నడిపిస్తుంది’ అనేవారు అమ్మ. ఆ మాటలనే నేను పని చేస్తున్న విశాఖ జిల్లాలో అమ్మాయిలకు చెప్తున్నాను’’ అన్నారు సంచయిత. మహిళల సహకారం ‘‘ఇంట్లో ఇల్లాలు సౌకర్యంగా ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. సామాన్య కుటుంబాల్లో అమ్మాయిల చదువు కోసం ఏం చేయాలి? ఎలా మొదలు పెట్టాలి? అనే ప్రశ్న నాలో మొదలైంది. విశాఖ జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్లి నా ఆలోచనను చెప్పాను. జిల్లా విద్యాధికారి, మండల అభివృద్ధి అధికారుల ద్వారా స్కూళ్ల వివరాలు, గ్రామాలలో మౌలిక వసతుల లేమి పట్ల స్పష్టత వచ్చింది. మహిళలు సర్పంచ్‌గా ఉన్న గ్రామాలను ఎంపిక చేసుకుని వాళ్లను స్వయంగా కలిశాను. వాళ్ల మాటల్లో కూడా మంచి నీళ్లే మొదటి ప్రాధాన్యంలో ఉన్నాయి. మంచినీటి కోసం నేను ఏర్పాటు చేయాలనుకున్న పనులకు వాళ్ల సహకారం తీసుకున్నాను. వాటర్ ప్లాంట్లు, సోలార్ ప్యానల్స్, ఎనర్జీ జనరేషన్ ఎక్విప్మెంట్ వంటి వాటిని ఏర్పాటు చేయగలిగాను. ఆ గ్రామాల్లోనే ఉన్న మహిళలకు యంత్రాల నిర్వహణ పనులు నేర్పిస్తే నేర్చుకోగలిగిన వాళ్లకు శిక్షణనిచ్చి సోలార్ ప్లాంట్, వాటర్ ప్లాంట్ నిర్వహణ బాధ్యత అప్పగించాం. ‘ఒక పనిని బాధ్యతగా చేయడానికి ఆడ–మగ అనే తేడా ఉండదు. అవకాశం వస్తే ప్రతి ఒక్కరూ చేయగలరు’ అని నిరూపించాలనేదే నా ఆశయం. పైగా ఆడవాళ్లయితేనే ప్లాంటును తమ ఇంటిని ఉంచుకున్నంత శుభ్రంగా ఉంచుతారు. అందుకే ఆడవాళ్లనే నియమించమని చెబుతుంటాను’’ అని తెలిపారు ఆమె. ఒక న్యాయవాది దృష్టి సామాజిక స్థితిగతుల మీదకు మళ్లితే సమాజానికి న్యాయం జరుగుతుంది. అదే సామాజిక న్యాయం. స్త్రీ–పురుషుల మధ్య వివక్షను రూపుమాపడానికి ఉద్యమించి విజయం సాధిస్తే అదే సమన్యాయం. సంచయిత శ్రమ... సామాజిక న్యాయం, సమన్యాయ సాధన కోసమే. విశాఖ అమ్మాయినే ‘‘విజయనగరంలో పుట్టాను. అమ్మమ్మ గారిల్లు మద్రాసు (చెన్నై)తో అనుబంధం పెంచుకున్నాను. అమ్మ సొంతూరు కేరళలోని పాల్ఘాట్. కానీ వాళ్ల కుటుంబం మద్రాసులో సెటిల్ అయింది. అమ్మ చదువు కూడా మద్రాసులోనే, స్టెల్లా మారిస్ స్టూడెంట్ ఆమె. ఢిల్లీలో ఉంటున్నాం. ఇన్ని ప్రాంతాలు, ఇన్ని రాష్ట్రాలతో మమేకమై సాగుతున్న నా జీవితంలో ప్రథమ స్థానం మాత్రం విశాఖదే’’ అన్నారు సంచయిత. చురుకైన కొత్త తరం నేను దత్తత తీసుకున్న స్కూళ్లలో అమ్మాయిలతో మాట్లాడుతూ ‘పెద్దయిన తర్వాత నువ్వు ఏమవుతావు’ అని అడుగుతుంటాను. ఒకమ్మాయి ‘సోలార్ ఇంజనీర్ అవుతా’ అని చెప్పింది. అది విని నాకు చాలా ముచ్చటేసింది. ఇంజనీరింగ్ అంటే అది అబ్బాయిల కోర్సు అనే అపోహ తొలగిపోయినందుకు రిలీఫ్ కలిగింది. అమ్మతో పాటు పాతిక–ముప్పయ్ ఏళ్ల కిందట చూసిన పరిస్థితులు గ్రామాల్లో ఇప్పుడు లేవు. ఎనిమిదేళ్ల కిందట నేను సన (సోషల్ అవేర్నెస్ న్యూయర్ ఆల్టర్నేటివ్స్) సంస్థ నిర్వహకురాలిగా గ్రామాల్లో అడుగుపెట్టినప్పుడు కూడా మహిళల్లో ఈ మాత్రపు చొరవను చూడలేదు. – సంచయితా గజపతి రాజు ఇప్పటికి ఇరవై గ్రామాలు సంచయిత.. 2013లో గూగుల్ గ్లోబల్ ఇంపాక్ట్ చాలెంజ్ అవార్డు అందుకున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం రంగాల్లో విశిష్ట సేవలందించిన సంస్థకు ఇచ్చే అవార్డు ఇది. ఆ అవార్డుతో వచ్చిన మూడు కోట్ల నగదు తన కార్యాచరణకు ఉపయోగపడుతోందని చెప్పారామె. మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణ, రెన్యూవబుల్ ఎనర్జీ, వ్యవసాయ రంగాల మీద ప్రత్యేక దృష్టి పెట్టిన సంచయిత ఇప్పటివరకు ఇరవై గ్రామాలు, మరో ఇరవైకి పైగా స్కూళ్లలో మంచినీరు, పారిశుద్ధ్య వసతులు కల్పించారు. ‘సన సూర్య సుజల ధార, హరిత బయో టాయిలెట్స్’ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్టణం జిల్లాలోని చినగందిల మండలం, పరదేశిపాలెంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్, గాజువాక మండలం నెలిముక్కులో ఉన్న సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో నిర్మించిన ప్లాంట్లను మార్చి మొదటి వారంలో విద్యార్థినులకు అంకితం చేస్తున్నారు. – వాకా మంజులారెడ్డి -
మద్య నిషేధానికి ప్రజలు సహకరించాలి: లక్ష్మణ్‌రెడ్డి
సాక్షి, విజయనగరం: మద్యానికి ప్రజలను దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆంధ్రప్రదేశ్ మద్యం విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి. లక్ష్మణ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంచెల వారికి మద్యం నిషేధం జరుగుతుందని తెలిపారు. ఇక 20 శాతం మద్యం తగ్గుదలతో ఎన్నో కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు. మద్యం నిషేధానికి వాలంటీర్ల బాధ్యత కూడా ఉందన్నారు. మద్యరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడానికి ముఖమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా ఎన్ని చేసిన పక్క రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి, గంజాయి అక్రమ రవాణాలు జరుగుతున్నాయన్నారు. ఇక అక్రమ రవాణాను సమర్ధవంతంగా అడ్డుకునేందుకు పోలీసు, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని లక్ష్మణరెడ్డి అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు, రవాణాలు వంటి కార్యకలాపాలు జరిగితే.. ఫీర్యాదు చేసేందుకు 14500 టోల్ ఫ్రీ నెంబర్ ఎర్పాటు చేశామన్నారు. ఇతర దేశాల మాదిరి హార్డ్ డ్రిక్స్ కాకుండా సాఫ్ట్ డ్రింక్స్ తాగేలా ప్రోత్సహించి మధ్య నిషేధం అమలుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. వ్యసనపరులకు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఐదు ముస్లిం దేశాలు ఇప్పటికే సంపూర్ణ మద్య నిషేదాన్ని అమలుచేస్తున్నాయని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా మద్యం నిషేధానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. -
స్పందించిన హృదయాలు!
సాక్షి ప్రతినిధి విజయనగరం: సమస్యలు విన్నవించేందుకు ‘స్పందన’ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించడంతో పాటు కనీస సౌకర్యాలు సమకూర్చాలన్న ముఖ్యమంత్రి జగన్ సూచనలను అనుసరిస్తూ ఒకడుగు ముందుకు వేసి దాదాపు 300 మంది ఆర్జీదారులకు విజయనగరం కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ ప్రతి సోమవారం భోజనం సమకూరుస్తున్నారు. రూ.50 విలువ చేసే భోజనాన్ని రూ.10కే అందజేయడాన్ని 2018 అక్టోబర్ 6న కలెక్టరేట్లో ప్రారంభించారు. జిల్లా అధికారులే చందాలు వేసుకుని ఈ సబ్సిడీ ఖర్చును భరిస్తుండటం గమనార్హం. కలెక్టర్ ఇంటి ఆవరణలో పండించిన కూరగాయలనే వంట కోసం వినియోగిస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని చూసి స్థానికులు తమ పుట్టినరోజు, పెళ్లిరోజు సందర్భంగా కొంత దానంగా ఇస్తున్నారు. ఫలితంగా ఇప్పటివరకు దాదాపు 15 వేల మందికి భోజన సదుపాయం కల్పించగలిగారు. తాజాగా వికలాంగులకు పది రూపాయలు కూడా తీసుకోకుండా ఉచితంగానే భోజనం అందిస్తున్నారు. విజయనగరం కలెక్టరేట్ క్యాంటీన్ వద్ద పేదలకు రూ.10కే భోజనం అందిస్తామంటూ ఏర్పాటు చేసిన బ్యానర్ కష్టం తీరుస్తామనే నమ్మకం కలిగించాలి.. ‘కష్టం వచ్చిందని ఎవరైనా మన వద్దకు వస్తే.. ఆ కష్టం నుంచి వారికి విముక్తి కలుగుతుందనే నమ్మకాన్ని మనం కలిగించాలి. బాధల్లో ఉంటూ మన సాయం కోసం వచ్చిన వారిని గౌరవించాలి’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేసిన సూచనలకు అనుగుణంగా ‘స్పందన’ మొదలైంది. ఈ కార్యక్రమానికి విజయనగరం జిల్లాలో సుమారు 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వస్తున్నారు. వీరంతా నిరుపేదలు. వారివద్ద చార్జీలకు కూడా సరిపడా డబ్బులుండవు. వీరి కష్టాలు స్వయంగా చూసిన కలెక్టర్‌తోపాటు అధికారులంతా ఆలోచించారు. అప్పుడు ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఓ అధికారి తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా పేదల భోజనం కోసం రూ.10 వేలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలా సాయం చేసేందుకు అంతా ముందుకొచ్చారు. వీరితో స్థానికులు చేయి కలిపారు. ఉచిత భోజనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో నామమాత్రంగా రూ.10 చొప్పున తీసుకోవాలని నిర్ణయించారు. కలెక్టరేట్లో క్యాంటీన్ నిర్వాహకులకు వంట చెరకు, తాగునీరు ఉచితంగా అందించే ఏర్పాటు చేశారు. ఆ మెట్లపై మరెవరూ దిగాలుగా కూర్చోలేదు.. ‘ఓ రోజు మధ్యాహ్నం.. భోజనం చేద్దామని వెళ్తుంటే మెట్లమీద నిస్సహాయంగా కూర్చున్న పెద్దాయనను చూశా. చాలా నీరసంగా కనిపించాడు. పలకరిస్తే తనది కొమరాడ మండలమని చెప్పాడు. చాలా ఆకలిగా ఉన్నా భోజనం చేస్తే ప్రయాణానికి డబ్బులు ఉండవని చెప్పడంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ ఘటన వేలాది మంది పేదల ఆకలి తీర్చేందుకు కారణమైంది. ఇక ఆ తర్వాత ఆ మెట్లపై మరెవరూ దిగాలుగా కూర్చోలేదు. ఆ పెద్దాయనలా ఇంకెవరూ ఆకలితో బాధపడలేదు’ – డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ (విజయనగరం జిల్లా కలెక్టర్) -
రాజమహేంద్రవరం – విజయనగరం వయా ఏజెన్సీ
సాక్షి, అమరావతి: రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు ఏజెన్సీ ప్రాంతం మీదుగా జాతీయ రహదారి 516 –ఇ నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు) సిద్ధమయ్యాయి. 2017లోనే ఈ రహదారి నిర్మాణానికి కేంద్రం అనుమతిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే డీపీఆర్‌లు పూర్తి చేయాలని కేంద్రం గతంలో సూచించినా.. అప్పటి ప్రభుత్వం పెడచెవినే పెట్టింది. వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేంద్రం తాజాగా సంప్రదించగా, డీపీఆర్‌లు వెంటనే తయారు చేయాలని ఆదేశాలిచ్చారు. దాంతో డీపీఆర్‌లు సిద్ధమయ్యాయి. కేంద్రానికి పంపి త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నట్లు ఎన్హెచ్ఏఐ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపాదిత రహదారికి మొత్తం ఆరు ప్యాకేజీలుగా డీపీఆర్‌లు తయారు చేశారు. రాజమండ్రి–రంపచోడవరం, రంపచోడవరం–కొయ్యూరు, కొయ్యూరు–లంబసింగి, లంబసింగి–పాడేరు, పాడేరు–అరకు, అరకు నుంచి గౌడార్ మీదుగా శృంగవరపుకోట, విజయనగరం వరకు ఆరు ప్యాకేజీలుగా డీపీఆర్‌లు తయారు చేశారు. మొత్తం 406 కిలోమీటర్ల మేర రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుంది. అధిక శాతం ఘాట్ రోడ్... ఈ మార్గంలో అధిక భాగం కొండ దారి నిర్మించాలి. ప్రస్తుతం ఉన్న ఆర్అండ్బీ రహదారి అధ్వాన్నంగా ఉంది. రాజమండ్రి నుంచి విజయనగరం వరకు ఎన్‌హెచ్–16 (చెన్నై–కోల్‌కతా) వయా తుని, అన్నవరం, అనకాపల్లి మీదుగా 227 కిలోమీటర్ల వరకు పొడవు ఉంది. ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ నిర్మించే కొత్త జాతీయ రహదారి 516– ఇ పొడవు 406 కిలోమీటర్లకు పైనే. దూరం ఎక్కువైనా పర్యాటకంగా, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధితో పాటు మావోయిస్టుల ప్రాబల్యం తగ్గించేందుకు కేంద్రం ఈ జాతీయ రహదారి చేపట్టినట్లు ఎన్హెచ్ఏఐ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ ప్రాంతం నుంచి భద్రాచలం మీదుగా వచ్చే వారికీ ఇది వెసులుబాటుగా ఉంటుంది. నిర్మాణానికి రూ.4 వేల కోట్లు... 516 జాతీయ రహదారి నిర్మాణానికి రూ.4 వేల కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా. రెండు వరుసల రహదారి కావడంతో కిలోమీటరుకు రూ.10 కోట్లు వరకు ఖర్చు అవుతుంది. డీపీఆర్‌లు ఆమోదం పొందితే వచ్చే ఏడాదిలో ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులు మొదలవుతాయి. -
విజయనగరం ఉత్సవాలకు సన్నద్ధం
సాక్షి, విజయనగరం: విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల వెబ్సైట్, పోస్టర్, కరపత్రాలను గురువారం జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఆవిష్కరించారు. ఉత్సవ నిర్వహణ, కార్యక్రమాల వివరాలు, ఫోటో గ్యాలరీను వెబ్సైట్లో పొందిపర్చారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల అధికారులకు కూడా పోస్టర్లు పంపించి ఉత్సవ విశిష్టత గురించి ప్రజలకు తెలిసేలా చర్యలు చేపడుతున్నారు. ఉత్సవాల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. తోలేళ్లు ఉత్సవం రోజున రూ.100, సిరిమానోత్సవం రోజున రూ.300గా టిక్కెట్ ధరలు నిర్ణయించారు. విజయనగర ఉత్సవాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరుకూ మూడు రోజల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. -
జేసీ కుమారుడు సర్కార్ బడికి..
సాక్షి, విజయనగరం: కుటుంబ పోషణ కోసం రోజం తా కష్టపడే కూలీ సైతం తమ పిల్లలను కార్పొరేట్ పాఠశాలల్లో చదివించాలని తపన పడుతున్న రోజులివి. వాటికి భిన్నంగా.. ప్రభుత్వ విద్యపై నమ్మకం కలిగించేలా.. తన తోటి అధికార యంత్రాంగానికి ఆదర్శంగా నిలిచేలా జేసీ–2 కూర్మనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఒక్కగానొక్క కుమారుడు ఆర్.త్రివిక్రమ్‌ను విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తోన్న కస్పా ఉన్నత పాఠశాలలో 9వ తరగతిలో సోమవారం ఉదయం చేర్పిం చారు. హెచ్ఎం శంకరరావు నుంచి ప్రవేశ ధ్రువీ కరణపత్రం తీసుకున్నారు. అనంతరం స్వయం గా తనే తరగతి గదికి కుమారుడిని తీసుకెళ్లి సహ విద్యార్థుల మధ్య కూర్చోబెట్టారు. ప్రభుత్వ విద్యపై నమ్మకం పెంచేందుకే... రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తోంది.. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వి నియోగం చేసుకునేలా అవగాహన కల్పించేందుకు తన కొడుకుని ప్రభుత్వ బడిలో చేర్పించినట్టు జేసీ–2 కూర్మనాథ్ వెల్లడించారు. విద్యార్థి చిన్నతనం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలన్నీ ప్రభుత్వ బడులలో అందుబాటులో ఉంటాయన్నారు. తద్వారా ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేవలం చదువులోనే కాకుండా శారీరక దారుఢ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, సమాజం పట్ల అవగాహన ప్రభుత్వ పాఠశాలల్లో సాధ్యపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల కోసం మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేయడంతో పాటు అమ్మఒడి పథకం అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఉపకార వేతనాలు అందజేస్తోందని తెలిపారు. వీటి కోసం బడ్జెట్లో అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తోందని చెప్పారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వబడుల్లో చక్కగా బోధించే ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థులు చదువుకునే వాతావరణం ఇంటివద్ద కల్పిస్తే చాలన్నారు. -
సీపీఎస్ రద్దుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: బొత్స
సాక్షి, విజయనగరం: అవినీతి రహితపాలనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దీనికి అందరూ సహకరించాలని, తమది స్నేహపూర్వక ప్రభుత్వమని పేర్కొన్నారు. మంగళవారం విజయనగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనతో భ్రష్టుపట్టిన వ్యవస్థలను తిరిగి కాపాడాలని వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. చట్టబద్దంగా, రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేస్తున్నామన్నారు. ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం అందరికి జవాబుదారీగా పనిచేయాలని బొత్స అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఉద్యోగులంతా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, ఉద్యోగుల యోగక్షేమాలను ప్రభుత్వం తప్పక చూస్తుందన్నారు. గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. దానిలో భాగంగానే పెద్ద ఎత్తున నియామకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఉన్నతాధికారులతో చర్చించి అన్ని వర్గాలవారికి న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు. కొందరు ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. వీటిని ఎవ్వరూ నమ్మొద్దని కోరారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్నవారిని తొలగిస్తున్నామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. ఎవ్వరినీ తొలగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని.. ఇది ముఖ్యమంత్రి తమందరితో చెప్పిన మాటని మంత్రి స్పష్టం చేశారు. -
ఈకేవైసీ మరింత ఈజీ...
ప్రభుత్వం అందించే రేషన్ పారదర్శకంగా అందాలంటే... సరకులు పక్కదారి పట్టకుండా ఉండాలంటే... ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరగాలంటే... ఈకేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) తప్పనిసరి. వచ్చే నెల నుంచి రేషన్ పంపిణీలో వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నందున వాటిని నమోదు చేసుకోవడం అనివార్యమైంది. దీనికోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రేషన్‌దుకాణాల్లో మరో నాలుగురోజులపాటు నమోదు చేయించుకునేందుకు అవకాశం కల్పించారు. విజయనగరం గంటస్తంభం: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు రాయితీపై సరుకులు సరఫరా చేసున్న విషయం తెలిసిందే. లబ్ధిదారులు రేషన్‌డిపోలో బయోమెట్రిక్ వేసి సరుకులు తీసుకుంటున్నా రు. ఇకపై ఇంటింటికి సరుకులు సరఫరా చేయాలని... అంతేగాకుండా నాణ్యమైన బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో సరుకులు అత్యంత పారదర్శకంగా పేదల కు సరఫరా చేసేందుకు ప్రతి లబ్ధి దారుడి వేలిముద్రలను ఈకేవైసీ ద్వా రా సేకరిస్తున్నారు. గతంలో ప్రజా సాధికార సర్వే సమయంలో ఈకేవైసీ చేశారు. కానీ అప్పట్లో కుటుంబంలో అందరూ వేలిముద్రలు నమోదు చేయించుకోలేదు. ఇప్పుడు వారందరూ నమోదు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామం, పురపాలక వార్డులో రేషన్‌డిపోల్లో ఈకేవైసీ కార్యక్రమం చేపట్టారు. డీలర్ వద్ద ఉన్న ఈపాస్ యంత్రంలో నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అయినా లబ్ధిదారులు ఎవరూ ముందుకు రావడం లేదు. జిల్లాలో ఒకటో తేదీ నాటికి 1,65,880మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉండగా.. ఇంకా సుమారు లక్షమంది అవకాశాన్ని వినియోగించుకోలేదు. డీలర్ల వద్ద నమోదుకు అవకాశం.. వాస్తవానికి డీలర్ల వద్ద 16వ తేదీ నుంచి ఈకేవైసీ నమోదు చేయించుకునే వీలుండదు. వారు రేషన్ సరుకులు ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే ఇస్తారు. 16వ తేదీన ఈపాస్ యంత్రాన్ని అధికారులు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈకేవైసీ ముఖ్యమని «భావించిన అధికారులు రేషన్ డీలర్ల వద్ద ఈపాస్ యంత్రాల్లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇప్పటికైనా లబ్ధిదారులు సద్వినియోగించుకోవాలనీ.. లేకుంటే సెప్టెంబరు నెలలో సరఫరా చేసే రేషన్ నిలుపుదల చేసే అవకాశం ఉందనీ అధికారులు చెబుతున్నారు. నాలుగైదు రోజులు పని చేస్తాయి.. రేషన్‌డీలర్లు ఈపాస్ యంత్రాల్లో ఈకేవైసీ నమోదుకు వీలుగా అవకాశం కల్పిం చాం. దానిని లబ్ధిదారులు సద్వినియోగించుకోవాలి. ఈ అవకాశం నాలుగైదు రోజులు మాత్రమే ఉంటుంది. లబ్ధిదారులు వెంటనే స్పందించాలి. – ఎ.పాపారావు, డీఎస్వో, విజయనగరం -
108 అడుగుల స్తంభంపై జాతీయ జెండా
విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లాకు గుర్తింపులా 108 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. 20 అడుగులు వెడల్పు, 30 అడుగులు పొడవు ఉన్న ఈ జెండాను కలెక్టర్ హరిజవహర్‌లాల్ గురువారం ఆవిష్కరించారు. ఎయిర్‌పోర్టులు, మరికొన్ని ప్రధాన నగరాల్లో కనిపించే పొడవైన స్తంభాలపై జాతీయ జెండాను తొలిసారిగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని కలెక్టరు నిర్ణయించారు. ప్రభుత్వ అనుమతి లభించడంతో రూ.12.50 లక్షలు వ్యయం చేసి 108 అడుగులు పొడువు ఉండే స్తంభాన్ని ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో గ్యాలవైజ్డ్ ఇనుముతో తయారు చేయించారు. బుధవారం ఆ స్తంభాన్ని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను గురువారం కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టాన్ని గురువారం ఆవిష్కరించడం సంతోషమన్నారు. గుంటూరు తర్వాత విజయనగరంలోనే ఇంత పెద్ద జెండా స్తంభాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జెండా ఆవిష్కరించిన కలెక్టర్.. 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను కలెక్టర్ హరిజవహర్‌లాల్ ఆవిష్కరించారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన తర్వాత వందనం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పేదరికాన్ని నిర్మూలించేందుకు, అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహకరించాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. మహాత్మగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థతో సాకారం అవుతుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఇన్చార్జి జేసీ–2 సాల్మన్‌రాజ్, డీఆర్వో వెంకటరావు, విజయనగరం ఆర్డీఓ జెవి.మురళి, ఇతరులు పాల్గొన్నారు. రక్షాబంధన్ వేడుకలు.. రక్షాబంధన్ సందర్భంగా కలెక్టరేట్లో వేడుకలు నిర్వహించారు. కలెక్టర్‌కు పలువురు మహిళలు రాఖీ కట్టి సోదర భావాన్ని తెలిపారు. ఆయనతో పాటు పలువురు అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
విజయనగరంలో పర్యటించిన మంతి బొత్స
-
నిండు గర్బిణిని డోలీలో తీసుకెళ్లారు!
సాక్షి, విజయనగరం: గర్బిణికి పురిటినొప్పులు రావడంతో ఆమెను డోలీపై ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ దయనీయ సంఘటన వీ.మాడుగుల మండలం శంకరం పంచాయతీ కొత్తవలసలో ఆదివారం చోటుచేసుకుంది. కొత్తవలస గ్రామానికి చెందిన గర్బిణీ జనపరెడ్డి దేవీకి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కానీ ఆ గ్రామంలో రోడ్డు సదుపాయం లేకపోవడంతో బంధువులు 15 కిలోమీటర్లు డోలీలో తీసుకెళ్లి కేజేపురం ఆసుపత్రికి చేర్పించారు. అక్కడ ఆమె ఆడపిల్లను ప్రసవించింది. కాగా సరైన సమయానికి ఆసుపత్రికి చేరుకోవడంతో తల్లీబిడ్డలిద్దరికీ ప్రమాదం తప్పింది. కొత్తవలస నుంచి శంకరం వరకు రోడ్డు సదుపాయం లేదు. దీంతో గిరిజనులు అత్యవసర సమయాల్లో డోలీని ఆశ్రయించక తప్పని పరిస్థితి. ఎవరికైన ఆపద వస్తే వారి బంధువులే డోలీ కట్టి, అందులో వారిని కూర్చుండబెట్టి కిలోమీటర్లు నడక సాగించి ఆసుపత్రికి చేరుస్తున్నారు. కొన్నిసార్లు అత్యవసర వైద్యం అందక దారి మధ్యలోనే మృత్యువాత పడ్డ సంఘటనలు ఉన్నాయి. కాగా అక్కడి గిరిజనులు రోడ్డు సదుపాయం కల్పించాలని అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాలేదు. -
విషాదం : కన్న తండ్రి కళ్లెదుటే..
అల్లారుముద్దుగా పెంచుతున్న తన కుమార్తెలను విద్యాలయాల్లో చేర్పించేందుకు బయలుదేరిన ఆ తండ్రిని విధి వెక్కిరించింది. తన కుమార్తెలిద్దరినీ ఆయా విద్యాలయాల్లో చేర్పించి సంతోషంతో ఇంటి ముఖం పట్టిన ఆ తండ్రికి తీరని వేదనే మిగిల్చింది. తనతోనే బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ కుమార్తెను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు మింగేసింది. కళ్ల ముందే కన్నబిడ్డ మృత్యు ఒడిలోకి వెళ్లిపోవడంతో గుండెలవిసేలా ఆ తండ్రి, తోబుట్టువులైన చెల్లి, తమ్ముడు కన్నీరుమున్నీరయ్యారు. అంతవరకు కలిసి తమతోనే ప్రయాణించిన రమ్యను మృత్యువు తీసుకుపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సాక్షి, విజయనగరం : రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక దుర్మరణం పాలైంది. మెంటాడ మండలం రాబంద గ్రామానికి చెందిన 12 సంవత్సరాల బాలిక కూనిశెట్టి రమ్య శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే...మెంటాడ మండలం రాబంద గ్రామానికి చెందిన కూనిశెట్టి అప్పలరాజు తన ఇద్దరు కుమార్తెలను మరుపల్లిలో ఉన్న ఆదర్శ పాఠశాల, కస్తూర్బా పాఠశాలలో చేర్పించేందుకు తన ద్విచక్ర వాహనంపై శుక్రవారం బయలుదేరాడు. పనులు ముగించుకొని తిరిగి తన స్వగ్రామం రాబందకు తిరుగు పయనమయ్యాడు. ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు చైతన్యను కూడా తన వాహనంపై తీసుకొని బయలుదేరాడు. మార్గంలో మరుపల్లి వోలమ్ కంపెనీ మలుపు వద్ద వారి వెనుక నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెద్దమ్మాయి రమ్య అక్కడికక్కడే మృతి చెందింది. బైక్‌ను ఢీకొన్నది ఒడిశా లారీ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన తరువాత లారీ ఆగకుండా వెళ్లిపోవడంతో ఏ వాహనం అన్నది చెప్పలేకపోతున్నారు. తండ్రి అప్పలరాజు, రెండో కుమార్తె రేష్మ, కుమారుడు చైతన్యకు గాయాలయ్యాయి. రమ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సంఘటనా స్థలానికి గజపతినగరం, మానాపురం ఎస్ఐలు సన్యాసినాయుడు, రమేష్ చేరుకొని వివరాలు సేకరించారు. వోలం కంపెనీ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. అయినా వాహనం వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం సీహెచ్‌సీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్
-
ప్రేయసి చున్నీతోనే ఉరి
కంప్యూటర్ కోచింగ్ కేంద్రంలో ప్రారంభమైన పరిచయాన్ని ప్రేమగా మార్చాలనుకున్నాడు. మనద్దిరం ప్రేమించుకుందామని...భవిష్యత్‌లో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. ప్రేమించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించాడు. వయసులో తనకంటే చిన్నవాడివని అది కుదిరే పని కాదని ఆ యువతి పదే పదే నచ్చచెబుతూ వచ్చింది. ఇంతలో ఆ యువతికి పెద్దలు పెళ్లి సంబంధం కుదిర్చారు. తనకు పెళ్లి కుదిరిందని ఆ పెళ్లికి తాను అంగీకారం కూడా తెలిపానని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఓసారి మాట్లాడాలని పిలిచి, పెద్దలు కుదిర్చిన పెళ్లి రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లినే చేసుకుంటానని ఆ యవతి స్పష్టం చేయడంతో ఆ యువకుడు కాస్త దూరం వెళ్లి ఆమె మెడలో ఉన్న చున్నీతో చెట్టుకు ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భయబ్రాంతులకు లోనైన యువతి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఏం చేయాలో తెలియక మృతదేహం వద్ద ఒంటరిగానే కూర్చుని రోదించింది. దీంతో చుట్టు పక్కల పంట పొలాల్లో పనులు చేస్తున్న రైతులు, కూలీలు అక్కడకు వచ్చి ఆమెను వారించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ సంఘటన పట్టణంలోని రైల్వేస్టేషన్ దాటి ఆరుఖానాలు సమీపంలో శుక్రవారం ఉదయం 11 గంటలు సమయంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... చీపురుపల్లి: మెరకముడిదాం మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన గొర్లె ప్రవీణ్(17) అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి చీపురుపల్లిలోని ఓ కంప్యూటర్ కోచింగ్ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. అక్కడ దాదాపు ఆరు నెలలు క్రితం వారికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చాలని ప్రవీణ్ ప్రయత్నించాడు. అయితే ఆ యువతి కంటే ప్రవీణ్ ఏడాది వయస్సులో చిన్న కావడంతో ఆమె అంగీకరించలేదని తెలుస్తోంది. అయినప్పటికీ వెంటపడి ఎట్టి పరిస్థితుల్లో తన ప్రేమను అంగీకరించాలని కోరినట్టు చెబుతున్నారు. ఇంతలో ఆ యువతికి ఇంట్లో పెద్దలు వివాహం కుదిర్చారు. దీంతో ఆమె కూడా పెళ్లికి సిద్ధమైంది. విషయం తెలుసుకున్న ప్రవీణ్ ఆ పెళ్లి రద్దు చేసుకోవాలని కోరుతున్నా ఆమె పట్టించుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేస్తూ వచ్చింది. మాట్లాడేందుకు రమ్మని.... ఇదిలా ఉండగా చీపురుపల్లి శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద మాట్లాడుకుందాం రమ్మని ప్రవీణ్ ఆ యువతిని పిలిచినట్టు తెలిసింది. అయితే ఆ యువతి వెళ్లిన సమయానికి ప్రవీణ్ అక్కడ లేకపోవడంతో అమ్మవారిని దర్శించుకుని తిరిగి ఆ యువతి వెనుదిరిగింది. ఆ తరువాత వచ్చిన ప్రవీణ్ తాను వచ్చానని రమ్మని ఫోన్లో పిలిచాడు. దీంతో ఆ యువతి వెళ్లగా అమ్మవారి ఆలయం నుంచి పొలాలు గుండా ఆరుఖానాలు వైపు నడుచుకుంటూ వచ్చి పెద్దలు కుదిర్చిన పెళ్లి రద్దు చేసుకోవాలని మరోసారి కోరాడు. అలా కుదరదని ఆ యువతి నచ్చజెప్పింది. దీనికి మనస్తాపం చెందాడు. కాలకృత్యాలు తీర్చుకుని వస్తానని అక్కడే కూర్చోమని, ఎండగా ఉంది చున్నీ ఇవ్వాలని అడిగాడు. దీంతో ఆమె చున్నీ పట్టుకుని వెళ్లి చాలా సేపు తరువాత ఫోన్ చేసి ఇదే ఆఖరి మాట గుడ్‌బై అని ఫోన్ పెట్టేసాడు. దీంతో ఆ యువతి పరుగులు తీసి వెళ్లగా అక్కడ ఓ చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ యవతి కన్నీరు మున్నీరుగా విలపించింది. దర్యాప్తు చేస్తాం.... మెరకముడిదాం మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన గొర్లె ప్రవీణ్ అనే యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం అందింది. వెంటనే సిబ్బందిని పంపించాం. అప్పటికే యువతి అక్కడ రోదిస్తూ ఉంది. దర్యాప్తు చేస్తున్నాం. ఆ యువతి వాంగ్మూలం కూడా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. – ఐ.దుర్గాప్రసాద్, ఎస్ఐ, చీపురుపల్లి -
టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
సాక్షి, విజయనగరం: ఎన్నికలకు ముందే అధికార టీడీపీకి భారీ షాక్ తగిలింది. విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జనార్ధన్ ధాట్రాజ్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. నామినేషన్ల పరిశీలన సందర్భంగా టీడీపీ అభ్యర్ధి అఫిడివిట్లో దాఖలు చేసిన కుల ధ్రువీకరణ పత్రంపై ప్రత్యర్థి అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జనార్ధన్ ధాట్రాజ్ ఎస్టీ కాదని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కాంగ్రెస్, బీజేపీకి చెందిన అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీనిని పరిశీలించిన అధికారి విశ్వేశ్వరరావు.. జనార్ధన్ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు భారీ షాక్‌కు గురైయ్యారు. కాగా నామినేషన్ పేపర్లలో తప్పిదం కారణంగా తీవ్ర ఉత్కంఠ అనంతరం నారా లోకేష్ నామినేషన్‌ను అధికారులు ఆమోదించిన విషయం తెలిసిందే. -
అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయాలని చూస్తున్నారు
-
ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న ఒడిశా యువకులు
-
296వ రోజు ప్రజాసంకల్పయాత్ర
-
జనసందోహంగా వైఎస్ జగన్ పాదయాత్ర
సాక్షి, విజయనగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసకల్పయాత్ర సాలూరు నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతోంది. హత్యయత్నం నుంచి తృటిలో బయటపడిన వైఎస్ జగన్‌ను చూడాలని ఆడపడుచులు, వృద్దులు, పిల్లలు పెద్ద ఎత్తున కదలివస్తున్నారు. దీంతో పాదయాత్ర జనసందోహంగా మారింది. జగన్‌తో నడిచి తన కష్టలను ఆయనతో పంచుకుంటున్నారు. ఆయనకు దేవుడి దీవెనలు ఉండాలని, ఎన్ని అవరోధాలు వచ్చిన తాము అండగా ఉన్నామనే భరోసాను జగన్‌కు ఇస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం తరువాత సాలూరు నియోజకర్గంలో పాదయాత్ర ముగించుకుని పార్వతీపురం నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. పింఛన్లు రావడం లేదు.. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం మంజూరు చేయడం లేదని కొయ్యనపేటకు చెందిన మహిళ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి తిరిగినా అధికారుల్లో స్పందన ఏమాత్రం లేదని తెలిపారు. తమ గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం కూడా లేకపోవడంతో గ్రామంలోని పిల్లలు ఇంటి వద్దనే ఉంటున్నారని కొయ్యనపేటకు చెందిన గ్రామస్తులు జగన్‌కు వివరించారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్‌ను మక్కువ మండలం తూరుమామిడి గ్రామస్తులు కలిశారు. ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లో ఉన్న తమ గ్రామానికి ఏళ్ల తరబడి అడిగినా కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేక పోయారని గ్రామస్థులు జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని మక్కువ ప్రభుత్వం జూనియర్ కళాశాల విద్యార్ధినులు జగన్‌కు వినతి పత్రం సమర్పించారు. -
296వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, విజయనగరం : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 296వ రోజు ప్రారంభమైంది. సాలూరు నియోజకవర్గం కొయ్యనపేట నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. కంచేడువలస క్రాస్, వెంకటభైరిపురం, బగ్గందొర వలస గెడలుప్పి జంక్షన్ మీదుగా తామరఖండి వరకు నేడు సాగనుంది. ఇప్పటి వరకు వైఎస్ జగన్ 3,218.3 కి.మీ నడిచారు. -
పలుచోట్ల దీపావళి వేడుకల్లో అపశృతి
-
దీపావళి పండుగలో తీవ్ర విషాదం
సాక్షి, విజయనగరం : దీపావళి పండుగ పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సరదాగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకుందామనుకున్న వారికి అవే టపాసులు తీవ్ర నిరుత్సాహానికి గురి చేశాయి. టపాసులు పేలడంతో పలు చోట్ల ఇళ్లు దగ్ధమవ్వగా, మరికొన్ని చోట్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం జిల్లాలోని జొన్న పలసలో దీపావళి సందర్భంగా టపాసులు పడి నిప్పంటుకుని నాలుగు తాటాకు ఇళ్లు మంటలకు ఆహూతి అయ్యాయి. మంటలు తీవ్రంగా వ్యాప్తిచే అవకాశం ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఎగసిపడుతున్న భారీ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 15మందికి తీవ్ర గాయాలు.. హైదరాబాద్ నగరంలో దీపావళి పండుగ వేడుకలో పలుచోట్ల అపశృతి చోటుచేసుకుంది. టపాసులు కాలుస్తూ ప్రమాదానికి గురైనవారిని సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నగరంలోని సరోజినిదేవి ఆసుపత్రికి ఇప్పటివరకు 15మంది బాధితులు చేరుకున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి మరింత విషమంగా ఉండగా.. ఇద్దరికి కంటిచూపు పూర్తిగా పోయే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఆటోలో వెళ్తున్న 65 ఏళ్ల మైసమ్మకు రాకెట్ తగలడంతో కంటి వద్ద తీవ్ర గాయమైంది. మరికొన్ని చోట్ల టపాసులు పేలడంతో షాపులు కూడా పూర్తిగా కాలిపోయ్యాయి. -
అంత అబద్ధం ఎలా రాశారు?
విజయనగరం సంస్కృత కళాశాలలో వినాయక నవరాత్రులు కళాశాల ప్రిన్సిపాల్ మానాప్రగడ శేషశాయి ఘనంగా జరిపించేవారు. ప్రతి సాయంత్రం ముందు ఒక సాహిత్య ప్రసంగం, తరువాత ఒక సంగీత కార్యక్రమం ఉండేది. ఆ రెండు రంగాల్లో మేటి ఘనాపాఠీలందరూ మా కళ్ళకు, వీనులకు విందు చేసేవారు. అప్పటి ఆ కళాశాల విద్యార్థిగా ఒక మరచిపోలేని సంఘటన. 1972లో ఒకనాటి ప్రసంగంలో ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి తన ఉద్యోగ జీవితంలోని ఒక సంఘటన వివరించారు. ఆయన గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కళాశాలలో పనిచేస్తున్నప్పుడు, ఒక ఆదివారం తన ఇంటికి కొంతమంది విద్యార్థినులు వచ్చారట. వారిని వరండాలో ఉన్న కుర్చీలలో కూర్చోమని, ఇంట్లోకి పోయి, మంచినీరు తెచ్చి ఇస్తుండేసరికి ఆ అమ్మాయిలు ‘‘మాస్టారూ! మీరు రాసిన ఉదయశ్రీ పుస్తకంలో ‘కూర్చుండ మాయింట కుర్చీలు లేవు’ అని ఓ పద్యం రాశారు కదా! ఇక్కడ ఇన్ని కుర్చీలు ఉండగా అక్కడ అంత అబద్ధం ఎలా రాయగలిగారండీ?’ అని ప్రశ్నించారట. అనుకోని ఆ ప్రశ్నకు అవాక్కయిన కరుణశ్రీ ‘‘ఇవన్నీ మీలాంటి అతిథులు కూర్చోడానికి తగిన కుర్చీలు. నేనా పద్యం సకలలోక పాలకుడైన భగవంతుని గూర్చి రాసినది. ఆయన కూర్చోడానికి తగిన కుర్చీ నేనెక్కడి నుండి తేగలను? అందుకే అలా రాయవలసి వచ్చింది’’ అని తిరిగి బదులిచ్చారట. ఆ మాటలకు మేము ఆశ్చర్యానికీ, ఆనందానికీ గురయ్యాం. గార రంగనాథం -
వైఎస్ జగన్‌ను కలిసిన ఆర్టీసీ యూనియన్ సభ్యులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన లాయర్లు
-
ముగిసిస 289వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర
-
వైఎస్ జగన్‌ను కలిసిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు
-
వైఎస్ జగన్ హామీలపట్ల హర్షం వ్యక్తం చేస్తున్న పలు కులవృత్తుల ప్రజలు
-
151వ జీవో అమలు చేయాలని 104ఉద్యోగులు విజ్ఞప్తి
-
వైఎస్ జగన్‌ను కలిసిన యాదవులు
-
286వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, గజపతి నగరం : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 286వ రోజు షెడ్యూల్ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. సోమవారం ఉదయం జననేత గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలంలోని నైట్‌క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి చౌదంతి వలస, బొబ్బిలి నియోజకవర్గంలోని పిండ్రంగి వలస, దొంకిన వలస, మీదుగా పెదపల్లి క్రాస్, లక్ష్మీపురం క్రాస్ వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన పాడి రైతులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన ఇరిగేషన్ రిటైద్ డీఈ దేముడు
-
గజపతినగరం బహిరంగ సభలో అశేష జనవాహిని
-
‘బాబుకు ఉత్తమ చెత్త సీఎం అవార్డు ఇవ్వాలి’
సాక్షి, గజపతినగరం(విజయనగరం) : ‘గత వారం రోజులుగా మున్సిపాలిటీల్లో చెత్త పేరుకు పోయి, విష జ్వరాలు వ్యాపిస్తున్నా పట్టించుకోని చంద్రబాబు నాయుడికి ఉత్తమ చెత్త ముఖ్యమంత్రి అవార్డు ఇవ్వాలి’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన చెత్త పాలనకు ఆ అవార్డే సరైందని ఎద్దేవా చేశారు. 283వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గజపతినగరం బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సభలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. తోటపల్లి పూర్తయ్యేనా... ? గజపతినగరంలో తిరుగుతున్నపుడు రైతన్నలు తనని కలిసి అర్జీలు ఇచ్చారన్న వైఎస్ జగన్.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కంటే ముందు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఏనాడు తోటపల్లి ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఆయనకు ప్రజలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాను సందర్శించిన రాజన్న.. అధికారంలోకి వచ్చాక తోటపల్లి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారని గుర్తు చేశారు. ఆయన హాయంలోనే ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని... కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లైనా మిగిలిన 10 శాతం పనులు పూర్తి కాలేదని విమర్శించారు. రైతుల బాగోగులు పట్టించుకోకుండా చంద్రబాబు గాడిద పళ్లు తోముతున్నారా అంటూ జగన్ ఎద్దేవా చేశారు. 20 మండలాల్లో లక్షా ముప్పై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా పనుల జాప్యం వల్ల కేవలం ఎనభై వేల ఎకరాలకు కూడా అందండం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ హయాంలో బ్రాంచు కెనాల్‌కు 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 25 శాతం పనులు పూర్తి చేస్తే.. చంద్రబాబు 9 కోట్లు ఖర్చు చేసి చేతులు దులుపుకొన్నారన్నారు. ఇలా అయితే తోటపల్లి ఎప్పుడు పూర్తవుతుందని జగన్ ప్రశ్నించారు. 100 పడకలకు పెంచే హామీ ఏమైంది..? ఆరుగురు డాక్టర్లు ఉండాల్సిన సామాజిక ఆస్పత్రిలో కేవలం నలుగురు మాత్రమే ఉండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని జగన్ అన్నారు. అధికారంలోకి వస్తే 100 పడకలకు పెంచుతామన్న బాబు హామీ ఏమైందని ప్రశ్నించారు. ‘ జగన్ చీపురుపల్లి దాటాడని తెలిసిన తర్వాత గైనకాలజిస్టును నియమించారు. పిల్లల డాక్టరు లేరు. బ్లడ్ బ్యాంకు లేదు. మార్చురీలో ఫ్రీజర్లు లేవు. జనరేటర్ పనిచేయదు. అంబులెన్సులు లేవు. ఇలా అయితే పేదవారికి వైద్యం ఎలా అందుతుందంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 108 వాహనాల కొనుగోలులో అడ్డగోలు అవినీతి రాష్ట్రంలో వాస్తవంగా 310 అంబులెన్సులు(108 వాహనాలు) ఉంటే.. సీఎం దగ్గర ఉన్న కోర్ డ్యాష్ బోర్డులో మాత్రం 414 వాహనాలు తిరుగుతున్నాయంటూ లెక్కలు చూపిస్తున్నారని జగన్ అన్నారు. అలాగే ఒక్కో వాహనం కొనుగోలు చేయడానికి టాటా కంపెనీ 12.60 లక్షలు కోట్ చేస్తే.. చంద్రబాబు మాత్రం 18 లక్షల రూపాయలు చెల్లించి తన బినామీలకు లబ్ది చేకూరుస్తున్నారని జగన్ ఆరోపించారు. పక్క రాష్ట్రం తెలంగాణలో 11 లక్షల 65 వేలకే 108 వాహనం కొనుగోలు చేస్తుంటే.. బాబు ఇంత మొత్తం ఖర్చు చేయడం ఆయన అవినీతికి నిదర్శనమన్నారు. ఆఖరికి 108 వాహనాల డీజిల్‌కు కూడా చెల్లించాల్సిన డబ్బుల విషయంలో కూడా చంద్రబాబు స్కాం చేయడం సిగ్గుచేటని జగన్ విమర్శించారు. బాబుకు ఉత్తమ కరువు రత్న అవార్డు.. వ్యవసాయం దండుగ, ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని రైతన్నను అవమానించిన చంద్రబాబు నాయుడికి అంతర్జాతీయ వ్యవసాయ విధాన నాయకత్వ పురస్కారం రావడం హాస్యాస్పదంగా ఉందని జగన్ వ్యాఖ్యానించారు. బాబుకు ఈ అవార్డు రావడం చూస్తుంటే రోజూ తాగొచ్చి భార్యను కొట్టే భర్తకు ఉత్తమ భర్త అవార్డు ఇచ్చినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. బాబు అధికారంలోకి వస్తే కరువు కూడా వస్తుందని అందుకే ఆయనకు ఉత్తమ కరువు రత్న అవార్డు, చెత్తగా పాలిస్తున్నందుకు చెత్త సీఎం అవార్డు, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నిద్ర పోతున్నందుకు కలియుగ కుంభకర్ణ అవార్డు ఇవ్వాలన్నారు. కరువును జయించానని బొంకుతున్న బాబు అధికారంలోకి రాగానే సాగు విస్తీర్ణం తగ్గిపోయిందని, పంట దిగుబడి కూడా తగ్గిందని జగన్ విమర్శించారు. జగన్ అనే నేను రైతుల కోసం... తాము అధికారంలోకి వస్తే రైతు సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాల గురించి జగన్ వివరించారు.పెట్టుబడి తగ్గితే రైతన్న ఆదాయం పెరుగుతుందన్న జగన్.. నవరత్నాల్లో భాగంగా ప్రతీ రైతుకు పెట్టుబడి సాయంగా 12, 500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. మే నెలలోనే ఈ మొత్తాన్ని అందజేస్తామని, అదే విధంగా క్రాప్‌లోన్ల ద్వారా వడ్డీ రుణాలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా పంట వేయడానికి ముందే ముందే ప్రతీ పంటకు ధరను నిర్ణయించి ధరలస్థిరీకరణ కింద 3 వేల కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే అవసరాన్ని బట్టి ప్రతీ మండలంలో కోల్డేజీ స్టోర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతామని జగన్ హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ లేకుండా చూస్తామన్నారు. అక్వా రైతుల కోసం కరెంటు యూనిట్‌కు రూపాయిన్నర చొప్పున తగ్గిస్తామని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా రైతు ఆత్మహత్యలు నివారించడానికి వైఎస్సార్ భీమా పేరిట ఒక్కో రైతుకు 5 లక్షల రూపాయల భీమా కల్పిస్తామన్నారు. ఈ సొమ్ముపై అప్పుల వాళ్లకు హక్కు లేకుండా ఉండేందుకు అసెంబ్లీలో చట్టం కూడా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. -
పాదయాత్రికుని అక్కున చేర్చుకుంటున్న పల్లెలు
-
వైఎస్ జగన్ మీద అభిమానంతో..
-
వైఎస్ జగన్‌ను కలిసిన మామిడి రైతులు
-
చిన్నారికి భవిష్య్ అని నామకరణం చేసిన వైఎస్ జగన్
-
3100కి.మీ చేరుకున్న వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర
-
అక్రమ సంపాదన బయట పడుతుందనే ఉలిక్కిపడుతున్నారు
-
108కి ఫోన్ చేస్తే.. సిబ్బంది లేరు అని కట్ చేశారు
-
బాగోతం బయటపడుతుందనే బాబు భయపడుతున్నారు..!
సాక్షి, విజయనగరం/ గుర్ల : అక్రమంగా సంపాదించిన సొమ్మును ఐటీ అధికారులు ఎక్కడ స్వాధీనం చేసుకుంటారోనని చంద్రబాబునాయుడు భయపడుతున్నారని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాసంకల్పయాత్ర 280వ రోజు పాదయాత్రలో భాగంగా ఆదివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఎన్నికల సమీపిస్తున్నందును ప్రతీ నియోజవర్గానికి రూ. 30 కోట్లు తరలించారని, వాటి వివరాలు బయటపడుతాయనే చంద్రబాబు భయాందోళనకు గురవుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొన్నారని, ఆ డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయని ఐటీ అధికారులు ప్రశ్నిస్తారనే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో అనేకసార్లు ఐటీ దాడులు జరిగినా స్పందించని సీఎం ఇప్పుడెందుకు గిలగిల కొట్టుకుంటున్నారని ప్రశ్నించారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రాంలో ఎక్కడ చూసినా అవినీతి తప్పు ఏమీ లేదని మండిపడ్డారు. జిల్లాకు తలమానికంగా ఉన్న తోటపల్లి ప్రాజెక్టును చంద్రబాబు అటకెక్కించారని, వైఎస్సార్ హాయాంలో ఈ ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో మిగిలిన 10 శాతం పనులను కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘ చంద్రబాబు సీఎం అయ్యాకా జిల్లాలో జూట్ మిల్లులు మూతపడుతున్నాయి. విజయనగరంలో 16 మిల్లులు ఉంటే నాలుగేళ్ల కాలంలో 6 మిల్లులు మూతపడ్డాయి. కరెంట్ చార్జీలు అధికంగా పెంచడం వల్లనే అవి మూతపడుతున్నాయి. వాటి వల్ల ఉద్యోగాలు కోల్పోవలసి వస్తోంది. అగ్రిగోల్డ్ మోసంలో అత్యధికంగా నష్టపోయింది ఉత్తరాంద్ర ప్రజలే. రాష్ట్రంలో 18 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వారందరి ఇప్పటి వరకూ నష్టపరిహారం చెల్లించలేదు. 11 వందల కోట్లు కేటాయిస్తే వారందరిని ఆదుకోవచ్చు. చంద్రబాబు ఎందుకు వారిని ఆదుకునే ప్రయత్నం చేయట్లేదు’’ కంప్యూటర్‌తో కూడా అబద్ధాలు చెప్పిస్తారు.. ‘‘11 వందల కోట్లు కేటాయిస్తే వారందరిని ఆదుకోవచ్చు. చంద్రబాబు ఎందుకు వారిని ఆదుకునే ప్రయత్నం చేయట్లేదు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పారాడా అంటూ చంద్రబాబు ప్రతీసారి అక్కడకు వెళ్తారు. కానీ ఆయన అక్కడ చేసే బాగోతం మాత్రం.. అగ్రిగోల్డ్ ఆస్తులను తక్కువ రేటుకు వేలం వేయడానికి బ్రోకరింగ్ చేయడానకి అమర్‌సింగ్ అనే వ్యక్తితో మంతనాలు చేస్తారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు 11 వందలు కేటాయించి వారిని ఆదుకుంటాం. నాలుగేళ్లలో రాష్ట్రంలో పాలన కుంటుపడింది. గతంలో వైఎస్ హాయంలో జిల్లాలో 38 వేల ఇళ్లు నిర్మిస్తే.. నాలుగేళ్ల కాలంలో చంద్రబాబు ఊరికి కనీసం ఒక్క ఇళ్లు కూడానిర్మించలేక పోయారు.150 కోట్లతో వైఎస్ త్రాగునీరు అందించారు. చంద్రబాబు పేదలకే ఏమీ చేయలేక కేవలం అబద్దాలతోనే నడిపిస్తున్నారు’’ అని అన్నారు. అందరూ గోబెల్స్‌యే.. ‘‘కేవలం గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. హిట్లర్ మంత్రి వర్గంలో ఒకే ఒక గోబెల్ ఉంటే చంద్రబాబు మంత్రివర్గంలో అందరూ గోబెల్స్‌యే. కంప్యూటర్‌తో అబద్దాలు చెప్పించగలడు. దానికి తోడు ఎల్లో మీడియా ప్రచారం. చంద్రబాబు నాయుడు ఎదనుకుంటే దానినే ప్రచారం చేస్తున్నారు. గతంలో బీజేపీకి జై అంటే ఎల్లో మీడియా కూడా అదే అంది. ఇప్పుడు కాంగ్రెస్‌కు జై అంటే మీడియా కూడా కాంగ్రెస్‌కు జై అంటోంది. సీ ఓటర్ అనే ఓ సంస్థ చేసిన సర్వేలో వైఎస్సార్సీపీకి 21 ఎంపీ సీట్లు వస్తాయని తేల్చిచెప్పింది. కానీ కొన్ని పత్రికలు మాత్రం వాటికి భిన్నంగా వార్తలు రాశారు. రాష్ర్టంలో జరిగే అవినీతి మీద మాత్రం ఒక్క వార్త కూడా రాయరు. పోలవరం, ఇసుక మాఫీయా, మట్టిమాఫీయా మీద మాత్రం రాయలేరు. కరెంటు చార్జీలు, ఫీజులు, ఆసుపత్రి చార్జీలు విఫరీతంగా పెంచారు. పేదవాడు ఆసుపత్రికి పోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతోంది’’ అని వ్యాఖ్యానించారు. -
విజయనగరం పట్టణం జన సునామీ
-
విజయనగరంలో జన సునామీ
సాక్షి, విజయనగరం : ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయనగరం పట్టణంలోకి విజయవంతంగా అడుగుపెట్టింది. వైఎస్ జగన్ రాకతో విజయనగరం పట్టణం జన సునామీలా మారింది. తమ అభిమాన నాయకుడిని చూడడానికి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రజల రాకతో ఎత్తు బ్రిడ్జి, రేల్వే స్టేషన్, వైఎస్సార్ జంక్షన్, ఎన్సీ యస్ ధియేటర్ జంక్షన్, కన్యకాపరమేశ్వరి టెంపుల్, కోళ్ల బజారు, మెయిన్ మార్కెట్ నుంచి మూడు లాంతర్ల జంక్షన్ వరకు భారీగా జనం పోటెత్తారు. వైఎస్ జగన్‌కు అపూర్వ స్వాగతం పలుకుతూ రెండు కిలోమీటర్ల మేర జనాలు బారులు తీశారు. మూడు లాంతర్లు జంక్షన్లో వైఎస్ జగన్ బహిరంగ సభ జరగనుంది. -
జెండాలు,ఫ్లెక్సీలతో నిండిపోయిన విజయనగరం
-
273వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, ఎస్.కోట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 273వ రోజు షెడ్యూల్ ఖరారైంది. శనివారం ఉదయం వైఎస్ జగన్ ఎస్. కోట నియోజకవర్గంలోని జామి మండలంలో నైట్ క్యాంప్ శిబిరం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి జిడ్డేటి వలస క్రాస్ రోడ్డు, గోడికొమ్ము, అలమంద క్రాస్ రోడ్డు, అలమంద సంత, లోట్లపల్లి క్రాస్ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్ జగన్ మధ్యాహ్నా భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి యాతపాలెం, కొత్త భీమసింగి, పాత భీమసింగి మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం ప్రకటనలో తెలిపారు. -
నవరత్నాల పథకాలపై చిన్నారుల ప్రత్యేక ప్రదర్శన
-
ప్రజాసంకల్పయాత్ర @3000 కి.మీ.
-
అన్నదాతలు ఆందోళనలో ఉంటే..
-
ఎస్ కోటలో ఎక్కడ చూసినా అవినీతే
-
నడిచేది నేను.. నడిపించేది ప్రజల అభిమానం: వైఎస్ జగన్
సాక్షి, కొత్తవలస(విజయనగరం) : ప్రజాసంకల్పయాత్రలో నడిచేది తనే అయినా.. నడిపించేది మాత్రం ప్రజల అభిమానమేనని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఎక్కడ పులివెందుల.. ఎక్కడ కొత్తవలస అని, దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానంతోనే ప్రజాసంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు మైలురాయి దాటిందని స్పష్టం చేశారు. 269వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కొత్తవలస బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సభలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘అరకు ఎమ్మెల్యే ఒక దుర్ఘటనలో మృతి చెందడం మనందరికి తెలిసిన విషయమే. ఆ ఎమ్మెల్యే మన పార్టీ వదిలి మనకు మోసం చేసినప్పటికి.. అతని ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ నియోజకవర్గంలో నడుస్తుండగా.. ఇక్కడి ప్రజలు నాతో అన్న మాటలు.. 2004 ఎన్నికలు తప్పా ప్రతీసారి తెలుగుదేశం గెలిపించామన్నా. ఈ ముప్పై ఏళ్లలో కనీసం మూడంటే మూడు గుర్తుకుపెట్టుకునే పనులు చేయలేకపోయారన్నా అని చెప్పారు. కొత్తవలస, వేపాడు మండలాలు కరువు ప్రాంతాలు. పోలవరం పూర్తి అయితే.. రైవాడ, తాటిపూటి రిజర్వాయర్ల నీటిని వాడుకునేదెప్పుడు అని ఇక్కడి రైతులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితేనే ఇక్కడి రైతాంగానికి మేలు జరుగుతోంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు పరుగెత్తాయి. పోలవరం ప్రాజెక్ట్ పనుల విషయంలో చంద్రబాబు డ్రామాలాడుతున్నారు. ఈ మధ్యనే ఫ్యామిలీని అక్కడికి తీసుకెళ్లారు. నాలుగున్నరేళ్లు పూర్తైనా పునాది గోడలు దాటి పనులు జరగలేదు. డిజైన్లు పూర్తికాలేదు. కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్ల పేరుతో బినామీలను తెచ్చుకుని రేట్లు పెంచుకున్నారు. కమీషన్ల కోసమే పోలవరం అంచనా వ్యయం పెంచారు. గత చంద్రబాబు పాలనలో భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ నష్టాల్లోకి వెళ్లింది. మూతబడిన ఈ చక్కెర ఫ్యాక్టరీని ఆ దివంగత నేత వైఎస్సార్ 2004లో తిరిగి తెరిపించారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యారు.. ఆ ఫ్యాక్టరీ రూ. 43 కోట్ల అప్పుల్లో మునిగిపోయింది. ఇక్కడికి చక్కటి రైల్వే వ్యవస్థ ఉంది. కానీ పారిశ్రామిక అభివృద్ధి అడుగు వేయలేదు. వైఎస్సార్ హయాంలో శారదా స్టీల్స్, గోల్డ్ స్టార్ స్టీల్స్ పేరిట పలు పరిశ్రమలు ఏర్పాడ్డాయి. ఎస్ కోట, కొత్తవలస మండలాల్లోనే నాలుగు, ఐదు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. బాబు పాలనలో ఒక్కటంటే ఒక్క ఫ్యాక్టరీ రాలేదు. కొత్త ఉద్యోగాలు దేవుడేరుగు.. జ్యూట్ మిల్స్ మూతబడి ఉన్న ఉద్యోగాలు పోయాయి. విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల పరిశ్రమలు మూతబడే పరిస్థితి నెలకొంది. ముప్పై పడకల ఆసుపత్రి ఏమైంది? కొత్తవలసలో ముప్పై పడకల ఆసుపత్రి కడతామని చంద్రబాబు గత ముప్పై ఏళ్లుగా చెబుతున్నారు. మరీ ఆ ఆసుపత్రి వచ్చిందా అని అడుగుతున్నా?(ప్రజల నుంచి లేదు లేదు సమాధానం) ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఇక్కడికి వచ్చి ఆసుపత్రి, ప్రభుత్వ కాలేజీ అంటాడు. ఇక్కడి ఎమ్మెల్యేకు సొంతంగా ప్రయివేట్ జూనియర్ కళాశాల ఉంది. దీంతోనే ప్రభుత్వ కాలేజీ రాకుండా ఈ ఎమ్మెల్యేనే అడ్డుపడుతున్నాడు. రైతుబజార్ నిర్మిస్తామని హామీ ఇచ్చి మరిచారు. మామిడి తాండ్రకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. బీమాలి, అలమండి గ్రామాల్లో తయారు చేస్తారు. మామిడి తాండ్రను నిల్వచేసేందుకు కోల్డ్ స్టోరేజిలు అడిగినా కల్పించలేదు. విశాఖ నుంచి అరకు వరకు ఉన్న రోడ్డును నాలుగు లేన్లుగా మారుస్తానని చంద్రబాబు ఊదరగొట్టారు. మీకేమైనా కనిపించిందా అని అడుగుతున్నా? ఎస్ కోట నియోజకవర్గంలో అవినీతి తప్ప ఏం కనబడటం లేదు. రియల్ఎస్టేట్ వెంచర్ వేయాలంటే ఎకరాకు రూ10 లక్షలు ఇవ్వాలంటా. నీరు చెట్టు అని చెప్పి తాటి చెట్టంతా తవ్వేస్తున్నారు. నీరు చెట్టు పేరిట ఇసుకను దోచేస్తున్నారు. దీని పేరుతో బిల్లులు తెచ్చుకుంటున్నారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. (చదవండి: వైఎస్ జగన్ చెప్పిన బల్ల కథ) అన్నదాతలు ఆందోళనలో ఉంటే.. గుంటూరు నుంచి అనంతపురం వరకు కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అన్నదాతలు ఆందోళనలో ఉంటే చంద్రబాబు అమెరికా వెళ్లారు. అక్కడ ఈ పెద్దమనిషి రైతుల గురించి ఉపన్యాసం చేస్తారట. అది సేంద్రీయ వ్యవసాయంపై ప్రసంగం చేస్తారట. పొదుపు సంఘాల అక్కాచెల్లమ్మలను సైతం మోసం చేశారు. చంద్రబాబు ఒక్కరూపాయి కూడా మాఫీ కాలేదు. మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన పుస్తకాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. నారయణ, చైతన్య స్కూళ్లు రూ.లక్షల్లో ఫీజులు గుంజుతున్నాయి. చదువులకు రూ.లక్షల్లో ఖర్చు అవుతుంటే ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ. 30 వేలు మాత్రమే ఇస్తున్నారు. బాబు పాలనలో చదువుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు. రాష్ట్రంలో లక్షా 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డీఎస్సీ, టెట్, టెట్-2, టెట్-3 అంటూ మోసం చేస్తున్నారు. లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చే ప్రత్యేక హోదాను బాబు తాకట్టు పెట్టారు. హోదాతోనే రాష్ట్రాభివృద్ధి అని తెలిసి కూడా తాకట్టు పెట్టారు. పరిశ్రమలకు ఇవ్వాల్సిన రూ.3200 కోట్ల రాయితీలు ఇవ్వడం లేదు. చంద్రబాబు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. హైదరాబాద్‌లో ఆపరేషన్ చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించదట. కానీ మంత్రి విదేశాల్లోని పంటి వైద్యానికి మాత్రం రూ.3 లక్షలు ఖర్చు చేస్తారు. మరో ఆరునెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాంటి నాయకుడు కావాలో ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించి ఓటు వెయ్యాలని’ వైఎస్ జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
పాదయాత్రకు సంఘీభావంగా.. ర్యాలీలు
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేడు మూడువేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు సంఘీభావం తెలిపారు. పలు చోట్లు కేకులు కట్ చేయగా, మరికొన్ని ప్రాంతాల్లో వైఎస్ విగ్రహనికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తూర్పు గోదావరి : వైఎస్ జగన్ మూడువేల కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు తునిలో కేక్ కట్‌చేశారు. అనంతరం కూడలిలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి సంఘీభావం తెలిపారు. పశ్చిమ గోదావరి : పాదయాత్ర మూడువేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ తానేటి వనిత ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొవ్వూరు నుంచి పంగిడి వరకు ర్యాలీ చేపట్టి పాదయాత్రను సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. నెల్లూరు : వైఎస్ జగన్ చేపట్టిన పాద్రయాత్రకు సంఘీభావంగా జిల్లాలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్న కమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలిపారు. పార్టీ శ్రేణులు మూడువేల కొబ్బరి కాయలు కొట్టి ఆయన పాదయాత్ర విజయంతంగా కావాలిన ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పాల్గొని.. పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తోందని అన్నారు. విజయవాడ : పాదయాత్ర మూడువేల కిలోమీటర్లు చేరిన సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు సంఘీభావం తెలిపారు. పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త మల్లాది విష్ణు కేక్ కట్‌చేసి సంఘీభావం వ్యక్తం చేశారు. ప్రకాశం : పాదయాత్రకు సంఘీభావంగా కందుకూరు నియోజకవర్గంలోని 3,4 వార్డులో పార్టీనేత మానుగుంట మహింధర్ రెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి నవరత్నాలు గురించి ప్రజలకు అవగహన కల్పించారు. వైఎస్ఆర్ : పాదయాత్రకు సంఘీభావంగా మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. పైడిపాలెం జలాశయం వద్ద వైఎస్సార్ విగ్రహానికి కృష్ణా జలాలతో అభిషేకం చేశారు. కర్నూలు : పాదయాత్రకు సంఘీభావంగా ఎమ్మిగనూరులో జగన్ రావాలి.. జగన్ కావాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఇంటింటికి వెళ్లి నవరత్నాలు గురించి ప్రజలకు తెలిపారు. పార్టీ నేత కాటసాని రామిరెడ్డి నేతృత్వంలో మండల కమిటి సమావేశం ఏర్పాటు చేశారు. -
చరిత్రలో నిలిచిపోయే పాదయాత్ర : భూమన
సాక్షి, విజయనగరం : ప్రపంచంలో ఏ రాజకీయ నేతకు కూడా సాధ్యం కాని మహా పాదయాత్రను వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చైనా కమ్యూనిస్టు అధినేత మావో జెడాంగ్‌కు కూడా సాధ్యం కాని మూడువేల కిలోమీటర్ల పాదయాత్రను నేడు వైఎస్ జగన్ పూర్తి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 269వ రోజు పాదయాత్ర విజయనగరం జిల్లాలోకి విజయవంతంగా ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజల సంక్షేమ, యోగక్షేమాలు తెలుసుకునేందుకే ఆయన ఈ యాత్రను చేపట్టారని తెలిపారు. ఆయనకు దారిపొడవున ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని అన్నారు. -
రాజన్న పాలన వైఎస్ జగన్‌తో సాధ్యం
-
చరిత్రలో నిలిచిపోయే పాదయాత్ర
-
ఇంజనీరింగ్ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం
-
పొలిటికల్ కారిడర్ 25th June 2018
-
టీడీపీ వైఫల్యాలను ప్రజలకు తెలపాలి
విజయనగరం మున్సిపాలిటీ : గత నాలుగేళ్లలో అధికార టీడీపీ వైఫల్యాలను, ప్రజలకు చేసిన నయవంచనను ప్రజలకు వివరించాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం నాయకుడు ఈశ్వర్ కౌషిక్ అన్నారు. 38వ వార్డులో బుధవారం పార్టీ నాయకులు పిళ్లా వేణు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలు వార్డుల్లో కలియతిరుగుతూ నవరత్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. బూత్ కమిటీలను మరింత పటిష్టం చేయాలన్నారు. అందరూ ఏకతాటిపై ఉండి విజయమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సంగంరెడ్డి బంగారునాయుడు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్య, తాడ్డి సురేష్, కరణం రమేష్, 38వ వార్డు పార్టీ నాయకులు పిళ్లా పాండు రంగారావు, ఈళ్ల శివ, కాశి, అడారి చంటి, శివాజీ , రవి, నరేష్, గురునాథ్, గొల్లపూడి నాగేశ్వరరావు, పి వినోద్, శరత్, గణేష్, తిరు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ
-
విజయనగరం జిల్లాలో భారీ వర్షం
-
అగ్రిగోల్డ్ బాధితుల పట్ల దురుసుగా ప్రవర్తించిన నారా లోకేశ్
-
మహిళలపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
-
విజయనగరంలో ఉద్రిక్తత
-
రాష్ట్ర భవిష్యత్ కోసమే బంద్
విజయనగరం మున్సిపాలిటీ : రాష్ట్ర భవిష్యత్ కోసం, ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా సాధనకు సోమవారం చేపడుతున్న రాష్ట్ర బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక సత్య కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న బంద్‌కు బాధ్యత గల ప్రతి పక్షంగా, హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. బంద్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, సినిమా థియేటర్లు, హోటళ్లు, స్కూల్స్‌ను మూసివేయించాలన్నారు. రవాణా వ్యవస్థను నిలిపివేయాలన్నారు. ఆటో డ్రైవర్లు బంద్‌కు సహకరించాలని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రజలను కోరారు. తెలుగు ప్రజలందరికీ కావాల్సిన హోదా కోసం చేస్తున్న పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తోన్న సిబ్బంది పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తూ ప్రజలను, రాష్ట్రాన్ని మోసం చేస్తున్నా రన్నారు. నాలుగేళ్ల కిందట ఇవ్వాల్సిన హోదాను కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి.సూర్యనారాయరాజు, పార్టీ నాయకులు పిళ్లా విజయ్‌కుమార్, కౌన్సిలర్ గాడు అప్పారావు, మాజీ కౌన్సిలర్ పొట్నూరు వెంకటి, పట్టణ నాయకులు పిలకా శ్రీను, ముల్లు త్రినాథ్, ఇసరపు శేఖర్, తురాల శ్రీను, గడి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. -
మామిడి ధరలు పుల్లన..!
విజయనగరం ఫోర్ట్ : మామిడి పండ్ల ధరలు పుల్లగా మారాయి. ఈ ఏడాది మామిడి పంటకు వాతావరణం అనుకూలించ లేదు. తెగుళ్లు దాడిచేయడం, పూత ఆలస్యం కావడంతో దిగుబడి అమాం తం తగ్గింది. దీంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఏడాది కంటే 8 నుంచి 10 రెట్లు పెరిగాయి. పండ్లవైపు చూసేందుకు సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. హెక్టారుకు గత ఏడాది 10 నుంచి 12 టన్నులు దిగుబడి వస్తే ఈ ఏడాది 4 టన్నులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 46 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. కొన్ని చెట్లకు పూతే రాలేదు. చెట్లకు అరకొరగా ఉన్న కాయలు ఇటీవల ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షాలకు నేలపాలయ్యాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు చేరుతున్న పంటకు ధర బాగుండడంతో రైతులు సంతోషపడుతున్నారు. పది రెట్లు పెరిగాయ్.. గత ఏడాది పణుకులు టన్ను ధర రూ.6 వేలు ఉంటే ఈ ఏడాది రూ.60 వేలు పలుకుతోంది. సువర్ణరేఖ రకం గతేడాది రూ.20 వేలు ఉంటే ఈ ఏడాది రూ.80 వేలు, బంగినిబిల్లి రకం రూ.30 వేలు ఉంటే ఈ ఏడాది రూ.90 వేలు, పరియాలు రూ.2 వేలు నుంచి రూ.40 వేలకు, రసాలు గత ఏడాది రూ.30 వేలు ఉంటే ఈ ఏడాది రూ.80 వేలకు చేరింది. పండ్ల ధరలతో పాటు మామిడి తాండ్ర ధరలు సైతం అమాం తం పెరగనున్నాయి. గత ఏడాది కేజీ తాండ్ర రూ.100 నుంచి రూ.120 ఉంది. ఇప్పుడు కేజీ తాండ్ర ధర రూ.600 నుంచి 800 వరకు అయ్యే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. బాగా పెరిగాయి... గత ఏడాది కంటే ఈ ఏడాది మామిడి ధరలు బాగా పెరిగాయి. దిగుబడి తగ్గడంతోనే ఈ పరిస్థితి. ఇది రైతులకు కాస్త ఊరటగా ఉంది. తెగుళ్లు, పురుగులు, వాతావరణ మార్పుల వల్లే దిగుబడులు తగ్గాయి. – పీఎన్వీ లక్ష్మీనారాయణ, డీడీ, ఉద్యానశాఖ -
ప్రత్యేక హోదా కోసం విద్యావేత్తల మద్దతు
-
హోదా కోసం విజయనగరంలో వైఎస్సార్సీపీ పోరుబాట
-
విజయనగరంలో హోదా కోసం ఎందాకైనా
-
కమ్మేసిన పొగమంచు, భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం 9 గంటలైనా వాహనాలు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి. ఫలితంగా జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. -
అప్పలనాయుడా మజాకా!
-
ఎమ్మెల్యే వర్సెస్ ఉద్యోగులు
-
15 ఇళ్లు దగ్ధం...70 మేకలు సజీవదహనం
సాక్షి, విజయనగరం: భోగాపురం పంచాయతీ వనుంపేటలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో 15 ఇళ్లు దగ్ధం కాగా, మంటల్లో చిక్కుకుని 70 మేకలు సజీవదహనమయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీ అస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సువర్ణముఖి తీరంలో... చాతుర్లింగేశ్వర ఆలయాలు
విజయనగరం జిల్లా బలిజిపేట మండలం సువర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతంలో నారాయణపురం గ్రామంలో నిర్మితమైన చాతుర్లింగేశ్వర దేవాలయం చారిత్రక ప్రసిద్ధి గాంచిన సుప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. 11వ శతాబ్దం నాటి అపురూప శిల్పకళా నైపుణ్యంతో, అందమైన రాతికట్టడాలతో నిర్మించారు. శ్రీ నీలకంఠేశ్వర, సంగమేశ్వర, మల్లికార్జున, శ్రీ నీలేశ్వర ఆలయాలు ఒకేచోట కొలువై ఉండటం ఇక్కడి ప్రత్యేకతలు. ఆలయ రాతిస్తంభాలపై ఉండే శాసనాలు, ఆలయాలపై ఉండే శిల్పాలు ఆనాటి చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయి. తూర్పుగాంగులలో ముఖ్యుడు అనంతవర్మ చోడగంగదేవుడు. ఇతడు క్రీ.శ.1077వ సంవత్సరం నుండి 1147వరకు పరిపాలించాడు. ఆ కాలంలోనే ఈ చాతుర్లింగ ఆలయాల నిర్మాణం జరిపినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయం చాతుర్లింగ శివాలయాలలో అత్యంత ప్రధానమైనది శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయం. దీని ఎత్తు 31 అడుగులు. ఒరిస్సాలో పరశురామేశ్వర ఆలయ శిఖరాన్ని పోలి ఉండడం విశేషం. గర్భగుడి ద్వారం పైన నవగ్రహాలు, పై భాగాన గజలక్ష్మి విగ్రహం కనువిందు చేస్తాయి. గర్భగుడికి ముందు దీర్ఘచతురస్రాకారంలో ఉన్న మండపం లోపల ఒక్కొక్క వరుసలో నాలుగు స్తంభాల వంతున రెండు వరుసలు ఉంటాయి. ఈ స్తంభాలపై చారిత్రక, పురాణ ఘట్టాల శిల్ప, చిత్రాలతో మండపం అద్భుతమనిపిస్తుంది. ఈ స్తంభాలపై సుమారు 40 శాసనాలు ఉన్నాయి. మండపం పైకప్పు అనేక రాతి పలకలతో అమర్చి ఉంది. గర్భగుడిలో నునుపు తేలిన శివలింగం, పానవట్టం ఎంతో పవిత్రంగా దర్శనమిస్తాయి. సంగమేశ్వర ఆలయం ఇది నీలకంఠేశ్వర ఆలయానికి ఉత్తరభాగాన దీర్ఘచతురస్రాకారంలో ఉంది. దీని నిర్మాణం కళింగ దేవాలయాల పద్ధతిలో ఒకటైన ఖాఖారా ఆలయనిర్మాణ శైలికి చెందినది. మల్లికార్జునాలయం నీలకంఠేశ్వరాలయానికి ఉత్తరభాగంలో ఈ ఆలయం ఉంది. గర్భగృహద్వారం చిత్రలేఖనాలతో అలంకరించిన నవగ్రహాలున్నాయి. ద్వారానికి ఇరువైపులా గంగ, యమున విగ్రహాలు కనిపిస్తాయి. గోడ పై భాగాన గల అరలలో మహిషాసుర మర్దని, ఏకపాదమూర్తి, కార్తికేయ, అర్ధనారీశ్వరుడు, గణేశ, గంగాధరమూర్తి విగ్రహాలు ఉన్నాయి. నాలేశ్వరాలయం ఇది నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి దక్షిణభాగంలో ఉన్న చతురస్రాకార గర్భాలయం. పదహారున్నర అడుగుల ఎత్తు కలిగిన ఆలయం. ఆలయ శిఖరం ఉత్కల్(ఒరిస్సా) శిల్ప సాంప్రదాయంతో అర్ధచంద్రాకార రేఖలు కలిసినట్టు ఉంటుంది. ఈ ఆలయం మిగిలిన మూడు ఆలయాలను పోలి ఉండటం విశేషం. శాసనాలు నీలకంఠేశ్వరస్వామి ఆలయం ముఖమండపంలోని రాతిస్తంభాలపై క్రీ.శ.1102–1251ల మధ్యకాలం నాటి 53 శిలాశాసనాలు దేవనాగరి లిపిలో ఉన్నాయి. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిత్యధూప దీప నైవేద్యాలతో విరాజిల్లుతున్న ఈ చాతుర్లింగేశ్వర ఆలయం కార్తీక మాసం నెలరోజులూ ప్రత్యేకపూజలు జరుగుతాయి. ఇక్కడికి సుమారు 23 కిలోమీటర్ల దూరంలో గళావెల్లి తామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇది కూడా 11వ శతాబ్దానికి చెందిన ఆలయం. భక్తులు ఈ ఆలయాన్నీ సందర్శిస్తుంటారు. ఎలా రావాలంటే: విశాఖ, విజయనగరం, పార్వతీపురం నుండి వచ్చేవారు బొబ్బిలి చేరుకుని అక్కడనుండి నేరుగా నారాయణపురం బస్సులో చేరుకోవచ్చు. బలిజిపేట బస్సు ఎక్కితే బలిజిపేటలో దిగి అక్కడ నుండి ఆటో వంటి ద్వారా 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న నారాయణపురం చేరుకోవచ్చు. శ్రీకాకుళం వైపు నుండి వచ్చేవారు రాజాం మీదుగా పణుకువలస జంక్షన్ నుండి తిరిగి వంతరాం, బలిజిపేట మీదుగా నారాయణపురం చేరుకోవచ్చు. రాజాం నుండి బస్సులో వచ్చేవారు బలిజిపేటలో దిగి నారాయణపురం చేరుకోవచ్చు. – బోణం గణేష్, సాక్షిప్రతినిధి, విజయనగరం – ఫొటోలు: కొడుకుల వేణుగోపాలరావు, బలిజిపేట -
సాక్షి ’కౌలు రైతు బతుకు’కు రైతుల స్పందన
-
బాలుడిపై యాసిడ్ దాడి
సాక్షి, విజయనగరం: ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలుడిపై గుర్తు తెలియని దుండగులు యాసిడ్ దాడి చేశారు. ఈ సంఘటన విజయనగరం జిల్లాలోని జామి మండలం తాండ్రంగి గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన సాయి(9) అనే బాలుడు నిన్న సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో ఓ వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దీంతో చిన్నారిని హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. బాలుడి చెప్పిన ఆధారాల ప్రకారం గండి కృష్ణ అనే వ్యక్తి దాడికి పాల్పడినట్లు సమాచారం. -
అక్టోబర్ 6న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
అనంతపుర న్యూటౌన్: విజయనగరంలోని రాజీవ్‌గాంధీ స్పోర్ట్స్ స్టేడియంలో అక్టోబర్ 6 నుంచి 17 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగనుంది. ఇందులో పాల్గొనేందుకు అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారు మాత్రమే అర్హులని జిల్లా యువజన శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటేశం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు www.joinindianarmy.nic.in వెబ్సైట్లో చూడవచ్చని తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న యువకులు తమ అర్హతను తెలిపే వివరాలను ‘ముఖ్య కార్యనిర్వహణాధికారి, యువజన సంక్షేమశాఖ, ఆన్సెట్, అనంతపురం’ చిరునామాలో ఈనెల 14లోపు అందించాలని కోరారు. దరఖాస్తుదారులకు 15వ తేదీ ఉదయం 9 గంటలకు ఆర్ట్స్ కళాశాలలో స్క్రీనింగ్టెస్ట్ నిర్వహించి అర్హత సాధించిన వారికి యువజన సర్వీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణనందిస్తామన్నారు. -
మురికి కాలువలో గంజాయి బ్యాగులు
విజయనగరం: విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. మురికి కాలువలో పెద్ద ఎత్తున గంజాయి బ్యాగులు పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన జిల్లాలోని సాలూరులో మంగళవారం వెలుగు చూసింది. ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు కోటదుర్గమ్మ గుడి సమీపంలోని కాలువలో సుమారు 25 బ్యాగుల గంజాయిని పడేసి వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం
చింట్యాడ: విజయనగరం జిల్లాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చింట్యాడ మండల కేంద్రంలో శనివారం ఉదయం వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో కాపు కాసిన పోలీసులు పలువురిని అరెస్టుచేసి వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. -
అయ్యో పాపం!
ఏమండీ ఇది విన్నారా... జిల్లా మంత్రిగారికి పంద్రాగస్టునాడు జెండా ఎగరేసే అవకాశం ఇవ్వలేదట. పక్క జిల్లాకు చెంది... ఇక్కడి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మంత్రికే ఆ ఛాన్స్ దక్కిందంట! అవునండీ నిజం... ఏ అధికారం కోసమైతే ఆయన పార్టీ ఫిరాయించారో... కేవలం దానితోనే సరిపెట్టారట. ఆయన పార్టీలోకి రావడం ఇష్టంలేక తెగ బాధపడిపోయిన అధికార పార్టీ నాయకులు... కార్యకర్తలు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారంట. జిల్లా పార్టీలో ఎలాగూ గౌరవం లేదు. మరి అధిష్టానం కూడా ఇలా చేసిందేంటని మంత్రిగారి అనుయాయులు తెగ బాధపడిపోతున్నారట. - పదవి కోసం పార్టీ మారిన సుజయకృష్ణ రంగారావు - తీరా వెళ్లాక అడుగడుగునా అవమానాలు - అమాత్యునిగా ఉన్నా... కనీస గౌరవం కరువు - జెండా ఆవిష్కరణకు నోచుకోని వైనం - పెత్తనమంతా ఇన్చార్జి మంత్రికే... సాక్షి ప్రతినిధి, విజయనగరం: అభివృద్ధి కోసమని.. కార్యకర్తల అభీష్టమని.. కుంటిసాకులు చెప్పి పదవి కోసం తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన మంత్రి అయిన సుజయకృష్ణ రంగారావు పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైందా... ఆ పార్టీ కేడర్ నుంచి కనీస గౌరవం లభించడం లేదా... ఇప్పుడు అధిష్టానం సైతం అదే బాటలో నడుస్తోందా... అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే ఆయన రాకను జిల్లాలోని ఇప్పటికీ కొందరు టీడీపీ నేతలు వ్యతిరేకిస్తుండగా తాజాగా అధిష్టానం కూడా అదే విధంగా అవమానించింది. స్వాతంత్య్ర వేడుకల్లో జిల్లా మంత్రిని కాదని ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావుకు పతాకావిష్కరణ చేసే అవకాశం కల్పిస్తూ సుజయ్‌కు ఆ అవకాశం కూడా లేకుండా చేసింది. జిల్లాలో గంటా హవా మరోవైపు జిల్లాలో ఇన్చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు హవా నడుస్తోందనే చెప్పాలి. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు మాటనే చెల్లనివ్వకుండా తనకు నచ్చిన వ్యక్తిని టీడీపీ జిల్లా అధ్యుక్షుడిగా తెచ్చుకోవడంతో గంటా ఇక్కడి నాయకులకు చెక్ పెట్టడం మొదలుపెట్టారు. పక్క జిల్లా నుంచి వచ్చి జిల్లా టీడీపీపై పెత్తనం చేలాయించడంతో పాటు మంత్రులను సైతం పక్కనబెట్టి పంచాయితీలు కూడా చేసేస్తున్నారు. ప్రారంభోత్సవాలు, పార్టీ వ్యవహారాల్లోనూ తానే ప్రముఖంగా ఉంటూ జిల్లా మంత్రులకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. అయితే గంటా పెత్తనం ప్రభావం అశోక్ గజపతిరాజుపై కంటే సుజయ కృష్ణ రంగారావుపైనే ఎక్కువగా పడుతోంది. జిల్లాలో టీడీపీకి చెందిన మంత్రి ఉన్నప్పుడు ఆయనే పార్టీని నడిపించాల్సి ఉన్నా అధిష్టానం మాత్రం గంటాకే ఆ బాధ్యత అప్పగించింది. వెంట నడవని జిల్లా నేతలు - ఇటీవల ఎమ్మెల్సీ విజయరామరాజు పుట్టిన రోజునాడు గిరిజన హస్పిటల్ తనిఖీలకు సుజయకృష్ణ వెళ్లారు. తనకు దారిలో కనిపించి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన సుజయ్ తాను ఇన్చార్జ్గా ఉన్న ప్రాంతంలో తనిఖీల గురించి తనకు చెప్పకపోవడం ఏమిటని ఆయన తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారంట. అంతేగాదు. మంత్రి పర్యటనలో ఆ పార్టీ నాయకులు కనిపించకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. - గజపతినగరం నియోజకవర్గం దత్తరాజేరులో ఓ పాఠశాల పీడీ పోస్టును మంత్రి సిఫార్సు చేసిన వ్యక్తికి ఇచ్చారు. ఆ విషయం తెలిసి స్థానిక ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. డీఈఓను, ప్రిన్సిపల్‌ను, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులను పిలిచి మందలించారు. మంత్రి సిఫార్సును పక్కన పెట్టమంటూ మరో వ్యక్తిని సిఫార్సు చేస్తూ ఎమ్మెల్యే లేఖ ఇచ్చారు. - చినమేరంగిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ భవనాలను రూ. 10కోట్లతో కడితే వాటిని ఎమ్మెల్సీ విజయరామరాజు మంత్రి సుజయ కృష్ణ రంగారావును ఆహ్వానించకుండానే ప్రారంభించేశారు. - జిల్లా టీడీపీ సమావేశాల్లోనూ పార్టీ నేతలు సుజయ్‌ను అంటీముట్టనట్లే వ్యవహరిస్తున్నారు. పార్టీ పరంగా పంచాయితీలేమున్నా అశోక్‌కు, గంటాకే చెబుతున్నారు. ఇంటా బయటా అవమానం వైఎస్సార్సీపీలో కీలక నేతగా ఉంటూ ఆ పార్టీని అభిమానించే ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచారు సుజయకృష్ణ రంగారావు. సరిగ్గా ఏడాది గడిచే సరికి జిల్లాలో అభివృద్ధి జరగాలంటే ప్రతిపక్షంలో ఉంటే కుదరంటూ అధికారపక్షం పంచన చేరారు. మరుసటి ఏడాది మంత్రి పదవి తెచ్చుకున్నారు. కానీ ఇంత వరకూ చెప్పుకోదగ్గ అభివృద్ధి అంటూ ఏమీ చేయలేకపోయారు. కనీసం టీడీపీలోనైనా ప్రాభవాన్ని పెంచుకుంటున్నారా అంటే అదీ లేదు. ఇటీవల బయటపడ్డ ఆయన ఆస్తుల సంరక్షణ అంశంతో ఇంటా బయటా అభాసుపాలయ్యారు. చివరికి పార్టీ తలదించుకునే పని చేయనని, టీడీపీకి చెడ్డపేరు తీసుకురానని ఆయనే స్వయంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. -
ఇరువర్గాల మధ్య ఘర్షణ, ఉద్రిక్తత
విజయనగరం: విజయనగరం జిల్లాలోని బలిజపేట మండలం వంతారం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలోని రెండు వర్గాల వారు రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇరు వర్గాల వారు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో.. ఆరుగురికి గాయాలయ్యాయి. దీంతో వారిని బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
హిజ్రాతో సహజీవనం.. ఆపై అనుమానంతో
విజయనగరం: ఏడాది కాలంగా తనతో సహజీవనం చేస్తున్న హిజ్రా మరొకరితో మాట్లాడుతుందనే అనుమానంతో ఆమెను దారుణంగా హతమార్చాడో వ్యక్తి. ఈ సంఘటన విజయనగరం జిల్లాలోని కురుపాం మండలం నీలకంఠాపురం గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన శ్రీకాంత్, రమేష్ అలియాస్ రమ్య అనే హిజ్రాతో గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో రమ్య తనతో పాటు మరి కొంతమందితో కూడా సంబంధం కొనసాగిస్తోందని శ్రీకాంత్ అనుమానించాడు. ఈ విషయంపై ఆమెతో పలుమార్లు గొడవ పెట్టుకున్నాడు. మంగళవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీకాంత్ నిద్రిస్తున్నరమ్యపై సమ్మెటతో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
గిరిజన గ్రామాల్లో కలెక్టర్ పర్యటన
విజయనగరం: విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని గిరిజన గ్రామాలైన కొత్తవలస, గండ్రాపు వలస గ్రామాల్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పర్యటించారు. విద్యార్థులు జ్వరాల బారినపడిన కొత్తవలస గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఆయన పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణపై తనిఖీలు నిర్వహించారు. ఇటీవల దిగువ గంజాయిగూడలో జ్వరంతో మరణించిన బాలిక కుటుంబానికి ఐదువేల ఆర్థిక సహాయం అందించారు. గండ్రాపువాలసలో మలేరియా నియంత్రణకు చేస్తున్న స్ప్రేయింగ్ ను పరిశీలించారు. జిల్లాలో 55 మంది వైద్యాధికారుల్ని తక్షణమే నియమించనున్నట్లు తెలిపారు. -
విజయనగరం జిల్లాలో కిడ్నాప్ కలకలం
-
విజయనగరం జిల్లాలో కిడ్నాప్ కలకలం
పూసపాటిరేగ: విజయనగరం జిల్లాలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేగింది. జిల్లాలోని పూసపాటిరేగ మండలం పోరాం గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడిని గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన మాదేష్(3) అలియాస్ పండును దుండుగులు కిడ్నాప్ చేశారు. ఇంటి ముందు తాతయ్యతో కలిసి ఆడుకుంటున్న సమయంలో బైక్‌పై వచ్చిన దుండగులు మంచినీళ్లు అడిగారు. పెద్దాయన నీళ్లు తేవడానికి ఇంట్లోకి వెళ్లి వచ్చే లోపు మాదేష్‌ను ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
రూ.20 లక్షల విలువైన గంజాయి పట్టివేత
జామి: విజయనగరం జిల్లా జామి మండలం లక్ష్మీపురం వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఎస్సై రాజు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ బొలేరో వాహనంలో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. 28 బస్తాల్లో గంజాయిని రవాణా చేస్తున్నారు. దీని విలువ రూ. 20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులు వ్యాన్‌ను వదిలి పరారయ్యారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీలో టీచర్ల ఆందోళన ఉదృతం
-
ఏపీలో టీచర్ల ఆందోళన ఉదృతం
విజయనగరం: ఏపీలో ఉపాధ్యాయులు ఆందోళన తీవ్రతరం చేశారు. ఉపాద్యాయులు అక్రమ బదీలు, ప్రభుత్వ పాఠశాలల మూసివేతలు ఆపాలని డిమాండ్ చేస్తూ టీచర్లు ఆందోళన చేస్తున్నారు. విజయనగరం కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమానికి భారీగా ఉపాధ్యాయులు తరలిరావడంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోవడానికి యత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ స్థాయిలో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరగడంతో.. పలువురు పోలీసులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనలో కలక్టరేట్ గేట్ ధ్వంసమైంది. అదే విధంగా రాష్రంలోని అన్ని జిల్లాల్లోనూ టీచర్లు డీఈవో కార్యాలయాలను ముట్టడించి నిరసనలకు దిగారు. -
సర్వే పనితీరు మార్చుకోవాలి
విజయనగరం కంటోన్మెంట్: రాష్ట్ర స్థాయిలో సర్వే శాఖ పనితీరును మార్చుకోవాలని సర్వే శాఖ కమిషనర్ సీహెచ్.విజయమోహన్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సర్వేయర్లతో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ రైతుల భూముల వివరాల్లో పేర్లు మార్చే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. దీనివల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఉద్యోగుల వారసులు కూడా ఈ విషయంలో ఇబ్బందులు పడే ప్రమాదముందన్నారు. రైతుకు భూమే వెన్నెముకనీ, రికార్డుల్లో పేర్లు మారిపోతే ఎలా అని ప్రశ్నించారు. రైతులే వారి భూమిని సబ్ డివిజన్ చేసుకుని విక్రయించుకునే నూతన విధానాన్ని అమలు పర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఎఫ్‌ఎంబీల డిజిటలైజేషన్ ప్రక్రియ నిలిచిపోయిందనీ, ఇంకా జిల్లాలో చేయాల్సిన 32 వేల ఎఫ్‌ఎంబీల డిజిటలైజేషన్ ప్రక్రియ వెంటనే ప్రారంభించేందుకు ఏపీ శాక్తో మాట్లాడుతానన్నారు. మొత్తం సర్వే ప్రక్రియంతా ఆన్లైన్లోనే నడవాలన్నారు. నెలాఖరు గడువు జిల్లాలో వివిధ గ్రీవెన్స్ పిటిషన్లు, సర్వే అప్లికేషన్లు ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు నెలల్లోనే తాను వస్తానని అప్పటికి ఎటువంటి పెండింగ్ ఉండకూడదన్నారు. సమీక్షలో ఆర్డీడీ డి.బి.డి.బి.కుమార్, ఏడీ ఎం.గోపాల రావు, పర్యవేక్షకులు రాంబాబు, కార్యాలయ అధికారులు, జిల్లా సర్వేయర్లు పాల్గొన్నారు. -
మావోయిస్టు కమాండర్ హతం!
విజయనగరం: జిల్లాలోని ఆంధ్రా ఒడిశా సరిహద్దులో శనివారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఓ మావోయిస్టు కీలక నేత మృతి చెందినట్లు తెలిసింది. మావోయిస్టులు ఉన్నట్లు ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు.. అడవిలోకి వెళ్లారు. మావోలు తారసపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో మావో కమాండర్ చనిపోయినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
డెంకాడలో ఘోర రోడ్డు ప్రమాదం
– ఆటోను ఢీకొన్న లారీ – ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురి దుర్మరణం – మరో నలుగురికి తీవ్ర గాయాలు – శోకసంద్రమయిన కేంద్రాసుపత్రి సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయనగరం - నాతవలస ఆర్అండ్బీ రహదారిపై డెంకాడ మండలంలోని చందకపేట సమీపంలో మధ్యాహ్నం 1.45గంటల సమయంలో లారీ– ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. విశాఖపట్నం అక్కయ్యపాలేనికి చెందిన ముక్కుబంగార్రాజు శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం స్టాండ్‌నుంచి ఆటో నడుపుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం కొందరు ప్రయాణికులను ఎక్కించుకుని నాతవరం దాటి విజయనగరం వైపు వస్తుండగా విజయనగరం నుంచి ఎదురుగా వస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన లారీ అతివేగంతో వస్తూ బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనతో ఆటో రెండు పల్టీలు కొట్టి నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు విజయనగరంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మరణించాడు. గాయపడిన నలుగురు విజయనగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనలో మృతి చెందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. పూసపాటిరేగ మండలం గులివిందపేటకు చెందిన గులివింద అప్పలనాయుడు(45), అదే మండలం చోడమ్మ అగ్రహారానికి చెందిన ఆవాల శంకరరావు(48), భోగాపురం మండలం మాల నందిగాంకు చెందిన మిరప గోవింద(37), డెంకాడకు చెందిన బంగారి సూరి(34), విజయనగరం పట్టణంలోని కోరాడ వీధికి చెందిన ఆర్.రాజేష్(23), శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్లపల్లికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నెల్లిమర్ల అప్పారావు(30) మృతి చెందిన వారిలో ఉన్నారు. గాయపడిన వారిలో డెంకాడకు చెందిన బంగారి అప్పారావు, పి.శ్రీను, విశాఖపట్నం అక్కయ్యపాలేనికి చెందిన ఆటో డ్రైవర్ ముక్కు బంగార్రాజు, విజయనగరానికి చెందిన ఆర్.రాజశేఖర్ ఉన్నారు. మృతులు, గాయపడ్డ వారిలో అత్యధికం ప్రైవేటు కంపెనీల్లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. మృతులపైనే కుటుంబీకులు ఆధారపడి ఉన్నారు. లారీ డ్రైవర్, క్లీనర్ పరారీ మితిమీరిన వేగంతో ప్రమాదానికి కారణమైన పశ్చిమ బెంగాల్‌కు చెందిన లారీ డ్రైవర్, క్లీనర్ ప్రమాదం సంభవించిన వెంటనే ఘటనా స్థలం నుంచి చూస్తుండగానే పారిపోయారు. చావు బతుకుల్లో ఉన్న క్షతగాత్రులను వదిలేసి పరారయ్యారు. ఈ మేరకు డెంకాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఎల్.కె.వి.రంగారావు, విజయనగరం ఆర్డీఓ శ్రీనివాసమూర్తి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఇక జిల్లా కేంద్రాస్పత్రిలో ఉన్న మృతుల కుటుంబీకులను, క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పరామర్శించారు. ఇదిలా ఉండగా, మృతుల కుటుంబీకుల ఆర్తనాదాలతో విజయనగరం జిల్లాకేంద్రాసుపత్రి శోకసంద్రమయ్యింది. -
గ్యాస్ సిలిండర్ పేలుడు: బాలుడి మృతి
విజయనగరం: విజయనగరం జిల్లాలోని బాడంగి మండలం ఎరుకులపాకలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఓ ఇంట్లో గురువారం మధ్యాహ్నం గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఇళ్లు కూలిపోవడంతో పాటు పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో ఇంట్లో ఉన్న వేణు(10) అనే బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు -
భూముల పంపిణీపై దళితు రైతుల ఆవేదన
-
అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు
► పెండింగ్ కనెక్షన్లను త్వరగా గ్రౌండింగ్ చేయాలి ► జేసీ శ్రీకేశ్ బి. లఠ్కర్ విజయనగరం కంటోన్మెంట్ : అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని జేసీ శ్రీకేశ్ బి.లఠ్కర్ అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పౌరసరఫరాల అధికారులు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, సంబంధిత డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న దీపం కనెక్షన్లను త్వరగా గ్రౌండింగ్ చేయాలన్నారు. సుమారు 4.78 లక్షల కార్డుదారులకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో దీపం పథకం కనెక్షన్లపై అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు మార్చిలోగా గ్యాస్ కనెక్షన్లు అందించాలన్నారు. ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఐదు కిలోల గ్యాస్ సిలిండర్‌తో కూడిన స్టవ్‌ను అందించాలన్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించడానికి గ్రామస్థాయి అధికారులు, రేషన్ డీలర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. అలాగే ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సాధికార సర్వే గమనిస్తే ఎవరికి గ్యాస్ కనెక్షన్ లేదో తెలుస్తుందని చెప్పారు . జూన్ చివరి నాటికి అర్హులందరికీ కనెక్షన్లు మంజూరు చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. దీపం కనెక్షన్లపై ప్రతి 15 రోజులకోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ ఏజెన్సీదారులు నగదురహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సమావేశంలో డీఎస్ఓ జె. శాంతికుమారి, ఏఎస్ఓ పి. నాగేశ్వరరావు, హెచ్‌పీసీఎల్ సేల్స్ మేనేజర్లు ఎం. చౌదరి, వివిధ గ్యాస్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు శ్రీధర్ రాజా, డీలర్లు శ్రీనివాసరావు, టి. సీతారామయ్య, రామకృష్ణ, వినియోగదారుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
తమ్ముళ్ల ఇళ్ల వ్యాపారం
► నాడు అంగన్వాడీ, షిప్ట్ ఆపరేటర్ల పోస్టుల విక్రయం ► మొన్న రేషన్‌కార్డులు, పింఛన్లకు ఆమ్యామ్యాలు... ► పథకం వచ్చిందంటే తమ్ముళ్ల పంట పండినట్టే... ► కాసులే పరమావధిగా లబ్ధిదారుల ఎంపిక సర్కారు అందించే పథకాల లక్ష్యాన్ని మార్చేస్తున్నారు. కాసులే లక్ష్యంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. జేబులు నింపుకోవడమే పనిగా పెట్టుకున్నారు. తొలుత అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టులు... అటు తరువాత విద్యుత్ సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు... మొన్నటికి మొన్న పింఛన్లు... రేషన్‌కార్డులు... ఇప్పుడేమో ఇళ్లు. వరుసగా వస్తున్న ఏ అవకాశాన్నీ తమ్ముళ్లు వదులుకోవడం లేదు. దరఖాస్తులు ఎక్కువ... మంజూరైనవి తక్కువ కావడంతో డిమాండ్ ఎక్కువై రేటు మరింత పెంచేస్తున్నారు. మళ్లీ... మళ్లీ వస్తుందో రాదోనన్న ఆందోళనతో వారడిగినంతా ఇచ్చి... వాటిని దక్కించుకుంటున్నారు. విజయనగరం : సర్కారు అందించే పథకాలు తెలుగు తమ్ముళ్లకు కాసులు కురిపిస్తున్నాయి. ప్రతీదానికీ ఓ రేటు నిర్ణయించేసి వసూలే లక్ష్యంగా పెట్టుకున్నారు. అంగన్వాడీ పోస్టులను ఏ విధంగా అమ్ముకున్నారో జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఒక్కో అభ్యర్థి నుంచి లక్షలాది రూపాయలు తీసుకుని ఉద్యోగాలు వేశారు. అందుకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయి. వీటిద్వారానే కోట్లాది రూపాయలు ఆర్జించారు. ముడుపుల బాగోతాన్ని కొందరైతే బాహాటంగానే బయటపెట్టారు. అటు తరువాత విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులైతే చెప్పనక్కర్లేదు. నియోజకవర్గాల వారీగా వాటాలేసుకుని అమ్ముకున్నారు. బొబ్బిలి, సాలూరు సబ్ డివిజన్ల పరిధిలో వాటాలు కుదరకపోవడంతో నియామకాలు సక్రమంగా జరగలేదని అధికారపార్టీ నేతలే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. సంక్షేమ పథకాల ముసుగులో... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో స్యాచురేషన్( సంతృప్తి) పద్ధతిలో సంక్షేమ పథకాలు మంజూరు చేశారు. అర్హులైన వారందరికీ ఆ ఫలాలు అందాయి. అప్పట్లో ముడుపులు ముట్టజెప్పాల్సిన పని ఉండేది కాదు. అటు తరువాత వచ్చిన ప్రభుత్వాల్లో కొంత తేడా వచ్చినప్పటికీ టీడీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. స్యాచురేషన్ అనేది లేకుండా పోయింది. పరిమిత సంఖ్యలో మంజూరు చేయడంతో పోటీ ఏర్పడింది. దీన్ని అవకాశంగా తీసుకుని అధికార పార్టీ నేతలు క్యాష్ చేసుకుంటున్నారు. రేషన్ కార్డు కోసం రూ. 2వేల నుంచి రూ. 5వేల వరకు ముడుపులు తీసుకున్నట్టు విమర్శలు వచ్చాయి. పింఛన్లకైతే రూ. 5వేల నుంచి రూ. 10వేల వరకు వసూళ్లు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎక్కడికక్కడ ఫిర్యాదులు కూడా వచ్చాయి. అడ్డగోలుగా లబ్ధిదారులను ఎంపిక చేశారని బాధితులు గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి ఫిర్యాదులిచ్చిన సందర్భాలు ఉన్నాయి. సాక్షాత్తు అధికార పార్టీ నేతలే పింఛన్ల ఎంపికలో అక్రమాలు జరిగాయని రోడ్డెక్కారు. దీనికి ఉదాహరణగా జియ్యమ్మవలస మండలాన్నే తీసుకోవచ్చు. ఇక్కడ, లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగలేదని, అనర్హులకు లబ్ధి చేకూర్చారని టీడీపీకి చెందిన ఎంపీపీ దత్తి కామేశ్వరి, ఆ పార్టీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు నేరుగా గ్రీవెన్స్సెల్కొచ్చి ఫిర్యాదు చేశారు. దీన్నిబట్టి పింఛన్ల మంజూరులో పెద్ద ఎత్తున చేతులు మారాయన్నది స్పష్టమయ్యింది. హౌస్ ఫర్ ఆల్తో వసూళ్లు మొదలు ఏడాదిన్నర క్రితం కేంద్రప్రభుత్వం ప్రకటించిన హౌస్‌ఫర్ ఆల్ స్కీమ్ అమలు కాకముందే టీడీపీ నేతలు వసూళ్లకు తెగబడ్డారు. ప్రభుత్వమే పూర్తిగా నిర్మించి ఇవ్వనుందనే ప్రకటనతో అర్హులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల రద్దీని టీడీపీ నేతలు క్యాష్ చేసుకున్నారు. మంజూరు పేరుతో ఒక్కొక్క ఇంటికి రూ. 15వేల నుంచి రూ. 30వేల వరకు ముడుపులు తీసుకున్నారు. మున్సిపాల్టీల్లో జరిగిన వసూళ్ల దందా అప్పట్లో చర్చనీయాంశమయ్యింది. విజయనగరం మున్సిపాల్టీని తీసుకుంటే స్థలం, ఇళ్లు లేని వారి కోసం 4,500ఇళ్లు అని, స్థలం ఉండి ఇళ్లు లేని వారి కోసం 4,300ఇళ్లు మంజూరైనట్టు అప్పట్లో అధికారులు ప్రకటించారు. తొమ్మిదేళ్ల తర్వాత అధికారం వచ్చిందని...సొమ్ము చేసుకోవడానికి ఇదొక అవకాశంగా ఎంచుకున్న తమ్ముళ్లు ఇళ్లను అనధికారికంగా పంచేసుకున్నారు. టీడీపీకి చెందిన ఒక్కో కౌన్సిలర్‌కు 50చొప్పున వాటాలేసేశారు. మిగతా వాటిని నియోజకవర్గ ప్రజాప్రతినిధి తమ అనుయాయులుగా ఉన్న వారికి కేటాయించారు. కొందరు కౌన్సిలర్లు తమకు కేటాయించిన ఇళ్లను ఎంచక్కా బేరం పెట్టేశారు. ఇల్లు కావాలంటే రూ. 15వేల నుంచి రూ. 30వేల వరకు ముట్టజెప్పాలని నేరుగా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ప్రసాదుల రామకృష్ణకు చెందిన 13వ వార్డు ప్రజలే నేరుగా మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఇళ్లు అమ్ముకున్నారని బాహాటంగానే నినాదాలు చేశారు. ఈ వ్యవహారమంతా కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు దృష్టికెళ్లింది. అయితే, హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ అమల్లోకి రాకపోవడంతో అవినీతి బాగోతం కాస్త సద్దుమణిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఇళ్ల పేరుతో ప్రస్తుతం ఎన్టీఆర్ ఇళ్ల సీజన్ నడుస్తోంది. ఎన్టీఆర్ రూరల్, అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద జిల్లాకు 19,437ఇళ్లు మంజూరయ్యాయి. వీటిని నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ నేతలు కేటాయించేసుకున్నారు. వారికి నచ్చినోళ్లను లబ్ధిదారులుగా ఎంపిక చేసుకున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 16,637మందికి ఇళ్లు మంజూరు చేశారు. రూరల్ హౌసింగ్ కింద 9118, అర్బన్ హౌసింగ్ కింద 6641, ప్రధానమంత్రి అవాస్ యోజన కింద 878ఇళ్లు మంజూరు చేశారు. ఇప్పుడీ లబ్ధిదారుల నుంచి వసూళ్లకు తెగబడ్డారు. ఒక్కో లబ్ధిదారుని నుంచి రూ. 5వేల నుంచి రూ. 30వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. వసూళ్ల బాధ్యతను వార్డుల వారీగా కొందరికి అప్పగించారు. ఇప్పుడా పనిలో ద్వితీయశ్రేణి నాయకులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల తొలి విడత బిల్లు రాకుండానే ముడుపులు ఎలా ఇవ్వగలమంటూ కొందరు మొండికేస్తున్నారు. అయినా వదలడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చి తీరాలిందేనంటూ పట్టుబడుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమయ్యింది. -
అందులో ఏముంది
► బహిర్గతం కాని రీ సర్వే నివేది ► లీజుకిచ్చిన ఏరియాలో రిజర్వుఫారెస్టు ఉందన్న డీఎఫ్ఓ ► ఇంతలోనే ఏసీబీకి పట్టుబడ్డ వైనం ► ఆ దెబ్బతో తవ్వకాల జోలికెళ్లని ఇతర అధికారులు ► అందులో వేలు పెడితే టార్గెట్ అయిపోతామన్న భయం ► అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతున్న తవ్వకాలు బడేదేవర కొండపైగల అనుమానిత రిజర్వు ఫారెస్టు ఏరియాలో మైనింగ్ జరుగుతూనే ఉంది. మైనింగ్ మెటీరియల్‌ను రవాణా చేసుకునేందుకు ఏకంగా రహదారులూ వేసేస్తున్నారు. లీజు భూమిలో రిజర్వు ఫారెస్టు ఏరియా ఉందన్న అనుమానంతో నిగ్గు తేల్చేందుకు వేసిన రీసర్వే కమిటీ నివేదిక నెలలు గడుస్తున్నా అధికారులు బయటపెట్టడం లేదు. దాని జోలికెళ్లినందువల్లే డీఎఫ్ఓ ఏసీబీకి పట్టుబడ్డారన్న క్రియేట్ చేశారు. అటు వైపు వెళ్లేందుకు ఏ ఒక్క అధికారి సాహసించకుండా లేనిపోని భయాందోళన కల్పిస్తున్నారు. అధికార పార్టీ నేతలే పరోక్షంగా అక్రమ మైనింగ్‌కు వత్తాసు పలుకుతున్నారు. విజయనగరం :పార్వతీపురం మండలం కోరి రెవెన్యూ పరిధిలో గల బడేదేవరకొండ భూముల్లోని 41ఎకరాలను చెన్నైకి చెందిన ఎంఎస్పీ గ్రానైట్ సంస్థకు ప్రభుత్వం లీజుకిచ్చింది. క్వారీ నిర్వహణకు 20సంవత్సరాల పాటు లీజుపొందామంటూ ఎంఎస్పీ సంస్థ తవ్వకాలు చేపడుతోంది. గిరిజనులు దేవతగా పూజించే బడిదేవర కొండను మైనింగ్ కోసం ఎలా లీజుకిచ్చారని, సంగంవలస రెవెన్యూ పరిధిలోని రిజర్వు ఫారెస్టు భూముల్లో తవ్వకాలకు ఎలా అనుమతి ఇస్తారని, వేలాది ఎకరాలకు సాగునీరందించే కొండ వాగులు ధ్వంసమవుతాయని, తమ పొలాల పరిస్థితేంటని 12గ్రామాల గిరిజనులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఉద్యమం కాస్తా తీవ్రమైంది. వైఎస్సార్సీపీ, వామపక్షాలు గిరిజనులకు అండగా నిలిచి, పెద్ద ఎత్తున పోరాటం చేశాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన జెడ్పీ సమావేశంలో రగడ చోటు చేసుకుంది. ఈ వ్యవహారం జిల్లా పరిషత్‌ను కుదిపేసింది. రిజర్వు ఫారెస్టు ఏరియాలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. మైనింగ్ చేసేందుకు రిజర్వు ఫారెస్టు ఏరియాలో అనుమతులెలా ఇచ్చారని అధికారుల్ని నిలదీశారు. దీంతో రీసర్వే చేసేందుకు కమిటీని వేశారు. యథేచ్ఛగా మైనింగ్ ఎక్కడైతే రిజర్వు ఫారెస్టు ఉందని గిరిజనులు, అటవీశాఖాధికారులు గగ్గోలు పెడుతున్నారో అక్కడ యథేచ్ఛగా మైనింగ్ జరిగిపోతోంది. రీసర్వే నివేదికపై స్పష్టత ఇచ్చేవరకు అక్కడ మైనింగ్ నిలిపివేయాల్సి ఉన్నా ఎవరూ అడ్డుకోవడంలేదు. ఎప్పుడైతే డీఎఫ్ఓ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారో అప్పటి నుంచి అటువైపు ఏ అధికారీ వెళ్లడం లేదు. అటు వెళితే టార్గెట్ అయిపోతామేమో, పట్టించేస్తారేమో అన్న భయం అధికారులకు పట్టుకుంది. దీంతో అక్కడ అడ్డగోలుగా మైనింగ్ జరిగిపోతోంది. అటు రీసర్వే... ఇటు డీఎఫ్‌ఓపై ఏసీబీ దాడి బడేదేవరకొండపై వేసిన రీసర్వే కమిటీ సభ్యులైన మైనింగ్ ఏడీ, పార్వతీపురం ఆర్డీవో, సర్వే అధికారి, డీఎఫ్ఓ అనుమానిత రిజర్వు ఫారెస్టు ఏరియాలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. దానితో పాటు రికార్డులు కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. విచారణలో ఏమి నిర్ధారించారో చెప్పాల్సిన సమయంలో కమిటీలో సభ్యుడైన డీఎఫ్ఓ రమణమూర్తి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అనుకూల నివేదిక ఇచ్చేందుకు లంచం అడిగారని చెప్పి బడేదేవరకొండ మైనింగ్ కంపెనీ యజమాని రాజధానికి చెందిన ఏసీబీ అధికారులను ఆశ్రయించడం, వ్యూహాత్మకంగా డీఎఫ్ఓను పట్టించడం జరిగిపోయింది. లీజుపొందిన మైనింగ్ ఏరియాలో రిజర్వు ఫారెస్టు ఉందని విచారణ నివేదికలో స్పష్టంగా పేర్కొన్న తర్వాత లంచం ఎందుకు అడుగుతానని ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సమయంలో డీఎఫ్ఓ రమణమూర్తి తన వాదన విన్పించారు. తద్వారా ఇక్కడ ఏసీబీ దాడి వెనుక ఏదో రాజకీయం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. చెన్నైకు చెందిన ఎంఎస్పీ సంస్థకు అనుమతులు రావడం వెనక సీఎంకు సన్నిహితంగా ఉన్న రాజ్యసభ సభ్యుడి జోక్యం ఉందని, ప్రభుత్వ స్థాయిలో ఆయన చేసిన లాబీయింగ్‌తోనే ఈ అనుమతులొచ్చాయని, రీసర్వేలో ఆ భూములు రిజర్వు ఫారెస్టులోకి రావంటూ రిపోర్టు ఇచ్చేలా డీఎఫ్‌ఓపై ఒత్తిళ్లు చేశారని, ఈ క్రమంలో ఏసీబీ అధికారులకు పట్టించారనే వాదనలు ఉన్నాయి. బయటకు రాని సర్వే నివేదిక రీసర్వే కమిటీ వేసి దాదాపు ఆరు నెలలైంది. అటు రికార్డులు, ఇటు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయింది. కానీ రీసర్వేలో ఏమిటి నిర్ధారించారో బయటకు రాలేదు. నివేదికను గుట్టుగానే ఉంచుతున్నారు. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సమయంలోనే డీఎఫ్ఓ రమణమూర్తి బాహాటంగానే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. లీజు పొందిన ఏరియాలో రిజర్వు ఫారెస్టు ఉందని ఏసీబీ అధికారుల ముందే స్పష్టంగా చెప్పారు. అక్కడే చెప్పారంటే రీసర్వే నివేదికలో స్పష్టంగా చెప్పి ఉంటారనేది సుస్పష్టం. ఇక, మిగతా వారి అభిప్రాయమేంటో ఇప్పటికే చెప్పి ఉంటారు. కానీ, వారేం చెప్పారో అన్నది నేటికీ బయటపెట్టడం లేదు. అసలు రిజర్వు ఫారెస్టు ఉందా? లేదా? అనేది ప్రశ్నగానే ఉంది. -
అగ్నిప్రమాదంలో వృద్ధురాలు సజీవ దహనం
బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కూరాడలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ ఇల్లు తగలబడి అప్పాయమ్మ అనే వృద్ధురాలు సజీవ దహనమైంది. ఆరు పశువుల పాకలు దగ్ధం కాగా రెండు పశువులు మృతి చెందాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. -
హీరాఖండ్ ఘటనపై ఎన్ఐఏ విచారణ
విజయనగరం: విజయనగరం జిల్లా కూనేరు స్టేషన్ వద్ద జరిగిన జగదల్ పూర్-భువనేశ్వర్ హీరాఖండ్ రైలు ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. ప్రమాదంపై అనుమానాలు తలెత్తడంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఏపీ సీఐడీ బృందాలు ఆ ప్రదేశాన్ని సోమవారం పరిశీలించాయి. కుట్ర జరిగి ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీఐడీ విభాగం కూడా సోమవారం సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించింది. ఈ బృందంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ద్వారకా తిరుమలరావు, ఐజీ అమిత్ గార్గ్ ఉన్నారు. ఈ ఘటనలో మావోయిస్టుల ప్రమేయం ఉండొచ్చనే అంశాన్ని అధికారులు కొట్టివేయలేకపోతున్నారు. కాగా, ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన ఓ బోగీ నుంచి మరో రెండు మృతదేహాలను సోమవారం వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య 41కి పెరిగింది. -
విద్రోహమా..? అలసత్వమా..?
-
విద్రోహమా? అలసత్వమా?
హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై అనుమానాలు హీరాఖండ్ ప్రమాదానికి కారణమేమిటి? పట్టాలు ఎలా విరిగాయి? దుండగులెవరైనా పట్టాలను ముందుగానే కట్ చేశారా?... క్రాస్‌గా విరగాల్సిన రైలు పట్టాలు షార్ప్‌గా ఎందుకు విరిగాయి... అసలిది ప్రమాదమా లేక విద్రోహుల పనా?... లేక రైల్వే అధికారుల అలసత్వమా? ప్రమాదానికి ముందు ఆ మార్గంలో గూడ్స్ రైలు వెళ్లాక సమీపంలోని క్యాబిన్ మాస్టర్ చెక్ చేయలేదా?.. ఇలా అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో వారు పలు సందర్భాల్లో దాడులకు పాల్పడ్డారు. తొమ్మిదేళ్ల క్రితం కూనేరు రైల్వే స్టేషన్‌ను పేల్చేశారు. కూనేరు పక్కనున్న గుమ్మడ స్టేషన్‌ను ఏడేళ్ల క్రితం పేల్చేశారు. ఆ తర్వాత అక్కడ కొత్త స్టేషన్ నిర్మించారు. అదే స్టేషన్లో ఓ పోలీసును చంపి మరీ నగదు దోచుకుపోయారు. ఇలాంటి ఘటనలు ఈ ప్రాంతంలో నిత్యం జరుగుతూనే ఉంటాయి. దీంతో సహజంగానే విద్రోహ చర్య అన్న అనుమానం వస్తుంది. కానీ ఆ ప్రాంతంలో దాదాపు ఐదేళ్ల నుంచి మావోయిస్టుల కదలికలు లేవని పోలీసులు చెబుతున్నారు. రైల్వే అధికారులే తమ అలసత్వం బైటపడకుండా ఇలా విద్రోహచర్య వాదనను తెరపైకి తెస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. – కూనేరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి, సాక్షి, విశాఖపట్నం 24 నిమిషాల ముందు సాఫీగా.. రాత్రి 10.40 గంటలకు ఇదే రెండవ ట్రాక్‌పై ఓ గూడ్స్ రైలు సాఫీగా వెళ్లింది. 11.05 గంటలకు హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఇదే ట్రాక్‌పై పట్టాలు తప్పింది. 25 నిమిషాల్లో అక్కడి పరిస్థితులు మారిపోయాయి. పట్టాలు సరిగ్గా లేకపోతే గూ డ్స్ వెళ్లినప్పుడే ప్రమాదం సంభవించి ఉండాలి. కానీ అలా జరగలేదు. పట్టాలు షార్ప్‌గా కట్ అయ్యాయి. ఎడ్జ్ కట్ కావాల్సినవి షార్ప్ కట్ ఎందుకు అయ్యాయనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రైలు రాకముందే కట్ అ యి ఉన్నట్లు భావిస్తున్నారు. పట్టాలను గమనించడంతోనే డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారని, దాంతో బోగీలు ఒకదానికొకటి గుద్దుకున్నాయని రైల్వేవర్గాలంటున్నాయి. సాధారణంగా చలికాలంలో పట్టాలు కాస్త సంకోచించి ఉంటాయి. అది కూడా ప్రమాదాలకు కారణమవుతుంటుంది. కానీ ఇక్కడ పట్టాలు ముందే తెగిపడి ఉండటం వల్లనే ప్రమాదం జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. విద్రోహుల పనేనా...? సిబ్బందిని బెదిరించి విద్రోహులు పట్టాలు తప్పించి ఉంటారేమోనన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానంతో రైల్వే ఉన్నతాధికారులు పలువురు స్థానిక సిబ్బందిని విచారిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే వచ్చే నెల 3న రైల్వే జీఎం పర్యటన ఉండటంతో ట్రాక్‌కు మరమ్మతులు చేస్తున్నారు. ఇందులో భాగంగా పట్టాలు సరిగ్గా ఉన్నాయో లేదో కచ్చితంగా చూస్తారు. కానీ ఇక్కడ చూడలేదు. గూడ్స్ వెళ్లిన తర్వాత ట్రాక్ చెక్ చేయలేదు. రైల్వే క్యాబిన్ కూడా పక్కనే ఉంది. అక్కడ క్యాబిన్ మాస్టర్ కూడా ఉంటారు. అయితే ఆయన పట్టాలు కట్ అయిన విషయాన్ని గమనించలేదా? లేక చూసి చూడనట్లు వదిలేశారా అనేది తేలాల్సి ఉంది. కీమ్యాన్లపై వదిలేయడమే కారణమా? మరోవైపు ఈ దుర్ఘటనకు రైల్వే అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. రైల్వే ట్రాక్‌ను నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారులు ఆ పని చేయకుండా కింది స్థాయి కీమ్యాన్లపైనే వదిలేశారన్న ఆరోపణలు రైల్వే వర్గాల నుంచే వెల్లువెత్తుతున్నాయి. ఆయా స్టేషన్ల పరిధిలో రైలు పట్టాలను పర్యవేక్షణకు వివిధ స్థాయిల్లో ఇంజినీరింగ్ అధికారులుంటారు. రాయగడలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (నార్త్), విజయనగరం జిల్లా పార్వతీపురం కేంద్రంగా సీనియర్ సెక్షన్ ఇంజినీరు (పర్మనెంట్ వే) ఉంటారు. ఆయన కింద గుమ్మడలో జూనియర్ ఇంజినీర్, వీరందరిపై పర్యవేక్షణకు విశాఖలో సీనియర్ డివిజనల్ ఇంజినీరు (నార్త్) విధులు నిర్వహిస్తారు. సంబంధిత దిగువ స్థాయి ఇంజినీర్లు పుష్ (తోపుడు) ట్రాలీ, మోటారు ట్రాలీలపై తరచూ ట్రాక్‌లను తనిఖీ చేయాలి. పట్టాలపై ఎక్కడైనా లోపాలు కనిపిస్తే తక్షణమే సరి చేయించాలి. కానీ కొన్నాళ్లుగా ఇప్పుడు ప్రమాదం జరిగిన సెక్షన్‌తో పాటు డివిజన్లోని పలు ప్రాంతాల్లో వీరు ట్రాలీలపై తనిఖీలే సమగ్రంగా చేయడం లేదని తెలుస్తోంది. కాని తనిఖీలకు వెళ్లినట్టు రికార్డుల్లో చూపుతూ టీఏ, డీఏలు డ్రా చేస్తున్నట్టు సమాచారం. రికా ర్డుల ప్రకారం వీరు ట్రాక్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు లెక్క! కానీ వాస్తవానికి సంబంధిత ప్రాంతాల్లోని కీమ్యాన్లపైనే వీరు ఆధారపడుతున్నారని అంటున్నారు. గొట్లాం–సింగపూర్ రోడ్డు లైన్ చూసే ఇంజినీరింగ్ అధికారి మూడేళ్ల క్రితం నేరుగా నియమితులై విధుల్లో చేరినట్టు చెబుతున్నారు. ఆయనకు అంతగా çపట్టు లేకపోవడం వల్ల దిగువ స్థాయి సిబ్బంది చెప్పిన దానిపైనే ఆధారపడాల్సి వస్తోందని అంటున్నారు. పార్వతీపురం సెక్షన్ ఇంజినీరిం గ్ అధికారి పర్యవేక్షణపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈయన నాలుగేళ్లుగా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఇక విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న సీనియర్ డివిజనల్ ఇంజినీర్(నార్త్) పీ–వే నుంచి కాకుండా సివిల్ ఇంజినీ రింగ్ నుంచి రావడం వల్ల పీ–వేపై అవగాహన లేదన్న ఆరోపణలున్నాయి. ఇలా ప్రధాన లైన్లలో విధులు నిర్వహి స్తున్న ఇంజినీరింగ్ విభాగ అధికారుల నిర్లక్ష్యం, అవగా హనా రాహిత్యం వెరసి హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి కారణమయిందని రైల్వే వర్గాల్లో వినిపిస్తోంది. విద్రోహ చర్యగా చిత్రీకరణ? హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో బాధ్యులైన సంబంధిత అధికారులు, ఇంజినీరింగ్ అధికారులను బయట పడేయడానికి రైల్వే ఉన్నతాధికారులు ఎత్తుగడలు వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు విద్రోహ చర్య కారణమై ఉంటుందన్న ప్రచారాన్ని లేవదీయడం, విరిగిన పట్టాను ఎవరో కోశారన్న వాదనను తెరపైకి తేవడం ఇందులో భాగమేనని అంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం మావోయిస్టుల కదలికలున్న ఏరియా కావడంతో ఆ నెపాన్ని వారిపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని, తద్వారా ఈ ఘటనకు కారకులను తేలికగా బయట పడవచ్చన్నది వ్యూహంగా చెబుతున్నారు. మావోయిస్టులు ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి ముందు ప్రజలను అక్కడ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తారని, రైళ్లను పట్టాలు తప్పించి ప్రయాణికులను పొట్టనబెట్టుకునే దుశ్చ ర్యకు పాల్పడరని గత అనుభవాలను ఉదహరిస్తు న్నారు. ఈ హీరాఖండ్ ప్రమాదాన్ని కూడా ఏదోలా విద్రోహచర్యగా నెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నా యన్న ప్రచారం జోరుగా సాగుతోంది. -
రైలు ప్రమాదంలో ఉగ్రకోణం?
విశాఖపట్నం: దాదాపు అర్ధరాత్రి సమయం.. ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా రైలు పట్టాలు తప్పడం బోగీలు చెల్లాచెదురవడం.. పెద్ద మొత్తంలో ప్రాణనష్టం చోటుచేసుకోవడం.. అంతకంటే ముందు వెళ్లిన రైలుకు ఏం నష్టం జరగకపోవడం ఇదంతా ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌కు జరిగిన ఘోర ప్రమాద నేపథ్యం. కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో పట్టాలు తప్పి ఇంజన్ సహా పలు బోగీలు బోల్తా పడ్డాయి. నాలుగు బోగీలు పక్క ట్రాక్‌పైనే వెళ్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 35 మందికిపైగా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదానికి కారణాన్ని ఇప్పటి వరకు ప్రకటించని అధికారులు తాజాగా ఉగ్రకోణం తీసిపారేయలేమని స్పష్టం చేశారు. హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం వెనుక విధ్వంసకకర కుట్రం దాగి ఉందని గట్టిగా అనుమానిస్తున్నారు. రైలు పట్టాలు రెండు చోట్ల విరిగి ఉండటం, అర్థరాత్రి ప్రమాదం జరగడం కూడా వారి అనుమానానికి మరింత బలం చేకూరుస్తోంది. ఇటీవల కాన్పుర్ రైలు ప్రమాదం వెనుక ఉగ్రవాద చర్య ఉందని పోలీసులు తేల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిరాఖండ్ ప్రమాదం వెనుక కూడా ఉగ్రవాదులు ఉన్నారనే కోణంలోనే విచారణ ప్రారంభించారు. అయితే, అన్నికోణాల్లో విచారణ జరుపుతామని వారు చెబుతున్నారు. త్వరలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
రైలు ప్రమాదంలో ఉగ్రవాదుల హస్తం?
-
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు, ఏపీ ప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియాగా ప్రకటించాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి కేంద్రం తరఫున 50 వేల రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 41 మందికి పైగా మరణించగా, మరో 100 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ముగ్గురు ఉన్నట్టు గుర్తించారు. గాయపడినవారిలో ఒడిశా, ఏపీకి చెందిన ప్రయాణికులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. -
పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు
విశాఖపట్నం: విజయనగరంలో జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్ల సమయాల్లో, వెళ్లే మార్గాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని రైళ్లు మొత్తానికే రద్దుకాగా మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు. ధన్‌బాద్ అలెప్పీ ఎక్స్‌ప్రెస్, హతియ యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లను టిట్టాగఢ్-రాయ్‌పూర్-నాగ్‌పూర్ మీదుగా దారిమళ్లించగా.. నాందేడ్-సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్‌ను కుర్టా రోడ్డు-అంగుల్ మీదుగా దారి మళ్లించారు. ఇక రాయ్‌గఢ్-విశాఖ ప్యాసింజర్, విశాఖ-కోరాపుట్, సంబల్పూర్-నాందేడ్ రైళ్లు రద్దు చేశారు. మరోపక్క, కోరాపుట్-విశాఖ రైలును రాయగఢ్ వరకే పరిమితం చేశారు. అయితే, ట్రాక్ పనులపై డీఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ వివరణ ఇచ్చారు. సాయంత్రానికి ట్రాక్ పనులు పునరుద్ధరిస్తామని చెప్పారు. రైలు ప్రమాదంపై సాక్షి టీవీతో మాట్లాడిన ఆయన రైలు ప్రమాదం విచారణ కమిటీ వేసినట్లు వివరించారు. ప్రమాదంపై ఇంకా ప్రాథమిక నిర్ధారణకు రాలేదని ఆయన అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో పట్టాలు తప్పింది. దీనితో ఇంజన్ సహా పలు బోగీలు బోల్తా పడ్డాయి. నాలుగు బోగీలు పక్క ట్రాక్‌పైనే వెళ్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 35 మందికిపైగా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది.