జనసందోహంగా వైఎస్‌ జగన్‌ పాదయాత్ర | YS Jagan Padayatra Successfully Run In Saluru | Sakshi
Sakshi News home page

జనసందోహంగా వైఎస్‌ జగన్‌ పాదయాత్ర

Published Tue, Nov 13 2018 11:33 AM | Last Updated on Tue, Nov 13 2018 4:46 PM

YS Jagan Padayatra Successfully Run In Saluru - Sakshi

సాక్షి, విజయనగరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసకల్పయాత్ర సాలూరు నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతోంది. హత్యయత్నం నుంచి తృటిలో బయటపడిన వైఎస్‌ జగన్‌ను చూడాలని ఆడపడుచులు, వృద్దులు, పిల్లలు పెద్ద ఎత్తున కదలివస్తున్నారు. దీంతో పాదయాత్ర జనసందోహంగా మారింది. జగన్‌తో నడిచి తన కష్టలను ఆయనతో పంచుకుంటున్నారు. ఆయనకు దేవుడి దీవెనలు ఉండాలని, ఎన్ని అవరోధాలు వచ్చిన తాము అండగా ఉన్నామనే భరోసాను జగన్‌కు ఇస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం తరువాత సాలూరు నియోజకర్గంలో పాదయాత్ర ముగించుకుని పార్వతీపురం నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.



పింఛన్లు రావడం లేదు..
రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం మంజూరు చేయడం లేదని కొయ్యనపేటకు చెందిన మహిళ జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి తిరిగినా అధికారుల్లో స్పందన ఏమాత్రం లేదని తెలిపారు. తమ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రానికి సొంత భవనం కూడా లేకపోవడంతో గ్రామంలోని పిల్లలు ఇంటి వద్దనే ఉంటున్నారని కొయ్యనపేటకు చెందిన గ్రామస్తులు జగన్‌కు వివరించారు. పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ను మక్కువ మండలం తూరుమామిడి గ్రామస్తులు కలిశారు. ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లో ఉన్న తమ గ్రామానికి ఏళ్ల తరబడి అడిగినా కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేక పోయారని గ్రామస్థులు జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని మక్కువ ప్రభుత్వం జూనియర్‌ కళాశాల విద్యార్ధినులు జగన్‌కు వినతి పత్రం సమర్పించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement