Praja Sankalpa Yatra
-
విప్లవాత్మక మార్పులకు అది రాచబాట
నెహ్రూనగర్/కర్నూలు(టౌన్)/మక్కువ: ప్రజల కష్టాలు తెలిసిన నేత సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని వైఎస్సార్సీపీ శ్రేణులు నినదించాయి. అన్ని వర్గాల సంక్షేమాభివృద్ధి కోసం విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టి, చరిత్ర సృష్టించారని కొనియాడాయి. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా విప్లవాత్మక మార్పులకు బాటలు వేసిన వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలు వేడుకలు నిర్వహించారు. ప్రజా సంకల్ప యాత్ర విప్లవాత్మక మార్పులకు రాచబాట అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు పరిపాలనలో భాగస్వామ్యం లభించిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజిక సాధికారత సాధించారని, రాష్ట్రంలో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు కళ్లెదుటే కనిపిస్తున్నాయని పార్టీ నేతలు అన్నారు. ప్రతి ఊళ్లోనూ మార్పు కనిపిస్తోందని చెప్పారు. గుంటూరులో మంత్రి విడదల రజిని పార్టీ కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల్లో ఉండటమే రాజకీయం అని నమ్మిన నేత జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూసి మేనిఫెస్టో రూపొందించారని చెప్పారు. ఇప్పటి వరకు 99 శాతానికిపైగా హామీలు అమలు చేసిన నాయకుడు జగనన్న అని తెలిపారు. కర్నూలులో ఘనంగా కార్యక్రమాలు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్పర్సన్ విజయమనోహరి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలులోని వైఎస్సార్ సర్కిల్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, పత్తికొండలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, సంజామలలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. తూర్పు గోదావరిజిల్లా కొవ్వూరులో హోం మంత్రి తానేటి వనిత కేక్ కట్ చేశారు. కాకినాడలో మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. వైఎస్ జగన్సీఎంగా ప్రజారంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కేక్‌లు కట్ చేసి సందడి చేశారు. పలు ప్రాంతాల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. తణుకులో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, బువ్వనపల్లిలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ప్రజాసంకల్ప యాత్ర ఓ చారిత్రక ఘట్టమని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. కోట్లాది హృదయాలను స్పృశిస్తూ.. 2017 నవంబర్ 6వ తేదీన వైఎస్ జగన్ ఇడుపులపాయలో ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. కోట్లాది హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన పాదయాత్ర ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 134 శాసనసభ నియోజక వర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజులపాటు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఈ యాత్రలో 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు. పాదయాత్ర ఆద్యంతం జననేతను మహిళలు, చేయూతకు నోచుకోని వృద్ధులు, ఉపాధి లేని యువత, రైతులు, రైతు కూలీలు సహా కలుసుకోని వర్గం అంటూ లేదు. కావాలి జగన్.. రావాలి జగన్.. అంటూ నినదించారు. -
విజయ సంకల్పానికి ఐదేళ్లు
-
ప్రజా సంకల్ప పాదయాత్రకు ఐదేళ్లు
పసుపు రంగు కంచుకోటను వైఎస్ జగన్ అనే ఒకే ఒక్కడు పునాదులతో సహా పెకలించిన జ్ఞాపకాలకు ఆ స్థూపం సజీవ సాక్ష్యం. రాజకీయ ఉద్ధండుల అంచనాలను పటాపంచలు చేస్తూ వైఎస్సార్ కుమారుడు రాసిన నవ చరితకు ఆ కట్టడమే తొలి అక్షరం. విలువలు వదిలేసిన నాటి పాలకులు కలలో కూడా భయపడేలా ప్రజాక్షేత్రంలో ఆయన చేసిన యుద్ధానికి ఆ నిర్మాణం ఓ నిదర్శనం. తన పద ఘట్టనలతో పల్లెపల్లెనూ చైతన్య పరుస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగించిన యాగానికి ఐదేళ్లు పూర్తయ్యాయి. అధికారంలోకి వచ్చాక ప్రజాక్షేత్రంలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న ఆయన జనం మనసులు గెలుచుకున్నారు. ఇచ్ఛాపురం రూరల్: రాజన్న బిడ్డగా, ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రజా సంకల్ప పాదయాత్రకు ఐదేళ్లు పూర్తయ్యాయి. 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర ఆయన సాగించిన పాదయాత్ర ఇచ్ఛాపురంలోనే ముగిసింది. 2017 నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుంటూ, ప్రజలకు భరోసా ఇస్తూ 2017, 2018, 2019 సంవత్సరాల్లో పాదయాత్రను కొనసాగించారు. తెలుగుదేశం పార్టీ అడుగడుగునా ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెరవకుండా ఎత్తుకున్న పనిని సమర్థంగా నిర్వర్తించారు. 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 54 మున్సిపాలిటీలు, 13 జిల్లాలు, 8 కార్పొరేషన్లు, 2,516 గ్రామాల గుండా 3,648 కిలో మీటర్ల మేర సాగిన ప్రజా సంకల్పయాత్ర 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో ముగిసింది. ఈ పాదయాత్ర తర్వాత 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్ సభ స్థానాలను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంది. 2019 మే 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు సంక్షేమం అనే పదానికి పర్యాయపదంగా మారిపోయారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేశారు. పాదయాత్రకు గుర్తుగా లొద్దపుట్టిలో నిర్మించిన విజయ స్థూపం ఆ నాటి కథలను అందరికీ గుర్తు చేస్తోంది. సమర్థ పాలకుడిగా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవస్థల దెబ్బకు దళారీలు మాయమయ్యారు. ‘కులం చూడం, మతం చూడం, పార్టీలు అసలే చూ డం...పేదరికం ఒక్కటే అర్హతకు ప్రామాణికం’ అన్నదే నేటి ప్రభుత్వం అజెండా. విద్య, వైద్యం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గృహాల నిర్మాణం వంటి ఎన్నో సంస్కరణలు అమలవుతున్నాయి. సాంఘిక భద్రతలో భాగంగా ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్నించే క్రమంలో పింఛన్లు, వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ఆర్థిక సాయం, ఆరోగ్య సంరక్షణ ద్వారా పేదలకు సాయం అందిస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా నేనున్నానంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో పేదలకు భరోసా ఇచ్చారు. మడమ తిప్పను, మాట తప్ప ను అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థను ప్రకటించి సంచలన సంస్క రణలకు శ్రీకారం చుట్టారు. చరిత్ర నిలిచి పోయేలా ప్రజా రంజక పాలన సాగిస్తున్న జగనన్న మరో 30 ఏళ్లు సీఎంగా ఉండటం గ్యారెంటీ. – పిరియా విజయ, జెడ్పీ చైర్పర్సన్, శ్రీకాకుళం సామాజిక న్యాయం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నదే సీఎం జగనన్న నమ్మిన సిద్ధాంతం. తాను నమ్మిన సిద్ధాంతాన్ని మాటల్లో చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. ఆయనతో కలసి ప్రజాసంకల్పయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే రాబోయే ఎన్నికలకు విజయాలు. – పిరియా సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే, ఇచ్ఛాపురం సమన్వయకర్త సంక్షేమానికి పెద్దపీట వెనుకబడిన ఉత్తరాంధ్ర తలరాతను మార్చేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. వలస ప్రాంతంగా పిలిచే నోటితో ఉపాధి కల్పించే స్థాయికి తీసుకువచ్చారు. కిడ్నీ ఆస్పత్రితో పాటు ఇంటింటికి తాగునీరు, పోర్టులు నిర్మాణాలు చేపట్టి దేవుడయ్యారు. ప్రతి కుటుంబానికి మేలు కలిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. విజయ స్థూపం సాక్షిగా మళ్లీ ఆంధ్ర ప్రదేశ్‌కు ముఖ్యమంత్రి జగనన్నే. – నర్తు రామారావు, ఎమ్మెల్సీ, శ్రీకాకుళం -
ప్రజాసంకల్ప యాత్రకు ఆరేళ్లు .. తిరుపతిలోని తుడా సర్కిల్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద సీఎం జగన్ ఫోటోకు పాలాభిషేకం (ఫోటోలు)
-
ప్రజా సంకల్ప యాత్రకు నేటితో ఆరు వసంతాలు పూర్తి
►ఏలూరు జిల్లా: సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కైకలూరులో సంబరాలు ►వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి,కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ, వైఎస్సార్ సీపీ నాయకులు,కార్యకర్తలు ►కృష్ణాజిల్లా: సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 6 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పెడన వైఎస్సార్సీపీ కార్యాలయంలో కేక్ కటింగ్ ►పాల్గొన్న పెడన పట్టణ వైఎస్సార్సీపీ కన్వీనర్ బండారు మల్లి, పార్టీ నాయకులు ►పశ్చిమగోదావరి జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పూర్తి చేసుకుని నేటితో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ►అనంతరం పేదలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ►తాడేపల్లి: పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్సీ, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ►హాజరైన పలు కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ►నెల్లూరు: జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ ఆఫీస్ లో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి కాకాని ►అనంతరం నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేసిన మంత్రి ►కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతి. ►ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ.. ‘ ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన ప్రజాసంకల్పయాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. పాదయాత్ర లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత 99 శాతం నెరవేర్చాం. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా క్యాడర్ కష్టపడి పని చెయ్యాలి. ►తిరుపతి: తుడా వైఎస్సార్ సర్కిల్ వద్ద ప్రజా సంకల్ప పాదయాత్ర ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు. ►సీఎం జగన్మోహన్రెడ్డి చిత్ర పటానికి పాలభిషేకం చేసిన మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, టౌన్ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్ రెడ్డి,టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయ చంద్రారెడ్డి, కార్పొరేటర్లు వెంకటేష్, మునిరామిరెడ్డి,పొన్నాల చంద్ర, నరసింహచారి పేదల కష్టాలు తెలుసుకునేందుకు వేసిన తొలి అడుగుకు ఆరేళ్లు పూర్తయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సంకల్ప యాత్ర (పాదయాత్ర)కు శ్రీకారం చుట్టి నేటి (సోమవారం)తో ఆరు వసంతాలయ్యాయి. 2017 నవంబరు 6వ తేదీన వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2017 నవంబరు 14 నుంచి 2018 డిసెంబర్ 3వ తేదీ వరకు 18 రోజుల పాటు ప్రజా సంకల్ప యాత్ర సాగింది. ఏడు నియోజకవర్గాలు, 14 మండలాలు, 66 గ్రామాలమీదుగా 263 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది జననేతతో కలసి అడుగులు వేశారు. పాదయాత్ర ద్వారా తెలుసుకున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను, అనుభవాలను మేనిఫెస్టోగా రూపొందించి 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చారు. రెండేళ్లలో 90శాతం, నాలుగున్నరేళ్లలో 99 శాతం హామీలు అమలు చేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజాసంకల్ప యాత్రకు ఆరు వసంతాలు పూర్తయిన సందర్భంగా సోమవారం కర్నూలులో పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కమిటీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటలకు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కేక్ కటింగ్ చేయనున్నట్లు జిల్లా కమిటీ పేర్కొంది. -
Fact Check: షరతులతోనే జగన్ పాదయాత్ర
సాక్షి, అమరావతి: చట్టం దృష్టిలో అందరూ సమానమే అన్నది రాజ్యాంగం స్పష్టం చేస్తున్న అంశం. కానీ చట్టానికి తాము అతీతమన్నట్టుగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యవహరిస్తోంది. అందుకు ‘ఈనాడు’, ఇతర ఎల్లో మీడియా వత్తాసు పలుకుతూ వక్రీకరణలతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నాయి. చంద్రబాబు, ఈనాడు రామోజీరావుకు మధ్య పరస్పర వ్యాపార, రాజకీయ సంబంధాలు ఉండొచ్చు. అందుకోసం చంద్రబాబును అర్జంటుగా సీఎంను చేసేయాలని రామోజీరావు ఆరాటపడుతూ ఉండొచ్చు. లోకేశ్‌కు లేని ప్రజాదరణను ఉన్నట్టుగా చూపించేందుకు నానా తంటాలు పడొచ్చు. కానీ చట్టానికి వాటితో ఏం పని? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అలా కాకుండా చట్టం తమ చుట్టం అని చంద్రబాబు, ఈనాడు రామోజీరావు భావిస్తూ రాజకీయ రాద్ధాంతం చేస్తుండటం విస్మయ పరుస్తోంది. అందుకే తాజాగా టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్రకు ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందంటూ కట్టుకథలతో కనికట్టు చేసేందుకు ఈనాడు తనకు అలవాటైన రీతిలో దిగజారుడు పాత్రికేయానికి పాల్పడుతోంది. లోకేశ్ పాదయాత్రకు నిబంధనల మేరకు పోలీసు శాఖ అనుమతిచ్చింది. అయినా సరే ‘యువ గళానికి ఆంక్షల సంకెళ్లు’ అంటూ ఈనాడు పత్రిక బుధవారం ఓ కథనాన్ని ప్రచురించడం ఎల్లో మీడియా దుష్ప్రచారానికి తాజా నిదర్శనం. పాదయాత్ర సజావుగా సాగేందుకు పోలీసులు చట్టంలో ఉన్న అతి సామాన్యమైన షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. ఆ షరతులు ఇప్పటికిప్పుడు కొత్తగా పెట్టినవి కావు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అమలవుతున్న భారత పోలీసు చట్టంలో పేర్కొన్నవే అవి. 2009లో సుప్రీంకోర్టు తన తీర్పులో కూడా స్పష్టం చేసిన షరతులనే ప్రస్తుతం పోలీసులు తమ అనుమతి పత్రంలో పేర్కొన్నారు. నాడు పోలీసులు నిర్దేశించిన, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం షరతులు ఇలా.. ► వైఎస్సార్సీపీ స్థానిక నేతలు పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను జిల్లా ఎస్పీలు/ నగర పోలీసు కమిషనర్లు, సంబంధిత ప్రాంతంలోని పోలీసు అధికారులకు ముందుగా తెలియజేయాలి. ► పాదయాత్రలోకానీ, పాదయాత్ర సందర్భంగా నిర్వహించే సభల్లో కానీ.. వచ్చే ప్రజలను నియంత్రించాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీదే. అంటే పాదయాత్ర నిర్వాహకులదే. వలంటీర్లను ఏర్పాటు చేసుకుని ప్రజలను నియంత్రించే బాధ్యత తీసుకోవాలి. ► పాదయాత్ర శాంతియుతంగా నిర్వహిస్తామని నిర్వాహకులు లిఖిత పూర్వకంగా తెలియజేయాలి. ► ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించకూడదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగితే, అల్లర్లు చెలరేగితే ఆ చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వారితో పాటు ఆ పాదయాత్ర నిర్వాహకులు కూడా బాధ్యత వహించాలి. వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో ప్రత్యక్షంగా పాల్గొనే కార్యకర్తలపై కేసులు పెడతారు. కానీ పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, నిర్వాహకులు తెరవెనుక ఉండిపోతారు. ఆ విధంగా కాకుండా వారిపై కూడా పోలీసులు తగిన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. పాదయాత్రను శాంతియుతంగా నిర్వహిస్తామని...అందుకు విరుద్ధంగా ఏదైనా విధ్వంసం జరిగితే తాము బాధ్యత వహిస్తామని నిర్వాహకులు ముందే లిఖిత పూర్వకంగా తెలియజేయాలి. ► పాదయాత్ర కొనసాగే పరిధిలోని పోలీస్‌స్టేషన్ హౌస్ అధికారి ప్రత్యేకంగా ప్రైవేట్ వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేసుకుని మరీ పాదయాత్ర/సభను వీడియో తీయించాలి. ఏదైనా విధ్వంసం జరిగితే సంబంధిత వీడియో క్లిప్పింగులను ఆధారాలుగా పరిగణిస్తూ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ స్టేట్మెంట్ రికార్డు చేయాలి. ఆ వీడియో సీడీనీ మెజిస్ట్రేట్ ఎదుట సమర్పించాలి. ► పాదయాత్రలో ఏదైనా విధ్వంసం సంభవిస్తే నిర్వాహకులు వెంటనే పోలీసు అధికారులను కలవాలి. పాదయాత్ర శాంతియుతంగా నిర్వహించేందుకు గాను రూట్‌మ్యాప్‌లో మార్పులు చేయాలి. ► ఎటువంటి ఆయుధాలను పాదయాత్రలో అనుమతించరు. ► పాదయాత్రలో ఏదైనా విధ్వంసంగానీ, దుస్సంఘటనగానీ జరిగితే పోలీసులు తగిన వీడియో ఆధారాలతో ప్రభుత్వానికి నివేదించాలి. వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తగిన నివేదికను రూపొందించాలి. అవసరమైతే వాటిని హైకోర్టుకుగానీ సుప్రీంకోర్టుకుగానీ సమర్పించాలి. ఎందుకంటే ఆ విధ్వంసం/ దుర్ఘటనపై సుమోటోగా హైకోర్టుగానీ సుప్రీంకోర్టుగానీ కేసు నమోదు చేయవచ్చు. అప్పుడు విచారణకు ప్రభుత్వం ఆ నివేదికను సమర్పించాలి. ► పాదయాత్రలో ఏదైనా విధ్వంసంగానీ దుర్ఘటనగానీ సంభవిస్తే న్యాయస్థానాలు సుమోటోగా కేసు నమోదు చేసి విచారిస్తాయి. బాధితులకు నిర్వాహకులతో నష్టపరిహారాన్ని ఇప్పిస్తాయి. అందుకోసం అవసరమైతే సిట్టింగ్/ రిటైర్డ్ న్యాయమూర్తితో క్లైమ్ కమిషన్‌ను న్యాయస్థానం ఏర్పాటు చేస్తుంది. ► పాదయాత్ర సందర్భంగా ఏదైనా విధ్వంసంగానీ దుర్ఘటనగానీ సంభవిస్తే మీడియా (ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియా) బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రాజ్యాంగం పత్రికా స్వేచ్ఛ కల్పించింది. కానీ సంచలనాలకు కాకుండా సంయమనానికి మీడియా అధిక ప్రాధాన్యమివ్వాలి. అందుకోసం మీడియా స్వీయ నియంత్రణ పాటించాలి. మీడియాను నియంత్రించడం అని కాదు గానీ ప్రెస్ కౌన్సిల్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించేలా పర్యవేక్షించాలి. వైఎస్ జగన్ పాదయాత్రకు అనుమతి కోరుతూ ఆయన పీఎస్ పి.కృష్ణమోహన్‌రెడ్డి 2017లో అప్పటి డీజీపీకి సమర్పించిన దరఖాస్తు ఇప్పుడెందుకీ రాద్ధాంతం? భారత పోలీసు చట్టం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి అవే షరతులతో ప్రస్తుతం పోలీసు శాఖ నారా లోకేశ్ పాదయాత్రకు అనుమతిచ్చింది. గతంలో వైఎస్ జగన్ పాదయాత్రకు విధించిన షరతులనే ప్రస్తుతం పేర్కొంది. కొత్తగా ఎలాంటి షరతూ విధించ లేదు. పోలీసులకు రూట్‌మ్యాప్‌ను ముందుగా తెలపాలి.. రూట్‌మ్యాప్‌కు కట్టుబడి పాదయాత్ర సాగాలి.. నిర్ణీత ప్రదేశాల్లోనే సభలు నిర్వహించాలి.. ప్రభుత్వ,ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించకూడదు.. ఎవరూ మారణాయుధాలు కలిగి ఉండకూడదు.. ఇలా ఎప్పటి నుంచో దేశంలో అమలులో ఉన్న సాధారణ షరతులనే పోలీసులు విధించారు. ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా తాము ఆనాడు తలచుకుని ఉంటే వైఎస్ జగన్ పాదయాత్ర చేయగలిగేవారా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తుండటం హాస్యాస్పదం. ఇటీవల చంద్రబాబు పాల్గొన్న కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాటలతో 11 మంది దుర్మరణం చెందారు. అందుకే పాదయాత్ర నిర్వాహకులు అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేకంగా అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని.. అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని సూచించారు. అందులో తప్పుబట్టడానికి ఏముంది? కేవలం నారా లోకేశ్ పాదయాత్రకు ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన లభించడం లేదన్నదే చంద్రబాబు, ఈనాడు రామోజీరావు ఆందోళన. అందుకే పోలీసులు సాధారణ షరతులతో ఇచ్చిన అనుమతిని వక్రీకరిస్తూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. తద్వారా లోకేశ్ పాదయాత్ర పట్ల లేని హైప్‌ను సృష్టించేందుకు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని స్పష్టమవుతోందనిపరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసుల షరతులు, సుప్రీంకోర్టు తీర్పులోని షరతులతో పాదయాత్రకు పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రం షరతులకు కట్టుబడే.. చరిత్రాత్మక పాదయాత్ర పోలీసు శాఖ విధించిన షరతులు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తునే వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర పూర్తి చేశారు. తన ‘ప్రజా సంకల్ప యాత్ర’ను 2017 నవంబరు 6న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభించి 341 రోజులపాటు 3,648 కి.మీ. మేర పాదయాత్ర నిర్వహించి.. 2019 జనవరి 10న ఇచ్ఛాపురంలో ముగించారు. పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను నిర్వాహకులు ముందుగానే సంబంధిత పోలీసు అధికారులకు అందజేశారు. సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రూట్‌మ్యాప్ రూపొందించారు. సభలు నిర్వహించేందుకు తగినంత విశాలమైన ప్రదేశాలను నిర్వాహకులు ముందుగానే ఎంపిక చేసుకుని పోలీసులకు తెలిపారు. పోలీసులు ఆమోదించిన తర్వాతే ఆ ప్రదేశాల్లో సభలు నిర్వహించారు. ఎక్కడ కూడా ముందుగా నిర్ణయించిన ప్రదేశంలో కాదని మరోచోట సభ నిర్వహించ లేదు. అంత పకడ్బందీగా రూట్‌మ్యాప్ అనుసరించారు. మైక్‌లను ఉపయోగించేందుకు ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. పాదయాత్రలో, పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన సభలు సక్రమంగా నిర్వహించేందుకు పార్టీ వలంటీర్లను ముందే నియమించారు. అందుకే అంతటి సుదీర్ఘ పాదయాత్రలో ఎక్కడా సాధారణ జనజీవనానికి ఇబ్బందులుగానీ ట్రాఫిక్ సమస్యలుగానీ తలెత్తనే లేదు. ఎక్కడా తోపులాటలుగానీ తొక్కిసలాటలుగానీ సంభవించలేదు. ప్రజా సంకల్ప యాత్ర ఆద్యంతం సజావుగా, సక్రమంగా సాగింది. వైఎస్ జగన్ పాదయాత్రకు విశాఖపట్నం పోలీసులు విధించిన షరతులు, మైక్ వినియోగానికి జారీ చేసిన అనుమతి పత్రం వైఎస్ జగన్ పాదయాత్రకు షరతులతోనే అనుమతి 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు ఉన్న వైఎస్సార్సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి 2017లో ‘ప్రజా సంకల్ప యాత్ర’పేరుతో చేపట్టిన పాదయాత్రకు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పోలీసు శాఖ షరతులతోనే అనుమతి మంజూరు చేసింది. పాదయాత్రకు అనుమతి కోరుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున ఆయన పీఎస్ పి.కృష్ణమోహన్‌రెడ్డి డీజీపీకి దరఖాస్తు చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులతో కూడిన బృందం అప్పటి డీజీపీ సాంబశివరావును కలిసి పాదయాత్రకు అనుమతి కోరింది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే డీజీపీ షరతులతో కూడిన అనుమతినిచ్చారు. పోలీసులు ఎన్నో షరతులు విధించడంతోపాటు సుప్రీంకోర్టు 2009లో ఇచ్చిన మార్గదర్శకాలు, షరతులను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పాదయాత్ర సాగే జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు ఆ షరతుల అమలును కచ్చితంగా పర్యవేక్షించాలని కూడా ఆయన ఆదేశించారు. -
విజయసంకల్పానికి నాలుగేళ్లు
-
సిక్కోలు గుండెల్లో ఆ గురుతులు పదిలం
ఇచ్ఛాపురం రూరల్: సరిగ్గా నాలుగేళ్ల కిందట.. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి వద్ద.. అశేష జన సందోహం ఓ చారిత్రక ఘట్టానికి సాక్షిగా నిలిచింది. 3,648 కిలోమీటర్ల మేర 341 రోజుల పాటు సాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ఆఖరి అడుగు లొద్దపుట్టిలో పడింది. ఆ అడుగే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు పునాదిని పటిష్టం చేసింది. నాలుగేళ్లయినా ఆ జ్ఞాపకాలు సిక్కోలు గుండెల్లో ఇంకా పచ్చగా మెదులుతున్నాయి. ఒక్కడిగా మొదలై.. ఒక్కొక్కరిని కలుపుకుంటూ.. ఉప నదులు తోడైన మహానదిలా రాష్ట్రమంతా సాగిన ఈ పాదయాత్ర చరిత్రలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు, 2,516 గ్రామాల గుండా సాగిన పాదయాత్ర ఆఖరి ఘట్టంలో వైఎస్ జగన్ చేసిన ప్రసంగం ఇంకా చాలా మందికి గుర్తుంది. నేడు అందరితో ప్రశంసలు పొందుతున్న నవరత్నాలను ఆనాడే వైఎస్ జగన్ వివరించారు. పాదయాత్రలో చూసిన కష్టాలతోనే సంక్షేమ పథకాలకు ఊపిరి పోశారు. ఈ యాత్ర ఇచ్చిన సత్తువతోనే జనం గుండెల్లో స్థానాన్ని పదిలం చేసుకున్నారు. యాత్ర ముగింపునకు గుర్తుగా ఇచ్ఛాపురంలో విజయ స్థూపం కూడా ఏర్పాటు చేశారు. ఇదిప్పుడు మంచి పర్యాటక స్థలంగా పేరు పొందింది. కోట్ల హృదయాలను గెలుచుకున్నారు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగిన ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా ఆయన ప్రజల కష్టాలను నేరుగా చూడటంతో అవి తీర్చడానికే హామీలిచ్చి 97 శాతం నెరవేర్చారు. ఆయనతో అడుగులు కలపడం అదృష్టంగా భావిస్తున్నాను. రానున్న ఎన్నికల్లో ఇచ్ఛాపురం నియోజకవర్గాన్ని జగనన్నకు కానుకగా ఇస్తాం. – పిరియా సాయిరాజు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, ఇచ్ఛాపురం ఆ చెమట చుక్కే అభివృద్ధికి చుక్కాని ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చిందించిన చెమట చుక్కలన్నీ రాష్ట్రాభివృద్ధికి చుక్కానిలయ్యాయి. ఓ సమర్థుడైన పాలకుడి పాలన కోసం ఎదురు చూసిన కోట్లాది మంది ప్రజల కలలను నిజం చేస్తూ ఆయన సంక్షేమ పాలన సాగిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఇచ్ఛాపురంలో పడిన జగనన్న అడుగుల చప్పుళ్లు, ఇచ్చిన హామీలు, నెరవేర్చిన వైనాలు సిక్కోలు ప్రజలు ఎప్పటికీ తమ గుండెల్లో పదిలంగానే ఉంటాయి. – పిరియా విజయ, జిల్లాపరిషత్ చైర్పర్సన్, శ్రీకాకుళం కలలో కూడా ఊహించని అవకాశం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ము ఖ్యమంత్రి బడుగు, బలహీన వర్గాలకు అత్యున్నత స్థానాలు ఇవ్వలేదు. తన క్యాబినెట్లో దళితులకు ఉన్నత పదవులు ఇచ్చిన జగనన్న ఇచ్ఛాపురం శివారు ప్రాంతంలో నన్ను డీసీఎంఎస్ చైర్‌పర్సన్‌గా ఎంపిక చేశారు. నాకు ఈ అవకాశం వస్తుందని కలలోనైనా అనుకో లేదు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించి, నా లాంటి వంద లాది మందిని అందలమెక్కించారు. – ఎస్.సుగుణ, డీసీఎంఎస్ చైర్పర్సన్ -
జగన్ సంకల్పం... జన సంక్షేమం
సాక్షి, పుట్టపర్తి: ప్రజా సంకల్పయాత్రలో అన్ని వర్గాలను పలకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక ‘నవరత్నాలతో’ రాష్ట్రంలో సంక్షేమ బాట పరిచారని ఎమ్మెల్యేలు తెలిపారు. ‘ప్రజాసంకల్ప యాత్ర’ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం వైఎస్సార్సీపీ శ్రేణులు జిల్లా అంతటా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. అన్నదానాలు, పేదలకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేసి నాయకులు సేవాభావం చాటుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడారు. పెనుకొండలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎంపీ గోరంట్ల మాధవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంకల్ప యాత్ర చరిత్ర సృష్టించిందని ఎమ్మెల్యే శంకరనారాయణ తెలిపారు. పేదల కన్నీళ్లు తుడిచి సీఎం జగన్ వారి గుండెల్లో నిలిచారన్నారు. పెనుకొండలో నాయకులతో కలిసి ఆయన కేట్ చేశారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. పెనుకొండలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులరి్పంచిన అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలనలో తనదైన మార్కు చూపించారని కొనియాడారు. రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. ప్రజా సంక్షేమానికి నాంది పలికిన మహా ఘట్టం ‘ప్రజా సంకల్ప యాత్ర’ అని అభివర్ణించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాల ప్రజలకు పథకాలు వర్తింపజేసి.. జనం మెచ్చిన నేతగా జగన్ నిలిచిపోయారన్నారు. సంక్షేమ పాలన ద్వారా జగన్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అమడగూరు మండలం గొల్లపల్లిలో భారీ కేక్‌ను ఎమ్మెల్యే కట్ చేసి నాయకులు, పిల్లలకు పంచిపెట్టారు. మడకశిరలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే తిప్పేస్వామి మడకశిర పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్లో ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే తిప్పేస్వామి వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. ప్రజా సంకల్పయాత్ర స్ఫూర్తితోనే సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’కు ఐదేళ్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి పేర్కొన్నారు. కదిరి పట్టణంలోని వైఎస్సార్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘన నివాళి అరి్పంచారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. హిందూపురంలో జయహో జగన్ నినాదం మార్మోగింది. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులరి్పంచిన అనంతరం భారీ కేక్‌ను ప్రజాప్రతినిధులు, నాయకులు కట్ చేశారు. పేదలకు అన్నదానం చేసి సేవాభావం చాటుకున్నారు. ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ధర్మవరం పీఆర్టీ సర్కిల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. (చదవండి: ఫ్యామిలీ డాక్టర్’: వైద్యం మరింత చేరువ) -
Praja Sankalpa Yatra: జనం చెంతకు జగనన్న అడుగులు (ఫోటోలు)
-
జనం జెండా - ఒకటే లక్ష్యం ఒకటే ఆశయం
-
YSRCP Plenary 2022: తిరుగులేని శక్తి.. అలుపెరుగని పోరు సాగించిన వైఎస్ జగన్
రాజకీయంగా వైరిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వైఎస్ జగన్‌ను, వైఎస్సార్సీపీని అణగదొక్కడానికి చేయని కుట్ర లేదు.. పన్నని కుతంత్రం లేదు. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సమస్యలు, సవాళ్లు, దాడులు ఎదుర్కొంది. అయినప్పటికీ వైఎస్ జగన్ ఒకే మాట.. ఒకే బాటగా ముందుకు సాగారు. ఏ దశలోనూ ప్రజల పక్షాన పోరాటాన్ని ఆపలేదు. సవాళ్లే సోపానాలుగా మలుచుకుని.. ఇద్దరితో మొదలై తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన వైఎస్సార్సీపీ ప్రస్తానాన్ని మూడో ప్లీనరీ నేపథ్యంలో ఓ సారి తరచి చూద్దాం. సాక్షి, అమరావతి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందారన్న విషాద వార్తను తాళలేక వందలాది మంది మరణించడం వైఎస్ జగన్‌ను, ఆయన కుటుంబీకులను తీవ్రంగా కలచివేసింది. ఆ కుటుంబాలన్నింటినీ పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతానని కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009 సెప్టెంబరు 25న నిర్వహించిన వైఎస్సార్ సంస్మరణ సభలో వైఎస్ జగన్ ప్రకటించారు. ఆ మేరకు 2010 ఏప్రిల్ 9న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓదార్పు యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ జగన్‌ను ఆదేశించింది. రాజకీయాలకు ఈ యాత్రతో ఏమాత్రం సంబంధం లేదని, తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికే యాత్ర చేపట్టామని తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిలతో కలిసి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి వైఎస్ జగన్ వివరించినా లాభం లేకపోయింది. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి.. వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను కొనసాగించారు. ప్రజల నుంచి అపూర్వ ఆదరణ రావడంతో ఓర్వలేకపోయిన కాంగ్రెస్‌లోని కొన్ని శక్తులు, టీడీపీతో కుమ్మక్కై కుట్రలకు తెరతీశాయి. వైఎస్ జగన్ ఆస్తులపై విచారణ జరిపించాలని నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కాంగ్రెస్ అధిష్టానం లేఖ రాయిస్తే.. కాంగ్రెస్ కనుసైగల మేరకు వైఎస్ జగన్ ఆస్తులపై దర్యాప్తు చేయించాలని నాటి ఎంపీ కె.ఎర్రన్నాయుడుతో టీడీపీ లేఖ రాయించింది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు చేస్తుండటంతో తన తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి, పులివెందుల శాసనసభ, కడప లోక్‌సభ, స్థానాలకు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఓ వైపు ఓదార్పు యాత్రను కొనసాగిస్తూనే.. మరో వైపు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమబాట పట్టారు. అప్పటి నుంచి అధికారం చేజిక్కించుకునే వరకు చోటుచేసుకున్న పరిణామాలు ఇలా ఉన్నాయి. చరిత్రాత్మకంగా ప్రజా సంకల్ప యాత్ర వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్ 6న ప్రజాసంకల్ప పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభించారు. ఎముకలు కొరికే చలిలో.. మండుటెండలో.. కుంభవృష్టిలో 14 నెలలపాటు 3,648 కి.మీ. దూరం సాగిన పాదయాత్రను 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. అన్నిచోట్లా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీడీపీ దుర్మార్గపు పాలనను కూకటివేళ్లతో పెకలిస్తూ 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని ప్రజలు అందించారు. దేశ చరిత్రలో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ (87 శాతం), 22 లోక్‌సభ (88 శాతం) స్థానాలను కట్టబెట్టారు. అజేయశక్తిగా అవతరణ 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి.. ఐదు డిప్యూటీ సీఎం పదవుల్లో నాలుగు ఆ వర్గాలకే ఇచ్చారు. హోంశాఖ మంత్రిగా తొలిసారిగా ఎస్సీ మహిళను నియమించి సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. మహిళలకు రిజర్వు చేసేలా చట్టం తెచ్చి మరీ ఆ వర్గాలకు పదవులు ఇచ్చారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, స్థానిక సంస్థల పదవుల్లోనూ ఆ వర్గాలకే పెద్దపీట వేశారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేస్తూ వారికి బాసటగా నిలుస్తున్నారు. 2022 ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చి సామాజిక మహా విప్లవాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. దీంతో వరుసగా జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించి తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో పూర్తికావస్తున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్లీనరీ ఏర్పాట్లు వైఎస్సార్సీపీ ప్రస్థానంలో కీలక ఘట్టాలు ►02.09.2009 : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్ట్టర్ ప్రమాదంలో హఠాన్మరణం ►09.04.2010: ఓదార్పు యాత్ర ప్రారంభం ►27.11.2010 : తమ ఆదేశాలను ధిక్కరించి ఓదార్పు యాత్ర చేపట్టారనే అక్కసుతో వైఎస్ జగన్ ఆస్తులపై విచారణ జరపాలని లేఖలు రాసిన కాంగ్రెస్, టీడీపీ ►29.11.2010: ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు, కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ రాజీనామా ►21.12.2010: రైతులు, చేనేత కార్మికులను ఆదుకోవాలనే డిమాండ్‌తో విజయవాడ కృష్ణా నదీ తీరాన వైఎస్ జగన్ ‘లక్ష్య దీక్ష’ ►11.03.2011: వైఎస్సార్సీపీ పేరు ప్రకటించిన వైఎస్ జగన్ ►12.03.2011: ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద వైఎస్సార్సీపీ పతాకం ఆవిష్కరణ, పార్టీ ఏర్పాటుపై ప్రకటన ►13.05.2011: కడప లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ జగన్ 5,45,672 ఓట్ల రికార్డు మెజార్టీతో ఘన విజయం. పులివెందుల శాసనసభ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ 81,373 ఓట్ల రికార్డు మెజార్టీతో విజయభేరి. ►08.07.2011:ఇడుపులపాయలో వైఎస్సార్సీపీ తొలి ప్లీనరీ ►10.08.2011: కాంగ్రెస్ ఎమ్మెల్యే, టీడీపీ ఎంపీ కె.ఎర్రన్నాయుడు చేసిన ఫిర్యాదులు ఆధారంగా వైఎస్ జగన్ ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు. ►21.08.2011: వైఎస్సార్సీపీలో చేరుతూ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు 19 మంది రాజీనామా. నెల్లూరు లోక్‌సభ స్థానానికి మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామా. ►27.05.2012: టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై పెట్టిన కేసుల్లో దర్యాప్తు కోసమని ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్ జగన్‌ను పిలిచి, అరెస్టు చేసిన సీబీఐ ►14.06.2012: ఉప ఎన్నికల్లో 17 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం ►21.12.2012: అక్రమ కేసులపై ‘జగన్ కోసం జనం’ పేరుతో కోటి సంతకాల సేకరణ ►24.09.2013: అక్రమ కేసుల్లో బెయిల్‌పై విడుదలైన వైఎస్ జగన్ ►05.10.2013: రాష్ట్ర విభజనను నిరసిస్తూ.. సమైక్య రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ లోటస్ పాండ్‌లో వైఎస్ జగన్ ఆమరణ దీక్ష ►18.12.2013: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం ►16.5.2014: సాధారణ ఎన్నికల ఫలితాల ప్రకటన.. 67 శాసనసభ స్థానాల్లో.. 8 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం.. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరం ►20.06.2014: శాసనసభలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌కు గుర్తింపు ►21.02.2015: అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టిన వైఎస్ జగన్ ►10.08.2015: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా ►29.08.2015: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర బంద్ ►26.01.2017: విశాఖ ఆర్కే బీచ్‌లో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన వైఎస్ జగన్‌ను రన్ వేపైనే అరెస్టు చేసిన పోలీసులు ►01.05.2017: రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్‌తో గుంటూరులో వైఎస్ జగన్ రైతు దీక్ష ►08.07.2017: నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న మైదానంలో వైఎస్సార్సీపీ రెండో ప్లీనరీ ►26.10.2017: వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయకపోవడాన్ని, శాసనసభలో ప్రతిపక్షం గొంతు నొక్కుతుండటాన్ని నిరసిస్తూ శాసనసభ సమావేశాలను బాయ్‌కాట్ చేసిన వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు. ►06.11.2017:ఇడుపులపాయలో ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం ►25.10.2018: విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ►09.01.2019: శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం వద్ద ప్రజాసంకల్ప పాదయాత్ర ముగింపు ►23.05.2019: ఎన్నికల్లో ఘన విజయం ►30.05.2019: రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం -
ఆదర్శ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి 90 శాతం హామీలను నెరవేర్చి దేశంలో ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా నిలిచారని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఇది ఏపీకి ఎంతో గర్వకారణమని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలన్నింటినీ కళ్లారా చూసి, వాటిని మేనిఫెస్టోలో హామీల రూపంలో పొందు పరిచి, ఆచరణలో చేసి చూపించిన అరుదైన నేత అని కొనియాడారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగిసి నేటికి మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ వైఎస్ జగన్ తన 3,648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రలో కోట్లాది మంది ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సీఎం జగన్ అందరి ఆదారాభిమానాలు చూరగొంటూ ముందుకు సాగుతున్నారన్నారు. ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి.. దిక్కుతోచని స్థితిలో ప్రతిపక్షాలు దుష్ప్రచారం, కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ స్పష్టమైన విజన్‌తో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నారని చెప్పారు. పాదయాత్రికులకు సత్కారం నాడు వైఎస్ జగన్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న రోశయ్య (అద్దంకి నియోజకవర్గం), డానియేల్, (ప్రత్తిపాడు నియోజకవర్గం), హరికృష్ణ (తిరుపతి నియోజకవర్గం), సురేష్ (నారావారిపల్లె), విక్రమ్ (కైకలూరు), ఇక్బాల్ బాషా (నంద్యాల), గోవిందరాజు (సత్తెనపల్లి), ఆనందరావు (పెదకూరపాడు), శ్రీనివాసరరెడ్డి (పాణ్యం), శ్రీను(అమలాపురం), వెంకటేశ్వరరెడ్డి (నరసరావుపేట), సతీష్ (పార్వతీపురం) తదితరులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫైబర్‌నెట్ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి, నవరత్నాల అమలు ప్రోగ్రామ్ వైస్ చైర్మన్ ఎ.నారాయణమూర్తి, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్పర్సన్ నారమల్లి పద్మజ పాల్గొన్నారు. -
మూడేళ్లు పూర్తి చేసుకున్నప్రజాసంకల్ప యాత్ర
-
CM YS Jagan: మరోసారి గొప్పమనసు చాటుకున్న సీఎం జగన్
సాక్షి, గుంతకల్లు టౌన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. సంకల్పయాత్రలో తన వెంట నడుస్తూ ఓ అభిమాని ప్రాణాలు కోల్పోగా, ఆదుకుంటానని ఆ కుటుంబానికి ఆయన మాట ఇచ్చారు. చెప్పినట్లుగానే సాయమందించి భరోసా ఇచ్చారు. వివరాలు.. గుత్తి మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన రంగారెడ్డి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని. ఇతనికి భార్య రమణమ్మ, కుమార్తెలు భారతి, భాగ్యలక్ష్మి ఉన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో ఇడుపులపాయ నుంచి రంగారెడ్డి ఆయన వెంట నడిచారు. నెల్లూరు జిల్లా కాండ్ర గ్రామంలో అభిమాన నేతతో కరచాలనం చేసి ఫొటో కూడా దిగారు. అదే రోజు మధ్యాహ్నం రంగారెడ్డికి గుండెపోటు రావడంతో గూడూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. చదవండి: (బాబుది కుట్రపూరిత మనస్తత్వం) రూ.10 లక్షల చెక్కును రంగారెడ్డి కుటుంబసభ్యులకు అందజేస్తున్న ఎమ్మెల్యే వైవీఆర్ కుటుంబాన్ని ఆదుకుంటానని జగన్ హామీ రంగారెడ్డి మృతి వార్త తెలుసుకున్న వైఎస్ జగన్ కాండ్ర గ్రామానికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటానని మాట ఇచ్చారు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి సీఎం జగన్‌కు గుర్తు చేయగా, వెంటనే స్పందించిన ఆయన రూ.10 లక్షల చెక్కు పంపారు. ఈ చెక్కును ఎమ్మెల్యే వైవీఆర్ శనివారం పెద్దొడ్డి గ్రామపెద్దల సమక్షంలో రంగారెడ్డి కుటుంబసభ్యులకు అందజేశారు. సీఎం జగన్‌కు రుణపడి ఉంటామని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. -
చెక్కు చెదరని దృఢ సంకల్పం
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించాయి. ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు అంటూ కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీలు, పాదయాత్రలు, పార్టీ జెండా ఆవిష్కరణలు నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయా.. లేదా.. అని ఇంటింటికి వెళ్లి ఆరా తీశారు. జోహార్ వైఎస్సార్.. జై జగన్.. అంటూ నినాదాలు చేస్తూ పార్టీ శ్రేణులు కదంతొక్కాయి. 2017 నవంబర్ 6న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర.. 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో ముగిసిన విషయం తెలిసిందే. పాదయాత్ర స్ఫూర్తితో 29 నెలలుగా కనీవినీ ఎరుగని రీతిలో జగన్ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే 97%› హామీలు నెరవేర్చారు. ఎన్నో విప్లవాత్మక చట్టాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాలన్నింటినీ వివరిస్తూ ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగింది. తిరుపతిలో ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పండుగలా సాగిన సంబరాలు ► తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు పాదయాత్రలు నిర్వహించారు. కుప్పంలో పార్టీ శ్రేణులు జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశాయి. ► అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాదయాత్రలు చేపట్టారు. పెనుకొండలో మంత్రి శంకరనారాయణ కేక్ కట్ చేశారు. అనంతపురంలో ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్ పాదయాత్ర నిర్వహించారు. ► వైఎస్సార్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ విగ్రహాల వద్ద నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పాల్గొన్నారు. ► కర్నూలు జిల్లాలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాయి. ఆలూరులో కార్మిక శాఖ మంత్రి జయరాం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ప్రకాశం జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహించారు. ► నెల్లూరులో మంత్రి అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు కేట్ కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహించారు. ► గుంటూరు నగరంలో భారీ ఎత్తున పాదయాత్ర నిర్వహించారు. బాపట్లలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా కేక్‌లు కట్ చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకులు పాదయాత్రలు చేశారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి, కేక్‌లు కట్ చేశారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ► పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు సంబరాలు చేసుకున్నారు. మంత్రి శ్రీరంగనాథరాజు పాదయాత్ర చేశారు. ► తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కేక్‌కట్ చేశారు. ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో లాలాచెరువు సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు జరిగాయి. నరసన్నపేటలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పార్టీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని కేక్ కట్ చేశారు. ► విజయనగరం జిల్లాలో సంఘీభావ ర్యాలీలు నిర్వహించారు. కురుపాంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, చీపురుపల్లిలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పాదయాత్ర సాగింది. ► విశాఖలో వాడవాడలా వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, బైక్ ర్యాలీలు, పాదయాత్రలు చేపట్టారు. జగదాంబ సెంటర్లో వైఎస్సార్సీపీ భారీ జెండాతో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. గుడిలోవలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కేక్ కట్ చేశారు. కొయ్యూరు మండలంలోని కంఠారంలో ఎంపీ గొడ్డేటి మాధవి వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి సురేష్. చిత్రంలో ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నేతలు కోవిడ్ సంక్షోభం నుంచి ప్రగతిపథంలోకి.. కోవిడ్ సంక్షోభంలో దేశం గర్వించేలా రాష్ట్రంలో పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం అవినీతి మయంగా ఉండిందని, ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి.. మొక్కవోని ధైర్యంతో అడుగులు ముందుకేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. వైఎస్ జగన్ నాడు చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, మాట్లాడుతూ.. సీఎం జగన్ అభివృద్ధి – సంక్షేమం అనే రెండు చక్రాల మీదుగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్తున్నారని చెప్పారు. అనంతరం పాదయాత్రలో వైఎస్ జగన్‌తో పాటు అడుగులు వేసిన వారిని సన్మానించారు. -
ఏపీ వ్యాప్తంగా నాలుగేళ్ల సంకల్ప యాత్ర పండుగ
-
ప్రజాసంకల్ప పాదయాత్ర ఒక చరిత్ర: సజ్జల
సాక్షి, తూర్పుగోదావరి: ప్రజాసంకల్ప పాదయాత్ర ఒక చరిత్రగాప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. ప్రజాసంకల్ప యాత్ర నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను చూసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. అన్ని వర్గాలనూ ఆదుకునేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాల అమలుకు సీఎం జగన్ వెనుకాడలేదని గుర్తుచేశారు. చదవండి: సందడిగా జగనన్న సంకల్ప యాత్ర నాలుగేళ్ల పండగ ప్రజలు సీఎం వైఎస్ జగన్‌వైపే నిలిచారని సజ్జల అన్నారు. సంక్షేమాన్ని అడ్డుకోవడమే ప్రతిపక్షానికి తెలిసిన రాజకీయమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించి నేటికి నాలుగేళ్లు పూర్తి అయింది. నవంబర్6, 2017న ఇడుపులపాయలో ఆయన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. పాదయాత్ర ద్వారా సీఎం జగన్ ప్రజలతో మమేకమయ్యారు సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పాదయాత్ర ద్వారా సీఎం జగన్ ప్రజలతో మమేకమయ్యారని పేర్కొన్నారు. అధికారం చేపట్టగాలనే సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ నడుంబిగించారని తెలిపారు. రూ.లక్షా 40 వేల కోట్లు పేద ప్రజల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. సాగునీటి సమస్యల లేకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. -
జననేత జగనన్నా.. ‘ప్రజా సంకల్పం’ నీదన్నా..
-
సీఎం జగన్ ప్రజాసంకల్పయాత్ర నాలుగేళ్ల పండగ
-
అలా ఆలోచించింది నాడు వైఎస్సార్.. నేడు సీఎం జగన్ మాత్రమే'
సాక్షి, విజయవాడ: ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేపట్టారని దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రకు నేటితో నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో నిర్వహించిన సంబరాల్లో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటికీ పేదల గురించి ఏనాడూ ఆలోచించలేదు. క్యాపిటల్, పెట్టుబడిదారులు, తమ సామాజికవర్గం వారి గురించి మాత్రమే చంద్రబాబు ఆలోచన చేశాడు. పేదల గురించి ఆలోచించింది ఆనాడు వైఎస్సార్.. నేడు జగన్ మాత్రమే. ఎండ, వాన లెక్క చేయకుండా 14 నెలల పాటు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో అనేక ఘటనలు వైఎస్ జగన్‌కు ఎదురయ్యాయి. మ్యానిఫెస్టోని రెండేళ్లలోనే నెరవేర్చారు. భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేనంత గొప్పగా పరిపాలన చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్. ప్రజల నాడి, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి జగన్. ప్రజలకి మంచి చేయాలన్న మనసున్న వ్యక్తి. ఇచ్చినమాటను నిలబెట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉంది. చదవండి: (నాలుగేళ్ల ‘ప్రజా సంకల్పం’.. సీఎం జగన్ ట్వీట్) పళ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు ప్రజలకు జగన్ మంచి చేస్తున్నారు కాబట్టే జగన్‌పై ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల నుంచి స్థానిక ఎన్నికల వరకూ ప్రజలు మాకు అండగా నిలిచారు. రేపు జరగబోయే ఎన్నికల్లోనూ మాదే విజయం. ఏపీలో ప్రతిపక్షపార్టీల అవసరం లేదు. జనసేన, బీజేపీ, టీడీపీలు చూడ్డానికి మాత్రమే విడివిడిగా ఉండే రాజకీయ పార్టీలు. సీఎం జగన్‌పై దాడి చేయడానికి మాత్రం మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. ప్రజలు మాతో ఉన్నారు. రాజకీయ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. రాజకీయ పార్టీలకు అతీతంగా భారతదేశంలో పాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని సగర్వంగా చెబుతున్నాం అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చదవండి: (సందడిగా జగనన్న సంకల్ప యాత్ర నాలుగేళ్ల పండగ) -
నాలుగేళ్ల ‘ప్రజా సంకల్పం’.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనం సృష్టించిన చరిత్రాత్మక ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టి నేటితో సరిగ్గా నాలుగేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘ప్రజా సంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్లు. నాడు నేడూ నా యాత్ర, నా ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే. మీ అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోందని’’ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రజాసంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్లు. నాడు నేడూ నా యాత్ర, నా ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే. మీ అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోంది. — YS Jagan Mohan Reddy (@ysjagan) November 6, 2021 చదవండి: మరవలేని మహా యజ్ఞం.. ప్రజా సంకల్పం -
సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యేలు
-
సందడిగా జగనన్న సంకల్ప యాత్ర నాలుగేళ్ల పండగ
Updates: వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం జగన్‌దే: ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర నాలుగేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో నగిరిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. నగిరి ఓం శక్తి సర్కిల్ నందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత పడుతున్న కష్టాలకు ప్రధాన కారకుడు చంద్రబాబు. ప్రజలు పడుతున్న కష్టాలను పరిష్కరించాలని దృఢ సంకల్పంతో సంకల్ప పాదయాత్ర చేపట్టారు. అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సర కాలంలోనే సమస్యలకు పరిష్కారం చూపుతూ తానిచ్చిన వాగ్దానాలను నూటికి నూరు శాతం నెరవేర్చారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా వార్ వన్‌సైడ్‌గా సీఎం జగన్‌కు విజయాన్ని అందిస్తున్నారు. ఆనాడు సీఎం జగన్ పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రజలు జగన్ వైపు నిలబడ్డారు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని వాగ్దానాలు చేసి ఇచ్చిన మాటకు కట్టుబడిన దాఖలాలు లేవు. ఇచ్చిన మాటకు కట్టుబడి తండ్రికి తగ్గ తనయుడిగా అన్ని ప్రాంతాల వారికి సంక్షేమ పథకాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. శ్రీకాకుళం జిల్లా.. టెక్కలిలో సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్థానిక వైఎస్సార్ జంక్షన్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి పాదయాత్రను ప్రారంభించారు. గుంటూరులో.. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరిధర్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మేయర్ కావటి మనోహర్ నాయుడు గుంటూరు నగరపాలెంలోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి హిమని సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కార్పొరేటర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో.. గూడూరులో జనహృదయనేత సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర నేటితో నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ వైఎస్సార్ విగ్రహం నుంచి సాదుపేట సెంటర్ వరకు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో.. సీఎం జగన్ పాదయాత్ర నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆళ్ళగడ్డ నాలుగు రోడ్ల కూడలిలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి, ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి, చాగలమర్రి ఎంపీపీ వీరభద్రుడు, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ 10 ఏళ్ల కష్టం ప్రజలందరికీ తెలుసు: భూమన ప్రజా సంకల్ప యాత్ర నాలుగేళ్లు పూర్తి చేసికున్న సందర్భంగా వైఎస్సార్ విగ్రహనికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తుడా సర్కిల్ లో వైఎస్సార్ విగ్రహం వద్ద సర్వమత ప్రార్ధనలు, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం తుడా వైఎస్సార్ సర్కిల్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ఎమ్మెల్యే భూమన, మేయర్ శిరీషా, కార్పొరేటర్లు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి 10 ఏళ్లు పడ్డ కష్టం ప్రజలందరికీ తెలుసు. నాడు వైఎస్ పాదయాత్రతో ఎలా ప్రభంజనం సృష్టించారో, అదే సంకల్పంతో వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టారు. ప్రజలు కష్టాలు తెలుసుకుని, రెండు పేజీలు మ్యానిఫెస్టోలో పెట్టి నవరత్నాలుగా మార్చి ప్రజలకు అందించారు. కోట్లాది మంది ప్రజల కష్టాలు తెలుసుకుని ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తున్నారు. చంద్రబాబు నిరంతరం దూషిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా నిరంతరం సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం అయ్యింది. చంద్రబాబు ఎన్నికుట్రలు చేసినా ప్రజలు మాత్రం వైఎస్ జగన్‌కే పట్టం కట్టారు. 3,648 కి.మీ ప్రజా సంకల్ప పాదయాత్ర సువర్ణ చరిత్ర అని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా పెనుకొండలో మంత్రి శంకరనారాయణ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్‌చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్సీ వెన్నుపూస గోపాల్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జెండా ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి తిరుపతి: ప్రజాసంకల్ప పాదయాత్ర 4 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పూర్తి చేసిన ఘనత మన ముఖ్యమంత్రికి దక్కుతుంది. విపక్ష నేత చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారు. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా మాట్లాడుతున్నారు. ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా.. ప్రజాసంకల్పయాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నిడమర్రు మండలం బువ్వనపల్లిలో పాదయాత్ర చేపట్టారు. అనంతరం వైఎస్సార్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించాయి. విజయవాడలో.. సీఎం వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ శ్రేణుల సంబరాలు నిర్వహించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు ఈ సంబరాల్లో పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మేయర్ భాగ్యలక్ష్మి పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేశారు. చిత్తూరు జిల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కుప్పంలో వైఎస్ జగన్ చిత్రపటానికి ఎమ్మెల్యేలు, నేతలు పాలాభిషేకం చేశారు. ప్రజా సంకల్ప యాత్రను గుర్తుచేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎండనక వాననక వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన పాదయాత్ర దేశ చరిత్రలో నిలిచి పోయిందని అంటున్నారు. వైఎస్సార్ జిల్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేంపల్లెలో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వేంపల్లె నాలుగు రోడ్ల కూడలి నుండి రాయచోటి బైపాస్‌లో ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె జడ్పీటీసీ రవికుమార్ రెడ్ది, ఎంపీపీ గాయత్రి, కార్పొరేషన్ డైరెక్టర్లు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సాక్షి, అమరావతి: జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి నవంబర్ 6వ తేదీతో నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నేడు (శనివారం) పాదయాత్రలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం పాదయాత్రతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించాలని, సర్వమత ప్రార్థనలు నిర్వహించాలని, కేక్ కటింగ్ చేయాలని ఆయన తెలియజేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. నాటి పాదయాత్ర అనుభవాలనే మేనిఫెస్టోగా మలుచుకుని అధికారం చేపట్టిన రెండేళ్ల కాలంలోనే 97 శాతం హామీలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేశారన్నారు. నాటి పాదయాత్రను గుర్తు చేస్తూ.. ఈనాటి జగనన్న పరిపాలనను వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. కాగా, నవంబర్ 6, 2017న ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 134 నియోజకవర్గాల్లో 231 మండలాల్లో 2,516 గ్రామాల్లో కొనసాగింది. అడుగడుగున పేదల కష్టాలను తెలుసుకున్నారు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్ ఆనాడే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. అధికారం చేపట్టగానే యాత్రలో తెలుసుకున్న సమస్యల పరిష్కారానికి నడుంకట్టారు. -
సీఎం వైఎస్ జగన్ పాదయాత్రకు నేటికి సరిగ్గా నాలుగేళ్లు
-
13 జిల్లాల ప్రజా సంకల్పం.. 14 నెలల సుదీర్ఘ ప్రయాణం
4 Years Of Praja Sankalpa Yatra: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో (శనివారం) నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్సార్ సమాధివద్ద 2017 నవంబర్ 6న పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలో 13 జిల్లాలను దాటుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. (చదవండి: మరవలేని మహా యజ్ఞం.. ప్రజా సంకల్పం) ►134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. ►341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. – –124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు. ►క్షేత్రస్థాయిలో రాష్ట్రం నలుమూలలా జగన్ పాదయాత్ర చేశారు. ►ఎండల తీవ్రతను, భారీ వర్షాలను, వణికించే చలిని ఇలా అన్ని కాలాల్లోనూ పాదయాత్ర సాగింది. ►ప్రతికూల వాతావరణంలోనూ సడలనీయక పాదయాత్ర సాగింది. ►జనం మధ్యే అడుగు మొదలుపెట్టి.. జనం మధ్యే జగన్ విడిదిచేశారు. ►పాదయాత్ర సమయంలో జనం చెప్పిన సమస్యలు వింటూ, వారి కన్నీళ్లు తుడుస్తూ ముందకు సాగారు జగన్. ►నేను ఉన్నానంటూ.. వారికి ఎనలేని భరోసా నిచ్చారు. ►చదువు, ఆరోగ్యం కోసం కుటుంబాలు ఆస్తులు అమ్ముకునే పరిస్థితులను తాను చూశానని, కచ్చితంగా ప్రజలకు అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. ►వివక్షలేని పాలనను అందిస్తానని హామీ ఇచ్చారు. ►ప్రజల ముంగిటకే సేవలను తీసుకొస్తానని చెప్పారు. ►దీంట్లో భాగంగానే మతం చూడకుండా, రాజకీయం చూడకుండా, అవినీతిలేని, వివక్షలేని రీతిలో ప్రజలకు ప్రయోజనాలు అందుతున్నాయి. ►గ్రామ సచివాలయాలు గ్రామ స్వరాజససాధనేలో కొత్త ఒరవడిని సృష్టించాయి. ►గ్రామంలోనే ఉద్యోగాలు వచ్చాయి. ►సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలు వచ్చాయి. ►ప్రతి 50 ఇళ్లకూ ఒక వాలంటీర్ .. సేవలందించడానికి వచ్చారు. ►మళ్లీ పల్లెలకు కొత్త కళ వచ్చింది. ►గ్రామాలకు ఆస్తులు వచ్చాయి. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు.. ఇలా ప్రతి గ్రామానికి విలువైన ఆస్తులు సమకూర్చబడ్డాయి. ►అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, మహిళా సాధికత, విద్యా దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఇవన్నీ.. ప్రజా సంకల్ప యాత్రలో మొగ్గ తొడిగినవే. ►ప్రజా సంకల్పయాత్ర ద్వారా ఇచ్చిన హామీలు, వాటిని దాదాపుగా అమలు చేయడంతో... జగన్ అనే పేరు విశ్వసనీయతకు మరో రూపంగా నిలబడింది. ►ప్రజాసంకల్పయాత్ర రాజకీయంగా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర చరిత్రలోనే చరిత్రాత్మక విజయాన్ని వైఎస్ జగన్ సాధించారు. ►నాలుగేళ్ల కిత్రం మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 చోట్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ►మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో 22 చోట్ల ఎంపీలు గెలిచి చరిత్ర సృష్టించారు. ►ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన మరుక్షణమే తానిచ్చిన మాటకు కట్టుబడి అవ్వాతాతల పింఛన్‌ను రూ.2,250కి పెంచుతూ జగన్ తొలి సంతకం చేశారు. ►మంత్రివర్గం కూర్పులో తనదైన శైలిని ప్రదర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులను కేటాయించి రాజకీయ సంచలనం కలిగించారు. ►తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీలకు ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారు. ►మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తానని తొలిరోజే ప్రకటించిన జగన్ అందులో పేర్కొన్న ‘నవరత్నాలు’ అమలుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. ►బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు. అన్నీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ►మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా దిశా చట్టం తెచ్చారు. చట్టంగా కేంద్రం ఇంకా ఆమోదించకపోయినా.. చట్టం స్ఫూర్తిని నూటికి నూరుపాళ్లు అమలు చేస్తున్నారు. ►అధికారం చేపట్టిన రెండున్నరేళ్లు అయినా ప్రజల గుండెచప్పుడు నుంచి జగన్ ఎప్పుడూ దూరంకాలేదు. ►ప్రజాసంకల్పయాత్ర స్ఫూర్తి పాలనకలో కొనసాగుతూనే ఉంది. ►అందుకే తిరుపతి ఉప ఎన్నిక, బద్వేలు ఉప ఎన్నిక, కార్పొరేషన్లు, మున్సిపల్ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తూనే ఉంది. ►ప్రజలనాడిని, వారి గుండె చప్పుడు ప్రమాణాలుగా తీసుకోవడం వల్లే ఈ విజయాలు సాధ్యం అవుతున్నాయి. ►గత రెండున్నరేళ్లకాలంలోని ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ వచ్చినా.. ప్రజా సంకల్పయాత్రలో జగన్‌గారు తనదిగా మార్చుకున్న ప్రజల గొంతుక ప్రకారమే.. సంక్షేమ పథకాల అమలు దేశంలోనే అగ్రగాయి రాష్ట్రంగా ఏపీ నిలవగలిగింది. ఇంతటి కోవిడ్ విపత్తు సమయంలోకూడా ఆకలి చావుకు తావులేకుండా పరిపాలన కొనసాగింది. ‘ప్రజా సంకల్ప యాత్ర’ మరిన్ని వివరాలు: ►వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ వేదికగా 2017, నవంబరు 6వ తేదీన ప్రారంభమైన వైఎస్ జగన్ సుదీర్ఘ ‘ప్రజా సంకల్ప యాత్ర’ రాష్ట్రమంతటా 13 జిల్లాలలో 341 రోజులు కొనసాగి, బుధవారం (జనవరి 9, 2019) నాడు ఇచ్ఛాపురంలో పూర్తి కానుంది. వైఎస్సార్ జిల్లాలో.... ఇడుపులపాయలో 2017, నవంబరు 6న ప్రారంభమైన వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర, వైయస్సార్ జిల్లాలో అదే నెల 13వ తేదీ వరకు కొనసాగింది. జిల్లాలో 5 నియోజకవర్గాలలో 7 రోజుల పాటు 93.8 కి.మీ నడిచారు. 5 చోట్ల బహిరంగ సభలతో పాటు, 3 ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. జిల్లాలో యాత్ర చివరి రోజున మైదుకూరులో బీసీల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. కర్నూలు జిల్లాలో.. అదే ఏడాది నవంబరు 13వ తేదీన (యాత్ర 7వ రోజు) ఆళ్లగడ్డ నియోజకవర్గం, చాగలమర్రి వద్ద కర్నూలు జిల్లాలో ప్రవేశించిన వైఎస్ జగన్ 18 రోజుల పాటు 263 కి.మీ నడిచారు. మొత్తం 7 నియోజకవర్గాలలో పర్యటించిన జననేత, 8 బహిరంగ సభలతో పాటు, 6 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ‘అనంతపురం’లో.. ఆ తర్వాత 2017, డిసెంబరు 4వ తేదీన (యాత్ర 26వ రోజు) అనంతపురం జిల్లాలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్, 20 రోజులు పర్యటించి 9 నియోజకవర్గాలలో మొత్తం 279.4 కి.మీ నడిచారు. 10 చోట్ల బహిరంగ సభలతో పాటు, 4 ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో.. పాదయాత్రలో 46వ రోజున (2017, డిసెంబరు 28) ఎద్దులవారికోట వద్ద చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన వైఎస్ జగన్, 23 రోజుల పాటు 10 నియోజకవర్గాలలో పర్యటించి మొత్తం 291.4 కి.మీ నడిచారు. జిల్లాలో 8 బహిరంగ సభలతో పాటు, 9 చోట్ల ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘కోస్తా’ లోకి ప్రవేశం వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 2018, జనవరి 23వ తేదీన (యాత్ర 69వ రోజున) కోస్తాలోకి ప్రవేశించింది. నెల్లూరు జిల్లా పీసీటీ కండ్రిగ వద్ద ఆయన కోస్తాలోకి అడుగు పెట్టారు. నెల్లూరు జిల్లాలో 20 రోజుల పాటు 9 నియోజకవర్గాలలో యాత్ర చేసిన జననేత 266.5 కి.మీ నడిచారు. 9 బహిరంగ సభలతో పాటు, 6 చోట్ల ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో.. 2018, ఫిబ్రవరి 16వ తేదీన (యాత్ర 89వ రోజు) కందుకూరు నియోజకవర్గం, లింగ సముద్రం మండలంలోని కొత్తపేట వద్ద ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన వైఎస్ జగన్, 21 రోజులు పర్యటించారు. జిల్లాలో 9 నియోజకవర్గాలలో ఆయన 278.1 కి.మీ నడిచిన ఆయన, 9 బహిరంగ సభలు, సమావేశాలతో పాటు, 2 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో.. మార్చి 12వ తేదీన (యాత్ర 110వ రోజు) బాపట్ల నియోజకవర్గం, అదే మండలంలోని స్టూవర్టుపురం వద్ద గుంటూరు జిల్లాలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్, 12 నియోజకవర్గాలలో 26 రోజులు పర్యటించారు. జిల్లాలో 281 కి.మీ నడిచిన ఆయన, 11 బహిరంగ సభలతో పాటు, 3 చోట్ల ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో.. ఆ తర్వాత ఏప్రిల్ 14వ తేదీన (యాత్ర 136వ రోజు) కనకదుర్గమ్మ వారధి వద్ద ప్రజా సంకల్ప యాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. వారధి వద్దకు అశేష జనవాహిని తరలి రావడంతో ఒక దశలో ఆ వంతెన కుంగి పోతుందా? అన్నట్లుగా మారింది. దీంతో పోలీసులు వంతుల వారీగా ప్రజలను వంతెనపైకి అనుమతించారు. కృష్ణా జిల్లాలో 24 రోజుల పాటు 239 కి.మీ నడిచిన వైఎస్ జగన్, 12 నియోజకవర్గాలలో పర్యటించారు. 10 బహిరంగ సభలు సమావేశాలు, 5 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ‘పశ్చిమ గోదావరి’ లో.. మే 13వ తేదీ (యాత్ర 160వ రోజున) దెందులూరు నియోజకవర్గం, కలకర్రు వద్దపశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్, 13 నియోజకవర్గాలలో పర్యటించారు. జిల్లాలో 27 రోజుల పాటు 316.9 కి.మీ నడిచిన జననేత, 11 బహిరంగ సభలతో పాటు, 5 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ‘తూర్పు గోదావరి’ లో.. జూన్ 12వ తేదీ (యాత్ర 187వ రోజు)న కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో గోదావరి మాతకు హారతి, ప్రత్యేక పూజల అనంతరం గోదావరి రైల్ కమ్ రోడ్ వంతెన మీదుగా రాజమహేంద్రవరం చేరుకున్న వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టారు. జిల్లాలో సరిగ్గా రెండు నెలలు సాగిన వైఎస్ జగన్ పాదయాత్ర ఆగస్టు 13న ముగిసింది. జిల్లాలో 50 రోజులు పాదయాత్ర చేసిన ఆయన 17 నియోజకవర్గాలలో 412 కి.మీ నడిచారు. 15 బహిరంగ సభలు, సమావేశాలతో పాటు, 2 చోట్ల ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ‘విశాఖ’ జిల్లాలో.. గత ఏడాది ఆగస్టు 14వ తేదీ (యాత్ర 237వ రోజు)న నర్సీపట్నం నియోజకవర్గం, నాతవరం మండలంలోని గన్నవరం మెట్ట వద్ద ప్రజా సంకల్ప యాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలో 32 రోజుల పాటు, 12 నియోజకవర్గాలలో పర్యటించిన వైఎస్ జగన్, 277.1 కి.మీ నడిచారు. 9 సభలు, సమావేశాలతో పాటు, 2 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ‘విజయనగరం’ లో.. సెప్టెంబరు 24వ తేదీ (యాత్ర 269వ రోజు)న ఎస్.కోట నియోజకవర్గం కొత్తవలస మండలంలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్ విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు. హత్యా ప్రయత్నం అక్టోబరు 25వ తేదీన జిల్లాలో 294వ రోజు యాత్ర పూర్తి చేసుకున్న వైఎస్ జగన్, హైదరాబాద్ వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోగా, అక్కడి విఐపీ లాంజ్‌లో ఆయనపై హత్యా ప్రయత్నం జరిగింది. దీంతో ప్రజా సంకల్పయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. 17 రోజుల విరామం తర్వాత నవంబరు 12వ తేదీన యాత్ర తిరిగి మొదలైంది. విజయనగరం జిల్లాలో మొత్తం 36 రోజుల పాటు 9 నియోజకవర్గాలలో పర్యటించిన వైఎస్ జగన్ 311.5 కి.మీ నడిచారు. 9 బహిరంగ సభలతో పాటు, 2 ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. ‘శ్రీకాకుళం’ జిల్లాలో.. 2018 నవంబరు 25వ తేదీ (యాత్ర 305వ రోజు)న పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలంలోని కడకెల్ల వద్ద వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించారు. కాగా, ఇదే జిల్లాలో యాత్ర 341వ రోజున, బుధవారం (జనవరి 9, 2019) నాడు ప్రజా సంకల్ప యాత్ర ముగుస్తోంది. జిల్లాలో మొత్తం 37 రోజుల పాటు 10 నియోజకవర్గాలలో పర్యటించిన వైఎస్ జగన్ 338.3 కి.మీ నడిచారు. 10 చోట్ల బహిరంగ సభలతో 6 ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర విశేషాలు – మొత్తం రోజులు 341 – 13 జిల్లాలు – నియోజకవర్గాలు 134 – 231 మండలాలు – 2516 గ్రామాలు – 54 మున్సిపాలిటీలు – 8 కార్పొరేషన్లలో పాదయాత్ర – 124 సభలు, సమావేశాలు – 55 ఆత్మీయ సమ్మేళనాలు – 3648 కి.మీ నడక ప్రారంభం – నవంబరు 6, 2017 – ఇడుపులపాయ. ముగింపు – జనవరి 9, 2019 – ఇచ్ఛాపురం. 14 నెలలు -
విజయసంకల్పానికి రెండేళ్లు
-
ప్రజా సంకల్ప యాత్ర తుది ఘట్టానికి రెండేళ్లు
జనం గుండె చప్పుడు వింటూ.. దగా పడ్డ ప్రజల కన్నీళ్లు తుడుస్తూ.. నేటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సాగించిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి నేటికి రెండేళ్లు. తెలుగుదేశం కర్కశ పాలనలో బరువెక్కిన హృదయ ఘోష వింటానంటూ.. పేదల పక్షాన నేనున్నానంటూ వైఎస్ జగన్ 2017 నవంబర్ 6వ తేదీన వరుణ దేవుడు ఆశీర్వదించగా ఇడుపులపాయ నుంచి తొలి అడుగు వేశారు. అవ్వాతాతల ఆశీస్సులు.. అమ్మల దీవెనలు, అన్నార్తుల ఆశీర్వాదాలే కొండంత అండగా ప్రజా క్షేత్రంలోకి పాదయాత్ర ద్వారా దూసుకెళ్లారు. టీడీపీ ప్రజా కంఠక పాలనలో ప్రజల సమస్యలే జగన్‌కు స్వాగత తోరణాలయ్యాయి. ఊరూరా బతుకు భారమైన పేదల ఆవేదనలు, కంట తడి పెట్టించిన సన్నివేశాలు, ప్రజల దీన పరిస్థితుల మధ్య సరిగ్గా 2019 జనవరి 9న జగన్ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగించారు. ‘మీ కష్టాలన్నీ విన్నాను.. నేనున్నాను..’ అంటూ జగన్ చెప్పిన ఒక్కమాట చితికిపోయిన రాష్ట్ర ప్రజలకు కొండంత గుండె ధైర్యాన్నిచ్చింది. అడుగడుగున ఆవేదనలే.. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకొచ్చిన టీడీపీ అరాచకాలకు అంతులేకుండా ఉండేది. కటిక పేదవాడైనా పైసలిస్తే తప్ప పనులు జరగని చీకటి పాలన అది. పెన్షన్ల కోసం పడిగాపులు గాసే అవ్వా తాతల గోడు వినే నాధుడే లేడు. బువ్వపెట్టే రైతన్న పురుగుల మందు తాగే దయనీయ స్థితి. పెన్షన్‌కు లంచం... రేషన్ కార్డుకు లంచం.. ఇంటి స్థలానికి లంచం.. జన్మభూమి కమిటీల పేరుతో పచ్చ చొక్కా రాయుళ్ల అరాచకమే ఆనాటి పాలనగా సాగింది. అసెంబ్లీలో నిలదీసిన విపక్ష నేతపై టీడీపీ ఎమ్మెల్యేల దిగజారుడు మాటల దాడి. విపక్ష నేత గొంతునొక్కి వ్యవస్థలను ఖూనీ చేసిన దారుణమైన స్థితి. సంతలో బజారు సరుకుగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనేసిన టీడీపీ అవినీతి పాలనను జనం అసహ్యించుకునే రోజులవి. ఈ తరుణంలో ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత వైఎస్ జగన్ తన భుజస్కంధాలకెత్తుకున్నారు. నేనున్నానంటూ జనం మధ్యకు వెళ్లారు. జనం మధ్యే ఆవాసం.. ఒకటి కాదు.. రెండు కాదు... 3,648 కిలోమీటర్లు సాగింది జగన్ పాదయాత్ర. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆయన ప్రజల్లోనే ఉన్నారు. మండువేసవి.. కుండపోత వర్షాలు.. ఎముకలు కొరికే చలి.. మూడు కాలాల్లో.. ప్రతికూల పరిస్థితుల్లోనూ జనంతోనే ఉండి జననేత అన్పించుకున్నారు. తమ కోసం తరలి వచ్చిన జగన్‌ను ప్రజలూ ఆ స్థాయిలోనే ఆదరించారు. ఊరూరా ముగ్గులేశారు. ఊరంతా సంబరాలు చేసుకున్నారు. 70 ఏళ్లకు పైబడిన అవ్వాతాతలు సైతం పొన్నుగర్ర పట్టుకుని తరలివచ్చి జననేతకు తమ దీన గాథలు చెప్పుకున్నారు. కూడులేక, గూడులేక, పిల్లలను చదివించే దిక్కులేక అవస్థలు పడే ప్రతీ అక్క, చెల్లెమ్మ.. పాదయాత్రకు తరలివచ్చారు. బతుకే భారమైన ప్రతి ఒక్కరి హృదయ ఘోషను ఆయన విన్నారు. ‘మన ప్రభుత్వం వస్తుంది.. ఓపిక పట్టండి.. అన్నీ నేను పరిష్కరిస్తాను’ అంటూ ఇచ్చిన భరోసా పేదవాడికి ఎంతో ఆనందాన్నిచ్చింది. విన్నాడు.. చేస్తున్నాడు.. తుది ఘట్టానికి చేరిన పాదయాత్రలో జననేత ఏం చెబుతాడనే ఉత్కంఠతో రాష్ట్రం నలుమూలల నుంచి జనం తరలివచ్చారు. ఇచ్ఛాపురం ఆ రోజు జన సంద్రమైంది. అనుకున్నట్టే ఆ రోజు జననేత జగన్ తన ఉద్విగ్న ప్రసంగంలో అంధకారమైన రాష్ట్ర భవితవ్యాన్ని ఆవిష్కరించారు. తానొస్తే పేదవాడి కన్నీళ్లు తుడుస్తానని భరోసా ఇచ్చారు. ఫలితంగా 175 అసెంబ్లీ స్థానాలకు 151... 25 పార్లమెంట్ స్థానాలకు 22 స్థానాలు కైవసం చేసుకుని తిరుగులేని మెజారిటీతో అధికారంలోకొచ్చారు. మాట తప్పని, మడమ తిప్పని వైఎస్ వారసుడిగా, ఇచ్ఛాపురం సాక్షిగా చేసిన ప్రతిజ్ఞను ముఖ్యమంత్రిగా నెరవేర్చారు. మేనిఫెస్టోనే ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి ప్రతీ ఒక్కరి సంక్షేమానికి బాటలు వేశారు. మేడిపట్టిన నాడే రైతన్నకు మేలు చేస్తానన్న హామీ నిలబెట్టారు. పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లోకి డబ్బులేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆరోగ్యశ్రీ ఇప్పుడు పేదవాడికి బీమా కల్పించే అస్త్రమైంది. చదువుకునే చెల్లెళ్లు, తమ్ముళ్ల ఫీజు కడుతూ యువత మనసులో ‘జగనన్న’గా చెరగని ముద్ర వేసుకున్నారు. పాదయాత్రలో మైలు రాళ్లు ఎన్నెన్నో.. 13 జిల్లాల మీదుగా, 134 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 2,516 గ్రామాలను తాకుతూ ప్రజా సంకల్పయాత్ర 341 రోజులు కొనసాగింది. వైఎస్ జగన్ 124 బహిరంగ సభల్లో మాట్లాడారు. 55 చోట్ల పలు సంఘాల (కమ్యూనిటీ మీటింగ్స్)తో సమావేశం నిర్వహించారు. లక్షల మంది ప్రజలను కలిశారు. వేలాది ప్రజా వినతులను స్వీకరించారు. 2017 డిసెంబర్ 16: అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం గొట్టూరు వద్ద 500 కి.మీ. 2018 జనవరి 29: నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో 1,000 కి.మీ. 2018 మార్చి 14: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ములుకుదురులో 1,500 కి.మీ. 2018 మే 14: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం వెంకటాపురంలో 2,000 కి.మీ. 2018 జూలై 8: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం పసలపూడిలో 2,500 కి.మీ. 2018 ఆగస్టు 24: విజయనగరం జిల్లా దేశపాత్రుని పాలెం వద్ద 3,000 కి.మీ. 2018 డిసెంబర్ 22: శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం రావి వలసలో 3,500 కి.మీ. 2019 జనవరి 9: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద 3,648 కి.మీ - వనం దుర్గా ప్రసాద్ -
సంఘీభావ ప్రభంజనం
-
సంక్షేమానికి నీరాజనం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రమంతటా ప్రజాచైతన్య ఝరి ఎగసింది. ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమలు తీరుకు నీరాజనం పలికింది. కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ.. అన్ని వర్గాలనూ ఆదుకుంటూ ముందడుగు వేస్తున్న పాలనకు జేజేలు పలికింది. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రజల్లో నాడు–ప్రజల కోసం నేడు’ కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజున సైతం పాదయాత్రలు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు హోరెత్తాయి. విజయనగరం జిల్లా కురుపాంలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, నెల్లిమర్లలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాదయాత్ర చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అట్టహాసంగా కార్యక్రమాలు జరిగాయి. విశాఖ జిల్లాలో ఎంపీ భీశెట్టి సత్యవతి, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్‌రామ్ మహా పాదయాత్ర నిర్వహించారు. కుల వృత్తులు, చేతి వృత్తుల శకటాలతో వినూత్న ప్రదర్శన జరిపి బహిరంగ సభ జరిపారు. పార్టీ సిటీ విభాగం ఆధ్వర్యంలో ఆనం కళా కేంద్రంలో గుడి సెట్టింగ్ వేసి సీఎం జగన్మోహన్రెడ్డిని కొలిచారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాదయాత్ర నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రకు ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ హాజరయ్యారు. భీమవరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిగాయి. విజయవాడ పశ్చిమలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రజాచైతన్య పాదయాత్రలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో పలుచోట్ల హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు పాల్గొన్నారు. చిలకలూరిపేటలో మహిళలు 25 వేల ప్రమిదలను అమ్మ ఒడి, విద్యాదీవెన తదితర 12 పథకాల పేర్లతో అమర్చి కార్తీక దీపాల్ని వెలిగించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జేజేలు పలికారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాదయాత్ర నిర్వహించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్‌నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, అనంతపురంలో ఎంపీ తలారి రంగయ్య పాదయాత్రలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన పాదయాత్రలకు విశేష స్పందన లభించింది. ఎంపీ రెడ్డెప్ప పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో పలుచోట్ల సంఘీభావ యాత్రలను అట్టహాసంగా నిర్వహించారు. కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఎమ్మెల్యేలు, నాయకుల ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిగాయి. -
ప్రజాచైతన్య యాత్రలకు బ్రహ్మరథం
సాక్షి, నెట్వర్క్: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ‘ప్రజల్లో నాడు–ప్రజల కోసం నేడు’ పేరిట చేపట్టిన సంఘీభావ పాదయాత్రలు ఆదివారం కూడా కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. విశాఖపట్నం, ప్రకాశం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో పాదయాత్రలు కొనసాగాయి. గుంటూరు జిల్లా పెదనందిపాడులో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు, ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మబగాంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎంపీ రంగయ్య పాల్గొన్నారు. రాప్తాడులో ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ‘ప్రజల్లో నాడు–ప్రజల కోసం నేడు’ కార్యక్రమం చేపట్టారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి బొత్స, ఎంపీ బెల్లాన పాదయాత్ర చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వర్షంలోనూ పాదయాత్ర నిర్వహించారు. గౌతంరెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో బైక్ ర్యాలీని ప్రారంభిస్తున్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడలో వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెల్లలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, కరప మండలం యండమూరు, జి.భావారంలో వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగా గీత పాదయాత్రలు చేశారు. కర్నూలు జిల్లా పాణ్యంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహా్మనందరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. -
సంఘీభావ పాదయాత్రలకు నీరాజనం
సాక్షి, నెట్వర్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో సాగుతున్న సంఘీభావ పాదయాత్రలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం కూడా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, పార్టీ నేతలు ప్రజాచైతన్య యాత్రల్లో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో ‘ప్రజల్లో నాడు – ప్రజల కోసం నేడు’ పేరిట సాగిన కార్యక్రమంలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు. ఏలూరు రూరల్ పోణంగిలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని.. ఎంపీ కోటగిరి శ్రీధర్‌తో కలిసి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం జి.ఉమ్మడివరంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రజలు నీరాజనం పలికారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరులో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఇంటింటికీ పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాదయాత్రలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో మంత్రి కన్నబాబు, ఎమ్మెల్సీ రవీంద్ర, మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు పాదయాత్ర చేశారు. కె.గంగవరం మండలం మసకపల్లిలో మంత్రి చెల్లుబోయిన వేణు, అల్లవరం మండలంలో ఎంపీ అనురాధ, మంత్రి పినిపే విశ్వరూప్ పాల్గొన్నారు. కృష్ణా, కర్నూలు, చిత్తూరు, విజయనగరం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతల ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్రలు, ర్యాలీలు కొనసాగాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పాదయాత్ర నిర్వహించారు. జి.సిగడాం మండలం చంద్రయ్యపేట, వెలగాడ, దేవరవలసల్లో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాదయాత్ర చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం పందిపర్తిలో మంత్రి శంకర నారాయణ పాదయాత్ర నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి ఎంపీ బీశెట్టి సత్యవతిల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో నిర్వహించిన పాదయాత్రలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, సమన్వయకర్త కేకే రాజు పాల్గొన్నారు. -
సంఘీభావ యాత్రలకు బ్రహ్మరథం
సాక్షి నెట్వర్క్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు’ పేరిట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాచైతన్య సంఘీభావ యాత్రలు బుధవారం ఆరో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాదయాత్రలు, ర్యాలీలు పెద్ద ఎత్తున జరిగాయి. ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరుతెన్నులను వివరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాదయాత్రలు నిర్వహించారు.. అనంతపురం జిల్లాలోని రొద్దం మండలంలో రోడ్లు, భవనాల శాఖమంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణ, వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పర్యటించారు. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పాదయాత్రలు కొనసాగాయి. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేలు పర్యటించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాదయాత్రలో పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఎమ్మెల్యేలు పాదయాత్రలు కొనసాగించగా.. ప్రొద్దుటూరులో నిర్వహించిన సభలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని పాదయాత్ర జరిపారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాదయాత్ర చేశారు. నెల్లూరులో జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్, మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నాయకులు పాదయాత్రలు నిర్వహించారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం రాంభొట్లపాలెం, బలుసుల పాలెంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు పాదయాత్ర చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగింది. కర్నూలు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సంఘీభావ యాత్రలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, రామచంద్రాపురం తాళ్లపొలం నుంచి బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కడియం మండలం జేగురుపాడులో ఎంపీ మార్గాని భరత్‌రామ్ పాదయాత్రలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం నందిగంపాలెంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, నిడదవోలు రావిమెట్ల, శంకరపురంలో ఎంపీ మార్గాని భరత్, లింగపాలెం మండలం భీమోలులో ఎంపీ కోటగిరి శ్రీధర్ పాదయాత్రల్లో పాల్గొన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పర్యటించారు. విశాఖ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిగాయి. -
ఆ సంకల్పానికి చేతులెత్తి..
సాక్షి నెట్వర్క్: జన నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రమంతటా పాదయాత్రలు, ర్యాలీల జోరు కొనసాగింది. ‘ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు’ కార్యక్రమాల్లో భాగంగా ఐదో రోజైన మంగళవారం కూడా వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వివిధ వర్గాల ప్రజలు, మహిళలు, రైతులు జేజేలు పలికారు. వైఎస్సార్ జిల్లా లింగాలలో ఎంపీ అవినాష్ రెడ్డి 23 కి.మీ మేర పాదయాత్ర చేశారు. చిత్తూరు జిల్లా పాలసముద్రంలో జరిగిన పాదయాత్రలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలోమంత్రి శంకర్‌నారాయణ పాదయాత్ర అనంతరం రచ్చబండ కార్యక్రమం చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా అంతటా వివిధ కార్యక్రమాలు జరిగాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్రలు జోరుగా సాగాయి. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పుట్టగుంటలో మంత్రి కొడాలి నాని పాదయాత్ర నిర్వహించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి గొట్టిపాడు వరకు హోం మంత్రి సుచరిత పాదయాత్ర నిర్వహించారు. తెనాలిలో జరిగిన బీసీ గర్జనలో ఎంపీలు మోపిదేవి, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నెల్లూరులో మంత్రి అనిల్‌కుమార్ పాదయాత్ర చేశారు. విశాఖ జిల్లాలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో మంత్రి వనిత, ఆచంటలో మంత్రి శ్రీరంగనాథ«రాజు పాదయాత్ర చేశారు. కర్నూలు జిల్లా అంతటా ప్రజా చైతన్య యాత్రలు కొనసాగాయి. -
ఘనంగా ‘ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు’
సాక్షి నెట్వర్క్: ప్రజాసంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం, వేటపాలెంలో ఆమంచి కృష్ణమోహన్, టంగుటూరులో డాక్టర్ వెంకయ్య, బల్లికురవలో బాచిన కృష్ణచైతన్య, గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్రలు చేశారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యేలు రోజా, ద్వారకానాథ్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు, నవాజ్ బాషా ఆధ్వర్యంలో ఈ పాదయాత్రలు జరిగాయి. కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని, మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజు, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు సంఘీభావ పాదయాత్రలు నిర్వహించారు. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేలు.. పీడిక రాజన్నదొర, శంబంగి వెంకట చినప్పలనాయుడు, అలజంగి జోగారావు, కడుబండి శ్రీనివాసరావు, బొత్స అప్పలనర్సయ్య, ఎమ్మెల్సీ పెనుమత్స సూర్యనారాయణరాజు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఎమ్మెల్యేలు.. సుదీర్‌రెడ్డి, రఘరామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పాదయాత్ర చేశారు. విశాఖ జిల్లాలో ఆయా కార్యక్రమాల్లో మంత్రి ముత్తంశెట్టి, ఎంపీ గొడ్డేటి మాధవి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు కొఠారు అబ్బయ్య చౌదరి, వీఆర్ ఎలీజా, తలారి వెంకట్రావు, గ్రంథి శ్రీనివాస్ పాదయాత్ర చేశారు. -
‘ప్రజా సంకల్ప యాత్ర’పై దేవిశ్రీ పాట
సీతమ్మధార (విశాఖ ఉత్తర): వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా గాయకుడు దేవిశ్రీ రచించి, పాడిన పాటను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదివారం విడుదల చేశారు. ‘ఆకలన్నోడికి అన్నం పెట్టే వైఎస్ జగనన్నో.. నీకు పేదలు అండగ ఉన్నారన్నో..’ అంటూ సాగిన గీతాన్ని మంత్రి ఆదివారం విశాఖలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాకవి శ్రీశ్రీ నుంచి వంగపండు వరకు ఎందరో మహానుభావులు ఇక్కడి వారు కావడం మన అదృష్టమన్నారు. ఆ కోవకు చెందిన మరో గొప్ప కవి దేవిశ్రీ అని కొనియాడారు. ప్రభుత్వం కళాకారులకు అండగా ఉంటుందన్నారు. గుంటూరులో గుర్రం జాషువా స్మారక చిహ్నం నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 కోట్లు విడుదల చేసిందన్నారు. ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రజలకు దేవుడయ్యారని పేర్కొన్నారు. చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి అని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇళ్లు ఇస్తుంటే బాబు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇళ్లు ఇవ్వలేదంటూ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. -
పండుగలా ప్రజాచైతన్య యాత్రలు
సాక్షి నెట్వర్క్: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు మూడో రోజైన ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాచైతన్య కార్యక్రమాలు పండుగలా నిర్వహించారు. ‘ప్రజల్లో నాడు–ప్రజల కోసం నేడు’ పేరిట మంత్రులు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ.. ప్రజలకు ఆయా పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. గుంటూరు జిల్లాలో పాదయాత్రలు కొనసాగాయి. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత వట్టిచెరుకూరు మండలం కోవెలమూడిలో, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దుర్గిలో, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు కనగాల–చెరుకుపల్లి, మరో ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని, జగ్గయ్యపేటలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పర్యటించగా.. వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాదయాత్రలు జరిపారు. విశాఖ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రభుత్వ విఫ్ బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు పాదయాత్రల్లో పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేలు ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, పార్టీ శ్రేణులు తూర్పు గోదావరి జిల్లాలో ఎంపీ వంగా గీతావిశ్వనాథ్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తాళ్లపూడి మండలంలో స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పాదయాత్రలో పాల్గొన్నారు. జిల్లాలో పలుచోట్ల ప్రజాచైతన్య యాత్రలు జరిగాయి. అనంతపురం జిల్లాలో మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లావ్యాప్తంగా పాదయాత్రలు జరిగాయి. వైఎస్సార్ జిల్లాలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రజాచైతన్య కార్యక్రమాలు కొనసాగాయి. -
సంకల్పం సాక్షిగా మార్పు
సాక్షి నెట్వర్క్ : ‘నిన్నటి కంటే ఈ రోజు బావుండాలి. ఈ రోజు కంటే రేపు ఇంకా బావుండాలి. అందరి జీవితాల్లో ఇలాంటి మార్పే నా లక్ష్యం. మీ అందరి చల్లని దీవెనలతో రేపు ఆ మార్పు సాధిస్తామని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రలో తరచూ చెప్పేవారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే ఆ దిశగా అడుగులు వేశారు. 17 నెలలు తిరక్కుండానే ఆ మార్పును సాకారం చేశారు’ అని ఊరూరా ప్రజలు వైఎస్సార్సీపీ నేతల ఎదుట ప్రస్తావిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు శనివారం ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగించాయి. ‘ప్రజల్లో నాడు–ప్రజల కోసం నేడు’ అంటూ భారీ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల్ని ఆరా తీశారు. సమస్యలను ఆలకించారు. చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యల పరిష్కారానికి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గుంటూరులో పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్సీ జంగా, ఎమ్మెల్యే ఎం. గిరిధర్ ► అనంతపురం జిల్లాలో మంత్రి శంకర్‌నారాయణ, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాదవ్, ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని ప్రజలు చెప్పారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డెప్ప ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, వైఎస్సార్ జిల్లా రాయచోటిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ మిథున్‌రెడ్డి, చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు కొనసాగాయి. శ్రీకాకుళం జిల్లా బ్రాహ్మణతర్లా– లక్ష్మీపురం మధ్య పాదయాత్రలో ప్రజలతో మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు ► శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు ర్యాలీలు చేపట్టారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రజలను కలిసి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఇంత తక్కువ సమయంలో వైఎస్ జగన్ ఇన్ని హామీలు నెరవేరుస్తారని అనుకోలేదని పలుచోట్ల ప్రజలు తెలిపారు. కృష్ణా జిల్లా వెణుతురుమిల్లిలో మంత్రి కొడాలి నాని పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు గ్రామ, గ్రామాన ప్రజలను కలుసుకున్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రులు ఆళ్ల నాని, శ్రీరంగనాథరాజు, తానేటి వనిత పాదయాత్రలో పాల్గొన్నారు. ► విజయనగరం జిల్లా మెట్టపల్లిలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ర్యాలీలో పాల్గొన్నారు. విశాఖ జిల్లా భీమిలిలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గాజువాకలో ఎంపీ సత్యనారాయణ పాదయాత్ర చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పాదయాత్ర చేపట్టారు. -
‘ఆ విషయం తెలుసుకోవడానికే పాదయాత్ర చేస్తున్నాం’
సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. శ్రీకాకుళంలో శనివారం నాడు ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు తన పాలనలో ఏనాడైనా ఒక ఎకరం భూమి కొని పేదవాడికి ఒక సెంటు భూమిని ఇండ్ల స్థలం కోసం ఇచ్చాడా? అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో రూ. 100 కోట్లు వెచ్చించి పేదల ఇండ్ల స్థలాల కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భూములు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. అయినప్పటికి చంద్రబాబు తమ ప్రభుత్వం విఫలమయ్యిందని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ పేదవాడి కన్నీరు తుడిచారు, అది వైఫల్యమా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు రెండు లక్షల సచివాలయాల ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వ వైఫల్యమా? అని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, మహిళలు, రైతులు, యువతకు అనేక పధకాలు ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం అని ధర్మాన తెలిపారు. ప్రజాసంకల్ప యాత్ర తరువాత సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఎటువంటి మార్పు జరిగిందో తెలుసుకోవడానికే పాదయాత్రల ద్వారా ప్రజల ముందుకు వస్తున్నామని ఆయన చెప్పారు. చదవండి: రైతులు రోడ్డున పడటానికి బాబే కారణం: సీపీఎం -
పాదయాత్రకి మూడేళ్లు
జగన్ పాదయాత్రకి, మహాజైత్ర యాత్రకి మూడేళ్లు. ఆయన కన్నాడు, ఆయన విన్నాడు, ఆయన సాధించాడు. నాడు బుద్ధుడు బయట సంచారంలో ఏమి చూశాడు? వాటినిబట్టి పూర్తిగా మారిపోయాడు. అప్పటి దాకా రాజ ప్రాసాదంలో పుట్టి పెరిగిన గౌతముడికి జర రుజ మరణాలు గురించిన స్పష్టత లేదు. తన రథం నడిపిన సారథిని అడిగి తెలుసుకున్నాడు. జర రుజ మరణాలు ప్రతి మనిషిని ఆవహి స్తాయ్ అని సారథి తేటతెల్లం చేశాడు. ఒక్కసారిగా రాకుమారుడికి బుద్ధి వికసించింది. జగన్మోహన్రెడ్డి అప్పటిదాకా అంతఃపురంలో పెరి గాడు. ఒక్కసారిగా విశాల ప్రపంచాన్ని చూడాలని, చూసి అర్థం చేసుకోవాలనుకున్నాడు. పాదయాత్రకి బయలు దేరాడు. ఎండనక, వాననక.. చీకటిని, వెన్నెలని సమంగా సమాదరిస్తూ, పేద గుడిసెల్లో రాజ్యమేలే దరిద్య్రాన్నీ, లేమినీ జాగ్రత్తగా ఆకళింపు చేసుకున్నాడు. రాష్ట్రంలో ఇంతటి కరువు రాజ్యమేలుతోందా? అని జగన్ నివ్వెర పోయాడు. వీళ్లకి ఏదైనా చెయ్యాలని ఎంతో కొంత మేలు చెయ్యాలని అడుగడుగునా ప్రతిజ్ఞ చేస్తూ జగన్ నడిచాడు. జనం ఆడామగా, పిల్లాజెల్లా నీరాజనాలు పలికారు. ప్రతి చిన్న అంశం ఆయన గమనించారు. స్కూల్ బ్యాగుల నుంచి యూనిఫారమ్‌ల నించీ అన్నీ అందరికీ సమకూర్చాలని సంకల్పించారు. గ్రామాల పాఠశాలల రూపు రేఖలు మారిపోయాయి. పిల్లలు గర్వంగా ‘ఇది మా బడి’ అనుకునే స్థాయికి తెచ్చారు. గ్రామ సుపరిపాలనకి నాంది పలికారు. చాలా ఉద్యో గావకాశాలు కల్పించారు. ఇది మన రాజ్యం అనే స్పృహ కల్పించారు. గతంలో పాలకులు పల్లెల్ని బాగు చేయడం ఎవరివల్లా కాదన్నారు. వ్యవసాయం లాభసాటి వృత్తి కాదన్నారు. గ్రామాల్లో ఎందరో పెద్దలు అనేకానేక ప్రయోగాలు చేసి చక్కని సిద్ధాంతాలను ఏర్పాటు చేశారు. అప్పట్లో ప్రతి గ్రామంలో కొద్దిమందైనా ఆదర్శరైతులుండేవారు. మావూళ్లో చిదంబరానికి మంచి పేరుండేది. ఆయనని, ఆయన సేద్యాన్ని చూడటానికి అడపాదడపా పొరుగూరి రైతులు వచ్చేవారు. ఆయన పెద్ద భూస్వామి కాదు. కేవలం ఒక ఎకరం భూమి వసతులన్నీ ఉన్నది ఉండేది. పొలంలో రెండు కొబ్బరి చెట్లు, రెండు నిమ్మ మొక్క లుండేవి. బాగా కాసేవి. ఆ నేలలోనే ఐదు సెంట్ల చిన్న చెరువు ఓ మూల ఉండేది. దాంట్లో చేపల పెంపకం నడిచేది. చుట్టూ అరటి మొక్కలు పెంచేవారు. ఏటా మూడు పంటలు పొలంలో పండించేవారు. ఒక ఆవు వారి పోషణలో ఉండేది. పది బాతులు పంటచేలో తిరుగుతూ ఉండేవి. సేంద్రియ వ్యవసాయానికి ఆవు, దూడ విని యోగానికి వచ్చేవి. పొలం పనులన్నీ చిదంబరం కుటుంబ సభ్యులే సకాలంలో బద్ధకించకుండా చేసుకునేవారు. తక్కువ భూమి కావడంవల్ల శ్రద్ధ ఎక్కువ ఉండేది. రాబడి అధికంగా ఉండేది. మంచి దిగుబడికి మూలం మంచి విత్తనం అన్నది చిదంబరం నమ్మిన సిద్ధాంతం. ఇప్పుడు ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. పెట్టుబడికి సకాలంలో డబ్బు అందిస్తోంది. రైతుకి గిట్టు బాటు ధర కల్పిస్తోంది. ఇవ్వాళ రైతులకు ముఖ్యంగా సన్నకారు రైతుకి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. జగనన్న పాదయాత్రలో తెలుగునేల ప్రతి అంగుళం నడిచి చూశారు. అందరి గోడు విన్నారు. వాటికి విరు గుడుగా ఏమి చెయ్యాలో కూడా అప్పుడే పథక రచన చేశారు. దాని పర్యవసానమే ఇప్పుడీ ప్రభుత్వం తెచ్చిన పథకాలు.. అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు. ఇంకా చెయ్యాల్సినవి ఎన్నో ఉన్నాయి. సుమారు ఏడాది కాలం కోవిడ్‌వల్ల నష్టపోయాం. విలువైన పౌష్టికాహారం మనమే యథాశక్తి పండించుకోవచ్చు. పల్లెల్లో పళ్లు, పచ్చికూరలు రసాయనాలు లేకుండా పండించుకోవచ్చు. వ్యవసాయ రంగంలో, విశ్వవిద్యాలయాల్లో వస్తున్న పరిశోధనా ఫలి తాలు ఎప్పటికప్పుడు చిన్న రైతులకు చేరాలి. హైబ్రిడ్ విత్తనాలు, తక్కువ వ్యవధిలో అధిక దిగుబడులిచ్చే ధాన్యాలు ధారాళంగా అందుబాటులోకి రావాలి. రైతులకు ఎప్పటికప్పుడు వర్క్‌షాపులు నడపాలి. వారికి ఉండే మూఢ నమ్మకాల్ని వదిలించాలి. చిన్న చిన్న రైతులు వినియోగించుకోగల వ్యవసాయ పనిముట్లు అందు బాటులోకి రావాలి. నాగళ్లు, హార్వెస్టర్లు, డ్రోన్లు తక్కువ ధరలకే అద్దెలకు దొరకాలి. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భాన్ని పేదరైతులకు అంకితం చేసి, ప్రతి ఏటా వారి వికాసానికి ఒక కార్య క్రమం చేపట్టాలి. -శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
‘మానవత్వమే నా మతం’ పుస్తకావిష్కరణ
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ‘మానవత్వమే నా మతం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో చోటు చేసుకున్న పలు మానవీయ ఘటనలు, ఆ సందర్భంగా అప్పుడు వైఎస్ జగన్ చూపిన దృక్పథంతో పాటు, ఆయన చిన్నతనం నుంచి ప్రదర్శించిన మానవీయ కోణాలను ఆవిష్కరింప చేస్తూ గాంధీపథం పక్షపత్రిక ఒక ప్రత్యేక పుస్తకం ప్రచురించింది. ‘మానవత్వమే నా మతం’ అన్న పేరుతో ప్రచురించిన ఆ పుస్తకాన్ని ముఖ్యమంత్రి తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా గాంధీపథం పక్షపత్రిక ఆ పుస్తకం ప్రచురించింది. (ప్రజల అజెండాయే.. సీఎం జగన్ అజెండా..) చిన్ననాటి నుంచే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, పాదయాత్రలో ఒక వృద్ధురాలి చెప్పు తెగిపోతే సరిచేసి ఇవ్వడం ,ముఖ్యమంత్రిగా ఒక పోలీసు అధికారికి పతకం ప్రదానం చేస్తుండగా, అది జారిపోతే స్వయంగా ఒంగి తీసి ప్రదానం చేయడం, విశాఖ పర్యటనలో కొందరు విద్యార్థులు తమ సహచరుడి అనారోగ్యం గురించి ప్లకార్డులు ప్రదర్శిస్తే వెంటనే ఆగి, వారి సమస్య తెలుసుకుని ఆ విద్యార్థి వైద్య సహాయం కోసం రూ.25 లక్షలు మంజూరు చేయడం.. వంటి పలు మానవీయకోణ విశేషాలను ‘మానవత్వమే నా మతం’ పుస్తకంలో పొందుపర్చినట్లు గాంధీ పథం పక్ష పత్రిక ఎడిటర్ పద్మజ తెలిపారు. (జీవితకాల మధుర‘యాత్ర’) పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, ముఖ్యమంత్రి సలహాదారు(గ్రామ, వార్డు సచివాలయాలు)ఆర్ ధనంజయ్ రెడ్డి, గాంధీ పథం పక్ష పత్రిక ఎడిటర్ పద్మజ పాల్గొన్నారు. (ఏపీ వ్యాప్తంగా ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’) -
వైఎస్ జగన్ పాదయాత్రకు మూడేళ్లు
-
ప్రజల అజెండాయే.. సీఎం జగన్ అజెండా..
సాక్షి, తాడేపల్లి: తండ్రి ఆశయాల కోసం.. మహానేత ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి తాండవం చేస్తున్న తరుణంలో వైఎస్ జగన్ పాదయాత్రతో ప్రజల సమస్యలను విని వారికి అండగా నిలిచారని పేర్కొన్నారు. దేశంలో ఎవ్వరికీ ఇవ్వని విజయాన్ని ఏపీ ప్రజలు వైఎస్ జగన్‌కు ఇచ్చారని తెలిపారు. పాదయాత్రలో చూసిన కష్టాలను సీఎం జగన్ పథకాలుగా మలిచారని చెప్పారు. గత పాలకులు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా.. వైఎస్ జగన్ ఉక్కు సంకల్పంతో పాలన ప్రారంభించారని తెలిపారు. ‘‘ఏడాదిన్నరగా ఇచ్చిన హామీలు అమలు చేస్తూనే ఉన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు దాదాపు అమలు చేశారు. దేశ చరిత్రలో ఏడాదిలోనే 90 శాతం ఎన్నికల హామీలు అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ ఒక్కరికే దక్కుతుంది. ఆయన అమలు చేసిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రతిపక్షాల దుష్ట ఆలోచనలను ప్రజలకు వివరిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు.(చదవండి: జనం మద్దతే జగన్ బలం) ప్రజా సంకల్పయాత్ర ఒక చరిత్ర.. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఒక చరిత్ర అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘‘ జగన్ పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది.14 నెలలు ప్రజలతో మమేకం అయ్యారు. అక్రమ కేసులు పెట్టినా బెదరకుండా జనంలోనే ఉన్నారు. ప్రజల్లో ఆదరణ ఓర్వలేక ప్రాణాలు కూడా తీయ్యాలని కూడా ప్రయత్నించారు. జగన్ ఎప్పుడూ జనంలోనే ఉన్నారు. జీవితం మొత్తం ప్రజలకే అంకితం చేశారు. ప్రజలు ఆశీర్వదించి 51 శాతం ఓట్లతో 151 సీట్లు కట్టబెట్టారు. ప్రజల నుండి తీసుకున్న అజెండానే తన అజెండాగా తీసుకున్నారు. 16 నెలల్లో రాష్ట్ర దిశను మార్చిన నేత సీఎం జగన్. ‘ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు’ అనే కార్యక్రమనికి శ్రీకారం చుట్టామని’’ ఆయన పేర్కొన్నారు.10 రోజుల పాటు పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకం కావాలని పిలుపు నిచ్చామని చెప్పారు. ఇది ప్రజల పండగగా జరపాలని పిలుపునిస్తున్నామని సజ్జల పేర్కొన్నారు. (చదవండి:.వైఎస్ జగన్ పాదయాత్రకు మూడేళ్లు) ఎన్ని కష్టాలు వచ్చినా సంకల్పం వదల్లేదు.. సీఎం వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజల్లోనే ఉన్నారని మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు. చంద్రబాబు అరాచక పాలన నుండి రాష్ట్రాన్ని రక్షించేందుకే పాదయాత్ర చేపట్టారని పేర్కొన్నారు.14 నెలలు ఎన్నికష్టాలు వచ్చినా సంకల్పం వదలలేదని, ఏడాదిన్నరలోనే సీఎం జగన్ 90 శాతం హామీలు అమలు చేశారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ చేసిన సంక్షేమ పాలన ప్రజలకు వివరిస్తామని వేణుగోపాల కృష్ణ తెలిపారు. -
‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’
-
సంక్షేమ సారధిగా.. ప్రజారంజక పాలన
సాక్షి, విజయవాడ : వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప పాదయాత్ర నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగా బస్ స్టాప్‌ను ప్రారంభించారు. కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ జక్కంపూడి రాజా ,బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు సహా వైఎస్సార్సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ..'ఎవరూ చేయలేని సాహసం వైఎస్ జగన్ చేవారని, 3648 కిలోమీటర్ల సుధీర్ఘ పాదయాత్రతో అన్ని వర్గాల ప్రజలతో జగన్ మమేకమయ్యారు. ప్రజల కష్టాలను దగ్గరనుంచి చూసిన వైఎస్ జగన్..ప్రజా మేనిఫోస్టోతో ఎన్నికలకు వెళ్లి అఖండ విజయం సాధించారు. అధికారం చేపట్టిన పద్నాలుగు నెలల్లోనే హామీలు నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్. సంక్షేమ రథసారధిగా ప్రజారంజక పాలన అందిస్తున్నారు' అని కొనియాడారు. సీఎం వైఎస్ జగన్‌కు వస్తోన్న ఆధరణను చూసి టీడీపీ తట్టుకోలేకపోతుందని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. ఇతర రాష్ట్రాలు ఏపీలో సాగుతున్న సంక్షేమ పడకలవైపు చూస్తున్నాయని, సంక్షేమ క్యాలెండర్ అమలుచేస్తున్న ఏకైక ప్రభుత్వం అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు పేదల ఇంటి వద్దకే చేరుస్తూ.. విద్య ,వైద్యం ,వ్యవసాయం ,శాంతిభద్రతల పరిరక్షణతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. (ప్రజా సంకల్పమే నిత్య స్ఫూర్తి) -
ఏపీ వ్యాప్తంగా ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’ పేరిట శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు.మంత్రులు, నాయకులు కేక్ కట్ చేశారు. వివిధ మతాల పీఠాధిపతులు సర్వమత ప్రార్థనలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, షర్మిల, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముగ్గురితో కలిసి పాదయాత్ర చేసిన రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులను మంత్రులు ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్న బాబు, అనిల్ కుమార్ యాదవ్, వేణుగోపాల కృష్ణ, కార్యాలయ ఇంచార్జ్ లేళ్ల అప్పిరెడ్డి, లక్ష్మీ పార్వతి, ధు సూధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: వైఎస్ జగన్ పాదయాత్రకు మూడేళ్లు) వైఎస్సార్ జిల్లా: బద్వేలులో వైఎస్సార్సీపీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు గురుమోహన్, రాజగోపాల్‌రెడ్డి, సుందరరామిరెడ్డి, గోపాలస్వామి యద్ధారెడ్డి శ్రీనివాసులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పోరుమామిళ్లలోని వైఎస్సార్ విగ్రహాలకు మాజీ ఎంపీపీ చిత్తా విజయ్ ప్రతాప్‌రెడ్డి, మండల కన్వీనర్ బాష, వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు. కృష్ణాజిల్లా: జగ్గయ్యపేట పట్టణంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో 18, 20,21 వార్డులో ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి ఆయన వివరించారు. ప్రజా సమస్యలను వినతిపత్రాల ద్వారా సేకరించి అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తన్నీరు నాగేశ్వరరావు, ముత్యాల వెంకటాచలం, చోడవరపు జగదీష్, తుమ్మల ప్రభాకర్, నంబూరి రవి, పలు శాఖల అధికారులు, వాలంటీర్లు, బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో.. ప్రజా సంకల్పానికి పునాదిపడి మూడేళ్లయిన సందర్భంగాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ‘వంగవీటి మోహన్‌రంగా బస్టాఫ్’ను ప్రారంభించారు. అనంతరం దేవీనగర్ నుంచి ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకొంటూ ఎమ్మెల్యేలు ముందుకు సాగుతున్నారు. పశ్చిమగోదావరి: జిల్లాలో ‘ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు’ పేరిట ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పెదవెల్లమిల్లి గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభించారు. పోలవరం నియోజకవర్గంలో పాదయాత్రలు ప్రారంభమయ్యాయి. కొయ్యలగూడెం మండలం డిప్పకాయలపాడు గ్రామంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాదయాత్ర ప్రారంభించారు. చింతలపూడి నియోజకవర్గంలో పాదయాత్రలు ప్రారంభమయ్యాయి. జంగారెడ్డిగూడెం తన క్యాంప్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే వి.ఆర్.ఎలిజా పాదయాత్ర ప్రారంభించారు. పాలకోడేరు మండలం కొండేపూడి గ్రామంలో ‘ప్రజల్లో నాడు- ప్రజలకోసం నేడు’ పాదయాత్ర ప్రారంభించారు. ఉండి నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేత పీవీఎల్ నరసింహారాజు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా: ప్రజా సంకల్పయాత్ర మూడేళ్లు పురస్కరించుకొని ‘ప్రజల్లో నాడు- ప్రజల్లో నేడు’ పేరిట ప్రజా చైతన్య కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కర్నూలు వైఎస్సార్ సర్కిల్ నుంచి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాదయాత్రను ప్రారంభించారు. విశాఖ జిల్లా: ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తయి మూడేళ్లయిన సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’ పేరుతో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కుంభ రవిబాబు తదితరులు పాల్గొన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో సమన్వయకర్త మళ్ళ విజయప్రసాద్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు . ‘జై జగనన్న జై జై జగనన్న మేము ఉన్నామన్న’ అనే నినాదంతో ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోపాలపట్నం పెట్రోల్ బంకు దగ్గర నుంచి కంచరపాలం వరకు ర్యాలీ నిర్వహించారు. చోడవరం పట్టణంలో ఎల్ఐసీ కోలనీ దగ్గర నుండి కొత్తూరు జంక్షన్ వరకు వైఎస్సార్సీపీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహనికి పూల మాల వేసి నివాళర్పించారు.మునగపాక మండలం ఉమ్మలాడలో యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు.. దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళర్పించారు. నాతవరం మండలం మాధవనగరంలో ప్రజాచైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఈ పాదయాత్రలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు. ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా అనకాపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో దాడి రత్నాకర్, దంతులూరి దిలీప్ కుమార్, మళ్ల బుల్లిబాబు, మందపాటి జానకిరామరాజు, గొర్లి సూరి బాబు, గొల్లవిల్లి శ్రీనివాసరావు, పలకా రవి, జాజుల రమేష్ పాల్గొన్నారు. మునగపాకలో గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ కేక్ చేశారు. -
జీవితకాల మధుర‘యాత్ర’
ఈ రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమాన్ని ఓ మేలి మలుపు తిప్పిన ప్రజా సంకల్పయాత్ర వంటి ఓ చారిత్రక ఘట్టంలో మేమూ భాగస్వాములమైనందుకు గర్వంగా భావి స్తాను. నిరాశ, నిçస్పృహలు అలముకున్న ప్రజలకు ‘నేనున్నాను’ అని ధైర్యం చెబుతూ జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వేసిన ఆ అడుగులు ఈ రాష్ట్ర అభివృద్ధికి పడిన గొప్ప ముందడుగు. ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు తాను చేసిన పాదయాత్ర గురించి చెబుతూ ఆనాడు తన కాళ్లలో దిగిన ముళ్లు ఇప్పటికీ గుర్తుకు వస్తాయన్నారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డికిగానీ ఆయనతో కలసి పాదయాత్రలో పాల్గొన్న మాకుగానీ మేము పడిన కష్టాలు.. కాళ్ల బొబ్బలు.. జలుబులు, జ్వరాలు, వర్షాలు ఏవీ గుర్తుకు రావు. చివరికి అప్పటి టీడీపీ ప్రభుత్వ సహకారంతో విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో తనపై చేయించిన హత్యాయత్నం కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డికి గుర్తుకు రాదు. ఆ పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాలు, వారి సమస్యలు, ఆవేదన గుర్తుకు వస్తాయి. అంతటి బాధల్లోనూ ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథం పట్టడం... తమ బాధలు తీర్చడానికి రాజన్న కొడుకు వచ్చాడని వాళ్ల మొహాల్లో కనిపించిన నమ్మకం గుర్తుకు వస్తుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయాలు విడిచిపెట్టారు. ప్రజలకు హామీ ఇచ్చినట్టుగా కులం చూడం.. మతం చూడం.. పార్టీలు చూడం.. అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆ యాత్ర ఎన్నో గొప్ప అనుభవాలు, జ్ఞాపకాలు మిగిల్చింది. అసలు కష్టం అన్నది ఏమిటో తెలియకుండా పెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తానంటే మేము మొదట్లో కంగారుపడ్డాం. ఆయన పాదయాత్రకు ఏర్పాట్లు ఎలా చేయాలా అని తర్జనభర్జనపడ్డాం. మేము పది మందిమి ఓ జట్టుగా ఉండి పాదయాత్ర ఏర్పాట్లు పర్యవేక్షించాం. పగటి పూట అంతా పాదయాత్ర చేసే నాయకుడు రాత్రి వేళ అయినాసరే కాస్త హాయిగా విశ్రాంతి తీసుకునేలా చూడాలన్నది మా ఉద్దేశం. కానీ పాదయాత్రలో అన్ని చోట్ల విశ్రాంతికి సరైన ప్రదేశాలు దొరికేవి కావు. ఊరి చివర పొలాల్లో, కొన్ని సార్లు అయితే శ్మశానాల సమీపంలో కూడా రాత్రి విడిది ఏర్పాటు చేయాల్సి వచ్చేది. కానీ అవేవీ వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టించుకునే వారు కాదు. విడిది ఏర్పాట్లు ఎలా ఉన్నా ఆయనకు పట్టేది కాదు. ఆ రోజు ఎంతమంది ప్రజలను కలిశాను.. వారు చెప్పిన సమస్యలు ఏమిటి.. ఇంకా తనను ఎవరైనా కలవలేక పోతున్నారా... ఇంకా మారుమూల పల్లెలకు వెళ్లాలి... ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా చూడాలి.. అందుకోసం పాదయాత్రలో ఏమైనా మార్పులు చేయాలా అని మాతో చర్చించేవారు. కానీ తన వసతుల గురించి ఒక్కరోజు కూడా ఆయన మాట్లాడలేదు. పగటి పూట మొత్తం ఏమీ తినకుండా... అంటే టిఫిన్, భోజనం లేకుండానే ఆయన పాదయాత్ర చేసేవారు. మధ్యాహ్నం కొన్ని పండ్లు తినేవారు. రాత్రి వేళల్లోనే భోజనం చేసేవారు. అందుకనే ఆయన చిత్తశుద్ధి, దృఢ సంకల్పాన్ని ప్రజలు గుర్తించారు. అందుకే అఖండ మెజార్టీతో ఎన్నికల్లో గెలిపించి అధికారాన్ని అప్పగించారు. ప్రజల విశ్వాసాన్ని నిజం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 నెలలుగా ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అంతటి జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నంటి పాదయాత్రలో మొదటి నుంచీ చివరి వరకూ పాల్గొనడం.. ఆ పాదయాత్ర కోఆర్డినేటర్‌గా వ్యవహరించడం ఓ గొప్ప అనుభూతి. జీవితకాలం పాటు గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం. పాదయాత్రకు ముందు జగనన్న సైనికులుగా ఉండేవాళ్లం. ఆయన్ను చూసిన తర్వాత జనం సేవకులుగా మారిపోయాం. తలశిల రఘురాం వ్యాసకర్త ఏపీ ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, పాదయాత్రకు కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు -
జనం మద్దతే జగన్ బలం
వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టి నేటికి సరిగ్గా మూడేళ్లయింది. గతంలో రాజశేఖరరెడ్డి లేపాక్షి నుండి పోతిరెడ్డి వరకు రాయలసీమ సాగు, తాగు నీటికోసం, హంద్రీనీవా, గాలేరు నగరి వెలిగొండ ప్రాజెక్టుల కోసం పాదయాత్ర,లు తలపెట్టారు. ఆ తరువాత ప్రజాప్రస్థానం పేరుతో చేవెళ్ళ నుండి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ చరిత్రనే తిరగరాసింది. తరువాత జగనన్న వదలిన బాణాన్ని నేను అంటూ అన్నకు మద్దతుగా వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరకు విజయవంతంగా కొనసాగింది. వైఎస్సార్, షర్మిల చేపట్టిన పాదయాత్రలు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు జరిగినవి. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర మాత్రం రాష్ట్ర విభజనానంతరం జరిగింది. ఇది ప్రజలు పడే బాధలను తీర్చడానికి జరిపిన పాదయాత్ర. వారి బాధలు అక్కడికక్కడే తీర్చడానికి ఆయన చెప్పిన అంశాలు తరువాత ఒక ప్రజా మేనిఫెస్టోకు రూపమిచ్చాయి. ఆయన అధికారంలోకి వచ్చాక ప్రజల అవసరాలు తీర్చడానికి ఆ మేనిఫెస్టో ఎంతగానో ఉపయోగపడింది. వ్యవసాయరంగం, సంక్షేమరంగం, ఫీజు రీయింబర్స్ మెంట్, పింఛన్, ఆరోగ్యశ్రీ... ఇలా సంక్షేమం, సుపరిపాలన పేరుతో వైఎస్ జగన్ అమలుచేస్తున్న అనేక పథకాలను నేడు జాతీయంగా చర్చిస్తున్నారు. ఏపీలో అవలంబిస్తున్న విధానాలు పరిపాలనా, వికేంద్రీకరణ కోసం గ్రామ స్వరాజ్యం పేరిట జగన్ ఏర్పాటుచేసిన నూతన పాలనా వ్యవస్థ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత, వారికి కల్పించిన సంక్షేమ కార్యక్రమాలు, వారి అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్లు ఏరకంగా చూసినా వినూత్నమైనవి. దేశచరిత్రలోనే తొలిసారిగా గ్రామ సచివాలయాల ఏర్పాటు, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిం చడం, గ్రామీణ పరిపాలనా వికేంద్రీకరణను అట్టడుగు ప్రజలకు పరిపాలనను అందించే విధంగా చేయడం గొప్ప విషయం. ఇవన్నీ జగన్‌కు పాదయాత్ర కాలంలో స్ఫురించినవి.. పైగా ఆయన అర్థం చేసుకుని తీసుకొచ్చిన పాలనా సంస్కరణలే. ఆరోజు జగన్ వదలిన బాణాన్ని నేను అంటూ వైఎస్సార్ తనయ షర్మిల జరిపిన పాదయాత్ర ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ నిలదొక్కుకోవడానికి, వైఎస్ కుటుంబం ప్రతిష్ఠ పెంచడానికి, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడానికి ఇతోధికంగా దోహదపడింది. మరోవైపున సోనియాగాంధీ వత్తాసుతో కాంగ్రెస్, టీడీపీలు రెండూ కుమ్మక్కై చేసిన నేరారోపణల ఫలితంగా 16 నెలలు జైలులో గడిపారు వైఎస్ జగన్. కనీవినీ ఎరుగని కష్టాలకు, బాధలకు ఓర్చి తట్టుకున్న జగన్ మనోనిబ్బరం, మనోస్థైర్యం ప్రజల నుండి వచ్చినవే. వైఎస్సార్ తనయుడిని కడగండ్ల పాలు చేసి తండ్రి వారసత్వాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ చేసిన కుట్రపూరిత ప్రయత్నాలను ప్రజలు తిరస్కరించి వైఎస్సార్ తనయుడి వైపే మొగ్గు చూపారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. 2019లో జరిగిన విభజనానంతర ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశాన్ని కూడా ప్రజలు తిరస్కరించారు. స్వల్పతేడాతో 2014లో అధికారానికి దూరమైన వైఎస్ జగన్‌కు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టి 151 అసెంబ్లీ సీట్లు ఇవ్వడం ఆయన చేసిన పాదయాత్రల ఫలితమే. గ్రామ స్వరాజ్యం పేరుతో పరిపాలన సాగించడం వైఎస్ జగన్ సాధించిన పరిణతికి నిదర్శనం. పాదయాత్ర ద్వారా ప్రజలతో నిత్యం సంబంధాలు కొనసాగించిన జగన్ వారి నుంచి స్ఫూర్తి పొందిన ఫలితమే నేడు ఏపీలో సంక్షేమ పథకాలు ఆకాశమే హద్దు లాగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు నాయకులు ఒకే కుటుంబం నుంచి వేలాది కిలోమీటర్ల దూరం పాదయాత్ర జరపడం ఒక విశేషం కాగా, వైఎస్ జగన్ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన పరిణామానికి కారణమైంది. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో సంక్షేమానికి చిరునామాగా జగన్ మారారు. రాయలసీమలో ఈ రోజు ఇన్ని సేద్యపు నీటి పథకాలు రూపుదిద్దుకున్నాయి అంటే ఆనాడు రాజశేఖరరెడ్డి లేపాక్షి నుండి పోతిరెడ్డి పాడు వరకు చేపట్టిన పాదయాత్రకు కొనసాగింపు ఫలితమే అని గుర్తించాలి. రాష్ట్రం అభివృద్ధిలో నూతన మలుపు తిరగడానికి ఉపయోగపడిన పాదయాత్ర వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర. ఈ సందర్భంగా జగన్‌కు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఇమామ్ వ్యాసకర్త కదలిక సంపాదకులు ‘ మొబైల్: 99899 04389 -
వైఎస్ జగన్ పాదయాత్రకు మూడేళ్లు
-
నవంబర్ 6 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు : సజ్జల
-
‘అరుదైన రాజనీతిజ్ఞుడిగా సీఎం జగన్ నిలిచారు’
సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ 6 నుంచి వైఎస్సార్సీపీ తరపున వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ప్రజలకు ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా అనేది వారి నుంచి తెలుకుంటామని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. . దేశ చరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా వైఎస్ జగన్ పాదయాత్ర చేశారన్నారు. 14 నెలల పాటు ప్రజల్లో ఉంటూ 3,640 కిలో మీటర్ల దూరం నడిచారని గుర్తుచేశారు. తనకు తానే ఒక మార్పుకు నాంది పలుకుతూ.. ఈ రోజు దేశంలోనే అరుదైన రాజనీతిజ్ఞుడిగా సీఎం జగన్ నిలిచారని ప్రశంసించారు. చీకటి తర్వాత తొలిపొద్దు పొడిచినట్లు రాష్ట్రం ముందడుగు వేసిందన్నారు. అందుకే నవంబర్ 6 నుంచి పార్టీ తరపున కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు సజ్జల వివరించారు. ‘సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఇచ్చిన హామీలను 90శాతం అమలు చేశారు. సంక్షోభాలను తట్టుకొని ఒక ధీశాలిగా ప్రభుత్వాని నడిపించారు. పరిపాలనను వికేంద్రీకరించి గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఇంటి ముందుకు పరిపాలన తెచ్చారు. గతంలో రేషన్ కార్డు నుంచి ఏది కావాలన్నా సమయం దొరికేది కాదు కానీ, ప్రస్తుతం సంతృప్తి స్థాయిలో నిర్ణీత సమయంలో సేవలు అందుతున్నాయి. సంక్షేమ నగదు నేరుగా లబ్దిదారుని ఖాతాలోకి వెళ్తున్నాయి. ఇవన్నీ సీఎం జగన్ తపన, నిబద్దత వల్లే సాధ్యమవుతున్నాయి. రివర్స్ టెండరింగ్ వల్ల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు రూ.2.60 లక్షల కోట్ల అప్పులు, మరో 60 వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టారు. ఆ డబ్బు అంతా ఎక్కడికి పోయింది అనే ప్రశ్న తలెత్తింది. ఇన్ని సమస్యలను ఎదుర్కొని వైఎస్ జగన్ పారదర్శకత, జవాబుదారీ తనం తెచ్చారు. ఇంగ్లీష్ మీడియం చదువు కొనుక్కోడానికి పేదలు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. సీఎం జగన్ మన పిల్లలంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి అని భావించారు. నాడు నేడు కింద స్కూల్ ఎలా అభివృద్ధి చెందుతున్నాయో మీరే చూస్తున్నారు. కానీ టీడీపీ నేతలు అన్నిటికీ కోర్టులకు వెళ్లి స్టే తెస్తున్నారు. ఎన్నికల సమయంలో అభివృద్ధి చేద్దాం అనే ధోరణి నుంచి బయటకు వచ్చి ప్రజలకు ఫలితాలు అందిస్తున్నాం. మహిళలకు మేము పెద్ద పీట వేశాము అని గర్వంగా చెప్పగలం. అన్నింటిలో వారికి 50 శాతం స్థానం కల్పించాం. ఆస్పత్రులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందబోతున్నాయి.16 కొత్త మెడికల్ కాలేజీ లు వస్తున్నాయి. ఏడాదిన్నరలోనే ఇవన్నీ చేసిన సందర్బంగా మా పార్టీ ప్రజల్లోకి వెళుతోంది. 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా అనేది వారి నుంచి తెలుసుకుంటాం. ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాం’ అని సజ్జల పేర్కొన్నారు. -
‘పాదయాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా’
-
‘పాదయాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా’
సాక్షి, తాడేపల్లి : వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో చేసిన ప్రజాసంకల్పయాత్ర రాష్ట్ర స్థితిగతిని మార్చివేసిన పాదయాత్ర అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన ప్రజల్లో మమేకమై ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకున్నారని గుర్తుచేశారు. ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర ముగిసి నేటికి ఏడాది పూరైన సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ నందిగం సురేష్‌లు పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ.. దేశ చరిత్రలో సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర నిలిచిపోతుంది. ప్రజాసంకల్పయాత్ర రాష్ట్ర స్థితిగతిని మార్చివేసింది. చరిత్రలో నిలిచిపోయే పాదయాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. వైఎస్ జగన్‌తో కలిసి పాదయాత్రలో అడుగులో అడుగు వేయడం సంతోషాన్నిచ్చింది. కోట్లాది మంది ప్రజలు వైఎస్ జగన్ మీద నమ్మకం పెట్టుకున్నారు. రికార్డు స్థాయిలో 3648 కి.మీ పాదయాత్ర చేశారు. మే 23న వైఎస్ జగన్‌పై ప్రజలకు ఎంత అభిమానం ఉందో బయటపడింది. 151 సీట్లలో వైఎస్సార్సీపీకి కట్టబెట్టారు. గాలికి వదిలేసిన సంక్షేమాన్ని సీఎం వైఎస్ జగన్ గాడిలో పెడుతున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన 80 శాతం హామీలను రెండు మూడు నెలల్లోనే అమలు చేశారు. చెప్పని హామీలను కూడా అమలు చేసి చూపిస్తున్నార’ని తెలిపారు. ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తానని చెబితే అందరు ఆశ్చర్యపోయారని అన్నారు. సుదీర్ఘంగా 3648 కి.మీ సాగిన పాదయాత్రలో ఆయన 2 కోట్ల మందిని కలుసుకున్నారని తెలిపారు. పేదలు పడుతున్న కష్టాలను కళ్లారా చూశారని చెప్పారు. పాదయాత్రలో చూసిన కష్టాలను తీర్చడం కోసం నవరత్నాలను ప్రవేశపెట్టారని.. మొదటి ఆరు నెలల్లోనే సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చారని వెల్లడించారు. సీఎం జగన్ చారిత్రాత్మక పథకాలను ప్రవేశపెడుతున్నారని కొనియాడారు. నందిగం సురేశ్ మాట్లాడుతూ.. పాదయాత్రను వైఎస్ జగన్మోహన్రెడ్డి పండగలా ప్రారంభించారని గుర్తుచేశారు. పాదయాత్ర సమయంలో ఆయనను ఎన్నో ఇబ్బందులు పెట్టారని.. కానీ ప్రజల కోసం వైఎస్ జగన్ 3,648 కి.మీ పాదయాత్ర చేశారని తెలిపారు. దళిత కుటుంబంలో పుట్టిన తనను ఎంపీగా చేశారని.. ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టారని చెప్పారు. -
విలీనం రైట్ రైట్
ఆయన మాట.. లక్షల మంది ఉద్యోగుల జీవితాలకు ప్రగతి బాటఆయన లక్ష్యం.. ప్రతి ఉద్యోగీ తన గుండెలపై చేయి వేసుకుని నిర్భయంగా జీవించడమే ధ్యేయంఆయన మార్గం.. సమస్యలను పారదోలుతూ సాగిపోయే సంక్షేమ పయనం.. ఇదిగో శాసన సభ వేదికగా ఆమోదించిన మరో చారిత్రాత్మక బిల్లే దీనికి సాక్ష్యం. ..ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమవ్వాలనే కల.. ఏళ్ల తరబడి శిలగా మారిన వేళ.. పాదయాత్రికుడై వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేనున్నానంటూ అభయమిచ్చారు. ఆనాడే కార్మికుల గుండెల్లో ఆవేదన తడిని చూసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే కమిటీ ఏర్పాటు చేసి.. హామీ అమలుకు ముందడుగు వేశారు. ఇప్పుడు శాసన సభలో విలీన బిల్లుకు పచ్చజెండా ఊపి ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. సాక్షి, గుంటూరు: ప్రజా సంకల్పయాత్ర, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. ప్రపంచం మొత్తం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చరిత్ర సృష్టించారు. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును సోమవారం శాసన సభ ఆమోదించింది. ఈ బిల్లుతో ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై కార్మికులు కాదు.. ప్రభుత్వం తీసుకువచ్చే ఏపీఎస్ ఆర్టీసీ విలీనం చట్టం ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉన్న ఆర్టీసీ.. పూర్తిగా ప్రభుత్వ సంస్థ మారనుంది. ఆర్టీసీ కార్మికులు సైతం రాబోయే రోజుల్లో ఉద్యోగులుగా మారనున్నారు. జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులంతా పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపబడతారు. జిల్లాలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది కలిపి 4,851 మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. వీరంతా జనవరి 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగులే. చరిత్రలో నిలిచిపోతారు.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే ఇందు కోసం కమిటీని ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడానికి కుదరదని చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 52 వేల మంది ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించిన సీఎం జగన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. – ఎం హనుమంతరావు,స్టేట్ ఎంప్లాయిస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ -
ప్రజా సంకల్పానికి రెండేళ్లు
-
ఆ యాత్ర చరిత్రలో నిలిచిపోతుంది : టీజేఆర్
సాక్షి, తాడేపల్లి : దేశచరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు గుర్తుచేశారు. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి నేటితో రెండేళ్లు పూర్తైన సందర్భంగా.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సుధాకర్‌బాబు మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఒక చరిత్ర అని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హమీలను సీఎం వైఎస్ జగన్ ఐదు నెల్లలోనే అమలు చేసి చూపించారని తెలిపారు. ప్రజల కష్టాలు తీర్చడం కోసమే వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేపట్టారని.. ఆయన చేసిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అంతకు ముందు మీడియాతో మాట్లాడిన సుధాకర్‌బాబు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలోనే ఇసుకను విచ్చలవిడిగా దోచేశారని ఆరోపించారు. అప్పుడు స్పందించని పవన్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. ప్రజలు తిరస్కరించినా పవన్ సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చిరంజీవి లేకపోతే పవన్ సినిమాల్లో వచ్చేవారా అని ప్రశ్నించారు. పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అని విమర్శించారు. ఇసుక దోపిడీని ఆరికట్టేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన విధానం తీసుకొచ్చారని తెలిపారు. పవన్ వెనుక ఉన్నవారంతా టీడీపీ తొత్తులే అని ఆరోపించారు. గత ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పినవారికే పవన్ సీట్లు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌లు దొంగ నాటకాలు ఆపాలని అన్నారు. పవన్ చేష్టలు అపహాస్యంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. పవన్ లాంగ్‌మార్చ్‌లో టీడీపీ కార్యకర్తలు తప్ప ఎవరు లేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు విష కౌగిలి నుంచి పవన్ బయటకు రావాలని సూచించారు. -
ప్రజా సంకల్ప సంబరాలు..
సాక్షి, తాడేపల్లి : వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదాలో చేసిన ప్రజా సంకల్ప యాత్రకు నేటితో సరిగ్గా రెండేళ్లు నిండాయి. ఈ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం సంబరాలు జరిగాయి. ఈ సంబరాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు కేక్ కట్ చేశారు. రాజన్న రాజ్యం మళ్లీ తీసుకు రావాలన్న సంకల్పంతో చేపట్టిన చరిత్రాత్మక పాదయాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మారథం పట్టిన సంగతి తెలిసిందే. ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్ రాజ సమాధి వద్ద 2017 నవంబర్ 6న వేసిన తొలి అడుగు.. వందలు, వేలు, లక్షలు, కోట్లాది మంది జనం మధ్య వారి హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 సభల్లో, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు. జనం గుండెల్లో దాగి ఉన్న బాధను తెలుసుకున్నారు. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ ప్రతి ఒక్కరిలో ధైర్యం నింపారు. వైఎస్సార్సీపీలో చేరిన అద్దేపల్లి.. జనసేన నేత అద్దేపల్లి శ్రీధర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. చరిత్రలో చూడలేదు.. భవిష్యత్తులో కూడా చూడలేం.. సాక్షి, పశ్చిమ గోదావరి : ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏ నాయకుడు చేయని విధంగా పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారని గుర్తుచేశారు. 3,648 కి.మీ సుదీర్ఘంగా సాగిన పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి హామీలు ఇచ్చారని.. ఇప్పుడు అధికారంలో వచ్చాక వాటిలో 90 శాతం నెరవేర్చారని తెలిపారు. ఇటువంటి పాదయాత్రను చరిత్రలో చూడలేదని.. భవిష్యత్తులో కూడా చూడలేమని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. -
తిత్లీ తుపాను బాధితుల సహాయం రెట్టింపు
-
తిత్లీ తుపాను బాధితులకు ఆపన్నహస్తం
సాక్షి, అమరావతి : తిత్లీ తుపాను బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆపన్నహస్తం అందించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గత ఏడాది డిసెంబర్ 30న పలాసలో ఇచ్చిన హామీకి కార్యరూపం ఇస్తూ పరిహారాన్ని భారీగా పెంచారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నష్టం వాటిల్లిన కొబ్బరి చెట్టుకు ఇచ్చే పరిహారాన్ని రూ.1,500 నుంచి రూ.3 వేలకు పెంచింది. నష్టం వాటిల్లిన జీడిమామిడి చెట్లకు హెక్టారుకు ఇచ్చే పరిహారాన్ని రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచింది. తాజాగా పెంచిన పరిహారాన్ని అందించడానికి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. గతేడాది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తిత్లీ తుపాను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. లక్షలాది కొబ్బరి చెట్లు, వేలాది హెక్టార్లలో జీడిమామిడి తోటలు నేల కూలాయి. ఏళ్లుగా పెంచుకున్న తోటలు నాశనమవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం తిత్లీ తుపాను సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఏ మూలకూ సరిపోని విధంగా నేలకూలిన కొబ్బరి చెట్టుకు రూ.1500, పూర్తిగా నష్టం వాటిల్లిన జీడిమామిడి తోటకు ఒక హెక్టారుకు రూ.30 వేల చొప్పున పరిహారం ఇచ్చేలా గత ఏడాది అక్టోబర్ 19న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే టీడీపీ నేతల జోక్యం వల్ల లబ్ధిదారుల జాబితాలో తోటలు నష్టపోయిన రైతుల పేర్లు గల్లంతయ్యాయి. లబ్ధిదారుల జాబితాలో సింహభాగం టీడీపీ నేతలు, కార్యకర్తల పేర్లే కనిపించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అప్పటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు విన్నవించుకున్నారు. అధికారంలోకి రాగానే పరిహారం పెంచుతామని, అర్హులైన రైతులందరికీ న్యాయం చేస్తామని అప్పట్లో వైఎస్ జగన్ పలాస సభలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం తిత్లీ తుపాను బాధిత రైతులకు పరిహారాన్ని పెంచుతూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
మనకే.. మస్కా కొట్టారు!
త్రిమూర్తులు : అరే.. సహదేవుడు.. మూటా ముల్లు సర్దుకుని ఊరి విడిచివెళ్లిపోతున్న.. ఆ కుటుంబం ఎవరిదిరా.. అటు చూడూ.. సహదేవుడు : వాళ్లా.. మామా.. ఇంకెవరూ మన భూషారావు కుటుంబం.. పాపం.. మన కొల్లేరులో పనులు లేక ఒడిషా రాష్ట్రానికి పిల్లలతో సహా వలస పోతున్నాడు.. త్రిమూర్తులు: అరేరే.. ఎంత కష్టం వచ్చిందిరా.. పదా ఆపుదాం.. అంటూ పరుగున వెళ్లారు.. సహదేవుడు : భూషారావు బాబాయ్.. ఎక్కడకు వెళుతున్నారు.. మొత్తం కుటుంబమే తరలిపోతున్నారు... భూషారావు : ఏమని చెప్పను.. సహదేవు.. మన కొల్లేరులో పనులు కరువయ్యాయి.. ఇకప్పుడు బాగా బతికిన కుటుంబం మాది.. నీకు తెలుసుకదా.. ఒడిషాలో నీటి ఏరులు ఉన్నాయి.. అక్కడ చేపల వేటతో జీవనం సాగిద్దామని వెళుతున్నా.. త్రిమూర్తులు: భూషారావు.. నువ్వు పెద్దోడివి. అన్ని తెలిసినోడివి.. నువ్వే ఇలా అంటే ఎలా.. మరో 21 రోజుల్లో ఎన్నికల వస్తున్నాయి... వచ్చే ప్రభుత్వం మన కొల్లేరు కష్టాలు ఆలకిస్తుందనే నమ్మకం నాకు ఉంది.. అప్పటి వరకు ఆగిపోవచ్చుకదా.. భూషారావు : ఆ నమ్మకం నాకు లేదు.. త్రిమూర్తులు.. మొన్న ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏమన్నారు... మేము అధికారంలోకి వస్తే∙కొల్లేరు కాంటూరును కుదిస్తామన్నారు.. రెగ్యులేటర్ కడతా మన్నారు. సర్కారు కాల్వపై వంతెన నిర్మిస్తామని చెప్పారు. కుదింపు అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నా, మిగిలిన హామీలైన నెరవేర్చవచ్చుకదా.. నా పుట్టిన రోజుకు వంతెన నిర్మిస్తానని మన ఎమ్మెల్యే కామినేని గత ఏడాది చెప్పారు.. పనులు పూర్తి కాలేదు.. మనకే మస్కా కొట్టారురా... ఇప్పుడు చెప్పు.. మల్లిఖార్జునరావు : (సైకిల్‌పై వస్తూ ఆగాడు) భూషారావు నువ్వు చెప్పిన మాటలు విన్నా. అది నిజమే.. మొన్న ఎన్నికల్లో మన కొల్లేరు గ్రామాల వ్యక్తికి రావల్సిన సీటు టీడీపీ పొత్తుల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌కు దక్కింది. ఆయనను గెలిపించాం.. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. కేంద్రంలో ఉన్న సంబంధాలతో కొల్లేరు కష్టాలు తీరుతాయని భావించా.. చివరకు మనకు కన్నీళ్లే మిగిలాయి. భూషారావు : నిజమే.. మల్లిఖార్జున.. పుష్కరాల స్నానాలకు వచ్చిన కేంద్ర మంత్రులను హెలికాప్టర్‌పై మన కొల్లేరు పెద్దింట్లమ్మ గుడివద్ద దించి ఏవో.. నాలుగు మాటలు చెప్పించారు.. తర్వాత కమిటీలంటూ కాలయాపన చేశారు. చివరకు కొల్లేరు కాంటూరు కుదింపు కుదరదన్నారు.. పౌల్రాజ్ : భూషారావు బాబాయ్.. మిగిలింది నేను చెప్తా.. వినండి.. కాంటూరు కుదింపు కుదరదని సుప్రీం కోర్టు చెప్పడంతో, కొల్లేరు బౌండరీలు మార్చి చుట్టూ జిరాయితీ భూములు కేటాయిస్తామని, మొన్నటి వరకు బీజేపీ ఎమ్మెల్యే కామినేని చెప్పారు. ఎన్నికలు రావడంతో ఇప్పుడు అసలు పత్తా లేకుండా పోయారు... అవునా.. కాదా.. త్రిమూర్తులు : పౌల్రాజ్ నువ్వు చెప్పింది నిజమే .. అదట్టా ఉంచూ.. క్రిందటి సంవత్సరం ప్రజా సంకల్పయాత్ర చేయడానికి వచ్చిన జగన్ మన కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని అనుకుంటున్నారా... అదిగదిగో.. ఆ వచ్చేది మన నరసింహేకదా.. ఆడికి బాగా తెలుసు అడుగుదాం.. నరసింహ : అందరికి నమస్కారమండీ.. ఏంటీ అందరూ మీటింగు పెట్టారు... త్రిమూర్తులు: ఏం లేదు.. నరసింహా.. మన భూషారావు కొల్లేరులో పనులు లేవని వలసపోతున్నాడు.. అందరం కలసి ఆపుతున్నాం.. నరసింహ : భూషారావు.. ఇన్ని రోజులు కష్టలు పడ్డావు.. ఇంకొక్క నెల ఆగు.. మన బతుకులు మారతాయి. మొన్న ప్రజా సంకల్ప యాత్రగా వచ్చిన వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ఏమన్నారో.. చెబుతాను వినండి.. ‘ నేను గత నాయకుల మాదిరిగా అమలు కాని వాగ్దానాలు ఇవ్వను.. మీ సామాజికవర్గ వ్యక్తికి ఎమ్మెల్సీ కేటాయించి, నా పక్కన కూర్చోబెట్టుకుంటా.. మీ సమస్యల పరిష్కారానికి ప్లాన్ ఏ, ప్లాన్ బీ అనే పద్ధతుల ద్వారా పరిష్కారించుకుందాం.. కొల్లేరు ప్రజలకు అవసరమైన రెగ్యులేటర్ నిర్మించుకుందాం.. అని చెప్పారు.. చూద్దాం.. ఆగండి.. పౌల్రాజ్ : భూషారావు.. నాకు జగన్ చెప్పిన హామీలపై నమ్మకం ఉంది.. మన కొల్లేరు ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటున్నా.. ఆయన తండ్రి కొల్లేరు ఆపరేషన్ తర్వాత దాదాపు 3,500 కోట్లు ప్రత్యేక పునరావాస ప్యాకేజీని అందించారు. సహదేవుడు : ఇదిగో భూషారావు బాబాయ్.. ఇంత మంది చెబుతున్నాం.. ఒక్క నెలరోజులు ఆగు.. పిన్ని బట్టల బుట్ట.. ఇటివ్వండి.. అందరూ రండిరా.. ఈ రోజు మా ఇంటి దగ్గరే మీ భోజనం.. భూషారావు : మీరందరూ చెబుతుంటే.. నాకు నమ్మకం కలుగుతుంది.. రాజన్న పాలన మళ్లీ మనం చూడబోతున్నామన్న నమ్మకంతో తిరిగి వెళుతున్నాం.. అందరూ అనుకుంటూ సహదేవుడు ఇంటికి భోజనాలకు వెళ్లారు.. -
జన ప్రభంజనం
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేతవైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసేందుకు వచ్చినజనంతో పులివెందుల కిక్కిరిసింది. మూడు రోజులుగాప్రతిపక్షనేత స్వస్థలంలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న ప్రజలు భారీగా తరలివచ్చారు. దారులన్నీ అటువైపే మళ్లాయి.దీంతో స్థానిక కార్యాలయం లోపల, బయట ఎక్కడ చూసినా జనమే జనం.. వైఎస్ జగన్ సీఎం అంటూ చేస్తున్ననినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. సాక్షి కడప/పులివెందుల : పులివెందులలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం జనసంద్రంగా మారింది. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో కలిసి సామాన్యుల కష్టాలను, సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి చొరవ చూపారు. జగన్‌ను కలిసిన ఆరోగ్య మిత్ర,ఏపీ వీవీపీ సిబ్బంది, జియాలజిస్ట్‌లుఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని వివిధ ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలు కలిశారు. పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ను మిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ నాయుడుతోపాటు ఇతర సిబ్బంది కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. పదేళ్లకుపైగా ఈ పథకం విజయవంతానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని వారు తెలియజేశారు. అనేక రకాల పరీక్షల పేరుతో ఇబ్బందులు సృష్టించినా ఎదుర్కొనిముందుకు వెళుతున్న తమకు ఉద్యోగ భద్రత లేదని వివరించారు. అధికారంలోకి వస్తే అండగా ఉంటామని వారికి జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ పరిధిలోని 11రక్త నిధుల, 51రక్త నిల్వల కేంద్రాల సిబ్బంది వచ్చి ప్రతిపక్షనేతను కలిశారు. వైఎస్సార్ చొరవతో రూరల్, చైల్డ్ హెల్త్ మిషన్ ప్రాజెక్టు కింద రెడ్‌క్రాస్ వారి నిర్వహణలో ఉన్న తమకు తక్కువ జీతం వచ్చేదని.. వైఎస్సార్ హయాంలో మరింత పెంచడంతో రూ.5,500ల వరకు వచ్చేదన్నారు. అంతేకాకుండా ఒక్క ఏడాదిలోనే రెగ్యులర్ చేస్తామని కూడా హామీ ఇచ్చారని తెలిపారు. అయితే తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదని వివరించారు. అధికారంలోకి రాగానే తమ డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగాలను రెగ్యులైజ్ చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. దేవుడి ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిస్కరిస్తామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, రూరల్ డెవెలప్మెంట్ శాఖ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అమలు చేస్తున్న ఇందిర జలప్రభ కార్యక్రమం, ఎన్టీఆర్ జలసిరి పథకాల కింద 2011 నుంచి ఇప్పటివరకు పనిచేస్తున్న జియాలజిస్ట్‌లు జీతంతోపాటు ఎఫ్‌టీఈ కోర్సు, ఉద్యోగాలను రెగ్యులైజ్ చేయాలని జగన్‌ను కలిశారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొని పనిచేస్తున్న ఆశించిన మేర అవకాశాలు కల్పించడంలేదని.. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడురోజుల పర్యటన విజయవంతంగా ముగి సింది. దీంతో పార్టీశ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. వైఎస్సార్సీపీలోకి భారీగా వలసలు.. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరిగిపోతున్నాయి. పులివెందుల మున్సిపాలిటీలోని చెన్నారెడ్డి కాలనీకి చెందిన టీడీపీ టి.రఘునాథరెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. ఆదివారం పులివెందులలోని పార్టీ కార్యాలయంలో ఆయనకు వైఎస్ జగన్ కండువా కప్పి ఆహ్వానించారు. రఘునాథరెడ్డితోపాటు మరో 20కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలోని హనుమగుత్తి ఎంపీటీసీ సత్యనారాయణరెడ్డి, పోట్లదుర్తి వైఎస్సార్సీపీ నాయకుడు సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో.. జమ్మలమడుగు ఇన్చార్జి డాక్టర్ సుధీకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోట్లదుర్తికి చెందిన టీడీపీ నాయకులు టి.వెంకటశివారెడ్డితోపాటు మరో 20కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న వెంకటశివారెడ్డి చేరడంతో వైఎస్సార్సీపీ పోట్లదుర్తిలో బలంగా మారింది. రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు చొప్పా యల్లారెడ్డి ఆధ్వర్యంలో ఖాజీపేట మున్సిపాలిటీ పరిధిలోని బోయినపల్లెకు చెందిన పలువురు నాయకులు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పులివెందులలో వారికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. వైఎస్సార్సీపీలో చిన్న పెంచలయ్య, శేఖర్, శివయ్య, రామకృష్ణ, రాజులతోపాటు మరికొన్ని కుటుంబాలు పార్టీలో చేరాయి. మీ నాయకుడు సుధీర్‌రెడ్డే.. గెలిపించుకోండి.. వైఎస్ జగన్‌జమ్మలమడుగుతోపాటు ఎర్రగుంట్ల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నేతలు వచ్చి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పులివెందులలో కలిశా రు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు కేరింతలు కొడుతుండగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్ డాక్టర్ సుధీర్‌రెడ్డి చేయిని పట్టుకొని పైకి ఎత్తి మీ నాయకుడు సుధీర్‌రెడ్డే.. గెలిపించుకొని రండి అంటూ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కష్టపడి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన సూచించారు. సుధీర్‌రెడ్డే మీ నాయకుడు గెలిపించుకోండని ప్రతిపక్షనేత అనగానే పెద్ద ఎత్తున జనాలు నినాదాలతో హోరెత్తించారు. జగన్‌ను కలిసిన అల్లె ప్రభావతి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని జమ్మలమడుగు వైఎస్సార్సీపీ నాయకురాలు అల్లె ప్రభావతి కలిశారు. ప్రత్యేకంగా సుమారు 50వాహనాలలో అనుచరులతో కలిసి వచ్చిన ఆమె పులివెందులలో వైఎస్ జగన్‌ను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఎలాంటి చిన్న, చిన్న సంఘటనలు ఉన్నా.. అన్ని మరిచిపోయి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు. వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు నేతలు : ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప మాజీ ఎంపీ వైఎస్‌అవినాష్‌రెడ్డిలను పలువురు నేతలు కలిశారు. హిందూపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు నదీమ్ అహమ్మద్ సుమారు 70వాహనాలలో తరలి వచ్చి వైఎస్ జగన్‌ను కలిశారు. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులందరూ వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ నదీమ్‌తో మాట్లాడారు. అలాగే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, అంజాద్ బాష, రవీంద్రనాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, ఆకేపాటి అమరనాథరెడ్డి, వైఎస్ అభిషేక్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, తదితర నేతలు కలిసి మాట్లాడారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇంట్లో కాసేపు పులివెందులలోని భాకరాపురంలో ఉన్న పులివెం దుల నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కాసేపు గడిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ భాస్కర్‌రెడ్డితోపాటు మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ముచ్చటించారు. రోజంతా ప్రజలతోనే.. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఉదయం 9గంటలనుంచి రాత్రి 9గంటల వరకు ప్రజలతోనే మమేకమయ్యారు. పార్టీ కార్యాలయంలో వివిధ ప్రాంతాలనుంచి ప్రజల కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. యువకులు ఎక్కువగా సెల్ఫీలు దిగుతూ కనిపించారు. ఎక్కడ చూసినా సెల్ఫోన్లతోనే యువత ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నించారు. వచ్చిన ఏ ఒక్కరిని నిరాశపర్చకుండా అందరితో మాట్లాడుతూ వైఎస్ జగన్ సెల్ఫీలకు అవకాశం ఇచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం భోజన విరామం అనంతరం, రాత్రి వరకు అనుక్షణం ప్రజలతోనే వైఎస్ జగన్ బిజీబిజీగా గడిపారు. -
కదిలిన కడప
పల్లె కదిలింది.. జగన్నినాదం మార్మోగింది. ఎక్కడ చూసినా జనమే జనం.పొలం, రోడ్డు, పల్లె తేడా లేకుండా ఎక్కడ చూసినా ప్రతిపక్ష నేత కోసం ఎదురుచూస్తున్న ప్రజలే కనిపించారు. చిన్నపిల్లలను ఎత్తుకున్న తల్లులు.. వయస్సు మీద పడిన పెద్దోళ్లు.. కులం, మతం, వర్గం అన్న తేడా లేకుండా కలిసేందుకు బారులు తీరారు. వారిని చూస్తే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుగా సందడి కనిపించింది. రోడ్లపై స్వాగత తోరణాలు పక్కన పెడితే.. కడప, రాజంపేట, పులివెందుల మొత్తం జనాలతో కిక్కిరిసి ఇసుకేస్తే రాలనంత జనంతో పట్టణాల్లో కేరింతలు కనిపించాయి. సాక్షి కడప : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని శుక్రవారం జిల్లాకు విచ్చేశారు.అభిమాన నేత వస్తున్నారన్న ఆనందంతో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎక్కడ చూసినా వైఎస్ జగన్ సీఎం అంటూ చేస్తున్న నినాదాలు మిన్నంటాయి. రోడ్లపై పూలవర్షం.. బాణసంచా మోత.. బైక్ ర్యాలీలు.. హారతులతో జనం నీరాజనాలు పలికారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ...అందరినీ దగ్గరకు తీసుకుని పేరుపేరున పలుకరిస్తూ కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. రైల్వేకోడూరు, రాజంపేటలలో పోటెత్తిన జనం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరుజిల్లాలో తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని శుక్రవారం ఉదయం జిల్లాకు పయనమయ్యారు. వైఎస్సార్–చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లోని కుక్కలదొడ్డికి ఉదయం 10 గంటల ప్రాంతంలో చేరుకోగానే ఘనస్వాగతం లభించింది. మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డితో కలిసి సరిహద్దు ప్రాంతానికి రాగానే రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. కోడూరు వద్ద రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన బెలూన్లు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. కుక్కలదొడ్డి నుంచి శెట్టిగుంట, ఉప్పరపల్లె, శాంతినగర్, సూరపురాజుపల్లె తదితర గ్రామాల వద్ద మహిళలు రోడ్డుపైకి వచ్చిన కాన్వాయ్‌ని ఆపి వైఎస్ జగన్‌తో మమేకమయ్యారు. రైల్వేకోడూరులో కూడా రోడ్డంతా జనాలతో నిండిపోయింది. ప్రతిపక్ష నేతను కలిసేందుకు కాన్వాయ్ వెంట జనాలు పరుగులు తీశారు. కోడూరు నుంచి మంగంపేట, కొర్లకుంట, ఓబులవారిపల్లె, ముక్కవారిపల్లె క్రాస్, కమ్మపల్లెక్రాస్, రెడ్డిపల్లె, అనంతంపల్లె, అప్పరాజుపేట రైల్వేగేటు, పుల్లంపేట, ఉడుగువారిపల్లె, పుత్తనవారిపల్లె, కనకదుర్గమ్మ కాలనీ, అనంతయ్యగారిపల్లె, ఊటుకూరు ఇలా ఎక్కడ చూసినా పల్లెలు సైతం కదిలివచ్చి జననేత జగన్‌ను పలుకరించారు. రాజంపేటలో పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో భువనగిరిపల్లె ఆర్చి వద్ద నుంచి స్వాగతం పలుకుతూ వైఎస్ జగన్‌ను తీసుకెళ్లారు. కుక్కలదొడ్డి నుంచి రాజంపేటకు చేరుకోవడానికి దాదాపు ఒంటి గంట సమయం పట్టింది. మిట్టమధ్యాహ్నం ఎండవేడికి అధికంగా ఉన్నా ఏమాత్రం లెక్కచేయకుండా జనాలు రాజంపేటలో బ్రహ్మరథం పట్టారు.భువనగిరిపల్లె ఆర్చి నుంచి పాతబస్టాండు, అమ్మవారిశాల, పెద్ద మసీదు, మార్కెట్, ఆర్టీసీ సర్కిల్, ఏఐటీయూసీ సర్కిల్ ఇలా ఎక్కడ చూసినా జనమే కనిపించారు. బయనపల్లె క్రాస్ వద్ద విద్యార్థులు వందల సంఖ్యలో వచ్చి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎర్రబల్లి మీదుగా నందలూరు, మంటపంపల్లె, చెర్లోపల్లె, ఒంటిమిట్ట, మాధవరం, భాకరాపేట, కనుమలోపల్లె, జేఎంజే కళాశాల వద్దకు రావడానికి మూడున్నర గంటల సమయం పట్టింది. ఒంటిమిట్టలో జెడ్పీ వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. కడపలో బ్రహ్మరథం కడప నగర శివార్లలోని జేఎంజే కళాశాల వద్దకు చేరుకోగానే ఎమ్మెల్యే అంజద్‌బాషా, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి వైఎస్ జగన్, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ర్యాలీగా కడపలోకి ప్రవేశించారు. అడుగడుగునా జై జగన్ నినాదం మార్మోగింది. రోడ్డు వెంబడి పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలుకగా, ఎక్కడికక్కడ రోడ్డుపైకి వచ్చి మహిళలు వైఎస్ జగన్ కాన్వాయ్‌ని ఆపి మాట్లాడుతూ వచ్చారు. కడప జేఎంజే కళాశాల నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైతే కడప సరిహద్దులు దాటడానికి సాయంత్రం 7.30 గంటలు అయిందంటే ఏ మేరకు కిటకిటలాడిందో అర్థమవుతోంది. చిన్నచౌకులోని మేయర్ సురేష్‌బాబు సోదరుడు సతీష్ ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కడప బిల్టప్ నుంచి బయలుదేరిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కేఎస్ఆర్ఎం, మిట్టమీదపల్లె, యల్లటూరు, పెండ్లిమర్రి, నందిమండలంలలో కాన్వాయ్ ఆపి కరచాలనం చేశారు. వేంపల్లెలో భారీగా తరలివచ్చిన జనం అఖండ స్వాగతం పలికారు. స్వంత నియోజకవర్గంలోకి అడుగు పెట్టగానే అడుగడుగునా హారతులు పట్టారు. పులివెందులకు చేరుకోగానే ఇంటివద్ద నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ జగన్‌కు సతీమణి వైఎస్ భారతిరెడ్డి హారతి పట్టి..దిష్టితీసి గుమ్మడికాయ కొట్టారు. పెద్దదర్గాలో ప్రత్యేక ప్రార్థనలు కడపలోని అమీన్‌పీర్ (పెద్దదర్గా) దర్గాలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పూలచాదర్ గురువుల మజార్ వద్ద సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గా ఆవరణలోని ఇతర గురువుల మజార్లను దర్శించుకుని ఫాతెహా చేశారు. తర్వాత దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ను కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్బంగా పెద్దదర్గా ప్రాంతమంతా ఎక్కడ చూసినా వైఎస్ జగన్‌ను కలిసేందుకు వచ్చిన ముస్లిం సోదరులు, ఇతర కార్యకర్తలతో నిండిపోయింది. వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు నేతలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను శుక్రవారం పలువురు నేతలు కలిసి చర్చించారు. దారి మధ్యలో కడప, రాజంపేట మాజీ ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, అంజద్‌బాష, రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథరెడ్డి, సురేష్‌బాబు, నెల్లూరుజిల్లా వైఎస్సార్ సీపీ నాయకులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రహ్మాన్, బద్వేలు సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డితోపాటు పలువురు నాయకులు అనేక అంశాలపై చర్చించారు. రాజకీయాలతోపాటు పార్టీకి సంబంధించిన అంశాలపై వారు మాట్లాడుకున్నారు. జననేతకు ఘన స్వాగతం పులివెందుల : వైఎస్సార్కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సుదీర్ఘమైన పాదయాత్ర ముగించుకుని శుక్రవారం రాత్రి 9గంటలకు కడప నుంచి పులివెందులకు చేరుకున్నారు. కడప నుంచి వస్తున్న ఆయనకు ప్రతి గ్రామంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. సీఎం.. సీఎం.. వైఎస్ జగన్ నాయకత్వం వర్ధిల్లాలంటూ అభిమానులు నినాదాలు చేశారు. వైఎస్ జగన్ 9గంటలకు స్వగృహానికి చేరుకోగానే అక్కడ వేచి ఉన్న ప్రజలు జై జగన్.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ జగన్ చెరగని తన చిరునవ్వుతో ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ పలకరించారు. విజయ హారతి పట్టిన వైఎస్ భారతమ్మ ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు తన సుదీర్ఘ ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముగించుకుని శుక్రవారం రాత్రి స్వగృహానికి చేరుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి సతీమణి వైఎస్ భారతమ్మ విజయ హారతి ఇచ్చి ఇంటిలోకి స్వాగతం పలికారు. వైఎస్ భారతమ్మతోపాటు ఇతర కుటుంబ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. శనివారం స్థానిక సీఎస్ఐ చర్చికి చేరుకుని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడ నుంచి ఇడుపులపాయకు చేరుకుని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల, సతీమణి భారతిరెడ్డి.ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించనున్నారు. విద్యార్థులకు దీక్షకు సంఘీభావం రైల్వేకోడూరులోని వైఎస్సార్ ఉద్యాన కళాశాల విద్యార్థులు చేస్తున్న నిరసన దీక్షలకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంఘీభావం తెలియజేశారు. ఉద్యానశాఖలో ఉన్న అన్ని రకాల ఉద్యోగాలు అర్హులైన హార్టికల్చర్ విద్యార్థులతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ 15 రోజులుగా దీక్షలకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి నుంచి వస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రైల్వేకోడూరు వద్దగల దీక్షా ప్రాంగణం వద్ద వారికి మద్దతు తెలిపి సమస్యలు తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు తీరుపై ఆయన మండిపడ్డారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు గ్రామ సచివాలయం ద్వారా పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. -
ప్రజాసంకల్పయాత్ర ఎఫెక్ట్.. పింఛన్ల రెట్టింపు
-
తిరునగరి.. జనహారతి
చారిత్రాత్మక పాదయాత్రను పూర్తిచేసుకుని అడుగుపెట్టిన జననేతకు గురువారం అపూర్వ స్వాగతం లభించింది. రేణిగుంట మొదలు తిరుమల వరకూ దారిపొడవునా జనజాతర తలపించింది. తిరుపతి రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. జై జగన్ నినాదాలతో హోరెత్తిపోయాయి. ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జనసందోహం మధ్య ఆయన వాహనం కదలడానికి చాలా సమయం పట్టింది. అలిపిరి నుంచి తిరుమలకు సాగించిన కాలినడకనూ వేలాదిగా అభిమానులు అనుసరించారు. సాధారణ భక్తునిలా జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు. చిత్తూరు, తిరుపతి తుడా/ తిరుమల : జననేతకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద వైఎస్సార్ సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ్ బియ్యపు మధుసూదన్‌రెడ్డి స్వాగతం పలికారు. ఏర్పేడు, శ్రీకాళహస్తి నుంచి వచ్చిన వేలాది మంది కార్యకర్తలతో రైల్వేస్టేషన్ నిండిపోయింది. జగన్‌ని నాదాలతో మార్మోగింది. తనకోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేసి చంద్రగిరి–రేణిగుంట బైపాస్ రోడ్డు మార్గం ద్వారా తిరుపతికి బయలుదేరారు. చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంట వద్ద నగరంలోకి ప్రవేశించిన జగన్‌కు ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వినూత్నంగా స్వాగతం పలికారు. రోడ్డుకి రువైపులా మామిడి, అరటి తోరణాలు, బెలూన్లు ఏర్పాటు చేశారు. మహిళలు గుమ్మడికాయలు కొట్టి దిష్టితీశారు. పద్మావతి గెస్ట్‌హౌస్‌లో కొంతసేపు సేదదీరారు. అనంతరం ఎమ్మెల్యేలు, కార్యకర్తలను పలకరించారు. జననేత కాన్వాయ్ తిరుపతి బాలాజీకాలనీలోని జ్యోతిరావ్ పూలే సర్కిల్‌కు చేరుకోగానే కార్యకర్తలు ప్లకార్డులతో ఘన స్వాగతం పలికారు. దీనికి భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యం వహించారు. మార్మోగిన గోవింద నామస్మరణ.. అలిపిరి మెట్ల మార్గంలో గోవింద నామస్మరణ మార్మోగింది. జగన్‌తో పాటు వేలాది మంది కార్యకర్తలు కాలినడకన నడిచారు. అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మెట్లకు నమస్కరించా రు. సామాన్య భక్తుని వలే కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తూ శ్రీవారిపై అపారమైన భక్తిని చాటుకున్నారు. మార్గ మధ్యంలో ఆంజనేయస్వామిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టారు. వడివడిగా మెట్లు ఎక్కిన వైఎస్.జగన్ ఎక్కడా ఆగకుండా ముందుకు కదిలారు. అలుపు లేకుండా పాదయాత్ర నిర్వహించిన జననేత తిరుమల మెట్లు ఎక్కడంలోనూ అదే ఉత్సాహాన్ని ప్రదర్శించారు. మెట్ల దారిలో సాటి భక్తులను పలకరిస్తూ ఆత్మీయ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మార్గ మధ్యంలో నరసింహస్వామి ఆలయం మీదుగా మోకాళ్ల పర్వతం నుంచి తిరుమల చేరుకున్నారు. సామాన్య భక్తునిలా తిరుమలకు కాలినడకన వస్తున్న జననేతను పలకరించడానికి భక్తులు ఆసక్తి కనబరిచా రు. అలిపిరి నుంచి తిరుమల చేరేవరకు జగన్ అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు గోవింద నామస్మరణ చేస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం 1.35 గంటలకు అలిపిరి వద్ద మొదలైన నడక 4.30గంటలకు తిరుమలకు చేరుకుంది. పద్మావతి గెస్ట్‌హౌస్‌లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. 6 గంటల సమయంలో స్వామి దర్శనానికి వెళ్లారు. రైల్వేస్టేషన్లో మాజీ ఎంపీలు మిథున్ రెడ్డి, వరప్రసాద్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, వెంకటేగౌడ తదితరులు స్వాగతం పలికారు. టౌన్‌క్లబ్ వద్ద భారీగా అభిమానులు టౌన్‌క్లబ్ సర్కిల్‌కు రాగానే అక్కడ వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, దివ్యాంగులు చేరుకుని అపూర్వ స్వాగతం పలికారు. మహతి ఆడిటోరియం వద్ద వైస్సార్సీపీ మైనారిటీ నాయకులు ఖాద్రీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు ప్లకార్డులతో రోడ్డుకిరువైపులా నిల్చొని జైజగన్ అంటూ అభిమానాన్ని చాటారు. అనంతరం జ్యోతి థియేటర్ సర్కిల్ వద్ద వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. ఎస్వీ మెడికల్ కళాశాల చేరుకోగానే అక్కడ అభిమానులు రంగురంగుల కాగితాలను వెదజల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. -
పాదయాత్ర సక్సెస్‌తో పాలకుల్లో భయం
-
ఈ సంకల్పం.. అందరికోసం
ఎండమావిలో పన్నీటి జల్లులా...కష్టాల కడలిలో చుక్కానిలా ఇపుడుకొండంత అండ దొరికినట్టయింది.ఒక్కో పథకం ఒక్కో రత్నంలా జనంమోములో వెలుగునింపుతోంది.జననేత ఇచ్చిన భరోసాతోప్రతిఒక్కరిలో ఆశలు నింపుతోంది.భరోసా కలిగిస్తోంది. విశాఖపట్నం, చోడవరం : ప్రస్తుతం చంద్రబాబు పాలనలో ఆధునిక వ్యవసాయం మాట దేవుడికెరుకగాని ఉన్న సాధారణ వ్యవసాయమే చేయలేని పరిస్థితిలో వైఎస్సార్సీపీలో ప్రవేశపెట్టిన నవరత్న పథకాల్లో ‘రైతు భరోసా’ పథకం రైతులకు కొండంత అండగా నిలుస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రతి రైతుకు రూ.12500 ఇవ్వడంతోపాటు పంటల బీమా ప్రీమియం కూడా తమ ప్రభుత్వమే చెల్లించేలా చూస్తామని జగన్ చెప్పడం రైతుల్లో ఎంతో ఆనందాన్ని నింపింది. ఉచితంగా వ్యవసాయ బోర్లు ఏర్పాటు, పంట దిగుబడి ముందే కొనుగోలు గిట్టుబాటు ధరను ప్రకటిస్తామని, ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటాకాల నుంచి రైతులను ఆదుకునేందుకు రూ.4వేల కోట్లు స్థిరీకరణ నిధిని కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తామని చెప్పడం రైతుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపింది. సుగర్ ఫ్యాక్టరీలను, చెరకు రైతులను ఆదుకోవడంతోపాటు పాడి రైతులకు లీటరుకు రూ.4 బోనస్‌గా ప్రకటించడం, సహకార పాల డెయిరీలను ప్రతి జిల్లాకు ఏర్పాటు చేస్తామని చెప్పడం పాడి రైతుకు ఊరటనిస్తుంది. ‘అమ్మ ఒడి’..ఆలంబనగా.. పేద కుటుంబాలకు ఉన్నత భవిష్యత్తును ఇచ్చేదిగా ఉంది. టీడీపీ పాలనలో గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం, ప్రైవేటు పాఠశాలలకు వేలకు వేలు ఫీజులు కట్టలేక దిగాలు పడుతున్న కుటుంబాలను జగన్ ప్రకటించిన అమ్మ ఒడి పథకం అక్షరాస్యత శాతాన్ని నూరుశాతం పెంచేదిగా ఉంది. బడికి పంపిస్తే చాలు ఒక్కో పిల్లోడికి ఏటా రూ.15వేలు నేరుగా తల్లికే ఇస్తానని, ఎంతమంది పిల్లలు ఉన్నా, ఏ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివినా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని చెప్పడం అన్ని వర్గాల కుటుంబాలకు ఓ వరం కానుంది. ‘ఫీజు రీయింబర్స్మెంట్’ ఉన్నతంగా.. గడిచిన ఐదేళ్లలో ఇంజినీరింగ్, డాక్టర్‌తోపాటు ఉన్నత చదువులన్నింటి ఫీజులు రూ.లక్షకు పైగానే పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు ప్రతి విద్యార్థికి ఉన్నత చదువుకయ్యే ఎంత ఖర్చయినా రూ.లక్ష వరకు భరించడంతో పాటు హాస్టల్ ఖర్చు కింద రూ.20వేలు ఇస్తామని జగన్ ఇచ్చిన హామీ ‘ఉన్నత’ విద్యార్థి లోకానికి ఓ మంచి అవకాశంగా ఉంది. ‘డ్వాక్రా రుణమాఫీ’ ఒక ఆసరా డ్వాక్రా మహిళలకు వరంగా కానుంది. గత ఎన్నికల్లో మహిళలందరికీ డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు తర్వాత మాఫీ చేయకపోవడంతో మహిళలంతా అప్పుల చేసి మరీ వడ్డీతో సహా అసలు కట్టిన విషయం తెలిసిందే. దీనితో మహిళలంతా ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన తరుణంలో జగన్మోహన్రెడ్డి ప్రకటించిన డ్వాక్రా రుణమాఫీ పథకం మహిళలందరికీ వరంగా మారనుంది. ఇంపుగా ‘పింఛన్ పెంపు’ ఇప్పటి వరకు రూ.వెయ్యి ఇస్తున్న వృద్ధాప్యం పింఛన్‌ను రూ.2వేలకు, వికలాంగుల పింఛన్ రూ.1500 నుంచి 3వేలకు పెంచుతామని జగన్ చేసిన ప్రకటన వేలాది మంది లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమౌతోంది. గృహ నిర్మాణం పక్కా.. చంద్రబాబు హయాంలో ఊరికి నాలుగైదు కూడా ఇళ్లు మంజూరు చేయని పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితిలో అర్హులైన వారందరికీ పక్కాగృహాలు మంజూరు చేయడంతోపాటు స్కీం మొత్తాన్ని రూ. లక్షన్నర నుంచి రెండున్నర లక్షలకు పెంచి ఇస్తామని చెప్పడం గూడులేని వారికి నమ్మకం ఏర్పడింది. ఆరోగ్య శ్రీ పథకానికి గతంలో కంటే నిధులు పెంచి రూ.వెయ్యికి మించి ఖర్చయ్యే ప్రతి వైద్యానికి ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తామని జగన్ ప్రకటించడం జనారోగ్యానికి ఢోకాలేదనే భావన ఏర్పడింది. ఇంటివద్దకే ప్రభుత్వ పథకాలు గ్రామ సచివాలయ వ్యవస్థలో స్థానికులకే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి వారికి జీతాలు ఇస్తూ వారి ద్వారా రేషన్‌తోపాటు అన్ని పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇంటికే పంపించే కొత్త విధానికి శ్రీకారం చుట్టేందుకు జగన్ సంకల్పించడం మేధావుల మన్ననలు సైతం పొందుతుంది. పంటకు ముందే ధర నిర్ణయం భేష్ అందరూ రైతులకి ఇదిచేస్తాం అది చేస్తాం అని ఓట్లు అడుగుతారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత రైతులనే మరిచిపోతారు. రాజశేఖరరెడ్డి రైతులను ఆదుకున్నారు. అతనిలాగే అతని కుమారుడు చేస్తాడని నమ్మకం ఉంది. ముఖ్యంగా గిట్టుబాటు ధర కల్పించారు. పంట పండించడానికి ముందే పంటకు ధర నిర్ణయించడం అంటే రైతులకు చాలా ఉపయోగం ఉంటుంది. అలాగైతే రైతులు పంటలు పండించడానికి ముందుకు వస్తారు.– బూడి వెంకటరమణ, రైతు, గౌరీపట్నం నిరుద్యోగులకు ఉపాధి వస్తుంది రాష్ట వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలతో పాటు, ఉపాధి అవకాశాలు వస్తాయి. జగనన్న పాదయాత్ర వల్ల ఎంతో మంది నిరుద్యోగుల సమస్యలను దగ్గర నుంచి విన్నారు. జగనన్న తప్పకుండా నిరుద్యోగులకు సముచిత స్ధానం కల్పిస్తారు. కొద్ది రోజుల్లోనే మంచిరోజులు వస్తాయన్న నమ్మకం మా యువతకు కలిగింది. – కంటే వెంకట్, మంగళాపురం, బుచ్చెయ్యపేట -
సంకల్ప సంబరం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో వైఎస్ జగన్ పాదయాత్ర ముగియగానే జిల్లాలో సంబరాలుఅంబరాన్నంటాయి. సంఘీభావంగా పాదయాత్రలు, బైక్‌ర్యాలీలు, ర్యాలీలు చేపట్టారు. పార్టీ కార్యాలయాల్లో కేక్‌లు కట్ చేసి..ప్రజలకు పంచిపెట్టారు. ఆలయాల్లో వైఎస్ జగన్ పేరిట అర్చనలు చేయించారు. వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రాలయంలో ఐదు వేల మందితో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ నుంచి రాఘవేంద్రస్వామి ప్రధాన ముఖద్వారం, రాఘవేంద్ర సర్కిల్, 167 జాతీయ రహదారి మీదుగా హెచ్ఆర్బీ కల్యాణ మండపం వరకు పాదయాత్ర కొనసాగింది. అనంతరం రాఘవేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించా. వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరిట అర్చన చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కుటుంబం విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తోందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటపై నిలబడే నాయకుడని కొనియాడారు. ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల్లో చెరగని ముద్ర వేయడంతో పాటు చరిత్ర సృష్టించారన్నారు. ♦ కర్నూలు ఎస్బీఐ సర్కిల్లోని వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నగర అ«ధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శులు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, లక్కీటూ నరసింహులు యాదవ్ తదితరులు భారీ పూలమాల వేసి.. పాలాభిషేకంచేశారు. ఇక్కడే కేక్‌లు కట్ చేశారు. మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ♦ కర్నూలు వినాయక స్వామి దేవాలయం వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కిమి అనుమంతరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వినాయకుడు, సాయిబాబాకు వైఎస్ జగన్ పేరిట అర్చన చేయించారు. అనంతరం 516 కొబ్బరికాయలను సమర్పించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకరరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పర్ల శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ♦ కల్లూరు శరీన్‌నగర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి కల్లూరు అర్బన్ వార్డుల ఇన్చార్జ్ బెల్లం మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి.. పాలాభిషేకం చేశారు. ♦ నంద్యాలలో మునిసిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, మాజీ చైర్మన్ కైపరాముడు, శిల్పా మహిళా సహకార్ చైర్మన్ శిల్పా నాగినీరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి ఇంటి నుంచి శ్రీనివాస సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ♦ ఆదోనిలో వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు దేవా ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి.. సంబరాలు చేసుకున్నారు. ♦ పత్తికొండలో జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, జిల్లా నాయకుడు కారం నాగరాజు, మండల కన్వీనర్ బజారప్ప ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి.. ప్రజలకు పంచిపెట్టారు. ♦ బనగానపల్లె మండలం నందవరంలోని చౌడేశ్వరిదేవి ఆలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పీఆర్ వెంటేశ్వరరెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు శివరామిరెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే కేక్ కట్ చేసి.. ప్రజలకు పంచిపెట్టారు. ♦ హాలహర్విలో మండల కన్వీనర్ భీమప్ప చౌదరి ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి..మిఠాయిలను పంచిపెట్టారు. -
ప్రజాసంకల్పయాత్ర అద్వితీయం.. అపూర్వం!
-
ఉత్సాహం నింపిన సంకల్పం
బిందువు.. బిందువూ కలిసి సింధువైనట్లు.. అడుగు.. అడుగు కలిసి అభిమాన సంద్రమైంది. 14 నెలలు.. 3648 కిలోమీటర్లు.. అలుపెరగని బాటసారి ప్రజా సంకల్ప యాత్ర సాగింది. నడిచింది తానే అయినా.. నడిపించింది మాత్రం ప్రజలే. అధికార మదం అడ్డంకులు సృష్టించినా.. రాజన్న చల్లని దీవెనలు.. ప్రజల ఆప్యాయత.. ఆత్మీయతలే తోడుగా.. ఆకాశమంత ఎత్తుకి ఎదిగిన వైఎస్సార్ వారసుడు.. సుదీర్ఘ పాదయాత్ర ఘనంగా ముగిసింది. ఎంత దూరం నడిచామన్నది ముఖ్యం కాదు.. ఎందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నామన్నదే ఆయన సిద్ధాంతం. కష్టం చెప్పుకున్న ప్రతి ఒక్కరికీ భరోసా కల్పిస్తూ.. రాబోయే రోజుల్లో రాజన్న రాజ్యం అందించేందుకు చేసిన జన జాతర ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకూ అదే అభిమానం సాగింది. ముగింపులోనూ జననేత జగనన్నకు ఆశీస్సులు, అభినందనలు అందించేందుకు ప్రతి జిల్లా దారులన్నీ.. ఇచ్ఛాపురం వైపే సాగాయి. చిన్నా పెద్దా.. కార్యకర్త, నాయకుడు అనే తారతమ్యం లేకుండా అద్వితీయ ముగింపు సభలో పాలుపంచుకునేందుకు ఉరకలేసే ఉత్సాహం ప్రదర్శించారు. విశాఖ సిటీ: రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్ర ఘనంగా ముగిసింది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు ఇచ్ఛాపురం చేరుకొని జననేతకు అభినందనలు తెలిపారు. దారులన్నీ.. శ్రీకాకుళం జిల్లా సరిహద్దు ఇచ్ఛాపురం వైపే సాగాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు జననేతకు జేజేలు పలికేందుకు ఇచ్ఛాపురం వెళ్లారు. జననాయకుడి జైత్రయాత్రకు సంఘీభావంగా తరలివెళ్తున్న జనంతో దారులన్నీ జనసంద్రంగా మారాయి. తమ చెంతకే వచ్చి సమస్యలు సావధానంగా విని భరోసా ఇచ్చిన నాయకుడు దొరికాడంటూ ప్రజలందరూ ఒకే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. నిఖార్సైన నేతగా.. నిలువెత్తు నిబద్ధతతో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే ప్రజా సంకల్ప ధీరుడు జగనన్నే అనే ఒక అభయం రాష్ట్ర ప్రజలకు దక్కిందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందరూ అక్కడికే.. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తలు పాదయాత్ర ముగింపు సభాస్థలికి చేరుకునేందుకు ఉత్సాహం చూపారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, వార్డు అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు తమ వాహనాల్లో ఇచ్ఛాపురం వెళ్లారు. సంకల్ప ధీరుడికి జన నీరాజనం సంకల్ప ధీరుడికి ముగింపు సభలో అశేష ప్రజానీకం విజయోస్తు అంటూ దీవెనలు పలికారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజాసంక్షేమం కోసం చేపట్టే పథకాలను, వాటి అమలుకు తీసుకునే చర్యలను వివరించడాన్ని ప్రజలు కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు. అవినీతిరహిత పాలనను ప్రజల చెంతకే చేరువచేస్తానని, రేషన్ సరకులు డోరు డెలివరీ ఇప్పిస్తాననే హామీలు ప్రజల్లో ఆసక్తిని, ఆకాంక్షను కలిగించాయి.– మళ్ల విజయప్రసాద్, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం ముగింపు సభలో నిజాయితీ, నిబద్ధతకే పెద్దపీట వేశారు. పంచాయతీలో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమిస్తానన్న హామీ పేదల్లో ఆనందాన్ని నింపుతుంది. పార్టీ విజయానికి బాటలు వేసేలా చేసిన జగన్ ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ఇదే స్ఫూర్తితో పార్టీ క్యాడర్ క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఆవశ్యకత ఆసస్నమైంది. – వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్,వైఎస్సార్ సీపీ తూర్పు సమన్వయకర్త వైఎస్ఆర్ అభిమాన కుటుంబం తరలివచ్చింది.. ఇచ్ఛాపురంలో ముగింపు సభకు యావత్ వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమాన కుటుంబం తరలివచ్చింది. సంక్రాంతి వారం రోజుల ముందే జరిగినట్టు అనిపించింది. 150 రోజులలో మనందరం కలలుకన్న నవరత్నాల వంటి సంక్షేమ పథకాలతో రాజన్న రాజ్యం సాకారం కాబోతోందని అందరూ చర్చించుకున్నారు. మూడు పాదయాత్రలు ఇచ్ఛాపురంలో ముగియడం.. అక్కడే ఈ మూడు పైలాన్లు ఉండటం స్థానిక ప్రజలు చేసుకున్న అదృష్టం. – అక్కరమాని విజయనిర్మల,భీమిలి సమన్వయకర్త, వైఎస్సార్సీపీ ప్రజా సంకల్పయాత్ర అపూర్వ ఘట్టం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. ప్రజల కష్టాలను విని, వారికి అండగా నిలబడ్డారు. ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.– తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీగాజువాక సమన్వయకర్త జగన్‌పై ప్రజల్లో అపార నమ్మకం రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలను 25 జిల్లాలుగా ఏర్పాటు చేసి, గ్రామ సచివాలయాల ఏర్పాటు చేస్తాననడంతో వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై ప్రజల్లో అపార నమ్మకం కలిగింది. జగన్ రైతు పక్షపాతిగా చెప్పడానికి ఆయన ప్రకటించిన వరాలు, స్థిర నిధి ఏర్పాటు హామీలే నిదర్శనం. ప్రస్తుతం వ్యవసాయం దండగా అనే నిస్పృహలో ఉన్న రైతులకు అది జగన్ సీఎం అయితే పండగా కాబోతోంది. – తైనాల విజయకుమార్, పార్టీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు ప్రజల్లో ఎనలేని ఉత్సాహం ప్రతి ఒక్కరి కష్టాన్ని తెలుసుకుం టూ.. ప్రజలందరికీ భరోసా ఇస్తూ సుదీర్ఘంగా జగనన్న పాదయాత్ర చేయడం ఓ రికార్డు. ఆ తుది ఘట్టం చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, అభిమానులు ఇచ్ఛాపు రం చేరుకున్నారు. ఆ జనసందోహం చూస్తే ఓ పండగ వాతావరణంలా కనిపించింది. పైలాన్‌ను ఓ సందర్శన స్థలంలా అద్భుతంగా నిర్మించారు. రాష్ట్ర ప్రజలకు జగనన్న ముందస్తు కానుకలు ఎన్నో అందించారు. – వరుదు కల్యాణి, వైఎస్సార్ సీపీ అనకాపల్లిపార్లమెంట్ జిల్లా సమన్వయకర్త ఇచ్ఛాపురంలో ముగింపు అదిరింది.. ఇచ్ఛాపురంలో సంకల్పయాత్ర ముగింపు అదిరింది. సభకు యావత్ రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. చంద్రబాబు మోసపూరిత హామీలపైనే ప్రజలు చర్చించుకున్నారు. ప్రజల్లో, పార్టీ క్యాడర్లో ఉత్సాహం రెట్టింపైంది. వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్న ఆకాంక్ష ప్రజల్లో కనిపించింది.– డాక్టర్ పైడి వెంకట రమణమూర్తి,వైఎస్సార్ సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త ప్రజలకు నమ్మకం కలిగించారు జగన్మోహన్రెడ్డి తన పాదయాత్ర ద్వారా ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు వినడం వల్ల ఆయనపై విపరీతమైన నమ్మకాన్ని ఈ రాష్ట్ర ప్రజలు పెంచుకున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని కళ్లారా చూశారు. ఓ గొప్ప నాయకుడుని కలుసుకుని ప్రతీ కుటుంబం ఎంతో సంతోషపడింది. యువత కష్టాలకు కాలం చెల్లి రేపటి భవిష్యత్ కళ్లముందు స్పష్టంగా కనిపిస్తోంది. – కె.కె.రాజు,ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, వైఎస్సార్ సీపీ -
సిక్కోలులో ‘తూర్పు’ సందడి
కాకినాడ: ప్రజా సంకల్ప పాదయాత్ర తుది అంకంలో ‘మేముసైతం’... అంటూ జిల్లాకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇచ్ఛాపురంలో బుధవారం జరిగిన పైలాన్ ఆవిష్కరణ, చివరి రోజు పాదయాత్ర ... బహిరంగ సభలో పాల్గొనడానికి జిల్లా నలుమూలల నుంచి ఉత్సాహంగా తరలి వెళ్లారు. అభిమాననేతకు బాసటగా ‘మీ వెంటే మేమం’టూ ఆయా ప్రాంతాల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లి సంఘీభావం ప్రకటించారు. వైఎస్సార్సీపీ అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు పిల్లి సుభాష్‌చంద్ర బోస్, కురసాల కన్నబాబు, కవురు శ్రీనివాస్‌ల పర్యవేక్షణలో ఆయా నియోజకవర్గాల నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కారులు, బస్సుల్లో బుధవారం ఉదయానికే ఇచ్ఛాపురం చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి పినపే విశ్వరూప్, పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర యువజన విభాగంఅధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితర నేతలు పాదయాత్రకు పార్టీశ్రేణులతో తరలి వెళ్లారు. వివిధ నియోజక వర్గాలకు చెందిన కో–ఆర్డినేటర్లు తమ ప్రాంతాలకు చెందిన పార్టీశ్రేణులతో కలిసి ఇచ్చాపురం చేరుకున్నారు. మాజీ మంత్రి కొప్పన మోహనరావు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు మార్గాని భరత్, చింతా అనురాధ, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, పొన్నాడ వెంకటసతీష్‌కుమార్, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా యువజన విభా గం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, మాజీ కార్యదర్శి కర్రి పాపారాయుడు, రాజమహేంద్రవరం, కాకినాడసిటీ పార్టీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, ఆర్‌వీజేఆర్ కుమార్, జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్ తదితరులు వేలాదిగా వెళ్లిన పార్టీశ్రేణులు జగన్ వెంట నడిచారు. అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్‌ను సందర్శించడంతో పాటు చివరి బహిరంగ సభలో ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లాలో సంబరాలు... జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రం కాకినాడలో పార్టీశ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కాకినాడ కొండయ్యపాలెంలో కేక్‌కట్ చేసి చిన్నారులకు పండ్లు, మిఠాయిలు పంచారు. కాకినాడ రేచర్లపేటకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ బైక్‌ర్యాలీ నిర్వహించి టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీలో రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు తనయుడు ఆకుల విజయ్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక అచ్చమ్మతల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు. రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర లీగల్‌సెల్ కార్యదర్శి మాగాపు అమ్మిరాజు ఇచ్చాపురంలో పైలాన్‌వద్ద పాదయాత్ర 341 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 341 బెలూన్లను ఎగురవేశారు. -
విజయోస్తు జగనన్న!
కడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలని... ప్రతి పేదవాడి గుండెల్లో బాధను నేరుగా తెలుసుకోవాలని... పద్నాలుగు నెలల క్రితం ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. కానీ తాను చేపట్టే ప్రజా సంకల్పయాత్ర 3648 కిలోమీటర్లు సాగుతుందని... తనపై ప్రజలు చూపిస్తున్న అపారమైన ప్రేమాభిమాలను తట్టుకోలేక కుట్రలు పురుడుపోసుకుంటాయని... ఆయనకే తెలియదు. అయితేనేం? ఎన్ని దుర్మార్గపు అవాంతరాలు ఎదురైనా అనిర్వచనీయమైన జనాభిమానం ముందు అవన్నీ కొట్టుకుపోయాయి. మృత్యుంజయుడై వచ్చిన ఆయన అడుగుముందుకే వేశారు. అనితరసాధ్యమైన మహాయజ్ఞాన్ని పూర్తిచేశారు. అ విజయోత్సాహంతోకలియుగవైకుంఠం తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుని దివ్యదర్శనానికి సంసిద్ధులయ్యారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 341 రోజుల పాటు ప్రజాసంకల్పయాత్ర చేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయింది. 3648కిలోమీటర్ల దూరం నడిచి ఇచ్ఛాపురం చేరుకుని ఓ చరిత్రను సృష్టించారు. ఆ చారిత్రక నేపథ్యానికి సాక్ష్యంగా రూపొందించిన విజయస్తూపాన్ని అక్కడ ఆవిష్కరించారు. ఆ అరుదైన ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు జిల్లా నుంచి భారీగా పార్టీ శ్రేణులు, అభిమానులు తరలి వెళ్లారు. ప్రతి నియోజకవర్గం నుంచి బస్సులు, కార్లలో వేలాదిగా వెళ్లి చివరి సభకు అఘండ విజయాన్ని చేకూర్చారు. ప్రజా సంకల్పయాత్ర విజయ సంకల్ప స్ధూపాన్ని సందర్శించి తరించారు. జగన్మోహన్రెడ్డి సాధించిన గ్రేట్ విక్టరీకి చిహ్నంగా అద్భుతంగాఅద్భుతంగా మలిచిన స్తూపం వద్ద ఫొటోలు దిగి ఆ జ్ఞాపకాన్ని పదిలపరుచుకున్నారు. విజయనగరం నుంచి తిరుపతికి... అశేష జనవాహిని నడుమ ప్రజా సంకల్పయాత్ర చివరి బహిరంగ సభను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగించుకుని రోడ్డు మార్గంలో జగన్ బుధవారం రాత్రికి విజయనగరం పట్టణానికి చేరుకున్నారు. దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో రాత్రి 10.10 గంటలకు తిరుపతికి బయలుదేరి వెళ్లా రు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో పాదయా త్ర చేసిన ఆయన పాదయాత్ర ముగిసిన జిల్లాలో విశాఖపట్నం విమానాశ్రయం మినహా మరెక్కడికీ మరలా వెళ్లలేదు. ఎప్పుడూ విశాఖ విమానాశ్రయం నుంచే హైదరాబాద్ వెళుతుండేవారు. కానీ విజయనగరం జిల్లాలో 36 రోజుల పాటు పాదయాత్ర చేసిన జగన్ పాదయాత్ర చివరిలో కూడా జిల్లాకు వస్తుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రజా సంకల్పయాత్రను దిగ్విజయంగా ముగించుకు న్న తమ నాయకుడికి శుభాకాంక్షలు తెలిపేం దుకు రైల్వే స్టేషన్ పరిసరాలకు పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంత మంతా కోలాహలం గా మారిపోయింది. జగన న్న రాగానే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సీఎం, సీఎం అంటూ నినాదాలు చేస్తూ ప్రతిపక్ష నేతకు జయ జయ ధ్వానాలు పలి కారు. క్షేమంగా వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోమం టూ వీడ్కోలు పలికారు. ప్రతిఒక్కరికీ చిరునవ్వుతో చేతులు జోడించి అభివాదం చేస్తూ జగన్ పయనమయ్యారు. రైల్వే స్టేషన్లో జగన్‌ను కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఇన్చార్జి భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు పీడిక రాజన్న దొర, పాముల పుష్పశ్రీ వాణి, కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, బెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స అప్పలనరసయ్య, పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బెల్లాన చంద్ర శేఖర్, శత్రుచర్ల పరిక్షిత్ రాజు, నెల్లిమర్ల నియోజక వర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, తదితరులు పాల్గొన్నారు. -
జన గర్జన
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నేల ఈనిందా అన్నట్లు ఇచ్ఛాపురం కదం తొక్కింది. రాష్ట్ర ప్రజల్లో ప్రస్తుత చంద్రబాబు పాలనపై ఉన్న నిరసన ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేసింది. ప్రజాసంకల్ప తీవ్రతను రాష్ట్రానికి చాటిచెప్పింది. ఇసుకేస్తే రాలనంతగా కిలోమీటర్ల మేర జనం తరలిరావడంతో ఇచ్ఛాపురం జనసంద్రమైంది. రాష్ట్రంలో ‘నారా’సుర పాలనకు అంతమొందించడానికి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారంతో దిగ్విజయంగా ముగిసింది. ఇడుపులపాయలో మొదటి కిలోమీటర్‌తో ప్రారంభమైన ఈ చరిత్ర బుధవారానికి ఇచ్ఛాపురం చేరుకుని ఏకంగా 3648 కిలోమీటర్ల మేరకు చేరి యాత్రను ఓ చరిత్రలా ముగించింది. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ఈ దృఢ సంకల్ప ముగింపునకు భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో వ్యతిరేక సర్కా ర్ వెన్నులో వణుకు పుట్టింది. చంద్రబాబు దుష్ట సర్కార్‌ను తరిమికొట్టేందుకు నవరత్నాలే సమరాస్త్రాలుగా ప్రజా సంక్షేమమే సంకల్పంగా చేపట్టిన సంకల్ప యాత్రికుడికి జనం జయ జయ ధ్వానాలు పలికారు. ఇందులో భాగంగా ఇచ్ఛాపురంలో నిర్వహించిన ముగింపు సభలో చంద్రబాబు సర్కార్‌పై ధ్వజమెత్తడంతో పాటు వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలపై జగన్ వివరించారు. వేలాది కిలోమీటర్లు మేరకు తానే నడిచినప్పటికీ నడిపించింది మాత్రం ప్రజలే అని చెప్పడం విశేషంగా చెప్పవచ్చు. ఇదిలావుంటే ముగింపు సభ జరుగుతున్న సమయంలో జిల్లాలో పలు చోట్లతో పాటు ప్రధానంగా ఇచ్చాపురం, పలాస, టెక్కలి తదితర నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరాను నిలిపివేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. జగన్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంగా టీవీల్లో చూసే అవకాశాలు లేకుండా సర్కార్ చేసిన ఈ కుటిల చర్యలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. హాజరైన నేతలు ప్రజాసంకల్పయాత్రకు రాష్ట్ర స్థాయి ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సంకల్పానికి తుది లక్ష్యానికి చేరుకోనున్న నేపథ్యంలో పలువురు జగన్‌తో కలిసి అడుగులు వేశారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల సమన్వయకర్తలు పిరియా సాయిరాజ్, సీదిరి అప్పలరాజు, పేరాడ తిలక్, గొర్లె కిరణ్‌కుమార్, ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి, రాష్ట్ర పార్టీ సిఈసి సభ్యుడు అంధవరపు సూరిబాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు చింతాడ మంజు, ముఖ్యనేతలు దువ్వాడ శ్రీధర్, దువ్వాడ శ్రీకాంత్, ఎన్ని ధనంజయ, మామిడి శ్రీకాంత్, హనుమంతు కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిన్ను నమ్మం బాబూ..అంటున్నారంతా.. ‘రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను తీవ్ర అవస్థలకు గురిచేసిన చంద్రబాబును ఇక నమ్మేది లేదంటూ జనం గట్టిగా చెబుతున్నారని వైఎస్ జగన్ అనడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ప్రజ లను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరాజకీయాలతో పాటు అవినీతి అక్రమాలను జగన్ ఎండగట్టాడు. పాదయాత్రలో ఎన్నో రకాల సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారని, దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు చేసిన మోసాలను చెప్పారని, అప్పట్లో చంద్రబాబుకు ఓటేసి మోసపోయామన్నారు. రుణమాఫీపై మోసం చేయడంతో రైతులంతా ‘నిన్ను నమ్మం బాబూ..’ అని అంటున్నారని, పొదుపు రుణాలు, బంగారు రుణాల మాఫీపై మోసం చేయడంతో డ్వాక్రా మహిళంతా ‘నిన్ను నమ్మం బాబూ..’ అంటున్నారని జగన్ చెప్పడంతో జనంలో మంచి స్పందన వచ్చింది. అలాగే ఇంటికొక ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేయడంతో నిరుద్యోగులు, యవత కూడా ‘నిన్ను నమ్మం బాబూ..’ అంటున్నారని, అలాగే యువకులు, గ్రామాల్లో ప్రజలు, ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా అమలు చెయ్యకపోవడంతో విద్యార్థులు, వైద్యం సక్రమంగా అందివ్వని కారణంగా రోగులు తదితర వర్గాల ప్రజలంతా ‘నిన్ను నమ్మం బాబూ..’ అంటూ అంటున్నారని జగన్ చెప్పడంతో విశేష స్పందన వచ్చింది. ఘనంగా విజయ స్తూపం ఆవిష్కరణ ప్రజాసంకల్పయాత్ర ముగింపునకు గుర్తింపుగా ఇచ్ఛాపురానికి సమీపంలో అద్భుతంగా నిర్మించిన విజయ స్తూపాన్ని (పైలాన్) వైఎస్ జగన్ ఘనంగా ఆవిష్కరించారు. 13 జిల్లాలకు గుర్తుగా 13 మెట్లతో అద్భుత రీతిలో టోంబ్తో పాటు గ్రీనరీ లాన్, దివంగత వైఎస్సార్ ఫొటోలు, అలాగే జగన్ పాదయాత్ర చేసిన రూటు తదితర వివరాలన్నీ ఈ స్తూపంలో ఉండడంతో అందరినీ ఆకట్టుకుంది. ఈ స్తూపాన్ని ఆవిష్కరించినప్పుడు యువకులు పెద్ద సంఖ్యలో సీఎం సీఎం.. అంటూ నినాదాలు చేశారు. ఇదే మార్గంలో దివంగత వైఎస్సార్ చేపట్టిన ప్రజాప్రస్థానం పైలాన్, వైఎస్ షర్మిళ చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పైలాన్లు కూడా ఉండడంతో యాత్రలో భాగంగా జగన్ వాటిని తిలకించి సభకు హాజరయ్యారు. పాదయాత్రకు జన నీరాజనం ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం ఉదయం కవిటి మండలం అగ్రహారం నుంచి భారీ జనసందోహం నడుమ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. జాతీయ రహదారి మీదుగా కొజ్జీరియా కూడలి, ఎ.బలరాంపురం, అయ్యవారిపేట, లొద్దపుట్టి వరకు యాత్ర సాగింది. విరామం అనంతరం ముగింపు పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం మళ్లీ పాదయాత్రగా ఇచ్ఛాపురం పట్టణానికి చేరుకుని బహిరంగ సభను నిర్వహించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో పాదయాత్ర ఆద్యంతం అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. ముగింపు రోజు కావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం పాదయాత్ర ప్రారంభం నుం చి వేదమంత్రాలు, శంఖారావం, కోలాటాలు, బిందెల నృత్యాలతో జగన్‌కు స్వాగతం పలి కారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలోకి జగన్ రాగానే మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, ఘన స్వాగతం పలికారు. రైతుల కళ్లల్లోఆనందం చూడాలని.. పాదయాత్ర ముగింపు సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతన్న కళ్లల్లో ఆనందం చూడాలని అనడంతో రైతులంతా హర్షం ప్రకటించారు. పంటలకు ఏటా గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని, అలాగే ముందస్తు పెట్టుబడిగా మే నెలలో ప్రతి రైతుకు రూ.12500 నేరుగా ఇస్తామని ప్రకటించడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే రైతులు వినియోగించే ట్రాక్టర్లకు లైఫ్ ట్యాక్స్ రద్దు చేస్తామని, రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని, ఉచితంగా బోర్లు వేయిస్తామని, అలాగే రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చి, అలాగే పంట భీమాను ఇక రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చేసి, రైతన్న ఆదాయం పెంచుతామని జగన్ ప్రకటించడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం లక్షలాది మంది రైతులకు ఆసరాగా మారనుంది. మరో మూడు నెలల్లో.. రాష్ట్రంలో మరో మూడు నెలల్లో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. నవరత్నాల అమలుతో ప్రజలకు సంక్షేమం చేరవవుతుంది. టీడీపీ చేస్తున్న కక్ష సాధింపు రాజకీయాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయి.– కంబాల జోగులు,ఎమ్మెల్యే, రాజాం. ఇది చరిత్ర ఇచ్ఛాపురం చరిత్రలో నిలిచి పోతుంది. పాదయాత్ర ముగింపు, పైలాన్ ఆవిష్కరణ, బహిరంగ సభ నిర్వహణ చిరస్థాయిగా నిలిచి పోతాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై పూర్తి దృష్టి పెడుతుంది. తిత్లీ బాధిత రైతులను ఆదుకుంటుంది. –పిరియా సాయిరాజ్,ఇచ్ఛాపురం వైఎస్ఆర్ సీపీ సమన్వయ కర్త,మాజీ ఎమ్మెల్యే జగన్ పేదల మనిషి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల మనిషి, పేద ప్రజలకు సేవ చేయాలన్న తపన ఆయనలో ఉంది. రాష్ట్రానికి 30 ఏళ్లు సీఎంగా కొనసాగుతారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు ఓపికగా విన్నారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నిం పారు. విద్య, వైద్యం, సంక్షేమం అన్ని రంగాల్లో ప్రగతికి కృషి చేస్తారు. – తమ్మినేని సీతారాం,పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పాలనలో విఫలం టీడీపీ ప్రభుత్వం పూర్తిగా పాలనలో విఫలమైంది. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోంది. టీడీపీ నాయకులు ప్రజాధనం దోచుకుంటున్నారు. అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.– పేరాడ తిలక్, టెక్కలి, సమన్వయకర్త రాక్షస పాలనకు అంతం తప్పదు ఆనాడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర ప్రారంభించినప్పుడు రాష్ట్రం రావణ కాష్టంగా ఉండేది. వైఎస్సార్ పాదయాత్రను విజయవంతం చేసి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. మళ్లీ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. మరి కొద్ది రోజుల్లో ధర్మమైన ప్రజా తీర్పుతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. – దువ్వాడ శ్రీనివాస్, వైఎస్సార్ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త. విజయం అందజేయాలి సుమారు 14 నెలల పాటు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను, కష్టాలను తెలుసుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. గ్రామ స్థాయిలో నవరత్నాలు, ఫ్యాన్ గుర్తుపై ప్రచారం చేసి రాబోయే ఎన్నికల్లో జగనన్నకు సీఎం చేయాలి.– విశ్వాసరాయి కళావతి,ఎమ్మెల్యే, పాలకొండ -
నాడు వైఎస్... నేడు జగన్
సాక్షి, తిరుపతి: తండ్రి బాటలోనే తనయుడు వైఎస్ జగన్ పాదయాత్ర పూర్తి చేసుకుని శ్రీవారి ఆశీస్సుల కోసం వస్తున్నారు. నాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర పూర్తి చేసుకుని తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వేంకటేశ్వరుడ్ని దర్శించుకున్నారు. నేడు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రను పూర్తి చేసుకుని గురువారం తిరుపతికి చేరుకోనున్నారు. అదే రోజు తిరుపతి నుంచి కాలి నడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు.. 2017 నవంబర్ 6న ప్రారంభమైన పాదయాత్ర 341 రోజుల పాటు 3,648 కి.మీ. 2516 గ్రామాల మీదుగా సాగి బుధవారం ఇచ్ఛాపురం వద్ద ముగిసింది. గత ఏడాది ఇదే సమయంలో చిత్తూరు జిల్లాలో పాదయాత్ర సాగింది. ఈ ఏడాది కూడా జనవరిలోనే జగన్మోహన్రెడ్డి యాత్రను పూర్తి చేసుకుని తిరుపతికి వస్తున్నారు. జననేతకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలుకనున్నాయి. యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో భూమన అభినయరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి అలిపిరి వద్ద 3648 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు జగన్‌కు స్వాగతం పలకడంతో పాటు ఆయన వెంట తిరుమలకు కాలినడకన వెళ్లడానికి సిద్ధమయ్యారు. గురువారం ఉదయం వైఎస్ జగన్ రైలులో రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన తిరుపతిలోని పద్మావతి అతిథిగృహానికి వెళ్తారు. అనంతరం తిరుపతి నుంచి కాలినడకన సాయంత్రం తిరుమలకు చేరుకుంటారు. అదే రోజు రాత్రి సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాత్రి తిరుమలలో బసచేసి శుక్రవారం ఉదయం తిరుమల నుంచి బయలుదేరి కడప మీదుగా పులివెందులకు చేరుకుంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. వైఎస్ జగన్‌కు భారీ స్వాగత ఏర్పాట్లు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు పూతలపట్టు– నాయుడుపేట జాతీయ రహదారిలో భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. చంద్రగిరి నియోజక వర్గం మీదుగా సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించనున్న మార్గంలో ఏడాదిపాటు వైఎస్ జగన్ పడిన కష్టాన్ని మరిపించేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి 20 అడుగులకు రోడుకిరువైపులా అరటిచెట్టు, కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. దారిపొడవునా మామిడి తోరణాలు, పార్టీ జెండాలతో కూడిన తోరణాలు, 50 వేలకు పైగా పార్టీ జెండా రంగుతో కూడిన బెలూన్స్‌ను మొత్తం కట్టారు. ఇంకా రోడ్డుకిరువైపులా మహిళలు, యువకులు పార్టీ జెండా రంగులతో కూడిన దుస్తులు ధరించి సుమారు 7 టన్నుల వివిధ రకాల పుష్పాలతో ఘనంగా స్వాగతం పలకనున్నారు. -
341వ రోజు పాదయాత్ర డైరీ
-
కడపలో వైఎస్ఆర్సీపీ నేతల సంబరాలు
-
సీఎంగా చూడాలని ఆకాంక్ష..
శ్రీకాకుళం :పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎనలేని ప్రజాదరణ వచ్చింది. ప్రజల సమస్యలు తెలుసుకునే వారే నిజమైన నాయకులు. అలా.. జనంలో నడిచి వారి కష్ట,సుఖాలు తెలుసుకున్నారు. వారి బాధలు తీర్చడానికి భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల వారు జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆకాంక్షిస్తున్నారు.– పి.నాని, వ్యాపారవేత్త, విశాఖపట్నం -
వచ్చేది రైతు రాజ్యమే!
-
గ్రామాభివృద్ధికి శ్రీకారం చుట్టాలి...
శ్రీకాకుళం :గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి. ప్రజా సంకల్పయాత్ర చేపట్టి ప్రజల బాధలు, కష్టాలు తెలుసుకోవాలన్న సంకల్పం ఎంతో మంచిది. జనం వద్దకే వెళ్లి జనం సమస్యలు తెలుసుకున్న నాయకుడిగా జగన్మోహన్రెడ్డి రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారు.– పడాల రామారావు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, తూముకొండ రామచంద్రాపురం, మెళియాపుట్టి మండలం -
ప్రజల గుండెల్లో చెరగని ముద్ర
శ్రీకాకుళం :ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగిన పాదయాత్రలో జన హృదయాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుచుకున్నారు. బడగు, బలహీన వర్గాలు కష్టాలను తెలుసుకున్నారు. వారికి భరోసానిస్తూ ముందుకు సాగిన తీరు రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిపోతుంది.– డాక్టర్ బి.కాశినాయుడు,రిటైర్డ్ డీఎంహెచ్ఓ, బలిజిపేట, విజయనగరం జిల్లా -
దివ్యాంగులను పట్టించుకోని టీడీపీ
శ్రీకాకుళం :దివ్యాంగులను టీడీపీ ప్రభుత్వం విస్మరిస్తోంది. అంగవైకల్యంతో బాధపడుతున్నాను. పెన్షన్‌కు దరఖాస్తు చేసినా జన్మభూమి కమిటీలు తొలగించాయి. హిందీ బీఈడీ పూర్తి చేసి డీఎస్సీ రాశాను. పోస్టులు తక్కువగా ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ నిర్వహించాలి.– ఏదురు భారతి, కొత్త కొజ్జీరియా, ఇచ్ఛాపురం మండలం -
ఆపరేషన్ చేయించి ఆదుకోండి..
శ్రీకాకుళం :క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. ముంబైలో ఆపరేషన్ కూడా చేశారు. మళ్లీ ఆపరేషన్ చేయాలని చెబుతున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. మా వద్ద డబ్బులు లేవు. మీరే ఆదుకోవాలన్నా.. – నెయ్యిల చంద్రమణి,అయ్యవారిపేట, ఇచ్ఛాపురం మండలం -
జనాల కష్టం తెలుసుకున్నారు
శ్రీకాకుళం :పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల ముందుకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకున్న నాయకుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారు. రానున్నది రాజన్న రాజ్యమే. ఆంధ్రప్రదేశ్‌కు సువర్ణ యుగం రాబోతోంది. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. నవరత్న పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది.బి.కోటేశ్వరరావు నాయక్,అíసిస్టెంట్ ప్రొఫెసర్, గుంటూరు పశువులకు బీమా ఇవ్వాలి మా జిల్లాలో యాదవ సామాజిక వర్గం అన్ని రకాలుగా వెనుకబడి ఉంది. మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. పశువుల కాపరులకు ప్రమాద బీమాగా రూ. 10 లక్షలు వర్తింప జేయాలి. బీసీ–డీ నుంచి బీసీ–ఏగా మార్పు చేయాలి. ప్రమాదవశాత్తు గొర్రెలు మృతి చెందితే రూ.10 వేలు నష్టపరిహారం ఇవ్వాలని, గొర్రెలు పెంపకం సొసైటీలు ఏర్పాటు చేయాలి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అందరికీ న్యాయం జరుగుతుంది.ఎం.వెంకటరావు, యాదవ సంఘ ప్రతినిధి -
జగన్‌తోనే పేదలకు న్యాయం
శ్రీకాకుళం :దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాడు అందించిన రామరాజ్యాన్ని నేడు తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తాడన్నది ప్రజాసంకల్పయాత్ర ద్వారా రూఢీ అయింది. లక్షలాది జనం ఆయన పాలన కోసం ఎదురు చూస్తున్నారు. మేమైతే వైఎస్ కుటుంబం కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు అమలైతేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతోంది.– రుద్ర వెంకటరావు, వేపాడ, విజయనగరం జిల్లా -
రాజధాని అంతా గ్రాఫిక్సే
శ్రీకాకుళం :రాజధాని భూములిస్తే మూడున్నరేళ్లలో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినా కార్యరూపం దాల్చలేదు. నాలుగున్నరేళ్లు ముగుస్తున్నా ఇంత వరకూ ప్లాట్ల అభివృద్ధి జరగలేదు. మా భూముల్లో ప్రభుత్వమే హ్యాపీనెస్ట్ పేరుతో రియల్ వ్యాపారానికి తెరతీయడం సిగ్గుచేటు. రాజధానిలో ఒక్క నిర్మాణం కూడా జరగలేదు. పత్రికలు, టీవీల్లో చూపించేదంతా గ్రాఫిక్సే. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మా సమస్యలు పరిష్కారిస్తారని హామీ ఇచ్చారు. – తుమ్మూరు రమణా రెడ్డి, రాజధాని రైతు -
సాగునీటి కాలువ బాగుచేయండి
శ్రీకాకుళం : ధర్మపురం గ్రామంలో సాగునీటి కాలువను అభివృద్ధి చేయాలి. 2000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ కాలువ పనులు 1954లో చేపట్టారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా పాడైంది. దీంతో ఏటా సాగునీటి సమస్యలు తప్పడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక కాలువల అభివృద్ధిపై దృష్టి సారించాలి.– ధర్మరాజురెడ్డి బృందం, ధర్మవరం, ఇచ్ఛాపురం మండలం -
అభయ ప్రదాత
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిచేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర అనే మహోన్నత అధ్యాయం ముగిసింది. పేదలకు తమకంటూ ఓ నాయకుడు ఉన్నాడన్న నమ్మకం కలిగించింది. త్వరలోనే కష్టాలన్నీ పరిష్కారమవుతాయనే భరోసా ఇచ్చింది. యాత్ర చివరి రోజైన బుధవారం ఇచ్ఛాపురంలో జరిగిన పాదయాత్రలో సామాన్యులతో పాటు వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు రాజన్న బిడ్డను కలిసి తమ ఆవేదనలు, ఆకాంక్షలు విన్నవించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అందరి సమస్యలు పరిష్కరిస్తానని జగన్ అభయమివ్వడంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా నుంచి వచ్చా.. చంద్రబాబు చేసిన అవినీతి సొమ్ముతో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మించుకోవచ్చు. అంతటి అవినీతిని ప్రజలకు తెలిసేలా అవినీతి చక్రవర్తి పేరిట ఆధారాలతో సహా పుస్తక రూపంలో ప్రజలందరికి అందుబాటులోనికి తీసుకురావడం శుభపరిణామం. రాబోయే ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించి రాజన్న రాజ్యం తీసుకురావాలి. సౌదీఅరేబియాలో ఉద్యోగం చేస్తున్న నేను ఈ ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు ఇక్కడికి వచ్చాను.– హర్షద్ అయూబ్, పులివెందుల నిరుద్యోగులకు తీరని నష్టం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు పూర్తిగా నష్టపోయారు. ఏటా డీఎస్సీ అని, ఎన్నికలు వస్తున్నాయని ఆదరాబాదరాగా పరీక్షలు నిర్వహించడం వల్ల చాలా మంది నిరుద్యోగులు నష్టపోతున్నారు. నాలుగేళ్లుగా నోటిఫికేషన్లు రాక చాలామంది అర్హత కోల్పోయారు. ప్రభుత్వ శాఖాల్లో కాంట్రాక్టు విధానంలో భర్తీ చేసిన ఉద్యోగాలను టీడీపీ నాయకులు వారి చెప్పిన వారికే కేటాయించుకొని మరింతగా మోసం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది.– సప్ప చిరంజీవి, ఇచ్ఛాపురం జగనన్న హామీలతో భరోసా ప్రజలకు భరోసా జగనన్న హామీలే. జనసంద్రంతో ఇచ్ఛాపురం ఉప్పొంగింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనడానికి లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలే ఉదాహరణ. ముగింపు సభకు మేమంతా ఎంతో ఉత్సాహంగా ఇక్కడకు వచ్చాం. సగం గెలుపు ఇక్కడే అన్నది జగనన్న మాటలు, వరాల్లో స్పష్టమైంది.– పెద్దిశెటి శేఖర్,వైఎస్సార్సీపీ యువజన అధ్యక్షుడు, పరవాడ, విశాఖపట్నం మైనార్టీలకు వరం మైనార్టీలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ వరంగా మేమంతా భావిస్తున్నాం. ప్రజాసంకల్ప యాత్రలో మైనార్టీలకు సబ్‌ప్లాన్, బడుగు, బలహీన వర్గాల ముస్లింలకు ఆయన ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. జగన్మోహన్రెడ్డితో మా బతుకులు బాగుపడతాయన్నది ముమ్మాటికీ నిజం. ముస్లిం సోదరులంతా వైఎస్సార్ సీపీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. – షేక్ మహబూబ్ బాషా,నంద్యాల, కర్నూలు జిల్లా -
ప్రజాసంకల్పయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాను
-
ఇడుపులపాయ టూ ఇచ్ఛాపురం @ 3648 కీ.మీ
-
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో జనసందోహం
-
మీ బాధలు నన్ను కదిలించాయి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఏదోఒక సమస్యను ఎదుర్కొంటూ పరిష్కారం కోసం వేచిచూస్తున్న రాష్ట్ర ప్రజ లు తనపై పెట్టుకున్న ఆశలు తనను మరింత బలవంతుడిని చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సుదీర్ఘ పాదయాత్ర ముగింపు సంద ర్భం గా తన మనస్సులో నెలకొని ఉన్న భావోద్వేగాలను ట్విట్టర్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. ‘‘పాదయాత్ర సమయంలో మీరు చూపిన ప్రేమానురాగాలు నన్ను వినమ్రుడిని చేస్తున్నాయి. మీ బాధలు, వేదనలు నన్ను కదిలించాయి. మీరు నాపై పెట్టుకున్న ఆశలు నాలో స్ఫూర్తిని రగిలిస్తున్నాయి. మీకు ఎల్లప్పుడూ సేవ చేయాలన్న నా కృతనిశ్చయం నన్ను కార్యదక్షత దిశగా మరింత బలవంతుడిని చేస్తోంది’’అని పేర్కొన్నారు. -
కీడ్నీ బాధితులకు ప్రత్యేకంగా పెన్షన్
-
గ్రామంలో చదువుకున్న పది మందికి ఉద్యోగాలు
-
ప్రతి పార్లమెంట్‌ను జిల్లాగా చేస్తాం
-
రైతుల తరపున ఇన్సూరెన్స్‌ను ప్రభుత్వమే చెల్లిస్తుంది
-
యాత్ర ముగిసినా..పోరాటం కోనసాగుతుంది
-
చంద్రబాబు ప్రభుత్వాన్ని నేలమట్టం చేస్తాం
సాక్షి, ఇచ్చాపురం: ‘నిన్నటి దినం ప్రజాసంకల్ప యాత్ర.. రేపు వైఎస్ జగన్ పట్టాభిషేక యాత్ర. ఈ ప్రజాసంకల్పయాత్ర ఇంత పెద్దఎత్తున విజయవంతం కావడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దివంగత నేత వైఎస్సార్ కుటుంబాన్ని ప్రేమించే ప్రతీ అభిమానీ ఆశీస్సులే..’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై, టీడీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ‘పేద రైతు కుటుంబానికి చెందిన నాలాంటి వాడిని ఎమ్మెల్యే చేసిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిది. అయితే.. సంతలో పశువులను కొన్నట్టు 23 మంది ఎమ్మెల్యేలను కొన్న నీచ చరిత్ర చంద్రబాబుది. మరోసారి గెలవడానికి చంద్రబాబు తన అక్రమ సంపాదనతో ఓట్లను కొనడానికి ప్రయత్నిస్తాడు. కానీ జగన్ సునామీలో చంద్రబాబు అక్రమ సంపాదన కొట్టుకపోవడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను గెలిపించడానికి మా ధన మాన ప్రాణాలను లెక్క చేయం. అక్రమ సంపాదనతో చంద్రబాబు అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు, పార్టీ కార్యకర్తల సహాయంతో నేలమట్టం చేద్దాం’అంటూ రాచమల్లు ఉద్ఘాటించారు. -
ఇచ్ఛాపురంలో విజయసంకల్ప స్థూపం ఆవిష్కరణ
-
విజయసంకల్ప స్థూపంను ఆవిష్కరించిన వైఎస్ జగన్
సాక్షి, ఇచ్ఛాపురం: చరిత్రాత్మకమైన పాదయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో ఇచ్ఛాపురంలోని బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన విజయసంకల్ప స్థూపం (పైలాన్)ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. భారీ ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు.. వైఎస్ జగన్ పైలాన్‌ను ఆవిష్కరించే దృశ్యాన్ని అపురూపంగా తిలకించారు. పైలాన్ ఆవిష్కరించడానికి ముందు ఆయన సర్వమత పెద్దల నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. స్థూపాన్ని ఆవిష్కరించిన అనంతరం వైఎస్ జగన్ కాలినడకన పాత బస్టాండ్ వద్దకు బయలుదేరారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అంతకు ముందు వైఎస్ జగన్ పాదయాత్రగా బయలుదేరి లొద్దపట్టి చేరుకున్నారు. అక్కడ వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. వైఎస్సార్ సీపీ నేతలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. జననేతతో కలిసి నడవటానికి పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు అక్కడకు చేరుకున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న దారులన్నీ జనసంద్రంగా మారాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇలాంటి పాదయాత్ర దేశంలో ఎవరు చేయలేదు
-
వైఎస్సార్ సీపీలో చేరిన భానుచందర్
సాక్షి, శ్రీకాకుళం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సినీ నటుడు భానుచందర్ వైఎస్సార్ సీపీలో చేరారు. జననేత పార్టీ కండువా కప్పి భానుచందర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్ర ముగింపు ఘట్టంలో పాల్గొన్న భానుచందర్ మాట్లాడుతూ... ప్రజల కోసం తపించే వైఎస్ జగన్ లాంటి నాయకుడిని ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. జనంతో ఇంతగా కలిసిపోయే నాయకుడు వైఎస్ జగన్ ఒక్కరేనని.. ఆయనకు ఎవరూ సాటి రారని పేర్కొన్నారు. 2019 నుంచి మరో 20 సంవత్సరాల పాటు వైఎస్ జగనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారంటూ వ్యాఖ్యానించారు. కాగా కొన్నిరోజుల క్రితమే భానుచందర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో సాగిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గతేడాది డిసెంబర్లో వైఎస్ జగన్‌ను భానుచందర్ కలిశారు. ఆరోజే తాను పార్టీలో చేరే విషయంపై చర్చించారు. -
ఇడుపులపాయలో అంకురార్పణ.. అలుపెరుగని బాటసారిగా..
ఓ వైపు తరలివచ్చిన లక్షలాది జనం.. మరో వైపుఅడుగడుగునా అభిమాన నేతకు ఆశీర్వచనం..ఎటు చూసినా ఉప్పొంగిన అభిమాన తరంగం.. ఇది2017 నవంబర్ 6వతేదీ నాటి దృశ్యానికి అక్షర రూపం. మహానేత వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిఆంధ్రరాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా సంకల్పధీరుడై..పాదయాత్రికుడై పుట్టిన గడ్డ నుంచి బయదేరిన సందర్భం.అలా మొదలైన తొలి అడుగు ఎండా.. వాన.. చలిని సైతంలెక్క చేయక నమ్మిన సిద్ధాంతం .. జన హితం కోసంఅలుపెరగకుండా కదిలింది. ఎన్నో సభలు.. మరెన్నోఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ.. సమస్యలు ఆలకిస్తూ..కష్టాలు తెలుసుకుంటూ.. కన్నీళ్లు తుడుస్తూ.. భరోసాకల్పిస్తూ జైత్ర యాత్రలా సాగిన ప్రజాసంకల్ప యాత్రమరుపురాని చరిత్రగా నిలిచి పోనుంది. ఆ అవిశ్రాంతయోధుడు జన దీవెనలతో రాజన్న రాజ్యం స్థాపిస్తాడని..సువర్ణయుగానికి నాంది పలుకుతాడని.. నవరత్నాల్లాంటిపథకాలతో తమ బతుకుల్లో వెలుగులు నింపుతాడనే ఆశ..ఆకాంక్ష.. ఆత్మవిశ్వాసం అందరిలో కనిపిస్తోంది. సాక్షి ప్రతినిధి కడప: ఇడుపులపాయలో 2017 నవంబర్ 6న ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర 2019 జనవరి 9న దిగ్విజయంగా ముగింపు పలకనుంది. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా ఉంటూ.. ఆత్మబంధువుగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిచారని విశ్లేషకులు కొనియాడుతున్నారు. సర్వం కోల్పోయి జీవితంలో ఏమీ లేదని నిరాశ చెందుతున్న బాధితులకు ప్రభుత్వం ఆసరాగా నిలివాల్సి ఉంది. ప్రభుత్వ చర్యలు నామమాత్రమే కావడంతో అలాంటి వారికి కొండంత ధైర్యం నింపుతూ.. బడుగు, బలహీన వర్గాల్లో.. నేనున్నానని.. మీకేం కాదని భరోసా కల్పిస్తూ ఎక్కడికక్కడ ముందుకు కదిలారు. కలిసిన ప్రతి ఒక్కరినీ కూడా అదే ఆప్యాయంగా పలుకరిస్తూ.. కష్టసుఖాలు తెలుసుకుంటూ అందరిలో ఒకడిలా ముందుకు కదిలారు. ఇంటి బిడ్డలా.. కష్టంలో ఇంటికి పెద్దన్నలా ఉంటానంటూ హామీ ఇçస్తూనే.. అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను దూరం చేసి రాజన్న రాజ్యంతో స్వర్ణయుగం అందిస్తానని నమ్మకం కల్పించారు. అడుగడుగునా బ్రహ్మరథం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రను తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ నుంచి ప్రారంభించారు. చలికాలం, ఎండకాలం, వానకాలంలో కొనసాగి మరుపురాని చరిత్రకు సజీవ సాక్ష్యమైంది. పాదయాత్ర ప్రారంభం నుంచి అపురూప ప్రజాదరణ లభించింది. ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనంతో దిగ్విజయంగా సాగింది. అడుగడుగునా ప్రతిపక్ష నేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పల్లె, పట్టణం తేడా లేకుండా.. చిన్నా పెద్ద తారమత్యం లేకుండా.. అడుగడుగునా జననేతను కలుస్తూ తమ కష్టసుఖాలు చెప్పుకుంటున్నారు. అంతే ఓపికగా వారి సమస్యలు వింటూ తన పరిధిలో అవకాశం మేరకు చేయూతనిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజా విన్నపాలు.. ప్రభుత్వం తత్తరపాటు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ప్రజల విన్నపాలు అధికమయ్యాయి. ప్రభుత్వ డొల్లతనాన్ని ఎక్కడికక్కడ ప్రజలు ప్రతిపక్షనేత దృష్టికి తీసుకువస్తున్నారు. సమస్యలపై జననేత స్పందిస్తూ తక్షణమే హామీలు గుప్పించారు. ఈ క్రమంలోనే వేంపల్లెలోని దేవి కల్యాణ మండపంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఎస్సీ కాలనీలకు ఉచిత విద్యుత్ హామీ లభించింది. అత్యధిక బిల్లులొస్తున్నాయి.. కూలీకి వెళ్తేనే పొట్ట నింపుకొనే మాబాటోళ్లు.. ఎలా బతకాలి సార్... అంటూ ఎస్సీలు విన్నవించడంతో వెంటనే స్పందించిన జననేత ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ♦ వేంపల్లెలో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైస్కూల్ సమీపంలో టీచర్లు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. కాంట్రీబ్యూటరీ ఫెన్షన్ స్కీమ్ (సీపీఎస్) వల్ల ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోనున్నట్లు వివరించారు. జిల్లాలో 12 వేల మంది ఉపాధ్యాయులు సీపీఎస్ పరిధిలోకి వస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది ఉన్నారని వివరించారు. సర్వీసు అంతా ప్రజలతో మిళితమైన తమకు అన్యాయం చోటు చేసుకుంటోందని వారు విన్నవించడంతో.. అధికారంలోకి రాగానే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ♦ గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా వీరపునాయునిపల్లె మండలంలోని సర్వరాయసాగర్ ప్రాజెక్టు పూర్తి కాలేదని రైతులు వివరించారు. అందుకు స్పందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామని, పెండింగ్‌లో ఉన్న సర్వరాయసాగర్ ప్రాజెక్టుతోపాటు సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించారు. ♦ జమ్మలమడుగు నియోజకవర్గంలోని బ్రహ్మణి ఉక్కు పరిశ్రమను ప్రభుత్వం రద్దు చేసింది. ఉపాధి కల్పన నిమిత్తం ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలని ఎర్రగుంట్లలో స్థానికులు కోరడంతో అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుడుతామని ప్రకటించారు. ♦ ఫిజియో థెరఫిస్టులకు ఉద్యోగ అవకాశాలు లేవని, కోర్సు పూర్తి చేసినా ఆశించిన ప్రయోజనం దక్కడం లేదని వివరించడంతో.. ఆరోగ్యశ్రీలో కీళ్లు మార్పిడి శస్త్ర చికిత్సను చేర్చి ఫిజియో «థెరపిస్టులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్ఛాపురానికి తరలివెళ్లిన నేతలు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ముగింపు కార్యక్రమం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి జిల్లా నేతలు తరలి వెళ్లారు. రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, రాచమల్లు శివప్రసాదరెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ సుధీర్‌రెడ్డి, డాక్టర్ వెంకటసుబ్బయ్య, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి, మండిపల్లె రాంప్రసాద్రెడ్డితోపాటు జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు తరలివెళ్లారు. -
ప్రజా సంకల్పానికి జేజేలు
అసమర్థ పాలనను ఎండగడుతూ.. అభ్యాగులకు భరోసానిస్తూ ప్రజా సంకల్పయాత్రికుడు జిల్లాలో అడుగు పెట్టింది మొదలు.. ఊరూరా జనంనీరాజనం పలికారు. పేదల బతుకుల్లో చీకటి తెరలు తొలగించే వెలుగు రేఖలా కనిపించిన జననేతలో రాజన్నను చూసుకున్నారు. వేలాది అడుగులు వెంట నడిచాయి. పల్లెలు కదిలి వచ్చాయి. అలుపెరగని నేతకు గ్రామ గ్రామాన ఆత్మీయ స్వాగతం పలికి.. గుండెల నిండా అభిమానంతో జనహారతి పట్టారు. ప్రజా సంకల్పానికి జేజేలు పలికారు. బుధవారం ప్రజా సంకల్పయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో జిల్లాలో సాగిన యాత్ర విశేషాలు గుర్తు చేసుకుంటూ.. కోవెలకుంట్ల :జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్ఆర్ జిల్లాలో పాదయాత్ర ముగించుకుని కర్నూలు జిల్లా చాగలమర్రి నుంచి పాదయాత్ర ప్రారంభమై 14 మండలాల మీదుగా 263 కి.మీ. మేర సాగింది. 18 రోజుల పాటు జిల్లాలో కొనసాగి తుగ్గలి మండలం ఎర్రగుడి వద్ద అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. బహిరంగ సభలు, ఆత్మీయ సదస్సులు, ముఖాముఖి కార్యక్రమాలతో అన్ని వర్గాలకు భరోసా కలిగించారు. బడుగులకుఆత్మ బంధువులా.. 2017 నవంబర్ 27న కోడుమూరు మండలం గోరంట్ల వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలతో ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో బీసీ ప్రతినిధులు తెలుగుదేశం పాలనలో చంద్రబాబునాయుడు చేస్తున్న మోసాలను ఏకరువు పెట్టారు. బీసీల ఆవేదన, అన్యాయాలను విన్న జగన్ బలహీన వర్గాలకు అన్ని విధాలా అండగా ఉండి బాసటగా నిలుస్తామని భరోసా కల్పించారు. బీసీలను అన్ని విధాలా ఆదుకునేందుకు బీసీ గర్జన నిర్వహించి బీసీ డిక్లరేషన్ ప్రకటించి వచ్చే ఎన్నికల్లో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఏదో ఒక చోట ఎంపీ టికెట్ బోయలకు కేటాయిస్తామని చెప్పడం ఆ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 108, 104 తరహాలో 102 అందుబాటులోకి తెస్తామని, ఈ అంబులెన్స్ ద్వారా గొర్రెలు, ఆవులను రక్షించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీతొలి అభ్యర్థి ప్రకటన ఇక్కడే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో కర్నూలు జిల్లాకు చెందిన కంగాటి శ్రీదేవి (పత్తికొండ)ని వైఎస్ఆర్సీపీ తొలి అభ్యర్థిగా ప్రకటించారు. జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఉండగా 2014 ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాలతో పాటు పదకొండు అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత జిల్లాలో నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, కోడుమూరు, కర్నూలు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. వైఎస్ఆర్సీపీకి వస్తున్న ఆదరణ చూడలేక టీడీపీ హత్యా రాజకీయాలకు పాల్పడింది. ఈ క్రమంలో జిల్లాలోని పత్తికొండ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డిని హతమార్చారు. 2017వ సంవత్సరంలో వైఎస్ జగన్ పాదయాత్ర జిల్లాలో పార్టీ ఫిరాంపు ఎమ్మెల్యే నియోజకవర్గం ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైంది. ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో ఎమ్మెల్యేలు మారినా ప్రజలంతా వైఎస్ఆర్సీపీకి అండగా ఉండటంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. జిల్లాలో పాదయాత్ర ముగిసేవరకు జగన్ అడుగుల్లో వేలసంఖ్యలో అడుగులు పడ్డాయి. రైతులు, కూలీలు, యువకులు, మహిళలు, వృద్ధులు సైతం జననేత వెంట నడిచేందుకు ముందుకు రావడంతో పాదయాత్ర సాగని ప్రయాణమైంది. అన్ని వర్గాల ప్రజల భవిష్యత్‌కు భరోసానిస్తూ పాదయాత్ర సాగగా జననేతకు ఊరూరా అçపూర్వ స్వాగతం లభించింది. వైఎస్ఆర్సీపీ మొదటి అభ్యర్థిగా శ్రీదేవిని పార్టీ అధినేత ప్రకటించడంతో జిల్లాకు అరుదైన అవకాశం పాదయాత్రకు జనాభి‘వంద’నం వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జిల్లాలో మూడు మైలురాళ్లను దాటింది. 2017 నవంబర్ 14న వైఎస్ఆర్ జిల్లా నుంచి చాగలమర్రి సమీపంలో కర్నూలు జిల్లాలో ప్రవేశించింది. జిల్లాలో 18 రోజులపాటు పాదయాత్ర కొనసాగగా చాగలమర్రి మండలం గొడిగనూరు సమీపంలో వంద కి.మీ. మైలురాయిని చేరుకుంది. డోన్ నియోజకవర్గంలోని ముద్దవరం వద్ద 200 కి.మీ., ఆలూరు నియోజకవర్గంలోని కారుమంచి వద్ద 300 కి.మీ. మైలురాయిని చేరింది. అన్నదాతకు అండగా.. తెలుగుదేశం పాలనలో రైతులు కన్నీరు పెడుతున్నారని, మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో తిరిగి రామరాజ్యం తీసుకొస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు భరోసా కల్పించారు. 2017 నవంబర్ 27వ తేదీన కోడుమూరులో జరిగిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో అన్నదాతకు అండగా నిలిచారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేనప్పుడు దిగుబడులను గోదాముల్లో ఉచితంగా నిల్వ ఉంచుకునేందుకు వీలుగా ప్రతి మండలానికి ఒక కోల్డ్‌స్టోరేజి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రైతు భరోసా కింద నాలుగేళ్ల పాటు ఏటా మే నెలలోనే పెట్టుబడుల కోసం రూ. 12,500 అందజేసి అండగా ఉంటామని రైతులకు భరోసా ఇచ్చారు. డిసెంబర్ 4వ తేదీన తుగ్గలి మండలం ఎర్రగుడి వద్ద జరిగిన రైతు సదస్సులో రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబం చిన్నాభిన్నం కాకుండా వైఎస్ఆర్ బీమా ద్వారా ఆ కుటుంబానికి తక్షణమే రూ. 5 లక్షల ఆర్థిసాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. పెద్దకొడుకులా.. ♦ 2017 నవంబర్ 20వ తేదీన బనగానపల్లె మండలం హుసేనాపురం వద్ద నిర్వహించిన మహిళా సదస్సులో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలు మహిళలకు కొండంత ధైర్యాన్ని నింపాయి. ♦ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే పిల్లల చదువుకు ఏడాదికి రూ. 15వేలు, పెద్ద చదువులకు అయ్యే ఫీజులను చెల్లిస్తామని, హాస్టల్ ఖర్చులకు ఏడాదికి రూ. 20వేలు ఇస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ♦ పేద కుటుంబాలకు చార్జీల మోత నుంచి ఉపశమనం కల్పించేలా 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందజేస్తామని, పొదుపు మహిళలకు ఎన్నికల నాటికి ఎంత అప్పులున్నాయో నాలుగు దఫాల్లో చెల్లిస్తామన్నారు. ♦ జన్మభూమి కమిటీలు ఉండవని, ఎవరికీ రూపాయి లంచం ఇవ్వాల్సిన పనిలేదని వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు మహిళలకు కొండంత అండగా నిలిచాయి. ♦ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యం మహమ్మారిని అధికారంలోకి రాగానే దశల వారీగా నిషే«ధిస్తామని హామీ ఇచ్చారు. ♦ గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి 72 గంటల్లోనే రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ, పింఛన్ అందజేస్తామన్న జననేత హామీ పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మేము సైతం చరిత పుటల్లో భాగమై..
అదిగో నవశకం.. ఈడ్చికొట్టే జడివానను చీల్చుకుంటూ.. ఎముకలు విరిచే చలిలో ఎదురీదుకుంటూ.. భగభగ మండే నిప్పుల కణికలపై సవారీ చేసిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరగని పయనం ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగి నవశకానికి నాంది పలికింది. తాను నడిచిన దారుల్లో బీద గుడిసె గుండెల్లో కన్నీటి తడిని ఆత్మీయంగా తుడిచేసి అభయ హస్తమిచ్చింది. అప్పుల అగాధంలో ఆత్మహత్యల ఉరికొయ్యకు వేలాడుతున్న రైతన్నను చూసి కరిగిపోయి.. పచ్చని పంటల్లో అన్నదాత నవ్వుల సిరిని పండిస్తానని భరోసా కల్పించింది. వేల కిలోమీటర్లు సాగిన ప్రజా సంకల్పం నేడు సరి కొత్త చరితను ఆవిష్కరించబోతోంది. దీనికి మేము సైతమంటూ విప్లవాల మల్లెలు విరబూసిన శ్రీకాకుళం గడ్డపై వజ్ర సంకల్పధీరునికి అభిమాన స్వర్ణ కంకణం అలంకరించేందుకు ఊరూవాడా జనవాహినై కదిలింది. సంకల్పధీరుడికి సలామంటూ తలొంచిన దారులు.. అభిమాన దండుకు అఖండ స్వాగతం పలకగా, జై జగన్ అనే నినాదం ఢమరుక నాదమై మార్మోగగా.. ఇచ్ఛాపురం గడ్డపై నేడు సంకల్ప మహోజ్వల దీప్తి దేదీప్యమానమై ప్రకాశించబోతోంది. గుంటూరు(పట్నంబజారు): ప్రజా సంకల్పయాత్రికుడై బయలుదేరిన జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పాదయాత్ర నేడు ఇఛ్చాపురంలో నేడు ముగియనుంది. అభిమాన నేత వైఎస్ జగన్ బహిరంగ సభకు జిల్లా నుంచి ఆశేష జనవాహిని పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. జిల్లా వ్యాప్తంగా బస్సులు, కార్లలో పాదయాత్ర ముగింపు సభకు తరలివెళ్లి జయప్రదం చేయనున్నారు. వైఎస్సార్ సీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలు, పార్టీ నేతలతో కలిసి మాచర్ల నియోజకవర్గం నుంచి ఇఛ్చాపురం చేరుకున్నారు. నర్సరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరావుపేట మండలం, రొంపిచర్ల మండలం నుంచి పార్టీ నేతలతో కలిసి సభకు తరలివెళ్లారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ ముస్తఫా, నగర అనుబంధ విభాగాల నేతలు, డివిజన్ అధ్యక్షులతో కలిసి వెళ్ళారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నియోజకవర్గ నేతలతో కలిసి పాదయాత్రకు చేరుకున్నారు. బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కోన రఘుపతి నియోజకవర్గం, ఆయా మండలాల నేతలతో కలిసి కార్లతో పాదయాత్ర తరలివెళ్లారు. అభిమాన తరంగం గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు, మోపిదేవి వెంకటరమణ ద్వితీయ శ్రేణి నాయకులతో కలిసి సభకు వెళ్లారు. పార్టీ గుంటూరు, సత్తెనపల్లి, బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్తలు కిలారి రోశయ్య, లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్‌లు పాదయాత్రకు పార్టీ నేతలు, కార్యకర్తలతోతో ఇచ్ఛాపురం చేరుకున్నారు. పట్టాభిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి నేడు జరిగే బహిరంగ సభకు తరలివెళుతున్న బస్సును కిలారి రోశయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు కలిసి జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం పాదయాత్ర వెళ్లగా, లక్ష్మీపురంలోని ఆయన కార్యాలయం నుంచి బస్సును ఏర్పాటు చేసుకుని సభకు తరలివెళ్లారు. ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడె మేరుగ నాగార్జున వేమూరు నియోజకవర్గం, ఎస్సీ విభాగం నేతలను వెంట తీసుకుని బయలుదేరారు. పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్ గాంధీ పార్టీ నేతలతో కలిసి వెళ్లారు.. గురజాల, వినుకొండ, చిలకలూరిపేట, తాడికొండ, పెదకూరపాడు, పొన్నూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు కాసు మహేష్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, విడదల రజని, ఉండవల్లి శ్రీదేవి, నంబూరు శంకరరావు, రావి వెంకటరమణలు వారి నియోజకవర్గ నేతలు, శ్రేణులు, కార్యకర్తలతో కలిసి ప్రజా సంకల్పయాత్ర ముగింపు కార్యక్రమానికి పయనమయ్యారు. న్యాయవాదుల సంఘీభావం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రకు మద్దతుగా గుంటూరు నగరంలో న్యాయవాదులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు నుంచి ప్రారంభమైన ప్రదర్శన నగరంపాలెంలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం ఆయన విగ్రహానికి, గుర్రం జాషువా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు, లీగల్ విభాగం గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు పోలూరి వెంకటరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్యన్నారాయణ, లీగల్ విభాగం నగర అధ్యక్షులు వాసం సూరిబాబు, ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలెదేవరాజులు పాల్గొన్నారు. -
సువర్ణాక్షరాలతో..
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోవటానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్రకు కృష్ణా జిల్లాలో విశేష ఆదరణ లభించింది. 25 రోజులపాటు జరిగిన ఈ యాత్ర జిల్లాలోని 12 నియోజకవర్గాల గుండా 5 మున్సిపాలిటీలు, 18 మండలాల్లో, 130 గ్రామాల మీదుగా 239 కి.మీ. మేర సాగింది. గతేడాది ఏప్రిల్ 14న గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి కనకదుర్గమ్మ వారథి మీదుగా జిల్లాలో ప్రవేశించింది. ఆయన అడుగులో అడుగేసేందుకు వేలాదిమంది కదం తొక్కారు. అదే రోజు విజయవాడ చిట్టినగర్ సెంటర్లో జరిగిన బహిరంగ సభతో జిల్లా ప్రజలకు జననేత పట్ల ఉన్న ఆదరాభిమానాలను తెలియజేసింది. ఆ తర్వాత మైలవరం, నూజివీడు, గన్నవరం, ఉయ్యూరు, పామర్రు, మచిలీపట్నం, పెడన, గుడివాడ, కైకలూరులలో కూడా ఇసుకేస్తే రాలనంత జనం, కనుచూపుమేర అభిమానసంద్రం పోటెత్తింది. చరిత్రలో చరగని ముద్ర వేసిన ప్రజాసంకల్పయాత్ర గతేడాది మే 13న కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం మణుగునూరు లంక వద్దదిగ్విజయంగా ముగిసింది. నాలుగు ఆత్మీయ సభలు.. జిల్లాలో పాదయాత్రలో వివిధ సామాజిక వర్గాలతో జరిగే ఆత్మీయ సమ్మేళనాల్లో భాగంగా జిల్లాలో నాలుగు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. గుడివాడ నియోజకవర్గ కౌతారం వద్ద ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులతో, కైకలూరు నియోజకవర్గం పెరిగెగూడెంలో దళితులతో, గుడివాడ నియోజకవర్గం అగ్రహారం వద్ద నాయీ బ్రాహ్మణులతో, మచిలీపట్నం నియోజకవర్గం పొట్లపాలెం వద్ద విశ్వబ్రాహ్మణులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయా వర్గాలపట్ల జననేత జగన్‌కు ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని చాటాయి. ఈ సభల్లో భాగంగా దళితులకు వైఎస్సార్ పెళ్లి కానుక, సబ్సిడీతో రుణాలు వంటి హామీలను ప్రకటించారు. న్యాయవాదులకు 100 కోట్ల రూపాయలతో సంక్షేమనిధి, విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కీలక నిర్ణయాలు.. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెడతామన్న హామీ పెనుప్రకంపనలను సృష్టించింది. కొల్లేరు ప్రజల కష్టాలను చట్టసభల్లో ప్రశ్నించటానికి ఆ ప్రాంత వాసికి ఎమ్మెల్సీని చేస్తామన్నారు. కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్)ను ప్రకటించారు. తరలిన వైఎస్సార్ సీపీ దండు సాక్షి, అమరావతిబ్యూరో : చరిత్రపుటల్లో నిలిచిపోయే అపూర్వ ఘట్టంలో పాలుపంచుకునేందుకు కృష్ణా జిల్లా నుంచి జన జాతర ఉప్పెనలా కదలివెళ్లింది. 14 నెలల కిందట జననేత వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నేటితో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. పల్లెపల్లెను పలుకరిస్తూ.. ప్రజలతో మమేకమవుతూ.. ప్రతిపక్ష నేత జగన్ సాగించిన పాదయాత్ర ముగింపు సభకు కృష్ణా జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు కదలివెళ్లి ఆయనకు సంఘీభావం తెలిపారు. తరలివెళ్లిన జనప్రవాహం ప్రజాసంకల్ప యాత్రికుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజయవాడ ప్రజలు ఆత్మీయ తివాచీతో స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న కనకదుర్గ వారధిపై నుంచి జిల్లాలోకి ప్రవేశించిన జగన్‌కు అభిమాన జనసందోహం ఎదురేగి జిల్లాలోకి సాదరంగా తోడ్కొని వచ్చింది. జననేతను అనుసరిస్తూ వేలాదిమంది అభిమానులు వారథిపై కదం తొక్కారు. అప్పుటి నుంచి జిల్లాలో యాత్ర ముగిసే వరకు వైఎస్ జగన్‌ను వెంట అడుగులో అడుగు వేసిన వేలాది మంది ఇప్పుడు ముగింపు యాత్రలో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి తరలివెళ్లడం గమనార్హం. పార్టీ నేతల సంఘీభావం.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి యాత్ర ముగింపు అపూర్వ ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు భారీగా తరలివెళ్లారు. సోమవారం రాత్రి నుంచి కొనసాగించి మంగళవారం రాత్రిలోగా వేలాది మంది ఇచ్ఛాపురం చేరుకున్నారు. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో నాయకులు తరలివెళ్లారు. విజయవాడ పార్టీ కార్యాలయం నుంచి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పార్థసారథి పలువురితో కలిసి సోమవారం ఇచ్ఛాపురం బయలుదేరి వెళ్లారు. పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త యలమంచిలి రవితో పాటు, విజయవాడ పార్లమెంటరీ జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు పలువురు సోమవారం రాత్రికే ఇచ్ఛాపురం చేరుకున్నారు. కాగా పార్టీ అభిమానలు ఇతర నాయకులు రెండు బస్సుల్లో మంగళవారం మధ్యాహ్నం బయలుదేరి వెళ్లారు. ♦ అలాగే మైలవరం నియోజకవర్గం నుంచి పార్టీ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్, పలువురు పార్టీ నాయకులు సోమవారం రాత్రి ఇచ్ఛాపురం తరలి వెళ్లారు. ♦ నూజివీడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మేకా వంకాప్రతాప్ అప్పారావుతోపాటు మరో 50 మంది నాయకులు, కార్యకర్తలు ఇచ్ఛాపురం తరలి వెళ్లారు. ♦ నందిగామ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త డాక్టర్ జగన్మోహనరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్‌లతో పాటు కొందరు ముఖ్య నాయకులు కలిసి తమ వాహనాల్లో 100 మందితో మంగళవారం సాయంత్రం కాన్వాయ్‌గా బయలుదేరారు. ♦ కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, ఆయన కుమారులు వినయ్, శ్యామ్లతోపాటు పార్టీ రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శి పోసిన పాపారావుగౌడ్, ప్రచార కమిటీ రాష్ట్ర్ర కార్యదర్శి వాసిపల్లి యోనా, రాష్ట్ర యువజన సంఘం నాయకుడు దాసరి అబ్రహం లింకన్, జోగి సురేష్‌లు తరలివెళ్లారు. ♦ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు సామినేని ఉదయభాను, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల సమన్వకర్తలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు కలిసి వెళ్లారు. ♦ పెడన నియోజకవర్గం నుంచి పార్టీ సమన్వయకర్త జోగిరమేష్, మున్సిపల్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్ ఇచ్ఛాపురం వెళ్లారు. ♦ గన్నవరం నియోజకవర్గం నుంచి పార్టీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు నేతృత్వంలో పది వాహనాల్లో ముఖ్యనాయకులు, పార్టీ శ్రేణులు ఇచ్ఛాపురం బయలుదేరి వెళ్లారు. మరో 100 మందికిపైగా సోమవారం రాత్రే తరలివెళ్లడం జరిగింది. ♦ తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి ఆధ్వర్యంలో సోమవారం 100 మందికిపైగా కార్యకర్తలు తరలివెళ్లారు. ♦ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో సోమవారం పలువురు కార్యకర్తలు ఇచ్ఛాపురం పయనమయ్యారు. ♦ మచిలీపట్నం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పేర్ని వెంకటరామయ్య(నాని) తన అనుచరులతో కలిసి వెళ్లారు. ♦ పామర్రు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కైలే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో పలు వాహనాల్లో సోమవారం ఇచ్ఛాపురం బయలుదేరి వెళ్లారు. అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ సమన్యయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావుతో పాటు పలువురు నేతలు సభకు పయనమయ్యారు. పార్టీ జిల్లా అనుబంధ సంఘాలు.. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు సోమవారమే ఇచ్ఛాపురానికి పలు వాహనాల్లో తరలి వెళ్లారు. తరలి వెళ్లినవారిలో వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అ«ధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి, విజయవాడ పార్లమెంట్ జిల్లా డాక్టర్స్ సెల్ అ«ధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ షేక్, బీసీ సెల్ కొసగాని దుర్గారావు గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు తోకల శ్యామ్‌కుమార్, లీగల్‌సెల్ అధ్యక్షుడు కోటంరాజు వెంకటేష్‌శర్మ, రాష్ట్ర అదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్, 15వ డివిజన్ విద్యార్థి విభాగం అ«ధ్యక్షుడ శివ, మైలవరం నియోజకవర్గం విద్యార్ధి విభాగం అ«ధ్యక్షుడు నాగిరెడ్డి, మైనార్టీ విభాగం కార్యదర్శి గౌసాని, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, కర్నాటి రాంబాబు ఉన్నారు. జననేతతో నడవటం గొప్ప అనుభూతి కంకిపాడు(పెనమలూరు): కృష్ణాజిల్లాలోకి ప్రజా సంకల్ప యాత్ర ప్రవేశించినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటే నడుస్తున్నాను. 11 నెలల పాటు ఆయనతో కలిసి ప్రయాణం చేయటం మరచిపోలేని అనుభూతి. అనేకవర్గాల ప్రజలు ఎదురేగి ఆయనకు సమస్యలు విన్నవించటం, ఎంతో ఓపికగా జగన్ సమస్యను వినడం.. వారికి భరోసా కల్పించడం చూస్తున్నా.. జగన్ అధికారంలోకి వస్తే బతుకులు బాగుపడతాయనే ధీమా ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది. పుట్టిన రోజు, పండుగలు, కొత్త సంవత్సర వేడుకలు కూడా ఆయనతో పాటే జరుపుకున్నాం. రోజూ ఆయన రమమ్మ తల్లి అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రానున్న రోజుల్లో పార్టీ కోసం మరింతగా పనిచేస్తా. -
మహా సంకల్పం
ప్రతి అడుగూ ప్రజల కోసమే.. వారి కష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకుంటూ నేనున్నాంటూ భరోసా ఇస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్‌కు వారధి నిర్మాణానికి మహా సంకల్పయాత్ర చేపట్టారు ప్రతిపక్షనేత వైఎస్ జగన. జననేత జనం కోసం అడుగులు వేస్తుంటే నీ వెంటే మేముంటాం అంటూ అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 3,645 కిలోమీటర్ల యాత్ర మరో చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. ప్రజలతో మమేకమవుతూ సాగిన ఈ యాత్ర నేడు ముగింపు ఘట్టానికి చేరుకుంది. ముఖ్యంగా జిల్లాలో కూడా నెల్లూరు నగరం మినహా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. ఆ సమయంలో అశేష జనవాహిని జగన్ వెంట నడిచింది. పల్లెల్లో అపూర్వ స్వాగతం లభిం చింది. తమ సమస్యలను చెప్పుకున్నారు. టీడీపీ చేసిన మోసాన్ని ఏకరువు పెట్టారు. ముగింపు ఘట్టంలోనూభాగస్వాములు అయ్యేందుకు ఇచ్ఛాపురానికి తరలి వెళ్లారు. జిల్లాలో పార్టీ మాజీ ఎంపీలు, రాజ్యసభ సభ్యుడు,ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనేతలతోపాటు మండల, గ్రామస్థాయి నాయకులు మంగళవారంబయలుదేరారు. జననేత పాదయాత్ర జిల్లాలోహాట్ టాపిక్‌గా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి పార్టీ క్యాడర్ దూరాభారాన్ని లెక్కచేయకుండా అపూర్వ ఘట్టంలో భాగస్వాములు కావాలనే సంకల్పంతో మంగళవారం పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లాకు తరలివెళ్లారు. ముఖ్యంగా పార్టీ మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వి.వరప్రసాద్‌రావు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్‌యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పార్టీ సమస్వయకర్తలు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మేరిగ మురళీధర్, పార్టీ తిరుపతి, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తదితరులు శ్రీకాకుళం పయనమయ్యారు. వీరిలో కొందరు మంగళవారం ఉదయానికే ఇచ్ఛాపురం చేరుకున్నారు. అలాగే నెల్లూరు సిటీ, రూరల్, గూడూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, వెంకటగిరి, సర్వేపల్లి, కోవూరు, సూళ్లూరుపేట తదితర నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు తరలివెళ్లారు. జిల్లాలో ప్రజాసంకల్ప హోరు ఆంధ్రా, తమిళనాడు సంప్రదాయ రీతుల్లో స్వాగతాల నుడుమ చిత్తూరు జిల్లా నుంచి కోస్తా జిల్లాలకు సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పునబాక గ్రామంలో వైఎస్ జగన్ పాదయాత్ర గతేడాది జనవరి 23న ప్రవేశించింది. యాత్ర ప్రారంభం మొదలు జిల్లాలో ముగింపు వరకు ఆశేష జనవాహిని జననేత వెంటే అడుగులు వేశారు. పాదయాత్రకు తన కోసం తరలివచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జననేత జగన్ ముందుకుసాగారు. పూర్తిస్థాయిలో వ్యక్తిగత సమస్యలు మొదలుకొని జిల్లా సమస్యల వరకు అన్నింటినీ తెలుసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ప్రతి ఒక్కరి కష్టాలను విని తానున్నానంటూ భరోసా ఇచ్చారు. జనవరి 23న పెళ్లకూరు మండలం పునబాక గ్రామంలో జిల్లాలో మొదటి అడుగుపడి ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం నేకునాంపేటలో మలి అడుగుతో యాత్ర జిల్లాలో ముగిసి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. తొమ్మిది నియోజకవర్గాల్లో పాదయాత్ర జిల్లాలో సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి, నెల్లూరురూరల్, కోవూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లోని 14 మండలాల్లో ఉన్న 142 గ్రామాల మీదుగా 266.5 కిలోమీటర్లు పాదయాత్ర సాగించారు. అలాగే సూళ్లూరుపేటలో పెళ్లకూరు(చెంబేడు), నాయుడుపేట గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి(పొదలకూరు), నెల్లూరురూరల్(సౌత్ మోపూరు), కోవూరు(బుచ్చిరెడ్డిపాలెం), ఆత్మకూరు(సంగం), కావలి(దగదర్తి), ఉదయగిరి(కలిగిరి)లలో బహిరంగ సభలు నిర్వహించి అన్ని అంశాలతోపాటు నియోజకవర్గ ప్రధాన సమస్యలపైనా మాట్లాడారు అలాగే జిల్లాలో చేనేత, యాదవ, ఆర్యవైశ్య, ముస్లిం, మహిళలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. ఉదయగిరి నియోజకవర్గం ప్రత్యేక హోదా కీలక ప్రకటనలకు వేదికగా నిలిచింది. ప్రత్యేక హోదా భవిష్యత్తు కార్యచరణ ఇక్కడే రూపొందించి ప్రకటించారు. వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం వద్ద 1000 కిలోమీటర్ల మైలురాయి దాటి విజయ సంకల్ప స్థూపం ఆవిష్కరించారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం వద్ద 1100 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయిన సందర్భంగా 72 అడుగుల ఎత్తులో భారీపార్టీ జెండా ఆవిష్కరించారు. ఇలా జిల్లాలో జరిగిన పాదయాత్ర పలు ముఖ్య ఘట్టాలకు వేదికగా నిలిచింది. -
ప్రజా సంకల్పం.. ప్రకాశం పరవశం
కిక్కిరిసిన రహదారులు..కార్యకర్తల జగన్నినాదాలు..హారతులు పట్టే ఆడపడుచులు..అభిమానులు పరిచిన పూల బాటలుకరచాలనం కోసం పోటీపడే యువకులుఅడుగో.. అన్నొచ్చాడంటూ కేరింతలు ప్రతీ ముఖంలో కాంతిరేఖలుజన సంద్రాలైన బహిరంగ సభలు..జననేతకు ఆద్యతం జనం నీరాజనం పలికారు.జిల్లాలోని పల్లెలు, పట్టణాలు పండుగ కళను సంతరించుకున్నాయి.గత ఏడాది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో22 రోజులపాటు నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపగా.. జనానికి భరోసా ఇచ్చింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్రతో ప్రకాశం జిల్లా పరవశించింది. గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో 22 రోజులపాటు కందుకూరు, కొండపి, కనిగిరి, మార్కాపురం, సంతనూతలపాడు, దర్శి, అద్దంకి, పర్చూరు, చీరాల 9 నియోజకకవర్గాల పరిధిలో 19 మండలాలు, 124 గ్రామాలలో పాదయాత్ర సాగింది. 8 నియోజకవర్గాల లోని కందుకూరు, కనిగిరి, పొదిలి, అద్దంకి, చీమకుర్తి, తాళ్లూరు, ఇంకొల్లు, చీరాల లో బహిరంగ సభలు నిర్వహించారు. కొండపి నియోజకవర్గంలోని తిమ్మపాలెం వద్ద రైతు సదస్సు జరిగింది. మొత్తం 278.1 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. పిబ్రవరి 16 నుండి మార్చి 12 వరకూ యాత్ర సాగగా ఆద్యంతం జనం జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యమంత్రి కావాలంటూ దీవించారు. రైతులు, కార్మికులు, మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు యువత ఆయనతో కలసి అడుగులు వేశారు. వారికష్టాలు చెప్పుకున్నారు. చంద్రబాబు మోసాలను జగన్‌కు వివరించారు. వైఎస్ పాలనలో జరిగిన మేలును గుర్తు చేసుక్నునారు. ప్రజలు తమ వినతులను తెలియచేశారు. చిన్నారులకు పేర్లుపెట్టించుకుని తల్లితండ్రులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. హామీల వరాలు... ఈ జిల్లా ప్రజలకు జగన్ వరాల జల్లులు కురిపించారు. బహిరంగ సభల్లో వాటిని ప్రకటించారు.అధికారంలోకి రాగానే రామాయపట్నం పట్నం పోర్టును నిర్మిస్తామని, రాళ్లపాడు ప్రాజెక్టును సైతం పూర్తి చేసి ఈ ప్రాంతవాసులకు నీళ్లిస్తామని జగన్ కందుకూరు సభలో ప్రకటించారు. ♦ ఒంగోలు డెయిరీని అభివృద్ధి చేస్తానని, రైతులకు లీటరుకు 4 రూపాయలు సబ్సీడీ ఇచ్చి ఆదుకుంటామని కొండపిలో జరిగిన రైతుసదస్సులో జగన్ హామీ ఇచ్చారు. పొగాకు రైతులను ఆదుకుంటామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. పంటలు నష్టపోయినవారిని ఆదుకొనేందుకు ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ♦ సురక్షిత తాగునీరు అందించి కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ బాధితులను ఆదుకుంటామని కనిగిరి సభలో చెప్పారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించడంతో పాటు పింఛన్లు అందజేస్తామన్నారు. ♦ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం జిల్లాలో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని పొదిలి సభలో జగన్ హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామన్నారు. ♦ గ్రానైట్ క్వారీలతో పాటు ఫ్యాక్టరీలకు రాయల్టీలో, విద్యుత్ చార్జీల్లో సైతం సబ్సీడీ ఇస్తామని చీమకుర్తి సభలో జగన్ హామీ ఇచ్చారు. ♦ అధికారంలోకి వచ్చిన వెంటనే దొనకొండలో పరిశ్రమలు నెలకొల్పి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ♦ భవనాశి రిజర్వాయర్ పూర్తిచేసి అద్దంకి ప్రాంతానికి సాగు నీరందిస్తామని జగన్ అద్దంకి సభలో హామీ ఇచ్చారు. ♦ రైతులకు అన్ని పంటలకు గిట్టు బాటుధరలు కల్పిస్తామని ఈ ప్రాంతంలో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని జగన్ ఇంకొల్లు సభలో చెప్పారు. ♦ చేనేతలను ఆదుకుంటామని చీరాల సభలో జగన్ హామీ ఇచ్చారు. వీటితో పాటు.. ప్రభుత్వం రాగానే వారం రోజులో సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించారు. మాల మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. ఆశ వర్కర్లుకు మిగిలిన రాష్ట్రాలలో కన్నా అదనంగా వెయ్యి రూపాయలు జీతం లా అందిస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెట్టాలని కందుకూరు సభలో నిర్ణయించారు. హోదాపై పోరు కోసం ఢిల్లీ యాత్రను ప్రారంభించారు. మార్చి 12 చివరి రోజున చీరాల రూరల్ మండలం ఈపురుపాలెం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో ప్రకాశం జిల్లాలో యాత్ర ముగిసింది. -
ప్రజాసంకల్పయాత్ర చివరి రోజు
-
అనంత అడుగులన్నీ ఇచ్చాపురం వైపే
అనంతపురం సప్తగిరి సర్కిల్: 341 రోజులు..3648 కి.మీ సాగిన చారిత్రాత్మక పాదయాత్ర. ప్రజాభిమానమే దన్నుగా ఓ పథకుడు సాగించిన ‘ప్రజాసంకల్పయాత్ర’ ఈ మహోన్నత యాత్ర నేడు తుది ఘట్టానికి చేరుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నిర్వహిస్తోన్న ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు..తమ అభిమాన నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకునేందుకు అనంత వాసులంతా భారీగా తరలివెళ్లారు. ఇప్పటికే కొందరు ఇచ్చాపురం చేరుకున్నారు. ♦ అనంతపురం అర్బన్ సమన్వయకర్త అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, నాయకులు చవ్వా గోపాల్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాలక్ష్మీ శ్రీనివాస్, పెన్నోబిలేసు, మీసాల రంగన్నలతో పాటు పలువురు నాయకులు, అభిమానులు బయలుదేరారు. ♦ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వేలూరి రామాంజినేయులు, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటి సూర్యప్రకాష్‌బాబు బయలుదేరి వెళ్లిన వారిలో ఉన్నారు. ♦ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రంగేగౌడ్, మాజీ మంత్రి నర్సేగౌడ్ తదితరులు బయలుదేరి వెళ్లారు. ♦ హిందూపురం నియోజకవర్గం నుంచి సమన్వయకర్త అబ్దుల్‌ఘని, హిందూపురం పార్లమెంటు సమన్వయకర్త నదీం అహమ్మద్, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు ఇచ్చాపురం వెళ్లారు. ♦ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, జక్కల ఆదిశేషులు తదితరులు ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వెళ్లారు. ♦ కళ్యాణదుర్గం నియోజకవర్గ నుంచి సమన్వయకర్త ఉషాశ్రీచరణ్, వైఎస్సార్సీపీ జిల్లా ప్రచార విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి, నాయకులు శెట్టూరు మధుసుధన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, సుధాకర్, అశోక్, రామ్మోహన్‌రెడ్డి, కుందుర్పి నుంచి దివాకర్‌రెడ్డి, రాయుడు, బ్రహ్మసముద్రం నుంచి నరేష్, బాలయ్య, మంజునాథ్‌చౌదరి తదితరులు ఇచ్చాపురం వెళ్లారు. ♦ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జాతీయ కార్యదర్శి కడపల శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ధూపంపల్లి నరసింహరెడ్డి, కృష్ణారెడ్డి, కత్తి జయచంద్రారెడ్డి ఇప్పటికే ఇచ్చాపురం చేరుకున్నారు. ♦ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, కణేకల్లు మాజీ ఎంపీపీ రాజగోపాల్‌రెడ్డి, బొమ్మనహళ్ మాజీ ఎంపీపీ లాలుసాబ్, కణేకల్లు మాజీ జడ్పీటీసీ సభ్యుడు నాగిరెడ్డి, కాంట్రాక్టర్లు కాంతారెడ్డి, నాగభూషణం, ఇల్లూరు శ్రీనివాసులు తదితరులు పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రీకాకుళం బయలుదేరారు. ♦ గుంతకల్లు నుంచి నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకట్రామిరెడ్డి, మంజునాథరెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నబాబు, వైఎస్సార్సీపీ టౌన్ కన్వీనర్ ఎద్దుల శంకర్, పామిడి చుక్కలూరు దిలిప్‌రెడ్డి, సీఎం బాషాలు బయలుదేరారు. ♦ శింగనమల నుంచి పార్టీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి, శ్రీకాంత్, రఘునాథరెడ్డి, నాగేశ్వరరెడ్డి, పుట్లూరు రాఘవరెడ్డి, నరేష్, రామచంద్రారెడ్డి, నగేష్, సూర్యనారాయణ, నరసయ్య, పెద్దన్న వెళ్లారు. ♦ రాప్తాడు నుంచి నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రాప్తాడు జెడ్పీటీసీ సభ్యుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు మహానందరెడ్డి, గంగుల భానుమతి, రామాంజినేయులు, గోపాల్‌రెడ్డి, నాగముని, గంగుల సుధీర్‌రెడ్డి తదితరులు వెళ్లారు. ♦ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు రమేష్‌రెడ్డి, పైలా నరసింహయ్య, వీఆర్ రామిరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, యువజన విభాగం జిల్లా కార్యదర్శి జబ్బార్బాషాలు శ్రీకాకుళం బయలుదేరి వెళ్లారు. ♦ పెనుకొండ నియోజకవర్గ నుంచి సమన్వయకర్త మాలగుండ్ల శంకరనారాయణ, వైఎస్సార్సీపీ నాయకులు సుధాకర్‌రెడ్డి తదితరులు తరలివెళ్లారు. ♦ ఉరవకొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల నాయకులు పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు. అధినేతతో ‘అనంత’ నేతలు అనంతపురం సప్తగిరి సర్కిల్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారంతో ముగుస్తున్న నేపథ్యంలో ఆ మహావేడుకలో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన పలువురు నేతలు మంగళవారమే శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, వైఎస్సార్సీపీ జాతీయ కార్యదర్శి కడపల శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, కదిరి సమన్వయకర్త సిద్దారెడ్డి, పుట్టపర్తి సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, పెనుకొండ సమన్వయకర్త, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌నారాయణ పాదయాత్రలో జగన్ కలిసి ఆయన వెంట నడిచారు. -
ప్రతి అడుగూ పండగే
ఏడాది క్రితం..ఇవే రోజులు..జిల్లా అంతటా పండుగ వాతావరణం..సంక్రాంతి ముందుగానే వచ్చినంత కోలాహలం.. రోడ్ల మీద కూడా రంగవల్లులు..ప్రతి గుండెలో సందడి..ఆత్మీయ నేతను కలుస్తున్నామన్న ఆనందం..టీడీపీ పాలనలో అనుభవిస్తున్న కష్టాలను వినే నాయకుడొస్తున్నాడనే కొండంత సంబరం.. బిడ్డ నుంచి అవ్వాతాతల వరకూ అందరిలోనూ అనిర్వచనీయ అనుభూతి..రాజన్న బిడ్డ..జగన్మోహన్రెడ్డి తమ మధ్య ఉంటే పండుగ కాక మరేంటి.. గతేడాది ఇదే రోజుల్లో సంకల్పయాత్ర జిల్లా మీదుగా సాగినప్పుడు ప్రజా గుండెల్లో సంక్రాంతులు వెల్లివిరిశాయి. ఆయన ప్రతి అడుగూ మాకు పండగేనని జనం సంబరపడ్డారు. తమ కష్టాలను వైఎస్సార్సీపీ అధినేత ముందు వివరించారు. అందరి ఇంటా సంక్షేమం గూడు కట్టుకునే రోజు తొందర్లోనే రానుం దంటూ జగనన్న ఇచ్చిన భరోసాతో వారంతా మురిసిపోయారు. కాగా నేడు పాదయాత్ర ముగుస్తున్న తరుణంలో నాటి స్మృతులను గుర్తుచేసుకుంటున్నారు. రావాలి..జగన్..కావాలి జగన్ అంటూ ఆకాంక్షిస్తున్నారు. చిత్తూరు, సాక్షి: ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రతో కరువు జిల్లా పులకించింది. అలుపెరుగని అడుగులను ఆత్మీయంగా ముద్దాడింది. పట్టణం, పల్లె తేడాలేకుండా హారతులిస్తూ నీరాజనాలు పలికింది. అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా సరిహద్దుల్లోకి 2017 డిసెంబర్ 28న ప్రజాసంకల్పయాత్ర ప్రవేశించింది. 23 రోజుల పాటు 18 మండలాల్లో 291.1 కి.మీ మేర పాదయాత్ర సాగింది. మనోధైర్యం చంద్రబాబు పాలనలో పేదల బతుకులు మరింత దిగజారాయి. దగాపడ్డాయి. సంక్షేమం అమలు మొత్తం జన్మభూమి కమిటీల చేతుల్లోకి వెళ్లిపోయింది. అణగారిన బతుకులు నిలువు దోపిడీకి గురయ్యాయి. ఇలాంటి దశలో జగన్మోహన్రెడ్డి పాదయాత్ర జిల్లాలో ప్రవేశించింది. బడుగు, బలహీన వర్గాలకు కొండంత ధైర్యాన్నిచ్చింది. దళితుల జీవితాల్లో ఆశాకాంతులు నింపింది. కన్నీటి పర్యంతమవుతున్న రైతన్నను వెన్నుతట్టి ప్రోత్సహించింది. పులకించిన కరువు నేల ప్రజాసంకల్పయాత్రతో కరువునేల పులకించింది. పాదయాత్ర మొదలైనప్పటి నుంచి రైతులు అడుగడుగునా వెనుదన్నుగా నిలిచారు. ఎద్దులవారి కోట దగ్గర టమాట రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో వారు ఉప్పొంగిపోయారు. జిల్లాలోని పది లక్షల మంది పాడి రైతులకు రూ.4 రాయితీతో లబ్ధిచేకూర్చుతామని జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువులో జరిగిన రచ్చబండలో సీఎంపై విమర్శలు ఎక్కుపెట్టారు. సొంత ఊరికి కూడా ఏమీ చేయలేని చంద్రబాబు ప్రజలకేం చేస్తారని మండిపడ్డారు. దళితుల నుంచే భూపంపిణీ సత్యవేడులో ఎస్సీ, ఎస్టీలతో ఆత్మీయ సదస్సు నిర్వహించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. భూ పంపిణీ కూడా దళితుల నుంచే మొదలు పెడతామని హామీ ఇచ్చారు. 10 వేల మంది ఉద్యోగులకు లబ్ధి ఆర్టీసీ విలీన ప్రకటన జిల్లాలోనే వెలువడింది. సదుంలో జరిగిన బహిరంగ సభలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జననేత హామీ ఇచ్చారు. ఈ హామీ జిల్లాలోని పది వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. అమ్మలో నమ్మకం..అవ్వాతాతల్లో ధైర్యం ‘కొడుకులు సరిగా చూసుకోలేదు నాయనా.. పింఛన్ మందులుమాకులకే సరిపోవడం లేదు’ అని ఓ అవ్వ రెడ్డిగుంట వద్ద జగన్‌ను కలిసి కన్నీటి పర్యంతమైంది. అవ్వ ఆవేదన జగన్‌ను కదిలించింది. మన ప్రభుత్వం వస్తూనే పెన్షన్ రూ.2 వేలు చేస్తానని హామీ ఇచ్చారు. కొడుకులు కూతుళ్లు చూసుకోలేకపోతే.. ప్రభుత్వమే ఆదుకునే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 45 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పడంతో కొండంత ఊరటనిచ్చింది. చిత్తూరు, చంద్రగిరి: వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభంకావడంతో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. నియోజకవర్గంలో సుమారు 52 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో అడుగడుగునా వినూత్నరీతిలో స్వాగతాలు పలుకుతూ, రాష్ట్రంలోనే ఎవరూ చేయలేని రీతిలో ఏర్పాట్లను చేశారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నిపుణులతో భారీ స్వాగత ఆర్చ్‌లను ఏర్పాటు చేశారు. వందలాది మంది మహిళలు రోడ్డుకిరువైపులా నిల్చొని అపూర్వ రీతిలో గుమ్మడికాయలు కొట్టి దిష్టి తీశారు. పాదయాత్రకు మద్దతుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా వచ్చాడా..? అన్న రీతిలో ఒకేసారి 99 మంది వైఎస్సార్ విగ్రహాలను మాస్క్‌లుగా ధరించి జననేతతో పాటు పాదయాత్రలో నడిచారు. రామచంద్రాపురం మండలంలో నిర్వహించిన రైతు సదస్సుకు వందలాది ట్రాక్టర్లలో రైతులు వచ్చి ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. విరిసిన సంక్రాంతులు చంద్రగిరి: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గత ఏడాది చంద్రగిరి నియోజకవర్గంలో వారం రోజుల పాటు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన యాత్రను కొనసాగించారు. సంక్రాంతి పండుగను సైతం ఆయన నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం రావిళ్లవారిపల్లిలో అట్టహాసంగా జరుపుకున్నారు. ఆయన బస చేసిన పల్లె పరవశించింది. రంగవల్లులు, గొబ్బెమలు, డూడూ బసవన్నలతో ఆ ప్రాం తమంతా కోలాహలంగా మారింది. కుటుంబ సభ్యులతో కలసి మూడు రోజుల పాటు ఆయన ఇక్కడే సంక్రాంతి వేడుకలను జరుçపుకున్నారు. పల్లె పండుగ పరవశించింది పెద్ద పండుగ జరుపుకోవడానికి అనుకోని అతిథిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఆయన బసచేసే ప్రదేశానికి చేరుకున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆ ప్రాంతమంతా సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా భారీ ఏర్పాట్లను చేశారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన జగనన్నకు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. పుంగనూరు గోవు బçహూకరణ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన అభిమాన నాయకుడికి పుంగునూరు గోవును బహూకరించారు. గోవును చూసి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మురిసిపోయారు. ఆప్యాయంగా అరటిపండు తినిపించారు. మనసున్న మారాజు వడమాలపేట: వడమాలపేట మండల పరిధిలోని పచ్చికాల్వ పంచాయతీకి చెందిన షేక్ ముజీబ్ బాషాది రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. ఇతని రెండేళ్ల కుమారుడు షేక్ రిహానాకు పుట్టినప్పటి నుంచి వినికిడి సమస్య. ఆపరేషన్‌కయ్యే ఖర్చును భరించే స్థోమత లేదు. గతేడాది జనవరి 16న సంకల్పయాత్రలో జగన్మోహన్రెడ్డికి బాషా దంపతులు తమ గోడు వినిపించారు. రిహానాకు ఆపరేషన్ చేయిస్తానని జననేత మాట ఇచ్చారు. గత ఏడాది ఏప్రిల్ 23న హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం రిహానా వినగలుగుతున్నాడు. ఆపరేషన్ ఖర్చును జగన్ భరించారు. ఆయన పెద్ద మనసుకు తామెప్పుడూ రుణపడి ఉంటామని బాషా దంపతులు చెబుతున్నారు. మా జీవితాల్లో వెలుగులొస్తాయ్ చిత్తూరు కార్పొరేషన్: వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే.. తమ జీవి తాల్లో వెలుగులొస్తాయని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఆశాభావం వ్యక్తం చేశా రు. గత ఏడాది పూతలపట్టు నియోజకవర్గం తలుపులపల్లె వద్ద డిమాండ్ల సాధన కు ఉద్యోగులు దీక్ష చేశారు. అటువైపు పాదయాత్రగా వెళ్తున్న జగన్మోహన్రెడ్డి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడికి వినతిపత్రం ఇచ్చి.. తమకు న్యాయం చేయాలని కోరినట్లు కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ జిల్లా నాయకుడు సుధాకర్ తెలిపారు. సంస్థ ద్వారా నేరుగా వేతనాలు చెల్లించి, దశలవారీగా ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఈ సందర్భంగా జగనన్న హామీ ఇచ్చారన్నారు. మహానేత వైఎస్సార్ హయాంలో ఉద్యోగుల జీతాలు పెంచి 7,000 మందిని ఒకేసారి క్రమబద్ధీకరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. -
పాదయాత్ర సక్సెస్‌కు కారణం అదే: పృథ్వీ
సాక్షి, ఇచ్ఛాపురం: వైఎస్ జగన్ పాదయాత్ర విజయవంతం కావడానికి ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యమే కారణమని సినీ నటుడు పృథ్వి అన్నారు. తమ సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వాన్ని ఓటుతో సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మరో నటుడు కృష్ణుడుతో కలిసి ఆయన ‘సాక్షి’ టీవీతో మాట్లాడారు. ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో వైఎస్ పాదయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. సమస్యలు తీర్చే ప్రజా నాయకుడు తమ ముందుకు వచ్చాడన్న నమ్మకం ప్రజల్లో వచ్చిందన్నారు. మహానేత వైఎస్సార్ లేని లోటు తీరుస్తారన్న భరోసా జనానికి కలిగిందన్నారు. ప్రజాసంకల్పయాత్రలో లక్షలాది మంది స్వచ్ఛందంగా ప్రతిరోజు జగన్ వెంట నడిచారని వెల్లడించారు. దేశ చరిత్రలో ఏ కుటుంబం కూడా వైఎస్సార్ కుటుంబంలా పాదయాత్ర చేయలేదని పృథ్వి గుర్తు చేశారు. చంద్రబాబు విఫలం: కృష్ణుడు టీడీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని నటుడు కృష్ణుడు అన్నారు. ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారని అభిప్రాయపడ్డారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున తమ సమస్యల గురించి చెప్పుకున్నారని తెలిపారు. ప్రజాసంకల్పయాత్రతో వైఎస్ జగన్ పరిపూర్ణమైన నాయకుడిగా ఎదిగారని ప్రశంసించారు. ప్రజల కోసం వైఎస్సార్ కుటుంబం ఎంతో చేసిందన్నారు. -
సిక్కోలు మదిలో చెరగని గురుతులు
పది నియోజకవర్గాల్లో పల్లె వేదికగా పాదయాత్ర వేడుక కొనసాగింది. ప్రజా సంకల్ప యాత్ర సిక్కోలు మదిలో చెరగని గురుతులు నిలిపింది. సర్కారు నిర్లక్ష్యానికి బలైపోయిన ప్రజలకు తమ బాధలు చెప్పుకోగలిగే అవకాశం ఇచ్చింది. ప్రభుత్వ నిరంకుశత్వానికి శిథిలమైపోయిన కుటుంబాలకు కన్నీరు తుడిచే నాయకుడిని చూపించింది. పన్నెండు జిల్లాల్లో దిగ్విజయంగా పాదయాత్ర నిర్వహించుకుని చివరి జిల్లాలో అడుగుపెట్టిన జగన్మోహనుడి ఆత్మీయ పలకరింపునకు సిక్కోలు ఫిదా అయిపోయింది. అడుగు అడుగునా అండగా నిలుస్తూ జనం రాజన్న బిడ్డకు నీరాజనం పలికారు. ప్రతి పలుకునకూ ప్రతిస్పందిస్తూ, పిలుపులను నినాదాలుగా మారుస్తూ పాదయాత్రను విజయవంతం చేశారు. ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఏడాది నవంబర్ 25న పాలకొండ నియోజకవర్గంలోని వీరఘట్టం మండలం కడకెల్ల వద్ధ జిల్లాలో తొలి అడుగు వేశారు. పాలకొండ నియోజకవర్గం నుంచి ఇచ్ఛాపురం వరకు కొనసాగిన ఈ పాదయాత్రలో తన వద్దకు వచ్చిన అన్ని వర్గాల వారినీ ఆప్యాయంగా పలకరించారు. వివిధ సామాజిక వర్గాలతో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి సమస్యలు వినిపించగా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. గిరిజనుల అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర, ఆమదాలవలస సుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, తిత్లీ తుఫాన్ బాధితులకు పరిహారం పెంపు, ఉద్దాన కిడ్నీ బాధితులకు పింఛన్.. ఇలా బాధితులందరికీ న్యాయం చేస్తానంటూ ఇచ్ఛాపురం వరకు ప్రజా సంకల్పయాత్రను కొనసాగించారు. పాలకొండ పాదయాత్ర జరిగిన తేదీలు: నవంబర్ 25 నుంచి 29 వరకు నడిచిన దూరం: 34 కిలోమీటర్లు వీరఘట్టం/పాలకొండ: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామంలో నవంబర్ 25న తొలి అడుగు వేశారు. ఐదు రోజుల పాటు జరిగిన పాదయాత్రలో స్థానిక సమస్యలు వింటూ బాధితులకు భరోసా ఇచ్చారు. ఉద్యోగులకు సంబంధించి సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజనోత్పత్తులకు గరిష్ట మద్దతు ధర కల్పించి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటించారు. రాజాం పాదయాత్ర జరిగిన తేదీలు:డిసెంబర్ 1 నుంచి 4 వరకు నడిచిన దూరం: 37.5 కిలోమీటర్లు రాజాం : నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు పాదయాత్ర సాగింది. డిసెంబర్ 3న రాజాం పట్టణ కేంద్రంలో జరిగిన సభలో విద్యారంగంలో పెరిగిన ఫీజులపై జననేత ప్రస్తావించారు. హెల్త్ అసిస్టెంట్లు తమకు ఉద్యోగ భద్రత లేదని చెప్పగా వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని చెప్పారు. సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలు, ఇండీట్రేడ్ బ్రోకర్ బాధితుల కష్టాలు.. ఇలా అన్ని వర్గాల సాధకబాధకాలను విని భరోసా కల్పించారు. టెక్కలి పాదయాత్ర జరిగిన తేదీలు:డిసెంబర్ 18 నుంచి 23 వరకు తిరిగిన దూరం: 46.2 కిలోమీటర్లు టెక్కలి: మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లుగా టీడీపీ కార్యకర్తలు చేసిన అరాచకాలు, అవినీతి కార్యకలాపాలను ప్రజలు ధైర్యంగా ప్రతిపక్ష నేత దష్టికి తీసుకువచ్చారు. పింఛన్లు అందక కొంత మంది, రేషన్ అందక మరికొంతమంది, జన్మభూమి కమిటీ సభ్యుల ఆగడాలకు బలైపోయిన బాధితులు జగన్‌కు కన్నీటి రూపంలో విన్నపాలు చేసుకున్నారు. 22న రావివలస గ్రామం నుంచి బర్మాకాలనీ, గోపినాథపురం, టెక్కలి వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. ఇదే సందర్భంలో పాదయాత్ర 3500 కిలోమీటర్లు మైలు రాయి చేరుకుంది. రావివలస గ్రామంలో మూతపడిన మెట్కోర్ ఫెర్రోఎల్లాయ్సెస్ పరిశ్రమ వద్ద కార్మికులను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఎచ్చెర్ల పాదయాత్ర జరిగిన తేదీలు: డిసెంబర్ 4 నుంచి 8 వరకు తిరిగిన దూరం: 17 కిలోమీటర్లు రణస్థలం: జి.సిగడాం మండలం గేదెలపేట వద్ద ప్రజానేతకు ఘనంగా స్వాగతం పలికారు. డిసెంబర్ 6న చిలకపాలెంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి కళా వెంకటరావు అవినీతి చరిత్ర, దౌర్జన్యకాండను జగన్ ఎండగట్టారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన తీరు, తోటపల్లి కాలువ పనుల్లో జాప్యం, అంబేడ్కర్ యూనివర్సిటీ సమస్యలు.. ఇలా అన్ని సమస్యలు ప్రస్తావించారు. ఆమదాలవలస పాదయాత్ర జరిగిన తేదీలు:డిసెంబర్ 5 నుంచి 12 వరకు నడిచిన దూరం: 34 కిలోమీటర్లు ఆమదాలవలస: పొందూరు మండలంలో ఖాదీ కార్మికులు జగన్‌ను కలిసి కష్టాలు వివరించగా, పొందూరులో ఖాదీ పరిశ్రమ నిర్మాణానికి చర్యలు చేపడతామని జగన్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 10, 11 12 తేదీల్లో ఆమదాలవలస పట్టణం, మండలంలో ప్రజా సంకల్పయాత్ర కొనసాగింది. ఆమదాలవలస పట్టణంలో జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ మూతపడిన సుగర్‌ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. నరసన్నపేట పాదయాత్ర జరిగిన తేదీలు: డిసెంబర్ 15 నుంచి 18 నడిచిన దూరం: 21 కిలోమీటర్లు నరసన్నపేట: మడపాం వద్ద వంశధార నది సాక్షిగా నరసన్నపేట నియోజకవర్గంలోనికి వచ్చిన జగనన్నకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. 16న నరసన్నపేటలో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రభుత్వ విధానాలను, వైఫల్యాలను ఎండగట్టారు. నరసన్నపేట చరిత్రలోనే ఇంత భారీగా ప్రజలు పాల్గొన్న సభ ఇదేనని స్థానికులు చెబుతున్నారు. 18న చల్లపేట మీదుగా చిన్న కిట్టాలపాడు వరకూ దిగ్విజయంగా సాగిన ప్రజాసంకల్పయాత్ర టెక్కలి నియోజకవర్గంలోనికి ప్రవేశించింది. 17న పొందరులు, అగ్రికల్చరల్ విద్యార్థులు కలసి తమ సమస్యలను వివరించారు. పాతపట్నం పాదయాత్ర జరిగిన తేదీలు: డిసెంబర్ 23 నుంచి 29 నడిచిన దూరం: 33.6 కిలోమీటర్లు ఎల్.ఎన్.పేట: తమకు అండగా ఉండాలని ఆటో డ్రైవర్లు, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, సమస్యలు పరిష్కరించాలని జీడి పరిశ్రమల కార్మికులు.. ఇలా అన్ని వర్గాల వారు ప్రజానేతకు సమస్యలు చెప్పుకున్నారు. 24న మెళియాపుట్టి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో అధికార పార్టీ వైఫల్యాలను, ఫిరాయింపు ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టారు. శ్రీకాకుళం పాదయాత్ర జరిగిన తేదీలు:డిసెంబర్ 8 నుంచి 12 వరకు నడిచిన దూరం: 25.8 కిలోమీటర్లు శ్రీకాకుళం: నియోజకవర్గంలో ఐదు రోజుల పాటు జరిగిన పాదయాత్రలో పలు వర్గాల ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్నారు. 8న శ్రీకాకుళం నగరంలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రుణంపై ఇళ్లను ఇస్తోందని, తాను మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన వెంటనే రుణం రద్దు చేస్తానని పేదలకు హామీనిచ్చారు. కళింగ కోమట్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని ప్రకటించారు. వెలమ, కాళింగ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నైరలో వ్యవసాయ కళాశాల విద్యార్థులను కలిసి సమస్యలను తీర్చేందుకు హామీనిచ్చారు. పలాస పాదయాత్ర జరిగిన తేదీలు: డిసెంబర్ 29 నుంచి జనవరి 2 నడిచిన దూరం: 44 కిలోమీటర్లు కాశీబుగ్గ: పలాస నియోజకవర్గంలోకి రేగులపాడులో ఆఫ్‌షోర్ వద్ద ప్రజాసంకల్పయాత్ర ప్రవేశించింది. 30న జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ జీడి కార్మికులకు పది వేలు పింఛన్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, తిత్లీ బాధితులకు చెట్టుకు రూ.3వేలు, హెకార్టు జీడికి రూ.50వేలు పరిహారం అందిస్తామని ప్రకటించారు. 1న వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానంలో తిత్లీ ప్రభావిత ప్రాంతంలో పాదయాత్ర కొనసాగించారు. దారి పొడవునా బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి తీవ్రతను పరిశీలించిన ప్రతిపక్ష నేత చలించిపోయారు. దీంతో కిడ్నీ రోగులకు 250 పడకలతో పరిశోధనా కేంద్రం, ఆస్పత్రి, కిడ్నీ రోగులకు రూ.10 వేలు పించన్ మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇచ్ఛాపురం పాదయాత్ర ప్రారంభమైన తేదీ: జనవరి 2 నడిచిన దూరం: 50 కిలోమీటర్లు కంచిలి: రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఇచ్ఛాపురం నియోజకవర్గంలో జనవరి 2న సోంపేట మండల సరిహద్దు రాణిగాం గ్రామకూడలి వద్ద ప్రారంభమైంది. కంచిలి, కవిటి మండలాల మీదుగా సాగింది. తిత్లీ పరిహారంలో జరిగిన అన్యాయాన్ని ప్రజలు వివరించారు. అధికార పార్టీ నేతల అరాచకాలు, సంక్షేమ పథకాల అమలులో వివక్ష చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తానంటూ జగన్ భరోసా ఇచ్చారు. 9న కొత్తకొజ్జిరియా నుంచి మొదలై పైలాన్ ఆవిష్కరణ అనంతరం ఇచ్ఛాపురం బస్టాండు కూడలిలో బహిరంగ సభతో పాదయాత్ర ముగియనుంది. -
జనంలో ఎదిగిన నాయకుడు జగన్: గట్టు
సాక్షి, హైదరాబాద్: ప్రజల కోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్రను విజయవంతంగా పూర్తి చేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచంద్రరావు అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్ తొలుత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా గుర్తింపు పొందినప్పటికీ ఆయన ప్రజల మధ్యలోనే ఎదిగారని, ప్రజలలోనే పెరిగారని ఆయన అభిప్రాయడ్డారు. ప్రజలను నమ్ముకున్న ఏ నాయకుడు కూడా నష్టపోడని, ప్రజలు లేకపోతే తానులేనుకునే నాయకుడు జగన్ అని ఆయన కొనియాడారు. వైఎస్ జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం ‘సాక్షి టీవీ’తో రామచంద్రరావు మాట్లాడారు. సొంత పార్టీ పెట్టుకుని ప్రజల అభిమానాలు, ఆదరణను జగన్ పొందారని అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిస్తే కేవలం 5 లక్షల 40వేల ఓట్లు మాత్రమే వైఎస్సార్సీపీ కంటే ఎక్కువగా వచ్చాయని, బీజేపీ లేకపోతే అన్ని ఓట్లు కూడా రావని వెల్లడించారు. కేవలం ఒక్క ఎమ్మెల్యేతో సొంత పార్టీని స్థాపించి నేడు 67 మంది ఎమ్మెల్యేలు, తొమ్మిది మంది ఎంపీలు సాధించి ఏపీలో బలమైన నేతగా జగన్ ఎదిగారని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో తనకు బలం సరిపోదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో పొత్తుల కోసం ప్రయత్తిస్తున్నారని, ఏపీలో కూడా టీడీపీకి బలం సరిపోదని చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందే వైఎస్ జగన్ ముందు చంద్రబాబు ఓడిపోయారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికలు జగన్, ఆయన వ్యతిరేకుల మధ్యనే జరుగుతాయని, భవిష్యత్తులో ఆయనకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నట్లు గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. -
గమ్యం వైపు..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రజాక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పం దిగ్విజయంగా ఫలించాలని, కోట్లాది మంది జనం సంకల్ప మేవ జయతే అంటూ నినదిస్తున్నారు. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించిన పాదయాత్ర అటు రాయలసీమ నుంచి ప్రారంభమై ఇటు ఉద్దాన సీమ వరకు దిగ్విజయంగా సాగింది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం పాదయాత్ర జనసందోహం నడుమ సాగింది. ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో ఉద్దాన ప్రాంత పల్లె జనం జగన్మోహన్రెడ్డికి జనహారతులిచ్చి స్వాగతాలు పలికారు. ముఖ్యంగా కవిటి, రాజపురం తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో ఈ ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారాయి. ఈ క్రమంలో అడుగడుగునా జనం తమ సమస్యలు విన్నవిస్తుంటే వారి బాధలను ఓపిగ్గా వింటూ తనదైన శైలిలో జగన్ వారికి భరోసా ఇచ్చి, భవిష్యత్‌పై ఆశలు చిగురించారు. పాదయాత్ర నేటితో (బుధవారం) ముగింపునకు చేరుకున్నందున మంగళవారం యాత్రకు ప్రత్యేకత సంతరించుకుంది. ఎలాగైనా జగనన్నను కలవాలని, ఆయనతో కరచాలనం చేయాలని, సెల్ఫీ తీయించుకోవాలని యువకులు, మహిళలతో పాటు వైఎస్సార్సీపీలో వివిధ విభాగాల శ్రేణులు కూడా పోటీపడ్డారు. యాత్ర తుది లక్ష్య స్థలమైన ఇచ్ఛాపురం భారీ ఏర్పాట్లతో ముస్తాబైంది. బ్రహ్మరథం పలికిన ఉద్దానం ప్రజలు పేద, సామాన్య జనాల సంక్షేమం కోసం, అలాగే రాష్ట్రంలో ‘నారా’సుర పాలనకు అంతమొందించాలని జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు ఉద్దాన ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తిత్లీ తుపానుతో సర్వం కోల్పోయిన వేలాది మంది బాధితులు తమకు అండగా జగనన్న ఉంటాడన్న విశ్వాసంతో యాత్రలో జగన్ వెంట అడుగులు వేశారు. దీంతో ఉద్దాన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో ఉద్దాన ప్రాంత ప్రజలు భారీ సంఖ్యలో జగన్‌కు స్వాగతాలు పలికారు. కవిటి మండల కేంద్రంతో పాటు రాజపురం, అగ్రహారం తదితర ప్రాంతాల్లో కూడా జనం స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో తరలిరావడంతో అధికార పక్ష నేతలకు చెమట్లు పట్టాయి. ప్రజాసంకల్పయాత్రలో నేతల హోరు.. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం పలువురు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నేతలు జగన్‌తో కలిసి కొంతదూరం అడుగులు వేశారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ విషయాలను చర్చిస్తూనే, బుధవారం ముగింపు సందర్భంగా ఏర్పాట్లపై జగన్‌తో ముఖ్య నేతలు చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 80 నియోజకవర్గాలకు చెందిన ప్రముఖ నేతలు, కీలక నియోజకవర్గాల సమన్వయకర్తలు జగన్‌ను కలవడంతో ఉద్దాన ప్రాం తంలో నేతల జోరు, హోరు కనిపించింది. పార్టీ ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, కోలగట్ల వీరభద్ర స్వామి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ఎంపి మిధున్‌రెడ్డి, గంగుల ప్రభాకరరెడ్డి, జి.అమర్నా«ధ్‌రెడ్డి తదితరులు జగన్‌తో కాసేపు నడిచారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర పార్టీల ప్రధాన కార్యదర్శులు తలశిల రఘురాం, రెడ్డి శాంతి, పాలకొండ, కురుపాం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, పలాస, టెక్కలి నియోజకవర్గాల సమన్వయకర్తలు సీదిరి అప్పలరాజు, పేరాడ తిలక్, మాజీ ఎమ్మెల్యే నరేష్కుమార్ అగర్వాలా (లల్లూ), పార్టీ రాష్ట్ర సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నర్తు రామారావు, ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజేశ్వరి, ఇచ్ఛాపురం నియోజకవర్గ మహిళా విభాగ కన్వీనర్ పిరియా విజయ, పలాస పిఎసిఎస్ అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్ (బాబా), రాష్ట్ర పార్టీ వివిధ విభాగాల నేతలు తమ్మినేని చిరంజీవినాగ్, ధర్మాన కృష్ణ చైతన్య, ఎన్ని ధనుంజయ, కామేశ్వరి, మామిడి శ్రీకాంత్ తదితరులు మంగళవారం నాటి యాత్రలో పాల్గొని జగన్‌కు సంఘీభావం ప్రకటించారు. సురక్షిత నీరు అందిస్తా.. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులను అన్ని రకాలుగా ఆదుకుంటామని, వీరి ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతామని జగన్ హామీ ఇచ్చారు. భూగర్భ జలాలే ఇక్కడ కిడ్నీ రోగాలకు ఓ ప్రధాన కారణంగా చెబుతున్న నేపథ్యంలో సమీపంలో ఉన్న పలు నదుల ఉపరితల నీటిని ఉద్దాన ప్రాంతాలకు రప్పించి, సురక్షిత నీటిని సరఫరా చేస్తామని జగన్ ప్రకటించడంతో ఉద్దాన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం జగన్ పాదయాత్రను కవిటి మండలం కవిటి కొత్తూరు క్రాస్ నుంచి ప్రారంభించగా, కవిటి పట్టణం మీదుగా, తొత్తిడి పుట్టుగ, బొర్రపుట్టుగ, చెండి పుట్టుగ, రాజపురం మీదుగా అగ్రహారం వరకు యాత్ర సాగింది. ఈ ప్రతి తోవ జనవెల్లువగా మారింది. యాత్రలో భాగంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెద్ద సంఖ్యలో జగన్‌ను కలిసి తమ గోడును వివరించారు. ఈ సందర్భంగా జగన్ స్పందిస్తూ.. కిడ్నీ వ్యాధులతో వేలాది మంది చనిపోతున్నా, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలాస కేంద్రంగా 200 పడకల ఆస్పత్రిలో కేవలం కిడ్నీ రోగులకు చికిత్సలు చేయిస్తామని, అలాగే కిడ్నీ రోగులకు ప్రతి నెల వైద్య ఖర్చుల కోసం రూ.10 వేలను పింఛనుగా అందజేస్తామని ప్రకటించారు. అలాగే మూడో దశలో ఉన్న వ్యాధి గ్రస్తులకు పూర్తిగా పోషకాహారాన్ని అందించేలా చర్యలు చేపడతామని కూడా వివరించారు. అలాగే ఈయాత్రలో తిత్లీ తుపాను బాధితులు, కొబ్బరి, జీడి రైతులు, సామంతులు, కండ్ర, బ్రాహ్మణ, కాపు తదితర కులాల ప్రతినిధులు కూడా జగన్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. అలాగే జగనన్న చేసిన సహాయంతో తన కుమారుడు లోకేష్‌కు బ్రెయిన్‌ట్యూమర్ వ్యాధికి ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తయ్యిందని, రూ.6 లక్షల విలువైన ఈ ఆపరేషన్‌ను ఉచితంగా చేయించి, నా కొడుక్కి మరో జన్మనిచ్చారని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం కొత్తగూడెంకు చెందిన వెంకట రాంబాబు తన ఆనందాన్ని జగనన్న వద్ద వ్యక్తం చేశారు. -
మత్స్యకారులపై కక్ష
శ్రీకాకుళం: ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో 5వ వార్డులో మత్స్యకారులంతా వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్నారని పాలకులు కక్ష సాధిస్తున్నారు. స్వదేశీ మత్స్యకారుల కో ఆపరేటివ్ సొసైటీ చెరువుల్లో రొయ్యలు, చేపలు పెంచుతూ జీవనం సాగిస్తున్నాం. మొత్తం 333 మంది ఈ సొసైటీలో సభ్యులుగా ఉండేవారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులను తొలగించి, కేవలం 46 మంది టీడీపీ మద్దతుదారులతోనే ప్రస్తుతం ఈ సొసైటీ నిర్వహిస్తున్నారు. దీనిపై నిలదీస్తే కక్ష సాధిస్తున్నారు. అక్రమంగా పోలీస్ కేసులు పెడుతున్నారు.– మేఘనాథ్ బెహరా, ఇచ్ఛాపురం -
సహాయం కావాలి
శ్రీకాకుళం: ఉద్దానం కిడ్నీ బాధితులకు సహాయ చర్యలు చేపట్టాలి. పూర్తిస్థాయి రోగులకు అవసరమైన డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆర్థికంగానూ ఆదుకోవాలి. కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసి వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టాలి.– కమల పోడియా, తొత్తిడిపుట్టుగ, కవిటి మండలం. -
బిడ్డను ఆదుకోండి
శ్రీకాకుళం:నా బిడ్డ దీపక్ గత ఆరేళ్లుగా అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. వయసు పెరుగుతున్నా మానసిక ఎదుగుదల లేదు. మాటరాదు, నడవలేడు. ఎన్నో ఆస్పత్రుల కు తీసుకువెళ్లాం. ఫలితం లేదు. నా భర్త దేవేంద్ర ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మందుల ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతున్నాం. జగన్‌పై నమ్మకంతో వచ్చాం.– అనంత పార్వతి, కవిటి గ్రామం, సోంపేట మండలం. -
బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేర్చాలి
శ్రీకాకుళం: బెంతు ఒరియా కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి. 2005 వరకు బెంతు ఒరియాలకు రెవెన్యూ శాఖ ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసింది. ఇప్పుడు 1951 జనాభా లెక్కలు తెస్తే పరిశీలిస్తామని ప్రభుత్వం చెబుతోంది. సుప్రీంకోర్టు కూడా ఎస్టీల్లో చేర్చాలని తీర్పునిచ్చింది. జీవో నంబర్ 371 అమలు చేస్తే బెంతు ఒరియాలకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతాయి.– డాక్టర్ దామోదర్ ప్రధాన్, మెళియాపుట్టి. -
సామంత కులాన్ని ఆదుకోండి
శ్రీకాకుళం: జిల్లాలో 40వేలు జనాభా కలిగిన సామంత కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్పించాలి. ఓసీ కేటగిరిలో ఉన్న మా కులాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి 2005లో బీసీ–ఏ కేటగిరిలో చేర్చారు. మేమంతా ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత ఉండడం లేదు. మా కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్పించి ఆదుకోవాలి.– కె.కొత్తూరు వాసులు, కవిటి మండలం -
నా బిడ్డను రక్షించండి
శ్రీకాకుళం: ఐదేళ్ల నా బిడ్డ దవళ సాగర్ బెహరా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్లం. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. నెలనెలా రూ.10 వేలు అప్పుగా వా డుకొని విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి వైద్యం కోసం తీసుకువెళుతున్నాం. మూడేళ్లుగా వ్యాధి తో బాధపడుతున్న నా కొడుకును ఆదుకోవాలి.– సాగర్బెహరాతో తల్లిదండ్రులు దుర్యోధన, లక్ష్మి, కవిటి -
టీడీపీ దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి
శ్రీకాకుళం: మేము చేపల వేట చేసుకుని బతుకుతున్నాం. మేము నివసిస్తున్న వీధిలో టీడీపీ వారు ఇబ్బం ది పెడుతున్నారు. పంచాయతీ స్థలం ఉన్నా మా ఇంటికి ఎదురుగా ట్యాంకు నిర్మించి దారిలేకుండా చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అందనీయడం లేదు.– కండ్ర వీధి కండ్ర కులస్తులు,కవిటి ఆపరేషన్ అవసరం శ్రీకాకుళం: నా బిడ్డ రుషికేశవ బెహరాకు గుండె ఆపరేషన్ చేయించి ఆదుకోవాలి. తొలుత కిడ్నీ సంబంధి త వ్యాధి వచ్చింది. గత కొన్నేళ్లుగా గుండె సంబంధిత వ్యాధి కూడా వచ్చిందని వైద్యులు చెబు తున్నారు. నా బిడ్డకు ఆపరేషన్ చేయించి ఆదుకోవాలి– రుషికేశవ్ బెహరాతో తండ్రి నర్సుతం బెహరా, కవిటి. గొడౌన్ తరలింపు తగదు కవిటి సివిల్ సప్లయ్ గొడౌన్ తరలింపు నిలిపివేయించాలి. టీడీపీ ప్రభుత్వం సివిల్‌సప్లయ్ గొడౌన్‌ను తరలిస్తోంది. ఇది తరలిస్తే ముప్పై ఏళ్లుగా పనిచేస్తున్న హమాలీలు ఉపాధి కోల్పోతారు. – బొర్ర బాలకష్ణ, హమాలీ, కవిటి -
పోరాటం కొనసాగుతూనే ఉంటుంది: వైఎస్ జగన్
చరిత్రాత్మక ప్రజాసంకల్పయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.. ఆయన ఏమన్నారంటే.. యుద్ధం నారాసురుడు ఒక్కడితోనే కాదు.. ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు పాలించాలనేది నాకున్న సంకల్పం. నా పాలన చూసి.. నాన్న ఫోటోతోపాటు నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలన్నది నా ఆశ . నవరత్నాలను ప్రతి ఇంటికీ చేర్చి.. వాటి మేలును ప్రతి ఒక్కరికీ చెప్పండి. అవి జనంలోకి తీసుకెళితే.. చంద్రబాబు నాయుడు ఎంత డబ్బులిచ్చినా.. ప్రజలు ఓటు వేయరు. ఈ 14 నెలలు పేదవాడితోనే ఉన్నాను. వారి కష్టాలు వింటూనే.. వారికి భరోసా ఇస్తూనే నడిచాను. ప్రతి పేద వాడికి మంచి చేయాలనే తపన ఉంది. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు బయలుదేరిన మీ బిడ్డకు తోడుగా ఉండమని, ఆశీర్వదించమని కోరుతున్నాను. ప్రజాసంకల్పయాత్ర ఇంతటితో ముగుస్తున్నా.. పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉంది. మనం యుద్దం చేసేది నారాసురుడి ఒక్కడితోనే కాదు ఎల్లో మీడియాతో కూడా యుద్ధం చేయాలి. జిత్తులు మారిన చంద్రబాబు అనేక పొత్తులు పెట్టుకుంటాడు. ప్రజల దీవెనలతో చంద్రబాబు మోసాలను, అన్యాయాలను జయిస్తా. చిలుకా గోరింకలు తలదించుకునేలా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 ఎమ్మెల్యేలను చంద్రబాబు సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు. ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేసి నలుగురిని మంత్రులుగా చేశారు. ప్రత్యేక హోదాను ఖూనీ చేసి.. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేశాడు. టీడీపీ ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా కొనసాగారు. నాలుగేళ్లు హోదా ఇవ్వకపోయినా చంద్రబాబు బీజేపీని పొగిడారు. ప్రత్యేక హోదాను వెటాకారం చేస్తూ అసెంబ్లీలో మాట్లాడారు. హోదా కోసం పోరాడితే జైల్లో పెట్టిస్తానని అంటారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అని హోదా కోసం మాట్లాడేవారిని ప్రశ్నించారు. చిలుక, గోరింకలు తలదించుకునేలా టీడీపీ, బీజేపీ ప్రేమ కొనసాగింది. ఎన్నికలు వచ్చేటప్పటికీ రంగులు మారుస్తున్నారు. ఎన్నికలకు మూడు నెలలు ముందే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొస్తారు. ఎన్నికల దగ్గరకు వచ్చే సమయానికి రాష్ట్ర సమస్యలను వదిలేసి మీడియా మేనేజ్మెంట్ చేస్తున్నారు. ప్రజలకు ఏం చెయ్యకపోయినా.. చేసినట్లు ఎల్లో మీడియా గ్లోబెల్ ప్రచారం చేస్తుంది. చెడిపోయిన రాజకీయ వ్యవస్థని మార్చాలంటే.. చెడిపోయిన రాజకీయ వ్యవస్థని మార్చాలంటే జగన్‌కు మీ అందరి దీవెనలు కావాలి. రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తాం. కలెక్టర్లు ఏడు నియోజకవర్గాలకే బాధ్యుడిగా ఉంటే.. ప్రజలకు అందుబాటులో ఉంటారు. కలెక్టర్ల వ్యవస్థను పూర్తిగా ప్రజల వద్ద తెచ్చేందుకు ఏపీలో 13 జిల్లాల స్థానంలో 25 జిల్లాలను ఏర్పాటుచేస్తాం. సమస్యలు పరిష్కరించేందుకు గ్రామ సచివాలయాలు ఏర్పాటుచేస్తాం. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామానికి చెందిన పది మందికి ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను గుర్తించేటప్పుడు.. పార్టీలను చూడం. అర్హత ఆధారంగానే లబ్ధిదారులను గుర్తిస్తాం. ప్రతి గ్రామంలోనూ 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటరీగా నియమిస్తాం. గ్రామ వాలంటీర్లకు రూ. 5వేల చొప్పున జీతాలు ఇస్తాం. ప్రతి ప్రభుత్వ పథకం మీ ఇంటికి వచ్చేవిధంగా చూస్తాం. రేషన్ బియ్యం సైతం డోర్ డెలివరీ చేస్తాం. జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా.. గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా రాజ్యం నడుస్తుంది. రేషన్‌కార్డు, ఇల్లు సహా.. చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదైనా మంజూరు చేయాలంటే మీరు ఏ పార్టీ వారని అడుగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందురులో పెన్షన్‌కోసం వృద్ధులు కోర్టుకు వెళ్లే దారుణమైన పరిస్థితి నెలకొంది. గ్రామ స్వరాజ్యం లేని జన్మభూమి కమిటీలను నడుపుతున్నారు. అంబులెన్స్ లేక.. గర్భిణీ బస్సులోనే ప్రసవించారు విజయనగరం జిల్లా గరివిడి మండలంలో ఓ ఘటన నాకు ఎదురైంది. గర్భిణీ పురిటి నొప్పులు వస్తున్నాయని ఫోన్ చేస్తే.. టైర్ పంక్చర్ అయిందని 108 సిబ్బంది చెప్పారు. అంబులెన్స్ లేకపోవడంతో ఆ గర్భిణీ బస్సులోనే ప్రసవించారు. రాష్ట్రంలో పేదవాడికి వైద్యం అందడం లేదు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. ఉద్దానంలో 4వేల మంది కిడ్నీ బాధితులుంటే.. ప్రభుత్వం 1400 మందికి మాత్రమే సాయం చేస్తుంది. 370 మందికి మాత్రమే పెన్షన్లు అందుతున్నాయి. డయాలసిస్ పేషెంట్లకు ముష్టి వేసినట్లు 2500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. బినామీలో కోసం విద్యారంగాన్ని బాబు నాశనం చేశాడు కవిటి మండలంలో అమ్మాయిలు చదివే జూనియర్ కాలేజీల్లో బాత్రూమ్లు లేకపోవడం దారుణం. చంద్రబాబు తన బినామీల కోసం విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారు. చంద్రబాబు ముక్యమంత్రి అయ్యాక ఆరువేల ప్రభుత్వ పాఠశాలలు మూయించివేశారు. ఎస్సీ, బీసీ, ఎస్టీల హాస్టళ్లను మూసివేయించారు. మధ్యాహ్న భోజన పథకానికి ఆరు నెలలుగా బిల్లులు చెల్లించలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలానికి చెందిన గోపాలన్న నన్ను కలిశారు. అక్కడ ఫ్లెక్సీలో ఉన్న వ్యక్తి తన కొడుకు అని, తాను ఫీజులు కట్టలేకపోవడంతో ఇంజినీరింగ్ చదువుతున్న తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. డ్వాక్రా మహిళలను కోర్టు మెట్లు ఎక్కించారు.. విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో డ్వాక్రా మహిళలను కోర్టు మెట్లు ఎక్కించారు. డ్వాక్రా సంఘాల మహిళలపై బ్యాంకు సిబ్బంది దాడులు చేస్తున్నారు. వడ్డీలు కట్టేందుకు అక్కాచెల్లమ్మలు తాళిబోట్లు తాకట్టు పెట్టే దుస్థితి నెలకొంది. 2016 నుంచి డ్వాక్రా సంఘాల వడ్డీలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఉద్యోగాలు లేవు.. ఉన్న ఉద్యోగాలు గోవిందా.. చంద్రబాబు హయంలో ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి లేదు. నిరుద్యోగ యువత నిరాశలో ఉన్నారు. బాబు వచ్చాడు కానీ.. జాబు రాలేదని నిరుద్యోగులు నన్ను కలిశారు. విభజన సమయానికి లక్షా 42వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో 90వేల మేర ఖాళీలు ఏర్పడ్డాయి. మొత్తం దాదాపు 2లక్షల 20వేల ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగాన్ని కుడా భర్తీ చేయలేదు. 30వేల ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా.. గృహ నిర్మాణ శాఖలో 3500మంది ఉద్యోగాలు గోవిందా.. గోపాలమిత్ర ఉద్యోగాలు గోవిందా.. ఆయూష్‌లో పనిచేస్తున్న 30వేల మంది ఉద్యోగాలు గోవిందా.. మధ్యాహ్నం భోజనం పథకంలో పనిచేస్తున్న 85వేల మంది ఉద్యోగాలు గోవిందా.. బెంగళూరులో కాఫీ.. చెన్నైలో ఇడ్లీ సాంబార్..! రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంటే.. చంద్రబాబు మాత్రం రాజకీయాలే ముఖ్యమనుకుంటున్నారు. జాతీయ రాజకీయాలంటూ చంద్రబాబు బెంగళూరుకు వెళ్లి.. కుమారస్వామితో కాఫీ తాగారు. కానీ కర్ణాటక పక్కనే ఉన్న అనంతపురం జిల్లా రైతుల పరిస్థితి ఆయనకు గుర్తుకురాలేదు. మరోవైపు చంద్రబాబు చెన్నై వెళ్లి స్టాలిన్‌తో ఇడ్లీ సాంబార్ తిన్నారు. కానీ పక్కనే ఉన్న తన సొంత జిల్లా చిత్తూరు రైతుల గురించి ఆయన పట్టించుకోరు. విమాన చార్జీలు ప్రభుత్వమే భరిస్తోంది కదా అని ఆయన పశ్చిమ బెంగాల్ వెళ్లి మమతను కలుస్తారు. కానీ, ఆయనకు రాష్ట్రంలోని రైతుల దుస్థితి కనిపించడం లేదు. వైఎస్సార్ హయాంలో ఏపీలో 42.70 లక్షల హెక్టార్ల పంటసాగు ఉంటే..చంద్రబాబు హయాంలో 40 లక్షల హెక్టార్లకు పడిపోయింది. అందుకే ఏపీలో పర్జలు చంద్రబాబును ‘నిన్ను నమ్మం బాబు’ అంటున్నారు. నాబార్డ్ నివేదిక ప్రకారం దేశంలోనే రైతు అప్పుల విషయంలో ఏపీ రెండో స్థానంలో ఉంది. రుణమాఫీ పేరుతో చద్రబాబు చేసిన దగాకు వడ్డీలు పెరిగిపోయి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వడ్డీలేని రుణాలు కూడా రైతులకు అందడం లేదు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. తన హెరిటేజ్ కోసం చంద్రబాబు దళారీలకు కెప్టెన్ అయ్యారు. రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి.. మూడింతలు ధరలు పెంచి తన హెరిటేజ్‌లో చంద్రబాబు అమ్ముతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటివరకు తెరవలేదు. పలాస జీడిపప్పు రైతులు కేజీ 650 రూపాయలకు కూడా అమ్ముకోలేకపోతున్నారు. చంద్రబాబు మాత్రం హెరిటేజ్‌లో జీడిపప్పు కిలో 1100 రూపాయలకు అమ్ముతున్నారు. రైతు శివన్న గురించి.. అనంతపురంలో శివన్న అనే రైతు కలిశారు. శివన్న పొలంలో వేరుశనగ వేశానని చెప్పాడు. పంట ఎలా ఉందని అడిగితే.. బాబు రాగానే కరువు వచ్చిందన్నారు. అనంత పర్యటనకు చంద్రబాబు వచ్చినప్పుడు సాయం అడిగామన్నారు. కరువుతో ఎండిపోతున్నాం సాయం చేయమంటే.. చంద్రబాబు అయ్యో నాకు కరువు గురించి తెలియదు అని అధికారులపై మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో వ్యవసాయం కుదేలైన పరిస్థితిని కళ్లకు కట్టేలా శివన్న చెప్పారు. రెయిన్ గన్లతో ప్రభుత్వం రైతులను మభ్యపెట్టిన తీరును శివన్న నాకు వివరించారు. అందుకే రైతులు నిన్న నమ్మం బాబు అంటున్నారు. ప్రజల గుండె చప్పుడును నా గుండె చప్పుడుగా మార్చుకున్నా పాదయాత్రలో ఎంతమందిని కలిశాం.. ఎంతమందికి భరోసా ఇచ్చామన్నదే ముఖ్యం నాలుగున్నరేళ్లలో బాబు పాలన ఎంత ఘోరంగా ఉందో ప్రజలు చెప్పారు. కరువు, నిరుద్యోగం వీటికి తోడు చంద్రబాబు మోసం ప్రజల పాలిట శాపంగా మారింది. ప్రజాసంకల్పయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాను. ప్రజల గుండె చప్పుడును నా గుండె చప్పుడుగా మార్చుకున్నాను. 14 నెలలుగా 3648 కిలోమీటర్లు నేను నడిచినా.. నడిపించింది ప్రజలు.. పైనున్న దేవుడు. ఇచ్ఛాపురం: వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చాపురం పాత బస్టాండ్ బహిరంగ సభ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్ ఘాట్) నుంచి 2017 నవంబర్ 6వ తేదీన జననేత చేపట్టిన ‘ప్రజా సంకల్పయాత్ర’, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. మొత్తం 341 రోజుల పాటు సాగిన ప్రజాసంకల్పయాత్ర.. 134 నియోజకవరాగలు, 231 మండలాలు, 2,516 గ్రామాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్ల గుండా సాగింది. జననేత 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ఇప్పటివరకు 123 సభల్లో పాల్గొన్న వైఎస్ జగన్.. పాదయాత్రలో అఖరి బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. ఇచ్ఛాపురం: వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయసంకల్ప స్తూపాన్ని అవిష్కరించారు. అక్కడి ఆయన ఇచ్ఛాపురం పాత బస్టాండ్ వద్ద జరిగే సభాస్థలికి బయలుదేరారు. ఇప్పటికే లక్షలాది మందితో సభాస్థలి కిక్కిరిసింది. జై జగన్ నినాదాలతో ఆ ప్రాతమంతా మారుమోగుతోంది. ఇచ్ఛాపురం: వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయసంకల్ప స్తూపం వద్దకు చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న సర్వమత ప్రార్థనల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఇచ్ఛాపురం చేరుకున్న అశేష ప్రజానీకం అడుగడుగునా వైఎస్ జగన్‌కు నీరాజనం పలుకుతున్నారు. ఇచ్ఛాపురం: వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్ఛాపురంలోని విజయసంకల్ప స్తూపాన్ని అవిష్కరించే క్షణం కోసం జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇచ్ఛాపురంతోపాటు పరిసర ప్రాంతాల్లో జనసందోహం నెలకొంది. 16వ నెంబర్ జాతీయరహదారి కిలోమీటర్ల మేర జనం బారులు తీరారు. పైలాన్ వద్దకు వైఎస్ జగన్ రాకకోసం లక్షలాది మంది జనం ఎదురు చూస్తున్నారు. ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాలు జగన్ నినాదాలతో మారుమోగుతున్నాయి. ఇచ్ఛాపురం: బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన విజయసంకల్ప స్థూపం (పైలాన్)ను ఇచ్ఛాపురంలో కాసేపట్లో వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున అక్కడికి తరలివచ్చారు. పైలాన్‌ను వైఎస్ జగన్ ఆవిష్కరించే అపురూప క్షణాల కోసం తామంతా వేచిచూస్తున్నామని వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. స్థూపాన్ని ఆవిష్కరించిన తర్వాత కాలినడకన పాత బస్టాండ్ వద్దకు చేరుకుని భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. తిరుపతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతమైన సందర్భంగా యువజన విభాగం నేత భూమన అభినయ రెడ్డి నేతృత్వంలో తిరుపతిలోని అలిపిరి వద్ద పార్టీ శ్రేణులు కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కుసుమ కుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు ఇమామ్, రాజేంద్ర, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కర్నూలు: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర ముగింపు నేపధ్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. వైఎస్ సర్కిల్లో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాజా విష్ణు వర్దన్ రెడ్డి, నరసింహులు యాదవ్, తెర్నకల్ సురేందర్ రెడ్డి, రెహమాన్, మద్దయ్య, మున్నా తదితరులు పాల్గొన్నారు. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా పాణ్యం నియోజకవర్గంలోని షరీన్ నగర్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు విశ్వేశ్వర్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, ఫిరోజ్, బెల్లం మహేశ్వర రెడ్డి, సులోచన, శ్రీనివాసులు, విక్రమ్, డేవిడ్‌లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలతో అభిషేకం, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతపురం: వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ శ్రేణులు రాయదుర్గం మండలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి ఉడేగొళం మధ్యనేశ్వర స్వామి దేవాలయం వరకు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనయుడు కాపు ప్రవిణ్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూడేరు మండలం పి. నాగిరెడ్డిపల్లిలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. విడపనకల్లు మండలం డోనేకల్లులో వైస్సార్సీపీ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. చిత్తూరు: ప్రజాసంకల్ప పాదయాత్ర ముగింపు సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు పురుషోత్తం రెడ్డి, చంద్రశేఖర్, రాహుల్ రెడ్డి,లీనారెడ్డిలు, ఇతర కార్యకర్తలు గాంధీ సర్కిల్లో కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా, వైఎస్ జగన్‌కు సంఘీభావం తెలియచేస్తూ పీలేరు, కలికిరి, కలకడ, వైవి పాలెం,గుర్రంకొండ, వాల్మీకి పురం మండలాలలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైఎస్సార్: జిల్లాలోని ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విజయవంతమైన సందర్భంగా సుండుపల్లి జెడ్పీటీసీ హకీం ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విజయవంతమైన సందర్భంగా రాయచోటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా బీసీ ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతపురం: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా ఎస్ కే యూనివర్సిటీ సమీపంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు, ఆకుతోటపల్లి గ్రామస్థుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. 101 టెంకాయలు కొట్టి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. నెల్లూరు: వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయవంతమైన సందర్భంగా రూరల్ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నాయకులు పిండి సురేష్, బొబ్బల శ్రీనివాస్ యాదవ్, కాకి వెంకటేశ్వర్లు భారీ కేక్‌ను కట్ చేశారు. మూడు నెలల్లో రాజన్న రాజ్యం రాబోతోందని, జిల్లాలో కచ్చితంగా 10 సీట్లు గెలుస్తామని బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా వైఎస్సార్ సీపీ విద్యార్ధి విభాగం నాయకులు విష్ణు వర్దన్ రెడ్డి, మేర్లపాక వెంకటేష్, సందీప్, రాజేష్, యశ్వంత్, బన్నీ,నాగరాజులు నాయుడుపేటలోని శ్రీ పోలేరమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, 101టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. విజయనగరం: ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు విజయనగరం నుంచి భారీగా జనం తరలి వస్తున్నారు. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు నెల్లిమర్ల వైఎస్సార్ సీపీ సమన్వయకర్త బడుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో నెల్లిమర్ల నియెజకవర్గం నుంచి భారీగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఇచ్ఛాపురం: వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రగా బయలుదేరి లొద్దపట్టి చేరుకున్నారు. అక్కడ వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. వైఎస్సార్ సీపీ నేతలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. జననేతతో కలిసి నడవటానికి పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు అక్కడకు చేరుకున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న దారులన్నీ జనసంద్రంగా మారాయి. వైఎస్సార్: వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా కడప జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, ఎమ్మెల్యే అంజాద్ బాషా, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్‌లు పాల్గొన్నారు. గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతం అయిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో 3648 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైన రోజు పాదయాత్ర విజయవంతం కావాలని స్వామివారికి మొక్కుకున్నారు. పాదయాత్ర విజయవంతం కావడంతో కార్యకర్తలు స్వామి వారికి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కు చెల్లించుకున్నారు. చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఇచ్ఛాపురం : విజయ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు పాడేరు సమన్వయ కర్త విశ్వేశ్వర రాజు ఆధ్వర్యంలో గిరిజనులు భారీగా ఇచ్ఛాపురానికి తరలి వచ్చారు.పాడేరు, జీకే వీధి, జీ మాడుగుల, కొయ్యురు మండలాల నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు భూసరి క్రిష్ణా రావు, లకే రత్నభాయ్,కోడా సురేష్, గాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం : పెందుర్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త అదీప్ రాజ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు కారు ర్యాలీ ద్వారా ఇచ్ఛాపురానికి బయలుదేరారు. జననేతకు జేజేలు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి విజయవంతంగా పూర్తి చేసిన రాజన్న తనయుడికి జనం జేజేలు పలికారు. సాక్షి టీవీ కేఎస్సార్ లైవ్ షోలో పలువురు మాట్లాడుతూ... జననేతకు అభినందనలు తెలిపారు. పాదయాత్రతో వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారని హైదరాబాద్‌కు చెందిన రాజ్యలక్ష్మి అనే మహిళ పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, కత్తితో దాడి చేసినా ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేయడం మామూలు విషయం కాదన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర తర్వాత జనసమ్మోహనరెడ్డిగా మారిపోయారని విస్సన్నపేటకు చెందిన జయకర్ ప్రసంశించారు. ప్రజాసంకల్పయాత్ర విజయసంకల్పయాత్రగా మారడంలో ఎటువంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని కడపకు చెందిన డాక్టర్ రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చివరిరోజూ అదే ఉత్సాహం: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని కొజ్జీరియా నుంచి చివరిరోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభించారు. జననేత వెంట నడిచేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిందరినీ చిరునవ్వుతో పలకరించి ముందుకు సాగారు. చివరిరోజు పాదయాత్ర మొదలు పెట్టడానికి ముందు వైఎస్ జగన్ వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. జననేత పాదయాత్ర సాగుతున్న దారిలో యువత కోలాహలం కన్పిస్తోంది. దారులన్నీ జనసంద్రం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్ ఘాట్) నుంచి 2017 నవంబర్ 6న వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 341 రోజుల తర్వాత బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. జన నాయకుడి జైత్రయాత్రకు సంఘీభావంగా తరలివెళుతున్న జనంతో దారులన్నీ జనసంద్రంగా మారాయి. -
మెగా డీఎస్సీ కావాలి
శ్రీకాకుళం: ‘అన్నా.. మీరు సీఎం అయిన తర్వాత మెగా డీఎస్సీ నిర్వహించాలి. టీడీపీ ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులను మోసం చేసింది. 23వేల పోస్టులుంటే 7వేల పోస్టులను మాత్రమే భర్తీ చేసి నిరుద్యోగులకు అన్యాయం చేసింది’ అని కవిటి మండలం కె.కొత్తూరుకు చెందిన బి.శ్రావణి జగన్‌కు తెలిపారు. వైఎస్ హయాంలో యాభై వేల పోస్టులు ఒకేసారి మంజూరు చేశారని, మీరు సీఎం అయ్యాక మెగా డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు. -
విజయ ‘సంకల్పం’
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా... సమస్యల పరిష్కారమే లక్ష్యంగా... సంకల్పమే ఆయుధంగా... అలుపెరుగకుండా సాగిన విపక్ష నేత ప్రజాసంకల్ప యాత్ర తుదిదశకు చేరుకుంది. జిల్లాలో దాదాపు రెండు నెలల్లో 36రోజులపాటు అకుంఠిత దీక్షతో సాగిన పాదయాత్రలో ఆయన వేలాదిమంది సమస్యలు తెలుసుకున్నారు. 214 గ్రామాలను సందర్శించారు. ఎక్కడ చూసినా ఆయనకోసం ఆత్రంగా ఎదురుచూసిన జనం కనిపించారు. తమ గోడు వినిపించుకోవాలనీ... సాంత్వన పొందుదామనీ ఆకాంక్షించారు. వారి అందరి ఆశలను తీరుస్తూ ఆయన శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు. ఇప్పుడు ఆ జిల్లాలో బుధవారంతో ఆయన యాత్ర పూర్తవుతోంది. ఆ చివరి ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆయన పర్యటన వివరాలు. సాక్షిప్రతినిధి విజయనగరం: 2017 నవంబర్ ఆరో తేదీ. వైఎస్సార్‌కడప జిల్లా ఇడుపులపాయ ఓ చారిత్రాత్మక నిర్ణయానికి సాక్షీభూతమైంది. ప్రజల కష్టాలు క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు తమ ప్రభుత్వం వస్తే వారికి న్యాయం చేసుకునేలా ప్రణాళిక రూపకల్పనకు ఓ మహోన్నత లక్ష్యంతో విపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర మొదలైంది. 269 రోజుల యాత్ర అనంతరం 12వ జిల్లాగా విజయనగరంలో గతేడాది సెప్టెంబర్ 24న ఎస్‌కోట నియోజకవర్గంలోని కొత్తవలస మండలంలోప్రవేశించింది. జిల్లాలో జగన్మోహన్రెడ్డి మొత్తం 36 రోజుల పాటు యాత్రసాగించి 311.5 కిలోమీటర్ల నడిచారు. 9 నియోజకవర్గాలు.. 18 మండలాలు, 214 గ్రామాలు, నాలుగు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో పర్యటించారు. 9 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించగా... రెండు ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొని 305వ రోజు నవంబర్ 25న విజయవంతంగా శ్రీకాకుళం జిల్లాకు పయనమయ్యారు. స్వర్ణకారులతో ఆత్మీయ సమ్మేళనం కార్పొరేట్ జ్యూయలరీ షాపులతో కుదేలవుతున్న విశ్వబ్రహ్మణులకు (స్వర్ణకారులకు) చేయూతనిస్తూ.. వీరు మాత్రమే మంగళసూత్రాలను తయారు చేసేలా పేటెంట్ హక్కు కల్పిస్తామని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి హమీ ఇచ్చారు. విజయనగరం నియోజకవర్గంలో స్వర్ణకారులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ మేరకు ప్రకటించారు. దీనిపై తొలి చట్ట సభలో తీర్మానించనున్నట్టు హామీ ఇచ్చారు. పోలీసుల వేధింపులు లేకుండా ఇప్పుడున్న చట్టానికి సవరణలు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ సీటు ఇచ్చి విశ్వబ్రహ్మణలకు చట్ట సభల్లో స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. శెట్టి బలిజలతో మరో సమ్మేళనం శెట్టిబలిజ కులస్తుల అభ్యున్నతికి రూ.2వేల కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సామాజిక వర్గ నేతలు జగన్‌ను కోరారు. జియ్యమ్మవలస మండలం శిఖబడి క్రాస్ వద్ద వారితో జగన్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వారి కోరికను మన్నించిన కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి చోటా జన ఉప్పెన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగన్మోహన్రెడ్డి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా నిర్వహించిన తొమ్మిది భారీ బహిరంగ సభలకు జన సునామీ ఎగసిపడింది. ఎస్‌కోట నియోజకవర్గం కొత్తవలస, విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల, గజపతినగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన బహిరంగ సభలు జన ఉప్పెనను తలపించాయి. పాదయాత్రలోనూ ఆయన వెంట వేలాదిగా జనం అనుసరించారు. రక్తం చిందినా సడలని సంకల్పం:అపూర్వ జనాదరణ నడుమ ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్రలో ఎయిర్‌పోర్టు ఘటన జిల్లా ప్రజలను కలచివేసింది. జిల్లాలోని సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలో పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ బయలుదేరిన జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో అక్టోబర్ 25న జరిగిన హత్యాయత్నంతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. అప్పటి వరకు తమ మధ్యనే పాదయాత్ర చేపట్టిన అభిమాన నేత కత్తిపోటుతో గాయపడ్డారని తెలిసి జిల్లావాసులంతా తల్లడిల్లారు. ఈ దుర్ఘటన నుంచి 17 రోజుల్లోనే వజ్ర సంకల్పంతో కోలుకున్న జగన్ నవంబర్ 12న జిల్లాలో యాత్రను పునఃప్రారంభించారు. ప్రతి అడుగూ ఓ చరిత్రః ఈ యాత్రలో జననేత వేసిన ప్రతి అడుగు చారిత్రాత్మకంగానే నిలిచింది. గతేడాది సెప్టెంబర్ 24న విశాఖ జిల్లా నుంచి విజయనగరం జిల్లాలో అడుగిడిన అభిమాననేత అదే రోజున కొత్తవలసలో 3000 కిలోమీటర్ల మైలు రాయిని దాటారు. దానికి గుర్తుగా ప్రత్యేక పైలాన్‌ను జగన్ ఆవిష్కరించారు. గుర్ల మండలం ఆనందపురం క్రాస్ వద్ద 3100 కిలోమీటర్లు, సాలూరు మండలం బాగువలస వద్ద 3200 కిలోమీటర్లు మైలురాయిని అధిగమించారు. నవంబర్ 17వ తేదీనాటికి 300 రోజుల యాత్ర పూర్తి చేసుకోవటం ద్వారా మరో నూతన రికార్డు సష్టిŠంచారు. జియ్యమ్మవలస మండలంలోని తురకనాయుడు వలసలో 3300 కిలోమీటర్ల మైలు రాయిని జగన్ దాటారు. సంకల్పంలో జిల్లా గుర్తులు సెప్టెంబర్ 24: జిల్లాలో పాదయాత్ర ప్రవేశం. దేశపాత్రుని పాలెంలో 3 వేల కిలోమీటర్లను అధిగమించిన ప్రస్థానం. సెప్టెంబర్ 30: విజయనగరం నియోజకవర్గంలో విశ్వబ్రాహ్మణులతో ఆత్మీయసమ్మేళనం. అక్టోబర్1: విజయనగరం పట్టణంలోని మూడు లాంతర్ల సెంటర్లో బహిరంగసభ. అక్టోబర్ 3: నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రం మొయిద జంక్షన్లో బహిరంగసభ. అక్టోబర్ 7: చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో బహిరంగసభ. అక్టోబర్ 8: గుర్ల మండలం ఆనందపురం క్రాస్ వద్ద 3100 కిలోమీటర్లు దాటిన యాత్ర అక్టోబర్ 10: గజపతినగరంలో బహిరంగ సభ. అక్టోబర్ 17: బొబ్బిలిలో బహిరంగ సభ. అక్టోబర్ 22: సాలూరులో బహిరంగ సభ అక్టోబర్ 24: సాలూరు మండలం బాగువలస వద్ద 3200 కిలోమీటర్ల మైలురా యిని దాటిన ప్రతిపక్షనేత అక్టోబర్ 25: మక్కువ నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి వెళ్లి వీఐపీ లాంజ్‌లో ఉన్న జగన్‌పై హత్యాయత్నం నవంబర్ 12: పదిహేడు రోజుల విరామం తర్వాత తిరిగి సాలూరు నియోజకవర్గం పాయకపాడు నుంచి పాదయాత్ర ప్రారంభం నవంబర్ 17: పార్వతీపురంలో బహిరంగ సభ. తనపై హత్యాయత్నం తర్వాత తొలిసారి సభలో మాట్లాడిన జగన్. నవంబర్ 18: 300 రోజుకు చేరిన ప్రజాసంకల్పయాత్ర. నవంబర్ 20: కురుపాంలో బహిరంగ సభ. నవంబర్ 24: జియ్యమ్మవలస మండలం తురకనాయుడు వలస శివారులో 3300 కి.మీల మైలురాయి అధిగమించిన జగన్ నవంబర్ 25: విజయనగరం జిల్లాలో పూర్తయిన పాదయాత్ర. -
341వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, శ్రీకాకుళం: ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 341వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం ఇచ్ఛాపురం నియోజకవర్గం.. కవిటి మండలంలోని కొత్త కొజ్జీరియా నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి ఇచ్ఛాపురం మండలం అయ్యవారి పేట, లొద్దపుట్టి మీదుగా, పేటూరు, ఇచ్ఛాపురం వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తారు. మధ్యాహ్నం ఇచ్ఛాపురం వద్ద జననేత ప్రజాసంకల్పయాత్ర పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం ఇచ్ఛాపురం పాతబస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. -
మనసున్న నాయకుడు
విజయనగరం: ఎండ మండిపోతున్నా..కాళ్లు కాయలు కాస్తున్నా..అనారోగ్యాన్ని అస్సలు లెక్కచేయక అడుగులు వడివడిగా వేస్తూ ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా సమస్యలతో నిండిన జనమే ఎదురయ్యారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి వ్యధాభరిత గాధలను విన్న జగన్ సాధ్యమైనంత వరకూ ప్రతీ సమస్యకు అప్పటికప్పుడే పరిష్కారం చూపించారు. కొన్నింటిని ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానంటూ భరోసా ఇచ్చారు. ఆయన మాటిచ్చిన అభాగ్యులకు పాదయాత్ర సమయంలోనే సాయం అందగా, కొందరికి జిల్లాలో పాదయాత్ర పూర్తయిన తర్వాత కూడా సాయం అందించి జగన్ తానిచ్చిన మాటను నిలబెట్టుకుని, తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. చిన్నారి బాధను జగనన్నకు చెప్పుకున్నాం.. నా పేరు బడుగంటి సత్యనారాయణ, మాది మణ్యపురిపేట గ్రామం, గుర్ల మండలం. మా కుమారుడు బడుగంటి రోహిత్ పుట్టిన అప్పటినుంచి అంగవైకల్యంతో బాధపడుతున్నాడు, రోహిత్‌కు ట్రై సైకిల్ మంజూరు చేయాలని అధికారులకు ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్న మంజూరు చేయలేదు. జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో భాగంగా మణ్యపురిపేట వద్దకు చేరుకున్నప్పుడు జగన్‌ను కలిసి రోహిత్ సమస్య గురుంచి తెలియజేశాం. ట్రై సైకిల్ అందిస్తామని హమీ ఇచ్చారు. హమీ మేరకు జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు ట్రై సైకిల్ అందించారు. ఆర్థిక సాయం చేశారు.. నా పేరు దమరశింగి సుజాత, మాది కెల్ల గ్రామం. గుర్ల మండలం. నేను ఐదేళ్లుగా కాలేయం, కిడ్ని, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాను. రెండు నెలలుకు ఒకసారి ఆస్పత్రికి తీసుకువెళ్లి కాలేయంలో ఉన్న నీటిని తొలగించాలని వైద్యులు సూచించారు. లేకపోతే ప్రాణానికే ప్రమాదమని తెలిపారు. ఇప్పటి వరకు ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం సుమారుగా రూ.10లక్షలు ఖర్చు చేశాం. ఆర్థిక భారమైనా అప్పులు చేసి చికిత్స చేస్తున్నాం. నా భర్త రాము తాపీమేస్త్రీగా పని చేస్తున్నాడు. ఒక్కరి కూలీతోనే కుటుంబ పోషణ జరగాలి. నా వైద్యం సాగాలి. వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కెల్ల గ్రామంలో ఆయన్ని కలిసి కష్టాలు చెప్పి, వినతిపత్రం అందించాం. జగన్ మా సమస్యను గుర్తించి జిల్లా వైఎస్సార్సీపీ నాయకులుతో మాకు ఆర్థిక సాయం చేశారు. చాలా సంతోషంగా ఉంది. పెద్ద మనుసుతో ఆదుకున్నారు.. నా పేరు అంబల్ల రామకష్ణ, మాది కెల్ల గ్రామం. గుర్ల మండలం. నేను తాపీమేస్త్రీగా పనిచేస్తున్న సమయంలో అదుపు తప్పి భవనం మీద నుంచి జారీ పడ్డాను. ఆ ప్రమాదంలో నా వెన్నెపూసకు బలమైన గాయమై రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. అప్పటి నుంచి నేను మంచంపైనే పడి ఉన్నా. నా తల్లిదండ్రులు సీతమ్మ, పైడినాయుడు వృద్ధులు కావడంతో కుటుంబ పోషణ కష్టం అవుతుంది. తండ్రి కూడా మంచం పట్టడంతో ఇద్దరికి చికత్స కోసం రూ.8 లక్షలపైనే ఖర్చు అవుతుంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్.జగన్మోహన్రెడ్డిని కెల్ల గ్రామంలో కలిసి ఆదుకోవాలని, ఎలక్ట్రికల్ వీల్ చైర్ అందించాల్సిందిగా కోరా. జగన్ స్పందించి అదుకుంటామని హమీ ఇచ్చారు. జిల్లాలో పాదయాత్ర ముగిసిన తర్వాత జిల్లా వైఎస్సార్ సీపీ నాయకులు ఆర్థిక సాయం అందించారు. ఎలక్ట్రికల్ వీల్‌చైర్‌ను కూడ పంపిస్తామని నాయకులు చెప్పారు. జగన్‌ను కలిసిన కోలగట్ల విజయనగరం రూరల్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని అగ్రహారం ప్రాంతంలో మంగళవారం రాత్రి మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రజా సంకల్పయాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా ముందస్తుగా పాదయాత్ర రాత్రి విడిది వద్ద జగన్‌ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు కోలగట్ల తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, బూత్ కమిటీల క్రియాశీలక పాత్ర, రావాలి జగన్– కావాలి జగన్ కార్యక్రమాలను కోలగట్ల జగన్‌కు వివరించినట్లు పేర్కొన్నారు. ప్రజా సంకల్పయాత్రతో ఏడాది కాలంగా రాష్ట్ర ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ ప్రజలకు భరోసా ఇచ్చి దిగ్విజయంగా పాదయాత్ర పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించారని, కోలగట్ల జగన్‌ను అభినందించినట్లు వివరించారు. -
ఆ యాత్రే ఓ ప్రభంజనం
ఆ అడుగు ఓ ప్రభంజనం..ఆ చిరునవ్వు కొండంత ధైర్యం..ఆ ఓదార్పు కష్టాల్లో ఉన్న వారికి మనోస్థైర్యం.. ఆ పలకరింపు నిజంగా ఊరడింపు..ఆ చేతి స్పర్శగొప్ప సాంత్వన..అలుపు..అలసట.. విసుగు.. విరామం లేకుండా సాగిన ప్రజాసంకల్పయాత్ర మరికొద్ది గంటల్లో ముగియనుంది(శ్రీకాకుళం జిల్లాఇచ్ఛాపురంలో..). దాదాపు 14 నెలల పాటు సాగినఈ సుదీర్ఘపాదయాత్ర ముగింపు మహోజ్వల ఘట్టాన్ని తలపించనుంది. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే మరే ఇతర రాజకీయ నాయకుడు తలపెట్టనిమహాయజ్ఞం ముగింపు దశకు చేరుకుంటున్న వేళఆ వజ్రసంకల్ప ధీరుడు అడుగుజాడలు జిల్లావాసులను ఉద్వేగానికి గురిచేస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం: నడిచొచ్చిన నిలువెత్తు నమ్మకాన్ని చూసి జిల్లా ఉప్పొంగింది. నవ్య చైతన్య దీప్తిని వెలిగిస్తూ దూసుకొచ్చిన రాజన్న బిడ్డకు ఉత్తరాంధ్ర ముఖ ద్వారమైన విశాఖ జిల్లా అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది. రాష్ట్రంలో నాలు గున్నరేళ్లుగా సాగుతున్న నారావారి నరకాసురపాలనను తుదముట్టించే సంకల్పంతో ఏపీ ప్రతి పక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర విశాఖ జిల్లాలో అడుగుపెట్టింది మొదలు జిల్లా దాటే వరకు ప్రజలు జననీరాజనాలు పలికారు. దాదాపు 32 రోజుల పాటు జిల్లాలో పాదయాత్ర చేసిన ఈ బహుదూరపు బాటసారిని చూసేందుకు పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా పోటెత్తాయి. గన్నవరం మెట్ట నుంచి.. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద గతేడాది ఆగష్టు 14న విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది మొదలు పెందుర్తి మండలం చింతలపాలెం వద్ద విజయనగరం జిల్లాలో అడుగుపెట్టే వరకు జనప్రభంజనంలా సాగింది. తొలి అడుగులో అడుగేసేందుకు వేలాది మంది ఎదురేగి గన్నవరం మెట్ట వద్ద ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజక వర్గాలు, విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఐదు నియోజకవర్గాల మీదుగా సాగింది. నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర గ్రామీణ జిల్లాలో పాయకరావుపేట, యలమంచలి, అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పెందుర్తి నియోజక వర్గాల మీదగా సాగింది. ఇక సిటీలో విశాఖ పశ్చిమలో అడుగు పెట్టిన పాదయాత్ర విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, విశాఖ తూర్పు, భీమిలి నియోజక వర్గాల మీదుగా సాగింది. గ్రామీణ ప్రాంతంలో శారద, వరహా, సర్పా నదులతో పాటు పోలవరం, ఏలేరు కాలువల చెంతన దుర్భేద్యమైన కొండలు..గుట్టల మధ్య అసలు సిసలైన పల్లె వాతావరణంలో పాదయాత్ర సాగింది. ఇక మహా విశాఖలో అడుగు పెట్టింది మొదలు చింతలపాలెం వరకు వేలాది అడుగులు కదంతొక్కాయి. పచ్చతివాచీ..పూలదారులు.. పొలిమేరల్లోనే కాదు..ప్రతి గ్రామం, పట్టణాల పొలిమేరల్లోనూ ఇదే రీతిలో భారీ ముఖ ద్వారాలు.. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం పలికారు. పాదయాత్రలో ఆధ్యాంతం అడుగుడగునా పూల వర్షం కురిపిస్తూ పచ్చ తివాచీ(గ్రీన్ కార్పేట్స్)లపై నడిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నుదటపై తిలకం దిద్ది మంగళ హారతులిచ్చి మహిళలు దిష్టి తీస్తే.. లేవలేని, నడవలేని వృద్ధులు సైతం జననేతను చూసేందుకు గంటలతరబడి నిరీక్షించడం కన్పించింది. మహిళలు, యువత, పేదలు, రైతులు, చిరుద్యోగులు, వ్యాపారులు, వివిధ కుల వృత్తులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు జన హృదయ నేతకు తమ కష్టాలు చెప్పుకుని ఊరడింపు పొందారు. ఇళ్లు, పింఛన్లు ఇవ్వడం లేదని, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంట్ వర్తించడం లేదని, ఉద్యోగాలు రావడం లేదని, ఉన్న కొలువులు ఊడదీశారని, తాగు, సాగునీరు అందడం లేదని, అధికార టీడీపీ నేతల భూకబ్జాలు, దందాలు, అవినీతి, అక్రమాలు పెచ్చుమీరిపోయాయని ఇలా ఒకటేమిటి వేల వినతులు వెల్లువెత్తాయి. తన వద్దకు వచ్చిన ప్రతిఒక్కరినీ చిరునవ్వుతో పలకరించి వారి కష్టాలు తెలుసుకుని కన్నీళ్లు తుడుస్తూ ..నేనున్నానంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగారు. జిల్లాలో 277.1 కిలోమీటర్లు ప్రజాసంకల్పయాత్ర 237వ రోజు 2721.4 కిలో మీటర్ల వద్ద నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద జిల్లాలో అడుగిడిగిన పాదయాత్ర జిల్లా లో 32 రోజులపాటు సాగింది. 264వ రోజు 2998.5 కిలోమీటర్ల వద్ద చింతల పాలెం వద్ద విజ యనగరం జిల్లాలోకి ప్రవేశించింది. గ్రామీణ జిల్లా లో 206.4 కిలోమీటర్లు, జీవీఎంసీ పరిధిలో 70.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. జిల్లాలో 277.1 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్ర గ్రామీణ జిల్లాలో అత్యధికంగా భీమిలిలో తొమ్మిదిరోజులపాటు, ఆ తర్వాత వారంరోజుల పాటు యలమంచలి నియోజక వర్గంలో పాదయాత్ర సాగింది. ఇలా మొత్తమ్మీద గతేడాది ఆగష్టు 14వ జిల్లాలో అడుగుపెట్టిన ప్రజాసంకల్పయాత్ర సెప్టెంబర్ 24వ తేదీతో ముగిసింది. పాదయాత్రకు వరుణుడు సైతం.. పాదయాత్రలో అడపాదడపా సూరీడు కాస్త చిటపట లాడించినా.. జననేత వెంటే నేనున్నానంటూ వరుణుడు మేఘచత్రం పడుతూ వచ్చాడు. నియోజకవర్గంలో అడుగు పెట్టకానే జడివానతో పలుకరిస్తూనే ఉన్నారు. కొన్ని చోట్ల కుండపోతగా వర్షం కురిసినా లెక్కచేయకుండా తన కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది చూపించే అభిమానం ముందు ఈ వర్షం ఏపాటిదంటూ జననేత ముందుకు సాగారు. నర్సీపట్నం సభకు ఓ మోస్తరుగా వర్షం కురవగా, యలమంచలి సభలో కుండపోతగా కురిసింది. భీమిలిలో అడుగు పెట్టన తర్వాత దాదాపు మూడురోజులు ప్రతిరోజు కనీసం పాదయాత్ర సమయంలో అరగంటకు పైగా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. జోరు వానలో సైతం తడిసి ముద్దవుతూనే జననేత ముందుకు సాగారు. మంత్రులపై ఎటాక్ నర్సీపట్నం, భీమిలి నియోజకవర్గాల్లో మంత్రులనే లక్ష్యంగా జగన్ పేల్చిన మాటల తూటాలు టీడీపీలో ప్రకంపనలు సృష్టించాయి. నర్సీపట్నం సభలో మంత్రి అయ్యన్నను లక్ష్యంగా చేసుకుని జగన్ చేసిన విమర్శలు అలజడని రేపాయి. బినా మీలకు కాంట్రాక్టులు, ఖనిజ దోపిడీలో కమీ షన్లు దండుకుంటున్నారంటూ నేరుగా అయ్యన్నపై వాగ్భాణాలు ఎక్కు పెట్టా రు. నాతవరం మండలం సరుగుడు దగ్గర బినా మీల పేరుతో లైసెన్సులు తీసుకొని పరిమితికి మించి భారీ ఎత్తున లేటరైట్ తవ్వకాలు చేస్తున్నారని ధ్వజ మెత్తారు. అవినీతిలో చంద్రబాబు కు బ్రాండ్ అంబాసిడర్ గంటా అని ఘాటుగా విమర్శించారు. దొంగల ముఠా స్థావరాలు మార్చినట్టు ఎన్నికలొచ్చేసరికి గంటా నియోజకవర్గాన్ని మార్చేస్తాడంటూ ఘాటుగా విమర్శించారు. తొమ్మిది సభలు..రెండు ఆత్మీయ సదస్సులురికార్డు తిరగరాసిన కేరాఫ్ కంచరపాలెం విశాఖ జిల్లాలో తొమ్మిది బహిరంగ సభల్లో జననేత ప్రసంగించారు. నర్సీపట్నం మొదలు కొని ఆనందపురం వరకు 9 సభల్లో పాల్గొన్నారు. గ్రామీణ సభలు రికార్డులు తిరగరాస్తే..కేరాఫ్ కంచరపాలెంగా జరిగిన విశాఖ బహిరంగసభ కొత్త రికార్డును సృష్టించింది. పూరిజగన్నాథ రథయాత్రను తలపించేలా లక్షలాది మంది జనం ఈ సభకు తరలిరావడంతో కంచరపాలెం మెట్ట నుంచి ఎన్ఏడీ వరకు జనసంద్రమైంది. ఇక విశాఖలో బ్రాహ్మణులు, ముస్లిం మైనార్టీలతో ఆత్మీయ సదస్సుల్లో పాల్గొన్నారు. విశాఖ వేదికగా జరిగిన పార్టీ కో ఆర్డినేటర్ల రాష్ట్ర స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. -
అన్ని దారులు ఇచ్ఛాపురం వైపే..
సాక్షి, విశాఖపట్నం: అందరి చూపులు అక్కడే... అన్ని దారులు అటువైపే.. వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలొస్తున్నాయ్ అన్నట్టుగా వేలు.. లక్షలు.. కోట్ల అడుగులు అటువైపు కదులుతున్నాయి. వజ్రసంకల్పంతో దాదాపు 14 నెలల పాటు సాగిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు పండగలో భాగస్వాములవ్వాలని ప్రతి ఒక్కరూ ఉత్తుంగ తరంగాల్లో ఉరకలెత్తు తున్నారు. ఈ మహోజ్వల ఘట్టానికి వేదికవుతున్న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వెళ్లేందుకు పార్టీలకతీతంతా జనసైన్యం కదులుతోంది. కదం తొక్కుతోంది. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గతేడాది నవంబర్ 6వ తేదీన చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారంతో ముగియనుంది. నిప్పులు చెరిగే ఎండను, కుండపోతవర్షాన్ని, వణికించే చలిని సైతం లెక్క చేయ కుండా మొక్కవోని సంకల్పంతో నగరాలు, పట్టణాలు, పల్లెలనే తేడాలేకుండా అలుపెరగకుండా సాగిన పాదయాత్ర నేటి మధ్యాహ్నంతో ముగియనుంది. ప్రజాసంకల్ప యాత్ర ముగింపును పురస్కరించుకుని ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేసిన 88 అడుగుల భారీ ఫైలాన్ ఆవిష్కరించి అనంతరం జరిగే భారీబహిరంగసభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ మహోజ్వల ఘట్టంలో భాగస్వాములవ్వాలని విశాఖ వాసులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ చరిత్రాత్మక పాదయాత్ర ముగింపు పండుగలో పాల్గొనేందుకు జిల్లా వాసులు వేలాదిగా తరలి వెళ్తున్నారు. ఇచ్ఛాపురం, బరంపురం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, రైళ్లన్నీ మంగళవారం సాయంత్రం నుంచే కిక్కిరిసిపోయాయి. ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటు కో ఆర్డినేటర్ వరుదు కళ్యాణితో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, శ్రేణులు ఇచ్చాపురానికి తరలి వెళ్లారు. పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, విశాఖ, అనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు తైనాల విజయకుమార్, గుడివాడ అమర్నాథ్, విశాఖ సిటీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, పార్లమెంటు కో ఆర్డినేటర్లు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవిలతోపాటు అసెంబ్లీ కో ఆర్డినేటర్లు, పార్టీ, అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా, నియోజక వర్గ నేతలు బుధవారం తెల్లవారుజామున బయల్దేరి తరలి వెళ్తున్నారు. బస్సులు, కారులు, ప్రత్యేక వాహనాల్లో పార్టీ శ్రేణులతో పాటు పార్టీలకతీతంగా వివిధ వర్గాల ప్రజలు కూడా ఇచ్ఛాపురం తరలివెళ్తున్నారు. -
ఆప్తబంధువు అడుగుజాడలు
జీవధారలు పొంగే ‘తూరుపు’ సీమల్లో ఆవేదనల చీకట్లు అలముకున్నవేళ.. వెలుగులు పంచే సూర్యుడిలా ఆయన అడుగు పెట్టారు. మంచిని పెంచి.. గట్టిమేలు తలపెట్టే మహత్తర సంకల్పంతో అలుపెరుగని పయనం సాగించారు. ముసిముసి నవ్వుల మాటున మరుగుతున్న విషం నింపుకొన్న పాలకులు.. నీతి లేని రీతిలో సాగిస్తున్న పాలనపై రణశంఖం పూరించారు. గోబెల్స్‌ను తలదన్నేలా సాగుతున్న అబద్ధపు ప్రచారపు నివురుగప్పిన జనచైతన్యాన్ని రగుల్కొలిపి, అణగారిన బతుకుల్లో ఆశల అరుణకిరణమై భాసించారు.వ్యథార్థ జీవితాల్లో ‘పండగలా దిగివచ్చిన’ ఆ జనహితుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ‘తూర్పు’ ప్రజలు జేజేలు పలికారు. ఆయన ప్రజాసంకల్ప యాత్ర సాగిన ప్రతిచోటా వరద గోదారిలా ఉప్పొంగారు. గుండె లోతుల్లోంచి పొంగుకొచ్చిన అభిమానాన్ని కురిపించారు. తూర్పు గోదావరే.. ‘మార్పు’ గోదావరి అవుతుందని చాటి చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో మహోజ్జ్వలంగా సాగిన ఈ పాదయాత్రనేడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తున్న సందర్భంగాజిల్లాలో సాగిన ఆ జనసారథి అడుగుజాడలివిగో.. సాక్షి ప్రతినిధి, కాకినాడ: అరాచకాలు, అక్రమాలు, అవినీతి వేయితలల రక్కసిలా వికటాట్టహాసం చేస్తున్న వేళ.. పీడిత ప్రజల గుండెల్లో ధైర్యం నింపి, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, భరోసా కల్పించే లక్ష్యంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర గత ఏడాది జూన్ 12 నుంచి ఆగస్ట్ 14 వరకూ జిల్లాలో జరిగింది. తమకోసం అలుపెరుగని పాదయాత్ర సాగిస్తున్న ఆ ధీరుడి వెంట జిల్లాలో వేలాదిగా అడుగులు కదిలాయి. పాదయాత్ర పొడవునా పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన నడిచిన ప్రతి దారిలోనూ జనగోదారి పరవళ్లు తొక్కింది. ప్రతి బహిరంగ సభకూ ఇసుక వేస్తే రాలనంతగా జనం పోటెత్తారు. ఆ జన నాయకుడికి జిల్లావ్యాప్తంగా బ్రహ్మరథం పట్టారు. జిల్లాలో జగన్ సాగించిన ఈ పాదయాత్ర ఓ ప్రభంజనంలా సాగింది. ఓవైపు ఘనస్వాగతం పలికిన జనం.. మరోవైపు తమ సమస్యలు వినే నాయకుడు వచ్చాడంటూ తరలివచ్చిన బాధిత ప్రజలు.. ఇలా ఆయన ఎక్కడ కాలు మోపినా జనకోలాహలమే. సమస్యలతో సతమతమవుతన్న వారందరూ ఆయనకు బాధలు చెప్పుకొని ఉపశమనం పొందారు. అధికారం అండతో పేట్రేగిపోతున్న పాలకుల దుర్మార్గాలను, అవినీతిని, నిర్లక్ష్య పాలనను నడిరోడ్డుపై జగన్ నిగ్గదీసినప్పుడు జనం పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు పలికారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేతల వరకూ ఏవిధంగా అవినీతికి పాల్పడ్డారో పూర్తి ఆధారాలతో ఆయన చెప్పినప్పుడు అక్రమార్కుల పాలనకు చరమగీతం పాడతామంటూ ప్రతినబూనారు. ఇన్నాళ్లూ తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల కుమిలిపోయిన బాధితులు అన్నొచ్చాడు.. అండగా ఉంటానని హామీ ఇచ్చాడని ఊరట చెందారు. జూన్ 12న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రోడ్డు కం రైల్ వంతెన మీదుగా రాజమహేంద్రవరం నగరంలోకి ప్రజాసంకల్ప యాత్ర ప్రవేశించింది. అఖండ గోదావరిపై చారిత్రాత్మకంగా నిలిచిపోయేవిధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘనస్వాగతం లభించింది. లక్షలాదిగా జనాలు తరలివచ్చి ‘తూర్పు’లోకి తమ ప్రియనేతను తోడ్కొని వచ్చారు. కోనసీమలోని పచ్చని పల్లెలు, తూర్పు డెల్టా, మెట్ట ప్రాంతాల మీదుగా ఆయన తన పాదయాత్ర సాగించారు. ఏజెన్సీకి సమీపాన ఉన్న జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో దుర్భేద్యమైన కొండల మధ్య కూడా పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో ఎన్నో ప్రధాన మజిలీలను అధిగమించారు. 2,400, 2,500, 2,600, 2,700 కిలోమీటర్ల మజిలీలను ఈ జిల్లాలోనే దాటి చరిత్ర సృష్టించారు. జిల్లా చరిత్రలో ఈ పాదయాత్ర అరుదైన ఘట్టంగా నిలిచిపోయింది. ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా జిల్లాలో 15 చోట్ల బహిరంగ సభలు జరిగాయి. ప్రతిచోటా జగన్ ప్రసంగాన్ని వినేందుకు జనం పోటెత్తారు. బహిరంగ సభలు జరిగిన ప్రాంతాలన్నీ మునుపెన్నడూ లేనివిధంగా జనంతో కిక్కిరిసిపోయాయి. ఇది జిల్లా రాజకీయాల్లో పెను సంచలనమే అయ్యింది. వెల్లువలా తరలివచ్చిన జనాలను చూసి ప్రభుత్వ నిఘావర్గాలు సహితం ఆశ్చర్యపోయాయంటే ప్రజాసంకల్ప యాత్రలో జనగోదారి ఏవిధంగా ఉప్పొంగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రధాన మజిలీలివీ.. ⇔ జూన్ 12 : పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశం. ⇔ జూన్ 22 : రాజోలు నియోజకవర్గంలో2,400 కిలోమీటర్లు పూర్తి. ⇔ జూన్ 27 : అమలాపురం నియోజకవర్గంలో 200 రోజుల పాదయాత్ర పూర్తి. ⇔ జూలై 9 : మండపేట నియోజకవర్గంలో 2,500 కిలోమీటర్లు పూర్తి. ⇔ జూలై 22 : కాకినాడ రూరల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మత్స్యకారులకు జగన్ ప్రత్యేక హామీలు ఇచ్చారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, డీజిల్‌పై సబ్సిడీ పెంచుతానని, కొత్త బోట్లకూ రిజిస్ట్రేషన్ చేయిస్తామని, ఫిషింగ్ హాలిడే సమయంలో ఇస్తున్న రూ.4 వేలను రూ.10 వేలకు పెంచుతామని, ప్రమాదవశాత్తూ మరణించే మత్స్యకారుని కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం, మత్స్యకార మహిళలకు 45 ఏళ్లకే పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. ⇔ జూలై 28 : జగ్గంపేట నియోజకవర్గంలో 2,600 కిలోమీటర్లు పూర్తి. ⇔ ఆగస్ట్ 7 : చేనేత కార్మిక దినోత్సవం రోజున శంఖవరంలో చేనేత కార్మికులతో మమేకమయ్యారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ⇔ ఆగస్ట్ 11 : తునిలో 2,700 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి. -
అందరి బంధువై.. అభిమాన సింధువై..
తూర్పుగోదావరి, కపిలేశ్వరపురం (మండపేట): తమ అభిమాన నేతను చూడాలి. కనులారా ఆయనను వీక్షించాలి. తమ ఆవేదనను ఆయనతో చెప్పుకోవాలి. ఆయనతో కలసి అడుగులు వేయాలి. కరచాలనం చేయాలి. వీలుంటే సెల్ఫీ దిగాలి. ఆయన ఆశీర్వాదం పొందాలి.. ఇలా ప్రతి ఒక్కరూ పాదయాత్రలో అనుకున్న వారే. ఆయన వస్తున్నారని తెలిస్తే చాలు.. దారులన్నీ జనగోదారులయ్యాయి. ఆయన పలకరింపే.. ఓ పులకరింపుగా భావించిన అభిమాన జనం ఆయన వెన్నంటే నడిచారు. ఏపీ ప్రతిపక్షనేత్ర, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ‘తూర్పు’లో చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చాలా మందికి మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. ఎప్పటికీ మరచిపోలేని అనుభూతిని కలిగించింది. అపురూప చిత్రం.. యూఎస్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న పెద్దింటి కీర్తి తన కుటుంబ సభ్యులతో వచ్చి జగన్‌తో సెల్ఫీ దిగి సంబరపడింది. తన కవల చిన్నారులతో కలిసి జగనన్నతో సెల్ఫీ తీసుకున్నానంటూ వాడ్రేవుపల్లికి చెందిన గోగు సుష్మ సంతోషం వ్యక్తం చేసింది. ఆయన ఆప్యాయంగా పలకరించడంతో పులకరించిపోయింది. తమ అన్నదమ్ముల పిల్లలందరితో కలిసి సెల్ఫీ దిగామంటూ సంబరపడ్డారు కడలికి చెందిన భార్యాభర్తలు బత్తుల దుర్గాభవాని, నవీన్‌కుమార్. బంధువుల పిల్లలందరితో జగన్‌తో లంకల గన్నవరం వద్ద సెల్ఫీ దిగామని ఆయన ఎంతో ఓపికగా అందరితో సెల్ఫీదిగడం తనకెంతో ఆశ్చర్యమేసిందని లంకల గన్నవరానికి చెందిన ఎన్నాబత్తుల శాంతకుమారి సంతోషం వ్యక్తం చేశారు. గంటి పెద్దపూడికి చెందిన బీటెక్ చదువుతున్న అక్కచెల్లెల్లయిన వి.భవాని, అనూషలు సెల్ఫీ దిగి తమ కుటుంబ సభ్యులకు చూపిస్తూ సంబరపడ్డారు. వైఎస్ కుటుంబంపై ప్రేమతో.. పేదలను అక్కున చేర్చుకున్న వైఎస్సార్ కుటుంబ సభ్యులపై కోనసీమ ప్రజలు అభిమానం చాటుకున్నారు. పాదయాత్ర దారైన జొన్నలంకలో వైఎస్ కుటుంబ సభ్యులతో ముద్రించిన ప్లెక్సీని అమర్చి స్వాగతం పలికారు. జగన్ తాతయ్య రాజారెడ్డి, దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి, విజయమ్మల బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో పాటు జగన్ చిన్ననాటి ఫోటోలు, ఇతర కుటుంబ సభ్యులు ఫ్లెక్సీలో ఉన్నాయి. పాదయాత్రికులను ఆ ఫ్లెక్సీ ఎంతగానో ఆకర్షించింది. నాన్న నేమ్‌తో నా బిడ్డ వర్ధిల్లాలంటూ... అభిమాన అన్నతో తమ పిల్లలకు నామకరణం చేయించుకున్నారు. కాకినాడకు చెందిన వనుం శ్రీదే వి, మురళీకృష్ణల బిడ్డకు పర్నిక అని జగన్ నామకరణం చేశారు. పలువురు చిన్నారులకు విజయలక్ష్మి, అని రాజశేఖర్ అని పేర్లు పెట్టారు. రాజోలుకు చెందిన కేఎన్ ప్రసాద్, జ్యోతి దంపతులకు వైఎస్సార్ కుటుంబమంటే వల్లమాలిన ప్రేమ. పాదయాత్రగా వచ్చిన జగన్ పి.గన్నవరం మండలం చాకలిపాలెంలో కలిసి తమ కుమారుడు జయన్స్ రెడ్డిగా నామకరణం చేయించుకున్నారు. ప్రసాద్ బ్యాంకు ఉద్యోగి కాగా జ్యోతి పీహెచ్సీలో సెకండ్ ఏఎన్ఎంగా విధులను నిర్వహిస్తున్నారు. తన కుమారుడికి రాజశేఖర్‌రెడ్డి అని పేరు పెట్టించుకోవడం సంతోషంగా ఉందని ముంగండకు చెందిన దొమ్మేటి దుర్గారావు, దుర్గలు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఉచ్చులవారి పేటకు చెందిన నేతల రమేష్, జయశ్రీల కోరిక మేరకు తమ కుమారుడికి జగన్ అని పెట్టారు. ప్రేమను తాకించు అన్నా.. సంప్రదాయబద్ధంగా జరుపుకొనే అన్న ప్రాసనను అమితంగా అభినందించే జగనన్నతో చేయించుకున్నారు పలువురు. కరకుదురులో ప్రణవ్‌కు జగనన్న అన్నప్రాసన చేయడంతో తల్లి చంద్రకళ సంతోషం వ్యక్తం చేసింది. ఆరు నెలల చిన్నారి చన్విక్రెడ్డికి జగన్ అన్నం ముట్టించడంతో తల్లి చిర్ల సత్యకుమారి పట్టలేనంత ఆనందాన్ని పొందారు. దుష్ట శక్తుల దిష్టి తగలకూడదంటూ.. పాదయాత్రికుడికి దిష్టి తగలకూడదని, అంతా మంచే జరగాలని కోరుకుంటూ విరవాడలో అక్క చెల్లెమ్మలు అడబాల వరలక్ష్మి కుటుంబ సభ్యులు, ఊలపల్లిలో పంపన చంద్రకాంతం కుటుంబ సభ్యులు హారతి పట్టి జగన్నుఆశీర్వదించారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. పాదయాత్రలో పలువురికి జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ముందుకు సాగారు. నాన్న పుట్టిన రోజునే పుట్టాడయ్యా అంటూ తన మనుమడు శ్రీరాజశేఖర్రెడ్డిని తీసుకొచ్చి జగన్‌కు చూపించారు దివిలికి చెందిన కేఎన్ సత్యనారాయణ. రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టుకున్నామంటూ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఊలపల్లిలో చిన్నారి అక్షయకు అక్షింతలు వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. పెద్దాడలో జగన్‌ను కలిసిన కె.దేవికి బర్త్‌డే విషెస్ చెప్పారు. అన్న చేతులతో లాలన.. జగన్‌ను చూసేందుకు వచ్చిన అక్క చెల్లెమ్మలు తమ చిన్నారులను జగన్‌కు చూపించేవారు. వారిని ఎంతో ప్రేమగా జగన్ ఎత్తుకుని లాలించే వారు. పిఠాపురం అగ్రహారంలో ముప్పిడి బిందు కుటుంబ సభ్యులతో జగన్‌ను చూసేందుకు రాగా తన బిడ్డను జగన్ ఎత్తుకుని లాలించారు. నెల్లిపూడికి చెందిన వై.స్వాతి తన బిడ్డను ఆశీర్వదించమని జగన్‌ను కోరగా ఆ బిడ్డను ఎత్తుకుని జగన్ లాలించడంతో స్వామి అమితానందాన్ని పొందింది. తన బిడ్డను జగన్ ఎత్తుకుని లాలించారంటూ సంబరపడ్డారు ఊడిమూడికి చెందిన కప్పలరోజా సంబరపడింది. అన్నచే అ, ఆలు దిద్దించారు.. పల్లిపాలేనికి చెందిన అక్షయ్‌కుమార్‌తో జగన్ అక్షరాలు దిద్దించారు. దీంతో తల్లి విజయలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు. కడలి గవళ్లపాలెం వద్ద తమ చిన్నారి నిమీషాకు అక్షరాభ్యాసం చేయించారు. బిసావరానికి చెందిన చెలులబోయిన శ్రీను సువర్ణ దంపతుల కోరిక సాకారమైందంటూ సంబరపడ్డారు. తన ఇద్దరి కుమార్తెలకు జగన్‌తో అక్షరాభ్యాసం చేయించడం సంతోషంగా ఉందంటూ గంటి పెదపూడికి చెందిన చిల్లి విజయలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు. తన కుమారుడు హర్షకు జగన్ చేతులమీదుగా అక్షరాబ్యాసం చేయించడం సంతోషంగా ఉందంటూ పశ్చిమగోదావరి జిల్లా దొంగరావిపాలేనికి చెందిన పమ్మి ప్రియాంక సంబరపడింది. అన్నకు రక్షణగా రాఖీ.. అన్నకు రాఖీ కట్టి తమ ఆప్యాయతను చాటుకున్నారు అక్క చెల్లెమ్మలు. పిఠాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం బీఎస్సీ చదువుతున్న దేవీ వరలక్ష్మి, ప్రత్తిపాడు నియోజకవర్గంలో శివాని, స్నేహ, సంధ్య, రత్న, మహిత తదితరులు జగన్‌తో సెల్ఫీ తీసుకుని రాఖీ కట్టారు. ఆటోగ్రాఫ్.. స్వీట్ మెమోరీ.. పాదయాత్రలో జనం జగనన్నతో ఆటోగ్రాఫ్ తీసుకుని సంబరపడ్డారు. బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న తాను ఐదేళ్ల తర్వాత ఆటూగ్రాఫ్ తీసుకున్నాంటూ అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన మేకా బయ్యపురెడ్డి సంబరపడ్డారు. కందులపాలేనికి చెందిన దిరిసాల రాజకుమార్ జగన్‌చే తన చొక్కాపై ఆటోగ్రాఫ్ పెట్టించుకుని సంబరపడ్డాడు. నగరంలో జగనన్నను కలిసి ఆటోగ్రాఫ్ అడగ్గానే ఇచ్చారని చిన్నారులు ముంగండ ఎలీష్కుమార్, లక్ష్మీ ప్రవల్లిక మురిసిపోయారు. విరవాడలో కోలా శివనాగబాల కుటుంబ సభ్యులతో వచ్చి జగన్ ఆటోగ్రాఫ్ తీసుకుంది. నెల్లిపూడికి చెందిన ఏనుగు స్వాతికి జగన్ ఆటోగ్రాఫ్ ఇవ్వడంతో అమితానందాన్ని పొందింది. నిండు గర్భిణులకు అన్న ఆశీర్వాదాలు.. పాదయాత్రగా వస్తున్న జగనన్న ఆశీర్వాదం కోసం ఎంతో మంది గర్భిణులు పాదయాత్రకు ఓపిక తీసుకుని వచ్చేవారు. ఎనిమిదినెలల గర్భవతిగా ఉన్న తనను జగనన్న ఆశీర్వదించారం టూ పెదపట్నంలంకకు చెందిన చెల్లుబోయిన రేవతి సంతోషం వ్యక్తం చేశారు. భర్తతో కలిసి 13 కిలోమీటట్లు బైక్‌పై ప్రయాణించి మొండెపులంకలో జగన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రేమానురాగాలు పంచిన వేళ... జగనన్నను కట్టమూరు క్రాస్ వద్ద కలిసి సెల్ఫీ తీసుకున్నాక తన భర్తకు మీరంటే ఎంతో అభిమానమని ఒక్కసారి ఆయనతో ఫోన్లో మాట్లాడన్నా అని అడగడంతో వెంటనే ఫోన్ చేసి తన భర్తతో మాట్లాడారంటూ సంబరపడింది తునికి చెందిన యండమూరి సత్యప్రయదర్శిని. ఓదార్పు యాత్రకు వచ్చిన సమయంలో అన్నతో తీయించుకున్న ఫోటోను పాదయాత్రలో జగన్‌కు చూపింది వేగివారిపాలేనికి చెందిన విప్పర్తి హర్షిత. ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు తాను రెండో తరగతి చదువుతున్నాననీ, మళ్లీ అన్నను కలసి సెల్ఫీ తీసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. జగనన్న అంటే తనకు ఎంతో ఇష్టమంటూ కడలికి చెందిన చిన్నారులు రేణి సుభాష్, కేవిన్ సుభాష్ రితీష్ చంద్ర, దీప్తిరాయులు స్వయంగా తాము తయారు చేసిన జగన్ ఫొటో ఆల్బమ్‌ను చూపించారు. అచ్చంపేటలో చేతి రుమాలుపై జై జగన్, జై వైఎస్సార్ అని రంగు రంగుల దారాలతో తయారు చేసి కుటుంబ సభ్యులతో కలిసి పెరుమళ్ల అనిత జగన్‌కు అందజేశారు. పిఠాపురంలో తల్లిదండ్రులతో వచ్చిన సాత్విక్ అనే చిన్నారి సైనిక దుస్తుల్లో విశేషంగా ఆకర్షించారు. -
జగదానంద కారక.. జన జాతర సాగెరో..!
ఆ అడుగుజాడలు.. ఎన్నో కుటుంబాల్లో ఆనందాన్ని నింపాయి. ఎందరికో స్వాంతన చేకూర్చాయి.అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వులు చిందించాయి. చిన్నారులకు పునర్జన్మనిచ్చాయి. పేద కుటుంబాల్లో వెలుగులు నింపాయి. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన అనేక సమస్యలకు తక్షణం పరిష్కారం చూపారు. ఆరోగ్య సమస్యలతో వచ్చేవారిని చూసి చలించారు. తక్షణ సాయం అందించారు. దీంతో జిల్లా ప్రజలు ఫిదా అయ్యారు. నీ మేలు మరువలేము.. జగదానంద కారకా.. అంటూ జగనన్నకు జై కొడుతున్నారు. ఈ చిత్రంలోని తల్లి శ్రావణిసంధ్య చేతుల్లో నెలల చిన్నారికి రెండునెలల వయస్సు ఉన్నప్పుడు తలలో రక్తం గడ్డ కట్టుకుపోయింది. వైద్యులకు చూపిస్తే రూ.13లక్షలు ఖర్చవుతాయన్నారు. ఏం చేయాలో పాలుపోక పేద దంపతులు శ్రావణిసంధ్య, దుర్గాప్రసాద్ ప్రజాసంకల్పయాత్రగా జిల్లాకు వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. పరిస్థితిని వివరించారు. దీంతో వెంటనే స్పందించిన జగన్ వైద్యానికి అయ్యే ఖర్చును భరించి తిరుపతి వైద్యశాలలో ఆపరేషన్ చేయించారు. చిన్నారికి పునర్జన్మనిచ్చారు. ఇప్పుడు ఆ కుటుంబం జగన్‌ను ఆరాధ్యదైవంగా కొలుస్తున్నారు.ఇలాంటి ఘట్టాలు ప్రజాసంకల్పయాత్రపొడవునా.. ఎన్నో.. ఎన్నెన్నో.. సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైత్రయాత్ర.. ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్ ఘాట్) నుంచి 2017 నవంబర్ 6న చేపట్టిన ‘ప్రజా సంకల్పయాత్ర’ 341 రోజుల తర్వాత బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించేందుకు జిల్లా నుంచి నాయకులు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున తరలి వెళ్లారు. జిల్లాలో పాదయాత్ర సూపర్ సక్సెస్ ప్రజాసంకల్ప పాదయాత్ర జిల్లాలో సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 3,648 కిలోమీటర్ల పాదయాత్ర జరిగితే మన జిల్లాలోనే నెలరోజులపాటు 316 కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో జిల్లాలో జరిగిన బహిరంగ సభలు విజయవంతమయ్యాయి. వీటితోపాటు పలుచోట్ల జరిగిన ఆత్మీయ సమ్మేళనాలకు వేలసంఖ్యలో ఆయావర్గాల ప్రజలు హాజరయ్యారు. పాదయాత్ర ఆద్యం తం జనజాతర మధ్య సాగింది. టీడీపీ సర్కారుపై నిప్పులు చెరుగుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ జగన్ జిల్లాలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయనతో సెల్ఫీలు తీసుకునేం దుకు, కరచాలనం చేసేందుకు ప్రజలు పోటీపడ్డారు. పాదయాత్రకే హైలెట్ ఘట్టం : జిల్లాలో పాదయాత్ర ముగించుకుని కొవ్వూరు నుంచి రైలు కమ్ రోడ్డు బ్రిడ్జి మీదుగా తూర్పుగోదావరి జిల్లాలోకి వైఎస్ జగన్ అడుగుపెట్టే సమయంలో వంతెన వైఎస్సార్ సీపీ జెండాలతో రెపరెపలాడింది. భారీ జనసందోహంతో వారధి కిక్కిరిసింది. పాదయాత్రకే ఈ ఘట్టం హైలెట్‌గా నిలిచింది. ప్రజలకు భరోసా : పాదయాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రజలకు భరోసా ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తామని ధైర్యం చెప్పారు. కష్టాలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు. నవరత్నాల గురించి వివరించారు. ఇవే కాకుండా ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.పది వేలు, అక్వా రైతులకు విద్యుత్ చార్జీల తగ్గింపు, వశిష్టవారధిపై వంతెన నిర్మాణంతోపాటు కొల్లేరు వాసులకు, మత్స్యకారులకు, ఇతర వృత్తుల వారికి పలు హామీలు ఇచ్చారు. చలో ఇచ్ఛాపురం ఈ చారిత్రక పాదయాత్ర ముగింపు ఘట్టానికి చేరుకుంది. ఇచ్ఛాపురంలో బుధవారం ముగియనుంది. ముగింపు సభలో పాల్గొనేందుకు ఇప్పటికే జిల్లా నుంచి ఇచ్ఛాపురం చేరుకున్న పలువురు నేతలు మంగళవారం జగన్‌తో కలిసి ముందుకు అడుగులు వేశారు. సోమవారం రాత్రి ఇచ్చాపురం బయలుదేరి వెళ్లిన నరసాపురం, రాజమండ్రి పార్లమెంట్, పాలకొల్లు, తణుకు, ఉండి నియోజకవర్గాల కన్వీనర్లు ముదునూరి ప్రసాదరాజు, కవురు శ్రీనివాస్, గుణ్ణం నాగబాబు, కారుమూరి నాగేశ్వరరావు, పీవీఎల్ నరసింహరాజు, మాజీ ఎమ్మెల్యేలు పాతపాటి సర్రాజు, ఘంటా మురళీ రామకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చిలువూరి కుమారదత్తాత్రేయ వర్మ, కమ్మ శివరామకృష్ణ తదితరులు మంగళవారం జగన్మోహన్రెడ్డిని కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. మంగళవారం ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గ్రంధి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, సమన్వయకర్తలు జి.శ్రీనివాస్ నాయుడు, ఉన్నమట్ల ఎలీజా, గుణ్ణం నాగబాబు, కొఠారు అబ్బయ్యచౌదరి, తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు తదితరులు కార్యకర్తలతో బయలుదేరి వెళ్లారు. జగన్ వల్లే ఖతార్ నుంచి స్వదేశానికి ఈ చిత్రంలోని మహిళ పేరు పల్లి రత్నం. ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామానికి చెందిన పల్లి నిషికుమార్ భార్య. 2017లో ఉపాధి కోసం ఖతార్ వెళ్లారు. ఏజెంట్ ద్వారా అక్కడ ఓ ఇంటిలో పనికి కుదిరిన రత్నంను ఇంటి యజమానులు పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. 5 నెలల జీతం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ గడిపారు. యజమానులను జీతం కోసం పట్టుపట్టడంతో రత్నంపై చేయని నేరానికి యజమానులు పోలీసు కేసు పెట్టారు. ఐదు నెలలపాటు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిప్పారు. దీంతో ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఆమె భర్త ఆందోళన చెందారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన వైఎస్ జగన్‌ను పిల్లలతో సహా కలిసి విషయం వివరించారు. దీంతో జగన్ ఎంపీ విజయసాయిరెడ్డికి ద్వారా ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ హర్షవర్ధన్‌రెడ్డికి సమాచారం అందించారు. ఆయన ఇండియన్ అంబసీ అధికారులతో మాట్లాడి రత్నంను స్వదేశానికి రప్పించారు. గత అక్టోబర్‌లో రత్నం ఇక్కడికి తిరిగి వచ్చారు. ఎప్పటికైనా జగన్‌ను కలుసుకుని ధన్యవాదాలు చెబుతానని రత్నం చెబుతున్నారు. బాధితులకూ ఆపన్న హస్తం అలాగే కాళ్ల గ్రామంలో కిడ్నీ బాధితుడు తోట వంశీ కృష్ణతోపాటు, అనారోగ్యంతో బాధపడుతున్న కూలా రాజేష్, బొండా హరేష్‌కు కూడా జగన్ ఆర్థిక సాయం చేశారు. ఆ కుటుంబాల్లో ఆనందాలు నింపారు. -
ఆకాశంలో కలల సౌధం
సాక్షి, అమరావతి/ సాక్షి, నెట్వర్క్: వంట, స్నానాల గదితో కూడిన చిన్నపాటి రెండు గదుల ఇల్లు.. జీవిత చరమాంకంలోకి వచ్చే సరికి కనీసం ఎలాగైనాఈ కలను సాకారం చేసుకోవాలనేది సగటు పేదవాడి ఆశ. ఈ కలల సౌధం కోసం కళ్లలో వత్తులు వేసుకుని సామాన్యుడు ఎదురు చూస్తున్నాడు.. అదింకా ఆకాశంలోనే ఉంది. ఎప్పుడు కిందికి దిగివస్తుందో ఏమో! అదిగో.. ఇదిగో అంటూ నాలుగున్నరేళ్లుగా పాలకులు ఊరించి ఉసూరు మనిపించారే తప్ప ఆ కలను సాకారం చేయలేదు. మళ్లీ రాజన్న రాజ్యమొస్తే తప్ప ఆ కల నెరవేరేలా లేదనేది సామాన్యుడి మాట. ఎండకు ఎండుతూ, చలికి వణుకుతూ.. నా భర్త మాదన్న 13 ఏళ్ల కిందట మృతి చెందాడు. మాకు ఎనిమిది మంది ఆడపిల్లలు, ఒకరి వివాహం చేయగా మిగిలిన ఏడుగురితో కలిసి ఓ చిన్న గుడిసెలో జీవనం సాగిస్తున్నాం. కూలి పనులు చేసు కుంటూ పొట్టపోసుకుంటున్నాం. ఇంటి కోసం పలుమార్లు అర్జీలు పెట్టుకున్నాం. జన్మభూమి, గ్రామదర్శిని తదితర కార్యక్రమాల్లో అధికారులకు పలు మార్లు దరఖాస్తులు ఇచ్చినా ఇల్లు మంజూరు కాలేదు.తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో కూడా వినతిపత్రాలిచ్చాం. అయినా ఫలితం లేదు. చేసేదేం లేక ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ గుడిసెలోనే బతుకులు వెళ్లదీస్తున్నాం. – హరిజన దస్తగిరమ్మ, ఎల్.నగరం, కర్నూలు జిల్లా కనిపించేది మొండి గోడలే.. ఆంధ్రప్రదేశ్‌ను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. ఐదేళ్లలో పేదలకు 19 లక్షల ఇళ్లు నిర్మిస్తాం.. ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ. అధికారంలోకి వచ్చాక మూడేళ్ల పాటు ఒక్క ఇల్లు కూడా పూర్తిచేయని ప్రభుత్వం ఈ ఏడాదిన్నరగా హడావుడి చేస్తున్నా పేదల లక్ష్యం నెరవేరడం లేదు. నాలుగున్నరేళ్లలో 5.61 లక్షల ఇళ్లు నిర్మించామని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. యూనిట్ ధర రూ.1.50 లక్షలుగా నిర్ణయించినా లబ్ధిదారులకు బిల్లులు సరిగా మంజూరు చేయకపోవడంతో 5.61 లక్షల ఇళ్లలో సగం అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఇది గమనించి.. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు యూనిట్ ధర మరో రూ.50 వేలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇళ్లు లేని పేదలకు కొత్తగా ఇళ్లు నిర్మిస్తామంటూ ఆశ చూపి.. ఉన్న గుడిసెలు, మట్టి మిద్దెలను తొలగించారు. నాలుగేళ్లు దాటినా వారికి సొంతింటి కల నెరవేరడం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సింగపూర్, మలేషియా, చైనా, బీజింగ్ తదితర దేశాల్లో చేపడుతున్న టెక్నాలజీని ఉపయోగించి ఇళ్ల నిర్మాణం చేపట్టి పేదల కల సాకారం చేస్తామని సీఎం చంద్రబాబు పెద్ద పెద్ద మాటలు చెప్పినా.. ఆచరణలో అమలు కావడం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరమ్మ పథకం కింద రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 44.80 లక్షల ఇళ్లు మంజూరు చేసి.. 31.24 లక్షల ఇళ్లను పూర్తిచేశారు. మిగిలిన 13.56 లక్షల ఇళ్లకు టీడీపీ ప్రభుత్వం బిల్లులు నిలిపి వేయడంతో ఇంటి నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయి ప్రస్తుతం అవి మొండి గోడలుగా దర్శనమిస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో ఇల్లు కావాలనుకునే వారు.. మొదట జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ తిరిగి వారికి అంతో ఇంతో సమర్పించుకోవాల్సిన పరిస్థితి. గృహ నిర్మాణాల కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నా నిర్మాణాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇటీవల నిర్వహించిన పల్స్ సర్వేలో రాష్ట్రంలో ఇంకా 30.31 లక్షల మంది పేదలు గుడిసెల్లోనే నివాసం ఉంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వం చెబుతున్న లెక్క ఇదీ.. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2015–16లో 62,584 ఇళ్లు, 2016–17లో 47,851, 2017–18లో 2,76,763, 2018–19లో 1,73,833 ఇళ్లు నిర్మిం చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇం దులో సగం ఇళ్లు కూడా పూర్తి కాలేదు. బిల్లుల మంజూరులో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుండటంతో ప్రభుత్వ తీరుపై పేదలు మండిపడుతున్నారు. వైఎస్సార్ హయాంలో.. వైఎస్సార్ హయాంలో రాజకీయాలకు అతీతంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదవాడికీ ఇళ్లు మంజూరు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేపట్టిన పాదయాత్ర ద్వారా పేదల ఇబ్బందులను కళ్లారా చూసి అడిగిన వారందరికీ ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరు చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు పేదల గురించి ఆలోచించకపోవడంతో రోజూ ఎక్కడో ఒక ప్రాంతంలో ఇంటి పట్టా, ఇళ్ల కోసం కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిత్యం ఆందోళనలు జరిగేవి. వైఎస్ అధికారంలోకొచ్చాక అడిగిన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలు, గృహ నిర్మాణ శాఖ ద్వారా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఆయన హయాంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 44.80 లక్షల ఇళ్లు మంజూరు చేయగా.. 31.24 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. పేదలంటే కనికరం లేని ప్రభుత్వమిది మా ఆయన హనుమంతు ఏడాది కిందట మృతి చెందాడు. ఆయన జీవించి ఉన్న సమయంలో ఇంటి కోసం పలుమార్లు దరఖాస్తుచేశాడు. ఆయన మృతి చెందినా ఇంత వరకు ఇల్లు మాత్రం మంజూరు కాలేదు. సొంత ఇల్లు లేకపోవడంతో పెద్దల నాటి నుంచి వచ్చిన ఈ పూరి గుడిసెలోనే నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులతో కాలం వెళ్లదీస్తున్నాం. ఇక్కడ కూలి పనులు దొరక్కపోతే కడప జిల్లాకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నాం. ఇంటి కోసం మేము కూడా అధికారులు, నాయకుల చుట్టూ తిరిగినా ఎవరూ కనికరించడం లేదు. చిన్న గుడిసెలోనే ఏడుగురం సర్దుకుపోతున్నాం. పేదలంటే ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. – కులుమాల రంగమ్మ, కోతికొండ గ్రామం, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా వైఎస్ జగన్ భరోసాతో పేదల్లో ఆనందం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీలో గూడు లేని పేదల కోసం 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో పేద కుటుంబాల్లో ఆశలు రేకెత్తాయి. ‘గ్రామాలకు వెళ్లి అందరికీ చెప్పండి.. అన్నొస్తున్నాడని, ప్రతి పేదవాడికీ ఇల్లు కట్టిస్తామని చెప్పండి’.. అంటూ వైఎస్సార్సీపీ శ్రేణులను గ్రామాలకు పంపి భరోసా ఇచ్చేలా ఆదేశించారు. దీంతో ఇన్నాళ్లూ గుడిసెల్లో నివాసం ఉంటున్న పేదల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. మంజూరుచేసే ఇళ్లు కూడా చంద్రబాబు పాలనలాగా జన్మభూమి కమిటీల ద్వారా ఇవ్వబోమని, వైఎస్సార్ మాదిరి.. కులం, మతం, పార్టీ చూడకుండా శాచురేషన్ పద్ధతిలో ఇస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడాన్ని పేదలు స్వాగతిస్తున్నారు. గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు లేని ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ప్రయోజనం.. ఇల్లు ఇచ్చే రోజునే ఆయా ఇళ్లల్లోని అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్, ఎప్పుడైనా డబ్బు అవసరమైతే ఆ ఇంటి మీద బ్యాంకుల్లో రుణం వచ్చేట్టుగా మాట్లాడుతాం.. అన్న ప్రతిపక్ష నేత భరోసాతో పేదలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ‘పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పేరిట ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ పేదలపై లక్షలాది రూపాయల భారం మోపుతోంది. ఒక్కో లబ్ధిదారుడిపై రూ.3.50 లక్షల మేర అప్పు మోపుతోంది. పేదవాడు ప్రతి నెలా రూ.3 వేలు, 4 వేల దాకా 20 ఏళ్లపాటు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇల్లు ఇస్తే తీసుకోండి. మన ప్రభుత్వం రాగానే ఈ ప్రభుత్వం మోపిన అప్పును రద్దు చేస్తాం’ అని వైఎస్ జగన్ పేదలకు భరోసా ఇచ్చారు. దీంతో పట్టణాల్లోని నిరుపేదల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. -
అమ్మ ఒడి పథకం
-
మెల్బోర్న్లో వైఎస్ జగన్‌కు అభినందన సభ
మెల్బోర్న్ : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వజ్ర సంకల్పంతో చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తుది అంకానికి చేరుకుంది. రేపటితో (జనవరి 9) జననేత చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగుస్తుండటంతో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఆసీస్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, నేమాని శర్మ,ఆదిత్య రెడ్డి, హరిబాబు చెన్నుపల్లి,రాజ్ దాసరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ ప్రతినిధులు పాల్గొని వైఎస్ జగన్ కి అభినందనలు తెలియజేసారు. -
ప్రజాసంకల్పయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది: ధర్మాన
-
341వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, శ్రీకాకుళం: ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారిలో భరోసా నింపుతూ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తుది అంకానికి చేరింది. ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్ ఘాట్) నుంచి 2017 నవంబర్ 6వ తేదీన చేపట్టిన ‘ప్రజా సంకల్పయాత్ర’, బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనున్న సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం వైఎస్ జగన్ పెద్ద కొజ్జిరియా నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి లొద్దకుట్టి మీదుగా జననేత పాదయాత్ర ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర సాగుతుంది. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సూచకంగా ఏర్పాటు చేసిన విజయసంకల్ప స్తూపాన్ని జననేత ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి తన తండ్రి మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజాప్రస్థానం విజయస్తూపం, తన సోదరి షర్మిల చేసిన మరో ప్రజాప్రస్థానం స్తూపం మీదుగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్ సెంటర్లో జరిగే బహిరంగ సభ ప్రాంతానికి వైఎస్ జగన్ చేరుకుంటారు. అక్కడ జననేత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడితో ఆయన చారిత్రాత్మకమైన పాదయాత్ర ముగుస్తుంది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. -
‘ఆటో డ్రైవర్లకు ఏటా రూ. 10వేల ఆర్థిక సాయం’
సాక్షి, శ్రీకాకుళం: ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని జగతి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించిన జననేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర సాగుతున్న మార్గంలో ప్రజలు వైఎస్ జగన్‌ను కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం.. పాదయాత్ర కవిటికి చేరుకున్న సమయంలో ఆటో డ్రైవర్లు జననేతను కలిసి తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. ఇన్సురెన్స్, ఫైన్లు, ఫిట్నెస్ ఫీజులను ప్రభుత్వం పెంచేసిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్లు.. వాటిని తగ్గించాలని వైఎస్ జగన్‌ను కోరారు. వారి సమస్యలపై స్పందించిన వైఎస్ జగన్.. ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. జననేత హామీపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. 104 ద్వారా అన్ని పరీక్షలు చేయిస్తాం నియోజకవర్గంలోని కిడ్నీ బాధితులు వైఎస్ జగన్‌ను కలిసి వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కవిటి మండలంలో వందల మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్టు జననేత దృష్టికి తీసుకువచ్చారు. వైద్యం కోసం ప్రతి నెలకు 5 వేల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. వారి సమస్యలపై స్పందించిన జననేత.. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారికి ఆర్థిక సాయం అందజేయడంతో పాటు.. 104 ద్వారా అన్ని పరీక్షలు చేయిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్‌ను కలిసిన రైల్వేజోన్ సాధన సమితి సభ్యులు.. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను ఉత్తరాంధ్ర రైల్వే జోన్ సాధన సమితి సభ్యులు కలిశారు. రైల్వే జోన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని వారు జననేతకు వివరించారు. -
‘దేవుణ్ని కూడా బాబు వాడుకుంటున్నారు’
సాక్షి, శ్రీకాకుళం : టీడీపీ ప్రభుత్వం ఎన్నో అవరోధాలు సృష్టించినా, చివరకు భౌతికంగా అంతం చేసేందుకు హత్యయత్నానికి పాల్పడినా చలించకుండా ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్విజయంగా తన పాదయాత్రను పూర్తి చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. వైఎస్ జగన్‌పై భౌతిక దాడి ఫలించకపోవడంతో ఇప్పుడు ఆధ్యాత్మిక దాడి చేసేందుకు చంద్రబాబు కుట్రపన్నారని ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైఎస్ జగన్ పాదయాత్రకు సహకరించిన వారందరకీ కృతజ్ఞతలు తెలిపారు. రేపటితో(బుధవారం) ప్రజాసంకల్పయాత్ర ముగుస్తుందని పేర్కొన్నారు.పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురం పాత బస్టాండ్ సెంటర్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశామని చెప్పారు. గొప్ప సంకల్పంతో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తిరుమల దర్శనం సందర్భంగా చంద్రబాబే టీడీపీ కార్యకర్తల చేత హడావిడి చేయించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. గతంలో కూడా ఇదే విధంగా వ్యవహరించారని విమర్శించారు. ఇప్పుడు కూడా అదే విధంగా దుశ్చర్యలు చేయబోతున్నారని, దీనిపై తమకు పక్కా సమాచారం ఉందన్నారు. స్వామి వారిని కూడా రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం చంద్రబాబు అలవాటేనని విమర్శించారు. యాత్ర అనంతరం వైఎస్ జగన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారని వివరించారు. ఇదే అదనుగా వైఎస్ జగన్ పై దుష్ర్సచారం చేయించేందుకు చంద్రబాబు కుట్రపన్నారని ఆరోపించారు. దేవ దర్శనం సమయంలో ‘జై జగన్’ అంటూ నినాదాలు చేసేందుకు టీడీపీ కార్యకర్తలు రంగంలోకి దింపారని ఆరోపించారు. జగన్‌పై భౌతిక దాడి ఫలించకపోవడంతో ఇప్పుడు ఆధ్యాత్మిక దాడి చేసేందుకు తెగించారని, ప్రజలే వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. -
సూర్య కిరణం.. ఆశల దీపం
కష్టం ఎంతైనా భయపడవద్దు.. సంకల్పం ముందు ఎంతటి కన్నీళ్లయినా నిలబడవు.. మీ కష్టానికి నేనున్నా.. ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కొంటానని భరోసా ఇస్తున్నా.. అందరి కష్టాలు నాకు తెలుసు.. టీడీపీ సర్కారులో సామాన్యులు ఎలా నలిగిపోతున్నారో ఎరుకే.. అంటూ అందరిలో ధైర్యాన్ని నింపుతూనే సామాన్యుల దగ్గరికి వెళ్లి.. యోగ క్షేమాలు తెలుసుకుంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర సాగించారు. దారి పొడవునా రైతులను పలుకరిస్తూ.. దారిలో ఉన్న చిరు వ్యాపారుల కష్టనష్టాలు తెలుసుకుంటూ.. ప్రతిక్షణం కష్టజీవి పడుతున్న శ్రమలో భాగమయ్యేలా పయనించారు. అలుపెరగని బాటసారిలా ఆయన సాగిస్తున్న పాదయాత్రకు ఓ పక్క జనం పోటెత్తుతుండగా.. మరో పక్క ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అడుగులో అడుగేస్తామంటూ యువత కదం తొక్కింది. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు వారం రోజుల పాటు ప్రతిపక్ష నేత వెంట నడిచారు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా జిల్లా వాసులు అనేక మంది ఆయన అడుగు జాడల్లో ముందుకు వెళుతున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు తోడు నీడగా ఉంటున్నారు. ఆయన పడుతున్న కష్టంలో పాలుపంచుకోవాలన్న సంకల్పంతోనే వేల కిలోమీటర్లు అని తెలిసినా ముందుకు కదిలినట్లు యువత పేర్కొంటోంది. సాక్షి కడప : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్రను 2017 నవంబరు 6న ఉదయం ఇడుపులపాయలో.. తన తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రారంభించారు. పాదయాత్ర వేలాది మంది జనతరంగంతో అలరారింది. ఎక్కడ చూసినా పోటెత్తిన జనం మధ్య.. జననేత జగన్‌తో కలిసి అడుగులో అడుగేసేందుకు పోటీ పడుతున్న యువతతో ఉత్సాహంగా సాగింది. 6 నుంచి 13వ తేదీ వరకు సాగిన యాత్రలో జిల్లా వాసులు లక్షలాది మంది పాలుపంచుకున్నారు. హారతులు పట్టి బొట్టు పెట్టారు. అడుగులో అడిగేశారు. కష్టాలు చెప్పుకున్నారు. సంతోషాన్ని పంచుకున్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలు ప్రతిపక్ష నేతకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. జిల్లాలోని వేల మంది యువకులు.. కులం, మతం, వర్గం బేధం లేకుండా.. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ప్రతిపక్ష నేత వెంట కదిలారు. ఏడు రోజుల పాటు ఇడుపులపాయ నుంచి దువ్వూరు మండలం ఇడమడక వరకు వైఎస్ జగన్ వెంట తండోప తండాలుగా ముందుకు సాగారు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా జిల్లా వాసులు అనేక మంది ఆయన అడుగు జాడల్లో ముందుకు వెళుతున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు తోడు నీడగా ఉంటున్నారు. ఆయన పడుతున్న కష్టంలో పాలుపంచుకోవాలన్న సంకల్పంతోనే వేల కిలోమీటర్లు అని తెలిసినా ముందుకు కదిలినట్లు యువత పేర్కొంటోంది. తల్లిచాటు బిడ్డలా.. రాగిసంగటి ఆరగించి.. 2017 నవంబరు 13న దువ్వూరు నుంచి ప్రారంభమైన ప్రజాసంకల్ప పాదయాత్రలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. జనం మధ్యన.. హోరెత్తుతున్న నినాదాల మధ్య సాగుతున్న పాదయాత్రలో ఒక్కసారిగా ప్రతిపక్ష వైఎస్ జగన్ పొలం వైపునకు అడుగులు వేశారు. పసుపు పంట వేయడానికి సంబంధించి పొలాన్ని సిద్ధం చేస్తున్న రాజుపాళెం మండలం టంగుటూరు గ్రామానికి చెందిన అన్నాచెల్లెలు నంద్యాల ఊపయ్య, సుభద్ర వద్దకు వెళ్లారు. పొలానికి సంబంధించి ఏ పంట వేస్తున్నారు.. పెట్టుబడులు ఎలా.. దిగుబడి పరిస్థితి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పసుపు పంట ఎక్కడ చూసినా తెగుళ్లకు గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని, అంతే కాకుండా దిగుబడులు ఉంటున్నా మద్దతు ధర ఉండడం లేదని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వస్తే పంటలకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతామని ప్రతిపక్ష నేత పేర్కొన్నారు. ఇంతలోనే తమ కోసం క్యారీలో పొద్దునే తెచ్చుకున్న రాగి సంగటి, ఉల్లిపాయ ముక్కలను ఆ తల్లి తీసుకొచ్చింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రతిపక్ష నేతకు ఆప్యాయంగా సంగటి ముద్దలను తినిపించడమే కాకుండా ఉల్లిపాయ అందించింది. సాధారణంగా పల్లె సీమల్లో పొద్దునే లేచింది మొదలు పొలం వద్దకు సంగటి, కారం, ఉల్లిపాయ తీసుకెళ్లడం సాధారణంగా జరుగుతుంది. వైఎస్ జగన్ కూడా వారితో మమేకమై, ఆమె ఆప్యాయంగా పెడుతున్న రాగి సంగటి ముద్దలను తిని.. వారి యోగక్షేమాలు తెలుసుకుని అక్కడి నుంచి ఉపక్రమించారు. ఎన్నో.. ఎన్నెన్నో.. ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి ముగిసేంత వరకు అన్ని వర్గాలతో మమేకమవుతూ.. కష్టసుఖాలు తెలుసుకుంటూ.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ముందుకు సాగారు. ఏడు రోజుల పాటు.. 93.8 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో ఎన్నో విశేషాలు, మరెన్నో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. రాజన్న బిడ్డతో.. ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర నడిచివచ్చి యువతులు, చిన్నారులు, వృద్ధులు, మహిళలు మమేకమై బాధలు చెప్పుకున్నారు. ఈ సందర్భంలో మైదుకూరు మండలం మూడిళ్లపల్లెకు చెందిన ఓ యువతి తన భర్త నిత్యం తాగుతూ.. మద్యం మత్తులో పడుకుంటున్నాడని.. పూర్తి స్థాయిలో మద్యాన్ని దూరం చేయాలని కోరింది. ఊరిలో బెల్ట్ షాపు ఉండడంతో ఎప్పుడూ మద్యం తెచ్చుకుంటూ బానిసయ్యాడని, నేను కష్టపడుతున్నానని వివరించింది. అంతేకాదు ఉన్న భూమిని అమ్మాలని చూస్తుండడంతోనే బాధ తట్టుకోలేక మీకు చెప్పుకుంటున్నానని వివరించగా.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అక్కచెల్లెమ్మలకు మద్యం కష్టాలు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఎంతో కమిట్మెంట్తో ఉన్నారు ఈ రాష్ట్రానికి ఉత్తమ భవిష్యత్తు ఉండేలా పటిష్టమైన ప్రణాళిక, ఎంతో కమిట్మెంట్తో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారు. పాదయాత్రలో ప్రతి ఒక్కరూ సూచనలు, సలహాలు, సమస్యలు చెబుతుంటే.. చాలా ఓపికగా వింటూనే బాగా ఆకలింపు చేసుకుంటూ.. ఇవి చేయాలనే తపనతో ఉన్నారు. ఎందుకంటే ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు చేస్తున్న పాదయాత్రలో నేను ఆయన వెంటే నడుస్తున్నాను. ఆయన ప్రజల సమస్యల పట్ల చూపుతున్న చొరవ, ఆలకించే విధానం నాకు నచ్చింది. ఎలాంటి కోపతాపాలు లేకుండా చిన్న పిల్లలను మొదలుకొని ముదుసలి వరకు అందరినీ పలకరిస్తూ వారికున్న సమస్యలను తెలుసుకుంటూ తగిన సమాధానాలు ఇస్తూ.. ఒక పక్క నాయకులు ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తూ పాదయాత్ర సాగిస్తున్నారు. చంద్ర ఇది మనం ఎందుకు చేయకూడదు అని జగన్ సారు చెబుతుంటారు. సార్..! ఇలా చేస్తే బాగుంటుంది అంటే.. పక్కనే ఉన్న మరొకరు అలా కాదు ఇలా అయితే పథకం విజయవంతం అవుతుందని చెబుతున్నప్పుడు.. జగన్మోహన్రెడ్డి దీన్ని ఆచరణలో పెడదామన్నప్పుడు నాకు చాలా సంతోషమనిపిస్తుంది. ప్రజల సాధక బాధకాలు వింటూ వారికి ఇలా చేస్తే మేలు చేకూరుతుందని అంటున్నప్పుడు.. బహిరంగ స¿¶భల్లో మాట్లాడుతున్నప్పుడు.. ఈ పథకాన్ని అమలు చేస్తారు మాకు మేలు జరుగుతుందని ప్రజలు చర్చించుకుంటూ ఉంటే.. జిల్లా వాసిగా నా ఆనందానికి అవదులు లేన్నట్లు ఉంటుంది. నిజంగా జగన్మోహన్రెడ్డి మదిలో ప్రజలకు మేలు చేసే గొప్ప ఐడియాలు చాలా ఉన్నాయి. – గుత్తిరెడ్డి చంద్రహాసరెడ్డి, వెంకటగారిపల్లె, చింతకొమ్మదిన్నె ప్రొద్దుటూరులోని మెయిన్‌రోడ్డులో బొగ్గులు అమ్ముకుంటున్న ఉస్మాన్‌ఖాన్ దగ్గరికి వెళ్లిన ప్రతిపక్ష నేత కష్టనష్టాల గురించి అడగ్గానే.. ఏడేళ్లవుతోంది.. కేరళ నుంచి వచ్చాను.. కానీ ఐదారు సార్లు దరఖాస్తు చేసినా పింఛన్ రాలేదని మొరపెట్టుకున్నారు. ఆ సంఘటన అక్కడ అందరినీ కదిలించింది. ఎందుకంటే ఉస్మాన్ వృద్ధుడు కావడం, బొగ్గులు అమ్ముకుంటూ రోజుకు రూ. 50–60 మాత్రమే మిగులుతున్నట్లు తెలుపడంతో జగన్ చలించిపోయారు. దువ్వూరు మండలం కానగూడూరు వద్ద తోట సుబ్బరాయుడు, రామతులసి వచ్చి వైఎస్ జగన్‌కు కప్పులో టీ తీసుకొచ్చి అందించారు. వారి కోరిక మేరకు అందరి మధ్య టీ తాగి వారితో కాసేపు ముచ్చటించారు. ఇలా అందరి కష్టాల్లోనూ మమేకమై తెలుసుకుంటూ భరోసానిస్తూ ముందుకు సాగారు. -
సంకల్పం మెరిసేలా.. అభిమానం మురిసేలా!
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు) :కన్నీటి కథలు.. ఎన్నో కదిలించే వ్యథలు.. దగా పడిన అన్నదాత గుండె చప్పుళ్లు.. చీకట్లు అలుముకున్న పల్లెలు.. ఉపాధి లేని నిరుద్యోగులు.. ఏ ఊరు చూసినా ఇదే దుస్థితి. ఈ పరిస్థితుల్లో నేనున్నానంటూ జననేత అలుపెరగని పాదయాత్ర చేస్తూ జిల్లాలోకి అడుగు పెట్టినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులు వెంట నడిచాయి. ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూ.. మీకేం కాదంటూ.. అవ్వతాతలను ఓదార్చుతూ.. అక్కాచెల్లెమ్మలకు అండగా ఉంటూ.. చిన్నా..పెద్దా తేడా లేకుండా అందరనీ కలుసుకుంటూ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముందుకు వెళ్తుండగా.. జనం ఆప్యాయత, అనురాగాలను చూసి పార్టీ నాయకులు, అభిమానులు మురిసిపోయారు. ఈ నెలలో ప్రజా సంకల్పయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో పాదయాత్రలో పాల్గొన్న పలువురు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ అడుగులు చరిత్రాత్మకమని.. ప్రజల కష్టాలను దగ్గరగా చూశామన్నారు. భాగస్వామ్యమైనందుకుసంతోషంగా ఉంది వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారు. సమీప భవిష్యత్‌లో ఎవరూ చేయని విధంగా పాదయాత్రలో 3,630 కిలోమీటర్ల దూరం నడిచారు. అడుగడుగునా ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. జిల్లాలో 18 రోజులపాటు కొనసాగిన పాదయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉంది. – శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ప్రజలకు భరోసా ఇచ్చారు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాదయాత్ర చారిత్రాత్మకం. దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా కోట్లాది మంది ప్రజల సమస్యలు తెలుసుకొని ముందుకు సాగారు. ఎక్కడి సమస్యలు అక్కడే తెలుసుకొని పరిష్కారానిని మార్గాలను చూపుతూ భరోసా కల్పించారు.– బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పీఏసీ చైర్మన్ బీసీలకు పెద్ద పీట వేస్తామన్నారు కర్నూలు జిల్లాలో అధికంగా బీసీలు ఉన్నారు. బీసీలకు అండగా పార్టీ నిలవాలని కోరాను. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. బీసీలను చట్టసభలకు పంపుతానని చెప్పారు.అన్ని కులాలు సామాజిక, ఆర్థికంగా ఎదిగేందుకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానన్నారు.– డాక్టర్ మధుసూదన్, ఆదోని ఆయన వెంట నడవడంమా అదృష్టం జగనన్న మా మధ్యకే రావడం మా అదృష్టం. నేను గోనెగొండ్ల నుంచి పత్తికొండ వరకు పాదయాత్రలో పాల్గొన్నాను. ఆయన నా చేయి పట్టుకొని ఆలూరు నియోజకవర్గంలో సమస్యలేమని అడిగారు. వేదవతి ప్రాజెక్ట్ కట్టాలని కోరాను. పరిశ్రమలు స్థాపించి ఉపాధిని కల్పించాలని అడిగాను. – రామకృష్ణ, ఆలూరు ప్రజా వ్యతిరేక పాలనపై పోరాడాలని చెప్పారు జిల్లాలో జరిగిన పాదయాత్రలో మొదటి నుంచి చివరి రోజు వరకు పాల్గొన్నాను. 18 రోజులు నడిచాను. నేను జగనన్నను కలిసిన సందర్భంలో టీడీపీ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఆ స్ఫూర్తితోనే నిరసనలు, ఆందోళనలో పాల్గొంటున్నాను. – కరుణాకర్‌రెడ్డి, ఎమ్మిగనూరు అపూర్వ స్పందన వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు జిల్లాలో విశేష స్పందన లభిచింది. ఏ నాయకుడికి లభించనంతగా ఆయనకు మద్దతు తెలిపి స్వాగతించారు. పత్తికొండలో జరిగిన బహిరంగకు రికార్డు స్థాయిలో ప్రజలు హాజరయ్యారు. పత్తికొండ చరిత్రలో ఇంత పెద్ద సభ జరగలేదు. – శ్రీరంగడు, పత్తికొండ వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర జిల్లాలో విజయవంతమైంది. అందులో నేను భాగస్వామ్యం కావడం సంతోషకరం. జిల్లాలో 263 కిలోమీటర్ల మేర పాదయాత్రలో పాల్గొన్నాను. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని జగనన్నకు నివేదిక ఇచ్చాను. – తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, కర్నూలు నీరాజనం పలికారు ప్రజా సంకల్ప పాదయాత్రకు జిల్లాలో జనం జేజేలు పలికారు. కోవెలకుంట్ల, బనగానపల్లె సభ లకు జనం పొటెత్తారు. పాదయాత్రకు దారిపొడవునా ప్రజలు వచ్చి వారి సమస్యలు చెప్పుకున్నారు. దేశంలో ఏ నాయకుడు ఈ మాదిరిగా ప్రజా సమస్యలను తెలుసుకోలేదు.– శీలారెడ్డి, నొస్సం సుబ్బారెడ్డి, బనగానపల్లె త్వరలో మొక్కు తీర్చుకుంటా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని వెంకటేశ్వరస్వామిని కోరుకున్నా. ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అయితే తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నా. పాదయాత్ర విజయవంతంగా కొనసాగింది. త్వరలోనే వెంకటేశ్వరస్వామికి మొకు తీర్చుకుంటా. – రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, కర్నూలు నగర అధ్యక్షుడు నవంబర్ 16న.. ఆళ్లగడ్డ మండలం పెద్ద చింతకుంట పాఠశాల విద్యార్థులు వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూడకుండా స్కూలు నిర్వాహకులు గేటు వేశారు. అయితే అభిమానాన్ని అరచేతితో అపలేరన్న నిజాన్ని నిజం చేస్తూ విద్యార్థులు గేటులోపల నుంచే వైఎస్ జగన్‌ను తిలకించారు. -
కన్నీరు తుడిచి.. ఆత్మీయత పంచి!
నాలుగేళ్ల టీడీపీ నయవంచక పాలనలో జనం ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు, సమస్యలతో విసిగివేసారిన ప్రజల కన్నీరు తుడిచి కొండంత భరోసా నింపేందుకు పాదయాత్రగా జిల్లాలోకి అడుగుపెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. తమ బాధలను ఆలకిస్తూ.. ఆత్మీయత పంచుతూ సాగిన అభిమాన నేత అడుగులో అడుగువేస్తూ జిల్లా ప్రజలు వెల్లువలా కదిలారు. ఆయన నడిచిన దారుల్లో పూలబాటలు పరిచి ఎదురేగి స్వాగతాలు పలికారు. ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో చెరగని ముద్ర వేసింది. జిల్లా ప్రజానీకానికి ఎన్నో స్మృతులను అందించింది. ‘నవ వసంతం’ తెచ్చింది.. కాకుమాను సమీపంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉగాది పండుగ జరుపుకున్నారు. పంచాగ శ్రావణం ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 135 సీట్లు వస్తాయని పంచాంగ కర్త పేర్కొన్నారు. సంప్రదాయ పద్ధతిలో ఉగాది వేడుకలను నిర్వహించారు. ⇔ ముప్పాళ్ల సమీపంలో శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించారు. ⇔ పేరేచర్ల సమీపంలో గుడ్‌ఫ్రైడే పండుగను జరుపుకున్నారు. ⇔ ప్రత్తిపాడు, మంగళగిరి నియోజకవర్గాలో అత్యధికంగా ఆరు రోజుల పాటు పాద యాత్ర సాగింది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని నెత్తిన పెట్టుకొని, ప్రత్తిపాడు నియోజకవర్గం మొత్తం జననేత వెంట గుంటూరు పార్లమెంట్ సేవాదళ్ అధ్యక్షుడు మెట్టు వెంకటఅప్పారెడ్డి నడవటం విశేషం. ఆసక్తిర ఘటనలు.. ⇔ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఇంజినీరింగ్ చదివి విదేశాలల్లో ఉద్యోగం చేస్తున్న సౌమ్య తన తండ్రి ద్వారా జననేతకు లోహపు సింహం విగ్రహాన్ని కానుకగా పంపింది. ⇔ ప్రజా సంకల్పయాత్రలో ప్రత్తిపాడు నియోజక వర్గంలో ప్రకాశం జిల్లా తెలగాయపాలెం అనగపాడుకు చెందిన గొర్రెల కాపరులు తమ అభిమాన నేతకు మేక పిల్లను బహూకరించారు. ⇔ ప్రత్తిపాడు నియోజక వర్గం నాగులపాడులో దుర్గా అనే మహిళ తన చంటి బిడ్డను జగన్ చెంతకు తెచ్చి ,పేరు పెట్టాలని కోరగా.. ఆయన ఆ పాపకు విజయమ్మగా నామకరణం చేశారు. ⇔ ప్రజా సంకల్పయాత్రలో ప్రకాశం జిల్లా మర్కాపురం మండలం కర్రాల గ్రామానికి చెందిన జక్కంపూడి లావణ్య, వీరనారాయణరెడ్డి దంపతుల కుమారుడికి రాజశేఖరరెడ్డిగా నామకరణం చేశారు. ⇔ జిల్లాలో నవరత్నాల పథకాల గురించి ఏర్పాటు చేసిన పలురకాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ⇔ ‘ప్రత్యేక హోదా మన ఊపిరి.. చంద్రబాబు ఎంపీలు ముందుకొచ్చినా.. రాకున్నా.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వైఎస్సార కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా వర్షాకాల పార్లమెంటు సమావేశాల చివరి రోజునే రాజీనామాలు చేస్తారని ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పేరేచెర్ల బహిరంగ సభలో వైఎస్ జగన్ సంచలనాత్మక ప్రకటన చేశారు. ⇔ ఘాత్మీయ నేతపై తనకున్న అభిమాన్ని చాటుకుంటూ పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తును తలపై భుజాన పెట్టుకుని, పార్టీ జెండా రంగు దుస్తులతో జిల్లాకు గొర్రె డెనియల్ జననేత ముందు అడుగులో అడుగేస్తూ ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. మాటతప్పని నైజం ఫిరంగిపురం మండలం రేపూడి శివారులో 2017 డిసెంబర్ 28వ తేదీన ఆటో ప్రమాదంలో ఆటోడ్రైవర్ సహా నలుగురు పిల్లలు మరణించిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం మొండిచేయి చూపిందని పాదయాత్రలో జననేతను కలిసిన బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ బాధిత కుటుంబాలకు వైఎస్సార్ సీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జననేత మాటిచ్చినట్టుగానే అప్పటి తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి కత్తెర హేనీక్రిస్టినా, రవి వెంకటరమణ శ్రీకృష్ణదేవరాయలు తమ వంతుగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25వేలు, క్షతగాత్రులకు రూ. 10వేలు, ఆటోడ్రైవర్ భార్యకు రూ. 50వేలు ఆర్థికసాయం చేశారు. కౌలు రైతులకు భరోసా నేడు వ్యవసాయ రంగ ంలో ఎక్కువగా కౌలు రైతులు ఉంటున్నారని వైఎస్ జగన్‌కు వివరిచాం. భూమిపై భూ యాజమానులు తక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు కౌలు రైతులకు అందటంలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లాం. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే కౌలు రైతులకు భరోసా కల్పిస్తానని చెప్పారు. – బోనిగల వేణుప్రసాద్, పొన్నూరు తమలపాకు తోటలకు ఆదరణ పొన్నూరులో తమలపాకు తోటలు ఎక్కువగా ఉన్నాయి. కానీ రైతులకు గిట్టుబాటు ధర కావటం లేదని జననేత దృష్టికి తీసుకెళ్లాం. అధికారంలోకి రాగానే రైతులను ఆదుకుంటామని తెలిపారు. పేదలకు పక్కగృహలు కట్టించాలని కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు. –నల్లమోతుల రూత్‌రాణి, మున్సిపల్ æమాజీ చైర్పర్సన్ -
చెరిగిపోని సంతకం
సాక్షి, అమరావతి బ్యూరో :యువోత్సాహం ఉవ్వెత్తున ఎగిసింది. రైతు, శ్రామిక, కర్షకలోకం సంబరం చేసుకుంది. వేయికళ్లతో ఎదురు చూసిన అక్కాచెల్లెళ్లు, అవ్వాతాతల మోము చిరునవ్వుతో మురిసింది. కష్టాలు, కన్నీళ్లలో తోడుండే నేస్తం, మా ధైర్యం నీవే అంటూ ప్రవాహంలా తరలివచ్చింది.. గతేడాది ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జననేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జిల్లాలో పర్యటించినప్పుడు కనిపించిన దృశ్యాలు ఇవి. ఏ రోడ్డు చూసినా జనసంద్రమే.. అన్న అడుగుజాడలోనే మేము అంటూ ‘కృష్ణా’భిమానం ఆయన వెంట పరుగుపెట్టింది. జననేతతో మాటలు కలుపుతూ.. సెల్ఫీలు దిగుతూ.. సుర్రుమంటున్న సూరీడును సైతం లెక్కచేయకుండా పదం కలిపింది. ఆ మహా ‘సంకల్పం’ తుది అంకానికి చేరుకుంటున్న తరుణంలో నాటి మధుర స్మృతులను అంతా జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. సెల్ఫీ అనిర్వచనీయం నూజివీడు మీదుగా జగన్ పాదయాత్ర చేసేటప్పుడు ఆయనను కలవడానికి మొదటి రోజు వెళ్లాం. కానీ కలవలేకపోయాం. ఎలాగైనా సాధించాలని రెండోరోజు వెళ్లి ఇద్దరు పిల్లలతో కలిసి సెల్ఫీ దిగాను. జీవితంలో అది ఒక మరచిపోలేని అనుభూతిగా మిగిలిపోయింది. అటువంటి గొప్ప నేతతో కలసి అడుగులు వేయడం నా అదృష్టం. – నాగరాణి, గృహిణి, నూజివీడు ప్రజల కష్టం తెలిసిన నాయకుడు ప్రజాసంకల్పయాత్ర జిల్లాలోకి ప్రవేశించిన నాటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోకి వెళ్లే వరకూ జననేత జగన్ వెంట నడిచాను. ఆయన ప్రజల కష్టాలు తెలిసిన గొప్పనాయకుడు. సమస్యల్లో ఉన్న వారు ఆయన వద్దకు వచ్చి తమ కష్టాలను చెప్పుకుంటే.. ఓదార్పునివ్వడంతో పాటు, పరిష్కార మార్గాలను చూపిన గొప్పవ్యక్తి. ఆయనతో కలిసి నడవటాన్ని నా జీవితంలో ఎన్నటికీ మరువలేను. – సారేపల్లి సుధీర్, బ్రహ్మానందరెడ్డినగర్,విజయవాడ తూర్పు నా బిడ్డను ఆశీర్వదించారు.. మా అభిమాన నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నా బిడ్డను ముద్దాడిన ఆత్మీయ సంఘటనను ఎన్నటికి మరువలేం. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కైకలూరు వచ్చిన సందర్భంగా గతేడాది ఏప్రిల్ 14న సీఎన్నార్ గార్డెన్ వద్ద జగనన్నను మా కుటుంబమంతా వెళ్లి కలిశాం. నా బిడ్డ హేమశ్రీని ఆయన చేతితో ఆశీర్వదించారు. ఓ అన్నలా నాతో ఎంతో ప్రేమగా మాట్లాడారు. –టి.భగవాన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి, కైకలూరు చేపను బహుమతిగా ఇచ్చాం.. దశాబ్ధాలుగా అపరిష్కృతంగా ఉన్న కొల్లేరు రైతుల, కూలీల సమస్యలను తీరుస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని జననేత తప్పక నెరవేర్చుతాడన్న నమ్మకం మాకుంది. పాదయాత్రలో భాగంగా జగన్‌ను కలసి మాపై తనకున్న ప్రేమకు కృతజ్ఞతగా చేపను బహూకరించాం. మేమిచ్చిన చిరుకానుకకు ఆయనెంతో సంబరపడ్డారు.–ముంగర నరసింహరావు, కొల్లేరు ప్రాంత చేపల రైతు, వడ్లపూటితిప్ప ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం వైఎస్ జగన్ వెంట ప్రజాసంకల్ప యాత్ర మొదలైన ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా వెన్నంటే ఉంటూ నడుస్తున్నాను. పాదయాత్ర మొదలైన 2017 సంవత్సరం నవంబర్ 6 నుంచి గెడ్డం తీయించుకోలేదు. యాత్ర విజయవంతమవగానే తిరుమలలో మొక్కు చెల్లించుకుంటాను. రాష్ట్రంలోని యువతకు న్యాయం జరగాలంటే ఒక్క జగన్‌తోనే సాధ్యం. –వైఎస్ ప్రశాంత్,వైఎస్సార్సీపీ సేవాదళం, గుడివాడ నా చేతులతో ప్రార్థన చేశాను.. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాబోయే ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మండవల్లి వచ్చిన జగన్‌కు ఈ చేతులతో ప్రార్థన చేశాను. ప్రభు ఏసు ఆయనపై కరుణ చూపుతారనే నమ్మకం ఉంది. ఎందరో బడుగు, బలహీన వర్గాల ప్రజలు జగన్ ఎప్పుడు సీఎం అవుతారా, తమ కష్టాలు ఎప్పుడు తీరతాయా అని ఎదురు చూస్తున్నారు. – రాణీఅబ్రహాం,హోలీ ఆర్మీ ఫెలోషిప్ చర్చి నిర్వాహకురాలు, మండవల్లి -
అడుగడుగూ జనహితం
ప్రజల కష్టాలు తెలుసుకుంటూ.. భవిష్యత్‌పై నమ్మకాన్ని కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర అడుగడుగునా జనహితంగా సాగింది. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో అష్టకష్టాలు పడుతున్న వివిధ వర్గాల ప్రజలు జగన్మోహన్రెడ్డి వెంట అడుగులు వేస్తూ తమ సమస్యలను విన్నవించారు. మద్యంతో కుదేలవుతున్న కుటుంబాల్లోని మహిళలు, ఆక్వా, వరి, పాడి రైతులు, చేనేతలు, విద్యార్థులు, చేతి వృత్తిదారులు, కుల వృత్తిదారులు.. ఇలా అనేక వర్గాల ప్రజలు తమ కష్టాలు తీరుస్తాడనే నమ్మకంతో జగన్‌కు చెప్పుకునేందుకు తరలి వచ్చారు. జిల్లాలో 9 నియోజకవర్గాల్లో 266.5 కిలో మీటర్ల యాత్ర జన ప్రభంజనంగా కొనసాగింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మద్యపానంతో చిన్నాభిన్నమవుతున్న పేదల కుటుంబాలు. సాగునీటి సమస్యలను అధిగమించినా తగ్గిన దిగుబడులు, గిట్టుబాటు ధరల్లేక నష్టపోతున్న రైతులు. ధరల దోపిడీకి గురవుతున్న ఆక్వా రైతులు, ఫీజు రీయింబర్స్మెంట్ అందక చదువులు కొనసాగించలేని విద్యార్థులు, బతుకుదెరువు లేక కష్టాలు పడుతున్న వివిధ సామాజిక వర్గాల ప్రజలు.. ఇలా ఎందరెందరికో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర జనవాణిగా మారింది. సింహపురి రాజకీయ దిశా నిర్దేశాన్ని మార్చేలా జన ప్రభంజనం నడుమ జిల్లాలో పాదయాత్ర జరిగింది. గత ఏడాది జనవరిలో జరిగిన పాదయాత్ర నింపిన స్ఫూర్తి నేటికీ ప్రజల్లో, వైఎస్సార్సీపీలోనూ ఆశల పరవళ్లు తొక్కుతోంది. ప్రతి పల్లెలో తమ ఆత్మీయ బంధువు వచ్చిన రీతిలో అపూర్వంగా స్వాగతించి జననేత పల్లె దాటే వరకు గ్రామం మొత్తం కదిలి వచ్చింది. పర్యవసనంగా జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్ర జనప్రభంజనంలా కొనసాగింది. ప్రస్తుత మాజీ ఎంపీలు మొదలుకొని వేలాది మంది నేతలు జననేత వెంట జిల్లాలో నడిచారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కొందరయితే ఇడుపులపాయ నుంచి మొదలై జగన్ వెంటే ఇచ్ఛాపురం వరకు కొనసాగుతున్నారు. మొత్తం మీద జగన్ పాదయాత్ర జనజాతరలా కొనసాగుతోంది.జిల్లాలో గత ఏడాది జనవరి 23న ప్రజాసంకల్ప యాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. చిత్తూరు జిల్లాలో యాత్ర ముగిసి ఉదయం 10.20 గంటలకు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పెళ్లకూరు మండలం పునబాక గ్రామంలోకి ప్రవేశించి అక్కడి నుంచి జిల్లాలో పాదయాత్ర అడుగులు మొదలయ్యాయి. అశేషంగా తరలివచ్చిన జనవాహినికి అభివాదం చేస్తూ అందరిని పలకరిస్తూ స్వాగతించిన జిల్లా నేతలను అందరినీ కరచాలనం చేస్తూ మొదలైన యాత్ర ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగింది. ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం నేకునాంపేటలో యాత్ర ముగిసింది. యాత్ర ఆద్యంతరం పార్టీ ముఖ్యులు, క్రియాశీలక కార్యకర్తలు, వైఎస్ జగన్ అభిమానులు ఆయన వెంటే నడిచారు. ప్రధానంగా జిల్లాలో నెల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి యాత్ర ఆద్యంతం జగన్ వెంటే ఉన్నారు. ఏడు పదుల వయస్సులో కూడా ఆయన నిత్యం జగన్‌తో నడిచి క్యాడర్లో ఉత్సాహం నింపారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి కూడా పునబాక గ్రామం నుంచి నేకునాం పేట ముగింపు వరకు నిత్యం జగన్ వెంటే నడిచారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు జగన్ వెంటే ఆయా నియోజకవర్గాలు ఆసాంతం నడిచారు. జిల్లాలో వెయ్యి కిలోమీటర్ల మైలరాయి అధిగమించిన చారిత్రాత్మక ఘట్టం సైదాపురంలో ఆవిష్కృతమైంది. ఈ సందర్భంగా వాక్ విత్ జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు , అశేషంగా తరలివచ్చిన జన ప్రభంజనం ఆయన వెంటే అడుగులు వేశారు. ఇక పాదయాత్రకు ఇతర జిల్లాల నేతలు కూడా పోటెత్తారు. ముఖ్యంగా శ్రీకాకుళం మొదలుకొని వైఎస్సార్ జిల్లా వరకు అనేక మంది ముఖ్య నేతలు ఒక్కొక్క నియోజకవర్గంలో జగన్‌ను కలిసి ఆయనతో నడిచారు. ఇక జగన్ అభిమానులు అనేక మంది జిల్లాలోని 9 నియోజకవర్గాల్లోని 14 మండలాలు 142 గ్రామాల్లో 266.5 కిలో మీటర్లు ఆసాంతం జననేత వెంటే ఉన్నారు. -
జనం గుండెల్లో జగన్ పాదయాత్ర
సాక్షి ప్రతినిధి,ఒంగోలు: వైఎస్సార్‌ర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో గత ఏడాది 22 రోజుల పాటు సాగించిన ప్రజాసంకల్ప యాత్ర ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. జిల్లా వాసులకు ఎన్నో తీపుగుర్తులు మిగిల్చింది. మైలు రాళ్లను అధిగమించింది. అభిమాన నేత పాదయాత్ర వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపగా జగన్ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తారన్న భరోసా ప్రజలకు కలిగించింది. గత ఏడాది ఫిబ్రవరి 16న జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం నుంచి యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రకు పార్టీ శ్రేణులతో పాటు ప్రజల నుంచి అడుగడుగున ఘన స్వాగతం లభించింది. ప్రజలు స్థానిక సమస్యలను జగన్ దృష్టికి తెచ్చారు. దివంగత నేత వైఎస్ పాలనలో జరిగిన మేలును జగన్‌కు గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో పడుతున్న కష్టాలను ఏకరువు పెట్టారు. అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలను పరిష్కరిస్తానంటూ జగన్ జనానికి భరోసా ఇచ్చారు. జగన్ హామీలపై జనానికి నమ్మకం పెరిగింది. జిల్లాలో జగన్ నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం నింపగా జనానికి భరోసా నిచ్చింది. మొత్తంగా ప్రజాసంకల్ప యాత్ర జిల్లాల వాసులకు మధురాను భూతులను మిగిల్చింది. ♦ 2018 ఫిబ్రవరి 16 నుంచి మార్చి 12 వరకు 22 రోజులపాటు ఈ యాత్ర సాగింది. 9 నియోజకవర్గాల పరిధిలో 19 మండలాలు 124 గ్రామాల పరిధిలో 278.1 కి.మీ మేర జరిగిన యాత్ర ఎన్నో ఆసక్తికర విషయాలకు కేంద్ర బిందువయింది. లింగసముద్రం మండలంకొత్తపేట వద్ద ఈ యాత్ర ప్రారంభమైంది. ♦ ఫిబ్రవరి 16వ తేదీన లింగసముద్రం మండలం రామకృష్ణాపురం వద్ద 1200 కి.మీ చేరుకుంది. అక్కడ వైఎస్ జగన్ మొక్కను నాటారు. వాకమళ్లవారిపాలెం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ♦ 17న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కు చెందిన న్యాయవాదులు ప్రత్యేక హోదాకోసం పోరాడుతున్న జగన్ ను కలసి తమ సంఘీభావం ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక న్యాయవాదులకు సంబందించిన 12 డిమాండ్ల పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. ♦ 18న కాకుటారు వద్ద ప్రత్యేక హోదా కోసం తిరుపతి నుంచి ఢిల్లీకి సైకిల్ యాత్ర చేపట్టిన వెంకట్ జగన్‌ను కలసి మద్దతు ప్రకటించారు. ♦ 19న తుళ్లూరు మండలం కు చెందిన 29 గ్రామాల రైతులు రాజ«ధాని కి సంబంధించిన రైతులకు అండగా నిలవాలని జగన్ ను కోరారు. ♦ 20న పొన్నలూరు మండలం మాలపాడు కు చెందిన గంగిరెడ్డి.మౌనిక కుమారుడికి వైఎస్ జగన్ రాజశేఖరరెడ్డి గానామకరణం చేశారు. ♦ 21న మర్రిపూడి మండలం అగ్రహారాని చెందిన వెంకటేశ్వర్లు తన అమ్మ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీగా పోటీ చేయడంతో తన తండ్రిని హత్య చేశారని జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ♦ 22న కనిగిరి వద్ద పూణే లో ఉంటున్న మేకల శ్రీనివాసులు అతని మిత్రులు వచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. ♦ 24న కనిగిరి మండలం శంఖవరం గ్రామానికి చెందిన ఎర్రబెల్లి సుజాత తన కుమార్తెకు జగన్‌తో విజయమ్మగా నామకరణం చేయించింది. ♦ 25న యర్రగొండపాలెం నియోజకవర్గ రైతులు పాదయాత్ర వద్ద కువచ్చి ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేశారు. ♦ 26 న మంచినీటి సమస్యకు పరిష్కారం చూపాలని జగన్ ఖాళీ బిందెలతో మహిళలతో కలసి నిరసన తెలిపారు. ♦ అదేరోజు పొదిలి మండలం కాటూరిపాలేనికి చెందిన శ్రీకాంత్, భారతిలు తమ కుమార్తెకు విజయమ్మగా నామకరణం చేయించారు. ♦ అదేరోజు పొదిలిలో నవరత్నాల శకటాలను ప్రదర్శించారు ♦ 28న చీమకుర్తి పోలీసు స్టేషన వద్ద పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా పైలాన్ ఆవిష్కరించారు. ఇక్కడే వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి మొక్కను నాటారు. ♦ మార్చి 3న వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధుల ఢిల్లీ యాత్రకు తాళ్లూరుమండలం కొర్రపాటివారిపాలెం పచ్చజెండా ఊపారు. ♦ 4న రామనాధపురానికి చెందిన లక్ష్మమ్మ విజయమ్మకోసం తయారు చేసిన పార్టీ బ్యాగును జగన్‌కు అందచేశారు ♦ 5న నాగులపాడు వద్ద 1400 కి.మీ మైలురాయికి పాదయాత్ర చేరుకుంది. అక్కడ జగన్ రావిమొక్కను నాటి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ♦ అదే రోజు కొరిశపాడు మండలం పిచుకుల గుడిపాడుకు చెందిన గాదె సునీత తన కుమారుడికి రాజశేఖరరెడ్డి గా జగన్‌తో నామకరణం చేయించింది. ♦ 6న చంద్రబాబు వల్ల 780 కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు నపడ్డాయని ఆయుష్ ఉద్యోగులు జగన్‌ను కలసి విన్నవించారు. ♦ అదే రోజు ప్రసవాలకు ఆరోగ్య శ్రీవర్తింప చేయాలని పర్చూరుకు చెందిన భాస్కర్‌రెడ్డి వినతిపత్రం అందచేశారు. జగన్ చేస్తామని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు వారం క్రితం ఈ నిర్ణయం తీసుకున్నారు. ♦ 8 న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులతో కలసి కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ♦ 10 న దేవర కొండ సుబ్బులు టీడీపీ నాయకుల అరాచకానికి మరణించిందని ఆమె కుమార్తె నాగలక్ష్మిజగన్ కలసి తెలియచేసింది. ♦ 11న చీరాలకు చెందిన ఇత్తడి లీల నూతన వస్త్రాలను జగన్‌కు బహూకరించింది. ♦ అదే రోజు ఐయల్టీడీ భూముల కుంభకోణం, మత్యకారుల గుడిసెల తొలగింపుపై జగన్‌కు కలిసి వినతిపత్రం అందచేశారు. ♦ 12న చీరాల మండలం ఈపూరుపాలెం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. -
ఆ యాత్ర ... జన జాతర
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లాలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సాగించిన 50 రోజుల సుదీర్ఘ పాదయాత్ర ఓ చారిత్రాత్మకం. 412 కిలోమీటర్లు సాగిన ఈ జన జాతరలో అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దాదాపు ప్రతిచోటా పాదయాత్ర తిరునాళ్లను తలపించింది. మార్తాండుడు చండ ప్రచండంగా విజృంభించినా... జడివానలు తడిపి ముద్ద చేసినా ఆయన అడుగు వెనుకకు వేయలేదు. జూన్ 12వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రోడ్డు కం రైల్వే వంతెన మీదుగా అశేష జనవాహిని మధ్య రాజమహేంద్రవరంలోకి ప్రజా సంకల్పయాత్ర ప్రవేశించింది. అఖండ గోదావరిపై చారిత్రాత్మకంగా నిలిచిపోయే విధంగా జననేతకు అపూర్వ స్వాగతం లభించింది. అక్కడి నుంచి కాటన్ బ్యారేజీ మీదుగా కోనసీమలోని పచ్చని పల్లెల్లోంచి మధ్య డెల్టా, మెట్ట ప్రాంతాల మధ్య పాదయాత్ర సాగించారు. ఏజెన్సీకి సమీపంలో ఉన్న జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో దుర్భేద్యమైన కొండల మధ్య కూడా పాదయాత్ర చేశారు. పాదయాత్ర పొడవునా జిల్లాలో చోటుచేసుకున్న ఆసక్తికర విషయాలిలా... ♦ జూన్13వ తేదీన 188వ రోజున పాదయాత్ర రాజమహేంద్రవరంలో మొదలై, కాటన్ బ్యారేజ్ మీదుగా బొబ్బర్లంక వద్ద కోనసీమలో కాలిడింది. అక్కడి నుంచి పేరవరం వరకూ యాత్ర వైఎస్సార్సీపీ పతాకంలోని మువ్వన్నెల్లా...మూడు పాయలుగా సాగింది. రేపటి సౌభాగ్యానికి భరోసానిస్తూ చిరునవ్వుతో నడుస్తుండగా, కుడివైపునున్న సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువలో నవరత్న పథకాలను చాటే కటౌట్లతో నావలు మెల్ల మెల్లగా అనుసరించాయి. ఇక కాలువకు ఆవలి గట్టునా పోటెత్తిన ప్రజలు మూడో పాయగా ముందుకు సాగారు. ♦ జూన్ 26న బిందువు బిందువు కలిసి మహా సింధువైనట్టు ... జన కెరటాలు ఎగసిపడి జన ఉప్పెనలా రూపుదాల్చి ..కోనసీమ కేంద్రం అమలాపురాన్ని ముంచెత్తారు. ఇక్కడ 200వ రోజు పాదయాత్ర పూర్తి చేసుకుంది. ♦ జూన్ 21న రాజోలు నియోజకవర్గంలోని లక్కవరం క్రాస్ వద్దకు చేరుకోగానే 2400 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించారు. ఆ ఊరికి సమీపంలో కొబ్బరి మొక్కను నాటారు. ♦ రాజోలు మండలం చింతలపల్లిలో 13 జిల్లాల నుంచి తరలివచ్చిన ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ నిర్వహించిన ఒలంపిక్ రన్‌ను ప్రారంభించారు. ♦ జూలై 8వ తేదీన 208వ రోజుపాద యాత్ర జరిగిన పసలపూడి వద్ద 2500 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించారు. అదే రోజున వైఎస్సార్ జయంతి కావడంతో అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేశారు. ♦ జూలై 17వ తేదీన కొవ్వాడ రైల్వే ట్రాక్ వద్ద భారీగా ఏర్పాటు చేసిన కటౌట్ వద్ద కాకినాడ నియోజకవర్గ ప్రజలు స్వాగతం పలికి అభిమానం చూపించారు. ♦ జూలై 28న పాదయాత్ర సాగిన 100వ నియోజకవర్గంగా జగ్గంపేటలో అడుగు పెట్టారు. కేక్ కట్ చేశారు. 2600 కిలోమీటర్ల మైలు రాయిని జగ్గంపేటలో అధిగమించి గుర్తుగా మొక్కను నాటారు. ♦ జూన్ 29న కిర్లంపూడి మండలం వీరవరంలో బెల్లం తయారీని పరిశీలించారు. అక్కడ బెల్లం రుచి చూశారు. ♦ ఆగస్టు 1న గొల్లప్రోలులో సాగిన పాదయాత్రలో ప్రజలు దారిపొడవునా పూలబాట పరిచారు. ♦ ఆగస్టు 7న చేనేత కార్మికుల దినోత్సవం పురస్కరించుకుని జనంతో మమేకమయ్యారు. శంఖవరంలో నాయీ బ్రాహ్మణులు కోరడంతో డోలు వాయించారు. ♦ ఆగస్టు 9న పారుపాక క్రాస్ వద్ద రోడ్డుపై చీరలు పరిచి స్వాగతం పలికారు. ఇక్కడ గిరిజనులు ఇచ్చిన విల్లును ఎక్కుపెట్టారు. ♦ ఆగస్టు 11న తునిలో 2700 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా మొక్కనాటి నీరు పోశారు. ఇదే రోజున తుని పాదయాత్రలో రోజా పూలతో అభిమానులు ముంచెత్తారు. -
చీకట్లో వెలుగు రేఖ
నాలుగేళ్ల టీడీపీ దుష్టపాలనలో ఎన్నో కష్టనష్టాలకు గురైన జిల్లా ప్రజలకు ఆయన వెలుగురేఖలా కనిపించారు. ఆయన ఓదార్పే చాలు అన్నట్టుగా ప్రజలు ఆయన రాక కోసం గంటలతరబడి రోడ్లపై నిరీక్షించారు. తమ కష్టసుఖాలు చెప్పుకునిసాంత్వన పొందారు. మా ఆశా నీవే.. శ్వాస నీవే.. అంటూ నినదించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్జగన్మోహన్రెడ్డి పాదయాత్ర జిల్లా ప్రజలకు భవిష్యత్తుపై భరోసాఇచ్చింది. కష్టాలు ఎల్లకాలం ఉండవని, త్వరలోనే సంక్షేమ రాజ్యం సిద్ధిస్తుం దన్న కొండంత ధైర్యాన్నిచ్చింది. ఏలూరు టౌన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో దారి పొడవునా.. ఎన్నో కన్నీటి గాథలు, వ్యథలు.. ఎన్నో చెమర్చిన కళ్లు.. మరెన్నో అలసిన గుండెలు.. అందరికీ భరోసా ఇస్తూ.. అందరిలో ధైర్యాన్ని నింపుతూ ఆయన ముందుకు సాగారు. ప్రజలు తమ సమస్యలు జగన్‌తో చెప్పుకునేందుకుబారులు తీరారు. అవ్వా తాతలు పింఛన్ రావడం లేదని, అక్కచెల్లెమ్మలు, రైతులు రుణాలు మాఫీ కాలేదని, నిరుద్యోగులు భృతి అందలేదని, ఉద్యోగం రాలేదని, గూడులేని పేదలు ఇళ్లు లేవని, అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు ఇలా.. చెప్పుకుంటూ పోతే.. ఎన్నో ఎన్నెన్నో కన్నీటి కథలు.. వైఎస్ జగన్‌ను చలింపజేశాయి. వారిలో కొందరికి తక్షణ సాయం చేసిన వైఎస్ జగన్.. మరికొందరిని ఓదార్చారు. త్వరలోనే సమస్యలు పరిష్కరమవుతాయని భరోసా ఇచ్చారు. త్వరలోనే మనందరి ప్రభుత్వం వస్తుందని, అందరి సమస్యలు పరిష్కారమవుతాయని ధైర్యం చెప్పారు. అడుగడుగునా.. ఆదరణ ప్రజలు అడుగడుగునా వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. ఆయనతోపాటు నడిచేందుకు పోటీపడ్డారు. దారిపొడవునా.. ఆయనతో కరచాలనానికి, సెల్ఫీలకు యువత, రైతులు, మహిళలు ఆసక్తి చూపించారు. మహిళలు అడుగడుగునా హారతులు పట్టి విజయీభవ అంటూ దీవించారు. కొందరు ఆయన వెంట నడిచారు. అన్నివర్గాల వారికీ వరాలు వైఎస్ జగన్ పాదయాత్రలో అన్నివర్గాల వారికీ వరాలు ప్రకటించారు. ఆటోవాలాలకు ఆర్థికసా, ఆక్వాకు విద్యుత్‌చార్జీల తగ్గింపు, గిరిజనులు, దళితులు, బలహీనవర్గాలు, లాయర్ల సంక్షేమానికి కృషి వంటి హామీలు ఇచ్చారు. సంచారజాతులకు వరాలు ప్రకటించారు. రాములు ఇంటికెళ్ళి పరామర్శించి.. ఏలూరు మండలం పాలగూడెం వద్ద భారీ జనసందోహం మధ్య వస్తున్న జగన్ వద్దకు జయశ్రీ అనే విద్యార్థిని వచ్చి అన్నా... రాజశేఖరరెడ్డిగారి అభిమాని తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టారు. మిమ్మల్ని చూడాలని అంటున్నారు.. అని చెప్పింది. వెంటనే జగన్మోహన్రెడ్డి క్షణం ఆలోచించకుండా ఇరిగేషన్ శాఖలో లస్కర్‌గా పనిచేసి రిటైరైన కఠారి రాములు ఇంటికి చేరుకున్నారు. కామెర్లు, లివర్ సమస్యతో బాధపడుతున్న ఆయనను ఆప్యాయంగా పలకరించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పలకరింపుతో రాములు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిన్నారుల ప్రాణాలు కాపాడిన జననేత దెందులూరు: పాదయాత్ర... ఓ చల్లని మనస్సు దాతృత్వం ఒకే గ్రామానికి చెందిన రెండు కుటుంబాల్లో శాశ్వత ఆనందాన్ని నింపింది. ఒకరు ఆరేళ్ల బాలుడు మణికంఠ కాగా.. .. మరొకరు నెలలు నిండని చిన్నారి.. ఇద్దరిదీ ఒకటే సమస్య తలలో నీరు పట్టింది.. ఇద్దరిదీ ఒకటే గ్రామం. పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరు మండలం సీతంపేట. గ్రామానికి చెందిన సాయి మణికంఠ, పొలుకొండ ప్రసాద్, శ్రావణి దంపతుల నెలల నిండని చిన్నారి. ఇద్దరూ తలలో మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో రెండు కుటుంబాలు తమ శక్తికి మించి ఖర్చు పెట్టాయి. సాయిమణికంఠకు రూ.ఆరు లక్షలు అవుతాయని, ప్రసాద్, శ్రావణి దంపతుల చిన్నారికి రూ.13 లక్షలతో అపరేషన్ చేయాలని పరీక్షలు చేసిన వైద్యులు చెప్పటంతో ఆ రెండు కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. ఏం చేయాలో తెలియక కన్నీటి పర్యంతమయ్యాయి. ఇదే సమయంలో దెందులూరు మండలం శ్రీరామవరంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని మణికంఠ తల్లిదండ్రులు కలసి సమస్యను వివరించారు. వెంటనే రూ.ఆరు లక్షలతో పెద్ద తిరుపతిలో వైద్యం చేయించేందుకు అంగీకరించి నగదును వైద్యశాలకు చెల్లించి సాయిమణికంఠకు చికిత్స చేయించారు. గత నెలలో శ్రీకాకుళంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ వద్దకు సీతంపేట గ్రామానికి చెందిన ప్రసాద్, శ్రావణిలు నెలలు నిండని చిన్నారిని తీసుకువెళ్లి సమస్యను వివరించారు. చలించిపోయిన ఆయన చిన్నారిని కాపాడేందుకు రూ.13 లక్షలతో చిన్నారి మెదడుకు ఆపరేషన్ చేయించారు. ఇప్పుడు ఆ ఇద్దరు చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్నారు -
జనవేల్పు.. అయ్యారు ఇలవేల్పు
అలుపెరగని బాటసారి, వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లాలో జనహృదయాలను తాకింది. లక్షలాది జనం ఆయన వెంట అడుగులో అడుగులేయడమే కాదు.. ఆయన చేతి స్పర్శ కోసం తహతహలాడారు. ఆయన పలుకు వినాలని ఉత్సుకత చూపారు. ఆయనతో మాట్లాడాలని ఉత్సాహంతో ఉరకలెత్తారు. చెంతకు రాగానే వారి ఆనందానికి అవధుల్లేవు. పసిపాపల నుంచి పండు ముసలి వరకు రాజన్న బిడ్డను చూసి పులకించిపోయారు. కుండపోత వాన, నిప్పులు చెరిగే ఎండలను సైతం లెక్కచేయకుండా జననేత పాదయాత్రను చూసి జనం చలించి పోయారు. గన్నవరం మెట్ట మొదలు కొత్తవలస వరకు దారిపొడవునా వరుణుడు వెంటపడుతూనే వచ్చాడు. మబ్బులతో మేఘచత్రం పడుతూనే తడిసిముద్ద చేశాడు. అయినా చలించని మొక్కవోని సంకల్పంతో ముందుకు సాగిన జననేత కోసం దారిపొడవునా వేలాది మంది బారులు తీరారు. సాక్షి, విశాఖపట్నం: ప్రజా సంకల్పయాత్ర విశాఖ జిల్లా గన్నవరం మెట్ట వద్ద అడుగుపెట్టింది మొదలు విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గంలో ప్రవేశించే వరకు ఎన్నో అపూరమైన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ఆగష్టు 14న జిల్లాలో అడుగుపెట్టిన జననేత సెప్టెంబర్ 24న కొత్తవలస వద్ద విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు. జిల్లాలో ఉండగానే పలు పండగలు, వేడుకల్లో పాల్గొని ప్రజలకు మరిచిపోలేని అనుభూతిని కలిగించారు. జిల్లాలో అడుగు పెట్టిన మరుసటి రోజునే స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత దార్లపూడి వద్ద ముస్లిలతో కలిసి బక్రిద్ పండుగ చేసుకున్నారు. రాఖీపౌర్ణమి, వరలక్ష్మి వ్రతం రోజుల్లో సాగిన పాదయాత్రలో దారి పొడవునా వేలాది మంది మహిళలు జననేతకు రాఖీలు కట్టేందుకు పోటీపడ్డారు. ‘జగనన్నకు రాఖీ కట్టడం మా అదృష్టం. ఈ అవకాశం మాకు దక్కుతుందని ఎన్నడూ అనుకోలేదు. మా ఈ కోరిక నెరవేరింది. మేమంతా అన్నతో సెల్ఫీ కూడా తీసుకున్నాం’ అంటూ నర్సీపట్నంలోని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాస్పటల్ నర్సింగ్ సిబ్బంది ఆనందంతో పరవశించిపోయారు. గొట్టివాడలో అపూరూప ఘట్టం పాదయాత్ర సమయంలో ఓ అరుదైన అపూరూపమైన ఘట్టం కోటవురట్ల మండలం గొట్టివాడలో చోటు చేసుకుంది. ఆ రోజు ఆ ఊళ్లో గ్రామదేవత పరదేశమ్మ అమ్మవారి పండుగ. కొండల మధ్య కొలువైన శక్తి వంతమైన అమ్మవారు. శ్రావణమాసంలో తొలి మంగళవారం ఈ అమ్మవారికి పండుగ చేస్తారు. పాత గొట్టివాడ, కొత్తగొట్టివాడ, ములగల్లోవ, గుడెప లోవ, రామచంద్రాపురం గ్రామానికి చెందిన ప్రజలు మొక్కులు తీర్చుకుని అమ్మవార్ని దర్శించుకునేందుకు పోటెత్తారు. అయితే ఆ భక్తజనం అటువైపుగా వెళ్తున్న జనవేల్పును చూసేందుకు బారులు తీరారు. జననేత ఆత్మీయ స్పర్శ కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా నడిరోడ్డుపైనే గంటల తరబడి నిల్చొండిపోయారు. గుండెల్లో దైవంగా కొలుచుకుంటున్న రాజన్న బిడ్డను చూసి పరవశించిపోయారు. తనను చూసేందుకు బాలురు తీరిన వేలాది భక్తులను ఏమాత్రం నిరుత్సాహపర్చకుండా ప్రతి ఒక్కర్నీ పలకరించారు. తమ మనసులోని కోర్కెలను మహానేత తనయుడికి చెప్పుకుని సాంత్వన పొందారు. ఆత్మీయ నేతతో మాట్లాడి..కరచాలనం చేసి తమ గుండె లోతుల్లోని బాధను చెప్పుకున్నారు. ఆ రైతే ఉచిత విద్యుత్‌కు ప్రేరణ మహానేత వైఎస్సార్ బస్సుయాత్రలో భాగంగా ఆ గ్రామానికి వచ్చినప్పుడు తన కష్టాలు చెప్పుకునేందుకు ఆడారి పోలయ్య అనే రైతు కలిసాడు. బెల్లం రైతులే కాదు.. రైతుల బతుకలే బాగులోదు సారూ అనగానే నీకేం కావాలో చెప్పు.. ఏం చేస్తే మీ బతుకులు బాగుంటాయో చెప్పు అని ఆ మహానేత అడిగారు. ‘అయ్యా మాకు విడతల వారీగా కాకుండా పగటి పూటే కరెంట్ ఇప్పించండి. సాగునీటి వసతి కల్పించండి.. ఉచితంగా కరెంట్ ఇస్తే రైతు ఉన్నంత కాలం ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోడు. అంతేకాదు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తే బోర్లు వేసుకుని సాగునీరు లేని ఇతర రైతులకు కూడా ఉచితంగా సాగునీరిస్తాం.. తద్వారా సాగు విస్తీర్ణం పెరుగుతుంది రైతులు బాగుపడతారు’ అని చెప్పగానే మహానేత ముగ్దుడయ్యారు. తప్పకుండా పోలయ్య మంచి మాట చెప్పావు. మనం అధికారంలోకి రాగానే మీ అందరికి ఉచిత కరెంట్ ఇప్పిస్తా అని భరోసా ఇచ్చాడు. అన్నట్టుగానే 2004లో అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలిసంతకం చేశాడు. అప్పుడు మహానేతతో తన అనుభవాలను పాదయాత్రలో తమ ప్రాంతానికి వచ్చిన వైఎస్ జగన్‌ను కలిసి పంచుకున్నారు. వైఎస్ మాదిరిగానే మీరు కూడా రైతుకు మేలు చేసేలా పథకాలు అమలు చేయాలని కోరాడు. జగన్‌కు బెల్లం దిమ్మ, చెరుకు గెడలను బహూకరించి మురిసిపోయాడు. అమ్మా.. అన్న పిలుపుతో పరవశం మహానేత తమ కుటుంబానికి చేసిన మేలుకు గుర్తుగా నాతవరం మండలం ములగపూడి గ్రామానికి చెందిన కొన్నపులోవ తన కుమార్తెకు విజయమ్మ అని పేరు పెట్టుకున్నారు. తమ గ్రామానికి వచ్చిన ఆయన తనయుడు జగనన్ను కలిసి తన బిడ్డను ఆశీర్వదించమన్నారు. ఆ బిడ్డకు మీ అమ్మగారి పేరే పెట్టామని చెప్పగానే జననేత కూడా ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. అమ్మా..అమ్మా అంటూ ఆ చిన్నారిని పిలిచి ఆప్యాయంగా గుండెకు హత్తుకున్నారు. నాతవరం మండలం పీకే గూడెంకు చెందిన పైలా రమణ బాబు, పద్మ దంపతులు కృష్ణాపురం వద్ద జగన్‌ను కలిసి తమ కవలలకు పేర్లు పెట్టమ ని కోరగానే, జననేత వారికి హర్షవర్థని, వర్షవర్థని అని నామకరణం చేశారు. దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.. ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖ జిల్లా పర్యటనలో కనీసం పది మందికి పైగా చిన్నారులకు నామకరణాలు, 50 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. ఎంతో మంది వృద్ధులు, చిన్నారులు జననేతతో సెల్ఫీలు తీసుకుని ఆ మధుర జ్ఞాపకాన్ని తమ గుండెల్లో దాచుకున్నారు. తాపీమేస్త్రి పాటకు విశేష ఆదరణ తగరపువలస: ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రపై చిట్టివలసకు చెందిన తాపీమేస్త్రి ముని రమేష్ రచించిన ‘అన్న వస్తున్నాడు...నవ రత్నాలు తెస్తున్నాడు’పాటకు విశేష ఆదరణ లభించింది. మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్న రమేష్ రెండు నెలల పాటు శ్రమించి తన ఆలోచనలకు పాట రూపం కల్పించాడు. ప్రతిరోజూ దినపత్రికలను చదువుతూ వైఎస్ జగన్‌పై జరుగుతున్న కుట్రలను, ప్రజలు అతనిపై పెట్టుకున్న ఆశలను ఈ పాటలో పొందుపరిచాడు. పాట రాయడానికి చదువు అక్కరలేదని స్పందించే హృదయం ఉంటే చాలని రమేష్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. జగనన్నతో సెల్ఫీ.. మరిచిపోలేను జగనన్నను చూడాలని ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నాను. మాగ్రామానికి వస్తున్నారని తెలిసి చూడటం కోసం కాలేజీ మానేశాను. జగనన్నతో సెల్ఫీ దిగడం ఎప్పటికీ మరిచిపోలేనని ఎస్.రాయవరం మండలం దార్లపూడికి చెందిన పద్మిని తెలిపింది. బాగా చదువుకోవాలని ఎంత ఖర్చయినా తానే భరిస్తానని జగనన్న ఇచ్చిన హామీ నాకెంతో భరోసానిచ్చిందని చెప్పింది. – పద్మిని, దార్లపూడి 2019లో నువ్వే సీఎంవని దీవించా.. నాయనా నిండు నూరేళ్లు చల్లగా ఉండు. నీ కష్టం వృథాగా పోదని, 2019లో నువ్వే సీఎం అవుతావని దీవించానని ఎస్.రాయవరం మండలం దార్లపూడికి చెందిన వెంకటనర్సయ్యమ్మ తెలిపారు. 98 ఏళ్ల వయసులో కూడా ఈమె పాదయాత్రలో దార్లపూడి వద్ద జగన్‌ను కలిశారు. నష్టాల్లో ఉన్న ఏటికొప్పాక చక్కెర కర్మాగారాన్ని ఆదుకోవాలని, కార్మికులకు జీతాలు సక్రమంగా ఇవ్వాలని కోరినట్టు ఆమె తెలిపారు. ఏటికొప్పాక సుగర్ ఫ్యాక్టరీ గేటు వద్ద కుర్చీలో కూర్చొని జగన్ రాకకోసం ఎదురు చూసిన ఈమెను జననేత పలకరించి అధికారంలోకి వస్తే తప్పకండా నష్టాల్లో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలను, కార్మికులను ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. – వెంకటనర్సయ్యమ్మ, -
అడుగులో అడుగులు.. అభిమాన సంద్రాలు
ఒక్క అడుగు లక్షలాది అడుగులకు స్ఫూర్తినిచ్చింది.ఒక్కడిగా మొదలైన పయనం..జగమంత కుటుంబాన్ని ఒక్కటి చేసింది.అభిమానం గూడుకట్టుకుంటే..అచ్చం వైఎస్ జగన్‌లాగే ఉంటుందనే సత్యం అడుగడుగులో కనిపించింది.అక్కచెల్లెమ్మల ఆప్యాయత..అన్నదమ్ముల అనురాగం..అవ్వాతాతల మమతానురాగం..పల్లె ముంగిట్లో పండుగ వాతావరణం..పట్టణాల్లో కోలాహలం.. అన్న రాకఓ సంబరం.చీకట్లను చీల్చుకుంటూ.. కుట్రలకుఎదురొడ్డి నిలుస్తూ..నవోదయానికి నాంది పలుకుతూ..అదిగో జగనన్న..మొక్కవోని ఆశయం దిశగా విజయదుందుభి. అనంతపురం టౌన్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 2017 డిసెంబర్ 4న కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం దాటి జిల్లాలోని గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలంలోని బసినేపల్లి గ్రామంలోకి ప్రవేశించింది. 25 రోజుల పాటు జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 15 మండలాల గుండా 278.6 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. పాదయాత్ర సాగిన పల్లెల్లో పండుగ వాతావరణాన్ని తలపించారు. ప్రతి పల్లెలోనూ జగనన్న వస్తున్నాడంటూ ఆడపిల్లలను, బంధువులను ఇళ్లకు పిలిపించుకున్నారు. ఇంటిముందు కల్లాపి చల్లి, ముగ్గులు వేసి రోడ్డుపై బంతిపూలు పరిచి ఘన స్వాగతం పలికారు. ఆసక్తికరమైన విశేషాలెన్నో.. ♦ యాత్రకు ప్రజలతో పాటు అన్ని కులాలు, ప్ర జా సంఘాలు, విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగసంఘాలు మద్దతు ప్రకటించాయి. హైకోర్టు న్యాయవాదులు చెన్నారెడ్డి, వెన్నపూస రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో 50 మంది న్యాయవాదులు ప్రత్యేక బస్సులో వచ్చి గార్లదిన్నెలో జగన్‌ను కలిసి యాత్రకు సంఘీభావం ప్రకటించారు. ♦ పుట్టపర్తి నియోజకవర్గం రామాపురంలో రష్యా తో పాటు పలుదేశాలకు చెందిన విదేశీయులు కలిశారు. ప్రతి గ్రామంలో నెలకొల్పిన వైఎస్ విగ్రహాలు చూసి ఆరా తీయగా, ఆ మహానేత గొప్పతనం తెలిసిందని, ఆయన కుమారుడు పాదయాత్ర చేస్తున్నారని తెలిసి చూసేందుకు వచ్చామంటూ జగన్‌తో వారు అన్నారు. ఈ సందర్భంగా వారితో పాటు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛోఫెర్రర్, ఏఎఫ్ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి ఉన్నారు. ♦ పాదయాత్ర కదిరి నియోజకవర్గంలోకి చేరగా నే కళ్యాణదుర్గం నియోజవకర్గం కుందుర్పికి చెందిన మహిళలు జగన్‌ను కలిసి ఆయన చేతిలో ఓ మూట పెట్టారు. ‘ఏంటి తల్లి ఇదీ?’అంటూ జగన్ అడగ్గానే ‘అన్నా ఇద్దరమూ కూలి పనికి వెళ్లి దాచుకున్న సొమ్ములో కొంత చిల్లర తెచ్చాం. పాదయాత్ర విజయవంతమయ్యేందుకు మా వంతు భాగంగా ఈ మొత్తాన్ని ఇస్తున్నాం’ అని వారు చెప్పగానే ఆ అభిమానానికి జగన్ కళ్లు చెమర్చాయి. ♦ శింగనమల నియోజకవర్గంలో కృష్ణారెడ్డి అనే రైతు కలిసి భారీ ఇత్తడి నాగలి బహుకరించారు. ‘సార్! నాకు చదువు రాదు. ఫ్లెక్సీలు వేయించలేను. పేపర్లో ప్రకటనలు ఇస్తే ఆ రోజుతోనే ఆ జ్ఞాపకం పోతుంది. అందుకే ఈ నాగలిని ఇస్తున్నా’ అంటూ అతను అభిమానాన్ని చాటుకున్నాడు. ♦ వైఎస్ జగన్మోహన్రెడ్డి 2017డిసెంబర్ 21న పుట్టిన రోజు వేడుకలను పుట్టపర్తి నియోజకవర్గంలో జరుపుకోగా.. క్రిస్మస్ పండుగను కదిరి నియోజకవర్గంలో జరుపుకున్నారు. ప్రారంభం నుంచి.. అమడగూరు మండలం జేకేపల్లి పంచాయతీ ఇద్దేవాండ్లపల్లికి చెందిన తాటిమల్లెల నంజుండు 2017 నవంబర్ 6న ఇడుపులపాయలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ప్రారంభంలో పాలు పంచుకున్నాడు. అప్పటి నుంచి అన్ని జిల్లాల్లోనూ అన్నతో కలసి అడుగేస్తూ ముందుకు సాగాడు. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న పాదయాత్ర నుంచి సాక్షితో ఆయన ఫోన్లో మాట్లాడుతూ.. పాదయాత్రకు, బహిరంగ సభలకు వస్తున్న జనాదరణ చూస్తే రాబోవు ఎన్నికల్లో జగనన్న సీఎం అవడం ఖాయమని పేర్కొన్నాడు. – అమడగూరు మరువలేని రోజులు ప్రజా సంకల్ప పాదయాత్ర జిల్లాలో ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకూ జగనన్నతో కలిసి అడుగు వేశాం. పాదయాత్రలో జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల ను వినడమే కాకుండా.. వాటికి శాశ్వత పరిష్కారాలను ఆయన అన్వేషించారు. రైతులు సంతోషంగా ఉండేందుకు ఏం చేయాలనే ఆంశాలపై రైతులనే అడిగి తెలుసుకున్నా రు. అధికారంలోకి రాగానే రైతులు అందజేసిన ప్రతి సూచనను అమలు చేస్తానంటూ అన్నదాతల్లో ఆత్మస్థైర్యాన్ని నిం పారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించడంతోపా టు, వారి సమస్యలు అంతే ఓపికగా విన్నారు. జగనన్నతో కలిసి నేను వేసిన ప్రతి అడుగు జీవితంలో ఎన్నటికీ మరువలేను. – ఆలూరి సాంబశివారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు జగన్ వెన్నంటే.. కొత్తచెరువు గ్రామానికి చెందిన వాల్మీకి శంకర్.. ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం నుంచి జగన్ వెంటనే నడుస్తున్నాడు. శ్రీకాకుళం నుంచి సాక్షితో ఫోన్లో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గృహనిర్మాణశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసేవాడిని. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విధుల నుంచి తప్పించారు. కుటుంబానికి ఆధారం లేకుండా పోయింది. జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనేదే నా లక్ష్యం. అందుకే పాదయాత్రలో జననేత వెంటే ఉన్నా. జగన్ సీఎం కావడం తథ్యం. – కొత్తచెరువు జగన్‌ను సీఎంగా చూడాలి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో 12 నెలల పాటు ఆయనతో పాటు కలిసి నడిచా. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నా. జగన్నను ముఖ్యమంత్రిగా చూడాలనేది నా కోరిక. ఈ జన్మకు ఇది చాలు. నా భార్య, తల్లి కూడా పూర్తిగా సహకరించారు. – రాంభూపాల్‌రెడ్డి పాపంపేట, అనంతపురం -
సంకల్ప స్మృతులు
జనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యా తెలుసుకోవాలనుంది. వాళ్లతో కలిసి నడవాలనుంది. వాళ్ల గుండెచప్పుడు వినాలనుంది. అందుకే ప్రతి గడపకూ వస్తున్నా.– ప్రజాసంకల్పయాత్ర మొదలు పెట్టిన రోజు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్న మాటలు ఇది అక్షర సత్యమైంది. చరిత్రలో లిఖితమైంది. ప్రజా సంకల్ప యజ్ఞం జిల్లాలోని ప్రతి గడపనూ తాకింది. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని అక్కున చేర్చుకుని ఓదార్పునిచ్చింది. దీనులకు అభయాన్ని అందించింది. యువతలో ఉత్తేజాన్ని నింపింది. రాజకీయంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ‘అన్నొస్తున్నాడ’నే భరోసానిచ్చింది. నేటికీ ఆ గురుతులు పదిలం. జనం దాచుకున్న జ్ఞాపకాలే దీనికి సాక్ష్యం. చిత్తూరు, నగరి : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించే రోజునే నగరి మండలం ముడిపల్లి గ్రామానికి చెందిన ప్రకాష్ ఒక నిర్ణయానికి వచ్చాడు. ప్రజాసంకల్ప యాత్ర విజయవంతం కావాలని వేంకటేశ్వరస్వామిని వేడుకున్నాడు. యాత్ర ముగిశాక శ్రీవారికి తలనీలా లు సమర్పిస్తానని మొక్కుకున్నాడు. ఇప్పటివరకు అదే సంకల్పంతో జగన్ వెంట నడుస్తూ వస్తున్నాడు. యాత్ర ప్రారంభంలో ఇడుపులపా య నుంచి ఎర్రగుంట్ల నియోజకవర్గం పోట్లదుర్తి వరకు 6 రోజులు, మైదుకూరు నుంచి ఆళ్లగడ్డ వరకు 4రోజులు, అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో 4రోజులు, చిత్తూ రు జిల్లా దామలచెరువు నుంచి శ్రీకా ళహస్తి వరకు, నెల్లూరు జిల్లా వెంక టగిరి నియోజకవర్గంలో 3 రోజులు, గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో 3 రోజులు, విజయవాడ వంతెనపై నుంచి విజయవాడ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్, మైలవరం, నూజి వీ డు, గన్నవరం, పెనమలూరు, పామ ర్రు, మచిలీపట్నం, పెడన, గుడివాడ ప్రాంతాల్లో 20 రోజులు, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, గోపాలప ట్నం, ఉంగుటూరు, దెందులూరు, పాలకొల్లు, కొవ్వూరులో 8 రోజులు, తూర్పుగోదావరి జిల్లాలో రాజమం డ్రి వంతెన నుంచి రాజోలు, అమలాపురం ప్రాంతాల్లో పది రోజులు, విజయనగరం జిల్లాలో 3వేల కిలో మీటర్ల సంబరంలోనూ పాల్గొన్నా డు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లా డుతూ ‘గతేడాది జనవరి 9న పెనుమూరు సమీపంలో స్థానిక చెరకు రైతుల సాధకబాధకాల గురించి జగనన్నకు తెలియపరిచా. అప్పుడు ఆయన నేను ఇచ్చిన చెరకు రసం తాగారు. ఆ అనుభూతి నేను మరువలేను. ఈనెల 10న తిరుపతి నుంచి పాదయాత్రగా వెళ్లి శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకుంటా’ అని తెలిపాడు. అవన్నీ మరిచిపోయా..! పలమనేరు:‘నేను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానిని. ఆయనను నా గుండె గుడిలో గూడుకుట్టుకున్నాను. అలాంటి మహానుభావుడి మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తున్నాడని తెలిసి ఉప్పొంగిపోయా. ఆయనతో కలిసి నడవాలని తాపాత్రయపడ్డా. ఇడుపులపాయకెళ్లి అక్కడ జరిగిన పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నా. ఆ జిల్లా మొత్తం పూర్తయ్యేవరకు పాదయాత్రలోనే ఉన్నా. అప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. చెరువులు, బావుల వద్ద స్నానం చేశా. భోజనం కూడా చేయని రోజులున్నాయి. తర్వాత జగన్మోహన్రెడ్డిని కలిసి కొంత దూరం నడిచా. చాలా సంతోషం అనిపించింది. ఆ బాధలన్నీ మరిచిపోయా’నని పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలం పట్రపల్లెకు చెందిన వాసు గుర్తు చేసుకున్నారు. త్వరలో ప్రజాసంకల్పయాత్ర ముగియనున్న నేపథ్యంలో ఆయన తన మధుర జ్ఞాపకాన్ని నెమరువేసుకున్నారు. – వాసు, వి.కోట అన్నొచ్చాడు చిత్తూరు అర్బన్:‘మాది పూతలపట్టు. 2014 ఎన్నికల్లో రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. కానీ మాకు ఒక్క రూపాయీ మాఫీ కాలేదు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కట్టొద్దని చెప్పడంతో మానేశాం. రూ.9 వేలు అసలుకు మూడేళ్లలో వడ్డీ కలిపి రూ.20 వేలు అయింది. ప్రభుత్వం ఎలాంటి నగదు మా ఖాతాల్లో వేయలేదు. తీసుకున్న అప్పును వడ్డీతో కలిపి కట్టాల్సిందేనని బ్యాంక్ అధికారులు చెప్పారు. మాకు జరిగిన అన్యాయాన్ని, నాయకులు చేసిన మోసాన్ని అన్న (వైఎస్.జగన్)కు చెప్పాం. నేనున్నాను.. మీకేం కాదు.. మంచి రోజులు వస్తాయి.. మీ సమస్యలను తీరుస్తానని అన్న మాటిచ్చారు. – భాగ్యలక్ష్మి, పూతలపట్టు ఉపాధి కల్పిస్తానన్నారు.. ‘నేను గత ఏడాది బీ.టెక్ పూర్తిచేశా. పూ తలపట్టు వద్ద పాదయాత్రలో జగనన్నను కలిశా. ఆయన సొంత చెల్లెలుగా చూశారు. చిత్తూరు జిల్లా కేంద్రం లో ఎలాంటి ఉపాధి, విద్యాకేంద్రాలు లేవు.. ఉన్నత చదువుల కోసం బెంగళూరు, చెన్నై వెళ్లాల్సి వస్తోందని చెప్పా. సమస్యలన్నీ జగనన్న ఓపిగ్గా విన్నారు. మన ప్రభుత్వం ఏర్పాటయ్యాక యువతకు చిత్తూరులో మంచి ఉపాధి అవకాశాలు కల్పించేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఆయన మాటపై మాకు నమ్మకం ఉంది. – గౌతమి, కట్టమంచి, చిత్తూరు భవితకు బంగారు మాట కలికిరి:‘అప్పుడు కలికిరి మండల పరిధిలో ప్రజాసంకల్పయాత్ర జరుగుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సార్‌ని కలవాలని మా కుటుంబం అంతా ఎదురుచూసింది. చాలా కష్టమనిపించింది. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కొన్ని రోజుల తర్వాత జగన్‌సార్‌ని కలిశాం. ఆయన ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఏమి చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు ? ఎలా చదువుతున్నావు..? అని అడిగారు. ఆర్థిక ఇబ్బందులతో చదువు సాగించడం కష్టమవుతోందని చెప్పా. సార్.. వెంటనే స్పందించారు. తమ ప్రభుత్వం వస్తే ఉన్నత చదువులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని ధైర్యం చెప్పారు. ఆ మధుర జ్ఞాపకాన్ని నా జీవితంలో మరువలేను.’ – సాయిచరణ్‌రెడ్డి, విద్యార్థి, కలికిరి అన్న అంకితభావానికి ఫిదా! తిరుపతి రూరల్: మాది తిరుపతి రూరల్ మండలం పద్మావతీపురం. పార్టీలకు అతీతంగా ప్రజలు అశీర్వదించడంతో పంచాయతీ సర్పంచ్‌గా గెలిచా. నాపై నమ్మకంతో మండల సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో భాగంగా రామచంద్రాపురం మండలం నెమ్మళ్లగుంటపల్లికి వెళ్లా. అక్కడ సదస్సులో మాట్లాడే అవకాశమొచ్చింది. పంచాయతీల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్ష, నిధులు అందించకుండా వేధిస్తున్న తీరు, చేపట్టాల్సిన చర్యలపై ఆయనకు వివరించాను. ప్రతి సమస్యను సానుకూలంగా ఆలకించడమే కాకుండా ముందు చూపుతో వాటిని పరిష్కరించేందుకు తాను చేపట్టే చర్యలను ఆయన చెప్పిన విధానం ఎంతో నచ్చింది. ప్రజా సమస్యల పట్ల ఆయనకున్న విజన్ ఎంతో ఆకట్టుకుంది. ఆయన అంకితభావానికి ఫిదా అయ్యాను. ఆయనతో నడిచాను. ప్రాణం ఉన్నంత వరకు ఆయన పార్టీలో కొనసాగుతా. పాదయాత్ర తర్వాత పూర్తిస్థాయి జగనన్న సైనికుడిగా మారా. – వి.గణపతినాయుడు, పద్మావతిపురం నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం మదనపల్లె: సీపీఎస్ రద్దు కోసం గళమెత్తినా ధైర్యం చెప్పేవారు లేరు. ఆందోళనలు చేసినా పట్టించుకునే నాథుడే లేకుండాపోయారు. అందుకే జగనన్నను కలిశాం. అక్కడ ఆయన్ను చూస్తే ఆశ్చర్యమేసింది. ఏ నమ్మకంతో ఒక వ్యక్తి వెనుక ఇంతమంది ప్రజలు, అభిమానులు వెంట పడుతున్నారనుకున్నా. ఆయన నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం. అందుకే సీపీఎస్ రద్దు చేయాలని ప్లకార్డులు చూపించాం. ఆయన ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఉద్యోగుల కష్టాలు తీర్చుతామని ధైర్యం చెప్పారు. ప్లకార్డులు చేతబట్టి మాతోపాటు నినాదాలు చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని భరోసా ఇచ్చారు. ఆ మధుర జ్ఞాపకం ఇప్పటికీ నా కళ్లెదుటే కదలాడుతోంది. ఆయన పాదయాత్ర విజయవంతం కావాలని ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్థించా. – సరస్వతి, ఉపాధ్యాయురాలు, పీలేరు -
మా ఆశవు నీవే.. మా శ్వాసవు నీవే...
-
స్మృతి పథంలో.. ప్రజాసంకల్పం
జిల్లాలోని వీరఘట్టం మండలం కడ కెల్ల వద్ద నవంబర్ 25న ప్రవేశించిన రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర.. అడుగడునా ప్రజలకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతుంది. ఈ సందర్భంగా తమ సమస్యలను చెప్పుకోవడం, జగన్ ఆత్మీయ పలకరింపునకు నోచుకోవడం, కలిసి నడవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయనతో కలిసి నడిచిన వారంతా గుర్తు చేసుకున్నారు. పాదయాత్రలో భాగంగా.. వీరఘట్టం మండలంలో ఆదివాసీలతో కలిసి పాదం కలిపి.. గిరిజన సంప్రదాయ నృత్యం చేసిన ప్రతిపక్ష నేత అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే ఆమదాలవలస నియోజకవర్గంలో నైరా కళాశాల వద్ద విద్యార్థులు చేపట్టిన దీక్షా శిబిరానికి చేరుకున్న ఆయన.. ఓ అన్నలా తమ అవస్థలను కింది కూర్చుని ఓపిగ్గా విని భరోసా ఇచ్చారు. నరసన్నపేట నియోజకవర్గంలో జగన్‌ను కలిసిన నూతన దంపతులు ఆయన ఆశీర్వాదంతో పాటు సెల్ఫీ కూడా తీసుకొని అనుబంధాన్ని భద్ర పరుచుకున్నారు. ఇక టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాళి మండలంలో జగన్‌ను చూసేందుకు 2 కిలోమీటర్లు పరుగులెత్తి వచ్చిన చిన్నారి.. ఆయనను చూసిన ఆనందంలో కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ప్రతిపక్ష నేత ఆ చిన్నారిని ఓ తండ్రిలా గుండెలకు హత్తుకుని, ఓదార్చిన తీరు అందరినీ.. కంటతడి పెట్టించింది. ఇటువంటి ఎన్నో మధుర స్మృతులకు వేదికైన ప్రజా సంకల్పయాత్రలో మజిలీల్లో కొన్ని.. శ్రీకాకుళం ,సీతంపేట: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాలకొండ నియోజకవర్గంలోకి ప్రవేశించిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి గిరిజనులు సవర నృత్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. వీరఘట్టం మండలం మరియగిరి వద్దకు పాదయాత్ర చేరుకునే సరికి అక్కన్నగూడ, ఈతమానుగూడ గిరిజనులు సవర సాంప్రదాయ నృత్యాలు చేశారు. అలాగే డప్పుల వాయిద్యాలతో అలరించారు. వీరి నృత్యాలు చూసిన జగన్.. వారితో కలిసి అడుగు కలిపారు. నూతన ఉత్తేజాన్ని నింపింది వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలసి ప్రజా సంకల్పయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉంది. జిల్లాలో పాదయాత్ర ప్రారంభమైన అనంతరం రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం కనిపిస్తుంది. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు వచ్చిన జగన్‌కు నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం లభించింది. రాజాంలో నిర్వహించిన బహిరంగ సభకు వేలాదిగా జనం తరలి వచ్చారు. ఊహకందని ఈ ప్రజాభిమానం చూస్తుంటే రాజాంలో వైఎస్సార్ అభిమానులు పుష్కలంగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో ఇక్కడ పార్టీ గెలుపు నల్లేరుపై నడకని తెలుస్తుంది. నియోజకవర్గంలో మొత్తం 37.5 కిలోమీటర్లు ప్రజాసంకల్ప యాత్ర సాగింది. ఇదే సభలో పిల్లల ఉన్నత చదువులకు మొత్తం ఖర్చు భరిస్తామని హామీ ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది. ఓపిగ్గా ప్రజల సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించడం గొప్ప విషయం. ఇంత ఓపికా, సహనం చాలా తక్కువ మందికే ఉంటుంది. కచ్చితంగా జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ప్రజల సమస్యలను తీరుస్తారు.– కంబాల జోగులు, శాసనసభ్యుడు, రాజాం