
రాములును పలకరిస్తున్న వైఎస్ జగన్ (ఫైల్)
నాలుగేళ్ల టీడీపీ దుష్టపాలనలో ఎన్నో కష్టనష్టాలకు గురైన జిల్లా ప్రజలకు ఆయన వెలుగురేఖలా కనిపించారు. ఆయన ఓదార్పే చాలు అన్నట్టుగా ప్రజలు ఆయన రాక కోసం గంటలతరబడి రోడ్లపై నిరీక్షించారు.
తమ కష్టసుఖాలు చెప్పుకునిసాంత్వన పొందారు. మా ఆశా నీవే.. శ్వాస నీవే.. అంటూ నినదించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర జిల్లా ప్రజలకు భవిష్యత్తుపై భరోసాఇచ్చింది. కష్టాలు ఎల్లకాలం ఉండవని, త్వరలోనే సంక్షేమ రాజ్యం సిద్ధిస్తుం దన్న కొండంత ధైర్యాన్నిచ్చింది.
ఏలూరు టౌన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో దారి పొడవునా.. ఎన్నో కన్నీటి గాథలు, వ్యథలు.. ఎన్నో చెమర్చిన కళ్లు.. మరెన్నో అలసిన గుండెలు.. అందరికీ భరోసా ఇస్తూ.. అందరిలో ధైర్యాన్ని నింపుతూ ఆయన ముందుకు సాగారు. ప్రజలు తమ సమస్యలు జగన్‌తో చెప్పుకునేందుకుబారులు తీరారు. అవ్వా తాతలు పింఛన్ రావడం లేదని, అక్కచెల్లెమ్మలు, రైతులు రుణాలు మాఫీ కాలేదని, నిరుద్యోగులు భృతి అందలేదని, ఉద్యోగం రాలేదని, గూడులేని పేదలు ఇళ్లు లేవని, అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు ఇలా.. చెప్పుకుంటూ పోతే.. ఎన్నో ఎన్నెన్నో కన్నీటి కథలు.. వైఎస్ జగన్‌ను చలింపజేశాయి. వారిలో కొందరికి తక్షణ సాయం చేసిన వైఎస్ జగన్.. మరికొందరిని ఓదార్చారు. త్వరలోనే సమస్యలు పరిష్కరమవుతాయని భరోసా ఇచ్చారు. త్వరలోనే మనందరి ప్రభుత్వం వస్తుందని, అందరి సమస్యలు పరిష్కారమవుతాయని ధైర్యం చెప్పారు.
అడుగడుగునా.. ఆదరణ
ప్రజలు అడుగడుగునా వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. ఆయనతోపాటు నడిచేందుకు పోటీపడ్డారు. దారిపొడవునా.. ఆయనతో కరచాలనానికి, సెల్ఫీలకు యువత, రైతులు, మహిళలు ఆసక్తి చూపించారు. మహిళలు అడుగడుగునా హారతులు పట్టి విజయీభవ అంటూ దీవించారు. కొందరు ఆయన వెంట నడిచారు.
అన్నివర్గాల వారికీ వరాలు
వైఎస్ జగన్ పాదయాత్రలో అన్నివర్గాల వారికీ వరాలు ప్రకటించారు. ఆటోవాలాలకు ఆర్థికసా, ఆక్వాకు విద్యుత్‌చార్జీల తగ్గింపు, గిరిజనులు, దళితులు, బలహీనవర్గాలు, లాయర్ల సంక్షేమానికి కృషి వంటి హామీలు ఇచ్చారు. సంచారజాతులకు వరాలు ప్రకటించారు.
రాములు ఇంటికెళ్ళి పరామర్శించి..
ఏలూరు మండలం పాలగూడెం వద్ద భారీ జనసందోహం మధ్య వస్తున్న జగన్ వద్దకు జయశ్రీ అనే విద్యార్థిని వచ్చి అన్నా... రాజశేఖరరెడ్డిగారి అభిమాని తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టారు. మిమ్మల్ని చూడాలని అంటున్నారు.. అని చెప్పింది. వెంటనే జగన్‌మోహన్‌రెడ్డి క్షణం ఆలోచించకుండా ఇరిగేషన్ శాఖలో లస్కర్‌గా పనిచేసి రిటైరైన కఠారి రాములు ఇంటికి చేరుకున్నారు. కామెర్లు, లివర్ సమస్యతో బాధపడుతున్న ఆయనను ఆప్యాయంగా పలకరించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పలకరింపుతో రాములు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
చిన్నారుల ప్రాణాలు కాపాడిన జననేత
దెందులూరు: పాదయాత్ర... ఓ చల్లని మనస్సు దాతృత్వం ఒకే గ్రామానికి చెందిన రెండు కుటుంబాల్లో శాశ్వత ఆనందాన్ని నింపింది. ఒకరు ఆరేళ్ల బాలుడు మణికంఠ కాగా.. .. మరొకరు నెలలు నిండని చిన్నారి.. ఇద్దరిదీ ఒకటే సమస్య తలలో నీరు పట్టింది.. ఇద్దరిదీ ఒకటే గ్రామం. పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరు మండలం సీతంపేట. గ్రామానికి చెందిన సాయి మణికంఠ, పొలుకొండ ప్రసాద్, శ్రావణి దంపతుల నెలల నిండని చిన్నారి. ఇద్దరూ తలలో మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో రెండు కుటుంబాలు తమ శక్తికి మించి ఖర్చు పెట్టాయి. సాయిమణికంఠకు రూ.ఆరు లక్షలు అవుతాయని, ప్రసాద్, శ్రావణి దంపతుల చిన్నారికి రూ.13 లక్షలతో అపరేషన్ చేయాలని పరీక్షలు చేసిన వైద్యులు చెప్పటంతో ఆ రెండు కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. ఏం చేయాలో తెలియక కన్నీటి పర్యంతమయ్యాయి. ఇదే సమయంలో దెందులూరు మండలం శ్రీరామవరంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మణికంఠ తల్లిదండ్రులు కలసి సమస్యను వివరించారు. వెంటనే రూ.ఆరు లక్షలతో పెద్ద తిరుపతిలో వైద్యం చేయించేందుకు అంగీకరించి నగదును వైద్యశాలకు చెల్లించి సాయిమణికంఠకు చికిత్స చేయించారు. గత నెలలో శ్రీకాకుళంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ వద్దకు సీతంపేట గ్రామానికి చెందిన ప్రసాద్, శ్రావణిలు నెలలు నిండని చిన్నారిని తీసుకువెళ్లి సమస్యను వివరించారు. చలించిపోయిన ఆయన చిన్నారిని కాపాడేందుకు రూ.13 లక్షలతో చిన్నారి మెదడుకు ఆపరేషన్ చేయించారు. ఇప్పుడు ఆ ఇద్దరు చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్నారు