జగన్‌ సంకల్పం... జన సంక్షేమం | YSRCP Party Celebrate 5 Years Of Prajasankalpa Yatra Across District | Sakshi
Sakshi News home page

జగన్‌ సంకల్పం... జన సంక్షేమం

Published Mon, Nov 7 2022 8:45 AM | Last Updated on Mon, Nov 7 2022 9:18 AM

YSRCP Party Celebrate 5 Years Of Prajasankalpa Yatra Across District - Sakshi

సాక్షి, పుట్టపర్తి: ప్రజా సంకల్పయాత్రలో అన్ని   వర్గాలను పలకరించిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక ‘నవరత్నాలతో’ రాష్ట్రంలో సంక్షేమ బాట పరిచారని ఎమ్మెల్యేలు తెలిపారు. ‘ప్రజాసంకల్ప యాత్ర’ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం వైఎస్సార్‌సీపీ శ్రేణులు జిల్లా అంతటా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. అన్నదానాలు, పేదలకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేసి నాయకులు సేవాభావం చాటుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి కేక్‌ కట్‌ చేసిన అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడారు.  


పెనుకొండలో వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎంపీ గోరంట్ల మాధవ్‌ 

  • వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంకల్ప యాత్ర చరిత్ర సృష్టించిందని ఎమ్మెల్యే శంకరనారాయణ తెలిపారు. పేదల కన్నీళ్లు తుడిచి సీఎం జగన్‌ వారి గుండెల్లో నిలిచారన్నారు. పెనుకొండలో నాయకులతో కలిసి ఆయన కేట్‌ చేశారు.
  • ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. పెనుకొండలో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులరి్పంచిన అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌ పరిపాలనలో తనదైన మార్కు చూపించారని కొనియాడారు.  
  • రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. ప్రజా సంక్షేమానికి నాంది పలికిన మహా ఘట్టం ‘ప్రజా సంకల్ప యాత్ర’ అని అభివర్ణించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాల ప్రజలకు పథకాలు వర్తింపజేసి.. జనం మెచ్చిన నేతగా జగన్‌ నిలిచిపోయారన్నారు. 
  • సంక్షేమ పాలన ద్వారా జగన్‌ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి పేర్కొన్నారు. అమడగూరు మండలం గొల్లపల్లిలో భారీ కేక్‌ను ఎమ్మెల్యే కట్‌ చేసి నాయకులు, పిల్లలకు పంచిపెట్టారు.   


మడకశిరలో వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే తిప్పేస్వామి  

  • మడకశిర పట్టణంలోని వైఎస్సార్‌ సర్కిల్‌లో ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే తిప్పేస్వామి వైఎస్సార్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్‌ కట్‌ చేశారు. ప్రజా సంకల్పయాత్ర స్ఫూర్తితోనే సీఎం జగన్‌ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. 
  • వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’కు ఐదేళ్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి పేర్కొన్నారు. కదిరి పట్టణంలోని వైఎస్సార్‌ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘన నివాళి అరి్పంచారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు.  
  • హిందూపురంలో జయహో జగన్‌ నినాదం మార్మోగింది. దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులరి్పంచిన అనంతరం భారీ కేక్‌ను ప్రజాప్రతినిధులు, నాయకులు కట్‌ చేశారు. పేదలకు అన్నదానం చేసి సేవాభావం    చాటుకున్నారు.  
  • ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని అన్ని     మండలాల్లో వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ధర్మవరం పీఆర్‌టీ సర్కిల్‌లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు.    

(చదవండి: ఫ్యామిలీ డాక్టర్‌’: వైద్యం మరింత చేరువ)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement