సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’ పేరిట శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు.మంత్రులు, నాయకులు కేక్ కట్ చేశారు. వివిధ మతాల పీఠాధిపతులు సర్వమత ప్రార్థనలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, షర్మిల, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముగ్గురితో కలిసి పాదయాత్ర చేసిన రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులను మంత్రులు ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్న బాబు, అనిల్ కుమార్ యాదవ్, వేణుగోపాల కృష్ణ, కార్యాలయ ఇంచార్జ్ లేళ్ల అప్పిరెడ్డి, లక్ష్మీ పార్వతి, ధు సూధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: వైఎస్ జగన్ పాదయాత్రకు మూడేళ్లు)
వైఎస్సార్ జిల్లా: బద్వేలులో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు గురుమోహన్, రాజగోపాల్‌రెడ్డి, సుందరరామిరెడ్డి, గోపాలస్వామి యద్ధారెడ్డి శ్రీనివాసులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పోరుమామిళ్లలోని వైఎస్సార్ విగ్రహాలకు మాజీ ఎంపీపీ చిత్తా విజయ్ ప్రతాప్‌రెడ్డి, మండల కన్వీనర్ బాష, వైఎస్సార్‌సీపీ నాయకులు,కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు.
కృష్ణాజిల్లా: జగ్గయ్యపేట పట్టణంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో 18, 20,21 వార్డులో ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి ఆయన వివరించారు. ప్రజా సమస్యలను వినతిపత్రాల ద్వారా సేకరించి అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తన్నీరు నాగేశ్వరరావు, ముత్యాల వెంకటాచలం, చోడవరపు జగదీష్, తుమ్మల ప్రభాకర్, నంబూరి రవి, పలు శాఖల అధికారులు, వాలంటీర్లు, బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో..
ప్రజా సంకల్పానికి పునాదిపడి మూడేళ్లయిన సందర్భంగాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ‘వంగవీటి మోహన్‌రంగా బస్టాఫ్’ను ప్రారంభించారు. అనంతరం దేవీనగర్ నుంచి ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకొంటూ ఎమ్మెల్యేలు ముందుకు సాగుతున్నారు.
పశ్చిమగోదావరి: జిల్లాలో ‘ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు’ పేరిట ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పెదవెల్లమిల్లి గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభించారు. పోలవరం నియోజకవర్గంలో పాదయాత్రలు ప్రారంభమయ్యాయి. కొయ్యలగూడెం మండలం డిప్పకాయలపాడు గ్రామంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాదయాత్ర ప్రారంభించారు. చింతలపూడి నియోజకవర్గంలో పాదయాత్రలు ప్రారంభమయ్యాయి. జంగారెడ్డిగూడెం తన క్యాంప్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే వి.ఆర్.ఎలిజా పాదయాత్ర ప్రారంభించారు. పాలకోడేరు మండలం కొండేపూడి గ్రామంలో ‘ప్రజల్లో నాడు- ప్రజలకోసం నేడు’ పాదయాత్ర ప్రారంభించారు. ఉండి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేత పీవీఎల్ నరసింహారాజు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా: ప్రజా సంకల్పయాత్ర మూడేళ్లు పురస్కరించుకొని ‘ప్రజల్లో నాడు- ప్రజల్లో నేడు’ పేరిట ప్రజా చైతన్య కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కర్నూలు వైఎస్సార్ సర్కిల్ నుంచి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాదయాత్రను ప్రారంభించారు.
విశాఖ జిల్లా: ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తయి మూడేళ్లయిన సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’ పేరుతో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కేకే రాజు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కుంభ రవిబాబు తదితరులు పాల్గొన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో సమన్వయకర్త మళ్ళ విజయప్రసాద్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు . ‘జై జగనన్న జై జై జగనన్న మేము ఉన్నామన్న’ అనే నినాదంతో ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోపాలపట్నం పెట్రోల్ బంకు దగ్గర నుంచి కంచరపాలం వరకు ర్యాలీ నిర్వహించారు.
చోడవరం పట్టణంలో ఎల్ఐసీ కోలనీ దగ్గర నుండి కొత్తూరు జంక్షన్ వరకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహనికి పూల మాల వేసి నివాళర్పించారు.మునగపాక మండలం ఉమ్మలాడలో యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు.. దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళర్పించారు. నాతవరం మండలం మాధవనగరంలో ప్రజాచైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఈ పాదయాత్రలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు. ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా అనకాపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో దాడి రత్నాకర్, దంతులూరి దిలీప్ కుమార్, మళ్ల బుల్లిబాబు, మందపాటి జానకిరామరాజు, గొర్లి సూరి బాబు, గొల్లవిల్లి శ్రీనివాసరావు, పలకా రవి, జాజుల రమేష్ పాల్గొన్నారు. మునగపాకలో గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ కేక్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment