awareness programs
-
అనుభవంతో అధికారంలోకి వచ్చా
చీమకుర్తి: అనుభవాన్నంతా ఉపయోగించా.. అందుకే 93 శాతం సీట్లను గెలిపించుకున్నా అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. కూటమి 21 ఎంపీ సీట్లు కూడా గెలవటంతో ఢిల్లీలో పరపతి పెరిగిందన్నారు. ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ పేరుతో శుక్రవారం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో చంద్రబాబు మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో జరగాల్సిన కార్యక్రమం వాయిదా పడటంతో ఆకస్మికంగా ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అన్ని శాఖల్లో సర్వే చేసి ఏడు శ్వేత పత్రాలను విడుదల చేశానన్నారు. రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్లు అప్పు ఉందని, వాటికి ఏటా రూ. 1 లక్ష కోట్లు వడ్డీ కట్టాల్సి ఉందన్నారు. అందుకోసం సంపద సృష్టించి గాడితప్పిన పాలనను గాడిలో పెడుతున్నానన్నారు. రూ. 99కే నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పారు. దగ్గరలోనున్న ఇసుకను ట్రాక్టర్ల ద్వారా లేక ఎడ్ల బండ్లపైన లేక నెత్తిమీద పెట్టుకోనైనా తెచ్చుకోవచ్చని అన్నారు. దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. గత ప్రభుత్వం నాసిరకం నెయ్యితో తిరుమల పవిత్రతను దెబ్బతీసిందన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిని వదిలిపెట్టమంటారా? అంటూ ప్రశ్నించారు. నంగనాచి మాటలు మాట్లాడుతున్న మాజీ చైర్మన్ ఈ జిల్లాలోనే ఉన్నాడని, ఆయన పేరు తాను చెప్పనని అన్నారు (మనం అధికారంలోకి వచ్చాక తిరుపతి లడ్డు ఎవరైనా తిన్నారా తమ్ముళ్లూ అని రెండు సార్లు అడిగినా.. జనం నుంచి స్పందన లేదు). ఇక నుంచి ప్రతి నెలా 1న ‘పేదల సేవలో’ పేరుతో నిర్వహించే కార్యక్రమంలో పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. అక్టోబర్ అంతా ప్రతి గ్రామంలో ఇలాంటి సభలే ఏర్పాటు చేసి నిజమైన అర్హులకు కొత్త పెన్షన్లు అందజేస్తామని, అదే సభలో దొంగ పెన్షన్లపై విచారణ చేస్తామన్నారు. మగవాళ్లూ... అర్థమైందా.. జనాభా తగ్గుతోందని, పిల్లలను పుట్టించకపోతే భవిష్యత్‌లో సమస్యలు వస్తాయని, అందుకే ఆడవారికి పనులు చెప్పటం తగ్గించి మగవారు ఆ పనిలో ఉండండి అంటూ చంద్రబాబు సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా ‘‘మగవారికి అర్థమైందా...?’’ అంటూ ప్రశ్నించారు. 15 ఏళ్ల క్రితం తానే జనాభా నియంత్రణ మార్గాలను అమలు చేశానన్నారు. దాని వలన జనాభా తగ్గిందన్నారు. రాబోయే ఐదేళ్లలో జనాభాను పెంచేందుకు పాప్యులేషన్ మేనేజ్మెంట్ పేరుతో రాష్ట్రంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక మహిళా సర్పంచ్‌ని గ్రామంలో ఇంటింటికీ తిరిగి జనాభా పెంచేందుకు అవగాహన కల్పించాలంటూ సీఎం సూచించారు. కార్యక్రమం తర్వాత కొంతమంది ఇళ్లకు వెళ్లి చంద్రబాబు మాట్లాడారు. -
ర్యాగింగ్, డ్రగ్స్‌పై సమరభేరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ర్యాగింగ్, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ఇప్పటికే ఈ అంశంపై అన్ని స్థాయిల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఈ నెల 17న హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసవుతున్న ఉదంతాలు కొంతకాలంగా పెరుగు తున్నాయి. రాష్ట్రంలో పలు యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇవి వెలుగు చూశాయి. వీటి వెనుక మాదకద్రవ్యాల మాఫియా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తొలి దశలో విద్యార్థుల్లో అవగాహన పెంచాలని ప్రభుత్వ నివేదికలు పే ర్కొంటున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు బయటపడకుండా యాజమాన్యాలు జాగ్రత్త పడుతున్నాయి. ధనిక విద్యార్థులు చదివే కాలేజీల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపడు తున్న చర్యలు ఆశించినంతగా లేవని నిఘా వర్గాలు ప్రభుత్వానికి చెప్పాయి. మాదక ద్రవ్యాలతో సంబంధం ఉన్న వారిని గుర్తించి, కౌన్సెలింగ్ ఇవ్వడాని కి గల ఏర్పాట్లపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. కౌన్సెలింగ్ తర్వాత కూడా ఈ దిశగా అడుగులేసే విద్యార్థులపై చట్టప రమైన చర్యలకు ఉపక్రమించాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన చట్టాలను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు తెలియజేసేందుకు కాలేజీలు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఉన్నత విద్యామండలి ఆదేశించింది. ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలువిద్యాసంస్థల్లో ర్యాగింగ్ తీవ్రంగా ఉందని అధికారులు భావిస్తున్నారు. గ్రామీణ విద్యార్థులు ఎక్కువగా ర్యాగింగ్‌కు గురవుతున్నట్లు గుర్తించారు. కొన్ని విద్యాసంస్థల్లో కుల వివక్షతో కూడిన ర్యాగింగ్ జరుగుతోందని చెబుతున్నారు. ఇలాంటి ఉదంతాలపై కొరడా ఝుళిపించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇటీవల రాష్ట్రాలకు ఆదేశాలు పంపింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను కూడా వెల్లడించింది. ప్రతి కాలేజీలోనూ ర్యాగింగ్, మాదక ద్రవ్యాల కట్టడికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇందులో ఫ్యాకల్టీతోపాటు, సీనియర్ విద్యార్థులు, ఉన్నత అధికారులను భాగస్వాము లను చేయాలని పేర్కొంది. అయితే, ఏఐసీటీఈ మార్గదర్శకాలు ఎక్కడా అమలవ్వడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విద్యా సంవత్సరం నుంచి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.17న ఉన్నతస్థాయి సదస్సువిద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల నిరోధం, ర్యాగింగ్ అంశాలపై ఈ నెల 17న జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీలో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి డీజీపీ జితేందర్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కాలేజియేట్ కమిషనర్ దేవసేన, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య హాజరవుతున్నారు. యాంటీ ర్యాగింగ్, మాదక ద్రవ్యాల నియంత్రణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.ఉపేక్షించేది లేదుమాదక ద్రవ్యాల వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. ఈ విషయంలో ఎంతటివారున్నా కఠినంగా చర్యలు తప్పవు. ఈ దిశగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. మాదక ద్రవ్యాల వినియోగంపై సమాచారం ఉంటే విద్యార్థులు స్వేచ్ఛగా మా దృష్టికి తేవాలి. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ర్యాగింగ్ భూతాన్ని పారదోలాలి కాలేజీల్లో ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే సూచించాం. ఇక నుంచి దీన్ని మరింత విస్తృతం చేస్తాం. కొత్తగా కాలేజీలకు వచ్చే వారిలో మనోనిబ్బరం కల్పించడం, ర్యాగింగ్‌ను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వడానికి కృషి చేస్తాం. – ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి -
ఈ నేల ఈ గాలి... పర్యావరణ గీతం
ఏయిర్ ఫోర్స్ అధికారి కూతురు అయిన బవ్రీన్ దేశంలోని వివిధప్రాంతాలలో చదువుకుంది. అలా ఎన్నో సంస్కృతులు, కళలు, ప్రకృతి అందాలతో పరిచయం అయింది. లండన్‌లోని వాయు కాలుష్యం గురించి వ్యాసం ఒకటి చదివింది బవ్రీన్. ‘దిల్లీలో కూడా ఇలాంటి పరిస్థితే కదా’ అని నిట్టూర్చింది. ‘ఇది లోకల్ ప్రాబ్లం కాదు. గ్లోబల్ ప్రాబ్లమ్’ అనుకుంది. వర్తమానం సంగతి ఎలా ఉన్నా పొగచూరిన భవిష్యత్ మసక మసకగా కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాపీరైటర్ ఉద్యోగాన్ని వదులుకొని ‘వారియర్ మామ్స్’కు శ్రీకారం చుట్టింది బవ్రీన్. ‘ వాయుకాలుష్యం అనేది చర్మం, జుట్టు, ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం చూపుతుంది. ఆహార ఉత్పత్తులలోని పోషక విలువలను నాశనం చేస్తుంది. అన్నిరకాలుగా హాని కలిగిస్తుంది’ అంటున్న బవ్రీన్ ‘వారియర్ మామ్స్’ ద్వారా పల్లె నుంచి పట్టణం వరకు ఎన్నోప్రాంతాలు తిరిగింది.క్షేత్రస్థాయిలో వాయుకాలుష్యం గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తనలాగే ఆలోచించే మహిళలు తోడు కావడంతో ‘వారియర్ మామ్స్’కు బలం పెరిగింది. మొదట్లో వాయుకాలుష్యం ప్రమాదాల గురించి ప్రచారం మొదలుపెట్టినప్పుడు ‘ఈ విషయాలు మాకు ఎందుకు’ అన్నట్లుగా ముఖం పెట్టేవారు. ప్రమాద తీవ్రత గురించి తెలుసుకున్న తరువాత మాత్రం వారిలో మార్పు రావడం మొదలైంది.‘మీ పిల్లల భవిష్యత్ గురించి కూడా ఆలోచించండి’ అనే మాట వారిని కదిలించి కార్యక్షేత్రంలోకి తీసుకువచ్చింది. ప్రపంచం ఎలా మారాల్సి వచ్చిందో చెప్పడానికి కోవిడ్ మహమ్మారి పెద్ద ఉదాహరణ. ఈ నేపథ్యంలోనే... ‘మరొక మహమ్మారిని నివారించడానికి మనం ఎందుకు మారకూడదు?’ అని ప్రశ్నిస్తోంది. ‘అభివృద్ధి’ గురించి మాట్లాడినప్పుడు ‘పర్యావరణ హితం’ గురించి కూడా మాట్లాడాలి అంటుంది బవ్రీన్.‘కొన్నిసార్లు దూకుడుగా ముందుకు వెళ్లాలి’ అనేది కొన్ని సందర్భాలలో బవ్రీన్ నోటినుంచే వినిపించే మాట. సమస్య గురించి అధికారుల దృష్టికి తెచ్చినప్పుడు, వారి స్పందనలో అలసత్వం కనిపించినప్పుడు, ‘నా కంపెనీకి మేలు జరిగితే చాలు పర్యావరణం ఏమైపోతే నాకెందుకు!’ అనుకునేవాళ్లను చూసినప్పుడు బవ్రీన్ దూకుడుగా ముందుకు వెళుతుంది, తాను ఆశించిన ఫలితం వచ్చే వరకు మడమ తిప్పకుండా పోరాడుతుంది. ‘మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలి’ అంటున్న బవ్రీన్ మాటలు ఎంతోమందిలో మార్పు తీసుకువచ్చాయి. ‘పదిమందిలో ఏడుగురు వాతావరణ మార్పుల గురించి ఆందోళన చెందుతున్నారు. పదిమందిలో తొమ్మిదిమంది వాతావరణ మార్పులపై తగిన కార్యాచరణ అవసరం అంటున్నారు. కానీ పదిమందిలో నలుగురు మాత్రమే కార్యాచరణలో భాగం అవుతున్నారు’ అంటున్న బవ్రీన్ ఆశ మాత్రం కోల్పోలేదు. ‘వారియర్ మామ్స్’ ద్వారా అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంది. ‘ఏమీ చేయలేమా?’ అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు వినిపించే జవాబులు రెండు... ‘మనం మాత్రం ఏం చేయగలం!’ ‘కచ్చితంగా మనమే చేయగలం’‘మనం మాత్రమే చేయగలం’ అని దిల్లీకి చెందిన బవ్రీన్ కాంధరీ అనుకోవడం వల్లే‘వారియర్ మామ్స్’ పుట్టుక సాధ్యం అయింది. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా పదమూడు రాష్ట్రాలలో క్షేత్రస్థాయిలో పర్యావరణ హిత ప్రచారాన్ని నిర్వహిస్తోంది బవ్రీన్. కాపీరైటర్ నుంచి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్‌గా ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం... -
ఏక్యూఐ ఉమెన్ అంబాసిడర్
సరోజ్ బెన్, జరీనా, ముంతాజ్‌లాంటి సామాన్య మహిళలు తమలాంటి సామాన్యుల కోసం వాయు కాలుష్యంపై దిల్లీ గల్లీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోర్టబుల్ ఏక్యూఐ(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) మానిటర్లతో ‘వాయు కాలుష్య నివారణకు మన వంతుగా చేయాల్సింది’ అనే అంశంపై ప్రచారం చేస్తున్నారు... దిల్లీలోని నందనగిరి ప్రాంతం. చేతిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) మానిటర్‌తో 39 సంవత్సరాల సరోజ్ బెన్ ఇద్దరు ముగ్గురు మహిళలతో మాట్లాడుతున్నప్పుడు ‘విషయం ఏమిటీ?’ అని అడుగుతూ మరో ఇద్దరు మహిళలు, ఆ తరువాత మరో ముగ్గురు మహిళలు వచ్చారు. అడిగిన వారికల్లా ఓపిగ్గా చెబుతోంది సరోజ్. ‘మీ ఏరియాలో వాయుకాలుష్యం ప్రమాదకరమైన స్థాయిలో ఉంది...’ అంటూ ప్రారంభించి ఆ సమస్య తలెత్తడానికి కారణాలు, దీని ప్రభావం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, నివారణ చర్యలు... మొదలైన వాటి గురించి చెబుతూ పోయింది. ‘మీరు గవర్నమెంట్ ఆఫీసరా?’ అని ఎవరో అడిగారు. ‘కాదమ్మా, నేనూ నీలాగే గృహిణిని. పెరుగుతున్న వాయుకాలుష్యం గురించి బాధపడి, కాలుష్య నివారణకు నా వంతుగా ఏదైనా చేయాలని ఇలా వీధులు తిరుగుతున్నాను’ అని చెప్పింది సరోజ్. సరోజ్ బెన్ మాత్రమే కాదు గ్రాస్‌రూట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ‘మహిళా హౌజింగ్ ట్రస్ట్’ కమ్యూనిటీ మూమెంట్ ‘హెల్ప్ దిల్లీ బ్రీత్’ ప్రభావంతో ఎంతోమంది సామాన్య మహిళలు వాయు కాలుష్యంపై అవగాహన చేసుకున్నారు. తమలాంటి వారికి అవగాహన కలిగించడానికి వాడ వాడా తిరుగుతున్నారు. కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, సాధారణ పౌరుల్లో వాయు కాలుష్యంపై అవగాహన కలిగించడానికి మహిళా హౌజింగ్ ట్రస్ట్, హెల్ప్ దిల్లీ బ్రీత్ సంస్థలు సామాన్య మహిళలకు శిక్షణ ఇస్తున్నాయి. పోర్టబుల్ ఏక్యూఐ మానిటర్లతో దిల్లీలోని గల్లీలు తిరుగుతూ వాయుకాలుష్య నివారణపై ప్రచారం నిర్వహిస్తున్న ఈ మహిళలు ‘ఏక్యూఐ ఉమెన్ అంబాసిడర్’లుగా గుర్తింపు పొందారు. ఏక్యూఐ అంబాసిడర్లు హెల్ప్ దిల్లీ బ్రీత్, మహిళా హౌజింగ్ ట్రస్ట్ నిర్వహించే సమావేశాలకు హాజరు కావడమే కాదు ప్రచార వ్యూహాల గురించి కూడా ఒకరితో ఒకరు చర్చించుకుంటారు. ‘కమ్యూనిటీ యాక్షన్ గ్రూప్’గా ఏర్పడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటారు. ‘వాయు కాలుష్యం గురించి కొద్దిసేపు మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని ఒక గృహిణితో అన్నప్పుడు నా ముఖం మీద తలుపు వేసినంత పనిచేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నాను. ఈసారి అలా కాదు ఇలా చేయాలనుకున్నాను. దిల్లీలోని నెహ్రూ నగర్‌కు వెళ్లినప్పుడు నా బ్యాగులో ఉన్న కొన్ని పోస్టర్లను ఆమెకు చూపాను. అవి చూసి అయ్యో ఏమిటి ఇది అన్నట్లుగా అడిగింది. అలా మెల్లగా టాపిక్‌ను మొదలుపెట్టాను. ఆమె చాలా శ్రద్ధగా విన్నది. పరిస్థితులను బట్టి ఏ రూట్లో వెళ్లాలో అప్పటికప్పుడు నిర్ణయించుకుంటే సమస్య ఉండదు’ అంటుంది సీమ అనే ఏక్యూఐ అంబాసిడర్. ‘ఉపన్యాసం ఇచ్చినట్లు కాకుండా మన ఇంటి పరిసరాల్లో ప్రమాదం పొంచి ఉంటే ఎలా చెబుతామో అలా వాయు కాలుష్యం గురించి చెబుతాను. ఉదాహరణలతో అర్థమయ్యేలా చెబుతాను. పెద్దవాళ్లకే సాధ్యం కాని పెద్ద సమస్య ఇది. మన వల్ల ఏమవుతుంది... అని కొందరు అంటారు. మీలా అందరూ అనుకోవడం వల్లే అది పెద్ద సమస్యగా మారింది అని నేను అంటాను. మొదటగా మీరు చేయాల్సింది మీ పెరట్లో ఒక మొక్క నాటడం అని సలహా ఇస్తాను. నేను చెప్పింది వారికి నచ్చినట్లు వారి హావభావాలను బట్టి గ్రహిస్తాను’ అంటుంది ఏక్యూఐ అంబాసిడర్ ముంతాజ్. ఏక్యూఐ అంబాసిడర్ల కృషి వృథా పోవడం లేదు. ఇప్పుడు ఎంతో మంది కాలుష్యాన్ని నియంత్రించే చర్యల గురించి నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నారు. వారు పెద్ద చదువులు చదుకున్నవారేమీ కాదు. సామాన్య మహిళలు. ఏక్యూఐ అంబాసిడర్ల విజయానికి ఇది ఒక ఉదాహరణ. మార్పు మొదలైంది... జరీనా ప్రతిరోజూ ఏక్యూఐ మానిటర్‌తో ఉదయం, సాయంత్రం వివిధ ప్రాంతాలలో పొల్యూషన్ లెవెల్స్‌ను చెక్ చేస్తుంది. ‘కొన్నిసార్లు కాలుష్యం తక్కువగా, మరికొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఏక్యూఐ మానిటర్‌పై ఎరుపు రంగు కనిపిస్తుంది. కొత్త సంఖ్యలు కనిపిస్తాయి. ఒకప్పుడు వాయుకాలుష్యం గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. అయితే ఇప్పుడు చాలామందిలో మార్పు రావడాన్ని గమనించాను’ అంటుంది జరీనా.ఏక్యూఐ అంబాసిడర్ అయిన జరీనా వాయునాణ్యత, వెంటిలేషన్, బొగ్గు పొయ్యిలకు దూరంగా ఉండడం... మొదలైన అంశాలపై దిల్లీ గల్లీలలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఇలా కూడా... వాడ వాడలా తిరుగుతూ వాయుకాలుష్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాదు లేబర్ కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు, పీఎం సురక్షిత్ మాతృత్వ అభియాన్, సుమన్ యోజనలాంటి ప్రభుత్వ సామాజిక, సంక్షేమ పథకాల గురించి భనన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు తెలియజేస్తున్నారు ఏక్యూఐ అంబాసిడర్లు. స్కీమ్‌కు సంబంధించిన పత్రాలు నింపడం నుంచి ఐడీ కార్డ్‌లు వారికి అందేలా చేయడం వరకు ఎన్నో రకాలుగా సహాయం అందిస్తున్నారు. -
ఏపీలో అభివృద్ధి, సంక్షేమం.. మీడియాకు సమగ్ర సమాచారం: కొమ్మినేని
సాక్షి, విజయవాడ: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత, వంటి వివిధ వర్గాల ప్రజలు పొందిన ప్రయోజనాలపై ఆయా వర్గాల ప్రజలకు, మీడియాకు సమగ్ర సమాచారం ఇవ్వడం కోసం రాష్ట్రవ్యాప్తంగా తాము పర్యటించనున్నామని సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పరిశ్రమలు వంటి అంశాలపై పూర్తి సమాచారం కూడా అందచేస్తామని ఆయన వెల్లడించారు. "మళ్ళీ జగనే ఎందుకు రావాలి" అనే అంశంపై ప్రజలకు, మీడియాకు పూర్తి వివరాలు అందుబాటులోకి తెచ్చేందుకు తమ పర్యటన దోహద పడుతుందని ఆయన తెలిపారు. దీని గురించి వీలైనంత వరకు పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 16 నుంచి రాయల సీమ జిల్లాల్లో పర్యటించనున్నట్టు వెల్లడించారు. తొలి దశలో కర్నూలు, పుట్టపర్తి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, జిల్లాల్లో పర్యటించి పాత్రికేయులకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత ఏడాది నవంబర్ 10న తాను చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రెస్ అకాడమీ పేరును "మీడియా" అకాడమీగా మార్పు చేయాలన్న తమ సూచనను పరిగణన లోకి తీసుకుని సంస్థ పేరును " ఆంధ్ర ప్రదేశ్ సి.ఆర్. మీడియా అకాడమీ" గా మార్చినందుకు సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. అన్ని వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్లతోనూ సత్సంబంధాలు నిర్వహిస్తూ, అందరినీ కలుపుకు పోయే ప్రయత్నం చేస్తూ గత ఏడాది కాలంలో సుమారు 100 కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించుకోగలిగామని చైర్మన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అన్నిటిలోనూ తమకు సంతృప్తినిచ్చే కార్యక్రమాలు ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. వివిధ జర్నలిస్టుల యూనియన్లు తమ దృష్టి కి తెచ్చిన పలు సమస్యల పై సంబంధిత శాఖల అధికార్లతో ఎప్పటికప్పుడు చర్చించి తగు పరిష్కారాలు సాధించడం జరిగిందన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ కేర్ స్కీం అమలులో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వాహణాధికారితో చర్చించడం జరిగిందన్నారు. ఈ సమస్యలు త్వరితంగా పరిష్కరించేందుకు వీలుగా 104 హెల్ఫ్లైన్లో ఒక ప్రత్యేక లైన్ (నెంబర్.4)ను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ అధికారి లిఖిత పూర్వకంగా తమకు తెలిపారని ఆయన వివరించారు. వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు వీలుగా ప్రత్యేకంగా 6 నెలల జర్నలిజంలో డిప్లమో కోర్సును రూపొందించి, అతి సాధారణ ఫీజుతో నాగార్జున యూనివర్సిటీ తో కలిసి నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కోర్సు పూర్తయి విద్యార్థులంతా పరీక్షలు కూడా పూర్తి చేశారన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాన్ని పెంచడంలో భాగంగా ప్రతి శనివారం ప్రత్యేక అంశాలపై ప్రముఖులతో "ఆన్ లైన్ క్లాసులు" నిర్వహించడం జరిగిందన్నారు. 28 వారాల పాటు వివిధ అంశాల పై ప్రముఖ రచయితలు, ప్రొఫెసర్లు, ఉన్నత అధికారులు, రాష్ట్ర మంత్రులు, సీనియర్ పాత్రికేయులు ఆన్ లైన్ క్లాసుల్లో ప్రత్యేక ప్రసంగాలు చేశారని ఆయన వెల్లడించారు. వర్కింగ్ జర్నలిస్టులకు ఉపయోగపడే అంశాలైన, పర్యావరణం, వృత్తి నైపుణ్యం, ఒత్తిడిని అధిగమించడంపై జిల్లాల్లో శిక్షణా తరగతులు, సెమినార్లు నిర్వహించడం జరిగిందన్నారు. జర్నలిస్టులుగా పనిచేసి రిటైర్ అయి కాలం గడుపుతున్న సీనియర్ జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం తరపున వారిని సన్మానిస్తూ వారిని గౌరవించడం జరుగుతోందని ఆయన వివరించారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ద్వారా జర్నలిస్టు మిత్రులు రచించిన పుస్తకాలు కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాలకు సరఫరా చేసే ఉత్తర్వులు వెలువడేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. వివిధ జిల్లాల్లో తాము పర్యటించిన సందర్భాల్లో జర్నలిస్టు యూనియన్లు అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు కోరుతూ ఇచ్చిన విజ్ఞాపనలు ప్రభుత్వానికి అందించామని, ఆయా అంశాల పై ప్రభుత్వం స్పందించి తగు నిర్ణయాలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సీఎం జగన్ నిర్ణయించడం జర్నలిస్టులందరికీ మేలు చేస్తుందని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. చదవండి: ఈనాడు కథనంపై ఏపీ గనుల శాఖ ఆగ్రహం -
ఫ్లాష్ లూటీ...
ఫిలడెల్ఫీయా: నిత్యం నిఘా నీడన ఉండే అమెరికాలో దొంగల ముఠా పేట్రేగిపోయింది. చూడ్డానికి.. షాపింగ్‌మాల్స్‌లో ఫ్లాష్‌మాబ్ పేరిట డ్యాన్స్‌లు, అవగాహన కార్యక్రమాలు చేసే బృందంలా కనిపిస్తూ ఒక్కసారిగా దుకాణాలపై తెగబడి అందిన కాడికి దోచేశారు. అమెరికాలోని ఫిలడెల్ఫీయా నగరం ఈ చోరీల ఘటనకు వేదికైంది. ఒక్కటి కాదు చాలా స్టోర్స్‌లో టీనేజర్లు ఇలా ఒకే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారు. మంగళవారం రోజు జరిగిన ఈ చోరీల తాలూకు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అత్యంత ఖరీదైన ఐఫోన్లుసహా యాపిల్ కంపెనీకి చెందిన పలు ఎల్రక్టానిక్ ఉపకరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. మాస్‌్కలు, హూడీలు ధరించిన దాదాపు 100కుపైగా టీనేజర్లు యాపిల్ స్టోర్, ఫూట్లాకర్, లూలూలెమెన్ స్టోర్లలో చొరబడి బ్యాగుల నిండా వస్తువులను తీసుకెళ్లారు. విషయం తెల్సుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను విశ్లేíÙంచి 20 మందికిపైగా టీనేజర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కొన్ని ఆయుధాలనూ స్వాదీనం చేసుకున్నారు. అయితే, వస్తువును దొంగిలించినా వాడుకోలేని(యాంటీ–థెఫ్ట్) ఫీచర్ ఉన్న కొన్ని యాపిల్ సంస్థ వస్తువులను దొంగలు అక్కడే వదిలేసివెళ్లారని ఫాక్స్ న్యూస్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. గత నెలలో డ్రైవర్ ఎడ్డీ ఐరీజెర్రీని ఫిలడెల్ఫీయా పోలీస్ అధికారి కాల్చిచంపిన కేసులో రిటెన్హౌజ్ స్క్వేర్ వద్ద శాంతియుత ర్యాలీ జరిగిన కొద్దిసేపటికే అక్కడా ఇలా రిటైల్స్టోర్పై దాడి జరిగింది. అయితే ఆ నిరసనకారులతో ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని ఫిలడెల్ఫీయా పోలీసులు స్పష్టంచేశారు. -
అవగాహనే అస్త్రంగా..!
సాక్షి, హైదరాబాద్: వరుసగా జరుగుతున్న భారీ అగ్ని ప్రమాదాల నేపథ్యంలో అగ్ని మాపక శాఖ అప్రమత్తమైంది. బహుళ అంతస్తుల భవనాలు, చాలా ఏళ్ల క్రితం నిర్మించిన వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నియంత్రణపై అధికారులు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ప్రమాదం జరిగితే ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లే అవకాశాలు ఇలాంటి చోట్లలోనే ఎక్కువగా ఉండటంతో ఈ తరహా భవన సముదాయాల్లో ఉండే వారికి అవగాహన పెంచడమే లక్ష్యంగా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు అగ్ని మాపక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి శుక్రవారం ప్రత్యేక అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలి, ప్రమాదవశాత్తు మంటలు అంటుకుంటే ఎలా జాగ్రత్తపడాలన్న అంశాలపై ఈ శిబిరాల్లో వివరిస్తున్నట్టు వివరించారు. అలాగే అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేయకూడదన్న విషయాలు కూడా వివరిస్తున్నారు. వాణిజ్య సముదాయాలతోపాటు పెట్రోల్ బంక్‌లు, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలు, గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఈ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని పాత బహుళ అంతస్తుల వాణిజ్య భవనాల్లోని దుకాణ యజమానులకు, ఆయా దుకాణాల్లో పనిచేసే వారికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తాజాగా స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రమైన పొగ కారణంగా లోపల చిక్కుకుపోవడం, ఆ సమయంలో ఎలా తప్పించుకోవాలో అవగాహన లేకపోవడంతోనూ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి పరిస్థితి రాకుండా వాణిజ్య సముదాయాల్లో పనిచేసే వారికి జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ వై.నాగిరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవలే అన్ని జిల్లాలతోపాటు రీజియన్ల ముఖ్య అగ్ని మాపక శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రతి ఫైర్‌స్టేషన్ అధికారులు తమ పరిధిలోని భవనాల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే అంశంపై ఆడిటింగ్ చేయడంతోపాటు, ప్రమాదాల నియంత్రణకు జాగ్రత్తలు వివరించాలని ఆదేశించారు. -
ప్లాస్టిక్ నిజాలు
ప్రపంచంలో తొలిసారిగా 1907లో ప్లాస్టిక్‌ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడం మొదలైంది. అయితే, భారీ స్థాయిలో ప్లాస్టిక్ ఉత్పత్తి 1952 నుంచి మొదలైంది. అప్పటి నుంచి ప్లాస్టిక్ వాడకం ఇబ్బడిముబ్బడిగా పెరిగి, పర్యావరణానికి బెడదగా మారింది. ఇటీవలి కాలంలో ఏటా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం 80 లక్షల టన్నులు. ఇవే పరిస్థితులు కొనసాగితే, 2040 నాటికి సముద్రాల్లో చేరే ప్లాస్టిక్ వ్యర్థాలు 2.90 కోట్ల టన్నులకు చేరుకోగలవని శాస్త్రవేత్తల అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగవుతోంది. 1952 నాటితో పోల్చుకుంటే, ప్లాస్టిక్ వినియోగం రెండువందల రెట్లు పెరిగింది. సముద్రంలోకి చేరే ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా ఏటా దాదాపు లక్షకు పైగా భారీ జలచరాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ ఉత్పత్తిదారు. అమెరికా ఏటా 4,2 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేస్తోంది. చైనా, యూరోపియన్ దేశాల్లో ఏటా జరిగే ప్లాస్టిక్ ఉత్పత్తి కంటే, అమెరికా చేసే ప్లాస్టిక్ ఉత్పత్తి రెట్టింపు కంటే ఎక్కువవ. అమెరికాలో ఏటా పోగుపడే తలసరి ప్లాస్టిక్ చెత్త 130 కిలోలు. ప్లాస్టిక్ నేలలోను, నీటిలోను ఎక్కడ పడితే అక్కడ పోగుపడి కాలుష్యానికి కారణమవుతోంది. ప్లాస్టిక్ నేరుగా మన పొట్టల్లోకే చేరేటంత దారుణంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతి మనిషి పొట్టలోకి వారానికి సగటున ఐదు గ్రాముల ప్లాస్టిక్ చేరుతోంది. ప్లాస్టిక్ ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే కర్బన ఉద్గారాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఒక్క అమెరికాలోనే ప్లాస్టిక్ ఉత్పత్తి కారణంగా వాతావరణంలోకి 23.2 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు చేరుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే, 2030 నాటికి బొగ్గు కంటే ప్లాస్టిక్ కారణంగానే ఎక్కువ మొత్తంలో కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రీసైకిల్డ్ ఫోమ్ ఫర్నిచర్ ఎక్స్పాండెడ్ పాలీస్టైరీన్ (ఈపీఎస్)– సాధారణ వ్యవహారంలో ఫోమ్‌గా పిలుచుకునే పదార్థం. దీనిని వస్తువుల ప్యాకేజింగ్ తదితర అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు. దీనిని ‘స్టరోఫోమ్’ సంస్థ ట్రేడ్‌మార్క్ పేరైన ‘డ్యూపాంట్’ పేరుతో కూడా పిలుస్తారు. ప్యాకేజీ పైనున్న ర్యాపర్లు, అట్టపెట్టెలతో పాటు దీనిని కూడా చెత్తలో పారేస్తుంటారు. దీనిని చెత్తలో పారేయకుండా, రీసైక్లింగ్ చేయడం ద్వారా అద్భుతమైన ఫర్నిచర్‌ను తయారు చేయవచ్చని జపాన్ శాస్త్రవేత్తలు నిరూపించారు. జపాన్ ‘వీయ్ ప్లస్’ కంపెనీకి చెందిన నిపుణుల బృందం రీసైకిల్డ్ ఈపీఎస్‌ను ఉపయోగించి, సుదీర్ఘకాలం మన్నగలిగే అద్భుతమైన ఫర్నిచర్‌ను రూపొందించింది. ఇవి ఎక్కువకాలం మన్నడమే కాకుండా కలపతోను, లోహంతోను తయారుచేసిన ఫర్నిచర్ కంటే చాలా తేలికగా కూడా ఉంటాయి. ప్యాకేజీ అవసరాలకు ఉపయోగించే ఫోమ్‌ను చెత్తలో పారేసి కాలుష్యాన్ని పెంచకుండా, ఇలా రీసైక్లింగ్ ద్వారా పునర్వినియోగంలోకి తేవడం భలేగా ఉంది కదూ! -
Srishti Bakshi: గ్రేట్ ఛేంజ్మేకర్
కొన్ని సంవత్సరాల క్రితం...‘ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో తల్లీకూతుళ్లు సామూహిక అత్యాచారానికి గురయ్యారు’ అనే వార్త చదివిన తరువాత శ్రీష్ఠి బక్షీ మనసు మనసులో లేదు. కళ్ల నిండా నీళ్లు. బాధ తట్టుకోలేక తాను చదివింది కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకుంది. ‘ఇలాంటివి మన దేశంలో సాధారణం’ అన్నారు వాళ్లు. ఈ స్పందనతో శ్రీష్ఠి బాధ రెట్టింపు అయ్యింది. ఇలా ఎవరికి వారు సాధారణం అనుకోవడం వల్లే పరిస్థితి దిగజారిపోతుంది. ఒక దుస్సంఘటన జరిగితే దానిపై ఆందోళన, ఆవేదన వ్యక్తం అవుతుంది తప్ప నిర్దిష్టమైన కార్యాచరణ మాత్రం కనిపించడం లేదు’ అనుకుంది. ఆరోజంతా శ్రిష్ఠి అదోలా ఉంది. ఈ నేపథ్యంలోనే తన వంతుగా ఏదో ఒకటి చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. మహిళలకు సంబంధించిన భద్రత, హక్కుల గురించి అవగాహన కలిగించడానికి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకుంది. దీనికి ముందు రకరకాల కేస్‌స్టడీలు, పరిశోధన పత్రాలు చదివింది. ఆధునిక సాంకేతిక జ్ఞానంతో అపూర్వ విజయాలు సాధించిన సాధారణ మహిళల గురించి అధ్యయనం చేసింది. బెంగాల్‌లోని ఒక పనిమనిషి సరదాగా యూట్యూబ్‌లో వంటలకు సంబంధించిన రకరకాల వీడియోలను పోస్ట్ చేసేది. కొద్దికాలంలోనే ఆమె యూట్యూబ్ స్టార్‌గా ఎదిగి ఆర్థికంగా బాగా సంపాదించడాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. ఆశీర్వాదం తీసుకుంటూ... తమిళనాడు గ్రామీణ ప్రాంతానికి చెందిన తల్లీకూతుళ్లు వాట్సాప్ కేంద్రంగా దుస్తుల వ్యాపారం మొదలుపెట్టి ఘన విజయం సాధించారు... ఇలాంటి ఎన్నో స్ఫూర్తిదాయక విజయాల గురించి తెలుసుకుంది. ఇలాంటి ఎన్నో విజయగాథలను తన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకుంది. ‘టెక్నాలజీతో సులభంగా అనుసంధానం అయ్యే ఈరోజుల్లో చాలామంది మహిళలు దానికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం డిజిటల్ నిరక్షరాస్యత. వారికి డిజిటల్ నాలెడ్జ్‌ను దగ్గర చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించగలరు’ అనుకుంది శ్రిష్ఠి బక్షీ. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల గుండా 3,800 కి.మీల పాదయాత్ర చేసింది. ఈ యాత్రలో ఎంతోమంది మహిళలు ఎన్నో సమస్యలను తనతో పంచుకున్నారు. పరిష్కార మార్గాల గురించి లోతైన చర్చ జరిగిదే. ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. తాజా విషయానికి వస్తే... హక్కుల నుంచి సాధికారత వరకు వివిధ విషయాల్లో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన శ్రిష్టి బక్షీని ఐక్యరాజ్యసమితి ప్రతిష్ఠాత్మక ‘ఛేంజ్మేకర్’ అవార్డ్ వరించింది. 150 దేశాలకు చెందిన 3000 మంది మహిళల నుంచి ఈ అవార్డ్‌కు శ్రిష్ఠిని ఎంపికచేశారు. ‘యూఎన్ ఎస్డీజీ యాక్షన్ అవార్డ్‌ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సోషల్ ఛేంజ్మేకర్స్తో మాట్లాడే అవకాశం లభిస్తుంది. వారి అనుభవాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. వ్యక్తిగతంగానే కాదు సమష్టిగా కూడా సమాజం కోసం పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది’ అంటుంది శ్రిష్ఠి. ‘సమీకరణ, స్ఫూర్తి, ఒకరితో ఒకరు అనుసంధానం కావడం ద్వారా సుందర భవిష్యత్‌ను నిర్మించుకోవచ్చు. మనం ఎలా జీవిస్తే మంచిది అనే విశ్లేషణకు ఇవి ఉపయోగపడతాయి. పునరాలోచనకు అవకాశం ఉంటుంది’ అంటుంది ఎస్డీజీ యాక్షన్ క్యాంపెయిన్ కమిటీ. ఇ–కామర్స్ స్ట్రాటజిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న శ్రిష్ఠి హాంకాంగ్‌లో పెద్ద ఉద్యోగం చేసేది. ‘నా జీవితం ఆనందమయం’ అని ఆమె అక్కడే ఉండి ఉంటే ‘ఛేంజ్మేకర్’గా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేది కాదు. టెక్నాలజీతో సులభంగా అనుసంధానం అయ్యే ఈరోజుల్లో చాలామంది మహిళలు దానికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం డిజిటల్ నిరక్షరాస్యత. వారికి డిజిటల్ నాలెడ్జ్‌ను దగ్గర చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించగలరు. ఆ వార్త చదివిన తరువాత తన కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ‘నేనేం చేయలేనా!’ అని భారంగా నిట్టూర్చింది. అంతమాత్రాన శ్రిష్ఠి బక్షీ బాధలోనే ఉండిపోలేదు. బాధ్యతతో ముందడుగు వేసింది... -
ఓటు తప్పక వేయండి: విజయ్ దేవరకొండ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఓటింగ్ పెంపునకు జీహెచ్ఎంసీ పెద్దఎత్తున చైతన్య కార్యక్రమాలను చేపట్టింది. గ్రేటర్ పరిధిలోని ఓటర్లందరికీ ఓటరు స్లిప్‌ల పంపిణీ చేయడంతో పాటు, ఓటరు స్లిప్‌ల డౌన్‌లోడ్‌కు ప్రత్యేక యాప్ రూపొందించింది. ‘మైజీహెచ్ఎంసీ యాప్’ లో నో యువర్ ఓట్ ఆప్షన్లో పేరు, వార్డు నంబర్ ఎంటర్ చేస్తే ఓటరు స్లిప్, పోలింగ్ లొకేషన్ గూగుల్ మ్యాప్ కూడా వస్తుంది. నో యువర్ ఓట్‌పై ఎఫ్ఎం రేడియో, టి.వి స్క్రోలింగ్, బస్ షెల్టర్లపై హోర్డింగ్‌ల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. (చదవండి: రోడ్డు షో మధ్యలోనే ముగించిన అమిత్ షా) మొట్టమొదటి సారిగా ఓటర్ల జాబితాను రాష్ర్ట ఎన్నికల సంఘం వెబ్సైట్లో ప్రదర్శన, ఓటరు చైతన్యంపై పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటు, జీహెచ్ఎంసీకి చెందిన 1500 సెల్ఫోన్ల రింగ్టోన్ల ద్వారా ఓటర్లను చైతన్యపర్చడం, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు పలు కమిటీలను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందాల ద్వారా ప్రత్యేక ఓటరు చైతన్య కార్యక్రమం చేపట్టింది. సర్కిళ్ల స్థాయిలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల సమావేశాలు నిర్వహించడంతో పాటు, ఎలక్ట్రానిక్ మీడియాలో షార్ట్ఫిలిమ్స్ ప్రదర్శన ద్వారా జీహెచ్ఎంసీ ఓటరు చైతన్య కార్యక్రమాలను చేపట్టింది. (చదవండి: బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా?) -
ఏపీ వ్యాప్తంగా ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’ పేరిట శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు.మంత్రులు, నాయకులు కేక్ కట్ చేశారు. వివిధ మతాల పీఠాధిపతులు సర్వమత ప్రార్థనలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, షర్మిల, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముగ్గురితో కలిసి పాదయాత్ర చేసిన రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులను మంత్రులు ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్న బాబు, అనిల్ కుమార్ యాదవ్, వేణుగోపాల కృష్ణ, కార్యాలయ ఇంచార్జ్ లేళ్ల అప్పిరెడ్డి, లక్ష్మీ పార్వతి, ధు సూధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: వైఎస్ జగన్ పాదయాత్రకు మూడేళ్లు) వైఎస్సార్ జిల్లా: బద్వేలులో వైఎస్సార్సీపీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు గురుమోహన్, రాజగోపాల్‌రెడ్డి, సుందరరామిరెడ్డి, గోపాలస్వామి యద్ధారెడ్డి శ్రీనివాసులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పోరుమామిళ్లలోని వైఎస్సార్ విగ్రహాలకు మాజీ ఎంపీపీ చిత్తా విజయ్ ప్రతాప్‌రెడ్డి, మండల కన్వీనర్ బాష, వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు. కృష్ణాజిల్లా: జగ్గయ్యపేట పట్టణంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో 18, 20,21 వార్డులో ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి ఆయన వివరించారు. ప్రజా సమస్యలను వినతిపత్రాల ద్వారా సేకరించి అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తన్నీరు నాగేశ్వరరావు, ముత్యాల వెంకటాచలం, చోడవరపు జగదీష్, తుమ్మల ప్రభాకర్, నంబూరి రవి, పలు శాఖల అధికారులు, వాలంటీర్లు, బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో.. ప్రజా సంకల్పానికి పునాదిపడి మూడేళ్లయిన సందర్భంగాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ‘వంగవీటి మోహన్‌రంగా బస్టాఫ్’ను ప్రారంభించారు. అనంతరం దేవీనగర్ నుంచి ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకొంటూ ఎమ్మెల్యేలు ముందుకు సాగుతున్నారు. పశ్చిమగోదావరి: జిల్లాలో ‘ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు’ పేరిట ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పెదవెల్లమిల్లి గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభించారు. పోలవరం నియోజకవర్గంలో పాదయాత్రలు ప్రారంభమయ్యాయి. కొయ్యలగూడెం మండలం డిప్పకాయలపాడు గ్రామంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాదయాత్ర ప్రారంభించారు. చింతలపూడి నియోజకవర్గంలో పాదయాత్రలు ప్రారంభమయ్యాయి. జంగారెడ్డిగూడెం తన క్యాంప్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే వి.ఆర్.ఎలిజా పాదయాత్ర ప్రారంభించారు. పాలకోడేరు మండలం కొండేపూడి గ్రామంలో ‘ప్రజల్లో నాడు- ప్రజలకోసం నేడు’ పాదయాత్ర ప్రారంభించారు. ఉండి నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేత పీవీఎల్ నరసింహారాజు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా: ప్రజా సంకల్పయాత్ర మూడేళ్లు పురస్కరించుకొని ‘ప్రజల్లో నాడు- ప్రజల్లో నేడు’ పేరిట ప్రజా చైతన్య కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కర్నూలు వైఎస్సార్ సర్కిల్ నుంచి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాదయాత్రను ప్రారంభించారు. విశాఖ జిల్లా: ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తయి మూడేళ్లయిన సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’ పేరుతో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కుంభ రవిబాబు తదితరులు పాల్గొన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో సమన్వయకర్త మళ్ళ విజయప్రసాద్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు . ‘జై జగనన్న జై జై జగనన్న మేము ఉన్నామన్న’ అనే నినాదంతో ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోపాలపట్నం పెట్రోల్ బంకు దగ్గర నుంచి కంచరపాలం వరకు ర్యాలీ నిర్వహించారు. చోడవరం పట్టణంలో ఎల్ఐసీ కోలనీ దగ్గర నుండి కొత్తూరు జంక్షన్ వరకు వైఎస్సార్సీపీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహనికి పూల మాల వేసి నివాళర్పించారు.మునగపాక మండలం ఉమ్మలాడలో యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు.. దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళర్పించారు. నాతవరం మండలం మాధవనగరంలో ప్రజాచైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఈ పాదయాత్రలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు. ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా అనకాపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో దాడి రత్నాకర్, దంతులూరి దిలీప్ కుమార్, మళ్ల బుల్లిబాబు, మందపాటి జానకిరామరాజు, గొర్లి సూరి బాబు, గొల్లవిల్లి శ్రీనివాసరావు, పలకా రవి, జాజుల రమేష్ పాల్గొన్నారు. మునగపాకలో గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ కేక్ చేశారు. -
కరోనా నివారణకు అవగాహన కార్యక్రమాలు
-
కొనసాగుతున్న దురాచారం
నాగరిక సమాజాన్ని కూడా పట్టి పీడిస్తున్న దురాచారం జోగిని. ఇప్పుడు దీన్ని నేరంగా పరిగణిస్తున్నా మహబూబ్‌నగర్, నిజామాబాద్ వంటి చోట్ల ఇంకా ఈ అనాచారం కొనసాగుతూనే ఉంది. ఈ నేరానికి ఆయువుపట్టు పేదరికం, సాంఘిక నిమ్నతలే. వయసొచ్చిన ఆడపిల్లను దేవుడికి అంకితం చేయడం పేరుతో ఆమెను లైసెన్స్డ్ వేశ్యగా మార్చడం అన్నమాట. పల్లెల్లో ఈ నేరంబారిన పడి చాలామంది ఆడపిల్లల జీవితాలు నాశనమవుతన్నాయి. దీన్ని రూపుమాపడానికి ప్రభుత్వాలు చట్టాలు తెచ్చిన యథేచ్చగా రాజ్యమేలుతూనే ఉంది. ట్రాఫికింగ్.. ప్రాస్టిట్యూషన్ ‘పట్నంలో నీ బిడ్డకు మంచి పని ఉంది.. నెలకు పదిహేనే వేలరూపాయల దాకా సంపాదించుకోవచ్చు... ఉండడానికి ఇల్లు, తిండి అన్నీ వాళ్లే ఇస్తారు’ అంటూ పట్నం పోయి బాగా డబ్బు సంపాదించుకున్న ఊరి కుర్రాడో, లేక ఆ ఊరి నడివయసు మహిళో పేదరికంలో మగ్గుతున్న కుటుంబాల్లో ఆశను రేకెత్తిస్తారు. అమ్మానాన్నలు ఆ ఇంటి ఆడపడచును వీళ్లతో పట్నం బస్ ఎక్కిస్తారు. ఆ పిల్ల పుణె రెడ్‌లైట్ ఏరియాలోనో, ముంబై కామటిపురాలోనో.. కోల్కత్తా సోనాగంచ్లోనో తేలుతుంది. ఇవే ట్రాఫికింగ్, వ్యభిచార నేరాలు. రెండూ ఒకదానికొకటి అనుసంధానమైన భూతాలు. రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ భారతాన్ని పట్టిపీడిస్తున్న పిశాచాలు. వీటిని అరికట్టడానికి మన దగ్గరున్న చట్టాలకు కొదవలేదు. కాని అమలు చేసే చిత్తశుద్ధికి కొరత. అందుకే యేటా వేలమంది ఆడపిల్లలు ఈ నేరం కొరలకు చిక్కి చీకటికూపాల్లో మగ్గుతున్నారు. కనిపించని నేరాలు...ఇంట్లోనే చాలా కనపడతాయి.. ►చిన్నపిల్లలను సెక్సువల్ అబ్యూజ్కి గురిచేయడం దగ్గర్నుంచి డొమెస్టిక్ లేబర్‌ను వేధించడం వరకు. అయితే ఇవి ఇప్పుడు చట్టం పరిధిలోకి వచ్చాయి. ►భవన నిర్మాణాలు, ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలు, బీడీ కంపెనీలు,పొలాలు వంటి చోట్ల దగ్గర మహిళా కార్మికులు, మహిళా శ్రామికులను శారీరకంగా, మానసికంగా వేధించడం (కులం పేరుతో, శారీరక రంగు, రూపు గురించి తులనాడడం, తిట్టడం, చేయి చేసుకోవడం, కోరిక తీర్చమని అడగడం) నేరమే. ►పబ్లిక్టాయ్లెట్స్ లేకపోవడం, ఉన్నా వాటిలో సరైన వసతులు అంటే వాటికి తలుపులు లేకపోవడం, ఉన్నా బోల్టులు లేకపోవడం, కింద నేల కనిపించేలా తలుపులు ఉండడం, కంతలు, సందులు ఉండడం, టాయ్లెట్లలో నీటి వసతి, మగ్గులు, బకేట్లు లేకపోవడం, నిర్వహణ (పరిశుభ్రత వగైరా) సరిగా లేకపోవడం వంటివన్నీ నేరాలే. ►అంతేకాదు పబ్లిక్ టాయ్లెట్లలో గోడల మీద స్త్రీల ప్రైవేట్ పార్ట్ బొమ్మలు వేయడం, పిచ్చి రాతలు రాయడం, అసభ్యకరమైన గీతలు గీయడం వంటివి అన్నీ నేరాలే. ►అలాగే ఇలాంటి పబ్లిక్ టాయ్‌లెట్స్ దగ్గర కాపలాదారు లేకపోవడం వంటివి. ఇవన్నీ కూడా 354సి నిర్భయ చట్టం కింద వర్తించే నేరాలు ►పాఠశాలలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండులు, ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో మహిళలకు సరైన మరుగుదొడ్ల వసతి లేకపోవడం నేరమే. ►అలాగే మహిళలకు నాప్కిన్స్(నెలసరి ప్యాడ్స్) అందుబాటులో లేకపోవడం కూడా నేరమే. ►షాపింగ్‌మాల్స్‌లోని ట్రయల్‌రూమ్స్‌లో, టాయ్‌లెట్స్‌లలో అలాగే సినిమాహాల్స్ వంటి పబ్లిక్ ప్రదేశాల్లోని టాయ్‌లెట్స్‌లలో రహస్య కెమెరాలు పెట్టడం నేరం. దీన్ని వాయొరిజం కింద పరిగణిస్తారు. ►బస్సుల్లో, ఇతర రద్దీ ప్రదేశాల్లో స్త్రీలను తాకడం, అసభ్యకరంగా మాట్టాడడం, అసభ్యకర సైగలు చేయడం, స్త్రీలకు పురుషులు తమ ప్రైవేట్ పార్ట్స్ చూపించడం, అలాగే కార్యాలయాల్లో ఉద్యోగినుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, వారిని తూలనాడడం, వేధించడం, సెక్సువల్‌గా అబ్యూజ్ చేయడం, వారిని అవమానించడం వంటివన్నీ నేరాలే. 354, 509 విమెన్ ఇన్సల్టింగ్ సెక్షన్ల కింద వీటికి శిక్ష ఉంటుంది. ►ఇక పబ్లిక్ ప్రదేశాల్లో అమ్మాయిల మీద కన్నేయడం, వెంబడించడం, ఈవ్‌టీజింగ్, వంటివన్నీ నేరాలన్న సంగతి విదితమే. ►అంతేకాదు ఇంట్లో కూడా స్త్రీలను, ఈడు వచ్చిన అమ్మాయిలను తాత మొదలుకొని తండ్రి, అన్న, బాబాయ్, పెద్దనాన్న, మేనమామ ఇలాంటి వాళ్లెవరైనా పరుషపదజాలంతో తిట్టడం, వ్యక్తిగత స్వేచ్ఛ హరించేలా తీవ్రమైన నిఘా పెట్టడం, శీలరక్షణ పేరుతో వాళ్లను కట్టడి చేయడం, శీలంపేరుతో వాళ్ల ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడడం వంటివన్నీ నేరాలే గృహహింస చట్టం కింద. అలాగే ఇంట్లో ఆడపిల్లలను అబ్బాయిలతో పోల్చి తిట్టడం, చులకన చేయడం, వివక్ష చూపించడం వంటివీ నేరాలే. మ్యారిటల్ రేప్ దీన్ని జస్టీస్ వర్మ కమిటీ 376(బి) నిర్భయ చట్టం కింద నేరంగా పరిగణించాలని సూచించింది. కానీ దీనివల్ల భారతీయ వివాహ, కుటుంబ వ్యవస్థలు బీటలు వారుతాయని రాజకీయ పక్షాలు ఆమోదించలేదు. కాని విడాకులు తీసుకున్న భార్యను, లేదా భర్త నుంచి విడిగా ఉంటున్న ఇల్లాలిని భర్త బలవంతం చేస్తే రేప్‌గా పరిగణించాలని మాత్రం నిర్ణయించారు. ∙ వివాహబంధంలో ఉన్న భర్త ..భార్య మానసిక, శారీరక పరిస్థితి తెలుసుకోకుండా ఆమెను ఇబ్బంది పెట్టడం, బలవంతం చేయడం క్రూయల్టీ కింద పరిగణించే నేరమే. గ్రేటర్ హైదరాబాద్‌లో మహిళా భద్రత గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం మూడు పోలీసు కమిషనరేట్లు ఉన్నాయి. అవి: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ. ‘గ్రేటర్’ జనాభా 1.17 కోట్లు. హైదరాబాద్ మహానగరంలో మహిళల రక్షణ కోసం మూడు కమిషనరేట్లూ చొరవ తీసుకుంటూ పలు చర్యలు చేపడుతున్నా, నగరంలో మహిళల పట్ల నేరాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం 2014లో అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా నేతృత్వంలో ప్రత్యేకంగా ‘షీ టీమ్స్’ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోను మొత్తం 300 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. షీ టీమ్స్‌లో 1500 మంది మహిళా పోలీసులు పనిచేస్తున్నారు. మహిళలకు మరింత భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం 2019లో ‘విమెన్ సేఫ్టీ వింగ్’ను కూడా ఏర్పాటు చేసింది. అదే ఏడాది ఎన్ఆర్ఐ భర్తల ఆగడాలను అరికట్టేందుకు ‘ఎన్ఆర్ఐ సెల్’ను ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లలోనూ కలుపుకొని 2015–19 సంవత్సరాల మధ్య కాలంలో మహిళలకు సంబంధించిన నేరాలపై 19,270 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ షీ టీమ్ వాట్సప్ 9490616555, సైబరాబాద్ షీ టీమ్ వాట్సప్ 9490617444, రాచకొండ షీ టీమ్ వాట్సప్ 9490617111 బాలల భద్రత కోసం ‘బాలమిత్ర’ బాలల భద్రత కోసం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ 2019లో ‘బాలమిత్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాఠశాలలకు వెళ్లే బాలబాలికలకు చిన్నప్పటి నుంచి ఎవరితో ఎలా మెలగాలో చెబితే ఆదిలోనే చెడు పోకడలను అరికట్టవచ్చనే ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమం పిల్లలకు, షీ టీమ్స్‌కు మధ్య వారధిగా పనిచేస్తోంది. ‘బాలమిత్ర’ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత దీని ద్వారా బాలలపై వేధింపులకు సంబంధించి 42 కేసులు నమోదయ్యాయి. ‘బాలమిత్ర’ హెల్ప్‌లైన్: 9490617444 షీ ఫర్ హర్‌తో ఈవ్ టీజింగ్‌కు చెక్ ఈవ్ టీజింగ్‌ను, కళాశాలల్లో విద్యార్థినులపై ర్యాగింగ్ వేధింపులను అరికట్టడానికి రాచకొండ పోలీసు కమిషనరేట్ 2017లో ‘షీ ఫర్ హెర్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ప్రతి కాలేజీ నుంచి ఇద్దరు చొప్పున సీనియర్ విద్యార్థినులను వాలంటీర్లుగా ఎంపిక చేసి, విద్యార్థుల్లో మహిళల చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. వేధింపుల బారిన పడ్డ విద్యార్థినులు ఈ కార్యక్రమం ద్వారా తమ పేర్లు గోప్యంగా ఉండేలా ఫిర్యాదు చేసే వెసులుబాటును కూడా కల్పిస్తున్నారు. ‘షీ ఫర్ హెర్’ ద్వారా గత మూడేళ్లలో 24 కేసులు నమోదయ్యాయి. ఐటీ కారిడార్‌లో ‘సేఫ్ స్టే’ గ్రేటర్ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో హాస్టళ్లలో ఉంటున్న మహిళా ఉద్యోగినులు, విద్యార్థినుల భద్రత కోసం సైబరాబాద్ పోలీసులు 2015లో ‘సేఫ్ స్టే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హాస్టళ్లన్నీ తప్పనిసరిగా నిబంధనలను పాటించేలా ఐటీ కారిడార్‌లోని హాస్టళ్లను పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తూ వస్తున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి, హాస్టళ్లన్నీ తప్పనిసరిగా పోలీసు అనుమతి పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా, ప్రతి మూడు నెలలకోసారి హాస్టళ్లన్నీ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నదీ లేనిదీ పర్యవేక్షిస్తున్నారు. ఈ చర్యల వల్ల హాస్టళ్లలో భద్రత మెరుగుపడింది. టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లు వివిధ జిల్లాల్లో పోలీసులు, మహిళా భద్రత కేంద్రాల ఫోన్నంబర్లతో పాటు ఆపదలో చిక్కుకున్న మహిళలు, బాలల కోసం నిరంతరం పనిచేసే టోల్ ఫ్రీ నంబర్లు ఇవి. వీటి ద్వారా కూడా బాధితులు తమ సమస్యలను తెలిపి పోలీసుల సహాయం కోరవచ్చు. డయల్ 100, చైల్డ్ లైన్ 1098 రక్షణ కోసం పోరాట శిక్షణ ►పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ‘శక్తి’ పేరుతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కేరళ రాష్ట్రానికి చెందిన ‘కలరిపయట్టు’, కరాటే మెటీరియల్ ఆర్ట్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ‘స్పృహ’ పేరుతో జెండర్ ఈక్వాలిటీ మీద బాలురకు అవగాహనా కార్యక్రమాలను చేపట్టారు. ►కామారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో ‘సురక్షిత కామారెడ్డి’ అనే కార్యక్రమం ప్రారంభమైంది. దీనిద్వారా జిల్లాలోని విద్యార్థినులకు ఆత్మరక్షణా విద్యలో శిక్షణను ఇప్పించడంతోపాటు, గ్రామస్థాయిలో జెండర్ ఈక్వాలిటీ మీద అవగాహనా సదస్సులనూ నిర్వహిస్తున్నారు. మహిళలకు ‘మార్గదర్శకంగా’ సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఇంటా, బయట వేధింపులు, ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు, గృహహింస, ఒత్తిడికి సంబంధించి కుటుంబసభ్యులు, మిత్రులు, పోలీసులకు చెప్పుకోని విషయాలను మార్గదర్శక్‌ల దృష్టికి తీసుకొస్తే మార్గనిర్దేశం చేస్తారు. అది ఏ రకమైనా సమస్య అయినా ఓపికతో వింటారు. వారికి న్యాయ సహాయమా, పోలీసుల సహాయమా, సైకలాజిల్ సహాయమా...ఇలా వారికి ఏది అవసరమో గుర్తించి ఆయా నిపుణుల వద్దకు పంపిస్తారు. వేధింపులైతే బాధితురాలి పేరును బహిర్గతం చేయకుండా పోలీసుల ద్వారా చర్యలు తీసుకునేలా సహాయం అందిస్తారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో 2016 జనవరిలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో, అదే ఏడాది అక్టోబర్‌లో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో దీన్ని ప్రారంభించారు. రెండు కమిషనరేట్లలో ఇప్పటికి 585 మంది మార్గదర్శక్‌ల ద్వారా 185 కేసులు పరిష్కరించారు. ‘సేఫ్టీ’ జర్నీ.... ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న మహిళల సురక్షిత ప్రయాణం కోసం షీ షటిల్ సేవలను ఎస్సీఎస్సీ సహాకారంతో సైబరాబాద్ పోలీసులు 2015 జూన్ 30న ప్రారంభించారు. తొలుత రెండు బస్సులతో ప్రారంభమైన ఈ సేవలు ఇప్పుడూ ఏడుకు చేరాయి. ఈ బస్సు జీపీఎస్‌కు అనుసంధానం కావడంతో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సంబంధిత ఠాణా పోలీసులను అప్రమత్తం చేస్తారు. అలాగే రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ఎస్సీఎస్సీ సహాకారంతో ఐటీ కంపెనీల్లో పనిచేసే మహిళల భద్రత కోసం 2017 ఆగస్టు 16న షీ షటిల్ సేవలు ప్రారంభించారు. ప్రస్తుతం రెండు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నారు. ఇలా ఈ రెండు కమిషనరేట్లలో కలిపి తొమ్మిది బస్సుల ద్వారా దాదాపు 80,000 మందికి పైగా మహిళలు ప్రయాణిస్తున్నారు. షార్ట్‌ఫిల్మ్‌తో స్మార్ట్‌గా గుడ్ టచ్, బ్యాడ్ టచ్, లైంగిక విద్య గురించి లఘు చిత్రాలతో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ముండ్రాతి హరిత... బాల్యానికి భరోసా పేరుతో. ఆరవతగరతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులందరికీ పాఠాలుంటాయి. లఘు చిత్రాల రూపంలో కౌమారదశలో పిల్లల్లో మొదలయ్యే శారీరక మార్పులతోపాటు పాటించాల్సిన శుభ్రత (నెలసరి మొదలయ్యాక అమ్మాయిలు పాటించాల్సిన శుభ్రతతోపాటు), పాటించకపోతే ఎదురయ్యే అనారోగ్య సమస్యలు, పిల్లలకు ఎవరి నుంచి ఎలాంటి హాని ఎదురవుతుందో ఉదాహరణలతో సహా ఈ లఘుచిత్రంలో చూపిస్తున్నారు.. చెబుతున్నారు. తాతయ్య బాలికపై అఘాయిత్యానికి పాల్పడవచ్చు. వరుసకు అన్నయ్య అయ్యే వ్యక్తి ఎలాంటి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు? అసలు అప్యాయతతో కూడిన స్పర్శ ఎలా ఉంటుంది? దురుద్దేశంతో కూడిన స్పర్శను ఎలా గుర్తించాలి వంటివన్నీ ఈ లఘుచిత్రాల్లో చూపిస్తున్నారు. ‘కోమల్’ అనే లఘు చిత్ర ప్రదర్శన ద్వారా ఇంటాబయటా స్నేహితులు, అపరిచితుల పట్ల పిల్లలు (ప్రధానంగా బాలికలు) ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తున్నారు. ‘కోమల్’ పది నిమిషాల నిడివి గల హిందీ చిత్రం. ఈ షార్ట్‌ఫిల్మ్ ప్రదర్శన తర్వాత అందులోని విషయాల గురించి బాలల పరిరక్షణ విభాగం సభ్యులు, వైద్యుడు.. పిల్లలకు అవగాహన కల్పిస్తారు. ఇప్పటికి పదివేల మందికి పైగా విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో.. జిల్లాలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు. జిల్లాలోని బాలల సంరక్షణ విభాగం రెండు బృందాలుగా ఏర్పడి ప్రతి మంగళ, శుక్రవారాల్లో పాఠశాలలు, జూనియర్ కళాశాల్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిబృందంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుంచి ముగ్గురు అధికారులతోపాటు ఒక ప్రభుత్వ వైద్యుడు.. మొత్తం సభ్యులుంటారు. ప్రజ్వల విమెన్ ట్రాఫికింగ్‌ను అరికట్టడానికి ప్రజ్వల అనే స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోంది. లైంగికదాడికి గురైన మహిళలు, సెక్స్ ట్రేడ్‌లో పట్టుబడ్డ మహిళలకు పునరావాసం కల్పిస్తోంది.. ఆమన్‌గల్ మునిసిపాలిటీ పరిధిలోని ప్రజ్వల పునరావాస కేంద్రంలో. దాదాపు పదేళ్లుగా వందల మందికి ఇక్కడ ఆశ్రయం ఇవ్వడంతోపాటు వారిలో మానసిక స్థయిర్యాన్నీ పెంపొందిస్తోంది . స్వయం ఉపాధిలోనూ శిక్షణనిస్తున్న ఈ ప్రజ్వల సంస్థాపకురాలు, నిర్వాహకురాలు సునీతా కృష్ణన్. -
ఇంటి నుంచే ‘మార్పు ’ప్రారంభం కావాలి
సాక్షి, విజయవాడ: ‘దిశ’ హత్యోదంతం నేపథ్యంలో మహిళలు, యువతుల భద్రతకు బెజవాడ పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. గురువారం సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ‘భద్రం బిడ్డ’ పేరుతో అవగాహన కార్యక్రమాలకు సీపీ ద్వారకా తిరుమలరావు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏదైనా సంఘటన జరిగినప్పుడల్లా కొత్త చట్టాల డిమాండ్ వినిపిస్తోందని.. ఆ ఆలోచనా ధోరణి సరైంది కాదన్నారు. ఉన్న చట్టాలని సక్రమంగా అమలు చేస్తే చాలని తెలిపారు. నిర్భయ, పోక్సో చట్టాలు చాలా పటిష్టమైనవన్నారు. ‘100’ ఒక్క నంబర్ గుర్తు పెట్టుకొని ఆపద ఉంటే కాల్ చేయాలని.. ఆరు నిమిషాల్లో పోలీసులు మీ ముందు ఉంటారన్నారు. కొన్ని దేశాల్లో ఇప్పటికీ కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారని.. ఉరి తీయమనేంత ఆక్రోశం కలిగించిన దారుణ ఘటన ‘దిశ’ ఘటన అని పేర్కొన్నారు. ‘ఇంటి నుంచి పిల్లలు బయటకెళ్లే సమయంలో తల్లిదండ్రులు ఆడ పిల్లలకు మాత్రమే జాగ్రత్తలు చెబుతారు. మహిళల పట్ల ఎలా మసులుకోవాలో మగ పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించాలని’ సూచించారు. మార్పు అనేది ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వాట్సాప్ వీడియో కాల్స్ కి రెస్పాండ్ కాకూడదన్నారు. లఘు చిత్రాల ప్రదర్శన ద్వారా పోలీసు యాప్‌లపై కళాశాల విద్యార్థినిలకు ఆయన అవగాహన కల్పించారు. 100,1090,1091,121,181 వంటి యాప్‌ల గురించి సీపీ వివరించారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని కళాశాలల్లో కార్యక్రమాలు చేపట్టి అవగాహన కల్పిస్తామని సీపీ తిరుమలరావు వెల్లడించారు. -
గులాబీ రంగు పురుగును నివారించండి
సాక్షి, హైదరాబాద్: పత్తి పంటను గులాబీ రంగు పురుగు నుంచి కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 18 లక్షల హెక్టార్ల మేర పత్తిని సాగు చేస్తున్నారని తెలిపారు. పత్తి పండించే మధ్య, దక్షిణాది రాష్ట్రాల్లో మూడేళ్ల నుంచి బీటీ రకం ఎక్కువగా ఈ గులాబీ రంగు పురుగు ప్రభావానికి గురవుతోందని చెప్పారు. ఏపీ, మహారాష్ట్రల్లో దీని తీవ్రత ఎక్కువగా కన్పిస్తోందన్నారు. గులాబీ రంగు పురుగు నివారణపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. -
డెంగీ బెంగ
రాయగడ : వర్షాకాలం ప్రారంభంలోనే డెంగీ జ్వరం ప్రభావం ఉండవచ్చన్న ముందస్తు ఆలోచనతో ప్రజలను చైతన్యవంతులను చేస్తూ గ్రామీణ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆశకార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లకు జిల్లా యంత్రాంగం, జిల్లా వైద్య విభాగం ఆదేశాలు జారీ చేశాయి. ఇటీవల డెంగీ దినోత్సవాన్ని నిర్వహించి మరిన్ని సూచనలు ఇస్తూ డెంగీ జ్వరానికి మందులు లేవని పరిసరాల శుభ్రతతో సహా ఇళ్లలో వేపాకు పొగ వేస్తూ ఇంట్లో మంచినీటి నిలువలు ఉండకుండా ప్రజలు దొమతెరల్లో నిద్రించాలని సూచించారు. అయితే రాయగడ జిల్లా ఆస్పత్రికి 7కిలోమీటర్ల దూరంలో గల కొత్తపేట గ్రామపంచాయతీ వీరనారాయణపురం గ్రామంలో ప్రజలు జ్వరాలతో బాధ పడుతున్న సమాచారంతో జిల్లా వైద్యబృందం గ్రామానికి వెళ్లి 13మంది రక్తనామూనాలు సేకరించి కొరాపుట్ రక్తపరీక్ష కేంద్రానికి పంపగా ఆ నమూనాల్లో ఏడుగురు వ్యక్తులకు డెంగీ జ్వరం సోకినట్టు వైద్య పరీక్షలో తేలింది. గ్రామంలో పారిశుద్ధ్య లోపం గ్రామంలో సుమారు వంద కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో గొట్టపు బావుల ప్రాంతంలో బురద పేరుకుపోయి, కాలువల్లో టన్నుల కొద్దీ పూడికలు నిండిపోవడంతో జిల్లాలో మొట్టమొదటిసారిగా డెంగీ వ్యాధి బయటపడింది. పంచా యతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పారిశుద్ధ్య నిర్మూలన కార్యక్రమాలు, స్వచ్ఛభారత్ కార్యక్రమాలు సరిగా చేయకపోవడం, పంచాయతీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా డెంగీ విజృంభించింది. గ్రామంలో సక్రమంగా దోమతెరలు వినియోగించక పోవడం, కాలువలు, గొట్టపు బావులు, ఇళ్ల దగ్గర నీటి నిలువలు నిలిచిపోవడంతో దోమలు విస్తరించి గ్రామస్తులు జ్వరాల బారిన పడుతున్నారు. గ్రామ సమీప జీమిడిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో డెంగీ జ్వరం సోకిన పవిత్ర కడ్రక మగవాడు(7) రంజిత తాడింగి(20) అర్జుమహనందియా(15) మధుబాయిసారక (23) కుమారిసారక(17)తదితరులు చికిత్స పొందుతున్నారు. గ్రామంలో ఇంకా జ్వరపీడితులు అధికంగా ఉన్నారు. -
బ్యాగు బరువుపై అవగాహన కార్యక్రమాలు
పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగు బరువు తగ్గింపుపై ముందుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ కిషన్ తెలిపారు. బ్యాగు బరువు తగ్గించే విషయంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో పాటు తల్లిదండ్రులకు బాధ్యత ఉందని, అందుకే అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. శుక్రవారం డైరెక్టరేట్‌లో టెట్ ఫలితాల వెల్లడి అనంతరం విలేకరులతో మాట్లాడారు. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీలు వేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. రాష్ట్ర స్థాయిలోనూ త్వరలోనే చేపడతామన్నారు. -
డేంజర్ జర్నీ
ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా వాహనచోదకులు నిర్లక్ష్యం వీడటం లేదు. ప్రమాదభరిత ప్రయాణం సాగిస్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. బైక్‌పై ఒకరికి ముగ్గురు కూర్చుని హెల్మెట్ కూడా లేకుండా రయ్..రయ్‌మని హైవేపై దూసుకుపోతున్నారు. ఆటో డ్రైవర్లు కూడా పరిమితికి మించి స్కూలు పిల్లలు, ప్రయాణికులను ఎక్కించుకుని వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏదో ఒక ఘటన జరిగిన సమయంలో హడావుడి చేసే రవాణా శాఖ, పోలీసు అధికారులు ఈ నిబంధనల ఉల్లంఘనను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు. ఖాళీ సమయాల్లో మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతుండటంతో వాహనచోదకులు ఇలా ప్రమాదభరిత ప్రయాణం సాగిస్తున్నారు. - సాక్షి ఫొటోగ్రాఫర్ -
విజృంభిస్తున్న ఎయిడ్స్
* జిల్లాలో పెరుగుతున్న హెచ్ఐవీ బాధితులు * ఇప్పటివరకు మొత్తం 3,012 మంది మృత్యువాత * అవగాహన కార్యక్రమాలు అంతంతమాత్రమే * బాధితులకు పింఛన్లు అందని వైనం సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ రోగాలున్న వంద మంది రోగులకు రక్త పరీక్షలు నిర్వహిస్తే వారిలో ఆరుగురికి హెచ్ఐవీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆరుగురిలో ఇద్దరు విద్యార్థులు ఉంటున్నారు. అవగాహన లోపం, ఆరోగ్యంపై అశ్రద్ధతోనే ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. జిల్లాలో హెచ్ఐవీ సోకి ఇప్పటి వరకు 3,012 మంది చనిపోయారు. వీరిలో అధిక శాతం 40 లోపు వయసు వారు ఉండటం గమనార్హం. పలు వ్యాపారాలకు చిత్తూరు జిల్లా అనుకూలంగా ఉండటం, పర్యాటక ప్రదేశాలు ఎక్కువగా ఉండటం కూడా ఈ వ్యాధి విజృంభిస్తోందని వైద్యుతు చెబుతున్నారు. జిల్లాలో ఈ మహమ్మారి వేగంగా వ్యాపిస్తుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 324 అభంశుభంతెలియని పిల్లలు దీని బారిన పడటం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది. రెండేళ్లనుంచి నిధులు నిల్ ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. కేవలం నామమాత్రపు కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులుపుకుంటోంది. ప్రధాన కూడళ్లలో ఎయిడ్స్ నియంత్రణపై సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఐసీటీసీ అండ్ డీఆర్పీసీయూ కేంద్రాలకు అరకొర నిధులిస్తూ ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది. ప్రతినెలా ఖర్చుల నిమిత్తం రూ.18,000 ఈ సెంటర్లకు విడుదల చేయాల్సి ఉంటుంది. రెండేళ్లుగా ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేయడం లేదు. దీంతో ఆ శాఖ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. తమకు జీతాలే సరిగా రావడం లేదని ఇంకా అవగాహన కార్యక్రమాలు ఎలా చేపట్టుతామని ప్రశ్నిస్తున్నారు. పింఛన్లకు దూరం జిల్లాలో సుమారుగా 17,326 మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారు. ఇది అధికారికంగా ఏఆర్టీ కేంద్రాల్లో నమోదైన సంఖ్య. వీరికి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వీరందరికి పింఛన్లు మంజూరు చేస్తోంది. అయితే గత మూడేళ్లలో పింఛన్ తీసుకున్న వారు ఐదు శాతం కంటే తక్కువే. సమాజం తమను చులకనగా చూస్తుందని రోగులు కూడా పింఛన్లకు దూరంగా ఉంటున్నారు. గత మూడేళ్లలో జిల్లాలో హెచ్ఐవీ బాధితులకు అందుతున్న పింఛన్లు.. 2013 ఏప్రిల్ వరకు 1,300 2014ఏప్రిల్ వరకు 2,144 2015 ఏప్రిల్ వరకు 2,215 అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం ఎయిడ్స్నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిం చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర కార్పొరేట్ కాలేజీల్లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని యాజమాన్యాలకు చెబుతాం. దీనిపై జిల్లా వ్యా ప్తంగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తాం. ప్రజల్లో చైతన్యం వచ్చే వరకు ఇలాంటి వ్యాధులను అరికట్టలేం. - డాక్టర్ వెంకటప్రసాద్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి, చిత్తూరు -
సంచార జాతుల సంక్షేమంపై ప్రభుత్వ దృష్టి
ఈ నెల 5 నుంచి 9 వరకు 10 జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లోని సంచార, ఉపసంచార జాతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ జాతుల సంస్కృతి, కళలు, సంప్రదాయాల పరిరక్షణ, సంక్షేమపథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా వారు లబ్ధిపొందేందుకు చర్యలను చేపట్టనుంది. ఇందుకోసం ఆధార్ కార్డులు, ఆసరా పింఛన్లు, ప్రభుత్వ ప్రతిపాదిత డబుల్ బెడ్రూమ్ పథకం వర్తింపజేయడం వంటి తదితర రూపాల్లో వారిని ఆదుకోవాలని యోచిస్తోంది. వీరి పిల్లలను విద్యావంతులను చేయడంపై బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఇందుకోసం ఈ నెల 5-9ల్లో రాష్ట్రంలోని పది జిల్లాల్లో సంచారజాతుల కులసంఘాల కులపెద్దలతో సమావేశం నిర్వహిస్తారు. మే 5న మెదక్, నల్లగొండ, 6న వరంగల్, కరీంన గర్, 7న ఖమ్మం, నిజామాబాద్, 8న మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, 9న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్వహిస్తారు. జిల్లాస్థాయిలో డిప్యూటీ డెరైక్టర్ (బీసీడబ్ల్యూ)/జిల్లా బీసీసంక్షేమ అధికారులు, ఏబీసీడబ్ల్యూలు, ఈడీ బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సంచారజాతుల జిల్లా అధ్యక్షులతో సమావేశమై వివరాలతో బీసీసంక్షేమ శాఖ డెరైక్టర్‌కు నివేదిక సమర్పిస్తారు. ఆ నివేదికలపై ఈ నెల 15న హైదరాబాద్‌లోని సంక్షేమభవన్‌లో సంఘాల రాష్ట్రస్థాయి నాయకులతో చ ర్చిస్తారు. అనంతరం వారి కోసం చేపట్టాల్సిన చర్యలను సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంక్షేమశాఖ నివేదిక సమర్పిస్తుంది. -
స్వైన్‌ఫ్లూ పంజా
⇒ ‘తూర్పు’న మరో ముగ్గురికి నిర్ధారణ ⇒నెల వ్యవధిలో ఎనిమిది పాజిటివ్ కేసులు ⇒ఆందోళనలో జిల్లా ప్రజలు ⇒రంగంలోకి రాష్ట్ర ఉన్నతాధికారులు ⇒నివేదిక కోరిన వైద్యారోగ్యశాఖ డెరైక్టర్ ⇒అటకెక్కిన అవగాహన కార్యక్రమాలు సాక్షి, మంచిర్యాల : జిల్లాపై ‘స్వైన్‌ఫ్లూ’ పంజా విసిరింది. గడిచిన నెల వ్యవధిలో ఐదు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. గురువారం మరో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయ్యింది. చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రాంతీయ ఆస్పత్రిలో చేరిన బెల్లంపల్లి పట్టణానికి చెందిన మాదాకా సుజాత-సమ్మయ్య దంపతులు, మందమర్రి మండలం గుడిపల్లికి చెందిన దుర్గమ్మ రాములు నుంచి ఈనెల 17న వైద్యులు నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపారు. అక్కడ నిర్వహించిన పరీక్షలో వీరికి స్వైన్‌ఫ్లూ సోకిందని నిర్ధారించారు. అయితే ఇప్పటి వరకు స్వైన్‌ఫ్లూ బారిన పడిన వారందరూ ‘తూర్పు’ ప్రాంతానికి చెందిన వారే కావడంతో ఈ ప్రాంత ప్రజలతోపాటు జిల్లా యంత్రాంగమూ కలవరపడుతోంది. జిల్లాలో వ్యాధి తీవ్రత తెలుసుకున్న కుటుంబ ఆరోగ్య శాఖ డెరైక్టర్ గురువారం జిల్లా విద్యాశాఖాధికారి రుక్మిణమ్మకు సాయంత్రం ఫోన్ చేశారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు.. రోగుల నివాస ప్రాంతాల పరిస్థితి.. చేపట్టిన ముందస్తు చర్యలపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు డీఎంహెచ్‌వో వివరించారు. దీంతో అధికారులు హుటాహుటిన నివేదిక తయారు చేసి పంపినట్లు తెలిసింది. గత నెల 22న.. పశ్చిమ ప్రాంతంలోని బాసరకు చెందిన ఓ యువతి స్వైన్‌ఫ్లూ లక్షణాలతో చనిపోయింది. వైద్యాశాఖ మాత్రం ఆ యువతి కామెర్ల వ్యాధితో చనిపోయిందని వివరణ ఇవ్వడం గమనార్హం. ‘తూర్పు’పై నిర్లక్ష్యమెందుకూ...? ‘తూర్పు’ పరిధిలో ఉన్న మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ప్రాంతాల్లో పారిశుధ్యం.. ప్రజావగాహన కార్యక్రమాలపై జిల్లా యంత్రాంగం పట్టింపులేకుండా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రం నుంచి ఈ ప్రాంతాలు దూరంగా ఉండడం.. అధికారులెవరూ ఇటు వైపు రాకపోవంతో ఈ ప్రాంతాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. పదిహేను రోజుల క్రితం జిల్లా యంత్రాంగం స్వైన్‌ఫ్లూపై చేపట్టిన అవగాహన కార్యక్రమాల అమలు అటకెక్కింది. ఫలితంగా.. ఆయా ప్రాంతాల్లో ప్రాణాంతక స్వైన్‌ఫ్లూ చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో నమోదైన ఎనిమిది కేసుల్లో.. మంచిర్యాల, బెల్లంపల్లి పట్టణాల్లో ఇద్దరి చొప్పున నలుగురు, మందమర్రిలో ముగ్గురు, కాసిపేటకు సంబంధించినవే. వ్యాధి ఇతరులకు సోకే ప్రమాదం పొంచి ఉండడంతో వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన ముందస్తు చర్యలతో ఒనగూరిందేమీ లేదు. గత నెలలో.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్ధాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసినట్లు అప్పట్లో అధికారులు చెప్పినా ప్రస్తుతం అవి కానరావడం లేదు. పదిహేను రోజుల క్రితం క్షేత్రస్థాయిలో కమిటీల పనితీరు నివేదికలు అధికారులు తెప్పించుకున్నారు. ఇప్పడు ఆ నివేదికల జాడ లేకుండాపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో దండోరా.. పారిశుధ్యంపై అవగాహన కల్పించాలని జిల్లా పంచాయతీ శాఖ కార్యదర్శులు.. ఆ శాఖ సిబ్బందికి జారీ చేసిన ఆదేశాలతో అవగాహన కార్యక్రమాలు మూడ్రోజులతోనే ముగిశాయి. క్షేత్రస్థాయిలో.. రోగులకు ప్రాథమిక చికిత్స అందించే గ్రామీణ వైద్యులు (ఆర్ఎంపీలు) ప్రజలకు స్వైన్‌ఫ్లూపై అవగాహన కల్పించడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ రిమ్స్, మంచిర్యాల, భైంసా, నిర్మల్ , బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఉట్నూరు, ఖానాపూర్ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేటెడ్ వార్డులు అంతంత మాత్రంగానే తెరుచుకుంటున్నాయి. ఏదేమైనా.. తూర్పు ప్రాంతంలో ఇంకా ‘స్వైన్‌ఫ్లూ’ నీడలు అలుముకునే ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. మరో మూడు స్వైన్ ఫ్లూ కేసులు - బెల్లంపల్లిలో రెండు, మందమర్రిలో ఒకటి.. - భార్యాభర్తలిద్దరికీ స్వైన్‌ఫ్లూ నిర్ధారణ మంచిర్యాల టౌన్ : ఇప్పటి వరకు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో 20 మంది వరకు స్వైన్ ఫ్లూ లక్షణాలతో చేరగా ఇందులో ఐదుగురికి నిర్ధారణ అరుునట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరు కోలుకుని ఇంటికి వెళ్లగా తాజాగా మరో ముగ్గురు వ్యాధి బారిన పడ్డారు. బుధవారం రాత్రి వచ్చిన నివేదిక ప్రకారం వివరాలిలా ఉన్నారుు. బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రి కాంప్లెక్స్ ఏరియాలో నివాసం ఉంటున్న దంపతులు మడక సమ్మయ్య(44), మడక సుజాత (40) స్వైన్‌ఫ్లూ బారినపడ్డారు. వీరితోపాటు మందమర్రి గుడిపెల్లి గ్రామానికి చెందిన దుర్గం రాములు (40) కూడా స్వైన్ ఫ్లూ లక్షణాలతో రాగా వీరంతా ఈ నెల 17వ తేదీన మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలకంఠేశ్వర్రావు ఆదేశాల మేరకు వైద్యురాలు నీరజ వీరి నమూనా రక్తం, తెమడ సేకరించి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి అదే రోజు పంపించారు. దీనికి సంబంధించి రిపోర్టు బుధవారం రాత్రి రాగా ముగ్గురికీ స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అదే రోజు మరో ఇద్దరి రక్త నమూనాలు పంపించగా కుశని మణమ్మ, సుల్లూరి కీర్తనలకు నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ ముగ్గురిలో దుర్గం రాములు హైదరాబాద్‌కు వెళ్లగా బెల్లంపల్లికి చెందిన భార్యాభర్తలు ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరికి మెరుగైన వైద్య సేవలందిస్తూ నిత్యం పర్యవేక్షిస్తున్నామని వైద్యుడు నీలకంఠేశ్వర్రావు తెలిపారు. స్వైన్‌ఫ్లూ వార్డుపై నిర్లక్ష్యం... స్వైన్‌ఫ్లూ వార్డు కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించారు. అయితే.. వ్యాధి సోకిన వారిని నిత్యం పర్యవేక్షిస్తూ వైద్య అందించాల్సి ఉండగా ఎవరూ లేకపోవడంతో వ్యాధి సోకిన వారు ఇష్టారాజ్యంగా ఆస్పత్రిలో తిరుగుతున్నారు. అలాగే ఈ వార్డు కూడా ప్రసూతి విభాగం, రక్తనిధి కేంద్రానికి మధ్యలో ఉండటంతో ఇటుగా వచ్చి పోయేవారు కూడా ఆ వ్యాధి బారిన పడే ప్రమాదామూ లేకపోలేదు. ఆస్పత్రి వర్గాలు ఇప్పటికైనా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
హమ్మయ్య.. పక్షులు బతికిపోయాయి!
* ‘దీపావళి’నాడు తగ్గిన పక్షుల మరణాలు, గాయాల కేసులు * గత ఏడాదికంటే 20% తగ్గిన నష్టం * అవగాహన కార్యక్రమాలు చేపట్టిన జంతు ప్రేమికులు * పెరిగిన టపాసుల ధరలూ కారణమే.. సాక్షి, ముంబై : నగరంలో ఈసారి దీపావళి సందర్భంగా గాయపడిన పక్షుల సంఖ్య తగ్గింది. గత ఏడాదితో పోల్చితే ఈ సారి ఈ కేసుల సంఖ్య 20 శాతం తక్కువగా నమోదయ్యిందని ఓ సామాజిక కార్యకర్త పేర్కొన్నారు. ప్రతిసారి దీపావళికి టపాసుల శబ్ధ ధాటికి చాలా పక్షులు గాయాలపాలు కాగా, మరికొన్ని మృత్యువాత పడుతుంటాయి. దీంతో పక్షి ప్రేమికులు ఈసారి నగరవాసుల్లో కొంత మేర అవగాహన కల్పించారు. అన్ని పండుగల కంటే దీపావళి నాడు జంతువులు, పక్షులు ఎక్కువగా ఇబ్బంది పడతాయని జంతు ప్రేమికులు పేర్కొన్నారు. లెక్కలేనన్ని జంతువులు గాయాలపాలవుతాయన్నారు. టపాసులు కాల్చడంతో చాలా జంతువులు శబ్దధాటికి బయటికి పరుగులు తీస్తుంటాయని, ఈ క్రమంలో అవి వాహనాల కింద పడి గాయాలపాలు అవుతుంటాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కూడా తాము నగర వాసుల్లో అవగాహన కల్పించామన్నారు. చిన్నపిల్లలతో ఈ అంశమై మాట్లాడడమే కాకుండా పోలీస్స్టేషన్లను కూడా ఆశ్రయించామన్నారు. అంతేకాకుండా ఫేస్బుక్, వాట్సప్‌ల ద్వారా కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఎలాంటి ప్రమాదం జరిగినా లేదా తమ జంతువులు తప్పిపోయినా అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా తమకు ఫిర్యాదు అందజేయాలని నగరవాసులకు సూచించామన్నారు. ఇదిలా ఉండగా, టపాసుల ధరలు పెరిగిపోవడంతో ఈసారి నగరవాసులు ఎక్కువ స్థాయిలో టపాసులు కాల్చలేదని, దీంతో పక్షులు, జంతువులు చాలావరకు గాయాలబారినుంచి బయటపడ్డాయని వారు అభిప్రాయపడ్డారు. పరేల్‌లోని బాంబే సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ (బీఎస్పీసీఏ)కు చెందిన ప్రతినిధి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈసారి గాయపడిన పక్షుల సంఖ్య గత ఏడాది కన్నా 25 శాతం తగ్గిందన్నారు. బీఎస్పీసీఏ ఆస్పత్రి ఇన్చార్జి డాక్టర్ జె.సి.కన్నా మాట్లాడుతూ.. దీపావళిని పురస్కరించుకొని ఆస్పత్రుల్లో చేరిన పక్షులు, జంతువులు కేసులు ఈసారి చాలా వరకు తగ్గాయన్నారు. ముఖ్యంగా గాలి పటాలు ఎగురవేయడం ద్వారా చాలా పక్షులు తీవ్రంగా గాయపడుతుంటాయి. దీంతో తమ వద్దకు చికిత్స నిమిత్తం తీసుకు వస్తుంటారన్నారు. కాగా, ఈసారి దీపావళి సందర్భంగా గాయపడిన 18 పక్షులను తమ వద్దకు చికిత్స కోసం తీసుకు వచ్చారన్నారు. ఒక్కోసారి కొంత మంది పిల్లలు శునకాలు, పిల్లులు, గొర్రెల తోకలకు టపాసులను కట్టి ఆడుకుంటారని తెలిపారు. ఇలాంటి వాటిల్లో గాయపడిన కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ విషయమై కూడా నగర వాసుల్లో అవగాహన కల్పించామన్నారు. టపాసుల ధరలు పెరగడంతో ఎకో ఫ్రెండ్లీ దీపావళి ఆవశ్యకత గురించి తెలియజేశామన్నారు. -
ప్రభుత్వ గుర్తింపులేని స్కూళ్లలో పిల్లలను చేర్చొద్దు
భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి గుర్తింపులేని స్కూళ్ల వివరాలతో కరపత్రాలు పంపిణీ జిల్లావ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు డీఈవో దేవానందరెడ్డి వెల్లడి విజయవాడ : ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి దేవానందరెడ్డి తల్లిదండ్రులకు సూచించారు. గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని కోరుతూ బుధవారం నగరంలో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యాన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక మారుతీనగర్‌లోని ఇండియన్ డిజిటల్ స్కూల్ వద్ద నుంచి ఈ ప్రదర్శన ప్రారంభమైంది. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పిల్లలను పాఠశాలల్లో చేర్చే ముందు ఆ స్కూలుకు తగిన గుర్తింపు ఉందా.. లేదా.. అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలని సూచించారు. నగరంలోని పలు కార్పొరేట్ స్కూళ్లకు సైతం గుర్తింపు లేదని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని చెప్పారు. జిల్లాలో 15లక్షల మంది చదువుకునేందుకు అవసరమైన గుర్తింపు పొందిన స్కూళ్లు ఉన్నాయని, వాటిలో కేవలం ఐదు లక్షల మంది మాత్రమే విద్యాభ్యాసం చేస్తున్నార ని పేర్కొన్నారు. తాను 2012లో డీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పుడు జిల్లాలో 300కు పైగా గుర్తింపు లేని స్కూళ్లు ఉన్నాయని, కఠిన చర్యలు చేపట్టడం వల్ల ఇప్పుడు ఆ సంఖ్య బాగా తగ్గిందని వివరించారు. ఈ ఏడాది నుంచి సీసీఈ విధానం అమలు ఈ విద్యా సంవత్సరం నుంచి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్(సీసీఈ) విధానం అమలు చేస్తున్నామని డీఈవో చెప్పారు. దీని వల్ల గుర్తింపు లేని స్కూళ్లలో విద్యను అభ్యసించిన వారు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఒక స్కూల్లో చదివిన విద్యార్థులను మరో పాఠశాల పేరుమీద పరీక్షలకు పంపించటం నేరమని తెలిపారు. ఆ విధంగా పరీక్షలు రాసిన విద్యార్థులు టీసీలు తీసుకునేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. జిల్లాలో గుర్తింపు లేని స్కూళ్ల వివరాలతో కూడిన ప్రచార వాహనం ద్వారా విద్యార్థులకు తల్లితండ్రులకు బుధవారం నుంచి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే గుర్తింపు లేని స్కూళ్లలో చేరితే కట్టిన ఫీజును తిరిగి ఇప్పించడానికి తాము సహకరిస్తామని డీఈవో హామీ ఇచ్చారు. డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ రవికుమార్ మాట్లాడుతూ గుర్తింపు లేని స్కూళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్పప్పటికీ, కార్పొరేట్ స్కూళ్లు చట్టాల్లోని లొసుగులను వినియోగించుకుని ముందుకు సాగుతున్నాయన్నారు. జిల్లాలో 82 గుర్తింపు లేని స్కూళ్లు ఉన్నాయని, వాటిలో చేరినవారు ఇబ్బందులు పడక తప్పదని హెచ్చరించారు. మారుతీనగర్‌లోని సాయి టాలెంట్ స్కూల్, నారాయణ, ఇండియన్ డిజిటల్, దుర్గాపురంలోని చైతన్య స్కూళ్లకు గుర్తింపు లేదని తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలంటూ నినాదాలు చేస్తూ ప్ల కార్డులు పట్టుకుని మారుతీనగర్, మాచవరం, ఏలూరు రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించారు. గుర్తింపు లేని స్కూళ్ల వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీవైఈవో టీఎస్ బాబు, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ఫీజులపై నియంత్రణ కార్పొరేట్, ప్రయివేటు స్కూళ్లలో ఫీజులపై కూడా దృష్టి సారించామని విద్యా శాఖ అధికారులు తెలిపారు. నిబంధనలకు అనుగణంగా ఫీజులు వసూలు చేయాలని, పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.