సాక్షి, హైదరాబాద్: పత్తి పంటను గులాబీ రంగు పురుగు నుంచి కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో 18 లక్షల హెక్టార్ల మేర పత్తిని సాగు చేస్తున్నారని తెలిపారు. పత్తి పండించే మధ్య, దక్షిణాది రాష్ట్రాల్లో మూడేళ్ల నుంచి బీటీ రకం ఎక్కువగా ఈ గులాబీ రంగు పురుగు ప్రభావానికి గురవుతోందని చెప్పారు. ఏపీ, మహారాష్ట్రల్లో దీని తీవ్రత ఎక్కువగా కన్పిస్తోందన్నారు. గులాబీ రంగు పురుగు నివారణపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment