cotton crops
-
పత్తిపై ‘గులాబీ’ పంజా
సాక్షి, హైదరాబాద్: పత్తిపై గులాబీ రంగు పురుగు పంజా విసురుతోంది. మూడేళ్ల క్రితం పంటపై పెద్దెత్తున దాడి చేసిన ఈ పురుగు ఇప్పుడు మరోసారి విజృంభిస్తుందన్నది శాస్త్రవేత్తల అంచనా. ఇప్పటికే ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ రూరల్, నల్లగొండ, సూర్యాపేట, నిర్మల్, ఆసిఫాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల సహా మిగిలిన జిల్లాల్లోనూ పత్తిని పీడిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పురుగు ప్రారంభ దశలోనే ఉన్నా, మున్ముందు దీని విస్తరణ మరింత వేగవంతం కానుందని వ్యవసాయ శాస్త్రవేత్త ఒకరు హెచ్చరించారు. ఒకచోట గులాబీ రంగు పురుగుంటే, చుట్టుపక్కల 30–40 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అనేకచోట్ల గులాబీ పురుగును గుర్తించినట్లు అక్కడి వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మరో వారంలోగా దాని ఉధృతి కనిపించనుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదు లక్షల ఎకరాల్లో... రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 60.52 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. వాణిజ్య పంట కావడంతో పత్తిని ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. మద్దతు ధర కూడా ఆశాజనకంగా ఉంది. ఇలాంటి సమయంలో గులాబీ పురుగు పత్తి చేలల్లో కనిపిస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో పత్తి పంటకు ఈ పురుగు సోకినట్లు అంచనా. లింగాకర్షక బుట్టల ఏర్పాటుతో పురుగును గుర్తించవచ్చు. ఒక బుట్టలో నాలుగు పురుగులు పడితే ఉధృతి అధికంగా ఉందని అంచనా. పురుగును గుర్తించాక అవసరమైన క్రిమిసంహారక మందులు వేస్తే చనిపోతుంది. అయితే లింగాకర్షక బుట్టలను సకాలంలో సరఫరా చేయడంలో వ్యవసాయశాఖ యంత్రాంగం విఫలమైందని, దీంతో పురుగు ఉధృతి పెరుగుతోందని రైతులు మండిపడుతున్నారు. బీటీ–2 విత్తన వైఫల్యమే... బీటీ పత్తి విత్తనాలు రాకముందు కాయతొలిచే పురుగుల ఉధృతితో తీవ్ర ఇబ్బందులు ఉండేవి. బీటీ రాకతో ఈ కాయతొలిచే శనగ పచ్చ పురుగు, మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగు తాకిడి తగ్గింది. కానీ, తర్వాత పరిస్థితులు మారాయి. బీటీ–1 టెక్నాలజీని 2002లో మోన్శాంటో పరిచయం చేసింది. 2006 వరకు బాగానే ఉన్నా తర్వాత ఈ బీటీ–1 గులాబీరంగు పురుగును నాశనం చేసే శక్తి కోల్పోయింది. దీంతో దాని స్థానే బీటీ–2ని తీసుకొచ్చింది. 2012 నాటికి దీనికి కూడా గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి నశించింది. తర్వాత బీటీ–3ని తీసుకొచ్చినా.. దీంతో జీవ వైవిధ్యానికే నష్టం జరుగుతుందని నిర్ధారణ కావడంతో దేశంలో దానికి అనుమతివ్వలేదు. బీటీ టెక్నాలజీ విఫలమైనా దేశంలో బీటీ–2 విత్తనాలనే రైతులు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కేంద్రం ప్రత్యామ్నాయం వైపు చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. ఎకరాకు సరాసరిన 10–12 క్వింటాళ్ల వరకు పత్తి ఉత్పత్తి కావాల్సి ఉండగా, గులాబీ రంగు పురుగుతో 6–7 క్వింటాళ్లకు పడిపోయింది. పైగా గులాబీ రంగు పురుగుతో పత్తి పంట పోయినా రైతులకు బీమా సౌకర్యమే లేదు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం గులాబీ రంగు పురుగుతో నష్టపోయిన రైతులకు ఆర్థికసాయం చేసింది. పైగా విత్తన కంపెనీల నుంచి కూడా పరిహారం ఇప్పించింది. గులాబీ రంగు పురుగుతో నష్టం ఇలా.. ఈ పురుగు తాకిడి పంట పూత దశ నుంచి మొదలై పంట చివరి దశలో ఎక్కువగా నష్టపరుస్తుంది. గులాబీ రంగు పురుగు సోకిన పత్తి కాయలను చూస్తే దాంట్లో దూది నల్లగా మారి, నాణ్యత దెబ్బతిని ఉంటుంది. బరువు తగ్గటంతో దిగుబడి తగ్గుతుంది. లేత కాయలపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కాయలపై 2 మిల్లీమీటర్ల పరిమాణం వరకు రంధ్రాలు కనిపిస్తాయి. పంట కాలాన్ని నవంబర్ తర్వాత పొడిగించడం వల్ల కూడా గులాబీరంగు పురుగు వస్తుంది. లింగాకర్షక బుట్టలతో పురుగును నియంత్రించవచ్చు. పంట నాశనం 12 ఎకరాల్లో పత్తి సాగు చేశా. అధిక వర్షాలకు తోడు పం టకు గులాబీ రంగు పురుగు ఆశించింది. పూత, కాతను పురుగు నాశనం చేసింది. ఎకరాకు రెండు క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చేలా లేదు. – మిర్యాల విక్రమ్‌రెడ్డి, బీరోలు, ఖమ్మం జిల్లా కాయ రాలిపోయింది 8 ఎకరాల్లో పత్తిని సాగు చేశా. కౌలుతో కలుపుకొని ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి అయ్యింది. గులాబీ రంగు పురుగుతో కాయ రాలిపోయింది. అధిక వర్షాలు కూడా తోడుకావడంతో పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. – బాగం రవి,సిద్దిక్‌నగర్, ఖమ్మం జిల్లా దున్నేద్దామనుకుంటున్నా... 15 ఎకరాల్లో పత్తి వేశా. అందులో నాలుగు ఎకరాలు కౌలు తీసుకున్నా. ఒకసారి దూది తీసినం. ఐదు క్వింటాళ్లు వచ్చింది. ఇప్పుడు రెండోసారి తీద్దామంటే పురుగువచ్చింది. ఎకరానికి రూ. 35 వేలు పెట్టుబడి పెట్టిన. పంట నాశనం కావడంతో దీన్ని దున్నేద్దామని అనుకుంటున్నా. – అండె అశోక్, పొన్నారి, ఆదిలాబాద్ జిల్లా -
మునిగిన పంటల్ని కాపాడుకోండిలా!
సాక్షి, అమరావతి: ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల వరి, పత్తి, మొక్కజొన్న పంటలతోపాటు అక్కడక్కడా అపరాలకు నష్టం వాటిల్లినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. రాష్ట్రంలో సుమారు 1.10 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. నీట మునిగిన పంటల్ని కాపాడుకునేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచనలు చేశారు. నీట మునిగిన పంటల్ని 48 గంటల్లోగా కాపాడుకునే చర్యలు చేపట్టాలని సూచించారు. వరి రక్షణకు.. వరి చేలల్లో అధికంగా ఉన్న నీటిని తొలగించేందుకు బోదెలు తీయాలి. వర్షం తెరిపి ఇస్తే.. ఎకరానికి 15, 20 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ పొటాష్ వేయాలి. పొడ తెగులు లక్షణాలు కనిపిస్తే హెక్సాకొనజోల్ లేదా వాలిడా మైసిన్ లేదా ప్రోపికొనజోల్ మందుల్లో ఏదో ఒక దానిని లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి 15 రోజుల తర్వాత మందు మార్చి చేనంతా తడిసేలా చల్లుకోవాలి. నారుమళ్లలో లద్దె పురుగు నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు, డైక్లోరోవాస్ ఒక మిల్లీలీటర్ కలిపి సాయంత్రం వేళ పిచికారీ చేయాలి. ఆకు ముడత నివారణకు ఎసిఫేట్ ఒకటిన్నర గ్రాము లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. దోమపోటు నివారణకు పైమెట్రోజైన్ 0.6 గ్రాము లేదా డైనోటేప్యూరాన్ 0.5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్‌ను ఇథిప్రోల్‌తో కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో సస్యరక్షణ భూమిలో అధికంగా తేమ ఉంటే అంతర సేద్యం ద్వారా తగ్గించాలి. ఎకరానికి 25, 30 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ వేయాలి. ఫాల్ ఆర్మీ వార్మ్ తెగులు గమనిస్తే ఎకరానికి క్లోరాంట్రనిలిప్రోల్ 60 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయెట్ 80 గ్రాములు లేదా లాంట్డా సైహలోత్రిన్ 200 మిల్లీలీటర్లను పిచికారీ చేయాలి. ఇతర పంటల రక్షణకు.. అపరాల పంటల్లో అధిక తేమ వల్ల నత్రజని అందకపోతే ఒక శాతం కేఎన్ఓ–3ని రెండుసార్లు చొప్పున 4, 5 రోజులు చల్లాలి. సూక్ష్మ పోషకాల లోపం నివారణకు జింక్ సల్ఫేట్, అన్నభేది వేయాలి. మరింత సమాచారం కోసం సమీపంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలను 155251 నంబర్లో లేదా ఆర్బీకేలలోని గ్రామీణ వ్యవసాయ సహాయకులను సంప్రదించవచ్చు. పత్తిలో తెగులు నివారణకు.. పత్తి తోటల్లో తేమను తగ్గించడానికి అంతర సేద్యం చేయాలి. మొదట డీఏపీ లేదా యూరియా వేయాలి. పత్తి విత్తిన 30, 35 రోజులప్పుడు గడ్డి జాతి మొక్కల నివారణకు ఎకరానికి 400 మిల్లీలీటర్ల క్విజలోపాప్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. భూమిలో వచ్చే కుళ్లు తెగుళ్లు, బ్యాక్టీరియా మచ్చ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములను లేదా పౌశమైసిన్ లేదా ప్లాంటా మైసిన్‌ను పిచికారీ చేయాలి. పంట వేసి 90 రోజులైతే ఎకరాకు 30, 35 కిలోల యూరియా, 20, 25 కిలోల పొటాష్ వేయాలి. -
పురుగులపై వలపు వల!
మొక్కజొన్న తదితర పంటల్లో కత్తెర పురుగు, పత్తి పొలాల్లో గులాబీ పురుగు సృష్టిస్తున్న విధ్వంసానికి భారతీయ రసాయనిక సాంకేతిక సంస్థ (ఐ.ఐ.సి.టి.) దీటైన, సులువైన, చవకైన పరిష్కారాన్ని చూపుతోంది. రసాయనిక పురుగుమందులకు, జన్యుమార్పిడి పంటలకు దీటైన రసాయనికేతర, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా లింగాకర్షక బుట్టలను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని ఐ.ఐ.సి.టి. శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయి ప్రయోగాల్లో రుజువు చేశారు. ఐ.ఐ.సి.టి.లోని సెంటర్ ఫర్ సెమియోకెమికల్స్ విభాగంలో గత 25 ఏళ్లుగా వ్యవసాయ రంగంలో వాడే రసాయనాలు, లింగాకర్షక ఎరల ఉత్పత్తిపై పరిశోధనలు జరుగుతున్నాయి. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా గుర్తింపు పొందిన ఈ విభాగానికి ముఖ్య శాస్త్రవేత్త డా. బి. వి. సుబ్బారెడ్డి అధిపతిగా ఉన్నారు. దేశంలోని అనేక వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇక్రిశాట్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఈ విభాగం పరిశోధనలు చేపడుతోంది. 20 రకాల పురుగులకు ఎరలు రైతులను, ప్రభుత్వాలను అల్లాడిస్తున్న గులాబీ పురుగు, కత్తెర పురుగులతోపాటు వివిధ పంటలను ఆశిస్తున్న మరో 18 రకాల పురుగులను తాము రూపొందించిన నాణ్యమైన లింగాకర్షక ఎరలతో సమర్థవంతంగా అరికట్టవచ్చని డా. సుబ్బారెడ్డి వెల్లడించారు. గత సంవత్సరం తెలంగాణలో 25 వేల ఎకరాల్లో ఈ ఎరలతో పత్తిలో గులాబీ పురుగు తీవ్రతను విజయవంతంగా అరికట్టామని, ఫలితంగా పురుగుమందుల వాడకం సగానికి సగం తగ్గిందని, నాణ్యమైన పత్తి దిగుబడి రావడంతో రైతులు లాభపడ్డారని డా. సుబ్బారెడ్డి తెలిపారు. చెరకులో ఎర్లీ షూట్ బోరర్,ఇంటర్ నోడ్ బోరర్, వరిలో ఎల్లో స్టెమ్ బోరర్, టేకులో మొవి తొలిచే పురుగులను అరికట్టడానికి, వంగలో కాయతొలిచే పురుగు, కూరగాయలు/పండ్ల తోటలకు నష్టం చేసే పండు ఈగను అరికట్టే లింగాకర్షక ఎరలను ఐ.ఐ.సి.టి. రూపొందించి, రైతులకు అందుబాటులోకి తెస్తున్నది. లింగాకర్షక ఎర పనిచేసేదిలా.. పంట పొలాల్లో అమర్చడం ద్వారా ఎంపిక చేసిన జాతికి చెందిన మగ పురుగులను ఆకర్సించి నశింపజేయడం ద్వారా ఆ పురుగుల సంతతి వృద్ధిని అరికట్టేందుకు లింగాకర్షక ఎరలతో కూడిన బుట్టలను పంట పొలాల్లో అక్కడక్కడా ఏర్పాటు చేయడం అనే పద్ధతి ఉంది. ఆడ పురుగు విడుదల చేసే హార్మోన్ల వాసనకు ఆకర్షితులై మగ పురుగులు దరి చేరినప్పుడు సంతానోత్పత్తి జరుగుతుంటుంది. ఆడ పురుగులు విడుదల చేసే మాదిరి హార్మోన్లను కృత్రిమంగా ప్రయోగశాలలో తయారు చేసి, అంగుళం పొడవున గొట్టం మారిదిగా ఉండే ఎరకు ఆ హార్మోన్లను అద్దుతారు. ఆ ఎరను లింగాకర్షక బుట్టలో అమర్చి, దాన్ని పొలంలో ఏర్పాటు చేస్తే ఆ వాసనకు ఆకర్షితులయ్యే మగ పురుగులు బుట్టలోకి చేరి, బయటకు వెళ్లలేక చనిపోతాయి. ఆ విధంగా పొలంలో ఎంపిక చేసిన ఆయా జాతుల పురుగుల సంతతి వృద్ధిని అరికట్టవచ్చు. ఫలితంగా ఆయా పురుగులను చంపడానికి పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హానికరంగా పరిణమిస్తున్న రసాయనిక పురుగుమందులు చల్లే అవసరం అంతగా ఉండదు. ఒక ఎర ఒకే రకం పురుగును ఆకర్షించడానికి మాత్రమే రూపొదించబడి ఉంటుంది. ఇందువల్ల పర్యావరణ సమతుల్యతకు భంగం కలగదు. వరుసగా మూడేళ్లు లింగాకర్షక బుట్టలను ఎకరానికి 8 నుంచి 10 వరకు ఏర్పాటు చేసుకుంటే ఆ పురుగు ఉధృతి తగ్గిపోయి, దాన్ని అరికట్టడానికి పురుగుమందులు చల్లే అవసరం ఇక ఉండదని డా. సుబ్బారెడ్డి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. లింగాకర్షక ఎరల గురించి గత కొన్ని ఏళ్లుగా సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తూనే ఉన్నారు. అయితే, ఇన్నాళ్లూ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎరల తయారీ రసాయనాలను ఇప్పుడు ఐ.ఐ.సి.టి.లోనే తయారు చేసి.. అత్యంత నాణ్యమైన ఎరలను ఉత్పత్తి చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు కంపెనీల లింగాకర్షక ఎరలు సమర్థవంతంగా పనిచేయకపోవడం వల్ల ఈ టెక్నాలజీపైనే అపోహలు నెలకొంటున్న నేపథ్యంలో.. ఐ.ఐ.సి.టి. దేశీయంగా ఉత్పత్తి చేసిన రసాయనాలతో అత్యంత నాణ్యమైన ఎరలను ఉత్పత్తి చేసి, క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలను సాధిస్తుండడం విశేషం. ఉచితంగా లింగాకర్షక ఎరల పంపిణీ ఐ.ఐ.సి.టి.లో రోజుకు 25 వేల లింగాకర్షక ఎరలను తయారు చేస్తున్నారు. అంగుళం పొడవుండే ఒక్కో ఎర (ల్యూర్)కు రకాన్ని రూ. 6 నుంచి రూ. 10 వరకు ఖర్చవుతుంది. వీటిని రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. లింగాకర్షక ఎరలను ఉచితంగా పొందదలచిన రైతులు ఎవరైనా సికింద్రాబాద్ తార్నాకలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కార్యాలయంలో చీఫ్ సైంటిస్ట్ డా. బి.వి. సుబ్బారెడ్డిని 94409 06803 నంబరులో నేరుగా సంప్రదించవచ్చు (రైతులు తమ ఆధార్ కార్డు జిరాక్స్‌ను విధిగా తెచ్చి ఇవ్వవలసి ఉంటుంది).subbareddyiict@gmail.com– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ పత్తిలో గులాబీ రంగు పురుగును అరికట్టడానికిపంట 60వ రోజు నుంచి 120 రోజుల వరకు ఎర వేయాలి! పత్తి పంటకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్న గులాబీ రంగు పురుగు(పింక్ బోల్ వార్మ్)ను సికింద్రాబాద్ తార్నాకలోని ఐ.ఐ.సి.టి. తయారు చేసిన లింగాకర్షక ఎరను అనేక ఏళ్లుగా మహారాష్ట్రతోపాటు తెలంగాణలోని అనేక కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా వేలాది ఎకరాల్లో ప్రయోగాత్మకంగా వాడి చక్కని ఫలితాలు సాధించినట్లు ఐ.ఐ.సి.టి. చీఫ్ సైంటిస్ట్ డా. బి. వి. సుబ్బారెడ్డి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. గత ఏడాది తెలంగాణలోని 9 జిల్లాల్లోని 31 మండలాల్లో 25 వేల ఎకరాల్లో (ఎకరానికి 8 చొప్పున) 4.5 లక్షల లింగాకర్షక బుట్టలను అరవై రోజుల పంట దగ్గర నుంచి పెట్టారు. పత్తి రైతులకు గులాబీ పురుగుకు సంబంధించి పురుగుమందుల ఖర్చు సగానికి సగం తగ్గిందని, గుడ్డి పత్తి తగ్గిపోయి పత్తి నాణ్యత పెరిగిందని, రూ. 3 వేల నుంచి 5 వేల వరకు అధికాదాయం లభించిందని ఆయన వివరించారు. పత్తి పంటలో గులాబీ రంగు పురుగు జీవిత కాలం 29 రోజులు. ఇది పుట్టిన తర్వాత 25 రోజులు పాకే పురుగు దశలో ఉండి, తర్వాత రెక్కల పురుగు దశలోకి మారుతుంది. మగ రెక్కల పురుగును లింగాకర్ష బుట్ట ద్వారా ఆకర్షించి నశింపజేస్తే మరో తరం పురుగులు పుట్టకుండా ఉంటాయి. పత్తి పంట కాలం 180 రోజుల్లో గులాబీ పురుగు 3 తరాలను వృద్ధి చేస్తుంది. పెద్దయిన పురుగు 200 గుడ్లు పెడుతుంది. ఆ రెండొందల పురుగులు తలా ఒక 200 గుడ్లు పెడతాయి. ఆ విధంగా 3 తరాల్లో వేలాదిగా సంతతిని పెంచుకుంటాయి. తొలి తరంలో ఎదిగిన మగ రెక్కల పురుగును ఆకర్షించి మట్టుబెడితే ఆడ పురుగులు సంతానోత్పత్తి చేయలేవు కాబట్టి వాటి సంఖ్య పురుగుల మందులు చల్లకుండానే తగ్గిపోతుంది. పత్తి విత్తిన 60రోజులకు పూతకు వస్తుంది. పూత దశలోనే గులాబీ పురుగు ఆశిస్తుంది. కాబట్టి పత్తి విత్తిన 60 రోజులకు గులాబీ పురుగును అరికట్టేందుకు లింగాకర్షక బుట్టలు పొలంలో పంట మొక్కలకు అడుగు ఎత్తున ఉండేలా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల 25–30 రోజుల తర్వాత ఆ బుట్టలోని ఎర వాసనలు వెదజల్లటం తగ్గిపోతుంది. అందుకని 5 రోజులు ముందుగానే పాత ఎర తీసేసి. కొత్త ఎరను పెట్టుకోవాలి. గులాబీ పురుగు నష్టాన్ని తప్పించుకోవడానికి మొత్తంగా రెండు ఎరలు పెట్టుకుంటే చాలు. ఈ ఎర వల్ల మిత్రపురుగులకూ హాని కలగదు. పత్తిని 8 రకాల పురుగులు ఆశిస్తాయి. రైతులు నెలకు 3–4 సార్లు పురుగుమందులు చల్లుతారు. గులాబీ పురుగు కోసం ఈ ఎరలు పెట్టుకుంటే నెలకు రెండు సార్లు పిచికారీ సరిపోతుంది. ఖర్చు తగ్గుతుంది. పత్తి నాణ్యత, ఆరోగ్యమూ బాగుంటుంది. పత్తి విత్తిన 1–30 రోజుల్లో పొగాకు లద్దె పురుగు, 35–65 రోజుల దశలో శనగపచ్చపురుగు, 90–180 రోజుల వయసులో స్పైనీ బోల్వార్మ్ ఆశిస్తాయి. ఇవన్నీ కలిపి పత్తికి 10–15% నష్టం చేస్తాయి. 85–90% పత్తి పంట నష్టం గులాబీ పురుగు వల్లే జరుగుతుంది. ఈ నష్టాన్ని ఎరల ద్వారా తగ్గించుకోవచ్చు. రసాయనిక పురుగుమందుల వాడకం తగ్గితే నీటి, వాయు, భూమి కాలుష్యం తగ్గిపోతుంది. రైతులు, రైతుకూలీల ఆరోగ్యం బాగుపడుతుంది. ఆర్థికంగానూ లబ్ధి కలుగుతుందని డా. సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులకు పెద్ద సంఖ్యలో లింగాకర్షక ఎరలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. సికింద్రాబాద్ తార్నాకలోని ఐ.ఐ.సి.టి.లో తనను నేరుగా సంప్రదించాలని డా.సుబ్బారెడ్డి(94409 06803) కోరారు. కత్తెర పురుగు(ఫాల్ ఆర్మీ వార్మ్)ను అరికట్టడానికివిత్తనం వేసిన రోజుæనుంచే ఎరవేయాలి! గత రెండేళ్లుగా మొక్కజొన్న, చిరుధాన్యాలు, వరి, చెరకు తదితర పంటలను ఆశిస్తూ విధ్వంసం సృష్టిస్తున్న కత్తెర పురుగు (ఫాల్ ఆర్మీ వార్మ్)ను సమర్థవంతంగా అరికట్టే లింగాకర్షక ఎరను సికింద్రాబాద్ తార్నాకలోని భారతీయ రసాయన సాంకేతిక సంస్థ (ఐ.ఐ.సి.టి.) విజయవంతంగా రూపొందించడంతోపాటు రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఐరోపా, బ్రెజిల్, ఆఫ్రికా దేశాల్లో మొక్కజొన్న సహా 80 రకాల పంటలను కత్తెర పురుగు ఆశిస్తున్నది. ఆడ కత్తెర పురుగు మగ పురుగును ఆకర్షించడం కోసం ఒక్కో దేశంలో ఒక్కో రకమైన అనేక రసాయనాల సమ్మేళనాలతో కూడిన సెక్సువల్ హార్మోన్లను విడుదల చేస్తున్నట్లు గుర్తించామని, విదేశాల్లో తయారైన ఎర(ల్యూర్)లు మన దేశంలో కత్తెర పురుగును అరికట్టడానికి గానీ, మరో పురుగును అరికట్టడానికి తయారు చేసిన ఎర ఇంకో పురుగుకు గానీ పనికిరావని ముఖ్య శాస్త్రవేత్త డా. బి. వి. సుబ్బారెడ్డి తెలిపారు. ఐ.ఐ.సి.టి.లోని అత్యాధునిక లాబ్‌లో తాము తయారు చేసిన ఎరను ఇటీవల ఇక్రాశాట్ క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించి చూడగా కత్తెర పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చన్న విషయం నిర్థారణ అయ్యిందని ఆయన వెల్లడించారు. తాము అందించే ఎరను అమర్చిన లింగాకర్షక బుట్టలను కత్తెర పురుగు ఆశించే అవకాశం ఉన్న మొక్కజొన్న, చిరుధాన్యాలు, చెరకు తదితర పంట పొలాల్లో విత్తనాలు వేసిన రోజు నుంచే వేలాడగట్టాలని డా. సుబ్బారెడ్డి సూచించారు. ఎకరానికి 8 నుంచి 12 లింగాకర్షక బుట్టలను పంట ఎత్తుకన్నా అడుగు ఎత్తులో ఉండేలా పెట్టుకుంటే కత్తెర పురుగు సంతతి వృద్ధిని అరికట్టవచ్చన్నారు. లింగాకర్షక బుట్టలో అమర్చే ఎర 25–30 రోజుల వరకు పనిచేస్తుందని, ఆ తర్వాత దాన్ని తీసేసి మరో ఎరను పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. మొక్కజొన్న, చిరుధాన్య పంటలకు తొలి 60 రోజుల పాటు ఎరను పెట్టుకుంటే చాలని, ఎకరానికి పంటకు 2 ఎరలు సరిపోతాయన్నారు. కత్తెర పురుగు పాకే పురుగు దశ దాటి ఎగిరే రెక్కల పురుగు దశకు చేరినప్పుడు.. ఆ రెక్కల పురుగులు లింగాకర్షక బుట్టలో చిక్కుకొని మరణిస్తాయని, తద్వారా వాటి సంతతి వృద్ధి చెందడం ఆగుతుందన్నారు. కత్తెర పురుగును చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. లింగాకర్షక బుట్టలను ఒక ప్రాంతంలో చాలా మంది రైతులు వరుసగా మూడేళ్లు సామూహికంగా ఉపయోగిస్తే ఏ పురుగునైనా అదుపులోకి తేవచ్చని డా. సుబ్బారెడ్డి చెప్పారు. తమ సంస్థ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో ముడత తొలిచే పురుగు (జి.ఎల్.ఎం.)ను వరుసగా నాలుగేళ్లు లింగాకర్షక బుట్టలు పెట్టించి పూర్తిగా అదుపులోకి వచ్చిందని, ఇప్పుడు ఈ పురుగు కోసం పురుగుమందులు చల్లాల్సిన అవసరం లేకుండా పోయిందని డా. సుబ్బారెడ్డి(94409 06803) తెలిపారు. కత్తెర పురుగును అరికట్టే ఎరలను రైతులకు వ్యక్తిగతంగా, నేరుగా ఉచితంగానే అందించడానికి ఐ.ఐ.సి.టి. సిద్ధంగా ఉందన్నారు. తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని కంపెనీలకు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి రైతుకు ఎకరం నుంచి పది ఎకరాలకు సరిపోయే లింగాకర్షక ఎరలను ఉచితంగా అందిస్తామన్నారు. ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తెచ్చి ఇవ్వాల్సి ఉంటుంది. -
పత్తి వైపే మొగ్గు..
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోనే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో అధిక విస్తీర్ణంలో పత్తి పంటనే సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖాధికారుల సాగు విస్తీర్ణం అంచనా ప్రకారం.. గతేడాది కంటే ఈ ఏడాది కొంత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. గతేడాది గులాబీరంగు పురుగు ఉధృతి, నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొదట్లో వర్షాలు కురిసినా ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో దిగుబడి కూడా ఆశించినంత రాలేదు. దీంతో పెట్టుబడి ఖర్చులు సైతం రాలేని పరిస్థితి ఎదురైంది. కొంతమంది రైతులు గులాబీపురుగు ఉధృతితో పత్తి పంటను ముందుగానే తొలగించారు. ఈ దశలో మరోసారి పత్తి సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతకు ఆ దిశగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. కానీ రైతులకు మాత్రం ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదని తెలుస్తోంది. 65శాతం పత్తినే.. జిల్లాలో అధిక శాతం మంది రైతులు పత్తివైపే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2 లక్షల హెక్టార్లు ఉంది. అయితే ఇందులో పత్తి పంట గతేడాది 1లక్ష 30వేల హెక్టార్ల వరకు సాగు కాగా, ఈసారి మరో 10వేల హెక్టార్లు అధికంగా సాగయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. పత్తి తర్వాత 30వేల హెక్టార్లలో సోయాబీన్, 20వేల హెక్టార్లలో కంది సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. పత్తి విత్తన ప్యాకెట్లు జిల్లాకు 8 లక్షలు అవసరం ఉండగా, 14లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు చెబుతున్నారు. ప్యాకెట్ ధర రూ.730 ఉంటుందని పేర్కొన్నారు. వరుణుడి కరుణ కోసం ఎదురుచూపు గతేడాది మే చివరి వారం, జూన్ మొదటి వారంలో కూడా భారీగా వర్షాలు కురువడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమైంది. జూన్ మొదటి, రెండో వారంలోనే విత్తనాలు వేశారు. అయితే ఈసారి జూన్ మొదటి వారం గడిచినా వర్షం జాడలేకుండా పోయింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుతుపవనాలు మొదటి వారంలోనే వస్తాయని వాతావరణ శాఖాధికారులు చెప్పినా మరో వారం రోజులపాటు ఆలస్యమయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. భా రీ వర్షాలు కురిస్తే తప్పా చిరుజల్లులకు విత్తనాలు విత్తితే నష్టపోవాల్సి వస్తోందని శాస్త్రవేత్తలు సూచి స్తున్నారు. గతంలో పలుసార్లు తొలకరి వర్షాలు కురువగానే పత్తి విత్తనాలను వేయడం, ఆ తర్వా త వర్షాలు ముఖం చాటేయడంతో భూమిలో విత్తనం మాడిపోయి నష్టాలు చవిచూశారు. ఒకటికి రెండుసార్లు కూడా విత్తనాలు వేసిన పరిస్థి తి ఎదురైంది. గతేడాది తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రైతుకు రూ.4వేల చొప్పున మేలోనే రైతులకు చెక్కుల రూపంలో అందించిన విషయం విధితమే. ఈసారి రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నామని అధికారులు చెబుతున్నా ఇంకా 10శాతం మంది రైతుల ఖాతా ల్లో డబ్బులు జమ అయినట్లు కనిపించడం లేదు. పెట్టుబడి సాయం త్వరగా అందిస్తే దళారులను ఆశ్రయించకుండా పెట్టుబడి కోసం వినియోగించే అవకాశం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. నకిలీ విత్తనాలతో జాగ్రత్త.. ఏటా రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోతూనే ఉన్నారు. ఈసారి కూడా జిల్లాలో కొంతమంది దళారులు రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే గ్రామాల్లో నకిలీ విత్తనాలు, బీటీ–3 పేరిట విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే నకిలీ విత్తనాల గురించి గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాల్సిన వ్యవసాయశాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంతో రైతులు నకిలీ విత్తనాలతో మరోమారు మోసపోయే ప్రమాదం లేకపోలేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. గతేడాది కొంతమంది రైతులు నకిలీ విత్తనాలు వేసి తీవ్రంగా నష్టపోయారు. పంట దిగుబడి రాక అవస్థలు పడ్డారు. పత్తి మొక్కలు ఏపుగా పెరిగినా ఎకరానికి ఒకట్రెండు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే రావడంతో పెట్టిన పెట్టుబడి సైతం రాలేని దుస్థితి ఎదురైంది. -
గులాబీ రంగు పురుగును నివారించండి
సాక్షి, హైదరాబాద్: పత్తి పంటను గులాబీ రంగు పురుగు నుంచి కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 18 లక్షల హెక్టార్ల మేర పత్తిని సాగు చేస్తున్నారని తెలిపారు. పత్తి పండించే మధ్య, దక్షిణాది రాష్ట్రాల్లో మూడేళ్ల నుంచి బీటీ రకం ఎక్కువగా ఈ గులాబీ రంగు పురుగు ప్రభావానికి గురవుతోందని చెప్పారు. ఏపీ, మహారాష్ట్రల్లో దీని తీవ్రత ఎక్కువగా కన్పిస్తోందన్నారు. గులాబీ రంగు పురుగు నివారణపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. -
అతివృష్టితో వి‘పత్తి’
తెరిపిలేని వర్షాలతో తెగుళ్ల దాడి రైతుల అప్రమత్తతో నష్టాల నివారణ గజ్వేల్: అన్ని పంటలు ఆగమైన వేళ.. తెల్ల ‘బంగారం’ కష్టాలు తీరుస్తుందనుకున్న రైతుకు అతివృష్టి నిరాశ మిగిల్చింది. కొన్ని రోజులుగా జిల్లాలో తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు పత్తిపై తెగుళ్ల దాడికి ఊతమిస్తున్నాయి. ఈ పరిణామం దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో రైతులు అప్రమత్తమై నివారణ చర్యలు చేపడితే నష్టాల నుంచి బయటపడే అవకాశముందని వ్యవసాయశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై కథనం... జిల్లాలో ఈసారి పత్తిసాగును తగ్గించడానికి సర్కారు తీవ్రస్థాయిలో ప్రయత్నించింది. గ్రామస్థాయి నుంచి ప్రచారాన్ని హోరెత్తించింది. ఫలితంగా పత్తిసాగు కొంతవరకు మాత్రమే తగ్గింది. గతేడాది 1.25లక్షల హెక్టార్లలో సాగైన ఈ పంట ప్రస్తుతం 84175హెక్టార్లకు తగ్గింది. గతంలో ఏటా మొదటి స్థానాన్ని ఆక్రమించే ఈ పంట ఈసారి మాత్రం రెండోస్థానానికి పరిమితమైంది. మొక్కజొన్న 1.22లక్షల హెక్టార్ల సాగుతో అగ్రభాగాన నిలిచింది. అయితే జూలై చివరి వారం, ఆగస్టు నెలల్లో తీవ్ర వర్షాభావం తలెత్తిన కారణంగా మొక్కజొన్న పంటకు భారీ నష్టం వాటిల్లింది. అదనుసమయంలో వర్షాలు లేక మక్క ఎదుగుదల లోపించడం, కంకులు పెట్టక రైతులు ఎంతోమంది చేలల్లోనే పంటను వదిలేశారు. చెల్కా భూముల్లో అపారనష్టం జరిగింది. నల్లరేగడి భూముల్లో కొంత రికవరీ అయినా మొక్కజొన్న మాత్రం ఈసారి రైతుల ఆశలను అడియాసలు చేసిందనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో రైతు పత్తిపై ఆశలు పెంచుకున్నాడు. బెట్ట పరిస్థితులను తట్టుకునే పత్తి పంటకు వర్షాభావం వల్ల కలిగిన నష్టం మొక్కజొన్నతో పోలిస్తే తక్కువే. పత్తి తమను గట్టెక్కిస్తుందనే భావనలో ఉన్న రైతులకు అతివృష్టి నిరాశపర్చింది. కొన్ని రోజులుగా జిల్లాను ముంచెత్తుతున్న వానలు పత్తి ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మరోవైపు నీరు నిలిచి తెగుళ్లదాడికి ఊతమిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రైతు అప్రమత్తం కావాలని జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ సూచిస్తున్నారు. ఇలా చేస్తే నష్టాల నివారణ ముసురు వర్షాలతో నేలలో తేమశాతం పెరుగుతుంది. పొలంలో వర్షపు నీటిని కాలువల ద్వారా బయటకు పంపే ఏర్పాట్లు చేసుకోవాలి. పత్తి మొక్కలు తేమ అధికంగా ఉండడం వల్ల వేర్లతో ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్, సూక్ష్మపోషకాలు జింక్, మెగ్నీషియం, బోరాన్‌లను తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పత్తిపంటపై లీటరు నీటికి 20గ్రాముల యూరియా, 20గ్రాముల పొటాష్ ఎరువు కలిపి పిచికారి చేయాలి. ఫలితంగా ఆకుల ద్వారా పోషకాలు గ్రహించి పంట పెరిగే అవకాశముంది. పోషకాల లోపం కారణంగా పూత, గూడ, పిందె రాలిపోయే అవకాశముంది. దీని నివారణకు నత్రజని, పొటాష్ ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలను పిచికారి చేయాలి. పత్తికి తుప్పు తెగులు ఆశించే అవకాశముంది. దీని నివారణకు లీటరు నీటికి ఒక మిల్లీలీటరు ప్రోఫాకొనిజాల్ మందును పిచికారి చేయాలి. రసం పీల్చే పెరుగుల ఉధృతి పెరిగే అవకాశముంది. వీటి నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము ఎసిఫేట్ పొడిమందు పిచికారి చేయాలి. అధిక తేమ కారణంగా వేరుకుళ్లు వచ్చే అవకాశముంది. దీని నివారణకు లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును పిచికారి చేయాలి. -
కదిలిస్తే కన్నీళ్లే..
కరువుతో వలస వెళుతున్న పల్లె జనం ♦ ఎండిపోయిన పంటలు.. ఉపాధి హామీ పనులు చేపట్టని ప్రభుత్వం ♦ పొట్టచేతబట్టుకుని ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తరలుతున్న వైనం ♦ పట్టణాల్లోనూ కూలీ పనులు అంతంతే సాక్షి నెట్వర్క్ కరువుతో తల్లడిల్లుతున్న తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, కూలీలు వలసలు పోతున్నారు. కంట నీరు కక్కుకుంటూ ముసలి తల్లిదండ్రులను, భార్యాపిల్లలను ఉన్న ఊళ్లలో వదిలేసి పోయేవాళ్లు కొందరైతే... పొట్టచేతబట్టుకుని కుటుంబం మొత్తం వెళ్లేవాళ్లు మరికొందరు. సాధారణంగా వేసవి సమయంలో వలసలు వెళ్లే రైతు కూలీలు... ఈ సారి రబీ పంటలు వేయకముందే పట్టణాల బాట పడుతున్నారు. ఎక్కడ నిర్మాణ పనులుంటే అక్కడికి తరలి వెళుతున్నారు. ఈ దుస్థితిలో ఉపాధి హామీ పథకంతో ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. నామమాత్రానికి కరువు మండలాలను ప్రకటించి ఊరుకుంది. దీంతో వలసలు పెరుగుతూనే ఉన్నాయి. మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం పట్టణ ప్రాంతాలకు, పక్కనున్న రాష్ట్రాలకు తరలి వెళుతున్నారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలోనైతే ఊళ్లకు ఊళ్లు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ మండలాల్లో కరువు పరిస్థితి తీవ్రంగా ఉంది. హుస్నాబాద్‌లోని రేగొండ, మల్‌చెర్వుతండా, దుబ్బ తండా రైతులు పంటలు కళ్లముందే ఎండిపోతున్నా.. నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మక్క, పత్తి పంటలు పూర్తిగా ఎండిపోయాయి. నీళ్లు లేక మొక్కజొన్న వాడిపోతుండటంతో పశువుల మేతగా ఉపయోగిస్తున్నారు. గ్రామాల్లో ఉపాధి లేక కరీంనగర్, వరంగల్ పట్టణాలకు వలస వెళుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. వ్యవసాయ పనులు, ఉపాధి పనుల జాడలేక పల్లెలను వదులుతున్నారు. అటు పట్టణ ప్రాంతాల్లోనూ సరిగా కూలి పనులు దొరకక పడరాని పాట్లు పడుతున్నారు. భార్యాపిల్లల్నీ వదిలేసి.. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం పేరపళ్ల పంచాయతీ పరిధిలోని మీది తండాకు చెందిన శంకర్‌నాయక్ సింగిల్ విండో డెరైక్టర్. ఆయనకు ఆరుగురు కుమారులు. ఉన్న నాలుగెకరాల్లో వేసిన పెసర పంట ఎండిపోయింది. ఉన్న పశువులనూ అమ్ముకునే పరిస్థితి. దీంతో ముగ్గురు కుమారులు దశరథ్, సిద్ధానాయక్, బీక్యానాయక్ బతుకు దెరువు కోసం ముంబైకి వలస వెళ్లారు. మరో ముగ్గురు కుమారులు చిన్నాచితకా పనులు చేసుకుంటున్నారు. పేరపళ్ల తండాకు చెందిన చిన్న రామునాయక్ ఎకరా భూమిలో వేసిన పెసర పంట ఎండిపోయింది. దీంతో ఉపాధి కోసం ఇద్దరు కుమారులు భార్యాపిల్లలను ఇక్కడే వదిలి ముంబైకి వలస వెళ్లారు. ఇదే తండాకు చెందిన మరో రైతు పెద్దరాము నాయక్. మూడెకరాల్లో పెసర, కంది పంటలు వేశాడు. వానల్లేక అవి ఎండిపోవడంతో... ముగ్గురు కుమారులు వారి భార్యాపిల్లలతో ముంబైకి వలస వెళ్లారు. పోరగాండ్లను వదిలేసి వెళ్తున్నం ‘‘పంటలతో కళకళలాడాల్సిన పొలాలు బీళ్లుగా మారినయి. ఇద్దరు పోరగాండ్లను ఇంటికాడ వదిలేసి పట్నానికి వలస వెళుతున్నా. కరువు కాలం లో ఉపాధి పనులు పెట్టాల్సిన అధికారులు ఎక్కడున్నారో ఎమో?’’ - రెడ్డి దస్తయ్య, రైతు, గాలిపూర్, నిజామాబాద్ జిల్లా ఊళ్లకు ఊళ్లే ఖాళీ.. పాలమూరు రైతులు, కూలీలు పొట్టకూటి కోసం వలసలు వెళుతున్నారు. జిల్లాలోని నారాయణపేట డివిజన్లో కోయిల్‌కొండ, ధన్వాడ, దామరగిద్ద, ఊట్కూర్, మాగనూర్ మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నారాయణపేట మండలంలోని పేరపళ్ల తండాలు, కొల్లంపల్లి పరిధిలోని లింగంపల్లితండా, ఒండుచెలిమి తండా, మేకహన్మన్ తండా, కోయిలకొండ మండలంలోని వింజామూర్, రామన్నపల్లి తండా, జయనగర్తండా, రాజీవ్గాంధీతండా, ఎల్లారెడ్డిపల్లి, అంకిళ్ల, చందాపూర్ల నుంచి గిరిజనులు మూటమూల్లె సర్దుకుని మహారాష్ట్రలోని ముంబై, పుణె, నాగపూర్, కర్ణాటకలోని బెంగళూర్, హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు ప్రాంతాలకు వలస వెళ్లారు. దీంతో ఊళ్లకు ఊళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. మరోవైపు కూలీ పనులు కూడా సరిగా దొరకడం లేదు. ఇక గ్రామాల నుంచి వలస వచ్చిన వారిని గుంపు మేస్త్రీలు మోసం చేస్తున్నారు. దంపతులిద్దరికీ కలిపి నెలకు రూ. ఆరేడు వేలు ఇస్తామంటూ ముంబై, గుజరాత్, పూణె, బెంగళూర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించి పనులు చేయించుకుంటున్నారు. అంటే ఒక్కొక్కరికి రోజుకు రూ. వంద కూడా రాని పరిస్థితి. -
తాండూరులో భారీ వర్షం
తాండూరు, తాండూరు టౌన్: తాండూరులో కుండపోతగా వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం 4.30గంటల నుంచి ఆరు గంటల వరకు కురిసిన వర్షం.. తిరిగి అర్ధరాత్రి 12గంటల నుంచి ఉరుములు, మెరుపులతో ప్రారంభమై కుండపోతగా కురిసింది. తెల్లవారుజాము వరకూ భారీ వర్షం పడింది. పట్టణంలో 48 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా.సుధాకర్ తెలిపారు. ఈ వర్షం కంది, పత్తి పంటలు విత్తుకోవడానికి అనుకూలమని ఆయన తెలిపారు. భారీ వర్షం కారణంగా పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్లు బురదమయంగా మారాయి. మురుగుకాలువల్లో చెత్తా చెదారం అడ్డుపడటంతో మురుగునీరు వీధుల్లోకి చేరింది. కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంగళవారం ఉదయం పట్టణ కమిషనర్ గోపయ్య పలువురు కౌన్సిలర్లతో కలిసి కొన్ని వార్డుల్లో పర్యటించారు. పొంగిపొర్లిన వాగులు.. వంకలు.. షాబాద్: భారీ వర్షంతో వాగులు, వం కలు పొంగిపొర్లాయి. వరదనీటి ఉద్ధృతితో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. షాబాద్ మండలం ఎల్గొం డగూడ గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామాలు మీరాపూర్, చర్లగూడల్లో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మంగళవారం కురి సిన భారీ వర్షానికి ఆయా గ్రామాల్లో ని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు 3గంటలపాటు వాగు వద్దనే పడిగాపులు కాశారు. కొంతమంది పిల్లలను ఎత్తుకుని వాగు దాటారు. మీరాపూర్ గ్రామానికి వెళ్లే కల్వర్టు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. వర్షం ధాటికి కల్వ ర్టు పూర్తిగా తెగిపోయింది. దీంతో ఆయా గ్రామాలకు వెళ్లడానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వానాకాలం వచ్చిదంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందేనని, ఈ విషయాన్ని అధికారులకు, ప్రజాప్రతిని దులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు మండిపడ్డారు. -
పత్తి బస్తాల కింద నలిగి.. ముగ్గురు చిన్నారులు మృతి
-
పత్తి బస్తాల కింద నలిగి.. ముగ్గురు చిన్నారులు మృతి
కేసముద్రం, న్యూస్‌లైన్: గిట్టుబాటు ధర వస్తుందనే ఆశతో ఇంట్లో దాచుకున్న పత్తి ఆ ఇంటి దీపాలను ఆర్పేసింది. ముగ్గురు చిన్నారుల మృతికి కారణమైంది. వివరాలు.. వరంగల్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామానికి చెందిన బేతు వెంకటయ్య, యాదమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు వీరన్న, శ్రీను, కుమార్తె సుజాత ఉన్నారు. వీరన్నకు కుమారుడు విక్కి(3)తో పాటు పది రోజుల క్రితం మరో కుమారుడు జన్మించాడు. కుమార్తె సుజాతకు.. కుమారుడు వేణు(12), కుమార్తె భద్రకాళి(6) ఉన్నారు. కాగా, సుజాత తన పిల్లలతో ఆదివారం తల్లిగారింటికి వచ్చింది. సోమవారం యూదమ్మ, సుజాత, వీరన్న కలిసి మహబూబాబాద్ వెళ్లారు. వెంకటయ్య గ్రామంలోకి వెళ్లాడు. సుజాత, వీరన్న పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. తాము ఇంట్లో టీవీ చూసి పడుకుంటామని సుజాత కుమారుడు వేణు తలుపుపెట్టుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత వెంకటయ్య తిరిగి ఇంటికి వచ్చి తలుపులు కొట్టగా లోపలి నుంచి సమాధానం రాలేదు. దీంతో తలుపులను పగులగొట్టి లోపలికి వెళ్లి పత్తిని తొలగించి చూడగా ముగ్గురు పిల్లలు శవాలై కనిపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తెల్లబోవడమేనా?
బోధన్, న్యూస్‌లైన్ : జిల్లాలో బోధన్ డివిజన్ పరిధిలోని బోధన్, రెంజల్, మద్నూర్, బి చ్కుంద, పిట్లం, జుక్కల్ మండలాల్లో పత్తిసాగు ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఖరీఫ్‌లో సాగుచేసిన పంట పూత దశకు చేరింది. వారం రోజుల్లో రైతుల చేతికి వస్తుంది. ఈ ఏడాది వర్షాలతో పాటు వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉండటంతో దిగుబడులు పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతం కంటే తక్కువే.. బోధన్ డివిజన్లో వేలాది ఎకరాల్లో పత్తి సాగయ్యేది. క్రమంగా సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. బోధన్ మండలంలోనే పదివేల ఎకరాలకు పైగా సాగయ్యే పత్తి ఈ ఏడాది రూ. నాలుగువేలకు పడిపోయింది. ప్రస్తుతం జుక్కల్ నియోజకవర్గంలోనే పత్తిసాగు అధికంగా ఉంది. ఐదారేళ్లలో పంట సాగుకు పెట్టుబడులు రెట్టింపు కావడం, దానికి తగ్గట్లు ధరలు లేకపోవడంతో రైతులు సాగుపై శ్రద్ధ చూపడం లేదు. ప్రస్తుతం కొత్తగా వస్తున్న వివిధ కంపెనీల సంకరజాతి పత్తి రకాలను సాగు చేస్తున్నారు. ఎకరానికి రూ.15వేల నుంచి రూ. 25వేల వరకు ఖర్చు అవుతోంది. విత్తనం మొదలుకొని, దుక్కి, కూలీ రేట్లు, ట్రాక్టర్లఅద్దె, పురుగు మందులు, ఎరువుల ధరలు రెట్టింపయ్యాయి. అన్నీ చేసినా ప్రకృతి అనుకూలిస్తేనే ఎకరానికి ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. దళారులు చెప్పిందే ధర.. రైతన్నలు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పం టను అమ్ముకునేందుకు మార్కెట్ సౌకర్యం లే దు.వాణిజ్య పంటగా సాగవుతున్నా పత్తికి ప్ర భుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేదు. దీం తో రైతులు దళారులపై ఆధారపడాల్సి వస్తోం ది. డివిజన్‌కు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలో ని నాందేడ్, బిలోలి, కొండల్వాడి, ధర్మాబాద్, దెగ్లూర్, నాయ్‌గావ్ ప్రాంతాల నుంచి వ్యాపారులు, దళారులు వచ్చి పత్తి కొనుగోళ్లు చేస్తుం టారు. వారు చెప్పిందే ధరగా ఉంటోంది. ఈ ఏడాదీ మహారాష్ట్ర దళారులు పంట కొనుగోళ్లకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాంత వ్యా పారులు వారితో కుమ్మక్కై తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. జాతీయ మార్కెట్లో పత్తికి ధర లేదంటూ మాయ మాటలు చెప్పి తక్కువ ధరను నిర్ణయిస్తున్నారు. గత్యంతరం లేక రైతు లు వాళ్లు చెప్పిన ధరకే అమ్ముకుంటున్నారు. రైతుల చేతి నుంచి పంట వెళ్లిన తర్వాత ధర పెరుగుతోంది. ఇలా దళారుల మోసానికి ప్రతి ఏడాది పత్తి రైతు మోసపోతూనే ఉన్నాడు. ధర పెరగలేదు.. ఏడాదికేడాది పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నా పత్తి పంటకు మద్దతు ధర మాత్రం పెరగడం లేదు. గత ఏడాది పత్తి క్వింటాలుకు రూ. నాలుగువేల నుంచి రూ. 4,200 వరకు పలికింది. ఇం చుమించుగా ఈ ఏడాదీ అదే ధర ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది కంటే సాగు ఖర్చులు పెరిగినా ధర మాత్రం పెరగడం లేదని రైతులు వాపోతున్నారు. గిట్టుబాటు ధర అందించడంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో మన పత్తి మహారాష్ట్ర పరిశ్రమలకు తరలి పోతోంది. జిల్లాలో మద్నూర్ మండల కేంద్రంలోనే పత్తి పరిశ్రమలున్నాయి. ఇక్కడ కూడా పరిశ్రమల యాజమాన్యాలు ఎక్కువ శాతం కొనుగోలు చేస్తారు. కొంతమంది క్రిమిసంహారక మందుల వ్యాపారులు మహారాష్ట్ర ప్రాంత వ్యాపారులు, దళారులతో మిలాఖతై పత్తి కొనుగోళ్లు చేస్తుంటారు. జాడ లేని సీసీఐ.. రెవెన్యూ డివిజన్ కేంద్రమైన బోధన్‌లో సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగో లు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి పత్తిని ఖరీ దు చేయాలని ఎప్పటినుంచో రైతులు కోరుతున్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, అధికారులూ పట్టించుకున్న పాపానపోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మార్కెట్ సౌకర్యం లేక నష్టపోతున్నామని వాపోతున్నారు. అక్రమ రవాణా.. బోధన్ ప్రాంతంలో కొనుగోలు చేసిన పత్తిని అడ్డదారుల్లో మహారాష్ట్ర వ్యాపారులు, దళారు లు అక్రమంగా తరలిస్తున్నారు. మహారాష్ట్ర సరి హద్దులో ఉన్న బోధన్ మండలంలోని సాలూర చెక్‌పోస్టు, ఇదే మండలంలోని ఖండ్గావ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్‌పోస్టు, రెంజల్ మం డలంలోని కందకుర్తి బ్రిడ్జి మీదుగా ఎలాంటి వేబిల్లులు లేకున్న రాత్రివేళ్లల్లో సరిహద్దు దాటిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికీ భారీ నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు.