బోధన్, న్యూస్‌లైన్ : జిల్లాలో బోధన్ డివిజన్ పరిధిలోని బోధన్, రెంజల్, మద్నూర్, బి చ్కుంద, పిట్లం, జుక్కల్ మండలాల్లో పత్తిసాగు ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఖరీఫ్‌లో సాగుచేసిన పంట పూత దశకు చేరింది. వారం రోజుల్లో రైతుల చేతికి వస్తుంది. ఈ ఏడాది వర్షాలతో పాటు వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉండటంతో దిగుబడులు పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గతం కంటే తక్కువే..
బోధన్ డివిజన్‌లో వేలాది ఎకరాల్లో పత్తి సాగయ్యేది. క్రమంగా సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. బోధన్ మండలంలోనే పదివేల ఎకరాలకు పైగా సాగయ్యే పత్తి ఈ ఏడాది రూ. నాలుగువేలకు పడిపోయింది. ప్రస్తుతం జుక్కల్ నియోజకవర్గంలోనే పత్తిసాగు అధికంగా ఉంది. ఐదారేళ్లలో పంట సాగుకు పెట్టుబడులు రెట్టింపు కావడం, దానికి తగ్గట్లు ధరలు లేకపోవడంతో రైతులు సాగుపై శ్రద్ధ చూపడం లేదు. ప్రస్తుతం కొత్తగా వస్తున్న వివిధ కంపెనీల సంకరజాతి పత్తి రకాలను సాగు చేస్తున్నారు. ఎకరానికి రూ.15వేల నుంచి రూ. 25వేల వరకు ఖర్చు అవుతోంది. విత్తనం మొదలుకొని, దుక్కి, కూలీ రేట్లు, ట్రాక్టర్లఅద్దె, పురుగు మందులు, ఎరువుల ధరలు రెట్టింపయ్యాయి. అన్నీ చేసినా ప్రకృతి అనుకూలిస్తేనే ఎకరానికి ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు.
దళారులు చెప్పిందే ధర..
రైతన్నలు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పం టను అమ్ముకునేందుకు మార్కెట్ సౌకర్యం లే దు.వాణిజ్య పంటగా సాగవుతున్నా పత్తికి ప్ర భుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేదు. దీం తో రైతులు దళారులపై ఆధారపడాల్సి వస్తోం ది. డివిజన్‌కు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలో ని నాందేడ్, బిలోలి, కొండల్‌వాడి, ధర్మాబాద్, దెగ్లూర్, నాయ్‌గావ్ ప్రాంతాల నుంచి వ్యాపారులు, దళారులు వచ్చి పత్తి కొనుగోళ్లు చేస్తుం టారు. వారు చెప్పిందే ధరగా ఉంటోంది. ఈ ఏడాదీ మహారాష్ట్ర దళారులు పంట కొనుగోళ్లకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాంత వ్యా పారులు వారితో కుమ్మక్కై తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. జాతీయ మార్కెట్లో పత్తికి ధర లేదంటూ మాయ మాటలు చెప్పి తక్కువ ధరను నిర్ణయిస్తున్నారు. గత్యంతరం లేక రైతు లు వాళ్లు చెప్పిన ధరకే అమ్ముకుంటున్నారు. రైతుల చేతి నుంచి పంట వెళ్లిన తర్వాత ధర పెరుగుతోంది. ఇలా దళారుల మోసానికి ప్రతి ఏడాది పత్తి రైతు మోసపోతూనే ఉన్నాడు.
ధర పెరగలేదు..
ఏడాదికేడాది పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నా పత్తి పంటకు మద్దతు ధర మాత్రం పెరగడం లేదు. గత ఏడాది పత్తి క్వింటాలుకు రూ. నాలుగువేల నుంచి రూ. 4,200 వరకు పలికింది. ఇం చుమించుగా ఈ ఏడాదీ అదే ధర ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది కంటే సాగు ఖర్చులు పెరిగినా ధర మాత్రం పెరగడం లేదని రైతులు వాపోతున్నారు. గిట్టుబాటు ధర అందించడంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో మన పత్తి మహారాష్ట్ర పరిశ్రమలకు తరలి పోతోంది. జిల్లాలో మద్నూర్ మండల కేంద్రంలోనే పత్తి పరిశ్రమలున్నాయి. ఇక్కడ కూడా పరిశ్రమల యాజమాన్యాలు ఎక్కువ శాతం కొనుగోలు చేస్తారు. కొంతమంది క్రిమిసంహారక మందుల వ్యాపారులు మహారాష్ట్ర ప్రాంత వ్యాపారులు, దళారులతో మిలాఖతై పత్తి కొనుగోళ్లు చేస్తుంటారు.
జాడ లేని సీసీఐ..
రెవెన్యూ డివిజన్ కేంద్రమైన బోధన్‌లో సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగో లు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి పత్తిని ఖరీ దు చేయాలని ఎప్పటినుంచో రైతులు కోరుతున్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, అధికారులూ పట్టించుకున్న పాపానపోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మార్కెట్ సౌకర్యం లేక నష్టపోతున్నామని వాపోతున్నారు.
అక్రమ రవాణా..
బోధన్ ప్రాంతంలో కొనుగోలు చేసిన పత్తిని అడ్డదారుల్లో మహారాష్ట్ర వ్యాపారులు, దళారు లు అక్రమంగా తరలిస్తున్నారు. మహారాష్ట్ర సరి హద్దులో ఉన్న బోధన్ మండలంలోని సాలూర చెక్‌పోస్టు, ఇదే మండలంలోని ఖండ్‌గావ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్‌పోస్టు, రెంజల్ మం డలంలోని కందకుర్తి బ్రిడ్జి మీదుగా ఎలాంటి వేబిల్లులు లేకున్న రాత్రివేళ్లల్లో సరిహద్దు దాటిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికీ భారీ నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు.
తెల్లబోవడమేనా?
Published Thu, Nov 7 2013 4:48 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement