Bodhan
-
హోలీ వేళ పిడిగుద్దుల ఆటపై పోలీసుల ఆంక్షలు
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో 124 ఏళ్ల నుంచి ఆచారంగా వస్తున్న పిడిగుద్దుల(Pidiguddulata) ఆటపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పిడిగుద్దుల ఆటకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, పోలీసులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయంగా వస్తున్న ఆటను అడ్డుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో, ఈ ఆటపై ఉత్కంఠ నెలకొంది.నిజామాబాద్ జిల్లాలోని సాలూర మండలం హున్సాలో ప్రతీ ఏడాది హోలీ సందర్బంగా పిడిగుద్దుల ఆట నిర్వహిస్తారు. ఈ ఆటలో భాగంగా ముందుగా గ్రామంలోని ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతారు. గ్రామం మధ్యలో ఉన్న చావిడి వద్ద ఉన్న ఖాళీ స్థలంలో రెండు వైపులా రెండు కర్రలు (గుంజలు) భూమిలో పాతుతారు. ఆ రెండు కర్రలకు మధ్యన ఓ బలమైన తాడును కడుతారు.అంతకుముందు గ్రామదేవతలకు పూజలు చేసి గ్రామ పెద్ద మనుషులు, పటేల్, పట్వారీలను డప్పులు, బాజాలతో పిడిగుద్దుల ఆట నిర్వహించే స్థలం వద్దకు వస్తారు. తర్వాత ఆట మొదలు కాగానే ఒక వర్గంపై మరో వర్గం పిడిగుద్దులతో విరుచుకుపడతారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ ఆట కొనసాగుతుంది. ఈ క్రమంలో దెబ్బలు తాకినా లెక్క చేయకుండా ఒకరిపై మరొకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఆట ముగిసిన ఒకరినొకరు కౌగిలించుకుంటారు.ఈ ఆటలో దెబ్బలు తగిలి రక్తాలు కారినా పట్టించుకోకుండా, కామదహనంలోని బూడిదను చేతులతో తీసుకుని దెబ్బలు, గాయాలపై రాసుకుంటే గాయాలు మానిపోతాయని, నొప్పులు కూడా తెలియవని గ్రామస్థులంటారు. కొత్తగా చూసేవారికి విచిత్రంగా అనిపించే ఈ ఆట హున్సా గ్రామానికే ప్రత్యేకతను సంతరించి పెట్టింది. అనంతరం, ఆట స్థలం నుంచి డప్పులు బాజాలతో కేకలు వేస్తూ గ్రామంలో తిరుగుతారు. ఈ ఆటను తిలకించడానికి తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ప్రజలు వస్తారు. అందుకే ఎన్ని ఆంక్షలు, హెచ్చరికలు ఎదురైనా వాటిని పట్టించుకోకుండా గ్రామస్థులంతా ఏకంగా నిలబడి ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వారం రోజుల నుంచి గ్రామస్థులు పిడిగుద్దులాట కోసం రిహార్సల్స్ చేస్తూ ఆటకు సిద్ధమవుతున్నారు. -
ఏకచక్రపురం.. నవనాథపురం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అశ్మక రాష్ట్రంగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. ఇందూరు వరకు నామాంతరం చెందిన నిజామాబాద్ (Nizamabad) చుట్టుపక్కల ప్రాంతాలు పౌరాణిక, ప్రాచీన చారిత్రక నేపథ్యాన్ని ఇముడ్చుకున్నాయి. మంజీర, గోదావరి పరీవాహకంలో ఉండి ప్రాచీన కాలంలో ఏకచక్రపురంగా, బహుధాన్యపురంగా విరజిల్లి, ప్రస్తుతం సాధారణ పట్టణంగా ఉన్న బోధన్ (Bodhan) ఎనలేని ప్రాచీన చరిత్రను కలిగి ఉంది. అయితే దీని చరిత్ర నిరంతరం బయటపడుతూనే ఉంది. తవ్వకాలు చేయడంలో నిర్లక్ష్యం కారణంగా దీని చరిత్ర ఆశించిన స్థాయిలో వెలుగు చూడటం లేదనేది చరిత్రకారుల అభిప్రాయం. ఇక్కడ ఎన్ని తవ్వకాలు జరిపితే అంత చరిత్ర (History) బయటపడే అవకాశముంది. ఈ విషయంలో పాలకులు అంతగా దృష్టి సారించకపోవడంతో.. పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల ఘనమైన చరిత్ర బయటకు రావడం లేదని పలువురి వాదన.పౌరాణిక నేపథ్యం ప్రకారం ఈ ప్రాంతాన్ని పరశురాముడు(Parasu Ramudu) తన చక్రంతో రక్షించడంతో పాటు చక్రతీర్థమనే చెరువును నిర్మించడంతో ఏకచక్రపురంగా పేరుపొందినట్లు పలువురు చెబుతున్నారు. పౌరాణిక సాహిత్యంలో, జైన సాహిత్యంలో, బౌద్ధ సాహిత్యంలో బోధన్ ప్రాశస్త్యం ఉంది. మహాభారతంలో వసుమతి, పద్మపురం నామాలతో, జైన సాహిత్యంలో పోదనపురం నామంతో, బౌద్ధ సాహిత్యంలో పోదన నామంతో పేరొందింది. ఇక ప్రాచీన, మధ్యయుగాల్లో ఈ ప్రాంతం ధన సంపదలతో తులతూగడంతో.. బహుధాన్యపురం పేరుతో పిలిచినట్లు చరిత్ర చెబుతోంది. గొప్ప వర్తక కేంద్రంగా వర్ధిల్లినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అనేక శాసనాలు, పాత్రలు, శిల్పాలు, నాణేలు(Coins) లభించాయి. అశ్మకుడనే రాజు పాలనలో.. ఈ ప్రాంతాన్ని అశ్మకుడనే రాజు పరిపాలించినట్లు మహాభారతంలో ప్రస్తావన ఉందని పలువురు చెబుతున్నారు. ఇక ఈ ప్రాంతాన్ని శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వాకాటకులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, విజయనగర రాజులు, మరాఠా రాజులు, బహమనీ సుల్తానులు, గోల్కొండ రాజులు, మొఘలులు పరిపాలించారు. ఏకచక్రపురంగా, బహుధాన్యపురంగా చాలాకాలం పేరొందిన ఈ పట్టణం ప్రస్తుతం బోధన్ పేరుతో స్థిరపడింది. ఈ ప్రాంతం గురించి ఎంత శోధిస్తే అంత చరిత్ర బయటపడే అవకాశముందని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు.నాటి నవనాథపురం.. నేటి ఆర్మూర్ ప్రస్తుతం పసుపు పంట అత్యధికంగా పండించే ప్రాంతంగా ఉన్న ఆర్మూర్ (Armoor) ప్రాంతం సైతం ఘనమైన చరిత్రను కలిగి ఉంది. నవనాథపురంగా ప్రసిద్ధి చెందిన ఈ పట్టణం.. నేడు ఆర్మూర్ నామాంతరంతో స్థిరపడింది. ఆర్మూర్ పట్టణానికి దక్షిణ నైరుతి భాగంలో కొన్ని కిలోమీటర్ల మేర సిద్ధులగుట్ట విస్తరించి ఉంది. ఈ గుట్టపై నవనాథ సిద్ధులు తపస్సు చేశారు. దీంతో గుట్ట చుట్టూ ఉన్న ప్రాంతానికి నవనాథపురంగా పేరు వచ్చింది. కాలక్రమంలో నవనాథపురం నుంచి ఆర్మూర్‌గా నామాంతరం చెందింది.వందల ఏళ్ల క్రితం దేశం నలుమూలల నుంచి నవనాథులైన గోరఖ్‌నాథ్, జలంధర్నా, చరఫట్‌నాథ్, అపభంగనాథ్, కానీషనాథ్, మచ్చింద్రనాథ్, చౌరంగీనాథ్, రేవనాథ్, బర్తరినాథ్ తదితరులు ఇక్కడికి వచ్చారు. నల్లని రాళ్లు పేర్చినట్లున్న ఈ గుట్టపై ఒక ఇరుకైన గుహలో తమ ఇష్టదైవమైన సిద్ధేశ్వరుడిని ప్రతిష్టించి పూజలు చేశారని ప్రతీతి. వారి పేరిట గుట్టకు నవనాథ సిద్ధుల గుట్టగా పేరు వచ్చింది. దీంతో గుట్టను ఆనుకున్న గ్రామానికి నవనాథపురంగా నామకరణం చేసుకున్నారు. చదవండి: ఆ గుడిలో దేవుడు లేడు.. అయినా జనాల క్యూ!కాలక్రమంలో ఈ తొమ్మిది మంది సాధువుల్లో ఆరుగురు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. మిగిలిన ముగ్గురు సాధువులు ఇక్కడే ఉండి పూజలు చేయడంతో ఆరు.. మూరు.. అంటూ కాలక్రమంలో ఆర్మూర్‌గా పేరు స్థిరపడింది. మరికొందరు చరిత్రకారులు ఆర్మూర్ అనే పదం.. ఆరావం అనే పదం నుంచి వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సిద్ధుల గుట్ట ఆధ్యాత్మికతకు చిరునామాగా మారింది. -
Panjagutta PS: సిబ్బందిపై వేటు వెనక కారణాలివే?
హైదరాబాద్, సాక్షి: రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇదో సంచలనం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే పీఎస్ లోని మొత్తం 86 మందిని బదిలీచేస్తూ ఉత్తర్వులిచ్చారు పోలీస్ కమీషనర్. ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డ్ వరకు అందరినీ బదిలీ చేశారు. పంజాగుట్ట పోలీసులపై పలు ఆరోపణలు రావడంతో.. తొలిసారి పీఎస్ లో ఉన్న 80శాతం సిబ్బందిని బదిలీచేస్తూ సీపీ శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ట్రాన్స్‌ఫర్స్‌తో పోలీసులు అవినీతికి పాల్పడితే ఇలాంటి పరిణామాలే ఉంటాయని రాష్ట్రవ్యాప్తంగా వార్నింగ్ ఇచ్చినట్లయింది. సిటీలో ప్రధాన పోలీస్ స్టేషన్స్ లో పంజాగుట్ట ఒకటి. నాలుగేళ్ల క్రితం దేశంలోనే రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా అవార్డు పొందింది. మూడున్నర లక్షల మంది జనాభా.. ఐదు సెక్టార్లు.. వందకు పైగా పోలీస్ సిబ్బంది.. అంతటి పేరున్న పంజాగుట్ట పీఎస్ రీసెంట్ గా వివాదాల్లో నిలిచింది. రాజకీయ పలుకుబడితో ఈ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్స్ కోసం ఆఫీసర్లు వెంటబడేవారు. ఇట్లాంటి పోలీస్ స్టేషన్స్ లోని సిబ్బంది పలు కీలక కేసులను తప్పుదారి పట్టిస్తున్నారు. దీంతో స్టేషన్ సిబ్బందిని భారీగా ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. నిన్న జరిగిన ఇన్స్పెక్టర్ల బదిలీల్లో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ ని బదిలీ చేస్తూ శోభన్ అనే కొత్త ఇన్స్పెక్టర్ ని సీఐగా నియమించారు. ఈరోజు పీఎస్‌లోని ఆరుగురు ఎస్సైలు, 9 మంది ఏఎస్సైలు, 16 మంది హెడ్ కానిస్టేబుల్స్ తో పాటు కానిస్టేబుల్స్, హోమ్ గార్డులను బదిలీ చేస్తూ సర్క్యులర్ జారీ చేశారు సీపీ. పీఎస్‌లో మొత్తంగా వందకు పైగా సిబ్బంది ఉండగా అందులో 85 మందిని ఈరోజు ట్రాన్స్ ఫర్ చేశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, ఎస్సైలను మినహా మిగతా అందరినీ ట్రాన్స్ ఫర్ చేశారు. ట్రాన్స్ ఫర్ అయిన వారి స్థానంలో కొత్తగా 82 మందిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ప్రజాభవన్ ముందు జరిగిన యాక్సిడెంట్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్‌ని తప్పించి మరొకరిపై కేసు పెట్టారని అప్పట్లో పని చేస్తున్న సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు సీపీ. సీఐ దుర్గారావుకు మరికొంత మంది సిబ్బంది సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. రీసెంట్ గా పంజాగుట్టలో ఒక వ్యక్తి ఫుల్లుగా తాగి తన కారుతో రోడ్డుపై ఉన్నవారందరినీ గుద్దుకుంటూ వెళ్లాడు. అతడ్ని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రిమాండ్ కి తరలిస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. వివిధ కేసుల్లో అరెస్టయిన నిందితులను కోర్టులకు, జైళ్లకు తరలించే టైమ్ లో పంజాగుట్ట పోలీసులు ఏమరపాటుగా ఉంటున్నారనే విమర్శలు వచ్చాయి. నిందితులకు సహకరిస్తూ వారి బంధువులతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. నెల క్రితం డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి.. న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఇద్దరిని ట్రాఫిక్ పోలీసులు పంజాగుట్ట పోలీసులకు అప్పగించగా.. వారిద్దరూ పోలీసుల నుంచి పారిపోయారు. గతంలో ఇదే పీఎస్ కి చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ, లిక్కర్ తాగుతూ పట్టుబడ్డారు. ఇదే పీఎస్ లోని ఓ ఎస్సై.. మహిళా బాధితుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ కదలికల్ని సైతం లీక్ చేస్తున్నారని సమాచారం అదింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఒకేసారి భారీగా ట్రాన్స్ ఫర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నగర కమీషనర్. అవినీతికి పాల్పడ్డా.. సివిల్ వివాదాల్లో తలదూర్చినా.. ట్రాన్స్ ఫర్స్ తో పాటు సస్పెన్షన్స్ ఉంటాయంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఆరోపణలు వచ్చిన ప్రతీ పోలీస్ పై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేయించి, రుజువైతే చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇదీ చదవండి: తెలంగాణ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మళ్లీ పెంపు -
బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై లుక్ అవుట్ నోటీసులు
బోధన్: బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహైల్‌పై పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. పంజాగుట్టలో రాష్ డ్రైవింగ్ చేసి సోహైల్ ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్ని లొంగిపొమ్మని చెప్పాడు. తనకు బదులు డ్రైవర్ అబ్దుల్ ని పోలీస్ స్టేషన్ కి పంపించాడని పోలీసులు తెలిపారు. ప్రమాదం చేసిన సోహెల్ నేరుగా ముంబకి వెళ్లిపోయాడు. అటునుంచి దుబాయ్ కి పారిపోయాడు. సోహెల్ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పంజాగుట్ట పోలీసులు.. దుబాయ్ లో ఉన్న సోహెల్ ని రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా షకీల్ కొడుకు కారుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నెల 23న ప్రజాభవన్ ఎదుట బారీకేడ్లను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. అయితే సోహైల్‌ను తప్పించి మరొకరు డ్రైవ్ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు ప్రమాద విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ విచారణకు ఆదేశించారు. షకీల్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేసింది షకీల్ కొడుకు సోహైల్‌గా తేల్చారు. అయితే ఎఫ్ఐఆర్లో మరొకరి పేరు చేర్చారు. దీంతో నిందితుడు సోహైల్‌కు సహకరించిన పోలీసులు ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. ప్రమాద సమయంలో సోహైల్‌తోపాటు ఉన్న ఫ్రెండ్స్ ఎవరు? పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎందుకు చేయలేదనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సోహైల్‌కు సహకరించి తప్పుడు కేసు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇదీ చదవండి: అసెంబ్లీలో అడుగిడిన సీపీఐ -
బోధన్‌లో పోస్టర్ల కలకలం.. రాహుల్, రేవంత్ ఫోటోలతో విమర్శలు
సాక్షి, నిజామాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్‌లో పోస్టర్ల కలకలం రేగింది. రాహుల్ బోధన్ రాకను నిరసిస్తూ పోస్టర్లు వెలిశాయి. నిజామాబాద్, బోధన్‌లో గోడలకు పోస్టర్ల ప్రత్యక్షమయ్యాయి. తెలంగాణలో బలిదానాల బాధ్యత కాంగ్రెస్‌దేనని, మా బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీ అంటూ.. పోస్టర్లు అంటించారు. వీటిపై రాహుల్, రేవంత్ రెడ్డి ఫోటోలు ముద్రించి ఉన్నాయి. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందేనని,ముక్కు నేలకు రాయాల్సిందేనని డిమాండ్ చేస్తూ పోస్టర్లు అంటించారు. పోస్టర్లలో కర్నాటకలో కరెంటు కష్టాలు, నిరుద్యోగాన్ని ఎండగట్టారు. బళ్లారిలో జీన్స్ పరిశ్రమలకు విద్యుత్తు కోతలపై పత్రికల్లో వచ్చిన కథనాలు జత చేశారు. ‘కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి కరెంటులేక అల్లాడుతున్న కర్నాటక. దివాళా తీస్తున్న పరిశ్రమలు.. కాంగ్రెస్ పేరెత్తితేనే జనం తిట్లు. గీ కన్నింగ్ కాంగ్రెస్ మనకు అవసరామా?. కర్నాటకలో ఉద్యోగాలు కాదు ఉరితాళ్లే. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికే నిరుద్యోగుల గోస.’ అంటూ పోస్టర్లు అంటించారు. కాగా బోధన్‌లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. నర్సాపూర్ గేట్ వద్ద కాంగ్రెస్ విజయ భేరి సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. చదవండి: పాతబస్తీలో బడా వ్యాపారులే టార్గెట్‌గా ఐటీ సోదాలు -
అవకాశం ఇవ్వండి నేనేంటో చూపిస్తా..! : వడ్డి మోహన్‌రెడ్డి
సాక్షి, నిజామాబాద్: 'అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏంటో, తానేంటో చూపిస్తానని బోధన్ బీజేపీ అభ్యర్థి వడ్డి మోహన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం బీజేపీతోనే సాధ్యమవుతుందని గ్రహించిన ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బోధన్‌లో అవినీతి పేరుకు పోయిందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని అన్నారు. ఎమ్మెల్యేగా తొలిసారిగా పోటీచేస్తున్నానని ప్రజలు ఆదరించి బీజేపీని గెలిపించాలని కోరారు.' అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వడ్డి మోహన్‌రెడ్డితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. – బోధన్ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది? ► నియోజకవర్గంలో నేను ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. యువగర్జన సభకు ఎంపీ అర్వింద్ హాజరయ్యారు. నియోజకవర్గంలో రెండో రోజుల్లో నిర్వహించే ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా రానున్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రజా సమస్యలపై మీ సమాధానం? ► బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో అంతా అవినీతే జరిగింది. నియోజక వర్గంలో అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట రుణమాఫీ, భూసమస్యలు, రేషన్‌కార్డులు, పింఛన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిరుద్యోగ సమస్యతో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస సౌకర్యాలపై ఎమ్మెల్యే షకీల్ దృష్టి సారించలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి తప్పకుండా సాధ్యమవుతుంది. పదేళ్లలో అభివృద్ధి ఎలా ఉంది? ► బోధన్ గత వైభవాన్ని కోల్పోయింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది. దీంతో చెరుకు రైతులు, వ్యాపార వర్గాలు, కార్మికులకు ఎంతో నష్టం కలిగింది. ప్రభుత్వ వివిధ శాఖల కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏం జరగలేదు. ఎన్నికల పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్యేనా..? ► ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి గెలిచే అవకాశం లేదు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌ను ఓడించాలంటే బీజేపీతోనే సాధ్యమనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీతో విజయం. నిజాంషుగర్స్ పునరుద్ధరణపై మీరిచ్చే హామీ..? ► ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తాం. ఇచ్చిన హామీని బీజేపీ ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఫ్యాక్టరీ ప్రారంభమైతే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటే అన్న ఆరోపణపై..? ► బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలు. ఆ పార్టీలే లోపాయి కారి ఒప్పందాలతో రాజకీయాలు చేస్తున్నాయి. 2006లో నవీపేట జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు తనను ఓడించేందుకు ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయి. ప్రజలకు మీరిచ్చే హామీలు? ► బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా అన్ని హామీలను నెరవేరుస్తాం. మూతపడిన నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం. యువతకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు మద్దతు ధర కల్పిస్తాం. తెల్లరేషన్‌కార్డు ఉన్న వారికి ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. రూ. పది లక్షల వరకు ఆరోగ్య బీమా, ఆడపిల్లల వివాహాలకు రూ.2 లక్షలు అందిస్తాం. ప్రజల నుంచి ఏమైనా ఆశిస్తున్నారా..? ► నేను 25 ఏళ్ల నుంచి రాజకీయ ప్రజా జీవితంలో కొనసాగుతున్నా.. నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడిని. తొలిసారిగా బోధన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా గెలిపించాలని ప్రజలను వేడుకుంటున్నా. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లను గెలిపించిన ప్రజలు ఈ సారి బీజేపీకి అవకాశం కల్పించాలని కోరుకుంటన్నారు. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తా. ఇవి చదవండి: ప్రజలే నా ధైర్యం.. నమ్మకం! : బిగాల గణేశ్‌గుప్తా -
కేసీఆర్‌ను ఓడించాలంటే మరో కేసీఆర్ పుట్టాలి
బోధన్: తెలంగాణ గడ్డపై ఉద్యమ నేత కేసీఆర్‌ను రాజకీయంగా ఓడించాలంటే ఎవరి తరం కాదని, మళ్లీ కేసీఆరే పుట్టాలని.. అయితే అది సాధ్యమయ్యే పని కాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఎన్ఎస్ఎఫ్ మైదానంలో గురువారం రాత్రి జరిగిన బీఆర్ఎస్ మహా యువగర్జన సభలో ఆమె ప్రసంగించారు. కేసీఆర్ ఏం చేశారని చాలామంది మాట్లాడుతున్నారని, ఆయన ఎవరూ అడగకుండానే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులకు కొట్లాటలకు, ముచ్చట్లకే సమయం సరిపోవడం లేదని, అలాంటివారు ప్రజల గురించి ఏం ఆలోచిస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలను సంపూర్ణంగా అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌దే నన్నారు. ఓడిపోతామనే నిరాశలో కాంగ్రెస్ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. మొన్న టీపీసీసీ చీఫ్ రేటెంతరెడ్డి (రేవంత్‌రెడ్డి) ఉస్మానియా విద్యార్థులను అడ్డమీది కూలీలన్నారని, రైతుబంధును బిచ్చమేస్తున్నారని అన్నారని కవిత పేర్కొన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 24 వేల ఉద్యోగాలిస్తే, అందులో తెలంగాణ వాటాకు 10 వేలు ఉద్యోగాలొచ్చాయన్నారు. కానీ పదేళ్ల కేసీఆర్ పాలనలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి, లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఎమ్మెల్యే షకీల్, జెడ్పీవైస్ చైర్పర్సన్ రజితాయాదవ్, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు, ప్రజాప్రతిని«ధులు సభలో పాల్గొన్నారు. -
Nizamabad: అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించేదీ వీరే..
సాక్షి, నిజామాబాద్: రాబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయికి మహిళలు చేరుకున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్ల శాతం ఎక్కువగా ఉండటంతో గెలిచే అభ్యర్థి ఎవరు, తర్వాతి స్థానంలో నిలిచే వారు ఎవరని నిర్ణయించే శక్తి మహిళా ఓటర్లకే ఉందని స్పష్టమవుతోంది. జిల్లాలో బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్ నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలున్నాయి. ఆరు నియోజకవర్గాల ఓటర్ల సంఖ్య అందులో నమోదైన మహిళా ఓటర్ల లెక్కను పరిశీలిస్తే వారి ఓట్ల సంఖ్యనే ఎక్కువగా ఉందని తేలింది. పురుషుల ఓటర్లలో అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలతో పాటు, పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు ఉన్నారు. ఈ లెక్కన మహిళలు వేసే ఓట్లే అభ్యర్థుల గెలుపునకు కీలం కానున్నాయి. అత్యధికంగా రూరల్ నియోజకవర్గంలోనే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండగా తర్వాత బాల్కొండ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది. మహిళా ఓటర్ల కోసం గాలం.. అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అధికార పార్టీ అభ్యర్థులు మొదట ఖరారు కావడంతో వారు దసరా, బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలకు బహుమతులను పంచిపెడుతున్నారు. చీరలు, కుక్కర్లు, గ్రైండర్లు, ఇతరత్రా గృహోపకరణాలు, అందిస్తూ మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మహిళలు తమవైపు ఉంటే విజయం వరిస్తుందనే ధీమాతో అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. మహిళా ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సి ఉంది. ఆరు నియోజకవర్గాల్లో ఓట్ల వివరాలు నియోజకవర్గం బాల్కొండ ఆర్మూర్ అర్బన్ రూరల్ బోధన్ బాన్సువాడ మహిళా ఓటర్లు 1,15,898 1,09,933 1,47,571 1,32,212 1,12,381 1,00,608 పురుష ఓటర్లు 99,728 96,404 1,39,163 99,728 1,03,577 92,225 ఎక్కువున్న మహిళలు 16,170 13,529 8,408 32,484 8,804 -
కుల, మతాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం: ఎమ్మెల్సీ కవిత
-
రూ .231 కోట్లు కొట్టేశారు!
సాక్షి, హైదరాబాద్/బోధన్: బోధన్ నకిలీ చలాన్ల కుంభకోణం కేసులో ఎట్టకేలకు చార్జి షీట్ దాఖలైంది. 2017 నుంచి ఆరేళ్ల పాటు సుదీర్ఘంగా దర్యాప్తు చేసిన తెలంగాణ సీఐడీ అధికారులు ఇటీవల కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్ వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 34 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో 22 మంది వాణిజ్య పన్నుల విభాగానికి చెందిన అధికారులే.మొత్తం 123 మంది సాక్షులను విచారించినట్టు చార్జిషీట్లో పేర్కొన్నారు. 68 రకాల సాఫ్ట్వేర్ మెటీరియల్‌తో పాటు 143 డాక్యుమెంట్లు, మూడు ఆడిట్ రిపోర్ట్‌లను సాక్ష్యాలుగా కోర్టుకు సమరి్పంచారు. ఈ కుంభకోణంలో నిందితులు మొత్తం రూ.231.22 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి కొల్లగొట్టినట్టు తేల్చారు. దీనికి సంబంధించి 2005 నుంచి 2016 వరకు బోధన్, నిజామాబాద్ వాణిజ్య పన్నుల శాఖలో పని చేసిన అధికారుల వివరాలు సీఐడీ సేకరించింది. ఇలా దోచేశారు.. వాణిజ్య పన్నులశాఖ బోధన్ సర్కిల్లో జరి గిన నకిలీ చలాన్ల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పన్నులు చెల్లించకుండానే నకిలీ చలాన్లు సృష్టించి కోట్ల రూపాయలు కొట్టేశారు. వ్యాపారాలు చేసేవారు వాణిజ్య పన్నుల శాఖ ద్వారా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నులు చలానా రూపంలో చెల్లిస్తారు. ప్రతి చలానాకు ప్రత్యేక నంబర్ ఉంటుంది. ఖజానా (ట్రెజరీ)లో ఈ నంబర్ వేయించుకుని ప్రభుత్వం అనుమతించిన బ్యాంకులో పన్ను మొత్తాన్ని జమ చేయాలి. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్, అతడి కుమారుడు సునీల్‌లు బోధన్ వాణిజ్య పన్నులశాఖ కార్యాలయ సిబ్బందితో కుమ్మక్కయ్యారు. పన్నులు చెల్లించకుండానే చెల్లించినట్టుగా నకిలీ చలాన్లు సృష్టించారు. కొంత మొత్తాన్ని చెల్లించి ఎక్కువ మొత్తంలో చెల్లించినట్టు చూపారు. ఒకరు చెల్లించిన చలానాతోనే పదుల సంఖ్యలో వ్యాపారులు, పలు వ్యాపార సంస్థలు చెల్లించినట్టుగా రికార్డులు సృష్టించారు. వ్యాపారుల సొమ్మును పక్కదారి పట్టించి తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెట్టారు. ఎక్కడికక్కడ అధికారులను తమ దారికి తెచ్చుకుని ఏళ్ల తరబడి ఈ కుంభకోణం కొనసాగించారు. అయితే నిజామాబాద్ జిల్లా బోధన్ సర్కిల్ సీటీఓ ఎల్.విజయేందర్ బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్లో 2017 ఫిబ్రవరి 2న చేసిన ఫిర్యాదుతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. దర్యాప్తులో ఉద్యోగుల అవినీతి బాగోతానికి సంబంధించి పక్కా సాక్ష్యాలు లభించాయి. ఫోర్జరీ, మోసం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నేరపూరిత కుట్ర, లంచం తీసుకోవడం వంటి నేరాలు ఉండడంతో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం డీఎస్పీ ఎన్.శ్యామ్ ప్రసాద్‌రావు దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. కేసు నీరుగార్చే యత్నాన్ని బయటపెట్టిన ‘సాక్షి’.. ఈ భారీ కుంభకోణం దర్యాప్తులో ఆద్యంతం అనేక మలుపు చోటు చేసుకున్నాయి. చలాన్లు పెట్టేందుకే నిందితులు ఏకంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటి నిండా చలాన్లు ఉండటాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. మరోవైపు దర్యాప్తును నీరుగార్చేందుకు ఏకంగా ఐఏఎస్ స్థాయి అధికారి ఒకరు ప్రయత్నించిన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఆ తర్వాతే కేసు దర్యాప్తులో వేగం పెరిగింది. తీగలాగితే డొంక కదిలిన చందంగా వాణిజ్య పన్నుల విభాగానికి చెందిన అనేకమంది అధికారుల పాత్ర వెల్లడైంది. ఈ క్రమంలో సీఐడీ విచారణాధికారికి కోటి రూపాయల ఎర వేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ డీఎస్పీ విజయ్‌కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అరెస్టు అయ్యింది వీరే.. ఈ కుంభకోణానికి కీలక సూత్రధారులుగా ఉన్న సింహాద్రి లక్ష్మీ శివరాజ్ (ఏడాది క్రితం మరణించాడు), అతని కుమారుడు సింహాద్రి వెంకట సునీల్‌లను సీఐడీ అరెస్టు చేసింది. వీరిద్దరు నిజామాబాద్ పట్టణంలో సేల్స్ ట్యాక్స్ ప్రైవేటు ఆడిటర్లుగా ఉంటూ ఈ కుంభకోణానికి తెగబడ్డారు. వీరితో పాటు వారి సిబ్బంది విశాల్ పాటిల్ అలియాస్ విశాల్ కాంతిపాటిల్, కమ్మర రామలింగం అలియాస్ రామ లింగడు, నారాయణదాస్ వెంకట కృష్ణమాచారి, ఎన్.సత్యవెంకట కృష్ణకుమార్ అలియాస్ పంతులు, ఎం.మల్లేశ్, గంగొనే రాకేశ్, మడపల్లి రమణ, వంగల శ్రీనివాస్, మహ్మద్ నజీముద్దీన్ అలియాస్ అబీబుద్దీన్, అర్రోజుల రాజేశ్ కూడా ఉన్నారు. ఇక వాణిజ్య పన్నుల శాఖ అధికారులు..రాథోడ్ ధర్మ విజయకృష్ణ, అనంతశ్యానం వేణుగోపాల స్వామి, బి.హనుమంతు సింగ్, ధరణి శ్రీనివాసరావు, టి.పూర్ణచంద్రారెడ్డితో పాటు బోధన్ సర్కిల్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు (ఏసీటీఓలు) ఆర్.కిషన్, కె.నాగేశ్వర్రావు, కె.విజయకుమార్, ఎస్.రత్నకుమారి, బీఎన్ ఇందిర, జె.రాజయ్య, ఎస్.సాయిలు, సీనియర్ అసిస్టెంట్లు సి.స్వర్ణలత, కె. అరుణ్‌రెడ్డి, బి.పీరాజి, రవీంద్రబాబు, ఆర్.బాలరాజు, జూనియర్ అసిస్టెంట్లు చంద్రహాస్, ఆర్.వినోద్‌కుమార్, బి.రంగారావు, ఎల్.భజరంగ్, సి.శ్రీధర్‌లు కూడా కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారు. -
పోయొద్దాం..! పోచారం..!! పచ్చదనంతో పలకరిస్తున్న పోచారం ప్రకృతి
మెదక్‌జోన్: కోయిల కిలకిల రావాలు.. చెంగుచెంగున ఎగిరి దూకే జింకలు.. పురివిప్పి నాట్యం చేసే నెమళ్లు.. గాంభీర్యాన్ని ప్రదర్శించే మనుబోతులు.. నీల్గాయి, సాంబార్లు, మనసుకు ఆహ్లాదానిచ్చే పచ్చని అటవీఅందాల మధ్య నెలకొన్న సుందర దృశ్యాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అడవమ్మ ఒడిలో స్వేచ్ఛగా విహరిస్తూ.. అందాలను వీక్షించేందుకు ప్రకృతి ప్రేమికులు పట్టణాలను విడిచి పోచారం అభయారణ్యానికి పయనం అవుతున్నారు. ► జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో బోధన్–మెదక్ ప్రధాన రహదారి పక్కన కామారెడ్డి, మెదక్ జిల్లాల సరిహద్దు గ్రామం పోచారం శివారులో ఉందీ ఈ అభయారణ్యం. ► ఈ 600 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు. ఇందులో 1983లో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని స్థాపించారు. ►వైల్డ్ డాగ్, చిరుత, వోల్ఫ్, జాకల్, ఫారెస్ట్ క్యాట్, బద్ధకం బేర్, సాంబార్, నీల్గాయి, చింకారా, చిటల్, నాలుగు కొమ్ముల జింకలను చూడొచ్చు. ► అభయారణ్యం పక్కనే నిజాం కాలంలో నిర్మించిన పోచారం ప్రాజెక్టు అందాలతో ఈ ప్రాంతం పర్యాటకులకు అడ్డాగా మారింది. ► హైదరాబాద్‌కు కేవలం 115 కిలోమీటర్లు దూరంలో ఉన్న అభయారణ్యానికి వారంతంలో పిల్లలు, పెద్దలు కుటుంబంతో కలిసి వచ్చి ఆనందంగా గడుపుతారు. ► నిజాంపాలనలో ఈ అభయారణ్యం వేట ప్రాంతంగా పేరుగాంచగా, నేడు వన్యప్రాణుల ఆవాసంగా మారింది. ► హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, కరీంనగర్, బోధన్ ప్రాంతాల నుంచి పర్యాటకులు సందర్శనకు వస్తుంటారు. ► వసతి కోసం పోచారం, మెదక్ వద్ద అతిథి గదుల్లో సేదతీరవచ్చు. మెదక్ వద్ద ఫారెస్ట్ రెస్ట్ హౌస్ కూడా ఉంది. ఇలా చేరుకోవచ్చు.. హైదరాబాద్ నుంచి వయా నర్సాపూర్, జేబీఎస్ నుంచి వయా తూప్రాన్ మీదుగా మెదక్‌కు రావొచ్చు. మెదక్ నుంచి పోచారం అభయారణ్యం 15 కిలోమీటర్లు అక్కడ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో సీఎస్ఐ చర్చి, ఖిల్లా, ఏడుపాయల, 3 కిలోమీటర్ల దూరంలో జైనమందిర్ ఉంటాయి. -
భయపడే వాళ్లు ఎవరూ లేరు.. ఒవైసీకి ఎమ్మెల్యే షకీల్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, నిజామాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో చూసుకుందామని బెదిరిస్తే భయపడే వారు ఇక్కడ ఎవరూ లేరు అంటూ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. దీంతో, ఎమ్మెల్యే వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాగా, బీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ శుక్రవారం ఓ వీడియోలో మాట్లాడుతూ.. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికలు రాగానే ఆయన నైజం బయటపెడుతున్నారు. ఎన్నికల్లో చూసుకుంటామని బెదిరిస్తే భయపడే వారు ఎవరూ లేరు. దమ్ముంటే ముందు నుండి కొట్లాడండి.. వెనుక నుండి కాదు. నేనెవరి మీదా తప్పుడు కేసులు పెట్టలేదు. ఎంఐఎం కౌనిల్సర్లు నామీద ముమ్మాటికీ హత్యాయత్నం చేశారు. ప్లాన్ ప్రకారమే ఆరోజు నామీద దాడి చేసి చంపాలనుకున్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న నిందితులపై సంఘ విద్రోహా కేసులు ఉన్నాయి. దొంగతనం, రౌడీయిజం, మర్డర్ ఇలా చాలా కేసులు వారిపై ఉన్నాయి. బోధన్ బీఆర్ఎస్ రాజకీయ నేత శరత్ రెడ్డి, ఎంఐఎం నేతలు కలిసి నాపై కుట్రలు చేస్తున్నారు. ఈ హత్యాయత్నం కేసులో పోలీసులే నిజానిజాలు తేలుస్తారు. ఈసారి ఎన్నికల్లో తేల్చుకుందాం. బోధన్ ప్రజలు నాతోనే ఉన్నారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అరెస్ట్ అయిన వారంతా కవిత గెలుపు కోసం పనిచేశారు: ఎంఐఎం ఒవైసీ -
నా కొడుకు తప్పు చేయలేదు.. బక్రీద్ వేళ బోధన్ ఎంఐఎం నేత తండ్రి రోదన
-
తెలంగాణ పాలిటిక్స్‌లో ట్విస్ట్.. బిగ్ బాంబ్ పేల్చిన ఒవైసీ!
సాక్షి, నిజామాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా నిజామాబాద్ జిల్లా జైలులో ఉన్న బోధన్ ఎంఐఎం నేతలతో ములాఖత్ అయ్యారు. అయితే, ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే షకీల్ ఫిర్యాదుతో మజ్లిస్ నేతలు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జైలు ములాఖత్ అనంతరం ఒవైసీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తాం. ఎక్కడెక్కడ పోటీ చేస్తామనేది ఎన్నికల ముందు జాబితాను ప్రకటిస్తాం. బోధన్‌లో ఎంఐఎం పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌కు ఎన్నికల ద్వారా తగిన బుద్ధి చెబుతాం. ఎంఐఎం కౌన్సిలర్స్, నేతలపై అక్రమ కేసులు పెట్టారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, డీజీపీ దృష్టికి తీసుకువెళ్తాం. అరెస్ట్ అయిన ఎంఐఎం నేతలు.. ఎమ్మెల్సీ కవిత, షకీల్ గెలుపు కోసం పనిచేశారు. తెలంగాణలో ముస్లింలకు కూడా ముస్లిం బంధు ఇవ్వాలి. ముస్లింలలో పేద ప్రజలు ఎక్కవగానే ఉన్నారు. గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాము. కానీ, ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మసీదులు తొలగించి సచివాలయం నిర్మించారు. ఆ మసీదులు వెంటనే కట్టాలి అని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో ఎంఐఎం బలపడటం కోసం ముందుగా పనిచేస్తాం. ఏ పార్టీతో మద్దతు.. ఏ పార్టీతో ముందుకెళ్లాలనేది ఆలోచిస్తాం. పాట్నా మీటింగ్‌కు ప్రతిపక్ష పార్టీలు నన్ను పిలవలేదు. తెలంగాణలో మేం కూడా ప్రత్యామ్నాయమే. తెలంగాణలో గెలుపోటములను ప్రజలు నిర్ణయిస్తారు. మణిపూర్‌లో మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బీజేపీలో కోల్డ్‌వార్ పాలిటిక్స్.. జేపీ నడ్డాకు వారు ముగ్గురు ఏం చెప్పారు? -
బోధన్ ఎమ్మెల్యే vs మున్సిపల్ చైర్మన్ ఫ్లెక్సీ వార్
-
కేంద్రం గుడ్‌న్యూస్! రూ.429.28 కోట్లతో మద్నూర్–బోధన్ రోడ్డు విస్తరణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని కామారెడ్డి, నిజామాబాద్, మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేలా మద్నూర్– బోధన్ రహదారి విస్తరణకుగాను రూ.429.28 కోట్ల వ్యయానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌గడ్కరి తెలిపారు. ఈ మేరకు గురువారం కేంద్రమంత్రి ప్రకటన చేశారు. కామారెడ్డి, నిజామాబాద్, నాందేడ్‌లోని ఎన్‌హెచ్–161బీబీలోని మద్నూర్ నుంచి బోధన్ సెక్షన్ వరకు రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించడానికి ఆమోదం తెలిపారు. 39.032 కిలోమీటర్ల పొడవు గల ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్, సేకరణ, నిర్మాణం(ఈపీసీ) పద్ధతిలో 2022–23 వార్షిక ప్రణాళిక కింద అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎన్‌హెచ్–163జీ(ఖమ్మం–విజయవాడ)లో రేమిడిచెర్ల గ్రామం నుంచి జక్కంపూడి గ్రామం (ఎన్‌హెచ్–16లో) వరకు నాలుగు లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే సెక్షన్ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 29.709 కిలోమీటర్ల లేఅవుట్‌కు రూ.1,190.86 కోట్లు ఖర్చు అవుతుందని, ఇతర ఎకనామిక్ కారిడార్(ఎన్‌హెచ్(ఒ)) ప్రోగ్రామ్‌ల కింద హైబ్రిడ్ యాన్యుటీ మోడ్‌లో తెలంగాణలోని ఖమ్మం, ఆంధ్రపద్రేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాల్లో నిర్మిస్తామని తెలిపారు. -
పాము కరిస్తే మంత్రం వేశారు!
ఎడపల్లి (బోధన్): సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొంతమంది మూఢ నమ్మకాలు విశ్వసిస్తున్నారు. పాము కరిస్తే వైద్యుడిని సంప్రదించకుండా మంత్రం వేయించుకోవడంతో ఓ వ్యక్తి ప్రాణం పోయింది. ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుర్నాపల్లికి చెందిన గంగారెడ్డి (51)కి శనివారం మధ్యాహ్నం ఇంటి వద్ద బాత్రూంలో పాముకాటు వేసింది. దీంతో స్థానికంగా ఉన్న పాము మంత్రం వేసే వారి వద్దకు వెళ్లి మంత్రం వేయించుకున్నాడు. అయితే గంటపాటు పాము మంత్రం వేసే వారి వద్ద ఉంచడంతో పరిస్థితి విషమించింది. స్థానికులు ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించడంతో గంగారెడ్డిని ఆటోలో నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో మల్లాపూర్ గండి వద్ద ఆటోలో డీజిల్ అయిపోయింది. మరో ఆటోలోకి ఎక్కించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గంగారెడ్డి మృతి చెందాడ -
ప్రాణం తీసిన ప్రేమ?.. 80 రోజుల క్రితం అదృశ్యమై
సాక్షి, ఆదిలాబాద్: 80 రోజుల క్రితం అదృశ్యమైన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖండ్గాం గ్రామానికి చెందిన శ్రీకాంత్ (20) పట్టణ శివారులోని పసుపువాగు వద్ద చెట్ల పొదల్లో శవమై కనిపించాడు. మృతుడి బ్యాగు, చెప్పులను గుర్తించి శ్రీకాంత్‌గా నిర్ధారించారు. బోధన్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండో ఏడాది చదువుతున్న శ్రీకాంత్ సెపె్టంబర్ 23న కాలే జీ వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కాగా శ్రీకాంత్ అదృశ్యం అనంతరం మండలంలోని భూ లక్ష్మీ క్యాంపు గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం బయటకు వచి్చంది. అతను కనిపించకుండా పోయిన నాలుగైదు రోజులకు యువతి బంధువులు ఐదుగురు ఇంటికి వచ్చి బెదిరించినట్టు తల్లిదండ్రులు జ్యోతి, లక్ష్మణ్ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించలేదని, తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని అన్నారు. పోలీసులు పట్టించుకోలేదంటూ ధర్నా పోలీసుల నిర్లక్ష్యంతోనే తమ కొడుకు చనిపోయాడని, యువతి తరఫున వారే హత్య చేశారని ఆరోపి స్తూ మృతుని బంధువులు బోధన్ రుద్రూర్ రహదారిపై బైఠాయించి రాత్రి పొద్దుపోయే వరకు ఆందో ళన చేపట్టారు. హత్య కేసులో పోలీసుల పాత్రపై అనుమానాలున్నాయని ఆరోపించారు. డీసీపీ అరవింద్‌బాబు, ఆర్డీవో రాజేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడా రు. డివిజన్ పోలీసుల మీద నమ్మకం లేక పోతే వేరే డివిజన్ పోలీసులతో కేసు విచారణ చేపడతామని స్పష్టం చేసిన మీదట ఆందోళన విరమించారు. -
ప్రశాంతంగా నిజామాబాద్ జిల్లా బోధన్ బంద్
-
నిజామాబాద్: ముంపు గ్రామల్లో బోధన్ ఎమ్మెల్యే షకీల్ పర్యటన
-
బోధన్ అల్లర్ల కేసులో కీలక మలుపు.. విగ్రహ వివాదంలో అధికార పార్టీ నేత
సాక్షి, నిజామాబాద్: బోధన్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు గోపికిషన్‌తో పాటు బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ పద్మా భర్త అధికార పార్టీ కౌన్సిలర్ శరత్‌రెడ్డి ఈ వ్యవహరంలో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసు విచారణతో పాటు ఇంటెలిజన్స్ వర్గాల ఆరాలో తేలినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. శరత్‌రెడ్డి ఇప్పటికే పరారీలో ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. శివాజీ విగ్రహం కొనుగోలు చేయడానికి శివసేన జిల్లా అధ్యక్షుడు గోపికిషన్‌కు కౌన్సిలర్ సహకరించినట్లు తెలిసింది. కొనుగోలు చేసిన విగ్రహాన్ని శరత్‌రెడ్డి రైస్‌మిల్ వద్ద ఉంచి, శనివారం అర్ధరాత్రి గోపి అక్కడి నుంచి తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ కేసులో ఏ1 గా ఉన్న గోపికిషన్‌ను రిమాండ్‌కు తరలించిన విషయం విధితమే. అలాగే పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాతో పాటు పలు ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు పికెట్ కొనసాగుతోంది. చదవండి: ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి త్రుటిలో తప్పిన ప్రమాదం.. -
అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు
-
నిజామాబాద్: బోధన్ బంద్‌కు బీజేపీ పిలుపు
-
బోధన్ లో 144 సెక్షన్ విధింపు
-
షరియత్ చట్టం అమలుకు కుట్ర: సంజయ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో షరియత్ చట్టం అమలుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బోధన్‌లో భజరంగ్‌దళ్, హిందూవాహిని కార్యకర్తలపై కొంతమంది ఛాందసవాదులు, పోలీసులు కలసి దాడి, లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. బోధన్ చౌరస్తాలో శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని మున్సిపాలిటీ పాలకవర్గం తీర్మానించాక టీఆర్ఎస్ మైనారిటీ నాయకులు రాళ్ల దాడి చేయడం, పోలీస్ కమిషనర్ భజరంగ్‌దళ్ కార్యకర్తలపై లాఠీచార్జి చేస్తూ రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరపడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. ఆదివారం ఆ పార్టీ నాయకులతో కలసి సంజయ్ మీడియాతో మాట్లాడారు. శివాజీ విగ్రహం కాకుండా అక్కడ ఔరంగజేబు విగ్రహం పెట్టాలా? అని ప్రశ్నించారు. ‘ఈ సీపీకి ఎంపీ టికెట్ ఇస్తానని కేసీఆర్ చెప్పిండట. సీపీయే ఈ విషయం మీడియాతో చెప్పిండు. ఇలాంటి వ్యక్తి సీపీగా ఉండటం సిగ్గుచేటు’అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బియ్యం సేకరణ గోల్మాల్ అవినీతి భాగోతం వెనుక మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల హస్తం ఉందని ఆరోపించారు. బియ్యం కొనబోమని కేంద్రం చెప్పిందా? ‘కేసీఆర్.. యాసంగి బియ్యం కొనడం లేదని మీతో ఎవరు చెప్పిండ్రు. పోయినసారి కూడా గిట్లనే అన్నవ్. వడ్లు కొనకపోతే పార్లమెంట్ ముందు, ఇండియా గేట్ ముందు, బీజేపీ ఆఫీస్ ముందు ఆ వడ్లన్నీ పారబోస్తానంటివి.. ఏమైంది.. నువ్వు ఇస్తానన్న బియ్యమే ఇంతవరకు ఇయ్యవైతివి..’అని సంజయ్ ధ్వజమెత్తారు. ‘యాసంగిలో తెలంగాణలో పండిన ప్రతి గింజ కొంటామని పోయినసారి పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి పీయుష్ గోయల్ ప్రకటించిన సంగతి కేసీఆర్‌కు గుర్తు లేదా’అని వ్యాఖ్యానించారు. -
శివాజీ విగ్రహం ఏర్పాటుతో వివాదం
బోధన్‌టౌన్ (బోధన్)/నిజామాబాద్ సిటీ/సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ పార్టీ రాత్రికి రాత్రే ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఘర్షణకు కారణమైంది. ఈ అంశంపై ఇరువర్గాల మధ్య మొదలైన వాగ్వాదం రాళ్ల దాడికి దారి తీసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. వివాదం మొదలైంది ఇలా.. బోధన్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం రాత్రి ఓ పార్టీ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన ఓ వర్గం వారు.. విగ్రహాన్ని తొలగించాలంటూ అంబేడ్కర్ చౌరస్తాలో బైఠాయించారు. దీంతో మరో వర్గం వారు కూడా వందలాదిగా అక్కడికి వచ్చారు. విగ్రహం ఏర్పాటుకు మున్సిపల్ తీర్మానం ఉందని, విగ్రహాన్ని తొలగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇరు వర్గాలు ఎదురెదురుగా టెంట్లు వేసుకుని ఆందోళనకు దిగాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏసీ పీ రామారావు ఇరువర్గాలను సముదాయించేందు కు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నినాదా లు చేస్తూ ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. లాఠీలు ఝళిపించిన పోలీసులు.. ప్రత్యేక బలగాలతో అక్కడకు చేరుకున్న నిజామాబాద్ పోలీసు కమిషనర్ నాగరాజు.. విగ్రహ ఏర్పాటుతో ఉద్రిక్తతలకు తావివ్వొద్దని, ఏదైనా న్యాయపరంగా చూసుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. దీంతో ఓ వర్గం వారు అక్కడి నుంచి వెళ్లిపోయి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. మరోవైపు విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని, అప్పటివరకూ విగ్రహాన్ని తొలగించక తప్పదని సీపీ.. దాన్ని ఏర్పాటు చేసిన నేతలకు స్పష్టం చేశారు. అక్కడి నుంచి వెళ్లి పోవాలని సూచించగా నాయకులు నిరాకరించారు. ఈ క్రమంలో ఆందోళనకారులు వేసుకున్న టెంట్‌ను పోలీసులు తొలగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. సీపీ లాఠీచార్జికి ఆదేశించడంతో ప్రత్యేక బలగాలు లాఠీలు ఝళిపించాయి. బాష్పవాయువును ప్రయోగించారు. పోలీసుల దెబ్బలకు ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోగా అతడిని ఆస్పత్రికి తరలించారు. బోధన్ ఠాణా ఎదుట బైఠాయించిన వారిపైనా పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ఈ సంఘటనపై బీజేపీ సోమవారం బోధన్ బంద్ కు పిలుపునిచ్చింది. బోధన్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఆదివారం బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ రాశారు. బోధన్ ఘటనపై హోంమంత్రి ఆరా బోధన్ ఘటనపై హోం మంత్రి మహమూద్ అలీ ఆరా తీశారు. డీజీపీ, నిజామాబాద్ పోలీ సు కమిషనర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థితి అదుపులో ఉందని, కమిషనర్, ఇతర పోలీసు అధికారులు బోధన్‌లోనే ఉండి పరిస్థితులు సమీక్షిస్తున్నారని హోం మంత్రికి డీజీపీ వివరించారు. ప్రజలు సంయమనం పాటించాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. -
జూబ్లీహిల్స్ ప్రమాదం.. కారులో ఎమ్మెల్యే కొడుకు కూడా
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. బాలుడి మృతికి కారణమైన బండిలో.. ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ కూడా ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. రాహిల్ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఏసీపీ సుదర్శన్ వివరాలను వెల్లడించారు.. ఫిలింనగర్ నుండి ఇన్ ఆర్బిట్ మాల్ మీదుగా తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కారులో ఎంఎల్ఏ కొడుకు రాహిల్ ఉన్నాడు. రాహిల్ తో పాటు అఫ్నాన్, నాజ్ మొత్తం ముగ్గురు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు పారిపోయారు. నిందితులు పారిపోయిన రూట్ లో సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ టవర్ ఆధారంగా గుర్తించాం. అన్ని రకాల ఎవిడెన్స్ సేకరించాం. ప్రమాదం జరిగిన టైంలో కారు నడిపింది అఫ్నాన్. రాహిల్ పక్కనే ఉన్నాడు. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కారు నడిపింది అఫ్నాన్ అని నిర్ధారించుకున్నాం. ప్రమాదానికి నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ ప్రధాన కారణాలని ఏసీపీ వెల్లడించారు. గురువారం రాత్రి దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు మహేంద్ర థార్ వేగంగా దూసుకొచ్చింది. ఆ టైంలో రోడ్డు దాటుతున్న కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మా బోస్లేలను ఢీకొట్టింది. ఈ ఘటనలో కాజల్ చౌహాన్ రెండు నెలల బిడ్డ కిందపడి.. మృతి చెందిన విషయం తెలిసిందే. బండిపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అహ్మద్ పేరుతో స్టిక్కర్ ఉండడంతో కేసు ఆసక్తికరంగా మారింది. కాజల్ చౌహాన్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆపై పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కారు నడిపింది ఎమ్మెల్యే కొడుకేనంటూ ప్రచారం మొదలైంది. అభం శుభం తెలియని రెండు నెలల చిన్నారి మృతి చెందడంతో.. విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఆ కారు తమ బంధువులదని, ఓ ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని, ఆ కారులో తన కొడుకు లేడని ఎమ్మెల్యే షకీల్ వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఆ కారులో తమ బంధువులు మాత్రమే ఉన్నారని ఎమ్మెల్యే శుక్రవారం వివరణ ఇవ్వగా.. అందులో ఆయన కొడుకు కూడా ఉన్నాడంటూ తాజాగా పోలీసులు ప్రకటించడం విశేషం. -
జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే కారు బీభత్సం కేసులో కొత్త కోణం
-
ఎమ్మెల్యే పేరుతో ఉన్న కారు బీభత్సం.. స్పందించిన బోధన్ ఎమ్మెల్యే
బంజారాహిల్స్: బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్న కారు జూబ్లీహిల్స్‌లో బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో అభంశుభం తెలియని 2 నెలల పసికందు అక్కడికక్కడే మృతి చెందాడు. మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మ భోస్లే రోడ్డుపై బుడగలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో వారు వ్యాపారం ముగించుకుని జూబ్లీహిల్స్ వైపు వెళ్తుండగా.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి మహేంద్రా థార్ కారు జూబ్లీహిల్స్ రోడ్ నం.45 వైపు అతివేగంగా వచ్చి వారిని ఢీకొంది. ఈ ఘటనలో కాజల్ చౌహాన్ కుమారుడు అశ్వతోష్ (2 నెలలు) తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన కాజల్, సారికా చౌహాన్, సుష్మా భోస్లేలను అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు. చదవండి: Hyderabad: ఈ రోజు రాత్రి ఆ మూడు ఫ్లైఓవర్లు మినహా అన్నీ బంద్ . ఎందుకంటే అయితే ఈ ఘటనపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. ఈ ప్రమాదంతో తనకెలాంటి సంబంధం లేదని, ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే స్టికర్‌ను మిత్రుడు మీర్జా అనే వ్యక్తికి ఇచ్చినట్లు,అది అతనికి సంబందించిన కారని తెలిపారు. ఆ కారు ఓ ప్రైవేట్ ఇన్ఫ్రా కంపెనీ పేరు మీద ఉందని అన్నారు. ఒక మహిళా యాచకురాలు అకస్మాత్తుగా పరిగెట్టడం వల్లనే యాక్సిడెంట్ అయిందని తనకు తెలిసిందన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పూర్తిగా విచారణ జరపాలని ఎమ్మెల్యే కోరారు. -
నా బిడ్డ మొండిఘటం.. ఉక్రెయిన్ నుంచి క్షేమంగా వస్తాడు!: రజియా బేగం
‘‘ఉక్రెయిన్ దేశం యుద్ధంలో ఉందనే సంగతి మొదట నా బిడ్డే ఫోన్ చేసి నాకు చెప్పాడు. ఎప్పటికప్పుడు వాడు తన క్షేమసమాచారాలను అందిస్తున్నాడు. వీలైతే ఫోన్ చేస్తున్నాడు. లేదంటే మెసేజ్ చేస్తున్నాడు. నాకు గుండె ధైర్యం ఎక్కువ. నా బిడ్డ కూడా నాలాగే మొండి ఘటం. వాడు క్షేమంగా ఉక్రెయిన్ నుంచి తిరిగొస్తాడనే నమ్మకం ఉంది నాకు. కానీ, తల్లి ప్రేమ కదా. అందుకే అధికారుల సాయం కోరుతున్నా’’ అని చెబుతోంది యాభై ఏళ్ల టీచరమ్మ రజియా బేగమ్. అన్నట్లు ఈమె గురించి మీకు పరిచయం ఉందో లేదో.. ఈమె అప్పట్లో నేషనల్ ఫేమస్ అయ్యారు. సుమారు రెండేళ్ల కిందట కరోనా మొదలయ్యాక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. ఆ సమయంలో ఎక్కడికక్కడే చిక్కుపోయి.. స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు చాలామంది. ఈ తరుణంలో నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి ఓ తల్లి తన బిడ్డ కోసం వందల కిలోమీటర్లు స్కూటీ మీద వెళ్లి.. సురక్షితంగా అతన్ని తెచ్చేసుకుంది(1400కి.మీ.పైనే). నెల్లూరులో చిక్కుకుపోయిన కొడుకు నిజాముద్దీన్ అమన్‌ను తీసుకొచ్చుకునేందుకు బోధన్ ఎస్పీ నుంచి పర్మిషన్ తీసుకుని మరి సాహసం చేసింది. కొడుకు కోసం తల్లి పడ్డ ఆరాటాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. సాలంపాడ్ క్యాంప్ విలేజ్‌లో గవర్నమెంట్ టీచర్‌గా పని చేసే రజియాబేగం కథ అప్పుడు బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ కొడుకు అమన్ ఇప్పుడు.. వేల కిలోమీటర్ల దూరంలో ఉక్రెయిన్ సంక్షోభంలో చిక్కుకుపోయాడు. అతను ఉంటున్న ప్రాంతంలో భారతీయుల తరలింపులో ఎలాంటి పురోగతి లేదని సమాచారం. రజియా భర్త 14 ఏళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూశాడు. అందుకే తన బిడ్డను డాక్టర్ కావాలని ఆమె కోరుకుంది. ఉక్రెయిన్ సుమీ స్టేట్ యూనివర్సిటీలో చేర్పించింది. సుమారు 50 దేశాల నుంచి రెండు వేల మంది దాకా విద్యార్థులు చదువుతున్నారు ఇక్కడ. మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్న అమన్. ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంలో ఓ బంకర్లో అతను ఆశ్రయం పొందుతున్నాడు. అయితే అతను ఉంటున్న ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన బిడ్డ మాత్రమే కాదు.. తన బిడ్డల్లాంటి వాళ్లందరినీ వీలైనంత త్వరగా ఇక్కడకు రప్పించే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను రజియాబేగం కోరుతున్నారు. ఇప్పటికే ఆమె నిజామాబాద్ కలెక్టర్‌కు లేఖ కూడా రాశారు. -
Nizamabad: రాజు ఘటన మరువకముందే మరో దారుణం
-
మద్యం తాగించి డిగ్రీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి డిగ్రీ చదువుతున్న యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. నలుగురు యువకులు బాధితురాలికి మద్యం తాగించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆర్మూర్ డివిజన్లోని ఓ గ్రామానికి చెందిన యువతి బోధన్‌లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం విద్యనభ్యసిస్తోంది. యువతికి జిల్లా కేంద్రంలోని డెకొరేషన్ పనిచేసే శేఖర్ అనే యువకుడితో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. యువతి బర్త్‌డే ఉండడంతో పార్టీ చేసుకోవాలంటూ శేఖర్ ఆమెను జిల్లా కేంద్రానికి రప్పించాడు. సాయంత్రం ఐదు గంటలకు గాయత్రినగర్‌లోని రూమ్‌కు తీసుకెళ్లాడు. అతని స్నేహితులు మరో ముగ్గురిని పిలిచాడు. అక్కడ యువతితో మద్యం తాగించి వారు తాగారు. మద్యం మత్తులో యువతిపై నలుగురు అత్యాచారం జరిపారు. రాత్రి 11 గంటల వరకు రూమ్‌లోనే ఉన్నారు. అనంతరం యువతిని ఇంటికి పంపించేందుకు బైక్‌పై ఆర్మూర్ రోడ్డువైపు వెళ్లారు. అప్పటికే యువతి మద్యం మత్తులో ఉండడంతో ఉదయం పంపించాలని తిరిగి బస్టాండ్ వైపు వచ్చారు. యువకుడికి బస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసే యువకుడు పరిచయం ఉండడంతో అతనికి ఫోన్‌చేసి ఈ రాత్రికి యువతిని ఉంచేందుకు ఆస్పత్రిలో రూమ్ కావాలని అడిగారు. ఆస్పత్రికి చేరుకున్న తర్వాత మద్యం మత్తులో ఉన్న యువతిని ఇద్దరు యువకులు బలవంతంగా ఆస్పత్రిలోకి తీసుకెళ్తున్నారని గమనించిన ఆస్పత్రి ముందు గల షాపింగ్ మాల్ సెక్యూరిటీ గార్డులు వారిని నిలదీశారు. దీంతో యువకులు, సెక్యూరిటీ గార్డుల మధ్య వాగ్వివాదం జరిగింది. సెక్యూరిటీ గార్డులు డయల్ 100కు ఫోన్ చేయడంతో యువతిని అక్కడే వదిలివేసి యువకులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఒకటో టౌన్ పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పారిపోతున్న నలుగురిలో ఇద్దరిని పట్టుకున్నారు. యువతిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు యువకులను తెల్లవారుజామున పట్టుకున్నారు. నిందితుల్లో శేఖర్‌తో పాటు అతని స్నేహితులు కోటగల్లికి చెందిన భానుప్రకాశ్, నవీన్, బస్టాండ్‌లో పనిచేసే కరీం ఉన్నారు. అడిషనల్ డీసీపీ ఉషావిశ్వనాథ్ యువతిని విచారించి వివరాలు సేకరించారు. బాధితురాలిని సఖీ కేంద్రానికి తరలించారు. -
పాలు పోయించుకుని పొమ్మన్నారు: జీతం అడిగితే పోలీస్ కేసు!
ఎడపల్లి (బోధన్): నెలల తరబడి పని చేసినందుకు జీతం అడిగితే.. ఓ యువకుడిపై సంబంధిత అధికారులు పోలీసు కేసు నమోదు చేయించారు. వివరాలను బాధితుడు బోధన్‌లోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియాతో మాట్లాడాడు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామానికి చెందిన కె.శివకుమార్ అనే విద్యార్థి గ్రామంలో ఉన్న విజయ డెయిరీ పాల కేంద్రంలో గత 20 నెలలుగా పనిచేశాడు. కొన్ని నెలలు సక్రమంగా జీతం చెల్లించిన అధికారులు ఆ తర్వాత వేతనాలు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. అంతేగాక తాను పనిచేసిన కాలంలో ప్రతి రోజు తాను డెయిరీకి పంపించిన పాలలో వెన్న శాతంలో కోత, పాల తూకంలో కోతలు విధిస్తూ ప్రతి నెల సుమారు రూ.ఐదువేల నష్టం చేకూర్చారని శివకుమార్ ఆరోపించారు. చదవండి: వాటికి వ్యతిరేకంగానే నా సినిమా: ఆర్.నారాయణమూర్తి డెయిరీ నుంచి వచ్చిన నష్టం నిజమేనని డెయిరీ సూపర్వైజర్లు కూడా ధృవీకరించారు. 11 నెలల కాలంలో వచ్చిన 55 వేల రూపాయలు నష్టం, 11 నెలల నెలసరి జీతం 55 వేల రూపాయలు తనకు డెయిరీ వారు చెల్లించాల్సి ఉందని శివకుమార్ తెలిపారు. దీంతో తాను రైతులకు రూ.37 వేలు బకాయి పడ్డానని ఆయన తెలిపారు. డెయిరీ అధికారులు తాను రైతులకు రూ.89 వేలు చెల్లించాల్సి ఉందని ఆరోపిస్తు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వాస్తవం లేదన్నారు. విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ నందకుమారి తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని శివకుమార్ ఆరోపించారు. ఈ విషయమై డీడీ నందకుమారి వైఖరిపై విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసినట్లు శివకుమార్ తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. చదవండి: ఫైవ్‌స్టార్ చాక్లెట్స్‌తో పాఠశాలకు ఆహ్వానం -
ఆకులో ఆకునై... ఈ అడవీ దాగిపోనా!
జీవనం కోసం తల్లిదండ్రులు పొలాలు అమ్ముకున్నారు.. జీవితంలో ఒడిదుడుకులను ఆత్మస్థైర్యంతో అధిగమించారు. తన మనసుకి నచ్చిన కేరళ అబ్బాయిని వివాహం చేసుకున్నారు. ప్రకృతిలో నివసించాలనుకున్నారు. రెండు సైకిళ్ల మీద ఈ దంపతులు తమ యాత్ర ప్రారంభించారు.. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట చేరుకుని, అక్కడ చిన్న కుటీరం నిర్మించుకుని, మనసుకి నచ్చిన పంటలు పండిస్తూ, రచనా వ్యాసంగం చేస్తున్న జయతి లోహితాక్ష్ తమ జీవనయాత్ర గురించి ఎన్నో విషయాలు వివరించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో పుట్టారు జయతి. తన ఎనిమిదేళ్ళ వయసులో వర్షాలు లేక కుటుంబం అప్పులపాలై, జీవనం కోసం కాశీబుగ్గ చేరారు. అక్కడ వరికోతలు, తూర్పార పట్టడం ఎన్నో చూశారు. ‘‘ఎన్ని చూసినా ఏదో దిగులు, ఒంటరిగా దాక్కునేదాన్ని. ఆటలంటే ఇష్టం ఉండేది కాదు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండేదాన్ని’’ అంటున్న జయతి కుటుంబం చేను అమ్మి అప్పులు తీర్చి, హైదరాబాద్ వచ్చేశారు. ఆరు వందలకు.. జీడిమెట్లలో ఒక కంపెనీలో ఆరు వందల జీతానికి చేరి, ఐదేళ్లు కష్టపడి పనిచేశాక, సంగారెడ్డి స్కూల్లో టీచరుగా పనిచేస్తున్న సమయంలో లోహి (లోహితాక్ష్)తో పరిచయమైంది. ‘‘ఇద్దరం కలిసి జీవించాలనుకుని, కడప జిల్లా మైదుకూరు చేరుకున్నాం. అక్కడి పిల్లలు, తల్లిదండ్రులు మమ్మల్ని బాగా ఇష్టపడ్డారు. మూడు సంవత్సరాలపాటు ‘భావన క్రియేటివ్ స్కూల్’ అని సొంత స్కూలు నడిపాం. ఫీజులు రాబట్ట లేక స్కూల్ మూసేశాం’’ అంటున్న జయతి లోహితాక్ష్, అక్కడున్న రోజుల్లోనే పీజీ పూర్తిచేశారు. అడవిలోనే హాయి... కడప నుంచి మళ్లీ హైదరాబాద్ వచ్చారు. తగినంత డబ్బు లేకుండా నగరంలో జీవించటం కంటె అడవిలో జీవించటం నయమనుకున్నారు. ‘‘నాకు అడవికి వెళ్లి, అక్కడ స్వచ్ఛంద సంస్థతో కాని, ప్రత్యేక అవసరాలున్న పిల్లలతో కాని పనిచెయ్యాలనే కోరిక కలిగి, అడవికి చేరుకున్నాం. పొద్దున్నే ఉడుతల్ని, పక్షుల్ని ఫొటోలు తీస్తూ, సాయంత్రం ట్యూషన్ చెప్పేదాన్ని. కొంతకాలం తరవాత ఛత్తీస్‌ఘడ్ వెళ్ళిపోయాం. అక్కడి పల్లెలు, కొండలు, అడవులు, పరవళ్లు తొక్కే నది, సాలవనం, పశువుల కాపర్లను ఫోటోలు తీసేదాన్ని. ఎంతోదూరం అడవి లో నడిచి కట్టెలు తెచ్చే మహిళలతో రోజంతా నడిచాను. కెమెరా పట్టుకొని ఒంటరిగా తిరగటం నాలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది’’ అంటున్న జయతి ఎక్కడా ఎక్కువకాలం ఉండలేకపోయారు. అడవి దగ్గరైంది.. ఏకాంతాన్ని ఇష్టపడే జయతికి అడవిలో ఉండాలనే కోరిక నిద్రపోనిచ్చేది కాదు. ‘‘మా అమ్మ నాతో, ‘ఎవరూ చేయని పని చెయ్యాలి. నిన్ను చూసి అందరూ ఇలా జీవించాలని అనుకోవాలి’ అన్న మాటలు నా మనసు మీద బాగా పనిచేశాయి. అడవికి వెళ్ళపోదామని అప్రయత్నంగా నా నోటి నుంచి వచ్చిన మాటలను లోహితాక్ష్ అంగీకరించాడు’’ అంటున్న జయతి లోహితాక్ష్ లు, సైకిల్ మీద ప్రయాణం ప్రారంభించాలనుకున్నాక, వస్తువులన్నీ అమ్మేశారు. 2017 జనవరి 26న సైకిల్ ప్రయాణం ప్రారంభించారు. ‘‘ఏ రాత్రి ఎక్కడ ఆగిపోతామో మాకు తెలియదు. అరవై రోజులు పులికాట్ సరస్సు దాకా ప్రయాణించాక, ఇబ్రహీంపట్నం రిజర్వ్ ఫారెస్టునానుకొని ఉన్న ఒంటరి బంగళాలో ఏడాదిన్నర ఉన్నాం’’ అంటున్న జయతి అక్కడ కూరగాయలు పండిస్తూ, నెలకి రెండు వేల రూపాయలతో జీవించటం అలవాటు చేసుకున్నారు. అప్పుడప్పుడు లోహితా„Š చేసిన కంటెంట్ రైటింగ్ ద్వారా వారి అవసరాలకి సరిపడా డబ్బు వచ్చేది. మళ్లీ ప్రయాణం.. ఇబ్రహీంపట్టణం నుంచి తూర్పుగోదావరి ధారపల్లి జలపాతం కింద అడవికి చేరుకుని, అక్కడ కుటీరం నిర్మించుకున్నారు. ‘‘అది గొడ్లపాక. పక్కనే నిత్యం ఏరు పారుతూ ఉంటుంది. తోట పెంచాం. పక్షులు, అడవి జంతువులు చేరేవి. పైకప్పులో పాము నివాసముండేది. అడవిలో కట్టెలు తెచ్చి, తోటలో కాసిన కూరగాయలతో వంట చేసుకున్నాం. ఎండకి, వానకి, చలికి ఆ కుటీరంలోనే ఉండిపోయాం’’ అంటున్న జయతి, లోహితా„Š లు స్వయంగా కుట్టుకున్న చెరి నాలుగు జతల బట్టలతో, కరెంటు లేకుండా రెండేళ్లు అక్కడే ఉన్నారు. కొన్నాళ్లకు కొండరెడ్లు వారిని వెళ్ళిపొమ్మనటం తో, కుటీరాన్ని వదిలేసి, అదే అడవిలో చలిలో కొండ మీద ఒక మహా వృక్షం కింద నెలరోజులు నివసించి, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట చేరుకుని, అక్కడే కుటీరం నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. 2021లో తూర్పుగోదావరి జిల్లా పల్లిపాలెం, మధునాపంతుల ఫౌండేషన్ వారు Bicycle diaries - Nature Connectednedd Bicycle journey is first book పుస్తకాన్ని ఆవిష్కరించారు. ‘అడవి పుస్తకం’ నా రెండవ రచన. ఉత్తమ సాహిత్యం చదవడం, రాయాలనిపిస్తే రాయడం, ఆకలేస్తే వండుకోవడం, తోట పెంచడం, కొద్దిసేపు ఖాళీగా ఉండటం... ఇదీ మా దినచర్య. – జయతి లోహితాక్ష్ జయతి దంపతులు నివసిస్తున్న కుటీరం -
బాబాయ్‌లను నమ్మించి.. చెరువులో తోసేసి.. ఆపై
బోధన్ టౌన్ (బోధన్): ఇరవై ఏళ్ల పగ ఇద్దరిని బలిగొంది. తన తండ్రిని హత్య చేశారనే అనుమానంతో ఓ యువకుడు ఇద్దరు చిన్నాన్నలను అంతమొందించాడు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు వివరాలను ఏసీపీ రామారావు, సీఐ రమణ్ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. బోధన్‌లోని రాకాసిపేట్కు చెందిన కాంబత్తి శంకర్, నర్సింహులు (32), శివ (27) అన్నదమ్ములు. ముగ్గురూ భవన నిర్మాణరంగ మేస్త్రీలే. ఇరవై ఏళ్ల క్రితం శంకర్ మృతి చెందగా, అతని కుమారుడు చిన్న వెంకటి అలియాస్ వెంకట్ చిన్నాన్నలతోనే ఉంటున్నాడు. తన తండ్రి మృతికి చిన్నాన్నలే కారణమని వెంకట్ కక్ష పెంచుకున్నాడు. అంతేకాకుండా చిన్నాన్నలు చులకనగా చూస్తున్నారని కుమిలిపోయేవాడు. 15 రోజుల క్రితం బైక్ విషయమై జరిగిన గొడవలో వెంకట్‌ను నర్సింహులు, శివ కొట్టగా వారిపై కక్ష పెంచుకున్నాడు. కల్లు, మద్యం తాగించి... వెంకట్ పథకం ప్రకారం సోమవారం చిన్నాన్నలిద్దరినీ కల్లు బట్టీకి తీసుకువెళ్లి కల్లు తాగించాడు. ఆపై మద్యం తాగుదామని చెప్పి వారిని బైక్‌పై బెల్లాల్ చెరువు అలుగు వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ వారికి అతిగా మద్యం తాగించాడు. అనంతరం శివను చెరువు వద్దకు తీసుకెళ్లి నీటిలోనికి నెట్టేశాడు. తర్వాత నర్సింహులు వద్దకు వచ్చి శివ బాబాయ్ చెరువునీటిలో పడిపోయాడని, వెళ్లి కాపాడదామని చెప్పి అతడిని కూడా నీటి వద్దకు తీసుకెళ్లాడు. తనకు ఈత రాదని నర్సింహులు అంటుండగానే, వెనుక నుంచి చెరువునీటిలోకి తోసేసి ఇంటికెళ్లిపోయాడు. చిన్నాన్నలు ఎక్కడని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా తెలియదని బదులిచ్చాడు. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వెంకట్‌పై అనుమానంతో అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. చదవండి: తిట్టారో... చచ్చారే... -
తల్లీకూతుళ్ల దారుణ హత్య.. అనుమానంతో భర్తే..
రుద్రూర్ (వర్ని): భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను హతమార్చాడు. తల్లికి మద్దతిస్తోందనే కారణంగా కూతుర్ని కూడా కడతేర్చాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. బోధన్ మండలం పెద్ద మావందికుర్దు గ్రామానికి చెందిన మల్లీశ్వరికి రుద్రూర్‌కు చెందిన బోజేడి గంగాధర్‌తో సుమారు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కూతురు రుత్విక ఉంది. కొన్నేళ్ల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న గంగాధర్ ఆమెను వేధించేవాడు. ఈ నేపథ్యంలో ఇటీవల పెద్దల సమక్షంలో నిర్వహించిన పంచాయితీలో కూతురు రుత్విక తల్లికి మద్దతుగా మాట్లాడింది. దీంతో తల్లీకూతుళ్లపై గంగాధర్ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున నిద్రిస్తున్న భార్య మల్లీశ్వరి (30), కూతురు రుత్విక (13)ను గొడ్డలితో నరి కి హత్య చేశాడు. ఇంటికి తాళం వేసి పోలీస్‌స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. బోధన్ ఏసీపీ రామారావు, రుద్రూర్ సీఐ అశోక్ రెడ్డి, ఎస్సై రవీందర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృ తురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు బోధన్ ఏసీపీ తెలిపారు. -
ఇందూరులో ‘తీవ్ర’ కలకలం
సాక్షి, నిజామాబాద్ అర్బన్: ‘ఉగ్ర కార్యకలాపాల’ వార్తతో ఇందూరు జిల్లా మరోమారు ఉలిక్కిపడింది. బోధన్ యువకుడి అరెస్టుతో ఒక్కసారిగా కలకలం రేగింది. జిల్లాలో గతంలోనూ ఉగ్రవాద మూలాలు బయటపడ్డాయి. కరుడుగట్టిన ఉగ్రవాదులు ఇక్కడ తలదాచుకున్న ఘటనలూ వెలుగు చూశాయి. ఉగ్రవాదులతో పాటు స్లీపర్‌సెల్స్ జిల్లాలో ఆశ్రయం పొందినట్లు, హైదరాబాద్ బాంబు పేలుళ్లకు పాల్పడిన వారిలో కొందరికి ఇక్కడి నుంచి సహకారం లభించినట్లు గతంలో బయటపడింది. ఇక, విదేశీయులకు అక్రమంగా పాస్‌పోర్టుల మంజూరు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందనే అనేమానంతో బోధన్‌లోని రెంజల్ బేస్‌కు చెందిన ఓ యువకుడ్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకున్న వార్త వెలుగులోకి రావడం కలవరపాటుకు గురిచేసింది. అనుమానితులకు అడ్డాగా..! జిల్లాలో ఉగ్ర కదలికలు ఉన్నట్లు గతంలోనే వెలుగు చూసింది. సమస్యాత్మక ప్రాంతాలను అడ్డాగా చేసుకుని స్లీపర్‌సెల్స్ పని చేస్తున్నట్లు నిఘా వర్గాలు అప్పట్లోనే గుర్తించాయి. కరుడు గట్టిన ఉగ్రవాది ఆజాం ఘోరిని జిల్లా పోలీసులు కాల్చి చంపారు. స్వచ్ఛంద సంస్థల పేరుతో తీవ్రవాద కార్యకలాపాలు విస్తరిస్తున్నారనే నెపంతో కొందరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. బోధన్‌లోని మూడు ప్రాంతాలతో పాటు ఎడపల్లిలోని ఓ ప్రాంతంలో ‘అనుమానితులు’ ఎక్కువగా ఉంటారని పోలీసులే అంతర్గతంగా చెబుతారు. అలాంటి వారి విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టకుండా పోలీసులకు అనేక ‘అడ్డంకులు’ ఎదురవుతున్నట్లు తెలిసింది. ఇదే నెపంతో కొన్నాళ్లుగా సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు పెద్దగా దృష్టి పెట్టట్లేదని సమాచారం. కీలకమైన కొన్ని ప్రాంతాల్లో నిఘా వైఫల్యం తరచూ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారనే విషయాలు పోలీసులకు తెలియడం లేదు. పోలీసులతోపాటు ఇంటెలిజెన్స్ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిఘా వైఫల్యం.. విదేశీయులకు అక్రమంగా పాస్‌పోర్టుల జారీ వ్యవహారమే జిల్లాలో నిఘా వైఫల్యానికి అతిపెద్ద నిదర్శనంగా నిలిచింది. ప్రధానంగా బోధన్‌తో పాటు మరికొన్ని వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా నిద్ర పోతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. రోహింగ్యాలకు పాస్‌పోర్టుల జారీ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఏకంగా 72 మంది రోహింగ్యాలకు పాస్‌పోర్టులు ఇచ్చేందుకు ఎస్బీ పోలీసులే క్లీన్చిట్ ఇవ్వడం వారి వైఫల్యానికి, నిర్లక్ష్యానికి పెద్ద ఉదాహరణ. నకిలీ ధ్రువపత్రాలతో కొందరు విదేశీయులు బోధన్ అడ్రస్ పేరుతో పాస్‌పోర్టులు పొంది బంగ్లాదేశ్‌కు వెళ్లి పోయారు. ఇదే తరహాలో ఇద్దరు విదేశాలకు వెళ్లేందుకు యత్నిస్తూ హైదరాబాద్ విమానాశ్రయంలో దొరికి పోవడంతో ఈ తతంగం బయటపడింది. తాజాగా బోధన్‌కు చెందిన యువకుడు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డాడనే అనుమానంతో హైదరాబాద్ నుంచి వచ్చిన కౌంటర్ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకోవడం కలవరానికి గురి చేసింది. ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక అధికారులు వచ్చి తమ ‘పని’ చక్కబెడుతుంటే, ఇక్కడే ఉండే నిఘా వర్గాలు మాత్రం అనుమానాస్పద కార్యకలాపాలను మాత్రం గుర్తించలేక పోతున్నాయి. ఇప్పటికైనా నిఘా వర్గాలు మేల్కొనపోతే కష్టమేననే భావన వ్యక్తమవుతోంది. అసాంఘిక శక్తులకు అడ్డాగా.. ►కరుడు గట్టిన ఉగ్రవాది ఆజాం ఘోరీ నిజామాబాద్‌లో తలదాచుకుంటూ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించాడు. ఇదే పని మీద జగిత్యాలకు వెళ్తుండగా, ఏప్రిల్ 6, 2000 సంవత్సరంలో నిజామాబాద్, కరీంనగర్ పోలీసులు కలిసి మట్టుబెట్టారు. ►సారంగపూర్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఓ ఉగ్రవాదిని పోలీసులు కాల్చి చంపారు. 2002లో సారంగపూర్‌లోని ఎస్టీడీ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్ హతమయ్యాడు. ►బోధన్‌లోని ఓ సైకిల్ షాప్ యజమానిని 1998లో ఆజాం ఘోరి, అతని అనుచరులు తొమ్మిది మంది కలిసి హత్య చేశారు. ఈ కేసులో ఏడుగురు అరెస్టు కాగా, మరో ఇద్దరి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఈ ఇద్దరు హైదరాబాద్ దిల్సుఖ్నగర్ బాంబుపేలుళ్లలో నిందితులకు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. ►నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులనే అనుమానంతో ముగ్గురిని నిజామాబాద్ కలెక్టరేట్ సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. ►ఇది జరిగిన కొన్నాళ్లకే నిజామాబాద్ రూరల్ మండలం గుండారంలో దేశ వ్యతిరేక నినాదాలతో కూడిన పేపర్లు ప్రత్యక్షమయ్యాయి. గాంధీజీ విగ్రహానికి నల్ల రంగు పూసిన దుండగులు.. కలెక్టరేట్ వద్ద అరెస్టు చేసిన వారిలో ఒకరిని విడుదల చేయాలంటూ పేపర్లలో రాయడం కలకలం రేపింది. -
‘బల్సిందా నీ.. ఊర్కో బే’ బోధన్ ఎమ్మెల్యే బూతు పురాణం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ బోధన్/ బాన్సువాడ: ‘బలిసిందా నీది.. ఊరుకో బే బాడ్ఖావ్.. ఏం మాట్లాడుతున్నావు..’ అంటూ నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమేర్ ఓ కిరాణా వ్యాపారిని బూతులు తిట్టడం వివాదాస్పదంగా మారింది. ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సరిగ్గా మాట్లాడండి’ అంటూ వ్యాపారి వారించినా వినకుండా ఎమ్మెల్యే ఆగ్రహంతో దూషణలకు దిగారు. డబ్బులు ఇచ్చానంటూ గద్దించారు. దీంతో మసీదు ఎక్కి ఆ మాట చెప్పాలని వ్యాపారి పేర్కొన్నారు. తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని, తాను మధ్యతరగతికి చెందిన వాడినని వాపోయారు. ఈ నేపథ్యంలోనే తనకు ఎమ్మెల్యే నుంచి రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని, లేదంటే ఎమ్మెల్యే నివాసం ఎదుట నిరాహార దీక్ష చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన మురళీధర్ అనే ఈ వ్యాపారి సోమవారం బోధన్ పోలీసులను ఆశ్రయించారు. ఇందుకు బోధన్ పోలీసులు నిరాకరించడంతో గురువారం బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని, తనకు ఎమ్మెల్యేతో ప్రాణ హాని ఉందని పేర్కొన్నారు. బాధితుడి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఎప్పుడో రంజాన్ తోఫా కిట్ల డబ్బులు.. 2018లో రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేదలకు సరుకులతో కూడిన తోఫా కిట్ల సరఫరాకు సంబంధించి వ్యాపారి మురళీధర్‌తో ఎమ్మెల్యే షకీల్ రూ.36 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో ఇప్పటివరకు రూ.12 లక్షలు చెల్లించారు. మిగిలిన రూ.24 లక్షలు 3 నెలల్లో ఇస్తామని చెప్పారు. కానీ ఈ డబ్బుల కోసం తాను పలుమార్లు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లినా స్పందించలేదని మురళీధర్ వాపోతున్నారు. అలాగే, 2019లో ఫుడ్ క్యాటరింగ్‌కు సంబంధించి మరో రూ.5 లక్షలు కూడా తనకు రావాలన్నారు. ఈ డబ్బుల కోసం పలుమార్లు హైదరాబాద్‌కు వెళ్లి అడిగినా.. ఎమ్మెల్యే దాటవేశారని తెలిపారు. చివరకు తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టడంతో, ఎమ్మెల్యే స్నేహితుడికి ఫోన్ చేసి తన బాధను వెళ్లగక్కానని, స్నేహితుడి ఫోన్ ద్వారా ఎమ్మెల్యే తనతో మాట్లాడారని వ్యాపారి తెలిపారు. బూతు మాటలతో తిట్టడంతో పాటు ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని చెప్పారన్నారు. తాను అప్పులు తెచ్చి సరుకులు సరఫరా చేశానని, తన వద్ద డబ్బులు లేక అవి తీర్చలేదని, వడ్డీ కూడా కట్టకపోవడంతో తన షాపు వేలం వేస్తున్నారని వాపోయారు. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు: ఎమ్మెల్యే తాను మురళీధర్‌కు పది పైసలు కూడా బాకీ లేనని, ఇదంతా తన రాజకీయ ప్రత్యర్థులు చేసిన కుట్ర అని షకీల్ అమేర్ సాక్షి ప్రతినిధితో అన్నారు. ప్రత్యర్థుల ప్రోద్బలంతోనే ఇలా చేస్తున్నారని చెప్పారు. అతనికి తానే లిఫ్ట్ ఇచ్చానని, ఇప్పుడు తననే బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. తాను 25 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది పేదలను ఆదుకున్నానని, తాను బాకీ ఉన్నానని అనడం తప్పు మాట అని అమేర్ పేర్కొన్నారు. -
వైరల్‌గా మారిన బోదన్ ఎమ్మెల్యే షకీల్ బూతు పూరాణం
-
ఆడియో కలకలం.. బోధన్ ఎమ్మెల్యే బూతు పురాణం
సాక్షి, నిజామాబాద్: బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఆడియో టేపు కలకలం రేపుతోంది. ఓ కిరాణా దుకాణం యజమానిని బూతులు తిడుతూ వేధిస్తున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రంజాన్ పండుగకు ఆర్డర్ ఇచ్చిన తోఫా ప్యాకెట్లకు సంబంధించిన డబ్బులు అడిగిన దుకాణం యజమానిపై ఎమ్మెల్యే బూతు పురాణం మొదలెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నాలుగేళ్ల క్రితం బోధన్ ఎమ్మెల్యే షకీల్ రంజాన్ పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన కిరాణా వ్యాపారి అయిన రుద్రంగి మురళీధర్‌కు 6వేల తోఫా ప్యాకెట్లను ఆర్డర్ చేశారు. ఒక్కోటి రూ.600 రూపాయల చొప్పున 6000 వేల ప్యాకెట్లకు ఆర్డర్ ఇవ్వగా.. ఎమ్మెల్యే 36లక్షలు రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో షకీల్ అడ్వాన్స్‌గా 12 లక్షల రూపాయలు చెల్లించి మిగిలిన మొత్తాన్ని తర్వాత ఇస్తానని చెప్పారు. 2019 ఎన్నికల్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా క్యాటరింగ్ నిమిత్తం మురళీధర్‌కు మరో 4 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఇలా ఎమ్మెల్యే షకీల్, కిరాణా వ్యాపారికి 30లక్షల రూపాయల వరకు బాకీ పడ్డారు. తన డబ్బులు ఇప్పించాలని మురళీధర్ రెండేళ్ల నుంచి ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నా ఆయన స్పందించడం లేదు. దీంతో బాధితుడు ఎమ్మెల్యే సన్నిహితుడి వద్ద బాధను చెప్పుకోగా ఆ వ్యక్తి ఎమ్మెల్యే షకీల్‌తో రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడించాడు. ఈ నేపథ్యంలోనే మురళీధర్‌పై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నీకు డబ్బులు ఇచ్చేది ఎక్కడిదిరా..’ అంటూ చెప్పుకోలేని రీతిలో దుర్భాషలాతుడూ కాల్ కట్ చేశారు. ఎమ్మెల్యే బూతు పురాణాన్ని సెల్ఫోన్లో రికార్డు చేసిన బాధితుడు మీడియా ఎదుట తన గోడు వెళ్లిబోసుకున్నాడు. బ్యాంక్ రుణం తీసుకుని షాపు పెట్టుకున్నానని, ఎమ్మెల్యే కారణంగా ఈఎంఐలు కట్టలేకపోవడంతో అధికారులు తన షాపును సీజ్ చేశారని మురళీధర్ తెలిపాడు. తనకు న్యాయం చేయాలని బోధన్ ఏసీపీని ఆశ్రయిస్తే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎమ్మెల్యే కారణంగా తన కుటుంబం రోడ్డున పడిందని, తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. చదవండి: వీఆర్ఓపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తిట్ల పురాణం! ఆడియో టేప్ లీక్: ఖుష్బూ క్షమాపణ -
‘కామారెడ్డిలో కాలిన శవం మిస్టరీ’ వీడింది
సాక్షి, బోధన్‌రూరల్(బోధన్): మండలంలోని కొప్పర్గ గ్రామంలో ఈ నెల 11న లభించిన కాలిన శవం మిస్టరీని బోధన్ పోలీసులు ఛేదించారు. ఈమేరకు పట్టణంలోని బోధన్ రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బోధన్ ఏసీపీ రామారావు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని బిలోలి తాలుక లాడ్క గ్రామానికి చెందిన అమృత్వార్ అశోక్‌ను, కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మల్లపూర్ గ్రామానికి చెందిన బాగవ్వ కూతురు అంజమ్మకు ఇచ్చి కొన్నేళ్ల క్రితం వివాహం చేశారు. ఇల్లరికంగా వచ్చిన అశోక్‌కు రెండు ఎకరాల వ్యవసాయ భూమి, ఇళ్లు అందజేశారు. కానీ అశోక్ పెళ్లి తర్వాత వ్యాసనాలు, జల్సాలకు అలవాటు పడి భూమిని అమ్ముకుని భార్య, కూతురును ఇబ్బందులను గురిచేశాడు. దీంతో వారి కుటుంబ కలహాల గురించి పలుమార్లు పెద్దలు అశోక్‌ను మందలించారు. అయినా అశోక్ తన పద్దతి మార్చుకోలేదు. ఈక్రమంలో అంజమ్మకు అన్న వరుసైన మహారాష్ట్రలోని బిలోలి తాలుక కార్లా గ్రామానికి చెందిన తొకల్‌వార్ పోచయ్య అశోక్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తన చెల్లెలు కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అశోక్‌ను హతమార్చాలని పోచయ్య పథకం వేశాడు. ఈక్రమంలో నిందితుడు పోచయ్య పథకం ప్రకారం అశోక్‌ను మద్యం తాగుదామని పిలిపించి బోధన్ మండలంలోని కొప్పర్గ శివారులోకి తీసుకువచ్చాడు. మద్యం తాగిచ్చి మద్యం మత్తులో ఉన్న అశోక్‌పై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పు అంటించాడని పోలీసులు పేర్కొన్నారు. ఫోన్ కాల్స్ డాటా ఆధారంగా ఈ హత్య కేసును చేధించినట్లు ఏసీపీ రామారావు తెలిపారు. చాకచక్యం వ్యవహరించి కేసు చేధించిన బోధన్ రూరల్ సీఐ రవీందర్ నాయక్, ఎస్సై సందీప్, కానిస్టేబుల్స్‌లు అనంద్ గౌడ్, సురేష్, జీవన్, హోంగార్డు సర్దార్లను ఏసీపీ రామారావు అభినందించి నగదు పురస్కారాన్ని అందజేశారు. సమావేశంలో బోధన్ రూరల్ సీఐ రవీందర్ నాయక్, ఎస్ఐ సందిప్, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు. -
రోజుకో మలుపు తిరుగుతున్న బోధన్ పాస్‌పోర్టుల కేసు
సాక్షి, హైదరాబాద్: బోధన్ పాస్‌పోర్టుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దేశానికి అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీయులు తప్పుడు చిరునామాలు, ధ్రువీకరణలతో పాస్‌పోర్టులు పొందడాన్ని కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. స్థానికుల సహకారంతో... ఇప్పటిదాకా మొత్తం 72 పాస్‌పోర్టులను విదేశీయులు తప్పుడు ఆధార్, ఇతర ఐడీ కార్డులతో పొందారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ప్రతీ పాస్‌పోర్టు క్లియరెన్స్‌కు స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) పోలీసులు రూ.పది వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. అయితే, ఇంత తక్కువ మొత్తానికే పాస్‌పోర్టుల జారీకి సహకరిస్తారా? అన్న అనుమానాలు పోలీసుశాఖలో తలెత్తుతున్నాయి. కచ్చితంగా దీని వెనక పెద్ద రాజకీయ నేతలే ఉండి ఉంటారని, వారి అభయం, ఒత్తిడి కారణంగానే ఎస్బీ పోలీసులు ఈ పనికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి కేసులు బోధన్ ప్రాంతంలో పాస్‌పోర్టుల జారీలో అక్రమాలు కొత్త విషయమేమీ కాదు. గతంలోనూ ఇక్కడ కొందరు రాజకీయ నాయకులపై ఇలాంటి కేసులు నమోదవడం గమనార్హం. అందుకే ప్రస్తుతం వెలుగుచూస్తోన్న దొంగపాస్‌పోర్టుల వ్యవహారంలోనూ పోలీసులు ఏమైనా రాజకీయ లింకులున్నాయా అని ఆరా తీస్తున్నట్లు సమాచారం. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన అబూసలేం పాస్‌పోర్ట్ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి జారీ అయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపింది. నకిలీ పత్రాలు సమర్పించి కర్నూలు జిల్లా నుంచి దొంగపాస్పోర్టు సంపాదించిన కేసులో అబూసలేంకు న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇక బోధన్ కేసు విషయానికి వస్తే సగానికి పైగా నిందితులు విదేశీయులు. వీరంతా దేశంలోకి అక్రమంగా ప్రవేశించారు. వీరందరిపై ఐపీసీ 420, 468, 471(ఫోర్జరీ), సెక్షన్ 14 ఫారినర్స్ యాక్ట్ 1946 (నకిలీ పత్రాలతో దొంగపాస్‌పోర్టులు పొందడం) ప్రకారం వీరికి ఏడేళ్ల కంటే అధికంగానే జైలు శిక్ష పడుతుందని సమాచారం. పాత నేరస్థులని తెలిసీ క్లియరెన్స్ ఈ కేసులో ఎస్బీ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ చేసే సమయంలో కనీస నిబంధనలు పాటించకుండా.. పూర్తిగా దరఖాస్తుదారుల పక్షం వహించడం చూసి దర్యాప్తు అధికారులే విస్తుపోతున్నారు. ఎనిమిది పాస్‌పోర్టులు ఏకంగా ప్రార్థనామందిరం చిరునామాతో ఉండటం చూసి దర్యాప్తు అధికారులు విస్మయం చెందినట్లు తెలిసింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పోలీసులు పట్టుకున్న బంగ్లాదేశీయుల్లో కొందరికి భారత్‌లో నేరచరిత్ర ఉంది. సాధారణంగా ఎస్బీ పోలీసులు పాస్‌పోర్టు విచారణ సమయంలో దరఖాస్తుదారుల వేలిముద్రలు తీసుకుంటారు. వాటిని ‘పాపిలాన్’ అనే అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌లో పోల్చి చూస్తారు. దేశవ్యాప్తంగా ఏమూలన నేరచరిత్ర ఉన్నా.. ఈ సాఫ్ట్‌వేర్‌లో కేవలం 10 సెకండ్లలో తెలిసిపోతుంది. అలాంటిది విదేశీయులు, పైగా పాత నేరస్థులు అని తెలిసినా... ఈ విషయాన్ని దాచిపెట్టి పాస్‌పోర్టులు పొందేందుకు సహకరించే సాహసం చేశారంటే.. తెరవెనక రాజకీయశక్తుల ఒత్తిడి తప్పక ఉండి ఉంటుందన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. చదవండి: అసలు సూత్రధారి గల్ఫ్ ఏజెంటే.. నిరూపిస్తే రాజీనామా చేస్తా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే -
బోధన్‌లో మళ్లీ అక్రమ పాస్‌పోర్టుల కలకలం
-
బోధన్‌లో మళ్లీ అక్రమ పాస్‌పోర్టుల కలకలం
సాక్షి, నిజామాబాద్ : బోధన్‌లో మళ్లీ అక్రమ పాస్‌పోర్టుల కలకలం మొదలైంది. బోధన్ పోస్టాఫీసుకు కొత్తగా మరో 80 నకిలీ పాస్‌పోర్టులు వచ్చాయి. షర్బత్ కెనాల్‌లోని నాలుగు ఇళ్ల అడ్రస్‌లపై ఈ పాస్‌పోర్టులు ఉన్నాయి. అవి తప్పుడు పాస్‌పోర్టులని గుర్తించిన పోస్టల్ సిబ్బంది డోర్‌లాక్ పేరుతో వాటిని వెనక్కు పంపేశారు. రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసు నుండి అవి వచ్చినట్లు తపాలా శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, బోధన్ కేంద్రంగా నకిలీ ఆధార్‌కార్డులను సృష్టించి ఇప్పటికే 72 మంది బంగ్లాదేశీయులు పొందిన సంగతి తెలిసిందే. పాస్‌పోర్టుల కుంభకోణంలో ఇప్పటికే 8 మంది అరెస్ట్ అయ్యారు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే మళ్లీ అవే అడ్రస్‌లకు నకిలీ పాస్‌పోర్టులు రావటంతో పోలీస్ శాఖలో టెన్షన్ మొదలైంది. చదవండి : దారుణం: ఎంగిలి పల్లెం విసిరాడని చిన్నాన్నను.. పోలీసులకు తలనొప్పిగా మారిన పందెం కోడి ! -
నిరూపిస్తే రాజీనామా చేస్తా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, నిజామాబాద్ : బోధన్‌లో రోహింగ్యాలు ఉన్నట్టు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని నిజామాబాద్ జిల్లా బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఛాలెంజ్ చేశారు. బోధన్‌లో బంగ్లాదేశ్ వాసులు కొందరు అక్రమ పత్రాలతో పాసు పోర్టులు పొందిన విషయంపై ఆయన మాట్లాడారు. ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని విమర్శించారు. ఒకే ఇంటి నంబర్ మీద 32కు పైగా పాసు పోర్టులు పొందుతుంటే కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నించారు. పాసుపోర్టుల అంశం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు.. ఎంపీ అరవింద్ కేంద్రంలోని బీజేపీకి చెందిన ఎంపీ కాబట్టి ఆయన కేంద్రంతో మాట్లాడి పాసుపోర్టు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
7 చిరునామాలతో 72 పాస్‌పోర్టులు!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన ముగ్గురు బంగ్లాదేశీయుల నుంచి స్వాధీనం చేసుకున్నవి నకిలీ పాస్‌పోర్టులు కావని, అసలైన పాస్‌పోర్టులనే వారు అక్రమ మార్గాల్లో పొందారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బోధన్ కేంద్రంగా మూడేళ్లపాటు సాగిన ఈ కుంభకోణంలో మొత్తం 72 మంది బంగ్లాదేశీయులు అడ్డదారిలో కేవలం 7 చిరునామాలతోనే పాస్‌పోర్టులు పొందినట్లు తేలిందన్నారు. వారిలో 19 మంది ఇప్పటికే విదేశాలకు పారిపోయారని వివరించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు పోలీసులు సహా మొత్తం 8 మందిని అరెస్టు చేశామని, ముగ్గురు పరారీలో ఉన్నారని సజ్జనార్ వివరించారు. ఆ అనుభవమే పెట్టుబడిగా... సీపీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం... బంగ్లాదేశ్‌కు చెందిన పరిమళ్ బెయిన్ 2013లో సముద్ర మార్గం ద్వారా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఉంటున్న జోబా అనే వ్యక్తి దగ్గర ఆశ్రయం పొందాడు. అక్కడే అక్రమంగా గుర్తింపు పత్రాలు, పాన్ కార్డు పొందాడు. బోధన్‌లో ఆయుర్వేద వైద్యశాల నిర్వహిస్తున్న బెంగాల్‌వాసి సమీర్ రాయ్ వద్దకు 2015లో వచ్చిన పరిమళ్.. వైద్యం నేర్చుకొని 2016లో సొంతంగా క్లినిక్ ఏర్పాటు చేశాడు. బోధన్‌లో ఉంటూనే నకిలీ గుర్తింపు కార్డులు పొందిన అతను పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అప్పట్లో స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సైగా ఉన్న పెరుక మల్లేశ్‌రావు నిర్లక్ష్యంగా వెరిఫికేషన్ చేయడంతో పరిమళ్‌కు పాస్‌పోర్టు జారీ అయింది. ఈ అనుభవంతోనే అక్రమంగా పాస్‌పోర్టులు పొందే దందాకు అతను శ్రీకారం చుట్టాడు. బతుకుదెరువు కోసం అడ్డదారుల్లో విదేశాలకు వెళ్లాలనుకొనే బంగ్లాదేశీయులకు తప్పుడు మార్గాల్లో పాస్‌పోర్టులు ఇప్పించే స్కాంకు పరిమళ్ తెరలేపాడు. తొలుత పుణేలోని ఓ కంపెనీలో పని చేసే తన సోదరుడు గోపాల్ బెయిన్‌కు ఏఎస్సై మల్లేశ్ సహకారంతో అక్రమంగా పాస్‌పోర్టు ఇప్పించాడు. ఆ తర్వాత 2019లో సమీర్, ఢిల్లీవాసి షానాజ్‌లతో జట్టుగా ఏర్పడ్డాడు. సమీర్ బంగ్లా జాతీయుల్ని అడ్డదారిలో సరిహద్దులు దాటించి భారత్‌కు తీసుకుకొచ్చే వ్యూహం అమలు చేయగా వారికి తప్పుడు చిరునామాలతో పాస్‌పోర్టులు ఇప్పించి విదేశాలకు వెళ్లడానికి టికెట్లను షానాజ్, సద్దాం హుస్సేన్ సమకూర్చేవారు. ఇరాక్‌లో పనిచేస్తున్న సమీర్ కుమారుడు మనోజ్ వీసాల ప్రాసెసింగ్‌కు పాల్పడేవాడు. ఈ దందాకు ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా ఉన్న మల్లేశ్‌రావు, ఏఎస్సై బి.అనిల్ కుమార్ సహకారం, అవినీతి ఉన్నాయి. ఇద్దరు పోలీసుల కీలకపాత్ర... ఈ గ్యాంగ్ సమకూర్చిన తప్పుడు చిరునామాలతో పాస్‌పోర్టులు పొంది దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన బంగ్లాదేశీయులు నితాయ్ దాస్, మహ్మద్ రానా మయ్, మహ్మద్ హసిబుర్ రెహ్మాన్ గత నెలాఖరులో శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. వారి విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలతో లోతుగా దర్యాప్తు చేసిన సైబరాబాద్ పోలీసులు కీలక విషయాలు సేకరించారు. బోధన్ కేంద్రంగా జరిగిన ఈ పాస్‌పోర్టుల కుంభకోణంలో నిందితులు కేవలం 5 ఫోన్ నంబర్లు, 7 చిరునామాలు వినియోగించారని గుర్తించారు. ఇలా జారీ అయిన 72 పాస్‌పోర్టుల్లో 42 వెరిఫికేషన్లను ఎస్సై మల్లేశ్, 30 వెరిఫికేషన్లను ఏఎస్సై అనిల్ చేశారు. అక్రమంగా పాస్‌పోర్టులు పొందిన 72 మంది బంగ్లాదేశీయుల్లో 12 మందికి బోధన్‌కు చెందిన మీ–సేవ కేంద్రం నిర్వాహకుడు మతీన్ అహ్మద్ మీర్జా అక్రమంగా ఆధార్ కార్డులు జారీ చేయించగా... మిగిలిన 60 మంది పశ్చిమ బెంగాల్లో వాటిని పొంది, ఇతడి ద్వారా చిరునామా మార్పు చేయించుకున్నారు. ఇలా పొందిన పాస్‌పోర్టులతో 19 మంది విదేశాలకు వెళ్లిపోగా... ముగ్గురు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. మిగిలిన 50 మంది ఆచూకీ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు... సమీర్, మనోజ్, సద్దాం హుస్సేన్ మినహా మిలిగిన వారిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం లుక్ ఔట్ సర్క్యులర్స్ జారీ చేస్తున్నారు. -
పాస్‌పోర్టు కేసులో పోలీసులు, విదేశీయుల అరెస్ట్
-
పాస్‌పోర్టు కేసులో పోలీసులు, విదేశీయుల అరెస్ట్
హైదరాబాద్: బోధన్ పాస్‌పోర్ట్ కేసులో విచారణ వేగవంతం చేసినట్లు పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఈ కేసులో భాగంగా ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరిలో ఇద్దరు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. నలుగురు బంగ్లాదేశీయులు, ఒకరు పశ్చిమబెంగాల్, ఒకరు ఏజెంట్, ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఒకే చిరునామాస్‌పై 32 పాస్‌పోర్టులు జారీ అవడం కలకలం రేపింది. దీనిలో ఇప్పటివరకు 72 పాస్ట్‌పోర్టులు గుర్తించినట్లు వివరించారు. హైదరాబాద్‌లోని కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఒకే చిరునామాపై భారీ సంఖ్యలో పాస్‌పోర్టులు ఉండడంపై ఇప్పటికే ఇమ్మిగ్రేషన్, రీజనల్ పాస్‌పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చినట్లు సజ్జనార్ తెలిపారు. ఎంతమంది దేశం దాటి వెళ్లారనేది విచారణ చేస్తున్నట్లు చెప్పారు. అధికారులు, స్థానికుల పాత్రపైనా కూడా విచారణ చేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే మిగతా వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ పొందారని, ఎంతమంది దేశం దాటి వెళ్లారు, ఎంతమంది పాస్‌పోర్టులు పొందారనేది విచారణ చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కస్టడీకి తీసుకొని విచారిస్తామని పేర్కొన్నారు. పాస్‌పోర్ట్ పరిశీలనలో లోపాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. దోషులు ఎవరైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. చదవండి: అసలు సూత్రధారి గల్ఫ్ ఏజెంటే.. -
అసలు సూత్రధారి గల్ఫ్ ఏజెంటే..
సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశీయులకు పాస్‌పోర్టు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత రెండు, తర్వాత 32 పాస్‌పోర్టులు అనుకున్నప్పటికీ ఈ విషయంలో కూపీ లాగిన కొద్దీ అక్రమంగా జారీ అయిన పాస్‌పోర్టుల సంఖ్య పెరుగుతూనే ఉందని సమాచారం.. ఈ పాస్‌పోర్టులతో ఎవరైనా ఇప్పటికే దేశం దాటారా? అన్న విషయంపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఇమిగ్రేషన్ అధికారులతో కలసి బోధన్‌లో ఒకే ఇంటి నంబరు నుంచి జారీ అయిన పాస్‌పోర్టుల నంబర్లతో విచారణ చేస్తున్నారు. మొత్తం వ్యవహారానికి సూత్రధారి స్థానిక గల్ఫ్ ఏజెంటేనని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. స్థానిక మీసేవ కేంద్రం నిర్వాహకుడి సాయంతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి వాటితో విదేశీయులతో పాస్‌పోర్టుకు దరఖాస్తులు చేయించినట్లు సమాచారం. తనకున్న పరిచయాలతోనే ఒకే చిరునామా నుంచి 32 మందికిపైగా విదేశీయులకు అక్రమ పద్ధతిలో పాస్‌పోర్టులు వచ్చేలా చేశాడు. ఇప్పుడు ఈ సంఖ్య మరింత అధికంగా ఉందన్న ప్రచారం ఊపందుకోవడంతో ఇంకా ఎన్ని పాస్‌పోర్టులు ఒకే ఇంటి నంబరు నుంచి వచ్చాయన్న దానిపై చిక్కుముడి వీడాల్సి ఉంది. మరింత లోతుగా దర్యాప్తు..! ఈ మొత్తం వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అధికారులకు అనేక కొత్త విషయాలు తెలిశాయి. తొలుత కేవలం రెండు పాస్‌పోర్టులే అనుకున్నా పోలీసులు మరింత కూపీలాగారు. మొత్తంగా 32కిపైగా పాస్‌పోర్టులు రెంజల్ కాలనీలోని ఒకే చిరునామా నుంచి జారీ అయ్యాయని తెలిసి అధికారులు అవాక్కయ్యారు. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగిందన్న ప్రచారం స్పెషల్ బ్రాంచ్ పోలీసుల విచారణలో అనేక లోపాలను ఎత్తిచూపుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన స్పెషల్ బ్రాంచ్ ఎస్సై, ఏఎస్సైలను ఇప్పటికే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. విదేశీయులకు పాస్‌పోర్టుల వ్యవహారంలో ఈ ఇద్దరు పోలీసులేనా..? ఇంకా ఇతర పోలీసు అధికారులెవరైనా సహకరించారా? ఒకే ఇంటిపై పదుల సంఖ్యలో పాస్‌పోర్టు దరఖాస్తులు వస్తున్నా ఎందుకు అనుమానించలేదు? దీని వెనక ఇంకా ఎవరైనా హస్తముందా? అన్న విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. -
ఇన్స్పైర్ చేశారు...!
జక్రాన్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, శాస్త్రీయ విజ్ఞానాన్ని వెలికి తీసేందుకు ఇన్స్పైర్ మనక్ పేరుతో కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా ఏటా పోటీలను నిర్వహిస్తోంది. ఇన్స్పైర్ మనక్‌పై ఈసారి హెచ్ఎంలు, ఉపాధ్యాయులు మనసు పెట్టారు. జిల్లా చరిత్రలో అత్యధికంగా ప్రాజెక్టులు నామినేషన్లకు ఎంపిక చేయబడ్డాయి. దరఖాస్తు ప్రక్రియలో విద్యార్థులకు ఉపాధ్యాయులు తగిన తోడ్పాటు ద్వారా ఈ ప్రగతి సాధ్యమైంది. విద్యార్థుల ఎంపిక.. కరోనా మహమ్మారి విస్తృతంగా ఉన్న సమయంలో డీఈవో, జిల్లా సైన్స్ అధికారి పాఠశాల హెచ్ఎంలతో సమావేశం ఏర్పాటు చేసి ఇన్‌సై్పర్ మనక్ కో సం ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఆయా హెచ్ఎంలు పాఠశాలల్లో సైన్స్ ఉపాధ్యాయుల సహకారంతో ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించారు. 2020– 2021కు గాను సంబంధించి జిల్లాలో 287పాఠశాలల నుంచి 680 నామినేషన్లు (ఐడియాస్)పంపగా 133 మంది విద్యార్థుల ఐడియాస్‌ను ఎంపిక చేశారు. అత్యధికంగా నిజామాబాద్ నార్త్, సౌత్, రూరల్ మండలాల నుంచి 22 నామినేషన్లు ఎంపిక చేశారు. బోధన్ మండలంలో 13, డిచ్పల్లి 16, ఆర్మూర్ 16, వేల్పూర్ 8, భీంగల్ 7, బాల్కొండ నుంచి 6 నామినేషన్లు ఎంపికయ్యాయి. కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి ఎంపిక చేసిన విద్యార్థుల ఖాతాల్లో గత వారం రోజుల నుంచి రూ.10 వేల నగదును జమ చేస్తున్నది. త్వరలో పోటీల నిర్వహణ జిల్లాలో నూతన సంవత్సరంలో జనవరి నెలలో ఇన్స్పైర్ పోటీలు నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. కానీ కరోనా కారణంగా ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తోంది. విద్యార్థులకు అందించిన రూ.10వేలలో రూ.5వేలు ప్రాజెక్ట్ తయారి కోసం, మరో రూ.5వేలు ప్రయాణ ఖర్చులకు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆన్లైన్లో పోటీలు నిర్వహించే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు తయారీకి రూ.10వేల వరకు వెచ్చించే సౌకర్యం లభించనుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు.. ఇన్స్పైర్ మనక్ క్రింద మూడు దశలలో ఎంపిక ఉంటుంది. ఎంపికైన నామినేషన్లు జిల్లా స్థాయిలో మొదటగా ప్రదర్శించాలి. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటితే రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో విద్యార్థులకు రూ.40వేలు చెల్లిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే జాతీయస్థాయికి ఎంపిక చేస్తారు. జాతీయస్థాయిలో ఎంపికైతే రాష్ట్రపతి ద్వారా అవార్డుతో పాటు రూ.60వేలు చెల్లిస్తారు. ఎంపికవ్వడం సంతోషంగా ఉంది.. ఇన్స్పైర్ మనక్ కోసం నేను తయారు చేసిన సోలార్ ప్యానల్ ద్వారా హైడ్రోజన్ ఇందన తయారీ ప్రాజెక్టు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. మా సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీధర్ సార్ సహకారంతో ప్రాజెక్టును తయారు చేశాను. రాష్ట్ర స్థాయిలో నా ప్రాజెక్టు ఎంపిక కావడమే నా ఏకైక లక్ష్యం. – శ్రీజ, విద్యారి్థని, జెడ్పీహెచ్ఎస్, అంక్సాపూర్ శాస్త్ర సాంకేతికత పెరుగుతోంది.. ఇన్‌సై్పర్ మనక్ వల్ల విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతికతను పెంపొందిస్తుంది. విద్యార్థుల చేత సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రజల యొక్క జీవితాలను సులభతరం చేసే యంత్రాలను, వస్తువును మెరుగుపరిచే విధంగా కొత్తదాన్ని ఆవిష్కరించే లేదా సృష్టించే విధంగా సొంత ఆలోచనలను పొందపరిచి స్వీకరించే పోటీయే ఇన్స్పైర్ అవార్డు మనక్. వేల్పూర్ మండలంలో 8 ప్రాజెక్టులు ఎంపికయ్యాయని తెలిపారు. – వనాజారెడ్డి, ఎంఈవో, వేల్పూర్ నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలు.. సమాజంలో ముందుగా మూఢ విశ్వాసాలను విడనా డాలి. విద్యార్థులు శాస్త్రబద్దంగా ఆలోచించి సమస్యలకు పరిష్కారమార్గాలను కనుగొనాలి. ట్రెడిషనల్ ప్రాక్టీసెస్‌కు తోడు ఆధునిక శాస్త్రీతయను జోడించి ఎ ప్పటికప్పుడు ఫలితాలను రాబట్టే దిశగా మనం ఆలోచించాలి. నేటి బాలలు రేపటి శాస్త్రవేత్తలుగా ఎదగాల్సిన అవసరం ఉంది. వివిధ రంగాల్లో ఎదురవుతున్న సమస్యలకు ఎప్పటికప్పుడు శాస్త్రీయంగా ఆలోచించి పరిష్కరించుకోవచ్చు. – గంగా కిషన్, జిల్లా సైన్స్ అధికారి -
చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన పెళ్లికొడుకు
సాక్షి, బోధన్‌టౌన్(బోధన్): వధూవరులు ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు.. అయితే పీటల మీదికొచ్చేసరికి పెళ్లికొడుకు ట్విస్ట్ ఇచ్చాడు.. పెళ్లి ససేమిరా వద్దన్నాడు.. దీంతో పెళ్లి నిలిచిపోయింది. ఈ సంఘటన శుక్రవారం బోధన్ పట్టణ కేంద్రంలో జరిగింది. బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్ కాలనీకి చెందిన యువకుడికి రాకాసీపేట్‌కు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో ఇరువురికి వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. శుక్రవారం ఉదయం ఇరు కుటుంబాలతో పాటు బంధువులు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు చర్చికి చేరుకున్నారు. చదవండి: వధువుకు కరోనా: అయినా పెళ్లి ఆగలేదు చర్చిలో ఫాదర్ మాట్లాడుతూ నీకు అబ్బాయి ఇష్టమా అని అడగగా అమ్మాయి ఇష్టమే అని తెలిపింది. కాని అక్కడే అబ్బాయి మొహం చాటేశాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేది లేదని చెప్పడంతో పెళ్లికూతురు, ఆమె తరపు బంధువులు, పెళ్లి కొడుకు తరపు బంధువులు అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పెళ్లికూతురు తరపు పెద్దలకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పెళ్లి నిరాకరణపై ఇరువర్గాల వారు పెళ్లికొడుకును ఎంత సముదాయించినా, మందలించినా ఎలాంటి సమాధానం రాకపోయేసరికి చివరికి పెళ్లిపెద్దలు మాట్లాడుకుని వివాహం క్యాన్సిల్ చేసుకుని ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. -
సెల్ఫీ మోజులో ముగ్గురు యువతుల మృతి
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలోని ఎడపల్లి మండలం అలీసాగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు అలీసాగర్ రిజర్వాయర్‌లో పడి ముగ్గురు యువతులు మృతి చెందారు. సెల్ఫి దిగుతూ ఒకరి వెంట మరొకరు నీళ్ళల్లో పడిపోయి మృత్యువాత పడ్డారు. ఒకరిని కాపాడబోయి మరొకరు నీళ్ళల్లో పడిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానాకుల ద్వారా తెలుస్తోంది. మృతులు బోధన్ పట్టణం రాకాసిపేట్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బోధన్‌లోని ఓ వార్డు కౌన్సిలర్ అన్నయ్య కూతుర్లు జుబెరా (16), మశేరా (14), మీరాజ్ (12)గా తెలిసింది. ఈ విషాద ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా 16 ఏళ్లలోపు వారే కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు విలపిస్తున్నారు. ఈ ఘటనలో రాకాసిపేట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. గుంటూరు కొల్లిపర మండలం పిడపర్తి పాలెం లో విషాదం చోటుచేసుకుంది. పశువులు కడగడానికి కాలువలోకి దిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. యువకుల కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. -
అత్యాశకు పోయి అడ్డంగా బుక్కైన సీఐ
సాక్షి, నిజామాబాద్ : ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ బోధన్ పట్టణ సీఐ, కానిస్టేబుల్ అడ్డంగా బుక్కయ్యారు. సీఐ పల్లె రాకేష్, కానిస్టేబుల్ గజేంద్రలు ఓ భూవివాదంలో రూ. 50 వేలు, ఓ బైకు, రూ.లక్షకు పైగా విలువల చేసే ఫోన్‌ను లంచంగా తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కారు. సాజిద్ అనే వ్యక్తి నుంచి ఈ లంచాన్ని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న ఏసీబీ అధికారులు..మాటు వేసి సీఐ పల్లె రాకేష్ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కానిస్టేబుల్ గజేంద్ర ద్వారా సీఐ లంచం తెప్పించుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగిని పై దాడి
-
కాంట్రాక్ట్ ఉద్యోగిని రోజాపై దాడి
సాక్షి, కామారెడ్డి : మున్సిపల్ కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగినిపై సహ ఉద్యోగి దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. కార్యాలయంలో కార్యాలయంలో విధులు నిర్వహించే కాంట్రాక్టు మహిళా ఉద్యోగిని రోజాపై బోధన్ సీనియర్ అసిస్టెంట్ దాడికి ఒడిగట్టాడు. గతంలో రామకృష్ణ కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పని చేశాడు. ఆ సమయంలో రోజా జూనియర్ అసిస్టెంట్ అయిన రామకృష్ణ కింద పని చేసేవారు. గత ఏడాది రామకృష్ణ పదోన్నతిపై బోధన్ మున్సిపల్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్‌గా బదిలీపై వెళ్ళాడు. బదిలీపై వెళ్లిన నుంచి తరచుగా రామకృష్ణ రోజాకు ఫోన్ చేసి మాట్లాడేవాడని తెలిసింది. గత నెల రోజులుగా రామకృష్ణ ఫోన్ చేసిన రోజా స్పందించకపోవడంతో ఆవేశానికి గురైన రామకృష్ణ సోమవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రోజాపై దాడి చేశాడు. (బయటపడుతున్న రెవెన్యూ లీలలు!) అంతేకాకుండా అక్కడ ఉన్న వస్తువులన్నీ ధ్వంసం చేశాడు. ఈ దాడిలో రోజా ముక్కుకు తీవ్ర గాయం అయింది. వెంటనే రోజాను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణ పై కామారెడ్డి పోలీస్ స్టేషన్లో రోజా ఫిర్యాదు చేయగా పోలీసులు రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతను దాడి చేసే దృశ్యాలు స్థానికులు ఫోన్లో రికార్డు చేశారు. అతని తీరుపై మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బోధన్ ఏఈ సస్పెన్షన్, కలెక్టర్ ఉత్తర్వులు జారీ
సాక్షి, బోధన్(బోధన్): బోధన్ పట్టణంలోని పాండుఫారం శివారులో నూతనంగా నిర్మించిన తెలంగాణ బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడిన ఏఈ నాగేశ్వర్‌రావ్‌ను నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి సస్పెండ్ చేశారు. గురువారం తెలంగాణ బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల కాంప్లెక్స్‌ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. చేపట్టిన పనులకు మెజర్మెంట్ బుక్‌లో రికార్డు చేసిన పనులకు మధ్య వ్యత్యాసాన్ని పరిశీలించి గుర్తించారు. రికార్డులను నమోదు చేసిన తెలంగాణ రాష్ట్ర ఈడబ్ల్యూఐడీసీ నిజామాబాద్ డివిజన్‌కు చెందిన ఏఈ ఎన్. నాగేశ్వర్‌రావ్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా ఆ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తిచేసిన పనులకు సంబంధించిన కొలతల్లో భారీగా వ్యత్యాసం చూపుతూ రికార్డులు నమోదు చేయడం, అధికారులను తప్పుదోడ పట్టించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈని సస్సెండ్ చేసి విచారణకు ఆదేశాలు జారీచేశారు. అధికారులు తమకు కేటాయించిన విధుల పట్ల బాధ్యతాయుతంగా ఉంటూ అధికారుల ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. -
బోధన్ స్కాంలో మళ్లీ కదలిక
సాక్షి, హైదరాబాద్: వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు చిల్లుపెట్టిన బోధన్ వాణిజ్య పన్నుల స్కాంలో తిరిగి కదలిక మొదలైంది. ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేసే విషయంలో సీఐడీ అధికారులు ముందడుగు వేసినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ ఖజా నాకు గండికొట్టిన రూ.300 కోట్ల వాణిజ్య పన్నుల నకిలీ డాక్యుమెంట్ల ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ సీఐడీ అధికారులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ స్కాంలో సూత్రధారి శివరాజు ఒక సంస్థ కోసం తీసిన చలానాను పలు సంస్థల పేరిట చూపించినట్లుగా రికార్డులు రాసి, సదరు మొత్తాన్ని జేబులో వేసుకున్నారు. ఫలితంగా వాణిజ్య శాఖకు తీవ్రనష్టం వాటిల్లిం ది. కేసు దర్యాప్తులో కీలకంగా ఉన్న పలు చలానాలు, అనుమానాస్పద పత్రాలు, డాక్యుమెంట్ల ఫిజికల్ వెరిఫికేషన్ మొదలైతే త్వరలోనే చార్జిషీటు సిద్ధమవుతుందని సమాచారం. ఈ వ్యవహా రంపై పలు ఫిర్యాదులు రావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ విచారణలో ప్రధాన నిందితుడు శివరాజ్, అతని కుమారుడు, మరికొందరు అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించింది. 2010 నుంచి 2016 వరకు సాగిన వీరి అక్రమాల ఫలితంగా వాణిజ్య శాఖకు, ప్రభుత్వ ఖ జానాకు రూ.300 కోట్ల నష్టం వాటిల్లినట్లు నివేదిక సమర్పించిం ది. కేసు సీఐడీకి బదిలీ అయ్యాక తండ్రీకుమారులిద్దరూ అరెస్టయ్యారు. స్వాధీనమైన చలానాలు, కంప్యూటర్లు, హార్డ్‌డిస్కుల ను ఇప్పటికే సైబర్ నిపుణులు విశ్లేషించారు కూడా. చాలా కాలం తరువాత ఇప్పుడు అనుమానాస్పద పత్రాల ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైంది. వాస్తవానికి ఆలస్యంగా మొదలైనా.. ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన శాస్త్రీయ ఆధారాలకు ఇది కీలకం కానుం ది. పత్రాల పరిశీలన పూర్తికాగానే చార్జిషీటు వేస్తారని సమాచారం. ఈ కేసులో తీవ్ర జాప్యం జరిగిందని సీఐడీపై విమర్శలు వస్తున్న క్రమంలో కేసులో కదలిక రావడం గమనార్హం. -
వివాహానికి నిరాకరించారని..
నిజామాబాద్‌అర్బన్/ఎడపల్లి: ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోవడం లేదని మనస్తాపం చెందిన ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఒకరు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బోధన్ పట్టణానికి చెందిన నవనీత (19) డిగ్రీ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటోంది. అయితే, ఆమె పాఠశాలలో చదువుకునే సమయంలో తనతో పాటే చదివే మోహన్ (20)తో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. మోహన్ కుటుంబం జీవనోపాధి కోసం చాలా రోజుల క్రితమే వలస వెళ్లింది. అయినప్పటికీ వారిద్దరూ తరచూ కలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారు ప్రేమ వివాహం చేసుకోవాలని ఇంట్లో వారికి చెప్పగా కుటుంబాలకు చెందిన పెద్దలు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన నవనీత, మోహన్ ఆదివారం అలీసాగర్ ఉద్యాన వనానికి చేరుకుని, కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగారు. గమనించిన స్థానికులు పోలీసుల సాయంతో వారిరువురినీ నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించగా, నవనీత అప్పటికే మృతి చెందింది. మోహన్ పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర విభాగంలో వైద్య చికిత్స అందిస్తున్నారు. -
సొసైటీ ఛైర్మన్ పదవి కోసం కొట్టుకున్న టీఆర్ఎస్,కాంగ్రెస్
-
పురపోరు: ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి
సాక్షి, నిజామాబాద్ : బోధన్‌లోని టీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ ఇమ్రాన్ షరీఫ్‌కు కాంగ్రెస్ అభ్యర్ధి మీర్ ఇలియాజ్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 32వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారని ఇరువర్గాలు పరస్పరం దాడికి దిగారు. వీరిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో ఆగ్రహం చెందిన కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాజ్.. టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్ ముక్కు కొరికేశాడు. బాధితుని ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ అభ్యర్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మహ్మద్ ఇమ్రాన్ షరీఫ్‌ను స్థానిక ఎమ్మెల్యే షకీల్ పరామర్శించారు.(ముగిసిన మున్సిపల్ పోలింగ్) -
రసవత్తరం..బోధన్ రాజకీయం
సాక్షి, బోధన్: మున్సిపల్ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అడుగులు వేస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వ్యుహప్రతివ్యూహాలతో ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ కోణంలోనే ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశాయి. ఓటర్ల ఆశీస్సులను పొందేందుకు అనుసరించాల్సిన ప్రచార వ్యుహాన్ని అభ్యర్థులకు ప్రధాన రాజకీయ పార్టీలు దిశా నిర్దేశం చేస్తున్నాయి. అభ్యర్థులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, వార్డు అబివృద్ధి పాటుపడతామని, సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తామని ఓటర్లకు హామీలను ఇస్తున్నారు. వార్డుల్లో మద్దతుదారులతో అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. బోధన్ మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులుండగా, ఇందులో 19వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి ఖమరున్నీసా బేగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 37 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు చైర్మన్ పీఠం దక్కించుకునే వ్యూహంతో పోటాపోటీగా ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేసి ఎన్నికల బరిలో నిలిపాయి. టీఆర్ఎస్ 37 వార్డులు, బీజేపీ 21 వార్డులు, కాంగ్రెస్ 35 వార్డులు, ఎంఐఎం 19, సీపీఎం, టీడీపీలు ఒకటి చొప్పున వార్డుల్లో పోటీ చేస్తుండగా, 37 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. పలువార్డులు ప్రధాన రాజకీయ పార్టీల గెలుపు ఓటములపై స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం కనిపిస్తోంది. వ్యూహాత్మకంగా పార్టీల ప్రచారం టీఆర్ఎస్ అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఓటర్లకు వివరిస్తున్నారు. బీజేపీ అభ్యర్థులు కేంద్రంలో నరేంద్రమోదీ అమలు చేస్తున్న సుపరిపాలన, జాతీయ స్థాయి అంశాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తుండగా, కాంగ్రెస్ గతంలో తమ హయాంలో మున్సిపల్ పాలక వర్గంలో చేపట్టిన పట్టణాభివృద్ధి పనులను ప్రస్తావిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను పూర్తి చేయడంలో వైఫల్యాలను, స్థానిక సమస్యల పరిష్కారంపై అధికారపక్ష నిర్లక్ష్యం వైఖరిని వివరిస్తున్నారు. ఎంఐఎం సైలెంట్‌గా వార్డుల్లో ప్రచారానికి పదును పెట్టింది. పార్టీలు వార్డుల్లో అనుకూల, ప్రతికూల ఓటర్ల లెక్కలను వేస్తున్నాయి. కుల సంఘాలు, యువత, మహిళ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల యువనాయకులను తమ వైపు తిప్పుకునేందుకు తెరవెనుక రాజకీయాలు నడుపుతున్నాయి. ప్రముఖ నేతలను రప్పించే యత్నాలు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారానికి ప్రధాన రాజకీయ పార్టీలు తమ పార్టీ ప్రముఖ ప్రజాప్రతినిధులు, నాయకులను రప్పించేందుకు యత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు ఈ నెల 20న టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ శనివారం ప్రచారం చేశారు. బీజేపీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి రానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి వార్డుల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. -
యువతిపై పెద్దనాన్న కొడుకే అఘాయిత్యం
బోధన్‌టౌన్: సోదరి అవుతుందన్న విషయం మరిచి చిన్నాన్న కూతురిపైనే కన్నేశాడో కీచకుడు. మిత్రుడితో కలసి రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భవతి కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బీటీ నగర్‌కు చెందిన యువతి (19) దివ్యాంగురాలు. పదో తరగతి చదివిన ఆమె ఇంటి వద్దే ఉంటోంది. అదే ప్రాంతంలో నివాసముంటున్న ఆ యువతి పెద్దనాన్న కుమారుడు నవీన్ మాయమాటలు చెప్పి లోబరచుకున్నాడు. మిత్రుడు రవితో కలసి రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో ఆమె నోరు విప్పలేదు. ఈ క్రమంలో ఆమెలో శారీరక మార్పులు గమనించిన తల్లి దండ్రులు ఏం జరిగిందని ఆరా తీయగా విషయం తెలిసింది. బాధితురాలు ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. అయితే, ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు కుల పెద్దలను ఆశ్రయించగా వారు ఈ విషయాన్ని బయటకు రాకుండా యత్నించారు. దీంతో బాధితులు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీని కలసి జరిగిన విషయం చెప్పారు. దీంతో ఆమె వారిని వెంట బెట్టుకుని శనివారం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. -
నలుగురి ఆత్మహత్యాయత్నం
సాక్షి, నిజామాబాద్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించిన ఘటన సోమవారం బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట చోటుచేసుకొంది. పెట్రోల్ బాటిళ్ళతో ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. తమ పంట పొలానికి వెళ్లే దారిని కబ్జా చేసి గేటు పెట్టారని ఆర్డీవోకు ఆందోళనకారులు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఆర్డీవో గోపిరామ్... పొలానికి వెళ్లే దారిని చూపాలని ఈ మేరకు తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. -
ఆరేళ్ల చిన్నారిపై బాలుడి లైంగికదాడి
రెంజల్ (బోధన్): ఆరేళ్ల చిన్నారిపై పదిహేనేళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం బాలిక తన ఇంటి ముందు ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన బాలుడు ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి జరిపాడు. సాయంత్రం కూలి పనుల నుంచి ఇంటికి వచ్చిన తల్లి బాలిక స్పృహలో లేకపోవడంతో ఆందోళనకు గురైంది. కొద్దిసేపటికి స్పృహలోకొచ్చిన బాలిక జరిగిన విషయం తల్లికి తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
బోధన్ బల్దియాలో ఇష్టారాజ్యం
బోధన్ పట్టణానికి చెందిన యువకుడు కడిగె శివకుమార్ పట్టణంలోని 23 వార్డులో ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఎన్ని ఉన్నాయో వివరాలు ఇవ్వాలని 2017 నవంబర్ 20న బల్దియా అధికారులకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడు. బల్దియాకు చెందిన అప్పిలేట్ అధికారులు కోరిన సమాచారం అందించకుండా తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు. ఆ యువకుడు రాష్ట్ర కమిషన్‌ను అశ్రయించగా, పూర్తి వివరాలతో హాజరు కావాలని నోటీసులు జారి చేసింది. సాక్షి, బోధన్(నిజామాబాద్) : సమాచార హక్కు చట్టం అంటే.. బోధన్ బల్దియా అధికారులకు బేఖాతరైంది. ఇక్కడ ఈ చట్టం అభాసు పాలవుతోంది. స్థానికులు పట్టణ అభివృద్ధి వివరాలు కోరితే స్పందించక పోవడంతో పాటు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు. దీంతో సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషన్ ఎదుట బల్దియా అధికారులు హాజరు కావాల్సివస్తోంది. బోధన్ పురపాలక సంఘానికి 2019 జనవరి నుంచి అక్టోబర్ వరకు సమాచార హక్కుచట్టం కింద 111 దరఖాస్తులు అందాయి. వీటిలో అధికారులు 82 దరఖాస్తులకు సమాచారాన్ని అందించారు. ఇంకా 29 దరఖాస్తులకు సమాచారం అందించాల్సి ఉంది. అయితే అధికారుల తీరులో మార్పు రావడం లేదు. మచ్చుకు కొన్ని దరఖాస్తులను పరిశీలిస్తే.. బోధన్ పట్టణానికి చెందిన కిరణ్ అనే యువకుడు బోధన్ బల్దియా పరిధిలోని వార్డుల్లో ఉన్న ఇండ్లకు సంబంధించిన ఆస్తిపన్ను వసూళ్లు, కుళాయి పన్ను వసూళ్ల వివరాలు అందించాలని 2018 డిసెంబర్ 14న న దరఖాస్తు చేశాడు. అయితే అధికారులు తప్పుడు సమాచారాన్ని అందించారు. బోధన్ బల్దియాకు కేంద్రం నిధులు ఎన్ని మంజూరు అయ్యాయి, ఎన్ని నిధులు వెచ్చించారు. ఈ నిధులతో పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు అడిగి ఏడాది అవుతున్నా సంబందిత దరఖాస్తు దారుకు ఇంకా బల్దియా అధికారులు సమాచారం అందించలేక పోయారు. బోధన్ బల్దియాలో 2017 సంవత్సరంలో నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు వార్డుకు రూ.లక్ష చొప్పున వెచ్చించి తాగునీటి అవసరాలు తీర్చారు. వాటి వివరాలు ఇవ్వాలని కోరిన వ్యక్తికి ఇప్పటి వరకు సమాచార హక్కు చట్టం అప్పిలేట్ అధికారి సమాచారం అందివ్వలేదు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న వివరాలకు సమాచారం అందించాలని చట్టం చెబుతున్నా బల్దియా అధికారులు మాత్రం స్పందించకుండా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బల్దియాకు మూడు నోటీసులు సమాచారం హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన వారికి తప్పుడు సమాచారం అందించినందుకు, సమాచారం ఇవ్వకుండా జాప్యం చేస్తున్న కారణంగా ఇప్పటి వరకు బల్దియా కమిషనర్‌కు 3 నోటీసులు అందాయి. సమాచార హక్కు చట్టం కింద అడిగిన వివరాలతో కమిషనర్ ఎదుట హాజరు కావాలని అందిన నోటీసుల్లో పేర్కొన్నారు. అయినా బల్దియా అధికారులు మాత్రం అవేవి తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బల్దియా కౌన్సెల్ ఉన్నప్పుడు ప్రతి పక్ష కౌన్సిలర్లతో పాటు అధికార పార్టీ కౌన్సిలర్లు అభివృద్ధి పనులకు సంబంధించి, బల్దియాకు మంజూరు అయిన నిధుల వివరాలు ఇవ్వాలని సహ చట్టం కింద దరఖాస్తు చేస్తే అధికారులు నెలల తరబడి సమాచారం అందించని ఘటనలు ఉన్నాయి. దీంతో కౌన్సిలర్లు కౌన్సెల్ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. మా పరిధిలో ఉన్న సమాచారం ఇస్తున్నాం.. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు దారులు అడిగిన సమాచారాన్ని మా పరిధిలో ఉన్నంత వరకు అందిస్తున్నాము. పరిధిలో లేని అంశాల రికార్డులు లేక పోవడంతో సమాచారం అందించడంలో జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు మాకు వచ్చిన దరఖాస్తుల్లో 80 శాతం వరకు సమాచారాన్ని అందించాము. – స్వామినాయక్, మున్సిపల్ కమిషనర్ -
మహిళ కేకలు వేయడంతో పట్టుబడిన దొంగలు
సాక్షి, నిజామాబాద్ : మహిళ మెడలోని పుస్తెల తాడును దొంగిలించాలని చూసిన ఇద్దరు దొంగలు ఆమె కేకలు వేయడంతో పోలీసులకు దొరికిపోయారు. జిల్లాలోని బోధన్ డివిజన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. అంతకుముందు మంగళవారం బోధన్‌లోని నాయీ బ్రాహ్మణ వీధిలో ఇంటి బయట నిల్చున్న మహిళ మెడలో గొలుసు తెంపడానికి ప్రయత్నించారు. కానీ, మహిళ అప్రమత్తంగా ఉండడంతో వీరి ప్లాన్ బెడిసికొట్టింది. బుధవారం ఎడవల్లిలో మాత్రం వారి ప్లాన్ సక్సెస్ అయ్యింది. వెంటనే మహిళ కేకలు వేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమందించారు. స్పందించిన పోలీసులు దొంగలను వెంబడించి సినీ ఫక్కీలో వారిని పట్టుకున్నారు. విచారణ అనంతరం బుధవారం సాయంత్రం పోలీస్ కమిషనర్ సమక్షంలో మీడియా ముందు ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. -
చోరీకి యత్నించి.. పట్టుబడి!
సాక్షి, బోధన్(నిజామాబాద్) : రెండు చోట్ల చైన్‌స్నాచింగ్‌కు పాల్పడి పారిపోతుండగా, స్థానికులు వెంటబడడంతో ఒక దొంగ నాటకీయంగా చిక్కాడు. మరొకడు తప్పించుకుని పరారయ్యాడు. అసలేం జరిగిందంటే.. బోధన్‌లోని నాయీబ్రాహ్మణ కాలనీకి చెందిన సావిత్రి మంగళవారం మధ్యాహ్నం ఇంటి ఎదుట నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మంగళ సూత్రాన్ని లాక్కెళ్లేందుకు యత్నించారు. అప్రమత్తమైన సావిత్రి గొలుసును గట్టిగా పట్టుకోవడంతో దొంగల చేతికి ఒక పుస్తే, రెండు గుండ్లు మాత్రమే చిక్కాయి. దీంతో దొంగలు బైక్‌పై వేగంగా అక్కడి నుంచి వెళ్లి పోయారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోధన్‌లో చోరీకి యత్నించి విఫలమైన దొంగలు ఎడపల్లిలో స్నాచింగ్ చేయాలని భావించారు. మాజీ సర్పంచ్ జనగం పుష్ప మిగులు అన్నాన్ని బయటకు పారేసి ఇంట్లోకి వెళ్తుండగా, దొంగలు ఆమె మెడలోని గొలుసును లాక్కొని నిజామాబాద్ వైపు పరారయ్యారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న యువకులు, ప్రజాప్రతినిధులు పోగయ్యారు. దొంగలను పట్టుకునేందుకు కార్లు, బైకులపై బయల్దేరారు. ఈ క్రమంలో జానకంపేట, నెహ్రూనగర్ ఎంపీటీసీ ఇమ్రాన్‌ఖాన్‌కు ఫోన్ చేసి, బైక్‌పై వస్తున్న వారిని అడ్డుకోవాలని కోరారు. దీంతో ఆయన కొంత మందిని జమ చేసి రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారు. వారిని గమనించిన దొంగలు తమ బైక్‌ను బోధన్ వైపు మళ్లించారు. అయితే, అప్పటికే ఎడపల్లి నుంచి వస్తున్న నేతలు ఎల్లయ్య యాదవ్, సుభాష్ అలీసాగర్ ఎత్తిపోతల పథకం వద్ద రోడ్డుపై కారును అడ్డంగా పెట్టగా, దొంగలు కారును ఢీకొని కింది పడిపోయారు. దొంగలను పట్టుకునేందుకు యత్నించగా ఒకరు చిక్కగా, మరొకరు పరారయ్యారు. ఎడపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని దొంగతో పాటు బైక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడ్ని బోధన్ ఠాణాకు తరలించి విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రెండు చోట్ల కేసులు నమోదు చేసినట్లు బోధన్ టౌన్, రూరల్ సీఐలు రాకేశ్, షాకీర్ తెలిపారు. -
పార్టీ మార్పుపై ఎమ్మెల్యే షకీల్ వివరణ
సాక్షి, నిజామాబాద్: తాను టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. పార్టీ మార్పుపై వస్తున్నదంతా తప్పుడు ప్రచారమంటూ కొట్టిపారేశారు. తెలంగాణలో తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆయన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో భేటీ అయ్యారు. వీరి భేటీ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. షకీల్ త్వరలోనే బీజేపీలో చేరతారని వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయనపై వస్తున్న ప్రచారంపై సోషల్ మీడియా వేదికగా షకీల్ స్పందించారు. ‘నాపై వస్తున్న వార్తలు అవాస్తవం. నేను టీఆర్ఎస్లోనే కొనసాగుతా. నాకు మంత్రిపదవి రానందుకు అసంతృప్తి ఉందనే ప్రచారం కూడా సరైంది కాదు. వ్యక్తిగత పనిమీద అరవింద్‌ను కలిశాను. నేను బీజేపీలో కానీ కాంగ్రెస్‌లో కానీ చేరను, ఆ ఆలోచనలే లేవు. నాకు సీఎం కేసీఆర్ న్యాయం చేస్తారని పూర్తి విశ్వాసం ఉంది. 12 ఏళ్ళుగా కేసీఆర్‌తో కలిసి నడుస్తున్నాం. జీవితాంతం ఇదేవిధంగా ఉంటాం. సమయం వచ్చినప్పుడు, దేవుడు కరుణించినప్పుడు అవకాశాలు అవే వస్తాయి’ అంటూ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. కాగా తెలంగాణ కేబినెట్ విస్తరణ తర్వాత రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్లో మొదలైన అలకలు, అసంతృప్తుల పర్వం మొదలైన విషయం తెలిసిందే. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో గులాబీ బాస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారంత బీజేపీలో చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అలక! చదవండి: కమలదళం వలస బలం! -
కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం
సాక్షి, బోధన్: మద్యం మత్తులో తొమ్మిదేళ్ల కూతురుపై కన్న తండ్రి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల కూతురిని ఇంట్లో ఉంచి తల్లి సోమవారం కూలి పనికి వెళ్లింది. సాయంత్రం సమయంలో మద్యం తాగి వచ్చిన తండ్రి షాదుల్ ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి కూలి పని ముగించుకుని రాత్రికి ఇంటికి వచ్చే సరికి కూతురు ఏడుస్తూ కనిపించింది. ఏం జరిగిందని ఆరా తీయగా బాలిక జరిగిన విషయం తల్లికి చెప్పింది. దీంతో తల్లి బోధన్ రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
మంచి కండక్టర్!
సాక్షి, బోధన్ : బస్సులో మరిచిపోయిన రూ.25 వేల క్యాష్ బ్యాగును కండక్టర్ తిరిగి ప్రయాణికుడికి ఇచ్చి మంచితనం చాటుకున్నాడు. బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ25వై.0018) శనివారం ఉదయం వరంగల్ వెళ్లి తిరిగి నిజామాబాద్ మీదుగా రాత్రి 8 గంటలకు బోధన్‌కు చేరుకుంది. బోధన్ పట్టణం ఆచన్‌పల్లి ప్రాంతానికి చెందిన నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ నీరడి గంగా శంకర్ నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ఎక్కారు. లెదర్ బ్యాగును బస్సులోనే మరిచిపోయి బోధన్‌లో బస్సు దిగి వెళ్లిపోయాడు. గమనించిన కండక్టర్ రాజ్‌కుమార్ లెదర్బ్యాగును డిపో సెక్యూరిటీ కానిస్టేబుల్స్‌కు అప్పగించారు. బ్యాగును తెరిచి చూడగా అందులో రూ. 25 వేల నగదు, మెడిసిన్స్, మెడికల్ రిపోర్టులు ఉన్నాయి. దీంతో డీఎం రమణకు సమాచారం అందించారు. మంచితనం చాటుకున్న కండక్టర్ రాజ్‌కుమార్, డ్రైవర్రాజును డిపో అధికారులు అభినందించారు. -
నవీపేట మేకల సంతలో కోట్లల్లో క్రయవిక్రయాలు
నవీపేట(బోధన్): మండల కేంద్రంలో శనివారం జరిగిన వారాంతపు మేకల సంతలో క్రయవిక్రయాలు భారీగా జరిగాయి. రూ.కోటిన్నరకు పైగా లావాదేవీలు జరిగినట్లు సమాచారం. జిల్లాకేంద్రంలో ఆదివారం జరుగనున్న ఊర పండగ సంబరాలతో పాటు వన భోజనాల సందడితో మేకల సంతలో క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఊర పండగకు ఆనవాయితీగా అమ్మవారికి మేకలను బలిఇవ్వడంతో అమ్మవారి భక్తులు మేకల కొనుగోళ్లు జరిపారు. గ్రామాలలో వన(విందు) భోజనాలకు మాంసాహారాన్ని భుజించడంతో మేకలకు మరింత గిరాకీ పెరిగింది. నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, కామారెడ్డి సరిహద్దు జిల్లాల నుంచి వచ్చిన కొనుగోలుదారులు అధిక ధరలు చూసి వాపోయారు. మనుపటికంటే అధిక ధరలకు విక్రయించడంతో విస్తుపోయారు. అవసరం నిమిత్తం కొనుగోలు చేయక తప్పలేదు. సీజన్‌ను గమనించిన మహారాష్ట్రలోని ధర్మాబాద్, పర్బణి, ముత్ఖేడ్, జాల్నాలతో పాటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలోని వ్యాపారులు ఒకరోజు ముందుగానే నవీపేటకు వచ్చి విక్రయాలు జరిపారు. -
జీవన స్థితిగతులకు అనుగుణంగా కులాల మార్పు
సాక్షి, బోధన్: రాష్ట్రంలో తమను బీసీ కులాల్లోకి తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వినతులను పరిగణంలోకి తీసుకుని ప్రజల జీవన స్థితిగతులకు అనుగుణంగా కులాల మార్పు చేయడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు అన్నారు. కుళ్లె కడిగి కులస్తులు తమను బీసీ కులాల్లోకి తీసుకోవాలని రాష్ట్రం ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో శుక్రవారం బోధన్ మండలంలోని తగ్గెల్లి, పెంటా కుర్దు గ్రామాల్లో తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు పర్యటించి కుళ్లెకడిగె కులస్తుల స్థితిగతులను పరిశీలించారు. వారి జీవన విధా నం, వారు నిర్వహిస్తున్న వృత్తులు, ఆర్థిక పరిస్థితు లు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ 2009 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్ల ప్రక్రియ ఆగిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఈ కమిషన్లనను పునరుద్ధరించినందున కులాల ను మార్చాలని, బీసీ కులాల్లోకి తమను తీసుకోవాలని కోరే ప్రజల నుంచి విజ్ఞప్తులు, దరఖాస్తు లు తీసుకుని వారికి న్యాయం చేయ్యడానికి బీసీ కమిషన్ కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పర్యటించి వారికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 70 కులాలకు చెందిన ప్రజల జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటామన్నారు. ఇందులో భాగంగా 20 కులాల నుంచి విజ్ఞప్తులు అందయని వారి జీవన స్థితిగతులు తెలుసుకునేందుకు మొదటి విడతలో ఆయా కులాలను తమ కార్యాలయానికి పిలిపించి వివరాలు సేకరించామని, రెండో దశలో వారికి సంబంధించిన సమాచారం సేకరించామని, మూ డో దశలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యక్షంగా ప రిశీలన చేస్తున్నామని అందులో భాగంగా బోధన్ మండలంలోని పెంటాకుర్దు, తగ్గెల్లి గ్రామాల్లో కుల్లె కడిగి కులస్తుల వివరాలు, వారి జీవన శైలి పరిశీలించి వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరించామన్నారు. ప్రభుత్వం, బీసీ కమిషన్ పూర్తి పరిశీలన అనంతరం వారిని ఏ కులం, ఏ కేటగిరిలో చేర్చా లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో గోపిరాం, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి శంకర్, డిప్యూటీ తహసీల్దార్ ము జీబ్, ఆర్.సాయిలు, సీఐ షకీల్ అలీ, ఎస్సై యా కుబ్, కుల్లె కడిగి కులస్తుల పెద్దలు, గ్రామపెద్దలు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. జీవన, అర్థిక స్థితిగతుల పరిశీలన వర్ని(బాన్సువాడ): చిట్టెపు కులస్తుల జీవన, అర్థిక పరిస్థితులపై మండలంలోని జాకోరా గ్రామంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మెన్ బి.ఎస్.రాములు అధ్యయనం చేశారు. గతంలో తమను బీసీ జాబితాలో చేర్చి జీవన స్థితిగతులను మెరుగు పర్చాలని చిట్టెపు కులస్థులు పలుమార్లు వినతిపత్రాలు అందచేశారు. ఈ నేపథ్యంలోలో తొలుత గ్రామ పంచాయతీ వద్ద చిట్టెపు కులస్థులతో బీసీ కమిషన్ చైర్మెన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇళ్లకు వెళ్లి జీవన విధానం, ఆర్థిక పరిస్థితులను పరిశీలించారు. కుటుంబ సభ్యుల వివరాలు, చేస్తున్న వృత్తి, వస్తున్న ఆదాయం వివరాలు తెల్సుకున్నారు. పిల్లలను చదివించాలని సూచించారు. చిన్నప్పుడు తాను బీడీలు చు ట్టానని చైర్మన్ చెప్పడం విశేషం. అనంతరం ఆ యన మాట్లాడుతూ చిట్టెపు కులానికి చెందిన కు టుంబాలకు విద్యా, సంక్షేమ పథకాలలో ఎలాం టి ఫలితం ఉండడం లేదని, బీసీ జాబితాలో చే ర్చాలని వినతిపత్రాలు ఇచ్చిన నేపద్యంలో క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నామని అన్నారు. త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందచేస్తామని పేర్కొన్నారు. చైర్మన్ వెంట బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి శంకర్, బోధన్ ఆర్డీవో గోపిరాం, తహసీల్దార్ నా రాయణ, వీఆర్వో అశోక్, చిట్టెపు కుల సంఘం జిల్లా కార్యదర్శి నాందేవ్, జాకోరా సర్పంచ్ గోదావరిగణేష్, మాజీ ఎంపీటీసీ కలాల్గిరి ఉన్నారు. కలెక్టర్, సీపీలకు అభినందన ఇందూరు(నిజామాబాద్ అర్బన్): పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దఎత్తున అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ సమర్ధవంతంగా పనిపూర్తి చేసినందు కు కలెక్టర్ రామ్మోహన్రావు, సీపీ కార్తికేయను రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు అభినందించారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారిరువురు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. తమను బీసీ కులంలోకి మార్చాలని కోరిన ప్రజల జీవన స్థితిగతులకు అనుగుణం గా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నా రు. జిల్లాకు సంబంధించి విషయాలపై ఇరువు రు కొద్దిసేపు చర్చించారు. జిల్లాలో వరుసగా జ రిగిన పలు ఎన్నికలను విజయవం తంగా నిర్వహించినందుకు కలెక్టర్, సీపీలను అభినందించారు. ముఖ్యంగా ఇరువురినీ అభినందించా రు. గెస్ట్‌హౌస్‌లో పలు కులాలకు చెందిన సభ్యుల నుంచి విన్నపాలు స్వీకరిచారు. -
బోధన్‌లో దారుణం
సాక్షి, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్తతో పాటు అత్త, మరిది కలిసి ఆరు నెలల గర్భవతిపైన కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో బాధితురాలు సీతాలు తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. రాకాసిపేట్‌లో నివసిస్తోన్న గైని ప్రశాంత్, సీతాలు భార్యాభర్తలు. పెళ్లి అయిన నెల వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. కల్యాణ లక్ష్మీ చెక్కు వచ్చాక ఇష్టం లేని పెళ్లి చేశారని సీతాలుకు అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. కుట్రలో భాగంగానే ఆమెను అంతమొందించేందుకు ఈ ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించిన అనంతరం అత్త, భర్త పరారయ్యారు. బోధన్ పోలీస్‌స్టేషన్‌లో బాధితులు జరిగిన సంఘటన గురించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బోధన్‌లో మున్సిపల్ కాంట్రాక్టర్ల ఆందోళన
-
క్రికెట్ బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేదని..
సాక్షి, నిజమాబాద్ : ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్తో గొడవ తలెత్తి ఓ యువకుడిని బంధించిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్‌లో కలకలం రేపింది. బోధన్‌కు చెందిన యువకులు, రెంజల్ మండలం కందకుర్తి చెందిన యువకులు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ కాశారు. ఈ బెట్టింగ్‌లో కందకుర్తి గ్రామానికి చెందిన యువకులు ఓడిపోయారు. డబ్బు కోసం బోధన్ యువకులు కందకుర్తికి వెళ్లారు. అక్కడే ఇరువర్గాల మధ్య గొడవ తలెత్తింది. దీంతో స్థానికులు వీరిని అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత కందకుర్తికి చెందిన యువకుడు పనిపై బోధన్ వెళ్లాడు. అప్పుడే కందకుర్తి యువకుడిని బోధన్ యువకులు బంధించారు. డబ్బులు ఇవ్వమని యువకుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భయందోళనకు చెందిన యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు బోధన్ యువకులు, ఇద్దరు కందకుర్తి యువకులను అదుపులోకి తీసుకున్నారు. -
డబ్బులు ఎందుకు ఇవ్వాలని అడిగినందుకే..
సాక్షి, నిజామాబాద్ : పెట్రోలింగ్‌లో ప్రభుత్వ ఉద్యోగిపై పోలీసులు దాడికి పాల్పడటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుద్రూరులో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాలు మేరకు...దుర్గా ప్రసాద్ వ్యక్తి బాన్సువాడ మండలం కోయగుట్ట గురుకుల పాఠశాలలో అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో విధులు ముగించుకుని వెళ్తున్న సమయంలో రుద్రూరు సమీపంలోని రైస్‌మిల్లు వద్ద పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో తమకు ఎదురుపడిన దుర్గాప్రసాద్‌ను డబ్బులు ఇవ్వాల్సిందిగా పోలీసులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తాను డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ పోలీసులను ప్రశ్నించాడు. దీంతో కోపోద్రిక్తులైన పోలీసులు దుర్గాప్రసాద్ పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లి బూటు కాళ్లతో తన్నారు. అనంతరం బోధన్ ఏరియా ఆస్పత్రిలో చేర్పించి వెళ్లిపోయారు. ఈ విషయంపై సీపీ ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. దాడి చేసిన వారిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అతడు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై స్పందించిన పోలీసులు బాధితుడు తాగి పడిపోవడంతోనే గాయాలపాలయ్యాడని పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
పిచ్చికుక్కల స్వైరవిహారం
సాక్షి, రెంజల్(బోధన్): మండలంలోని బాగేపల్లి గ్రా మంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు, పాలకుటు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పది, పన్నెండు రోజులుగా పిచ్చికుక్కలు పశువులపై దాడులు చేసి గాయపరుస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. వాటి భయానికి ఇంట్లో నుంచి రాత్రిపూట బ యటకు వచ్చేందుకు జనాలు జంకుతున్నారు. రా త్రి సమయంలో పశువుల పాకల్లో కట్టెసిన పశువు లపై దాడులు చేస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. బర్రెలను తలుగులకు కట్టేసి ఉంచడంతో అవి ఎదురు తిరగలేని పరిస్థితి ఉంటుందన్నారు. గురువారం రాత్రి టీఆర్ఎస్ నాయకుడు సాయిబాబగౌడ్‌కు చెందిన పశువుల పాకలోని రెండు గేదెలపై పిచ్చికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. శుక్రవారం పశువుల పాకను శుభ్రం చేసేందుకు వెళ్లగా గేదెలు అపస్మారకస్థితిలో ఉన్న ట్లు గుర్తించారు. అప్పటికే ఓ గేదె మృత్యువాత ప డినట్లు గుర్తించారు. ఇప్పటికే అనేక పశువులను పిచ్చికుక్కలు దాడి చేశా యని గ్రామస్తులు వాపోతున్నారు. పంచాయతీ పాలకవర్గం సభ్యులకు, అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని బా ధిత రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పం దించి గ్రామంలో రాత్రిపూట సంచరిస్తున్న పిచ్చి కుక్కలను సంహరించాలని కోరుతున్నారు. -
హున్సలో పిడిగుద్దులాట
బోధన్‌రూరల్: హోలీ పండగను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్స గ్రామంలో గురువారం పిడిగుద్దులాట ఉత్కంఠగా సాగింది. ముందుగా గ్రామ శివారులో కుస్తీ పోటీలను నిర్వహించారు. హనుమాన్ మందిరం ఎదురుగా ఖాళీ ప్రదేశంలో పిడిగుద్దులాటకు వేదికను సిద్ధం చేశారు. 5 ఫీట్ల ఎత్తుతో ఉన్న బలమైన కర్రలను నిలిపి పొడువైన తాడును కట్టారు. కుస్తీ పోటీల అనంతరం పిడిగుద్దులాట ప్రక్రియను ప్రారంభించారు. డప్పు వాయిద్యాలతో గౌరవ సూచికంగా గ్రామ పెద్దలను వేదిక వద్దకు తీసుకువచ్చారు. అప్పటికే తాడుకు ఇరువైపులా గ్రామస్తులు రెండు వర్గాలుగా చీలిపోయి మోహరించి ఉన్నారు. పిడిగుద్దులాట కోసం ఏర్పాటు చేసిన తాడును ఎడమ చేయితో పట్టుకుని కుడి చేయి పిడికిలి బిగించి ఇరువర్గాలు కొట్టుకున్నాయి. ఆట ముగిసినట్టు గ్రామ పెద్దలు ప్రకటించిన వెంటనే గ్రామస్తులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. -
హామీల అమలులో టీఆర్ఎస్ విఫలం: పి. సుదర్శన్ రెడ్డి
సాక్షి, బోధన్‌రూరల్: గత ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలను ఇచ్చిన టీఆర్ఎస్ అధికారంలో రాగానే వాటిని అమలు చేయడంతో విఫలమైందని మాజీ మంత్రి, బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండంలోని చెక్కి క్యాంప్, పెంటాకుర్దూ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పార్టీ అధికారంలోకి మేనిఫేస్టోలో ఉన్నవిఅన్ని అమలు చేస్తామన్నారు. టీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ గంగాశంకర్, మండలాధ్యక్షులు నాగేశ్వర్రావ్, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తాం బోధన్‌టౌన్ : విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కాంగ్రెస్ ఎల్లవేళల కృషి చేస్తుందని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. పట్టణ శివారులోని ఏఆర్ గార్డెన్లో విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి మాజీ మంత్రి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విశ్వబ్రాహ్మణులు అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం టీఆర్ఎస్ పిరికి పందచర్య అన్నారు. ఈ సమ్మేళనంలో విశ్వబ్రాహ్మణుల సంఘం జిల్లా అధ్యక్షులు రమణాచారీ, సభా«ధ్యక్షులు హరికాంత్ చారీ, ఓబీసీ రాష్ట్ర కన్వీనర్ దోసపల్లి నరహారి నాయకులు కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి, అమర్‌నాథ్‌బాబు, గోపాల్‌రెడ్డి, హన్మంత్‌రావ్, మహమూద్, విశ్వబ్రాహ్మణ సంఘం వివిధ మండలాల అధ్యక్షులు భూమాచారీ, ప్రసాద్, మల్లెపూల రవి, గంగాధర్‌చారీ, చంద్రశేఖర్ చారీ, సత్యం చారీ, మురారి, జనార్ధన్‌చారీ ఉన్నారు. ఎడపల్లి : కుర్నాపల్లి, మండల కేంద్రంలో పి.సుదర్శన్‌రెడ్డి ప్రధాన వీదుల గుండా రోడ్‌షో నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టపాకాయలు పేల్చి సుదర్శన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికారు. రెంజల్ : టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా చేస్తుందని సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బాగేపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ మేనిఫెస్టోలోని çహామీలను నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు. -
నిజామాబాద్: తలోదారిలో కామ్రెడ్స్
ప్రజా సమస్యలపై పోరాటంలో ముందుండే కమ్యూనిస్టుపార్టీలకు జిల్లాలో మంచి పట్టుండేది. చెప్పుకోదగ్గ స్థాయిలో కార్యకర్తలతో పాటు అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. కానీ, ఏ ఎన్నికల్లోనూ ఎర్రజెండా ఎగరలేదు. చాలా చోట్ల పోటీ చేసినా ఎక్కడా విజయం సాధించలేదు. పార్టీలు, నేతల మధ్య సిద్ధాంత విభేదాలు, ఆధిపత్య పోరే అందుక కారణం. సాక్షి, బోధన్: జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు, విప్లవ పార్టీలకు ఘనమైన చరిత్రే ఉంది. దశాబ్దాల క్రితం నుంచి పార్టీ నిర్మాణం చేపట్టి, ప్రజా సమస్యలపై క్రియాశీలకంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. పార్టీ అనుబంధ సంఘాల నేతృత్వంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల కార్మికులను సంఘటితం చేసి, వారి సమస్యలపై నిరంతరం పోరాడుతున్నాయి. విద్యార్థి, యువత, మహిళా, అసంఘటిత రంగ కార్మికులు, రైతాంగ సమస్యలపై నిరంతరం గళమెత్తుతూనే ఉన్నాయి. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు తలోదారిలో వెళ్తుండడంతో కామ్రేడ్లు అధికారం దక్కించుకోలేక పోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒంటరిగా పోటీ చేసినా ఎర్రజెండా పార్టీల అభ్యర్థులు ఓటమి మూటగట్టుకుంటున్నారు. సిద్ధాంత విభేదాలు, రాజకీయ ఎత్తుగడ తదితర అంశాల్లో కమ్యూనిస్టు పార్టీల్లో విభేదాలు చోటు చేసుకుని ఎన్నికల్లో తలోదారిలో నడుస్తున్నాయి. బోధన్, రూరల్ వంటి నియోజక వర్గంలో క్రియాశీలకంగా రాజకీయ కార్యక్రమాలు కొనసాగిస్తున్న కమ్యూనిస్టు పార్టీలకు అసెంబ్లీకి వెళ్లే అవకాశం దక్కలేదు. దశాబ్దాలు గడిచినా అధికార పీఠం దక్కలేదు. సమరశీల పోరాటాల ఘన చరిత్ర బోధన్‌లో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ (రాయల వర్గం), సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ (చంద్రన్నవర్గం), ఆర్ఎస్పీ, ఎంసీపీఐ (యూ) పార్టీలు నిరంతరం కార్మికులు, పేదల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నాయి. గతంలో జిల్లాలో జరిగిన చారిత్రాత్మక పోరాటాల్లో నియోజక వర్గానికి చెందిన కమ్యూనిస్టు నాయకులు కీలక పాత్ర వహించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిరక్షణకు ఎగువ భాగంలో నిర్మించిన సింగూర్ ప్రాజెక్టును ఇందూరు జిల్లాకే కేటాయించాలని నిజాంసాగర్ ఆయకట్టు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో 1986, 1997లలో జరిగిన చారిత్రాత్మక రైతు ఉద్యమానికి కమ్యూనిస్టు పార్టీలే నేతృత్వం వహించాయి. దశాబ్దాల నుంచి ఇప్పటివరకూ బీడీ కార్మికుల పోరాటాలకు ప్రాతిని«ధ్యం వహిస్తున్నాయి. 2000 సంవత్సరంలో కరెంట్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా, 2002లో చంద్రబాబు హయాంలో నిజాంషుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలన్నీ ఐక్యంగా పోరాటం చేశాయి. ఫ్యాక్టరీ భూములు పేదలకు పంచాలని జరిగిన భూపోరాటంలో కమ్యూనిస్టు పార్టీలు ఏకతాటిపై నిలిచి ఉద్యమించాయి. మలి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో కమ్యూనిస్టు పార్టీలు, అనుబంధ విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక సంఘాలు సమరశీల పోరాటాలు చేపట్టాయి. 2014 నుంచి ఇప్పటి వరకు ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకొని ప్రభుత్వమే నడుపాలని, ప్రైవేట్ కంపెనీ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించాలని కమ్యూనిస్టులు ఇతర రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలతో కలిసి ఉద్యమిస్తూనే ఉన్నారు. ప్రజా ఉద్యమాల్లో ఏకతాటిపై నిలిచే కమ్యూనిస్టులు.. ఎన్నికల వేళ మాత్రం తలోదారిలో వెళ్తుండడంతో అధికారానికి దూరమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆయా కమ్యూనిస్టు పార్టీలలో అంతర్గతంగా నాయకుల మధ్య ఆధిపత్య పోరు, విభేదాల కారణంగా కమ్యూనిస్టు పార్టీలు బలోపేతం కావడం లేదని, అందువల్లే దశాబ్దాలుగా ప్రజలతో మమేకమై పని చేస్తున్ననా కమ్యూనిస్టులకు అధికారం దక్కడం లేదని విశ్లేషిస్తున్నారు. ప్రతి సారీ ఓటమే.. 1952లో బోధన్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలతో పాటు స్వతంత్రులు సైతం ఇక్కడ విజయం సాధించారు. సీపీఐ, సీపీఎం ఎన్నికల వేళ చెరో కూటమిలో చేరి విడిపోతున్నారు. విప్లవ పార్టీ అయిన సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ 1989లో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామానికి చెందిన ఆ పార్టీ డివిజన్ ప్రతినిధి చిక్కెల లక్ష్మణ్ పోటీ చేసి ఓడిపోయారు. 1994లో న్యూడెమోక్రసీ అభ్యర్థిగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా మాజీ కార్యదర్శి సుధారాణి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో ఎంసీపీఐ అభ్యర్థిగా కోటగిరి మండలానికి చెందిన యార్లగడ్డ సాయిబాబా కూడా పెద్దగా పోటీ ఇవ్వలేక పోయారు. 2014 ఎన్నికల్లో ఆర్ఎస్పీ అభ్యర్థిగా యార్లగడ్డ సాయిబాబా పోటీ చేసి ఓటమి చెందారు. తాజా ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమిలో భాగస్వామిగా ఉండగా, సీపీఎం నేతృత్వంలో ప్రజా సంఘాలతో ఏర్పడిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. ప్రజా కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తుండగా, సీపీఐ పోటీకి దూరంగా ఉంది. -
బోధన్ ఎన్నికల ప్రచార సభలోనైనా..
సాక్షి, బోధన్: ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్ సభకు వస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాంషుగర్స్ భవితవ్యంపై స్పష్టత ఇవ్వాలని నిజాంషుగర్స్ రక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. పట్టణంలోని రాకాసీపేట్ ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిజాంషుగర్స్ రక్షణ కమిటీ కన్వీనర్ రాఘవులు, ప్రతినిధులు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజాంషుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేర్చకుండా ఏ ముఖంతో ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ప్రశ్నించారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెలంగాణ వారసత్వ సంపద, ఈ ప్రాంత అస్తిత్వం అవునా? కాదా? ప్రత్యేక రాష్ట్రసాధనోద్యమంలో షుగర్ ఫ్యాక్టరీ సమస్యను చోదక శక్తిగా ఉపయోగించుకున్నారా? లేదో? జవాబు చెప్పాలన్నారు. షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్ కంపెనీ కబంధ హస్తాల నుంచి విడిపించి, ప్రభుత్వపరం చేసుకోకుండా, ఇచ్చిన హామీని నెరవేర్చలేక, నడిచే ఫ్యాక్టరీని మూసివేసి కేసీఆర్ నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఆంధ్రప్రాంత ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యాల లాబీయింగ్ ప్రభావంతో ఈ ప్రాంత షుగర్ ఫ్యాక్టరీలను మూసివేశారని ఆరోపించారు. ఫ్యాక్టరీ మూసివేతతో వందలాది మంది చెరుకు రైతులు ఇబ్బందులపాలయ్యారని, ఉపాధి కోల్పోయి ఫ్యాక్టరీ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయంలో చిత్తశుద్ధి చూపకపోవడం దుర్మార్గ వైఖరికి నిదర్శనమని కెసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, స్వాధీనం అంశంపై స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నిజాంషుగర్స్ రక్షణ కమిటీ ప్రతినిధులు గంగాధర్ అప్ప, వరదయ్య, మల్లేష్, షేక్‌బాబు, శంకర్ గౌడ్, యేశాల గంగాధర్, ఎండీ గౌస్, సుల్తాన్ సాయిలు, ఎన్డీఎస్ఎల్ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రవి, శంకర్‌గౌడ్, ప్రతినిధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్కంఠకు తెర
సాక్షి,బోధన్: బోధన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. ఆర్మూర్‌కు చెందిన అల్జాపూర్ శ్రీనివాస్‌కు టికెట్ కేటాయించింది. ఆదివారం మధ్యాహ్నమే మిగతా చోట్ల అభ్యర్థులను ఖరారుచేసిన ఆ పార్టీ నాయకత్వం.. బోధన్‌కు మాత్రం అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో రేకెత్తింది. చివరకు అర్ధరాత్రి వేళ అభ్యర్థిని ప్రకటించడంతో ఉత్కంఠ వీడిపోయింది. టికెట్ కోసం నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ, ఆర్మూర్ ప్రాంతానికి చెందిన పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్ పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఎట్టకేలకు అభ్యర్థి పేరు ఖరారు కావడంతో అసెంబ్లీ ఎన్నికల బరిలో పార్టీ ఉండబోతోంది. -
హామీలను టీఆర్ఎస్ విస్మరించింది
సాక్షి,బోధన్(నిజామాబాద్): తెలంగాణ సెంటిమెంట్ తో ప్రజలను మభ్యపెట్టి, లేనిపోని హామీలను ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్ర భుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన విస్మరించి స్వలాభం, కమీషన్ల ప్రజాధానాన్ని దుర్వినియోగం చేసిన టీఆర్ఎస్ నాయకులకు రానున్న ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి, బోధన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ అన్నారు. మంగళవారం బోధన్ మండలంలోని నాగన్‌పల్లి, కొప్పర్తి, జాడిజమాల్ పూర్, చిన్నమావంది, సాలూర క్యాంప్, సాలంపాడ్, కుమ్మన్‌పల్లి గ్రామాల్లో మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 100రోజులో ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పి ఇచ్చిన హామీని టీఆర్ఎస్ తుంగలో తొక్కిందన్నారు. ఫ్యాక్టరీ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లామని, పార్టీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు. పలువురిని పార్టీలో చేర్చుకున్నారు. ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ తమ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అన్ని పంటలకు బీమా సౌకర్యం కల్పించి బీమా సొమ్మును కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ప్రతి మహిళ సంఘానికి రూ.లక్ష గ్రాంటు అందించడంతో పాటు వడ్డీ లేకుండా రూ.10లక్షలు రుణం అందిస్తామన్నారు. ప్రతి మహిళ సంఘం సభ్యులకు రూ.5లక్షల ప్ర మాద బీమా కూడ కల్పిస్తామన్నారు. ఇళ్ల నిర్మాణాలకు రూ.5లక్షలు.. పేదల సొతింటి కలను సహకారం చేసేందుకు కొ త్తగా ఇళ్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు ఆర్థికసా యం అందిస్తామన్నారు. ఎస్సీ,ఎస్టీలు అయితే రూ.6లక్షలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. అమలు చేసే హామీలే చెపుతున్నాం.. రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్న టీఆర్ఎస్, బీజేపీ పార్టీ లాగా తమ కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇవ్వదని మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. గ్యాస్ ధరలు పెంచి ప్రజలను ఇబ్బందిపాల్జేస్తున్న టీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, ఎంపీపీ గంగాశంకర్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు నాగేశ్వర్రావ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లె రమేశ్, మాజీ ము న్సిపాల్ చైర్మన్ గౌసుద్దీన్, నాయకులు గణపతి రెడ్డి, వీరభద్ర రావ్, ఖలీల్ తదితరులున్నారు. -
ఆ పల్లెలో ప్రచారం మొదలు పెడితే విజయం ఖాయం!
సాక్షి,బోధన్(నిజామాబాద్) : ఆ పల్లెలో ప్రచారం మొదలు పెడితే ఎన్నికల్లో విజయం ఖాయమని రాజకీయ నేతల నమ్మకం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎమ్మె ల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేసే రాజకీయ పార్టీల నేతలు ఆ పల్లె నుంచే ప్రచారం ప్రారంభించే పొలిటికల్ సెంటీ మెంట్ 20 ఏళ్లుగా కొనసాగుతోంది. అదే బోధన్ మండలంలోని బర్దీపూర్ గ్రామం. మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈశన్య దిశలో ఉన్నా చిన్న పల్లెటూరు.. రాజకీయ నాయకులు ప్రచారం ఈ పల్లె నుంచే మొదలు పెడితే విజయం సిద్ధిస్తుందని జ్యోతిష్క్యుల సూచనలను నియోజక వర్గ అభ్యర్థులు అనుసరిస్తున్నారు. ఈ గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆయలంలో దైవ దర్శనం చేసుకుని, పూజలు నిర్వహించి ప్రచారాన్ని మొదలు పెట్టడం ఆనవాయితీగా కొనసాగుతోంది. తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి 1999 ఎన్నికల్లో బర్దీపూర్ గ్రామం నుంచి ప్రచారం మొదలు పెట్టి విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికలతో పాటు తాజాగా 2018 ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించారు. అయితే 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి ఓడిపోయారు. ఈ విషయం తెలిసి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఈ గ్రామం నుంచే ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. 2014 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీజేపీ నేత యెండల లక్ష్మీనారాయణ కూడా ఈ గ్రామం నుంచి ప్రచారం మొదలు పెట్టారు. పొలిటికల్ సెంటిమెంట్‌తో బర్దీపూర్ గ్రామానికి ప్రత్యేకత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తాజా మాజీ ఎమ్మెల్యే షకీల్ బర్దీపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుని అబివృద్ధికి కృషి చేశారు. -
రెండు గంటల్లోనే రెండు పార్టీలు..
సాక్షి, బోధన్(నిజామాబాద్): అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో బలసమీకరణకు ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకులను తమ పార్టీలో చేర్చుకునే యత్నాలు చేస్తున్నాయి. గ్రామ, మండల, పట్టణ స్థాయి ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు కారణాలు చూపి ఈ పార్టీ నుంచి ఆ పార్టీల్లోకి , ఆపార్టీ నుంచి ఈ పార్టీలోకి జంప్ కావడం సహజంగా జరుగుతుంది. కానీ ఉదయం వేళ పార్టీ మారి, మధ్యాహ్నం వరకు సొంత పార్టీల్లోనే కొనసాగుతానని చెప్పుకొస్తున్న విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరుతున్న కలీం దీపావళి పండుగ వేళ బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కాంగ్రెస్ మైనారిటీ సెల్ పట్టణ ఉపాధ్యక్షుడు కలీం తాజా మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ సమక్షంలో టీఆర్ఎస్ కండుకప్పుకుని ఆ పార్టీలో చేరారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మళ్లీ కాంగ్రెస్ కార్యాలయంలో ప్రత్యక్షమై, ఆ పార్టీ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో మళ్లీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని వెల్లడించారు. రెండు గంటల్లోనే రెండు పార్టీల కండువాలు మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. గురువారం రాత్రి కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు కలీంను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా వివరాలు తెలిపారు. టీఆర్ఎస్ కండువ కప్పుకోవడం అనుహ్యంగాజరిగిపోయిందన్నారు. సొంత పార్టీ నాయకుల సూచనలు మేరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. -
ప్రతిసారీ త్రిముఖ పోరే..
బోధన్ నియోజకవర్గంలో ప్రతిసారి సార్వత్రిక ఎన్నికల లాగే ఈ సారి కూడా త్రిముఖ పోరు జరుగనుంది. 1994 సంవత్సరం నుంచి ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడు ప్రధాన పార్టీల మధ్యే పోటీ నెలకొంటోంది. ఇతర పార్టీలు బరిలో ఉంటున్నా పోటీ నామమాత్రంగానే ఉంటుంది. గతంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల నువ్వానేనా అన్నట్లు పోటీ ఉండేది. ప్రస్తుతం టీడీపీ స్థానంలో టీఆర్ఎస్ చేరింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. ఈ సారి టీఆర్ఎస్ అభ్యర్థిని పార్టీ ముందుగానే ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి సైతం దాదాపుగా ఖరారయినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. సాక్షి, బోధన్(నిజామాబాద్ ): బోధన్ నియోజక వర్గంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికల పోరు పోటాపోటీగా ఉండనుంది. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరిగే అవకాశాలున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ మహాకూటమి, బీజేపీ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ప్రధాన పోటీ సాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావనంతరం రెండోసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు వ్యుహా, ప్రతివ్యూహాలు, ఎత్తుకుపై ఎత్తులతో ప్రణాళికలు రచిస్తున్నాయి. ఆయా సామాజిక వర్గాలు, నియోజక వర్గ స్థాయి ప్రత్యర్థి పార్టీల్లో కొనసాగుతున్న ముఖ్యనేతల మద్దతు సమీకరణ ప్రయత్నాల్లో అభ్యర్థులు బిజీబిజీగా ఉన్నారు. ఈ సారి ఎన్నికల సమరాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. నియోజక వర్గ పరిధిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు మహ్మద్ షకీల్ ఆమేర్, పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిలకు మద్దతుగా ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ పార్టీల ప్రచారంతో సందడి వాతావరణం మొదలైంది. 1994 నుంచి త్రిముఖ పోరే.. 1952లో నియోజక వర్గం ఏర్పడింది. ఆనాటి నుంచి 1989 వరకు తొమ్మిది సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీతో పాటు స్వతంత్రులు, కొన్ని సార్లు ప్రధాన రెండు రాజకీయ పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ సాగింది. 1994 ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల పోటీ అభ్యర్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. 1994 ఎన్నికల్లో మాజీ మంత్రి బషీరుద్దీన్‌బాబుఖాన్(టీడీపీ), నర్సింహారెడ్డి (బీజేపీ), తాహెర్‌బిన్ హుందాన్(కాంగ్రెస్ పార్టీ)లు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ త్రిముఖ కోణంలో సాగింది. బీజేపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారిగా రంగ ప్రవేశం చేసింది. 2004, 2009, 2014 ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ ముఖ్యంగా ఈ మూడు ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల మధ్యే పోటీ నెలకొంది. 2004 ఎన్నికల్లో మాజీ మంత్రిసుదర్శన్ రెడ్డి (కాంగ్రెస్), అబ్దుల్‌ఖాదర్ (టీడీపీ), కెప్టెన్ కరుణాకర్ రెడ్డి (తెలంగాణ జనతా పార్టీ)ల మధ్య త్రిముఖ పోరు జరిగింది. 2009లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి(కాంగ్రెస్), టీడీపీ, టీఆర్ఎస్ మహాకూటమి అభ్యర్థి మహ్మద్ షకీల్(టీఆర్ఎస్), కెప్టెన్ కరుణాకర్ రెడ్డి (ప్రజారాజ్యం పార్టీ), డాక్టర్ శివప్ప(బీజేపీ) ఈ నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు బరిలో నిలిచినా ఇందులో మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. 2014లో జరిగిన తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో నియోజక వర్గంలో బహుముఖ కోణంలో పోటీ కొనసాగినప్పటికీ ఆఖరులో మూడు పార్టీల మధ్యే పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ ఆమేర్, కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి మేడపాటి ప్రకాశ్‌రెడ్డిలు ప్రధానంగా పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా కాటిపల్లి సుదీప్‌రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. వీరితో పాటు బీఎస్పీ, ఆర్ఎస్పీ, ఆమ్ఆద్మీ పార్టీలు పోటీ చేశాయి. ఇప్పుడూ మూడు పార్టీలే.. తాజా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమేర్ పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. కాంగ్రెస్ మహాకూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైందని స్పష్టమవుతుంది. అయితే బీజేపీ అభ్యర్థి పేరు ఇంకా ఖరారు కాలేదు. శివసేన పార్టీ అభ్యర్థిగా గోపి కిషన్ పేరు ఆ పార్టీ ప్రకటించింది. టీఆర్ఎస్ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం ఈ సారి ఎన్నికల్లో పోటీలో ఉండడం లేదని స్పష్టమైంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి పేరుపై ఇంకా స్పష్టత రాలేదు. బీఎల్ఎఫ్ అభ్యర్థిని నిలబెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నా ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. అయితే తాజా రాజకీయ పరిస్థితులు పరిశీలిస్తే మళ్లీ త్రిముఖ కోణంలోనే ఎన్నికల సమరం ఉండబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
పోటాపోటీగా బెలూన్ల ఏర్పాటు
సాక్షి,బోధన్(నిజామాబాద్): అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడియ సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే స్థానానికి పోటీ పడుతున్న అభ్యర్థులు ప్రచారపర్వంలో పోటీ పడుతున్నారు. బోధన్ నియోజక వర్గం ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమేర్, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. వారం పది రోజుల నుంచి ఇరుపార్టీల నాయకులు అభ్యర్థులకు మద్దతుగా గ్రామాల్లో పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో బాగంగా కెసీఆర్, ఎంపీ కవిత, కేటీఆర్, షకీల్ ముఖచిత్రాలు, కారుగుర్తు చిత్రాలతో కూడిన బెలూ న్ను బోధన్ మండలంలోని సాలూర గ్రామ బస్టాండ్‌లో గల ఓ ఎత్తయిన భవనంపై నాలు గు రోజుల క్రితం కట్టారు. మంగళవారం ఇదే భవనంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పా ర్టీ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, హస్తం గుర్తు, పార్టీఅగ్రనేతల ముఖచిత్రాలతో కూడి బెలూన్ కట్టారు. అభ్యర్థులు పోటీ పడి బెలూన్లు కడుతున్నారు. రెండు బెలూన్లను తిలికిస్తున్న సాలూర, పరిసర గ్రామాల ప్రజలు ఆసక్తిగా కనబరుస్తు చర్చించుకుంటున్నారు. -
అన్ని పార్టీలపై ఆదరణ
బోధన్ నియోజక వర్గం తన ప్రస్థానంలో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులనూ ఆదరించింది. కాంగ్రెస్ ఆరు పర్యాయాలు, టీడీపీ నాలుగు పర్యాయాలు విజయం సాధించగా, స్వతంత్ర అభ్యర్థులు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ఈ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థికి పట్టం కట్టింది. బీజేపీ అభ్యర్థులు పలుమార్లు గట్టి పోటీ ఇచ్చినా విజయ శిఖరాలను మాత్రం అందుకోలేకపోయారు. బోధన్: బోధన్ నియోజక వర్గం 1952 సంవత్సరంలో ఏర్పడింది. ఈ నియోజక వర్గం పరిధిలో బోధన్ పట్టణం, మండలం, ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాలున్నాయి. నియోజ వర్గం ఏర్పడి నాటి నుంచి ఆరుసార్లు కాం గ్రెస్ పార్టీకి, నాలుగు సార్లు టీడీపీ, మరో నాలుగు సార్లు స్వతంత్ర అభ్యర్థులకు అధికారం కట్టబెట్టారు. 1999 నుంచి 2009 వరుకు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శ న్ రెడ్డి హ్యాట్రిక్ సాధించారు. టీడీపీ హయాం లో దివంగత మాజీ మంత్రి బషీరుద్దీన్ బాబూఖాన్ 1985,1994 ఎన్నికల్లో రెండు పర్యాయాలు గెలుపొందారు.1983 నుంచి 1994 వరకు వరుసగా నాలుగుసార్లు టీడీపీకి ఓటర్లు పట్టం కట్టారు.1994, 2004, 2009 లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా అధికారం దక్కలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బోణీ కొట్టింది. టీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ ఆమేర్ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిపై 15 వేల పైచిలుకు ఓట్లతో ఆధిక్యత సాధించి గెలుపొందారు. 2009లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి (కాంగ్రెస్), మహ్మద్ షకీల్ ఆమేర్ (టీఆర్ఎస్, టీడీపీ మహాకూటమి) అభ్యర్థులుగా బరిలో నిలిచారు. షకీల్ పై సుదర్శన్ రెడ్డి 1200 పై చిలుకు ఓట్ల ఆధిక్యత సాధించి గెలుపొందారు. 1957 నుంచి 1972 వరకు వరుసగా నాలుగు సార్లు స్వతంత్ర అభ్యర్థులు శ్రీనివాస్‌రావు, రాంగోపాల్‌రెడ్డి, కెవీరెడ్డి, ఆర్ భూంరావులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ప్రస్తుతం బీజేపీ నియోజవర్గ ముఖ్య నేత కెప్టెన్ కరుణాకర్ రెడ్డి 2004లో తెలంగాణ జనతా పార్టీ, 2009లో ప్రజారాజ్యం పార్టీ ల అభ్యర్థిగా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. 2009లో 34 వేల 142 ఓట్లుసాధించి సత్తాచాటారు. 2014లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన మేడపాటి ప్రకాష్ రెడ్డి 26 వేల 558 ఓట్లు పొంది సత్తా చాటారు. ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఇదే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా రెంజల్ మండల కేంద్రానికి చెందిన కాటిపల్లి సుదీప్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచి ప్రధాన రాజకీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేశారు. -
సబ్ కలెక్టర్ వాహనం అడ్డగింత
బోధన్ నిజామాబాద్ : తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆవేదనతో మెప్మా ఆర్పీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బోధన్ మున్సిపల్ ఆఫీసు లోపల నుంచి బయటకు వస్తున్న సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి వాహనాన్ని మున్సిపల్ ఆఫీసు ప్రవేశ ద్వారం వద్ద అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆర్పీలను సముదాయించే ప్రయత్నం చేస్తూ వాహనాన్ని తహసీల్ ఆఫీసు వైపు మళ్లీంచారు. స్థానిక మున్సిపల్ ఆఫీసులో చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్యపై కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస నోటీసు మేరకు బలపరీక్షకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 11.30 గంటల వరకు కౌన్సిలర్ల కోరం లేక పోవడంతో సమావేశం వాయిదా వేసి తిరిగి సబ్ కలెక్టర్ ఆఫీసుకు వెళ్తున్న ఆయన వాహనాన్ని మున్సిపల్ ప్రవేశ ద్వారం వద్ద మెప్మా ఆర్పీలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆర్పీలు ఆగ్రహానికి గురై నినాదాలు చేశారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని, 22 రోజులుగా రోడ్డెక్కి నిరసన తెలిపినా ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం తమతో వెట్టిచాకిరి చేయించుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ ఆఫీసుకు ర్యాలీ వెళ్లి నిరసన తెలిపారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర సమస్యలు పరిష్కరించాలని మెప్మా ఆర్పీలు 22 రోజులుగా నిరవధిక సమ్మెను కొనసాగిస్తూ రిలే నిరహార దీక్షలు కొనసాగిస్తున్నారు. -
‘బోధన్ స్కాం’ దర్యాప్తు ముగిసినట్లే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సర్కారు ఖజానాకు రూ.300 కోట్లు గండి కొట్టిన బోధన్ స్కాంలో సీఐడీ దర్యాప్తు ముగిసినట్లేనని తెలుస్తోంది. ఈ స్కాంలో ప్రధాన సూత్రధారి శివరాజు, అతడి కుమారుడితో పాటు 9 మంది కమర్షియల్ ట్యాక్స్ అధికారులను సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ స్కాం రెండో దశ దర్యాప్తులో భాగంగా మరో 16 మంది కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో పాటు 250 మందికి పైగా ఉన్న లబ్ధిదారులను విచారిం చాలని భావించింది. కానీ కొద్ది రోజులుగా బోధన్ స్కాంలో ఎలాంటి పురోగతి కనిపించక పోవడంతో దర్యాప్తు అధికారులు చార్జిషీట్ దాఖలుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. డీలర్లు, డిస్టిబ్యూటర్లకు ఊరటేనా? ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన చలాన్ల సొమ్మును శివరాజు తన వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించుకున్నాడు. ఒకే చలాన్‌పై ఇద్దరు, ముగ్గురు వ్యాపారుల పన్ను చెల్లించినట్లు చూపించి నకిలీ చలాన్ల నంబర్లతో కమర్షియల్ ట్యాక్స్ వెబ్సైట్లో లెక్కలు సృష్టించడంతో రూ.300 కోట్ల మేర వాణిజ్య పన్నుల శాఖకు నష్టం వాటిల్లినట్లు సీఐడీ గుర్తించింది. అయితే స్కాంలో పాలుపంచుకున్న నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ తదితర ప్రాంతాల్లోని వ్యాపారులను విచారించాలని సీఐడీ తొలుత భావించినా అది సాధ్యపడలేదని సమాచారం. 2010 నుంచి 2016 వరకు జరిగిన ఈ కుంభకోణంలో డిప్యూటీ కమిషనర్లతో పాటు ఆపై స్థాయి అధికారులు కూడా పాత్రధారులేనని, వారిని కూడా విచారించాలని వాణిజ్య పన్నుల శాఖకు లేఖ రాసినా ఆ విభాగం పట్టించుకోలేదు. స్కాంతో సంబంధం ఉన్న అధికారుల వివరాలు, వారు నిజామాబాద్‌లో పనిచేసిన వివరాలు కావాలని సీఐడీ కోరినా పట్టించుకోలేదు. ఇక చేసేదేమీ లేక సీఐడీ అధి కారులు చార్జిషీట్ దాఖలు చేసే పనిలో పడ్డట్లు తెలు స్తోంది. దీంతో అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఇటు అధికారు లకు ఊరట లభించినట్లేనన్న వాదన వినిపిస్తోంది. -
బోధన్ ఆస్పత్రికి ‘జిల్లా’ హోదా!
బోధన్ టౌన్(బోధన్) నిజామాబాద్: బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి జిల్లా ఆస్పత్రి హోదా లభించింది. బోధన్ వాసుల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. ఎంపీ కవిత, ఎమ్మెల్యే షకీల్ చొరవతో బోధన్ ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు ప్రభుత్వ వైద్యం చేరువ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం రాష్ట్రంలోని 25 ఏరియా ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే బోధన్‌కు ‘జిల్లా ఆస్పత్రి’ హోదా లభించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 100 పడకల సంఖ్య 250కి పెరగనుంది. నెరవేరిన కల ఉమ్మడి జిల్లాలో జిల్లా కేంద్రానికి మెడిక ల్ కళాశాల మంజూరు కాగా, బోధన్ ఏ రియా ఆస్పత్రిని జిల్లా ఆస్పతిగా మా ర్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. పదెకరాల సువిశాల స్థలం లో కొత్త భవనంతో పాటు మౌలిక వస తులు కల్పించాలని, ప్రస్తుతం ఉన్న పాత భవనాన్ని నర్సింగ్ స్కూల్‌కు కేటాయించాలని ప్రతిపాదించారు. బోధన్ ఆస్పత్రికి జిల్లా ఆస్పత్రి హోదా వస్తుంద ని నియోజకవర్గ ప్రజలతో పాటు డివిజ న్ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశారు. కానీ, ఏళ్ల తరబడి వారి కల నేరవేరలేదు. ఎంపీ కవిత చొరవతో తాజాగా ప్రభుత్వం జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పూర్వ డివిజన్ పరిధిలో బోధన్ నియోజకవర్గంతో పాటు ప్రస్తుత కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని మండలా గ్రామీణ ప్రజలు వైద్య సేవలు అందించిన చరిత్ర ఏరియా ఆస్పత్రికి ఉంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా బోధన్ డివిజన్ 12 మండలాల నుంచి 7 మండలాలకు పరిమితమైంది. ప్రస్తుతం డివిజన్ పరిధిలో బోధన్ టౌన్, రూరల్, ఎడపల్లి, రెంజ ల్, బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి, రుద్రూర్, వర్ని మం డలాల ప్రజలకు ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలు అందుతున్నాయి. తాజా గా ప్రభుత్వం ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయడంతో ప్రజల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.రోగుల తరలింపునకు చెక్ బోధన్ ఏరియా ఆస్పత్రిలో రోజూ 500 మంది ఔట్ పేషెంట్స్, 100 మంది ఇన్పేషెంట్లుగా చికిత్స పొందు తుంటారు. బోధన్ పట్టణంతో పాటు బోధన్ రూరల్, ఎడపల్లి, రెంజల్, కోటగిరి, వర్నితో పాటు నవీపేట్, బీర్కూర్ మండలాలకు చెందిన ప్రజలు ఇక్కడ వైద్య సేవలు అందుకుంటున్నారు. ఏటా సుమారు నాలుగైదు లక్షల మంది ఇక్కడ చికిత్సలు పొందుతున్నారు. రోడ్డు ప్రమాదాలు, అత్యవసర వైద్య చికిత్సలు అందించాల్సిన వచ్చినప్పుడు ప్రథమ చికిత్సలు నిర్వహించి, రోగులను జిల్లా ఆస్పత్రికి మేరుగైన వైద్య సేవల నిమిత్తం తరలించాల్సిన పరిస్థితి ఉండేది. రోగులకు అత్యవసర చికిత్సలు అందించాలనే ప్రభుత్వ ఆలోచనలో భాగంగా ఇటీవల ఆస్పత్రిలోని ప్రసూతి వార్డును అధునాతనంగా తీర్చి దిద్దారు. దీంతో పాటు అత్యవసర చికిత్సలు అందించే సమయంలో రోగికి అవసరమైన రక్తం అందుబాటులో ఉండేందుకు ఇటీవల రక్త నిధి కేంద్రం పనులు ప్రారంభించారు. కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. తాజాగా ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయడంతో ప్రస్తుతం ఉన్న వంద పడకలకు తోడు మరో 150 పడకలు అందుబాటులోకి రానున్నాయి. -
‘పది’లో మాస్ కాపీయింగ్..
బోధన్ టౌన్ : పట్టణంలోని బీటీనగర్‌లో గల ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి పరీక్ష కేంద్రంలో చిటీలు అందిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో సోమవారం హాల్చల్ చేస్తున్నాయి. కొందరు యువకులు పరీక్ష కేంద్రం వద్ద చిటీలు అందించడానికి గోడలు ఎక్కిన దృశ్యాలను, విద్యార్థి సంఘాల నాయకులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. పరీక్షకేంద్రాల వద్ద పకడ్భందీగా ఏర్పాటుచేశామని, మాస్‌కాపీయింగ్‌కు తావులేదని అధికారులు చెబుతున్నా, ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి వీటిని అరికట్టాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదికాగా సోమవారం పట్టణంలోని పరీక్ష కేంద్రాలను డీఈవో నాంపల్లి రాజేశ్ తనిఖీ చేశారు. -
ఆశీర్వదించండి
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో తాము అధికారంలో లేకపోయినా అభివృద్ధి కోసం ఎన్నో నిధులు కేటాయిస్తున్నామని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహేర్ హామీ కోరారు. తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్యవంతులని, తమ పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక నిజాం చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కృషి చేస్తామని ఇచ్చారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయమై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధానితో చర్చించాలని సూచించారు. చెరుకు రైతుల చర్నాకోల్ మహా పాదయాత్ర ముగిం పు సందర్భంగా ఆదివారం బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. చెరుకు రైతులు, కార్మికులకు భరోసా కల్పించేందుకు నాయకులు పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాము ఎప్పుడూ అధికారంలో లేకపోయినా.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నిధులు ఇస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఆర్మూర్ – ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. గోదావరి, పెన్‌గంగా నదులపై నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు వెంటవెంటనే అనుమతులిచ్చామని, మహారాష్ట్రలోని తమ ప్రభుత్వం కూడా ఇందుకు అంగీకరించిందని పేర్కొన్నారు. అధికారం కష్టమేమీ కాదు.. త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాల మాదిరి తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాలకు వలస వెళ్లకుండా స్థానికంగా ఉపాధి కల్పించేందుకు యువతకు నైపుణ్య అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు మూత పడ్డాయని, రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు సైతం ఇదే ధోరణితో ముందుకెళుతోందని విమర్శించారు. ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారిని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజ్యసభకు పంపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని శాసన మండలి బీజేపీ పక్ష నేత రాంచంద్రరావు విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు చేసుకోవడమే గుణాత్మకమైన మార్పా అని ప్రశ్నించారు. ప్రజాసమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, 140 కిలోమీటర్ల పాదయాత్రలో ఎన్నో సమస్యలు దృష్టికి వచ్చాయని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. బోధన్ చక్కెర కర్మాగారాన్ని ప్రైవేటుకు ధారాదత్తం చేసిన చంద్రబాబు మహా పాపాత్ముడని, దీన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ నిలబెట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనతోనే రైతుల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలిస్తామని ప్రకటించిన కేసీఆర్ పాలనలో ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ విమర్శించారు. చక్కెర కర్మాగారం కార్మికులకు వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, మహిళా సంఘాలకు రూ.2,200 కోట్ల వడ్డీ రాయితీ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికార ప్రతినిధి అడ్లూరు శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు, కార్మికులకు అండగా నిలిచేందుకు చేపట్టిన పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లెగంగారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, లోక భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి, బస్వ లక్ష్మినర్సయ్య, శివప్ప, గురూజీ బాబుసింగ్రాథోడ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పోలీసులపై తీరుపై అసహనం ముగింపు సభలో కేంద్రమంత్రి మాట్లాడుతుండగా ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన తెలిపారు. వర్గీకరణపై బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అసహనం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ పునరుద్ధరించాలని బీజేపీ నాయకులు పాదయాత్ర చేసి ముగింపు సభ నిర్వహిస్తే కొందరు వచ్చి నిరసన తెలుపుతుంటే పోలీసులు చూస్తూ ఉండడం ఏమిటని ప్రశ్నించారు. చేతులు కట్టుకోవడానికి వచ్చారా? అని అసహనం వ్యక్తం చేశారు. -
టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు
నవీపేట(బోధన్): ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం మెరుపు దాడి చేసి, రెండు టిప్పర్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. గురువారం వేకువజామున నాళేశ్వర్ నుంచి నిజామాబాద్‌కు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు టిప్పర్లను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. మండలంలోని జన్నెపల్లి, నాళేశ్వర్, శాఖాపూర్, చిక్లి వాగుల నుంచి కొందరు ఇసుకాసురులు రాత్రి వేళల్లో నిజామాబాద్, ఆర్మూర్, నందిపేట, నవీపేటలకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని రెవెన్యూ, పోలీసులకు వివిధ గ్రామాల రైతులు, యువకులు పలుమార్లు ఫోన్లో ఫిర్యాదులు చేశారు. అయితే, వారు తూతూ మంత్రంగా స్పందిస్తున్నారని కొందరు ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఉన్నతాధికారులు పగడ్బందీగా దాడులు చేయాలని టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆదేశించారు. ఇసుక రవాణాలో ముదుర్లుగా పేరున్న గాంధీనగర్, చిక్లి క్యాంప్‌లకు చెందిన ఇరువురు ఎప్పటిలాగే నాళేశ్వర్ వాగు నుంచి నిజామాబాద్ వైపు రెండు టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నారు. పథకం ప్రకారం నిఘా వేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ వాహనాలను వెంబడించి పాల్దా సమీపంలో పట్టుకున్నారు. ఈ రెండు వాహనాలకు రక్షణగా ఉన్న కారును కూడా సీజ్ చేశారు. టిప్పర్లతో పాటు కారును స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, కారును సీజ్ చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. -
కట్నం కోసం వేధించిన భర్తకు ఏడాది జైలు
బోధన్ టౌన్: భార్యను అదనపు కట్నం కోసం వేధించిన కేసులో సాక్షధారాలు రుజువు కావడంతో భర్తకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ మంగళవారం జూనియర్ సివిల్ జడ్జి ఈశ్వరయ్య తీర్పు వెల్లడించారు. పీపీ కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని శక్కర్‌నగర్ చౌరస్తాకు చెందిన ప్రభుత్వ టీచర్ మదనగిరి వరలక్ష్మి వరంగల్ జిల్లా జనగామ మండలం పతమల్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌గౌడ్‌తో 4–5–2007లో వివాహమైందని, పెళ్ళి సమయంలో రెండున్నర లక్షలు, రెండుతులాల బంగారం, ఒక ప్యాషణ్ ప్రో బైకు, రూ.లక్ష విలువ చేసే ఇంటి సామగ్రి ఇచ్చారని తెలిపారు. కొన్ని రోజులు పాటు బాగానే ఉన్నారని అదనంగా కట్నం ఇవ్వాలని భర్త, అత్త, మరిది, మరిది భార్య, బావ, బావ భార్య వేధించారని, కొన్ని రోజులు బోధన్‌లో నివాసం ఉన్నారన్నారు. అయినా వేధింపులు తగ్గక పోవడంతో వరలక్ష్మి 17–7–2012న బోధన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు 498ఏ, 3అండ్4, డీసీఆర్ కేసునమోదు చేశారు. సాక్షధారాలు రుజువు కావడంతో భర్తకు యేడాది జైలుశిక్ష, రూ.10 వేల జరిమాన, జరిమాన కట్టకుంటే 2 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారని తెలిపారు -
బోధన్ స్కాంలో వేటుకు రంగం సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు వందల కోట్లు గండికొట్టిన బోధన్ వాణిజ్యపన్నుల స్కాంలో అధికారులపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. గతేడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసిన సీఐడీ, రూ.200 కోట్లకు పైగా ఖజానాకు గండిపడినట్లు గుర్తించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులిద్దరితో పాటు వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్, నలుగురు రిటైర్డ్ అధికారులను అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న అధికారులపై ప్రభుత్వానికి సీఐడీ నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో నివేదికలో పేర్కొన్న మొత్తం 26 మంది అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు చార్జిమెమోలు జారీచేశారు. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయవద్దు... వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఐదుగురు డిప్యూటీ కమిషనర్లు, ఐదుగురు కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు (సీటీవో), ఎనిమిది మంది అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ అధికారులు, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లకు రెండు రోజుల క్రితం జీఏడీ నుంచి జీవోల రూపంలో చార్జిమెమోలు పంపించారు. 2005 నుంచి 2014 వరకు కుంభకోణం జరిగిందని, ఆ సమయంలో విధులు నిర్వర్తించిన డిప్యూటీ కమిషనర్లు ఆడిటింగ్ సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో సస్పెన్షన్‌తోపాటు, ఎందుకు అరెస్ట్ చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌కి... ప్రస్తుతం చార్జిమెమోలు అందుకున్న అధికారులు నెల రోజుల లోపల వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వం గడువునిచ్చినట్టు తెలిసింది. కాగా, తమను సీఐడీ ఎక్కడ అరెస్ట్ చేస్తుందోనని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మెమోలకు వివరణను కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విభాగానికి పంపించాలనడంతో అధికారుల్లో మరింత ఆందోళన మొదలైంది. వివరణ సంతృప్తికరంగా లేకపోతే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ నేరుగా విజిలెన్స్ కమిçషనర్‌కు చర్యల కోసం సిఫారసు చేయడంతో పాటు సీఎంకి సైతం చర్యలపై ప్రతిపాదన పంపేందుకు అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు ఎలా ఇస్తే ఏం జరుగుతుందో అన్న భయం అధికారుల్లో మొదలైంది. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే... ప్రస్తుతం ఈ స్కాంలో సీఐడీ విచారణ ఆగిపోయింది. గతంలో కీలక పాత్రధారులను అరెస్ట్ చేసిన సీఐడీ, కమర్షియల్ టాక్స్ శాఖలోని మరి కొంత మందిని అరెస్ట్ చేయాలని భావించింది. అయితే వాణిజ్యపన్నుల శాఖ అంతర్గత విచారణ అనంతరం అరెస్టులకు వెళ్లాలని ప్రభుత్వం సూచించడంతో సీఐడీ వెనక్కి తగ్గింది. ఇప్పుడు చార్జిమెమోలు జారీ చేయడంతో సీఐడీ అధికారులు ఈ 26 మందిలో కొందరిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ అనుమతి పొందాలని యోచిస్తోంది. -
బోధన్ ఇరిగేషన్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి
సాక్షి, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ ఇరిగేషన్ డిఈ శ్రావణ్ కుమార్ రెడ్డి ఇంటిపై ఏసీబి దాడులు చేసింది. బాన్సువాడ లోని ఆయన నివాసంలో రూ.40లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఖదీదైన కారును సీజ్ చేశారు. ఆర్మూర్‌లో ఉన్న ఆయన ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు జరిపింది. ఇక్కడా విలువైన అస్తులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటికి సంబంధించిన పత్రాలను సీజ్ చేశారు. -
సర్కారు సగమిస్తేనే..!
ఎనిమిది దశాబ్దాల కలకు.. ‘బంగారు తెలంగాణ’లోనూ మోక్షం కలగడం లేదు. బోధన్–బీదర్ రైల్వే లైన్ పొడిగింపు అడుగు ముందుకు పడట్లేదు. 1938లో నిజాం హయాంలో ప్రతిపాదించిన ఈ రైల్వే మార్గం.. ఇప్పటికీ పట్టాలెక్కలేదు. 2014లో సర్వే పూర్తయినా నిధుల కేటాయింపు లేక ‘లైన్ క్లియర్’ కావట్లేదు. ఈ ‘మార్గం’ సుగమం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే, కేంద్రం కూడా ఆ మేరకు నిధులు ఇవ్వనుంది. అయితే, ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్లోనైనా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందా..? దశాబ్దాల కల సాకారమవుతుందా? అన్న దానిపై ఆసక్తి నెలకొంది. బాన్సువాడ: అసంపూర్తిగా ఉన్న బోధన్ రైల్వే లైన్‌ను బీదర్ వరకు పొడిగిస్తే వెనుకబడిన ప్రాంతాలకు ఎంతో లబ్ధి చేకూరనుంది. ఆయా ప్రాంతాలకు రవాణా వసతులు పెరిగి అభివృద్ధి బాట పట్టే అవకాశముంది. అయితే, సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఆయా ప్రాంతాలకు ఇప్పట్లో ‘రైలు బండి’ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చట్లేదు. 201లో రూ.1,029 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ ప్రాజెక్టు.. జాప్యం కారణంగా ప్రస్తుత అంచనా వ్యయం రెట్టింపయింది. అయితే, మారిన నిబంధనల ప్రకారం ఈ రైల్వే లైన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాల్సి ఉంది. ఈ లైన్ ప్రస్తుతం పట్టాలెక్కాలంటే సుమారు రూ.2 వేల కోట్ల వ్యయం కానుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సగం కేటాయిస్తే, కేంద్రం సగం కేటాయించనుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించని కారణంగా ఈ ‘మార్గానికి’ మోక్షం కలగట్లేదు. ఎనిమిది దశాబ్దాల కల.. బోధన్–బీదర్ రైల్వే లైన్‌ను పొడిగించేందుకు 1938లోనే నిజాం సర్కార్ హయాంలో ప్రతిపాదనలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అయిన రైల్వే లైన్ నిర్మాణం కలగానే మారింది. బోధన్–బాన్సువాడ–బీదర్ ప్రాంత ప్రజల కోరిక మేరకు 2010లో అప్పటి రైల్వే మంత్రి మమతాబెనర్జీ ఈ మార్గానికి ‘లైన్ క్లీయర్’ చేశారు. దశాబ్దాల కల అయిన బోధన్–బీదర్ రైల్వే లైన్‌కు సర్వే కోసం పచ్చజెండా ఊపిన మమతా బెనర్జీ.. ఆదిలాబాద్–పటాన్చెరు మధ్య కొత్తగా మరో రైల్వే లైన్ కోసం సర్వే చేసేందుకు పచ్చ జెండా ఊపారు. దీంతో ఈ ప్రాంతం మీదుగా ఒకేసారి రెండు రైల్వే లైన్ల కోసం సర్వే చేయించేందుకు అనుమతి లభించడంతో అందరూ ఎంతో సంబర పడ్డారు. కానీ ఈ ప్రతిపాదనలు పట్టాలెక్కకుండానే కనుమరుగయ్యాయి. 2014లో సర్వే పూర్తి! 2010లో రైల్వే బడ్జెట్లో రెండు లైన్లకు లభించిన సర్వే అనుమతుల దృష్ట్యా సర్వే అయితే పూర్తి చేశారు. 138 కిలోమీటర్ల బోధన్–బీదర్ రైల్వే లైన్ కోసం 2011 ఏప్రిల్‌లో ప్రారంభమైన సర్వే 2014లో పూర్తయింది. బోధన్ నుంచి రుద్రూర్, వర్ని, నస్రుల్లాబాద్, బాన్సువాడ, పిట్లం మీదుగా నారాయణఖేడ్, బీదర్ వరకు వారు సర్వే నిర్వహించారు. సర్వే ప్రకారం మార్గమధ్యలో భారీ వంతెనలు లేవని తేలింది. కేవలం రూ.1,029 వ్యయంతో లైన్ వేయవచ్చని అధికారులు తేల్చారు. బాన్సువాడ–బోధన్ ప్రధాన రోడ్డుకు ఆవలి వైపు సుమారు 3 కిలోమీటర్ల వ్యత్యాసంలో సర్వే నిర్వహించి, హద్దు రాళ్లను పాతారు. ఈ మేరకు హద్దు రాళ్లు ఆయా పంట పొలాలు, అడవుల్లో ఇప్పటికీ ఉన్నాయి. దశల వారీగా నిర్వహించిన ఈ సర్వేలో మార్గ మధ్యలో వచ్చే నదులపై వంతెనలు, ఎత్తుపల్లాలు ఇతర అన్ని రకాల భౌగోళిక పరిస్థితులపై అంచనా వేసి రైల్వే శాఖ ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించారు. నిధుల కేటాయింపుపై సందిగ్ధత 2014లో సర్వే పూర్తవడంతో ఏటా రైల్వే బడ్జెట్లో ఎంతో కొంత నిధులు మంజూరవుతాయని అంతా భావించారు. కానీ ఇప్పటివరకు మూడు బడ్జెట్లు పూర్తయినా పైసా కూడా మంజూరు కాలేదు. తెలంగాణలోని కొన్ని కొత్త మార్గాల్లో మెండుగా నిధులు కేటాయించిన కేంద్రం.. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న బోధన్–బీదర్ రైల్వే లైన్‌కు మొండి చేయి చూపింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తేనే ఈ లైన్ పట్టాలెక్కే అవకాశముంది. ఈ మార్గంలో సర్వే పూర్తయినందున రాష్ట్రప్రభుత్వం 50 శాతం నిధులు కేటాయిస్తే, మరో 50శాతం కేంద్రం కేటాయించనుంది. సుమారు రూ.2వేల కోట్ల అంచనా వ్యయం కాగా, ఇందులో 50శాతం నిధులను రాష్ట్రం కేటాయిస్తేనే కేంద్రం తన వాటా 50 శాతం నిధులు మంజూరు చేయనుం దని అధికారులు చెబుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువైంది. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో రూపా యి కూడా కేటాయించలేదు. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లోనైనా నిధులు కేటాయిం చాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. 50 శాతం నిధులిస్తే.. బోధన్–బీదర్ రైలు మార్గానికి సర్వే పూర్త యింది. రూ.2వేల కోట్ల తో ఈ ప్రాజెక్టు చేపట్టా ల్సి ఉంది. మారిన నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులు కేటాయిస్తే 50 శాతం నిధులను కేంద్రం మంజూరు చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే ప్రాజెక్టు ముందుకు సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపుపైనే ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంది. – బీబీ పాటిల్, జహీరాబాద్ ఎంపీ ♦ బోధన్–బీదర్ రైల్వేలైన్ ప్రతిపాదించింది 1938 నిజాం హయాంలో ♦ రైల్వే లైన్ పొడవు 138 కిలో మీటర్లు (తెలంగాణలో 90 కి.మీ., మహారాష్ట్ర, కర్ణాటకలో 48 కి.మీ.) ♦ లబ్ధి పొందే జిల్లాలు నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, బీదర్ ♦ సర్వే పూర్తయినది 2014లో ♦ అప్పట్లో అంచనా వ్యయం రూ.1,029 కోట్లు ♦ ప్రస్తుత అంచనా రూ.2 వేల కోట్లు -
కిడ్నాప్ కేసులో ఇద్దరి అరెస్ట్
నిజామాబాద్ : కిడ్నాప్ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వివరాలు..బోధన్ పట్టణంలో యాచిస్తూ జీవనం సాగిస్తున్న దుర్గం వెంకట్-సావిత్రిలకు 15 రోజుల మగ శిశువు ఉన్నాడు. శిశువుతో కలిసి పట్టణంలోని హనుమాన్ మందిరం సమీపంలోని లక్ష్మీ జ్యూవెల్లరీ దుకాణం వద్ద శనివారం రాత్రి నిద్రిస్తుండగా ఇద్దరు యువకులు ఇలియాస్, చిరంజీవిలు 11 గంటల సమయంలో బాబును ఎత్తుకెళ్లారు. గోశాల కాలనీకి చెందిన కౌసర్ బేగంకు రూ. 5 వేలకు విక్రయించారు. బాబును కొనుగోలు చేసిన కౌసర్ బేగం మహారాష్ట్రలోని దెగ్లూర్లో ఉంటున్న తన కూతురు గౌసియా బేగం వద్ద ఉంచింది. ఉదయం బాబు కనపడకపోవడంతో ఆందోళన చెందిన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా విచారణ చేపట్టి, బాబును తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. కిడ్నాప్‌నకు పాల్పడిన ఇద్దరు యువకులతో పాటు శిశువును కొన్న మహిళపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. -
ఆ అధికారులను విచారించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు చిల్లుపెట్టిన బోధన్ వాణిజ్య పన్నుల శాఖ కేసుకు సంబంధించి సీఐడీ విచారణలో వేగం పెంచింది. ఈ కేసు దర్యాప్తులో రెండో ఎపిసోడ్ ప్రారంభించిన సీఐడీ అధికారులు.. శుక్రవారం నాంపల్లిలోని వాణిజ్య పన్నుల శాఖ కేంద్ర కార్యాలయానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు గుర్తించిన నకిలీ చలాన్లు, అందుకు కారణమైన అధికారుల్లో కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ చేసింది. అయితే అరెస్టయిన అధికారులతో పాటు ఉన్నతాధికారుల్లో కొంతమందికి స్కామ్‌తో లింకున్నట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. నకిలీ చలాన్ల ద్వారా లబ్ధి పొందిన డిస్ట్రిబ్యూటర్లు, రైస్‌మిల్లర్లు, ఇతరత్రా వ్యాపారులు అసలు కట్టాల్సిన చలానా ఎంత? కట్టకుండా ఎగ్గొట్టి అధికారుల జేబుల్లోకి నింపిన ఖజానా ఎంత అన్న అంశాలను తెలుసుకునేందుకు శుక్రవారం దర్యాప్తు అధికారి అయిన సీఐడీ ఎస్పీ, తన బృందంతో వాణిజ్య పన్నుల శాఖలో విచారించారు. మరో 16 మందిపై అనుమానం బోధన్ స్కామ్‌లో పలువురు అధికారులను అరెస్ట్ చేసిన సీఐడీ.. వారి విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలతో మరో 16 మంది అధికారులపై అనుమానం వ్యక్తం చేస్తోంది. లబ్ధి పొందిన వ్యాపార సంస్థల నుంచి పై స్థాయిలో ఉన్న అధికారుల జేబుల్లోకి ప్రభుత్వ ఖజానా సొమ్ము వెళ్లినట్టు గుర్తించింది. దీంతో వారిని సైతం విచారించేందుకే వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయానికి వెళ్లినట్టు సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు. ఆ 16 మందికి సంబంధించిన వివరాలు సేకరించడంతో పాటు పలు కీలకమైన ఆడిటింగ్ డాక్యుమెంట్లను సీఐడీ అధికారులు వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులను అడిగినట్టు తెలిసింది. ఆ 16 మంది అధికారులు తమ దర్యాప్తుకు సహకరించేలా చూడాలని, ఈ మేరకు తాము నోటీసులిస్తామని సీఐడీ అధికారులు సూచించినట్టు తెలుస్తోంది. -
నత్తలా నడుస్తూనే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రెండు కుంభకోణాల కేసులు ఇంకా ‘నానుతూనే’ఉన్నాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి ఏడాదిన్నర గడిచినా చార్జిషీటు దాఖలుకాని ఎంసెట్ కేసు ఒకటికాగా.. రాష్ట్ర ఖజానాకు వందల కోట్లు కన్నం వేసిన బోధన వాణిజ్య పన్నుల కుంభకోణం మరొకటి. రెండు కేసులూ సీఐడీ చేతుల్లో ఉన్నా.. దర్యాప్తు మాత్రం ‘సాగుతూనే’ఉంది. కేవలం నోటీసులు, లేఖలు, ప్రశ్నించడాలతోనే సరిపోతోంది. ఈ నాన్చివేత ధోరణిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఎంసెట్’పై కొత్త సందేహాలు? 2016 ఆగస్టులో ఎంసెట్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కేసు విచారణ ప్రారంభించిన మొదట్లో సీఐడీ చురుగ్గా వ్యవహరించినట్లు కనిపించింది. 68 మంది బ్రోకర్లు, 16 మంది సూత్రధారులను పట్టుకోగలిగింది. అయితే ఓ కీలక సూత్రధారి కస్టడీలో మృతిచెందగా, ప్రశ్నపత్రం లీక్ చేసిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఇక ఈ కేసులో ఇప్పటివరకు చార్జిషీట్ దాఖలు చేయలేదు. డ్రాఫ్ట్ చార్జిషీట్ సిద్ధం చేసి నాలుగు నెలలు గడిచింది. ఇది అటు కోర్టుకు వెళ్లక, ఇటు తుది దశకు చేరక సందిగ్ధ పరిస్థితి నెలకొంది. దీనిపై సీఐడీ అధికారులను వివరణ కోరగా... జేఎన్టీయూకు లేఖలు రాశామని, ప్రశ్నపత్రం తయారీ కమిటీ, ఆ కమిటీ మినిట్స్ తదితర సమాచారం కావాలని కోరామని చెబుతోంది. అంటే దర్యాప్తు దాదాపు పూర్తయి డ్రాఫ్ట్ చార్జిషీట్ సిద్ధమయ్యాక మళ్లీ విచారణ యూటర్న్ తీసుకోవడం, జేఎన్టీయూ అధికారులపై అనుమానాలు లేవంటూనే మళ్లీ నోటీసులిచ్చి మినిట్స్ కావాలనడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. చార్జిషీట్ రూపొందించడానికి ముందే ఈ నోటీసులు ఎందుకు జారీచేయలేదు. అప్పుడే ఈ కోణంలో ఎందుకు విచారణ సాగించలేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. వందల కోట్లు గండికొట్టినా చర్యల్లేవు.. రాష్ట్ర ఖజానాకు రూ.450 కోట్లకుపైగా కుచ్చుటోపీ పెట్టిన బోధన్ కమర్షియల్ ట్యాక్స్ కుంభకోణం వ్యవహారం సీఐడీ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరి చివరలో కేసు నమోదు చేసిన సీఐడీ.. పాత్రధారులుగా ఉన్న 8 మంది అధికారులను, ఇద్దరు సూత్రధారులను అరెస్టు చేసింది. కానీ ఈ కుంభకోణంలో లబ్ధిపొందిన డిస్టిబ్యూటర్లు, ఏజెన్సీలు, ఇతర వ్యక్తులవైపు సీఐడీ కన్నెత్తి చూడకపోవడం సందేహాలను లేవనెత్తింది. రాజకీయ నేతల ఒత్తిళ్ల కారణంగానే జాప్యం జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నకిలీ చలానాలను ట్రెజరీ కార్యాలయాలకు పంపి వెరిఫికేషన్ చేయిస్తున్నామని సీఐడీ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి మేలోనే 5,540 నకిలీ చలాన్లు గుర్తించామని, వాటిని చెక్ చేసేందుకు సీఐడీ బృందం సబ్ ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లిందని గతంలోనే ఉన్నతాధికారులు తెలిపారు. కొందరు అధికారులపై విచారణకు ఆ శాఖ ఉన్నతాధికారులు అడ్డుపడ్డారని సీఐడీ ఆరోపించింది. కానీ తర్వాత వారి నుంచి క్లియరెన్స్ వచ్చినా... చర్యలు చేపట్టడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారన్నది అనుమానాస్పదంగా మారింది. ఇందిరమ్మ కేసు మూసేసినట్లే! ఇందిరమ్మ ఇళ్ల కేసును మూసివేసేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. లబ్ధి దారులు సబ్సిడీ పొందిన సమయం, ఇళ్లు నిర్మించిన సమయం తదితర సరిగా వివరాలు దొరకడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. వివరాలు దొరికినా సరైన తేదీల్లోనే లబ్ధిదారులకు చేరినట్టు కొన్నిచోట్ల వెల్లడికావటంతో బలమైన ఆధారాలు లేవని అభిప్రాయపడుతున్నారు. దీంతో కేసును మూసివేయడమే మేలని సీఐడీ ప్రభుత్వానికి సంకేతాలు పంపింది. ఈ కేసులో సీఐడీకి ముందుకెళ్లే అవకాశం లేదని సీఐడీ ఉన్నతా«ధికారి ఒకరు వెల్లడించారు. కొత్త డీజీపీకి సవాలే.. ఎంసెట్, బోధన్ కుంభకోణాల్లో చార్జిషీట్ల దాఖలు పెండింగ్‌లో ఉంది. ఈ కేసులు కొత్త డీజీపీ మహేందర్‌రెడ్డికి సవాలుగా నిలవనున్నాయి. ఈ కేసులపై ఎలా ముందుకెళ్తారు? చార్జిషీట్ల నమోదు సమస్యలను ఎలా పరిష్కరిస్తారన్న దానిపై అధికారుల్లో చర్చ జరుగుతోంది. -
అప్పునకు బదులు కొడుకునెత్తుకెళ్లాడు
-
అప్పునకు బదులు కొడుకునెత్తుకెళ్లాడు
బోధన్: తీసుకున్న అప్పుకు బదులు వడ్డీ వ్యాపారి కొడుకును ఎత్తుకు పోయాడు. అప్పుతీర్చకుంటే చంపేస్తానని బెదిరించడంతో భయపడి భర్త పారిపోయాడు. దిక్కుతోచని స్థితిలో ఓ బాధితురాలు సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిర్వహించిన ప్రజావాణిలో తన గోడును సబ్ కలెక్టర్ వద్ద సిక్తా పట్నాయక్ వెళ్లబోసుకుంది. బోధన్‌లోని శర్భతీ కెనాల్ ప్రాంతంలో భారతి, మోతీ దంపతులకు నలుగురు పిల్లలు రవి, అంజలి, పవన్, ఓం ఉన్నారు. వీరు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఊరూరా తిరుగుతూ మోతీ బట్టల వ్యాపారం చేస్తాడు. వీరి సమీప బంధువు బోధన్‌కు చెందిన నారాయణ వద్ద వ్యాపారం కోసం ఏడాది క్రితం రూ. 70 వేలు అప్పుగా తీసుకున్నారు. తిరిగి అప్పు చెల్లి›ంచడంలో ఆలస్యం జరిగింది. అయితే, దశల వారీగా రూ. 20 వేల వరకు చెల్లించారు. కాగా, అసలు అప్పు, వడ్డీ కలిపి రూ. 2 లక్షల వరకు అయ్యాయని.. మొత్తం అప్పు చెల్లించాలని సదరు వడ్డీవ్యాపారి ఒత్తిడి చేశాడు. వారం రోజుల క్రితం అప్పు చెల్లించి తీసుకెళ్లాలని.. వీరి కుమారుడు పవన్ (9)ను బలవంతంగా తీసుకెళ్లాడు. అలాగే, అప్పు చెల్లించకుంటే చంపేస్తానని బెదిరించడంతో మోతి ఇల్లు వదిలి పారిపోయాడు. తన భర్త ఎక్కడికెళ్లిందీ.. తన కొడుకును ఏం చేశాడో తెలియదని బాధితురాలు భారతి సబ్ కటెక్టర్కు విన్నవించుకుంది. మొత్తం అప్పు చెల్లించకపోతే మిగిలిన ముగ్గురు పిల్లలను తీసుకెళ్తానని బెదిరిస్తున్నాడని బోరుమంది. -
రైస్‌మిల్స్‌పై విజిలెన్స్ పంజా
బోధన్‌రూరల్(బోధన్): రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో విజిలె న్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారు లు పంజా విసిరారు. కొద్ది రోజులుగా మాటు పెట్టిన వారు సోమ వారం అర్థరాత్రి నుంచి నిఘా పెట్టి దాడులు చేశారు. పట్టణ శివారులోని సూర్య ఆగ్రో, చం ద్ర ఇండస్ట్రీస్‌లో రూ.36 లక్షలు విలువ చేసే 1500 క్వింటాళ్ల బియ్యాన్ని, ఓ లారీని, ఆటోను సీజ్ చేశారు. రెండు మిల్లుల యజమానిపై కేసు నమోదు చేశారు. అనంతరం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ ఎస్పీ కేఆర్ నాగరాజు మా ట్లాడారు. బోధన్‌లో కొద్ది రోజులుగా పీడీఎస్ రైస్‌ను తక్కువ ధరకు కొని రీసైకిలింగ్ చేసి తిరిగి ఎక్కు వ ధరకు అమ్మడం, దొడ్డు బియ్యాన్ని సన్నగా మార్చి అమ్మడం వంటి అక్రమాలు సాగుతున్నాయని తమ దృష్టికి వచ్చిం దన్నారు. దీంతో అనుమానం వచ్చి రైస్ మిల్లులపై నిఘా పెట్టామన్నారు. మంగళవారం తెల్లవారుజామున ప్రభాకర్ అనే వ్యక్తి చెందిన సూర్య, చంద్ర రైస్‌మిల్లులకు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండడంతో పట్టుకున్నా మన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బియ్యాన్ని ప్రభాకర్ రెడ్డి రైస్‌మిల్లులో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వీటి ని విచారణకు ఉన్నతాధికారులకు పం పించామన్నారు. సూర్య ఆగ్రో, చం ద్ర ఇండస్ట్రీస్ యాజమాని ప్రభాకర్‌రెడ్డిపైక్రిమి న ల్ కేసు నమోదు చేశామన్నా రు. పట్టుబడిన బియ్యాన్ని పరీక్షల కో సం పంపించామని చెప్పారు. నివేదిక లు వచ్చాకమరిన్ని చర్యలు తీసుకుంటా మనివెల్లడించారు. అధికారుల నిఘా, మెరుపు దాడులు.. మంగళవారం తెల్లవారుజామున ఆటో (టీఎస్16 యూబీ 3859)లో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రైస్ మిల్లుకు తరలిస్తున్నారన్న సమాచారంతో అధికారులు వెంబడించారు. పట్టణానికి చెందిన ప్రభాకర్‌రెడ్డికి సంబంధించిన చంద్ర ఇండస్ట్రీస్‌లోకి ఆటో వెళ్లగా, అధికారులు పట్టుకున్నారు. తనిఖీలు చేసి భారీగా బియ్యం నిల్వలను గుర్తించారు. అనంతరం పక్కనే ఉన్న మరో రైస్‌మిల్ సూర్య ఆగ్రో ఇండస్ట్రీస్‌లో తనిఖీలు చేయగా నిబంధనలకు విరుద్ధంగా బియ్యం నిల్వలను గుర్తించారు. వీటి పత్రాలు, వివరాలు సక్రమంగా లేక అధికారులు సీజ్ చేశారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు.. పీడీఎస్ బియ్యంతో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నాగరాజు హెచ్చరించారు. బోధన్‌లో చేసిన దాడుల అనంతరం ఆయన మాట్లాడారు. నిజామాబాద్, కామారెడ్డి, మెద క్, సిద్దిపేట, మేడ్చల్ జిల్లాల్లో నిరంతరం దాడులు చేస్తున్నామన్నారు. ఐదు జిల్లాలో ఎక్కడైనా పీడీఎస్ బియ్యంపై అక్రమాలకు పాల్పడితే 80082 03377కు సమాచారం అందించాలని కోరారు. ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాస్, డీసీటీవో ఉపేందర్, సీఐలు వినాయక్‌రెడ్డి, బాల్‌రెడ్డి, ఎస్ఐ సంగమేశ్వర్ గౌడ్, హెచ్‌సీ లక్ష్మారెడ్డి, కానిస్టేబుళ్లు శివానంద్, శివకుమార్, సుదర్శన్, డీఈ రమణ, ఏఆర్ రమేశ్, బోధన్ తహసీల్దార్ గంగాధర్, డీటీ వసంత, శశి భూషన్, అధికారులు పాల్గొన్నారు. -
మేనబావ లేడని.. మరదలి ఆత్మహత్య
► జీవితంపై విరక్తితో బలవన్మరణానికి పాల్పడిన బావ ► మనస్తాపంతో తర్వాతి రోజే యువతి కూడా.. నవీపేట(బోధన్): మేనబావ అంటే ఆమెకెంతో ఇష్టం.. కానీ అనుకోకుండా అతడు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ యువతి తట్టుకోలేక పోయింది. తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని జన్నెపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై రవీందర్‌నాయక్ కథనం ప్రకారం.. జన్నెపల్లికి చెందిన బోడ శ్రీనివాస్, వాణి దంపతులకు కొడుకు నాగరాజు, కూతురు నందిని (19) ఉన్నారు. నందిని ఇటీవలే ఇంటర్ పూర్తి చేసి, డిగ్రీలో చేరేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంది. నందిపేట మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన మేనబావ రచ్చ సాయికుమార్ అంటే ఆమెకెంతో ఇష్టం. అయితే, సాయికుమార్ జీవి తంపై విరక్తి చెంది సోమవారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం నంది పేటలో జరిగిన అంత్యక్రియలకు నం దిని తల్లిదండ్రులు వెళ్లారు. అయితే, మేనబావ మృతితో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె.. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. పూర్తిగా కాలిపోయిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే, ఇంటి నుంచి పొగలు రావడంతో గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు.. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
అటకెక్కిన బోధన్ స్కాం
► అమాత్యుడి జోక్యంతో నిలిచిన దర్యాప్తు ►ఫలించిన కమర్షియల్ వర్గాల ఒత్తిడి మంత్రం ►ఆపేయాలంటూ ప్రభుత్వం నుంచి సీఐడీకి ఆదేశం ►అరెస్ట్‌లు ఆపి.. చార్జిషీట్‌తో సరిపెట్టేందుకు యత్నాలు ►అసలు దొంగలను వదిలేశారంటూ సర్వత్రా విమర్శలు ►తమను బలి చేశారంటున్న కింది స్థాయి అధికారులు సాక్షి, హైదరాబాద్ బోధన్ వాణిజ్య పన్నుల శాఖలో వెలుగుచూసిన స్కాం అటకెక్కినట్టే కనిపిస్తోంది! ఇప్పటిదాకా అక్రమార్కుల చుట్టూ ఉచ్చు బిగిస్తూ సాగిన దర్యాప్తు ఇప్పుడు ఉసూరుమంటోంది. ఓ అమాత్యుడి పైరవీనే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల వద్ద ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించినట్టుగా కనిపిస్తున్నాయి. అందుకే 15 రోజులుగా ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. వందల కోట్లు కొల్లగొట్టిన ఈ స్కాం కూడా అన్ని కేసుల మాదిరే కోల్డ్‌స్టోరేజీలోకి వెళ్లినట్టేనని అటు వాణిజ్య పన్నుల శాఖ, ఇటు సీఐడీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. మేలో స్పీడ్.. జూన్‌లో కళ్లెం.. గతేడాది డిసెంబర్లో వెలుగులోకి వచ్చిన బోధన్ నకిలీ చలాన్ల స్కాం మార్చిలో సీఐడీ చేతికి వచ్చింది. మార్చి, ఏప్రిల్‌లో తూతూమంత్రంగా సాగిన విచారణ కాస్తా మే వచ్చేసరికి హైస్పీడ్‌లో దూసుకెళ్లింది. డిప్యూటీ కమిషనర్లు, ట్యాక్స్ అధికారులు, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, కీలక సూత్రదారులందరినీ కటకటాల్లోకి నెట్టేలా దర్యాప్తు సాగింది. ఈ కేసులో ఇక మిగిలింది కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులే కావడంతో కేసు దర్యాప్తును ప్రభావితం చేసే చర్యలు మొదలయ్యాయి. జూన్ రాగానే కేసు పూర్తిగా పక్కనబడింది. హైస్పీడ్‌తో నడిచిన దర్యాప్తు కాస్తా నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వంపై ఒత్తిడి.. 2005 నుంచి 2014 వరకు సాగిన నకిలీ చలాన్ల దందాలో బోధన్ నుంచి హైదరాబాద్‌లోని ఉన్నతాధికారుల వరకు భాగస్వామ్యం ఉన్నట్టు తేలింది. ఇందులో భాగంగా నిజామాబాద్‌లో గతంలో పనిచేసిన అధికారులను సీఐడీ అరెస్ట్ చేసింది. ఏసీటీవో, డిప్యూటీ కమిషనర్ల నుంచి పైస్థాయిలో వసూళ్లు చేసిన ఇతర ఉన్నతాధికారులను అరెస్ట్ చేసేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో పలువురు ఉన్నతాధికారులు మంత్రుల చుట్టూ చక్కర్లు కొట్టారు. ఈ కేసులో తాము అరెస్ట్ కాకుండా చూడాలని వేడుకున్నారు. ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖ అంటే అవినీతికి కేరాఫ్ అన్నట్టుగా ముద్ర పడిందని, అక్కడ పనిచేసేందుకు ఏ అధికారి, సిబ్బంది ఇష్టపూర్వకంగా లేరంటూ కీలకమైన ఓ మంత్రిపై ఒత్తిడి పెంచారు. అంతటితో ఆగని అధికారులు.. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ధర్నాకు వెళ్తామని తెగేసి చెప్పారు. దీంతో చేసేదేమి లేక సదరు మంత్రి ప్రభుత్వ పెద్దల వద్ద లాబీయింగ్‌కు ఒప్పుకున్నారు. అనుకున్నట్టుగానే మంత్రి కేసులో చక్రం తిప్పారు. ఇక చాలు ఆపండి... కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీకి ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ‘స్కాం మొత్తం బయటపడింది కదా.. క్రియాశీలక పాత్ర పోషించిన వారిని అరెస్ట్ చేశారుగా.. ఇక ఆపేయ్యండి.. చేసింది చాలు..’ అని ఆదేశాలు రావడంతో కేసును సీఐడీ పక్కనపెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. స్కాం జరిగిన తీరు తెన్నులు, నకిలీ చలాన్లు, వాటి ఆడిటింగ్‌ను కాగ్‌కు అప్పగించినట్టు తెలిసింది. ప్రతీ చలాన్ పరిశీలించి, పక్కదారి పట్టిన పన్నులపై నివేదిక ఇవ్వాలని కాగ్‌ను ప్రభుత్వం కోరినట్టు తెలిసింది. దీంతో కేసును, అరెస్టులను పక్కనబెట్టి చార్జిషీట్ వేసే ప్రక్రియ ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది. అసలు దొంగలు దొరలయ్యారా? బోధన్ కేంద్రంగా సాగిన నకిలీ చలాన్ల స్కాంలో రూ.400 కోట్ల వరకు సొమ్ము పక్కదారిపట్టినట్టు సీఐడీ ఆధారాలతో సహా నిర్ధారించింది. అయితే స్కాంలో అరెస్టయిన అధికారులు సంచలనాత్మక ఆరోపణలు చేస్తున్నారు. ‘మమ్ముల్ని అరెస్ట్ చేశారు సరే.. మరి మాపై ఒత్తిడి తెచ్చి శివరాజుకు సహకరించిన కేంద్ర కార్యాలయంలోని ఉన్నతాధికారుల సంగతేంటి’ అని వారు ప్రశ్నించారు. లక్షలు దోచుకొని సౌతాఫ్రికాలో పెట్టుబడులు పెట్టిన ఓ జాయింట్ కమిషనర్‌పై చర్యలు తీసుకోరా అని బెయిల్‌పై బయటకు వచ్చిన ఓ అధికారి నిలదీశారు. అప్పుడు దొంగలయిన వారు ఇప్పుడు పునీతులయ్యారని ఆరోపించారు. అంతేకాదు ఆడిటింగ్ నిర్వహించిన ఏజీ అధికారులు కూడా స్కాంలో పాత్రధారులేనని సీఐడీ తేల్చిందని, వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. -
తప్పు చేసినవారిని వదలొద్దు
► బోధన్ స్కాం దోషులను కఠినంగా శిక్షించాలి: సీఎం కేసీఆర్ ► ఏళ్లుగా పాతుకుపోయిన అధికారులను బదిలీ చేయండి సాక్షి, హైదరాబాద్: బోధన్ కమర్షియల్ ట్యాక్స్ స్కాంను తీవ్రంగా పరిగణించాలని సీఎం కేసీఆర్.. అధికారులను ఆదేశించారు. సమగ్రమైన దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలని స్పష్టంచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు చేపట్టాలన్నారు. మంగళవారం ప్రగతి భవన్లో సీఎం వాణిజ్య పన్నుల శాఖపై సమీక్ష నిర్వహించారు. వాణిజ్య పన్నుల శాఖ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో పలువురు అధికారులు సుదీర్ఘకాలంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలోనే పని చేస్తున్నారని, వారిని గుర్తించి బదిలీ చేయాలని వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేసిన వారిని వదల కూడదన్నారు. ‘‘ఇలాంటి సంఘటనలు మరెక్కడైనా జరిగే ఆస్కారం ఉందా..? అలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..’’ అని ఆరా తీశారు. ‘‘కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నాం. అవినీతి అరికట్టే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదు. అక్కడక్కడా ఇంకా అవినీతి చోటుచేసుకుంటున్నదంటే.. అది గత ప్రభుత్వాల అవలక్షణం. మనం ప్రభుత్వ యంత్రాంగాన్నీ, పాలనా పద్ధతులను ప్రక్షాళన చేసినప్పటికీ.. మన మంచితనాన్ని అలసత్వంగా తీసుకుని కొందరు ఇలా చేసున్నారు. ఇలాంటి దొంగలను పట్టుకుని భవిష్యత్‌లో అవినీతికి ఆస్కారం లేని వ్యవస్థ రూపొందించుకోవాలి. అవినీతి వాతావరణం మన రాష్ట్రంలో ఏ మాత్రం ఉండటానికి వీల్లేదు’’ అని సీఎం పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి ఈటæల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ, సీఎంవో అధికారులు నర్సింగ్ రావు, స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి సోమేశ్‌కుమార్, కమిషనర్ అనిల్‌కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి సమృద్ధిగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నుల శాఖ పటిష్టంగా పనిచేయాలని సీఎం పేర్కొన్నారు. పన్నుల వసూలు, వినూత్న విధానాలతో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ దేశంలో నంబర్ వన్‌గా నిలవా లని అన్నారు. శాఖను మరింత పటిష్ట పరిచేం దుకు సరైన వ్యూహం తయారుచేసుకోవాలని అధికారులకు సూచించారు. -
సీఎం కేసీఆర్ సీరియస్
బోధన్ ఫోర్జరీ చలాన్ల ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా వాణిజ్య పన్నుల శాఖ సమీక్ష సమావేశాన్ని ఆయన ప్రగతి భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోధన్ చలాన్ల వ్యవహారంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఇలాంటివి రాష్ట్రంలో ఇంకెక్కడా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవినీతిని అరికట్టే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, వాణిజ్య పన్నుల శాఖ పటిష్ఠంగా పనిచేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. కాగా బోధన్ స్కాం గురించి అది వెలుగులోకి వచ్చిన సమయంలోనే ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. తక్షణం దానిపై విచారణ జరిపి బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
సీఎం కేసీఆర్ సీరియస్
-
‘ఇన్పుట్’తోనూ ఎగనామం
- బోధన్ స్కాంలో కొత్తకోణం.. - అడ్రస్ లేని వ్యాపార సంస్థల నుంచి బోగస్ ఇన్వాయిస్లు - ఏటా రూ.కోట్లలో పన్ను ఎగవేతలు.. - మిల్లర్ల మరో అక్రమాల బాగోతమిది.. సాక్షి, నిజామాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బోధన్ స్కాంలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటి వరకు బోగస్ చలానాలతోనే రూ.వందల కోట్లు పన్ను ఎగవేసినట్లు తేలింది. ఇది కాకుండా ఇన్పుట్ ట్యాక్స్ పేరుతో కూడా కొందరు రైస్ మిల్లర్లు సర్కారుకు పెద్ద మొత్తంలో ఎగనామం పెట్టినట్లు తాజాగా వెలుగులోకి వస్తోంది. చాలా మంది రైస్ మిల్లర్లు బోగస్ చలానాలతో పన్ను ఎగవేస్తే.. పెద్ద మొత్తంలో టర్నోవర్ చేసిన కొందరు మిల్లర్లు మాత్రం ఇలా ఇన్పుట్ ట్యాక్స్ దారిని ఎంచుకున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ విచారణ అధికారుల దృష్టికి వచ్చింది. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన మిల్లర్లు పన్ను ఎగవేసేందుకు వ్యాపారుల వద్ద కొన్నట్లు బోగస్ ఇన్వాయిస్లతో సర్కారును బురిడీ కొట్టించారు. ఇన్పుట్ ట్యాక్స్ అంటే..? వ్యాపారి గానీ, వ్యాపార సంస్థ గానీ ఆ నెలలో చేసిన క్రయవిక్రయాలపై వ్యాట్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంలో సరుకు క్రయవిక్రయాల్లో పెరిగిన విలువ ఆధారంగా పన్ను మొత్తం కూడా పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యాపారి రూ.లక్ష విలువ చేసే వంద క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తే దానిపై రూ.4వేలు (4 శాతం) వ్యాట్ చెల్లించాలి. ఆ వ్యాపారి ఈ ధాన్యంపై లాభం, ఇతర ఖర్చులు కలుపుకుని రూ.1.25 లక్షలకు ఓ రైస్ మిల్లరుకు విక్రయించాడనుకుందాం. కొనుగోలు చేసిన రైస్ మిల్లరు అదనంగా కలిసిన రూ.25 వేల విలువకు రూ.వెయ్యి చెల్లిస్తే సరిపోతుంది. ఆ రూ.4 వేల పన్ను మొత్తాన్ని ఇన్పుట్ ట్యాక్స్ కింద చూపుతారు. ఆడిట్ అధికారులకు భారీ నజరానాలు... జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లు బోగస్ వ్యాపార సంస్థలు సృష్టించి.. వాటి పేరుతో నకిలీ ఇన్వాయిస్లు తయారు చేసి, ఇన్పుట్ ట్యాక్స్ పేరుతో తక్కువ పన్ను కట్టారని అధికారుల దృష్టికి వచ్చింది. ఈ విధంగానూ వాణిజ్య పన్నుల శాఖకు ఏటా రూ.కోట్లలో కుచ్చుటోపీ పెట్టారు. ఇన్పుట్ ట్యాక్స్ చూపిస్తున్న రైస్ మిల్లర్ల రికార్డులను పరిశీలించాల్సిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రతి నెలా మామూళ్లతో సరిపెట్టుకోవడంతో ఈ దందా యథేచ్ఛగా సాగింది. అప్పుడప్పుడు తనిఖీలకు వెళ్లే ఆడిట్ విభాగానికి పెద్ద మొత్తంలో నజరానాలు ముట్టజెప్పడం ఇక్కడ ఆనవాయితీ. ప్రస్తుతం బోధన్ స్కాంలో సూత్రధారులైన ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్, అతని కుమారుడు సునీల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సీఐడీ అధికారులు... ఇన్పుట్ ట్యాక్స్ కుంభకోణంపై కూడా దర్యాప్తు చేస్తే మరికొంత మంది రైస్‌మిల్లర్ల బాగోతాలు బట్టబయలయ్యే అవకాశాలున్నాయి. -
అవినీతి పుట్ట
బోధన్ స్కాంలో వెలుగుచూస్తున్న విస్మయకర అంశాలు (ఐరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి– సాక్షి ప్రతినిధి) అతడో సాధారణ ట్యాక్స్ కన్సల్టెంట్.. అవినీతి అధికారులను అడ్డుపెట్టుకొని వందల కోట్లు కొల్లగొట్టాడు.. ఏకంగా వాణిజ్య పన్నుల విభాగాన్నే శాసించాడు..! బోధన్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న శివరాజు కొన్నేళ్లుగా నిర్మించిన అవినీతి పుట్ట పగులుతోంది. సీఐడీ విచారణలో అతడు సంచలనాత్మక విషయాలను బయటపెట్టాడు. తాను ప్రారంభించిన కుంభకోణాన్ని తనయుడికి అప్పగించి కోట్ల కొద్దీ సొమ్మును జేబులో వేసుకొన్నట్టు ఒప్పుకొన్నాడు. 2005 నుంచి మొదలైన స్కాం.. బోధన్ స్కాంకు 12 ఏళ్ల కిందటే బీజాలు పడ్డాయి. ట్యాక్స్ వసూలు చేసి వెబ్‌పోర్టల్ ద్వారా సంబంధిత చలాన్లను అప్లోడ్ చేసేలా 2005లో నాటి ప్రభుత్వం పారదర్శకత కోసం వ్యాటిస్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా కేవలం చలాన్లు కట్టినట్టు ఓ కాపీని పోర్టల్‌లో అప్లోడ్ చేసేవారు. దీన్నే శివరాజు అవకాశంగా మల్చుకున్నాడు. నకిలీ చలాన్లు సృష్టించి, అప్పటి బోధన్ సీటీవోగా పనిచేసిన నారాయణదాస్ వెంకట కృష్ణమాచారి ద్వారా వెబ్‌పోర్టల్‌లో అప్లోడ్ చేసినట్టు శివరాజు విచారణలో ఒప్పుకున్నాడు. ఇందుకు కృష్ణమాచారికి ప్రతీనెల రూ.లక్ష లంచం ఇచ్చినట్టు వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అతడి కార్యాలయమే సర్కిల్ ఆఫీస్ శివరాజు నిజామాబాద్‌లోని ద్వారాకానగర్ మాత్రుచాయ అపార్ట్మెంట్లోని తన ఇంటినే కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంగా మార్చేశాడు. జూనియర్ అసిస్టెంట్ నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు ప్రతీ ఒక్కరికి నెలనెలా లక్షల్లో లంచాలు ఇచ్చాడు. ఏసీటీవో నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు అందరి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను శివరాజు వాడుకున్నాడు. ఆడిటింగ్, విజిలెన్స్, ఇంటెలిజెన్స్.. ఈ మూడు విభాగాల అధికారులకు లంచాలిచ్చి నకిలీ చలాన్లు, పోర్టల్‌లో ఎంట్రీ చేసిన తప్పుడు సమాచారం బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. అంతేకాదు బ్యాంకుకు సంబంధించిన స్టాంపు, సబ్‌ట్రెజరీ ఆఫీస్ స్టాంపు, కమర్షియల్ ట్యాక్స్ అధికారుల స్టాంపులు కూడా నకిలీవి తయారుచేసి ఇంట్లోనే ఫేక్ చలాన్లు సృష్టించి ట్యాక్స్ క్లెయిమ్ చేశాడు. అకౌంటింగ్ జనరల్ అధికారులకూ పాత్ర శివరాజు చేసిన స్కాంలో అకౌంటింగ్ జనరల్ అధికారులు సైతం పాత్ర వహించినట్టు సీఐడీ గుర్తించింది. బోధన్ సర్కిల్ కార్యాలయంలో ఆడిటింగ్‌ను ఏమాత్రం పరిశీలించకుండా లంచాలకు అమ్ముడుపోయినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో సీఐడీ స్పష్టం చేసింది. శివరాజుతో కుమ్మక్కవడం వల్లే ఇంత పెద్ద మొత్తంలో మోసం జరుగుతున్నా పట్టించుకోలేదని సీఐడీ పేర్కొంది. అధికారులకు కార్లు, విదేశీ టూర్లు తన అక్రమాలకు సహకరించిన ప్రతి అధికారికి లంచాలివ్వడంతోపాటు కార్లు, విదేశీ ప్రయాణాలు గిఫ్టుగా ఇచ్చినట్టు శివరాజు తన వాంగ్మూలంలో తెలిపాడు. సీటీవో కృష్ణమాచారికి చెవ్రోలెట్ స్పార్క్ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు. డిప్యూటీ కమిషనర్ ధరణీ శ్రీనివాస్‌రావుకు హోండా అమేజ్ కారు బహుమానంగా ఇచ్చాడు. అలాగే అతడి ఇంటికి రూ.5 లక్షల విలువ చేసే ఫర్నీచర్‌ను, విదేశీ ప్రయాణాలను గిçఫ్టుగా ఇచ్చినట్టు పేర్కొన్నాడు. ఏసీటీవో సంజీవ్ గౌడ్‌కు టాటా ఇండికా కారు, ఇంటికి రూ.50 వేల విలువైన ఫర్నీచర్, అసిస్టెంట్ కమిషనర్ పూర్ణచందర్‌రెడ్డికి మహీంద్రా జైలో కారు గిఫ్టుగా ఇచ్చాడు. నెలనెలా ఏ అధికారికి ఎంత లంచం? అధికారి లంచం శ్రీనివాస్‌రావు(డిప్యూటీ కమిషనర్) రూ.5 లక్షలు ఎన్.శ్రీనివాసులు(డిప్యూటీ కమిషనర్) రూ.5 లక్షలు లక్ష్మయ్య(అసిస్టెంట్ కమిషనర్) రూ.1.5 లక్షలు నాయర్(అసిస్టెంట్ కమిషనర్) రూ.1.10 లక్షలు సంజీవ్ గౌడ్(సీటీవో) రూ.లక్ష ఎన్.కృష్ణమాచారి(సీటీవో) రూ.లక్ష ఆర్డీ విజయకృష్ణ(ఏసీటీవో) రూ.40 వేలు వేణుగోపాలస్వామి(సీనియర్ అసిస్టెంట్) రూ.40 వేలు హనుమంత్ సింద్(జూనియర్ అసిస్టెంట్) రూ.20 వేలు ఈశ్వర్(డీసీటీవో) రూ.50 వేలు పూర్ణచందర్‌రెడ్డి(సీటీవో బోధన్) రూ.లక్ష ఎన్.ఇందిరా(ఏసీటీవో–బోధన్) రూ.20 వేలు రఘునాథ్‌బాబు (విజిలెన్స్ డీసీటీవో) రూ.1.10 లక్షలు(మూడు నెలలకు) లక్ష్మీనారాయణ(ఏసీటీవో) రూ.లక్ష (ఆరు నెలలకు) అరుణ్‌రెడ్డి(డీసీటీవో) రూ.లక్ష (మూడు నెలలకు) లబ్ధి పొందిన సంస్థలు తండ్రి వారసత్వంగా స్కాంను అందిపు చ్చుకున్న శివరాజు తనయుడు సునీల్ అవినీతి సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాడు. అధికా రుల అండతో రెచ్చిపోయాడు. వ్యాపారస్తు లతో కుమ్మక్కై నకిలీ చలాన్ల ద్వారా నిజామా బాద్‌లోని ప్రముఖ వ్యాపారులకు కోట్ల రూపా యలు ఆదా చేశాడు. కొంతమంది వ్యాపారు లు ప్రతీ నెల ట్యాక్స్ చెల్లిస్తే.. వారి ట్యాక్స్‌ను ఇతర వ్యాపారులపైకి మళ్లించి క్లెయిమ్ చేశా డు. అలాగే మరికొందరు ఒక్కసారి చెల్లించిన ట్యాక్స్‌లను 3సార్లు చెల్లించినట్టు పోర్టల్‌లో ఎం ట్రీ చేశాడు. 2010 నుంచి తండ్రి శివరాజు రైస్ మిల్లర్లు, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా కోట్లు గడించ గా.. ఆసొమ్మును సునీల్ రెండింతలు చేశాడు. పన్నును మళ్లించాడిలా.. క్రమంగా పన్నులు కట్టేవారు ప్రతీనెల రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు చెల్లించేవారు. వారు చెల్లించిన నగదు/చెక్‌లను.. తాను ఒప్పందం కుదుర్చుకున్న వ్యాపార సంస్థల పేరిట సగం మళ్లించి ట్యాక్స్ చెల్లించినట్టు వెబ్‌పోర్టల్‌లో, అకౌంట్ పుస్తకాల్లో సునీల్ నమోదు చేశాడు. కంపెనీలు చెల్లించిన ట్యాక్స్‌లో కేవలం 30 శాతమే చెల్లించి మిగతా మొత్తాన్ని తన ఖాతాల్లోకి మళ్లించాడు. దీంతో ప్రభుత్వానికి ఏటా రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు సీఐడీ విచారణలో వెల్లడైంది. సునీల్ ద్వారా లబ్ధి పొందిన సంస్థలివే సిద్దిరామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ (కాలూర్), లక్ష్మీనర్సింహా ఇండస్ట్రీస్ (కాలూర్), వెంకటర మణ, ప్యాడీ ప్రాసెస్ ఇండస్ట్రీస్ (ఖానాపూర్), వంశీ కృష్ణా ఇండస్ట్రీస్(ఖానాపూర్), శుభం ట్రేడింగ్ కంపెనీ (కాలూర్), ధనలక్ష్మీ రైస్ మిల్ (బోధన్), తులసీ ట్రేడర్స్ (ఖానా పూర్), త్రినేత్రా రైస్ ఇండస్ట్రీస్ (ఖానాపూర్), కృష్ణా ఆగ్రో ఇండస్ట్రీస్ (గుండారం), ఎల్జీ ఆగ్రో ఇండస్ట్రీస్ (ఖానాపూర్), ఆనంద్ రైస్‌మిల్, అరుణోదయ రైస్‌మిల్, బాలాగణపతి ఇండ స్ట్రీస్, శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్, శ్రీరాజేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్, మహేశ్వరి బిన్నీ రైస్‌మిల్, సాయి సుధా ఇండస్ట్రీస్, సూర్యా ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీనివాసా రైస్‌మిల్, శ్రీచక్ర ఇండస్ట్రీస్, శ్రీగురుకృపా ఇండస్ట్రీస్, జై గణేష్ ఫ్యాడీ ప్రాసెసింగ్, రుద్రా ఇండస్ట్రీస్, తిరుమల ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీరాధాకృష్ణా ఆగ్రో ఇండస్ట్రీస్, మంజునాథా ట్రేడర్, తిరుమల రైస్ ఇండస్ట్రీస్, ద్వారాకామయి ఇండస్ట్రీస్, నీల కంఠ ఇండస్ట్రీస్, వాసవి బిన్నీ రైస్‌మిల్, తిరు మల బిన్నీ రైస్‌మిల్, శ్రీపాండురంగా రైస్ మిల్, కొలావర్ బిన్నీ రైస్‌మిల్, హనుమాన్ ట్రేడర్స్, సాయిస్వరూపా ఇండస్ట్రీస్, ఆదిలక్ష్మీ రైస్‌మిల్ ఆస్తుల విలువ 300 కోట్లపైనే.. శివరాజు, అతడి కుమారుడు సునీల్ అక్రమాస్తులకు లెక్కే లేదని సీఐడీ స్పష్టం చేసింది. శ్రీకృష్ణా ఎంటర్ ప్రైజెస్ అనే పేరుతో కంపెనీ స్థాపించి ఆ కంపెనీ ద్వారా బ్లాక్‌మనీ మొత్తం వైట్ చేసి నట్టు సీఐడీ గుర్తించింది. గుజరాత్లో రూ.50 లక్షలతో సిమెంట్ కంపెనీలో షేర్లు కొనుగోలు చేశారు. కర్నూల్లో రూ.30 కోట్లకు పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. బ్లూమీ థెరపిటిక్ పేరిట ఫార్మా కంపెనీ స్థాపించారు. విశ్వమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమి టెడ్, సాయి తిప్పారాజు ఇన్ఫ్రా వెంచర్స్‌తో కన్స్ట్రక్షన్ అండ్ రియల్టర్ కంపెనీలు పెట్టారు. తన తల్లి సూర్యకళ పేరుతో సునీల్ జీకే సీడ్స్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీ ఏర్పాటు చేశాడు. ఈ కంపెనీ లన్నింటినీ తమ ఇంటి ఎదురుగా ఉన్న వారి భవనంలో ఏర్పాటు చేశారు. ఇదే భవనంలో మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ నివాసం ఉంటున్నారని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రూ.25 లక్షలతో కేబుల్ నెట్వర్క్, నిజామాబాద్ మాధవ నగర్లో ఫాంహౌజ్, కొంపల్లిలో 2 గృహాలు, చైన్నైలో ఇల్లు, బంజారాహిల్స్‌లో ఇల్లు, పారడైజ్ వద్ద మరో ఇల్లు, డిచ్‌పల్లిలో 20 ఎకరాల భూమి ఉన్నట్టు సీఐడీ పేర్కొంది. ఈ ఆస్తి రూ.300 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. కేసును తొక్కేసేందుకు టీడీపీ నేత ► రంగంలోకి దిగిన కర్నూలుకు చెందిన తిరుమలనాయుడు ► డీఎస్పీ విజయ్‌కుమార్‌తో రూ.20 లక్షల ఒప్పందం ► బెయిల్ కోసం అడ్వొకేట్‌తో రూ.30 లక్షలకు అగ్రిమెంట్ కర్నూలులో శివరాజు రియల్ ఎస్టేట్, ఫార్మా కంపెనీలు స్థాపించాడు. దీంతో అక్కడ రాజకీయ నాయకులతో అతడి కుమారుడు సునీల్ సన్నిహితంగా మెదిలారు. బోధన్ స్కాం బయటపడటంతోనే కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత తిరుమలనాయుడు రంగంలోకి దిగారు. శివరాజు కుమారుడు సునీల్‌ను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు, కేసును లోతుగా దర్యాప్తు చేయనీయకుండా దర్యాప్తు అధికారులను ప్రలోభపెట్టారు. ‘‘నీకేం ఇబ్బంది లేదు.. నేను డీల్ సెట్ చేస్తా..’’అని సునీల్‌కు చెప్పిన తిరుమలనాయుడు హైదరాబాద్‌లోని హైకోర్టు అడ్వొకేట్ నరేశ్‌కుమార్‌తో చర్చించాడు. వీరిద్దరు కలసి దర్యాప్తు అధికారిగా ఉన్న డీఎస్పీ విజయ్‌కుమార్‌ను ఎల్బీనగర్లోని సితార హోటల్‌కు రప్పించుకున్నారు. అప్పటికే తిరుమలనాయుడు, సునీల్.. విజయ్‌కుమార్‌తో డీల్ మాట్లాడుకున్నారు. ఒప్పందంలో భాగంగా కలవాలని భావించిన వీరు సితారలో ఏప్రిల్ 17న కలుసుకున్నారు. అక్కడే రూ.20 లక్షలకు డీఎస్పీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏప్రిల్ 24న ఈ సొమ్ము ఇస్తామని డీఎస్పీకి హామీ ఇచ్చారు. అలాగే బెయిల్ కోసం లాయర్ నరేశ్ మరో అడ్వొకేట్ రఫత్ అహ్మద్‌ఖాన్‌ను పరిచయం చేశాడు. బెయిల్‌కు రూ.30 లక్షలతో డీల్ కుదుర్చుకున్నారు. రూ.లక్ష అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇదంతా సెట్ చేసినందుకు టీడీపీ నేత తిరుమలనాయుడికి రూ.5 లక్షలు ఇస్తానని సునీల్ మాటిచ్చాడు. ఏప్రిల్ 24న సునీల్ తన మనుషులతో బంజారాహిల్స్ రోడ్ నంబర్–10లోని ఓ ఆస్పత్రి వద్ద రూ.20 లక్షలు ఇచ్చేందుకు వచ్చాడు. అక్కడికి చేరుకునేందుకు డీఎస్పీ విజయ్‌కుమార్ కూడా బయలుదేరాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న సీఐడీ అధికారులు, టాస్క్‌ఫోర్స్ సాయంతో సునీల్ అండ్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. తర్వాత రెండ్రోజులకు డీఎస్పీ విజయ్‌కుమార్‌ను సస్పెండ్ చేశారు. ఈ కేసులో డీల్ సెట్ చేసేందుకు ప్రయత్నించిన తిరుమలనాయుడు, అడ్వొకేట్‌పై కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు ఐడీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. క్రమంగా ట్యాక్స్ చెల్లించినవారు.. ఎంబీ ఆగ్రో ఇండస్ట్రీస్, ధర్మారం లక్ష్మీబాలాజీ రైస్ ఇండస్ట్రీస్, కాపూర్ అయ్యప్ప ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, కాలూర్ శ్రీరామా ఇండస్ట్రీస్, సారంగపూర్ ఆర్కే మోడ్రన్ రైస్ మిల్, ఖానాపూర్ శ్రీబాలాజీ ఫుడ్ ప్రాసెసింగ్, బోధన్ శ్రీవినాయక ఆగ్రో ఇండస్ట్రీస్, బోధన్ ప్రకాశ్ ఆటోమోటివ్, నిజామాబాద్ నిజామాబాద్ ఆగ్రో ప్రై.లి., ఖానాపూర్ శ్రీరామా పారాబాయిల్డ్ రైస్‌మిల్, ఖానాపూర్ -
రెండేళ్లు ఉంటా.. 2 కోట్లు కావాలి!
బోధన్ స్కాంలో మరో తిమింగళం తెరపైకి డిప్యూటీ కమిషనర్ అవినీతి బాగోతం ► ఏ–1 శివరాజుతో ములాఖత్ అయినట్టు గుర్తించిన సీఐడీ ► ఒప్పందంలో భాగంగా రూ. 25 లక్షల అడ్వాన్స్ ► శివరాజు కుమారుడు సునీల్‌తో ఒప్పందం ► సర్కిళ్లు, చెక్‌పోస్టుల నుంచి నెలకు రూ. 10 లక్షలు ► అక్రమార్జన సొమ్ముతో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి సాక్షి, హైదరాబాద్ బోధన్ కమర్షియల్ ట్యాక్స్ స్కాంలో అవినీతి తిమింగళాల పాత్ర బయటపడుతోంది. ఇప్పటికే ఈ కేసులో తొమ్మిది మంది వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బంది అరెస్ట్ కాగా తాజాగా మరో డిప్యూటీ కమిషనర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీఐడీ విచారణలో కళ్లు బైర్లు కమ్మే అవినీతి బండారం బయటపడింది. పోస్టింగ్ పొందగానే శివరాజు(కేసులో ఇప్పటికే అరెస్టయిన ఏ–1 నిందితుడు)ను దర్శనం చేసుకునేందుకు డిప్యూటీ కమిషనర్లు ఉవ్విళ్లూరుతారట! రెండేళ్లు నేనే ఉంటా.. డిప్యూటీ కమిషనర్(డీసీ)గా ఉన్న ఓ అధికారి తనకు కోట్లలో ముట్టజెప్పాలని డిమాండ్ చేశారు. శివరాజు కుమారుడు సునీల్‌తో సదరు డీసీ నేరుగా బేరసారాలు సాగించినట్టు సీఐడీ అధికారులు తెలిపారు. ‘రెండేళ్లపాటు పనిచేస్తా కాబట్టి ఏడాదికి రూ.కోటి చొప్పున రెండేళ్లకు రూ.2 కోట్లు ఇవ్వాల్సిందే..’అని ఆ డీసీ స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో ముందుగా అడ్వాన్స్ కింద రూ.25 లక్షలు నగదు చెల్లించినట్టు సునీల్ తన వాంగ్మూలంలో వెల్లడించినట్టు సీఐడీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అంతేకాదు మిగిలిన మొత్తాన్ని ప్రతినెలా రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్టు తెలిపారు. అలా ఇప్పటివరకు రూ.80 లక్షలు సంబంధిత డిప్యూటీ కమిషనర్‌కు అందినట్టు విచారణలో బయటపడినట్లు ఆయన తెలిపారు. ప్రతీ ఆడిటింగ్‌కు ఓ రేటు వాణిజ్య పన్నుల శాఖలో ఒక్కో అధికారికి నెలకు 4 లేదా 5 ఆడిటింగ్లు చేయాలని ఆదేశాలుంటాయి. దీని ప్రకారం సంబంధిత అధికారులు ఆడిటింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ కూడా సంబంధిత డిప్యూటీ కమిషనర్ రేటు ఫిక్స్ చేసినట్టు సీఐడీ వెలుగులోకి తెచ్చింది. ఒక్కో ఆడిటింగ్‌లో టర్నోవర్‌ను బట్టి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్టు గుర్తించారు. ఏడు సర్కిళ్లు, నాలుగు చెక్‌పోస్టులు సంబంధిత డిప్యూటీ కమిషనర్ కింద ఏడు సర్కిల్ కార్యాలయాలు, నాలుగు ప్రధాన చెక్ పోస్టులున్నాయి. వీటి నుంచి సాగే జీరో దందా వ్యాపార సంస్థల వాహనాల నుంచి వసూలు చేసిన లంచాల్లో మెజారీటీ శాతం డిప్యూటీ కమిషనర్‌దేనని సీఐడీ తేల్చింది. ఇలా రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు పై స్థాయిలో ఉన్న అధికారులకు ఈ డిప్యూటీ కమిషనర్ ద్వారానే చేరుతుందని సీఐడీ గుర్తించింది. అక్రమార్జనతో బిజినెస్... అక్రమార్జనతో సంపాదించిన కోట్ల రూపాయాలను సదరు డిప్యూటీ కమిషనర్ హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్, నిర్మాణ సంస్థలో పెట్టుబడిగా పెట్టినట్టు సీఐడీ గుర్తించింది. ప్రతి శుక్రవారం లేదా సోమవారం కార్యాలయానికి వెళ్లడం, తనకు రావాల్సిన వాటాను తీసుకోవడం, తన వెంట వచ్చే తండ్రికి ఆ మొత్తాన్ని ఇచ్చి ఆర్టీసీ బస్సులో పంపించడం ఆ డిప్యూటీ కమిషనర్ స్టయిల్ అని తేలింది. పోస్టింగ్‌కు రూ.30 లక్షలు హైదరాబాద్‌లో పోస్టింగ్ ఇప్పించాలంటూ ఈ డిప్యూటీ కమిషనర్ గతంలో ఓ మంత్రి ఓఎస్డీకి రూ.30 లక్షలు ముట్టజెప్పారు. తీరా పోస్టింగులు అయ్యే సమయంలో మంత్రి పైరవీ పని చేయలేదు. అందరిలాగే సాదాసీదా బదిలీపై పోస్టింగ్ ఇచ్చారు. దీంతో తాను పోస్టింగ్ కోసం ఇచ్చిన రూ.30 లక్షలు ఇవ్వాలని ఓఎస్డీని డీసీ గట్టిగా నిలదీశారు. తన వద్ద లేవని, వెళ్లి మంత్రిగారితో చెప్పుకోండని సదరు ఓఎస్డీ తెగేసి చెప్పారు. మంత్రిని అడిగేందుకు ధైర్యం చాలకపోవడంతో ఇచ్చిన పోస్టింగ్‌కే వెళ్లారు. మలేసియా ప్యాకేజీ రూ.2.5 లక్షలు సంబంధిత డిప్యూటీ కమిషనర్ ఐదు నెలల క్రితం మలేసియా వెళ్లినట్టు సీఐడీ గుర్తించింది. ఆ దేశం వెళ్లేందుకు రూ.2.5 లక్షల ఖర్చును తామే భరించినట్లు సునీల్ విచారణలో ఒప్పుకున్నాడని సీఐడీ అధికారి ఒకరు స్పష్టంచేశారు. ఇది కూడా ఒప్పందంలో భాగంగానే జరిగిందని సునీల్ చెప్పినట్టు ఆయన తెలిపారు. ఈ వివరాలన్నీ ఏసీబీ అధికారులు సైతం వాకబు చేశారని, వాటితో ఒక నివేదిక రూపొందించి వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించారని, త్వరలోనే ఏసీబీ కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందని సమాచారం. -
జంప్ జిలానీ!
సీఐడీకే ఝలక్ ఇచ్చిన కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ బోధన్ స్కాం కేసులో విచారణకు వచ్చి పరార్ సాక్షాత్తూ సీఐడీ ప్రధాన కార్యాలయం నుంచి మాయం విషయం బయటకు పొక్కనీయని అధికారులు అదేరోజు పారిపోయిన అధికారి పేరుతో ఉన్న మరో అధికారి అరెస్ట్ నాలుగు రోజులుగా డిప్యూటీ కమిషనర్ కోసం వేట దర్యాప్తు అధికారులపై వెల్లువెత్తుతున్న విమర్శలు సమయం: ఉదయం 11 గంటలు.. స్థలం: ఎన్నో సంచలనాత్మకమైన కేసులను విచారించే హైదరాబాద్‌లోని సీఐడీ ప్రధాన కార్యాలయం. ఎవరెవరుంటారు?: ఒక అదనపు డీజీపీ, ఇద్దరు ఐజీలు, నలుగురు అదనపు ఎస్పీలు, పదుల సంఖ్యలో డీఎస్పీలు, 30 మందికిపైగా ఇన్స్పెక్టర్లతో ఆ కార్యాలయం కట్టుదిట్టంగా ఉంటుంది. వచ్చిందెవరు?: ఆయన కమర్షియల్ ట్యాక్స్ శాఖ డిప్యూటీ కమిషనర్. బోధన్ స్కాంలో కీలక నిందితుడు. సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. ప్రశ్నల వర్షం కురిపించారు. పొంతన లేని సమాధానాలు వచ్చాయి. లాభం లేదనుకొని అరెస్ట్‌కు సిద్ధమయ్యారు. ప్రభుత్వం నుంచి అనుమతి కోసం వేచిచూస్తున్నారు. ఎలా జారుకున్నాడు?: ఇక అరెస్టు తప్పదని డిప్యూటీ కమిషనర్‌కు అర్థమైపోయింది. విచారణకు పిలిచిన అధికారి బయటకు వెళ్లారు. అదే చాన్స్‌గా డిప్యూటీ కమిషనర్ సీట్లోంచి లేచాడు. తలుపులు తెరిచి అటూ ఇటూ చూశాడు. పెద్దగా సిబ్బంది ఎవరూ కనిపించలేదు. ఇంకేముంది.. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ్నుంచి జంప్ అయ్యాడు!! గతనెల 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇది స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన కేసు కావడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి ముఖ్యమైన కేసులో, అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సీఐడీ అధికారుల సమక్షంలోంచి, అదీ ప్రధాన కార్యాలయం నుంచి కీలక నిందితుడు పరారవడం సంచలనం రేపుతోంది. అప్పట్నుంచీ ఆ డిప్యూటీ కమిషనర్ జాడ తెలియడం లేదు. ఇంటికి తాళం వేసి భార్యాపిల్లలు సహా పత్తా లేకుండా పోయారు. కలిసొచ్చిన ఒకే ‘పేరు’ బోధన్ స్కాంలో మొదట అరెస్ట్ చేయాల్సింది పరారైన డిప్యూటీ కమిషనర్‌నే. అయితే సీఐడీ కార్యాలయం నుంచి ఆయన పరారవడంతో దర్యాప్తు అధికారులకు, ఉన్నతాధికారులకు ఏం చేయాలో తోచలేదు. ఆయన తర్వాత అరెస్టు చేయాల్సిన మరో అధికారి శ్రీనివాస్‌రావును అదేరోజు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. తప్పించుకొని పారిపోయిన అధికారి పేరు, అరెస్ట్ చేసిన అధికారి పేరు ఒకటే కావడం గమనార్హం. ఎలాగూ శ్రీనివాస్‌రావు అరెస్ట్ కావాల్సిందే కాబట్టి మొదటి అధికారి కన్నా ముందు ఈయనను అరెస్ట్ చేసినట్టు తెలిసింది. దర్యాప్తు అధికారులపై తీవ్ర ఆగ్రహం బోధన్ స్కాం విచారణ ప్రారంభమైన నాటినుంచి దర్యాప్తు అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. మొదట దర్యాప్తు అధికారిగా ఉన్న డీఎస్పీపై ఆరోపణలు రావడంతో ఆయన్ను పక్కనబెట్టారు. ఆ తర్వాత దర్యాప్తు అధికారిగా ఉన్న డీఎస్పీ... నిందితులతో కుమ్మక్కయ్యారని తేలడంతో సీఐడీ అదనపు డీజీపీ ఆయన్ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఏకంగా అదనపు ఎస్పీ అధికారిని విచారణ అధికారిగా నియమించినా.. ఏకంగా సీఐడీ కేంద్ర కార్యాలయం నుంచి నిందితుడు పరారవడం ఉన్నతాధికారులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఒక్క కేసు విచారణ కూడా వివాదాస్పదం కాకుండా పూర్తి చేయలేరా అంటూ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే కేసులో ఇద్దరు దర్యాప్తు అధికారులు మారడం, మూడో అధికారి నేతృత్వంలోనూ నిర్లక్ష్యం జరగడంపై ప్రభుత్వ వర్గాలు సైతం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముమ్మరంగా వేట.. సీఐడీ కార్యాలయం నుంచి పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన డిప్యూటీ కమిషనర్ కోసం రెండు ప్రత్యేక బృందాలు నాలుగు రోజులుగా వేట సాగిస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా సాగిన వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. ఎలాగైనా డిప్యూటీ కమిషనర్‌ను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఇక ఈ కేసులో చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటున్న ఏసీటీవో పూర్ణచందర్‌రెడ్డి విషయంలోనూ సీఐడీ ఉన్నతాధికారులు దర్యాప్తు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండు రోజుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయకపోతే తీవ్రమైన చర్యలుంటాయని దర్యాప్తు అధికారులను హెచ్చరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. -
డిలీట్ చేస్తే నెలకు రూ.5 లక్షలు
- అక్రమ చలాన్లు సరిచేస్తే నెలకు రూ.2 లక్షలు - మరీ దాసోహపడితే ఏడాదికో కొత్త కారు - ఆరు నెలలకోసారి ఎంటర్టైన్మెంట్ ట్రిప్ - ప్రతీ ఆర్థిక సంవత్సరం చివర రూ.5 లక్షల బోనస్ - కమర్షియల్ స్కాంలో అధికారులకు తాయిలాలు - సీఐడీ విచారణలో వెలుగులోకి.. సాక్షి, హైదరాబాద్: బోధన్ స్కామ్‌కు సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ అధికారుల విచారణలో వరుసగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో పోస్టింగ్‌లో ఉన్నంత కాలం డబ్బుకు లోటుండదు. అతిథి సత్కారాలకు అంతరాయం ఉండదు. టూర్లు, షికార్లు, విందులు, వినోదాలకు ఢోకాలేదు. అన్నీ తానై శివరాజు సెటప్ చేసి పెట్టాడు. ఏ అధికారి వచ్చినా అక్కడ శివరాజుదే పైచేయి. అతడు చెప్పిందే లెక్క. అతడు కట్టిందే ట్యాక్స్. మూడు చలాన్లు, ఆరు కమిషన్లతో హాయిగా సాగిపోయింది. దండుకున్నోళ్లకు.. దండుకున్నంత అన్నట్టుగా ఇన్నాళ్లూ నడిచిపోయింది. ఇలా ఒకటా రెండా.. ఏకంగా రూ.350 కోట్లు అప్పనంగా కొట్టేశారు. సీఐడీ చేస్తున్న దర్యాప్తులో ఒక్కో అధికారి దిగమింగిన లెక్క మెల్లమెల్లగా బయటకు వస్తోంది. డిలీట్ చేస్తే నెలకు రూ.5 లక్షలు.. నకిలీ చలాన్లు సృష్టించి ట్యాక్స్ క్లయిమ్ చేసినందుకు ఏసీటీవో నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు శివరాజు పక్కాగా లకారాలు అందించాడు. అక్కడ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన శ్రీనివాస్‌రావు విచారణలో సీఐడీ ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. నిజామాబాద్ జిల్లా కింద ఉన్న నాలుగు సర్కి ల్ కార్యాలయాల్లో ప్రతీ నెలా ట్యాక్స్ అమౌం ట్ను కమర్షియల్ ట్యాక్స్ వెబ్‌పోర్టల్‌లో ఎంట ర్ చేస్తారు. అయితే నకిలీ చలాన్ల ద్వారా వచ్చే అమౌంట్, సర్కిల్ కార్యాలయాల్లో ఆడిటింగ్‌లో వచ్చిన అమౌంట్ సరిపోలాలి. అయితే ప్ర తి నెలా ఈ రెండింటిని పోల్చేందుకు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్‌రావు తన ప్రతిభ ఉపయోగించాడు. పోర్టల్‌లో పొందుపరిచిన వివరాల ను సరిచేయడం, తప్పుగా ఉంటే డిలీట్ చేయడం, శివరాజు చెప్పిన లెక్కను యథావిథిగా పోర్టల్‌లో ఎంట్రీ చేయడం శ్రీనివాస్‌రావు చేసేవాడని సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు. ఇందుకుగానూ శివరాజు గ్యాంగ్ నుంచి ప్రతి నెలా రూ.5 లక్షలు శ్రీనివాస్‌రావు పుచ్చుకున్నట్టు విచారణలో బయటపడిందన్నారు. అక్రమాలకు తగ్గ రేటు.. ప్యాకేజీలు.. డిప్యూటీ కమిషనర్‌కు నెలకు రూ.5 లక్షలు పక్కాగా 3వ తేదీన శివరాజు అందించేవాడని, సీటీవోకు రూ.2 లక్షల నగదు తీసుకొచ్చి ఇచ్చేవాడని విచారణలో తేలింది. డివిజన్ అధికా రికి రూ.2 లక్షలు, ఏసీటీవోకు రూ.లక్ష పక్కాగా అందించాడని సీఐడీ బయటపెట్టింది. ఏటా శివరాజు బంపర్ ఆఫర్లు ఇచ్చేవాడు. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్‌రావుకు హోండా అమేజ్ కారు.. రిటైర్డ్ సీటీవోకు షెవర్లెట్ స్పార్క్ కారును గిఫ్ట్‌గా ఇచ్చినట్టు సీఐడీ అధికారులు తెలిపారు. ఆరు నెలలకోసారి ప్రతీ సర్కిల్ కార్యాలయం బృందానికి గోవా, ఊటీ, కేరళ, అండమాన్.. ఇలా టూర్లకు కూడా తిప్పాడని విచారణలో వెల్లడైంది. ప్రతీ నెలా 30న కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కోరుకున్న చోట, కోరుకున్న విందు ఏర్పాటు చేశాడని, ప్రతీ ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఒక్కో అధికారికి రూ.5 లక్షలు బోనస్ కూడా ఇచ్చాడని సీఐడీ ఆధారాలతో బయటపెట్టింది. ఈ లెక్కన జాయింట్ కమిషనర్ల నుంచి ఏసీటీవోల వరకు హోదాను బట్టి ఒక్కో అధికారి ఆస్తులు కనీసం రూ.50 కోట్లకు పైమాటే అని సీఐడీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అరెస్టయిన అధికారులపై త్వరలోనే ఏసీబీ యాక్షన్ ప్లాన్ ఉండే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు ప్రభుత్వ ఖజానాను దోచుకున్నందుకు పీసీ యాక్ట్ కింద కేసులు పెట్టే అవకాశం ఉందని తెలిసింది. -
ఇద్దరికి జ్యుడీషియల్ రిమాండ్
నిజామాబాద్ లీగల్ (నిజామాబాద్ అర్బన్): బోధన్ వాణిజ్య పన్నుల శాఖలో పన్ను ఎగవేత కుంభకోణం కేసులో నిందితులైన ఇద్దరు అధికారులను ఈ నెల 15 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏ2 నిందితుడు సింహాద్రి వెంకట సునీల్‌బాబు కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం మేరకు వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ ధరణి శ్రీనివాస్‌రావు, రిటైర్టు సీటీవో నారాయణదాస్ వెంకట కృష్ణమాచారిలను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ధరణి శ్రీనివాస్‌రావు హైదరాబాద్‌లో అప్పిలేట్ డిప్యూటి కమిషనర్‌గా పనిచేస్తుండగా, నారాయణదాస్ 2012 నుంచి 2016 వరకు నిజామాబాద్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. ఈ సమయంలో బోధన్‌లో జరిగిన నకిలీ చాలన్లకు సహకరించాలని ఇందుకు నెలకు రూ. 5 లక్షలు ఇచ్చినట్లు సునీల్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. రిటైర్డు సీటీవోకు తమకు సహకరించాలని కారు కొనిచ్చినట్లు తెలిపాడు. శ్రీనివాస్‌రావు ఇంట్లో విలువైన ఫర్నిచర్ చేయించినట్లు సునీల్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ మేరకు సీఐడీ అధికారులు వారిని అరెస్టు చేసి సోమవారం నిజామాబాద్ మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ సరిత ఎదుట హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ వీరికి ఈ నెల 15 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. -
బోధన్ స్కాంలో మరో ఇద్దరు సీటీవోల అరెస్ట్
- సీఐడీ అదుపులో సంజయ్‌గౌడ్, పూర్ణచందర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: బోధన్ స్కాం వ్యవహారంతో వాణిజ్య పన్నుల శాఖలో తీవ్ర కలవరం మొదలైంది. వరుసగా సీఐడీ చేస్తున్న అరెస్టులు ఆరోపణలెదుర్కుంటున్న అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. డిప్యూటీ కమిషనర్ ధరణి శ్రీనివాస్‌రావుతో పాటు రిటైర్డ్ సీటీవో కృష్ణమాచారిని సీఐడీ ఆదివారం ఉదయం అరెస్ట్ చేసింది. ఈ వార్త వెలుగులోకి రాకముందే మరో ఇద్దరు సీటీవోలను నిజామాబాద్‌లో సోమవారం అదుపులోకి తీసుకున్నట్టు సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ వరుస పరిణామాలు కమర్షియల్ ట్యాక్స్ ఉన్నతాధికారుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ధరణి శ్రీనివాస్‌రావు, కృష్ణమాచారికి రిమాండ్... బోధన్‌లో పనిచేసిన ఇద్దరు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సంజయ్‌గౌడ్, పూర్ణచందర్రెడ్డిలను సీఐడీ చాకచక్యంగా సోమవారం అదుపులోకి తీసుకుంది. దాడులు చేసేందుకు వస్తున్నారని ముందే పసిగట్టిన సీటీవోలు... ఇళ్లకు తాళాలు వేసి పరారయ్యారు. ఎట్టకేలకు వారిని గుర్తించి నిజామాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్టు సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌సింగ్ ‘సాక్షి’కి తెలిపారు. వీరితోపాటు ఆదివారం అరెస్ట్ చేసిన డిప్యూటీ కమిషనర్ ధరణి శ్రీనివాస్‌రావు, రిటైర్డ్ సీటీవో కృష్ణమాచారిని నిజామాబాద్ కోర్టులో ప్రవేశపెట్టామని, వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని చెప్పారు. వీరిద్దరినీ కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటీషన్ దాఖలు చేస్తామన్నారు. వణికిపోతున్న మహిళ అధికారులు... రూ. 350 కోట్లకు పైగా జరిగిన కుంభకోణంలో తాజాగా ముగ్గురు మహిళా అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో ఓ ఉన్నతాధికారి శివరాజు అండ్ గ్యాంగ్ నుంచి నెలకు రూ.10 లక్షలు కమిషన్ పద్ధతిన తీసుకున్నట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. మరో ఇద్దరిలో ఒక డీసీటీవో, ఒక సీటీవో మహిళా అధికారి ఉన్నారని, వీరి అరెస్టుకు సంబంధించి ఇప్పటికే సీఎంఓ నుంచి సీఐడీకి అనుమతి వచ్చినట్టు తెలిసింది. -
బోధన్ స్కాంలో డిప్యూటీ కమిషనర్ అరెస్ట్
♦ కుంభకోణంలోఈయనదే కీలకపాత్ర ♦ ఓ సీటీవోనూ అదుపులోకి తీసుకున్న సీఐడీ ♦ మిగతా 17మందికి కౌంట్ డౌన్ మొదలు సాక్షి, హైదరాబాద్: బోధన్ వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన కుంభకోణంలో ఆదివారం పెద్ద వికెట్‌పడింది. ఎస్పీ హోదాలో పనిచేసే డిప్యూటీ కమిషనర్‌ను సీఐడీ అరెస్ట్ చేసింది. కుంభకోణంలో నిందితులతో సంబంధాలు కొనసాగించడంతో పాటుగా నకిలీ చలాన్లు సృష్టించి, తప్పుడు ఆడిటింగ్‌కు పాల్పడటం లో ఈయనదే కీలక పాత్రగా సీఐడీ ఆధారాలు సేకరించింది. ఈయనతో పాటు మరో సీటీవో శివరాజు గ్యాంగ్‌తో కలసి అక్రమాల కు పాల్పడ్డట్లు గుర్తించి ఆయన్ను సైతం అరెస్ట్ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య పన్నుల శాఖలో అక్రమాలకు పాల్పడిన అధికారుల్లో వణుకు మొదలైంది. కమిషనరే రింగ్ లీడర్.. బోధన్, నిజామాబాద్, కామారెడ్డి, నిజా మాబాద్ రూరల్..ఈ నాలుగు సర్కిల్ కార్యాలయాల్లో రైస్ మిల్లర్లు, వ్యాపారాలు నిర్వహించే వారి నుంచి ట్యాక్స్ వసూళ్లు భారీ మొత్తంలో ఉంటాయి. అయితే గతంలో నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా పని చేసిన ఈయన ప్రస్తుతం హైదరాబాద్ కేం ద్రంలో పనిచేస్తున్నారని సీఐడీ అధికారులు స్పష్టంచేశారు. కేసు ప్రారంభ దశలో ఏసీటీ వో, ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బోధన్ స్కాంలో కీలక నిందితులు శివరాజ్, అతడి కుమారుడు సునీల్ కుమార్‌తో కలసి ఇప్పుడు అరెస్టయిన సీటీవో కూడా కుంభకోణానికి అండదండలు అందించినట్లు సీఐడీ గుర్తించింది. స్వంత విభాగంలోనే అవినీతి అధికారులపై వేట సాగించిన సీఐడీ ఇక కమర్షియల్ ట్యాక్స్‌లోని అవినీతి అధికారులను కటకటాల్లోకి నెట్టడం ప్రారంభించింది. ఈ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో శివరాజు, సునీల్ ఏయే అధికారికి నెలకు ఎంత కమిషన్ ఇవ్వాలి? ఏయే ప్యాకేజీలు ఇచ్చి టూర్లకు ఆఫర్ ఇవ్వాలన్న అన్ని కార్యక్రమాలు నిర్వహిం చినట్లు సీఐడీ ఆధారాలు సేకరించింది. శివరాజు అండ్ గ్యాంగ్ నుంచి నెలకు రూ.10 లక్షల చొప్పున డీసీ కమిషనర్ పుచ్చుకున్నట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి. అధికారుల్లో వణుకు సర్కిల్ కార్యాలయాల నుంచి మొదలైన అక్రమాలు నిజామాబాద్ అర్బన్, రూరల్, కామారెడ్డి కార్యాల యాల్లోనూ కొనసాగినట్లు సీఐడీ బయ టపెట్టింది. 2005 నుంచి జరిగిన తతంగంలో మొత్తం 18 మంది అధికారుల పాత్ర స్పష్టం గా ఉందని ఇప్పటికే ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొంది. తాజాగా ఒక సర్కిల్ అధికారిని సీఐడీ అదుపులోకి తీసుకోవడంతో మిగిలిన 17 మందిలో వణుకు మొదలైంది. కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు జాయింట్ కమిషనర్లు, ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు, ఆరుగురు డివిజనల్ కమిషనర్లు, 8 మంది ఏసీటీవోలు స్కాంలో ఆరోపణలెదు ర్కుంటున్నారని, వారికీ కౌంట్‌డౌన్ ప్రారం భమైనట్లేనని సీఐడీ స్పష్టంచేసింది. హోదాను బట్టి కమీషన్... సీఐడీ విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కో అధికారి హోదాను బట్టి శివరాజు అండ్ గ్యాంగ్ కమిషన్ రేటు నిర్ణయించింది. వీరిలో ఏసీటీవోకు నెలకు రూ.లక్ష, డీసీటీవోకు రూ.2.50 లక్షలు, సీటీవోకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు, డిప్యూటీ కమిషనర్లకు రూ.10 నుంచి రూ.15 లక్షలు, అసిస్టెంట్ కమిషనర్ల/జాయింట్ కమిషనర్‌కు మూడు నెలలకోసారి రూ.10 లక్షల చొప్పున శివరాజు పంపిణీ చేసినట్లు సీఐడీ గుర్తించింది. అక్రమార్కులను వదిలిపెట్టొద్దు: సీఎంఓ కుంభకోణంలో ప్రధాన పాత్ర వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ కమిషనర్‌ను అరెస్ట్చేసేందుకు సీఐడీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుమతి కోరింది. బోధన్ స్కాంలో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని, స్పష్టమైన ఆధారాలుంటే అరెస్ట్ చేయాలని సీఎంఓ ఆదేశాలు జారీచేసింది. దీంతో డిప్యూటీ కమిషనర్‌ను సీఐడీ బృందాలు అరెస్ట్ చేశాయి. -
బోధన్ స్కామ్.. కర్నూల్ డీఎస్పీ డీల్
- కర్నూల్ డీఎస్పీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు - ఏపీ డీజీపీకి లేఖ రాయనున్న సీఐడీ అదనపు డీజీపీ సాక్షి, హైదరాబాద్: ఆయన అవినీతి రాష్ట్రాలు దాటింది. తెలంగాణలో స్కాం విచారణ జరుగుతూ ఉంటే, ఆ కుంభకోణంలో నిందితులకు, దర్యాప్తు అధికారికి మధ్య బేరసారాలు సాగించడంలో కీలక పాత్ర పోషించారు. బోధన్ కమర్షియల్ స్కాంలో సస్పెండ్ అయిన డీఎస్పీ విజయ్‌కుమార్ వ్యవహారంలో కర్నూలు డీఎస్పీ పాత్రపై పూర్తి ఆధారాలు బయటపడ్డాయి. రూ.65 లక్షలు డీల్ సెట్ చేసిన డీఎస్పీ కర్నూల్లోని ఓ విభాగంలో పని చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ మేరకు బోధన్ స్కాంలో ఏ2గా ఉన్న సునీల్, అతడి అసిస్టెంట్ రామలింగంతో ఆయన సంప్రదింపులు సాగించినట్టు తేల్చారు. సునీల్, రామలింగంలను విచారించగా.. విజయ్‌కుమార్, కర్నూల్ డీఎస్పీల వ్యవహారంపై వాంగ్మూలం ఇచ్చినట్టు సీఐడీ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి స్పష్టంచేశారు. దీంతో ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావుకు సమాచారం అందించి.. చర్యలకు ఆదేశించేలా సీఐడీ అదనపు డీజీపీ లేఖ రాయనున్నట్టు ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. 1989 బ్యాచ్‌లో విజయ్‌కుమార్, కర్నూల్ డీఎస్పీ ఎస్ఐలుగా నియామకం అయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పరిచయాలున్నాయి. అయితే కేసు దర్యాప్తును క్యాష్ చేసుకునేందుకు కర్నూల్ డీఎస్పీని విజయ్‌కుమార్ వాడుకున్నారా? లేక బోధన్ నిందితుల తరఫు వకాల్తా తీసుకొని కర్నూలు డీఎస్పీ స్కాం సెట్ చేసే ప్రయత్నం చేశారా అన్నది తేల్చాల్సి ఉందని సీఐడీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
బోధన్ స్కాంలో దర్యాప్తు అధికారి ఔట్
డీఎస్పీపై సస్పెన్షన్ వేటు వేసిన సీఐడీ అదనపు డీజీపీ - దర్యాప్తును క్యాష్ చేసుకున్న వైనంపై ‘సాక్షి’ కథనం - విచారణకు ఆదేశించిన సీఎస్ - కర్నూలు జిల్లాకు చెందిన డీఎస్పీతో కలసి రూ.65 లక్షల డీల్ కుదుర్చుకున్నట్టు వెల్లడి - సీఐడీకి చేరిన డీఎస్పీ బేరసారాల ఆడియో క్లిప్ సాక్షి, హైదరాబాద్: బోధన్ కమర్షియల్ ట్యాక్స్ స్కాం కేసును నీరుగార్చేందుకు యత్నించిన సీఐడీ డీఎస్పీపై వేటు పడింది. దర్యాప్తును క్యాష్ చేసుకుంటున్నారని ‘సాక్షి’ ఇటీవల ప్రచురించిన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కథనంపై రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. కేసు దర్యా ప్తును అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఐడీ అదనపు డీజీపీ ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ ఉన్నతాధికారులు బోధన్ కమర్షియల్ స్కాంలో నిందితులతో కుమ్మౖకన అధికారులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ఈ విచారణలో భాగంగా కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న డీఎస్పీ విజయ్‌కుమార్ అక్రమాలకు పాల్పడ్డట్టు ఆధారాలతో సహా బయటపడింది. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్ ‘సాక్షి’ తెలిపారు. బ్యాచ్‌మేట్ డీఎస్పీని రంగంలోకి దింపి.. సీఐడీలో పనిచేస్తున్న డీఎస్పీ విజయ్‌కుమార్, బోధన్ స్కాంలో ఏ–2గా ఉన్న సునీల్‌తో సంప్రదింపులు జరిపినట్టు విచారణలో తేలింది. అంతేకాదు కేసును నీరుగార్చేందుకు ఇద్దరు ఒకేచోట కూర్కొని డీల్ సెట్ చేసుకున్నట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. ఇందులో భాగంగా సునీల్ దగ్గర పనిచేసిన రామలింగం అనే వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టుకొని డీల్ నడిపినట్టు బయటపడింది. నేరుగా డీల్‌లో పాల్గొంటే దొరికిపోతానని భావించిన విజయ్‌కుమార్ తన బ్యాచ్‌మేట్ అయిన కర్నూల్ జిల్లాల్లోని ఓ డీఎస్పీని రంగంలోకి దింపాడు. అతడి ద్వారా సునీల్, రామలింగం, సునీల్ భార్యతో సెటిల్మెంట్ కు యత్నించారు. ఇందులో భాగంగా రూ.65 లక్షలు డిమాండ్ చేసినట్టు విచారణలో బయటపడింది. దీంతో విజయ్‌కుమార్‌ను కేసు దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పించి సస్పెండ్ చేస్తున్నట్టు అదనపు డీజీపీ గోవింద్ సింగ్ తెలిపారు. త్వరలో అధికారుల బండారం.. బోధన్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు నిందితులతో కలసి పోలీస్ విచారణను నీరుగార్చే యత్నం చేస్తున్నారని విచారణలో తేలినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ సైతం తీవ్రంగా పరిగణించి నట్టు సమాచారం. పోలీస్, వాణిజ్య పన్నుల శాఖ అధికారుల మధ్య సాగిన వ్యవహారా లను కూడా బయటపెట్టనున్నట్టు సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు. త్వరలో ఆ విభాగం అధికారుల బండారం కూడా బయటపడుతుందని, వారిని సైతం సస్పెండ్ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందని అధికారులు తేల్చిచెప్పారు. మరో డీఎస్పీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు బోధన్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో డీఎస్పీపైనా విచారణ సాగుతోందని సీఐడీ వర్గాలు తెలిపాయి. ఈ డీఎస్పీతోపాటు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై కూడా విచారణ జరపాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని, ఒకట్రెండు రోజుల్లో వారి సంగతి కూడా తేలుతుందని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. అడ్డంగా పట్టించిన ఆడియో క్లిప్... కేసును సెట్ చేయడంతోపాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు డీల్ కుదుర్చుకున్నపుడు జరిగిన సంభాషణల ఆడియో క్లిప్ ఒకటి అదనపు డీజీపీకి చేరింది. దీని ఆధారంగా మరింత లోతుగా విచారణ చేస్తున్నామని, డీల్‌లో ఎవరెవరున్నారు? వారికి కేసుకు సంబంధమేంటి? అధికారులూ ఉన్నా రా? అని విచారణ చేస్తున్నట్లు సీఐడీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
నిజామాబాద్ జిల్లాలో దారుణం
బోధన్: నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పన్నెండేళ్ల బాలికపై గుర్తుతెలియని దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. బోధన్ మండలం తెగడపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(12) ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో గట్టిగ కేకలు వేస్తూ బాలిక అక్కడే కుప్పకూలిపోయింది. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం బాలిక మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. 65 కోట్లు కాదు.. 316 కోట్లు
బోధన్ స్కామ్‌పై సీఐడీ నివేదిక.. - 2005 నుంచే అక్రమాలు - శివరాజు విచారణలో సంచలన అంశాలు వెల్లడి సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి పుట్ట పగలబోతోంది. సర్కిల్ కార్యాలయాల్లో సాగిన దందా కేంద్ర కార్యాలయం వరకు విస్తరించినట్టు సీఐడీ ఆధారాలతో సహా నిరూపించబోతోంది. అధికారులు బ్రోకర్లు కలసి చేసిన ఈ స్కాంపై సీఐడీ కీలక అంశాలను ఏ1గా ఉన్న శివరాజు నుంచి రాబట్టగలిగింది. బోధన్ కమర్షియల్ ట్యాక్స్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన కుంభకోణం ఇప్పటిది కాదని, 15 ఏళ్ల నుంచి నడుస్తోందని పూసగుచ్చినట్టు సీఐడీ అధికారులకు శివరాజు చెప్పినట్టు తెలిసింది. పాత్రదారులు ఎవరు... శివరాజుతో కుమ్మౖక్కై కోట్లు గడించిన అధికారుల పాత్ర ఏంటన్న అంశాలపై సీఐడీ రాష్ట్ర డీజీపీ పూర్తి నివేదిక సమర్పించారు. కేంద్ర కార్యాలయం నుంచే... బోధన్, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్... ఈ నాలుగు సర్కిల్ కార్యాలయాలను డీసీటీవో కంటే శివరాజే ఎక్కువగా ఆపరేట్ చేసినట్టు సీఐడీ గుర్తిం చింది. గతంలో డీసీటీవోలుగా పనిచేసిన అధికారులు ప్రస్తుతం కేంద్ర కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారని, మరికొంత మంది బదిలీ అయి ఇతర విభాగాలకు వెళ్లిపోయా రని, వారి పేర్లతో సహా శివరాజు బయటపెట్టి నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. గతం లో ఈ విభాగంలో పనిచేసిన నలుగురు ఐఆర్ ఎస్ అధికారులు కుట్రలో ప్రధాన భాగస్వా ములయ్యారని విచారణలో బయటపడినట్టు తెలిసింది. వీరి ద్వారా కేంద్ర కార్యాలయంలో సర్కిల్ కార్యాలయాల్లోని ఆడిటింగ్ ఫైళ్లను పరిశీలించకుండా చేశాడని సీఐడీ గుర్తించింది. 2012 నుంచి కాదు... వాణిజ్య పన్నుల శాఖ బోధన్ సర్కిల్లో 2012 నుంచి కుంభకోణం జరిగిందని ఆ విభాగం కమిషనర్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. కానీ 2005 నుంచి స్కాం జరిగినట్టు సీఐడీ విచారణలో గుర్తించింది. అలాగే... రూ.65కోట్లు మాత్రమే నకిలీ చలాన్ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని వాణిజ్య పన్నుల శాఖ తెలుపగా, రూ.316 కోట్ల కుంభకోణం జరిగిందని సీఐడీ దర్యాప్తు బృందాలు డీజీపీకి సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇంత భారీతేడా ఉన్నా వాణిజ్య పన్నుల శాఖలోని అధికారులు గుర్తించకపోవడంపై సీఐడీ ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిసింది. అధికారులకు బంపర్ ఆఫర్లు... శివరాజు నిజామాబాద్‌ను కేంద్రంగా చేసుకొ ని దందా సాగించాడు. అతడికి సహకరించిన ఏసీటీవోలు, డీసీటీవోలు, అసిస్టెంట్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లకు ఆరు నెలలకోసారి ఆఫర్లు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. మలేషియా, బ్యాంకాక్, శ్రీలంక, ముంబై.. ఇలా టూర్ ప్యాకేజీలు ఇచ్చి దగ్గరుండి స్కాం పనులు చక్కబెట్టుకున్నట్టు విచారణలో బయటపడింది. ఇలా శివరాజుకు సహకరించిన 16 మంది అధికారుల జాబితా ను నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. వివరాలివ్వడంలోనూ జాప్యం... స్కాం విచారణ మొదలుపెట్టిన నాటి నుంచి సీఐడీ అడిగిన ఏ వివరాలనూ వాణి జ్య పన్నుల శాఖ తమకు అందించలేదని సీఐడీ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. చీఫ్ సెక్రెటరీ ఆదేశించిన తర్వాతే వివరాలు అందించారన్నారు. ఈ జాప్యం వెనుక అసలు కోణాలు శివరాజు విచారణలో బయటపడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు. కేసుల నమోదుకు రంగం సిద్ధం... శివరాజుకు సహకరించి ప్రభుత్వ ఖజానా ను జేబులోకి మళ్లించుకున్న 16 మంది అధికారులపై సీఐడీ ఇప్పుడు నజర్ పెట్టిం ది. సీఎం శాఖ కావడం, పైగా 15 ఏళ్ల నుంచి స్కాం జరుగుతుంటే పట్టించుకోక పోవడంపై ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిసింది. దీనితో వీరిపై కేసులు నమోదు చేసి విచారించాలని సీఐడీ భావిస్తోంది. ఇందుకు అన్ని ఆధారాలను సిద్ధంచేసి రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌కు అందించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆధారాలను బట్టి ముందుకెళ్తున్నాం: డీజీపీ అనురాగ్‌శర్మ బోధన్ వాణిజ్య పన్నుల శాఖ స్కాంలో సీఐడీ వేగవంతంగా విచారణ సాగిస్తోంది. అరెస్టయిన వారి నుంచి సేకరించిన వివరా లను బట్టి మరికొంత మందిని విచారించా ల్సి ఉంది. స్కాంలో ఆరోపణలెదుర్కుంటు న్న వారికి నోటిసులిచ్చి వాంగ్మూలాలు నమోదు చేయాలి. శివరాజు చెప్పిన అంశాలపై మరికొంత స్పష్టత, మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ఎంతటి అధికారులైనా స్కాంలో పాత్రదారులని తేలితే అరెస్ట్ చేయక తప్పదు. -
బతుకు చేదు!
- తేలని నిజాం షుగర్స్ భవితవ్యం - లేఆఫ్తో ఉపాధి కోల్పోయిన కార్మికులు - చెప్పులు కుడుతూ.. కూలికెళ్తూ.. - స్వాధీనం హామీని విస్మరించిన సీఎం కేసీఆర్ - 17న బోధన్‌లో పాదయాత్ర, బహిరంగ సభ చెప్పులు కుడుతున్న ఇతని పేరు వి.సాయిలు. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పర్మినెంట్ కార్మికుడు. భార్య లక్ష్మి, కూతురు, కుమారునితో చింత లేకుండా జీవితం గడిచిపోయేది. అయితే ఫ్యాక్టరీకి లేఆఫ్ ప్రకటించి మూసేయడం.. సాయిలు జీవితాన్ని తలకిందులు చేసింది. ఒకవైపు ఫ్యాక్టరీ మూతపడటంతో ఏ దారీ లేక కుల వృత్తి అయిన మోచీ పనినే మళ్లీ మొదలుపెట్టాడు. బోధన్ ఆర్టీసీ కొత్త బస్టాండ్‌లో చెప్పులు కుడుతూ.. పాలిష్ చేస్తూ.. ఆ వచ్చే కాస్త డబ్బుతోనే కుటుంబాన్ని పోషించుకోవాల్సిన దుస్థితి సాయిలుది. ఇతని పేరు ఈరవేణి సత్యనారాయణ. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రిషియన్ విభాగంలో టర్బన్ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. కానీ ఫ్యాక్టరీకి లేఆఫ్ ప్రకటిచడంతో వేతనం ఆగిపోయి.. కుటుంబ పోషణ భారంగా మారింది. నెల క్రితం వరకూ బోధన్‌లోని ఓ సినిమా «థియేటర్లో గేట్ కీపర్‌గా రోజుకు రూ.115 కూలీ పనిచేసేవాడు. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 11 వరకు డ్యూటీ చేయాల్సి రావడంతో అక్కడ మానేసి ఓ వాటర్ ప్లాంట్‌లో పనికి చేరాడు. రోజుకు వంద కూలీ ఇస్తున్నారు. కూలీ పనికి పోతేనే కుటుంబం గడిచే పరిస్థితి కావడంతో ఆ వంద కోసం రోజంతా చెమటోడుస్తున్నాడు. బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ(ఎన్ఎస్ఎఫ్) భవితవ్యం ఎటూ తేలకపోవడంతో కార్మికుల బతుకులు చేదెక్కుతున్నాయి. ఈ ఫ్యాక్టరీని 1938లో నిజాం పాలకులు నెలకొల్పారు. ఫ్యాక్టరీ ఆవిర్భావంతో ఈ ప్రాంతమంతా చెరకు తోటలతో పచ్చదనం వెల్లివిరిసింది. చెరకు రైతులు, కార్మికుల కుటుంబాలు సంతోషంగా జీవనం సాగించాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా ఈ ఫ్యాక్టరీ ఎదిగింది. ఇదంతా గత వైభవం. ఫ్యాక్టరీ టీడీపీ హయాంలో ప్రైవేటుపరం కాగా, తదనంతర పరిణామాల్లో యాజమాన్యం లేఆఫ్ ప్రకటించడంతో రైతులు, కార్మికుల జీవితాలు ఛిద్రమయ్యాయి. పచ్చని చెరకు తోటలు కనుమరుగయ్యాయి. ప్రైవేటీకరించిన చంద్రబాబు సర్కారు నిజాం షుగర్ ఫ్యాక్టరీని 2002లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీకి భాగస్వామ్యం కల్పించి జాయింట్ వెంచర్ పేరుతో ప్రైవేటీకరించారు. దీంతో ఫ్యాక్టరీ నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్)గా రూపాంతరం చెందింది. 2015 డిసెంబర్ 23న ఎన్డీఎస్ఎల్ యాజ మాన్యం లేఆఫ్ ప్రకటించింది. బోధన్‌తో పాటు ప్రస్తుత జగిత్యాల జిల్లా ముత్యంపేట, వికారాబాద్ జిల్లాలోని ముంబోజిపల్లి యూనిట్లకు కూడా దీనిని వర్తింప చేసింది. దీంతో 305 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. లేఆఫ్తో 2015–16, 2016–17 క్రషింగ్ సీజన్ కూడా నిలిచిపోయింది. దీంతో ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని కార్మికులు పలువురు మంత్రులను వేడుకోగా.. బకాయి వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే 16 నెలలు గడుస్తున్నా వేతనాలు అందలేదు. 3 ఫ్యాక్టరీల కార్మికులకు రూ.8 కోట్ల వరకు బకాయి వేతనాలు రావాల్సి ఉంది. సీఎం కేసీఆర్ హామీ.. అధికారం చేపట్టిన వెంటనే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ హయాంలో నడుపుతామని కేసీఆర్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అధికారం చేపట్టి మూడేళ్లవుతున్నా ఈ హామీ నెరవేరలేదు. ఫ్యాక్టరీని ప్రభుత్వం నడపటం సాధ్యం కాదని, మహారాష్ట్ర తరహాలో సహకార రంగంలో రైతులు ముందుకు వస్తే ఆధునీకరించి ఫ్యాక్టరీని అప్పగిస్తామని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినా.. ఇప్పటివరకు విధివిధానాలు ప్రకటించలేదు. 17న బోధన్‌లో పాదయాత్ర.. ఎన్డీఎస్ఎల్ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలని, లేఆఫ్ ఎత్తివేసి వెంటనే పునరుద్ధరించాలని, కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించి ఆదుకోవాలనే డిమాండ్లతో నిజాం షుగర్స్ రక్షణ కమిటీ, అఖిలపక్ష పార్టీలు ఏడాదిగా ఆందోళనలు సాగిస్తున్నాయి. టీజేఏసీ, నిజాంషుగర్స్ రక్షణ కమిటీ, అఖిల పక్షం ఆధ్వర్యంలో ఈ నెల 17న పాదయాత్ర, బహిరంగ సభ తలపెట్టారు. ఈ కార్యక్రమానికి టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హాజరుకానున్నారు. -
బోధన్ స్కాంలో రాజకీయ కలవరం!
ప్రస్తుత ఎంపీ అయిన ఓ మాజీ మంత్రి వర్గంలో ఆందోళన సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖ బోధన్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన కుంభకోణం వ్యవహారంలో రాజకీయ కలవరం మొదలైంది. ఈ కేసులో సీఐడీపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ అయిన ఓ నాయకుడి అనుచరుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. 300 మంది రైస్‌మిల్లర్ల పాత్రపై సీఐడీ విచారణ చేపట్టనున్నట్లు వచ్చిన వార్తలపై భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న ఆ ఎంపీకి ఈ కేసులో కీలక నిందితుడు శివరాజ్ అత్యంత సన్నిహితుడని తెలిసింది. ఇక ఓ మాజీ ఎంపీకి కూడా శివరాజ్ సన్నిహితుడని.. దీంతో ఈ ఇద్దరు నాయకుల వద్దకు రైస్‌మిల్లర్లు క్యూ కట్టారని సమాచారం. అయితే ఈ నేతలిద్దరిలో మాజీ ఎంపీ పరోక్షంగా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఎంపీ మాత్రం ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులపై నేరుగా ఒత్తిడి తీసుకువస్తున్నట్టు పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ వ్యవహారంలో కల్పించుకుంటున్నట్లు సమాచారం. -
రైస్ మిల్లర్లపై సీఐడీ నజర్!
- బోధన్ స్కాంలో 300 మంది రైస్‌మిల్లర్ల పాత్ర - వారిని విచారించాలని భావిస్తున్న సీఐడీ - ఆపేందుకు ప్రయత్నిస్తున్న ఓ ఎంపీ, మాజీ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు! - ఏ1 నిందితుడు శివరాజ్‌తో వారికి ఆర్థిక సంబంధాలు - ఉన్నతాధికారులకు సీఐడీ ఫిర్యాదు.. ఆరా తీస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు సాక్షి, హైదరాబాద్ వాణిజ్య పన్నుల విభాగం బోధన్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన నకిలీ చలాన్ల కుంభకోణంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కాంలో పాత్రధారులుగా 300 మంది రైస్‌మిల్లర్లు ఉన్నారని, వారిని విచారించాలని సీఐడీ ప్రయత్నిస్తోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న శివరాజ్ పలువురు ప్రజాప్రతినిధులకు సన్నిహితుడని కూడా గుర్తించింది. అయితే రైస్‌మిల్లర్లకు, శివరాజ్‌కు సన్నిహితులైన ఓ ఎంపీ, మాజీ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ కేసు విచారణపై ప్రభావం చూపేలా ఒత్తిళ్లు తీసుకువస్తున్నట్లు సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. రైస్ మిల్లర్లూ బాధ్యులే.. నకిలీ చలాన్లు సృష్టించి, ట్యాక్స్ చెల్లించినట్టు చెప్పుకుంటున్న 300 మంది రైస్‌మిల్లర్ల పాత్రపైనా విచారించాలని సీఐడీ నిర్ణయించింది. 2005 నుంచి ఇప్పటివరకు వారు నయా పైసా చెల్లించకున్నా.. చెల్లించేసినట్లు శివరాజ్ వారికి చలాన్లు సృష్టించి ఇచ్చినట్టు సీఐడీ దర్యాప్తులో తేలింది. ఇక నిజామాబాద్‌లోని పలువురు ఎమ్మెల్యేలకు కొంత మంది రైస్‌మిల్లర్లు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించారనీ భావిస్తున్నారు. నాయకులతో ఏమిటీ లింకు..? సదరు ఎంపీ, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రైవేటు ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్‌తో ఉన్న లింకులపై ఇంటలిజెన్స్ వర్గాలు ఆరాతీస్తున్నాయి. ఏటా ఐటీ చెల్లింపులు, ట్యాక్స్‌ల వ్యవహారం వంటి వాటన్నింటిలో వారికి శివరాజ్ సహాయసహకారాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నోట్ల రద్దు సమయంలోనూ ఓ ఎంపీ, మాజీ ఎంపీలకు శివరాజ్ నోట్లు మార్పిడి చేసి పెట్టినట్లు సీఐడీ అధికారులు సందేహిస్తున్నారు. అంతే కాకుండా నిజామాబాద్ జిల్లాలో కొత్తగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల ఆర్థిక వ్యవహారాలను శివరాజ్ చక్కబెట్టేవాడని భావిస్తున్నారు. అందుకే ఆ ఎంపీ, మాజీ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ కేసు దర్యాప్తుపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారని ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై ఇంటలిజెన్స్ విచారణకు ఆదేశించారని, ఇంటలిజెన్స్ అధికారులు నివేదిక రూపొందించే పనిలో ఉన్నారని సమాచారం. ప్రభుత్వం వైపు నుంచీ ఒత్తిడికి యత్నం ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి తమపై వస్తున్న ఒత్తిళ్లు వాస్తవమేనని అధికారులు అంగీకరిస్తున్నారు. అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కుంభకోణంలో ఎవరినీ వదలిపెట్టలేమని వారికి స్పష్టం చేశామని చెబుతున్నారు. దీంతో ఆయా నేతలు ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
‘వాణిజ్య’ అధికారులపై సీఎస్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంపై సీఐడీ చేపట్టిన దర్యాప్తుకు సహకరించడంలేదంటూ ఆ శాఖ అధికారులపై సీఎస్ ఎస్పీ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దర్యాప్తుపై శనివారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. బోధన్, కామారెడ్డిల్లోనే కాకుండా నిజామాబాద్ రూరల్, అర్బన్ సర్కిల్ కార్యాలయల్లోనూ స్కాం సూత్రధా రి శివరాజ్ కుంభకోణాలకు పాల్పడ్డట్టు సీఎస్ దృష్టికి సీఐడీ తీసుకెళ్లింది. ఆరోపణ లెదుర్కొంటున్న అధికారుల జాబితా ఇవ్వాలని ఆ శాఖ అధికారులను కోరినా ఇప్పటి వరకు ఇవ్వలేదని, తాము 22 మంది అధికారులను విచారించాల్సి ఉంద ని సీఐడీ అధికారులు సీఎస్ దృష్టికి తీసు కెళ్లారు. దీనితో ఆయన వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులను తీవ్రంగా మందలించినట్టు తెలిసింది. ఏ2గా ఉన్న సునీల్‌ను తాము గుర్తించామని, రెండు రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందని సీఐడీ ఉన్నతాధికారులు సీఎస్‌కు తెలిపారని సమాచారం. (బోధన్ స్కాం.. ప్రధాన సూత్రధారికి గుండెపోటు!) -
బోధన్ స్కాంపై నేడు సీఎస్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: బోధన్ సర్కిల్లో జరిగిన వాణిజ్య పన్నుల శాఖ నకిలీ చలా న్ల కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ గురువారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్ డీజీపీ అనురాగ్ శర్మకు సమాచారం అందించారు. గురువారం ఉదయం సీఎస్ చాంబర్లో కేసు దర్యాప్తుSపై సమీక్ష జరుగుతుందని, సంబంధిత అధికారులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సోమేశ్‌కుమార్ సూచించారు. కేసు దర్యా ప్తులో ఆరోపణలు రావడంతో దర్యాప్తు అధికారి స్థానంలో మరొకరిని నియమిం చారు. అదనపు ఎస్పీని ఎప్పటికప్పుడు కేసు దర్యాప్తు వివరాలు తెలుసుకుంటూ ఉండాలని డీజీపీ ఆదేశించారు. ఈ వ్యవహారంపై కూడా సీఎస్ సమీక్ష జరప నున్నారు. అటు కమర్షియల్ శాఖలోనూ పలువురు అధికారుల పాత్రపై సీఐడీ నివేదిక రూపొందించినట్టు తెలిసింది. -
దర్యాప్తును క్యాష్ చేసుకున్నారు!
⇒ కమర్షియల్ ట్యాక్స్ స్కాం దర్యాప్తులో సీఐడీ అధికారులపై ఆరోపణలు ⇒ నిందితులు లొంగిపోయేందుకు సహకారం ⇒ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కేసు నీరుగార్చిన వైనం ⇒ ఉన్నతాధికారుల విచారణలో తేటతెల్లం ⇒ దర్యాప్తు అధికారితోపాటు మరో ఇద్దరిపై వేటుకు రంగం సిద్ధం సాక్షి, హైదరాబాద్: బోధన్ కమర్షియల్ ట్యాక్స్ కేసు పక్కదారి పట్టింది. వందల కోట్లు దిగమింగిన కేసులో నిందితులకు సీఐడీ అధికారులు సహకరించినట్టు ఆరోపణలు రావడం సంచలనాత్మకంగా మారింది. నిందితు లతో కుమ్మక్కై, వారు అరెస్ట్ కాకుండా నేరుగా కోర్టులో లొంగిపోయేలా సహకరించడంతో పాటు స్కాంలో ఆరోపణలెదుర్కొంటున్న ఉన్నతాధికారుల పాత్ర బయటకు రాకుండా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై పోలీస్ శాఖ ముఖ్యమంత్రికి నివేదిక అందించి నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రధాన నిందితుడితో డీల్ బోధన్ కమర్షియల్ ట్యాక్స్ స్కాం దర్యాప్తును కొందరు అధికారులు సొమ్ము చేసుకున్నట్టు సీఐడీ చేసిన అంతర్గత విచారణలో బయటప డింది. నిందితులకు సహకరించడంతోపాటు లొంగిపోయేలా తోడ్పాటు అందించారని దర్యాప్తు అధికారులపై ఆరోపణలు వచ్చాయి. నిందితులను అరెస్ట్ చేసేందుకు ఉన్నతాధి కారులు కృషి చేస్తుంటే దర్యాప్తు అధికారులు, కిందిస్థాయి సిబ్బంది నిందితులతో ఒప్పం దం కుదుర్చుకున్నట్టు విచారణలో బయటకు వచ్చింది. ప్రధాన నిందితుడు శివరాజ్‌తో ఈ డీల్ కుదుర్చుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. అలాగే కేసులో ఆరోపణలెదుర్కొంటున్న ముగ్గురు జాయింట్ కమిషనర్ల పాత్రపై వివరాలు బయటకు రాకుండా ఉండేందుకు కూడా ఒప్పందం జరిగినట్లు తేటతెల్లమైంది. అందులో భాగంగా మొదటి దశలో.. ఏసీ టీవో, జూనియర్, సీనియర్ అసిస్టెంట్ లొంగి పోయినట్టు ఉన్నతాధికారులు బయట పెట్టారు. రెండో దశలో.. ప్రధాన నిందితుడు, కేసులో సూత్రధారి అయిన ఏ1 శివరాజు, ఏ2 గా ఉన్న అతడి కుమారుడు సునీల్ లొంగి పోయేలా సహకరించేందుకు ప్రయత్నాలు చేశారని అధికారులు తెలిపారు. బయటకు పొక్కడంతో.. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ.. పైగా ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న ఈ కేసులో ముగ్గురు నిందితులు లొంగిపోయిన వ్యవహారంపై ఆరోపణలు బయటకు పొక్కాయి. దీనితో రెండో దశలో భాగంగా లొంగిపోవాలని ప్రయత్నించిన శివరాజు వ్యవహారంలో ఒప్పందం అడ్డం తిరిగింది. సీఐడీ ఉన్నతా ధికారులు సీరియస్‌గా స్పందించడంతో దర్యాప్తు అధికారులు శివరాజు కోసం వేట సాగించారు. తమిళనాడు సరిహద్దులో అదు పులోకి తీసుకోవడం, తీవ్ర ఒత్తిడికి గురైన శివరాజుకు గుండెపోటు రావడం.. ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి. అయితే ఎక్కడా విషయం బయటకు పొక్కకుండా దర్యాప్తు అధికారులు ప్రయత్నించారని ఉన్నతాధికా రుల ద్వారా తెలిసింది. ప్రభుత్వ విభాగంలో వందల కోట్లు కాజేసిన కీలక కేసులోనే సీఐడీ అధికారులు ఇలా వ్యవహరించారంటే ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో అర్థమవుతోంది. ఇలాంటి అధికారుల తీరుపై సొంత విభాగం అధికారులే సిగ్గుపడుతున్నారు. దర్యాప్తు అధికారిపై వేటుకు రంగం సిద్ధం స్కాం దర్యాప్తు తీరు, కుంభకోణం జరిగిన పూర్తి వ్యవహారంపై సీఐడీ ఉన్న తాధికారులు సీఎం కేసీఆర్‌కు నివేదిక పంపి నట్టు విశ్వసనీయంగా తెలిసింది. బోధన్‌లో మాత్రమే కాదని, ఇలా పలుచోట్ల 2010 నుంచి జరిమానాల సొమ్ము పక్క దారి పట్టినట్టు అనుమానాలున్నాయన్న విష యాన్ని సీఐడీ నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. ప్రసుత్తం ఈ కేసు దర్యాప్తు చేస్తున్న డీఎస్పీతో పాటు ఇద్దరు ఇన్ స్పెక్టర్లపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు డీజీపీ కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. డీఎస్పీ స్థాయి అధికారిని సస్పెండ్ చేయడంతో పాటు ఇద్దరు ఇన్స్పెక్టర్లను కేసు నుంచి తప్పించే అవకాశాలున్నాయని తెలిపాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కూడా కచ్చితమైన ఆదేశాలు వచ్చినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. -
సిఐడి అదుపులో కీలక సూత్రధారి
-
బోధన్ స్కాం.. ప్రధాన సూత్రధారికి గుండెపోటు!
⇒ ఏ–1 నిందితుడు శివరాజ్ పరిస్థితి విషమం.. గుట్టుచప్పుడు కాకుండా చికిత్స ⇒ ఏ–2గా ఉన్న శివరాజ్ కుమారుడు సునీల్ కోసం వేట సాగిస్తున్న సీఐడీ సాక్షి, హైదరాబాద్: బోధన్ వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి శివరాజ్‌కు గుండెపోటు వచ్చినట్టు విశ్వసనీ యంగా తెలిసింది. గత పదిహేను రోజుల నుంచి సీఐడీ బృందాలు శివరాజ్ కోసం మూడు రాష్ట్రాలను జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కొయంబత్తూర్ సమీపంలోని ఓ గెస్ట్‌హౌజ్‌లో శివరాజ్ ఉన్న సమాచారం అందుకున్న అధికారులు.. ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడి నుంచి హైదరాబాద్ వస్తుండగా మార్గమధ్యంలోనే శివరాజ్ తీవ్ర గుండెపోటుకు గురైనట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి. దీంతో హుటాహుటిన హైదరాబాద్ తరలించి ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మూడు స్టంట్లు వేశారని, అయినా పరిస్థితి విషమంగా ఉందని సీఐడీ దర్యాప్తు బృందాల అధికారులు స్పష్టంచేశారు. గుట్టు చప్పుడు కాకుండా.. రూ.వంద కోట్ల కుంభకోణంలో ఏ–1గా ఉన్న శివరాజ్‌కు గుండెపోటు వచ్చిన విషయాన్ని సీఐడీ అధికారులు బయటకు పొక్కనివ్వలేదు. గతంలో ఎంసెట్ కేసులోనూ కీలక నిందితుడు కమిలేశ్ కుమార్ సింగ్ కూడా సీఐడీ కస్టడీలోనే మృతి చెందాడు. ముందుగా కమిలేశ్ గుండెపోటు వచ్చినట్టు నటించాడు. అయితే తర్వాత కొద్ది సేపటికే అతడికి నిజంగా గుండెపోటు వచ్చినా, సీఐడీ అధికారులు డ్రామాగా భావించి ఆస్పత్రికి తరలించడంలో నిర్లక్ష్యం వహించారు. ఆస్పత్రికి ఆలస్యంగా తీసుకెళ్లడం వల్లే కమిలేశ్ మృతి చెందాడని తర్వాత తెలిసింది. ఇప్పుడు కమర్షియల్ స్కాంలోనూ ఇదే రీతిలో ఏ–1గా ఉన్న శివరాజ్ గుండెపోటుకు గురవడం సంచలనంగా మారింది. కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన శివరాజ్ కుమారుడు, ఏ–2 సునీల్ కోసం సీఐడీ ముమ్మరంగా గాలిస్తోంది. కార్యాలయం అతడి హ్యాండోవర్లోనే! కమర్షియల్ ట్యాక్స్ సర్కిల్ ఆఫీస్ పేరుకు మాత్రమేనని, కార్యకలాపాలు మొత్తం నిర్వహించేది శివరాజేనని నిందితులు సీఐడీకి పూసగుచ్చినట్టుగా తెలిపారని సమాచారం. ఏ అధికారి ఏసీటీవోగా సర్కిల్ ఆఫీస్‌కు వచ్చినా, శివరాజ్ హవానే కొనసాగేదనని, ఎవరెవరకి ప్రతీ నెలా ఎంత పంపాలో అతడికి బాగా తెలుసని వివరించినట్లు సమాచారం. కేంద్ర కార్యాలయంలో ఉన్న ఆడిటింగ్ అధికారులను సైతం శివరాజ్ మ్యానేజ్ చేశారని, 2010 నుంచి ఇప్పటివరకు ట్యాక్స్ లెక్కలను ఆడిటింగ్ చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ అని కస్టడీలో ఉన్న నిందితులు సీఐడీకి స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ముగ్గురి అరెస్ట్ బోధన్ స్కాంలో నిందితులతో కుమ్మకైన ఏసీటీవో, సీనియర్ అసిస్టెంట్, మరో జూనియర్ అసిస్టెంట్ వారం రోజుల కిందటే కోర్టులో లొంగిపోయా రు. సీఐడీ వీరిని వారం రోజులపాటు కస్టడీలోకి తీసుకుంది. ఈ కుంభకోణంలో సీటీవోలు, డీసీటీవోలు, జాయింట్ కమి షనర్లు, అదనపు కమిషనర్ల పాత్ర కూడా ఉందని కస్టడీలో ఉన్న నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తాము కేవలం ఏసీటీవో, డీసీటీవోలు చెప్పిన వివరాలను రికార్డుల్లోకి ఎక్కిస్తామని, అంతకు మించి తమ పాత్ర పెద్దగా ఏమీ లేదని వెల్లడించినట్లు సమాచారం. -
కుంభకోణంలో మరో కొత్త కోణం!
నిజామాబాద్ సీటీవో–1 కార్యాలయంలో సీఐడీ తనిఖీలు ‘బోధన్’ నిందితుల వివరాల ఆధారంగా సోదాలు నిజామాబాద్ నాగారం (నిజామాబాద్ అర్బన్): బోధన్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో జరిగిన కుంభకోణంలో తీగ లాగిన కొద్దీ డొంక కదులుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కుంభకోణం కథ తాజాగా నిజామాబాద్‌కు చేరింది. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం (సీటీవో–1)లో బుధవారం సోదాలు నిర్వహిం చడంతో అధికారుల్లో గుబులు మొదలైంది. బో ధన్‌లో జరిగిన కుంభకోణానికి, జిల్లా కేంద్రం లోని కార్యాలయం నుంచే పూర్తి సహకారం అం దినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తనిఖీలు చేసినట్లు సమాచారం. ‘బోధన్ స్కాం కేసు’లో ఇప్పటికే ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు.. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిజామాబాద్ సీటీవో–1లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. నకిలీ చలానాలు సృష్టించి సర్కారు ఆదాయానికి భారీగా గండికొట్టారు. ఒక్క బోధన్ సీటీవో కార్యాలయంలోనే రూ.70 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో బోధన్‌కు, నిజామాబాద్ సీటీవో–1కు విడదీయని రాని బంధం ఉన్న ట్లు అధికారులు గుర్తించారు. సీటీవో–1లోని ఉ న్న వాణిజ్య పన్నుల శాఖ అధికారి కంప్యూటర్‌నే హైజాక్ చేసి, అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. సీటీవో కంప్యూటర్ యూజర్ ఐడీ, పా స్వర్డ్ను తస్కరించి, లావాదేవీలు నిర్వహించిన ట్లు నిందితుల్లో ఒకరైన ఏసీటీవో జయకృష్ణ సీఐ డీ అధికారులకు విచారణలో వెల్లడించినట్లు తెలి సింది. దీంతో సీఐడీ అధికారులు బుధవారం ఆ కస్మికంగా సీటీవో–1లో సోదాలు చేశారు. కం ప్యూటర్ నుంచి చలానాలకు సంబంధించిన పూ ర్తి సమాచారాన్ని అధికారులు సేకరించారు. అ లాగే ఇక్కడి నుంచి జరిగిన పూర్తి స్థాయి లావాదేవీలను, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల్లో గుబులు ఈ కుంభకోణంతో శాఖలో పనిచేస్తున్న అవినీతి అధికారుల్లో గుబులు మొదలైంది. దాదాపుగా నెల రోజుల నుంచి అక్రమాలకు పాల్పడిన అధికారులు భయపడుతూనే ఉన్నారు. ఎప్పుడు ఏ కార్యాలయానికి, ఏ సెక్షన్‌కు సీఐడీ అధికారులు వచ్చి విచారిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. సీఐడీ కస్టడీలో ఉన్న ముగ్గురు నిందితులను విచారణ చేస్తూ వారికి సంబంధించిన సమాచారం కోసం ఆకస్మికంగా సంబంధిత శాఖలో త నిఖీలు చేపడుతున్నారు. కన్సల్టెంట్ శివరాజ్, అ తని కుమారుడు పట్టుబడితే మరిన్ని నిజాలు బ యటకు వచ్చే అవకాశం ఉంది. -
ఈదురు గాలుల బీభత్సం
జిల్లాలో పలుచోట్ల అకాల వర్షం నేలకొరిగిన పంటలు, చెట్లు, విద్యుత్‌స్తంభాలు నవీపేట(బోధన్): మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం సాయ్రంతం ఈదురు గాలులు, వడగండ్ల వాన భీభత్సం సృష్టించింది. నవీపేట నుంచి జన్నెపల్లికి వెళ్లే రోడ్డుపై రెండు భారీ వృక్షాలు నేలకొరిగాయి. జన్నెపల్లి, సిరన్‌పల్లి, నాళేశ్వర్, నందిగామ, లింగాపూర్ గ్రామాన్లే వడగండ్లతో కూడిన వర్షాలు పడ్డాయి. నవీపేట, జన్నెపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో 50 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మొక్కజొన్న, వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. నిండా ముంచిన వర్షం నందిపేట(ఆర్మూర్): అకాల వర్షం రైతులను నిండా ముంచింది. చేతికొచ్చిన పంటలన్నీ తడిసి ముద్దయ్యాయి. బుధవారం సాయంత్రం మండలంలోని వెల్మల్, కౌల్పూర్, ఆంధ్రనగర్లలో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురియడంతో కల్లాల్లో ఉన్న పసుపు, జొన్నలు తడిసిపోయాయి. పసుపు తడవడంతో రంగుమారి కనీస ధర కూడా దక్కదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కోత కోసి కుప్పలుగా ఉంచిన జొన్నలు కూడా వర్షార్పణమయ్యాయి. -
సీఐడీ కస్టడీకి బోధన్ స్కామ్ నిందితులు
సాక్షి, హైదరాబాద్: కమర్షియల్ ట్యాక్స్ చలాన్ల కుంభకోణంలో కోర్టులో లొంగిపోయిన ముగ్గురు నిందితులను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. బోధన్ సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఏసీటీవో, ఓ సీనియర్, మరో జూనియర్ అసిస్టెంట్ గత వారం కోర్టులో లొంగిపోయారు. వారిని విచారించి కేసుకు సంబంధించి మిగిలిన నిందితుల పాత్రను నిరూపించాల్సి ఉందని, కాబట్టి వారిని కస్టడీకి అప్పగించాలని సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు వారం రోజుల పాటు ఆ ముగ్గురిని విచారించేందుకు కోర్టు అనుమతిచ్చిందని సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా తెలిపారు. కేసులో కీలకంగా ఉన్న ప్రైవేట్ ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజు, అతడి కుమారుడు సునీల్ కోసం సీఐడీ బృందాలు వేటసాగిస్తున్నాయి. -
ఇక్కడ హోలీ అంటే పిడిగుద్దులాటే
బోధన్ రూరల్(బోధన్): నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో సోమవారం హోలీ సందర్భంగా పిడిగుద్దులాట ప్రశాంతంగా సాగింది. గ్రామం సుభిక్షంగా ఉండాలన్న ఆకాంక్షతో హోలీ రోజు 130 ఏళ్ల నుంచి పిడిగుద్దులాట నిర్వహిస్తున్నారు. సోమవారం గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయి పిడిగుద్దులు కురిపిం చుకున్నారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పిడిగుద్దులాటలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
పోలీసుల అదుపులో కీలక నిందితుడు!
‘బోధన్’ కుంభకోణంలో కొనసాగుతున్న అరెస్టుల పర్వం సాక్షి, హైదరాబాద్: బోధన్ వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ ఒక్కసారిగా వేగం పెంచింది. నిందితుల ఆచూకీని పసిగట్టి ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతోంది. ఈ కేసులో ప్రమేయమున్నట్లుగా ఆరోపణలున్న నిజామాబాద్ ఏసీటీవో విజయ్‌కృష్ణ సోమవారం బోధన్ కోర్టులో లొంగిపోయాడు. ప్రధాన నిందితుడిగా ఉన్న టాక్స్ కన్సల్టెంట్ శివరాజ్, అతడి కుమారుడు సునీల్‌ను సీఐడీ పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరితో పాటు ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఒక జూనియర్ అసిస్టెంట్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరి ద్వారా మిగిలిన సూత్రధారుల వివరాలను సీఐడీ అధికారులు రాబడుతున్నారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల్లోనూ వణుకు మొదలైంది. ప్రధానంగా శివరాజ్‌తో లావాదేవీలు నడిపిన ఇద్దరు జాయింట్ కమిషనర్లు, నలుగురు సీటీవోలు, ఆరుగురు డీసీటీవోలకు సంబంధించి ఇప్పటికే సీఐడీ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించినట్లు సమాచారం. -
బోధన్ స్కామ్‌లో ఐదుగురు నిందితుల గుర్తింపు
వీరి కోసం గాలిస్తున్నామన్న ఐజీ సౌమ్యామిశ్రా సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి ప్రతి నెలా వ్యాట్ రూపంలో రావాల్సిన కోట్ల రూపాయలను బినామీ ఖాతాలో్లకి మళ్లించిన బోధన్ కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ దర్యాప్తును సీఐడీ అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని నిందితులుగా గుర్తిం చినట్లు ఐజీ సౌమ్యామిశ్రా శుక్రవారం తెలి పారు. వీరిలో ముగ్గురు కమర్షియల్ ట్యాక్స్ అధికారులుండగా... ఇద్దరు దళారులని పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఇప్పటివరకు ఓ ఉదంతంలోనే రూ.3.39 కోట్లు స్వాహా అయినట్లు గుర్తించామని మిగిలిన ఉదంతాల్లో గుర్తించా ల్సుందని పేర్కొన్నా రు. ఈ కేసు దర్యాప్తులో అనేక ఖాతాలను సరిచూడాల్సి ఉందని, దీంతో కమర్షియల్ ట్యాక్స్ విభాగం నుంచి నోడల్ అధికారి, కొందరు సహాయకులను నియమించామని పేర్కొన్నారు. నమో ఫౌండేషన్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్న అంకిత్ మెహతాపై ఆశిష్ జైన్ న ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేశామని ఐజీ తెలి పారు. తన తల్లి సరోజ జైన్ నుంచి మెహతా రూ.12.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తనకు ప్రధాన మంత్రి కార్యాలయంలోనూ (పీఎంఓ) పలుకుబడి ఉన్నట్లు బాధితులకు చెప్పాడని, దీంతో వారు సీఐడీలో ఫిర్యాదు చేయడంతో పాటు పీఎంఓకూ లేఖ రాశారన్నారు. ఈ మోసానికి, ఫౌండేషన్ కు సంబంధం లేదని, అయితే బాధితులు మాత్రం ఆ సంస్థ ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే మెహతాకు నగదు ఇచ్చినట్లు చెప్తున్నారని సౌమ్యామిశ్రా తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు కూడా దర్యాప్తు స్థితిలో ఉందని వివరించారు. ఎంసెట్ లీకేజ్ స్కామ్‌లో ఇప్పటికే అనేక మంది నిందితుల్ని అరెస్టు చేశామని చెప్పిన ఐజీ బీహార్ కేంద్రంగా జరిగిన ఈ స్కామ్‌లో కీలక నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. -
ఇరిగేషన్ ఈఈపై రైతులు దాడి
బోధన్: నిజామాబాద్ జిల్లా రైతులు బోధన్ బై పాస్ రోడ్డు వద్ద ఆందోళనకు దిగారు. తమ పంట పొలాలకు సాగునీరు అందించాలంటూ రైతులు ధర్నా చేయడంతో రాకపోకలు స్తంభించాయి. పోలీసులు రంగప్రవేశంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరిగేషన్ ఈఈ సత్యశీల రెడ్డి పై రైతులు దాడికి యత్నించారు. ధర్నా చేస్తున్న రైతుల్లో శంకర్ అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో బోధన్ ఆస్పత్రికి తరలించారు. -
సీఐడీ వర్సెస్ కమర్షియల్ ట్యాక్స్!
⇒ బోధన్ స్కాంలో నిందితులకు ఉన్నతాధికారుల వత్తాసు ⇒ పరారీకి సహకరించారని సీఐడీ ఆగ్రహం ⇒ ఆ శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో నకిలీ చలాన్లతో కోట్లు కొట్టేసిన (బోధన్ స్కాం) నిందితులకు ఆ విభాగపు ఉన్నతాధికారులు సహకరిస్తున్నారంటూ సీఐడీ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై వాణిజ్య పన్నుల విభాగం ముఖ్య కార్యదర్శికి సీఐడీ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో ఆ విభాగపు ఉన్నతాధికారుల పాత్రపైనా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ప్రభుత్వం నుంచి పక్కాగా ఆదేశాలు వచ్చాయని సీఐడీ వర్గాలు తెలిపాయి. (బో‘ధన్’ దొంగలెందరో?) పరారీ.. ఆశ్రయం: బోధన్ స్కాంలో ప్రాథమికంగా నిందితులుగా ఉన్న ఏసీటీవో, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లకు పరారీలో తోడ్పడింది ఇద్దరు íసీటీవోలు, ఇద్దరు జాయింట్ కమిషనర్లని సీఐడీ విచారణలో బయటపడింది. ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్, అతడి కుమారుడు సునీల్‌కు ఆశ్రయం ఇవ్వడంలోనూ వీరి పాత్ర కీలకమని సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. స్కాంలో కీలక సూత్రధారిగా ఉన్న శివరాజ్, సునీల్ కర్ణాటకలో తలదాచుకున్నట్టు గుర్తించారు.(‘కమర్షియల్’ స్కాంపై సీఎం కేసీఆర్ సీరియస్) విచారణకు సహకరించాలి: ఈ కుంభకోణం వ్యవహారంలో తమ దర్యాప్తునకు సహకరించాలని సీఐడీ విజ్ఞప్తి చేసిందని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఉదంతంపై తాము కూడా అంతర్గతంగా విచారణ జరుపుతున్నామని, తమ అధికారుల పాత్రపై పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని, దాన్ని బట్టి సీఐడీ అధికారులు విచారించుకోవచ్చని స్పష్టం చేశారు. నిందితులకు సహకరిస్తున్న అధికారుల వివరాలను సీఐడీ నుంచి తీసుకుంటామని, ఈ కేసులో సీఐడీకి ఒత్తిళ్లు లేకుండా చూస్తున్నామని కమర్షియల్ ట్యాక్స్ విభాగంలోని కీలక అధికారి ఒకరు చెప్పారు. వణికిపోతున్న అధికారులు... ఈ స్కాంలో దోచుకున్న డబ్బులు ఖాతాల్లో వేసుకున్న కమర్షియల్ ట్యాక్స్ ఉన్నతాధికారుల్లో వణుకు మొదలైనట్టు తెలిసింది. శివరాజ్, సునీల్ సహా 22 మంది ములాఖత్ అయ్యారని, హైదరాబాద్‌లోని రెండు హోటళ్లలో రహస్యంగా సమావేశమై డబ్బు పంచుకున్నట్టు సీఐడీ గుర్తించింది. వీరిలో నలుగురు సీటీవోలు, నలుగురు జాయింట్ కమిషనర్లు కూడా ఉండటంతో ఆ విభాగంలో తీవ్ర చర్చ ప్రారంభమైంది. ఎప్పుడు, ఏ సమయంలో సీఐడీ అధికారులు ఎవరి ఇంట్లో దాడులు చేస్తారో తెలియక ఆ అధికారులు భయాందోళనలో ఉన్నారని తెలుస్తోంది. శివరాజ్, సునీల్ సీఐడీకి దొరికితే అందరి బాగోతం బయటపడుతుందని, వారి విచారణలో ఎవరి పేర్లు బయటకు వస్తాయోనని హడలిపోతున్నారని సమాచారం. -
కోట్లు దోచుకుంటే ఏం చేస్తున్నారు?
⇒ ‘కమర్షియల్’ స్కాంపై సీఎం కేసీఆర్ సీరియస్ ⇒ ఎన్ఫోర్స్మెంట్ నిఘా పెంచాలని ఆదేశం ⇒ సీఐడీ విచారణపై ఆరా..ఆరోపణలెదుర్కొంటున్న అధికారులపై విచారణ సాక్షి, హైదరాబాద్: బోధన్ వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన కుంభకోణంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీరియస్ అయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ రాబడికి గండి కొడుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ సంబంధిత విభాగ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత కేవలం రూ.60 కోట్ల వరకే స్కాం జరిగినట్లు నివేదికిచ్చారని, కానీ సీఐడీ విచారణలో వందల కోట్లు పక్కదారి పట్టినట్లు తేలడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక నుంచి ప్రతి సర్కిల్ కార్యాలయ పరిధిలోని ఆడిటింగ్‌ను తప్పనిసరిగా కేంద్ర కార్యాలయాల్లో పర్యవేక్షించాలని, అధికారులపై ఎన్ఫోర్స్మెంట్ నిఘాను పెంచాలని ఆదేశించారు. సీఐడీ చేస్తున్న దర్యాప్తు తీరుపై డీజీపీ అనురాగ్ శర్మతో సీఎం వాకబు చేశారు. కేసు విచారణలో బయటపడుతున్న సంచలనాత్మక అంశాలపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని, మరిన్ని బృందాలను రంగంలోకి దించి నిందితులను పట్టుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. (చదవండి: బో‘ధన్’ దొంగలెందరో?) క్రిమినల్ కేసులకు రంగం సిద్ధం బోధన్ స్కాం అక్రమాల్లో పాలుపంచుకున్న కమర్షియల్ ట్యాక్స్ సీటీవోలు, ఏసీటీవోలు, సూపరింటెండెంట్లు, డీసీటీవోలు, జాయింట్ కమిషనర్ల విచారణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ స్కాంలో ఆరోపణలెదుర్కొంటున్న 18 మంది అధికారుల పాత్రపై సీఐడీ ఆరా తీయనుంది. ప్రైవేట్ ఆడిటర్ శివరాజ్, అతడి కుమారుడు సునీల్‌తో పదే పదే సంభాషణలు కొనసాగించిన ఈ అధికారులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు దర్యాప్తు అధికారులు రంగం సిద్ధం చేశారు. వీరిని విచారించేందుకు సీఐడీకి అనుమతి లభించడంతో నోటీసులు జారీ చేసి విచారణకు హాజరవ్వాలని కోరే అవకాశం ఉన్నట్లు సీఐడీ వర్గాలు తెలిపాయి. నీకింత.. నాకింత వాటాలు పంచుకున్న 18 మంది అధికారులు బోధన్ స్కాం తవ్వుతున్న సీఐడీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ బయటపడింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన ఉన్నతాధికారుల జాబితా వెలుగులోకి వచ్చింది. ఏకంగా 18 మంది ఉన్నతాధికారుల పాత్రపై సీఐడీ దృష్టి సారించింది. బోధన్‌లో గతంలో పనిచేసిన ఏసీటీవో, సీటీవోల దగ్గరి నుంచి డివిజన్ కార్యాలయాలు, జాయింట్ కమిషనర్ల వరకు ఈ స్కాంలో పాత్రదారులుగా ఉన్నారని సీఐడీ ఆధారా లు సేకరించింది. ప్రైవేట్ ఆడిటర్‌గా ఉం టూ ట్యాక్స్ చెక్కులు వసూలు చేసిన శివరాజుతో కలసి ఈ 18 మంది వాటాలు పంచుకున్నారని విచారణలో తేలినట్టు అధికారులు తెలిపారు. వీరంతా ప్రస్తుతం వివిధ హోదాల్లో పలు చోట్ల పనిచేస్తున్నారు. వీరు పనిచేస్తున్న ప్రాంతాల్లోనూ శివరాజుతో కలసి ఇలాంటి వ్యవహారాలు సాగిస్తున్నట్టు సీఐడీ గుర్తించింది. అయితే వీరు పనిచేస్తున్న ప్రాంతాలను తెలిపేందుకు అధికారులు నిరాకరించారు. బోధన్‌లో రూ.25 లక్షలకు పైగా ట్యాక్స్ చెల్లించాల్సిన 100 మంది వ్యాపారుల వాంగ్మూలాలు సేకరించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. వీరిలో ట్యాక్స్ కట్టిన వారు, ట్యాక్స్ కట్టకుండా శివరాజుతో కలసి పన్ను కట్టినట్టు నకిలీ చలాన్లు పెట్టుకున్న వారిని విచారించాలని భావిస్తున్నారు. దీంతో పాత నిజామాబాద్ జిల్లాలో కలవరం మొదలైంది. ఎప్పుడు ఏ సీఐడీ అధికారులు వచ్చి విచారిస్తారో తెలియక సతమవుతున్నట్టు తెలిసింది. -
బో‘ధన్’ దొంగలెందరో?
కమర్షియల్ ట్యాక్స్‌లో బయటపడని తిమింగళాలు మరెన్నో.. - వెయ్యి కోట్ల దాకా స్కాం జరిగి ఉండొచ్చని సీఐడీ అనుమానం - అన్ని సర్కిళ్లలోనూ బోధన్ తరహా వ్యవహారాలే! - ఒక్క బోధన్‌లోనే రూ. 200 కోట్లు నొక్కేసిన శివరాజ్ గ్యాంగ్ - ఐదేళ్లుగా అన్నీ దొంగ లెక్కలు.. నకిలీ ఆడిటింగ్లు - బ్యాంకులు, సబ్ ట్రెజరీల్లోనూ అక్రమార్కులు - అధికారులపై దాడులకు సిద్ధమైన ఏసీబీ - ఫైలు సీఎంవోకు వెళ్లకుండా ఉన్నతాధికారుల ఒత్తిడి? సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వానికి ప్రతి నెలా వ్యాట్ కింద రావాల్సిన కోట్ల రూపాయలను బినామీ ఖాతాల్లోకి మళ్లించారు.. ఒక వ్యాపారి చెల్లించిన ట్యాక్స్ నగదును మరో ఐదుగురు వ్యాపారుల పేర్ల మీదకు మార్చేశారు.. బోధన్ కమర్షియల్ ట్యాక్స్ స్కాంలో ఇలాంటి ఎన్నో సంచలనాత్మక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి! కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారుల కళ్లు బైర్లు కమ్మే విషయాలు కనిపిస్తున్నాయి. ఏకంగా రూ.200 కోట్లకు పైగా ట్యాక్స్ వసూలు చేసి కేవలం 25 నుంచి రూ.30 కోట్లు మాత్రమే ప్రభుత్వ ఖజానాలోకి చేరాయంటే ఎంతటి స్థాయిలో స్కాం జరిగిందో తెలుస్తోంది. ఇలా కేవలం బోధన్ మాత్రమే కాదు కమర్షియల్ ట్యాక్స్‌లోని 80 శాతం సర్కిళ్లలో ఇదే పరిస్థితి ఉన్నట్టు సీఐడీ అనుమానిస్తోంది. ఇలా ఏటా ప్రభుత్వానికి వెయ్యి కోట్ల దాకా వ్యాట్ సొమ్ము గల్లంతైనట్టు సీఐడీ అంచనా వేస్తోంది. కేసు సీఐడీకి బదిలీ వెనుక ఒత్తిడి? బోధన్ స్కాం వ్యవహారంలో సీఐడీ దర్యాప్తునకు ఆదేశించే ముందు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ప్రాథమిక దర్యాప్తు జరిపింది. ఈ విచారణలో కేవలం బోధన్‌లోనే రూ.200 కోట్లు స్కాం జరిగినట్టు తేలింది. సీటీఓ, ఏసీటీవోతోపాటు మరో నలుగురు కార్యాలయ సిబ్బంది, ఆడిటర్ నేతృత్వంలో స్కాం చేసినట్టు ఏసీబీ ఆధారాలు సేకరించింది. ఇలా రాష్ట్రంలోని 12 డివిజన్లలో 91 సర్కిల్ కార్యాలయాలున్నాయి. ఈ సర్కిళ్లలోని 80 శాతం కార్యాలయాల్లో ఆడిటర్లే వాటిని పరోక్షంగా శాసిస్తున్నారని తేలినట్టు తెలిసింది. ఇలా ఈ సర్కిల్ కార్యాలయాల్లో రూ.1000 కోట్లకు పైగా కుంభకోణం జరిగి ఉంటుందని ఏసీబీ అనుమానించింది. అయితే ఈ కేసును తామే విచారణ చేస్తామని ఉన్నతాధికారులు పట్టుదల చూపించారు. కానీ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చి కేసును కేవలం బోధన్‌కు మాత్రమే పరిమితం చేసి సీఐడీకి బదిలీ చేయించారని విశ్వసనీయంగా తెలిసింది. అన్ని వారి చేతుల్లోనే.. బోధన్ స్కాంలో ప్రధాన పాత్ర పోషించింది ఆడిటర్ శివరాజ్‌గా సీఐడీ అధికారులు గుర్తించారు. ఇతడి ప్రమేయం లేనిదే ఆ సర్కిల్ పరిధిలో ట్యాక్స్ చెల్లింపులు జరగవని గుర్తించారు. శివరాజ్‌తోపాటు అతడి కుమారుడు సునీల్ కూడా కీలక పాత్ర పోషించాడని దర్యాప్తులో బయటపడింది. శివరాజ్ లాబీయింగ్‌తోనే కమర్షియల్ ట్యాక్స్ అధికారుల బదిలీలు కూడా జరిగాయంటే స్కాంలో అతడి పాత్ర ఎంతటితో అర్థమవుతోంది. ఇలా అతడు ఒక్క బోధన్లోనేగాక.. నిజామాబాద్ డివిజన్లో నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని నకిలీ ట్రెజరీ చలాన్లతో ట్యాక్స్ చెల్లించినట్టు వ్యాట్ వెబ్‌పోర్టల్‌లో అధికారులు యూజర్ ఐడీ, పాస్‌వర్డులతో వివరాలు అప్లోడ్ చేసేవాడని సీఐడీ అధికారుల ద్వారా తెలిసింది. ఇలా ఐదేళ్లలో ఇతడి ద్వారానే దొంగ ఆడిటింగ్లు చేయించారని, వాటికి సంబంధించిన ఫైలు కూడా దొరక్కుండా చేశారని తేలింది. ఒక్క చెక్కు.. ఐదుగురికి ట్యాక్స్... బోధన్‌లో ప్రముఖ వాహనాల డిస్టిబ్యూటర్ ప్రతి నెలా రూ.25 లక్షల ట్యాక్స్ కడుతుంటాడు. కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు నిత్యం టచ్‌లో ఉండే ఆడిటర్ శివరాజ్‌కు రూ.25 లక్షల చెక్కు ఇచ్చాడు. ఈ చెక్ తీసుకున్న శివరాజ్ ఐదుగురు వ్యాపారుల పేరిట చలాన్లు తీసి సబ్ ట్రెజరీ ఆఫీస్‌లో చెల్లించాడు. వాహనాల డిస్టిబ్యూటర్ పేరిట కేవలం రూ.5 లక్షలు చెల్లించి మిగతా డబ్బును ఇతర వ్యాపారుల పేరిట జమ చేశారు. వారిచ్చిన డబ్బును శివరాజ్‌తో పాటు అధికారులు తమ సొంత జేబుల్లో నింపుకున్నారు. గత అయిదేళ్లలో ఒక వాహనాల డీలర్ రూ.28 కోట్లు ట్యాక్స్ చెల్లించినట్టు చెక్కులున్నాయి. కానీ కమర్షియల్ టాక్స్‌లో ఆయన పేరిట ఇప్పటివరకు రూ.2 కోట్లు మాత్రమే జమ అయినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. మిగతా రూ.26 కోట్లు అధికారులే స్వాహా చేశారనే నిర్ధారణకు వచ్చారు. ఇలా బోధన్ పరిధిలో రూ.25 లక్షలకు పైగా ట్యాక్స్ చెల్లించే వారు 150 మంది ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా రైస్‌మిల్లర్లు, కార్ల డిస్టిబ్యూటర్లుండటంతో కమర్షియల్ టాక్స్ అధికారుల పంట పడింది. ఒకరు కట్టిన ట్యాక్స్‌ను ఖజానాకు జమ చేసి.. మిగతా వారు కట్టిన డబ్బును తమ సొంతం చేసుకున్నారు. బ్యాంకు, సబ్ ట్రెజరీల్లోనూ... కమర్షియల్ ట్యాక్స్ ప్రభుత్వ ఖాతా ఉన్న బ్యాంకు, చలాన్లు చెల్లించే సబ్ ట్రెజరీ కార్యాలయాలు(ఎస్టీవో)ల్లో కూడా శివరాజ్ మనుషులున్నట్టు సీఐడీ గుర్తించింది. ఒకరి పేరుపై ట్యాక్స్ చెల్లించేందుకు ఇచ్చిన చెక్కుతోనే మిగతా వ్యాపారుల పేరిట చలాన్లు స్వీకరించడం ఏంటన్న అంశంపై దృష్టి సారించగా.. ఈ రెండు విభాగాల అధికారుల అక్రమాలు బయటపడినట్టు తెలుస్తోంది. 15 రోజుల్లోనే రూ.20 కోట్లు బోధన్‌లో ట్యాక్స్ కుంభకోణం బయటపడి 15 రోజులు గడుస్తోంది. ఈ పక్షం రోజుల్లో బోధన్ మిల్లర్లు రూ.20 కోట్ల వరకు పెండింగ్ ట్యాక్సులు చెల్లించినట్టు తెలిసింది. ఇవి కేవలం 20 శాతం మంది మిల్లర్లు మాత్రమే చెల్లించినవి సీఐడీ తన దర్యాప్తులో బయటపెట్టింది. మొద్దు నిద్రలో వాణిజ్య విభాగం బోధన్‌లో ఈ స్కాం ఐదేళ్ల నుంచి జరుగుతోందని సీఐడీ దర్యాప్తులో తేలింది. అయితే ఈ ఐదేళ్లకు సంబంధించిన ఏ ఒక్క రికార్డు కూడా దొరక్కుండా కాల్చి బూడిద చేశారు. మరి ఐదేళ్ల నుంచి కమర్షియల్ ట్యాక్స్ విభాగం ఉన్నతాధికారులు, ఆడిటింగ్ విభాగం ఎందుకు పట్టించుకోలేదన్న అంశంపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. వీరి చేతుల్లోకి కూడా వసూళ్ల డబ్బు వచ్చి ఉంటుందని అనుమానిస్తోంది. 2012 నుంచి 2016–17 ఆర్థిక సంవత్సరం వరకు స్కాం జరిగినట్టు విచారణలో వెలుగు చూసింది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ వసూళ్లనే దోచుకుంటే వాణిజ్య విభాగం చూసీచూడకుండా ఉండటంపై విమర్షలు వెలువెత్తుతున్నాయి. ఆ అధికారులపై నజర్ ప్రభుత్వ ఉద్యోగుల అక్రమాలకు సంబంధించి కేసుల నమోదు, దాడులు చేసే అధికారం కేవలం ఏసీబీకి మాత్రమే ఉంది. బోధన్ స్కాంతో వెలుగులోకి వచ్చిన కమర్షియల్ ట్యాక్స్ అధికారులపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బినామీ పేర్లతో అక్రమాస్తులు కూడబెట్టిన అధికారులపై త్వరలోనే కొరడా ఝళిపించే అవకాశం ఉందని ఏసీబీ అధికారుల ద్వారా తెలిసింది. అయితే అధికారులపై దాడులకు సంబంధించిన ప్రతిపాదన పైలు జీఏడీలో పెండింగ్‌లో ఉందని, ఆ ఫైలును సీఎం కార్యాలయానికి చేరకుండా కమర్షియల్ ట్యాక్స్‌లోని కొందరు ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చి ఆపించే కుట్ర చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. 10 రోజులుగా ఆ ఫైలు సీఎంవోకు వెళ్లకుండా పక్కనబెట్టడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ జాబితాలో జూనియర్ అసిస్టెంట్ నుంచి జాయింట్ కమిషనర్లకు వరకు ఉన్నట్టు తెలిసింది. -
సీఎం దిష్టిబొమ్మ దహనం
బోధన్: నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోధన్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నిజాం సుగర్ ఫ్యాక్టరీపై సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపించి కార్మికులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇంతవరకూ ఎలాంటి పురోగతీ లేదన్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేని కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ గంగా శంకర్‌తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
భవిత తేలేనా ..
కసరస్తు చేస్తున్న సర్కారు అసెంబ్లీ సమావేశాల్లోనే స్పష్టత ఇవ్వాలని యోచన రెండుమూడు రోజుల్లో రైతులతో మంత్రి కేటీఆర్ బేటీకి అవకాశం బోధన్ : బోధన్‌లోని నిజాంషుగర్స్ భవిత ను తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లోనే తుది నిర్ణయంపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. తాజాగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావు నిజాంషుగర్స్ పరిధిలోని నియోజక వర్గాల ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టు సమాచారం. ఫ్యాక్టరీ పరిధిలోని ముఖ్యమైన చెరుకు రైతుల నాయకులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో రైతులతో కీలక సమావేశం జరుగనుందని సంకేతాలు వస్తున్నాయి. షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు, కార్మికుల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అధికార పక్ష నేతలు, రైతు నాయకులు అంటున్నారు. వారం రోజుల్లో పే ఫ్యాక్టరీ భవిత తేలుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా టీఆర్ఎస్ ఎన్నికల అజెండాలో ముఖ్యమైన అంశంగా నిజాంషుగర్ ఫ్యాక్టరీ సమస్య ఉంది. స్వయంగా సీఎం కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమం, ఎన్నికల సభల్లో నిజాంషుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచి పోయినా ప్యాక్టరీ భవితను తేల్చడంలో విధాన పరంగా స్పష్టత ఇవ్వలేదు. 2015 డిసెంబర్ 23న నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) యాజమాన్యం చెరుకు, నీటి లభ్యత కొరత కారణాలు చూపి లేఆఫ్ ప్రకటించింది. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ఎన్డీఎస్ఎల్తో పాటు జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట, మెదక్ జిల్లాలోని ముంబోజిపల్లి యూనిట్లను మూసివేసింది. ముఖ్య వ్యవసాయాధార పరిశ్రమ షుగర్ ఫ్యాక్టరీల మూసివేతతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఫ్యాక్టరీలు మూసివేసి ఏడాది కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు పునరుద్ధరణకు స్పష్టత ఇవ్వలేదు.మూడు ఫ్యాక్టరీల మూసివేతతో వందలాది మంది కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. చెరుకు పంట సాగు చేసిన రైతులు జిల్లాలోని ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీలకు చెరుకును మళ్లించారు. అఖిల పక్షాలు, కార్మిక ,రైతు సంఘాలు, నిజాంషుగర్స్ రక్షణ కమిటీల నేతృత్వంలో బోధన్‌లో 10 నెలలకు పైగా వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి పి సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో బోధన్ నియోజక వర్గం పరిధిలోని నాలుగు రోజుల పాటు రైతు పాదయాత్ర చేపట్టారు. 2015 జనవరి 5న సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో మూడు ఫ్యాక్టరీల పరిధిలో చెరుకు రైతుల సమావేశం నిర్వహించారు. రైతులు ముందుకువస్తే ఫ్యాక్టరీని ఆధునీకరించి అప్పగిస్తామని అన్నారు. అయితే ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడుపాలని రైతులు స్పష్టం చేశారు. 20 రోజుల క్రితం ఎంపీ కల్వకుంట్ల కవిత రైతులతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి అభిప్రాయాలను సేకరించారు. ప్రభుత్వం కాలయాపన చేస్తోందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఫ్యాక్టరీ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందని తెలుస్తోంది -
షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని బోధన్ బంద్
బోధన్(నిజామాబాద్ జిల్లా): నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని చక్కెర ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం పిలుపుమేరకు సోమవారం బోధన్ బంద్ జరుగుతోంది. పట్టణంలో దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. కాంగ్రెస్, శివసేన, న్యూడెమోక్రసీ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బంద్‌కు ప్రజలు స్వచ్చందంగా సహకరిస్తున్నారు. -
నేడు బోధన్ బంద్
అఖిల పక్షాల పిలుపు ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం పోరుబాట బోధన్ : నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) పునరుద్ధరణ కోసం అఖిలపక్షాలు మరోమారు బోధన్ బంద్‌కు పిలుపునిచ్చాయి. టీఆర్ఎస్ మినహా మిగతా రాజకీయ, వామపక్ష పార్టీలు, అనుబంధ ప్రజా సంఘాలు కొద్ది కాలంగా ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఐక్య పోరాటాలు ప్రారంభించాయి. ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు, పాదయాత్రలు చేసిన ఆయా పార్టీలు.. సోమవారం బోధన్ బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యా, వ్యాపార సంస్థలు సహకరించి బంద్‌ను విజయవంతం చేయాలని కోరాయి. ఏకతాటిపైకి పార్టీలు.. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం రాజకీయ, వామపక్ష పార్టీలు, ప్రజా, విద్యార్థి సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఫ్యాక్టరీని తక్షణమే తెరిపించాలని ఐక్య ఉద్యమాలు చేపడుతున్నాయి. ఇప్పటికే నిరసనలు, ఆందోళనలు, బంద్‌లు, పాదయాత్రలు నిర్వహించాయి. గత నెలలో అక్టోబర్ 20 నుంచి నాలుగు రోజుల పాటు మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. చివరి రోజు నిర్వహించిన బహిరంగ సభకు రాష్ట్ర నేతలు రావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. వరుస ఆందోళనలతో అధికార పార్టీ నేతల్లో స్పందన కనిపిస్తోంది. ఎంపీ కవిత చెరుకు రైతులతో హైదరాబాద్‌లో సమావేశమై ఫ్యాక్టరీ భవితపై చర్చించారు. మరోవైపు, ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీని ఆధునికీకరించి, రైతులకు అప్పగించాలని యోచిస్తోంది. ఫ్యాక్టరీని నడిపేందుకు సుముఖంగా లేదని స్పష్టమవుతోంది. విపక్షాల ఒత్తిడి నేపథ్యంలో త్వరలోనే ఫ్యాక్టరీ భవితపై విధానపరమైన నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. సర్కారు నిర్ణయం కోసం రైతులు, కార్మికులు ఆశతో ఎదురు చూస్తున్నారు. 14 ఏళ్లుగా ‘ప్రైవేట్’లోనే.. నిజాం పాలకుల హయాంలో 1938లో నెలకొల్పిన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయ ఆధార పరిశ్రమగా గుర్తింపు పొందింది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన ఈ ఫ్యాక్టరీ లాభాలతోనే రాష్ట్రంలో చక్కెర ఫ్యాక్టరీల విస్తరణ సాగింది. అయితే, 2002లో అప్పటి సీఎం చంద్రబాబు ఫ్యాక్టరీని ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు. ప్రైవేట్ యాజమాన్యం లాబాపేక్ష, ఏకపక్ష నిర్ణయాలతో రైతులు, కార్మికులకు కష్టాలు మొదలయ్యాయి. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ రద్దు కోసం 14 ఏళ్ల నుంచి రైతులు, కార్మికులు పోరాడుతూనే ఉన్నారు. 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఫ్యాక్టరీ స్థితిగతులపై విచారణకు శాసనసభా సంఘం నియమించారు. ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలని సభా సంఘం నివేదించింది కానీ, ఆ సిఫారసులు అమలు కాలేదు. మరోవైపు, అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని తెలంగాణ మలి దశ ఉద్యమంలో, 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడిచినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2015లో ప్రైవేట్ యాజమాన్యం లేఆఫ్ ప్రకటించింది. 2016-17 క్రషింగ్ సీజన్ నవంబర్, డిసెంబర్ మాసాల్లో ప్రారంభం కావాల్సి ఉంది. డిసెంబర్, జనవరి మాసాల్లో చెరుకు సాగుకు అనువైన వాతావరణం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో అఖిలపక్షాలు ఆందోళనలను ఉద్ధృతం చేశాయి. -
కాలయాపన వద్దు
• ఎన్డీఎస్ఎల్ను తక్షణమే పునరుద్ధరించాలి • చెరుకు సాగుకు ప్రభుత్వం భరోసానివ్వాలి • మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి డిమాండ్ • రేపటి నుంచి కాంగ్రెస్ రైతు పాదయాత్ర బోధన్: నిజాం షుగర్ ఫ్యాక్టరీ భవితను తేల్చడంలో ఇంకా కాలయాపన వద్దని, నెలలోపు ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని పూర్వవైభవం తెస్తామన్న టీఆర్ఎస్.. రెండున్నరేళ్లు గడిచినా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. మంగళవారం బోధన్‌లోని నీటిపారుదల శాఖ గెస్ట్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. లేఆఫ్ ప్రకటించి ఫ్యాక్టరీని మూసివేయడంతో కార్మికులు ఉపాధి కోల్పోయారని, వారికి ఉద్యోగ భద్రతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోధన్ ప్రాంతం చెరుకు పంట సాగుకు అనుకూలమని, చెరుకుకు బదులు ఇతర పంటలు సాగు చేసిన రైతులు వాతావరణ పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఫ్యాక్టరీ భవితతో పాటు చెరుకు పంట సాగుపై రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. గతేడాది ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీకి చెరుకు తరలించిన రైతులకు రావాల్సిన రవాణా చార్జీలను వెంటనే చెల్లించాలని కోరారు. నాలుగు రోజుల పాటు పాదయాత్ర ఫ్యాక్టరీని పునరుద్ధరణ, చెరుకు సాగుపై రైతులకు భరోసా, కార్మికుల ఉద్యోగ భద్రత, బకాయి వేతనాలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్లతో అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు రైతు పాదయాత్ర నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి చెప్పారు. కోటగిరి మండలంలోని కొల్లూరులో ప్రారంభమయ్యే పాదయాత్ర బోధన్, రెంజల్, ఎడపల్లి మండలాల మీదుగా బోధన్‌కు చేరుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాదయాత్రలో పాల్గొంటారన్నారు. ఎంపీపీలు గంగాశంకర్, మోబిన్‌ఖాన్, రెంజల్ జెడ్పీటీసీ సభ్యుడు నాగభూషణంరెడ్డి, నేతలు రాంమోహన్, రమేశ్, గుణప్రసాద్, ఎల్లయ్య యాదవ్, అశోక్, ఎంపీటీసీలు శంకర్, సురేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఎంపీ కవితపై అసత్య ఆరోపణలు తగవు’
చంద్రశేఖర్‌కాలనీ : బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించకుండా ఉండేందుకు ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీల నుంచి నిజామాబాద్ ఎంపీ కవిత డబ్బులు తీసుకున్నారంటూ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ వీజీ గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎన్డీఎస్ఎల్ను ఎందుకు టేకోవర్ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్‌లో గల టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. పదేళ్లపాటు ఎంపీగా కొనసాగిన మధుయాష్కీ గౌడ్ జిల్లాను ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. ఆయన హైదరాబాద్, ఢిల్లీలలో ప్రెస్మీట్లతోనే కాలం గడిపారన్నారు. జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న ఎంపీ కవితపై మధుయాష్కీ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కా్రంగెస్ నాయకులు ఇప్పటి నుంచే టీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తప్పుడు ఆరోపణలను మానుకోవాలని హితవుపలికారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నాయకులు డాక్టర్ బాపురెడ్డి, ధర్మపురి సురేందర్, కోటగిరి గంగాధర్, ప్రభాకర్‌రెడ్డి, నవీద్ ఎక్బాల్, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ మురళి తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకే మూడెకరాల భూమి
బోధన్ రూరల్: భూపంపిణీ పథకం కింద అర్హులైన దళితులకే మూడెకరాల భూమిని ఇవ్వనున్నట్లు కలెక్టర్ యోగితారాణా తెలిపారు. భూకొనుగోలు పథకం కోసం భూములు విక్రయించేందుకు వచ్చిన కామారెడ్డి, బోధన్ డివిజన్ రైతులతో ఆమె శనివారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ధర నిర్ధారణపై వారితో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టాదారులతో చర్చించి 360 ఎకరాలకు చెందిన పొల్లాలోని వనరులు, పండించే పంటలను బట్టి ధరను నిర్ణయించినట్లు చెప్పారు. భూములను అమ్మేందుకు ముందుకు వచ్చే పట్టాదారులతో వారి పంట పొలాల్లో నీటి వనరులు, వెట్ మరియు డ్రై క్రాప్ వివరాలను సంబంధిత గ్రామ వీఆర్వో, తహసీల్దార్లతో మాట్లాడి భూముల ధరల వివరాలను ముందుగానే పట్టాదారులకు తెలియచేయాలని వివరించారు. భూములు విక్రయించగా వచ్చిన డబ్బును వృథా చేయొద్దని ఆమె రైతులకు సూచించారు. పట్టాదారుల నుంచి స్వీకరించిన భూములు రిజిస్ట్రేషన్ కాగానే, వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఇందులో ఎవరు ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. జేసీ రవీందర్‌రెడ్డి, బోధన్, కామారెడ్డి ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, నగేష్ రెడ్డి, విమాలాదేవి తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు దూకాణాల్లో చోరీలు
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దొంగలు రెచ్చిపోయారు. స్థానిక అంబెడ్కర్ చైరస్తాలో ఉన్న నాలుగు దుకాణాల్లో దొంగలు పడి నగదు ఎత్తుకెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి స్థానిక ఫొటోస్టూడియో సహా మరో మూడు దుకాణాల షటర్లు పగలగొట్టి దొంగలు చోరీలకు పాల్పడ్డారు. బుధవారం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీల ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపడుతున్నారు. చోరీలకు పాల్పడింది. గురుగోవింద్నగర్కు చెందిన యువకులుగా అనుమానిస్తున్న పోలీసులు గురుగోవింద్నగర్లో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
బోధన్ లో మిషన్ భగీరథ పనులు ప్రారంభం
నిజామాబాద్ జిల్లా బోధన్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మిషన్ భగీరథ పనులను శుక్రవారం ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ప్రారంభించారు. రూ.265 కోట్ల అంచనాతో ఈ పనులను చేపట్టారు. అలాగే, పట్టణంలోని 12,13,14,15 వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
100రోజుల దీక్ష చేస్తాం..
నిజాంషుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిజాం షుగర్ రక్షణ కమిటీడిమాండ్ చేసింది. గురువారం బోదన్ మండల కేంద్రంలో కమిటీ సభ్యులు దీక్ష చేపట్టారు.కమిటీకన్వీనర్ రాఘవులు మాట్లాడుతూ.. 100రోజుల పాటు రీలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. కార్మికులు, రైతులు, పలు ప్రజా సంఘాలు ఈ దీక్షలో పాల్గొన్నాయి. -
ఇసుక తరలిస్తున్న 3 టిప్పర్లు సీజ్
బోధన్ (నిజామాబాద్ జిల్లా) : అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు. బోధన్ మండలం కొప్పర్తి నుంచి నిజామాబాద్‌కు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సీఐ వెంకన్నకు సమాచారం అందింది. వెంటనే స్పందించి ఆయన టిప్పర్లను పట్టుకుని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.