బోధన్‌ స్కాంలో రాజకీయ కలవరం! | Political confusion in Bodhan scam | Sakshi
Sakshi News home page

బోధన్‌ స్కాంలో రాజకీయ కలవరం!

Published Wed, Mar 29 2017 5:21 AM | Last Updated on Wed, Apr 3 2019 5:38 PM

Political confusion in Bodhan scam

ప్రస్తుత ఎంపీ అయిన ఓ మాజీ మంత్రి వర్గంలో ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: వాణిజ్య పన్నుల శాఖ బోధన్‌ సర్కిల్‌ కార్యాలయంలో జరిగిన కుంభకోణం వ్యవహారంలో రాజకీయ కలవరం మొదలైంది. ఈ కేసులో సీఐడీపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ అయిన ఓ నాయకుడి అనుచరుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. 300 మంది రైస్‌మిల్లర్ల పాత్రపై సీఐడీ విచారణ చేపట్టనున్నట్లు వచ్చిన వార్తలపై భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది.

నిజామాబాద్‌ జిల్లాలో సీనియర్‌ నేతగా ఉన్న ఆ ఎంపీకి ఈ కేసులో కీలక నిందితుడు శివరాజ్‌ అత్యంత సన్నిహితుడని తెలిసింది. ఇక ఓ మాజీ ఎంపీకి కూడా శివరాజ్‌ సన్నిహితుడని.. దీంతో ఈ ఇద్దరు నాయకుల వద్దకు రైస్‌మిల్లర్లు క్యూ కట్టారని సమాచారం. అయితే ఈ నేతలిద్దరిలో మాజీ ఎంపీ పరోక్షంగా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఎంపీ మాత్రం ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులపై నేరుగా ఒత్తిడి తీసుకువస్తున్నట్టు పోలీస్‌ శాఖలో చర్చ జరుగుతోంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ వ్యవహారంలో కల్పించుకుంటున్నట్లు సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement