సాక్షి, హైదరాబాద్: బోధన్ సర్కిల్‌లో జరిగిన వాణిజ్య పన్నుల శాఖ నకిలీ చలా న్ల కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ గురువారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్ డీజీపీ అనురాగ్ శర్మకు సమాచారం అందించారు. గురువారం ఉదయం సీఎస్ చాంబర్‌లో కేసు దర్యాప్తుSపై సమీక్ష జరుగుతుందని, సంబంధిత అధికారులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సోమేశ్‌కుమార్ సూచించారు.
కేసు దర్యా ప్తులో ఆరోపణలు రావడంతో దర్యాప్తు అధికారి స్థానంలో మరొకరిని నియమిం చారు. అదనపు ఎస్పీని ఎప్పటికప్పుడు కేసు దర్యాప్తు వివరాలు తెలుసుకుంటూ ఉండాలని డీజీపీ ఆదేశించారు. ఈ వ్యవహారంపై కూడా సీఎస్ సమీక్ష జరప నున్నారు. అటు కమర్షియల్ శాఖలోనూ పలువురు అధికారుల పాత్రపై సీఐడీ నివేదిక రూపొందించినట్టు తెలిసింది.
బోధన్ స్కాంపై నేడు సీఎస్ సమీక్ష
Published Thu, Mar 23 2017 3:54 AM | Last Updated on Wed, Apr 3 2019 5:38 PM
Advertisement